Activities calendar

29 August 2018

21:46 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందగా.. ప్రస్తుత ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. ఇక 2009లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమాద బారిన పడ్డారు. సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ గాయపడ్డారు.

టీడీపీ సీనియర్‌ నేత, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్లగొండ జిల్లా సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు పాలైన హరికృష్ణను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలో కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ నుండి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా ప్రమాదాలు
హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇప్పుడు ఓ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశమైంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఆకుపాముల వద్ద జరిగిన ప్రమాదంలో జానకీరామ్‌ మృతి చెందారు. జానకీరామ్‌ ఒంటరిగా టాటా సఫారీ వాహనంలో విజయవాడకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను జానకీరామ్‌ వాహనం ఢీ కొనటంతో జానకీరామ్‌ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. జానకీరామ్‌ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.

2009 ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి వెళ్లిన ఎన్టీఆర్‌
ఇక హీరోగా మంచి గుర్తింపు సాధించిన జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రోడ్డు ప్రమాదం వెంటాడింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయటానికి ఎన్టీఆర్‌ ఖమ్మం జిల్లా వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. సూర్యాపేట సమీపంలో గల ఓ పదునైన మలుపు వద్ద ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న టాటా సఫారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌ తలకు, భుజానికి, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఎన్టీఆర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ చికిత్స పొందారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఈ ప్రమాదాల్లో ఎన్టీఆర్‌ మినహా మిగతా వారు మరణించారు.

నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీ కొడుకులు
హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయంశమైంది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ ప్రయణించిన కారు నెంబర్‌ ఏపీ 29 బీడీ 2323 కాగా.. ప్రస్తుతం హరికృష్ణ ప్రయాణించిన కారు నెంబర్ కూడా ఏపీ 28 బీడబ్ల్యూ 2323. అయితే 2323 సిరీస్ నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని అభిమానులు భావిస్తున్నారు. కుమారుడు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండొచ్చిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, తండ్రీకొడుకులిద్దరూ నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఎన్టీఆర్‌ ప్రమాదం కూడా నల్లగొండ జిల్లాలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాతుండటం పట్ల అభిమానులను కలచివేస్తోంది.

 

21:39 - August 29, 2018

హైదరాబాద్ : టీడీపీ రాజకీయాల్లో హరికృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడిగానే కాకుండా కుటుంబ రాజకీయాల్లో రెబల్‌గా హరికృష్ణకు పేరుంది. మంత్రి, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా వివిధ పదవులు నిర్వహించారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌తో విభేదించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు హరికృష్ణ.. చంద్రబాబుకు అండగా నిలించారు.
తండ్రి వెంటనే నడిచిన హరికృష్ణ
ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచార వాహనం చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... నాలుగుసార్లు చైతన్య రథాన్ని నడిపిన ఘనత హరికృష్ణకే దక్కింది. 1983, 85, 89, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ చైతన్య రథాన్ని స్వయంగా నడిపి... తండ్రికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉన్నారు హరికృష్ణ. మొదటిసారి 9 నెలల పాటు చైతన్య రథానికి సారథిగా వ్యవహరించారు.

చంద్రబాబుతో చేతులు కలిపిన హరికృష్ణ ..రవాణా మంత్రిగా బాధ్యతలు
1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌తో చంద్రబాబు విభేదించి... 1995లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు, టీడీపీ సారథ్యం చేపట్టారు. అప్పుడు హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌కు కాదని... బావ చంద్రబాబుతో చేతులు కలిపారు. తనకు అండగా నిలిచినందుకు చంద్రబాబు.. తన మంత్రివర్గంలో హరికృష్ణకు స్థానం కల్పించారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించారు. 1996లో జనవరిలో ఎన్టీఆర్‌ మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై 62 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. అయితే చంద్రబాబు తన కేబినెట్‌లో హరికృష్ణకు స్థానం కల్పించకుండా విస్మరించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారన్నవిమర్శలను చంద్రబాబు ఎదుర్కొన్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగానే కొనసాగారు. నాలుగేళ్లపాటు హిందూపురంలో ప్రజా సమస్యలు పరిష్కరించి అందరి మన్ననలు పొందారు.

1999 జనవరి 26 అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన

1999లో హరికృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుతిరిగారు. టీడీపీకి పోటీగా 1999 జనవరి 26న అన్న టీడీపీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలిస్తూ... ఎన్టీఆర్‌ వారసత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్న తెలుగుదేశమే నిజమైన టీడీపీ అని ప్రచారం చేశారు. 1999 ఎన్నికల్లో హరికృష్ణ నాయకత్వంలోని అన్న టీడీపీ పోటీ చేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. సోదరుడు బాలకృష్ణ... చంద్రబాబుకు మద్దతుగా నిలించినా.. హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగానే ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు హరికృష్ణతోపాటు ఆయన తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు మరోసారి దగ్గరకు తీశారు. అప్పట్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీకి ప్రచారం చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు... హరికృష్ణను రాజ్యసభకు పంపారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలుగులో రాజ్యసభలో ఆవేశపూరితంగా తెలుగులో ప్రసంగించారు. ముందస్తు అనుమతి లేకుండా తెలుగులో హరికృష్ణ చేసిన ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని అప్పట్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ ఆదేశించారు.

21:31 - August 29, 2018

హైదరాబాద్ : రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ నేత హరికృష్ణకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హరికృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖసారగంలో ఉన్న కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ నేత హరికృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్నకుటుంబ సభ్యులను ఓదార్చారు.

తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌... హరికృష్ణ నివాసానికి చేరుకుకి భౌతికకాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరికృష్ణ నివాసానికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరార్శించారు.

హరికృష్ణ రోడ్డు ప్రమాదవార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి లోకేశ్‌తో కలిసి హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో నల్గొండ చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వచ్చి.. హరికృష్ణ భౌతికకాయాన్నిచూసి చలించిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌ కన్నీటి పర్యతంమయ్యారు. హరికృష్ణ మృతి తమ కుటుంబానికి, టీడీపీకి తీరనిలోటని... ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణలేని లోటును భర్తీ చేయలేమన్నారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌... హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. హరికృష్ణ మృతి తెలుగు ప్రజలకు తీరలని లోటని టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. కారు నడుపుతూ సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికి ఉండేవారని రాజమంత్రి గ్రామీణ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. :హరికృష్ణ మృతికి టీడీపీ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి సంతాపం ప్రకటించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు ప్రజలు, ఆయన అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళలర్పిస్తున్నారు. 

మళ్లీ మళ్లీ పెరుగుతున్న పెట్రో..డీజిల్..

ఢిల్లీ: డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వాహనాదారులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ రేట్లు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్ల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 69.61, పెట్రోలు 78కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు డీజిల్ ధర రూ.73.90కు చేరగా, కోల్‌కతాలో రూ.73.54గా ఉంది. ఇక చెన్నైలో డీజిల్ లీటరు రూ.73.54గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఒసిఎల్) పేర్కొంది.

పేలిన కారు బాంబు..8మంది మృతి..

ఢిల్లీ : ఇరాక్‌లోని అంబర్ ప్రొవిన్స్‌లో ఈరోజు ఉదయం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అంబర్ ప్రొవిన్స్‌లోని భద్రతా దళాల చెక్ పాయింట్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిందెవరో ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

20:49 - August 29, 2018

జమ్ము కశ్మీర్‌ : లోని షోపియన్ జిల్లాలోని అర్హామా గ్రామం వద్ద ఉగ్రవాదులు పోలీసులపై మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు అమరులయ్యారు. ఓ పోలీసు వాహనానికి మరమ్మతులు చేయడానికి డీఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన ఎస్కార్ట్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం ఆయుధాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నలుగురు జవాన్లను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానిస్టేబుళ్లు ఇశ్వాక్‌ అహమద్‌ మీర్, జావేద్‌ అహమద్‌ భట్, మొహమ్మద్‌ ఇక్బాల్ మీర్, ఎస్‌పిఓ ఆదిల్‌ మంజూర్‌ భట్‌ మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

20:45 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యులుగా ఢిల్లీలోనూ కీలక పాత్ర పోషించారు. రాజ్యసభలో తెలుగులో ప్రసంగించడం ద్వారా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

నందమూరి హరికృష్ణ సినిమాల్లోనే కాదు... రాజకీయ ప్రస్థానంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్ని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హరికృష్ణను రాజ్యసభకు పంపించారు. 2008లో ఆయన టిడిపి తరపున రాజ్యసభ పదవికి ఎన్నికయ్యారు.

హస్తిన రాజకీయాల్లోనూ హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హరికృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పార బట్టేవారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభలో ఆయన తెలుగులో చేసిన ప్రసంగం హైలైట్‌గా నిలిచిపోయింది. హరికృష్ణ తెలుగులో ప్రసంగించడానికి అప్పటి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పిజె కురియన్‌ అనుమతించలేదు. తెలుగులో మాట్లాడడానికి ముందస్తు పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కురియన్‌ అన్నారు. ఉప సభాపతి మాటలను పట్టించుకోని హరికృష్ణ తనదైన శైలిలో తెలుగులోనే ప్రసంగించారు. తాంబూలలిచ్చాం...తన్నుకు చావండి...అన్నట్లుగా తెలుగు ప్రజలను విభజించారని ఆయన సభలో మండిపడ్డారు.

రాష్ట్రవిభజనకు నిరసనగా 2013, ఆగస్టు4న రాజ్యసభ పదవికి హరికృష్ణ రాజీనామా చేశారు. తన రాజీనామాను పట్టుబట్టి ఆయన ఆమోదింపజేసుకున్నారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కడవరకు హరికృష్ణ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంత కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

20:44 - August 29, 2018

హైదరాబాద్ : తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని తెలిపారు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్న ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నానని బాలకృష్ణ అన్నారు. అన్నయ్య హరికృష్ణ లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. మెహిదీపట్నంలో హరికృష్ణ భౌతికకాయం ఉంచిన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, హరికృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధకరమని అన్నారు. హరికృష్ణకు బంధుప్రీతి ఎక్కువని, మా ఊరు వెళ్లినప్పుడు ప్రతిఒక్క బంధువును కలిసి, పలకరించేవారని అన్నారు. అలాగే, పార్టీలో కూడా అందరితో కలుపుగోలుతనంగా ఉండేవారని, అటువంటి ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. సంస్కృతీ సంప్రదాయాలకు హరికృష్ణ విలువ నిచ్చేవారని, తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, హరికృష్ణ చూస్తుంటే తండ్రిని చూస్తున్నట్టే ఉండేదని అన్నారు. అందరూ పోవాల్సిన వాళ్లేమని, కానీ, ఈవిధంగా చనిపోవడం బాధాకరంగా ఉందని, నమ్మబుద్ధి కావడంలేదని బాధాతప్త హృదయంతో బాలకృష్ణ చెప్పారు.

20:31 - August 29, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ..
టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్లగొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద కారు బోల్తాపడింది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు శివాజీ, వెంటకట్రావు ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయన్ను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ హరికృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. అయితే హరికృష్ణను ఆస్పత్రికి తరలించినప్పటికే స్పృహలేదని డాక్టర్లు చెబుతున్నారు.

వాటర్‌ బాటిల్‌ అందుకునేందుకు ప్రయత్నంలో ప్రమాదం..
హరికృష్ణతోపాటు కారులో ప్రయాణించిన మరో ఇద్దరు శివాజీ, వెంకట్రావు గాయాలతో బయపడ్డారు. వీరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. హరికృష్ణ వాటర్‌ బాటిల్‌ అందుకునేందుకు ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగిందిని వీరు చెప్పారు. కారు పల్టీ కొట్టి డోర్‌ తెరుసుకోవడంతో హరికృష్ణ దూరంగా పడిపోయారు. ప్రమాదం జరినప్పుడు కారు వంద కి.మీ. వేగంలో ప్రయాణించి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారును హరికృష్ణ స్వయంగా నడిపారు. సీటుబెల్టు పెట్టుకోనందునే తీవ్రగాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకుని ఉండే ప్రణాలు దక్కేవని స్థానికులన్నారు.

హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తరువాత ప్రత్యేక అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని హైదరాబాద్‌- మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. హరికృష్ణ భౌతికకాయం వెంట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, త్రివిక్రమ్ ఉన్నారు. 
మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరం : సీఎం చంద్రబాబు
ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరమని తెలిపారు సీఎం చంద్రబాబు. హరికృష్ణ మృతి పట్ల సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. హరికృష్ణ తనకంటూ ప్రత్యేకత, గుర్తింపు సాధించారని చంద్రబాబు అన్నారు. హరికృష్ణ ఏ పదవిలో ఉన్న నీతి-నిజాయితీతో పనిచేసేవారని చంద్రబాబు చెప్పారు. 

11మంది టీ. ఐఏఎస్ ల బదిలీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందులో స్వల్ప మార్పులు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.

20:15 - August 29, 2018

రేపటినుండి ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన ఇంగ్లండ్ విజయోత్సాహంతో వుండగా..ఇండియా మాత్రం ఒక మ్యాచ్ గెలిచి రెండు రెండు మ్యాచ్ లతో సమం చేసి అంతిమపోరులో విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో నాలుగవ మ్యాచ్ గెలిచి సిరిస్ ను సొంతంచేసుకోవాలని ఇంగ్లండ్ ఉబలాటపడుతోంది. నేపథ్యంలో నాలుగవ టెస్ట్ ఇరు జట్ల మధ్య కీలకంకానుంది.

19:49 - August 29, 2018

ఢిల్లీ : వరదలతో అతలాకుతలం అయిపోయిన కేరళకు కేంద్రం ప్రకటించిన సహాయం ఏమాత్రం సరిపోదని..కేంద్రం మరింతగా కేరళను అదుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వరదలతో నష్టపోయిన ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారనీ..వారికి కేంద్రం భరోసా కల్పించేవిధంగా వ్యవహరించాలని కోరారు. కేరళ పరిస్థితిపై తాను కేరళ సీఎం పినరాయి విజయన్ తో మాట్లాడానని తెలిపారు. బీజేపీ ప్రభ్తువం ఆర్ ఎస్ఎస్ చెప్పుచేతల్లో నడుస్తోందని రాహుల్ ఆరోపించారు. 

పౌరసంఘ నేతలకు సుప్రీంలో ఊరట..

హైదరాబాద్ : పౌరహక్కుల సంఘాల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారిని అరెస్ట్ చేయటం సరికాదంటు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పౌరహక్కుల సంఘాల నేతలకు ఊరట లభించింది. వారిని సెప్టెంబర్ 5 వరకూ గృహ నిర్భంధంలోనే వుంచాలని..మూడు రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా ఐదుగురు పౌరహక్కుల సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ హత్య కుట్ర కేసులో పక్కా ఆధారాలతో వీరిని పూణే పోలీసులు అరెస్ట్ చేసారు.

18:55 - August 29, 2018

హైదరాబాద్ : భీమా-కోరేగావ్‌ హింస కేసులో అరెస్ట్‌ అయిన ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు- మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. వారిని సెప్టెంబర్‌ 5 వరకు హౌజ్‌ అరెస్ట్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురు మానవ హక్కుల కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచాలని, వారని బయటకు వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 6కు వాయిదా వేసింది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురిపై తప్పుడు అభియోగాలు మోపారని, వారిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. భీమా-కోరేగావ్‌ హింసాత్మక ఘటనలు, మావోయిస్టులతో సంబంధాలు, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పుణె పోలీసులు వరవరరావుతో సహా నలుగురు పౌర హక్కుల కార్యకర్తలను మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఘనంగా అధికారిక అంత్యక్రియలు: కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. హరికృష్ణను కడసారి చూసేందుకు వచ్చే ఏ ఒక్కరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సోదరులు తారక్, కల్యాణ్ రామ్ లతో పాటు నందమూరి కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు.

హరికృష్ణ మృతి మనసుని కలచివేస్తోంది :చిరంజీవి

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ విషాద మరణం చాలా దురదృష్టకరమని.. దుర్దినం అని ప్రముఖ నటుడు చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని, చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు. హరికృష్ణ, తాను ఎప్పుడు ఎదురుపడ్డా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, సరదాగా జోక్స్ వేస్తూ.. నవ్వించే వారని గుర్తుచేసుకున్నారు.

18:31 - August 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. హరికృష్ణను కడసారి చూసేందుకు వచ్చే ఏ ఒక్కరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సోదరులు తారక్, కల్యాణ్ రామ్ లతో పాటు నందమూరి కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు.

18:25 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ట మరణం తన మనసుని కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హరిక్రిష్ట పార్దీవదేహానికి నివాళులర్పించిన అనరంతరం చిరంజీవి మాట్లాడుతు..ఆయన మరణంతో ఆప్యాయంగా పలకరించే ఓ మంచి మిత్రుడు అకాలంగా మరణించటం చాలా బాధాకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ కనిపించినా సరదాగా జోకులు వేసే హరికృష్ణ ఇక కనిపించరంటే చాలా బాధగా వుందన్నారు. కాగా చిరంజీవి వెంట ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.  ఇప్పటికే హరికృష్ణకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. 

18:17 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ణ మృతి దురదృష్టకరమని..ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయామని టీడీపీ ఎంపీ మురళీమోహన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ చైతన్య యాత్రలో కీలక పాత్ర పోషించిన సేపెస్ట్ రథ సారథి హరికృష్ణ మృతి చెందటం బాధాకరమన్నారు. రాత్రిపగళ్లు వేలాది కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపిన సేఫెస్ట్ సారధిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ట వున్న సయమంలో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేసారని ఆయన తెలిపారు. హరికృష్ట ఆత్మకు శాంతికలగాలని..ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. 

18:08 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ణ అంతిమయాత్ర స్వర్గీయ ఎన్టీర్ ఎన్నికల రథంగా ఉపయోగపడిన చైతన్యరథంలోనే హరికృష్ణ అంతిమయాత్ర రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో జరగనున్నాయని వార్తలు వచ్చాయి. అయితే..ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగడం లేదు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఆయన అంతిమయాత్ర కోసం చైతన్య రథం సిద్ధమవుతోంది. 

16:35 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల ఏపీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో హరికృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యేగా పని చేసిన హరికృష్ణ... అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని అన్నారు. శ్రీరాములయ్య సినిమాలో సత్యం క్యారెక్టర్ లో మీరు నటించాలని హరికృష్ణ అడగ్గానే... ఆయన ఒప్పుకుని, సినిమాలో నటించారని చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని సునీత అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారని తెలిపారు. పరిటాల రవి, హరికృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. 

16:31 - August 29, 2018
16:30 - August 29, 2018

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ హరికృష్ణ పార్ధీవదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతు..హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్రం అధికార లాంఛనాలతో జరిపించేందుకు వారి కటుంబ సభ్యులతో సంప్రదించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామనీ..దీనికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. హరికృష్ణ మృతి బాధాకరమన్నారు. 

16:25 - August 29, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, నటుడు అయిన హరికృష్ణకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ట నివాసానికి చేరుకుని గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని వ్యక్తంచేశారు. గత కొంతకాలం క్రితం హరికృష్ణ పెద్ద కుమారుడు మోహన్ కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు హరికృష్ణను పరామర్శించేందుకు వచ్చాననీ..ఇప్పుడు ఆయన మృతి చెందిన తరువాత రావటం విచారించదగిన విషయమని నరసింహన్ పేర్కొన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ చైతన్యరధానికి కృష్ణుడిలా రథసారధిగా వ్యవహరించాడని గవర్నర్ గుర్తుచేశారు.

కాసేపట్లో హరికృష్ణకు గవర్నర్ నివాళి..

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, నటుడు అయిన హరికృష్ణకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివాళులర్పించనున్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ట నివాసానికి చేరుకుని గవర్నర్ నరసింహన్ నివాళులర్పించున్నారు. కాగా ఇప్పటికే సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

హరికృష్ణకు కేసీఆర్ నివాళి..

హైదరాబాద్ : హరికృష్ణ పార్ధీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా మెహిదీపట్నం నుండి సాయంత్రం 5 గంటలకు హరికృష్ణ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించనున్నారు. కాగా ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో నటుడు హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. 

15:15 - August 29, 2018

నల్లగొండ : కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే స్పృహలో లేరనీ..తీవ్ర రక్తస్రావంతోనే ఆయన మృతి చెందారని కామినేని మెడికల్ సూపరిండెంటెండ్ డాక్టర్ లూథర్ తెలిపారు. ప్రమాదంలో హరికృష్ణ తల, చాతి, పొత్తికడుపులకు తీవ్రంగా గాయాలయ్యాయనీ డాక్టర్ లూథర్ తెలిపారు. ఆయనను బతికించేందుకు తాము తీవ్రంగా యత్నించామనీ..తలకు తీవ్రగాయం కావటం..రక్తస్రావం కావటంతో తమ ప్రయత్నాలు ఫలించలేదని డాక్టర్ లూథర్ తెలిపారు. 

15:03 - August 29, 2018

హైదరాబాద్ : హరికృష్ణకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యేగా..ఎంపీగా..మంత్రిగా కూడా రాజీకీయాల్లో పలు విధుల్లో హరికృష్ణ అంకితభావంతో పనిచేసారని..తాను ఎంపీగా వున్న సమయంలో హరికృష్ణతో తనకు మంచి స్నేహభావం వుండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటు ఆయన కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తంచేశారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు సంతాపాన్ని వ్యక్తంచేశారు. హరికృష్ణ మృతితమను షాక్ కు గురిచేసిందనీ..చిన్న పిల్లలను కూడా ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారి నటులు శివాజీరాజా, ఏడిద శ్రీరాం, బెనర్జీ గుర్తు చేసుకుని హరికృష్ణ కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. 

15:02 - August 29, 2018

హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ, పొలిట్ బ్యూరో సభ్యులుగా సేవలు చేసిన హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో అటు కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకోనని సన్నిహితులతో అయన తెలిపినట్లుగా తెలుస్తోంది. మన తోటి మనుష్యులు కష్టాల్లో వున్నప్పుడు జన్మదినం వేడుకలు జరుపుకోవటం సరికాదనీ..తన మిత్రులు, శ్రేయోభిలాషులు తన పుట్టినరోజు వేడుకల ఖర్చును వరద బాదితులకు వినియోగించాలని హరికృష్ణ తెలిపారని ఆయన సన్నిహితులు తెలిపారు. 

ఎన్టీఆర్ కు హరికృష్ణ అంత్యంత ఇష్టుడు : చంద్రబాబు

హైదరాబాద్ : మాజీ దివంగత నేత, మాజీ సీఎం అయిన ఎన్టీఆర్ కు హరికృష్ణ అంత్యంత ఇష్టుడు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన చైతన్య రథానికి రథసారధిగా హరికృష్ణ అత్యంత బాధ్యతతో వ్యవహరించేవారనీ..వేలాది కిలోమీటర్లు స్వయంగా డ్రైవ్ చేసిన ఎన్టీఆర్ ను హరికృష్ణ ప్రజలకు చేరువచేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. హరికృష్ట ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా..హరికృష్ణ ఎనలేని సేవలు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ నిరాడంబరుడే కాదు నిగర్వి కూడాననీ స్నేహానికి మారుపేరుగా హరికృష్ణ వుండేవారని చంద్రబాబు పేర్కొన్నారు.

14:27 - August 29, 2018

హైదరాబాద్ : మాజీ ఎంపీ, నటుడు అయిన నందమూరి హరికృష్ణ పార్ధీవదేహాం ఆయన స్వగృహానికి తరలించారు. ప్రమాదం అనంతరం చికిత్స కోసం నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మృతి చెందిన హరికృష్ణ పార్దీవదేహాన్ని పోస్టుమార్టం అనతరం మెహిదీపట్నంలోని ఆయన స్వగృహానికి తరలించారు. హరికృష్ణ పార్దీవదేహం వెంట సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెంట వున్నారు. కాగా రేపు అంటే గురువారం నాడు మొయినాబాద్ లోని హరికృష్ణ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. కాగా హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హరికృష్ణకు నివాళులర్పించారు. 

అతివేగంతోనే హరికృష్ణ మృతి : ఎస్పీ

నల్లగొండ : హరికృష్ణ మృతికి కారు అతి వేగంతో డ్రైవ్ చేయటమే కారణమని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కారు డ్రైవ్ చేసే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రాణాలు పోవటానికి కారణమనీ..బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశముండేదని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వాటర్ బాటిల్ వెనక్కి తిరగటంతో వాహనం అదుపు తప్పిందని..డివైడర్ ను ఢీకొని 15 మీటర్ల దూరంలో వాహనం ఎగిరిపడిందని..ఈ క్రమంలో డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. డ్రైవింగ్ సమయంలో కారు 160. కి.మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని తెలిపారు. 

మొయినాబాద్ లో అధికారికంగా హరికృష్ణ అంత్యక్రియలు ..

హైదరాబాద్ : అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిపించాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సంప్రదించి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా హరికృష్ణ అంత్యక్రియలను మొయినాబాద్ లోని గెస్ట్ హౌస్ ప్రాంగంణంలో రేపు అంటే గురువారం జరిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

13:42 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతికి సిని, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియచేశారు. గురువారం మెహిదీపట్నంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా అన్నేపర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కు తరలించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు.

ఈ సందర్భంగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ మెహిదీపట్నంకు వెళ్లనున్నారు. అక్కడ హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంసభ్యులను పరామర్శించనున్నారు. 

హరికృష్ణ నివాసానికి కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెహిదీపట్నం వెళ్లనున్నారు. అక్కడ హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. 

13:35 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఎందరినో కలిచి వేసింది. నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన రాజ్యసభలో చేసిన స్పీచ్ ను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తెలుగులో ప్రసంగించారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హిందీలో మాట్లాడాలని డిప్యూటి ఛైర్మన్ పేర్కొన్నా...హిందీలో మాట్లాడే అవకాశం ఉన్నా..ఆయన మాత్రం తెలుగులోనే మాట్లాడుతానని పట్టుబట్టారు. విభజనను వ్యతిరేకించిన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వం నుంచి ఆయన తప్పుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం రోజునే హరికృష్ణ మృతి ఘటన దురదృష్టకరమని టీడీపీపీ పేర్కొంది.

13:19 - August 29, 2018

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వెస్ట్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద పోలీసులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు టెన్ టివితో మాట్లాడారు. నార్కట్ పల్లి నుండి భౌతికకాయం తరలిస్తున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడకు చేరుకున్నారన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:09 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు మృతదేహాన్ని తరలించారు. ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి లోకేష్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ కూడా ఉన్నారు. అప్పటికే ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుపాటి పురంధేశ్వరీ, ఎమ్మెల్యే బాలకృష్ణ, తదితర సినీ ప్రముఖులు చేరుకున్నారు.

మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి మృతదేహాన్ని తరలిస్తున్నారు. పార్థీవ దేహం వెంట సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లున్నారు. మృతదేహానికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మెహిదీపట్నంకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

12:54 - August 29, 2018

మెహిదీపట్నం నివాసానికి హరికృష్ణ భౌతికకాయం...

హైదరాబాద్ : నల్గొండ నుండి కామినేని ఆసుపత్రి నుండి హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మెహిదీపట్నం నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతికి సిని, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియచేశారు. గురువారం ముర్తుజగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

'అమ్మా' అని పిలిచేవాడు - లక్ష్మీ పార్వతి...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అకాల మృతిపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని, తనను నోరారా అమ్మా అని పిలిచేవాడని తెలిపారు.

12:24 - August 29, 2018

హరికృష్ణ భౌతికకాయం తరలింపు...

నల్గొండ : నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాసేపటి క్రితం హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. 

12:15 - August 29, 2018

హైదరాబాద్ : నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మృతదేహాన్ని నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరీ, భువనేశ్వరీ తదితరులు ఆసుపత్రికి తరలించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రత్యేక హెలికాప్టర్ లో నార్కట్ పల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద భారీగా ఎన్టీఆర్ అభిమానులు, హరికృష్ణ అభిమానులు, టిడిపి నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కు తరలించనున్నారు. బాబు వచ్చిన తరువాతే పోస్టుమార్టం నిర్వహించినట్లు సమాచారం. గురువారం మొయినాబాద్ ఫాం హౌజ్ లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 

హరికృష్ణ భౌతికాయానికి పోస్టుమార్టం...

నల్గొండ : హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో వైద్యులు పోస్టమార్టం పూర్తి చేశారు. 

గురువారం హరికృష్ణ అంత్యక్రియలు...

హైదరాబాద్ : సినీ నటుడు, నిర్మాత, టిడిపి నేత హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

11:26 - August 29, 2018
11:21 - August 29, 2018

నల్గొండ : నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని ఉంచిన నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు, టిడిపి శ్రేణులు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుకున్నాయి. పోలీసులు ఒక సందర్భంలో లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలై కన్నుమూశారు.

విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు నల్గొండ జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చేరుకున్నారు. నటుడు బాలకృష్ణ, పురంధేశ్వరీ, భువనేశ్వరీ, దర్శకుడు తివిక్రమ శ్రీనివాస్ లు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ కు తరలించనున్నట్లు, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నల్గొండకు చేరుకున్న బాబు..లోకేష్..బాలకృష్ణ...

నల్గొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

10:42 - August 29, 2018

హైదరాబాద్ : నటుడు, నిర్మాత, టిడిపి నేత హరికృష్ణ మృతి పలువురిని కలిచివేసింది. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కామినేని ఆసుపత్రిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఇదిలా ఉంటే ఆయన రాసిన లేఖ బయటపడింది. తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'సెప్టెంబర్ 2వ తేదీన 62వ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపవద్దు. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రులయ్యారు. ఇది మన అందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. ఇందుచేత జన్మదిన సందర్భంగా బేనరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్చాలు, దండలు తీసుకరావద్దని, వీటికి అయ్యే ఖర్చు వరదలు..వర్షాలతో నష్టపోయిన వారి కుటుంబాలకు అందచేయాలని కోరుతున్నా. అంతేగాకుండా నిరాశ్రుయలయిన వారికి దుస్తులు, వంట సామాగ్రీ, నిత్యావసర వస్తువులు శక్తి కొలది అందచేయాలని కోరుతున్నా' అంటూ హరికృష్ణ లేఖ రాశారు. 

10:39 - August 29, 2018

విజయవాడ : నటుడు, నిర్మాత, టిడిపి నేత హరికృష్ణ మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయని తెలుసుకున్న బాబు మెరుగైన వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కామినేని ఆసుపత్రి యాజమాన్యంతో బాబు మాట్లాడారు. కానీ కాసేపటికే హరికృష్ణ ఇక లేరని తెలుసుకున్న బాబు షాక్ కు గురయ్యారు. వెంటనే తన అధికారిక కార్యక్రమలన్నీ రద్దు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో జరిగే మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ వేడుకకు బాబు వెళ్లడం లేదు. నల్గొండ జిల్లాకు వెళ్లేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పడంతో వారు ఆ విధమైన ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్ లు నల్గొండ జిల్లాకు బయలుదేరారు. వెళ్లేముందు అక్కడ జరగాల్సిన ఏర్పాట్లు..తదితర వివరాలపై అధికారులతో మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:23 - August 29, 2018

హైదరాబాద్ : నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి నేత హరికృష్ణ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కొద్దిసేపట్లోనే దావానంలా వ్యాపించింది. దీనితో ఆయన నివాసానికి భారీగా అభిమానులు, కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కాసేపటి క్రితం చేరుకున్నారు. పురంధేశ్వరీ, భువనేశ్వరీలు నివాసానికి చేరుకుని నేరుగా కామినేని ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో టిడిపి నేత రావుల మాట్లాడారు. హరికృష్ణ మృతి తీరని లోటని అభివర్ణించారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందని, టిడిపి శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎనలేని కృషి చేశారని తెలిపారు. 

నార్కట్ పల్లి వద్ద ఉద్రిక్తత...

నల్గొండ : నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి నేత హరికృష్ణ భౌతికకాయాన్ని ఉంచిన నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరీలు ఆసుపత్రికి చేరుకున్నారు. 

10:09 - August 29, 2018

విజయవాడ : ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ ముక్కుసూటిగా వ్యవహరించే వారని పలువురు పేర్కొంటుంటారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ హరికృష్ణ 2013 ఆగస్ట్‌ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న హరికృష్ణ ముక్కుసూటిగా మాట్లాడుతారని పలువురు పేర్కొంటుంటారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

విషాదంలో మునిగిన నిమ్మకూరు...

కృష్ణా : నిమ్మకూరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ మృతి చెందడం పట్ల పలువురు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా స్వస్థలం నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నిమ్మకూరులో రూ. 1.35 కోట్లతో రోడ్ల నిర్మాణం, గ్రామంలో కోటి రూపాయలతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు, ఏపీఆర్జేసీ స్కూల్ ని 50 లక్షలతో అభివృద్ధి చేశారు. 

09:46 - August 29, 2018

హైదరాబాద్ : ఎన్టీరామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి హరికృష్ణ అని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటికైనా తెగిస్తారని హరికృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. హరికృష్ణ మృతిపై ఆయన సంతాపం తెలియచేశారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఆయన మృతి పార్టీకి వ్యక్తిగతంగా తీరని లోటని అభివర్ణించారు.

ఎన్టీఆర్ కు కుడి భుజం హరికృష్ణ - నడింపల్లి...
నందమూరి ఎన్టీరామారావుకు అత్యంత ప్రియుడు హరికృష్ణ అని, ఆయన మాట అంటే వేదంగా ఎన్టీరామారావు భావించే వాడని ప్రముఖ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పలుమార్లు కోరినా పాలకులు స్పందించకపోవడంపై ఆయన బాధ పడ్డారని పేర్కొన్నారు.

తీరని ఆవేదన - కేఈ...
నందమూరి హరికృష్ణ మృతి చెందడం చాలా బాధాకరమని, ఏమి చెప్పాలో తెలియడం లేదని ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన టెన్ టివితో తెలిపారు. రాయలసీమపై ప్రత్యేకంగా ప్రేమ ఉండేదని..హిందూపురం నుండి పోటీ చేసి గెలుపొంది...మంత్రిగా పనిచేశారని తెలిపారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన హరికృష్ణ మృతి పార్టీకి, రాయలసీమకు తీరని లోటని అభివర్ణించారు. 

బర్త్ డే సందర్భంగా హరికృష్ణ లేఖ...

హైదరాబాద్ : పుట్టిన రోజుల వేడుకలపై అభిమానులకు ఒక లేఖ రాయాలని హరికృష్ణ ఆలోచించారు. సెప్టెంబర్ 2న జరిగే తన 63వ పుట్టిన రోజు వేడుకలు వద్దని లేఖలో రాసుకున్నారు. పుట్టిన రోజు వేడుకలకు అయ్యే ఖర్చును కేరళ వరద బాధితులకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

హరికృష్ణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం...

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

షాక్ తిన్నా బాబు...

విజయవాడ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని షాక్ కు గురయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతం వ్యక్తం చేశారు. 

నందమూరి హరికృష్ణ జీవిత విశేషాలు...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు. ఒకరు లక్ష్మీ కాగా మరొకరు శాలిని. హరికృష్ణకు ముగ్గురు కుమారులుండగా (జానకీ రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్), ఒక కుమార్తె (సుహాసిని) ఉంది. కుమారులు. నందమూరి వారసుడిగానే కాకుండా హరికృష్ణ వ్యక్తిగతంగా ఎదిగారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణ డ్రైవర్ గా వ్యవహరించారు. హరికృష్ణకు కుటుంబమంటే అమితమైన ప్రేమ. అందులో కుమారులంటే మరింత ప్రేమ.

 

సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టిన రోజు...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. మరికొద్ది రోజుల్లో 63వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన హరికృష్ణ మృతి చెందడం పలువురిని కలిచివేస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు.

09:23 - August 29, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి రాజకీయ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందడం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాల పాలైన హరికృష్ణ నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఆయన జీవిత గమనాన్ని నేతలు నెమరు వేసుకుంటున్నారు. ఎన్టీరామారావుతో ఎంతో సానిహిత్యంగా ఉండేవాడని, ఆయన ప్రారంభించిన చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన నిర్వహించిన పాత్ర ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. హరికృష్ణ ఒక మొండి మనిషి..భోళాశంకరుడని టిడిపి నేతలు అభివర్ణిస్తుంటారు. సీతయ్య ఎవరి మాట వినడనే రీతిలో వ్యవహరించేవాడని...ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజీనామా చేసి తెలుగులో ప్రసంగించిన సంగతి తెలిసిందే.

2004లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జూ.ఎన్టీఆర్ ప్రమాదానికి గురై తృటిలో మృత్యువాత నుండి బయటపడ్డారు. కానీ జానకీ రామ్ మాత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడం కుటుంబసభ్యులను కలిచివేస్తోంది. 

భోరున విలపించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు...

నల్గొండ : కారు ప్రమాద వార్తను తెలుసుకున్న ఎన్టీఆర్, తన సోదరుడు కల్యాణ్ రామ్ తో కలసి హుటాహుటిన నార్కట్ పల్లి ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. దీనితో తండ్రి మృతదేహం వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు భోరున విలపించారు.

09:14 - August 29, 2018

నల్గొండ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని అన్నేపర్తి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా హరికృష్ణ కారును నడుపుతూ ఉండటం, సీటు బెల్టు పెట్టుకో లేదని సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత కారు పల్టీలు కొట్టినట్లు, హరికృష్ణ కారులోంచి కిందపడినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. తలకు బలమైన గాయమై మెదడు చిట్లిందని సమాచారం. కామినేని ఆసుపత్రికి తరలించగా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:58 - August 29, 2018

విజయవాడ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో కుటుంబంలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు నార్కట్ పల్లికి బయలుదేరారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి లోకేష్ లు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు పయనమయ్యారు.

హరికృష్ణ ఇక లేరన్న విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సాదాసీద జీవితం గడిపారని..ఎవరైనా మృతి చెందితే మొదటగా వెళ్లేంది హరికృష్ణనేని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. లక్ష్మీ పార్వతితో విబేధాలు రావడంతో చంద్రబాబు నాయుడు వద్ద చేరి పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ్యులుగా పార్టీ నియమించింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయన రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. 

08:19 - August 29, 2018

నల్గొండ : నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతి చెందారు. అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందారు. హైదరాబాద్ నుండి గుంటూరుకు వెళుతున్న హరికృష్ణ అన్నేపర్తి వద్ద టర్నింగ్ వద్ద ప్రమాదం ఎదురైంది. డివైడర్ ను ఢీకొన్న కారు ఐదు పీట్ల ఎత్తుకు లేచింది. కారులో ఉన్న హరికృష్ణ రోడ్డుకు అవతలి వైపున ఉన్న కల్వర్టులో పడిపోయారు. దొర్లుకుంటూ పొదల్లో హరికృష్ణ పడిపోయారు. స్థానికంగా ఉన్న వారు దీనిని గమనించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కానీ హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడం..రక్త స్రావం కావడంతో చికిత్సకు సహకరించలేదు. దీనితో ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు కామనేని ఆసుపత్రికి బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరారు.

నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు వెంటాడుతాయనే చెప్పవచ్చు. 2009 ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్ చనిపోయారు. ప్రమాదాలన్నీ విజయవాడ హైవేపైనే కావడం గమనార్హం. 

1956లో జన్మించిన నందమూరి హరికృష్ణ...

నల్గొండ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 1956 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. రాజకీయ నేతగా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా రాణించారు. తెలుగుదేశంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇతనికి జానకీ రామ్, కల్యాణ్ రామ్, నందమూరి సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ లు సంతానం. జానకీ రామ్ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. 

08:00 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హరికృష్ణ ఇకలేరు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నందమూరి హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను ఆసుపత్రికి తరలించారు. కానీ తలకు తీవ్ర గాయాలు కావడం..రక్తస్రావం కావడంతో చికిత్సకు సహకరించలేదు. దీనితో ఆయన తుదిశ్వాస విడిచారు. దీనిని వైద్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009 ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్ చనిపోయారు. ప్రమాదాలన్నీ విజయవాడ హైవేపైనే కావడం గమనార్హం.

నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. రాజకీయ నేతగా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా రాణించారు. తెలుగుదేశంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇతనికి జానకీ రామ్, కల్యాణ్ రామ్, నందమూరి సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ లు సంతానం. జానకీ రామ్ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. 

తీవ్ర విషాదంలో నందమూరి ఫ్యామిలీ...

హైదరాబాద్ : నందమూరి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నందమూరి హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

నందమూరి హరికృష్ణ కన్నుమూత...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి - నార్కెట్ పల్లి రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

హరికృష్ణ ప్రమాదంపై బాబు ఆరా...

విజయవాడ : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం బాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

హైదరాబాద్ కు బాబు..లోకేష్...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు హైదరాబాద్ కు రానున్నారు. నల్గొండ జిల్లాలో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. 

హరికృష్ణ పరిస్థితి విషమం - ఎస్పీ రంగనాథ్...

నల్గొండ : హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. హరికృష్ణ చికిత్సకు అందించడం లేదని, ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారన్నారు. హరికృష్ణ తలకు బలమైన గాయమయ్యిందని పేర్కొన్నారు. 

07:24 - August 29, 2018

నల్గొండ : నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళుతున్నారు. స్వయంగా కారును హరికృష్ణ నడుపుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు అన్నేపర్తి వద్ద హరికృష్ణ వాహనం అదుపుతప్పింది. డివైడర్ దాటి అవతల రోడ్డులో మరో వాహనాన్ని హరికృష్ణ వాహనం ఢీకొట్టింది. దీనితో హరికృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009 ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్ చనిపోయారు. ప్రమాదాలన్నీ విజయవాడ హైవేపైనే కావడం గమనార్హం. 

నందమూరి హరికృష్ణకు ప్రమాదం...

నందమూరి హరికృష్ణ కారుకు ప్రమాదం జరిగింది. హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయని..ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హరికృష్ణను నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళుతున్నారు. స్వయంగా కారును హరికృష్ణ నడుపుతున్నారు. 

06:53 - August 29, 2018

తెలంగాణలో మత్స్యకార్మికులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం మత్స్య భవన్‌ ముందు మహాధర్న కార్మక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లతో మత్స్యకార్మికుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి లేకుండా చూడాలని దళారీ వ్యవస్థ పాత్ర తగ్గించాలని మత్స్య సొసైటీలకు చేపల పంపిణీ కోసం బ్యాంకుల్లో నగదు జమ చేయాలని తదితర డిమాండ్లతో వాళ్లు ఆందోళనబాట పట్టారు. వారి డిమాండ్లు.. ప్రభుత్వ విధానంపై మనతో చర్చించేందుకు తెలంగాణ మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:51 - August 29, 2018

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత రన్నర్లు సత్తా చాటారు. 800 మీటర్ల పరుగు పందెంలో మంజీత్‌ సింగ్‌ స్వర్ణం సాధించాడు. మరో స్ర్పింటర్‌ జిన్సన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. దీంతో బ్యాడ్మింటన్‌ తర్వాత ఒక పోటీలో భారత్‌కు రెండు పతకాలు వచ్చినట్టైంది. రేసుకు ముందు జాన్సన్‌ ఫేవరెట్‌. అతడిని దాటేసి మంజీత్‌ 1 నిమిషం 46.16 సెకన్లలో పరుగును పూర్తి చేశాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ కూడా ఇదే.

 

06:49 - August 29, 2018

విజయవాడ : ప్రభుత్వ తల్లీపిల్లల ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో పడకలకు విపరీతమైన కొరత ఏర్పడగా.. ఒకే బెడ్‌పై ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలను ఉంచుతున్నారు. ఈ క్రమంలో కొత్తపేటకు చెందిన బాలింత స్వాతి బెడ్‌పై నుంచి పడి మృతి చెందింది. నిన్ననే ఓ శిశువుకు జన్మనిచ్చిన స్వాతి.. బెడ్‌పై అసౌకర్యంగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. బెడ్‌పై నుంచి కిందపడి స్వాతి కొట్టుకుంటున్నా సిబ్బంది పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే స్వాతి చనిపోయిందంటూ... ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. 

06:47 - August 29, 2018

చిత్తూరు : తిరుపతి బర్డ్‌ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. ఓ రోగికి ఒక కాలికి చేయాల్సిన చికిత్స మరో కాలికి చేశారు. ఈ విషయం టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ తనిఖీల్లో బయటపడింది. దీంతో వైద్యుడిని సస్పెండ్‌ చేయాలని టీటీడీ చైర్మన్‌ ఆదేశించారు. బాధితుడు నరసింహులు కడప జిల్లా సరస్వతిపేట వాసి. 

06:46 - August 29, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో సమావేశమైన పాలకమండలి... అమరావతిలో నిర్మించతలపెట్టిన శ్రీవారి ఆలయానికి నిధులను ఆమోదించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారంతో పాటు.. శ్రీవేంకటేశ్వరతత్వాన్ని మరింత విశ్వవ్యాప్తంగా చేసేందుకు కసరత్తు చేపట్టింది.

తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌, కమిషనర్‌ డా.ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు హాజరయ్యారు. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి నూతన ఆలయానికి రూ.150 కోట్లు మంజూరు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అలాగే రూ.79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇక సనాతన ధర్మ ప్రచారంతో పాటు శ్రీవేంకటేశ్వరతత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా 2,200 టీటీడీ ఆధ్యాత్మిక ప్రచురణలను ఏపీలోని 142 గ్రంధాలయాలకు ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించారు.

ఇక 2015లో సవరించిన పీఆర్‌సీ ప్రకారం టీటీడీ రవాణా విభాగంలో పని చేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్లకు రూ.15 వేల నుంచి రూ.24 వేలు.. క్లీనర్లకు రూ.18 వేలు వేతనం పెంచారు. అలాగే తిరుమలలో ఫాస్ట్‌ ఫుడ్, హోటల్స్‌లో అధిక రేట్ల నియంత్రణకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృ‌హాన్ని ఏపీ టూరిజంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కల్యాణమండపాల నిర్వహణకు రూ.35 కోట్లు కేటాయించారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ భవనాల కాంట్రాక్టును మరో 3 సంవత్సరాలు పొడిగించారు. రాబోవు 6 నెలల్లో నూతనంగా కళ్యాణ మండపాలు మంజూరు చేయబోమని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. 

06:44 - August 29, 2018

నెల్లూరు : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2న విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం చోడవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సూచించిన చోటు నుంచే పోటీ చేస్తానన్నారు ఆనం రామనారాయణ రెడ్డి.

ఇప్పటికే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయిన ఆనం.. వైసీపీలో చేరికపై చర్చించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిలతో చర్చించి.. తనతో ఎవరెవరు వచ్చేది వివరించారు. కాగా.. ఆనంతో .. ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. తన అన్న కుమారులు ఆనం రంగమయూర్ రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి ఆనం రాంనారాయణరెడ్డితో వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏసీ సుబ్బా రెడ్డి జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. అలాగే రాంనారాయణరెడ్డి తమ్ముడు ఆనం విజయకుమార్ రెడ్డి ఇప్పటికే వైసీపిలో ఉండగా.. మరో సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అటు టీడీపీ జిల్లా అధిష్ఠానం కూడా ఆనం వెంట వెళ్లే వారిని అడ్డుకుంటోంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున ఆనం వైసీపీలో చేరతారన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ ఆనం వైసీపీ అధినేత ముందుంచిన డిమాండ్ల వల్లే ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గ టికెట్‌, మంత్రి పదవితోపాటు.. నెల్లూరు మేయర్ అభ్యర్థి ఎంపికలో కూడా తన ప్రాధాన్యం ఉండాలన్న డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. దీనికి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ నేతలు బాలినేని, సజ్జల రామ కృష్ణారెడ్డితో కలిసి ఆనం సుమారు గంటసేపు జగన్‌తో చర్చించాకే ఆనం చేరికపై స్పష్టత వచ్చింది. క్యాడర్‌తోపాటు.. అనుచరగణంతో వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు ఆనం. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి లేదా.. ఆత్మకూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . మొత్తానికి ఆనం రాకతో జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

06:41 - August 29, 2018

గుంటూరు : రాష్ట్రాభివృద్ధిని ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌ అడ్డుకుంటున్నారని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని మోదీకి జగన్‌ వంతపాడుతున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసమే మోదీని విమర్శించకుండా... ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడటే జగన్‌ పనిగా పెట్టుకున్నారని గుంటూరులో జరిగిన నారా హమారా - టీడీపీ హమారా సభలో లోకేశ్‌ మండిపడ్డారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆధారాలుంటే నిరూపించాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిశారు. నాలుగేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించిన పవన్‌.. ఇప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని గుంటూరులో జరిగిన నారా హమారా - టీడీపీ హమారా సభలో లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 

06:39 - August 29, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 11 మంది కలెక్టర్లు ఉన్నారు. వరంగల్‌ నగర కలెక్టర్‌ అమ్రపాలిని బదిలీ చేసిన సర్కార్‌.. ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. మంచిర్యాలకు ఎవరినీ నియమించలేదు. హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణాను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రత్యేకాధికారి ఎం.హన్మంతరావును సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావును హైదరాబాద్‌ కలెక్టర్‌గా,... ఖమ్మం జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అలాగే కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ ప్రశాంత్‌జీవన్‌ను... అమ్రపాలి స్థానంలో వరంగల్‌ నగర కలెక్టర్‌గా బదిలీ చేశారు. సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను సిద్దిపేటకు.. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని రాజన్న సిరిసిల్లకు బదిలీ చేశారు. ఇక భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు... మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లను జయశంకర్‌ భూపాలపల్లికి బదిలీ చేయగా... జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. అయితే... మరికొంతమంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ఈరోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఐపీఎస్‌లనూ కూడా భారీ ఎత్తున బదిలీ చేసే అవకాశం ఉంది.

06:37 - August 29, 2018

హైదరాబాద్ : ముందస్తుకు టీ-పీసీసీ సిద్దమవుతోంది. వరుస మీటింగ్‌లు, ప్రభుత్వ టార్గెట్‌ సభలు నిర్వహించి.. కేడర్‌ను ముందస్తుకు సమాయత్తం చేయాలని నిర్ణయించారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో.. సభల ద్వారా ప్రజల ఆవేదనను వినిపించాలని కాంగ్రెస్‌ వ్యూహం రచిస్తోంది. తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి పెరిగింది. పార్టీలు త‌మ ఫ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. అధికార పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తుందన్న వార్తల నేపథ్యంలో అన్నీ పార్టీలు అల‌ర్ట్ అయ్యాయి. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. సిద్దమని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అంతే స్పీడ్‌గా అడుగులు వేస్తోంది.

గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశాలలో ముందస్తుపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. ఒకవేళ ముందస్తు వస్తే పార్టీ ఎలా వ్యవహరించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు... పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు. సాధ్యమైనంత త్వరగా ప్రచార, మేనిఫెస్టో, ఎలక్షన్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాంట్రవర్సీ లేని చోట్ల అభ్యర్థులను ప్రకటించాలని.. మిగతా అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ సెలక్షన్‌ కమిటీని నియమిస్తామంటున్నారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.

ఇక సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ. నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు హస్తం నేతలు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో సభలను నిర్వహించి.. సోనియా, రాహుల్‌గాంధీలను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రగతి నివేదన సభకు ధీటుగా.. కేసీఆర్‌ పాలనలో ప్రజల ఆవేదనను సభల ద్వారా బయటపెట్టేందుకు సిద్దమవుతోంది టీ-పీసీసీ. నేతలందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని.. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో పాటు.. నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. మొత్తానికి ముందస్తుకు పార్టీలో కేడర్‌ను సమయాత్తం చేసేందుకు హస్తం పార్టీ సిద్దమైంది.

06:35 - August 29, 2018

హైదరాబాద్ : అధికార పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభతో ఆ రెండు మూడు గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో.. ఊహించని విధంగా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ప్రగతినివేదన సభతో ఇటు గులాబీ నేతల్లోనూ.. అటు రియల్టర్లలోనూ జోష్‌ కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ.. సమీప గ్రామస్తుల్లో సంతోషం నింపుతోంది. పెద్దగా గుర్తింపు లేని ప్రాంతం.. ఈ సభతో రాష్ర్ట వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అభివృద్ధి ఊసే లేని గ్రామాల్లో భారీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. నాలుగైదు రోజులుగా జరుగుతున్న అభివృద్ధి పనులతో ఆయా గ్రామస్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఔటర్‌ రింగురోడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగర కలాన్‌కు.. వెళ్ళేందుకు 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు దాని దశ తిరిగి.. వంద అడుగుల రహదారిగా మారింది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులతో.. ఓఆర్‌ఆర్‌ను తలపిస్తోంది.. ఇండ్రస్టీయల్ పార్కు కూడా ఉండడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గతరోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారని మాజీ సర్పంచ్ అశోక్ అంటున్నారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతినివేదన సభను విజయవంతం చేయాలని చూస్తోంది అధికార టీఆర్ఎస్. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు... తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. సభకు భారీగా ప్రచారం కల్పించే వ్యూహాన్ని అధికార పార్టీ అమలు చేస్తోంది. దీంతో పెద్దగా గుర్తింపులేని కొంగరకలాన్ ప్రాంతం అందరి నోళ్లలో నానుతోంది. ప్రగతినివేదన సభ టీఆర్ఎస్‌ నేతలతోపాటు.. రియల్టర్లలోను జోష్‌ పెంచింది. ఆదిబట్లలో పారిశ్రామిక అభివృద్ధితో ఇప్పటికే జోరుమీదున్న రియల్ ఎస్టేట్‌ వ్యాపారం.. ఈ సభతో మరింత ఊపందుకుంటుదన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు రియల్టర్లు. ఇప్పటికే ఇక్కడ ప్రారంభించిన వెంచర్లకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మొత్తానికి అధికార పార్టీ నిర్వహిస్తున్న సభ పుణ్యమా గ్రామాల అభివృద్ధితోపాటు.. రియల్ బూమ్‌కు బాటలు పడ్డాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

06:32 - August 29, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ హత్య కుట్ర కేసులో అరెస్ట్‌ చేసిన విరసం నేత వరవరరావును.. పోలీసులు ఈరోజు పుణె కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు నిర్వహించి... అనంతరం అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సూచనల మేరకు పుణె తరలించారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు చేసిన పోలీసుల.. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే తమను ఏడు గంటల పాటు నిర్బంధించి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వరవరరావు సతీమణి హేమలత ఆరోపించారు. కనీసం మంచినీళ్లు, టీ కూడా తాగేందుకు అనుమతివ్వలేదన్నారు. ఇక వరవరరావుపై పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దేశంలో ఐదుగురిపై మాత్రమే ఈ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్‌లో ఉన్న సెక్షన్‌ 15, 16, 17 కింద కేసు నిరూపితమైతే టెర్రరిస్ట్‌గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపులంటున్నారు. 

వరవరరావు అరెస్టును ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ నేతలు ఖండించారు. వరవరరావుపై కుట్రపూరిత కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వరవరరావుపై తప్పుడు అభియోగాలు మోపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వరవరరావు గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.  మూడు నెలల కింద దొరికిన లేఖను ఇప్పుడు ప్రస్తావించి పోలీసులు అరెస్ట్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధర్నా...

హైదరాబాద్ : నేడు ఓయూ ఎన్ సీసీ గేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగనుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ విద్యార్థుల ఫెలోషిప్స్ స్కాలర్ షిప్ ల కేటాయింపులో కేంద్ర నిర్లక్ష్య వైఖరిపై నిరసన చేపట్టనున్నారు. 

భూమా అఖిల ప్రియ వివాహం...

కర్నూలు : నేడు ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహం జరుగనుంది. ఆళ్లగడ్డలో జరిగే ఈ వివాహ వేడుకలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొననున్నారు. 

అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనలు...

హైదరాబాద్ : ఉదయం 11గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వరవరరావును అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం జరుగనుంది. కవులు, కళాకారులు, వామపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.

పూణే కోర్టుకు వరవరరావు...

ఢిల్లీ : వరవరరావును నేడు పూణే కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరచనున్నారు. ప్రధాన మంత్రి మోడీ హత్య కేసు కుట్రలో భాగంగా ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేడు వెబ్ కౌన్సెలింగ్...

హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు.

ఒక కాలికి చేయాల్సిన ఆపరేషన్ మరో కాలికి...

తిరుపతి : నగరంలోని బర్డ్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వాకం బయటపడింది. ఆసుపత్రికి వెళ్లిన రోగికి వైద్యులు ఒక కాలికి చేయాల్సిన ఆపరేషన్ మరో కాలికి చేశారు. రోగిని టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ పరామర్శించారు. వైద్యుడిని సస్పెండ్ చేయాలని బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ ను ఆయన కోరారు. బాధితుడు కడప జిల్లా సరస్వతిపేటకు చెందిన నరసింహులు. 

ఎమ్మెల్యే రామానాయుడుకు మాతృవియోగం...

పశ్చిమగోదావరి : పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుకు మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే రామానాయుడు తల్లి రమామాణి (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా రమామణి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రమామణికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. 

Don't Miss