Activities calendar

01 September 2018

21:39 - September 1, 2018

ప్రత్యర్థుల అంచనాలకు అందని రాజకీయ చతురత..సమయానుకూల వ్యూహాల్లో దిట్ట....ఎక్కడ తగ్గాలో...ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత..రాజకీయ శూన్యతను అవకాశంగా మలుచుకున్న నేర్పరి కేసీఆర్ వ్యక్తిత్వంపై 10టీవీ లైవ్ షో 'కేసీఆర్ అను నేను' వీడియోలో చూద్దాం.. 

ప్రగతి నివేదన సభ ప్రాంతంలో తగ్గిన వర్షం

రంగారెడ్డి : కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ ప్రాంతంలో వర్షం తగ్గింది. సభ పరిపరాల్లో వాతావరణం సందడిగా మారింది. 

 

బందిపారా ప్రాంతంలో ఎదురుకాల్పులు

జమ్మూకాశ్మీర్ : బందిపారా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

19:09 - September 1, 2018

రంగారెడ్డి : రేపు కొంగరకలాన్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు రెండు వేల ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన వేదిక సహా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లక్ష వాహనాల్లో 25 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వాహనాలు బయల్దేరాయి. 

 

18:16 - September 1, 2018

గుంటూరు : జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో ప్రాజెక్ట్‌ జళకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరటంతో సమీప గ్రామాలు వరదల్లో చిక్కకున్నాయి. బెల్లంకొండ మండలంలోని కోళ్ళురు, కేతవరం, చిట్యాల, మరికొన్ని తండాలు నీటమునగటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇతర సాంకేతిక సంబంధాలు కూడా తెగిపోయాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

 

17:15 - September 1, 2018

ఒక హిట్ కొట్టగానే విర్రవీగే తెలుగు కుర్ర హీరోలకు తెలుగు క్యారెక్టర్ నటి మీనా ఓ ఝలక్ ిఇచ్చింది. నేను చాలా మంది హీరోలను చూశాను. ఒక్క హిట్ కొట్టగానే విర్రవీగిపోతుంటారు. వారిలో కుక్క బుద్ధిలాంటి ఈగో తారాస్థాయికి చేరుకుంటుంది. ఇటువంటి నటులందరు తమిళ హీరో అజిత్ కాళ్లు కడిగి నెత్తిమీద నీళ్ళు  జల్లుకోవాలి అంటూ  వదిన, అక్క క్యారెక్టర్లలో కనిపించే మీనా తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానం పోస్ట్ చేసింది. అంతేకాదు..ఆయన పాదపూజ చేసుకుంటే కనీసం 10 శాతం మంచితనమైన పెరుగుతుందని తన పోస్ట్ లో పేర్కొంది. 

ఈ వ్యాఖ్య  ఎవరిగురించో కొంత అర్ధం అయినా.. కుర్రహీరోలందరూ ఈ నటిపై గుర్రుగా ఉన్నారు. ఈ నటి అజిత్ సినిమాలో ఓ పాత్ర పోషించింది ఇటీవల. అదీ అసలు విషయం. 

 

16:10 - September 1, 2018

ఢిల్లీ : తాగిన మైకంలో విమానంలో తన పక్క సీట్లోనే మూత్ర విసర్జన కానిచ్చేశాడు ఓ ప్రభుద్ధుడు. ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ సంఘటనపై   మహిళా ప్రయాణీకురాలు కుమార్తె   ఇంద్రాణి ఘోష్ ట్విట్టర్లో పోస్టు చేశారు. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై విచారణ చేయాల్సిందిగా ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఎయిర్ ఇండియా అధికారులను ఆదేశించారు. 

 ఈ సంఘటన ఆగస్టు 31 న ఎయిర్ ిఇండియా ప్లైట్ ఏ1 102 లో చోటుచేసుకుంది. దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా విమాన సంస్థను మంత్రి ఆదేశించారు. 

‘‘ ఈ సంఘటనతో మా అమ్మ షాక్ కు గురైంది. తాగిన మైకంలో పాంట్ ఊడదీసి పక్కసీటుపై మూత్ర విసర్జన చేయడం ఆమెను తీవ్రంగా కలిచివేసింద’’ ఇంద్రాణి తన ట్విట్టర్లో కంప్లైంట్ చేసింది. 

 

 

ఆసియాకప్ కు భారత్ టీమ్ ఎంపిక

ఢిల్లీ : ఆసియాకప్ కు భారత్ టీమ్ ను ఎంపిక చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్టు ఇచ్చారు. తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ వ్యవహరించనున్నారు. అంబటి రాయుడు, భువనేశ్వర్, కేదార్ జాదవ్ లు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ధోనీ, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షల్ పటేల్, బూమ్రా, శార్ధూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్ లకు జట్టులో చోటు దక్కింది. సెప్టెంబర్ 15 నుంచి ఆసియా కప్ జరుగనుంది. 

 

15:08 - September 1, 2018

ఢిల్లీః  చట్ట ప్రకారం 18 ఏళ్లు దాటిన స్త్రీలు మాత్రమే వివాహానికి అర్హులు. ఇక పురుషుల విషయానికి వస్తే 21 సంవత్సరాలు దాటితే వివాహం చేసుకొనే అవకాశం చట్టం కల్పించింది.  స్త్రీ, పురుషులిద్దరికీ 18 ఏళ్లు దాటితే వివాహానికి అర్హులుగా గుర్తించాలని కేంద్రానికి లా కమిషన్ కమిటీ సూచించింది. మెజార్టీ వయస్సు 18 ఏళ్లుగా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) గుర్తించాలని కోరింది.  

భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు దాటిన ప్రతీ వ్యక్తి ఓటు హక్కు పొందగలుగుతున్నారంటే వారికి వివేచన శక్తి ఉన్నట్టు భావించాలి. కాబట్టి వారికి తమ భాగస్వాములను ఎంచుకొనే సామర్ధ్యం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని జాతీయ లా కమిషన్ వ్యాఖ్యానించింది.  స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించాలంటే ముందుగా ఈ వివక్షను రూపుమాపాలని పర్సనల్ చట్టంపై ఏర్పాటైన లా కమిషన్ కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి వివాహానికి రకరకాల వయస్సును నిర్ణయించడం సరికాదు కాబట్టి  ఇరువురి సమ్మతితో జరిగే నిర్ణయాలపై ఆంక్షలు విధించడం సబబు కాదని సూచించింది. వ్యక్తిగత చట్టాలను ఈ పద్దతిలో సవరించడం ద్వారా బాల్యవివాహాలతో పాటు లింగ వివక్షను అరికట్టవచ్చని లా కమిషన్ కమిటీ అభిప్రాయపడింది. భర్త వయస్సు కన్నా భార్య వయస్తు తక్కువగా ఉండాలన్న నిబంధన లింగ వివక్షను ప్రమోట్ చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. 

హిందూ వివాహ చట్టం ప్రకారం  స్త్రీకి వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా కాాగా పురుషులకు 18 సంవత్సరాలు. అదే ముస్లీం వివాహ చట్టంలో యవ్వనంలోకి అడుగుపెట్టగానే వివాహానికి అర్హులే. ఈ తారతమ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పర్సనల్ లా లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర లా కమిషన్ కమిటిని నియమించంది. 

 

 

మంత్రాలయంలో అమిత్ షా పర్యటన

కర్నూలు : మంత్రాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటిస్తున్నారు. సుజియేంద్ర ఆరోగ్య కేంద్రాన్ని షా ప్రారంభించారు. 

13:51 - September 1, 2018
13:48 - September 1, 2018

కరీంనగర్ : ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు మంత్రి ఈటెల తన యత్నాలకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ళ అభివృద్ధిని ప్రజలకు ఈ సభ ద్వారా వివరిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. భారీ జన సమీకరణతో హుజురాబాద్ లో ట్రాక్టర్ ర్యాలీని ఈటెల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు టీఆర్ఎస్ సాధిస్తుందని..విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా 119స్థానాలు మావేనని ఈటెల ధీమా వ్యక్తంచేశారు. ఈ సభపై కాంగ్రెస్ ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవని ఆయన స్పష్టంచేశారు. ప్రతీ ఇంటింటికి ప్రతీవారు ఈ సభకు రావాలనే సంకల్పంతో వున్నారని..దీని కోసం 100 ట్రాక్టర్లను, ప్రతీ గ్రామానికి రెండేసి బస్సుల చొప్పున 360 బస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులలో 60 వేల మంది ప్రజలు..ఇంకా ఇతర వాహనాలలో కలిపి మా అంచనాలను మించి ప్రజలు కొంగరకలాన్ సభకు తరలిపోయేందుకు సిద్ధంగా వున్నారని..వారికి అన్ని ఏర్పాట్లను చేశామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో భారత్‌కు చెందిన అమిత్‌ పంఘాల్‌ విజేతగా నిలిచి స్వర్ణం పతకం సాధించాడు. ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బోయ్‌ దుస్మతోమ్‌పై విజయం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో ఫైనల్‌ చేరిన ఏకైక భారత బాక్సర్‌ అమితే. 2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దుస్మతోమ్‌పై విజయం సాధించడంతో అమిత్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

13:33 - September 1, 2018

ఖమ్మం : ప్రగతి నివేదన సభకు గులాబీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి దాదాపు 2.5 లక్షల మంది ప్రజలను కొంగరకలాన్ కు తరలించేందుకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బాధ్యత తీసుకున్నారు. దీంతో పెద్దఎత్తున జనసమీకరణలో భాగంగా మహిళలను కూడా భారీగా తరలిస్తున్నారు. ప్రజల స్పందనకు తగ్గట్లుగా వాహనాలకు ఏర్పాటు చేసి భారీగా జనాన్ని సమీకరిస్తున్నామనీ..ఇది ఇప్పటివరకూ ఎవ్వరు..ఏ పార్టీ చేయనటువంటి సభ అని దాదాపు 25లక్షలమందితో ఇంతటి పెద్ద సభ జరగటం అద్భుతమని బాలసాని పేర్కొన్నారు. ఖమ్మం పట్టణంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అలాగే తుమ్మల నాగేశ్వర్రావు వంటి నేతలు తమ తమ శక్తి సామర్థ్యాంలను..తమ క్యాడర్ ను చూపించుకునేందుకు గులాబీ బాస్ దగ్గరు మార్కులు కొట్టేసేందుకు జన సమీకరణ విషయంలో పట్టుదలతో సమీకరణ బాధ్యతలను చేపట్టారు. 

13:26 - September 1, 2018

రంగారెడ్డి : కొంగరకలాన్ లో జరగబోయే ప్రగతి నివేదన సభకు భద్రత విషయంలో పోలీస్ యంత్రాంగా కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించి దాదాపు 3000ల మంది పోలీస్ సిబ్బందితో అన్ని విధాలుగా పక్బందీగా ఏర్పాట్లు చేసారు. సభలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు ఫైర్ సేప్టీకి సంబంధించి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తలు తీసుకున్నామని అడిషనల్ డీజీపీ గోపీకృష్ణ తెలిపారు. 

13:24 - September 1, 2018

నెల్లూరు : చదువు చెప్పి విద్యార్థులను భావి భారత పౌరులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. మాకు పెన్షన్ భరోసా ఏదంటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద భారీగా చేరిన ఉపాధ్యాయులు కలెక్టరేట్ ను ముట్టడించి ధర్నా చేపట్టారు. కలెక్టర్ ను విధుల్లోకి రాకుండా ఉపాధ్యాయులు అడ్డుకుని తమ డిమాండ్ విషయంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తమకు భరోసా ఇచ్చేంత వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టంచేశారు. తమ డిమాండ్స్ ను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. 

శ్రీశైలం సాగర్ ఎత్తివేత..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,56,656 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,83,714 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.3 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 206.09 టీఎంసీలుగా నమోదైంది. మరోవైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 1,25,774 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 44,892గా ఉంది.

ఊళ్లన్నీ హైదరాబాద్ రోడ్డెక్కుతున్నాయి!..

హైదరాబాద్ : తెలంగాణ గులాబి దండు కదిలింది. జనజాతరకు ప్రజలు తరలిరావడం మొదలైంది! ప్రభలు కట్టుకుని పండుగలకు పోయినట్టు.. ఊళ్లన్నీ హైదరాబాద్ రోడ్డెక్కుతున్నాయి! అందంగా అలంకరించిన వేలకొద్దీ ట్రాక్టర్లు.. లారీలు.. బస్సులు.. ఇతర వాహనాలు.. వాటినిండా వాడితగ్గని ఉద్యమ ఉత్సాహంతో 31 జిల్లాల నుంచి ప్రజలు ప్రగతి నివేదన సభాప్రాంగణాన్ని గులాబీమయం చేసేందుకు కొంగరకలాన్ బాటపట్టారు!.. మరోవైపు ప్రగతి నివేదన సభ ప్రారంభానికి ముందే ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

12:59 - September 1, 2018

విశాఖపట్నం : కాలుష్యం, పెట్రో ధరల సమస్యను అధిగమించే దిశగా అడుగులేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. విడతల వారీగా అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎలక్ట్రిక్ కార్లను అందించనున్నారు. తొలి విడతగా విశాఖ రోడ్లపై ఈ-కార్లు పరుగులు తీయనున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, కాలుష్యం సమస్యలకు -కార్లతో చెక్‌
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయని బాధపడాల్సిన పనిలేదు. వాటితో పనిలేకుండానే ఎలట్రిక్ కార్లలో ప్రయాణించవచ్చు. మరో 20రోజుల్లోనే ఇవి విశాఖ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. దశల వారీగా ప్రభుత్వ అధికారులకు ఈ- కార్లను అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటిని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ సమకూర్చనుంది. దీంతో విశాఖ కాలుష్యరహిత నగరంగా మారనుంది.

విశాఖకు దాదాపు 400 - కార్లు అవసరమని అధికారుల అంచనా
విశాఖకు దాదాపు 400 ఈ- కార్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తొలివిడతగా తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్‌కు 67, జీవీఎంసీకి 30 ఈ-కార్ల కోసం ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నగరంలోని డీలర్ల వద్ద 30 ఈ-కార్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈపీడీసీఎల్‌కు 20, జీవీఎంసీకి 10 కార్లను మరో 20 రోజుల్లో డెలివరీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి కాక అధికారులకు మరో వంద కార్లు అవసరం ఉంది. దశల వారీ గా ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ-కార్లను సమకూర్చనున్నారు.

12 నుంచి 13 లక్షల విలువ చేసే ఈ-కారును ఈఈ ఎస్‌ఎల్‌ కొనుగోలు
టాటా, మహిం ద్రా కంపెనీలు తయారు చేస్తున్న టాటా టిగార్, మహింద్రా ఈ-వెరిటో మోడల్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి. 12 నుంచి 13 లక్షల విలువ చేసే ఈ-కారును ఈఈ ఎస్‌ఎల్‌ కొనుగోలు చేస్తోంది. వీటిని వినియోగిస్తున్న శాఖలు డ్రైవర్‌ను సొంతంగా నియమించుకుని.. ఒక్కో కారుకు నెలకు 20 వేల చొప్పున ఈఈఎస్‌ఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. వీటికి క్లచ్, గేర్లు ఉండవు. న్యూట్రల్, రివర్స్, స్పీడ్‌ పాయింట్లను మార్చుకోవాల్సి ఉంటుంది.. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే వీలుంటుంది.

3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు
12 ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు, 13 ఏసీ చార్జింగ్‌ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసులో 6, మధురవాడ, సర్కిల్, డివిజన్‌ కార్యాలయాల్లోను, కార్పొరేట్‌ కార్యాలయంలో 3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్‌ మూడో వారం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే కారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. వీటికోసం యూనిట్ విద్యుత్ ధరను 6 రూపాయల 95 పైసలుగా ఖరారు చేశారు.
భవిష్యత్తు మొత్తం ఈ కార్లదే
చార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడంతోపాటు.. వంద కిలోమీటర్లకే పరిమితం కావడంతో ఈ కార్లను పట్టణ పరిథిలో మాత్రమే వినియెగించనున్నారు. పాస్ట్ చార్జింగ్‌, రహదారుల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్సాట్లు జరిగితే భవిష్యత్తు మొత్తం ఈ కార్లదే అనడంలో అతిశయోక్తి లేదు. 

12:52 - September 1, 2018

హైదరాబాద్‌ : తుక్కుగూడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్కూటర్‌పై వెళుతున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన భార్యను స్థానికులు సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ భార్య కూడా మృతి చెందింది. పోలీసులు మృతులను తుక్కుగూడాకు చెందిన దశరథ దంపతులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. 

12:50 - September 1, 2018

చిత్తూరు : రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. విజయ్‌ భాస్కర్‌ ఇంటితో పాటు అతని బంధువులు, స్నేహితులు ఇళ్లపై అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతపురం, బెంగళూరు, తిరుపతి సహా 14 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. చెక్‌పోస్ట్‌లో లభించిన 14 వేల రూపాయల అక్రమ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

12:34 - September 1, 2018

సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిదే ముద్ద దిగన నాన్ వెజ్ ప్రేమికుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఏ విందుకైనా ముక్కతో కూడిన ఆహారం వుండాల్సిందే. అలా మారిపోతోంది నేటి ఆహార వినియోగం పరిస్థితి. తినే కంచంలో చిన్న చికెన్ ముక్క వుంటే చాలా వారం వర్జం పక్కన పెట్టి లొట్టలేసుకుంటు తినేస్తారు. మాంసాహార వంటకాలతో విందు రుచే మారిపోతుంది. ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రపంచంలో మాంసాహార వినియోగం బాగా పెరిగిందని ముక్కమీద ఒట్లేసి చెప్పకతప్పదు.

మాంసాహార ప్రియులు అమెరికన్లు..
93 కేజీల మాంసాహార వినియోగంతో గత మూడేళ్లుగా ఆస్ట్రేలియా ముందుండేది. రోజుకు పావు కేజీ మాంసాన్ని అవలీలగా తినేస్తు అమెరికన్లు ఆస్ట్రేలియా స్థానాన్ని ఆక్రమించారు. అమెరికాలో మాంసం ప్రియులు 97.1 శాతం తినగా..ఆస్ట్రేలియాలో 94.8గా వుంది. ఇక అర్జెంటీనా, ఉదుగ్వే, ఇజ్రాయిల్,బ్రెజిల్, చైనా, కెనాడా, న్యూజిలాండ్ దేశాలు ఇంచుమించు 86, ..85,70,65 శాతానికి ఇంచుమించుగా వున్నాయి.

మాంసాహారంతో ముంచుకొస్తున్న ముప్పు..
పోషకాహారంగా మాంసానికి ప్రాధాన్యం ఉన్నా ప్రపంచంలో మాంసం వినియోగం ఎంత పెరిగితే మన పర్యావరణానికి అంత హాని అని పర్యావరణ వేత్తలంతా హెచ్చరికల్ని కూడా గమనించాల్సిన అవసరముంది. మాంసం కోసం పెద్దఎత్తున పెంచుతున్న పశువుల నుంచి భారీగా మీథేన్‌ వాయువులు వెలువడుతుండటంతో అవి భూమిలో వేడిని పెంచుతున్నాయని నిపుణులు గుర్తించారు. కాగా పశువుల నుండి కంటే కాయగూరల పెంపకం నుంచి వెలువడే మీథేన్‌ వాయువు చాలా తక్కువగా వున్నట్లు కూడా నిపుణులు గుర్తించారు. మాంసం కోసం పెంచుతున్న జంతువులన్నింటినీ చూస్తే పశువులు, గొర్రెలు, మేకల నుంచే మీథేన్‌ వంటి పర్యావరణ హానికర వాయువులు అత్యధికంగా వెలువడుతున్నాయి.

పండ్లు, కూరలు, పప్పు ధాన్యాలతో మేలు..
పొలాల్లో విరివిగా పండించే పండ్లు, కూరలు, పప్పు ధాన్యాల పంటల నుంచి వెలువడే హానికర పదార్ధాలు బహు తక్కువగా వుంటాయట. కాబట్టి పర్యావరణం పచ్చగా మానవ మనుగడ..జీవ పరిణామం సక్రమంగా వుంటుంది. అలా వుండాలంటే మాంసాహారం తగ్గించుకుని పండ్లు, కూరగాయలు, పప్పుల వైపు ఎక్కువుగా వినియోగించటం..అలవాట్లను పెంచుకోవటం శ్రేయస్కరమని శాస్త్రవేత్తలు నొక్కిచెబుతున్నారు.

12:25 - September 1, 2018

వరంగల్ : బలమైన అభ్యర్థులకు పోటీలో నిలబెడతామని కడియం తెలిపారు. ఈ సభ ఏర్పట్లతో పాటుగా ఎన్నికలలో నిలిపే అభ్యర్థులపై కూడా పార్టీకి స్పష్టత వచ్చిందని తెలిపారు. ఈ సభతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ సభకు భారీగా వచ్చే ప్రజలతో పోల్చుకుంటే వారికి సరిపడా వాహనాలకు సమకూర్చలేకపోతున్నామని..అంత భారీగా ప్రజలు సభకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారనీ..ప్రజల స్పందనే మా పార్టీ అభివృద్ధికి అద్దం పడుతుందని కడియం తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై మంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తంచేశారు. తాను మరో మూడేళ్లు ఎమ్మెల్సీగానే వుంటాననీ తనకు ఏమాత్రం ఢోకా లేదని కడియం ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభతో ప్రజలకు ప్రగతిని వివరిస్తునే...పార్టీని ఎన్నికలకు సన్నద్ధంచేస్తున్నామని కడియం తెలిపారు. అభ్యర్థులపై దాదాపు పాఈర్టకి స్పష్టత వుందన్నారు. భూపాల పల్లిలో బలమైన అభ్యర్థి మధుసూధనాచారే కొనసాగుతారని..స్పీకర్ ను మార్చాల్సిన అవసరం లేదని కడియం స్పష్టంచేశారు.

11:40 - September 1, 2018

రంగారెడ్డి : రేపు కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్వం సిద్ధమయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా గులాబీ మయంగా మారిపోయి సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తోంది. రేపటి సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రగతి నివేదన సభాస్థలం గులాబీమయంగా మారింది. 31 జిల్లాల నుంచి జనం ఉప్పెనలా తరలివచ్చే ప్రజల కోసం రూట్ మ్యాప్ లకు కూడా నేతలు అన్ని ఏర్పాట్లుచేశారు. సభకు రెండు రోజుల ముందు నుంచే కొంగరకలాన్ దారులన్నీ జన జాతరను తలపిస్తున్నాయి. బస్సులు, ఇతర వాహనాలు ప్రగతి నివేదన సభ బాట పట్టాయి. ఇవాళే సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి 2000 ట్రాక్టర్లలో రైతన్నలు ప్రగతి నివేదన సభకు నిన్న బయలుదేరారు.

ప్రగతి సంబురానికి భారీ ఏర్పాట్లు..
ప్రగతి నివేదన సభకు కామారెడ్డి జిల్లా రైతులు ట్రాక్టర్లలో తరలిరానున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు 100 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరనున్నారు. మంత్రి పోచారం జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించనున్నారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సభాస్థలి 15 రోడ్లతో అనుసంధానం చేశారు. సభకు నలువైపులా వచ్చేవారి కోసం 19 ప్రవేశ మార్గాలు, 14 పార్కింగ్ స్థలాలు, ప్రగతి నివేదన సభకు 25 ల‌క్ష‌ల‌ మంది ప్రజల కోసం దాదాపు లక్ష వాహనాలకు నేతలు సిద్ధం చేశారు. వారికోసం అన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటుచేశారు. సభకు తరలివచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే వారి కోసం 19 మార్గాలు, 14 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ట్రాఫిక్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలంతా వీక్షించేందుకు 50 భారీ ఎల్ ఈడీలను ఏర్పాటు చేశారు. కాగా సీఎం కేసీఆర్ సభాస్థలికి హెలికాప్టర్ లో రానున్నారు. 

రేణిగుంట ఆర్డీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు..

చిత్తూరు : రేణిగుంట ఆర్డీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో రూ.14వేల అక్రమ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏంవీఐ అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారంతో విజయ్ భాస్కర్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి, అనంతపురం, బెంగళూరులోని విజయభాస్కర్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 14 ప్రాంతాలలో అధికారులు తనిఖీలు కొసాగిస్తున్నారు. 

నా రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండం : కడియం

వరంగల్ : తన రాజకీయ భవిష్యత్తుపై మంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తంచేశారు. తాను మరో మూడేళ్లు ఎమ్మెల్సీగానే వుంటాననీ తనకు ఏమాత్రం ఢోకా లేదని కడియం ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభతో ప్రజలకు ప్రగతిని వివరిస్తునే...పార్టీని ఎన్నికలకు సన్నద్ధంచేస్తున్నామని కడియం తెలిపారు. అభ్యర్థులపై దాదాపు పాఈర్టకి స్పష్టత వుందన్నారు. భూపాల పల్లిలో బలమైన అభ్యర్థి మధుసూధనాచారే కొనసాగుతారని..స్పీకర్ ను మార్చాల్సిన అవసరం లేదని కడియం స్పష్టంచేశారు.  

10:54 - September 1, 2018

ఖమ్మం : ప్రగతి నివేదన సభ ముందస్తు ఎన్నికల కోసం మాత్రం కాదనీ..ఈ నాలుగున్నరేళ్లలో ప్రభ్తువం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపేందుకు..ప్రజలకు సమాధానం చెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సభకు నేతలకంటే ప్రజలే ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారనీ..మేము ఊహించినదానికంటే ప్రజల స్పందన చాలా భారీగా వుందనీ..వారి స్పందనకు సరిపడా వాహనాలు సమకూర్చటం కష్టంగా వుందని తుమ్మల తెలిపారు. వాహనాలకు ప్రజల స్పందన మేరకు సమకూర్చేందుకు పక్క రాష్ట్రం ఏపీలోని కొన్ని జిల్లా నుండి వాహనాలను తీసుకొస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.ఈ సభను జయప్రదం చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన వాహనాలను కూడా సమీకరిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 

10:51 - September 1, 2018

పెద్దపల్లి : ధర్మారం మండలం నందిమేడారం కాలేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇటీవలే కాలేశ్వరం ప్రాజెక్టు -8లో బాహుబలి మోటార్‌ పంపును దిగ్విజయంగా డ్రైరన్‌ నిర్వహించిన ఇంజనీర్లు.. ఇప్పుడు మరో రికార్డును సృష్టించారు. మంత్రులు హరీశ్‌, ఈటల రాజేందర్‌ సమక్షంలో 6వ ప్యాకేజీలో తొలిపంపు డ్రైరన్‌ నిర్వహించారు. దీంతో ఇంజనీర్లను మంత్రులు అభినందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్యాకేజీ-6లో ప్రారంభమైంది. ఆగస్టు 27నే ఈ సబ్‌స్టేషన్‌ పూర్తైంది. 29న అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్న సబ్‌స్టేషన్‌ నుంచి రాత్రి తొలిపంపు డ్రైరన్‌కు విద్యుత్‌ సరఫరా చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యంతో నడిపే ఈ పంపు డ్రైరన్‌ను ఇంజనీర్లు విజయవంతంగా నిర్వహించారు.

10:48 - September 1, 2018

హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తి కరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 273పరుగులకు భారత్‌ ఆలౌట్‌ అయింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా చెలరేగి పోయాడు. వీరోచిత సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కోహ్లీ ఆటతీరు ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ పరుగులకే వికెట్‌ కోల్పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 84.5ఓవర్లలో 273పరుగులకే పెవిలియన్‌ దారి పట్టింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు మొయిన్‌ అలీ ఐదు వికెట్లు, ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీశారు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 195 పరుగులకే 8 వికెట్లు!.. ఈ స్థితిలో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఆలౌట్‌ కావాలంటే ఎంత సమయం కావాలి? విజృంభిస్తున్న ఇంగ్లిష్‌ బౌలర్లను భారత టెయిలెండర్లు తట్టుకునేదెంతసేపు? కానీ చెతేశ్వర్‌ పుజారా 132 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. 257 బంతుల్లో 16×4 చేసి ఇండియాకు కంచుకోటలా నిలిచాడు. కోహ్లి వికెట్‌ పడగొట్టామని సంబరపడిన ఇంగ్లాండ్‌ ఆనందానికి తెరదించుతూ ఒక్కడు భారత్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో.. అపరిమిత సహనాన్ని ప్రదర్శిస్తూ.. కఠోర దీక్షతో బ్యాటింగ్‌ చేసిన పుజారా.. అజేయ సెంచరీతో భారత్‌కు అనూహ్యమైన ఆధిక్యాన్ని అందించాడు. 

10:43 - September 1, 2018

నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి నీరు రావటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్‌ నిండటంతో తమకు రెండు పంటలకు నీరు అందుతుందని రైతులు భావిస్తున్నారు. దీంతో సాగర్ లో జలకళకు తమ ఇంటిలో పంటల శిరులు వెల్లివిరుస్తాయని రైతన్నలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

10:40 - September 1, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో ముజ్ర పార్టీ కలకలం నెలకొంది. జూపార్క్‌ సమీపంలోని ఓ లాడ్జీలో యువకులు ముజ్ర పార్టీ నిర్వహిస్తున్నారని తెలిసి.. పోలీసులు దాడులు నిర్వహించారు. అమ్మాయిలతో అశ్లీల ప్రదర్శనలు, అర్దనగ్న ప్రదర్శనలు చేస్తున్న అమ్మాయిలు, యువకలును అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతిపై అత్యాచారం చేసిన ఖుద్దూస్‌ అనే యువకుడినపై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

10:36 - September 1, 2018

స్థిరాస్తి వ్యాపార మోసాలకు 'రెరా' చెక్..

హైదరాబాద్ : తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారంలో జరిగే మోసాలకు తెరపడనుంది. శనివారం నుంచి రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ ప్రాథికార సంస్థ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. బిల్డర్లు చేసే మోసాలు, అక్రమాలను అరికట్టి... కొనుగోలుదారులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ.. రెరా అమల్లోకి వస్తోంది.

రా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌- మాసాబ్‌ ట్యాంక్‌.. డీటీసీపీ భవనంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రెరా కార్యాలయాన్ని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి.. ఆవరణలో మొక్కలు నాటారు. రెరా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సైట్‌ ప్రారంభించిన వెంటనే 9 మంది రియల్టర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి బిల్డర్‌ రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది.

2017 జనవరి 1 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులకు రెరా వర్తింపు

రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి బిల్డర్‌ ప్రాజెక్టుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఒక బిల్డర్‌ పది ప్రాజెక్టులు చేస్తుంటే అన్నింటికీ విడివిడిగా ఎస్క్రో అకౌంట్లు ప్రారంభించాలి. కొనుగోలుదారుల నుంచి వసూలుచేసే సొమ్ములో 70 శాతం మొత్తాన్ని ఈ ఖాతాలో జమచేయాలి. ప్రాజెక్టు ప్రారంభ తేదీ నుంచి పూర్తి చేసే తేదీ వరకు అన్ని వివరాలు నమోదు చేయాలి. జాప్యం జరిగితే కారణాలు తెలపాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్టు ప్రగతి నివేదిక సమర్పించాలి. అనుమతి లేకుండా ప్రాజెక్టులు ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. రెరా పరిధిలోకి రాని నిర్మాణాలను కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. రెరా ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ కార్యాలయంలో రెండు కోర్టు హాల్స్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ రెరాకు రాజేశ్వర్‌తివారీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ కంట్రీ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. మరో ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. 2017 జనవరి 1 తర్వాత తెలంగాణలో ప్రారంభించిన అన్ని లే అవుట్లు, నిర్మాణాలకు రెరా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లు కూడా పేర్లు నమోదు చేయించుకోవాలి. లేకపోతే రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల నిర్వహణకు అనుమతి ఉండదు. స్థిరాస్తి వ్యాపారంలో పారదర్శకత కోసం రెరా ఏర్పాటు చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు ఫుల్ స్టాప్ పడేనా?..
2017 జనవరి 1వ తేదీకి ముందు జరిగిన రియల్‌ ఎస్టేట్‌ మోసాలను మానవతా దృక్పథంతో పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రెరా ద్వారా రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఎంతవరకు తగ్గుతాయో... కొనుగోలుదారుల ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడతాయో చూడాలి. 

10:25 - September 1, 2018

తిరుపతి : ఎర్ర చందనం. ఈ పేరు చెబితే చాలు స్మగ్లర్ల మనస్సు ఉవ్విళ్లూరుతుంది. ఎర్రచందనం చూస్తే చాలా వారి కంటికి కరెన్సీ నోట్లే కనిపిస్తాయి. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో అమాయకులు మాత్రం బలైపోతున్నారు. పెద్దవారు మాత్రం సేఫ్ జోన్ లోనే వుంటున్నారు. పొట్టకూటికోసం ఎర్రచందనం చెట్లను కొట్టి తరలించేందుకు కూలి కోసం వచ్చిన రోజువారి కూలిలు మాత్రమే పోలీసుల కూబింగ్ లో వారు పేల్చిన తూటాలకు బలవుతున్నారు. బడా ఎర్ర చందనం వ్యాపారస్తులు మాత్రం ఎవరో తెలియకుండా పోతోంది. ఈ నేపథ్యంలో గొల్లపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు. శ్రీ కాళహస్తి సమీపంలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో అటవీ శాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్మగ్లర్లు పోలీసులు కూబింగ్ సిబ్బంది అధికారులపై రాళ్లు రువ్వారు. దీంతో అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో కూబింగ్ ను కొనసాగిస్తున్నారు.

10:13 - September 1, 2018

చెన్నై : సేలం సమీపంలోని మామందూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. సేలం నుండి ధర్మపురి కి వస్తున్న ప్రయివేటు బస్ పూర్తిగా రాంగ్ రూట్ లో రావటంతో బెంగళూరు నుండి సేలంకు వస్తున్న మరో బస్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందగా మొత్తం 25మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. గాయపడినవారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదం స్పందించి క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనందించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రమాదానికి గురైన ఈ రెండు బస్సుల్లో దాదాపు 50మంది ప్రయాణీకులున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సేలంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనాస్థలిని కలెక్టర్ రోహిణి పరిశీలించారు.

విష జ్వరాలకు పిట్టల్లా రాలిపోతున్నారు..

శ్రీకాకుళం : వంగర మండలంలోని శ్రీహరిపురంలో విషజ్వరాలు ప్రబలి ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విష జ్వరాలకు వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషజ్వరాల ప్రభావం ఎంతగా వుందో ఊహించుకోవచ్చు. కేవలం ఒక్క వంగర గ్రామంలోనే 150మందికి ఈ విష జ్వరాలబారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం విష జ్వరాల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామస్థులు కోరుతున్నారు. 

కళ్యాణ మండపాల నిర్మాణాలకు టీటీడీ చెక్..

తిరుమల : ప్రభుత్వ సిఫార్సులకు టీటీడీ పాలక మండలి చెక్ పెట్టింది. కళ్యాణ మండపాలు నిర్మించాలన్న సీఎంవో, ఇతర నేతల పిషార్సులను టీటీటీ పాలకమండలి పక్కన పెట్టింది. టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల ఆరోపణలతో కళ్యాణ మండపాల నిర్మాణంపై టీటీడీ వెనక్కి తగ్గింది. 

09:17 - September 1, 2018

హైదరాబాద్‌ : భాగ్యనగరంలో నివసించే శుకన ప్రేమికులకు శుభవార్త. కుక్కలను పెంచుకునేవారి వాటిని ఖుషీ చేయటానికి ఓ అరుదైన అవకాశాన్ని జీహెచ్ ఎంసీ కల్పింస్తోంది. ఇప్పటి వరకూ తమ పెంపుడు కుక్కలతో విహారం చేసేందుకు అనువైన అన్ని సౌకర్యాలతో ఓ డాగ్ పార్క్ నిర్మాణం నగరంలో జరిగింది. చిన్నకుక్కలు, పెద్ద కుక్కలకు వేర్వేరుగా క్రీడా ప్రాంగణాలు, శిక్షణ కేంద్రాలు, శునకాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కేంద్రం, స్పా వంటి సకల సదుపాయాలను అందబాటులోకి వచ్చాయి. మరి శునక ప్రేమికులకు ఇది శుభవార్తే కదా..తమ పెంపుడు కుక్కలతో ఆడుతు..పాడుతు..చక్కగా ఎంజాయ్ చేయొచ్చు..మరి ఆ ఖుషీ ఖుషీ వివరాలేమిటో తెలుసుకుందామా..

కొండాపూర్‌లో 1.2 ఎకరాల్లో చేపట్టిన డాగ్‌పార్క్ నిర్మాణం పూర్తయింది. మరో వారం రోజుల్లో ఈ డాగ్ పార్క ప్రారంభమవుతుంది. విశాలంగా నిర్మించిన ఈ పార్కులో శునకాల కోసం ఈత కొలను, ఆడుకునే వస్తువులు, వ్యాయామ, ఆహార శాల, ముస్తాబు కేంద్రం వంటి సదుపాయాలను సమకూర్చారు. తమ శునకాలతోపాటు యజమానులు కూడా ఇక్కడ హాయిగా సేదతీరొచ్చు. వాటితో చక్కగా ఎంజాయ్ చేయ్యొచ్చు.

దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో పెంపుడు జంతువుల కోసం పార్కులు అందుబాటులో వున్నాయి. కానీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న హైదరాబాద్‌లో మాత్రం ఇంతవరకూ డాగ్ పార్క్ లేదు. దీంతో కుక్కల ప్రేమికుల కోసం ఈ డాగ్ పార్క్ అందుబాటులో వచ్చింది. కొండాపూర్‌లోని రాడిసన్ హెటల్ వెనక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పార్కు ప్రారంభోత్సం కోసం ముస్తాబవుతోంది. హైదరకాబాద్ గ్రేటర్ పరిధిలో లక్షలకు పైగా పెంపుడు శునకాలున్నాయని..వాటి సౌకర్యార్థం ఈ పార్కును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. చిన్నకుక్కలు, పెద్ద కుక్కలకు వేర్వేరుగా క్రీడా ప్రాంగణాలు, శిక్షణ కేంద్రాలు, శునకాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కేంద్రం, స్పా వంటివి ఇందులో ఉన్నట్టు తెలిపారు. అలాగే వైద్యులు, పర్యవేక్షణ నిపుణులను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎంట్రీ ఫీజును రూ.10గా నిర్ణయించినట్టు జీహెచ్ ఎంపీ అధికారు తెలిపారు.

అబ్బాయిలు 18 పెళ్లి చేసుకోవచ్చన్న లా కమిషన్..

ఢిల్లీ : పురుషుల కనీస వివాహ అర్హత వయసు తగ్గే అవకాశం వుంది. ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని పేర్కొంది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం..

08:56 - September 1, 2018

ఢిల్లీ :  భారత దేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత వుంది. ఈ క్రమంలోనే వివాహాలు చేసే విషయంలో కూడా భారత రాజ్యాంగ కొన్ని నిబంధనలు విధించింది. అదే అబ్బాయిలు..అమ్మాయిల వివాహ వయసు అర్హత. అబ్బాయిల వివాహం చేసే సమయానికి 21 సంవత్సరాలు వుండాలనీ..అదే అమ్మాయి అయితే 18 ఏళ్లు వుండాలని రూల్ వుంది. ఇది జెండర్ ప్రకారంగా చూస్తే..అబ్బాయిల కంటే అమ్మాయిలు మెచ్యూరిటీ త్వరగా వస్తుంది అనే ప్రతిపాదన కావచ్చు. కానీ ప్రస్తుతం ఆ రూల్ ని మారుస్తు లా కమిషన్ సంచనల ప్రతిపాదన చేసింది. అబ్బాయిల కనీస వివాహ అర్హతన తగ్గించేందుకు ప్రతిపాదన పెట్టింది. ఆ వివరాలేమిటో చూద్దాం..

పురుషుల కనీస వివాహ అర్హత వయసును తగ్గిస్తు..ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం అబ్బాయిల వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా వుంది. అమ్మాయిలకు 18 ఏళ్లుగా వుంది. అ నేపథ్యంలో అబ్బాయి వివాహ వయస్సు మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని తెలిపింది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం.. ఓ వ్యక్తి మెజారిటీ వయసు 18 ఏళ్లని, ఇద్దరి స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కాగా లాకమిషన్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీపురుష సమానత్వం మాట ఎలా ఉన్నా..ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పలువురు విశ్లేషకులు..న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి భారతీయ సంస్కృతిలో వివాహం చేసేటప్పుడు అబ్బాయి కంటే అమ్మాయి వయసు కనీసం మూడేళ్లు తక్కువగా ఉండాలని చెబుతారు. అలా చూసుకుంటే.. ప్రస్తుత సిఫార్సుల ప్రకారం అమ్మాయి వయసు 15 ఏళ్లు ఉండాలి. అలా చేస్తే అమ్మాయిల వివాహం బాల్య వివాహం కింద వస్తుంది. మరి ఈ విషయంలో న్యాయశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది చూడాలి. కనీసం మూడేళ్లు కాకున్నా అబ్బాయి, అమ్మాయి మధ్య వయసు తేడా ఏడాదైనా ఉండేలా చూసుకున్నా అప్పుడు అమ్మాయి వయసు 17 ఏళ్లు అవుతుంది. అలా చేస్తే.. అది కూడా బాల్య వివాహం కిందికి వస్తుంది. కాబట్టి లా కమిషన్ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదని పలువురు వాదిస్తున్నారు. మరి దీనిపై లా కమిషన్ ప్రతిపాదన ఏమవుతుందో వేచి చూడాలి..

త్రినాథ్ ఆత్మహత్య బాధాకరం : పవన్ కళ్యాణ్

అమరావతి : రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటు రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతున్నా..కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటంలేదు. ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకు రావటంలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

08:37 - September 1, 2018

అమరావతి : రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటు రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతున్నా..కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటంలేదు. ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకు రావటంలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. త్రినాథ్ బలవన్మరణం సంఘటన గురించి తెలియగానే మనసు వికలమైందని, హృదయాన్ని కలచి వేసిందని అన్నారు. అతన్ని కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని..ప్రాణత్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని,. కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

కాగా ప్రత్యేక హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో అసహనాన్ని తీసుకువస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్, ఒక చేనేత కార్మికుడు ప్రాణ త్యాగాలు చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా పాలకులు ప్రత్యేక హోదా సాధించటంలో చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవుసరం వుంది. ఈ నేపథ్యంలో యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయచేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్రప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం’ అని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

08:24 - September 1, 2018

కర్నూలు : శ్రీశైలం కొండపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి 12గంటల తరువాత తాత్కాలిక దుకాణ సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీశైలం దేవస్థానం సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసారు. కానీ అప్పటికే పలు షాపుల్లోని వస్తు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. శ్రావణ మాసం సందర్భంగా దుకాణదారులు భారీగా వస్తు సామగ్రి స్టోర్ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో వస్తు సామగ్రి అంతా కాలి బూడిద అయిపోవటంతో దుకాణదారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  

శ్రీశైలంలో అగ్నిప్రమాదం..

కర్నూలు : శ్రీశైలం కొండపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి 12గంటల తరువాత తాత్కాలిక దుకాణ సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీశైలం దేవస్థానం సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసారు. కానీ అప్పటికే పలు షాపుల్లోని వస్తు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. శ్రావణ మాసం సందర్భంగా దుకాణదారులు భారీగా వస్తు సామగ్రి స్టోర్ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో వస్తు సామగ్రి అంతా కాలి బూడిద అయిపోవటంతో దుకాణదారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

పోలీసులు కాల్పుల్లో ఎర్రచందనం స్మగ్లర్ మృతి..

తిరుపతి : గొల్లపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు. శ్రీ కాళహస్తి సమీపంలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో అటవీ శాఖ అధికారులు భారీగా కూబింగ్ చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్మగ్లర్లు పోలీసులు కూబింగ్ సిబ్బంది అధికారులపై రాళ్లు రువ్వారు. దీంతో అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో కూబింగ్ ను కొనసాగిస్తున్నారు. 

07:42 - September 1, 2018

మలబార్ వేప, శ్రీగంధం సాగు, యాజమాన్య పద్ధతులు ఎలా? వీటిని మార్కెటింగ్ చేసుకోవటం ఎలా అనే అంశంపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఈనాటి మట్టి మనిషి కార్యక్రమంలో రజనీకాంత్ ఇచ్చే సలహాలేమిటి? సూచనలేమిటి? తెలుసుకుందాం..

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

ప్రగనితి సభకు ముందే టీ.కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు జరగనున్న ప్రగతి నివేదన సభకు రెండు గంటలు ముందుగా ఈ సమావేశాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రగతిభవన్ లో సెప్టెంబర్ 2 మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాగా ఈ భేటీ అనంతరం కొంగరకలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు కేసీఆర్, మంత్రులు వెళ్లనున్నారు. అయితే, అప్పటికే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఉంటాయి.

07:05 - September 1, 2018

హైదరాబాద్ : ఇప్పుడు తెలంగాణలో రాజకీయమంతా ప్రగతి నివేదన సభ చుట్టూనే తిరుగుతోంది. ప్రగతి నివేదన సభలో ముందస్తుపై కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. సభకు మరెంతో సమయం లేదు. దీంతో ఊరూవాడ ప్రగతి నివేదన సభకు కదులుతున్నాయి. అన్ని అడుగులు అటువైపే పడుతున్నాయి.

తెలంగాణ పల్లెల్లో ప్రగతి నివేదన సభ సందడి కనిపిస్తోంది. ఏ పల్లెలో చూసినా సభ గురించిన చర్చలే సాగుతున్నాయి. సభకు మరొక్క రోజే సమయం ఉండడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, పార్టీ అభిమానులు కొంగరకలాన్‌కు బయలుదేరుతున్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. సుమారు 1800 ట్రాక్టర్లతో ఖమ్మం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ రాత్రి సూర్యాపేటకు చేరుకుంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ వస్తున్నారు. ర్యాలీ సూర్యాపేట చేరగానే టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రగతి నివేదన సభకు భారీగా ప్రజలు తరలిరావాలంటూ వరంగల్‌ తూర్పులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వినూత్న ప్రచారం చేపట్టారు. మేయర్‌ నన్నపునేని నరేందర్‌ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని టీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, మాజీమంత్రి బస్వరాజు సారయ్య జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్‌ శివనగర్‌లోని మేయర్‌ క్యాంపు కార్యాలయం దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ... పోచమైదాన్‌ సెంటర్‌ వరకు కొనసాగింది. ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో కొంగరకలాన్‌కు తరలిరావాలని మేయర్‌ నరేందర్‌ ప్రజలను కోరారు.

ప్రగతి నివేదన సభ విజయంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం కావడంతో సభను విజయంతం చేసేందుకు పార్టీ శ్రేణులు జనసమీకరణపై దృష్టి సారించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించారు. బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ విస్తృతంగా బహిరంగసభ ప్రచారం నిర్వహిస్తున్నారు.

రేపు జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలేదేరారు. మట్ట దయానంద్‌ ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లకు టీఆర్‌ఎస్‌ జెండాలు, ఫ్లెక్సీలు కట్టుకుని సభకు తరలివెళ్లారు. ట్రాక్టర్లన్నీ ర్యాలీగా తరలివెళ్లాయి. మిగిలిన జిల్లా నుంచి కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్పుడే కొంగరకలాన్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు తరలివెళ్లాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది.

07:00 - September 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ రేపు సమావేశం కానుంది. ప్రగతి నివేదన సభ ప్రారంభానికి ముందే భేటీ అవుతోంది. కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం నేపథ్యంలో రేపు జరిగే కేబినెట్‌ సమావేశానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ముందస్తు అంచనాలు తార స్థాయికి చేరాయి. కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభతో ముందస్తుపై స్పష్టత వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్‌ భేటీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొంగరకలాన్‌లో సభ ప్రారంభానికి ముందే మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రగతి నివేదన సభలో సీఎం ప్రజలపై వరాలు కురిపించబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. సీఎం ప్రకటించబోయే వరాలకు కేబినెట్‌ నుంచి ఆమోదం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వరాల కన్నా ముందస్తుపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశముంది.

వేతన సవరణ కమిషన్‌ ఇచ్చిన మధ్యంతర నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. మధ్యంతర భృతిపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు 31 కులాలకు సామాజిక భవనాలు నిర్మించడానికి వీలుగా 61.30 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే భేటీలో వృద్దాప్య, వికలాంగ, వితంతువు వర్గాలకు పింఛన్‌ పెంపు, నిరుద్యోగ భీతిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త జోనల్‌ విధానంపై రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల కావడంతో.. నోటిఫికేషన్ల మీద చర్చించనున్నారు. ఇప్పటికే నియామకాలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చినప్పటికీ భర్తీ ప్రకియ చోటుచేసుకోని నోటిఫికేషన్లు రద్దు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఎజెండాలో వందకుపైగా అంశాలున్నట్టు తెలుస్తోంది. అర్చకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలతోపాటు రెగ్యులర్‌గా ఒకటో తేదీన వేతనం ఇవ్వడానికి వీలుగా తగిన చర్యలు తీసుకోవడానికి ఆమోదం తెలిపే వీలుంది.

ఈ సమావేశమే కేబినెట్‌ చివరి భేటీ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే అనూహ్య నిర్ణయం జరిగితే తప్ప ఇది చివరి మంత్రివర్గ సమావేశం కాదని తెలుస్తోంది. 2వ తేదీన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలుకావాలంటే మరికొన్ని రోజులు ప్రభుత్వం ఉండాల్సిందే. అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అపద్ధర్మ ప్రభుత్వానికి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. అందుకే మరో కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై విధాన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండానే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ముందస్తు ఎన్నికలపై మంత్రివర్గం నిర్నయం తీసుకొని.. సీఎంకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎదేమైనా రేపు జరిగనున్న కేబినెట్‌ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెంచుతోంది. 

06:56 - September 1, 2018

హైదరాబాద్ : ప్రగతినివేదన సభకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఆర్టీసీ తన వంతు సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి నివేదన సభతో తన ఆదాయం పెంచుకుంటున్నామంటున్న ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. 

06:53 - September 1, 2018

హైదరాబాద్ : అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ... సెప్టెంబర్‌ 12న దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ స్పష్టంచేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. స్థానికతను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పరిగణించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. బాహ్యవలయ రహదారిని ఇష్టానుసారం మార్పు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్లో సగానికి పైగా ఖర్చు చేయలేదని విమర్శించారు. వారిది ప్రగతి నివేదన సభ అయితే,..తమది ప్రజల ఆవేదన అని అన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం..8మంది మృతి...

చెన్నై : సేలం సమీపంలోని మామందూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 8మంది మృతి చెందారు. మరో 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనాస్థలిని కలెక్టర్ రోహిణి పరిశీలించారు. 

హరికృష్ణ భౌతిక కాయంతో సెల్ఫీ తీసుకున్న సిబ్బందిపై వేటు..

నల్లగొండ : హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకున్న నలుగురు సిబ్బందిపై వేటేసినట్టు కామినేని ఆసుపత్రి తెలిపింది. ఈ ఘటన అమానుష, అనాగరిక ప్రవర్తన వల్ల జరిగిన తప్పిదమని, జరిగిన తప్పుకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రిలో ఉన్న హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నామని..ఈ తప్పులో పాల్గొన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు కామినేని ఆసుపత్రి స్పష్టం చేసింది. మరోమారు ఇటవంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Don't Miss