Activities calendar

04 September 2018

21:50 - September 4, 2018

అమెరికా : చేపల్ని పెంపకంపై ఇప్పుడు కోట్లాది రూపాయలు టర్నోవర్ అవుతున్నాయి. చేపల్ని ఎక్కువగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. ఒకప్పుడు కాలువల్లోను, నదుల్లోను, సముద్రాల్లోను పెరిగిన చేపల్నే తినేవారు. కానీ గత కొంతకాలంగా చేపల చెరువుల్లో ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే చేపల్ని ఒకచోటి నుండి మరొక చోటికి తరలించేందుకు సాధారణంగా రోడ్డు మార్గాలను..లేదా నీటి మార్గాల ద్వారా కానీ విమానం ద్వారా చేపల్ని ఒకచోటి నుండి మరొకచోటికి తరలించటం కూడా జరుగుతోంది. వాటికి తీసుకెళ్లి అతి ఎతైన ప్రదేశం నుండి ఆ చేపల్ని గాల్లోంచి కొండ ప్రాంతాలలో వుండే చెరువుల్లోకి జారవిడుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..అంత ఎత్తునుండి జారవిడిచినా మీనాలు చక్కగా చెరువుల్లోకి క్షేమంగా చేరిపోతున్నాయి.

అమెరికాలోని యుటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ ఈ పని చేస్తున్నది. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఈ పద్ధతి ఈజీగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు. విమానం కింది భాగంలో ఉన్న భారీ రంధ్రం నుంచి వేలాది చేపలను కింద ఉన్న చెరువులోకి జార విడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి, వాటిని గుర్రాలపై పైకి తరలించి చెరువుల్లో వేసేవారు. కానీ దానికి సమయం ఎక్కువ, సుదీర్ఘ ప్రక్రియ కావడంతో విమానంతో చేపల్ని తరలించటం సునాయాసంగా మారిపోవటం..పైగా తక్కువ సమయంలోనే పని పూర్తి కావటంతో దీన్నే కొనసాగిస్తున్నామని సదరు విమాన చేపల తరలింపుదారులు తెలిపారు. కాగా ఇవన్నీ చిన్నచిన్న చేప పిల్లలు కావడంతో అంత ఎత్తు నుంచి కింద పడినా వాటిలో 95 శాతం వరకు బతికే ఉంటున్నాయంటున్నారు సదరు నిర్వాహకులు.

21:27 - September 4, 2018

జమ్ము కశ్మీర్ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవానుల ధైర్యసాహసాలతో దేశ ప్రజలకు భరోసా నిచ్చే జవానుల త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ జవాన్లకు దిశానిర్దేశం చేస్తు అనుక్షణం అప్రమత్తంగా వుండి..దేశ భద్రత బాధ్యతను కడు సమర్థవంతంగా నిర్వహించే ఆర్మీ అధికారుల సమయోచిత శక్తి యుక్తులతో భారత భద్రత ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయిలోవుండే ఆర్మీ అధికారులకు నైతికత కూడా అంతే ముఖ్యం. కానీ కొందరు అత్యంత ఉన్నత హోదాలో వున్నప్పటికీ..వారి సహజ నైజంతో తమ నైతికతను దిగజార్చుకుంటుంటారు. ఇది వారి అనైతకతకే కాదు దేశ భవిత్రకు, భద్రతకు కూడా ముప్పువాటిల్లే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి అధికారులకు సైనిక దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేశారు.

సైన్యంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. మేజర్ లీటుల్ గొగోయ్ ఓ స్థానిక యువతిని శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు రప్పించుకున్న వ్యవహారంపై సైనిక న్యాయస్థానం లీటుల్ ను దోషిగా తేల్చింది. ఇది ప్రజల దృష్టిలో సైన్యం ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా భావిస్తున్నారు.

నేరాన్ని బట్టి మేజర్ గొగోయ్‌పై చర్య తీసుకుంటామని జనరల్ రావత్ స్పష్టంచేశారు. అనైతిక చర్యలను, అవినీతిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేస్తున్నాను. సైనిక న్యాయస్థానం మేజర్ గొగోయ్‌ని దోషిగా తేల్చింది. ఆయనను కోర్ట్‌మార్షల్ చేయాలని సిఫారసు చేసింది. అమ్మాయిని హోటల్‌కు పిలిపించుకున్న సమయంలో మేజర్ గొగోయ్ తన డ్యూటీ ప్రదేశానికి దూరంగా ఉన్నారని కూడా సైనిక న్యాయస్థానం తేల్చింది. ఇది మరింత తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాగా గతంలో కూడా మేజర్ గొగోయ్ ఓ కశ్మీరీ యువకుని తన జీపు బానెట్‌కు కట్టేసి అల్లర్లు జరిగే ప్రాంతాల్లో తిరగడం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. రాళ్లురువ్వే వారిని అదుపు చేసేందుకు అలా తిప్పినట్టు ఆయన తర్వాత ప్రకటించినా ప్రజల్లో మాత్రం అది పలు విమర్శలకు దారి తీసింది. అప్పట్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలు నిరంతరంగా చేపట్టినందుకు జనరల్ రావత్ ఆయనకు ఆర్మీచీఫ్ కమెండేషన్ కార్డు బహూకరించారు. ఏడాది తిరిగేలోపు మేజర్ గొగోయ్ అనైతిక ప్రవర్తన కారణంగా తలదించుకోవాల్సి వచ్చింది.

కాగా ఆర్మీలో ఎంతటి కఠినతరమైన నిబంధనలుంటాయో అంతటి బాధ్యత కూడా ఆయా అధికారులపై వుందనే విషయాన్ని వారు నిద్రలో కూడా మరిచిపోయే వీలులేదు. ఈ నిబంధనలు అతిక్రమించినా..నిర్లక్ష్యం వహించినా ఒక్కో సమయంలో, సందర్భంలో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. అసలే భారత్ పై పలు దేశాల కన్ను వున్న క్రమంలో దేశ భద్రతకు కడు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఆర్మీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని, గౌరవాన్ని అధికారులు గుర్తెరికి వ్యవహరించాల్సిన అవసరముంది. అలాగే భారత ఆర్మీ పట్ల ఇటువంటి సందర్భలతో మాయని మచ్చ పడే ప్రమాదముంది. ఏది ఏమైనా సహజసిద్ధంగా సాధారణ మనుషులకు వుండే బలహీనతలను అధిగమించి దేశం ఆర్మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ధైరాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యత పట్ల నిత్యం అప్రమత్తంగా వుంటారని ఆశిద్దాం..

 

20:49 - September 4, 2018

ఢిల్లీ : గజరాజుల్ని చూస్తే చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా ఆనంద పడుతుంటారు. ఏనుగును చూస్తే ఏడ్చే పిల్లలు కూడా కిలకిలా నవ్వేస్తారు. పెద్ద ఆకారం, చిన్ని చిన్ని కళ్లు, పెద్ద పెద్ద చెవులు ఇలా గజరాజులో అన్ని ప్రత్యేకతలే. ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన అంటు పాటలు పాడుకుంటు గజరాజులను చూసి, విని, పాడుకుంటు మురిసిపోతాం. కానీ ఇక్కడ గజరాజులను దుర్భర పరిస్థితి ఎంతటి కఠినాత్ములలైనా కన్నీరు పెట్టకమానరు. ఎక్కడ ఏనుగులను చూసినా అదే దృశ్యం మన కళ్ల ముందు నిలిచి మనసు ద్రవింపజేస్తుంది. అంతటి దుర్భరమైన, భయంకరమైన, దారుణమైన ఘటన ఆఫ్రికా వన్యమృగ చరిత్రలోనే అత్యంత దుర్భరమైన వార్త ఇది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆఫ్రికాలోని బొచ్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే ముష్కరులు ఈ ఘోరకలికి ఒడిగట్టారు. ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉండడం కనిపించింది. షాక్ అయిన అటవీ అధికారులు రంగంలోకి దిగారు. సుమారు వంద ఏనుగులు విగతజీవులై వారి కంటికి కనిపించాయి.

జూలై 10వ తేదీనుంచి ఈ అన్వేషణ...ప్రతిరోజూ కొనసాగుతునే వుంది. ఇంకా గజరాజుల కళేబరాలు అటవీశాఖ అధికారులకు కనిపిస్తు మమ్మల్ని విస్మయానికి, ఆందోళనలకు గురిచేస్తున్నాయని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ ఆవేదనతో తెలిపారు.

ఇప్పటి వరకూ ఆఫ్రికా చరిత్రలో ఇంతఘోరం జరగలేదని మైక్ చేజ్ వాపోయారు. బొచ్వానా ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత గజరాజుల ఊచకోతచ జరిగిందని మైక్ తెలిపారు. ఓకవాంగా డెల్టాలోని ప్రసిద్ధ సంరక్షణ కేంద్రంలో ఈ ఘోరకలి చోటుచేసుకుంది. ఆఫ్రికాలో అత్యధిక ఏనుగుల జనాభా సుమారు 1,35,000 ఉన్నది ఒక్క బొచ్వానాలోనే. జాంబియా, అంగోలా దేశాల్లో ఏనుగుల జాతిని దాదాపుగా అంతం చేసిన అక్రమరవామాదారులు ఇప్పుడు బొచ్వానా మీద పడ్డారని మైక్ చేజ్ పేర్కొన్నారు. ఖడ్గమృగాలకు కూడా ఈ వేటగాళ్ల నుంచి ముప్పు ఎదురవుతున్నదనీ..ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని బొచ్వానా టూరిజం మంత్రి షెకేడీ ఖామా ధృవీకరించారు. కాగా దీనిపై విచారణ కొనసాగుతోంది. 

20:03 - September 4, 2018

ఆకుకూరల్ని రైతులు పడిస్తుంటారు. లేదా పెరట్లో పెంచుకుని వాటుకుంటుంటాం. మనం రోజు తినే..చూసే అకుకూరలు మనం పెంచకపోయినా..ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోయినా అన్ని మొక్కల్లో కలిసిపోయి పెరుగుతుంటాయి. వాటి సంగతి మనకు తెలియదు. అసలు అవి ఆకుకూరలని కూడా మనకు తెలియదు. కొన్ని రకాల ఆకుకూరలు కలుపు మొక్కల్లో మొక్కలుగా పెరుగుతాయనే సంగతి మీకు తెలుసా? ఇలా పెరిగే ప్రతి మొక్కలోనూ ఔషధ, పోషక గుణాలు పుష్కలంగా వున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ ఆకు కూరల పంటల పట్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు వీటి పేర్లు కూడా చాలావరకూ తెలియవంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖరీప్‌, రబీ సీజన్లలో పొలాల్లోను, పొలంగట్లు వెంబడి, ఆఖరికి మొక్క మొలవని బీడు భూముల్లోను, గుట్టల్లోను ఇలా వివిధ రకాల ఆకుకూరలు దొరుకుతాయి. వాటిలో ముఖ్యంగా దొగ్గలి, జొన్నచెంచలి, తెల్లగలిజేరు, సన్నపాయిలి, బర్రెపాయిలి, తలావావిలి, ఎలుకచెవికూర, ఎర్రదొగ్గలికూర, గునుగుకూర, తుమ్మికూరలను పాతతరం వారు ఆకుకూరల్లా వండుకు తినేవారు. వీటిల్లో ఆద్భుతమైన పోషకాలు వుండేవని పెద్దగా అవగాహన లేని పెద్దలు చెబుతుండేవారు. ఇప్పుడంటే న్యూట్రిషియనిస్ట్ లు చెబుతున్నారు గానీ పాతకాలంలో ఆనుభవమున్న పెద్దలే పెద్ద న్యూట్రిషియనిస్టులు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..మరి మీరేమంటారు? అవును కదా? పెద్దల మాట సద్ధన్నం మూట.

19:28 - September 4, 2018

హైదరాబాద్ : గత కొంతకాలంగా డీఎస్ పై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన డీఎస్ కొంతకాలంగా బాగానే వున్నా..ఇటీవల కాలంలో నిజామాబాద్ నేతలు సీఎం కేసీఆర్ కు డీఎస్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వున్న పార్టీలో వుండి పరిస్థితులను చక్కబెట్టుకునే ఆలోచనలో వున్న డీఎస్ ఆలోచనలు ఏమీ జరిగేటట్టు లేవు. ఈ నేపథ్యంలో తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డీఎస్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

డీఎస్ కు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాను చెబితే చాలని అన్నారు. ఎందుకంటే, గతంలో డీఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించానని, ఈ వ్యక్తి వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పరంగా ఇరవై ఏళ్లు వెనకబడిందని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తన పైరవీలు ఇక్కడ నడవట్లేదని, తన మాట ఎవరూ వినడం లేదని భావిస్తున్న డీఎస్ లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నపళంగా, పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన ఇష్టమొచ్చిన పార్టీలో చేరాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

18:27 - September 4, 2018

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటవంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా బీజేపీ నేతలు పెట్రో ధరల పెరుగుదలపై వ్యంగ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.  
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. పిల్లికి ముందుగా ఎవరు గంట కడతారు అన్న చందంగా కేంద్రం రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ ధరల భారాన్ని మోయలేక సామాన్యడు కుదేలవుతున్నాడు. 

18:23 - September 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సామాన్యులతో కూడా సరదాగా వ్యవహరిస్తారనే పేరుంది. ట్విట్టర్ లోను, ఇన్ స్ట్రా గ్రామ్ లోను సామాన్యులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సరదాగా సమాధానాలు కూడా చెబుతుంటారు. ఇలా బిజీ బిజీ లైఫ్ లో కూడా ఐటీ మినిస్టర్ సరదాసరదాగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన కాన్వాయ్ ను ఆపారు. దీంతో రెడ్ సిగ్నల్ పడటంతో అటుగా బైక్ పైన వెళ్తున్న ఐటీ ఉద్యోగిని వైష్ణవి కెటిఆర్‌ను చూసి విష్ చేసింది. వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. దీంతో మరింత ఉత్సాహంగా మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి అడిగింది. ఇంకేముంది టెకీ తో టెకీ మినిస్టర్ కేటీఆర్ వెంటనే మంత్రి ఒప్పేసుకుని ఓ సెల్ఫీకి ఫోజులిచ్చారు. దీంతో వైష్ణవితో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడని, కీలక శాఖల మంత్రిని అనే అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా వ్యవహరించిన కేటీఆర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

18:06 - September 4, 2018

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్ కతాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కోల్ కతాలోని పురాతన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై కుప్పకూలింది. బస్సులు, కార్లు వంతెనపై పయనిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనపై విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు.

17:47 - September 4, 2018

రోజు మనం తీసుకునే ఆహారంమీదనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది. అదే కష్టంగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం అనారోగ్యాల బారిని పడటమే కాక..మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేసేందుకు మనం శరీరం కష్టపడితే అతి త్వరగా మన శరీరం అలసిపోతుంది. దీంతో పలు ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్స్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువ మోతాదులో అందాలంటే మొలకలే మెండు అంటున్నారు న్యూట్రీషియన్స్. మరి వారి సలహాలతో మంచి ఆహారం తీసుకుని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మొలకలతో మేలైన ఆరోగ్యం ఏమిటో తెలుసుకుందాం..

మెులకలు తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. జీర్ణశక్తికి పెంచేందుకు మెులకలు బహు చక్కగా ఉపయోగపడతాయి. వీటితో మన శరీరంలో వుండే ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించటానికి చక్కటి తోడ్పాటును అందిస్తాయి. అంతేకాదు మొలకలు

చెడు కొలెస్ట్రాల్, రక్తపోటుల స్థాయిని క్రమేపీ తగ్గిస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుటకు మంచిగా దోహదపడుతాయి. వీటిల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అధికంగా ఉంది. మెులకల్లో విటమిన్ కె, సి, ఎ, ఐరన్, క్యాల్షియం, మినరల్స్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మెులకలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో మన ఆరోగ్యం చక్కగా వుంటుంది. 

17:27 - September 4, 2018

హైదరాబాద్ : మలయాళ సూపర్ స్టార్ ముమ్ముటి కుమారుడు దుల్కర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానులకు పరిచయమైన దుల్కర్ 'మహానటి' సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. వెంకటేశ్‌, దుల్కర్ సల్మాన్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ పరిశ్రమ సమాచారం. వార్‌ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మరో కథానాయకుడిగా సందడి చేయనున్నారని సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఇద్దరినీ కలిసి స్క్రిప్ట్‌ నరేట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు.

16:56 - September 4, 2018

ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో టెన్నిస్‌ దిగ్గజం, నంబర్‌ 2 సీడ్‌ ఆటగాడైన ఫెదరర్‌పై అనూహ్య విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్ మాన్, ఫెదరర్ ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్ లో ఓడించి సరికొత్త స్టార్ గా నిలిచాడు. తొలి సెట్ ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మిల్ మాన్ థాటికి తలొగ్గాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లో మిల్ మాన్, నోవాక్‌ జకోవిచ్‌ తో తలపడనున్నాడు.

16:38 - September 4, 2018

ఢిల్లీ : కొంతమందికి డ్రైవ్ చేయటంలో మజా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో వారు ర్యాష్ గా..స్టైల్ గా..కేర్ లెస్ గా డ్రైవ్ చేస్తుంటారు. దీంతో వాహనాలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వాహనం పూర్తిగా డేమేజ్ కావచ్చు. ఆ ఏముందిలే..బీమా వుందిగా..మనకెందుకు చింత అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు యాక్సిలేటర్ మీద కాలేసినట్లే. ర్యాష్ డ్రైవింగ్ చేసిన సమయంలో యాక్సిడెంట్ అయిన వాహనాలకు బీమా వర్తించదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.

జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ చేప్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అటువంటి సందర్భాల్లో మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా ఇన్స్యూరెన్స్‌ కోరొద్దని పేర్కొంది. అయితే పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ కింద భౌమిక్‌ కుటుంబానికి రూ.2లక్షల బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

16:19 - September 4, 2018

తిరుమల : శ్రీవారి ఆభరణాల విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. టీటీడీ ఆభరణాల గురించి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఏలూరు చెందిన ప్రముఖ సామాజిక వేత్త అయ్యంగార్. అన్ని స్థాయిల్లోను పోరాడిన అయ్యంగార్ చివరకు సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. అసలు శ్రీవారి ఆభరణాల గరించి ఆయన ఎందుకు పోరాటం చేస్తుంది అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. తిరుమల ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1,500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుమల కొండపై శ్రీవారి ప్రధాన ఆలయం మహాద్వారం ఎదురుగా ఉన్న 15 శతాబ్దం నాటి వెయ్యి కాళ్ల మండపాన్ని ఎలాంటి కారణం లేకుండానే 2003లో కూల్చివేశారని ఆక్షేపించారు. కీ.శ ఆరు ఏడు శతాబ్దాల నుండి శ్రీవారికి చారిత్రక వైభవం వుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ తన భాత్యతను పూర్తిగా విస్మరించిందటానికి శ్రీవారి నగల మాయం ఒక ఉదాహరణగా చెప్పవచ్చని అయ్యంగార్ అభిప్రాయపడ్డారు. తిరుమల ఆలయంలో గోడలపై చెక్కిన శాసనాల ఆధారంగా శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన అనేక ఆభరణాలకు సంబంధించి ఆధారాలు లభించాయని 2011లోనే కేంద్ర పురావస్తు శాఖకు చెందిన 20మంది అధికారుల బృందం తేల్చి చెప్పిందని అయ్యంగార్ గుర్తు చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు ఎనిమిది సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ఏఏ అభరణాలకు సమర్పించారో..ఎన్ని ఇచ్చారు. అవి ఎంత బరువు వున్నాయి? ఆ నగలలో వున్న రత్నాల విషయంలో కూడా అధికారుల తనిఖీలలో సరిపోలలేదని కూడా పురావస్తు శాఖ బృందం నివేదికలో వెల్లడయ్యిందని అయ్యంగార్ తెలిపారు. ఏది ఏమైనా శ్రీవారి ఆభరణాల లెక్కలు తేలేవరకు తన పోరాటం కొనసాగుతుందని అయ్యంగార్ తేల్చి చెప్పారు. 

15:17 - September 4, 2018

హైదరాబాద్ : నిజాం మ్యూజియంలో చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 20 అడుగులు తాడు సాయంతో దొంగలు మ్యూజియంలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి అంతస్తులోని ఇనుపకడ్డీలను తొలగించి లోపలికి ప్రవేశించారని పోలీసులు అంటున్నారు. సీపీ కెమెరాల్లో నిజాం మ్యూజియం చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. మొహం కనబడకుండా మ్యూజియంలోకి దుండుగులు చొరబడ్డారు. సీసీ కెమెరాల్లో దుండగుల వీపు దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రొఫెషనల్ దొంగలే ఈ చోరీకి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

15:13 - September 4, 2018

కేరళ : ఒక పక్క ప్రకృతి విపత్తును నుండి కోలుకుంటున్న కేరళ ప్రజలు ఇప్పుడిప్పుడే శ్వాస పీల్చుకుంటున్నారు. ఇంతలోనే మరో భయం వారిని వెన్నాడుతోంది. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వందేళ్ల కేరళ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తులో సుమారు 483 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. 14.50 లక్షల మంది 3,000కు పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ వరదల్లో చిక్కుకున్న కేరళకు కొత్త చిక్కొచ్చి పడింది. రాట్ ఫీవర్ కేరళ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

200ల మందికి ర్యాట్ ఫీవర్..
ఇప్పటికే దాదాపు 200 మందికి ర్యాట్ ఫీవర్ వ్యాధి సోకగా, ఇంతవరకూ 19మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నీటిలో జంతువుల మూత్రం కలిసినందున బ్యాక్టీరియా ప్రబలుతుందని, ఆ నీటిలో పని చేస్తున్న వారికి ఈ వ్యాధి సోకుతుందని అధికారులు చెప్తున్నారు. వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్న వారికి ర్యాట్ ఫీవర్‌ను నివారించే డాక్సీ సెలైన్ టాబ్లెట్లను ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

రాట్ ఫీవర్ లక్షణాలు..
అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులు తదితరాలు ఈ వ్యాధి లక్షణాలని, ప్రజలు బాగా మరిగించిన నీటినే తాగాలని శుభ్రత పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సైతం ర్యాట్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించి, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది. దోమల నుంచి తమను తాము కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచనలు చేస్తున్నారు.

15:02 - September 4, 2018

హైదరాబాద్ : ఇవాళ హైదరాబాద్ కు స్వామి పరిపూర్ణానంద తిరిగి వస్తున్నారు. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకుని ఆయన హైదరాబాద్ కు పయనమవనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు తన పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. చివరకు ధర్మమే గెలిచిందన్నారు. గతంలో స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. 

14:44 - September 4, 2018

హైదరాబాద్ : సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందే ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఒంటిపై కిరోసిన పోసుకుని బోయిన్ పల్లి పీఎస్ ముందుకు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో షాక్ కు గురైన పోలీసులు, స్థానికులు వెంటనే తేరుకుని మంటలు ఆర్పి మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బేగంపేట అన్నానగర్ కు చెందిన సబిత అనే యువతి కుటుంబ కలహాలతో ఆత్మహతకు యత్నించినట్లుగా తెలుస్తోంది. కాగా సబిత పీఎస్ ముందు ఆత్మహత్యకు యత్నించటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సబిత శరీరం దాదాపు 70 శాతం కాలిపోవటంతో ఆమె పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

14:24 - September 4, 2018

రంగారెడ్డి : కేశంపేట సాజీదా ఫామ్ హౌస్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రపార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 25240 రూపాయల నగదుతోపాటు రెండు కార్లు, ఒక బైక్, 25 సెల్ ఫోన్ లను  స్వాధీనం చేసుకున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబాయి, ఇద్దరు హైదరాబాద్ చెందిన వారుగా గుర్తించారు.

 

13:55 - September 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై డీ.శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం కక్ష గట్టిందని వ్యాఖ్యానించారు. తనతోపాటు కేబినెట్ లో చాలామంది అసంతృప్తులు ఉన్నారని పేర్కొన్నారు. పార్టీని వదిలివెలితే తనపై ఆరోపణలు నిజమవుతాయన్నారు. కాబట్టి పార్టీకి తనంతట తానుగా రాజీనామా చేయనని తెలిపారు. తన కుమారుడిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అనవసరంగా ఇరికించారని వాపోయారు. తాను పార్టీలో ఉండడం కవితకు ఇష్టం లేకుంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. తాను ఎలాంటి తప్పుచేయలేదన్నారు. బీజేపీకి ఉపయోగపడే విధంగా తాను ఎప్పుడూ మాట్లాడానో చెప్పాలని తెలిపారు. 

 

13:44 - September 4, 2018

హైదరాబాద్ : లుంబినిపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేకన్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఏ 1, ఏ2 లను దోషులగా తేల్చింది. అనిఖ్ షఫీఖ్ అహ్మద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ ఇద్దరికీ సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఆధారాలు లేవని న్యాయమూర్తి మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. చర్లపల్లి జైలులో జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ రోజు మరో నిందితుడు తారీఖ్ అంజుమ్ ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడన్న మరో కేసులో సోమవారం న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. ఈ కేసులోనూ తీర్పును కోర్టు సోమవారం వెల్లడించనుంది. 
న్యాయమూర్తి ముందు నలుగురు నిందితులు హాజరు
ఈ రోజు నలుగురు నిందితులను జైలు అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏ 1 అనిఖ్ షఫీఖ్ అహ్మద్, ఏ 2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఏ 5 ఫారూోక్ షర్ఫుద్దీన్, ఏ6 మహ్మద్ సాదిఖ్ ఇస్రార్ లను పేలుళ్లకు పాల్పడ్డ కేసులో హాజరు పరిచారు. లుంబినీ వద్ద ఏ1 అనీఖ్ షఫీఖ్ అహ్మద్ బాంబు పెట్టాడు. దిల్ షుఖ్ నగర్ వద్ద ఏ 2 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ బాంబు పెట్టాడు... ఇది పేలకుండా నిర్వీర్యం చేసారు. గోకుల్ చాట్ వద్ద రియాజ్ భక్తల్ బాంబు పెట్టాడు. ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. 11ఏళ్లపాటు విచారణ సాగింది. రెండో కేసులో సోమవారం తుది తీర్పురానుంది. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో.. మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో జరిగిన పేలుడులో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర జరిగిన పేలుడులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది క్షతగాత్రులయ్యారు. 
2007 ఆగస్టు 25న జంట పేలుళ్లు
2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం... ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ఏడు గంటల ప్రాంతంలో.. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లుంబిని పార్కులో అత్యంత ఆసక్తిగా లేజర్ షోను వీక్షిస్తున్న పర్యటకులపై ఉగ్రమూక.. బాంబులు పేల్చింది. ఈ ఘటనలో కూర్చున్న వారు కూర్చున్నట్టే 9 మంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. లుంబిని పార్క్ వద్ద బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాలకే... రాత్రి 7 గంటల 50 నిమిషాలకు కోఠీలో అత్యంత రద్దీ ప్రదేశంలోని గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన పేలుడు సంభవించింది. లోపల టిఫిన్‌ చేస్తున్న వారు మొదలుకుని వెలుపల రోడ్డు వెంట వెళ్తున్న వారికి బాంబు శకలాలు తగిలి మృతి చెందారు. గోకుల్ చాట్ దగ్గర మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది అమాయకులు, పిల్లలు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులు ఆయ్యారు. 

 

13:37 - September 4, 2018

విజయవాడ: అన్నా నా జీవితంలో నిన్ను చూడలేకపోయాను. నీవు నన్ను చూడటానికి రావాలి. నీ చేతుల మీదుగా నా అంత్యక్రియలు జరగాలి. నీవు వస్తావని అశిస్తూ.. నీ పిచ్చి అభిమాని.. అంటూ విజయవాడలో బాడీ బిల్డింగ్ షాపులో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న కొమరవల్లి అనీల్ కుమార్ అనే యువకుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. 
విజయవాడలో తల్ వాకర్స్ లో జిమ్ ట్రైనర్ గా అనిల్ కుమార్ పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని అని.. గత కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉంటున్నట్టు అనిల్ స్నేహితులు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు.  తన మృతిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అని లెటర్ లో అనిల్ కోరాడు. 
 నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ అన్నయ్య నా ఆత్మశాంతి కోసం నన్ను చూడటానికి రావాలి.  నీ చేతుల మీదగా నా అంత్యక్రియలు జరగాలి అని కోరాడు. నిన్ను బ్రతికివుండగా చూడలేకపోయాను. తప్పని పరిస్థితుల్లో చనిపోతున్నా. నీవు వస్తావని ఆశిస్తున్నా అంటూ నోట్ లో పేర్కొన్నాడు. 

13:19 - September 4, 2018

కర్నూలు : జిల్లాలో అరుదైన పాము కనిపించింది. 'లైకోడాన్‌ ఫ్లావికోల్లిన్‌’శాస్త్రీయ నామంతో పిలిచే అరుదైన యెల్లో కాలర్డ్‌ ఊల్ఫ్‌ స్నేక్‌‌ ను సోమవారం కనిపించింది. నల్లమల అటవీ ప్రాంతం సున్నిపెంట పరిధిలో రామాలయం సమీపంలో అరుదైన పామును బయోల్యాబ్‌ సిబ్బంది గుర్తించారు. ఈ పామును నాగార్జున సాగర్‌, శ్రీశైలం అభయార్యణ ప్రాంతంలో గుర్తించడం ఇదే మొదటిసారని బయోల్యాబ్‌ కేంజ్‌ అధికారిణి ఎ.ప్రేమ తెలిపారు. సున్నిపెంటలోని రామాలయం పరిసరాల్లోని ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది వెళ్లి ఈ పామును అక్కడ పట్టుకున్నట్లు చెప్పారు. ఊల్ఫ్‌ స్నేక్స్‌లో అయిదు రకాల జాతులు ఉంటాయని, ఇవి విషపూరితం కాదని చెప్పారు. 

 

12:05 - September 4, 2018

హైదరాబాద్ : లుంబినిపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేకన్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఏ 1, ఏ2 లను దోషులగా తేల్చింది. ఇస్మాయిల్ చౌదరి, షఫీద్ లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆధారాలు లేవని న్యాయమూర్తి మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. చర్లపల్లి జైలులో జడ్జి తీర్పు వెల్లడించారు. 2007 ఆగస్టు 25న జంట బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. 11ఏళ్లపాటు విచారణ సాగింది. ఇద్దరికి సోమవారం శిక్షలు ఖరారు కానున్నాయి. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో.. మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో జరిగిన పేలుడులో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర జరిగిన పేలుడులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది క్షతగాత్రులయ్యారు. 
2007 ఆగస్టు 25న జంట పేలుళ్లు
2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం... ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ఏడు గంటల ప్రాంతంలో.. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లుంబిని పార్కులో అత్యంత ఆసక్తిగా లేజర్ షోను వీక్షిస్తున్న పర్యటకులపై ఉగ్రమూక.. బాంబులు పేల్చింది. ఈ ఘటనలో కూర్చున్న వారు కూర్చున్నట్టే 9 మంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. లుంబిని పార్క్ వద్ద బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాలకే... రాత్రి 7 గంటల 50 నిమిషాలకు కోఠీలో అత్యంత రద్దీ ప్రదేశంలోని గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన పేలుడు సంభవించింది. లోపల టిఫిన్‌ చేస్తున్న వారు మొదలుకుని వెలుపల రోడ్డు వెంట వెళ్తున్న వారికి బాంబు శకలాలు తగిలి మృతి చెందారు. గోకుల్ చాట్ దగ్గర మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది అమాయకులు, పిల్లలు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులు ఆయ్యారు. 

 

లుంబినిపార్క్, గోకుల్ చాట్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులు

హైదరాబాద్ : లుంబినిపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ప్రత్యేకన్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఏ 1, ఏ2 లను దోషులగా తేల్చింది. ఇస్మాయిల్ చౌదరి, షఫీద్ లను దోషులుగా నిర్ధారించింది. ఆధారాలు లేవని న్యాయమూర్తి మరో ముగ్గురిని నిర్ధోషులుగా తేల్చారు. 

 

11:30 - September 4, 2018

హైదరాబాద్ : లుంబినిపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ప్రత్యేకన్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఏ 1, ఏ2 లను దోషులగా తేల్చింది. ఇస్మాయిల్ చౌదరి, షఫీద్ లను దోషులుగా నిర్ధారించింది. మరో ముగ్గురిని నిర్ధోషులుగా తేల్చింది. రెండో కేసులో సోమవారం తుది తీర్పురానుంది. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో..  మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 
2007 ఆగస్టు 25వ తేదీన జంట పేలుళ్లు
2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం... ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ఏడు గంటల ప్రాంతంలో.. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లుంబిని పార్కులో అత్యంత ఆసక్తిగా లేజర్ షోను వీక్షిస్తున్న పర్యటకులపై ఉగ్రమూక.. బాంబులు పేల్చింది. ఈ ఘటనలో కూర్చున్న వారు కూర్చున్నట్టే 9 మంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. లుంబిని పార్క్ వద్ద బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాలకే... రాత్రి 7 గంటల 50 నిమిషాలకు కోఠీలో అత్యంత రద్దీ ప్రదేశంలోని గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన పేలుడు సంభవించింది. లోపల టిఫిన్‌ చేస్తున్న వారు మొదలుకుని వెలుపల రోడ్డు వెంట వెళ్తున్న వారికి బాంబు శకలాలు తగిలి మృతి చెందారు. గోకుల్ చాట్ దగ్గర మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది అమాయకులు, పిల్లలు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులు ఆయ్యారు. 

 

 

నిజాం మ్యూజియంలో చోరీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

హైదరాబాద్ : పాతబస్తీ మీర్ ఆలాం చైక్ లోని నిజాం మ్యూజియంలో చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారింది.

కృష్ణా జిల్లాలో దారుణం

కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామంలో దారుణం జరిగింది. భార్యను భర్త రాడ్ తో కొట్టి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం భర్త సుందరరావు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

వికారాబాద్ : పూడూరు మండలం మన్నెగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.

నేటి నుంచి యధావిధిగా కంటివెలుగు వైద్య శిభిరాలు

హైదరాబాద్ : మూడురోజుల విరామం తర్వాత నేటి నుంచి యధావిధిగా కంటివెలుగు వైద్య శిభిరాలు నిర్వహించనున్నారు. ఆధార్ కార్డు లేని వారికి కూడా కంటి పరీక్షలు చేయనున్నారు.

 

నేడు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వెంకటరావు

విజయనగరం : నేడు దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో నిర్వహించనున్న గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి వెంకటరావు పాల్గొననున్నారు. మరడాంలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. 

 

09:07 - September 4, 2018

బర్మా : మయన్మార్‌లో ఇద్దరు రాయిటర్స్‌ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో మయన్మార్‌ కోర్టు వా లోన్, కియా సోలను దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. గత ఏడాది మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన హింసాకాండకు సంబంధించి వీరు రిపోర్టింగ్‌ చేశారు. పోలీసుల నుంచి రహస్య పత్రాలను సేకరించడం ద్వారా వా లోన్‌, కియా సొయి చట్టాన్ని ఉల్లంఘించారని 2017 డిసెంబర్‌లో వీరిని అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి వారు జైలులోనే ఉన్నారు. కోర్టు తీర్పుపై కియా సో భార్య కన్నీరు పెట్టారు. ఆమెకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. నేను భయపడడం లేదని... తాము ఏమి తప్పు చేయలేదని...చట్టం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై తమకు నమ్మకముందని వా లోన్‌ చెప్పారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది చాలా విచారకరమైన రోజని, మీడియాను బెదిరించేందుకు చేసే ప్రయత్నమని రాయిటర్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ స్టీఫెన్‌ విచారం వ్యక్తం చేశారు.

 

లుంబినిపార్క్, గోకుల్ చాట్ లలో బాంబు పేలుళ్లకేసులో నేడు తుది తీర్పు

హైదరాబాద్ : నగరంలోని లుంబినిపార్క్, గోకుల్ చాట్ లలో ఉగ్రదాడి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో..  మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. 

08:26 - September 4, 2018

హైదరాబాద్ : నగరంలోని లుంబినిపార్క్, గోకుల్ చాట్ లలో ఉగ్రదాడి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో..  మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబాలు... ఇప్పటికీ ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఎంతో మంది తల్లులకు పుత్రశోకం కలిగించిన ఉగ్రవాద ద్రోహులను.. కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. మొత్తమ్మీద ఇన్నేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. నేడు వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకోంది.
లుంబిని పార్కులో పేలుడు
2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం... ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ఏడు గంటల ప్రాంతంలో.. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లుంబిని పార్కులో అత్యంత ఆసక్తిగా లేజర్ షోను వీక్షిస్తున్న పర్యటకులపై ఉగ్రమూక.. బాంబులు పేల్చింది. ఈ ఘటనలో కూర్చున్న వారు కూర్చున్నట్టే 9 మంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. 
గోకుల్‌చాట్‌ బండార్‌లో పేలుడు  
లుంబిని పార్క్ వద్ద బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాలకే... రాత్రి 7 గంటల 50 నిమిషాలకు కోఠీలో అత్యంత రద్దీ ప్రదేశంలోని గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన పేలుడు సంభవించింది. లోపల టిఫిన్‌ చేస్తున్న వారు మొదలుకుని వెలుపల రోడ్డు వెంట వెళ్తున్న వారికి బాంబు శకలాలు తగిలి మృతి చెందారు. గోకుల్ చాట్ దగ్గర మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది అమాయకులు, పిల్లలు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులు ఆయ్యారు. 
తీర్పుపై బాధిత కుటుంబాల్లో ఉత్కంఠ.. 
తీర్పు కోసం బాధిత కుటుంబాల్లో ఉత్కంఠ.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ బ్లాస్ట్ కేసుల్లో దర్యాప్తు ముగిసింది. ఇన్ వెస్టిగేషన్ లో కీలక సాక్ష్యాలు సేకరించిన ఆక్టోపస్.... పదకొండేళ్ల క్రితమే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ పేలుళ్ల వెనక కొత్తగా పుట్టుకొచ్చిన దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ వాదించింది. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఐఎం సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ల పాత్ర ఉన్నట్లు  ముంబాయి పోలీసులు తేల్చారు. ముంబాయి పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన  ఉగ్రవాదులను 2009లో రాష్ట్రానికి తీసుకు వచ్చిన రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, అక్టోపస్‌ విభాగాల అధికారులు వారిని విచారించారు. 
తీర్పు ఎలా ఉండబోతోంది..? 
హైదరాబాద్ జంటపేలుళ్లలో... పదకొండు మంది పాల్గొన్నట్లు ఆక్టోపస్ గుర్తించింది. ఇందులో ఐదుగురిని అరెస్ట్ చేసింది. పోలీసులు అరెస్టు చేసిన అయిదుగురు నిందితులు.. సాదిక్ ఇస్సార్,  అక్బర్ ఇస్మాయిల్,  అనిక్ సయీద్, ఫరూక్ షర్ఫుద్దీన్, తారిక్ అంజుంలపై అభియోగాలు మోపి చార్జిషీట్ దాఖలు చేసింది. రియాజ్ భత్కల్ తో సహా ముగ్గురు పరారీలో ఉన్నట్లు చార్జిషీట్లో తెలిపింది. నాంపల్లి స్పెషల్ కోర్టు భద్రత కారణాల వల్ల.. ఈ కేసును జైల్లోనే విచారించారు. నిజానికి అగస్ట్ 27 న ఈ కేసు తుదితీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆర్డర్  కాపీ సిద్దంకానీ కారణంగా తీర్పును సెప్టెంబర్ నాలుగో తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికీ నిందితులను వీడియో కాన్ఫరెన్స్ లో  విచారించిన కోర్టు. చర్లపల్లి జైల్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కోర్టులో తుది తీర్పును వెల్లడించనుంది. తీర్పు ఎలా ఉండబోతోంది..? దోషులకు శిక్ష ఖరారవుతుందా..? తప్పించుకు తిరుగుతున్న వారి ఆచూకీ దొరికేదెప్పుడు..? ఈ కేసులో తీర్పు ఇవాళ వెలువడనుంది. తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

నేడు 254వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

విశాఖ : నేడు 254వ రోజు వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. జోగన్నపాలెం నుంచి నేడు పాదయాత్ర ప్రారంభం కానుంది. రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చంద్రయ్యపేటలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. 

తిరుమలలో నేడు ఉట్లోత్సవం

చిత్తూరు : తిరుమలలో నేడు ఉట్లోత్సవం జరుగనుంది. ఉట్లోత్సవం సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి నేడు మాడ వీధుల్లో ఊరేగనున్నారు. 

 

నేడు చింతలపూడిలో సీఎం చంద్రబాబు పర్యటన

ప.గో : నేడు చింతలపూడిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

 

ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారానికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. టీఆర్ ఎస్ భవన్ లో నేడు ప్రచార రథాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ప్రచారం సిద్ధమైంది. 

 

Don't Miss