Activities calendar

26 August 2018

21:21 - August 26, 2018

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక మిగతా మంత్రులు కూడా రాఖీలను కట్టించుకున్నారు.

అన్నా చెల్లెల, అక్క తమ్ముళ్ల అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక నిలిచే రక్షాబంధన్‌ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేగుతో పంచుకున్న అనుబంధానికి రాఖీతో ముడివేసి తోబుట్టువుగా చాటారు. ఇక ఈ రాఖీ పండుగను సాధరణ ప్రజలతో పాటు ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. రాఖీ కట్టడంతో పాటు సోదరుడు చిరకాలం సురక్షితంగా ఉండాలంటూ కేటీఆర్‌కు హెల్మెట్‌ను బహుకరించారు. హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు హరీశ్‌రావుకు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్‌కు మహిళలు రాఖీలు కట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సోదరి, బాల సధన్‌ అనాథ పిల్లలు మంత్రికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.

విశాఖ జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌కు ప్రజాసంకల్ప యాత్రలో మహిళలు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే రోజా.. ఇతర మహిళా నేతలు జగన్‌కు రాఖీలు కట్టి.. ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీలు కట్టిన ఇద్దరు చెల్లెళ్లకు చిరంజీవి... ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బహుమతులు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురంలో అవినీతి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, మేయర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

స్త్రీలను గౌరవిద్దాం.. సోదరి భావాన్ని చాటుదాం అనే నినాదంతో విశాఖలో ఐద్వా నేతలు రక్షబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదమ్ములు మహిళలకు రక్షణగా ఉండాలని ఐద్వా నేతలు కోరారు. అలాగే ప్రభుత్వాలు అశ్లీల సాహిత్యాన్ని, చిత్రాలను నిషేధించాలని ఐద్వా నేతలు డిమాండ్‌ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద సిరి స్వచ్ఛంద సంస్థ రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ చైర్మన్‌ సుష్మారెడ్డి ద్విచక్ర వాహనాదారులకు రాఖీలు కట్టి ఉచితంగా హెల్మెట్‌లు అందించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దత్త క్షేత్రంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీపాద శ్రీవల్లభుడికి మహారాష్ట్ర ఆడపడుచులు రాఖీని కట్టి తమ భక్తిని చాటుకున్నారు.

21:19 - August 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభ ఏర్పాట్లను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు. భారత దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభ జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వేదిక నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. సభా స్థలంతో పాటు పార్కింగ్‌ ప్రాంతాలను పూర్తిగా చదును చేశారు. సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా కొత్త రోడ్ల ఏర్పాటు, ప్రస్తుతమున్న రోడ్లకు సమాంతరంగా రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి పనులు చేస్తున్నారు.

ప్రగతినివేదన సభ ప్రాంగణం ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రగతినివేదన సభ జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణాను కేసీఆర్‌ అభివృద్ధి చేశారన్నారు మంత్రి నాయిని నరసింహారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతినివేదన సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని మంత్రులు టీఆర్ఎస్‌ శ్రేణులకు సూచించారు. దేశ రాజకీయాల్లో ప్రగతి నివేదనసభ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. 

21:15 - August 26, 2018

ఢిల్లీ : ముంబై స్టాక్ ఎక్చ్సేంజ్ నిర్వహించే 'అమరావతి బాండ్ల లిస్టింగ్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన ముంబై బయలుదేరారు. సోమవారం ఉదయం 9గంటలకు జరిగే ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో బాబు భేటీ కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ భేటీలు జరుగనున్నాయి. రతన్ టాటా, ముఖేష్ అంబానీతో పాటు పలువురితో బాబు సమావేశం కానున్నారు. 

21:10 - August 26, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు జాతీయ 51 ప్రాంతీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి టిడిపి నుండి కనమేడల రవీంద్ర కుమార్ హాజరు కానున్నారు. ఈవీఎంలకు వీవీ పాట్ లను తప్పనసరి చేయాలని టిడిపి కోరనుంది. 

21:00 - August 26, 2018

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీలో కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిపిన సమావేశంలో స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ బకాయిల విడుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై కేసీఆర్‌ చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మూడు రోజుల హస్తిన టూర్‌లో భాగంగా శనివారం మొదటి రోజు ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్‌.. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, విభజన హామీలు, కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం రెండో రోజు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీతో సమావేశమైన కేసీఆర్‌... హైకోర్టు విభజన, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై చర్చించారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, వినోద్‌, బూర నర్సయ్యగౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ పాల్గొన్నారు. కాగా అరుణ్‌ జైట్లీతో జరిపిన సమావేశంలో కేసీఆర్‌ ఏకాంతంగా చర్చలు జరిపారు. 

రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ జరిపిన భేటీలో విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. 9,10 షెడ్యూలు సంస్థల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు కేటాయింపు, హైకోర్టు విభజన వంటి అంశాలను చర్చించారు. అరుణ్‌ జైట్లీతో జరిపిన భేటీలో తెలంగాణలోని 4 లక్షల స్వయం సహాయ సంఘాలకు కేంద్రం నుంచి రావాల్సిన 399 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ, తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే రాష్ట్రానికి అదనంగా రుణాలు వస్తాయని జైట్లీ దృష్టికి తెచ్చారు. సోమవారం మూడో రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌ సమావేశం అవుతారు. రాష్ట్రాలోని కొత్త జాతీయ రహదారులకు అనుమతి, మౌలికసదుపాయాలకు నిధులు, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై చర్చిస్తారు. 

సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం...

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.

 

కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తులు...

ఢిల్లీ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్డు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీ కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిపిన సమావేశంలో స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ బకాయిల విడుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై కేసీఆర్‌ చర్చించారు.  

20:45 - August 26, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది. 

20:43 - August 26, 2018

ఢిల్లీ : తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్డు సంస్థల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను కూడా పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన భేటీ కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిపిన సమావేశంలో స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ బకాయిల విడుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై కేసీఆర్‌ చర్చించారు.  

19:18 - August 26, 2018

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కొంగర్ కలాన్ లో నిర్వహించే 'ప్రగతి నివేదన' సభను ఆయన పరిశీలించారు. ఎవరికీ ఇబ్బందులు కలుగ వద్దనే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సభ నిర్వహించడం జరుగుతోందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

19:13 - August 26, 2018

అనంతపురం : మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురం జిల్లాలో 'రాఖీ' పండుగ పర్వదినాన ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పాతూరుకు చెందిన రాజేశ్వరీ పులివెందు జేఎన్టీయూలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈమె రూమ్ నెంబర్ 2లో ఉంటోంది. రూంలో ఎవరూ లేని సమయం చూసి రాజేశ్వరీ ఆదివారం ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే ఆమె తల్లి చనిపోయిందని..తండ్రి ఆటో తోలుతూ చదివిస్తున్నాడని తెలుస్తోంది. తండ్రి కూడా మే నెలల చనిపోవడంతో రాజేశ్వరీ మానసికంగా కృంగిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజేశ్వరీ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలుస్తోంది. 

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య...

అనంతపురం : పులివెందుల జేఎన్టీయూలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెది అనంతపురం జిల్లాలోని పాతూరు.

ఆ రోజున ప్రయాణాలు వద్దన్న మంత్రి కేటీఆర్...

హైదరాబాద్ : సెప్టెంబర్ 2 ఆదివారం కావాలనే ఆ రోజున ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ రోజున కార్యాలయాలు, పిల్లలకు స్కూళ్లు ఉండవుని...ఇతర ఇబ్బందులు కూడా ఉండవన్నారు. ఆ రోజున దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.

 

బ్యూటిషియన్ హత్యాయత్నం కేసులో...

విజయవాడ : బ్యూటిషీయన్ హత్యాయత్నం కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఆమెపై హత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్న ప్రియుడు నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే బ్యూటీషియన్ పద్మపై నూతన్ కుమార్ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాళ్లు కట్టేసి చేతులు నరికేసి పారిపోయాడు.

18:33 - August 26, 2018
18:29 - August 26, 2018

విజయవాడ : బ్యూటిషీయన్ హత్యాయత్నం కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఆమెపై హత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్న ప్రియుడు నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే బ్యూటీషియన్ పద్మపై నూతన్ కుమార్ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాళ్లు కట్టేసి చేతులు నరికేసి పారిపోయాడు. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నూతన్ కుమార్ పోలీసులు గాలింపులు చేపట్టారు. ఆదివారం నరసరావు పేట - గుంటూరు మార్గంలో నూతన్ మృతదేహం లభ్యమైంది. హనుమాన్ జంక్షన్ పోలీసులు గుర్తించారు. మరింత వివరాలు తెలియాల్సి ఉంది. 

18:23 - August 26, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నియంత్రణ విధించాలని సోమవారం నాడు జరిగే ఎన్నికల కమిషన్ సమావేశంలో కోరుతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అందులో పెట్టాలని అనుకుంటున్నారని, కొన్ని అక్రమాలకు దారి తీసే పరిస్థితులున్నాయని తాము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హడావుడి చూస్తుంటే రాష్ట్రంలో ముందదస్తు ఎన్నికలు వచ్చినట్లుగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీపీఎం, బీఎల్ఎఫ్ సిద్ధంగా ఉందని సీపీఎం నేత తమ్మినేని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు, అందులో సీపీఎం స్థానాలు ఏమిటీ ? సెప్టెంబర్ 2వ వారంలో జిల్లాల కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

18:18 - August 26, 2018

శ్రీకాకుళం : మరో నేత జంప్ కానున్నారు. కాంగ్రెస్ నేత కొండ్రు మురళి టిడిపి పార్టీలో చేరనున్నారు. ఆయన కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో సంప్రదింపులు జరపగా, కార్యకర్తల అభీష్టం మేరకే టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈనెల 31 న పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధినేత కళావెంకట్రావు ఆధ్వ‌ర్యంలో అమరావతి చంద్రబాబు నివాసంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబు పడుతున్న తపన..అభివృద్ధి చూసి తాను టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు.

 

18:11 - August 26, 2018

నెల్లూరు : తెలుగువాడికి అత్యున్నత పదవి దక్కింది. రక్షణశాఖలో కీలకమైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ జీ.సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. డీఆర్‌డీవో చైర్మన్‌ పదవిని చేపట్టిన తెలుగువాళ్లలో ఈయన రెండోవాడు. రక్షణ శాఖకు చెందిన కీలక బాధ్యతలను కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ జి.సతీశ్ రెడ్డికి అప్పగించింది. ప్రస్తుతం డిఆర్ డీవోలోని క్షిపణి వ్యవస్థల విభాగం డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్న సతీశ్ రెడ్డి.. మూడేళ్లుగా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదరుగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సామాన్య రైతు కుటుంబానికి చెందిన సతీశ్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మహిమలూరుకు చెందిన వారు. నెల్లూరు, అనంతపురం, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1986లో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో యువ శాస్త్రవేత్తగా చేరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మానస పుత్రిక... రీసెర్చ్‌ సెంటర్‌ ఇమరత్‌.... ఆర్‌సీఐలో పనిచేశారు. జాతీయ విధానాలు రూపొందించడంలో, క్షిపణుల సమర్థత కోసం రూపొందించిన రోడ్‌మ్యా్‌పలో సతీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌ లాబొరేటరీ్‌సకి డైరెక్టర్‌ జనరల్‌గా నేతృత్వం వహించారు. అనేక నూతన ఆవిష్కరణలకు ఆద్యుడిగా ఉన్నారు.

సతీశ్ రెడ్డి కొత్త ప్రాజెక్టులు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. డీఆర్‌డీవోలో స్వదేశీ పరిజ్ఞాన రూపకల్పన, అభివృద్ధికి సతీశ్‌రెడ్డి విశేష కృషి చేశారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు, వైమానిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. భారత అంతరిక్ష సాంకేతికత పురోగతిలో కీలకపాత్ర పోషించారు. జాతీయ స్థాయి విధానాల రూపకల్పనకు సహకారం అందించారు. నేవిగేషన్‌ రంగంలో ఆయన రూపొందించిన అనేక పరికరాలను క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో తొలిసారి 1000కిలోల గైడెడ్‌ బాంబులను అభివృద్ధి చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సతీశ్‌రెడ్డి కృషిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం గత ఏడాది హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన సతీశ్ రెడ్డిని 2014లో కేంద్ర ప్రభుత్వం విశిష్ట శాస్త్రవేత్తగా గుర్తించింది. 2015లో పదోన్నతి కల్పించి రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమించింది. ప్రస్తుతం సతీశ్ రెడ్డి డిఆర్ డీఓ చైర్మన్ గా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. 

16:34 - August 26, 2018

నెల్లూరు : రక్షణ ఉత్పత్తుల ఎగుమతి స్థాయికి డీఆర్డీవోను తీసుకెళుతానని డీఆర్‌డీవో చీఫ్‌ డాక్టర్ సతీశ్ రెడ్డి తెలిపారు. ఆయన డీఆర్ డీవో చీఫ్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. డీఆర్ డీవోలో నూతన పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తానని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సాహిస్తానని, దేశ రక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - August 26, 2018
16:27 - August 26, 2018

నెల్లూరు: ఓ కన్నతల్లి మానవత్వం మరిచిపోయింది. మాతృత్వానికే మాయని మచ్చగా చెప్పవచ్చు. కొందరు తల్లిదండ్రులు పిల్లల పట్ల రాక్షసంగా ప్రవరిస్తున్నారు. ఇటీవలే పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ తల్లి కన్నకొడుకును ఇనుప స్కేల్ ను కాల్చి వాతలు పెట్టింది. సూళ్లూరుపేటలో భార్య భర్తలు కృష్ణకుమారి, ప్రశాంత్ కుమార్ లకు ప్రణీత్ కుమారుడున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలతో తండ్రిని చూడవద్దంటూ ప్రణీత్ కు తల్లి గట్టిగా చెప్పింది. కానీ ఆదివారం తండ్రిని చూసేందుకు ప్రణీత్ వెళ్లాడు. ఈ విషయం కృష్ణ కుమారికి తెలిసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె ఇనుప స్కేల్ ను కాల్చి వాతలు పెట్టింది. భరించలేని ప్రణీత్ తండ్రి దగ్గరకు పరుగులు తీశాడు. దీనితో ఆ తండ్రి కుమారుడికి వైద్య చికిత్స చేయించాడు. ఇరువురూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

కొడుక్కి వాతలు పెట్టిన తల్లి...

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇనుప స్కేల్ కాల్చిన తల్లి కృష్ణకుమారి సొంత కుమారుడు ప్రణీత్ కు వాతలు పెట్టింది. భార్య కృష్ణకుమారి, భర్త ప్రశాంత్ కుమార్ లు విడిగా ఉంటున్నారు. 

16:14 - August 26, 2018

ఘట్ కేసర్ : సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే 'ప్రగతి నివేదన' సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు కొసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జనసమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఘట్ కేసర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సర్వసభ సమావేశం జరిగింది. ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున జనసేకరణ చేస్తామని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభకు జరుగుతున్న ఏర్పాట్లపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:08 - August 26, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన టూర్ కొనసాగుతోంది. ఆయన శనివారం ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు...నూతన జోనల్...విభజన చట్టం హామీలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన నిధులు..ఇతరత్రా వాటిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న అంశాలను పూర్తి చేయాలని..రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను మంజూరు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తులు చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. 

15:52 - August 26, 2018

కృష్ణా : జిల్లాలో దివిసీమ వాసులకు 'పాము' భయం పట్టుకుంది. భారీ వర్షాలు పడడడం..ఎగువన కురిసన వర్షాలతో వరదలు ప్రవహించాయి. కానీ వర్షాలతో పాటు పాములు కూడా భారీగా రావడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలువురిని కాటేస్తుండడంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇందులో కొందరు మృతి కూడా చెందారు. కానీ సర్పాలు పగబట్టాయని..అందుకే కరుస్తున్నాయని..సర్పయాగం చేస్తే దోషాలు తొలగిపోతాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై టెన్ టివి నిర్వహించిన చర్చా వేదికలో తేజశ్వీ శర్మ (జ్యోతిష్కులు) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:51 - August 26, 2018

కృష్ణా : జిల్లాలో దివిసీమ వాసులకు 'పాము' భయం పట్టుకుంది. భారీ వర్షాలు పడడడం..ఎగువన కురిసన వర్షాలతో వరదలు ప్రవహించాయి. కానీ వర్షాలతో పాటు పాములు కూడా భారీగా రావడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలువురిని కాటేస్తుండడంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇందులో కొందరు మృతి కూడా చెందారు. కానీ సర్పాలు పగబట్టాయని..అందుకే కరుస్తున్నాయని..సర్పయాగం చేస్తే దోషాలు తొలగిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో సర్పయాగం చేస్తే దోషం తేజశ్వీ శర్మ (జ్యోతిష్కులు), మధు కిరణ్ (ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ మెంబర్)లు పాల్గొని వివరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:23 - August 26, 2018

మహబూబ్ నగర్ : తెలంగాణలో ఎన్నికలంటే కాంగ్రెస్..టిడిపికి భయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్ లో టీఆర్ఎస్ 'ప్రగతి నివేదన' సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు జరగాల్సిన పనులను వేగవంతం చేశారు. పనులను పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టింది ? ఇతరత్రా వాటిపై సభలో వివరిస్తారని తెలిపారు. వనపర్తి జిల్లా నుండి ప్రజలు సమయత్తం అవుతున్నారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:14 - August 26, 2018

నెల్లూరు : తనలో నరసింహస్వామి ప్రవేశించాడని...సైకో మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేజర్ల మండలం నాగల వెలటూరులో చోటు చేసుకుంది. హైమావతమ్మ అనే మహిళ స్థానికంగా ఉన్న పోలేరమ్మ గుడిలో పూజారీగా చేస్తోంది. పోలెరమ్మ ఆలయాన్ని పెద్దగా నిర్మించాలని విరాళాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానికంగా వ్యవసాయ కూలీగా చేసుకునే హరిబాబు తన ఒంట్లోకి నరసింహ స్వామి ప్రవేశించాడని...చెబుతూ కేకలు వేస్తూ ఊర్లోని ప్రజలను భయపెట్టాడు. పూజారీ హైమావతితో మాట్లాడిస్తానని నమ్మబలికాడు. ఓ ప్రాంతానికి తీసుకొచ్చిన హైమావతిపై దాడికి పాల్పడ్డాడు. ఎవరైనా వస్తే రక్తం కక్కుకుని చనిపోతారని భయపెట్టడంతో ఎవరూ ముందుకు రాలేకపోయారు. చివరకు స్థానికంగా ఉన్న ఓ యువకుడు గమనించి హైమావతిని కాపాడాడు. చేజర్ల పీఎస్ లో హైమావతమ్మ ఫిర్యాదు చేసింది. నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. 

నెల్లూరులో సైకో హల్ చల్...

నెల్లూరు : జిల్లా చేజర్ల మండలం నాగల వెలటూరులో హరిబాబు సైకో హల్ చల్ చేశాడు. మూఢనమ్మకాల ముసుగులో హైమావతమ్మ అనే మహిళపై సైకో హరిబాబు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి పూజారీగా హైమావతమ్మ పని చేస్తోంది. గత మూడు రోజుల నుండి తన ఆత్మలోకి నరసింహ స్వామి వచ్చాడని హరిబాబు పేర్కొన్నాడు. చేజర్ల పీఎస్ లో హైమావతమ్మ ఫిర్యాదు చేసింది. నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. 

14:45 - August 26, 2018

వరంగల్ : సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభను విజయవంతం చేసేందుకు వరంగల్ జిల్లాలో గ్రామ స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పనుల్లో నిమగ్నమైనారు. జిల్లా నుండి 2.5 లక్షల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పథకాలను సభలో వివరిస్తామని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. హరితప్లాజ్ లో మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో నేతలు సమావేశమవుతామని, సభకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:39 - August 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సాధించేందుకే తాను టీజేఎస్ లో చేరానని మర్రి ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. ఈయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడనే సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ ఆదిత్యరెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. కోదండరాం జరుపుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలనే ఉద్ధేశ్యంతో పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కమీషన్ ఇవ్వనందుకే అక్రమ కేసులు - కాంట్రాక్టర్...

పశ్చిమగోదావరి : పాలకొల్లు దమ్మయ్యపతి డ్రైన్ సబ్ కాంట్రాక్టర్ పాకపాటి పృథ్వీరాజును పోలీసులు అరెస్టు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయనందుకు పృథ్వీరాజుపై డీఈ శ్రీనివాసరావు కేసు పెట్టారు. ఎమ్మెల్యే రామానాయుడు అడిగిన కమిషన్ ఇవ్వనందుకే డీఈతో అక్రమ కేసులు పెట్టించారని పృథ్వీరాజు ఆరోపించారు. 95 శాతం పనులు పూర్తి చేసినా రూ. 60 లక్షల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

విజయవాడ బ్యుటీషయన్ హత్యాయత్నం కేసులో కొత్త మలుపు

కృష్ణా : విజయవాడ బ్యుటీషయన్ హత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. హత్యాయత్నానికి ముందు బ్యుటీషయన్ పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

కార్పోరేటర్లుకు కోట్లు దోచి పెడుతున్నారు - సీపీఐ...

విజయవాడ : నగరాన్ని అభివృద్ధి చేయడమంటే కార్పొరేటర్లకు కోట్లు దోచి పెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. స్కూటర్లపై తిరిగిన కార్పొరేటర్లు ఆడి కార్లలో తిరుగుతున్నారని, రూ. లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటున్న సీఎం పరిశ్రమలు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

జనసేన, సీపీఐ, సీపీఎం శంఖారావం...

విజయవాడ : జనసేన, సీపీఐ, సీపీఎం శంఖారావం పూరించాయి. విజయవాడ కార్పొరేషన్ బకాసురుడిలా ఉందని సీపీఎం నేత మధు విమర్శించారు. విజయవాడ కార్పొరేటర్లు బకాసురుడి ఏజెంట్లుగా మారారని, కార్పొరేషన్ కార్యాలయానికి అందరూ కలిసి సున్నం పూస్తారని పేర్కొన్నారు. కార్పొరేషన్ సొమ్మును స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు దోచుకుతింటున్నారని తెలిపారు. 

14:17 - August 26, 2018

కృష్ణా : విజయవాడ బ్యుటీషయన్ హత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. హత్యాయత్నానికి ముందు బ్యుటీషయన్ పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్ కుమార్, పద్మ మధ్య ఘర్షణ జరిగినట్లు, వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

14:05 - August 26, 2018

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 'మామయ్య రాఖీ సెలబ్రేషన్స్‌ విత్‌ లవ్లీ సిస్టర్స్‌' అంటూ ఉపాసన ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. రాఖీలు కట్టిన ఇద్దరు చెల్లెళ్లకు చిరంజీవి... ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బహుమతులు ఇచ్చారు. 

14:00 - August 26, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. రాఖీ కట్టినందుకు అభిమానంతో అక్కా,చెల్లెళ్లకు సోదరులు బహుమానం ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఎంపీ కవిత మాత్రం తన సోదరుడు చిరకాలం సురక్షితంగా ఉండాలంటూ హెల్మెట్‌ను బహుమానంగా అందజేశారు. అందరూ సోదరీమణులు కూడా తమ సోదరులకు రాఖీ సందర్బంగా హెల్మెట్‌ బహుమతిగా ఇవ్వాలని సూచిస్తున్నారు.

 

13:51 - August 26, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏర్పాట్లను మంత్రి మహేందర్‌రెడ్డి, పలువురు నేతలు పరిశీలించారు. సభకు వచ్చేందుకు రోడ్లు వేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు వేగవంతం చేయాలని పార్టీ నేతలు సూచించారు. 

 

ఢిల్లీలో రెండోరోజు కొనసాగుతోన్న కేసీఆర్‌ పర్యటన

ఢిల్లీ : రెండోరోజు ఢిల్లీలో కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌ను, 4.30 గంటలకు అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కోరనున్నారు. 

13:49 - August 26, 2018

ఢిల్లీ : రెండోరోజు ఢిల్లీలో కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌ను, 4.30 గంటలకు అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కోరనున్నారు. 

 

ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఉదయమే అక్కడకు చేరుకున్న మహేందర్‌రెడ్డి... రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

13:46 - August 26, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. పనులను పార్టీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొంగరరావిరాలలో ప్రగతి నివేదన సభ జరగడం సంతోషమన్నారు. 1650 ఎకరాలలో సభాస్థలి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1000 ఎకరాల్లో పార్కింగ్, 650 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 400 మంది లేబర్స్ పని చేస్తున్నారని తెలిపారు. 350 నుంచి 500 వరకు వేదికపై కూర్చుంటారని పేర్కొన్నారు. 29కల్లా ఏర్పాట్లు పూర్తి అవుతాయన్నారు. 

టీ స్టాల్‌ నిర్వహించే వ్యక్తితో రోగులకు వైద్య సేవలు

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో అధికారులు... రోజువారీ వేతనంతో వేరే వ్యక్తులతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే.. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని.. ఓ టీ స్టాల్‌ నిర్వహించే వ్యక్తితో రోగులకు వైద్య సేవలు అందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

13:21 - August 26, 2018

ఉమ్మడి నిజామాబాద్‌ : జిల్లాలో తామూ ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధమంటున్నారు ఎమ్మెల్సీలు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ.. క్యాడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. ఒక్క ఛాన్స్‌ అంటూ తమ గాఢ్ ఫాదర్ల చుట్టు ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాలపై ఎమ్మెల్సీల కన్ను పడటంతో సిట్టింగ్‌లు అలర్ట్‌ అయ్యారు. హీట్‌ పుట్టిస్తున్న నిజామాబాద్ పాలిటిక్స్‌ స్పెషల్‌ స్టోరీ. 
ఎన్నికలకు రెడీ అవుతున్న ఎమ్మెల్సీలు
ముందస్తు ఎన్నికలకు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారు. తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటూ నిజామాబాద్‌ జిల్లాలోని ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు శాసన మండలి సభ్యులు ఉండగా.. అధికార పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఓ మాజీ ఎమ్మెల్సీతో పాటు నలుగురు ఎమ్మెల్సీలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రోటోకాల్ పరంగా ముందు వరుసలో ఉన్నా.. తెలంగాణ ఏర్పడ్డాక నియోజకవర్గానికి ఎమ్మెల్యే పవర్ ఫుల్ అయ్యారు. అభివృద్ది కార్యక్రమాలు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇది గమనించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నా నియోజకవర్గం లేకపోవడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
నిజామాబాద్‌పై కన్నేసిన భూపతిరెడ్డి
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్‌ నియోజకవర్గంపై కన్నేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యేకు ధీటుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అభివృద్ధి నిధులను ఖర్చు చేసి క్యాడర్ పెంచుకుంటున్నారు. ఇక భూపతి రెడ్డికి చెక్ పెట్టేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భూపతి రెడ్డి పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అయితే భూపతిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ఆయన మరింత ఉత్సాహంతో పోటీకి సిద్ధమవుతున్నారు. ఒకవేళ పార్టీ చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ నుంచి కానీ, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీకి చేయాలని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చూస్తున్నారు.
జుక్కల్‌పై కన్నేసిన ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ 
ఇక అధికార పార్టీ మరో సీనియర్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్.. జుక్కల్ నియోజకవర్గంపై కన్నేశారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కార్యకర్తలకు చెబుతున్నారు. మరో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. అవకాశం వస్తే పోటీ చేస్తానని.. లేదంటే తటస్థంగా ఉంటానని చెబుతున్నారు. 
కాంగ్రెస్‌కు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలు 
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిద్దరికి ఎమ్మెల్యేగా పనిచేసిన అపార అనుభవం  ఉంది. వీరిలో ఒకరు శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ కాగా... మరొకరు ఆకుల లలిత. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన షబ్బీర్.. కామారెడ్డి నుంచి మరోసారి అదృష్టం పరీక్షించుకుంనేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దాదాపు ఆయనకు టిక్కెటు ఖాయం అయినట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ ఆకుల లలిత..  ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలపై లలిత కన్నేశారు. మూడు నియోజకర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. నిధులను ఖర్చు చేస్తున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో.. పార్టీ కూడా ఆమెవైపే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల ప్రజలు ఆమెకు అనుకూలంగా ఉండటంతో.. ఏదైనా ఒక నియోజకవర్గంలో లలిత పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి  సైతం నిజామాబాద్ రూరల్ నియోజవర్గం పై కన్నేశారు. రూరల్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి టికెట్టు రేసులో ఎమ్మెల్యేలు పై చేయి సాధిస్తారా లేక ఎమ్మెల్సీలు టికెట్టు దక్కించుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. అసలు ఎవరూ పై చేయి సాధిస్తారని తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్‌ చేయాల్సి ఉంది. 

 

13:08 - August 26, 2018

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో అధికారులు... రోజువారీ వేతనంతో వేరే వ్యక్తులతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే.. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని.. ఓ టీ స్టాల్‌ నిర్వహించే వ్యక్తితో రోగులకు వైద్య సేవలు అందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రోగులు, బంధువులు భయాందోళనలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:58 - August 26, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. హరీశ్‌రావుకు రాఖీ కట్టి మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

12:55 - August 26, 2018

మెదక్‌ : అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెదక్‌ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. రాఖీలు కొనేందుకు మహిళలు దుకాణాల వద్ద బారులు తీరారు. రాఖీలు కట్టి తమ బంధాన్ని చాటుకుంటామంటున్నారు మహిళలు. మెదర్‌ జిల్లాలో రాఖీ సందడిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

12:52 - August 26, 2018

కర్నూలు : వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయం అధిష్టానమే నిర్ణయిస్తుందని ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఎవరు బాగా పనిచేస్తే ప్రజలు వారికే పట్టం కడతారన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉరుకుందు ఈరన్న స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మిగనూరుకు విచ్చేసిన టీజీ వెంకటేశ్‌కు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. 

12:48 - August 26, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఉదయమే అక్కడకు చేరుకున్న మహేందర్‌రెడ్డి... రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:44 - August 26, 2018

వరంగల్‌ : రాఖీ పౌర్ణమి వేడుకలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. తమకు రక్షణగా ఉండాలని సోదరులకు... అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతున్నారు. పలు గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహిస్తున్నాయి. వరంగల్‌ జిల్లాలో రాఖీ పౌర్ణమి వేడుకలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

12:21 - August 26, 2018

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో ఎక్కడ చూసినా రాఖీ పండుగ సందడి కనిపిస్తోంది. జింగిల్‌ బెల్స్‌ స్కూల్లో ఆనందోత్సాలతో రాఖీ వేడకులు జరిగాయి. బాలబాలికలు ఉత్సాహంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

12:19 - August 26, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ ఆదిత్యరెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిత్యరెడ్డి చేరికను టీజేఎస్‌ చివరివరకు గోప్యంగా ఉంచారు.  

12:09 - August 26, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో మెట్రో కూత పెట్టేందుకు రెడీ అవుతుంది. ఓల్డ్‌ సిటీలో మెట్రో పనులను స్పీడప్‌ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి పక్షాలు, పలు సంస్థలు ఓల్డ్‌ సిటీలో మెట్రో నిర్మించాలని డిమాండ్‌  చేయటంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యేలతో హెచ్‌ఎంఆర్‌ అధికారులు మెట్రో మార్గంలో పర్యటించారు. 
హోల్డ్‌లో సీబీఎస్‌..ఫలక్‌నూమా మార్గం
హైదరాబాద్‌లోని పాతబస్తీలో మెట్రోకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మొదటి దశలో నగరంలోని మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే 66 కిలోమీటర్ల పనులు పూర్తి కావస్తున్న సీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు నిర్మించాల్సిన మెట్రోను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. ఆస్తుల సేకరణకు ఇబ్బంది కలగటంతో పాటు మసీదులకు, ఇతర ప్రాచీన కట్టడాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టింది. అయితే పాతబస్తీలో మెట్రోను నిర్మించాలని విపక్షాలు, పలు సంస్థలు డిమాండ్‌ చేయటంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు 6 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పనులు మొదలు పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అధికారులు మెట్రో మార్గంలో పర్యటించారు. ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్‌, హైదరాబాద్‌ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మార్గాన్ని పరిశీలించారు. 
రెండు రోజుల్లో పనులు ప్రారంభం
మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభించేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. ఓల్డ్‌సిటీలో ఉన్న ప్రార్థన మందిరాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెట్రోను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మెట్రో మార్గంలో మొత్తం 5 స్టేషన్లు రానున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రాక ప్రదేశాల పేర్లు స్టేషన్లకు పెట్టాడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాలర్ జంగ్‌ మ్యూజియం స్టేషన్‌, శాలిబండ స్టేషన్‌, షంషీర్‌ గంజ్‌ స్టేషన్‌, ఫలక్‌నూమా స్టేషన్లు రానున్నాయి.
ప్రాజెక్ట్‌ పూర్తి కావటానికి రెండేళ్ల సమయం 
మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్‌ 2018 నాటికి పూర్తి కావాల్సి ఉన్న.. పాతబస్తీలో ఇప్పుడు పనులు ప్రారంభమవుతుండటంతో ప్రాజెక్ట్‌ పూర్తి కావటానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రాజెక్ట్‌ పనులు మొదలవుతుండటంతో ప్రతిపక్ష పార్టీలు, సంస్థలతో పాటు స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

 

11:55 - August 26, 2018

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగే రాఖీ పండగ. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో వైభవంగా రక్షా బంధన్‌ను జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు తెలుగురాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. కొత్త కొత్త డిజైన్‌లు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రాఖీ పౌర్ణమికి పురాణాల్లో ప్రాచీన గాథలు
అన్నా చెల్లెల, అక్క తమ్ముళ్ల అనురాగం, ఆప్యాయత, అనుబంధాల ప్రతీక రక్షాబంధన్. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువుగా గుర్తుచెప్పే అపురూపమైన పండుగ కూడా. ఈ రక్షా బంధనాన్ని రాఖీ పౌర్ణమిగా, శ్రావణ పౌర్ణమిగా, జంధ్యాల పౌర్ణమి పండుగగా పిలుస్తుంటారు. తన సోదరుడు సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని కోరుకుంటూ రాఖీ పండుగా నాడు సోదరి కట్టే దారాన్ని రాఖీ అంటారు. 
రాఖీ పౌర్ణమికి తెలుగురాష్ట్రాలు సిద్ధం
ఇక ఈ ఏడాది వస్తోన్న రాఖీ పౌర్ణమికి హైదరాబాద్‌తో పాటు తెలుగురాష్ట్రాలు సిద్ధమయ్యాయి. మారుతున్న కాలం కొద్ది రాఖీలు రకాలు కూడా మారుతూ వస్తోన్నాయి. దీంతో మార్కెట్‌లో వెరైటీ రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. దూది రాఖీలు మొదలుకొని స్టోన్‌ రాఖీలు, వెండి రాఖీలు ఇలా రకరకాల రాఖీలు ప్రస్తుతం మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
చిన్నారుల కోసం ప్రత్యేకమైన రాఖీలు 
ఇక చిన్నారుల కోసం ప్రత్యేకమైన రాఖీలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. చోటాభీమ్, స్పైడర్‌మెన్, బెన్‌టెన్, కార్లు, మోటర్‌బైకుల వంటి బొమ్మలతో కూడిన రాఖీలను విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఇవే కాకుండా రంగు రంగుల కలర్‌తో కూడిన లైటింగ్ రాఖీలు కూడా విక్రయిస్తున్నారు. ఇదివరకు బ్యాంగిల్ స్టోర్స్‌లలో మాత్రమే రాఖీల విక్రయాలు జరుగగా.. ప్రస్తుతం ప్రత్యేక స్టాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసి రాఖీలను విక్రయిస్తున్నారు.
వెరైటీ రాఖీలు 
ఇక వెరైటీ రాఖీలు ఆకర్షిస్తుండటంతో సోదరిమణులు స్టాళ్లలో క్యూ కడుతున్నారు. తమ అన్నయ్యలకు, తమ్ముళ్లకు నచ్చే రాఖీలు కట్టాలనే ఉద్దేశ్యంతో వెరైటీ రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. 
సోదరులకు సోదరిలు పోస్టు ద్వారా రాఖీలు 
కాలం మారటంతో రక్షాబంధనం తీరు మారుతూవస్తోంది. విద్య, ఉపాధి, ఇతరత్ర కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు సోదరిలు పోస్టు ద్వారా రాఖీలను పంపుతున్నారు. రాఖీలు కట్టుకున్న సోదరులు పోస్టుల ద్వారా తోబుట్టువులకు కానుకలు పంపుతుండడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావటంతో ఆన్‌లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్‌లైన్ ద్వారానే కానుకలు స్వీకరించే విధానం ప్రస్తుతం కనిపిస్తోంది. స్కైప్‌, వాట్సాప్ లాంటి సోషల్ మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకోవటం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి వెసులుబాటుగా మారింది. పద్ధతులు మారినా రాఖీలో అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కుచెదరలేదు.

 

11:45 - August 26, 2018

కృష్ణా : పంటకాల్వలో గల్లంతైన ఎస్ ఐ వంశీధర్ మృతదేహం లభ్యం అయింది. చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద పంట కాల్వలో వంశీధర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిన్న ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కాలువలో ఎస్ ఐ వంశీధర్ గల్లంతయ్యారు. చికిత్స నిమిత్తం వెళ్లి కరకట్టపై వస్తుండగా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కేఈబీ కాలువలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. స్థానికుల తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడారు. ఎస్ ఐ వంశీధర్ గల్లంతయారు. స్థానికులు కాపాడలేకపోయారు. దాదాపు 30 కిలో మీటర్ల దూరం ఎస్ ఐ మృతదేహం కొట్టుకుపోయింది. నిన్న నుంచి గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు, ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు ఇవాళ చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద పంట కాల్వలో వంశీధర్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత ఎస్ ఐ స్వగ్రామం కోడూరుకు మృతదేహాన్ని తరలించనున్నారు. వంశీధర్ మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇవాళ, లేదా రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:41 - August 26, 2018

సంగరారెడ్డి : వారికే ఒకరి సాయం కావాలి... కానీ!  మేము సైతం అంటూ కేరళ వరద భాధితుల కోసం ముందుకొచ్చారు సంగారెడ్డిలోని దివ్యాంగ బాలలు. రాఖీలు తయారుచేసి.. అవి అమ్మగా వచ్చిన డబ్బును వరద భాధితులకు అందించేందుకు సిద్దమయ్యారు. ఆదర్శవంతమైన దివ్యాంగ బాలల ఔదార్యంపై 10టీవీ ప్రత్యేక కథనం..
రాఖీలు అమ్మి సాయం చేస్తున్న దివ్యాంగులు
కేరళలో సంభవించిన ఘోర విపత్తు పట్ల  ప్రంపంచ వ్యాప్తంగా స్పందించి.. తోచిన సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. కాగా.. సంగారెడ్డిలో ఒకరి ఆసరాలేనిదే తమ పని తాము చేసుకోలేని దివ్యాంగులు కేరళ వరదబాదితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చారు.  రాఖీల తయారీలో శిక్షణ తీసుకున్న దివ్యాంగ బాలలు రాఖీలు అమ్మి..  ఆ డబ్బును కేరళ వరదబాధితులకు సాయంగా అందించబోతున్నారు. 
రాఖీలు అమ్మి కేరళ వరద భాధితులకు సాయం 
కార్భైడ్ అనే స్వచ్చంద సంస్థ చిన్నపిల్లలకు రాఖీల తయారీలో శిక్షణ ఇస్తోంది. ఆ పిల్లలు తయారుచేసిన రాఖీలు అమ్మి కేరళ వరద భాధితులకు సాయం చేస్తున్నారు. ఈ విషయం సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న దివ్యాంగ బాలలకు తెలిసింది. ఇలాగే వారు కూడా తమవంతు సాయం చేయాలనుకున్నారు. వారంతా కార్భైడ్ సంస్థ నిర్వాహకుడు ఎం.ఎస్ చంద్రకు తమ సంకల్పాన్ని చెప్పారు. దీంతో ఆయన వారికి రాఖీ తయారీలో ట్రైనింగ్‌ ఇప్పించాడు.  దివ్యాంగ బాలలు.. ఇలా ముందుకు రావడం ఎందరికో స్పూర్తినిస్తుందని ఎం.ఎస్ చంద్ర అంటున్నారు.
సహాయ పడితే తప్పేముంది : బాలలు
మమ్మల్ని చూసి జాలిపడకుండా.. నిత్యం చాలా మంది సహాయ, సహకారాలు అందిస్తున్నారని చెబుతున్నారు దివ్యాంగ బాలలు. అలాంటప్పుడు శక్తి వంచన లేకుండా సహాయ పడితే తప్పేముంది అంటున్నారు. అందుకే కేరళ వరద భాదితులకు ఉడతా భక్తిగా తమవంతు సాయాన్ని ఈ విధంగా అందిస్తున్నాం అంటున్నారు.
కార్భైడ్ మంచి కార్యక్రమం చేపట్టిందన్న కేంద్రం నిర్వహకులు  
కార్భైడ్ స్వచ్ఛంద చాలా మంచి కార్యక్రమం చేపట్టిందంటున్నారు పునరావాస కేంద్రం నిర్వాహకులు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు మా పిల్లలు ముందుకు రావడం ఆనందంగా ఉందని పునరావాస కేంద్రం నిర్వాహకురాలు అంటున్నారు.
దివ్యాంగుల ఔదార్యానికి సలాం
కేరళ ప్రజల కష్టాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది గుండెలు స్పందించాయి. వేరొకరి సాయం లేనిదే తమ పని తాము చేసుకోలేకున్నా.. మేము సైతం అంటూ కేరళ బాధితుల కోసం ముందుకొచ్చిన దివ్యాంగుల ఔదార్యానికి సలాం. 

 

నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఉత్తమ్ భేటీ

హైదరాబాద్ : నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బస్సు యాత్రపై చర్చించనున్నారు.

08:22 - August 26, 2018

ఏపీ రాజకీయాలపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ నేత మల్లాది విష్ణు, బీజేపీ నేత బాజీ, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. టీడీపీ ధర్మపోరాట దీక్షపై చర్చించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:10 - August 26, 2018

తూర్పు గోదావరి : చామంతులు చిందులేస్తున్నాయి. గులాబీలు గూబ గుయ్‌మనిపిస్తున్నాయి. బంతులు సామాన్యుడితో బంతాటకు సిద్ధమవుతున్నాయి. లిల్లీ లొల్లిలొల్లి చేస్తోంది. ఇలా అన్ని రకాల పూల ధరలకు మార్కెట్లో ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పండుగల సీజన్‌ కావడంతోపాటు... అననుకూల వాతావరణం, వరదలు తోడవ్వడంతో ధరలు మండిపోతున్నాయి. ధరాభారంతో పూలను కొనాలంటేనే సామాన్యుడు హడలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రావణమాసంలో పూలకు డిమాండ్‌ 
శ్రావణమాసం అనగానే పండుగలు.. ముహూర్తాలు ముంచుకొస్తుంటాయి. విందులు, వినోదాల సందడి కనిపిస్తుంటుంది. శ్రావణమాసంలో రకరకాల శుభకార్యాలు ఉండడంతో పూల వినియోగం కూడా పెరుగుతుంది. ఈ శ్రావణమాసంలోనూ పూలకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. 
ఆకాశాన్నంటుతున్న పూల ధరలు  
ఈసారి పూల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఏడాదితో పోలీస్తే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే చామంతుల ధర చెమటలు పుట్టిస్తోంది. ఏపూలు కొనాలన్నా ధర మండిపోతోంది. దీంతో పూలను కొనాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.
పడిపోయిన పూల ఉత్పత్తి 
కేరళ, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో వచ్చిన వరదలతో పూల ఉత్పత్తి పడిపోయింది. ఏపీలోని గోదావరి తీరంలో వచ్చిన వరదల కారణంగా పూల ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాదితో పోలిస్తే పూల ధరలు రెట్టింపు అయ్యింది. ఇది మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
వర్షం కారణంగా నీట మునిగిన పూల తోటలు  
గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పూల తోటలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల పూల మొక్కల కోసం వేసిన నారుమళ్లు నాశనం అయ్యాయి. దీంతో ఉత్పత్తి పడిపోవడంతో పూల ధరలు అమాంతం పెరిగాయి.
సామాన్యులు సతమతం 
పూల ధరలకు రెక్కలురావడంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. పూజావేళ పూల గుత్తులు కాకపోయినా.. విడిపూలు కూడా కొనలేని పరిస్థితి తలెత్తింది. మొత్తంగా ఇప్పుడు పూల మార్కెట్‌లో పూల ధరలు మండిపోతుండడం... సామాన్యులను కలవరపెడుతోంది.
 

08:05 - August 26, 2018

ప.గో : ఏలూరులోరాఖీల సందడి కొనసాగుతునే ఉంది. రకరకాలుగా ఆకర్షిస్తున్న రాఖీలను.. రేట్లతో సంబంధం లేకుండా అన్నయ్యల కోసం కొనుగోలు చేస్తున్నారు చెల్లెలు. అన్నదమ్ములు ఆనంద పడేలా రాఖీలను కొనుగోలు చేస్తున్నామని సోదరిమణులు చెబుతున్నారు. రాఖీల సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

07:39 - August 26, 2018

శ్రీకాకుళం : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగే రాఖీ పండగ. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో వైభవంగా రక్షా బంధన్‌ను జరుపుకొంటున్నారు. ఇక పండుగ సందర్భంగా మార్కెట్లో ఎన్నో రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అయితే శ్రీకాకుళం మన్యంలో రాఖీలు సహజ సిద్ధంగా పూస్తున్నాయి. అదేంటీ... రాఖీలు సహజంగా సిద్ధంగా పూయటమా అనేగా మీ డౌట్‌. అయితే వాచ్‌ దిస్‌ స్టోరీ. 
కలర్‌ఫుల్‌ రాఖీలు సందడి 
రక్ష బంధన్‌ వచ్చిందంటే చాలు మార్కెట్లో కలర్‌ఫుల్‌ రాఖీలు సందడి చేస్తుంటాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సోదరిమణులను ఆకట్టుకుంటాయి. అన్నా చెల్లెల, అక్క తమ్ముళ్ల అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుంది. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువునని సోదరి గుర్తు చేస్తుంది. ఈ దారాన్ని మనం రాఖీగా పిలుస్తున్నాము. అయితే మార్కెట్లో లభిస్తున్న వెరైటీ రాఖీలు.. అధిక ధరలు ఉన్న సోదరుల కోసం సోదరి ఇష్టంతో కొనుగోలు చేస్తుంది. 
వెరైటీ రాఖీ సందడి 
ఇక విషయానికి వస్తే శ్రీకాకుళంలో ఓ వెరైటీ రాఖీ ఇప్పుడు సందడి చేస్తుంది. శ్రీకాకుళం మన్యంలో లభించే సహజ సిద్ధమైన రాఖీ ఇది. అదేంటీ... రాఖీలు సహజ సిద్ధంగా లభించటమేమిటి అనుకుంటున్నారా? అవును శ్రీకాకుళం మన్యంలో రాఖీ పుష్పాలు పూస్తున్నాయి. అందం, ఆకర్షణలో మాములు రాఖీలకు తీసిపోని విధంగా ఉన్న ఈ రాఖీలు.. కొత్తూరు మండలం పారాపురంలో పూస్తున్నాయి. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి ఈ రాఖీ పుష్పాలు పూస్తున్నాయి. పారాపురం పరిసర ప్రాంతాల్లో ఈ రాఖీ పుష్పాలను రాఖీలుగా కడుతున్నారు. ఎటువంటి సొమ్ముచెల్లించకుండా ఈ రాఖీ పుష్పాలు అందరికీ అందుబాటులో ఉంటుండటంతో.. మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సహజ సిద్దంగా పూస్తుండటంతో ఈ పుష్పాలను సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.  మరి మీకు కూడా రాఖీ పుష్పాలు కావాలంటే శ్రీకాకుళం వెళ్లాల్సిందే. 

 

నేడు బ్యాడ్మింటన్ క్వార్టల్ ఫైనల్

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా నేడు బ్యాడ్మింటన్ క్వార్టల్ ఫైనల్ జరుగనుంది. రచనోక్ ( థాయ్ లాండ్ ) తో సైనా నెహ్వాల్ తలపడనుంది. జిందాపోల్ ( థాయ్ లాండ్ )తో పీవీ సింధు ఢీకొననుంది. 

 

07:27 - August 26, 2018

నెల్లూరు : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఓ లవ్‌స్టోరీ ఉంది. తాను చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారట. ఇంటిపక్కన ఉండే అమ్మాయితోనో... క్లాస్‌మేట్‌తోనో కాదు... నాటి స్టార్‌ హీరోయిన్‌తో లవ్‌లో పడ్డారట. ఈ మాట ఆయనే స్వయంగా వెల్లడించారు. మరి ఇంతకీ సోమిరెడ్డి మదిని దోచిన ఆ అలనాటి తార ఎవరు. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...
సోమిరెడ్డికి రెండో కోణం 
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇప్పటి వరకు మనకు ఆయన ఓ రాజకీయ నాయకుడిగానే తెలుసు. ఏ సబ్జెక్టు తీసుకున్నా.. ఆయన సమగ్రంగా విశ్లేషించగలరన్న పేరుంది. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేయగల సత్తా ఉన్న వ్యక్తి.  ఇదంతా ఆయనలో దాగున్న ఒక కోణం మాత్రమే.. ఆయనకు రెండో కోణం కూడా ఉంది. అదే ప్రేమకోణం. 
సోమిరెడ్డి లవ్‌స్టోరీ 
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ ఓ లవ్‌స్టోరీ ఉంది. ఇది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అంశం. సోమిరెడ్డి తాను చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. పక్కింటి అమ్మాయితోనో... అత్త కూతురితోనో... లేదా క్లాస్‌మేట్‌తోనో కాదండోయ్‌.... ఓ స్టార్‌ హీరోయిన్‌తో. అలా అవాక్కవ్వకండి. నిజమే అలనాటి తార వాణిశ్రీని ఆయన అమితంగా ప్రేమించారట. ఇది ఎవరో చెపుతున్నది కాదు. స్వయంగా మంత్రిగారే చెప్పారు.
మనసులోని మాట బయటపెట్టిన సోమిరెడ్డి 
నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో సౌత్‌ ఇండియన్‌ సినీ కల్చర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రులు సోమిరెడ్డి, నారాయణ హాజరయ్యారు. అలనాటి తార వాణీశ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు. తాను చదువుకునే రోజుల్లోనే  ప్రేమించేవాడినని చెప్పుకొచ్చారు.  కాలేజీకి బంక్‌కొట్టి మరీ వాణిశ్రీ సినిమాలు చూసేవాడినని సెలవిచ్చారు. ప్రేమ్‌నగర్‌ సినిమాను 80 సార్లు చూశానంటూ నాటి తీపి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 
వాణిశ్రీని సన్మానించిన సోమిరెడ్డి  
సోమిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో స్టేజీ మీద ఆయన పక్కనే ఉన్న వాణిశ్రీ మంత్రిగారి మనసులోని మాటవిని చిరునవ్వు చిందించారు. దీంతో ఆ ప్రాంతమంతా నవ్వులు పూశాయి. అనంతరం సోమిరెడ్డి వాణిశ్రీని ఘనంగా సన్మానించారు. 

 

07:19 - August 26, 2018

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన పాలకమండల్లో కొత్తబాస్‌లు కొలువుదీరారు. బల్దియా కమిషనర్‌గా దాన కిషోర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా జనార్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కృషి చేస్తానని బల్దియా కమిషనర్‌ దాన కిషోర్‌ తెలిపారు. మేయర్‌, డిప్యూటి మేయర్‌ కార్పొరేటర్ల సహకారంతో సిటిజన్స్‌కు మరిన్ని సేవలు అందిస్తామన్నారు. మరోవైపు మాజీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించటం సంతృప్తి నిచ్చిందని తెలిపారు. నగరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బల్దియాను దేశంలో ముందజలో నిలిపామని చెప్పారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని జనార్ధన్‌రెడ్డి తెలిపారు. 

 

07:17 - August 26, 2018

గుంటూరు : వారికి బిల్లులతో పనిలేదు. తనిఖీలు చేసేవారు అసలే ఉండరు. వెరసి అక్రమ వ్యాపార కార్యకలాపాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారింది. బంగారం, వెండి ఆభరణాలను ఎలాంటి బిల్లులు లేకుండానే వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న అక్రమ బంగారు,ఎండి ఆభరణాల వ్యాపారంపై ప్రత్యేక కథనం..
అమాంతం పెరిగిన భూముల రేట్లు 
గుంటూరు ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ ఒక్కసారిగా పుంజుకుంది. భూములరేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీనికితోడు వ్యవసాయ, వాణిజ్యంలో గుంటూరు జిల్లాకు పెట్టిందిపేరు కావడంతో.. ఇక్కడ శ్రీమంతులు కూడా ఎక్కువే. చేతిలో దండిగా డబ్బు ఉండడంతో బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై జిల్లా వాసులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పండుగల సమయంలో బంగారు దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. కొనుగోలుదారుల ఆసక్తితో జిల్లాలోని గుంటూరు, తెనాలి, నరసరావుపేటలో  బంగారు దుకాణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
పన్నులు చెల్లించకుండానే గోల్డ్‌ వ్యాపారం
కోయంబత్తూరు, నెల్లూరు,విజయవాడ, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన ఆభరణాల తయారీదారులు గోల్డ్‌ ఆభరణాలను తీసుకువచ్చి ఇక్కడున్న దుకాణ దారులకు విక్రయిస్తుంటారు. వీటిపై ఎలాంటి పన్నులు చెల్లింపులు చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా తామ వ్యారాన్ని కొన్నేళ్లుగా సాగిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి రావడంతో.. వాణిజ్యపన్నుల శాఖ తనిఖీలు లేకుండా పోవడంతో అక్రమ బంగారు -వెండి ఆభరణాల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ఎలాంటి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న 33 లక్షల విలువైన బంగారు ఆభరణాలను  నరసరావుపేట పోలీసులు పట్టుకున్నారు. రొంపిచర్లలోనూ అక్రమంగా తరలిస్తున్న ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అవగాహనలేకనే అక్రమ వ్యాపారం 
అవగాహనలేకనే కొంతమంది వ్యాపారులు ఈ తరహా అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారని బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ నేతలు అంటున్నారు. గతంలో బంగారు ఆభరణాల విక్రయాలపై పన్నులు అధికంగా ఉండడంతో అక్రమ వ్యాపారం వైపు మొగ్గుచూపిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం పన్నుల విధానంలో మార్పులు రావడంతో అక్రమ పద్దతిలో వ్యాపారం కొనసాగించాల్సిన పనిలేదని బులియన్‌ మర్చంట్‌  అసోసియేషన్‌ నేతలంటున్నారు. మొత్తానికి గుంటూరు జిల్లాలో సాగే అక్రమ జ్యువెలరీ వ్యాపారానికి అడ్డకట్ట వేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

07:11 - August 26, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. రేపు తుదితీర్పు రాబోతోంది. ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నాటి బాంబు బ్లాస్ట్‌ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
2007 ఆగస్టు 25న బాంబు బ్లాస్ట్‌
ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడి 11 ఏళ్లు పూర్తయ్యింది. 2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు బాంబ్‌ బ్లాస్ట్‌లు జరిగాయి. దీంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  42 మంది చనిపోగా... 70మందికిపైగా గాయపడ్డారు. 
లుంబినీపార్క్‌, గోకుల్‌చాట్‌ బండార్‌లలో పేలుళ్లు
మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన బాంబు పేలింది.  రెండు ఘటనల్లో స్పాట్‌లోనే 33మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా... వందలాది మందికి గాయాలయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు విచారణలో తేలింది. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ముంబై పోలీసులు తేల్చారు.  దీంతో ఈ ఏడుగురు  ఉగ్రవాదులను 2009లో రాష్ట్రానికి తీసుకొచ్చిన రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, అక్టోపస్‌ విభాగాల అధికారులు  వారిని విచారించారు.  ప్రధాన సూత్రధారి అయిన యాసిన్‌ భత్కల్‌ను నేపాల్‌ ప్రాంతం నుంచి పట్టుకొచ్చారు.  కర్నాటక రాష్ట్రంలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు సోదరులలో యాసిన్‌, ఇక్భాల్‌ పట్టుబడ్డారు. అసలు నిందితుడు రియాజ్‌ తర్వాత అల్‌ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నట్టు తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ వైపు ఆకర్షితుడైనట్టు ఎన్‌ఐఏకు సమాచారం అందింది.
రేపు తుది తీర్పు 
నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దాని ఆధారంగా  ఈ కోర్టులో వారానికి రెండు రోజుల చొప్పున విచారణ చేపట్టారు. దర్యాప్తు బృందం ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించింది.  అనంతరం 1125 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేసింది. 11 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. 286 మంది సాక్ష్యులను ఎన్‌ఐఏ విచారించింది. మొత్తానికి 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

 

నేడు రతన్‌టాటాతో పీఎం చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబై వెళ్లనున్నారు. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రేపు పెద్ద ఎత్తున జరిగే అమరావతి బాండ్ల లిస్టింగ్‌లో పాల్గొనేందుకు ఇవాళ ముంబై వెళ్తున్నారు.  టాటా సంస్థ ప్రధాన కార్యాలయం బోంబే హౌస్‌నూ సందర్శిస్తారు.  పలు ప్రముఖ సంస్థల అధినేతలతోనూ ఆయన సమావేశం అవుతారు. ఇవాళ బొబే  హౌస్‌కు వెళ్లి.. అక్కడ టాటా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. రతన్‌టాటాతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. 

07:01 - August 26, 2018

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబై వెళ్లనున్నారు. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రేపు పెద్ద ఎత్తున జరిగే అమరావతి బాండ్ల లిస్టింగ్‌లో పాల్గొనేందుకు ఇవాళ ముంబై వెళ్తున్నారు.  టాటా సంస్థ ప్రధాన కార్యాలయం బోంబే హౌస్‌నూ సందర్శిస్తారు.  పలు ప్రముఖ సంస్థల అధినేతలతోనూ ఆయన సమావేశం అవుతారు. ఇవాళ బొబే  హౌస్‌కు వెళ్లి.. అక్కడ టాటా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. రతన్‌టాటాతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అపై ముంబైలోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో దేశంలోని ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాల గురించి చంద్రబాబు వారికి వివరిస్తారు. 

06:58 - August 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి మరో రెండు రోజులపాటు హస్తినలోనే ఉండనున్నారు. ఇవాళ ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అవుతారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆయనను కోరనున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఆయనతో చర్చించనున్నారు. అరుణ్‌జైట్లీతోపాటు అపాయింట్‌మెంట్‌ దొరికితే మరికొంత మంది కేంద్రమంత్రులతో కేసీఆర్‌ భేటీ అవుతారు.

 

ఇవాళ అరుణ్‌జైట్లీతోసీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ : నేడు సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అవుతారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆయనను కోరనున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఆయనతో చర్చించనున్నారు. అరుణ్‌జైట్లీతోపాటు అపాయింట్‌మెంట్‌ దొరికితే మరికొంత మంది కేంద్రమంత్రులతో కేసీఆర్‌ భేటీ అవుతారు.

నేడు తెలంగాణలో ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష జరుగనుంది. ఎస్సై ప్రిలిమ్స్ కు 1,88,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 339 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు గంట ముందే సెంటర్ లకు చేరుకోవాలని అధికారుల సూచించారు. నిమిషం ఆలస్యం నిబంధన వర్తించనుంది.

 

నేడు 246వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

విశాఖ : నేడు 246వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఇవాళ యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని రాంజల్లి, వెంకటాపురం, గొల్ల ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం, రామన్నపాలెంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

 

Don't Miss