Activities calendar

25 August 2018

22:04 - August 25, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 5వందల మంది కూర్చునే విధంగా స్టేజీ ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

22:02 - August 25, 2018

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 9 మంది సభ్యులతో కూడిన కోర్‌ కమిటీని నియమించారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, పి. చిదంబరం, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేష్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోర్‌ కమిటీతో పాటు మరో రెండు కమిటీలను రాహుల్‌ ఏర్పాటు చేశారు. పార్టీ మ్యానిఫెస్టోను ఆకర్షణీయంగా రూపొందించేందుకు 19 మంది సభ్యులతో ఓ కమిటి వేశారు. ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 13 మంది సభ్యులతో కూడిన మరో పబ్లిసిటీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

 

22:00 - August 25, 2018

ఢిల్లీ : అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌... ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తాందా.. అని కుంతియా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలతో వచ్చే నెల నుంచి నాలుగైదు నెలలపాటు తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే తెలుపని కుంతియా ధీమా వ్యక్తం చేశారు. 

21:56 - August 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో జరిగిన భేటీలో కేసీఆర్‌ ఈ అంశం చర్చించినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైకోర్టు విభజనతోపాటు కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 450 కోట్ల రూపాయల కేంద్ర సాయం  వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధాని మోదీతో చర్చించారు.
లోక్‌సభ ముందస్తు ఎన్నికలు.. మోదీ ఆలోచనలపై ఆరా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌ జరిపిన భేటీలో ప్రధానంగా ముందస్తు ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈవిషయంలో కేసీఆర్‌ తన ఆలోచనలకు మోదీతో పంచుకున్నారని సమాచారం. లోక్‌సభ ముందస్తు ఎన్నికలపై ప్రధాని ఆలోచనలు ఎలా ఉన్నాయన్న అంశంపై కేసీఆర్‌ ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర వైఖరిని బట్టి తెలంగాణ నిర్ణయం  ఆధారపడి ఉంటుందన్న అంశాన్ని కేసీఆర్‌... మోదీ దృష్టికి తెచ్చారని వినిపిస్తోంది. ఏప్రిల్‌, మేలో ఎన్నికలకు వెళితే సాగు, తాగునీరు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది, ఇది ప్రజా వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉందని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తంచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకావం ఉందని మోదీని వివరించినట్టు సమాచారం. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుపై నడకగా ఉంటుందన్న అంశాన్ని కేసీఆర్‌ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చెప్పిన  అన్ని విషయాలు సావధానంగా విన్న ప్రధాని మోదీ.. దేనిపై కూడా పెద్దగా స్పందించలేదని సమాచారం. 
కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలపాలి 
మరోవైపు కేసీఆర్‌, మోదీ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ విషయంలో జరుగుతున్న జాప్యం ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలను కూడా కేసీఆర్‌... ప్రధాని మోదీతో చర్చించారు. రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నాల్గవ విడత 450 కోట్ల ఇవ్వాలని కోరారు. మూడవ విడత నిధులు విడుదల చేసినందుకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు పంపిన విషయాన్ని ప్రస్తావించారు. 
బైసన్‌ పోలో గ్రౌండ్‌ కేటాయింపుపై దఫదఫాలుగా చర్చలు 
తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖ పరిధిలోని సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానాన్ని కేటాయించాలని కేసీఆర్‌ కోరారు. రెండేళ్లుగా ఈ విషయంలో కేంద్రంతో దఫదఫాలుగా చర్చించిన విషయాన్ని ప్రస్తావించారు. అదనపు బీఆర్‌బీఎం నిధులను విడుదల చేయాలని విన్నవించారు. తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్న అంశాన్ని మోదీ దృష్టికి తెచ్చిన కేసీఆర్‌.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచితే అదనంగా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ, ఏపీ  ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించడంతోపాటు హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాని కోరారు. అన్నీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌కి  మోదీ హామీ ఇచ్చారు. 
 

21:50 - August 25, 2018

రాఖి పండుగ సందర్భంగా జీనియస్ వండర్ గూగుల్ నైనా జైశ్వాల్, గూగుల్ బాయ్ అగస్త్యతో టెన్ టివి ముచ్చటించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

21:39 - August 25, 2018

ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్, కూతురు దివ్యతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:29 - August 25, 2018

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ అన్నారు. అందుకోసం గిరిజనులు గంజాయి పంట సాగు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పాడేరులో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహనా సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

 

21:26 - August 25, 2018

కృష్ణా : విజయవాడలో బ్యుటీషియన్‌పై హత్యాయత్నం కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బ్యుటీషియన్‌ పద్మ పరిస్థితి విషమంగా ఉంది. పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్న నూతన కుమారే హత్యాయత్నం చేశాడా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

21:24 - August 25, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ. నాలుగురన్నరేళ్లలో మంచి పనులు చేస్తే సభ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రగతి నివేదన సభ కోసం ఒక్కో ఎమ్మెల్యేకు కేసీఆర్‌ కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క రోజే విచ్చల విడిగా 100 కోట్ల పంపిణీ జరిగితే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

 

21:22 - August 25, 2018

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ప్రధాని మోదీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. అవినీతి పార్టీలకు కొమ్ముకాస్తూ, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం ఊబిలో కూరుకుపోయిన ప్రధాని మోదీకి గుణపాఠం తప్పదని కర్నూలు ధర్మపోరాట సభలో హెచ్చరించారు. 
టీడీపీ ఐదవ ధర్మపోరాట సభ
కర్నూలులో టీడీపీ ఐదవ ధర్మపోరాట సభ జరిగింది. కుట్రరాజకీయాలు - నమ్మకద్రోహంపై ధర్మపోరాటం పేరుతో నిర్వహించిన ఈ సభకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా  రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. 
రాష్ట్ర ప్రజలను మోదీ మోసం చేశారన్న చంద్రబాబు  
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బడ్జెట్ల తర్వాత కూడా రాష్ట్రానికి న్యాయం జరగకపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం నుంచి కేంద్రంలోని టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుని, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విషయంలో తాను యూ టర్న్‌ తీసుకున్నాని ప్రధాని మోదీ లోక్‌సభలో చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. వైసీపీ ఉచ్చులో పడ్డ ప్రధాని.. చివరికి ఫలితం అనుభవించకతప్పదని హెచ్చరించారు. 
మృతుల కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి 
కర్నూలు ధర్మపోరాట సభకు వస్తూ గుండెపోటుతో మరణించిన మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉప్పరి బజారి, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నందికొట్కూరుకు చెందిన చిన్నయ్యస్వామి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. బీమాకు ఇది అదనం. వీరి మృతికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలను సానుభూతి తెలిపారు. 

 

21:11 - August 25, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ కమిటీలలో తెలంగాణకు మొండిచేయి చూపింది అధిష్టానం. ప్రచార కమిటీ, కోర్‌, మేనిఫెస్టో కమిటీల్లో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు. తెలంగాణ నేతల ఆశలపై హైకమాండ్‌ నీళ్లు చల్లింది. హైకమాండ్‌ తీరుపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారు. సీడబ్ల్యూసీలో కూడా తెలంగాణ నేతలకు అవకాశం దక్కలేదు. సీడబ్ల్యూసీలో చోటును ఆశించిన జైపాల్‌రెడ్డి, పొన్నాల, విహెచ్‌లకు నిరాశే ఎదురైంది. తెలంగాణ నేతలకు కార్యదర్శి పదవులతో హైకమాండ్‌ సరిపెట్టింది. 

21:01 - August 25, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు.గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సాంబశివరావు ఖండించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు.  

 

20:53 - August 25, 2018

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు..కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, బీసీ రిజర్వేషన్ బిల్లుపైతో పాటు రక్షణ శాఖ భూములు రాష్ర్టానికి బదలాయించాలని కోరినట్లు సమాచారం. అలాగే రాష్ర్టానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. 

 

 

20:49 - August 25, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 

 

20:43 - August 25, 2018

నెల్లూరు : ప్రకృతి అందాలకు నెలవైన నెల్లూరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పట్టణంలో ఎక్కడ చూసినా కాలుష్యమే కనబడుతుంది. కాలుష్యంతో సావాసం చేస్తూ ప్రజలు రోగాల భారీన పడుతున్నారు. దేశంలోని అత్యంత కలుషిత ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న నెల్లూరు కాలుష్యంపై స్పెషల్‌ స్టోరీ.  
రైస్‌ మిల్లుల వ్యర్థాలతో జల, వాయు కాలుష్యం
నెల్లూరు.. ప్రకృతి అందాలకు నెలవైన నెల్లూరు ప్రస్తుతం కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజలు నిత్యం రోగాల భారీన పడుతున్నారు. సుమారు 8 లక్షల జనాభా ఉన్న నెల్లూరు పట్టణంలో పారిశ్రామిక పురోగతి గణనీయంగా పెరిగింది. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి. అయితే అభివృద్ధి ఎంత పెరిగిందో అంతే స్థాయిలో కాలుష్యం కూడా పట్టణంలో వ్యాపించింది. ఇదే ఇప్పడు పట్టణ ప్రజలను కలవరపెడుతుంది. నెల్లూరు పట్టణం చుట్టు పక్కల వందకు పైగా రైస్ మిల్లులున్నాయి. ప్రతి ఏడాది 7 నుంచి 8 నెలలు పాటు ఇవి నడుస్తాయి. రైస్‌ మిల్లులు విడుదల చేసే వ్యర్థాలతో జల, వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ రైస్ మిల్లుల్లో కూడా కొన్ని ఉప్పుడు బియ్యపు మిల్లులున్నాయి. అసలు ఉప్పుడు బియ్యం తినే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ మిల్లులను నిషేధిస్తే.. ఇక్కడ మాత్రం వాటికి అనుమతులు ఇచ్చారు. వీటి నుంచి వచ్చే కాలుష్యమే పట్టణాన్ని చుట్టుముడుతోంది. 
5 పవర్ ప్రాజెక్టులు, 7పామాయిల్ ఫ్యాక్టరీలు
ఇక పట్టణంలో భూగర్భ డ్రైనేజీ కోసం అధికారులు ఇష్టారీతిని రోడ్లను తవ్వారు. తవ్విన రోడ్లపై వాహనాలు నడవటంతో దుమ్ము, ధూళి పెరిగి పట్టణంలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దుమ్ము, ధూళికి తోడు వాహనాల నుంచి వచ్చే పొగతో కూడా కాలుష్యం అధికమవుతోంది. పట్టణంలో సుమారు 30వేలకు పైగా ఆటోలు, 1000కి పైగా బస్సులు, 20 వేల లారీలు, 15 వేల కార్లు , సుమారు లక్షల ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాలే అధికంగా ఉన్నాయి. వీటి నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి పట్టణాన్ని కాలుష్యం పట్టణంగా మారుస్తున్నాయి. ఇక పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. ఇక నెల్లూరుకి 30 కిలోమీటర్ల దూరంలో 5 పవర్ ప్రాజెక్టులు.. 7పామాయిల్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి నుంచి వచ్చే కాలుష్యంతో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం చిక్కుకుంటున్నాయి.
కాలుష్య ప్రాంతాల్లో 14వ ప్రాంతంగా గుర్తింపు
ఇంతటీ కాలుష్యంతో దేశంలోని అత్యంత కాలుష్యపు ప్రాంతాల్లో నెల్లూరు 14వ ప్రాంతంగా ఉంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌ కన్నా.. 8 లక్షల జనాభా ఉన్న నెల్లూరులనే కాలుష్యం ఎక్కువగా ఉందని ఆరోగ్య సంస్థ అభిప్రాయ పడింది. నెల్లూరులో 6శాతం సల్ఫర్ డయాక్సైడ్, 22శాతం నైట్రోజన్ డయాక్సైడ్, 0.001 శాతం మెర్క్యురీ, 0.005 శాతం ఆర్సినిక్ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతకముందు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా నెల్లూరులో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని.. వెంటనే నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా అధికారులు ఏ మాత్రం నివారణ చర్యలు చేపట్టలేదు. ఇక ఈ కాలుష్యంతో నగరవాసులు శ్వాసకోశ, కంటి జబ్బులు, విష జ్వరాలు, కిడ్నీవ్యాధులతోపాటు రకరకాల రోగాల భారీన పడుతున్నారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరించటం వల్లే ఈ రోజు పట్టణం ఈ దుస్థితికి చేరుకుందని ప్రజలు మండిపడుతున్నారు. మరి ఇప్పుడైనా అధికారులు కాలుష్య నివారణకు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి.  

 

20:36 - August 25, 2018

గుంటూరు : ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్స్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీఎంఏ ఫైనల్‌ ఫలితాలలో మొదటి 50 ర్యాంకుల్లో 24 ర్యాంకులు మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులే సాధించినట్లు మాస్టర్‌మైండ్స్‌ అడ్మిన్‌ అడ్వైజర్‌ మోహన్‌ తెలిపారు. సీఎంఏ ఇంటర్‌లో కూడా మొదటి 50 ర్యాంకుల్లో కూడా 7 ర్యాంకులు తమ విద్యార్థులే సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అద్భుత విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. 

 

20:31 - August 25, 2018

హైదరాబాద్ : వచ్చే సెప్టెంబర్‌లో ఎస్‌బీఐ లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్ బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌. ఎస్ పీఏలకు పరిష్కారానికి ఆర్ బీఐ పెట్టిన గడువు ఆగష్టు 27న ముగియనుందని ఎస్ బీఐ 7 కేసులకు సంబంధించిన అసెట్స్‌ ప్రాసెస్‌ మరో వారం రోజుల్లో పూర్తవుతుందని రజనీశ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ బీఐ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద జీహెచ్ ఎంసీ పరిధిలో 100 టాయిలెట్ల నిర్మాణానికి 15 లక్షల చెక్కును జీహెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్‌రకు రజనీశ్‌ కుమార్‌ అందజేశారు. ముద్రా పథకం కింద లబ్దిదారులకు చైర్మన్‌ రజనీశ్‌ స్వయంగా కారు తాళాలను అందజేశారు. 

 

ఇచ్చిన హామీ ఏమైంది ? సీఎం చంద్రబాబు

కర్నూలు : ఏపీ ప్రజల కష్టాన్ని కేంద్రం దోచుకోవాలనుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీ ఏమైంది ? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా ? అని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకోని కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. తెలుగు జాతికి పోరాటాలు కొత్త కాదన్నారు. 

ఏపీ పట్ల కేంద్రం వివక్షత : సీఎం చంద్రబాబు

కడప : ఢిల్లీని తలదన్నే రీతిలో, ఢిల్లీ చిన్నబోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రం 1500 కోట్లు ఇచ్చారని.. అవి ఎలక్ట్రికల్ కేబుల్ వేయడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. కేంద్రం వేరే రాష్ట్రాలకు విచ్చలవిడిగా నిధులు ఇచ్చి...ఏపీ పట్ల వివక్షత చూపించారని మండిపడ్డారు. 

కేంద్రానిది అవకాశవాదం : సీఎం చంద్రబాబు

కర్నూలు : 'నాది రైట్ టర్న్.. మీదే యూటర్న్...రాంగ్ టర్న్' అని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేంద్రానిది అవకాశ వాదమని విమర్శించారు. తాను అవినీతి ఉచ్చులో పడలేదని.. బీజేపీ నేతలే అవినీతి ఉచ్చులో పడ్డారని... దాని ఫలితం రేపు ఎన్నికల్లో అనుభవిస్తారన్నారు. రాష్ట్ర మేలు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. కడపలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. 

19:59 - August 25, 2018

విజయవాడ : రేపు దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ నిర్వహించుకోబోతున్న తరుణంలో.. విజయవాడలో భారీ రాఖీని రూపొందించారు. ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ ఆర్టిస్టు గొట్టేటి బాలకృష్ణ 999 అడుగుల పొడవైన రాఖీని ప్రదర్శించారు. దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం దక్కే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ రాఖీ ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. దీనిపై 
మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

19:51 - August 25, 2018

హైదరాబాద్‌ : నగర షీ టీమ్స్‌ భరోసా కేంద్రంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు, విద్యార్థులకు నగరవాసులు రాఖీలు కట్టారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు నగర పోలీసులు భరోసా ఇస్తున్నారంటున్న షీ టీమ్స్‌ అదనపు కమిషనర్‌ షికా గోయల్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరిగేలా ధైర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఎవరైనా వేధిస్తుంటే షీ టీమ్స్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. 

19:47 - August 25, 2018

హైదరాబాద్ : రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ షీ టీమ్స్‌, లీడ్‌ లైఫ్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రక్షా బంధన్‌ వేడుకలు జరిగాయి. నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు, షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పోలీపు కమిషనర్‌ అంజీనీకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంజనీకుమార్‌తోపాటు షీటీమ్స్‌ అదనుపు పోలీసు కమిషనర్‌ షికా గోయల్‌ రాఖీలు కట్టారు. అన్నా చెల్లళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్‌ ప్రధాన్యతను వివరించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. షీటీమ్స్‌ సేవలను విద్యార్థినులు ప్రశంసించారు. 

19:43 - August 25, 2018

కర్నూలు : 'నాది రైట్ టర్న్.. మీదే యూటర్న్...రాంగ్ టర్న్' అని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేంద్రానిది అవకాశ వాదమని విమర్శించారు. తాను అవినీతి ఉచ్చులో పడలేదని.. బీజేపీ నేతలే అవినీతి ఉచ్చులో పడ్డారని... దాని ఫలితం రేపు ఎన్నికల్లో అనుభవిస్తారన్నారు. రాష్ట్ర మేలు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. ఢిల్లీని తలదన్నే రీతిలో, ఢిల్లీ చిన్నబోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం 1500 కోట్లు ఇచ్చారని.. అవి ఎలక్ట్రికల్ కేబుల్ వేయడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. కేంద్రం వేరే రాష్ట్రాలకు విచ్చలవిడిగా నిధులు ఇచ్చి...ఏపీ పట్ల వివక్షత చూపించారని మండిపడ్డారు. ఏపీ ప్రజల కష్టాన్ని కేంద్రం దోచుకోవాలనుకుంటుందన్నారు. పన్నులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీ ఏమైంది ? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా ? అని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకోని కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. తెలుగు జాతికి పోరాటాలు కొత్త కాదన్నారు. ఆనాడు మద్రాస్ నుంచి కట్టుబట్టలలో కర్నూలుకు వచ్చామని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలనుకున్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిందదన్నారు. ఏపీని కాంగ్రెస్ హేతుబద్దత లేకుండా విభజిస్తే ఆ బిల్లుకు పార్లమెంట్ లో బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. మళ్లీ కట్టుబట్టలతో, నెత్తిన అప్పుతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చామని తెలిపారు. అమరావతికి ప్రధాని యమునా నదిని నీరు, పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి అయితే కేంద్రానికి ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కళా వెంకట్ రావు, దేవినేని ఉమా మహేశ్వర్ రావు, పరిటాల సునీతా, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

 

19:05 - August 25, 2018

హైదరాబాద్ : తెలంగాణల రైతులకు స్వర్ణయుగం రాబోతోందని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతల్లో భరోసా పెరుగుతోందన్నారు. దీంతో ఆత్మహత్యలు ఆగిపోతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వజ్రోత్సవాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఉచిత విద్యత్‌, రైతుబంధు, రైతు బీమా పథకాలతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. 

 

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. 

18:40 - August 25, 2018

హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 2 న జరగబోయే సభను జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

18:38 - August 25, 2018

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సభాస్థలాన్ని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అన్నివైపులా 15 నుంచి 20 రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. 480 ఎకరాల్లో ప్రగతి నివేదన సభ జరగనుంది. దాదాపు 25 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికపై 500 మంది కూర్చునేనా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక సమీపంలో సీఎం కోసం హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు లక్ష వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌కోసం 16 స్థలాలను గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడింగ్, రోడ్డు పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు మైక్, ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్ధంచేస్తున్నారు. 

 

18:31 - August 25, 2018

ఏపీ డీఎస్సీ మరింత లేట్ కాబోతోంది. సంవత్సరకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు నిరాశ చెందారు. ఎప్పటిలోగా డీఎస్సీ నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. లక్షలాది మంది నిరుద్యోగుల డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. ఆర్థిక శాఖ, విద్యాశాఖ మధ్య సమన్వయం కొరవడడంతోనే ఈ జాప్యం జరుగుతోంది. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఏపీహెచ్ ఎమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల శంకర్ రావు, విద్యార్థి సంఘం నాయకులు సూర్యారావు పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్ధేశం సర్కార్ కు లేనట్లు కనిపిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

18:12 - August 25, 2018

ఢిల్లీ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కేరళకు భారీ ఎత్తున సామాగ్రిని పంపనుంది. యూఏఈ ప్రభుత్వ విమాన సంస్థ ఎమిరేట్స్ విమానంలో 175 టన్నుల సహాయ సామాగ్రిని తీసుకుని   కేరళకు బయలుదేరింది. కేరళకు యూఏఈ అండగా ఉంటుందని, 175 టన్నుల సామాగ్రిని తీసుకొస్తున్నామని ఎమిరేట్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. యూఏఈలోని ఎంతోమంది వ్యాపారవేత్తలు, ప్రజలు, సంస్థలు అందించిన సాయాన్ని విమానాల ద్వారా తిరువనంతపురానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోట్లు, రగ్గులు, నిల్వ ఆహార పదార్థాలు, తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నారు. యూఏఈలో పనిచేస్తున్న విదేశీయుల్లో 80 శాతం మంది కేరళ వాసులే ఉండడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది.

18:06 - August 25, 2018

అహ్మదాబాద్ : గుజరాత్‌లో పాటీదార్ రిజర్వేషన్ల పోరాట నేత హార్దిక్‌ పటేల్‌ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, రైతులకు రుణమాఫీ ప్రకటించాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ తన ఇంట్లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. జునాగఢ్‌లో 144వ సెక్షన్‌ విధించింది. ఇంతకు ముందు అహ్మదాబాద్‌, గాంధీనగర్‌లో హార్దిక్‌ పటేల్‌ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతించలేదు. తన నిరాహార దీక్షకు అనుమతించాలని కోరుతూ హార్దిక్ పటేల్‌ గుజరాత్‌ సిఎం విజయ్‌ రూపానికి లేఖ రాశారు.

 

17:45 - August 25, 2018

కృష్ణా : జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కేఈబీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న రామచంద్రాపురం ఎస్‌ఐ కోట వంశీ నీటిలో గల్లంతయ్యారు. తల్లీ, కూతురు క్షేమంగా ఉండగా.. వీరిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. కరకట్ట మీదుగా అవనిగడ్డ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:43 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సభకు ఓయూ జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘం మద్దతు తెలిపాయి. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. 
శేఖర్ రెడ్డి..
'సభకు 25 లక్షల మంది హాజరవుతారు. ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల మందిని సమీకరించాలని సీఎం చెప్పారు. కానీ 40 వేల మంది వచ్చే అవకాశం ఉంది. రోడ్డు, మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము' అని చెప్పారు.
వెంకటేష్.....
'3 వేల మంది వాలంటీర్లు ఉంటారు. 20 గేట్లు ఏర్పాటు చేస్తున్నాం. సభకు 7వేలకు పైగా వాహనాల్లో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం  ఉంటుంది. పార్కింగ్ కు వెయ్యి ఎకరాలను కేటాయించాం. విద్యుత్ సౌకర్యం కల్పించాము' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:09 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. 

 

16:46 - August 25, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే గడపనున్నారు. సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి, రక్షణశాఖ మంత్రిని కలవనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. పెండింగ్‌ అంశాలను వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం

 

16:40 - August 25, 2018

కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఈమేరకు కేఈతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీకి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యమన్నారు. జాతీయ స్థాయిలో ఏర్పడే కూటమిలో టీడీపీ పాత్ర నంబర్‌ వన్‌గా ఉంటుందని తెలిపారు. ఏపీ అభివృద్ధి కేవలం చంద్రబాబుకే సాధ్యమని చెప్పారు. తమకు శత్రువులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. జగన్, పవన్ కళ్యాణ్ లు తమకు నెంబర్ వన్ శత్రువులు అని అన్నారు. 

 

ముగిసిన మోడీ..కేసీఆర్ భేటీ...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. 

2019 ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీ...

ఢిల్లీ : 2019 ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కమిటీలను నియమించారు. కోర్ గ్రూప్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు చోటు దక్కలేదని సమాచారం. 

మోడీతో కేసీఆర్...

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర భేటీ అయ్యారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని సమాచారం. కేసీఆర్ భేటీ అనంతరం ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

డీఆర్ డీవో ఛైర్మన్ గా నెల్లూరు వాసి...

ఢిల్లీ : డీఆర్ డీవో ఛైర్మన్ గా సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. డీవోపీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సతీశ్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సతీశ్ రెడ్డి ఉన్నారు. 

16:19 - August 25, 2018

కడప : మన పూర్వీకులు చెట్లు నాటి, అడవులు కాపాడటం వల్లే ఈ మాత్రమైనా పర్యావరణం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో వనం మనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సీఎం. కొందరు స్వార్థపరులు పర్యావరణాన్ని దుర్వినియోగం చేశారన్నారు.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లనే కడపలో అనావృష్టి, కేరళలో అతివృష్టి నెలకొందన్నారు. వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయని సీఎం అన్నారు.

 

టిడిపి 'ధర్మపోరాట' సభ...

కర్నూలు : ఎన్టీబీసీ కళాశాల మైదానంలో ధర్మపోరాట సభ జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు, దేవినేని, పరిటాల, అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు. 

16:17 - August 25, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే గడపనున్నారు. సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి, రక్షణశాఖ మంత్రిని కలవనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. పెండింగ్‌ అంశాలను వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

కెనాల్లో కారు...ఎస్ఐ గల్లంతు...

కృష్ణా: జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామచంద్రాపురం నుంచి కోడూరుకు వెళుతున్న ఓ కారు అవనిగడ్డ బెజవాడ కరకట్టపై పాపవినాశనం వద్ద అదుపు తప్పి బందరు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎస్సై కోట వంశీ గల్లంతయ్యారు.

16:15 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. సభకు 7వేలకు పైగా వాహనాల్లో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కల్చర్ హబ్ గా కడప జిల్లా : చంద్రబాబు

కడప : 55 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని..వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవ్వగా మిగిన ప్రాజెక్టులు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సీఎంం చంద్రబాబు 'వనం మనం' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తెలిపారు. 

పక్కింటి సంపులో పడి బాలుడు మృతి..

మేడ్చల్ : మేడిపల్లి పీఎస్ పరిధిలోని బుద్ధ నగర్ లో విషాదం నెలకొంది. రెండేళ్ల బాలుడు పక్కింటి సంపులో పడి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలోను..స్థానికంగాను..తీవ్ర విషాదాన్ని నింపింది. సైకిల్ పై ఆడుకుంటు వెళ్లి పక్కనున్న అపార్ట్ మెంట్ లోని ఆరు అడుగుల లోతులో వున్న సంపులో పడి రక్షిత్ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ..

హైదరాబాద్ : మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ 9వ సాధారణ సమావేశం ప్రారంభంకానుంది. ఇప్పటి వరకూ స్టాండింగ్ కమిటి ఆమోదించిన ప్రతిపాదనలతను కార్పొరేటర్లు ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ఆర్డీవో దేవేందర్ రెడ్డి ప్రభుత్వానికి సరెండర్...

కడప : ఆర్డీవో దేవేందర్ రెడ్డిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల విషయంలో ఆర్డీవో నిర్లక్ష్యంగా వ్యవరించి విఫలమైనందుకు ఆర్డీవో దేవేందర్ రెడ్డిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో ఆర్డీవో బాధ్యతలను జమ్మలమడుగు ఆర్డీవో నాగన్నకు అప్పగించారు. 

బాబు రాక...రాయలసీమ జేఏసీ ఆందోళన...

కర్నూలు : సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో ధర్మ పోరాట సభలో పాల్గొననున్నారు. ఈక్రమంలో చంద్రబాబు రాకను రాయలసీమ యూనివర్శిటీ జేఏసీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేసేందుకే ధర్మపోరాట సభలను నిర్వహిస్తున్నారని విమర్శిస్తు సీఎం రాకను వ్యతిరేకిస్తు నల్ల జెండాలను ఆవిష్కరించేందుకు యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రాయలసీమ జేఏసీ సభ్యులు వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అక్రమార్కులకు వరంగా టీటీడీ ఆన్ లైన్..

తిరుమల : తిరుమలలో టీటీడీ ప్రవేశపెట్టిన ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. వేల యూజర్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తూ.. వందలాది టికెట్‌లను అక్రమార్కులు పొందుతున్నారు. దీంతో లక్షల రూపాయలు గడిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

తప్పిన పెను ప్రమాదం...

పెద్దపల్లి : ఓ ప్రైవేటు స్కూల్ కు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడం...సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యుత్ తీగలు కింద పడడం..విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్రిసెంట్ స్కూల్ కు చెందిన బస్సు ప్రతి రోజులాగానే వెల్లంపల్లి నుండి పెద్దపల్లికి వెళుతోంది. హనుమంతుని పేట వద్దకు రాగానే బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ కు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బస్సు వేగంగా ఢీకొంది. వెంటనే విద్యుత్ తీగలు కింద పడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కాళ్లు కట్టేసి..చేతులు నరికారు...

కృష్ణా : బాపులపాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత (బ్యూటిషన్) ను ప్రియుడు దారుణంగా హత్యాయత్నం చేశాడు. కాళ్లు కట్టేసి చేతులు నరికేశాడు. 

సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

కన్నబిడ్డను దారుణంగా చంపేసిన తండ్రి...

విజయనగరం : కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి తన సుఖం కోసం కన్న బిడ్డను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గుర్ల మండలం గరికివలసలో చోటుచేసుకుంది. మూడో వివాహం చేసుకుందుకు సిద్ధపడుతున్న భర్తతో భార్య గొడవ పడుతోందనే కోపంతో మూడేళ్ళ కుమార్తెను అత్యంత పాశవికంగా తండ్రి కడతేర్చాడు. 

కడప, కర్నూలుకు బాబు...

కర్నూలు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట సభలో పాల్గొననున్నారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల పేరిట నిర్వహిస్తున్న ధర్మపోరాట 5వ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. 

కాసేపట్లో ప్రధానితో సీఎం కేసీఆర్ మీటింగ్...

ఢిల్లీ : నేడు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రక్షణ శాఖ భూముల కేటాయింపుల విషయంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోవటంలేదని కేసీఆర్ ప్రధానికి విన్నవించనున్నారు. 

కేఈబీ కెనాల్ లో కారుతోపాటు ఒకరి గల్లంతు

కృష్ణా : జిల్లాలోని కేఈబీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. తల్లీ, కూతురు క్షేమంగా ఉన్నారు. కారుతోపాటు మరొకరు గల్లంతు అయ్యారు. 

హత్య, దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో జరిగిన ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగర్వాల్ కుమార్తె ఇంట్లో గత ఆరు నెలల నుండి డ్రైవర్ గా పని చేసి మానివేసిన యువకుడు ఈ దోపిడీకి పాల్పడ్డట్లుగా పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వాహణక ప్రకటన...

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వాహణకు సంబంధించిన ప్రకటన జారీ అయ్యింది. సెప్టెంబర్ 6 ఉదయం 9.15 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

డ్రంక్ అండ్ డ్రైవ్..17మందిపై కేసు..

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోని మందుబాబులు తాగి వాహనాలు నడపటం మాత్రం మానలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అమ్మాయిలు హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 17మందిపై కేసు నమోదు చేసారు. అనంతరం 123 వాహనాలకు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ..

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు.

టీ.కాంగ్ లో ముందస్తు గందరగోళం..

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై గులాబీబాస్‌ దూకుడు కనబరుస్తోంటే.... కాంగ్రెస్‌లో మాత్రం కన్ఫ్యూజన్‌ నెలకొంది. కొందరు ముందస్తు ఖాయమంటుంటే... మరికొందరు అది అసాధ్యమంటున్నారు. ఇంకొందరైతే.. ముందస్తు పేరుతో కేసీఆర్‌ ఆడిస్తున్న పొలిటికల్‌ డ్రామా అంటూ కొట్టి పారేస్తున్నారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

ఢిల్లీ : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజులపాటు సీఎం ఢిల్లీల్లోనే గడపనున్నారు. సాయంత్రం 4.10 గంటకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

 

'ముందస్తు' కోసం గులాబీ బాస్ వరాలు..

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించబోతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సెప్టెంబర్‌ చివరి వారం.. లేదా అక్టోబర్‌ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే నెల 2న జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ ఆదేశించారు.

రన్నర్స్ మారథాన్ రన్..ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 9 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టు పక్కలతోపాటు రన్ జరిగే రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆ సమయంలో ఈ రూట్లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

నవంబర్ 11నుండి ఇంప్రూవుడ్ న్యూట్రీషన్ సదస్సు..

హైదరాబాద్ : నగరంలో రెండురోజులపాటు జాతీయ పోషకాహార సంస్థ సదస్సు నిర్వహిస్తున్నది. 2018 నవంబర్ నెలలో వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అలైనింగ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్తీ డైట్స్ అండ్ ఇంప్రూవుడ్ న్యూట్రీషన్ పేరుతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు, విద్యార్థులు హాజరవుతున్నారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వంటి వాటిపై నివేదిక విడుదల చేసే అవకాశమున్నది.

సా.4గంటలకు ప్రధానితో కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : నేడు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రక్షణ శాఖ భూముల కేటాయింపుల విషయంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోవటంలేదని కేసీఆర్ ప్రధానికి విన్నవించనున్నారు. 

టీ.టీడీపీ ఛలో బయ్యారం కార్యక్రమం..

హైదరాబాద్ : నేడు టీ.టీడీపీ ఛలో బయ్యారం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలనే డిమాండ్ తో టీడీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 

కంటోన్మెంట్ బోర్డు కీలక సమావేశం..

సికింద్రాబాద్ : నేడు కంటోన్మెంట్ బోర్డు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణపై అవిశ్వాసం తీర్మానాన్ని ఈ కీలక సమావేశంలో ప్రవేశపెట్టాలని స్వంత పార్టీ సభ్యులు బోర్డులో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

మంత్రులు కేఈ, అయ్యన్నలకు బాబు క్లాస్..

అమరావతి : మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల గురించి మాట్లాడంపై వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం తీసుకోవాలటం..మాట్లాడటం టీడీపీ సంప్రదాయం కాదన్నారు. పార్టీలో పొత్తుల గురించి చర్చించకుండా విపక్షాల విమర్శలను నమ్మి ఎందుకు మాట్లాడాల్సివచ్చిందని సీఎం ఇద్దరు మంత్రులను నిలదీసినట్లుగా తెలుస్తోంది. పొత్తుల విషయాన్ని పొలిట్ బ్యూరోలో నిర్ణయిస్తారనే విషయం కూడా మంత్రులు గ్రహించకపోతే ఎలాగని ప్రశ్నించారు.

హత్య, దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో జరిగిన ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగర్వాల్ కుమార్తె ఇంట్లో గత ఆరు నెలల నుండి డ్రైవర్ గా పని చేసి మానివేసిన యువకుడు ఈ దోపిడీకి పాల్పడ్డట్లుగా పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇంటియొక్క ఆనుపానులు తెలుసుకున్న సదరు నిందితుడు నగదు, నగలు ఎక్కక్కెడ వుంటాయో తెలుసుకుని పాట్నాలోనే దోపిడీకి ప్లాన్ చేసి గ్యాంగ్ తో తిరిగి నగరానికి వచ్చి దోపిడీకి పాల్పడ్డట్లుగా పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ..

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, సచివాలయ నిర్మాణం, రెండు రహదారుల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గతంలోనే కోరారు.

డ్రంక్ అండ్ డ్రైవ్..17మందిపై కేసు..

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోని మందుబాబులు తాగి వాహనాలు నడపటం మాత్రం మానలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అమ్మాయిలు హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 17మందిపై కేసు నమోదు చేసారు. అనంతరం 123 వాహనాలకు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ..

హైదరాబాద్ : నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, సచివాలయ నిర్మాణం, రెండు రహదారుల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గతంలోనే కోరారు.

Don't Miss