Activities calendar

28 August 2018

21:16 - August 28, 2018

సిద్ధిపేట : హరిత తెలంగాణ సాధనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కోమొక్క నాటాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో ఒకే రోజు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌ ప్రారంభించారు. పట్టణ ప్రజలు, పాఠశాలల బాలబాలికలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరీశ్‌ ప్రసంగిస్తూ.. హరిత తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. మరోవైపు ఈ ఏడాది ఇంతవరకు 23 కోట్ల మొక్కలు నాటామని అటవీశాఖ మంత్రి జోగురామన్న చెప్పారు. 

21:08 - August 28, 2018

గుంటూరు : ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలపై వరాల జల్లు కురిపించారు. త్వరలో మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు... వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు. ముస్లింలను ఆదుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళిక తరహాలోనే మైనారిటీలకు కూడా సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తామని ప్రకటించారు. దర్గాల అభివృద్ధికి పది కోట్లు, వచ్చే డిసెంబర్‌లో కర్నూలులో నిర్వహించే ఇస్తామాకు పది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఆర్థిక సంస్థతోపాటు నూర్‌ బాషా సమాఖ్యకు నిధుల కేటాయింపు పెంచుతామని గుంటూరులో జరిగిన నారా హమారా - టీడీపీ హహారా సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో ముస్లిం మైనారిటీల సభ జరిగింది. నారా హమారా - టీడీపీ హమారా.. పేరుతో నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐటీ మంత్రి లోకేశ్‌ సహాల పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తోపాటు గుంటూరు మాజీ ఎంపీ లాల్‌జాన్‌ బాషాకు నివాళులర్పించారు.

ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన ముస్లింలను అన్ని రాంగాల్లో పైకి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. ఎన్‌ఎండీ ఫరూక్‌ను మండలి చైర్మన్‌ పదవి, ఎండీ షరీఫ్‌కు ఎమ్మెల్సీ పదవితోపాటు పలువురు ముస్లిం నాయకులను వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమించిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... త్వరలోనే మంత్రివర్గంలో ముస్లింకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థకు అదనంగా వంద కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రబాబు.. నూర్‌ బాషా సమాఖ్య బడ్జెట్‌ను 40 కోట్ల రూపాయల నుంచి పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధికి ఉపప్రణాళిక తీసుకొస్తామని ప్రకటించారు. అమరావతిలో 15 ఎకరాలల్లో షాహీ మసీదు, ఇస్లామిక్‌ సాంస్కృతిక కేంద్రానికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఆటోనగర్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి... ముస్లింలలో బంగారం పనిచేసేవారు ఉపకరణాల కొనుగోలుకు 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలపై జరిగే దాడులు, వేధింపుల నివారణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న విషయాన్ని నారా హమారా టీడీపీ హమారా సభ దృష్టికి తెచ్చారు. పదవ తరగతి పూర్తి చేసిన ముస్లిం యువకులకు ప్లంబింగ్‌, రాడ్‌బెడింగ్‌ వంటి వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఉర్దూ మాధ్యమిక పాఠశాలను ఉన్నత పాఠశాలుగా, హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా స్థాయి పెంచి.. ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమిస్తామని హామీ ఇచ్చారు. దర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ప్రధాని మోదీపై చంద్రబాబు మండిపడ్డారు. నారా హమారా - టీడీపీ హమారా.. సభలో ప్రసంగించిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌... రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీకి 2019లో తెలుగు ప్రజలు సినిమా చూపిస్తారని హెచ్చరించారు. సభలో ప్రసంగించిన పలువురు మైనారిటీ నాయకులు.. మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. 

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు..అప్పుడే నీటి విడుదల..

హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు నీటిని కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల కింద ఉన్న పంట పొలాలకు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

హైదరాబాద్ కలెక్టర్‌గా రఘునందన్‌రావు...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ లు బదిలీ అయ్యారు. 11 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా రఘునందన్‌రావు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా యోగితా రాణా. రంగారెడ్డి కలెక్టర్‌గా లోకేశ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్ పాటిల్. సిద్దిపేట కలెక్టర్‌గా కృష్ణభాస్కర్. కుమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గ రాజీవ్‌గాంధీ హనుమంతు. ఖమ్మం కలెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అమయ్‌కుమార్.

20:40 - August 28, 2018
20:35 - August 28, 2018

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో రెండు వరుస సెట్లలో ఓడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉంది. తొలిసెట్‌ను 13-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌ను 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజూనే పైచేయిగా నిలిచింది. 

20:24 - August 28, 2018
20:13 - August 28, 2018
19:44 - August 28, 2018

ఢిల్లీ : ముందస్తు ఎన్నికలు..జమిలి ఎన్నికలు..త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలుపొందాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై బీజేపీ దృష్టి సారించింది. మంగళవారం బీజేపీ ఓ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతలను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2019 కంటే ముందుగా ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహాలు రచించాలి ? అంతకంటే ముందు పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని..అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచించాలని పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:35 - August 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 'ముందస్తు' వేడి మరింత రాజుకుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. దీనితో కాంగ్రెస్ మేల్కొంది. గాంధీ భవన్ లో టిపిసిసి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో కో ఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని...అలాగే టీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఇప్పటికే అధ్యయనం చేసిన కాంగ్రెస్ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. పలు కమిటీలు నియమించి విస్తతంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని టిపిసిసి యోచిస్తోంది. ఒక బహిరంగ లేఖను విడుదల చేయాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణాది తెలంగాణ ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించి ప్రగతి నివేదన సభ కాదని..ప్రజల ఆవేదన అని పేర్కొంటామని తెలియచేస్తున్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:20 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్టు చేయడం నగరంలో కలకలం రేగింది. 2015 సంవతస్రంలో మారఓయిస్టు రోనాల్డ్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధాన మంత్రి మోడీ హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖను పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన ఫండింగ్ విరసం నేత వరవరరావు అందిస్తారని లేఖలో గుర్తించారని తెలుస్తోంది. అందులో భాగంగా మూడు నెలల అనంతరం పూణే పోలీసులు నగరానికి చేరుకుని వరవరరావు నివాసం..ఆయన కూతుళ్ల నివాసాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. సుమారు 8గంటల పాటు సోదాలు చేసిన అనంతరం కంప్యూటర్, ఇతరత్రా పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అనంతరం ఆయన్ను అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి వైద్య చికిత్సలు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆయనపై యూఏపీఏ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు చట్ట వ్యతిరేక కార్యాకలాపాల (నిరోధక చట్టం) (యూఏపీఏ) యాక్ట్ దేశంలో కేవలం ఐదుగురిపై మాత్రమే నమోదు చేశారు. ఈ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 15, 16, 17 కింద కేసు నిరూపితం అయితే టెర్రరిస్ట్‌గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతెసే విధంగా, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసే గ్రూపులను అణచివేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. 

18:41 - August 28, 2018

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం..ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. జిల్లాలో 'నారా హమారా.. టీడీపీ హమారా’పేరిట టిడిపి భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ బహిరంగసభలో సీఎం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని మరోసారి దుయ్యబట్టారు. అవిశ్వాసం తీర్మానం పెట్టండని తాను ఢిల్లీలో ఉంటానన్న పవన్ కనిపించలేదని విమర్శించారు. బిజెపితో వైసీపీ కలిసిందో లేదో ప్రజల చెప్పాలన్నారు. అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి యువ నేస్తం వస్తోందని నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కల్యాణ్ లను ఓడించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. టిడిపి వీరోచితంగా పోరాడుతుంటే.. రాజీనామాలు చేసి పిరికిపందలుగా ఇంటి దగ్గర కూర్చున్నారని, మోదీని చూస్తే వారికి వణుకు అని తెలిపారు. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్రం ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకు, ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరు ఆగదని మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆటలు ఇక్కడ సాగవు.. ఖబడ్దార్..జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇంకా పూర్తి ప్రసంగం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:35 - August 28, 2018

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి యువ నేస్తం - బాబు...

గుంటూరు : అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి యువ నేస్తం వస్తోందని నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. 

ఎన్డీయే మోసం చేసిందన్న బాబు...

గుంటూరు : రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానం పెట్టండని తాను ఢిల్లీలో ఉంటానన్న పవన్ కనిపించలేదని విమర్శించారు. బిజెపితో వైసీపీ కలిసిలందా లేదో ప్రజల చెప్పాలన్నారు. 

టిటిడి పాలక మండలి నిర్ణయాలు...

చిత్తూరు : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాలపై ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు, ఒంటిమిట్ట యాత్రకులకు వసతి సదుపాయం ఏపీ టూరిజం శాఖకు కేటాయింపు, రాబోయే ఆరు నెలల్లో కొత్త కళ్యాణ మండపాలు మంజూరు చేయడం జరగదు, ఏపీలోని టిటిడి కళ్యాణ మండపాల అభివృద్ధికి రూ. 37వేల కోట్లు కేటాయింపు, రూ. 150 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం, రూ. 79 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం, ఏపీలో గ్రంథాలయాలకు టిటిడి ఆధ్మాత్మిక ప్రచురణల పంపిణీ, 65 మంది డ్రైవర్లు, ఫిట్టర్లకు వేతనాలను పెంచారు. వకుళా సదన్, యాత్రికుల వసతి సముదాయం -2 నిర్వాహణకు రూ. 19.5 కోట్లు కేటాయించారు. 

విద్యుత్ శాఖలో సమ్మెపై నిషేధం...

హైదరాబాద్ : విద్యుత్ శాఖలో సమ్మెపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకూడదని విద్యుత్ శాఖ పేర్కొంది. 

బిజెపిని గద్దె దించాలి - బాబు...

గుంటూరు : ఏపీ రాష్ట్రానికి మోసం చేస్తున్న బీజేపీకి...మైనార్టీ సోదరులను మోసం చేస్తున్న ఎన్డీయేని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

17:42 - August 28, 2018

గుంటూరు : బీజేపీ పార్టీ...బీ అంటే బీజేపీ.. జే అంటే జగన్.. పి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని...వారికి ఓటేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసినట్లేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తన అవినీతిపై ఆరోపణలు చేసే వారు నిరూపించాలని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో 'నారా హమారా - టిడిపి హమారా' పేరిట మైనార్టీ సభ నిర్వహించింది. ఈ సభలో నారా లోకేష్ మాట్లాడారు. అభివృద్ధి అంటే చంద్రన్న ఏజెండా...ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా 24 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత టిడిపికి దక్కుతుందని తెలిపారు. 24గంటల విద్యుత్ సరఫరా చేయడం..డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు రూ. 10వేల రూపాయలు ఇచ్చిన సహాయం..చంద్రన్న బీమా..రూ. 5లకే భోజనం..ప్రభుత్వం అందిస్తోందన్నారు.

నిరుద్యోగ యువతి, యువకులందరికీ నెల నెల వెయ్యి భృతి త్వరలోనే అందిస్తామన్నారు. రూ. 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమంలో దూసుకెళుతోందన్నారు. మైనార్టీ అభివృద్ధికి రూ. 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని, ఉర్దూ భాషాభివృద్ధి కోసం రూ. 24 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. దుల్హన్ పథకం కింద రూ. 50వేలు సహాయం చేయడం జరగుతోందన్నారు.

68 ఏళ్ల వయస్సులో కూడా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కన్నుకొట్టిందని..ప్రోత్సాహిస్తే భారతదేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందనే భయంతో అనేక ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. అవినీతి పుత్రుడు జగన్, మోడీ దత్త పుత్రుడు పవన్ష కళ్యాణ్ లు చంద్రబాబును తిడుతున్నారని తెలిపారు. కేసుల మాఫీ కోసం జగన్ బీజేపీతో లాలూచీ పడుతున్నారని అందుకే ఆయన తాను పేరు మార్చడం జరిగిందన్నారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని..గతంలో పవన్ పేర్కొన్నారని.., ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకొచ్చిన తరువాత పవన్ కు అంతా అవినీతి మయం కనబడుతోందన్నారు. కులం..మతం..ప్రాంతం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దమ్ము..ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. అవిశ్వాస తీర్మానం పెడితే తాను ఢిల్లీకి వెళ్లి సహాయం చేస్తానని ఆనాడు పవన్ పేర్కొన్నారని..కానీ తీర్మానం పెడితే పవన్ కనబడలేదన్నారు. పవన్..జగన్ కు ఓటేస్తే నేరుగా బీజేపీకి వెళుతుందన్నారు. 

17:40 - August 28, 2018
17:39 - August 28, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే దానిపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే 'ప్రగతి నివేదన సభ' టీఆర్ఎస్ నిర్వహిస్తుండడం మరింత బలం చేకూరిస్తోంది. సభకు జిల్లా వ్యాప్తంగా జనాలను తరలించేందుకు నేతలు నిమగ్నమయ్యారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సభ జరుగుతుండడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడేండ్ల సర్వీసు పైబడిన ఉద్యోగుల లిస్టును తయారు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. నాలుగేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు నేతలు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పవన్..జగన్ లపై లోకేష్ విమర్శలు...

గుంటూరు : బీజేపీ పార్టీ...బీ అంటే బీజేపీ.. జే అంటే జగన్.. పి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని...వారికి ఓటేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసినట్లేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తన అవినీతిపై ఆరోపణలు చేసే వారు నిరూపించాలని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో 'నారా హమారా - టిడిపి హమారా' పేరిట మైనార్టీ సభ నిర్వహించింది. ఈ సభలో నారా లోకేష్ మాట్లాడారు. 

17:24 - August 28, 2018

 

కరీంనగర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి లక్ష మందిని 'ప్రగతి నివేదన' సభకు తరలించనున్నట్లు..వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూస్తామని మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు..ఇతరత్రా విషయాలపై ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ప్రగతి నివేదన సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని, కని వినీ ఎరుగని రీతిలో..దేశంలో ఏ పార్టీ..ప్రభుత్వం పెట్టని సభను తాము పెడుతున్నట్లు తెలిపారు. ఈ సభకు ఆదిలాబాద్ జిల్లా నుండి లక్ష మంది జనాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాహనాలను సమకూర్చడం...ఆర్టీసీ బస్సులు..ప్రైవేటు బస్సులు..ఇతరత్రా వాహనాలను ఉపయోగించడం జరుగుతోందని..పూర్తి వివరాలు సేకరించి సభకు తరలిస్తామన్నారు. 

 

నాంపల్లి కోర్టుకు వరవరరావు...

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును నాంపల్లి కోర్టులో జడ్జి ముందు వరవరరావును పూణె పోలీసులు ప్రవేశ పెట్టారు. బుధవారం సాయంత్రం 5గంటల వరకు వరవరరావును పూణె కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరవరరావును వెంట తన మెడిసిన్ తీసుకెళ్లడానికి... వైద్య సదుపాయం కూడా కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

17:04 - August 28, 2018

హైదరాబాద్ : సెప్టెంబర్ 2వ తేదీ ప్రగతి నివేదన సభ కోసం టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు నేతలు సభ వేదిక వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పనులు వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నియమితులైన కమిటి సభ్యులు పనుల్లో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ కళా విభాగం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. పాటలు..నృత్యాల రూపంకంగా కళాకారులు ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ నిర్ణయాలతో కళారూపాలు చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:58 - August 28, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని టిపిపిసి అధికార ప్రతినిధి మల్లు రవి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన టెన్ టివితో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారని తెలిపారు. కేసీఆర్ కోటి వరాలు ప్రకటించినా ప్రజలు నమ్మరని, టీఆర్ఎస్ ను గెలిపించరని జోస్యం చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియోలో క్లిక్ చేయండి. 

బీజేపీ నేతలపై యనమల ఫైర్...

విజయవాడ : కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నట్లుగా బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమని మంత్రి యనమల పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపికి ఈ పరిస్థితి ఎందుకొస్తుందని ప్రశ్నించారు. 

16:53 - August 28, 2018

ఢిల్లీ : వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. పార్టీ కార్యాలయంలో బీజేపీ పాలిత 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్ర ఫలితాల అమలు తీరు, రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై నివేదిక సమర్పించనున్నారు. 

16:35 - August 28, 2018

తిరువనంతపురం : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. మంగళవారం ఎర్నాకులం చేరుకున్న రాహుల్ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించారు. బుధవారం వాయనాడ్ లో పర్యటించనున్నారు. 1093 పునరావాస శిబిరాల్లో 3 లక్షలకు పైగా శిబిరాల్లో తలదాచుకున్నారు. 

16:01 - August 28, 2018

గుంటూరు : తెలంగాణ రాష్ట్రంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని..కేసీఆర్ రాజకీయాలకు తమకు ఎంతో తేడా ఉందని మంత్రి జవహార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో మైనార్టీలతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 13 జిల్లాల నుండి భారీగా ముస్లింలు తరలొచ్చారు. అందులో భాగంగా మంత్రి జవహార్ తో టెన్ టివి ముచ్చటించింది. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, టిడిపి అంటేనే బడుగుల, బలహీన వర్గాలు, మైనార్టీల పార్టీ అని తెలిపారు. ఏపీ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారని..తాత్కాలిక, రాజకీయ ప్రయోజనాలను ఆశించి తెలంగాణ రాష్ట్రం లాగ చేయడం లేదన్నారు. తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, కాంగ్రెస్ తో పొత్తు అంశం ఊహాజనితమైనవేనన్నారు. 

9గంటల పాటు విచారణ - క్రాంతి...

హైదరాబాద్ : ఓ కేసు విషయంలో పూణె పోలీసులు తనను 9గంటల పాటు విచారించారని, తన ల్యాప్ టాప్, ఫోన్, పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వరవరరావుకు చెందిన వెబ్ సైట్ లో పనిచేస్తున్నందుకు పోలీసులు తనను విచారించారని జర్నలిస్టు క్రాంతి తెలిపారు.

15:58 - August 28, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి బీజేపీ నేతలు చేరుకోవడం చర్చనీయాంశమైంది. మంగళవారం ఆ పార్టీకి చెందిన వారికి కేసీఆర్ అపాయింట్ ఇవ్వడం గమనార్హం. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పాయి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. కానీ వాజ్ పేయి విగ్రహ ఏర్పాటు మాములు అంశమేనని..అందులో అంతర్లీనం వేరే ఉందనే ప్రచారం జరుగతోంది. ముందస్తు ఎన్నికలు..ఇతరత్రా వాటిపై కేసీఆర్ ఢిల్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు ప్రధాన మంత్రి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతేగాకుండా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ తదితర విషయాల్లో కేంద్రానికి సపోర్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తూ వస్తోంది. బీజేపీ నేతల భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

కేసీఆర్ తో బీజేపీ ఎమ్మెల్యేలు...

హైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ కేటాయించలేదు. కానీ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వాజ్ పేయి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. 

ఎన్నికలకు సిద్ధమన్న టిపిసిసి...

హైదరాబాద్ : ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...75 సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

15:44 - August 28, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...75 సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇమామ్, మౌజామ్ లకు వేతనాన్ని పెంచే విషయంలో కాంగ్రెస్ ఏకీభవిస్తోందని, 12 శాతం రిజర్వేషన్ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రధాన మంత్రితో మోడీతో పలుమార్లు భేటీ అయినా ఈ విషయం అక్కడ ఎందుకు లేవనెత్తలేదని, శాసనసభలో రిజర్వేషన్ అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు.

రిజర్వేషన్ ఇవ్వకపోతే ఢిల్లీలో ధర్నా చేస్తానని..భూకంపం సృష్టిస్తానని పేర్కొన్నారని..కానీ ప్రస్తుతం అక్కడకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వక్ఫ్ ల్యాండ్ విషయంలో నిర్లక్ష్యం చేశారని, మైనార్టీలకు తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు చేసింది ఒక శాతం కంటే తక్కువని, 12 శాతం జనాభా ఉన్న మైనార్టీలకు 0.46శాతం ఖర్చు చేశారని వివరించారు. 3500 కోట్ల రూపాయలు ఐదేండ్ల కాలంలో ఖర్చు పెట్టాల్సి ఉన్నా ఖర్చు చేయలేదని..వారికి ఉద్యోగాలు లేవన్నారు.

2014-15లో 1.53 మైనార్టీ యువత లోన్లకు దరఖాస్తు చేసుకుంటే 14వేల మందికి రుణాలు మంజూరు చేశారన్నారు. 2015-16 సంవత్సరానికి ఒక్క మైనార్టీ వ్యక్తి దరఖాస్తు చేసుకోలేని ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, వెనుకబడిన తరగతుల వారు ఈ విషయాలన్నింటినీ గమనించాలని సూచించారు. పొత్తుల విషయంలో సీనియర్ నేతలతో చర్చించడం జరిగిందని, భవిష్యత్ లో పొత్తులపై చర్చిస్తామన్నారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చిస్తామని, అలాంటి ప్రస్తావన ప్రస్తుతం లేదన్నారు. 

15:41 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేశారు. సోదాలు ముగిసినంతరం వరవరరావును అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు చేసిన అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక్కడి నుండి పూణెకు వరవరరావును తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ హత్య కేసులో భాగంగా పూణె పోలీసులు నగరానికి చేరుకుని వరవరావు, ఆయన కూతుళ్ల నివాసాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 7గంటల పాటు విచారించారని, మావోయిస్టుల లేఖలో ఆయన పేరు ఉన్నందునే వేధిస్తున్నట్లు వరవరరావు సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

తల్లి పిల్లల ఆసుపత్రిలో దారుణం...

విజయవాడ : ప్రభుత్వ తల్లి పిల్లల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బెడ్ పై నుండి ఓ బాలింత కింద పడి మృతి చెందింది. బెడ్ పై నుండి కిందపడి కొట్టుకుంటున్నా స్వాతిని సిబ్బంది పట్టించుకోలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

 

15:36 - August 28, 2018

విజయవాడ : ప్రభుత్వ తల్లి పిల్లల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బెడ్ పై నుండి ఓ బాలింత కింద పడి మృతి చెందింది. దీనిపై బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పడకలకు విపరీతమైన కొరత ఏర్పడింది. ఒకే బెడ్ పై ఎక్కువ మంది గర్భిణీలు, బాలింతలు పడుకోబెడుతున్నారు. కొత్తపేటకు చెందిన బాలింత స్వాతి కూడా అలాగే పడుకొంది. సోమవారం స్వాతి శిశువుకు జన్మనిచ్చింది. స్వాతి పరిస్థితి బాగా లేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని బంధువులు పేర్కొంటున్నారు. బెడ్ పై నుండి కిందపడి కొట్టుకుంటున్నా స్వాతిని సిబ్బంది పట్టించుకోలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

15:28 - August 28, 2018

హైదరాబాద్ : వచ్చే నెల 2న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకాలన్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ప్రగతి నివిదేన సభకు బ్యానర్లు, జెండాలన్నీ హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. జంట నగరాలను గులాబీ జెండాలమయంగా చేసేందుకు భారీగా పోస్టర్ల తయారీకి ఆర్డర్లు ఇచ్చారు. సెప్టెంబర్‌ 2న జరిగే టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీల తయారీకి ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా ప్రింటర్‌తో టీఆర్‌ఎస్‌ బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:22 - August 28, 2018

గుంటూరు : జిల్లాలో 'నారా హమా టీడీపీ హమారా' మైనారిటీ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో మైనారిటీలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మైనారిటీలకు కేబినెట్‌లో స్థానం కల్పించే అంశంపై బాబు ఈ సభలో కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. లక్ష మంది మైనార్టీలు వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. సభలోకి ప్రవేశించేందుకు మూడు మార్గాలు ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు నమాజ్‌ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ మైనారిటీ సభ చరిత్రలో నేతలు మిగిలిపోతుందంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:10 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును అరెస్టు చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును ఖండించాయి. ప్రధాన మంత్రి మోడీ హత్య కేసు కుట్రలో భాగంగా మంగళవారం పూణె పోలీసులు నగరానికి చేరుకుని వరవరావు నివాసంలో ఆయన కూతుళ్ల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వరవరరావును విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం పూణెకు తరలించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నాగోల్ లో జర్నలిస్టు క్రాంతిని కూడా పూణె పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:24 - August 28, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్ లో టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' భారీ బహిరంగసభను ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ చరిత్రలో నిర్వహించని విధంగా ఈ సభ నిర్వహిస్తామని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనితో పార్టీ నేతలు..కార్యకర్తలు రేయింబవళ్లు పనులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మూడు వేల నుండి నాలుగు వేల మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని, వీరందరికీ బుధవారం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వాలంటరీ విభాగం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు టెన్ టివికి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:22 - August 28, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి కలకలం రేగింది. విరసం నేత వరవరరావు నివాసంపై పూణె పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర కేసుకు సంబంధించి పూణె పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు విచారణ అనంతరం వరవరరావును అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నాయి. పాలకుల వైఖరిని తీవ్రంగా నిరసించాయి. ఈ దాడిని ఖండిస్తున్నట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మోడీని హత్య చేసేందుకు వరవరరావు ఫండింగ్ చేశారని అంటే నవ్వుతారని సంధ్య విమర్శించారు.

ఇదిలా ఉంటే వరవరరావును ఇంటి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించనున్నారు. అనంతరం నాంపల్లి పీఎస్ లేదా పూణె పీఎస్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వరవరరావు కూతుళ్ల నివాసాలపై కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన అల్లుడు ఇఫ్లూ ప్రోఫెసర్ సత్యనారాయణ నివాసంలో సోదాలు చేశారు. అలాగే జర్నలిస్టు క్రాంతి నివాసంపై కూడా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ల్యాప్ టాప్, పుస్తకాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల క్రితం మావోయిస్టుల కుట్ర బయటపడింది. గతంలో అరెస్ట్ చేసిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికి లేఖ ఆధారంగా.. ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర చేసినట్టు పూణే పోలీసులు దర్యాప్తులో తేల్చారు.  ప్రస్తుతానికి సంబంధించిన ఈ ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

జర్నలిస్టు క్రాంతి అరెస్టు...

హైదరాబాద్ : నాగోల్ లో జర్నలిస్టు క్రాంతిని పూణె పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ హత్య కుట్ర కేసులో విరసం నేత వరవరరావు నివాసంపై పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నటిస్టు క్రాంతి నివాసంలో సోదాలు నిర్వహించి ఆయన్ను కూడా అరెస్టు చేశారు. 

జర్నలిస్టు, ఇఫ్లూ ప్రొపెసర్ నివాసాలపై సోదాలు...

హైదరాబాద్ : నాగోల్ విజయపురి కాలనీలో జర్నలిస్టు క్రాంతి ఇంట్లోనూ పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 9గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాప్ టాప్, పుస్తకాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ నివాసంలో కూడా సోదాలు చేశారు.  

ప్రారంభమైన బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ఢిల్లీ : హస్తినలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

14:02 - August 28, 2018

ఢిల్లీ : హస్తినలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర పథకాల అమలు తీరును సమావేశంలో సమీక్షించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై...

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియార్టీ ప్రకారం చేస్తే తెలంగాణకు న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని వాదనలు జరిగాయి. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున న్యాయవాదులు సల్మాన్ ఖుర్షి, అహ్మద్ వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణ వాళ్లకే ఎక్కువ పదోన్నతులు వచ్చే అవకాశం ఉందని వాదనలున్నట్లు సమాచారం. తదుపరిచ విచారణనను రేపటికి వాయిదా వేశారు. 

సింధు ఓటమి...

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటెన్ సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ లో సింధు ఓటమి పాలైంది. ఫైనల్ లో చైనా షట్లర్ తైజుయింగ్ చేతిలో పరాజయం చెందిన సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పూణెకు వరవరరావు...

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను పూణెకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ హత్య కేసు కుట్రల్లో వరవరరావును అరెస్టు చేశారు.

 

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో...

ఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ..అమిత్ షాలు భేటీ అయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోని బీజేపీకిచ చెందిన డిప్యూటి సీఎంలు హాజరయ్యారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేవ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై చర్చ జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 

వరవరరావు ఇంట్లో సోదాలను ఖండిస్తున్న ప్రజా సంఘాలు

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు ఇంట్లో పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు చేసిన కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. గతంలో అరెస్టైన రోనాల్డ్‌ విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల సోదాలన ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.   

13:44 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు ఇంట్ల పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు చేసిన కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. గతంలో అరెస్టైన రోనాల్డ్‌ విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని విరసం ప్రతినిధుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ప్రతినిధుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 
వరవరరావు అరెస్టుకు రంగం సిద్ధం 
విరసం నేత వరవరరావు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వరవరరావు ఇంటి వద్దకు ప్రజా సంఘాలు చేరుకున్నాయి. వరవరరావు ఇంటిపై సోదాలను ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. పోలీసుల జులుం నశించాలని నేతలు నినాదాలు చేశారు. ప్రజా సంఘాలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది. 
పీవోడబ్ల్యు పద్మ
కుట్రలతో వరవరరావు ఇంటిపై దాడి చేస్తున్నారు. దాడిని తెలంగాణ సమాజం క్షమించదు.. అది పోర్జరీ ఉత్తరమే. ప్రజల తరపున పోరాడుతున్న నేతను అణిచివేస్తున్నారు. ప్రజా గొంతుకను శాశ్వతంగా మూయించాలని కుట్రపన్నుతున్నారు.

 

13:29 - August 28, 2018

రంగారెడ్డి : టీఆర్‌ఎస్ ఏర్పాటు చేస్తున్న ప్రగతినివేదన సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లను రేయింబవళ్లు పరిశీలిస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. సభకు 30 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:24 - August 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది.  తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మాజీ పీసీసీ, డీసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.  

 

13:22 - August 28, 2018

గుంటూరు : 'నారా హమారా-టీడీపీ హమారా' పేరుతో గుంటూరులో భారీ ఎత్తున మైనారిటీ సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షమంది తరలిరానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మైనారిటీల కోసం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. చేపట్టనున్న మరిన్ని పథకాల వివరాలను సభావేదికగా వివరించనుంది. అలాగే కేబినెట్‌లో మైనారిటీలకు స్థానం కల్పించే అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి మైనారిటీలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మైనారిటీలను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
స్వాగత తోరణాలు
గుంటూరులో నిర్వహిస్తున్న నారా హమా టీడీపీ హమార సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. టీడీపీ నేతలకు స్వాగతం పలికేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. టీడీపీ సభా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

13:03 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు ఇంట్ల పూణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు చేసిన కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. గతంలో అరెస్టైన రోనాల్డ్‌ విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని విరసం ప్రతినిధుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ప్రతినిధుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు సోదాలను ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వరవరరావు ఇంటి వద్ద ఉద్రికత్త నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

డిఎంకె అధ్యక్షునిగా స్టాలిన్‌...

చెన్నై : డిఎంకె అధ్యక్షునిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 49 ఏళ్ల తరువాత డిఎంకె పార్టీ మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 65 మంది కార్యదర్శుల మద్దతుతో డిఎంకె చీఫ్‌గా స్టాలిన్‌ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. కోశాధికారిగా దురై మురగన్ ఎన్నికయ్యారు. 

12:55 - August 28, 2018

చెన్నై : డిఎంకె అధ్యక్షునిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 49 ఏళ్ల తరువాత డిఎంకె పార్టీ మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 65 మంది కార్యదర్శుల మద్దతుతో డిఎంకె చీఫ్‌గా స్టాలిన్‌ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. కోశాధికారిగా దురై మురగన్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారానికి డిఎంకె ప్రధాన కార్యాలయం అరివాలయం ముస్తాబైంది. డిఎంకె కార్యవర్గ ఎన్నికల్లో మాత్రం అళగిరి ప్రభావం చూపలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:38 - August 28, 2018

హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఇంట్లో పుణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోణలున్నాయి. గతంలో అరెస్టైన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికిన లేఖ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పూణెలో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని మొత్తం 8 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:33 - August 28, 2018

గుంటూరు : 'నారా హమారా-టీడీపీ హమారా' పేరుతో గుంటూరులో భారీ ఎత్తున మైనారిటీ సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షమంది తరలిరానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మైనారిటీల కోసం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. చేపట్టనున్న మరిన్ని పథకాల వివరాలను సభావేదికగా వివరించనుంది. అలాగే కేబినెట్‌లో మైనారిటీలకు స్థానం కల్పించే అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. 

 

12:32 - August 28, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చారు. సీఎం కేసీఆర్‌ ఇవాళ అత్యవసర కేబినేట్‌ భేటీకి సిద్ధమయ్యారు. ఈ రోజు అత్యవసర అంతర్గత భేటీలు జరుగనున్నాయి. ఈ భేటీలో కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు రాజకీయాల్లో ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ముందస్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ముందస్తుపై గతంలో గుజరాత్‌ ఎన్నికలపై ఇచ్చిన తీర్పే ప్రతిపాదికం కాబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు ప్రగతి నివేదన సభ మరోవైపు పక్కా రాజకీయ వ్యూహాలతో రాజకీయ వేడి ఊపందుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

వరవరరావ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న పుణే పోలీసులు

హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఇంట్లో పుణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోణలున్నాయి. 

 

12:27 - August 28, 2018

హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఇంట్లో పుణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర కేసులో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు ఆరోణలున్నాయి. గతంలో అరెస్టైన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికిన లేఖ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పూణెలో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని మొత్తం 8 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:14 - August 28, 2018

నిర్మల్‌ : జిల్లాలోని కుంటల మండలం అంబుగంలో విషాదం చోటుచేసుకుంది. అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో సుశీలను అత్తింటివారు గత నెల రోజులుగా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఇద్దరు చిన్నారులను చంపి సుశీల ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుశీల అత్తింటివారిపై సుశీల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

 

12:11 - August 28, 2018

చెన్నై : డిఎంకే అధినేతగా స్టాలిన్‌కు ఇవాళ పట్టాభిషేకం జరుగనుంది. 49 ఏళ్ల తరువాత డిఎంకె పార్టీ మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారానికి డిఎంకే ప్రధాన కార్యాలయం అరివాలయం ముస్తాబైంది. డిఎంకె కార్యవర్గ ఎన్నికల్లో మాత్రం అళగిరి ప్రభావం చూపలేదు. 

 

12:09 - August 28, 2018

గుంటూరు : 'నారా హమారా-టీడీపీ హమారా' పేరుతో గుంటూరులో భారీ ఎత్తున మైనారిటీ సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షమంది తరలిరానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మైనారిటీల కోసం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. చేపట్టనున్న మరిన్ని పథకాల వివరాలను సభావేదికగా వివరించనుంది. అలాగే కేబినెట్‌లో మైనారిటీలకు స్థానం కల్పించే అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరో వైపు రాత్రి కురిసిన వర్షానికి స్టేడియం బురదమయంగా మారింది. పార్టీ నేతలు యుద్ధ ప్రాతిపదికన స్టేడియంను చదును చేయిస్తున్నారు.

 

12:07 - August 28, 2018

ఢిల్లీ : పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ స్కాంలో నిందితుడైన మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ నోటీసు అవసరం లేదని సిబిఐ కేంద్ర విదేశాంగ శాఖకు తెలిపింది. తప్పించుకు తిరిగే నిందితుడికి మాత్రమే రెడ్‌ కార్నర్‌ నోటీసు అవసరముంటుందని.... మెహుల్‌ ఛోక్సీ ఆంటిగ్వాలో పౌరసత్వం తీసుకున్నందున రెడ్‌కార్నర్‌ అవసరం లేదని సిబిఐ అధికారులు తెలిపారు. తనకు రెడ్‌కార్నర్‌ నోటీసు ఇవ్వకూడదని, దీని వెనక రాజకీయ కోణం ఉందని ఛోక్సీ ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించారు. భారత జైళ్లలో సదుపాయాలు బాగుండవని, మానవ హక్కులను ఉల్లంఘిస్తాయని ఆయన ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగానే భారత జైళ్లను నిర్వహిస్తున్నట్లు సిబిఐ స్పష్టం చేసింది. 

 

12:03 - August 28, 2018

ఢిల్లీ : ఈ వర్షాకాలంలో సంభవించిన వరద విపత్తు గణాంకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళతో సహా 5 రాష్ట్రాల్లో ఆగస్టు 22 వరకు 993 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఒక్క కేరళలోనే 387 మంది మృతి చెందారు. ఇపుడు మృతుల సంఖ్య 4 వందలకు పైగా దాటింది. యూపీలో 204, వెస్ట్‌ బెంగాల్‌లో 195, కర్ణాటకలో 161, అసోంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు 70 లక్షల మందిపై ప్రభావం చూపగా... 17 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని హోంశాఖ తెలిపింది. కేరళలో 54 లక్షల మంది ప్రజలు విషమ పరిస్థితిని ఎదుర్కోగా...14.52 లక్షల మంది  పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. అసోంలో 11 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. కేరళతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం, కర్ణాటకలో వరదలు సంభవించి తీవ్ర నష్టం జరిగిందని హోంశాఖ వెల్లడించింది.

 

11:07 - August 28, 2018

రంగారెడ్డి : సమయం దగ్గర పడుతుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ  ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు శ్రమిస్తున్నాయి. సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నేతలు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో కొంగరకలాన్‌ సభ నుంచే టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమర శంఖారావం పూరించే అవకాశం కనిపిస్తోంది. 

కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు మరింత వేగం అందుకున్నాయి. 500 మంది కూర్చునే విధంగా సభావేదిక నిర్మించబోతున్నారు. సభావేదికపై ఉండే వారు కనిపించే విధంగా సభను నిర్మించబోతున్నారు. అందరూ తిలకించేందుకు 300కు పైగా ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సమయం తక్కువ ఉన్నా... ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతాయని నేతలు చెబుతున్నారు. 10 రోజుల్లోనే భారీ సభ ఏర్పాటు చేయడం రికార్డ్‌ అని నేతలంటున్నారు. సమ్మక్క-సారక్క జాతరలా సభ జరగబోతుందని.. కేసీఆర్‌ జాతరను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలిరానున్నట్లు నేతలు చెబుతున్నారు.  

ఇక సభ ఏర్పాట్లను ఎంపీ జితేందర్‌రెడ్డి పరిశీలించారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత సాధించిన ప్రగతిని ఈ సభ ద్వారా తెలియజేస్తామంటున్నారు. కేసీఆర్‌ పాలన భేష్‌ అని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. 

మరోవైపు సభకు సీఎం కేసీఆర్‌ చేరుకునేందుకు ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. క్రికెట్‌ పిచ్‌ మాదిరిగా హెలీప్యాడ్‌ను తయారు చేయబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఓవైపు ముందస్తుకు సంకేతాలు జోరందుకుంటున్న నేపథ్యంలో కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభ నుంచే కేసీఆర్‌ ఎన్నికల సమరం పూరించే అవకాశం కనిపిస్తోంది. 

10:59 - August 28, 2018

హైదరాబాద్‌ : జిల్లాలోని మెహదీపట్నంలో దారుణం జరిగింది. కన్నబిడ్డను నేలకేసి కొట్టింది తల్లి. ఆ బిడ్డ తనకు పుట్టింది కాదని భర్త ఆరోపించడంతో ఆగ్రహం చెందిన భార్య.... తన కుమారుడిని రోడ్డుపై పారేసింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ బిడ్డను తల్లి వద్దకు చేర్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. 

 

10:56 - August 28, 2018

 ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారో ప్రభుత్వం చెప్పాలని వక్తలు అన్నారు. ముందస్తు ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి దుర్గపరసాద్, బీజేపీ నేత టి.ఆచారి, వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి, టీఆర్ ఎస్ నేత, మాజీ ఎంపీ మందజగన్నాథం పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

10:49 - August 28, 2018

ఆంధ్రప్రదేశ్‌లో చేతి వృత్తి కార్మికులు ఆందోళనబాట పట్టారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ-2 పథకంలో అప్లై చేసుకున్న ప్రతి వారికీ ప్రభుత్వం బెనిపిషరీ ఇవ్వాలని.. నాణ్యమైన సామాగ్రిని పంచాలని, కుల వృత్తులకు కేటాయించిన బడ్జెట్‌ను ఆచరణలో ఖర్చుపెట్టాలని కనుమరుగవుతున్న కుల వృత్తులను కాపాడేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వాళ్లు ఆందోళనలు చేస్తున్నారు. వారి డిమాండ్లు, వారిపట్ల ప్రభుత్వ విధానంపై ఏపీ చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ రామకృష్ణ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:47 - August 28, 2018

ఢిల్లీ : జావెలిన్‌ త్రోలో భారత్‌ స్వర్ణం సాధించింది. యువ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకం అందుకున్నాడు. ఆట ఆరంభం నుంచే నీరజ్‌ అందరికన్నా ఆధిక్యంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 83.46 మీటర్లు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక నాలుగోసారి 83.25 మీటర్లు,.. ఐదోసారి 86.36 మీటర్లు విసిరాడు. అద్బుతమైన ప్రదర్శనతో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించాడు. 

 

10:29 - August 28, 2018

ఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈవీఎంలు పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలు టాంపరింగ్‌కు గురవుతున్నాయని...ప్రతీసారి ఓట్లన్నీ ఒకే పార్టీకి వెళ్లడాన్ని ఈసీ దృష్టికి తెచ్చాయి. ముందస్తు ఎన్నికలపై తమను ఎవరూ సంప్రదించలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఈసీ.. అఖిలపక్ష సమావేశం 
2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రవాస భారతీయ భవన్‌లో జాతీయ ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 7 జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను ఈసీ సేకరించింది. 
ఈవీఎంల వినియోగంపై తీవ్ర అభ్యంతరం 
ఈవీఎంల వినియోగంపై కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ప్రతిపాదించాయి. చాలా సందర్భాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చాయి. ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి ఓట్లు వెళ్లిన పలు సందర్భాలను విపక్షాలు పేర్కొన్నాయి. ఈవీఎంలను ఎక్కడ రిపేర్‌ చేయిస్తున్నారో తెలపాలని ఈసీని నిలదీశాయి. 30 శాతం వివిప్యాట్‌లను క్రాస్‌ చెక్‌ చేయాలని కాంగ్రెస్‌ సూచించింది.
ఈసీకు వివిధ పార్టీలు పలు సూచనలు 
ఎన్నికల్లో అనుసరిస్తున్న విధి విధానాలు, చెయ్యాల్సిన మార్పులపై ఈసీ పార్టీలతో చర్చించింది. ఎన్నికల ఖర్చు తగ్గించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేత, సెక్షన్‌ 126 పకడ్బందీగా అమలు, ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను పెంచడం తదితర అంశాలపై వివిధ పార్టీలు ఈసీకు పలు సూచనలు చేశాయి. ఈవీఎంలపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఈసీ తెలిపింది. బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం వల్ల బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగే అవకాశముందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు ఎన్నికలపై తమను ఎవరూ సంప్రదించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. జాతీయ ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో బిజెపి తరపున జేపీ నడ్డా, భూపీందర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి ముఖుల్‌ వాస్నిక్‌, మహ్మద్‌ ఏ ఖాన్‌, టిడిపి నుంచి రవీంద్రకుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ నుంచి వినోద్‌ కుమార్‌, సీపీఐ నుంచి నారాయణ, తదితర పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.

10:10 - August 28, 2018

కరీంనగర్ : బతుకమ్మ చీరలతో నేతన్నల తలరాతలు మారుతున్నాయి. ఆకలి కేకలు, బలవన్మరణాలతో ఉరిసిల్లగా గుర్తింపు పొందిన సిరిసిల్లలో బతుకమ్మ చీరలు బతుక్కు భరోసానిస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలే నేతన్నలకు ఉపాధిగా మారాయి. బతుకమ్మ బతుకునిస్తుందన్న మాటను.. నిజం చేస్తూ.. సిరిసిల్లా నేతన్నలను బతికిస్తున్న బతుకమ్మ చీరలపై 10టివి ప్రత్యేక కథనం. 
కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్ర పరిశ్రమ 
నేతన్నలను ఆశలతో మభ్యపెట్టిన గత ప్రభుత్వాలు.. వారి జీవితాల్లో వెలుగు నింపలేక పోయాయి. ఫలితంగా నూలు పోగును నమ్మిన బతుకులు కాస్తా ఉరి తాడుకు వేళాడాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారి పోయాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలోని వస్త్ర పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. దీనిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి ఆసాములు, కార్మికుల జీవితాలను మార్చేందుకు ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది.
ఇక్కడినుంచే రాజీవ్ విద్యా మిషన్‌కు కావాల్సిన బట్ట కొనుగోలు
రాజీవ్ విద్యా మిషన్‌కు కావాల్సిన బట్టను ప్రభుత్వం ఇక్కడినుంచే కొనుగోలు చేస్తోంది. కోటి ఇరవై లక్షల మీటర్ల బట్టను కొని కార్మికులకు ఉపాధి కల్పించింది. బతుకమ్మ, దసరా కానుకగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయాలన్న సీఎం నిర్ణయంతో.. సుమారు 25 వేల మంది కార్మికులు, 3 వేల మంది ఆసాములకు ఉపాధి  దొరికింది. గతేడాది  సమయం లేకపోవడంతో..  కోటి చీరలు నేయవలసి ఉంటే.. సుమారు 40 లక్షల చీరలు మాత్రమే నేశారు. అందుకే ఇప్పుడు ముందస్తుగానే బతుకమ్మ చీరలు ఉత్పత్తికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 6నెలల ముందే.. సుమారు కోటి చీరలకు అనుమతిచ్చింది 
ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి 
ఆరు నెలల ముందే.. సుమారు కోటి చీరలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మూగవోయిన మగ్గాలపై నూలు పోగులు నృత్యం చేస్తుంటే.. నేతన్నల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. బతుకమ్మ చీరలన్నీఇక్కడి పరిశ్రమకే అప్పగించడంతో.. కార్మికులు, ఆసాముల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం నేతన్నలకు చేతినిండా పని
గతంలో ఏడాదికి  రెండు మూడు సార్లు సంక్షోభాల పేరుతో కార్మికులు పస్తులుండేవారు. కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్దితి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో  నేతన్నలకు ఉపాధికి కొదవలేదు. గతంలో వారానికి పదిహేను వందలు మాత్రమే  సంపాదించే వారు. ఇప్పుడు  నాలుగు నుంచి అయిదు వేల వరకు సంపాదిస్తున్నామని కార్మికులు, ఆసాములు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు ఇబ్బంది కల్గిస్తున్న పన్నెండు శాతం జీఎస్టీ  
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకోసం ఎంతగానో పాటుపడుతున్నా..కేంద్రం విధించిన పన్నెండు శాతం జీఎస్టీ కార్మికులకు ఇబ్బందిగా మారింది. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం దృస్తి సారించాలని నేతన్నలు కోరుతున్నారు. మొత్తానికి రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపుతోంది.. ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న బతుకమ్మ కానుక.. నేతన్నలను బతికిస్తోంది. 

 

09:38 - August 28, 2018

గుంటూరు : 'నారా హమారా-టీడీపీ హమారా' పేరుతో గుంటూరులో భారీ ఎత్తున మైనారిటీ సభ నిర్వహించేందుకు టీడీపీ  ఏర్పాట్లు చేసింది. నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మైనారిటీల కోసం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. చేపట్టనున్న మరిన్ని పథకాల వివరాలను సభావేదికగా వివరించనుంది. అలాగే కేబినెట్‌లో మైనారిటీలకు స్థానం కల్పించే అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. 
గుంటూరులో పండుగ వాతావరణం 
తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల సభ నిర్వహించనున్న నేపథ్యంలో గుంటూరులో పండుగ వాతావరణం నెలకొంది. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ నేతలంతా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
ఇక సభావేదికపై 300మంది కూర్చునేలా ఏర్పాట్లు 
ఇక సభావేదికపై 300మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికపై సీఎం చంద్రబాబుతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్లు, సీనియర్‌ నేతలు ఆశీనులు కానున్నారు. వేదిక ముందు భాగంలో మొత్తం 16 గ్యాలరీలను బారికేడ్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్యాలరీలో 30 వేలమంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. సుమారు 15 వేల మంది మైనారిటీ మహిళలు, 15 వేల మంది మైనారిటీ విద్యార్థులు పాల్గొంటారన్న అంచనాతో.. వారి కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో బయట ఉన్నవారు సభలోని ముఖ్యుల ప్రసంగాలు తిలకించేలా.. ఫ్లడ్‌లైటు మరియు ఎల్‌ఇడి తెరలను సిద్దం చేశారు. ఇక స్టేడియంలోకి ప్రజలు వచ్చేందుకు మూడు మార్గాలు, చంద్రబాబు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక మార్గాన్ని సిద్దం చేశారు. 
వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు 
ఇక రాష్ట్ర నలుమూలల నుంచి 600 ఆర్టీసీ బస్సుల, పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ వాహనాలు తరలిరానున్నాయి. వీటి వాటి పార్కింగ్‌ కోసం నందివెలుగు రోడ్డు, పొన్నూరు రోడ్లలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ముస్లిం సోదరులు నమాజ్‌ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముస్లిం మతపెద్దలను గుర్తించి వారిని సభకు ఆహ్వానించారు. సభకు హాజరయ్యే వారి కోసం అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉర్దూకవులు, రచయితలతో ప్రత్యేక కార్యక్రమాలతో సభ ప్రారంభం కానుంది. 4 గంటల నుండి ముఖ్య నేతల ప్రసంగాలు కొనసాగేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. 
సభ చరిత్రలో మిగిలిపోతుందన్న టీడీపీ నేతలు 
'నారా హమారా.. టీడీపీ హమారా' సభ చరిత్రలో మిగిలిపోతుందన్నారు టీడీపీ నేతలు. మైనారిటీల కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పడంతో పాటు.. బీజేపీ దేశంలో అనుసరిస్తున్న లౌకిక వ్యతిరేక పాలనను ఎండగడతామన్నారు. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా టీడీపీ నేతలు సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక మైనారిటీలకు మరిన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కేబినెట్‌లో మైనారిటీకి స్థానం కల్పించే అంశంపై కూడా చంద్రబాబు నిర్ణయం ప్రకటించనున్నారు. 

 

09:21 - August 28, 2018

రంగారెడ్డి : గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ ఆపార్టీ నేతల్లో ఉత్సాహం నింపుతుంటే.. సభకు వేదికగా నిలుస్తున్న గ్రామంలో మాత్రం కొంత నిరుత్సాహం నెలకొంది.. ప్రగతి నివేదన సభ తమ గ్రామ పరిధిలో జరుగుతుంటే.. అధికార పార్టీ నేతలంతా మరో గ్రామం పేరు వినిపిస్తున్నారని ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారూ... మా ఊరిని గుర్తించడంటూ ఆ గ్రామస్థులు నేతల ముందు వాపోతున్నారు. ఇంతకీ ప్రగతి నివేదన జరుగుతున్న గ్రామం పేరేది...?
'బహిరంగ సభ మా గ్రామంలో.. ప్రచారం మరో గ్రామానికా'
వచ్చే నెల 2న అధికార టీఆర్ఎస్‌ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ రంగారెడ్డి జిల్లాలోని 2 నియోజకవర్గాల పరిధిలో జరుగుతోంది. సభకు హాజరుకానున్న జనాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 2 వేల ఎకరాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, ప్రాంగణం కోసం దాదాపు 600 ఎకరాలు ఉండాలన్న నిర్ణయం మేరకు పనులు చేపట్టారు. కానీ బహిరంగ సభను తమ గ్రామంలో నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతలు.. మరో గ్రామం పేరును ప్రచారం చేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. 
సభ కొంగరకలాన్‌లో అంటున్న టీఆర్ఎస్‌
ప్రగతి నివేదన సభను కొంగరకలాన్‌లో నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్‌ నేతలు ముందు నుంచీ చెబుతున్నారు. దీంతో ఆ గ్రామానికి భారీగా ప్రచారం వస్తోంది. కానీ.. వాస్తవానికి  సభ నిర్వహించనున్న గ్రామం మహేశ్వరం మండలంలోని రావిర్యాల అని గ్రామస్థులు అంటున్నారు. తమ  గ్రామ పరిధిలో సభ నిర్వహిస్తూ.. మరో ఊరి పేరు ఎందుకు చెబుతున్నారంటూ స్థానికులు గట్టిగానే అడుగుతున్నారు. సీఎంతో సహా ప్రధాన నేతలంతా  ఇలాగే చెప్పడంతో.. రాష్ట్ర స్థాయిలో తాము గుర్తింపు కోల్పోతున్నామంటున్నారు స్థానికులు. 'సారూ.. మా వూరు పేరు పలకండంటూ' కొత్త నినాదాన్ని అందుకుంటున్నారు. రావిర్యాల గ్రామస్తులు మంత్రి కేటిఆర్ ముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో గులాబి నేతలు గ్రామస్తులను సముందాయించే యత్నం చేశారు. సీఎం ఇక్కడికి వస్తే ఎలాంటి నిధులు వస్తాయో అవన్నీ ఇప్పించడంతోపాటు.. సీఎంతో  రెండు గ్రామాల పేర్లను చెప్పిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.

 

నేడు 'నారా హమారా..టీడీపీ హమారా' మైనార్టీ సభ

గుంటూరు : ఇవాళా పట్టణంలో 'నారా హమారా..టీడీపీ హమారా' పేరుతో మైనారిటీ సభ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. 

మెహిదీపట్నంలో అమానవీయ ఘటన

హైదరాబాద్ : మెహిదీపట్నంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డను తల్లి నేలకేసి కొట్టింది. ఆ బిడ్డ తనకు పుట్టలేదని భర్త ఆరోపించడంతో భార్య ఆగ్రహంతో బిడ్డను నేటకేసి బాదింది. ట్రాఫిక్ పోలీసులు బిడ్డను తల్లికి అప్పగించారు.   

 

08:38 - August 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, రీజనల్‌ రింగురోడ్డు, ప్రాజెక్టుల విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సీఎం నేషనల్ హైవేలను ఎన్ హెచ్ ఏఐకి అప్పగించి... గ్రీన్ హైవేస్‌గా మార్చాలని కేంద్రాన్ని కోరారు. 
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. మూడు రోజుల హస్తిన టూర్‌లో భాగంగా శనివారం మొదటి రోజున ప్రధాని నరేంద్రమోదీతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు, విభజన హామీలు, కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం వంటి అంశాలపై ప్రధానితో చర్చించారు. ఆదివారం రెండో రోజు పర్యటనలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై చర్చించారు.  
జాతీయ రోడ్ల అభివృద్ధి, రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టులపై చర్చ
మూడవ రోజు హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్‌... కేంద్ర రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, రీజనల్‌ రింగ్‌రోడ్డు, ప్రాజెక్టులపై చర్చించారు. 334 కిలోమీటర్ల నిడివిలో ఎక్స్‌ప్రెస్‌ హైవేను ఆరులేన్లుగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి-తుఫ్రాన్‌-చౌటుప్పల్‌ వరకు 154 కి.మీ నిడివికి అనుమతి మంజూరు చేసే విషయమై సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. అలాగే అనుమతులిచ్చిన రహదారులకు అలైన్మెంట్లు, నోటిఫికేషన్లు ఇవ్వాలని గడ్కరీని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల బాధ్యతను ఎన్ హెచ్ ఏఐకి అప్పగించి...నేషనల్‌ హైవేలను గ్రీన్‌ హైవేలుగా మార్చాలని కోరారు. 
కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం : సీఎం
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకు బచావత్‌ ట్రిబ్యూనల్‌లోనే అన్యాయం జరిగినందున... మొత్తం కృష్ణా జలాల విషయంలో మళ్లీ పంపకం జరపాలని సీఎం కేసీఆర్‌... కేంద్రమంత్రి గడ్కరీని కోరారు. మొత్తానికి మూడురోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. 

 

08:27 - August 28, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత సమావేశం అవుతున్న కేబినెట్‌ మీటింగ్‌... ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతోనే.. సీఎం ఈ సమావేశం పెట్టారని.. దీంతో ఇదే రాష్ట్ర చివరి కేబినెట్‌ అనే ప్రచారం జరుగుతోంది.
అత్యవసరంగా కేబినెట్‌ భేటీకి పిలుపు
తెలంగాణ కేబినెట్‌ ఇవాళ సాయంత్రం అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అధికారపార్టీ సంసిద్ధం అవుతుండడంతో... ఈ కేబినెట్‌ పట్ల అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కేసీఆర్‌ నాలుగు రోజుల క్రితం అనధికారికంగా మంత్రివర్గ సహచరులతో దాదాపు ఆరున్నర గంటలపాటు భేటీ అయ్యారు. జిల్లాల వారీగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి... ఎన్నికల బాధ్యత తనదేనని ... నాయకత్వమంతా సెప్టెంబర్‌ 2న జరిగే సభపై దృష్టి సారించాలని ఆదేశించారు. అదేరోజు సాయంత్రం సీఎం హస్తినకు బయలుదేరి వెళ్లారు.
మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసిన కేసీఆర్‌
మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం... ప్రధానిసహా పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఇందులో రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్‌పై నివేదించారు. ఇందులో అత్యంత కీలకమైన , సున్నితమైన జోనల్‌ వ్యవస్థపై రాష్ట్రపతిచేత ఆమోదానికి ఒప్పించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇవాళో.. రేపో రాష్ట్ర సంతకం చేసి గెజిట్‌ కూడా విడుదల చేయవచ్చన్న ప్రచారం సాగుతోంది.
ప్రజలకు వరాలు కురిపించనున్న కేబినెట్‌!
ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇవాళ కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పలు కీలక అంశాలు చర్చించే అవకాశముంది. ముందస్తుకు వెళితే ఇదే చివరి సమావేశం అయ్యే అవకాశమూ ఉంది. ఒకవేళ ఇదే చివరి సమావేశమైతే.. ప్రజలపై వరాలు కురిపించేలా పలు నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.  ఈ భేటీ అనంతరం ఒకటి రెండు రోజుల్లోనే కేబినెట్‌ను రద్దు చేస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అయితే సెప్టెంబర్‌ రెండు సభ సక్సెస్‌ అయిన తర్వాత ఒకరోజు అసెంబ్లీని సమావేశపర్చి అక్కడే తమ ప్రభుత్వ పనితీరుపై మరోసారి వివరించి శాసనసభను అక్కడి నుంచే రద్దు కూడా చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం నుంచి వచ్చిన గ్రీన్‌సిగ్నల్‌ ముందస్తు ఎన్నికల వేడి రాష్ట్రంలో మరింత రాజుకుంది. 

 

నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆత్మీయ సమావేశం

ఢిల్లీ : నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆత్మీయ సమావేశం జరుగనుంది. ఉప రాష్ట్రపతిగా ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం నిర్వహించనున్నారు. 

నేడు తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం

హైదరాబాద్ : నేడు తెలంగాణ కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కుంతియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. మాజీ పీసీసీలు, డీసీసీలు, ఏఐసీసీ కార్యదర్శులకు ఆహ్వానం పంపారు. 

నేడు కేరళ వరద ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటన

తిరువనంతపురం : కేరళ వరద ప్రాంతాల్లో నేడు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

నేడు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : నేడు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరింకుంది. కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ పంపారు. నిర్ణయాలకు సంబంధించిన అంశాలను సిద్ధం చేయాలని సూచించారు.

 

నేడు డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం

చెన్నై : నేడు డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.  

 

నేడు 248వ రోజ జగన్ ప్రజా సంకల్పయాత్ర

విశాఖ : ఇవాళ 248వ రోజ జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. నేడు యలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. కొండపల్లి నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.  

 

Don't Miss