Activities calendar

27 August 2018

21:16 - August 27, 2018

ఢిల్లీ : నెహ్రూ మెమోరియల్‌ను మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌ నేత కాదని...ఈ దేశానికే తొలి ప్రధాని అని మన్మోహన్‌ పేర్కొన్నారు. నెహ్రూ మ్యూజియం రూపు రేఖలను మార్చవద్దని, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని కోరారు. నెహ్రూ స్మృతి చిహ్నంగా ఉన్న తీన్‌మూర్తి కాంప్లెక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేయొద్దని మాజీ ప్రధాని అన్నారు. వాజ్‌పేయీ హయాంలోనూ నెహ్రూ మెమోరియల్‌ మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని గుర్తు చేశారు. ఇపుడు ఈ మెమోరియల్‌ను మార్చాలని చూడడం బాధాకరమని మన్మోహన్ లేఖలో వెల్లడించారు.

21:15 - August 27, 2018

జమ్ము కశ్మీర్‌ : ఆర్మీకి చెందిన మేజర్ లీతుల్‌ గోగోయ్‌పై ఆర్మీ క్రమశిక్షణా చర్యలు తీసుకోనుంది. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో ఓ అమ్మాయితో కలిసి ఆ మేజర్ కనిపించాడు. ఆ ఘటనపై ఆర్మీకోర్టు విచారణ జరిపింది. నిబంధనలను ఉల్లంఘించి స్థానిక అమ్మాయితో తిరిగినందుకు ఆర్మీ కోర్టు ఆ మేజర్‌ను తప్పుపట్టింది. మేజర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మే 23వ తేదీన శ్రీనగర్‌లో మేజర్ గగోయ్ 18 ఏళ్ల యువతితో కలిసి హోటల్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. స్థానిక అమ్మాయిని హోటల్‌కు తీసుకురావడాన్ని హోటల్ యజమాని అడ్డుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు మేజర్‌పై కేసు బుక్ చేశారు. గోగోయ్‌ దోషిగా తేలితే శిక్ష తప్పదని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. అల్లరి మూకల రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి మేజర్‌ గోగోయ్ ఓ వ్యక్తిని జీపుకు కట్టి తీసుకెళ్లడం వివదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

 

21:14 - August 27, 2018

గుంటూరు : మంగళవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో టీడీపీ మైనారిటీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 'నారా హమారా-టీడీపీ హమారా' అనే నినాదంతో నిర్వహించనున్న ఈ సభకు లక్షమంది ముస్లిం మైనారిటీలు తరలిరానున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సభ ఏర్పాట్లపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:13 - August 27, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచుతున్నారు. ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో వీడియోలో చూడండి. 

21:11 - August 27, 2018

ముంబై : ఏపీ రాజధాని నిర్మాణం కోసం CRDA జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో నమోదు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన ఈ లిస్టింగ్‌ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం కోసం CRDA జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదు చేశారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అమరావతి బాండ్ల లిస్టింగ్‌ను బెల్‌ కొట్టి ప్రారంభించారు.

బీఎస్‌ఈలో అమరావతి బాండ్లు నమోదు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా అమరావతిని వరల్డ్‌ క్లాస్ సిటీగా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అమరావతిలో ఉన్నాయన్నారు. ఏపీలో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీఎస్‌ఈ అధికారులను సీఎం కోరారు. ఒక ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు విజన్‌, లక్ష్యం కావాలన్నారు సీఎం చంద్రబాబు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా నిర్మించగలిగామని.. ఈ ఒక్క విమానాశ్రయం తెలంగాణలో 50 శాతానికిపైగా స్థూల ఉత్పత్తిని సాధిస్తుందన్నారు. అందకే గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అందుకోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ ఆగ్రస్థానంలో ఉందని బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌ కుమార్‌ అన్నారు. సాంకేతిక వినియోగంలోనూ ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. లిస్టింగ్‌ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజ్‌ పాలెస్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేందుకు విజన్‌ రూపొందించుకున్నట్లు చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు తెలిపారు. 

శ్రీవారికి బంగారు కిరీటం...వెండి పాదాలు...

చిత్తూరు : తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం, వెండి పాదాలను భక్తులు బహుకరించారు. టిటిడి ఛైర్మన్ సుధాకర్ యాదవ్ కు దొరై స్వామి అందచేశారు. కిలో 600 గ్రాముల వెండి పాదాలను తమిళనాడు గుడియాతంకు చెందిన దొరై స్వామి కుటుంబం అందచేసింది. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు..గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్ : 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పోస్టుల భర్తీ, కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకం జరుగనుంది. 

పవన్ కు తమ్మినేని లేఖ...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీపీఎం నేత తమ్మినేని లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేనతో కలిసి పని చేయాలని ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కలిసి పనిచేద్దామని సూచించారు. తమ్మినేని ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. తమ్మినేనితో ముఖాముఖి మాట్లాడాలని జనసేన నిర్ణయం తీసుకుంది. 

ఏపీలో 22 మంది డిప్యూటి కలెక్టర్లు బదిలీ...

విజయవాడ : ఏపీలో 22 మంది డిప్యూటి కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఒంగోలు ఆర్డీవో పెంచెల కిషోర్, కందుకూరు ఆర్డీవో కేఎస్ రామారావు, రాజంపేట ఆర్డీవోగా డి.కోదండరామ్ రెడ్డి, మార్కాపురం ఆర్డీవోగా జి.రామకృష్ణారెడ్డి, కడప ఆర్డీవోగా ఎంఎస్ మురళీ, కళ్యాణ దుర్గం ఆర్డీవోగా హుస్సేన్ సాహెబ్, కర్నూలు ఆర్డీవోగా బి.కె.వెంకటేశ్వర్లు..తదితరులు బదిలీ అయ్యారు. 

19:26 - August 27, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్ లో టీఆర్ఎస్ నిర్వహించే ప్రగతి నివేదన సభకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పలువురు మంత్రులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సోమవారం ఎంపీ జితేందర్ రెడ్డి కొంగర్ కలాన్ కు చేరుకుని జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని సభలో వివరిస్తామని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

19:23 - August 27, 2018

గుంటూరు : 'నారా హమారా టిడిపి హమారా' పేరిట టిడిపి సభ నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భారీ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మైనార్టీలు నిర్వహిస్తున్న ఈ ర్యాలీపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:20 - August 27, 2018

గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింల కోసం టిడిపి కృషి చేస్తోందని, ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ముస్లింలతో మమేకం కావడానికి గుంటూరులో సభ నిర్వహించడం జరుగుతోందని, ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావిస్తుంటే మైనార్టీల్లో పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:29 - August 27, 2018

హైదరాబాద్ : అందరి చూపు సెప్టెంబర్ మాసంపై నెలకొంది. 2వ తేదీన కొంగర్ కలాన్ లో జరిగే 'ప్రగతి నివేదన' సభకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 25 లక్షల మందిని తరలించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు నియమితులైన కమిటీలు బిజీ బిజీగా ఉంటున్నాయి. సీఎం కేసీఆర్ దిగేందుకు ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మాణం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:27 - August 27, 2018

హైదరాబాద్ : సెప్టెంబర్ మాసంలో ఏం జరుగబోతోంది ? ఆ నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తారా ? ముందస్తు ఎన్నికలకు సమాయత్తం జరుగుతోందా ? తదితర ఎన్నో అంశాలపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన..ఈసీని పలువురు నేతలు కలవడం...తదితర పరిణామాలతో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు పయనం అవుతుండడం...అంతలోనే మంగళ, బుధవారాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని ప్రచారం జరిగుతోంది. ప్రపోజల్స్ తో సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్స్ పల్ సెక్రటరీ నోట్ జారీ చేశారు. కానీ సమయం అందులో పేర్కొనలేదని సమాచారం. మంగళ, బుధవారాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

కేసీఆర్ పర్యటన ముగిసింది...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కాసేపటి క్రితం ముగిసింది. కాసేపట్లో ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు. 

18:07 - August 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ గూబ గుయ్యిమనేటట్లు ప్రజలు తీర్పునిస్తారని, నల్గొండ జిల్లాలో 12 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, మరి కాంగ్రెస్ ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల పదవులు..ఆస్తులు..పాపాలు పెరిగాయో..అలానే ఫ్లోరైడ్ భూతం పెరిగిందని అభివర్ణించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఏం చేశారని, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పై ఏనాడు కృషి చేయలేదన్నారు. ఒక్క పైసా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొంటే జానా, ఉత్తమ్ లు ముసిముసి నవ్వులు నవ్వారని, ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఫ్లోరైడ్ భూతాన్ని పారదాలుతోమని, నాలుగేళ్లలో ఎన్నో పనులు చేసిన కేసీఆర్ దించేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు ఆనాడు ఏం చేశారు - కేటీఆర్...

హైదరాబాద్ : నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, మరి కాంగ్రెస్ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల పదవులు..ఆస్తులు..పాపాలు పెరిగాయో..అలానే ఫ్లోరైడ్ భూతం పెరిగిందని అభివర్ణించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఏం చేశారని, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పై ఏనాడు కృషి చేయలేదన్నారు. ఒక్క పైసా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొంటే జానా, ఉత్తమ్ లు ముసిముసి నవ్వులు నవ్వారని, ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీశారు. 

కొచ్చి ఎయిర్ పోర్టులో...

కేరళ : కొచ్చి ఎయిర్ పోర్టులో విమానాల పునరుద్ధరణకు సంబంధించి కొచ్చి ఎయిర్ పోర్టు బోర్డు సమీక్ష జరిపింది. ఈ నెల 29 నుండి విమాన సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కొచ్చి ఎయిర్ పోర్టును సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ పరిశీలించారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం...

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన ఎంపి కమిటీ, పంచాయతీ రాజ్ కమిషనర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. 30 జిల్లాల్లో నియామక పరీక్ష నిర్వహించాలని స్ఫష్టం చేసింది. 

ముగిసిన ఈసీ సమావేశం...

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో ఈసీ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈవీఎంలు, వీవీ పాట్ లపై కొన్ని పార్టీలు అభ్యంతాలు లేవనెత్తాయని ఓపీ రావత్ వెల్లడించారు. 

16:55 - August 27, 2018

మేఘాలయ : దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ కన్రాడ్‌ కే సంగ్మా విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి చార్లెట్‌ మొమిన్‌పై 8,400 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో సం‍గ్మాకు 13,656 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి మొమిన్‌కు 8421 ఓట్లు దక్కాయని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎఫ్‌ఆర్‌ కర్కోంగర్‌ వెల్లడించారు. సంగ్మా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిఎం సోదరి, మాజీ కేంద్ర మంత్రి అగత సంగ్మా తురా నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆగస్టు 23న ఉప ఎన్నిక జరిగింది. ఈ విజయంతో 60 మంది సభ్యులు కలిగిన మేఘాలయా అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఎన్‌పీపీ సంఖ్యాబలం విపక్ష కాంగ్రెస్‌తో సమానంగా 20కి చేరుకుంది. ఆరు పార్టీలతో కూడిన మేఘాలయా డెమొక్రాటిక్‌ అలయన్స్‌ ప్రభుత్వానికి ఎన్‌పీపీ నేతృత్వం వహిస్తోంది. రాణికోర్‌ ఉప ఎన్నికలో కూడా యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి పియోస్‌ మార్విన్‌ ఆధిక్యంలో ఉన్నారు. 

16:53 - August 27, 2018

ఢిల్లీ : 2002 గోద్రా రైలు మారణహోమం కేసులో ఇద్దరు నిందితులకు గుజరాత్‌లోని సిట్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో దాదాపు దశాబ్దకాలం పాటు తప్పించుకు తిరిగిన ఐదుగురిని 2015-16 మధ్య అరెస్టు చేశారు. 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఓ బోగికి అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. దీంతో ఎస్-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కారణంగా గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్‌ ప్రత్యేక కోర్టు 2011లో 11 మందికి ఉరిశిక్ష విధించగా... 20 మందికి జీవిత ఖైదు విధించింది. మరో 63 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. తమకు విధించిన శిక్షలపై నిందితులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు 11 మందికి విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మారుస్తూ గత ఏడాది అక్టోబర్‌లో తీర్పు చెప్పింది. 

16:49 - August 27, 2018

రంగారెడ్డి : కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రగతినివేదన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సభకు చేరుకునేందుకు హెలిప్యాడ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు అధికారులు. హెలికాప్టర్‌ వచ్చే సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:33 - August 27, 2018
16:08 - August 27, 2018

హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థ గెజిట్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని...సోమవారం సాయంత్రం గెజిట్ విడుదలవుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. గెజిట్ విడుదల కాబోతుండడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ సాధించిన సీఎం కేసీఆర్ కు ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలియచేస్తున్నాయి. అభినందన సభలు ఏర్పాటు చేయాలని పలు ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సచివాలయంలో పలు సంఘాల నేతలతో టెన్ టివి ముచ్చటించింది. ఈ కొత్త జోనల్ వ్యవస్థతో ఉద్యోగులు..నిరుద్యోగులకు మేలు జరగుతుందని నేతలు పేర్కొంటున్నారు. ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే రిజర్వేషన్లు వస్తాయని, అనేక ఉద్యోగాలు వస్తాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి శిక్షణా తరగతులు...

పశ్చిమగోదావరి : పాలకొల్లు, నరసాపురంలో టిడిపి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణలు ప్రారంభించారు. దేశంలో మోడీని ఎదిరించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయడని, తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

15:35 - August 27, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నివేదికలను కేంద్ర పెద్దలకు ఇస్తున్నారు. ఆయా విషయాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందనని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని సోమవారం సాయంత్రం హైదరాబాద్ కు కేసీఆర్ రానున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతుండడం...కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. దీనితో ముందస్తు ఎన్నికలపై మరింత ఉత్కంఠ నెలకొంది. ప్రపోజల్స్ తో సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్స్ పల్ సెక్రటరీ నోట్ జారీ చేశారు. ఏ శాఖకు కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందనే దానిపై సమావేశంలో చర్చిస్తారని మరోవైపు చర్చ జరుగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

15:34 - August 27, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నారని టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపణలు గుప్పించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, ఇతర పార్టీలు పేర్కొంటున్నాయని, దేశానికి మేలు జరుగుతుందని మోడీ తెలిపారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ కుటుంబ ప్రయోజనం...టీఆర్ఎస్ లాలూచీ తప్ప ప్రజా ప్రయోజనం ఏముందో చెప్పాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు రుద్దితే గతంలో ఎన్టీఆర్ విషయంలో...చంద్రబాబు విషయంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో కేసీఆర్ కి కూడా గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ మొనగాడు కాదని...ఒక్కసారి మాత్రమే గెలిచారన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకుని ఎన్నికల నావాను ఒడ్డుకు చేర్చుకున్నారని విమర్శించారు.

1600 ఎకరాల్లో 25 లక్షల మందితో కొంగర కనాల్ లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నారని, ఈ సభకు 25 లక్షల మందిని తీసుకరావాలంటే 2.5 లక్షల వాహనాలు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు రూ. 125 కోట్ల రూపాయల అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. మొత్తం రూ. 500 కోట్లు సభ కోసం ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ. కోటి రూపాయలు ఉంచిన డబ్బాలని ఇచ్చారని..ఈ డబ్బాలను గన్ మెన్ ల ద్వారా తరలించారన్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన శాసనసభ్యులు ఆ డబ్బు డబ్బాలను ఎత్తుకెళ్లారని..రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పర్యవేక్షణలో ఇదంతా జరిగిందన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా తమపై ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. 

15:30 - August 27, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన టూర్ కొనసాగుతోంది. మూడు రోజులుగా ఆయన అక్కడ మకాం వేసిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో ఇచ్చిన హామీలు..పెండింగ్ లో ఉన్న కేంద్ర నిధులు..ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. సోమవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులపై కేసీఆర్ చర్చించారు. అనుమతులిచ్చిన రహదారులకు వెంటనే అలైన్ మెంట్లు, నోటిఫికేషన్ లు త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నేషనల్ హైవేలన్నింటినీ గ్రీన్ హైవేలుగా మార్చాలని గడ్కరిని కోరారు. 

తెలంగాణ కేబినెట్ మీటింగ్...

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం సాయంత్రం జరుగనుంది. ప్రపోజల్స్ తో సిద్ధంగా ఉండాలని ముఖ్య అధికారులకు ప్రిన్స్ పల్ సెక్రటరీ నోట్ జారీ చేశారు. 

గడ్కరితో కేసీఆర్...

ఢిల్లీ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నేషనల్ హైవే పెండింగ్ ప్రాజెక్టులపై గడ్కరితో చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు అంశంపై చర్చించారు. అనుమతులిచ్చిన రహదారులకు అలైన్ మెంట్లు, నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. నేషనల్ హైవేలన్నింటినీ గ్రీన్ హైవేలుగా మార్చాలని గడ్కరిని కోరారు. 

రాధా మోహన్ కు హరీష్ రావు లేఖ...

హైదరాబాద్ : కేంద్ర మంత్రి రాధా మోహన్ కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో కందులు, అపరాలు కొనడానికి 25 శాతం అనుమతిని 75 శాతానికి పెంచాలని లేఖలో కోరారు. కొనుగోళ్ల రోజులను 60 నుండి 15 రోజులకు పెంచాలని లేఖలో కోరారు. 

15:13 - August 27, 2018

కర్నూలు : జిల్లాలో డీలర్లకు అందుతున్న బియ్యం సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలో ఐదారు చోట్ల విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలు గోదాములపై అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పలువురు దళారులు గోదాములో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. స్టాకు ఎంతుందనే దానిపై నోటీసు బోర్డులో పేర్కొనడం లేదని, లోడ్ లు చేసే సమయంలో పలువురు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని అధికారులు గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కర్నూలులో విజిలెన్స్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు...

కర్నూలు : జిల్లాలోని సివిల్ సప్లై గోదాములపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని అన్ని గోదాములపై దాడి చేశారు. డీలర్లకు బియ్యం తక్కువగా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. 

14:51 - August 27, 2018

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్మార్ట్ సిటీ అని చెప్పుకోవడం తప్పా పనులు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అపరిష్కృతంగా ఉన్న చేపల మార్కెట్, డంపింగ్ యార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఏ ఒక్క అధికారి లేడని విమర్శించారు. 

14:21 - August 27, 2018

కరీంనగర్ : కొంగర కలాన్‌లో జరగబోయే ప్రగతినివేదన సభ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. సభకు భారీగా జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానానికి తమ సత్తాను చూయించేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ప్రగతి నివేదన సభకు జనసమీకరణ చేస్తూ మరో వైపు అభివృద్ధి మంత్రం జపిస్తూ అధికార పార్టీ నేతలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

జిల్లాలోని 13 నియోజకవర్గాలు 12 టీఆర్‌ఎస్‌వే కావడంతో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తం రెండున్నర లక్షల మందిని సభకు తీసుకెళ్లేందుకు మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం పార్టీ క్యాడర్‌ ను అలర్ట్‌ చేసి నేతలంతా విబేధాలు వీడి పని చేయాల్సిందిగా మంత్రులు ఉపదేశం చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలని రద్దు చేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ప్రగతి నివేదన సభకు జనసమీకరణ కోసం జరిగే సమావేశాలు, కార్యక్రమాలను ఎన్నికల సమాయత్తానికి కూడా వినియోగించుకోవాలని వ్యూహం రచించారు. గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి....నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని నిర్ణయించారు. అలాగే తాగు, సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఓటర్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఈ సారి నలుగురు శాసనభ్యులకు టికెట్లు లభించకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు సీట్లు మార్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాల్సిందిగా జిల్లా మంత్రులు గులాబీ శ్రేణులకు సూచనలు చేస్తున్నారు. తమకు బలమైన పోటీనిచ్చే కాంగ్రెస్‌ నేతలను ప్రగతినివేదన సభల ప్రచారంలో తిప్పికొట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌...

కేసీఆర్‌ సెంటిమెంట్‌ జిల్లాల్లో అధిక సీట్లు సాధించేందుకు పట్టు వదలకుండా టీఆర్‌ఎస్‌ ముందుగానే ప్రచారం మొదలు పెట్టింది. ప్రగతి నివేదన సభకు రెండున్నర లక్షల మందిని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న సభ ఏర్పాట్లు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ముందస్తు లేదంటూనే ప్రతిపక్షాలను మభ్య పెడుతూ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌ ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

రతన్ టాటాను కలిసిన బాబు...

ముంబై : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముంబైలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటాను బాబు కలిశారు. టాటా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను వారు సందర్శించారు. ఏపీలో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా రంగాల్లో భాగస్వామ్యం కావాలని టాటా గ్రూప్ కు బాబు ఆహ్వానం పంపారు. 

వాట్సాప్ కు సుప్రీం నోటీసులు...

ఢిల్లీ : వాట్సాప్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత్ లో ఫిర్యాదుల స్వీకరించే అధికారిని ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని నోటీసుల్లో పేర్కొంది. వాట్సాప్ తో పాటు కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. 

14:15 - August 27, 2018

నిజామాబాద్ : ఉత్తర తెంగాణా వరప్రదాయిని.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పురుడు పోసుకున్న పల్లె అది. ఐదు జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందించే మహా జలాశయం ఉన్న ఊరది. కానీ.. ఒకపుడు ఆ గ్రామంలో ఆసాములుగా బతికిన రైతులు నేడు కూలీలుగా మారారు. బీడు భూములను సస్యశ్యామలం చేసి..  ఆ ప్రాజెక్టే  సొన్ పేట్ గ్రామస్తులను నిండా ముంచింది.
గ్రామస్తుల పాలిట శాపంగా మారిన జలాశయం 
వరప్రదాయిని వంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రైతాంగం బతుకుల్లో వెలుగులు నింపింది. లక్షలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసింది. ఐదు జిల్లాల ప్రజల నీటి సమస్యను తీర్చింది. కానీ ఈ ప్రాజెక్టు వల్లే సొన్‌పేట్‌ గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జమిందారులుగా బతికిన రైతులు.. నేడు కూలీలుగా  మారారు. పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో.. ఏదైతేనేం ఈ జలాశయమే వారి పాలిట ఓ శాపంగా మారింది. 
వేలాది ఎకరాల్లో జలాశయం నిర్మాణం 
ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం సోన్ పేట్ గ్రామం.. ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నది ఇక్కడే..ఈ గ్రామంతో పాటు వేలాది ఎకరాల్లో జలాశయం నిర్మాణం జరిగింది.  దాదాపు వెయ్యి ఎకరాలను లాక్కున్న ప్రభుత్వం.. అప్పట్లో నష్ట పరిహారం ఊసే ఎత్తలేదు. తమకు న్యాయం చేయాలంటూ  1957లో స్థానిక రైతులు ఉద్యమాలు చేయడంతో...  వేరే ప్రాంతంలో భూమిని కేటాయిస్తామని అధికారులు హమీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ గుంట భూమి కూడా ఇవ్వలేదు.
నోటి కాడి కూడు లాక్కున్నారని ఆగ్రహం 
సోన్ పేట్ గ్రామస్తుల భూముల్లో ప్రస్తుతం ప్రాజెక్టుతోపాటు సిబ్బంది క్వార్టర్లు, పార్కు, కాలువలు నిర్మించారు. తమకు న్యాయం చేయాలని గతంలో అధికారులు, నాయకుల చుట్టు తిరిగినా పట్టీంచుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నోటి కాడి కూడు లాక్కున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు  హమీలిచ్చే నాయకులు..  తర్వాత పత్తా తేకుండా పోతున్నారంటూ  నిప్పులు చెరుగుతున్నారు బాధితులు. న్యాయం కోసం పోరాడి    వృద్ధాప్యం వచ్చిందని..  ఇక తమ కుటుంబాలకైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

బీజపీలోకి దేవనకొండ జడ్పీటీసీ...

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరీ సమక్షంలో దేవనకొండ జడ్పీటీసీ కోట్ల హరి చక్రపాణిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి ఎదురుగాలి అన్నవారికి ఈ చేరికలే సమాధానమని పురంధేశ్వరీ పేర్కొన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి బీజేపీలో చేరుతున్నారని, ఆంధ్రాలో కూడా సామర్థ్యం ఉన్న నాయకులంతా బీజేపీలోకి వస్తున్నారన్నారు. 

అద్దె ఆర్టీసీ బస్సు చోరీ...

వరంగల్ : హన్మకొండ బస్టాండులో ఆర్టీసీ అద్దె బస్సు మాయమైంది. పార్క్ చేసిన బస్సును దొంగలు అపహరించారు. పోలీసులకు అద్దె బస్సు యజమాని ఫిర్యాదు చేశారు. 

14:08 - August 27, 2018

విజయవాడ : ఏపీఎస్‌ ఆర్టీసీలో సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఆమోదంలేని పోస్టుల రద్దుకు సిఫార్సు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించిందా? ఆర్టీసీలో స్టాఫ్‌ను తగ్గించుకునేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టిందా? ఆర్టీసీ ప్రయత్నాలపై కార్మిక సంఘాలు ఏమంటున్నాయి?
ప్రక్షాళనకు సిద్ధమైన ఏపీఎస్‌ఆర్టీసీ
ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రక్షాళనకు సిద్ధమయ్యింది. అవసరం లేని ఉద్యోగులు, సిబ్బందిని తగ్గించుకునేపనిలో పడింది. ఏయే అవసరాలకు ఎంతమంది ఉన్నారు... అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తున్నట్లైతే వారిని సాగనంపేందుకు రంగంసిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్‌, సీనియర్‌ స్కేల్‌ క్యాడర్‌కు చెందిన పోస్టులే ఇందులో కీలకంగా ఉన్నాయని సమాచారం.
ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు యాజమాన్యం చర్యలు
డిపోల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీని గాడిలో పెట్టడం, వేగవంతంగా అభివృద్ధి చేస్తూనే... కోట్లాది రూపాయల ఆదాయం సమకూరేలా యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగులు, సిబ్బందిని ఆర్టీసికి అవసరాల మేరకు వినియోగించుకుని అదనపు ఎంప్లాయీస్‌ ఉంటే వారందరికీ ఉద్వాసన పలకాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ చేపడితే ఉద్యోగులు, సిబ్బందికి వెచ్చిస్తున్న లక్షలాది రూపాయల జీతాలు ఆర్టీసీకి మిగిలిపోతాయని భావిస్తోంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆర్టీసీకి చెందిన స్థలాలు, కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని కార్పొరేటక్ష సంస్థలకు లీజుకు ఇస్తే  రాబడి పొందేలా యాజమాన్యం మాస్టర్‌ ప్లాన్‌ వేస్తోంది.
అధికారులతో ఆర్టీసీ ఎండీ సమావేశం
ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు ఇటీవలే రద్దుకు సంబంధించిన పోస్టులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో ఉద్యోగులు, సిబ్బంది వారి వివరాలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సొంత పార్శిల్‌ సర్వీస్‌ కార్గో నిర్వహణ కోసం నియమించిన 16మంది డిపో మేనేజర్లను తొలగించాలని అధికారులకు ఎండీ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వారిని తీసివేయనున్నారు. పోస్టుల రద్దుతో ఆర్టీసీ సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గనుంది.  2011-12లో 64,639 మంది ఉద్యోగులు ఏపీలోని 13 జిల్లాల్లో పనిచేసేవారు. ఈ ఏడాది జూన్‌ 16 నాటికి ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య 54,489కి కుదించారు. ఆరేళ్లలోనే 10,150 మంది ఉద్యోగులను తప్పించారు. ఆర్టీసీలో కీలకంగా వ్యవహరిస్తోన్న డిపోల్లోని గ్యారేజీ కార్మికల సంఖ్యను తగ్గించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఆర్టీసీలోని అన్ని డిపోల్లో కలిపి సుమారు 9వేలమంది కార్మికులు గ్యారేజీల్లో పనిచేస్తున్నారు. వీరిలో 1600 మంది వరకు తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. 
ఆర్టీసీలో ఉద్యోగులు, సిబ్బంది కుదింపు సరికాదంటున్న యూనియన్‌ నేతలు  
ఆర్టీసీలో ఉద్యోగులు, సిబ్బందిని కుదించడం సరైందికాదని యూనియన్‌ నేతలు మండిపడుతున్నారు. అందరి సేవలను వినియోగించుకోవాలని, సిబ్బందిని తగ్గించడం వల్ల ఆర్టీసీ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగామారుతుందని... అభివృద్ధి కుంటుపడుతుందని అంటున్నారు.
2007లో ఆర్టీసీలో చివరిసారిగా రిక్రూట్‌మెంట్లు
ఆర్టీసీలో 2007లో చివరిసారిగా రిక్రూట్‌మెంట్లు చేపట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా ఖాళీల భర్తీ ఊసేలేదు. ఆర్టీసీలో ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఎదురుచూస్తునన నిరుద్యోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 1500 వరకు కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి.  అంతేకాదు.. ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులనూ భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 
 

 

14:04 - August 27, 2018

రాజమండ్రి : కేరళ వరద బాధితులకు తన వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. 5 లక్షల రూపాయల చెక్కును మురళీమోహన్‌ తన నివాసంలో మళయాళ సమాజ ప్రతినిధులకు అందజేశారు. కేరళను వరదలు ముంచెత్తటం చాలా బాధాకరమని మురళీ మోహన్‌ అన్నారు. కేరళను వరదలు ముంచెత్తితే దేశ మంతా ఒక్కటై సాయం చేస్తుందని.. కానీ కేంద్ర ప్రభుత్వం 5 వందల కోట్లు మాత్రమే ప్రకటించటం హాస్యస్పాదం అని అన్నారు. 

 

14:02 - August 27, 2018

 విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం  దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం ముట్టడికి వచ్చిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జీ ప్లస్‌ త్రీ హౌసింగ్‌ స్కీంలో అవకతవకలు జరిగాయంటూ సీపీఎం ఆందోళనకు దిగింది.

 

14:00 - August 27, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రగతినివేదన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సభకు చేరుకునేందుకు హెలిప్యాడ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు అధికారులు. హెలికాప్టర్‌ వచ్చే సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:57 - August 27, 2018

ముంబై : రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం చంద్రబాబు.. అనంతరం గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. అమరావతిని వరల్డ్‌ క్లాస్ సిటీగా తయారు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు అమరావతిలో ఉన్నాయని.. పరిశ్రమలు స్థాపించి అమరావతి అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. 

 

13:54 - August 27, 2018

అనంతపురం : పరిగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్‌ బాటిల్స్‌ పట్టుకొని ఊటకూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్తులంటున్నారు. 

 

అనంతపురం జిల్లా పరిగి మండలంలో ఉద్రిక్తత

అనంతపురం : పరిగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్‌ బాటిల్స్‌ పట్టుకొని ఊటకూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. 

13:50 - August 27, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బోంగుళూరు గేట్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సాహితీ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రతిక బస్సు కింద పడి మృతి చెందింది. మంచాలకు చెందిన బోయిని వెంకటేష్‌-చందనలు వారి కొడుకుని, కూతురిని తీసుకుని రాఖీ పండుగ సందర్భంగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చారు. ఈ రోజు ఉదయం పాప బయట ఆడుకుంటుండగా.. స్కూల్ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. పాపను ఢీకొట్టాడు. దీంతో పాప బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పాప బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

ఫైనల్స్ కు చేరిన పీవీ.సింధు

ఢిల్లీ : ఆసియా గేమ్స్‌లో పివీ సింధు చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పైనల్స్‌కు చేరి రికార్డ్‌ నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్రను సృష్టించింది. సెమిస్‌లో జపాన్‌ ప్లేయర్‌ యమగుచిపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

13:47 - August 27, 2018

ఢిల్లీ : ఆసియా గేమ్స్‌లో పివీ సింధు చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పైనల్స్‌కు చేరి రికార్డ్‌ నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్రను సృష్టించింది. సెమిస్‌లో జపాన్‌ ప్లేయర్‌ యమగుచిపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

 

స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బోంగుళూరు గేట్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సాహితీ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రతిక బస్సు కింద పడి మృతి చెందింది. 

13:29 - August 27, 2018

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ జంట బాంబుపేలుళ్ల కేసులో తీర్పు వాయిదా పడింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. 2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది. మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో బాంబు పేలింది.  రెండు ఘటనల్లో 42 మంది మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రెండేళ్ల అనంతరం ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ.. 11 వందల 25 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. 2 వందల 86 మందిని విచారించిన ఎన్ఐఏ.. 11 మందిపై అభియోగాలు నమోదు చేసింది. 

13:13 - August 27, 2018

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ప్రారంభం అయింది. పార్టీల ఎన్నికల ఖర్చుపై పరిమితి, ఓటర్ల నమోదు యంత్రాంగం ఏర్పాటు, పార్టీ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అంశాలపై అభిప్రాయాన్ని ఈసీ సేకరిస్తుంది. టీడీపీ తరపున కనమేడల రవీంద్ర కుమార్, రావులు చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ, బీజేపీ నుంచి జేపీ నడ్డా, భూపేంద్రయాదవ్ లు హాజరయ్యారు. 

 

ఆసియా క్రీడల ఫైనల్ లో సైనా నెహ్వాల్ పరాజయం

ఢిల్లీ : ఆసియా క్రీడల ఫైనల్ లో సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. జాయింత్ తై (చైనా) చేతిలో సైనా ఓడిపోయింది. 

గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో తీర్పు సెప్టెంబర్ 4కు వాయిదా

 హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 4కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వాయిదా వేసింది. 2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది.

రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సమావేశం ప్రారంభం అయింది. బీజేపీ నుంచి జెపీ నడ్డా, భూపేంద్ర, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ హాజరయ్యారు.

కొద్దిసేపట్లో గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో కోర్టు తీర్పు

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది. కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నాటి బాంబు బ్లాస్ట్‌ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.

 

11:58 - August 27, 2018
11:45 - August 27, 2018

ముంబై : రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం చంద్రబాబు.. అనంతరం గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. అమరావతిని వరల్డ్‌ క్లాస్ సిటీగా తయారు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు అమరావతిలో ఉన్నాయని.. పరిశ్రమలు స్థాపించి అమరావతి అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. 

జంట పేలుళ్లలో తుది తీర్పు...చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈనేపథ్యంలో చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

11:37 - August 27, 2018

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈనేపథ్యంలో చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
2007 ఆగస్టు 25న బాంబు బ్లాస్ట్‌ 
2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది. మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో బాంబు పేలింది.  రెండు ఘటనల్లో 42 మంది మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రెండేళ్ల అనంతరం ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ.. 11 వందల 25 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. 2 వందల 86 మందిని విచారించిన ఎన్ఐఏ.. 11 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదు. ములాఖత్ లకు అనుమతించడం లేదు. మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్లపల్లి జైలు నుంచి నిందితులను ప్రవేశపెట్టనున్నారు. 

11:27 - August 27, 2018
11:16 - August 27, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అక్క ప్రేమపెళ్లి వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించాడని విజయ్‌ అనే వ్యక్తి స్నేహితుడైన కిషోర్‌ను హత్య చేశాడు. నిందితుడు విజయ్‌ ఇసుక క్వారీలో పనిచేస్తుండగా కిశోర్‌, నర్సింహమూర్తిలు పరిచమయ్యారు. విజయ్‌ అక్క లలితతో నర్సింహమూర్తి ప్రేమ వ్యవహారం నడిపి.. ఆమెను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఈ పెళ్లికి కిషోర్ సహకరించాడని తెలుసుకున్న విజయ్‌.. అతనిపై పగ పెంచుకుని నరికి చంపాడు. 

 

ఎడపల్లిలో వ్యక్తి హత్య

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అక్క ప్రేమపెళ్లి వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించాడని విజయ్‌ అనే వ్యక్తి స్నేహితుడైన కిషోర్‌ను హత్య చేశాడు. 

మీర్‌పేట్‌ లో బాలిక హత్య

హైదరాబాద్‌ : మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన బాలిక వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అల్మాస్గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన వైష్ణవి రెండ్రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బాలిక వైష్ణవిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని చర్చి ప్రాంతంలో పడేశారు.

11:11 - August 27, 2018

హైదరాబాద్‌ : మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన బాలిక వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అల్మాస్గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన వైష్ణవి రెండ్రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బాలిక వైష్ణవిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని చర్చి ప్రాంతంలో పడేశారు.

 

11:08 - August 27, 2018

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది. మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో బాంబు పేలింది.  రెండు ఘటనల్లో 42 మంది మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రెండేళ్ల అనంతరం ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ.. 11 వందల 25 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. 2 వందల 86 మందిని విచారించిన ఎన్ఐఏ.. 11 మందిపై అభియోగాలు నమోదు చేసింది. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదు. ములాఖత్ లకు అనుమతించడం లేదు. నాంపల్లి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనున్నారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులుగా ఖరారు చేస్తారా..? శిక్ష ఖరారు చేస్తారా... అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ప్రధాన సూత్రదారులు రియాజ్ భక్తల్, మహ్మద్ భక్తల్ పరారీలో ఉన్నారు.

 

09:59 - August 27, 2018

ముంబై : బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ ఈ)లో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. అమరావతి బాండ్ల 2018 లిస్టింగ్ ను సీఎం చంద్రబాబు సెరిమోనియల్ బెల్ మోగించి ప్రారంభించారు. జీఎస్ ఈ సీఈవో, ఎండీ అశిష్ కుమార్ తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం జీఎస్ ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. పెట్టుబడుల కోసం ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం భేటీ కానున్నారు. 

 

09:53 - August 27, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది. ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నాటి బాంబు బ్లాస్ట్‌ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
1125 పేజీలతో కూడిన చార్జిషీట్‌
నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దాని ఆధారంగా  ఈ కోర్టులో వారానికి రెండు రోజుల చొప్పున  విచారణ చేపట్టారు. దర్యాప్తు బృందం ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించింది.  అనంతరం 1125 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేసింది. 11 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. 286 మంది సాక్ష్యులను  ఎన్‌ఐఏ విచారించింది.  మొత్తానికి 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

 

ఇవాళ నితిన్‌గడ్కరీతో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా... ఇవాళ  కేంద్ర మంత్రి  నితిన్‌గడ్కరీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జాతీయ రహదారులు, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. 

అమరావతి బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ముంబై : బీఎస్ ఈలోని అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభం అయింది. అమరావతి బాండ్ల లిస్టింగ్ 2018 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

08:54 - August 27, 2018

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, ముందస్తు ఎన్నికలపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బీజేపీ నేత రఘునాథ్ బాబు, టీఆర్ ఎస్ నేత దేవీప్రసాద్, టీడీపీ నేత గురుమూర్తి పాల్గొని, మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:48 - August 27, 2018

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్‌ మరో రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల, మహిళల రన్నింగ్‌ రేసులో ఈ పతకాలు దక్కాయి. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో భారత స్ప్రింటర్‌ మహ్మద్‌ అనాస్‌ సత్తా చాటాడు. 45.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల రన్నింగ్‌ రేసులో హిమదాస్‌ రజతం కైవసం చేసుకుంది. 50.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకం సాధించింది. ఇక భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు భారత్‌కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లోకి తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఆసియా క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి జిందాపోల్‌పై విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ క్రీడాకారిణి, థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనాక్‌పై సైనా నెహ్వాల్‌ గెలిచి పతకాన్ని ఖాయం చేసింది. 

 

08:40 - August 27, 2018

శ్రీకాకుళం : మూడు దశాబ్దాల సమస్యపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తున్న మూత్రపిండాల వ్యాధి   సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఉన్నతాధికారులు. వైద్యసేవలు, పెన్షన్లు, ఉచిత మందులు నేరుగా అందించాలని  నిర్ణయించారు. 
ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి  
గత ముప్పై ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా వేధిస్తోంది. వేలాది మంది మృత్యువాత పడగా.. లక్షలాది మంది రోగులు ఉన్నారన్నది ఆందోళన కలిగిస్తున్నఅంశం.  కిడ్నీ వ్యాధిని సైతం రాజకీయం చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో.. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో సేవలందించేందుకు శ్రీకారం చుడుతోంది.
కిడ్నీ వ్యాధిగ్రస్థులతో మమేకమయ్యేందుకు చర్యలు 
జిల్లాలోని నాలుగవ వంతు జనాభా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దృష్ట్యా.. మరో రెండు నెలల్లోగా గ్రామాల్లో  స్క్రీనింగ్ జరపాలని నిర్ణయించారు కలెక్టర్ ధనుంజయరెడ్డి. మరో డెబ్భై వేలమందికి పరీక్షలు జరిపి వివరాలు సేకరించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వి.ఆర్.ఓ,  మండల వైద్యాధికారితోపాటు జిల్లా ఉన్నతాధికారుల బృందం కిడ్నీ వ్యాధిగ్రస్థులతో మమేకమయ్యేందుకు చర్యలు చేపడుతున్నారు. 
కిడ్నీ బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు 
కిడ్నీ బాధితులకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు.. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ నేతృత్వంలో ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విరివిగా డయాలసిస్ కేంద్రాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుతో పాటు.. పెన్షన్లు, ఉచిత మందులతో మరింత తోడ్పాటు  అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థలు, గ్రామకమిటీల సమన్వయంతో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు అడుగేయడం ఆశించదగ్గ పరిణామం.. బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి సర్వేతో మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. 

 

08:34 - August 27, 2018

కడప : కడపలో స్టీల్‌ప్లాంట్‌ను ఎప్పుడు నిర్మిస్తారు? స్టీల్‌ప్లాంట్‌ అసలు నిర్మిస్తారా ? లేక అది నీటిమీది రాతలుగా మిగిలిపోతుందా? అదిగో, ఇదిగో స్టీల్‌ప్లాంట్ అంటూ బీజేపీ, టీడీపీలు ప్రజలను వంచిస్తున్నాయా? స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఎందుకు ఆలస్యమవుతోంది? నాలుగు సంవత్సరాలైనా ఎందుకు అడుగు ముందుకుపడడం లేదు?
4ఏళ్లుగా సాగుతున్న స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు
కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నాలుగు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది.  కడపలో వైఎస్‌ హయాంలో బీజం పడింది.  ఆ తర్వాత అది అనివార్య కారణాలతో వెనకబడుతూ వస్తోంది.  విభజన చట్టంలో ఆరు నెలలలోపే ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాలని చట్టం చేశారు. అయినా నేటికీ ఉక్కుఫ్యాక్టరీ ఆచరణకు నోచుకోలేదు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంట్‌పై నోరుమెదపలేదు. కానీ బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నాక  ఉక్కు ఫ్యాక్టరీపై గళం విప్పడం మొదలైంది. సీఎం రమేష్‌తో టీడీపీ దీక్ష చేయించింది. ఈ దీక్షకు కేంద్రం స్పందించకపోతే తామే ఉక్కు ఫ్యాక్టరీ పెడతామంటూ చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. కేంద్రానికి రెండు నెలల గడువు కూడా ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం ఇలాంటి ప్రకటన చేయడంతో.. దీన్ని ఎన్నికల స్టంట్‌గానే ప్రజలు భావిస్తున్నారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామా : విపక్షాలు 
స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ రెండూ ప్రజలను మోసం చేశాయని ఆరోపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకటన జిల్లా ప్రజలను మోసం చేసేలా ఉందని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు.  కడప జిల్లా అభివృద్ధి కావాలంటే ఉక్కు ఫ్యాక్టరీ ఒక్కటే మార్గమన్నారు. 
రాజకీయ అంశంగా మారిన స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు  
మొత్తానికి కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. టీడీపీ, బీజేపీ రెండు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై పాలిటిక్స్‌ చేస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీలు ప్రజలగోడు విని ఎప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాయో చూడాలి.

 

ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ సమావేశం ఏర్పాటు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.  

08:29 - August 27, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.  అయితే వచ్చే ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ వినియోగానికి విపక్షాలు పట్టుబట్టనున్నాయి. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితత్వం, పారదర్శకత, ఓటర్ల నమోదులాంటి అంశాలైనా చర్చ జరుగనుంది.ఈ మీటింగ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి నేతలు హాజరవుతున్నారు. ఎన్నికల సంస్కరణలకు తమ పార్టీ సానుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 

 

08:24 - August 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ ఆదిత్యరెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సాధించుకునేందుకు తాను టీజేఎస్‌లో చేరుతున్నట్లు ఆదిత్యరెడ్డి తెలిపారు. 

 

ఇవాళ గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో తుది తీర్పు..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది. ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నాటి బాంబు బ్లాస్ట్‌ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.

08:19 - August 27, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌ కేసులో దర్యాప్తు ముగిసింది.  కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ... కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇవాళ తుదితీర్పు రాబోతోంది. ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నాటి బాంబు బ్లాస్ట్‌ బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
2007 ఆగస్టు 25న బాంబు బ్లాస్ట్‌
ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడి 11 ఏళ్లు పూర్తయ్యింది. 2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు బాంబ్‌ బ్లాస్ట్‌లు జరిగాయి. దీంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  42 మంది చనిపోగా... 70మందికిపైగా గాయపడ్డారు. 
మొదట లుంబినీపార్క్‌, తర్వాత గోకుల్‌చాట్‌లో బాంబు బ్లాస్ట్‌
మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన బాంబు పేలింది.  రెండు ఘటనల్లో స్పాట్‌లోనే 33మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా... వందలాది మందికి గాయాలయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు విచారణలో తేలింది. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ముంబై పోలీసులు తేల్చారు.  దీంతో ఈ ఏడుగురు  ఉగ్రవాదులను 2009లో రాష్ట్రానికి తీసుకొచ్చిన రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, అక్టోపస్‌ విభాగాల అధికారులు  వారిని విచారించారు.  ప్రధాన సూత్రధారి అయిన యాసిన్‌ భత్కల్‌ను నేపాల్‌ ప్రాంతం నుంచి పట్టుకొచ్చారు.  కర్నాటక రాష్ట్రంలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు సోదరులలో యాసిన్‌, ఇక్భాల్‌ పట్టుబడ్డారు. అసలు నిందితుడు రియాజ్‌ తర్వాత అల్‌ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నట్టు తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ వైపు ఆకర్షితుడైనట్టు ఎన్‌ఐఏకు సమాచారం అందింది.
కీలక ఆధారాలను సేకరించిన ఎన్‌ఐఏ
నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దాని ఆధారంగా  ఈ కోర్టులో వారానికి రెండు రోజుల చొప్పున  విచారణ చేపట్టారు. దర్యాప్తు బృందం ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించింది.  అనంతరం 1125 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేసింది. 11 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. 286 మంది సాక్ష్యులను  ఎన్‌ఐఏ విచారించింది.  మొత్తానికి 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
 

08:11 - August 27, 2018

ఢిల్లీ : మంత్రివర్గ సిఫారసు ప్రకారం అసెంబ్లీ రద్దైనా ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషనేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ చెప్పారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 
 

08:06 - August 27, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా... ఇవాళ  కేంద్ర మంత్రి  నితిన్‌గడ్కరీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జాతీయ రహదారులు, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. 

 

08:03 - August 27, 2018

గుంటూరు : ఆర్థిక రాజధాని ముంబైలోని బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  పాల్గొంటారు. అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం అనంతరం.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబై నగరంలో సీఎం పర్యటన సాగబోతుంది. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం సమావేశం అవుతారు. 
అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు  
అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమరావతి బాండ్లు 2018 పేరుతో  ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ముంబై నగరంలో సీఎం పర్యటించనున్నారు.. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. ముంబై వేదికగా అమరావతి విశిష్టతను  వివరించనున్నారు సీఎం. అమరావతి బాండ్ల లిస్టింగ్‌ సందర్భంగా ఆయన అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.
ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా..
ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగించే ముంబై పర్యటనలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌, రిలయన్స్ ఇండస్డ్రీస్ అధినే ముఖేష్ అంబానీ, రిలయన్స్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎండీ నడియార్ గోద్రేజ్‌తో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో సంజయ్ శ్రీవాత్సవ భేటీ కానున్నారు. 
పలు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం 
రోజంతా భేటీలతో బిజీగా గడపనున్న సీఎం ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం, వెల్సపన్ గ్రూప్ ఛైర్మన్ బీ. కే. గోయింకా, పిరామిల్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత లోథా గ్రూప్ ఛైర్మన్ మంగళ ప్రభాత్‌ లోధా, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, సమావేశం  కానున్నారు. ముంబైలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు. 

 

నేటితో విజయవాడ దుర్గగుడిలో ముగియనున్న పవిత్రోత్సవాలు

విజయవాడ : దుర్గగుడిలో నేటితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

నేడు బీజేపీలో చేరనున్న కోట్ల హరిచక్రపాణి రెడ్డి

కర్నూలు : నేడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరనున్నారు. పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. 

నేడు ఎస్ ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

హైదరాఆద్ : నేడు ఎస్ ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల కానుంది. పోలీస్ నియామక బోర్డ్ వెబ్ సైట్ లో కీ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 29 వరకు తుది గడువు విధించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఐ ప్రిలిమినరీ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

 

 

 

నేడు జీఎస్ ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్

ముంబై : నేడు జీఎస్ ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటలకు మార్కెట్లు తెరిచిన వెంటనే లిస్టింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

 

చికాగోలో ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ మృతి

అమెరికా : చికాగోలో ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఉడుత స్వర్ణ మృతి చెందారు. మృతరాలి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి. 

Don't Miss