Activities calendar

02 September 2018

22:58 - September 2, 2018

కొంగర కలాన్ వేదిక ఇచ్చిన సంకేతమేంటి..? కేసీఆర్ అంతరంగం ఆవిష్కృతమైందా..? ముందస్తుపై దోబూచులాట తొలగిందా..? కేసీఆర్ ప్రసంగంపై టెన్ టివి ప్రత్యేక విశ్లేషణను చేపట్టింది. ప్రగతి నివేదన సభపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చేప్పిందేమి లేదన్నారు. పదే పదే చెప్పిననే ఉన్నాయని... కొత్తగా ఒక్క అంశం లేదన్నారు. కానీ కేసీఆర్ చాలా తెలివైన వాడు...అంత పెద్ద సభ పెట్టి..కొత్త విషయాలు చెప్పకపోవడం వెనుక ఏదో వ్యూహం ఉండి ఉంటుందన్నారు. గుడ్ పబ్లిసిటీ ఉన్న వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.

ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని, ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు ఎన్నో సార్లు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ స్పీచ్ ను విమర్శించే అవకాశం ఉందని..ఇక్కడ కేసీఆర్ చాలా తెలివిగల వాడని..తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు కూడా కేసీఆర్ ను కవర్ చేయకుండా ఉండలేకపోయారని..కేసీఆర్ భాష..టైమింగ్...కొన్ని అంశాలు కేసీఆర్ కు కవరేజ్ వచ్చాయన్నారు. సింగిల్ ఎపిసోడ్ లో కేసీఆర్ పూర్తి చేయరని, కొత్త పథకాలు ప్రకటిస్తే..ఆ వరాలకు సంబంధించిన అంశాలు వస్తాయన్నారు. రేపటి హెడ్ లైన్ ను కేసీఆర్ ఇవాళే నిర్ణయించుకని మాట్లాడారని, త్వరలో రాజకీయ నిర్ణయాలు వెలువరిస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. అంటే ఒక ట్రైలర్ వదిలారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడనే దానిపై ఉత్కంఠ ఉందని...అందుకే సభకు వచ్చారన్నారు. సభకు వచ్చిన వారంతా టీఆర్ఎస్ శ్రేణులేనని, సానుభూతి పరులు, ఓటర్లు అని పేర్కొన్నారు. వెళ్లిన వారికి కూడా క్రూరియాసిటీ ఉందన్నారు. అధికారంలో ఉన్న వారు ఇలాంటి సభలు నిర్వహించడం పరిపాటి అని, ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు జనసమీకరణ చేశారని..పోటీ పడి జనాలను తరలించారని, టికెట్లు రావాలనే ఉద్ధేశ్యంతో ఇలా చేశారన్నారు. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

 

22:48 - September 2, 2018

రంగారెడ్డి : కొంగర కలాన్‌ సభలో ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ముందస్తు ఎన్నికలపై ఉత్కంఠకు తెరదించకుండా, జనంలో ఆసక్తి మరింత పెరిగేలా రాజకీయ ప్రకటనలు చేశారు. ఢిల్లీ పెద్దలకు గులాం గిరీ చేద్దామా.. తెలంగాణ గులాబీలుగా స్వతంత్రంగా ఉందామా అంటూ పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచారు కేసీఆర్‌. 
రాజకీయ వేడిని రగిలించిన కేసీఆర్  
తెలంగాణలో రాజకీయ వేడిని రగిలించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణను గత ప్రభుత్వాలేవీ చేయలేనంతగా అభివృద్ధి చేశామని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలపై కొంగర కలాన్‌ సభలోనే కేసీఆర్ ప్రకటన చేస్తారంటూ సాగిన ప్రచారంపైనా స్పందించారు కేసీఆర్‌. అయితే, ఎన్నికలు వస్తాయా రావా అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 
జాతీయ పార్టీలపైనా మండిపడ్డ కేసీఆర్‌ 
అటు జాతీయ పార్టీలపైనా మండిపడ్డారు కేసీఆర్‌. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌, బీజేపీలను దుయ్యబట్టారు. అధికారం మన దగ్గరే ఉంటే ఆత్మగౌరవంతో ఉంటామన్నారు.  ఢిల్లీకి గులాం గిరీ చేయాలో, స్వతంత్రంగా ఉండాలో తేల్చుకోమని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్.
ఎన్నికల హామీలను చేయచ్చన్న ప్రచారానికీ తెరదించిన కేసీఆర్‌
కొంగర కలాన్‌ సభలో భారీగా ఎన్నికల హామీలను కేసీఆర్ చేయచ్చన్న ప్రచారానికీ తెరదించారు కేసీఆర్‌. ప్రస్తుతం అధికారంలో ఉన్నందున, ముఖ్యమంత్రిగా తాను ఎలాంటి హామీలు ఇవ్వడం సరికాదన్నారు. చేసేవాటినే చెబుతామన్న కేసీఆర్‌, మేనిఫెస్టో రూపకల్పన కోసం త్వరలోనే కె.కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి..
తమ పాలనలోనే తెలంగాణ గణనీయమైన అభివృద్ధి చెందిందన్న కేసీఆర్‌, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కోటి ఎకరాల సాగు నుంచి యువకులకు ఉద్యోగావకాశాల వరకూ అన్నీ కల్పిస్తామన్నారు. మొత్తంమీద తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మాత్రం కొంగరకలాన్‌ సభ ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయింది. అయితే, ఎన్నికలకు మాత్రం సిద్ధం కావాలన్న సంకేతాలను టీఆర్‌ఎస్ క్యాడర్‌కు అందించడంలో గులాబీ బాస్‌ సక్సెస్‌ అయ్యారు.

 

22:36 - September 2, 2018

హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠకు దారితీసిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పలు వర్గాలకు వరాలు ప్రకటిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అణగారిన వర్గాల సామాజిక భవనాలకు 71 ఎకరాల భూమి, 70కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్‌ఎంలు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 
కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రగతి నివేదన సభ తుది ఏర్పాట్లలో  నిమగ్నమైన మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, జలవనరులు శాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.  
ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు...
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం సిఫారుసు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కొంగర కలాన్‌ ప్రగతి నివేదన సభలో అసెంబ్లీ రద్దను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారని అనకున్నారు. అయితే ఈ భేటీలో అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ... త్వరలో మరోసారి నిర్వహించే  కేబినెట్‌ సమావేశంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని ముక్తసరిగా చెప్పారు. ఈనెల 5న మరోసారి కేబినెట్‌ భేటీ కానుంది. 
ఆశా వర్కర్ల వేతనాలు రూ.6 వేల నుంచి రూ.8,500 పెంపు 
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఎనిమిదన్నర వేల రూపాయలకు పెంచారు. దీని వలన 25,045 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సెకండ్‌ ఏఎన్‌ఎంలు,  ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల వేతనాలుకు కూడా పెరిగాయి. సెకండ్‌ ఏఎన్‌ఎంలకు నెలకు  ప్రస్తుతం ఇస్తున్న 11 వేల రూపాయలను 21 వేలకు పెంచారు. దీని వలన 9 వేల మందికిపైగా రెండో ఏఎన్‌ఎంలకు లబ్ధి చేకూరుతుంది. కాంట్రాక్ట్‌ డాక్టర్లకు కూడా వేతనాలు పెరిగాయి. 
రెడ్డి హాస్టల్‌కు మరో 5 ఎకరాలు కేటాయింపు 
జనాభాలో 50 శాతంపైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు హైదరాబాద్‌లో భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెడ్డి హాస్టల్‌ కోసం గతంలో కేటాయించిన 10 ఎకరాల భూమికి అదనంగా మరో 5 ఎకరాలు కేటాయించింది. అలాగే గోపాలమిత్రల వేతనాలను పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు పదవీ విరమణ వయసు పెరిగింది. 
మన్వాడ గ్రామంలో ఒక్కో కుటుంబానికి 4.25 లక్షలు 
మిడ్‌మానేరు ప్రాజెక్టు గండిపడి ముంపుతో నష్టపోయిన మన్వాడ గ్రామంలోని ఒక్కో కుటుంబానికి 4.25 లక్షల రూపాయాలు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం 25.84 కోట్ల రూపాయలు కేటాయించింది. కంటివెలుగు అమలు జరుగుతున్న తీరుపై కేబినెట్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. 
 

22:22 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని టీపీసీసీ విమర్శించింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగంలో పసలేదని విమర్శించారు. కేసీఆర్‌ మీటింగ్, స్పీచ్ తుస్సుమందని అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని ఉత్తమ్‌ చెప్పారు. సీఎం ప్రసంగంలో పసలేదన్నారు. 

 

21:34 - September 2, 2018

హైదరాబాద్ : ఇది జనమా..ప్రభంజనమా అనేలా సభకు వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. సభను చూస్తుంటే 18 ఏళ్ల నాటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. గిరిజన గుడాలు, లంబాడీ తండాల నుంచి తరలివచ్చిన అందరికీ వందనం తెలిపారు. అప్పటి సీఎం విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు తల్లడిల్లిపోయారని తెలిపారు. ఛార్జీల విషయంలో సీఎంకు తాను బహిరంగ  లేఖ రాశానని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు తెలంగాణ రైతులకు ఉరితాడులాంటిదని లేఖలో రాశానని తెలిపారు. తెలంగాణ అంటే అప్పటి పాలకులకు అలుసైపోయిందన్నారు. ఆందోళనలకు దిగితే కాల్చి పారేస్తామనుకునే వాళ్లు..అధికారమదంతో అప్పటి ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తాను రాసిన లేఖతోనే బీజం పడిందన్నారు. 9..10 నెలల పాటు విపరీతమైన మేధోమథనం చేశామని చెప్పారు. ఏం చేయగలం..ఏం చేయలేమన్నది విపరీతంగా చర్చించామన్నారు. తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ కోసం పోరాడాల్సిందేనని నిర్ణయాకొచ్చామని తెలిపారు. తన వెంట పడికెడు మంది వ్యక్తులే అప్పుడున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ పెద్దలు కుట్రలు  
రాజకీయ పంథాలోనే తెలంగాణ సాధించాలని ఆ బాట పట్టామని తెలిపారు. ఆ పోరాటంలో మీరంతా భాస్వాములేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఒక ఉప్పెన సృష్టించామన్నారు. ముందు హామీ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు ఆ తర్వాత కుట్రలు చేశారని తెలిపారు. గులాబీ జెండా పనైపోయిందని ప్రచారం మొదలు పెట్టారని తెలిపారు. 'మనల్ని అవమానించారు...మనల్ని అవహేళన చేశారు' అని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా మనం కొనసాగించగలితే ఎప్పటికైనా తెలంగాణ సమాజమంతా ఒక్కవైపు వస్తుందని అప్పుడే చెప్పానని తెలిపారు. ఉద్యమ బాట విడితే రాళ్లతో కొట్టి చంపమని జలదృశ్యంలో చెప్పానని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 36 పార్టీలను తెలంగాణకు ఒప్పించానని తెలిపారు. 'కమ్యూనిస్టు పార్టీని ఒప్పించడానికే 37 సార్లు బర్దన్ ను కలిశానని..నున్వేమైనా పిచ్చోడివా' అని బర్ధర్ అన్నారని గుర్తు చేశారు. తాను తెలంగాణ పిచ్చోడినే అని బర్ధన్ కు చెప్పానని తెలిపారు. 14 సంవత్సరాలు కఠోర శ్రమ తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు. ఇంత పోరాటం చేసి రాష్ట్రాన్ని ఇతరుల పరం చేయొద్దని పార్టీ నేతలు కోరారని తెలిపారు. అందుకే 2014లో ఒంటరిగానే పోరాటం చేశామన్నారు. టీఆర్ ఎస్ బిడ్డలే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మనల్ని గెలిపించారని తెలిపారు. 
అధికారంలోకి వచ్చాక చూస్తే ఎన్నో సమస్యలు 
అధికారంలోకి వచ్చాక చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అలాంటి పరిస్థితుల్లో పాలన ప్రారంభించామని తెలిపారు. ఒక్కోటి అర్థం చేసుకుంటూ ముందుకు సాగామని తెలిపారు. ఏది అత్యవసరమో అదే చేసుకుంటూ వెళ్లామని చెప్పారు. తెలంగాణ వస్తే తక్షణం చెరువులు బాగు చేయాలని ఎప్పుడో నిర్ణయించామని తెలిపారు. దీనిపై జయశంకర్, విద్యాసాగర్ రావు, నేను కలిసి ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో ఒక ఉప్పెన సృష్టించామని చెప్పారు. 
సమైక్య పాలనలో కూలిపోయిన కులవృత్తులు  
సమైక్య పాలనలో కులవృత్తులు కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రం వస్తే చేనేత కార్మికులను కడుపులో పెట్టుకుంటామని చెప్పామని...చేనేత కార్మికులను ఆత్మహత్య చేసుకోవద్దని కాపాడుకున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 15 లక్షల మంది వలసపోయారని తెలిపారు. కంప్యూటర్ల పనే కాదు, గొర్రెలు, బర్రెలు పెంచడం కూడా వృత్తేనని స్పష్టం చేశారు. 
ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ స్పందన 
ముందస్తు ఎన్నికలపై ప్రజలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ చెప్పందని.. దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి చాలామంది మాట్లాడుతున్నారని... అసెంబ్లీ రద్దుపై మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్‌. ఎన్నికలకు వెళ్లే విషయమై మంత్రివర్గ సహచరులు.. నిర్ణయాన్ని తనకే వదిలేశారన్నారు. ముందస్తు ఎన్నికలపై రాబోయే రోజుల్లో నిర్ణయం తెలియజేస్తామన్నారు.
మనం ఢిల్లీ దొరల దగ్గర గులాంగిరి ఉండాలా...
'మనం ఢిల్లీ దొరల దగ్గర గులాంగిరి ఉండాలా'.. అని కాంగ్రెస్‌ నేతలను సీఎం కేసీఆర్‌ పరోక్షంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే... కొంతమంది కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జోనల్‌ వ్యవస్థపై ప్రధాని మోదీ ఊగిసలాడుతుంటే స్వయంగా ఢిల్లీ వెళ్లి కొత్త జోనల్‌ వ్యవస్థను సాధించానన్నారు.

ఇది జనమా..ప్రభంజనమా : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సభను చూస్తుంటే 18 ఏళ్ల నాటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. గిరిజన గుడాలు, లంబాడీ తండాల నుంచి తరలివచ్చిన అందరికీ వందనం తెలిపారు. అప్పటి సీఎం విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు తల్లడిల్లిపోయారని తెలిపారు. ఛార్జీల విషయంలో సీఎంకు తాను లేఖ రాశానని గుర్తు చేశారు.

 

20:23 - September 2, 2018
20:19 - September 2, 2018
19:46 - September 2, 2018

రంగారెడ్డి : నాలుగేళ్ల పాలనలో తాము ఏ ప్రగతినైతే చేశామో అది చెప్పేందుకే ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామని టీఆర్ ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు అన్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని చెప్పారు. 500 పథకాలు ప్రవేశట్టామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఎస్పీ, ఎస్టీలు, బీసీలు ఉన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం బీసీలకు అంకితమవుతుందన్నారు. మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే స్వర్ణ తెలంగాణ స్వర్గతెలంగాణ అవుతుంది. 

 

ప్రగతి నివేదన సభలో కే.కేశవరావు ప్రసంగం

రంగారెడ్డి : నాలుగేళ్ల పాలనలో తాము ఏ ప్రగతినైతే చేశామో అది చెప్పేందుకే ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామని కే.కేశవరావు అన్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని చెప్పారు. 500 పథకాలు ప్రవేశట్టామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఎస్పీ, ఎస్టీలు, బీసీలు ఉన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం బీసీలకు అంకితమవుతుందన్నారు. మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే స్వర్ణ తెలంగాణ స్వర్గతెలంగాణ అవుతుంది. 

 

ప్రగతి నివేదన సభలో మహేందర్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్ : ఇంత పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో ప్రగతి నివేదన సభ జరగడం తమకు చాలా సంతోషమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని..వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

19:21 - September 2, 2018

హైదరాబాద్ : ఇంత పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో ప్రగతి నివేదన సభ జరగడం తమకు చాలా సంతోషమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని..వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

19:02 - September 2, 2018

కొంగరకలాన్ చేరుకున్న సీఎం కేసీఆర్

రంగారెడ్డి : బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ బయల్దేరారు. సీఎం కేసీఆర్ కొంగరకలాన్ చేరుకున్నారు. కాసేపట్లో ప్రగతి నివేదన సభ ప్రారంభం కానుంది.  

 

కాసేపట్లో ప్రగతి నివేదన సభ ప్రారంభం

 రంగారెడ్డి : కాసేపట్లో ప్రగతి నివేదన సభ ప్రారంభం కానుంది. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ బయల్దేరారు. 

17:12 - September 2, 2018
16:19 - September 2, 2018

రంగారెడ్డి : కొంగరకలాన్ లో జరుగనున్న ప్రగతి నివేదన సభకు వాన గండం పొంచివుంది. కొంగరకలాన్ చుట్టూ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. గులాబీ దళం ఆందోళనలో ఉంది. సభకు జనం హాజరయ్యారు. తేలికపాటి వర్షం వచ్చినా బురద కాకుండా నిర్వహకులు మ్యాట్లు పరిచారు. సభా ప్రాంగణానికి జనం ఇంకా తరలివస్తున్నారు. సభాస్థలికి మంత్రులు చేరుకున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

కేవలం వేతన సవరణలకే పరిమితమైన కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కేవలం వేతన సవరణలకే కేబినెట్ భేటీ పరిమితమైంది. ముందస్తు ఎన్నికలపై మంత్రులు మాట్లాడలేదు. ఉప ఎన్నికలపై మంత్రులు సమాధానం దాటవేశారు. మీడియా సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. కేబినెట్ లో ముందస్తు ఎన్నికలపై చర్చ జరగలేదా?  కొంగరకలాన్ సభలోనైనా ముందస్తు ప్రకటన వస్తుందా? అన్న అనుమానాలున్నాయి. 

15:34 - September 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కేవలం వేతన సవరణలకే కేబినెట్ భేటీ పరిమితమైంది. ముందస్తు ఎన్నికలపై మంత్రులు మాట్లాడలేదు. ఉప ఎన్నికలపై మంత్రులు సమాధానం దాటవేశారు. మీడియా సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. కేబినెట్ లో ముందస్తు ఎన్నికలపై చర్చ జరగలేదా?  కొంగరకలాన్ సభలోనైనా ముందస్తు ప్రకటన వస్తుందా? అన్న అనుమానాలున్నాయి. 

 

15:21 - September 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ కులాల కోసం హైదరాబాద్ లో భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీ కులాలకు హైదరాబాద్ లో రూ.70 కోట్లతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 71 ఎకరాలు కేటాయించారు. 50 శాతం పైబడిన బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించనున్నారు. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ కు మరో 5 ఎకరాలు కేటాయించారు. గోపాలమిత్రల వేతనం రూ.3500 నుంచి రూ.8500 వేలకు పెంచారు. అర్చకుల పదవీ మిరమణ వయస్సును 65ఏళ్లకు పెంచారు.
మంత్రి హరీష్ రావు... 
రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 27,500 మంది ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.6000నుంచి రూ. 7500లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సెకండ్ ఏఎన్ ఎమ్ లు వారితోపాటు ఎన్ యూహెచ్ ఎమ్, స్టాప్ నర్సులు, ఫార్మాసిస్టులు మొత్తంగా వైద్య ఆరోగ్ శాఖలో 9 వేల మందికి కనీస వేతనాలు అమలు చేసే విధంగా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెకండ్ ఏఎన్ ఎమ్ ల వేతనాన్ని 11 వేల నుంచి 25000 వేలకు పెంచినట్లు తెలిపారు. 

 

15:04 - September 2, 2018

రంగారెడ్డి : టీఆర్ ఎస్ ప్రగతి నివేదన సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కొంగరకలాన్ కు గులాబీ శ్రేణులు పోటెత్తారు. రహదారులు గులాబీమయం అయ్యాయి. సభ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. రెండు వేల మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు. సభా ప్రాంగణానికి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ కులాలకు హైదరాబాద్ లో రూ.70 కోట్లతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 71 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ కు మరో 5 ఎకరాలు కేటాయించారు. గోపాలమిత్రల వేతన రూ.3500 నుంచి 6000 వేలకు అర్చకుల పదవీ మిరమణ వయస్సును 65ఏళ్లకు పెంచారు.

 

కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్...

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర కెబినెట్ సమావేశం కొనసాగుతోంది. పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కొంగరకలాన్ కు వెళ్లనున్నారు. 

సాగర్ గేట్లను మూసివేశారు...

నల్గొండ : నాగార్జున సాగర్ లో ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ఉదయం 2గేట్లను అధికారులు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇన్ ఫ్లో తగ్గడంతో మళ్లీ గేట్లను మూసివేశారు. 

వైసీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి ?

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత, నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రాంనారాయణరెడ్డి వైసీసీలో చేరనున్నట్లు సమాచారం.

25-30 లక్షల మంది వస్తారు - బాల్క సుమన్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కొంగరకలాన్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో ఆయనతో టెన్ టివి మాట్లాడింది. కొంగరకలాన్ కు దాదాపు 25-30 లక్షల మంది తరలివస్తారన్నారు.

సభలో ఎమ్మెల్సీ నృత్యం...

హైదరాబాద్ : కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. సభా ప్రాంగణం మంతా గులాబీ మయమై పోయింది. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం...

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ ఎజెండాపై సర్కార్ గోప్యత పాటిస్తోంది. ఉద్యోగుల మధ్యంతర భృతిపై కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నట్లు, ఉద్యోగులకు 24-30 శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త కొలువుల నోటిఫికేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు కేటీఆర్..మహేందర్ రెడ్డిలకు మినహాయింపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఆకట్టుకుంటున్న 'గుస్సా' నృత్యాలు...

హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన పలువురు గుస్సా నృత్యాలు చేస్తూ సభకు వెళుతున్నారు. కోలాట నృత్యాలు...గోండు నృత్యాలు...లంబాడీల నృత్య ప్రదర్శన...బోనాలతో వెళుతుండడం అందర్నీ ఆకట్టుకుంది. 

అందుకే ప్రగతి నివేదన - మహేందర్ రెడ్డి...

హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేస్తామని ఎవరన్నా చెప్పారా ? కేవలం తాము చేపడుతున్న...చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తెలియచేసేందుకే 'ప్రగతి నివేదన' సభ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సభ ప్రాంగణం నుండి ఆయనతో టెన్ టివి మాట్లాడింది. 25-30 లక్షల మంది జనాలు తరలివస్తున్నారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

11:25 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహిస్తున్న 'ప్రగతి నివేదన' సభలో పాల్గొనేందుకు తాము పాదయాత్రగా వెళుతున్నామని హస్తినాపురం కార్పొరేటర్ పేర్కొన్నారు. టెన్ టివి నేతలతో మాట్లాడింది. ఇక్కడి నుండి పది కిలో మీటర్ల దూరం ఉందని..అందుకే పాదయాత్ర ద్వారా సభకు వెళుతున్నామన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ ఏం చెబుతారని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:48 - September 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ప్రగతి నివేదన' సభపై అందరి చూపు నెలకొంది. తెలంగాణ జిల్లాల నుండి భారీగా జనాలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. ఇలాంటి సభ ఎవరూ పెట్టలేదని తెలిపారు. 2000వేల ఎకరాలు 600 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 150ట్రాక్టర్లలో ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చారని, మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం జనాలతో సభ నిండిపోతుందన్నారు. విజయవాడ నుండి తాము రావడం జరిగిందని, అలాగే ఇతర రాష్ట్రాల నుండి జనాలు వస్తున్నారని పేర్కొన్నారు. 

ఇలాంటి సభ ఎవరూ పెట్టలేదన్న జీవన్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ప్రగతి నివేదన' సభపై అందరి చూపు నెలకొంది. తెలంగాణ జిల్లాల నుండి భారీగా జనాలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. ఇలాంటి సభ ఎవరూ పెట్టలేదని తెలిపారు. 2000వేల ఎకరాలు 600 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

10:43 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బహిరంగసభకు సిద్ధిపేట జిల్లా నుండి బంజారాలు డ్యాన్సులు..పాటలు పాడుతూ కదం తొక్కుతున్నారు. ఈ సందర్భంగా వారితో టెన్ టివి ముచ్చటించింది. ఎత్తురా..తెలంగాణ జెండ..రాజుగా..అంటూ ఓ బంజారా మహిళ పాట పాడింది. పాట చూడటానికి వీడియో క్లిక్ చేయండి. 

10:32 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుండి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా నెలకొంది. ఈ సందర్భంగా టోల్ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తరలివస్తున్న జనాలకు అక్కడక్కడ వంటలు ఏర్పాటు చేశారు...;పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:57 - September 2, 2018

హైదరాబాద్ : ఎల్ బినగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జీ ముద్దగోని రాంమోహన్ గౌడ్ తమకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని...భోజనాలు కూడా సమకూర్చారని పేర్కొన్నారు. ఆదివారం కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్ బినగర్ లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. కేసీఆర్ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొందని...సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్నారు. భారతదేశానికి ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని అనుకుంటారన్నారు. వేరే పార్టీకి పుట్టగతులుండవని..కాంగ్రెస్ లో నేతలు కూడా మిగలరని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇంటి పెద్ద అని...ముద్దగోని రాంమోహన్ గౌడ్ అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. 

09:54 - September 2, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రైతుల్లో ఆనందం నెలకొందని తెలిపారు. 24గంటల కరెంటు..పెట్టుబడి సాయం...ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు. కేసీఆర్ పాలన ఎంతో బాగుందని..రైతు బీమా..రైతులకు ఇచ్చే పథకాలు చాలా గొప్పవన్నారు. లక్షల మందితో జనాలు తరలివస్తున్నారని..సబ్సిడీ ద్వారా ఇచ్చిన ట్రాక్టర్లతో జనాలు ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లను ఎంతో అందంగా అలకరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:53 - September 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ గుడి ఉంది తెలుసా ? అవునండి..ఈ విషయం 'ప్రగతి నివేదన' సభ ఏర్పాటు సందర్భంగా తెలిసిందే. కొంగర కలాన్ లో నిర్వహించే భారీ బహిరంగసభ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీ గేటు వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. ఈ సందర్భంగా అక్కడున్న నేతలతో మాట్లాడింది. కేసీఆర్ తమకు దేవుడని...ఎన్నో పథకాలు..సంక్షేమ కార్యక్రమాలు చేశారని ఓ నేత తెలిపారు. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేయలేదని తెలిపారు. దేవుడి గుడి కూడా కట్టానని..ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం..ఇతరత్రా సేవా కార్యక్రమాల చేస్తానని తెలిపారు.

09:52 - September 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కొంగర్ కలాన్ లో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో మాట్లాడే ప్రయత్నం చేసింది. శనివారం రాత్రే ప్రజలు సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. బొంగులూరు గేట్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రైతులతో టెన్ టివి మాట్లాడింది. ఉత్సాహం..వాతావరణం...కదిలిన జనాన్ని చూస్తే 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది వస్తారని తెలుస్తోందన్నారు. ఖమ్మం జిల్లా నుండి వచ్చే వారికి బొంగులూరు గేటు వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. 1850 ట్రాక్టర్లు వస్తాయని అంచనా వేస్తే 3వేల ట్రాక్టర్లలలో జనాలు వచ్చారని..ఇంకా అధికంగా ప్రజలు రావడంతో బయట పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలివచ్చామన్నారు.

బొంగులూరి గేట్ వద్ద భారీగా ట్రాక్టర్లు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించే ప్రగతి నివేదన సభకు భారీగా జనాలు తరలివస్తున్నారు. శనివారం రాత్రికే ట్రాక్టర్లలలో ప్రజలు భారీగా తరలివచ్చారు. బొంగులూరి గేట్ వద్ద మూడు వేల ట్రాక్టర్లు పార్కింగ్ చేశారు. 

'ప్రగతి నివేదన' టోల్ ట్యాక్స్ లేదు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కొంగరకలాన్ లో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన..చేస్తున్న ప్రగతిని సభలో వివరించనున్నారు. ఈ సందర్భంగా సభకు వెళ్లే మార్గాలన్నీ అందంగా 'గులాబీ' తోరణాలు..ఫ్లెక్సీలతో అలంకరించారు. నాగోల్ లో స్థానిక నేతలు పలు ఏర్పాట్లు చేశారు. బహిరంగసభకు వెళ్లే వారికి స్వాగతం పలికేందుకు స్వాగత వేదిక...ఆహారం..మంచినీరు ఏర్పాట్లు చేశారు.

సభకు 2వేల ఎకరాలు...

హైదరాబాద్ : 2 వేల ఎకరాల్లో 300 మంది కూర్చొనేందుకు వీలుగా సభా వేదికగా ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 24 గ్యాలరీలు, సభా ప్రాంగణంలో 50 భారీ ఎల్ ఈ డీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. 30 అంబులెన్స్ లు, 150 మంది వైద్యులను నియమించారు. సభకు 14 ఎంట్రీ పాయింట్లు, 1400 ఎకరాల్లో 19 పార్కింగ్ స్థలాలు కేటాయించారు. 

25 లక్షల మంది హాజరు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించే కొంగరకలాన్ లో నిర్వహించే భారీ బహిరంగసభకు సుమారు 25 లక్షల మంది వస్తారని తెలుస్తోంది. ఇందుకు నేతలు జనసమీకరణ చేశారు. 

టీఆర్ఎస్ ప్రగతి నివేదన...

రంగారెడ్డి : కొంగరకలాన్ లో టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సాయంత్రం 4గంటల తరువాత పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రసగించనున్నారు. సుమారు గంటన్నర సేపు ఆయన ప్రసంగించనున్నారని తెలుస్తోంది. 

Don't Miss