Activities calendar

05 September 2018

20:51 - September 5, 2018
20:05 - September 5, 2018

అమరావతి : యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వని బీజేపీకి అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. రాజధానికి ఓ రూపు వచ్చిందని తెలిపారు. 

19:48 - September 5, 2018

ముంబై : మొగల్-ఏ-అజమ్, నవ్యదౌర్, దేవదాస్, గంగా జమునా, కర్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దిలీప్ కుమార్ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని ఆ ట్వీట్ లో కోరారు. ‘జెడీ కింగ్’ గా పేరు సంపాదించుకున్న దిలీప్ కుమార్ 1998 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.1994లో దాదా సాహెబ్ ఫాల్కే, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో దిలీప్ కుమార్ ని ప్రభుత్వం గౌరవించింది.

19:22 - September 5, 2018

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్ ను నారాయణులు నడయాడిన స్థలంగా..ఉ్తప రమేశ్వరుడు కొలువైన పుణ్యస్థలం. అందుకే దీన్ని దేవభూమిగా కొలుస్తారు. శివశంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి.దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలోని నది పొంగి పొర్లడంతో నది పరివాహకం ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నది మీద ఉండే వంతెన రెండు నెలల క్రితం కూలిపోయింది. అయితే, ఇప్పుడు వర్షాల కారణంగా వరదలో చిక్కుకున్న ప్రజలు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి తాడు సాయంతో నదిని దాటుతున్నారు.

ఈ వంతెన కూలిపోవడం గురించి స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని చమోలీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తాళ్ల సాయంతో నదిని దాటుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లాలంటే ఇలాంటి ఫీట్లు చేయాల్సిందే. ఊరు దాటి వెళ్లాలంటే మహిళలు, చిన్నారులు కూడా తాడు సాయంతో నది దాటి వెళ్తున్నారు.

18:30 - September 5, 2018

ఢిల్లీ : ఆధార్ ఇప్పుడు అన్నింటికి అదే ఆధారం. ఇది లేకుంటే ఏపనీ జరగదు. ఇది ప్రతీ భారతీయుడు హక్కు. అన్నింటికి అధారే ఆధారం. ఈ క్రమంలో ఆధార్ కార్డు లేదని స్కూల్లో పిల్లకు అడ్మిషన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన సందర్బం వెలుగులోకి వచ్చింది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పందించింది. ఆధార్ కార్డు లేని కారణంగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది. ఇలాంటి కారణంతో అడ్మిషన్లు నిరాకరించడం చట్టవిరుద్ధమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ చర్యలకు బదులుగా స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆధార్ కార్డుల కోసం ఎన్ రోల్ మెంట్ చేయించాలని యూఐడీఏఐ సూచించింది.

ఇటీవలి కాలంలో కొన్ని పాఠశాలలు ఆధార్ లేదన్న వంకతో విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆధార్ కోసం పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని..విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటు యూఐడీఏఐ సర్క్యులర్ జారీచేసింది. 

17:46 - September 5, 2018

కేరళ : రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాల సహాయక చర్యలు సామాన్యమైనవి కాదు. వారి తెగువ, అంకిత భావం, ప్రాణాలకు తెగించి వారు నిర్వర్తించిన విధులు కేవలం డ్యూటీగా మాత్రమే వారు చేయలేదు. ప్రాణాలు కాపాడాలనే తెగువతో వారు చూపిన నిబద్ధతతో వేలాదిమంది ప్రాణాలను కాపాడారు. వారి సహాయంగా స్థానికులు కూడా తమవంతుగా తోడ్పడ్డారు. కానీ కేరళ వరదలలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్లలేమన్న ప్రాంతాలకు సైతం వెళ్లి ముగ్గురి ప్రాణాలను కాపాడిన జైసల్‌ అనే ఓ మత్స్యకారుడు హీరోగా మారాడు.ఇప్పుడతను రియల్ హీరోగా ప్రజలు పేర్కొంటున్నారు.

వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు చిక్కుకుకుపోయారు. కానీ ఆ ప్రాంతానికి వెళ్లేందుకు కడు కష్టంతో కూడుకున్న పని. అక్కడి వెళ్లలేమని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం చేతులెత్తేసారు. కానీ నేను వెళ్తానంటు జైసాల్ అనే ఓ మత్స్యకారుడు ముందుకొచ్చి చిన్నారితో పాటు ముగ్గురు మహిళలకు సురక్షితంగా బైటకు తీసుకువచ్చాడు. జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగితే.. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు రియల్ హీరో జైసాల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. సినిమాలలో రెస్క్యూ సీన్స్ లో నటించే హీరోల కంటే రియల్ గా తన ప్రాణాలను అడ్డువేసిన జైసాల్ రియల్ హీరో అనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.

17:30 - September 5, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో గుట్కా ప్రకంపనాలు సృష్టిస్తోంది. సీబీఐ అధికారులు ఏకంగా మంత్రి నివాసంలో సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా 40 చోట్ల తనిఖీలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో గుట్కా స్కాం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. రూ. 250 కోట్ల ఆదాయ పన్నును ఓ వ్యాపారి ఎగవేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఓ డైరీ, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డైరీలో మంత్రి విజయ భాస్కర్, డీజీపీ, పలువురు పోలీసు అధికారుల పేర్లు ఉండడం సంచలనం రేకెత్తించింది.

దీనిపై విపక్షాలు గళం విప్పాయి. గుట్కా స్కాంపై సీబీఐ విచారణ చేయాలని డీఎంకేతో పాటు పలు సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గుట్కాం స్కాం కేసును విచారిస్తోంది. బుధవారం చెన్నైలో విద్యాశాఖ మంత్రి సి.విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, మాజీ డీజీపీ ఎస్ జార్జి సహా పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. 

17:17 - September 5, 2018

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కంటే హీట్ ను పెంచుతున్నాయి. ఈ సారి కూడా వైసీపీ సభకు హాజరవుతుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. సమావేశాలకు హాజరుపై వైసీపీ ఓ లేఖ రాసింది. స్పీకర్ కోడెల, సీఎం చంద్రబాబు నాయుడులకు వైసీపీ నాలుగు పేజీల లేఖ రాసింది. స్పీకర్ కోడెల విజ్ఞాపన మేరకు ఈ లేఖను రాస్తున్నామని, పార్టీ ఫిరాయించిన మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను తక్షణం తొలగించాలని లేఖలో డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, ఈ విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పామని గుర్తు చేశారు. వెంటనే వారిని తొలగిస్తే తాము సమావేశాలకు హాజరవుతామని కండీషన్ పెట్టింది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ అంశాలను ప్రభుత్వం, స్పీకర్ పరిష్కరిస్తారా ? అనేది వేచి చూడాలి. 

17:00 - September 5, 2018

తెలంగాణ రాష్ట్రంలో 'ముందస్తు' ఎన్నికల హడావుడి నెలకొంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయాల్లో వేడి నెలకొంది. టి.కేబినెట్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీనిపై రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సై అంటున్నాయి. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఇంటికి సాగనంపాలని పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

టీఆర్ఎస్ ను ఢీకొనేందుకు విపక్షాల సహాయం తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. అంతర్గతంగా విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో మహా కూటమి ఏర్పడేందుకు అడుగులు పడుతున్నట్లు టాక్. టి.టిడిపి, టీజేఎస్, వామపక్షాలు సిద్ధమయ్యాయని, ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఓ దఫా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. మొత్తం 119 సీట్లున్న రాష్ట్రంలో టిడిపికి 15, కోదండరాం పార్టీకి 6, సీపీఐ 4, సీపీఎం 4 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ పొత్తుల వ్యవహారాన్ని కాంగ్రెస్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు వినికిడి. కానీ ఈ పొత్తుల విషయంలో కాంగ్రెస్ నెతలెవరూ స్పందించడం లేదని సమాచారం. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. మరి ఈ ఇది నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

16:56 - September 5, 2018

కర్ణాటక : ప్రజా ప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసేవారు అని కదా అర్థం. అది సదరు ప్రజా ప్రతినిధులు చెప్పిన మాటలే. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని సదరు ప్రజా ప్రతినిధులు వల్లెవేస్తుంటారు. కానీ అవి మాటల వరకే పరిమితం. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక..ఉచ్ఛ నీచాలు మరిచిపోతారు. కనీసం మనిషి అనే సంగతే మరిచి ప్రవర్తిస్తుంటారు కొందరు నేతలు. అధికారంలో వుంటే కన్నుమిన్నుకాన కుండా కొందరు నేతలు చేసే పనులతో వీరినా మనం ఓట్లు వేసి గెలిపించింది? అనే ప్రశ్న ఉదయించకమానదు. అధికారాహకారం తలకెక్కిన నేతలు తమకు అందరు గులాంగిరి చేయాలని అనుకుంటారు. దీంతో సాటి మనిషితో చేయకూడని పనులు చేయిస్తుంటారు. ఇటువంటి నేతలు తమ ఉనికి చాటకునేందుకు అలా చేస్తారా? లేదా అది వారి సహజధోరణితో చేస్తుంటారా? లేదా అధికార మదంతో చేస్తారా అనేది సందర్భాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇటువంటివారిని మరోసారి ప్రజల్లో తిరిగేందుకు కూడా భయపడేలా బుద్ధి చెప్పితీరాలి అని మాత్రం మనకు కసిగా అనిపించకమానదు. అటువంటి ఓ ప్రబుద్ధ మంత్రిగారు ఏం చేసారో తెలుసుకుందాం..

అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న పరమేశ్వర నిన్న ఉల్సూర్ లోని ఎల్లమ్మ కోయిల్ వీధిలో పర్యటించారు. సదరు మంత్రి వర్యులుగారి ఫ్యాంట్ పై బురద పడింది. దీంతో ఆయనగారు గన్ మెన్ ను పిలిపించి శుభ్రం చేయించుకున్నారు. గన్ మెన్ కర్చీఫ్ తో డిప్యూటీ సీఎం ఫ్యాంటును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు మంత్రి వర్యులు గారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో మంత్రి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ‘‘పరమేశ్వర.. సిగ్గుపడండి. నేను మంత్రిని. నాకు అందరూ సేవలు చేయాలి’ వంటి మైండ్ సెట్ ఉన్నందుకు మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇప్పుడు పరమేశ్వరను ప్రజలు మంత్రిగా చూస్తున్నారనీ, ప్రవర్తనను మార్చుకోకపోతే త్వరలోనే కంత్రీగా గుర్తిస్తారని మరొకరు విమర్శించారు.

16:42 - September 5, 2018

అసోం : రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం బ్రహ్మపుత్ర నదిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 26 మంది గల్లంతయ్యారు. గౌహతిలో చోటు చేసుకున్న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పడవలో ఎక్కువగా విద్యార్థులున్నట్లు సమాచారం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం వెంటనే స్పందించింది. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారిలో 16మందిని కాపాడినట్లు సమాచారం. నది మధ్యలో నిర్మాణంలో ఉన్న పిల్లర్‌ను ఢీకొనడం..వెంటనే పడవ రెండు ముక్కలైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

16:38 - September 5, 2018

జమ్ముకశ్మీర్‌ : భారతదేశంలో స్త్రీని, స్త్రీ పుట్టుక అనేది ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడపిల్లను కనాలంటేనే హడిపోయే దుర్భర పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఆడపుట్టుకపై జరుగుతున్న అరాచకాలకు మరో ఆడదే కొన్ని సందర్భాలలో హేతువుగా మారటం దారుణం!!. చిన్నారుల భద్రత కోసం ఎన్ని చట్టాలు వచ్చినా..సమాజంలో ఆడపుట్టుకపై జరుగుతున్న దారుణ మారణ కాండలకు అడ్డుకట్టు వేయలేకపోతున్న దుస్థితి..నేడి ఆడపిల్లలపై జరుగుతున్న దారునాలకు హేతువుగా మారుతోంది.

దేశంలో నిత్యం ఏదో ఒక చోట మానవ మృగాళ్ల చేతుల్లో ఆడపిల్లలు బలైపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు సోదరుడైన వ్యక్తి, అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు బాధిత బాలిక కళ్లు పీకి, యాసిడ్‌ పోసి అత్యంత పాశవికంగా..కిరాతకంగా దారుణ హత్యకు పాల్పడ్డారు సదరు మృగాళ్లు. ఇక్కడ సిగ్గు పడాల్సిన దుస్థితి మరొకటి ఏమిటంటే ఆడబిడ్డను అక్కున చేర్చుకోవాల్సిన మరో ఆడది ఆ చిన్నారిపై బాలిక సవితి తల్లే దగ్గరుండి మరీ కొడుకు చేత ఈ దారుణాలు ప్రోత్సహించింది.

బారాముల్లా జిల్లా యురి అటవీ ప్రాంతంలో గత ఆదివారం అత్యంత దారుణమైన స్థితిలో ఓ బాలిక మృతదేహం కన్పించిదని స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. బాలికను అత్యాచారం చేసి చంపేసినట్లు తేలడంతో ఆ కోణంలో విచారణ చేపట్టగా అత్యంత దారుణమైన భయంకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బాలిక సవతి తల్లి, అతడి కుమారుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

తన భర్త రెండో భార్యతోను ఆమె సంతానంతోనే ఎక్కువ ప్రేమగా వుంటున్నాడని కక్ష పెంచుకున్న మొదటి భార్య తన కుమారుడితో కలిసి ఈ ఘోరానికి ఉసిగొల్పింది. వారి నివాసానాకి సమీపంలో వున్న అటవీ ప్రాంతానికి సవితి కుమార్తెను తీసుకెళ్లి తన 14ఏళ్ల కుమారుడితో సహా అతడి స్నేహితులు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడేలా ప్రేరేపించింది. అనంతరం గొడ్డలితో చిన్నారి తలను నరికి అతి దారుణంగా చంపేశారు. అంతటితో ఆగకుండా చిన్నారి కళ్లు పీకి, శరీరంపై యాసిడ్‌ పోసి తగలబెట్టారు. కాలిన మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు.

దీంతో పోలీసులు చిన్నారి సవతి తల్లి, ఆమె కుమారుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తమ కెరీర్‌లో ఇంతటి క్రూరమైన నేరాన్ని చూడలేదంటూ పోలీసులు పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. 

16:26 - September 5, 2018

హైదరాబాద్ః గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సూత్రధారి.. లష్కరే తాయిబా ముఖ్యనాయకుడు  అమీర్ రజాఖాన్ నిఘా వర్గాలకు చిక్కకుండా ఇంకా పరారీలోనే ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రజాఖాన్ పాకిస్తాన్ లేదా దుబాయ్ లో ఉంటూ దేశంలో నిందిత యువకులకు శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపాడు. బాంబుల తయారీలోనూ నిందితులకు శిక్షణ ఇచ్చి వారిచేతే పేలుడు సామగ్రిని తయారు చేయించాడు. 
అమీర్ రజా ఆదేశాలతో ఇండియన్ ముజాయిద్దీన్ కు చెందిన రియాజ్ భక్తల్, ఇక్బాల్ భక్తల్  టెర్రరిస్టులకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంతో పాటు వారికి పేలుడు సామగ్రినీ అందించారు. 2007 పేలుళ్ల సూత్రధారి అయిన రియాజ్ భక్తల్ స్వయంగా సంఘటన జరిగిన సమయంలో వ్యక్తిగతంగా హాజరై పేలుళ్లను పర్యవేక్షించినట్టు దర్యాప్తు బృందాలు పసిగట్టాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ మద్దతుతోనే ఈ పేలుళ్ళను చేపట్టినట్టు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

16:20 - September 5, 2018
16:10 - September 5, 2018

తెలంగాణ రాష్ట్రంలో 'ముందస్తు' ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. సీఎం కేసీఆర్ నోట నుండి వెలుబడిన అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం ఉదయం 6.45గంటలకు కేబినెట్ రద్దు చేస్తారని...సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యలో టి.కాంగ్రెస్ కూడా సమాయత్తం అయ్యింది. తాము కూడా ఏమీ తీసిపోలేదని..ముందస్తు వచ్చినా తరువాత వచ్చినా తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో టి. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఉత్తమ్ మీడియాకు తెలియచేశారు. ఇంటి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని...ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ. 2 లక్షలు ఇవ్వడం...ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు ఇవ్వడం..ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు లక్ష అదనంగా ఇవ్వాలని...తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 7 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని...వికలాంగులను పెళ్లి చేసుకంటే ప్రోత్సాహకంగా రూ. 2లక్షలు ఇవ్వాలని..వికలాంగుల శాఖ విలీనం రద్దు...మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం...కళ్యాణ లక్ష్మీతో పాటు బంగారు లక్ష్మీ పథకం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. 

15:43 - September 5, 2018

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ లో భారత క్రీడకారులు సత్తా చాటారు. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు దేశంలో అడుగు పెట్టారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు, ఇతరులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో భారత ఏషియాడ్ మెడలిస్టులకు పూలమాలలు..శాలువాలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. దేశానికే గర్వ కారణంగా నిలిచారని పలువురు కొనియాడారు. మొత్తం 15 రోజలు పాటు ఈ పోటీలు జరిగాయి. భారత క్రీడాకారులు 69 పతకాలు సాధించి ఏషియాడ్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అంతేగాకుండా పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో నిలిచింది. మొత్తం 45 దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 289 పతకాలు చేజిక్కించుకన్న చైనా టాప్ ప్లేస్ లో నిలిచింది. సెప్టెంబర్ 2న ఏషియాడ్ ముగింపు వేడుకలు జరిగాయి.

15:40 - September 5, 2018

తూర్పుగోదావరి : కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. మోసం చేయాలంటే కాసులున్న కాంతల్నే టార్గెట్ చేయాలనుకున్నాడు ఓ మాయగాడు. చిన్నా చితకా అమ్మాయిల్ని మాయ చేస్తే చేతికి పైసలు పెద్దగారావు. మరి ఏం చేయాలి? అమ్మాల్నే మోసం చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఓ మాయగాడు. ఆ చేసేదేదో పెద్దస్థాయి అమ్మాయిల్నే చేస్తే..కట్టలకొద్దీ నోట్లు కళ్లముందు మిలమిలలాడతాయి. బాగా ఆలోచించి మంత్రివర్యుల అమాయిల్నే మోసం చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాడు సదరు మాయగాడు. ఇక రంగంలోకి దిగాడు..కాని అందివచ్చిన ఏ అమ్మాయినీ వదల్లేదు..పోయేదేముంది..పైసా నష్టం లేదు.

ఇంకేముందు మాయ మాటలతో ముంచేశాడు..ఎందరో అమ్మాయిలను మోసం చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 500 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకుని బాగా గడించాడు. అతడి వలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కుమార్తెలు, మేనకోడళ్లు, మహిళా డాక్టర్లు బాధితులుగా చేరిపోయారు. ఏమైతేనే..మోసాలు,మాయలు ఎల్లకాలం సాగవుకదా? ఇంకేముంది అమ్మాయిల్ని టార్గెట్ చేసిని ఆ మయాగాడిని పోలీసు మామలు పట్టేసుకున్నారు. సదరు మాయగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్తారించటి తీసుకెళ్లి చక్కగా మర్యాదలు చేశారు. అదేనండీ పోలీస్ స్టేషన్ కి. ఆ మాయగాడి మాయల ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కంబాల చెరువు సమీపంలో నివాసం ఉండే జోగాడ వంశీకృష్ణ అనే వ్యక్తి శ్రీమంతులు కుటుంబంలో పుట్టాడు. కాలక్రమేణా వంశీకృష్ణ ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కాలిపోయాయి. ఇక మోసాలు చేయటానికి పూనుకున్నాడు.ఈ నేపథ్యంలో 2017లో కాకినాడ రంగరాయ మెడికల్ కలేజ్ కి ఓ వైద్య విద్యార్థినితో పరిచయం పెంచుకుని తన మాయ మాటలతో బుట్టలో వేసుకుని..ఆమె వద్ద నుంచి 70 వేల నగదు, 40 గ్రాముల బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి మాయ ప్రస్థానం ఎక్కడ నుండి ప్రారంభించాడో చూద్దాం..

2009లో కాకినాడ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి మధ్యలోనే ఆపేశాడు. 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఫేక్ అకౌంట్లు తెరిచాడు. ఫేస్‌బుక్‌లో యానాం ప్రాంతానికి చెందిన ఓ అందమైన యువకుడి ఫోటోను ఉంచి.. ప్రముఖులు, ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసి.. మధురమైన మాటలతో మాయ చేసేవాడు. ఇతని మాయమాటలకు ఎందరో అమ్మాయిలు మోసపోయారు. నగదు, నగలు అప్పగించేవారు. వీరిలో ఎక్కువమంది ప్రజాప్రతనిథుల అమ్మాయిలే ఎక్కువమంది వున్నారని దర్యాప్తులో వెల్లడయ్యింది.

ఇలా రెండున్నరేళ్ల కాలంలో సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. తాజాగా ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలుకి వెళ్లొచ్చినా ఇతనిలో మార్పు రాలేదు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ వెతికి ఎట్టకేలకు కాకినాడ రైల్వే స్టేషన్ సమీపంలో వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

15:29 - September 5, 2018

రాజకీయాల్లో ఉన్న నేతలు...ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ...వ్యవహర శైలి..తదితర విషయాల్లో జాగ్రత్త పడుతుంటారు. వారు ఏదైనా మాట్లాడినా...వ్యవహరించినా ప్రత్యర్థులు వాటిని చక్కగా ఉపయోగించుకుని విమర్శల దాడిని పెంచుతుంటారు. కొన్ని సందర్భాల్లో నేతలకు ఇది తలనొప్పిగా మారుతుంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా పలువురు విమర్శలు గుప్పిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేపట్టిన 'మానస సరోవర్' యాత్ర వివాదాస్పదమైంది. యాత్ర ప్రారంభించడానికంటే ముందు నేపాల్ లో బస చేసిన రెస్టారెంట్ లో రాహుల్ చికెన్ తిన్నారని ప్రచారం జరుగుతోంది.  రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ మాంసాహారాన్ని తిన్నట్లు కథనాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ చికెన్ వంటకాల కోసం ఆర్డర్ ఇచ్చారని రెస్టారెంట్ సిబ్బందిని ఉటంకిస్తూ నేపాల్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్లు కథనాలు వెలువరించాయి.

ప్రత్యర్థులు దీనిని చక్కగా క్యాష్ చేసుకోవాలని రాహుల్ పై విమర్శల దాడిని పెంచారు. ఆయన మాంసహారం తినడం హిందువుల మనోభావాలను దెబ్బతినేలా రాహుల్ వ్యవహరించారని బీజేపీ నేత ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కానీ ఈ వివాదంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యం వివరణనిచ్చినట్లు, మాంసాహారం తిన్నారన్న కథనాలను తిప్పికొట్టేలా ఈ ప్రకటన ఉన్నట్లు తెలుస్తోంది.
మానస సరోవర్ యాత్ర కోసం ఇండిగో విమానంలో ఆగస్టు 31న ఎకానమీ క్లాస్‌లో రాహుల్ గాంధీ దిల్లీ నుంచి ఖాట్మండు చేరుకున్నారు. అక్కడి హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని, మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు. తీర్థయాత్రను ప్రారంభించే ముందు మహాశివుని ఆశీస్సులు కోరుతూ సంస్కృత శ్లోకాన్ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

15:10 - September 5, 2018

అమలా పాల్...ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగింది. అనంతరం తమిళ దర్శకుడు. ఏ.ఎల్.విజయ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయనకు విడాకులు ఇచ్చేసింది. మళ్లీ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా 'ఆడై' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక లుక్ రిలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తెలుగులో రానా, తమిళంలో వెంకట్ ప్రభు విడుదల చేశారు. వీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని రత్న కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ లుక్ మతులు పొగొట్టేలా ఉంది. చాలా బోల్డ్ గా కనిపిస్తుండడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది వ్యతిరేకిస్తుండగా మరికొందరు పోస్టర్ బాగుందంటూ కితాబులిస్తున్నారు. ఈ పోస్టర్లో ఒక సోల్ ఉందని..ఎంతో పెయిన్ ఉంది.... కానీ ఆమె స్కిన్ మాత్రమే చూస్తున్నారు అంటూ ట్రోలింగ్ చేసే వారికి పలువురు కౌంటర్ ఇస్తున్నారు. దాదాపు ఈ లుక్ లో 'అమలా పాల్' చిరిగిన దుస్తులతో కనిపిస్తోంది. 

14:37 - September 5, 2018

స్వామి పరిపూర్ణానంద..నగరంలో అడుగు పెట్టారు. దాదాపు 55 రోజుల పాటు ఆయన నగరం విడిచి బయట ఉన్న సంగతి తెలిసిందే. నగరంలో అడుగు పెట్టిన ఆయనకు అనుచరులు, మద్దతు దారులు స్వాగతం పలికారు. రెండు మాసాల క్రితం ఫిల్మ్ క్రిటిక్ 'కత్తి మహేష్' తో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 'శ్రీరాముడి' విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. 'శ్రీరాముడి' విషయాన్ని ప్రస్తావించిన 'కత్తి మహేష్' పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకేత్తించాయి. దీనిపై 'స్వామి పరిపూర్ణానంద' ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి ఉప్పల్ నుండి యాదాద్రి వరకు యాత్ర చేపడుతానని ప్రకటించారు. వెంటనే పోలీసులు స్పందించారు. 'కత్తి మహేష్' ను నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరం 'స్వామి'ని కూడా నగర బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ ఎత్తివేయాలని కోర్టు ఉత్తర్వులు చేసింది. దీనితో ఆయన నగరానికి తిరిగొచ్చారు. వచ్చే ముందు స్వామి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. నగరానికి వచ్చిన అనంతరం ఆయనకు బీజేపీ నేతలు, ఇతరులు స్వాగతం పలికారు. మరి కత్తి మహేష్ ఎప్పుడు నగరానికి వస్తారో వేచి చూడాలి.

14:33 - September 5, 2018

రంగారెడ్డి : టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలోనూ పెట్టమని అక్కడి ప్రజలు కోరుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. షాద్ నగర్ గడ్డకు ఎంతో ప్రాధాన్యత ఉందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరూ అంటారని..కానీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని తెలిపారు. 1952 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ఉన్నారని పేర్కొన్నారు. 1956 లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. అత్యంత దగా పడ్డ, మోస పోయిన ప్రాంతం పాలమూరు జిల్లా అని పేర్కొన్నారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టును తలపెట్టిన విధంగా పూర్తి చేసి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదన్నారు. మీరిచ్చిన ఆశీర్వాదంతోనే కేసీఆర్ గెలిచి పార్లమెంట్ కు వెళ్లి కొట్లాడి.. తెలంగాణ రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి...తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తుందని తెలిపారు. పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశ ప్రజలు అంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యంలో సీలింగ్ విధించారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రేషన్ బియ్యంలో ఎలాంటి సీలింగ్ విధించ లేదని... అందరికీ ఇస్తున్నామని తెలిపారు. 

14:14 - September 5, 2018

కర్నూలు : విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, లెక్చరర్స్ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అల్లరి చేస్తున్నారని, హోమ్ వర్క్ చేయలేదని, ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థులను చితకబాదుతున్నారు. ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. తాజాగా నారాయణ కళాశాలలో  విద్యార్థిని ఓ లెక్చరర్ తీవ్రంగా కొట్టి గాయపర్చారు.
వివరాల్లోకి వెళితే...
స్థానికంగా ఉన్న నారాయణ కళాశాలలో జిషాన్‌ బాషా అనే విద్యార్థి చదువుతున్నాడు. జిషాన్‌ బాషా అల్లరి చేస్తున్నాడని ప్రసాద్‌ అనే కెమిస్ట్రీ లెక్చరర్‌ ఎగ్జామ్‌ ప్యాడ్‌తో అతనిపై దాడి చేశాడు. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తోటి విద్యార్థులు అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలేజీపై, లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని బాషా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

14:07 - September 5, 2018

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. 10-15 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కోడెల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. స్పీకర్ కోడెల వేర్వేరుగా ఈ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు స్పీకర్ కోడెల పలు సలహాలు సూచనలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశాలకు మీడియా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి రానివ్వాలని, సమావేశాల సందర్భగా భోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం అందించే విధంగా చూడాలని అన్నారు. 

13:56 - September 5, 2018

ఆర్పీ సింగ్..టీమిండియా మాజీ పేసర్. ఇతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 32 ఏళ్ల ఆర్పీ సింగ్ ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇండియా జెర్సీ ధరించానని..ఈ రోజు క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆట తనకెన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని, ఈ రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా అని ఆర్పీ సింగ్‌ ట్విట్టర్ ‌లో రాసుకొచ్చాడు.

ఇక ఆర్పీ విషయానికి వస్తే 2005లో అంతర్జాతీయ ప్రవేశించాడు. మొత్తం 14 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 3.98 సగటుతో 40 వికెట్లు తీశాడు. 58 వన్డేలో 58 వన్డేల్లో 5.48 యావరేజితో 69 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరుపున 10 టీ20లాడిన ఆర్పీ సింగ్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 82 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ లాంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

13:50 - September 5, 2018

చిత్తూరు : తిరుపతిలో విషాదం నెలకొంది. హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని పరశాల వీధికి చెందిన గంగాధరం(25).. టీటీడీ కాంట్రాక్ట్‌ కార్మికునిగా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో నిన్న రాత్రి గంగాధరం తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ప్రాణాలతో ఉన్న గంగాధరాన్ని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కుమారుని మృతిని తట్టుకోలేక గంగాధరం తల్లి కుమారి ఆస్పత్రి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నిపింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. వీరి మృతికి టీటీడీ బాధ్యత వహించాలని కాంట్రాక్టు ఉద్యోగులు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.  
గంగాధరానికి తీవ్ర ఇబ్బందులు : బంధువులు 
ఇటీవలే వివాహం చేసుకున్న గంగాధరం చాలీచాలనీ జీతంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అతడి బంధువులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ నిర్వహణ భారం కావటంతో ఇటీవలి కాలంలో తరచుగా తల్లితో గంగాధరంకు గొడవలు జరిగినట్లు తెలిపారు. గంగాధరం తల్లి కుమారి తిరుపతి నగరపాలక సంస్థలో ఒప్పంద కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆర్థిక సమస్యలతో సతమవుతున్న కారణంగా మనస్పర్థలు చెలరేగడంతో గంగాధరం భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో తల్లీకొడుకులు క్షణికావేశంలో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

13:44 - September 5, 2018

దేశ రాజధాని మరోసారి దద్ధరిల్లింది. పాలకుల విధానాలపై రైతులు..కార్మికులు కదం తొక్కారు. ఇటీవలే రైతులు మహా మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహించింది. తాజాగా కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు..కార్మికులు..మహా ధర్నా చేపట్టారు. రాంలీలా మైదనం నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఈ మహా ర్యాలీ కొనసాగింది. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో 'మజ్దూర్ కిసాన్ సంఘర్ష్' పేరిట ఈ ర్యాలీ జరిగింది. వేలాది మంది రైతులు, కార్మికులు రామ్‌లీలా మైదానికి చేరుకున్నారు. రాంలీలా మైదనం నుండి రంజిత్ సింగ్ ఫ్లై ఓవర్, టాల్ స్టాయి మార్గ్ మీదుగా పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ జరుగనుంది. ఈ ర్యాలీలో 25 వేల మంది రైతులు, కార్మికులు పాల్గొంటారని అంచనా. ఉద్యోగ కల్పన, పేద రైతులకు భూమి, పంటలకు మద్దతు ధర, రైతు రుణమాఫీ, పనికి తగ్గ వేతనం సహా పలు డిమాండ్లతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.

భారీ సంఖ్యలో తరలివస్తే రాజధానిలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని భావించిన అక్కడి ట్రాఫిక్ పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తే కష్టాలు తప్పవని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ర్యాలీ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

13:34 - September 5, 2018

తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం ఎన్నో హాట్ హాట్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా డీఎంకేలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా డీఎంకేలో అన్నదమ్ముళ్లు సై అంటే సై అంటున్నారు. డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సోదరుడు ఆళగిరి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కనీసం పార్టీలో చోటు దక్కకపోవడంతో గుర్రుగా ఉన్నారు. తన బలం ఏంటో చూపించాలని భావించారు. అందులో భాగంగా చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రిప్లికాన్ పీఎస్ నుండి కరుణానిధి మెమోరీయల్ వరకు ప్రదర్శన జరిగింది. ఆళగిరి మద్దతు దారులు..ఇతరులు భారీగా తరలివచ్చారు. ఆళగిరి నలుపు రంగు దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కరుణానిధి మెమోరియల్ దగ్గర అళగిరి కుటుంబం నివాళి అర్పించింది. శాంతి ర్యాలీలో అళగిరితో పాటు ఆయన కుమారుడు దయా అళగిరి, కూతురు కయాళ్‌విలి కూడా పాల్గొన్నారు.

13:04 - September 5, 2018

టాలీవుడ్ లో విలన్ పాత్రకు ఒక మార్పు తెచ్చిన నటుడు ఎవరు అంటే ఠక్కున 'జగపతి బాబు' అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన టాలీవుడ్ లో మోస్ట్ విలన్ గా మారారు. హీరో 'బాలకృష్ణ' నటించిన 'లెజెండ్' మూవీలో నటించిన 'జగపతిబాబు'కు మంచి మార్కులు పడ్డాయి. ప్రతి నాయకుడిగా జగపతి బాబు ఫుల్ బిజీ అయిపోయాడు. విలన్ గా నటిస్తూనే క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ లో కూడా తన విలనిజాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు.

బాలీవుడ్ హీరో 'అజయ్ దేవ్ గన్' నటిస్తున్న 'తానాజీ' మూవీలో 'జగపతి బాబు' నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 'జగపతి బాబు'కు సంబంధించిన లుక్‌ను సోషల్ మీడియాలో లీకైంది. తానాజీ జీవిత కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఓం రావత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం జగపతి బాబుకు సంబంధించిన ఈ లుక్ వైరల్ అవుతోంది. మరి మీరు ఈ లుక్ పై లుక్కేయండి. 

13:04 - September 5, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఇసుక కొరత ఏర్పడింది. లారీ ఇసుకను 40వేలకు విక్రయిస్తున్నారు. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తోంది. తమ దందాకు సహకరించని వారిని వేధింపులకు గురిచేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 
ప్రభుత్వం ఉచిత ఇసుకని చెబుతున్నా... ఇసుక అమ్మకం
ఏపీలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత విధానం అమలు చేస్తోంది. అంటే ఇసుకను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కానీ శ్రీకాకుళంలో మాత్రం ఇది అమలు కావడంలేదు.  ఇసుక మాఫియా క్వారీలను తమ గుప్పిట్లోకి తీసుకుంది. ప్రభుత్వం ఉచిత ఇసుకని చెబుతున్నా... లారీ ఇసుక 40వేల రూపాయలకు విక్రయిస్తోంది. విశాఖలో ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు, అధికారులు కుమ్మక్కై ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
విశాఖ జిల్లాలో ఇసుక రీచ్‌లకు అనుమతి లేదు
విశాఖ జిల్లాలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుకను తీసుకొస్తున్నారు. విశాఖలో జరిగే నిర్మాణ అవసరాలకు రోజుకు రాజమండ్రి నుంచి 100 లారీలు, శ్రీకాకుళం నుంచి 250 లారీల ఇసుక వస్తోంది. ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి ఇసుకను తీసుకొస్తున్నారు. ఒక లారీ ఇసుక లోడింగ్‌, ఇతర ఖర్చులకు గాను 2500 తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించడం.. లారీ ఇసుక రేటును 30 నుంచి 40 వేలకు పెంచడం రివాజుగా మారింది.  శ్రీకాకళం నుంచి ఇసుక తీసుకొస్తున్నప్పుడు రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ ఇలా అన్ని శాఖల అధికారులు ఎక్కడికక్కడ లారీలను ఆపడం, అందినంత దండుకోవడం చేస్తున్నారు. ఒక రేటు నిర్ణయించుకుని అవగాహనతో వెళ్లిపోతున్న సమయంలో ప్రభుత్వం ఇసుకను పూర్తిగా ఉచితంగా చేడయంతో వివాదం మొదలైంది. విశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. శ్రీకాకుళం జిల్లాలో ఒకటో, రెండో రీచ్‌లను కేటాయిస్తే.. వాటి నుంచి ఇసుకను తెచ్చుకుంటామని బిల్డర్లు, లారీల యజమానులు కోరుతున్నారు.
రాజకీయ నేతలకు లబ్ధి 
శ్రీకాకుళంలోని కొందరు అధికారులు రాజకీయ నేతలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా తమ దందాకు సహకరించని లారీ యజమానులను వేధింపులకు గురిచేస్తోంది.  సహకరించని లారీ యజమానులను ఎంచుకొని వేధిస్తున్నారు. ఆ లారీలకు బీమా ఇవ్వవద్దని బీమా కంపెనీలకు లేఖలు కూడా రాశారు. గత 15 రోజుల్లో 90 లారీలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు లారీ యజమానుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 
ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
దళారులు, మాఫియాకు మాత్రమే లాభం చేకూర్చుతున్న ఉచిత ఇసుక విధానాన్ని తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలని క్రెడాయి అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్‌ చేస్తున్నారు. ఉచిత ఇసుకంటూ రెవెన్యూ అధికారుల అండతో ఇసుకను రవాణా చేస్తున్న లారీలను సీజ్‌ చేస్తున్నారని తెలిపారు. వాటిని ఎందుకు సీజ్ చేశారో చెప్పడం లేదన్నారు. ఒక్కో లారీకి రెండు లక్షల జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అందుకే  లారీల సమ్మె చేయనున్నట్టు తెలిపారు.  దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నారు.

 

13:01 - September 5, 2018
12:50 - September 5, 2018

గృహిణులకు వంటింట్లో పిడుగులాంటి వార్త పడబోతోందంట. వంటింట్లో కీలక భాగమైన 'గ్యాస్' ధర మరోసారి పెరగబోతోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. భవిష్యత్ లో ఏకంగా రూ. 1000 ధరకు ఎగబాకనుందని టాక్. 'అచ్చే దిన్' అని చెబుతున్న పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

రికార్డు స్థాయిలో సబ్సిడీ లేని సిలిండర్ ధర. రూ. 820కి చేరింది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు మళ్లీ సబ్సిడీ లేని సిలిండర్ రేటు రూ.30.50 పెంచేశారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు పలువురు సబ్సిడీని వదులకున్న సంగతి తెలిసిందే.

ఆగస్టు మాసంలో రూ. 790 ఉన్న నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 820.50కి చేరిపోయింది. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని..గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. రెండు..మూడు నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పైన పేర్కొన్నట్లు రూ. 1000 కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ రేటు జనం గుండెల్లో గుబులురేపుతోంది. అతి త్వరలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరుకోనుందని అభిప్రాయం వెల్లడవుతోంది. 

12:24 - September 5, 2018

విజయవాడ : యువతను ప్రభావితం చేసే వ్యక్తి టీచర్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విద్యాబుద్ధులు నేర్పే గురువును పూజించాలని, గౌరవించాలన్నారు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉన్నత విద్య కోసం యువత విదేశాలకు వెళ్తున్నారని.. మనదగ్గరే చదువుకునే పరిస్థితి వస్తుందన్నారు. జ్ఞానభరిలో యువత ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారని తెలిపారు. ఆకాశమే హద్దుగా వినూత్నమైన ఆలోచనలకు యువత శ్రీకారం చుడుతున్నారని అభినందించారు.

 

12:17 - September 5, 2018

నల్గొండ : వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తికి మూత్రపిండంలో రాళ్లు ఉన్నాయని వైద్యులు కిడ్నీ తొలగించారు. పదేళ్ల క్రితం వ్యక్తికి నిర్వహించిన కిడ్నీ శస్త్రచికిత్స తాజాగా వివాదానికి కారణమైంది. మూత్రపిండంలో రాళ్లు ఉన్నాయని చెప్పిన వైద్యులు తనకు తెలియపరచకుండానే ఒక కిడ్నీని తొలగించారంటూ బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనికి గాను తనకు పరిహారం చెల్లించాలంటూ బంధువులతో కలిసి ఆ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆర్‌ఎంపీ వైద్యుడిని డిమాండ్‌ చేస్తూ డిండి మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. 
వివరాల్లోకి వెళితే...
నాగర్ కర్నూలు జిల్లా వంగూర్‌ మండలం ఉమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బన్నె బుచ్చయ్య పదేళ్ల క్రితం కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులను సంప్రదించగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. అచ్చంపేట ఆస్పత్రిలో తీసిన ఎక్స్‌రేలను తమ ఊరి వాడు, డిండి మండల కేంద్రంలో ఆర్‌ఎంపీ వైద్యుడైన జిలానీకి చూపించగా ఆయన హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. అక్కడ కుటుంబ సభ్యుల సమ్మతితో శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తొలగించిన రాళ్లను చూపారని, అయితే మూత్రపిండం తొలగించినట్లు చెప్పలేదని బాధితుడు ఆరోపించారు. 3 నెలల కిందట మళ్లీ నొప్పి రావడంతో అచ్చంపేటలోని మరో ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ ఒకటి తొలగించి ఉన్నట్లు తెలిసిందని,  కల్వకుర్తి, హైదరాబాద్‌లలోని మరో 2 ఆస్పత్రులకు వెళ్లినా ఇదే విషయం చెప్పారన్నారు. దీంతో గ్రామస్థులు, బంధువులతో కలిసి బాధిత కుటుంబసభ్యులు నిన్న డిండిలోని ఆర్‌ఎంపీ వైద్యుడు జిలానీని నిలదీశారు. తనకేమీ తెలియదని జిలానీ జవాబివ్వటంతో అతని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. నష్టపరిహారానికి డిమాండ్‌ చేశారు. స్థానిక నేతలు జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

12:10 - September 5, 2018

సెప్టెంబర్ 5...సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ప్రముఖుల దినోత్సవాలు..ఇతర ముఖ్యమైన రోజుల్లో గూగుల్ డూడుల్స్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కళ్లజోడు ధరించిన ఉపాధ్యాయుడిని గ్లోబ్‌గా చూపిస్తూ.. మ్యూజిక్, ఆస్ట్రానమీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇతర పాఠ్యాంశాలను ప్రస్తావిస్తూ.. గురువు ప్రాధ్యాన్యతను ప్రతిబింబించేలా..డూడుల్ ను రూపొందించింది.

ఇక ఈ డూడుల్‌ను ఎంపిక చేయడం కోసం పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఆకర్షితంగా ఉండేలా ఈ డూడుల్ ఉంటుంది. 1998లో తొలి గూగుల్‌ డూడుల్‌ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వస్తున్న..వచ్చే డూడుల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. టీచర్స్ డే సందర్భంగా దేశ వ్యాపితంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంటుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులను అందిస్తుంటారు. మరొక్కసారి ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు....

11:44 - September 5, 2018

విజయవాడ : ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. మరి ఈ సమావేశాలకు వైసీపీ నేతలు వస్తారా ? రారా ? గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని చెబుతారా ?..వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టబోతోందా ? జగన్ ఏం ఆలోచిస్తున్నారు. ? అసెంబ్లీకి డుమ్మా కొడితే వైసీపీ పట్ల నెగటివ్ వస్తుందా ? పార్టీ నేతలకు జగన్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు ?

గురువారం నుండి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10-15 రోజుల వరకు నిర్వహిస్తారని తెలుస్తోంది. కానీ ఈ సమావేశాలకు కూడా హాజరు కావద్దని వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలపై చర్చించి..పరిష్కరిస్తారని ఎన్నుకుంటే అసెంబ్లీకి గైర్హాజర్ అవుతుండడంపై వైసీపీ తీవ్ర విమర్శలు పెల్లుబికుతున్నాయి.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని...మంత్రులుగా బాధ్యతలు తీసుకొన్న నలుగురిని భర్తరప్ చేయాలని....టిడిపిలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై టిడిపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగే సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని సూచిస్తారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1989 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు తాను హజరు కాబోనని అప్పటి విపక్ష నేత ఎన్టీఆర్ పేర్కొని సమావేశాలకు హజరు కాలేదు. ప్రస్తుతం వైసీపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజా సమస్యలను పరిష్కరించాలని...అత్యున్నతమైన సభకు ఎమ్మెల్యేలను పంపిస్తే వారు సమావేశాలకు హాజరు కాకపోవడంపై వైసీపీపై నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ బహిష్కరణనను జనసేన అధినేత పవన్ కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సమస్యలపై చర్చించకుండా..వాటిని పరిష్కరించకుండా రాజకీయాలు చేయడం ఏంటీ ? అని చర్చ జరుగుతోంది.

ఇక టిడిపి విషయానికి వస్తే 10-15 రోజుల పాటు నిర్వహించే ఈ సభలో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న టిడిపి ఈ సమావేశాలను చక్కగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ...శాసన మండలి వేదికగా కేంద్రం..ప్రతిపక్షాలపై దాడికి సిద్ధమౌతోంది. ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్ష...అభివృద్ధికి సహకరించకపోవడం తదితర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు టాక్. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఈసారి సమావేశాలకు హాజరవుతుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

11:02 - September 5, 2018

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి '6'...సంఖ్యను ఎందుకు ఎక్కువగా నమ్ముతారు ? ప్రస్తుతం ఈ అంకెపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. వాస్తు, జ్యోతిషం, న్యూమరాలజీలకు ఆయన అత్యం ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ రద్దుకు నిర్ణయించిన తేదీ...సమయం..అన్నీ '6' చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయంగా కేసీఆర్ వేసే ప్రతి అడుగు '6'తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కోసం కీలక సభలు నిర్వహించినా..కీలక భేటీలు నిర్వహించినా...ఏ నిర్ణయం తీసుకున్నా '6'తో ముడి పడి ఉంటుంది

'6' అంకె అంటే ఆయనకు కేసీఆర్ కు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆరు వచ్చే విధంగా చూసుకుంటుంటారు. ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా '6' సంఖ్యతోనే ఉంటాయి. ఇక ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా '6' సంఖ్యతోనే ఉంటాయి. ఇలా ప్రతి సందర్భంలో '6' వచ్చే విధంగా జాగ్రత్తలు పడుతుంటారని టాక్. ఆయన సెల్ నెంబర్ కూడా ఆరుతోనే ఉంటుందని తెలుస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగానూ ఆరో నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ఆయనతో కలిపి ఆరుగురు మంత్రులు ప్రమాణం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. 6తో ముడిపడి ఉన్న అంశాలు అనేకం కనిపిస్తాయి. ఈ ఆరు సెంటిమెంట్ కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు కొంత మంది అధికారులు, పార్టీ నేతలకు కూడా అంటుకుంది. అదండి అసలు సంగతి..మరి ఆయన తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

10:52 - September 5, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. డిఎస్ కాంగ్రెస్ లో చేరనున్ననట్లు తెలుస్తోంది. ఈనెల 12 లేదా 13న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. రాహుల్ సమక్షంలో డీఎస్ పార్టీలో చేరనున్ననట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ మానససరోవర యాత్రలో ఉన్నారు. 11వ తేదీ రాత్రి రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు. డీఎస్ రాకపై కాంగ్రెస్ నేతలు పాజిటివ్ ఉన్నారు. కేసీఆర్ టార్గెట్ గా డీఎస్ మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన తనను సస్పెండ్ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సస్పెండ్ చేయకుంటే కనుక అధిష్ఠానంపై మాటల యుద్ధానికి దిగడం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. 
2014 ఎన్నికల తర్వాత డీఎస్ టీఆర్ఎస్‌లో చేరిక  
కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీఎస్ 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే, డీఎస్ ఇద్దరు కుమారుల్లో ఒకరు బీజేపీలో చేరడం, మరో కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో నెమ్మదిగా విభేదాలు మొదలయ్యాయి. దీనికితోడు డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి ఆ ప్రతిని సీఎం కేసీఆర్‌కు పంపడంతో అవి మరింత ముదిరాయి.
డీఎస్ కినుక.. 
స్థానిక ప్రజాప్రతినిధులు పంపిన తీర్మానంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, తనను పిలిచి వివరణ అడగకపోవడంతో డీఎస్ కినుక వహించారు. పార్టీలో తనకు విలువ లేకుండా పోయిందని గుర్తించారు. ఈ క్రమంలో పార్టీతో అమీతుమీకి సిద్ధమయ్యారు. అధిష్ఠానానికి రెండు పేజీల లేఖ రాశారు. తనంతట తానుగా రాజీనామా చేయబోనని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ వెల్లడించారు. మరో వారం రోజులు వేచి చూసి అప్పటికీ తనను సస్పెండ్ చేయకపోతే పార్టీ మారాలని డీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన అనుచరులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. 

 

10:41 - September 5, 2018

 

హైదరాబాద్ : సెప్టెంబర్ 6...ఏం జరుగబోతోంది...తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు...నలుగురు కలిసిన చోట ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శాసనసభ' రద్దు చేస్తారనే వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. గురువారం ఉదయమే మంత్రివర్గం సమావేశమై ఒక తీర్మానం కూడా చేయనున్నట్లు సమాచారం. కానీ సెప్టెంబర్ 6వ తేదీనే ముహూర్తం ఎందుకు నిర్ణయించారనే ఒక చర్చ జరుగుతోంది. అంతేగాకుండా మంత్రివర్గ భేటీ కూడా ఉదయం 6.45 గంటలకు ఎందుకు పెట్టారనే విపరీతంగా చర్చ జరగుతోంది.

కేసీఆర్...తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా...వాస్తు..జ్యోతిష్యం విపరీతంగా నమ్ముతారనే విషయం తెలిసిందే. ఏ క్షణంలోనైనా ఎన్నికలకు తాము సిద్ధమని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఎన్నికల వేడి రెట్టింపైంది. 'ముందస్తు'కైనా సిద్ధమేనని కేసీఆర్‌ అనడం వెనుక వాస్తు, జ్యోతిష కారణాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. వాస్తు రీత్యా సెక్రటేరియట్‌ అచ్చి రాదని...కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టానే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో మెదక్ జిల్లాలో ఎర్రవల్లిలో ఆయుత చండీయాగం కూడా అలాంటి నమ్మకంలో భాగమే.

కేసీఆర్ జన్మ నక్షత్రానికి కుజు గ్రహం సహకారం చాలా అవసరమని.. అందుకే కుజుడు కక్ష్యలోకి రాగానే శుభకార్యాలు మొదలుపెట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులు కేసీఆర్ కు సూచించినట్లు టాక్. గురుడు అక్టోబర్ 12న వృశ్చికంలోకి చేరుతాడని...దీంతో గురుడు విశేష దృష్టి కర్కాటకం మీద పడుతుందని.. అప్పుడు కేసీఆర్ ఏపని మొదలుపెట్టినా శుభమే అని సూచిస్తున్నారంట. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్‌కు అనుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కేసీఆర్ చాలా తెలివిగల వాడని..తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు సైతం కేసీఆర్ ను కవర్ చేయకుండా ఉండలేకపోయారని విశ్లేషకులు పేర్కొంటుంటారు. కేసీఆర్ భాష..టైమింగ్...కొన్ని అంశాలు కేసీఆర్ కు కవరేజ్ తీసుకొచ్చాయనే చెప్పవచ్చు. మరి కేసీఆర్ ముహూర్తం సక్సెస్ అవుతుందా ? లేదా ? అంటే కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకు వెయిట్ అండ్ సీ...

కొడుకు ఆత్మహత్య...తల్లి కూడా...

తిరుపతి : ఆర్థిక ఇబ్బందులతో టిటిడి కాంట్రాక్టు కార్మికుడు గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుయాలో చికిత్స పొందుతూ గంగాధర్ మృతి చెందాడు. కుమారుని మృతిని తట్టుకోలేక తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 

శ్రీ చైతన్య స్కూల్ బస్సులో మంటలు...

మేడ్చల్ : జవహార్ నగర్ పరిధిలో యాప్రాల్ లో శ్రీ చైతన్య స్కూల్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేశారు. 

09:44 - September 5, 2018

హైదరాబాద్ : నిజాం సొమ్ము దొంగలపాలయ్యింది. ఎంతో జాగ్రత్తగా కాపాడాల్సిన అమూల్యమైన సంపద.. అనూహ్యంగా మాయమయ్యింది. నిజాం మ్యూజియంలో జరిగిన చోరీపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇద్దరు దొంగలు మ్యూజియంలోకి చొరబడ్డా.. వెంటిలేటర్‌ను.. అల్మారాను పగలగొట్టినా.. పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు  
నిజాం మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీ చేసిన దుండగుల దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. అయితే.. తమ ముఖాలు కనిపించకుండా వాళ్లు మాస్క్‌లు కట్టుకోవడంతో ఎవరన్నది స్పష్టంగా తెలియడం లేదు. చోరీ అనంతరం పల్సర్‌ బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మ్యూజియం నుంచి మాయమైన వస్తువులు.. 
నిజాం మ్యూజియం నుంచి మాయమైన వాటిలో బంగారు టిఫిన్ బాక్స్‌, బంగారు స్పూన్‌, బంగారు టీ కప్పు, సాసర్‌ ఉన్నాయి. ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ జరిగింది. ఆ సమయంలో మ్యూజియానికి ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తున్నారు. అయినా.. తెలివిగా వారి కళ్లు గప్పిన దుండగులు ప్రహారీ నుంచి మ్యూజియం పై అంతస్తుకు వెళ్లారు. అక్కడి వెంటిలేటర్‌ ను పగలగొట్టి ఒకడు లోపలికి చొరబడ్డాడు. మరొకడు అక్కడే కాపలాగా ఉన్నాడు. తాడు సాయంతో లోపలికి దిగి.. నిజాం ఉపయోగించిన బంగారు వస్తువులను దోచుకెళ్లాడు.
మ్యూజియం లోపల చోరీ జరుగుతున్నా.. 
మ్యూజియం లోపల చోరీ జరుగుతున్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. లోపల సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిలో పూర్తి స్థాయిలో చోరీ దృశ్యాలు నమోదు కాలేదు. కేవలం దుండగుడి వీపు మాత్రమే రికార్డయ్యింది. మ్యూజియంలో మరెన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ వాటి జోలికి దొంగ వెళ్లలేదు. కేవలం నాలుగు వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లడం చూస్తుంటే.. ఈ చోరీపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. వాటిపైపు సీసీ కెమెరాల ఫోకస్ లేదన్న సంగతిని పక్కాగా గుర్తించే.. వీటిని చోరీకి ఎంచుకుని ఉండొచ్చని తెలుస్తోంది. 
ఇంటిదొంగల పనై ఉండొచ్చన్న డౌట్స్‌ 
నిజాం మ్యూజియం నుంచి ఈ వస్తువులు దోచుకెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, తెగించి మరీ చోరీకి వచ్చారంటే, అది ఇంటిదొంగల పనై ఉండొచ్చన్న డౌట్స్‌ తలెత్తుతున్నాయి. పైగా టెర్రస్‌పై సీసీ కెమెరాలు లేకపోవడం కూడా దొంగలకు తెలిసే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దొంగలకు మ్యూజియం గురించి పూర్తిగా తెలిసి ఉంటే తప్ప, ఇంత ఈజీగా చోరీ జరగదు. వజ్రాలు, రూబీలు పొదిగిన టిఫిన్‌ బాక్స్ బరువు దాదాపు రెండు కిలోలు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల వేటకు వెళ్లే సమయంలో ఏడో నిజాం ఈ టిఫిన్‌ బాక్స్‌ను తీసుకువెళ్లేవారట. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. మ్యూజియం గ్యాలరీల్లో సీసీకెమెరాలను కన్నార్పకుండా పరిశీలించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఎంతగా నిద్రపోతున్నారో ఈ ఘటనతో తేలిపోయింది. 

09:29 - September 5, 2018

గుంటూరు : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో అనుసరించే వ్యూహాలపై టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. సభలో తమ వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు..
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇవాళ ఉదయం 11 గంటలకు  టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఉండవల్లి గ్రీవెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి టీడీపీ శాసనసభాపక్షంతోపాటు  పార్టీ నేతలు హాజరుకానున్నారు.  రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలపైనే ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశముంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. గ్రామదర్శిని, గ్రామ వికాసంపైనా చంద్రబాబు సమీక్షించనున్నారు. వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల ముంగిట పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది.
కేబినెట్‌లోకి ఒకరా.. ఇద్దరా?
టీడీపీ విస్తృ స్థాయి సమావేశంలో చంద్రబాబు కేబినెట్‌ విస్తరణపై నేతలకు స్పష్టత నిచ్చే అవకాశముంది. దీంతో తెలుగుదేశం పార్టీలో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రుల రాజీనామాతో మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక ఖాళీని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎస్టీలు లేనందున.. ఆ వర్గానికి కూడా చోటిస్తే బావుంటుందని సీనియర్లు సూచించారు. దీంతో కేబినెట్‌లోకి ఇద్దరిని తీసుకునే చాన్స్‌ ఉంది.

 

08:57 - September 5, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎవరైనా భోజనం చేయాలనుకుంటున్నారా అయితే 82,500 రూపాయలను సిద్ధం చేసుకోవాల్సిందే. ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీరే చూడండి. రాహుల్‌ గాంధీ ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన కార్యక్రమాల పట్ల పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ హాజరైన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్వహకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 900యూరోలు( సుమారు రూ.82,500) వసూలు చేశారు. భారత్‌కు చెందిన విలేకరులతో మాట్లాడేందుకు రాహుల్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌(ఐఓసీ‌) నిర్వహించింది. అయితే ఐఓసీ దానిని ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం మాదిరిగా నిర్వహించిందని, పార్టీ అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి నిధులు ఆ విధంగా సేకరించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటన కార్యక్రమాలకు ఐఓసీ‌ నిర్వహణ
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటనలోని దాదాపు కార్యక్రమాలను ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్సే నిర్వహించింది. పలు కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. భాజపాకు ఎక్కువ సన్నిహితంగా ఉండే కన్జర్వేటివ్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేసింది. దానికి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి సన్నిహితంగా ఉండే వ్యక్తి హోస్ట్‌ చేసేలా ప్రణాళిక వేశారు. ఐఓసీనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్లాన్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సమాచారం. దానికి బదులుగా యూకే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మరో కార్యక్రమానికి రాహుల్‌ వెళ్లేలా ప్రణాళికను మార్చారు. మరికొన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే గందరగోళంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

08:52 - September 5, 2018

ఒడిషా : సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటుంది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండరు. కాని ఒక పాఠశాలలో ఉపాధ్యాయులకు తగట్టుగా విద్యార్థులు లేరు. ఒక వైపు పాఠశాలల్లో తరగతులు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకుంటే... మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పది మంది కంటే తక్కువగా ఉన్నా ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉంటున్నారు... ఫలితంగా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఇందుకు రాయగడ జిల్లా రామన్నగుడ సమితి పారికేత పంచాయతీ గుమ్మాగుడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలే నిదర్శనం. ఇక్కడ కేవలం ఒక్క విద్యార్థే చదువుతుండగా ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో మొత్తం 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఉన్న పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి అయిదుగురు విద్యార్థులు చదువుతున్నారు. వారిలో నలుగురికి ఆశ్రమ పాఠశాలలో సీటు లభించడంతో అక్కడికి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఒక్క విద్యార్థి బిజయ్‌ అరకా(మూడో తరగతి) చదువుతున్నాడు. బిజయ్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఈ విషయంపై సమితి విద్యాధికారి వేణుధర్‌ జానితో మాట్లాడగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, ఆ విద్యార్థిని సమీపంలోని మరో పాఠశాలకు మార్చుతామన్నారు. ఉపాధ్యాయులు ఇద్దరినీ ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. గ్రామస్థులు, అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని తెలిపారు.

 

08:07 - September 5, 2018

ముంబయి : బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా మరో నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అధికార బీజేపీకి చెందిన ఘట్కోపర్‌ ఎమ్మెల్యే రాం కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల ప్రతిపాదనను తిరస్కరించిన అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాం కదం ముంబయిలో 'దహి హంది' వేడుకలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న యువకులను ఉద్దేశిస్తూ అత్యుత్సాహంతో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడున్న యువకులకు తన ఫోన్‌ నెంబర్‌నూ ఇచ్చారు. 'మీకే సాయం కావాలన్నా నాకు ఫోన్‌ చేయొచ్చు. మీరు ప్రపోజ్‌ చేసిన అమ్మాయి మిమ్మల్ని తిరస్కరిస్తే నన్ను సంప్రదించండి. మీకు తప్పకుండా సాయపడుతాను. మీ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి నచ్చితే ఆమెను వెంటనే కిడ్నాప్‌ చేసి మీ దగ్గరకు తీసుకొస్తాను' అంటూ ఎమ్మెల్యే అన్నారు. ఈ వీడియోను ఎన్సీపీ ఎమ్మెల్యే జితేండ్ర అవ్హాద్‌ సామాజిక మాధ్య మాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలో నేపథ్యంలో రాష్ట్రంలో మహిళ భద్రతపై జితేంద్ర అధికార పార్టీని ప్రశ్నించారు. కాగా, దీనిపై తీవ్ర దుమారం రేగడంతో రాం కదం మాట మార్చారు. తాను అలా అనలేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్రలో భాగమని తప్పించ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా దహి హంది కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం హాజరై ఎమ్మెల్యేతో వేదికను పంచుకోవడం గమనార్హం. 

07:41 - September 5, 2018

నల్గొండ : సాధారణంగా తాబేలు ఐదారు కిలోల బరువు ఉంటుంది. మీరేప్పుడైనా 60 కిలోల తాబేలు చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. అడవిదేవులపల్లి మండల శివారులోని నాగార్జున సాగర్‌ టేల్‌పాండ్‌ వద్ద సుమారు 60 కిలోల భారీ తాబేలు లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు తాబేలును తిరిగి నదిలోకి వదిలారు. ఇటీవల నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం విదితమే. నీటి విడుదల సమయంలో నదిలోని నీటి వేగానికి ఒక భారీ తాబేలు ఒడ్డుకు కొట్టుకొచ్చి బండరాళ్ల మధ్య చిక్కుకు పోయింది. గమనించిన స్థానికులు అతి కష్టం మీద దానిని నదిలోకి వదిలారు. ఇంత పెద్ద తాబేలును తామింత వరకు చూడలేదని వారు తెలిపారు. 

 

07:29 - September 5, 2018

హైదరాబాద : హైదరాబాద్‌ మెట్రో రైలు అరుదైన రికార్డు సాధించింది. 2కోట్ల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చి సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం 9నెలల్లోనే 20 మిలియన్ల ప్రయాణికులను ఒకచోట నుంచి మరొకచోటుకు చేర్చడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం నవంబరు 29న నాగోల్‌.. అమీర్‌పేట, అమీర్‌పేట..మియాపూర్‌ మెట్రో రైలు మార్గాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. 9నెలల కాలంలో 2 కోట్లు మందిని వారి గమ్యస్థానాలకు చేర్చడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. మెట్రో సేవలను సాదరంగా ఆహ్వానిస్తున్న హైదరాబాద్‌ నగరవాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాము ఊహించిన దానికంటే ముందుగానే ఓ మైలురాయిని సాధించామని చెప్పారు. నాగోల్‌..అమీర్‌పేట, అమీర్‌పేట..మియాపూర్‌ మార్గంతోనే బెంచ్‌మార్క్‌ సాధించినట్లు పేర్కొన్నారు.
ప్లాట్‌ఫామ్‌లపైనా రైళ్ల రాకపోకలు, రెగ్యులర్‌ ఎనౌన్స్‌మెంట్లు
అమీర్‌పేట..ఎల్బీనగర్‌ మార్గంలో ప్రయాణ సౌకర్యాలు ప్రారంభించిన తరువాత ఇలాంటి మైలు రాళ్లు మరిన్ని అధిగమిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రయాణీకుల సేవలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్న ఆయన ఇటీవల కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. అన్ని మెట్రో స్టేషన్లల్లోనూ ఉచితంగా రెస్ట్‌ రూమ్‌లను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం రైళ్ల రాకపోకలు, రెగ్యులర్‌ ఎనౌన్స్‌మెంట్లను రైలుతోపాటుగా ప్లాట్‌ఫామ్‌లపై కూడా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. మెట్రో రైలు దిగిన తరువాత వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని నూతన సౌకర్యాలు ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

06:57 - September 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల అంశం రాజకీయ సెగను రేపింది. ఆయా పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ప్రగతి నివేదన సభ తర్వాత సీఎం కేసీఆర్‌ ముందస్తు దూకుడును పెంచారు. ఈనెల 6వ తేదీ ఉదయం 6.45 నిముషాలకు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు మంత్రులందరికీ వర్తమానాన్ని పంపారు. అదేరోజు ఆయన అసెంబ్లీ ని రద్దు చేస్తూ, గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. దీన్ని దృవీకరిస్తూ మంగళవారం ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తదితరులు గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో అధికారుల భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నియోజకవర్గాల వారీగా గడచిన నాలుగేండ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల నుంచి తెప్పించి, సీఎం కేసీఆర్‌కు అందచేసినట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌ నుంచే మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. 6వ తేదీ అసెంబ్లీ రద్దు చేసి, 7వ తేదీ హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభను ఏర్పా టు చేశారు. ఇక్కడ 65వేల మంది జనాభాను సమీకరించే బాధ్యతను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లకు అప్పగించారు. గతంలో నిర్ణయించినట్టు 50 రోజుల్లో వంద బహిరంగసభల్ని నిర్వహిస్తామని, వీటన్నింటిలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సభలకు 'ప్రజా ఆశీర్వాద సభ' అని నాయకరణం చేశారు. 
2014 ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్‌ నుంచి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ 
2014 ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచే ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గడచిన నాలుగేండ్లలో ఎన్నడూ సీఎం కేసీఆర్‌ ఉదయం పూట మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు. మూఢాలు, ముహూర్తాలను విశ్వసించే ఆయన వేదపండితులు, జ్యోతిష్యుల సలహా మేరకే 6వ తేదీ ఉదయం 6.45 నిముషాల కు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం కాగానే గవర్నర్‌కు రాజీనామా ఇస్తారా లేక రాత్రికి ఇస్తారా అనే దానిపై స్పష్టత రావల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని సీఎం హౌదాలో చేస్తారా లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హౌదాలో వెళ్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఇటీవల సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా అంశాలను ప్రస్తావించడానికే తాను ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసినట్టు అప్పట్లో రాజీవ్‌శర్మ తెలిపారు. ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి ఆయన గవర్నర్‌ను కలవడం 'ముందస్తు' వేగంలో భాగమేనని చర్చ జరుగుతోంది.

 

Don't Miss