Activities calendar

31 August 2018

22:00 - August 31, 2018

హైదరాబాద్ : అన్ని దారులూ అటువైపే వెళ్తున్నాయి. కొంగర కలాన్‌.. కమాన్‌ అంటూ పిలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. స‌భ ఏర్పాట్లపై టీ.ఆర్.ఎస్ కార్యక‌ర్తల‌ కంటే కూడా ఇప్పుడు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స‌భ‌కు కార్యక‌ర్తల త‌ర‌లింపు వ్యవ‌హారంలో మంత్రులు ఎమ్మెల్యేలు త‌ల‌మున‌క‌లైతే... వచ్చే కార్యకర్తలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా.. అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జరగకుండా పోలీసులు శ్రమిస్తున్నారు.

పూర్తికావచ్చిన ప్రగ‌తి నివేద‌న స‌భ‌...
ప్రగ‌తి నివేద‌న స‌భ‌ ఏర్పాట్లు దాదాపు పూర్తిగావచ్చాయి. ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమ్మద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. వ‌చ్చే వీఐపీల‌ భ‌ద్రతా వ్యవ‌హారాలు.. అటు స‌భ భ‌ద్రతా వ్యవహారాలు చూడ‌టం ఇప్పుడు పోలీసుల‌కు స‌వాల్‌గా మారింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు క‌లుగ‌కుండా ఔటర్ రింగ్‌రోడ్‌ నుండి నేరుగా స‌భ‌కు చేరుకోవ‌డానికి.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌కి సైడ్‌లో ఉండే సేప్టీ సెక్యూరిటీ లైన్‌ని కొన్ని ప్రాంతాల‌లో బ్రేక్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కి సంబంధించిన ర‌ద్దీ త‌గ్గే అవ‌కాశం ఉంది.

రూట్ మ్యాప్‌కి అనుకూలంగా పోలీసు అధికారుల‌ ఎంట్రీ
ఇక జిల్లాలో ఉండే ఎస్పీ స్థాయి అధికారులు... క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని డీసీపీ స్థాయి అధికారులు రెండు రోజులుగా భ‌ద్రతా ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తున్నారు. ఏ జిల్లా నుంచి వ‌చ్చే కార్యక‌ర్తల వాహనాలను.. ఆయా మార్గాల‌్లో పార్కింగ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జిల్లాల నుంచి వ‌చ్చే రూట్ మ్యాప్‌కి అనుకూలంగా ఆ జిల్లాకు సంబంధించిన కొంత మంది పోలీసు అధికారుల‌ను ఎంట్రీ- ఎగ్జిట్ పాయింట్‌ల‌లో ఉండేలా చూస్తున్నారు. వాహ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటే స‌భ‌కు దాదాపుగా నాలుగైదు కిలోమీట‌ర్ల దూరంలో పార్కింగ్ చేసేలా ప్రత్యేక‌ పార్కింగ్ స్థలాల‌ను పోలీస్ అధికారులు సిద్ధం చేశారు.

సీసీ కెమెరాల ప‌హరాలో సభ
స‌భా స్థలి మొత్తం సీసీ కెమెరాల ప‌హరాలో ఉండ‌నుంది... స‌భ బ‌య‌ట‌ పార్కింగ్ చేసే వాహ‌నాల నుండి స‌భ‌ లోప‌లి ప్రదేశమంతా సీసీ కెమెరాల‌తో కమాండ్ కంట్రోల్‌లో పర్యవేక్షిస్తారు. స‌భ లోప‌లికి వెళ్లడానికి వీఐపీల‌ కోసం, కార్యక‌ర్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స‌భ‌కు సంబంధించిన భ‌ద్రతా అంశాల‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ఎప్పటిక‌ప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక‌ రాచ‌కొండ క‌మిష‌న‌ర్ రెండు రోజుల‌ నుండి స‌భ భ‌ద్రతా ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తున్నారు. సివిల్, ట్రాఫిక్, స్పెష‌ల్ పార్టీ పోలీసులతో పాటు టీ.ఆర్.ఎస్ పార్టీ వాలెంటీర్లతో ఎలా స‌మ‌న్వయం చేసుకోవాలో స్సెష‌ల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వివ‌రిస్తున్నారు. స‌భా ఏర్పాట్లకు సంబంధించి మ‌ట్టి ప‌నులు ఇంకా జ‌రుగుతుండ‌టంతో పోలీసుల భ‌ద్రతకు కొద్దిమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

21:53 - August 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రగతినివేదన సభను ఆపాలంటూ వచ్చిన పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది. సభ పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా ఉందని న్యాయవాది పూజారి శ్రీధర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభ నిర్వహించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

ప్రగతి నివేదన సభ ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత
తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రగతి నివేదన సభకు అడ్డంకులు తొలగిపోయాయి. సభను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. ప్రగతి నివేదన సభ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని.. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

సభకు అనుమతి ఇవ్వొద్దని పిటిషన్‌..
ప్రగతి నివేదన సభకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పర్యావరణ పరిరక్షణ సమితి, ప్రముఖ న్యాయవాది పూజారి శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. సభ పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా ఉందని, ప్రభుత్వం తమ విధి విధానాలను చెప్పదలచుకుంటే సామాజిక మాద్యమాల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి చెప్పాలని పిటిషన్‌ దాఖలు చేశారు శ్రీధర్‌. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ వాదిస్తూ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు.
న్యాయవాది సమాధానంతో సంతృప్తి చెందిన కోర్టు
ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ సమాధానంతో సంతృప్తి చెందిన కోర్టు.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని సూచించింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేసింది.

21:48 - August 31, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక సీఎం కుమారస్వామి ప్రతిపాదించారు. ఈ విషయంలో ప్రాథమిక స్థాయిలో ఉన్న చర్చలకు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా కాకుండా చూసే లక్ష్యంతో పనిచేయాలని విజయవాడలో జరిపిన భేటీలో చంద్రబాబు, కుమారస్వామి ప్రతిపాదించారు.

దుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి..
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్వాగతం పలికారు. విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో బసచేసిన కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిపిన భేటీలో రాజకీయపరమైన అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

కర్నాటక వరద నష్టానికి సహాయం చేయని కేంద్రం
వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, కుమారస్వామి భేటీకి రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చినట్టు సమాచారం. నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షచూపుతోందన్న అంశం ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నాటకలో వరద ప్రభావిత జిల్లాలకు సాయం అందిచేవిషయంలో కేంద్ర అనుసరిస్తున్న విపక్షపై చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు కూడా ఏపీ వరదల అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

ఏపీకి సాయం చేయడంలో మోదీ విఫలం -బాబు
కర్నాటక ప్రభుత్వ రైతు రుణమాఫీ పథకానికి కేంద్రం చేయూత ఇవ్వడం లేదని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేస్తే.... విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోవడంలో మోదీ విఫలమయ్యారన్న అంశాన్నిచంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏపీకి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉందని కాగ్‌ తేల్చినా... అరకొర సాయంతో సరిపెట్టారని ఏపీ సీఎం ప్రస్తావించినట్టు సమాచారం. వ్యవసాయ రుణమాఫీని కూడా లోటుగా చూపారంటూ కేంద్రం సహాయ నిరాకరణ పాటించడంతో ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. అమరావతి నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలతో సరిపెట్టడం, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇబ్బంది పెట్టడం, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ మంజూరు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు 600 కోట్ల రూపాయల అరకొర నిధులతో సరిపెట్టిన ప్రధాని మోదీ... మరోసారి అధికారంలోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆందోళన వ్యక్తం చేశారని చర్చ జరుగుతోంది. ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయే అంశంపై చంద్రబాబు, కుమారస్వామి చర్చించారు.

మరోసారి భేటీ అయ్యేందుకు ఇరువురు నిర్ణయం..
ప్రస్తుతం ప్రాథమిక దశంలో ఉన్న ఈ చర్చలకు భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, కుమారస్వామి నిర్ణయించారు. కర్నాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్‌, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా కుమారస్వామి, చంద్రబాబు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో ఉంటూనే కాంగ్రెస్‌ నేతలు ముప్పతిప్పలు పెడుతున్న అంశంపై కుమారస్వామి ఆవేదన వెలిబుచ్చారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో భేటీ తర్వాత కుమారస్వామి కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కుమారస్వామికి వేదపండితులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కర్నాటక సీఎం కుమారస్వామికి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరి వెళ్లారు. 

21:31 - August 31, 2018

మధ్యప్రదేశ్‌ : ఎన్నికలు సమీపిస్తుండంతో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య డిజిటల్‌ వార్‌ మొదలైంది. తాజాగా ఎంపీ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బాహుబలిగా చూపుతూ బిజెపి కార్యకర్తలు రూపొందించిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మహా శివలింగాన్ని భుజానికి ఎత్తుతుంటే జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ కళ్లు అప్పగించి ఆశ్చర్యంతో చూస్తుంటారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కట్టప్పగా, భల్లాలదేవునిగా జ్యోతిరాదిత్య సింధియాను చూపారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అనే నేను మధ్యప్రదేశ్ ప్రజల గౌరవాన్ని, సంపదను కాపాడుతాను...అవసరమైతే నా ప్రాణాలు ఒడ్డుతాను.. నా మాటే శాసనం అంటూ ప్రతిజ్ఞ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై కాంగ్రెస్‌ మండిపడింది. అసలు బాహుబలి ఎవరో ఎన్నికల్లో తేలిపోతుందని పేర్కొంది. ఈ వీడియోకు తమకూ ఎలాంటి సంబంధం లేదని బిజెపి చెబుతోంది. 

21:24 - August 31, 2018

ఢిల్లీ : 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ పరమ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆధారాలతోనే పౌర హక్కుల నేతలను అరెస్ట్‌ చేసినట్లు మీడియా సమావేశంలో ఎడిజి స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నారని, మావోయిస్టులు వేసిన ప్రణాళికలకు పౌర హక్కుల నేతలు సహకరించారని ఎడిజి వెల్లడించారు. ఈ కుట్రలో ఓ ఉగ్రవాద సంస్థకు కూడా ప్రమేయం ఉందని చెప్పారు. మానవ హక్కుల నేతలు మావోలతో సంభాషణలు జరిపిన కొన్ని లేఖలను ఏడీజి మీడియా ముందు ప్రదర్శించారు. గ్రనేడ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఉంది. భీమా-కోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పౌర హక్కుల నేతలు వరవరరావు, సుదా భరద్వాజ్, గౌతమ్ నవలక, అరుణ్ ఫెరిరా, వెర్నన్ గొంజాలెజ్‌లను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్లను గృహనిర్బంధంలో ఉంచారు.

21:19 - August 31, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు నియోజకవర్గాల్లో తిరగరని హెచ్చరించారు. 

21:16 - August 31, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడూ పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సెప్టెంబర్‌ 2న జరిగే టీఆర్‌ఎస్‌ సభ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు మల్లారెడ్డి.

21:14 - August 31, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతినివేదన సభకు రైతులు వేలాదిగా తరలివెళ్తున్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 2వేల ట్రాక్టర్లతో 20వేల మంది రైతులు ఖమ్మం నుండి చైతన్య యాత్రగా బయలుదేరారు. సభకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికీ అన్ని వసతులు కల్పిస్తామంటున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

21:07 - August 31, 2018

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ టీమ్‌ ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితమైంది. గేమ్స్‌లో 13వ రోజైన శుక్రవారం జపాన్‌తో ఫైనల్లో తలపడిన భారత్ జట్టు 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు అవకాశాన్ని కూడా భారత్ చేజార్చుకుంది. ఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా గేమ్స్‌లో పసిడి పతకం గెలుపొందిన భారత మహిళల హాకీ టీమ్.. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత అంటే 20 ఏళ్ల తరువాత ఫైనల్‌కి చేరింది. అయితే.. తుది మెట్టుపై అనూహ్యంగా తడబడి స్వర్ణ పతకంతో పాటు ఒలింపిక్స్‌ బెర్తుని కూడా చేజార్చుకుంది. గురువారం భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. తాజా రజత పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 65కి చేరింది. ఇందులో 13 స్వర్ణాలు, 23 రజతాలతో పాటు 29 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అంచనాలు అందుకుంటూ.. జోరు కొనసాగిస్తున్న మహిళల టీమ్ ఈరోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి తుది పోరు‌కి అర్హత సాధించింది. ఆసియా గేమ్స్‌లో 1998 తర్వాత భారత మహిళల హాకీ టీమ్ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. జపాన్‌తో శుక్రవారం భారత్ జట్టు పసిడి పతకం కోసం ఫైనల్ ఆడనుంది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ జట్టు దూకుడైన ఆటతో చైనాతో ఆడుకుంది. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో మ్యాచ్ 52వ నిమిషం వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదవలేదు. అయితే.. ఈ దశలో గుర్జీత్ కళ్లు చెదిరే గోల్‌తో భారత్‌కి 1-0తో ఆధిక్యం అందించగా.. ఆ తర్వాత ఆధిక్యాన్ని సమం చేసేందుకు చివరి వరకూ చైనా ప్రయత్నించింది. కానీ.. ఫలితం లేకపోయింది. 1982 ఆసియా గేమ్స్‌లో పసిడి పతకం గెలుపొందిన భారత మహిళల హాకీ టీమ్.. ఆ తర్వాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో భారత్ మహిళల టీమ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 

సెప్టెంబర్ 2న టీ.కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న మ.1.గంటకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి నివేదన సభకు గంట ముందుగానే కేబినెట్ సమావేశం జరగనుంది. ముందస్తు ఊహాగానాలతో కేబినెట్ సమావేశానికి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 

20:43 - August 31, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో సామాన్యుడు ఎంతగా మెత్తుకున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గత కొంతకాలం నుండి వరుసగా పెరుగతునే వున్నాయి. ముంబైలో రై.85.78 పైసలుగా వుంటే హైదరాబాద్ లో రూ.83.02 పైసలుగా వుంది. రికార్డులో స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా అంతకంతకు దిగజారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణతో..

ప్రభుత్వ రద్దు ఎందుకో ప్రజలకు చెప్పాలి : కృష్ణయ్య

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని, ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వాళ్లకు ఏ గతి పట్టిందో కేసీఆర్ కూ అదే గతి పడుతుందని అన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, బీసీలను అణచివేసే కుట్రతోనే క్రిమిలేయర్ తెచ్చారని విమర్శించారు.

19:33 - August 31, 2018

రంగారెడ్డి : వచ్చే నెల 2న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు హాజరయ్యే ప్రజలను అలరించేందుకు సాంస్కృతిక బృందాలు సిద్ధమవుతున్నాయి. కళాకారుల బృందాలు విస్తృతంగా రిహార్సల్స్‌ చేస్తున్నాయి. ఆటలతో..పాటలతో సభికులను అలరించేందుకు గాయకులు వారి గళాన్ని సరిచేసుకుంటుంటే..నృత్యకులు వారి పాదాలకు మరింతగా శిక్షణనిచ్చి నృత్యంతో సభికులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మీకోసం..

19:26 - August 31, 2018

సంగారెడ్డి : జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో చార్జ్ తీసుకున్న హనుమంతరావు పరిపాలనా సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ.. గడా ప్రత్యేకాధికారిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా హనుమంతరావు సంగారెడ్డి కలెక్టర్‌గా నియమితులయ్యారు. విద్య, సంక్షేమం, కాలుష్యం నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తానంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు తెలిపే విశేషాలతో..

19:23 - August 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌.... టీడీపీ, బీజేపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకోదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని టీడీపీ, వైసీపీలకు భయం పట్టుకుందన్నారు. సెప్టెంబర్‌ 18న కర్నూలులో రాహుల్‌ పర్యటిస్తారని... ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ ఒక్కటే అని రఘువీరా అన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ సభ నిర్వహించబోయే ఎస్టీబీసీ గ్రౌండును రఘువీరా రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు.

19:21 - August 31, 2018

తిరుపతి : ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో ఆధునిక క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎన్టీఆర్‌ క్యానర్స్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటుకానున్నాయి. వైద్యరంగంలో ఏపీని కేంద్ర స్థానంగా అభివృద్ధి చేస్తామని తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతి అలిపిరిలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో ఆధునిక క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. అలిపిరి జంతు ప్రదర్శనశాల సమీపంలో టీటీడీ 25 ఎకరాల భూమి కేటాయించింది. శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసర్చ్‌... స్వీకార్‌ పేరుతో నిర్మిస్తున్న ఈ సంస్థకు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు.

ఏపీ, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, అసోం, రాజస్థాన్‌లో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రులు
వచ్చే ఏడాది నుంచి మొదటి దశ వైద్య సేవలు ప్రారంభించేలా స్వీకార్‌ నిర్మాణం చేపడతారు. బోన్‌ మ్యారో సహా అన్ని రకాల క్యానర్స్‌కు ఇక్కడ వైద్యం అందిస్తారు. క్యాన్సర్‌ పరిశోధనా సంస్థగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏపీతోపాటు జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, అసోం, రాజస్థాన్‌లో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రులు ఏర్పాటువుతున్నాయి. తిరుపతి స్వీకార్‌ దక్షిణాది రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ముందుగా 376 పడకలతో దీనిని నిర్మిస్తారు. ఆ తర్వాత వెయ్యి పడకలకు విస్తరిస్తారు. ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, నెల్లూరులో కేన్సర్‌ ఆస్పత్రులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు ఏర్పాటు చేస్తున్నారు. కేన్సర్‌ ఆస్పత్రులులేని 9 జిల్లాల్లో ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తామని స్వీకార్‌కు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

దేశవ్యాప్తంగా 124 క్యాన్సర ఆస్పత్రులు..
టాటా ట్రస్ట్‌ ముంబయి, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా 124 ఆస్పత్రులను నిర్వహిస్తోంది. ప్రాణాంతక క్యానర్స్‌ను చికిత్సతో నయంచేసే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా చెప్పారు.

శ్రీవారిని దర్శించుకున్న రతన్ టాటా..
స్వీకార్‌ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుమల వచ్చిన రతన్‌ టాటా శుక్రవారం ఉదయం విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. నిజపాద దర్శనానికి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న రతన్‌ టాటాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

19:16 - August 31, 2018

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. కారు పార్టీలో టికెట్ల రేట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సిట్టింగులకు దక్కే ప్రాధాన్యత ఎంత? అనే ఆందోళన అందరిలోను నెలకొంది. ఎన్నికల బరిలోకి దిగే కొత్త నేతలెవరు? మరి గులాబీ బాస్ మదిని దోచేదెవరు? టికెట్ దక్కించుకునేదెవరు? ఈ క్రమంలో కేసీఆర్ ప్రగతి నివేదన సభలో టికెట్ల నేతలను ప్రకటించనున్నారా? ఇప్పుడు అందరి కళ్లు కొంగరకలాన్ లో జరిగే ప్రగతినివేదన సభవైపే వుంది. హైదరబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులెవరు? అనే అంశాలపై 10టీవీ చేతిలో ఎక్స్ క్యూజివ్ రిపోర్ట్ ఈనాటి రేసుగుర్రంలో చూద్దాం..

ఏపీ ప్రత్యేక హోదా కోసం యువకుడు ఉరి..

విశాఖపట్నం : నక్కపల్లిలో ఓ విద్యార్థి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దొడ్డి త్రినాథ్ అనే రాజమండ్రికి చెందిన యువకుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. సెల్ టవర్ కు ఉరి వేసుకున్న త్రినాథ్ ను చూసిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు త్రినాథ్ మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. అతని పాకెట్ లో ఆత్మహత్య లేఖ లభించింది. కాగా తన తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తు ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ..ఇందుకు వారు క్షమించాలని లేఖలో త్రినాథ్ పేర్కొన్నాడు.

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ..

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లీ... టెస్టుల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఆటగాళ్లలో 119 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 120 రికార్డును కోహ్లీ అధిగమించాడు. 117 ఇన్నింగ్స్ లలో ఆరు వేల పరుగులను పూర్తి చేసిన గవాస్కర్ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతలను సాధించినవారిలో డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం 68 ఇన్నింగ్స్ లలోనే ఆయన ఈ ఘనతను సాధించారు. 

18:32 - August 31, 2018

విశాఖపట్నం : నక్కపల్లిలో ఓ విద్యార్థి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దొడ్డి త్రినాథ్ అనే రాజమండ్రికి చెందిన యువకుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. సెల్ టవర్ కు ఉరి వేసుకున్న త్రినాథ్ ను చూసిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు త్రినాథ్ మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. అతని పాకెట్ లో ఆత్మహత్య లేఖ లభించింది. కాగా తన తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తు ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ..ఇందుకు వారు క్షమించాలని లేఖలో త్రినాథ్ పేర్కొన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత పోరాటం చేయాలని త్రినాథ్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. 

18:04 - August 31, 2018

రంగారెడ్డి : ప్రగతి నివేదన సభ జన సమీకరణ కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్‌ ముందు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. కొంగరకలాన్ జాతరకు తరలివెళ్లి సభను విజయవంతం చేస్తామంటున్న పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. 

17:58 - August 31, 2018

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం జఠిలమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి. మొన్నటివరకు జమిలి ఎన్నికలకు సై అన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు సడెన్‌గా యూటర్న్‌ తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించినట్లు తెలిపారు. 

17:56 - August 31, 2018

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడిచమురు ధరల్లో పెరుగుదల వెరసి రూపాయి పతనం కొనసాగుతోంది. తాజాగా డాలరుకు రూపాయి మారకం విలువ రూ.71కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. ట్రేడింగ్ సెషన్ లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ తాజాగా మరో 26 పైసలు కోల్పోయి తొలిసారిగా రూ.71కు దిగజారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. చమురు సెగకు తోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భయం, దేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్న వేళ రూపాయి పతనం ఈ రోజు కూడా కొనసాగింది. కాగా ప్రస్తుతం రూపాయి విలువ అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు రూ.70.94 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డ్‌ స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై అత్యంత కనిష్ట స్థాయి 71 రూపాయలకి చేరింది. క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

17:53 - August 31, 2018

కేరళ : భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రస్ రిలీఫ్ ఫండ్‌కు 1,027 కోట్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. వరదల బారినపడిన కేరళకు 4.76 లక్షల మంది ఆన్‌లైన్‌లో విరాళాలిచ్చారు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా 145.17 కోట్లు, యూపీఐ ద్వారా 46 కోట్లు, డైరెక్ట్ డిపాజిట్లు, చెక్కుల రూపేణా 835.86 కోట్లు వచ్చాయి. వందేళ్ల కేరళ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 20 వేల కోట్లకు పైగా నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం కేరళకు 600 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళి ప్రజలను కలుసుకుని విరాళాలు అందజేయాలని కోరనున్నట్లు కేరళ సిఎం పినరయి విజయన్‌ తెలిపారు. ఈ విపత్తులో సుమారు 483 మంది ప్రాణాలు కోల్పోగా, 14.50 లక్షల మంది 3,000కు పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

17:50 - August 31, 2018

జమ్ముకశ్మీర్‌ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 35 ఏ అధికరణపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 35ఏ అధికరణ రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తరపున ఏఎస్‌జి తుషార్‌ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భద్రతా సంస్థలు ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ జనవరి 19, 2019కు వాయిదా వేసింది. ఆర్టికల్‌ 35 ఏ అధికరణం రద్దు చేయొద్దని కోరుతూ వేర్పాటు వాదులు జమ్ముకశ్మీర్‌లో గురు, శుక్రవారాల్లో బంద్‌ పాటించారు. 1954లో రాష్ట్రపతి ఆదేశాలతో ఆర్టికల్‌ 35 ఏ చట్టబద్దమైంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. భూములు, ఉద్యోగాల్లో కేవలం కశ్మీరీలకు మాత్రమే హక్కు ఉంటుంది. 

వెయ్యి పడకలతో క్యాన్సర్ ఆసుపత్రి : చంద్రబాబు

తిరుపతి : తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి చంద్రబాబు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మొత్తం వెయ్యి పడకలకు గాను తొలిదశలో 376 పడకలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు కేన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా కేన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారని చంద్రబాబు తెలిపారు.

ప్రభుత్వాలు చేయలేని పని టాటా ట్రస్ట్ చేస్తోంది : చంద్రబాబు

తిరుపతి : కేన్సర్ వ్యాధిని నివారించేందుకు..క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల కోసం ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి చంద్రబాబు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారతదేశంలో చాలా మంది ఉన్నప్పటికీ, అందరి కన్నా ముందుండే వ్యక్తి రతన్ టాటా అని, దేశ వ్యాప్తంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా తక్కువే అన్నట్టుగా ఆయన ఎంతో ఉదారంగా ముందుకు వెళ్తున్నారని, ఇలి చాలా గొప్ప విషయమని అన్నారు.

రంభ, ఊర్వశిల్లో అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి : రాజమండ్రి నగరంలోని రంభ, ఊర్వశి థియేటర్లలో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా తీవ్ర భయాందోళనలకు గురైన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. అగ్నిప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు. ట్రాఫిక్ జామ్ అయింది. 

హైకోర్టును ఏపీకి ఇచ్చేస్తామన్న తెలంగాణ..

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

17:22 - August 31, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో మూడు సినిమా థియేటర్లకు చాలా పేరుంది. వాటికి ఆ పేరు వాటి పేర్ల వల్లనే వచ్చింది. రంభ, ఊర్వశి, మేనక అనే పేర్లతో ఆ సినిమా థియేటర్లు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో అనుమతులు లేకండా ఈ మూడు థియేటర్ల ప్రాంగణంలో నిర్మించిన ఫన్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నారులు ఆడుకునేందుకు ఓ ఫన్ జోన్ నిర్మించారు. చిన్నారులు ఆడుకునేందుకు నిర్మించిన ఫన్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు ఫన్ జోన్ లో లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఫన్ జోన్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం ఏర్పడింది. కాగా మాజీ ఎమ్మెల్యే భవనం కావటంతో ఎవరు ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయటంలేదనే విషయం తెలుస్తోంది.  

17:17 - August 31, 2018

విజయవాడ : రేపు ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. రాబోయే ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్లను, సీనియర్ క్రికెటర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేస్తామని క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 2019 ప్రపంచ కప్‌ కోసం కోర్ టీం సిద్ధం చేస్తున్నామన్నారు. అమరావతి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం తాను ఎదురుచూస్తున్నంటున్న ఎమ్మెస్కే ప్రసాద్ తో మా ప్రతినిధి నరసింహరావు తెలిపే వివరాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

17:14 - August 31, 2018

నెల్లూరు : పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. జీవో నెం 279 రద్దు చేయాలని 18 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా అనారోగ్యాలబారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతుఆన్నరు. అస్థవ్యస్తమైన పారిశుద్ధ్యంతో నిండిపోయిన నెల్లూరు జిల్లా వాసుల పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.

17:00 - August 31, 2018

రంగారెడ్డి : ప్రగతినివేదన సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలను సమీకరిస్తామన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. మండలాల వారీగా కోటాలు నిర్ణయించుకొని గులాబీ నేతలు సభను సక్సెస్‌ చేసేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి 3 లక్షలకు పైగా ప్రజలు సభకు వస్తారంటున్న జగదీశ్‌ రెడ్డి తెలిపారు.

16:57 - August 31, 2018

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై వున్న కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శ్రావణమాసం సందర్భంగా శ్రావణ శోభ సంతరించుకుంది. మహిళలంతా వరలక్ష్మీ నోముతో కళకళలాడుతో కనిపించారు. దీంతో ఇంద్రకీలాద్రి శ్రావణమాస శోభను సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. వందలాది మహిళలు తరలివచ్చి సామూహిక వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీపై మరింత సమాచారం ఈ వీడియోను చూడండి...

16:53 - August 31, 2018

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

16:49 - August 31, 2018

శ్రీకాకుళం : మూడు దశాబ్దాల సమస్యపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తున్న మూత్రపిండాల వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఉన్నతాధికారులు. వైద్యసేవలు, పెన్షన్లు, ఉచిత మందులు నేరుగా అందించాలని నిర్ణయించారు.

గత ముప్పై ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి..

గత ముప్పై ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా వేధిస్తోంది. వేలాది మంది మృత్యువాత పడగా.. లక్షలాది మంది రోగులు ఉన్నారన్నది ఆందోళన కలిగిస్తున్నఅంశం. కిడ్నీ వ్యాధిని సైతం రాజకీయం చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో.. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో సేవలందించేందుకు శ్రీకారం చుడుతోంది.

మరో రెండు నెలల్లోగా గ్రామాల్లో స్క్రీనింగ్
జిల్లాలోని నాలుగవ వంతు జనాభా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దృష్ట్యా.. మరో రెండు నెలల్లోగా గ్రామాల్లో స్క్రీనింగ్ జరపాలని నిర్ణయించారు కలెక్టర్ ధనుంజయరెడ్డి. మరో డెబ్భై వేలమందికి పరీక్షలు జరిపి వివరాలు సేకరించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వి.ఆర్.ఓ, మండల వైద్యాధికారితోపాటు జిల్లా ఉన్నతాధికారుల బృందం కిడ్నీ వ్యాధిగ్రస్థులతో మమేకమయ్యేందుకు చర్యలు చేపడుతున్నారు. కిడ్నీ బాధితులకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు.. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ నేతృత్వంలో ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విరివిగా డయాలసిస్ కేంద్రాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుతో పాటు.. పెన్షన్లు, ఉచిత మందులతో మరింత తోడ్పాటు అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థలు, గ్రామకమిటీల సమన్వయంతో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు అడుగేయడం ఆశించదగ్గ పరిణామం.. బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి సర్వేతో మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. 

హరికృష్ణతో కామినేని సిబ్బంది సెల్ఫీ విమర్శలు..

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరికృష్ణను ఆసుపత్రికి తరలించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా గాయలపాలైన హరికృష్ణ పరిస్థితిని అర్థం చేసుకోకుండా..వైద్యం చేయకుండా సెల్ఫీలు తీసుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ ఫోటోను ఆసుపత్రి సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టటంతో అది వైరల్ గా మారటం..విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

16:27 - August 31, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరికృష్ణను ఆసుపత్రికి తరలించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా గాయలపాలైన హరికృష్ణ పరిస్థితిని అర్థం చేసుకోకుండా..వైద్యం చేయకుండా సెల్ఫీలు తీసుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ ఫోటోను ఆసుపత్రి సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టటంతో అది వైరల్ గా మారటం..విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ఫీల పిచ్చితో కొందరు బాధితుల పరిస్థితిని కూడా పట్టించుకోకపోవటం..కనీస మానవత్వపు ఛాయలను కూడా మరచిపోయి గాయపడిన హరికృష్ణ బెడ్ మీద వున్న వైద్యం లేకుండా పడి వున్న హరికృష్ణతో సెల్ఫీలు తీసుకున్నారు. కాగా హరికృష్ణ మృతి అనంతం ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

16:19 - August 31, 2018

కొచ్చి  : కేరళ వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ఈ భారీ వరదల్లో 370 మంది ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవగా... 3 వేల పైచిలుకు పునరావాస కేంద్రాలను ఏర్పాలు చేశారు. 54 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 3 లక్షల మంది రైతులు భారీగా నష్టపోయారు. 537 కొండచెరియలు విరగిపడినట్లు గుర్తించారు. 221 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనాలు తెలుపుతున్నాయి. 

అయితే ఈ మహాప్రళయానికి జాతి యావత్తు కదిలి వచ్చింది. వేలాది మంది స్వచ్చందంగా కదిలి కేరళ వరద బాధితులకు బాసటగా నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు వెయ్య కోట్లు దాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

సీఎమ్ డీఆర్ ఎఫ్ వెబ్ సైట్ లెక్కల ప్రకారం ఎలక్ట్రానిక్ విధానం ద్వారా రూ. 145 కోట్ల విరాళాలు రాగా.. రూ. 46 కోట్లు యూపీఐ, క్యూఆర్, వీపీఏ పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చింది. ఇక నగదు, చెక్కులు, ఆర్టీజీఎస్ ద్వారా రూ. 835 కోట్ల విరాళాలు వచ్చాయి. 

కాగా భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 483 మంది మరణించినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు.

15:48 - August 31, 2018

విజయవాడ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కుమారస్వామికి ఘన స్వాగతం పలికారు. కుమారస్వామిని సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీతో తమది సోదర బంధం అన్నారు కుమారస్వామి. ఎన్డీఏ ఓటమే తమ ముందున్న ప్రధాన అజెండా అన్నారు. 

15:47 - August 31, 2018

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక వైఫల్యమని విమర్శించారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇప్పటికీ రద్దు భారం ప్రజలు మోస్తున్నారని తెలిపారు. ఒక్క వ్యక్తిని హత్య చేస్తే యావజ్జీవ శిక్ష లేదా ఉరి వేస్తారని అలాంటిది 150 మంది చనిపోవడానికి కారణమైన ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్‌ చేశారు.

15:46 - August 31, 2018

హైదరాబాద్ : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో లైన్‌మెన్‌ ఆకుల రాజేందర్‌. తన వద్దకు ట్రాన్స్‌ఫారం సిటీ మీటర్‌ కోసం వచ్చిన బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 50వేలు లంచం అడిగాడు. దీంతో బాలకృష్ణ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి సబ్‌ స్టేషన్‌లో 50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి లైన్‌మెన్‌ రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

15:45 - August 31, 2018

బీహార్ : ఐఆర్‌సిటిసి అవినీతి కేసులో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వియాదవ్‌కు ఊరట లభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కేసులో రబ్రీదేవి, తేజస్వీతో పాటు నిందితులందరికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రబ్రీదేవి, తేజస్వియాదవ్‌లకు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో అక్టోబర్ 6న హాజరు కావాలని లాలూ ప్రసాద్‌కు కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. లాలు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రయివేట్‌ హోటళ్లకు కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. దాణా స్కాం కేసుల్లో శిక్ష పడిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ పెరోల్‌ ముగియడంతో గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.

15:44 - August 31, 2018

కేరళ : మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం భావాలను కించపరిచేలా పాట ఉందన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పాటలో ప్రియ కన్నుకొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 'ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పని లేదా?' అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్యాన్సర్ రోగులకు శుభవార్త..

తిరుపతి : క్యాన్స్ రోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. క్యాన్సర ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ఆధునాతనమైన సౌకర్యాలు శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థలో రాబోతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ రతన్ టాటా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తిరుపతి క్యాన్సర్‌ ఆసుపత్రి రేడియోషన్‌ థెరపీ హబ్‌గా తయారవుతుందని చంద్రబాబు అన్నారు. క్యాన్సర్‌ అనేది భయకరమైన వ్యాధి అని..

15:33 - August 31, 2018

తిరుపతి : క్యాన్స్ రోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. క్యాన్సర ట్రీట్‌మెంట్‌కు అవసరమైన ఆధునాతనమైన సౌకర్యాలు శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థలో రాబోతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ రతన్ టాటా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తిరుపతి క్యాన్సర్‌ ఆసుపత్రి రేడియోషన్‌ థెరపీ హబ్‌గా తయారవుతుందని చంద్రబాబు అన్నారు. క్యాన్సర్‌ అనేది భయకరమైన వ్యాధి అని.. క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్‌ చాలా అవసరమని చంద్రబాబు చెప్పారు. 

అన్ని జిల్లాల్లోను క్యాన్సర్ ఆసుపత్రులు అవసరం : చంద్రబాబు

తిరుపతి : శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ వైద్య, విజ్నాన సంస్థ నిర్మాణానికి, క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో క్యాన్సర్ ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. క్యాన్సర్ వైద్య, విజ్నాన సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. 376 పడకలతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపనచేశారు. 2020 నాటికి లక్షా 50 వేల మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం వుందని నివేదికలే తేల్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు రావాల్సిన అవసరం వుందని చంద్రబాబు పేర్కొన్నారు.

14:04 - August 31, 2018

రంగారెడ్డి : జిల్లా మైలార్‌దేవుపల్లిలో ఫర్నిచర్‌ షాపు యజమానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఇద్దరు నిందితులు స్కూటీపై పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శంషాబాద్‌కు చెందిన నర్సింగ్‌ అనే వ్యక్తి మైలార్‌దేవుపల్లిలో టింబర్‌ డిపో నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు డోర్లు కావలంటూ టింబర్‌ డిపోలోకి వచ్చారు. డోర్ల విషయం గురించి ఆఫీసు రూంలో మాట్లాడుతుండగా.. ఓ యువకుడు కత్తి తీసి నర్సింగ్‌ చాతిలో పొడిచాడు. దీంతో నర్సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు రక్షించండి అంటూ ఛాతిలో ఉన్న కత్తితో నర్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. దీంతో పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

14:01 - August 31, 2018

కరీంనగర్‌ : ప్రేమలో మరో యువతి మోస పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ హత్యలు, ప్రేమ పేరిట మోసాలు అధికమౌతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగిస్తుంటారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి...మరో యువతితో పెళ్లి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే...జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంటలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. మహేందర్‌ అనే వ్యక్తి తనను ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధితురాలు ఆరోపించింది. మహేందర్‌ పెళ్లి చేసుకుంటే.. తననే పెళ్లి చేసుకోవాలని.. వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాటానికి వీలులేదని బాధితురాలు తేల్చిచెప్పింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:55 - August 31, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకురాలు బి. జయ కన్నుమూశారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కేర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గుండమ్మగారి మనువడు, లవ్‌లీ, చంటిగాడు, వైశాఖం సహా ఏడు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. జయ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు జయ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు పంచుకున్నారు. 

13:53 - August 31, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు ఆవేదనలో ఉన్నారని అందుకే వారు ఆవేదన సభ పెడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం సాధించడంతో సీఎం కేసీఆర్‌ ఘనత మరోసారి స్పష్టమైందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రగతినివేదన సభకు రైతు సమన్వయ సమితి సభ్యులందరూ తరలిరావాలని సూచించారు.

13:51 - August 31, 2018

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ క్యాన్సర్‌ అండ్‌ కేర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చిత్తూరులో బాబు..రతన్ టాటా..

చిత్తూరు : అలపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఎంపీలు కేశినేని నాని, శివప్రసాద్, టీటీడీ ఈవో సింఘాల్, ఎమ్మెల్యే సుగుణమ్మలు హాజరయ్యారు. 

12:04 - August 31, 2018

హైదరాబాద్ : 'ప్రగతి నివేదన' సభకు లైన్ క్లియర్ అయ్యింది. టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెప్టెంబర్‌ 2న జరుపనున్న భారీ బహిరంగ సభ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు , న్యాయవాది అయిన పూజారి శ్రీధర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు వాదనలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలుగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ హామీతో పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 

టిడిపితో తమది సోదర బంధం -కుమార స్వామి...

విజయవాడ : టిడిపితో తమది సోదర బంధమని కర్నాటక సీఎం కుమార స్వామి పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సినవసరం ఉందని, వీలైనన్నీ పార్టీలను కలుపుని వెళుతామన్నారు. ఇప్పటికే చర్చలు జరిపామని, ఈ రోజు జరిగిన భేటీ దానికి కొనసాగింపు అన్నారు. 

ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ కొట్టివేత...

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలుగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ హామీతో పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 

ఇంద్రకీలాద్రిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్...

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్ దర్శించుకున్నారు. ఆసియా కప్ పాల్గొనే జట్టును రేపు ప్రకటిస్తామని టెన్ టివితో ప్రసాద్ తెలిపారు. రాబోయే ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని యువ క్రికేటర్లను సీనియర్ క్రికేటర్లతో సమతూకంగా జట్టు ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే 2019 ప్రపంచ కప్ కోసం కోర్ టీం సిద్ధం చేయడం జరుగుతోందని, క్రికెటర్ల ఫామ్ ఆధారంగా వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో యువ క్రికెటర్లకు కొదవ లేదని, త్వరలోనే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.

11:34 - August 31, 2018

హైదరాబాద్‌ : నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీసుల మామూళ్ల దందా మితిమీరిపోతోంది. కుల్సుంపురా సీఐ డ్రైవర్‌ కాశిరెడ్డి, హోంగార్డు శ్రీరాములు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. మేకలమండిలో వాహనాల డ్రైవర్ల నుండి వీరిద్దరూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు వీరిద్దరూ ఇదేవిధంగా వ్యవహరిస్తుండడంతో సహనం కోల్పోయిన డ్రైవర్లు.. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు.

11:32 - August 31, 2018

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో వెండి పతకం సాధించిన విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రాష్ట్రానికి చేరుకున్నారు. జ్యోతి సురేఖకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో మరోసారి అవకాశం వస్తే స్వర్ణ పతాన్ని సాధిస్తానని జ్యోతి తెలిపారు. వచ్చే నెలలో టర్కీలో జరిగబోయే క్రీడల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. తనకు ప్రభుత్వం సహాకారంతో పాటు ఇతరులు సహాయ సహకారులు అందిస్తున్నట్లు జ్యోతి సురేఖ తెలిపారు. 

11:30 - August 31, 2018

 

నిజామాబాద్‌ : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 19 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సంజయ్‌ బయటికి వచ్చారు. శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్ధినిలు.. మాజీ మేయర్ సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ హోంమంత్రితో పాటు జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీసులు సంజయ్‌ని అరెస్ట్‌ చేశారు. సంజయ్‌పై లైంగిక వేధింపులతో పాటు నిర్భయ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది సాక్ష్యులను విచారించిన పోలీసులు వారి వాంగ్మూలం సేకరించారు.

 

11:27 - August 31, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలవుతోంది. కానీ.. తెలంగాణాలో ఆ వేడి కాస్త ముందుగానే రాజుకుంటోంది. ఎన్నికల కుంపట్లో ముందస్తుగానే ఆజ్యం పోశారు సీఎం కేసీఆర్. కానీ.. కేసీఆర్ ముందస్తు జపానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు వాస్తు, జ్యోతిష్య పండితులు. ఆ వివరాలేంటో చూద్దాం..

ఏ క్షణంలోనైనా ఎన్నికలకు తాము సిద్ధమని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఎన్నికల వేడి రెట్టింపైంది. కానీ.. తాము ముందస్తుకైనా సిద్ధమేనని కేసీఆర్‌ అనడం వెనుక వాస్తు, జ్యోతిష కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. జ్యోతిషం, వాస్తుపై నమ్మకంతోనో ఎప్పట్నుంచో కొనసాగుతున్న సెక్రటేరియట్‌ను కాదని... వేరే చోట నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెదక్ జిల్లాలో ఎర్రవల్లిలో ఆయుత చండీయాగం కూడా అలాంటి నమ్మకంలో భాగమే.

కేసీఆర్ జన్మ నక్షత్రానికి కుజు గ్రహం సహకారం చాలా అవసరమని.. అందుకే కుజుడు కక్ష్యలోకి రాగానే శుభకార్యాలు మొదలుపెట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులంటున్నారు. గురుడు అక్టోబర్ 12న వృశ్చికంలోకి చేరుతాడు. దీంతో గురుడు విశేష దృష్టి కర్కాటకం మీద పడుతుందని.. అప్పుడు కేసీఆర్ ఏపని మొదలుపెట్టినా శుభమే అంటున్నారు వాస్తు నిపుణలంటున్నారు.

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్‌కు అనుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది యాదృచ్చికమా... వాస్తవమా... అన్నది పక్కనపెడితే.. ఈ సమయంలో అనుకూల ఫలితాలుంటాయనే కేసిఆర్ ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. 

11:11 - August 31, 2018

విజయవాడ : కర్నాటక సీఎం కుమార స్వామి విజయవాడకు వచ్చారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి కుమార స్వామి కుటుంబసమేతంగా విజయవాడకు వచ్చారు. గేట్ వై హోటల్ బస చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆంజనేయులు కుమార స్వామిని కలిశారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాలు కేంద్రంపై అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని, ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే విధంగా అన్ని ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకెళుతామన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కలవాల్సినవసరం ఉందన్నారు. 

11:07 - August 31, 2018

మెదక్ : జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటెనర్ బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు కంటెనర్ వేగంగా వెళుతోంది. టోల్ ప్లాజా వద్ద రెండు టోల్ బూత్ లు, రెండు కార్లను కంటైనర్ ఢీకొంది. వరంగల్ సీపీ విశ్వనాథ్ రవీంద్ర కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సీపీ బంధువు అనితకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాద సమయంలో కారులో సీపీ లేరు. 

కేసీఆర్ ఘనత ఏంటో మరోసారి స్పష్టమైంది - ఎంపీ గుత్తా...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఘనత మరోసారి స్పష్టమైందని ఎంపీ గుత్తా పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, నాలుగేళ్లుగా సాధించిన విజయాల కోసమే ప్రగతి నివేదన సభ అన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులంతా కుటుంబంతో సహా హాజరు కావాలని, కాంగ్రెస్ నేతలే ఆవేదనలో ఉన్నారని తెలిపారు. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. 

రబ్రీ, తేజశ్రీలకు ఊరట...

ఢిల్లీ : ఐఆర్ సీటీసీ కేసులో లాలూ కుటుంబానికి ఊరట లభించింది. రబ్రీదేవి, తేజశ్రీలకు పటియాల హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. 

ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపాం - బాబు...

విజయవాడ : గేట్ వే హోటల్ లో కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని, ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే విధంగా అన్ని ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకెళుతామన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కలవాల్సినవసరం ఉందన్నారు. 

ఐఆర్సీటీసీ కేసులో నిందితులకు బెయిల్...

ఢిల్లీ : ఐఆర్సీటీసీ కేసులో నిందితులందరికీ బెయిల్ లభించింది. 14 మందికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాల హౌస్ కోర్టు తీర్పును వెలువరించింది. 

కర్నాటక సీఎంతో బాబు...

విజయవాడ : గేట్ వే హోటల్ లో కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా ఉన్నారు. చిత్తూరు పర్యటనకు వెళుతూ మధ్యలో ఆగి కుమార స్వామితో బాబు, మంత్రులు భేటీ అయ్యారు. 

కంటైనర్ బీభత్సం..సీపీ బంధువు మృతి...

మెదక్ : తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటెనర్ బీభత్సం సృష్టించింది. రెండు టోల్ బూత్ లు, రెండు కార్లను కంటైనర్ ఢీకొంది. వరంగల్ సీపీ విశ్వనాథ్ కారుతో పాటు మరో కారుకు ప్రమాదం ఎదురైంది. కారులో ప్రయాణిస్తున్న సీపీ బంధువు అనిత మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో సీపీ లేరు. 

09:30 - August 31, 2018

కృష్ణా : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నివాసముంటున్న వృద్ధులే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు రాత్రి ఇంట్లో ఉండాలంటేనే వణికిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

దొంగలు పగలంతా సూదులు, ఇతరత్రా వస్తువులు విక్రయిస్తూ గల్లీలు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తుంటారు. ఒంటరిగా నివాసముంటున్న మహిళలు, వృద్ధుల ఇళ్లనే వారు టార్గెట్‌ చేస్తారు. ప్రధానంగా మహిళలే ఈ రెక్కీలు నిర్వహిస్తుంటారు. తర్వాత వారు పురుషులకు చెప్పడంతో వారు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అర్థరాత్రి గుంపులుగా వచ్చి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి ఈ దొంగలు హత్యలు చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు.

కృష్ణా జిల్లాలో వారం రోజులు నుంచి నందిగామ, కంచకచర్ల, జగ్గయ్యపేట, నూజివీడతోపాటు మచిలీపట్నం, హనుమాన్‌ జంక్షన్‌లాంటి ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో ఓ మహిళ తన భర్త అనారోగ్యంగా ఉన్నాడని వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుళ్ల చేశారు. ఎనిమిది లక్షల నగదు, నలబై తులాల బంగారం దోచుకెళ్లారు. నూజివీడులోని విస్సన్నపేట రోడ్డులో అర్థరాత్రి దొంగలు వరుసగా ఉనన నాలుగు షాపులలో ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు. గుడివాడ సమీపంలో బొమ్మినపాడులోని అంజిబాబు అనే దంపతులు రాత్రి సమయంలో వివాహానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో బయటకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి దోచుకెళ్తారా అన్న ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతే తమ లక్ష్యమని గొప్పలు చెబుతోందని.. మహిళలకు ఏమాత్రం రక్షణ కల్పించలేక పోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్తీల్లో గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

09:28 - August 31, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో అధికార టీఆర్ఎస్‌ ఆదివారం నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు కనీవినీ ఎరుగని రీతిలో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌ స్వయంగా మంత్రులు, నిర్వాహక కమిటీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆధునిక టెక్నాలజీతో అణువణువునూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. కొంగరకలాన్‌లో ప్రగతినివేదన సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. సభ వద్ద ఏర్పాట్ల గురించి సీఎం కేసీఆర్‌ నేరుగా మంత్రులు, నిర్వాహక కమిటీల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సభకు వచ్చేవారికి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సభా ప్రాంగణంలో సకల సౌకర్యాలు ఉండాలనీ, రాకపోకలకు వీలుగా మార్గాలుండాలని సీఎం సూచించారు. స్పష్టమైన సౌండ్‌ సిస్టం, ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు..

నిత్యం పలువురు మంత్రులు సభాస్థలంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా అధికారులు సభాప్రాంగణాన్ని ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేపట్టారు. కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. 23 వేలకు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు. వీవీఐపీలు, వీఐపీలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్ కెమెరాలను నిషేధించారు. ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. అలంకరణ పూర్తవుతోందని, కమిటీలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని వెల్లడించారు.

09:25 - August 31, 2018

కర్నూలు : నేటి నుండి మూడు రోజుల పాటు మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు మంత్రాలయానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ నేతలు పాల్గొననున్నారు. సమావేశం జరిగే ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సబూదేంద్ర తీర్థుల ఆశ్వీరాదం తీసుకున్నారు. 

09:21 - August 31, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తంగెళ్లమూడి కబాడిగూడెంలో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తిపై గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నలుగురు దాడి చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన సతీష్ ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి...

హైదరాబాద్ : మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.35 కాగా డీజిల్ ధర రూ. 76.47 కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.97 కాగా డీజిల్ ధర రూ. 77.76 కి చేరింది. 

జైలు నుండి విడుదలైన ధర్మపురి సంజయ్...

నిజామాబాద్ : ధర్మపురి సంజయ్ జైలు నుండి విడుదలయ్యారు. నర్సింగ్ విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పై విడుదలయ్యారు. 

సాగర్ గేట్లను తెరుస్తారా ?

శ్రీశైలం : నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రవాహంతో సాగర్ భారీగా నీరు వచ్చి చేరుతోంది. సాగర్ నీటి మట్టం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 582 అడుగులకు నీరు చేరింది. మధ్యాహ్నానికి ఇదే ప్రవాహం ఉంటే అధికారులు గేట్లను తెరుస్తారని తెలుస్తోంది. 

విమానంలో ఎయిర హోస్టెస్ కు వేధింపులు...

హైదరాబాద్ : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్ కు వేధింపులు ఎదురయ్యాయి. హైదరాబాద్ కు చెందిన అజయ్ రెడ్డిపై పైలట్ కు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కు పైలట్ సమాచారం అందించాడు. దీనితో ఎయిర్ పోర్టులో విమానం దిగగానే అజయ్ రెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. 

కేరళకు రూ. 1027 కోట్ల విరాళాలు...

ఢిల్లీ : వరదల బీభత్సంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఎంతో మంది ఆర్థిక సహాయం అందచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1027 కోట్ల రూపాలయ విరాళాలు అందాయని ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. 

జయకు సి.కళ్యాణ్ నివాళి...

హైదరాబాద్ : ప్రముఖ దర్శకురాలు జయ మృతి చెందడం పట్ల నిర్మాత సి.కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. జయ తమ కుటుంబసభ్యురాలని, , జయ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. జయ మృతి చెందడంతో భర్త రాజు కృంగిపోయాడని, తామంతా అతనికి సపోర్టుగా ఉంటామన్నారు. జయ మృతి తీరని లోటు అని విషాద వదనంతో వెలుబుచ్చారు. 

08:26 - August 31, 2018

హైదరాబాద్ : ప్రముఖ దర్శకురాలు జయ మృతి చెందడం పట్ల నిర్మాత సి.కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. జయ తమ కుటుంబసభ్యురాలని, , జయ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. జయ మృతి చెందడంతో భర్త రాజు కృంగిపోయాడని, తామంతా అతనికి సపోర్టుగా ఉంటామన్నారు. జయ మృతి తీరని లోటు అని విషాద వదనంతో వెలుబుచ్చారు.

సినీ దర్శకురాలు బి. జయ గుండెపోటుతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 ఏళ్లు. గుండమ్మగారి మనువడు, లవ్‌లీ, చంటిగాడు, వైశాఖంసహా మొత్తం ఏడు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా రంగంలో జర్నలిస్టుగా పనిచేసిన జయ.. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎంఏ, జర్నలిజంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

08:22 - August 31, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకురాలు బి. జయ కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 ఏళ్లు. గుండమ్మగారి మనువడు, లవ్‌లీ, చంటిగాడు, వైశాఖంసహా మొత్తం ఏడు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా రంగంలో జర్నలిస్టుగా పనిచేసిన జయ.. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎంఏ, జర్నలిజంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఇవాళ ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

08:14 - August 31, 2018

సంగారెడ్డి : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. వేగంగా రావడం...నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ డ్రైవర్ చేసిన తప్పిదం నలుగురు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన పలువురు ఓ శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు గుల్బార్గాకు వెళ్లారు. తిరిగి గురువారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. తుపాన్ వాహనంలో 11 మంది వస్తున్నారు. మార్గమధ్యంలో భోజనం నిమిత్తం ఆగారు. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించాడని...వద్దు అని చెబుతున్నా పెడచెవిన పెట్టాడని బంధువులు పేర్కొంటున్నారు.

మద్దికుంట వద్ద వేగంగా వెళుతున్న ఓ లారీని తప్పించబోయి మరో లారీని వేగంగా తుఫాన్ వాహనం ఢీకొంది. దీనితో అక్కడికక్కడనే నలుగురు దుర్మరణం చెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఎస్ఆర్ నగర్ వాసులు. శివాజీ (28), వరుణ్ (9), తూప్రీ (16), నాగేందర్ (50)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. వాహన డ్రైవర్ తప్పతాగి..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఘోరం జరిగిందని బంధువులు వాపోతునాన్రఉ.

మరోవైపు 65 జాతీయ రహదారిపై విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కడపకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు...

కడప : నేడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటించనున్నారు. కలెక్టరేట్ లో దళిత సంఘాల నుండి కమిషన్ సభ్యుడు శ్రీరాములు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం కలెక్టరేట్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.  

నార్కట్ పల్లి శివారులో రోడ్డు ప్రమాదం...

నల్గొండ : నార్కట్ పల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఓ బైక్ డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

అంబికా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం...

పశ్చిమగోదావరి : ఏలూరు అంబికా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమయానికి స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

సంగారెడ్డిలో ఆక్సిడెంట్...మృతుల వివరాలు...

సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద లారీని తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఎస్ఆర్ నగర్ వాసులు. శివాజీ (28), వరుణ్ (9), తూప్రీ (16), నాగేందర్ (50)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

06:54 - August 31, 2018

ఏపీలో ఉపాధ్యాయులు అందోళనబాట పట్టారు. శనివారం మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి కలెక్టరేట్ల ముట్టడికి ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. 68శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని డిసెంబర్ 31 లోపు ఇవ్వాలని నూతన వేతనాల్లో కనీసం వేతనం 20 వేలుగా నిర్ణయించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్స్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనబాట పట్టారు. వారి ఆందోళనకు గల కారణాలు ప్రభుత్వ విధానంపై టెన్ టివి 'జనపథం'లో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి విశ్లేషించారు. 

06:52 - August 31, 2018

ఢిల్లీ : భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్‌ మొదటి రోజు ఆటలో ఇండియా పైచేయి సాధించింది. తొలిరోజు 80.4 ఓవర్ల ఆట జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ను.. భారత బౌలర్లు 76.4 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ నాలుగు ఓవర్లలో వికెటేమీ నష్టపోకుండా 19 పరుగుల చేసింది. క్రీజులో ధావన్‌, రాహుల్‌ ఉన్నారు. టీమ్‌ ఇండియా బౌలర్లలో బుమ్రా, ఇషాంత్‌, షమి నిప్పులు చెరిగారు. ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు. పిచ్‌ నుంచి వచ్చిన సహకారంతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. బుమ్రా 3, ఇషాంత్‌ శర్మ 2, షమి 2, అశ్విన్‌ 2, పాండ్య ఒక వికెట్‌ పడగొట్టారు.

06:50 - August 31, 2018

హైదరాబాద్ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో చేస్తారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆయనకు మొండి పట్టుదల కూడా ఎక్కువే అంటారు. తాను తలపెట్టిన పనిలో ఏ చిన్న లోపం కనిపించినా... దాన్ని ఆపేస్తారని కూడా చెబుతుంటారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ సందర్భంగా... పై సీఎం ఆలోచనా విధానంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పడొచ్చినా సిద్ధమే అంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో.. రాష్ట్రంలో రాజకీయంగా అలజడిరేగింది. ఈ నేపథ్యంలో 25లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనం తమకు నీరాజనాలు పట్టబోతున్నారని ఈ సభ ద్వారా చాటబోతున్నారు. ఇందుకోసమే కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లోని 1600 ఎకరాల్లో నిర్వహించబోతున్న సభకు.. భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. కాగా ప్రతీపనినీ వాస్తుప్రకారం చేసేందుకే ఇష్టపడే కేసీఆర్‌.. వాస్తు ప్రమాణాలను పరిశీలించాకే కొంగర కలాన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాగంణాన్ని పూర్తిగా వాస్తుకు అనుగుణంగానే ఏర్పాటు చేయబోతున్నారు. కే, కో, హ, హీ అనే అక్షరాలు పునర్వసు నక్షత్రానికి చెందినవి. అందుకే సీఎం కొంగర కలాన్ గ్రామాన్ని ఎంచుకుని ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాస్తు నిపుణలు. కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కావడం.. పునర్వసు నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి మిత్ర తార కావడం కూడా ప్రధానమైన కారణమని వారంటున్నారు. కొంగర కలాన్‌తోపాటు.. కేసిఆర్ పేరులో ఉండే జ్యోతిష్య బలాన్ని బట్టే దీన్ని ఎంచుకుని ఉంటారని వాస్తు పండితులు అంటున్నారు.

మరోవైపు సెప్టెంబర్‌ 2 కూడా కీలకమైన తేదినే అంటున్నారు వాస్తు, జ్యోతిష్య పండితులు. ఈ తేదిన కృతికా నక్షత్రం సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఉంటుంది. ఇది కూడా కేసిఆర్ క్షేమ తార అవడం వల్లే ఈ రోజును ఎంచుకుని ఉండొచ్చంటున్నారు. కేసీఆర్ జన్మ నక్షత్రానికి తగ్గట్టుగా స్థల, తేదీలు కుదరడం వల్లే ఈ రోజును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తు, జ్యోతిష్యానికి అనుగుణంగా అడుగులేస్తున్న సీఎం కేసీఆర్‌కు అవి ఏమేరకు అనుకూలిస్తాయో వేచిచూడాల్సిందే..

06:48 - August 31, 2018

సంగారెడ్డి : జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలిక నిఖితను బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్న అరవింద్‌ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.ఈ ఘటన జరిగిన వెంటనే అరవింద్‌ను స్థానికలు ప్టటుకున్నారు. నిఖితను కూకట్‌పల్లి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. శవ పరీక్ష కోసం నిఖిత మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే నిఖిత హత్యకు కారణమని భావిస్తున్నారు. అరవింద్‌ మహారాష్ట్రలో చదువుతున్నాడు. సెలవుకు వచ్చినప్పుడల్లా ప్రేమ పేరుతో నిఖితను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

06:43 - August 31, 2018

విజయవాడ : ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ఊహించినట్టే చేస్తోంది. ముందే అనుకున్నట్టు 39 పోస్టులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. త్వరలో ఆర్టీసీలో మరికొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు ఉన్నతాధికారులు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఆమోదం లేని పోస్టులను రద్దు చేస్తూ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేడర్లలో కలిపి మొత్తం 39 పోస్టులను రద్దు చేశారు. ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో, ప్రధాన కార్యాలయంలో జూనియర్‌, సీనియర్‌ స్కేల్‌ కింద వందలాది మంది అధికారులు ఉన్నారు. అనుమతుల్లేకుండా 80 పోస్టుల్లో డిపో మేనేజర్‌, డివిజనల్‌ మేనేజర్‌, రీజినల్‌ మేనేజర్‌ స్థాయిల్లో అధికారులు కొనసాగుతున్నారని ఇటీవల నివేదిక రూపొందించారు. వీటితోపాటు 2000 కోట్లతో 760 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీలో బదిలీ విధానానికి రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రతిఏటా ఏప్రిల్‌ నెలకు ముందే సాధారణ బదిలీలు పూర్తి చేయాలని, విభాగాధిపతులు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు వాళ్ల సొంత జోన్లలో విధులు నిర్వర్తించడానికి వీల్లేదని, అధికారులు ఒకే రీజియన్‌లో మూడేళ్లపాటు పనిచేస్తే వారిని తప్పకుండా బదిలీ చేయాలని నిర్ణయించారు.

ఆర్టీసీలో పనిచేసే మరికొందరినీ సాగనంపేందుకు శరవేగంగా కసరత్తు చేపట్టారు. వ్యయ నియంత్రణ, పొదుపు, సంస్థపను అభివృద్ధి పథంలో నడిపించడం, ఏపీ వ్యాప్తంగా డిపోలకు కార్పొరేట్‌ హంగులు తీసుకురావడం, ఉన్న సిబ్బందితోనే సక్రమంగా పనిచేయించి నూతన బస్సులు కొనుగోలు చేయడం, ఖాళీ స్థలాలను , కార్యాలయాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి ఆదాయం రాబట్టడంలాంటి చర్యలకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలుత ఆర్టీసీ ప్రక్షాళణ దిశగా అడుగులేస్తోంది. ప్రధానంగా విజయవాడలాంటి నగరంలో అన్ని డిపోల్లో ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది, ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహాలో ఎంతమంది ఉన్నారని ఆర్టీసీ లెక్కకడుతోంది. పూర్తి నివేదిక సిద్దం చేసి హెచ్చు సంఖ్యలో ఉండే ఎంప్లాయీస్‌ను తప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. యాజమాన్యం అనుకున్నదే తడవుగా ఎంప్లాయీస్‌కు ఉద్వాసన పలకడంతో ఆర్టీసీలో కొందరు ఉద్యోగులు, సిబ్బందికి గుబులు మొదలైంది.

ఆర్టీసీలో ఉద్యోగుల తొలగింపుపై 10టీవీ ముందే హెచ్చరించింది. వరుస కథనాలు ప్రసారం చేసింది. 10టీవీ కథనాలతో అప్రమత్తమైన కొంతమంది ఉద్యోగులు తమపై వేటుపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే మరికొంత మందికి మాత్రం ఉద్యోగం గండం పొంచి ఉంది. దీనిపై కార్మికుల్లో ఆందోళన మొదలైంది.

వాస్తవానికి ఆర్టీసీలో 2007 నుంచి రిక్రూట్‌మెంట్లు లేవు. పైగా ఉన్న సిబ్బందిని , ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. 2011-12లో 13 జిల్లాల్లో 64,639 మంది కార్మికుల ఉంటే... వారిని ప్రస్తుతం 54,489కి కుదించారు. అంటే సుమారు 10,150 మంది కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం ఉద్వాసన పలికింది. అంతేకాదు.. కార్గో నిర్వహణ కోసం నియమించిన 16 మంది డిపో మేనేజర్లతోపాటు గ్యారేజీల్లో కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం సిద్ధపడటం కార్మికులకు మింగుడుపడటం లేదు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని ఆశిస్తోంటే... దానికి విరుద్దంగా తొలగిస్తుండడం గుబులు రేపుతోంది. కారుణ్య నియామకాలతోపాటు ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న పళాన తమను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంస్థ అభివృద్ధికి డిపోల సంఖ్య పెంచడంతోపాటు పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

06:38 - August 31, 2018

ఢిల్లీ : 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదిపై ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలోని 15-20 మంది క్రోని కాపిటలిస్టుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే మోది కావాలనే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీసి... అమెజాన్‌ లాంటి పెద్ద కార్పోరేట్‌ సంస్థలకు ఊతమిచ్చేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. మోదిని టీవీల్లో మార్కెటింగ్‌ చేసేందుకు కార్పోరేట్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని....ఆ డబ్బును ప్రజల నుంచి తీసుకుని వారి జేబుల్లో వేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. 

06:35 - August 31, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన వేదిక నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, బారికేడ్ల నిర్మాణం పనులు పూర్తికావచ్చాయి. హెలిప్యాడ్‌తో పాటు మొబైల్ ఫోన్ సిగ్నల్ టవర్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చరిత్రను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొంగరకలాన్‌కు వచ్చే రహదారులన్నింటినీ గులాబీమయంగా మార్చారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని సాంస్కృతిక బృందాలు.. కళాప్రదర్శనలతో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్ని వినేందుకు, చూసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్నవారు కూడా సభను తిలకించేందుకు వీలుగా 50 భారీ ఎల్‌ఈడీలు స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ప్రగతి నివేదన సభ ద్వారా వివరించనున్నారు. 

06:32 - August 31, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెప్టెంబర్‌ 2న జరుపనున్న భారీ బహిరంగ సభ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు , న్యాయవాది అయిన పూజారి శ్రీధర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రగతిని నివేదించాలనుకుంటే అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని పిటిషనర్‌ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులో ఉన్నందున 4జీ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వివరించవచ్చని పిటిషన్‌లో సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంగా గతంలో ఇందిరాపార్కు, విశ్వవిద్యాలయాల్లో పలు సభల నిర్వహణకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం... ఇప్పుడెలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని ప్రశ్నించారు. సభ పేరిట టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని పిటిషనర్‌ ఆరోపించారు. ప్రగతి నివేదన సభకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరుగనుంది.

06:29 - August 31, 2018

విశాఖపట్టణం : భవిష్యత్తులో దక్షిణాదికి తుఫానుల ముప్పు తప్పదా..? అంటే.. జరుగుతున్న పరిణామాలు.. నిపుణుల మాటలను బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. దక్షిణాదిని తుఫానులు ముంచెత్తుతాయంటున్నారు వాతావరణ శాస్ర్తవేత్తలు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల సంఖ్య తగ్గినప్పటికీ తీవ్రత మాత్రం గతంలోకంటే చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్, నవంబర్‌లో ఏదో ఒక తుపాను దక్షిణాదిని ముంచెత్తుతుంది. 2014లో విశాఖను చిరుటాకుల వణికించిన హుద్ హుద్ అక్టోబర్‌లోనే వచ్చింది. ఈ భవిష్యత్తులో తూర్పు తీరాన తుపానులు విలయాన్ని సృష్టించే అకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఈశాన్య రుతుపనాల్లో సంభవించే తుపానులు తూర్పు కోస్తాపై విరుచుకుపడే ప్రమాదం ఉందంటున్నారు.

మరోవైపు బంగాళాఖాతంలో తుఫాన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని అంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ నిపుణులు చెబుతున్నారు. 1969-1970 నుంచి తుపానుల సంఖ్య 25 నుంచి 35 శాతం తగ్గగా..అదే స్థాయిలో వాటి తీవ్రత పెరిగింది. ఈ సారి తుపానులు దక్షిణాదిన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఇస్రో ముందస్తుగా హెచ్చరిస్తోంది. గతంలో ఎక్కువ సంఖ్యలో తుపానులు రావడంతో నీటి లభ్యత పుష్కలంగా ఉండేదీ.. కానీ ఇప్పుడు తక్కువ సంఖ్యలో తుఫానులు వస్తున్నా వర్షపాతం మాత్రం చాలా ఎక్కువగా నమోదవుతోంది. దీంతో నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు నిపుణులు. వాతావరణం మార్పులతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. నీటి నిల్వ సామర్ధ్యాన్ని సాధ్యమైనంత పెంచుకుంటే ఎటువంటి అనర్ధాలు ఉండవంటుని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

సినీ పరిశ్రమలో మరో విషాదం...

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకురాలు బి. జయ కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 ఏళ్లు. గుండమ్మగారి మనువడు, లవ్‌లీ, చంటిగాడు, వైశాఖంసహా మొత్తం ఏడు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా రంగంలో జర్నలిస్టుగా పనిచేసిన జయ.. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎంఏ, జర్నలిజంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు.

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం...

సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద లారీని తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఓపెన్ యూనివర్సిటీలో ఆ పరీక్ష వాయిదా...

హైదరాబాద్ : డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోసం సెప్టెంబర్ 2న నిర్వహించతలపెట్టిన ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. 

తిరుపతికి రతన్ టాటా...

చిత్తూరు : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తిరుపతికి రానున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. 

ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు...

కర్నూలు : నేటి నుండి మూడు రోజుల పాటు మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు హాజరు కానున్నారు. 

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ సతీమణి కన్నుమూత...

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి భార్య ఉమ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 

దర్శకురాలు జయ ఇక లేరు...

హైదరాబాద్ : దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో మృతి చెందారు. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రేమికులు, గుండమ్మ గారి మనువడు, లవ్ లీ, వైశాఖం సినిమాలకు జయ దర్శకత్వం వహించారు. 

Don't Miss