Activities calendar

30 August 2018

21:36 - August 30, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా మణుగూరు ఎస్‌ఐ జితేందర్‌ రెచ్చిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పర్వీన్‌ను జితేందర్‌ చితకబాదాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలున్నాయి. వేరే మహిళతో జితేందర్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పర్వీన్‌కు భర్త రాసలీలల వీడియో లభించింది. భర్తతో వేరుగా ఉంటున్న పర్వీన్‌.. ఈ విషయంపై జితేందర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్‌ఐ పర్వీన్‌ను రక్తం కారేటట్లు చితకబాదాడు. చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఎస్‌ఐ... భార్యపైనే అరాచకంగా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 

21:26 - August 30, 2018

హైదరాబాద్ : కొత్త జోనల్‌ విధానం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కృషి ఫలించింది. తెలంగాణ నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెటిజ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కొత్త జోనల్‌ వ్యవస్థలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయి. మిగిలిన ఐదు శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు లభిస్తాయి. పోలీసు శాఖకు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ జోనల్‌ విధానం వర్తిస్తుంది. పోలీసు శాఖకు ప్రత్యేక జోన్లు వర్తింప చేస్తారు.
నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం..
కొత్త జోనల్‌ విధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపి కొత్త జోనల్‌ విధానం ఫైలుపై సంతకం చేసే విధంగా కృషి చేశారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీఅయి... జోనల్‌ విధానంపై చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం నూతన జోనల్‌ విధానానికి ఆమోదం తెలపడం.. ఆ వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

50 వేల పోస్టుల భర్తీకి సిద్ధమవుతున్న నోటిఫికేషన్లు

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటవుతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా... మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీ జోన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు జిల్లా స్థాయిలో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళ జోన్ విధానంలో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త జోనల్‌ విధానంలో జిల్లా, జోనల్‌, బహుళ జోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. నూతన జోనల్‌ విధానంలో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పోస్టులకు రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటేపడేవారు. కొత్త జోనల్‌ విధానంలో రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు ఉండవు. కేవలం పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 50 వేల ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు 4 నుంచి 10 తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఒకేచోట చవితే స్థానికత..
స్థానికులుగా పరిగణించేందుకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని కూడా మార్చారు. ఇప్పుడు 4 నుంచి 10వ తరగతి వరకు నాలుగేళ్లపాటు ఒకే ప్రాంతంలో చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. నూతన జోనల్‌ విధానంలో 1 నుంచి 7 తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు చదవితేనే స్థానికులు అవుతారు. జిల్లా, జోన్లు, బహుళ జోన్లు, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు. తెలంగాణలోని 31 జిల్లాలను ఏడు జోన్లలో చేర్చారు. మొదటి జోన్‌ కాళేశ్వరంలో భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో 28.29 లక్షల మంది జనాభా ఉన్నారు. రెండో జోన్‌ బాసరలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు వస్తాయి. సెకండ్‌ జోన్‌లో 39.74 లక్షల జనాభా ఉంది. మూడో జోన్‌ రాజన్నలో కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో 43.09 లక్షల మంది జనాభా ఉన్నారు. నాల్గవ జోన్‌ భద్రాద్రిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో 50.44 లక్షల జనాభా ఉంది. ఐదో జోన్‌ యాదాద్రిలో జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలను చేర్చారు. ఈ జోన్‌లో 45.23 లక్షల మంది జనాభా ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలతో ఏర్పాటైన చార్మినార్‌ జోన్‌లో అత్యధికంగా కోటి మూడు లక్షల మంది జనాభా ఉన్నారు. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో ఏర్పాటైన 7వ జోనల్‌లో 44.63 లక్షల జనాభా ఉంది. ఇక మొదటి బహుళ జోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు వస్తాయి. ఈ మల్టీ జోన్‌లో 1.61 కోట్ల మంది జనాభా ఉన్నారు. రెండో మల్లీజోన్‌లో యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లను చేర్చారు. ఈ బహుళ జోన్‌లో 1.88 కోట్ల జనాభా ఉంది. కొత్త జోనల్‌ విధానంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖకు ప్రత్యేక జోన్లు వర్తింప చేస్తారు. కాళేశ్వరం జోన్‌లో జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, కుమురం భీమ్‌ జిల్లాలతోపాటు రామగుండం పోలీసు కమిషనరేట్‌ వచ్చే అవకాశం ఉంది. బాసర జోన్‌లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలతోపాటు నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ చేరనుంది.రాజన్న జోన్‌లోకి కరీంనగర్‌, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లు, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు వస్తాయి. భద్రాద్రి జోన్‌లో ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనరేట్లతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలు వస్తాయి. యాద్రాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్గొండ జిల్లాలతోపాటు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ చేరుతుంది. చార్మినార్‌ జోన్‌లో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లతోపాటు సంగారెడ్డి జిల్లా రానున్నాయి. జోగులాంబ జోన్‌లో మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగలాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌ జిల్లాలు వస్తాయి.

21:18 - August 30, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తనిచ్చింది. తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏడు జోన్లు, రెండు మల్లీజోన్లకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 9,355 జూనియర్ పంచాయితీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ పోస్టుల దరఖాస్తు కోసం సెప్టెంబర్ 3 నుండి 11వరు ఆన్ లైన్ లో దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది. దీనికి సంబంధించి ఫీజు చెల్లింపులకు తుది గడువు సెప్టెంబర్ 10వ తారీఖుగా నోటిఫికేషన్ లో పేర్కొంది. కాగా ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

21:11 - August 30, 2018

తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏడు జోన్లు, రెండు మల్లీజోన్లకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.అంశంపై 10టీవీ విశ్లేషణ..

 

విద్యార్థిని గొంతు కోసిన యువకుడు..

హైదరాబాద్ : బొల్లారం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వినాయక్ నగర్ లో ఓ యువకుడు విద్యార్థిని గొంతు కోశాడు. నికిత అనే 10వ తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడిన యువకుడు గొంతు కోసాడు. దీంతో సదరు బాధితురాలి పరిస్థితి విషమంగా వుండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా పారిపోతున్న యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. 

తెలంగాణలో ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ల బదిలీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీ చేస్తు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ ఎస్పీగా రామా రాజేశ్వరి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాశ్ రెడ్డి, ఎల్బీ నగర్ డీసీపీగా సుమతి, నార్త్ జోన్ డీసీపీగా కమలేశ్వర్ , కుమరం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పీగా మల్లారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా లక్ష్మీనాయక్, లు బదిలీలయ్యారు. కాగా ఇద్దరు జాయింట్ కలెక్టర్లు కూడా బదిలీలయ్యారు. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గా జీవీ శ్యాంప్రసాద్, ఆసిఫాబాద్ జాయింట్ కలెక్టర్ గా పి.రాంబాబు బదిలీలయ్యారు.

తెలంగాణలో 4గురు ఐపీఎస్ లు బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా రామా రాజేశ్వరి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాశ్ రెడ్డి, ఎల్బీ నగర్ డీసీపీగా సుమతి, నార్త్ జోన్ డీసీపీగా కమలేశ్వర్ లు బదిలీలయ్యారు.  

19:29 - August 30, 2018

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యక్షంగా కాకపోయినా..పరోక్షంగా గులాబీ బాస్ ఎన్నికల శంఖారావం మోగిస్తున్నారు. ముందస్తుకు సై అంటున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కారు పార్టీలో టెకెట్ల రేసు జరుగుతోంది. సిట్టింగ్ లలో టికెట్ దక్కేది ఎవరికి? ఆశల పల్లకిలో ఆశావహులకు చాన్స్ ఉందా? లేదా? 2019 ఎన్నికల బరిలో నిలిచేదెవరు? ఖమ్మం,వరంగల్, నల్లగొండ జిల్లాల్లో సీట్లు ఎవరికి? కరీంనగర్, పాలమూరు బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? 10టీవీ స్పెషల్ ఫోకస్ 'రేసు గుర్రం'లో చూద్దాం..

19:26 - August 30, 2018

తిరుమల : మంత్రి అఖిల ప్రియ దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిన్న వివాహం చేసుకున్నఅఖిలప్రియ.. రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. తమ ఇంట్లో శుభకార్యం జరిగితే.. నడచి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అఖిలప్రియ అన్నారు.

19:24 - August 30, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో వామపక్షనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వామపక్షనేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించడం లేదని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై కలిసి వచ్చే పార్టీలతో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బస్సు యాత్ర, పాదయాత్ర చేపడుతామన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఆదేరోజు మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రకు, బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తమ మద్ధతు ప్రకటించాలని,యాత్రని విజయవంతం చేయాలని వామపక్ష నేతలు కోరారు.

19:21 - August 30, 2018

హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్నా.. ఎవరూ చేయని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన హరీష్‌రావు... త్వరలో వెయ్యి డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నెలకు రెండు ప్రైవేట్‌ ఆస్పత్రులు నెలకొల్పేవారని... కానీ తమ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు తీరుస్తున్నాయన్నారు హరీష్‌రావు. 

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం..

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత్‌మరో బంగారుపతాకాన్ని సాధించింది.అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన జిన్సన్‌ జాన్సన్‌ మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకున్నాడు. ఇదే పోటీలో మంజిత్‌ సింగ్‌ నాలుగోస్థానంలో నిలిచాడు. 800 మీటర్ల పోటీలో ఆయన స్వర్ణాన్ని గెలుపొందడం గమనార్హం. 1500 మీటర్ల పోటీలో జిన్సన్ 3నిమిషాల 44.72 సెకన్ల సమయంలోనే గమ్యం చేరి ప్రథమస్థానంలో నిలిచాడు.

చెన్నై తాగునీటికోసం ఏపీ నీరు..

అమరావతి : చెన్నై తాఉగనీటి అవకాసరాల కోసం.. 15 టీఎంసీల నీరును విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరును విడుదల చేయాలని కర్నూలు నీటిపారుదల శాఖ సీఈకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

18:54 - August 30, 2018

ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చాలా సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పలువురి మన్ననలు పొందుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే భారీ విజయాలు అందుకుని నిర్మాతలకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. హీరో, హీరోయిన్‌లు ఎవరనేది చూడకుండా కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛలో సినిమా విజయోత్సవంలో వున్న నాగశౌర్య లాంటి చిన్న హీరోలు కామెడీ ప్రధానంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది ‘ఛలో’ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాగశౌర్య మళ్లీ అలాంటి హాస్యప్రదమైన చిత్రం ‘@నర్తనశాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేసిన ఈ సినిమా రివ్వ్యూని చూద్దాం..

18:42 - August 30, 2018

రంగారెడ్డి : పట్టపగలు ఓ వ్యక్తిపై దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మైలార్ దేవుపల్లి సీఎస్ పరిధిలోని ఉడంగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉడంగడ్డలో ఫర్నీచర్ షాపు యజమానిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో షాపు యజమాని కడుపులో కత్తితో దాడి చేయటంతో అతను కేకలు వేయటంతో సదరు దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనలో కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. షాపు యజమాని కేకలు వేయటంతో దుండగుడు పరారయ్యాడు. అనంతరం తన ప్రాణాలు కాపాడాలను బాధితుడు పీఎస్ కు పరుగులు తీశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సదరు నిందితుడి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

విశాఖ జిల్లాకు పిడుగు హెచ్చరిక..

విశాఖపట్నం : జిల్లాకు పిడుగు హెచ్చరికలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జారీ చేసింది. విశాఖ అర్బన్, రూరల్, భీమునిపట్నం, పెందుర్తి, గాజువాక, సబ్బవరం మండలాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జారీ హెచ్చరికలను జారీ చేసింది. ఆయా ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ప్రగతి నివేదనకు అనుమతి ఇవ్వొద్దంటు పిటీషన్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన భారీ సభకు అనుమతి ఇవ్వవద్దంటు హైకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. ప్రగతి నివేదన భారీ సభ వలన పర్యావరణానికి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ అనే అడ్వకేట్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టినుంది. మరి ఈ విచారణపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ వేదికగా టీఆర్ఎస్ ఎన్నికల సమరశంఖం పూరించబోతోంది.

తండ్రి చితికి నిప్పు పెట్టిన కళ్యాణ్ రామ్..

హైదరాబాద్ : దివంగత హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తన తండ్రి హరికృష్ణ చితికి కల్యాణ్ రామ్ నిప్పు పెట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు. కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య తుది అంకం ముగిసింది. ఇక సెలవు అంటూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన హరికృష్ణ శాశ్వతంగా మన నుంచి దూరమయ్యారు. అంత్యక్రియలు ముగియడంతో బాధాతప్త హృదయంతో ఒక్కొక్కరు అక్కడ నుంచి బయటకు వస్తున్నారు.

17:59 - August 30, 2018

బీహార్ : 2019 లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. ఇందుకోసం బిజెపి ఓ ఫార్మూలాను తయారు చేసింది. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపి 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జెడియూ 12, ఎల్జేపి 5 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. జెడియుకు జార్ఖండ్‌లో 1, యూపీలో రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో బిజెపికి 22 మంది ఎంపీలు ఉండగా...జెడియుకు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపికి ప్రస్తుతం ఆరు స్థానాలుండగా...ఒక స్థానంపై కోత విధించే అవకాశం ఉంది. ఉపేంద్ర కుశ్వాకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్పీ ఎన్డీయేతో ఉంటే ఆ పార్టీకి 2 స్థానాలు కేటాయించనున్నారు. బిజెపి చీఫ్‌ అమిత్‌ షా, బిహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

17:57 - August 30, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొనకూడదని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సలహా ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ విషమన్న విషయం అందరికీ తెలిసిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే- రాహుల్‌తో అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందుత్వ వాదాన్ని వ్యాపింపజేస్తోందని...అందులో మనం ఎందుకు భాగస్వాములం కావాలని ప్రశ్నించారు. వాళ్లు రాజ్యాంగం కన్నా మనుస్మృతినే నమ్ముతారని ఖర్గే అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీకు చెందిన ఏ నేత కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వచ్చే నెల జరిపే ఓ కార్యక్రమంలో రాహుల్‌గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

17:55 - August 30, 2018

హైదరాబాద్ : భీమా కొరెగావ్ విచారణ కేసుతో సంబంధం ఉందంటూ విరసం నేత వరవరరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌ అక్రమం అంటూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అరెస్ట్‌ను నిలిపివేయాలంటూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలీసులు వీరిని గృహా నిర్భందంలో ఉంచారు. గృహా నిర్భందంలో ఉన్నవారిని కలవటానికి పోలీసులు ఎవ్వరినీ అనుమతించటం లేదు. ఈ నేపథ్యంలో అడ్వకేట్‌ ప్యానల్‌ తరపున జలిల్‌ లింగయ్య యాదవ్‌, మరికొందరు అడ్వకేట్స్‌ వరవరరావును కలిశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

17:51 - August 30, 2018

హైదరాబాద్‌ : మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్‌ స్టేడియంలో నిర్వహించిన లాల్‌ కేసర్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు గ్రూపులు పరస్పరం కుర్చీలు విసురుకున్నాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. కుస్తీ పోటీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హస్తినకు టీ.పీసీసీ ఉత్తమ్..

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉత్తమ్ కలుస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జరగనున్న భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్, టీపీసీసీకి యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

17:10 - August 30, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన పెద్దమనసుని చాటుకుంది. హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించి గౌరవించింది. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ గురించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతున్న మహా ప్రస్థానంలోనే ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా 450 గజాల స్థలాన్ని కేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక... కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు హరి స్మారకచిహ్నాన్ని నిర్మిస్తారు. తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఈ స్మారకం నిర్మాణం జరగనుంది. నందమూరి కుటుంబంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంతులేని అభిమానం ఉంది. తనకు రాజకీయ జన్మను ప్రసాదించిన ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం. 'ఒక్క మగాడు అంటే ఎన్టీఆరే' అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. దాదాపు రెండు నెలల్లో ఈ హరికృష్ణ స్థూపాన్ని పూర్తయ్యే అవకాశాలున్నాయి. 

16:15 - August 30, 2018

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంది. ఈ యాత్రలో ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్ర వాహనంలో హరి భౌతికకాయం పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిల్చున్నారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. టీడీపీ నేతలతో కలసి నారా లోకేష్ వాహనం ముందు నడుస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య, పోలీసు బ్యాండ్ మధ్య అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో..తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ అన్ని ఏర్పాట్లను చేయించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు. కాగా మహాప్రస్థానం చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు, మరో బావమరిది దగ్గుపాటి వెంకటేశ్వరావులతో పాటు ప్రముఖులు పాడెను అంత్యక్రియల ప్రాంతానికి తీసుకువచ్చి కిందికి దింపారు. అనంతరం హరికృష్ణ కుమారులు అన్ని కార్యక్రమాలను చేయగా కహరికృష్ణ కుమారుడు కళ్యాణరామ్ చితికి నిప్పటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, సామాజిక కార్యకర్తలు వంటి రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, ఆత్మీయులు, కార్యకర్తలు, సినీ ప్రముఖుల అశృనయనాల మధ్య హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

15:27 - August 30, 2018

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి హరికృష్ణ అంతిమయాత్ర మరికాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఘనంగా చేసింది. దాదాపు 200ల మంది పోలీసులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, సినీ అభిమానులు వంటి వేలాదిమంది తుది వీడ్కోలు పలుకేందుకు తరలివచ్చారు. మొదట మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగుతాయనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా మహాప్రస్థానం శ్మశాన వాటికలోనే హరికృష్ణ అంత్యక్రియలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా మహాప్రస్థానం పక్కనే హరికృష్ణ ' స్మృతివం' నిర్మించాలనే యోచనలో  అధికారులు వున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో సంప్రదించగా వారు కూడా అంగీకరించటంతో మహాప్రస్థానం పక్కనే హరికృష్ణ స్మృతివంనిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహాప్రస్థానం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరి అంత్యక్రియలు జరగనున్నాయి.

 

15:03 - August 30, 2018

హైదరాబాద్ : దివంగత హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నంలోని నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసముంద్రంగా మారింది. అశేషమైన అభిమానులతో రోడ్డు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. సాయంత్రం 4, 6 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
హరికృష్ణ పాడెను మోసిన సీఎం చంద్రబాబు..
హరికృష్ణ అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పాడె ముందు నడుస్తుండగా... ముఖ్యమంత్రి చంద్రబాబు హరికృష్ణ పాడెను తన కుడి భుజంపై మోశారు. పాడె మోస్తున్న క్రమంలో చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. పాడెకు ముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు. అనంతరం భౌతకకాయాన్ని అంతిమయాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలోకి చేర్చారు. తన నివాసం నుంచి మహాప్రస్థానానికి హరి అంతిమయాత్ర మొదలైంది. కాగా ఈ అంతిమయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను అధికారులు కొనసాగిస్తున్నాయి. పోలీస్ యంత్రాంగం తెలియజేయటంతో నగరవాసులు వాటికి అనుగుణంగా వారి ప్లానింగ్ చేసుకోవటంతో కొద్దిపాటి ఇబ్బందులు తప్ప పెద్దగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పలు జాగ్రత్తలను పోలీసులు తీసుకున్నారు.
తండ్రికి సన్నిహితుడిగా..తండ్రి మాట జవదాటని కొడుకుగా..
తండ్రి ఎన్టీ ఆర్ కు అత్యంత సన్నిహితుడిగా..తండ్రి మాట జవదాటని కొడుకుగా హరికృష్ణ నడుచుకునేవారు. ఎన్టీఆర్ ఎన్నికల యాత్రలో అనుక్షణం ఎన్టీఆర్ కు పక్కనే వుంటు ఆయన అవసరాలు..ఆరోగ్యం..రూట్ షెడ్యూల్..బస ఏర్పాట్లు వంటి పలు కీలక అంశాలను హరికృష్ణ దగ్గరుండి చూసుకునేవారు. కుటుంబ సభ్యులలో తండ్రితో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అటువవంటి సమయాలలో కూడా తండ్రితో ఏ విషయానైనా సరే సమయోచితంగా మాట్లాడగలిగేవారు హరికృష్ణ. పార్టీలో ఎంతకాలం పనిచేసినా..నాకు ఈ పదవి కావాలని ఏనాడు డిమాండ్ చేయలేదు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను మాత్రం అంకిత భావంతో నెరవేర్చేవారు. పెద్దస్థాయి నాయకుల నుండి కార్యకర్తలందరితోను కలివిడిగా ఎటువంటి భేషజం లేకుండా హరికృష్ణ కలిసి మెలిసి పనిచేసేవారని ఎన్టీఆర్ తరువాత ఎవరైనా తమ కష్టాలను, ఇబ్బందులకు హరికృష్ణ దృష్టికి తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఎన్నో వున్నట్లుగా తెలుస్తోంది.

హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం...

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుండి జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానం వరకు కొనసాగనుంది. 

13:49 - August 30, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ స్పీడు పెంచింది. ముందుస్తు ఎన్నికలు వస్తే అనుసరించాలిస్నవ్యూహంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ హస్తినకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ముందస్తు యాక్షన్ ప్లాన్ ను హై కమాండ్ సూచించనుంది. పీసీసీ ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను ఏఐసీసీ ప్రకటించనుంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం ప్రభాకర్ లను నియమించే అవకాశం ఉంది. 

ఢిల్లీకి ఉత్తమ్...

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ముందస్తు యాక్షన్ ప్లాన్ ను హై కమాండ్ సూచించనుంది. పీసీసీ ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను ఏఐసీసీ ప్రకటించనుంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం ప్రభాకర్ లను నియమించే అవకాశం ఉంది. 

13:34 - August 30, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నంలోని ఆయన నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అభిమానులు కూడా భారీగా తరలివస్తున్నారు. ఇందుకు పోలీసులు క్యూ లైన్ ఏర్పాటు చేశారు.

మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు డీసీఎంలను పూలతో సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంతిమ కార్యక్రమాలు జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగనుంది. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత కుటుంబసభ్యులు నిర్ణయించారు. కానీ సీఎం కేసీఆర్ హరికృష్ణకు నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియలపై మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని అంగీకరించారు. అంతేగాకుండా హరికృష్ణ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కుటుంబసభ్యులు అంగీకరించారు. 

విద్యార్థినిని బలి తీసుకున్న ఫొటో...

యాదాద్రి : స్నేహితులు పెట్టిన ఓ ఫొటో ఓ విద్యార్థినిని బలి తీసుకుంది. ఆలేరు (మం) కొల్లూరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఈ ఫొటోను స్నేహితులు వాట్సాప్ లో పెట్టారు. పరువు పోయిందని భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

13:12 - August 30, 2018

ఢిల్లీ : సోషల్ మీడియాలో చెడును ప్రచారం చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. వారణాసి స్వచ్చంద సేవకులతో, బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారం పోస్టు చేయవద్దని, ఏ రాజకీయ పార్టీకో...భావజాలానికి చెందిందో కాదని 125 కోట్ల భారతీయులకు చెందిన అంశమన్నారు. సోషల్ మీడియాలో చెడు భాషను వాడుతూ తప్పుడు అంశాలు పెడుతున్నారని, వాటిని ఇతరులకు పంపుతున్నారని...సమాజానికి ఎంత చెడు జరుగుతుందో నెటిజన్లు గుర్తించ లేకపోతున్నారని తెలిపారు. సానుకూల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాను ఉపయోగించాలన్నారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వచ్చ సేవా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

హరికృష్ణ నివాసానికి వెళ్లే మార్గం మూసివేత...

హైదరాబాద్ : సినీ నటుడు హరికృష్ణ నివాసానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే అనుమతించాలని సూచించారు. అభిమానులు మహా ప్రస్థానానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. 

12:39 - August 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

జోన్ల వివరాలు: కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి. బాసర జోన్ : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. రాజన్న జోన్ : కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్. భద్రాద్రి జోన్ : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ. చార్మినార్ జోన్ : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. జోగులాంబ జోన్ : మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్.
మల్టీ జోన్లు : కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ.

కొత్త జోన్లకు ఆమోదం...

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిపికేషన్ ను జారీ గురువారం ఉదయం చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. 

12:24 - August 30, 2018

హైదరాబాద్ : కుస్తీ పోటీల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం హనుమాన్ స్టేడియంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో కొట్టుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. 

మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత...

హైదరాబాద్ : మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఛాంపియన్ షిప్ లో రెండు గ్రూపుల మధ్య గొడవ చెలరేగింది. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సీబీఐ కోర్టులో లాలూ...

జార్ఖండ్ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఎదుట లొంగిపోవాలని రాంచీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టు వద్దకు చేరుకున్నారు. 

11:27 - August 30, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ పార్థీవ దేహానికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ కు వస్తున్నారు. టిడిపి మంత్రులు సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతమనేని, ఎంపీలు సీఎం రమేష్, టి.జి.వెంకటేశ్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన ఎంతో మంచి వ్యక్తి అని, నిబద్ధతో కలిగిన నేత అని అభివర్ణించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఎదురు కాల్పులు...ఉగ్రవాది హతం...

జమ్మూ కాశ్మీర్ : బండిపోరాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. 

11:16 - August 30, 2018

హైదరాబాద్ : చైతన్య రథాన్ని నడిపించిన నాయకుడు హరికృష్ణ అని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమని ఏపీ మంత్రి హరికృష్ణ పేర్కొన్నారు. ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, టిడిపి నేతగా ఎనలేని కృషి చేశారన్నారు. కేబినెట్ లో ఇద్దరం సహచర మిత్రులుగా ఉండేవారని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమన్నారు. ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, టిడిపి నేతగా ఎనలేని కృషి చేశారన్నారు.

యలమంచిలి శివాజీ...
హైదరాబాద్ :
చైతన్య రథాన్ని చివరి వరకు నడిపించిన వ్యక్తి హరికృష్ణ అని, రథం కిందనే నిలబడే వాడని యలమంచిలి శివాజీ తెలిపారు. హరికృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి ఎదిగాడన్నారు. తాను, హరికృష్ణ..ఇతరులు కూర్చొని 'టైగర్ హరిశ్చంద్ర' సినిమాకు కథ రూపొందించడం జరిగిందన్నారు. నేతలు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం బాధాకరమని, ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

హరికృష్ణకు సోమిరెడ్డి నివాళి...

హైదరాబాద్ : సినీ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ పార్థీవ దేహానికి టిడిపి మంత్రి సోమిరెడ్డి నివాళి అర్పించారు. చైతన్య రథాన్ని నడిపించిన నాయకుడు హరికృష్ణ అని, కానీ దురదృష్టవశాత్తు డ్రైవింగ్ లో చనిపోవడం బాధాకరమన్నారు. ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, టిడిపి నేతగా ఎనలేని కృషి చేశారన్నారు.

 

కేరళకు రూ. 738 కోట్లు - పినరయి...

ఢిల్లీ : కేరళ వరద బాధితుల సహాయార్థం సీంఎ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వచ్చాయని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈనెల 28 వరకు రూ. 738 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. 

10:53 - August 30, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, టిడిపి నేత నందమూరి హరికృష్ణ మృతి తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని టిడిపి రాజ్యసభ మాజీ సభ్యుడు దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాజ్యసభలో తనకు ఆప్తుడిగా ఉండేవారని, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అందరితో కలగొలుపుగా ఉండే వారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

10:35 - August 30, 2018
10:12 - August 30, 2018

చెన్నై : సినీ నటుడు హరికృష్ణ దుర్మరణం చెందారన్న వార్తతో షాక్ కు గురయ్యామని, ఇది నమ్మలేదని సినీ నటి భాను ప్రియ పేర్కొన్నారు. ఆయనతో రెండు సినిమాల్లో నటించానని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియచేస్తున్నట్లు, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని తెలిపారు. నందమూరి కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు.

తీరని లోటు -- మైసూరా...
సినీ రంగంలో కాకుండా రాజకీయాల్లో హరికృష్ణ రాణించారని, క్రియాశీల పాత్ర పోషించారని మైసురారెడ్డి తెలిపారు. చైతన్యరథం రథసారధిగా ఉన్న హరికృష్ణ మృతి తీరని లోటని తెలిపారు. 

09:34 - August 30, 2018

హైదరాబాద్ : నందమూరి తారకరావు తగ్గ తనయుడు హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ మృతి బాధిస్తోందని తెలిపారు. హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళర్పించేందుకు ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. నివాళుర్పించిన అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఆయన తెలుగులో ప్రసంగించారని, తెలుగులో ప్రసంగించవద్దని డిప్యూటి ఛైర్మన్ కోరినా ఆయన వినిపించుకోలేదన్నారు. తాను తర్జూమా చేస్తానని చెప్పడం జరిగిందని, మాటకు విలువనిచ్చే వ్యక్తి అని తెలిపారు. ఆయన మృతి తీరని లోటని వెంకయ్య తెలిపారు. 

హరికృష్ణ నివాసానికి ఉప రాష్ట్రపతి...

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ పార్థీవ దేహానికి ఆయన నివాళులర్పిస్తున్నారు. 

09:12 - August 30, 2018

 

చిత్తూరు : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు ప్రభుత్వం..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పలు సందర్భాల్లో పోలీసులపైకి దాడులు చేస్తున్నారు. తాజాగా మరో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. తిరుపతి - చెన్నై రహదారిపై ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. కొద్ది కిలో మీటర్ల మేర వెంబడించిన అనంతరం లారీని పట్టుకున్నారు. అందులో ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు విషయం తెలియదని ఇద్దరు వ్యక్తులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

08:36 - August 30, 2018

కర్నూలు : ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆళ్లగడ్డలోని భూమా శోభనాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ వివాహం బుధవారం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లు అఖిల ప్రియ వివాహాన్ని సాంప్రదాయ బద్ధంగా జరిపించారు. అఖిల ప్రియ - భార్గవ్ రామ్ లకు దేవస్థాన పురోహితుడు అహోబిలేశుడు ఆశ్వీరాదాలను అందచేశారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు ఆదినారాయణరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నారాయణలు, శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్ తో పాటు పలువురు హాజరయ్యారు. ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

08:12 - August 30, 2018
08:11 - August 30, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతి చెందడం పట్ల మంత్రి పోచారం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆత్మయంగా పలకరించేవాడని, ఆయన మరణం అందరికీ దుఖాన్ని కలుగ చేస్తోందన్నారు. ఎంతో చక్కటి, నైపుణ్యంతో డ్రైవింగ్ చేసేవాడని తెలిపారు.

ఇదిలా ఉంటే నందమూరి హరికృష్ణను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. మెహిదీపట్నంలో ఆయన నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయంత్రం 4గంటలకు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

పోచారం సంతాపం...

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతి చెందడం పట్ల మంత్రి పోచారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆత్మయంగా పలకరించేవాడని, ఆయన మరణం అందరికీ దుఖాన్ని కలుగ చేస్తోందన్నారు. ఎంతో చక్కటి, నైపుణ్యంతో డ్రైవింగ్ చేసేవాడని తెలిపారు. 

బాబుకు స్టాలిన్ సానుభూతి లేఖ...

చెన్నై : టిడిపి నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ లేఖ రాశారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు స్టాలిన్ సానుభూతి తెలియచేశారు. 

వరవరరావు గృహ నిర్భందం...

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణే పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను నేటి నుండి సెప్టెంబర్ 5వరకు గృహ నిర్భందం చేయనున్నారు. వరవరరావును అరెస్టు చేయడంతో ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

07:45 - August 30, 2018

తెలంగాణలో వి.ఆర్.ఏలు ఆందోళ‌న బాట ప‌ట్టారు. శుక్రవారం ఛ‌లో సి.సి.ఎల్.ఏ ఆఫీస్ ముట్టిడికి తెలంగాణ గ్రామ రెవిన్యూ, స‌హ‌య‌కుల సంఘాల జే.ఏ.సీ పిలుపునిచ్చింది. త‌మ‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని, జీరో వ‌న్ జీరో ప‌ద్దు పై విధానం ప్రక‌టించాల‌ని, వేత‌నాలు పెంచాల‌ని త‌దిత‌ర డిమాండ్లతో వారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. వారు డిమాండ్లు వారి ప‌ట్ల ప్రభుత్వ విధానంపై మ‌న‌తో చ‌ర్చించేందుకు తెలంగాణ గ్రామ రెవిన్యూ స‌హాయ‌కుల సంఘాల జె.ఏ.సీ చైర్మన్ వంగూరి రాములు టెన్ టివి 'జనపథంలో' విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:48 - August 30, 2018

ఢిల్లీ : నేటి నుంచి భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ రెండు టెస్టులను గెలుచుకోగా.. భారత్‌ ఒకమ్యాచ్‌లో నెగ్గింది. వరుసగా రెండు పరాజయాలు... అందులోనూ లార్డ్స్‌లో దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ స్థితిలో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. మరో ఓటమి ఖాయమని, సిరీస్‌పై ఆశలు నిలిచే అవకాశమే లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటిస్థితిలో కోహ్లీసేన అద్భుతం చేసింది. నాటింగ్‌హామ్‌ టెస్టులో గొప్పగా పుంజుకుంది. అన్ని రంగాల్లో రాణిస్తూ... ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఇంగ్లాండును చిత్తుగా ఓడించి.. అభిమానుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో మరో విజయం సాధించి.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న పట్టుదలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. భారత్‌ గత మ్యాచ్‌ జట్టునే సౌథాంప్టన్‌లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

 

06:45 - August 30, 2018

కరీంనగర్ : ఓ గొప్ప ఆలోచన వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తోంది. ఒకప్పుడు నేతన్నల ఆకలి చావులకు మారుపేరుగా నిలిచిన ఆ ప్రాంతం.. ఇప్పుడు ఉపాధి అవకాశాలతో వారి బతుకులను మారుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నల జీవితాల్లో సంతోషం నిండుతోంది. కార్మికులకు చేతినిండా పని ఉండడంతో వలసపోయిన నేతన్నలను తిరిగి తీసుకువచ్చేలా చూస్తున్నారు. కానీ... ప్రత్యేక తెలంగాణలో నేతన్నల తలరాతలు మారుతున్నాయి. గత ప్రభుత్వాలు నేతన్నల సంక్షేమానికి శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ఎంతోమంది నేత కార్మికులు బలవనర్మరణాలకు పాల్పడ్డారు. నేతన్నల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో ఉన్న ఊరిని వదిలి ఉపాధిని వెతుక్కుంటూ వలసలు పోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిరిసిల్లలో బలవన్మరణలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టింది. వలసను నియంత్రించి స్థానికంగానే ఉపాధి మార్గాలను చూపిస్తోంది.

దసరా పండుగ సందర్బంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కానుకగా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నేతన్నల జీవితాల్లో వెలుగునింపుతోంది. మంత్రి కేటీఆర్‌ చొరవతో బతుకమ్మ చీరలను సిరిసిల్ల నేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అయితే గతేడాది ఆశించిన స్థాయిలో సిరిసిల్ల నుంచి చీరల ఉత్పత్తి జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మే మాసంలోనే చీరలకు ఆర్డర్లు ఇచ్చారు. దీంతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది.

ఇక గతంతో పోలిస్తే సిరిసిల్ల నేతన్నలకు రెండింతలు కూలి అధికంగా లభిస్తోంది. బతుకమ్మ చీరల ఉత్పత్తితో వారానికి 5 వేల నుంచి 6 వేల రూపాయల వరకు ఉపాధి లభిస్తోంది. చీరల ఆర్డర్లు ఇచ్చే ముందు జౌళిశాఖ అధికారులు కూలిని నిర్ణయించి... క్షేత్రస్థాయిలో శ్రమించే కార్మికులకు రెండింతలు కూలి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. బతుకమ్మ చీరల తయారీపై ప్రస్తుతానికి 25 వేల మంది కార్మికులు, మరో మూడు వేల మంది ఆసాములకు జీవనోపాధి లభిస్తోంది.

ఇక 90 లక్షల చీరల ఆర్డర్‌ లభించడంతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఉదయం రాత్రి వరకు పని చేస్తున్నా నిర్ణీత సమయానికి చీరలను అందించాలంటే శ్రామికులు మరింత శ్రమించాల్సి వస్తోంది. దీంతో ఆసాములు, వస్త్ర ఉత్పత్తిదారులు భీవండి, సూరత్‌, షోలాపూర్‌ నుండి కార్మికులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం ఒకప్పుడు సిరిసిల్ల నుంచి వలసపోయిన కార్మికులు.. ఇప్పుడు సిరిసిల్లకు తిరిగి వస్తుండడంతో నేతన్నల కుటుంబంలో సంతోషం వ్యక్తమవుతోంది.

చేతినిండా పని దొరకడంతో నేతన్నలకు ఓవైపు ఆనందంగానే ఉన్నా... కార్మికులు అంతంతమాత్రంగానే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. అదనంగా కార్మికులు లభిస్తే యజమానికి, కార్మికులకు ఎంతో లాభం చేకూరుతుందంటున్నారు. ఒకప్పుడు పని దొరకడమే కష్టంగా ఉంటే.. ఇప్పుడు పని చేసేవారికి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న చీరల ఆర్డర్లతో వలస జీవులను తిరిగి ఇంటిదారి పట్టిస్తుండడంతో నేతన్న కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

06:42 - August 30, 2018

హైదరాబాద్ : పత్తి మార్కెటింగ్‌ సీజన్‌ కోసం తెలంగాణ సర్కార్‌ ముందస్తు ప్రణాళికను సిద్దం చేస్తోంది. అక్టోబర్‌ 1 నాటికి పత్తి కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని అధికారులను మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గతేడాది మాదిరిగానే అన్ని కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. వచ్చే సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పత్తి కోనుగోళ్లకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా మార్చేందుకు సీసీఐ సానుకూలంగా ఉందని.. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారుల సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. గతేడాది మాదిరిగానే పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్‌ యార్డులను కొనుగోలు కేంద్రాలుగా వినియోగించనున్నారు. వీటిని అక్టోబర్‌ 1 నాటికి సిద్దంగా ఉంచాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.

పత్తి నుంచి దూది శాతం ఈ ఏడాది 33గా నిర్ణయించడం వల్ల రాష్ట్రంలోని కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులు సీసీఐ పిలిచిన లీజు టెండర్లలో పాల్గొనకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే దీనిపై సీసీఐ చైర్మన్‌ స్పందిస్తూ... జిన్నింగ్‌ మిల్లులు ఇవ్వాల్సిన దూది శాతాన్ని 33 నుండి 31.5 గా తగ్గిస్తూ టెండర్లను తిరిగి పిలవడమైనదని తెలిపారు. ఈ ఏడాది పత్తి ధర 5,450 రూపాయలుగా నిర్ణయించడం వల్ల రైతులు ఎక్కువ శాతం సీసీఐకు అమ్మేందుకు ముందుకు వస్తారని మంత్రి తెలిపారు. జిన్నింగ్‌ మిల్లులు, సీసీఐ లీజ్‌ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే రైతులకు ఇబ్బందికరంగా ఉంటుందని.. దీనిపై సీసీఐ మరింత లోతుగా పరిశీలించాలని హరీష్‌రావు కోరారు. వెంటనే జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హరీష్‌రావు హామీ ఇచ్చారు.

ఇక ఎంఎస్పీ ఆపరేషన్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ పరికరాలను సిద్దం చేసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. రైతులకు గుర్తింపు కార్డులు, పంట అమ్మిన వెంటనే రైతులకు చెల్లింపుల విషయంపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు ఆదేశించారు. 

06:41 - August 30, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు, మూడు నెలల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌గా మొదట విజయవాడలో రెండు బస్సులు నడపనున్నారు. విశాఖ సీఐఐ పార్టనర్‌ సమ్మిట్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్‌లతో బెలారస్‌కు చెందిన యాక్సిస్‌ మొబలిటీ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో.. అమరావతి సచివాలయంలో అధికారులను మొబలిటీ సంస్థ ప్రతినిధులు కలిశారు. ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, సామర్ధ్యం గురించి యాక్సిస్‌ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. త్వరలోనే రెండు బస్సులను అందజేస్తామన్నారు. బస్సులను ఉచితంగా అందజేస్తున్నందున దిగుమతికయ్యే కస్టమ్స్‌ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించాలని కోరారు. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. 

06:40 - August 30, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం అందింది. వచ్చే నెల 24న సదస్సులో కీలకోపన్యాసం చేయాలంటూ ఆహ్వానం పంపారు. ఫైనాన్సింగ్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌.. గ్లోబల్‌ ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌ అనే అంశంపై న్యూయార్క్‌లో జరిగే సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. జీరో బడ్జెట్‌, ప్రకృతి సేద్యంలో ఏపీ ముందుకెళ్తున్న యూఎన్‌ ప్రశంసించింది. 2024 కల్లా 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగుబాటు పట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సేంద్రీయసాగు వృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్‌ సాయం చేస్తోంది.

 

06:38 - August 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం 11 మంది కలెక్టర్లను బదిలీ చేసిన సర్కార్‌.. తాజాగా మరో ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా భారతి హొలికెరిని నియమించారు. గద్వాల జిల్లా కలెక్టర్‌గా శశాంకను నియమించారు. అదేవిధంగా మంగళవారం జారీ చేసిన బదిలీల్లో స్వల్పమార్పులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా రజత్‌కుమార్‌ శైనీని నియమించి.. ఆమోమ్‌కుమార్‌ బదిలీని రద్దు చేసింది. అలాగే వెయిటింగ్‌లో ఉన్న మరో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. అగ్రికల్చర్‌ కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాను, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా అమ్రపాలిని నియమించారు. ఇక పోలీసుశాఖలోనూ బదిలీలు జరిగాయి. 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

06:35 - August 30, 2018

హైదరాబాద్ : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని-నందమూరి కుటుంబానికి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. నిన్న హరికృష్ణ మరణవార్త తెలుసుకుని వచ్చిన కొడాలి నాని.. ఇంకా అక్కడే ఉన్నారు. రాత్రంతా హరికృష్ణ పార్ధివదేహం వద్దే గడిపారు. చాలామంది వెళ్లిపోయినా కొడాలి నాని మాత్రం కుర్చీలోకూర్చుని అక్కడే ఉన్నారు. 

06:32 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు సినీ ప్రపంచం నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు సినీ జగత్తు నివాళులర్పించింది. సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో చిరంజీవి అన్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడైన హరికృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, హరికృష్ణ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు. అటు పవన్‌కల్యాణ్‌ సైతం హరికృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని అన్నాకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయన్నారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హరికృష్ణ తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించాడని బాలకృష్ణ అన్నారు.

హరికృష్ణ మహా మనిషి అని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా.. చేసేవారని సినీ నటుడు కృష్ణం రాజు అన్నారు. ఒక మంచి మిత్రున్ని కోల్పోయనని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు కృష్ణం రాజు. హరికృష్ణ మంచి నటుడిగా.. మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించారని సినీ నటుడు సీనియర్‌ నరేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథ సారథిగా హరికృష్ణకు గొప్ప పేరుందని తెలిపారు. హరికృష్ణ మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. హరికృష్ణ ఇంత త్వరగా తమని వదిలి వెళ్తారని తాను ఊహించలేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నానని నరేష్‌ అన్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగు సినీ జగత్తుకు తీరని లోటు అన్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌. ఆకస్మాత్తుగా హరికృష్ణ మరణ వార్త వినటం కలిచివేసిందని చెప్పారు. నందమూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నానని కళ్యాణ్ అన్నారు. హరికృష్ణ మంచి మనిషి అని.. గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు సినీ నటుడు అశోక్‌. ఏ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి ఎలాంటి సాయమైనా చేసే వారని తెలిపారు. నందమూరి హరికృష్ణ మరణించటం తెలుగు సినీ పరిశ్రమకు, టీడీపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి. మానవీయ విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలపై నిబద్దత, పట్టు ఉన్న మనిషి హరికృష్ణ అని తెలిపారు. అలాంటి వ్యక్తి చనిపోవటం దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆర్‌. నారాయణ మూర్తి చెప్పారు. ఇక హరికృష్ణను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున్న ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

06:29 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. చైతన్య రథంపైన హరికృష్ణ అంతిమయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు పలువురు అభిమానులు తరలివస్తున్నారు

ఆసియా క్రీడల్లో....

ఆసియా క్రీడల్లో హకీ పురుషుల సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్ - మలేషియా జట్లు ఢీకొననున్నాయి. స్వాష్ మహిళల టీమ్ లో భారత్ - హాంకాంగ్, మహిళల 1500 మీటర్లలో పలకీజ్, మౌనిక, పురుషుల 1500 మీటర్లలో జిన్సన్ జాన్సన్, మంజీత్ లు పోటీ పడనున్నారు. 

జగన్ 250వ రోజు...

విశాఖపట్టణం : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 250వ రోజు విశాఖపట్టణంలోని అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగనుంది. మార్టూరు, బవులువాడ, త్రిమూర్తులు నగర్ లో పాదయాత్ర కొనసాగనుంది. 

బాబు చెన్నై పర్యటన రద్దు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నై పర్యటన రద్దు అయ్యింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభకు బాబు హాజరు కావాల్సి ఉంది. బాబుకు బదులుగా గజపతి రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు చెన్నై వెళ్లనున్నారు. 

హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు...

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టిడిపి నేత హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30గంటలకు యాత్ర కొనసాగనుంది. 

తెలంగాణలో బదిలీల పర్వం...

హైదరాబాద్ : తెలంగాణలలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. 9మంది ఐపీఎస్ లు బదిలీలయ్యారు. రామగుండం కమిషనర్ గా సత్యనారాయణ, వనపర్తి ఎస్పీగా అపూర్వరావు, జగిత్యాల ఎస్పీగా సింధుశర్మ, సీఐడీ ఎస్పీగా ప్రకాశ్ జాదవ్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా సునీల్ దత్, కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా మురళీ కృష్ణ, సౌత్ జోన్ డీసీపీగా అంబర్ కిశోర్ ఝా, హైదరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్ గా శివ ప్రసాద్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీబీగా వెంకటేశ్వర్లులు బదిలీ అయ్యారు. 

Don't Miss