Activities calendar

06 September 2018

21:08 - September 6, 2018

విజయవాడ : గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముందుకు సీవై సోమయాజులు కమీషన్ నివేదిక వచ్చింది. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజుల కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒకే ముహూర్తానికి పుష్కర స్నానం సెంటిమెంట్ తోనే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

21:04 - September 6, 2018

విజయవాడ : గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. వీఆర్ ఏలకు రూ. 300 మేర డీఏ పెంపు, కృష్ణపట్నం, పోర్టు లిమిట్స్ ను సవరించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ - పుట్టపర్తి విమాన సర్వీసులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ - నాగార్జున సాగర్ మార్గంలో నైన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు ఆమోదం కూడా తెలిపిందే. డీఫ్ వాటర్ పోర్టు, ఇండస్ట్రీయల్ కారిడార్ అభివృద్ధికి రుణం తీసుకొనేందుకు అనుమతినిచ్చింది. 

20:49 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ భవన్ లో జరిగిన ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈసందర్భంగా నేతలకు ఆయన దిశా..దశ నిర్ధేశం చేశారు. శుక్రవాం నుండే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. టికెట్ వచ్చిందని గర్వపడొద్దని, నియోజకవర్గంలోని అందరి నేతలతో కలుపుకొని పోవాలని, ప్రతి నియోజకవర్గానికి తాను రావడం జరుగుతుందని...ఒక్కటి..రెండు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన ఫీడ్ బ్యాంక్ తీసుకోవడం జరుగుతుందని..అలసత్వం ప్రదర్శిస్తే తనకు సమాచారం అందుతుందని...15 రోజుల తరువాత జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇక అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించాలని సూచించారు. 

20:33 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టిజేఎస్ అధినేత కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ రద్దు అంశంపై ఆయన స్పందించారు. కేసీఆర్ ఆపద్ధర్మ ప‌ద‌వుల‌ను వదులుకుని ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని డిమాండ్ చేశారు.న కేసీఆర్‌ను అప‌ద్ధ‌ర్మ సీఎంగా కొన‌సాగించ‌ వద్దని...ఈ విషయంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని గవర్నర్ ను కోరుతామన్నారు. కేవలం పరిపాల‌న చేత‌కాక‌పోవ‌డం వ‌ల్లే అసెంబ్లీని రద్దు చేశారని, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని కోదండ‌రాం విమర్శించారు. 

20:26 - September 6, 2018

విజయవాడ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబునాయుడు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. పదవులు పొందిన తర్వాత బాధ్యతలు విస్మరిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుక బాబు యోచించారు. నివాళి అర్పించే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. 

20:19 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. కమిటీ ఛైర్మన్ గా కె.కేశవరావు, కమిటీ సభ్యులుగా జితేందర్ రెడ్డి, జి.నగేష్, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, అజ్మీర చందూలాల్, పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి లున్నారు. 

18:59 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో గరం గరంగా మారింది. అంతేగాకుండా 119 స్థానాలకు 105 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించడంతో రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ఇదిలా ఉంటే గతంలో కూడా 'ముందస్తు' ఎన్నికలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికలు జరగగా తెలంగాణలో మొదటిసారి జరగడం విశేషం. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయారు. 201 సీట్లలో ఘన విజయం సాధించారు. కొద్దికాలానికే రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేయడం..నాదెండ్ల భాస్కర్ రావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఆందోళనలు భగ్గుమన్నాయి. తిరిగి రామారావుకు అధికార పగ్గాలు లభించాయి. 1985లో మరోసారి ప్రజా తీర్పును కోరుతూ సభను రద్దు చేస్తు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వామపక్షాలు, బీజేపీకి సీట్లను కేటాయించి పోటీలో దిగారు. మొత్తం 249 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి 209, సీపీఐ 11, బీజేపీ 10 స్థానాలు, కాంగ్రెస్ కు 50 సీట్లు గెలుచుకున్నాయి. ఇక్కడ టిడిపి తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది...

2004లో బాబు...

2004 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బాబు నిర్ణయించారు. వాజ్ పేయి నాయకత్వంలో ఉన్న ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడం...లోక్ సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు. టీఆర్ఎస్..ఇతరపక్షాలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుంది. కాంగ్రెస్ 185, టీఆర్ఎస్ 26, సీపీఎం 9, సీపీఐ 6, టిడిపి 47 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షంగా మిగిలింది.

2018లో ?

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏడు నెలల వ్యవధి ఉండగానే సభను 2018, సెప్టెంబర్ 6వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ కేసీఆర్ అనుకున్నట్లు గెలుపొంది ఎన్టీఆర్ స‌ృష్టించిన ప్రభంజనాన్ని పునరావృత్తం చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ప్రజల ఆశ్వీరాదం తమకే ఉందని వారు భావిస్తున్నారు. ఖచ్చింతంగా వంద పైగా సీట్లలు గెలుపు బావుటా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

18:42 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దయి పోయింది. గురువారం కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంతో భేటీ అయిన కేసీఆర్ ఏకీకృత తీర్మానం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. అనంతరం గవర్నర్ ను కలిసిన కేసీఆర్ లేఖ అందచేశారు. దీనికి గవర్నర్ ఆమోదించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం విశేషం. కానీ కొన్ని స్థానాల్లో మాత్రం పెండింగ్ లో ఉంచగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.

పెండింగ్ లో ఉంచిన దానిలో మల్కాజ్ గిరి కూడా ఉంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా కనకరెడ్డి గెలుపొందారు. ఆయనకు మరోసారి అవకాశం కల్పిస్తారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఆయన కుమార్తె ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్న శ్రీదేవికి అవకాశం ఇస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కానీ కనకారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వరని...ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హన్మంతరావును బరిలోకి దించుతారని మరో ప్రచారం జరుగుతోంది. మరి ఎవరికి దక్కుతుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

18:32 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందింది. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ ను శాసనసభ కార్యదర్శి కలిశారు. గెజిట్ నోటిఫికేష్ ను అందించారు. మంత్రివర్గ సిఫార్సులకు అనుగుణంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు అనుగుణంగా శాసనసభ సచివాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ప్రతిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అందించారు. శాసనసభ రద్దు కావడంతో అన్ని స్థానాలు ఖాళీ అయ్యాయని సీఈసీకి అందిస్తారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. 

18:23 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ భవన్ లో జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థులకు దిశ..దశ నిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం నుండి ఏకంగా సీఎం కదనరంగంలోకి దూకుతున్నారు. హుస్నాబాద్ నుండి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అంతేగాకుండా 50 నియోజవకవర్గాల్లో పర్యటిస్తానని, వంద సభలో పాల్గొంటానని వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థులు కూడా ప్రచారంలోకి వెళ్లాలని..టీఆర్ఎస్ 100 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించలేదు.

 

18:17 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల ప్రకటనల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. కొన్ని స్థానాల్లో మాత్రం పెండింగ్ లో ఉంచడం...ఇద్దరు సిట్టింగ్ ఎమ్యేలకు మరోసారి అవకాశం కల్పించ లేదు. ఖైరతాబాద్, గోషామహల్ తదితర కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీనితో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవలే పార్టీలో చేరిన దానం నాగేందర్ కు టికెట్ వస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఇటీవలే టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఖైరతాబాద్ నుండి పోటీ చేయాలని దానం నాగేందర్ భావిస్తున్నట్లు, కానీ సికింద్రా బాద్ నుండి పోటీ చేయాలని కేసీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అటువైపు గోషా మహల్ కు కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు. 

17:33 - September 6, 2018

హైదరాబాద్ : తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రద్దు..అనంతరం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై కుంతియా పేర్కొన్నారు. కేసీఆర్ హిట్లర్ పాలన ముగిసిందని ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని, నెల రోజులుగా మోడీతో పదే పదే సమావేశాలు తరువాత కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయంత తీసుకున్నారని విమర్శించారు. 

17:23 - September 6, 2018

హైదరాబాద్ : రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించాలన్నారు.

ప్రతిపక్షాలకు భయపడి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అప్రజాస్వామికంగా కేసీఆర్ వ్యవహరించారని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అధికార యంత్రాగాన్ని చేతిలో పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. కేబినెట్ అభిప్రాయాలను కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తి చేయలేదన్నారు. మిషన్ భగీరథ పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పారన్నారు. 

17:01 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు. దీంతో రాష్ట్రంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారంటు ప్రశ్నిస్తు.. ఓ యువకుడు రాజ్ భవన్ బయట ఆత్మహత్యకు యత్నించాడు. కాగా రాజ్ భవన్ భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంద్భంగా అతను మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వచ్చానని, తన పేరు ఈశ్వర్ అని, నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థినని తెలిపాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అమరులైన వారికి,ఉద్యమకారులకు, నిరుద్యోగులకు,కళాకారులకు న్యాయం చేయకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఈశ్వర్ ప్రశ్నించాడు.

16:56 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. గురువారం మంత్రివర్గంతో భేటీ అయినా ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దును మంత్రివర్గం స్వాగతించారు. అనంతరం గవర్నర్ తో భేటీ కావడం..గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి.

అసలు ఏం టైంలో ఏమి జరిగిందో చూద్దాం....

సమయం ఏం జరిగింది ? 
01.00 పీఎం  తెలంగాణ కేబినెట్ భేటీ...
01.02 పీఎం  అసెంబ్లీ రద్దుకు సిఫార్సు...
01.15 పీఎం రాజ్ భవన్ కు కేసీఆర్...
01.25 పీఎం గవర్నర్ తో కేసీఆర్ మీటింగ్...
01.50 పీఎం అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం...
02.00 పీఎం రాజ్ భవన్ నుండి కేసీఆర్ బయలుదేరడం..
02.06 పీఎం ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్...
02.46 పీఎం  టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్...

 

16:45 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..కేసీఆర్ ప్రజలకు ఏమీ చేశారని టి.కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పై ఆయన స్పందించారు. 102 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎందుకు ఉత్పత్తి చేయలేదని అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ రుణమాఫీ సకాలంలో అమలు కాకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చారని, మొదటి నిరసన చూసిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. మూడు నిర్ణయాలు తీసుకున్నారని అందులో మొదటిది సిమెంట్ కంపెనీలకు రేట్లు పెంచారని..రెండోది మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచడం..మూడోది పోలీసులకు వాహనాలు పెంచడం తదితర నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అభివృద్ధికి టి.కాంగ్రెస్ ఆటంకం కాదని..కానీ వారి వారి ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. 

16:34 - September 6, 2018

హైదరాబాద్ : కేసీఆర్ కు పోయే కాలం వచ్చిందని...కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడుతారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తెలిపారు. కేబినెట్ రద్దు చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పిన అంశాలపై టిపిసిసి ఉత్తమ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన అవమానం అంతా ఇంత కాదని తెలిపారు. మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళితులకు మూడెకరాలు ఏమయ్యాయి ? దళిత ముఖ్యమంత్రి ఏమైంది అని ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగం..అన్నారని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం...విషయంలో పచ్చి..మోసం..దగా చేశారని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్..మైనార్టీలకు రిజర్వేషన్ విషయంలో పచ్చి మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి..కేసీఆర్ కు బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని విమర్శించారు. 

16:32 - September 6, 2018

హైదారాబాద్ : అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపరు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆర్థిక ఎదుగుదల 17.17 శాతంగా ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలో కేసీఆర్ పలు అంశాలను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రం సాధించిన ప్రగతి 21.96 శాతంగా ఉందన్నారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఈ మధ్య రాజకీయాల్లో అసహనం చూస్తున్నాం. అది మంచిది కాదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పసలేనివి. భయంకరంగా ఆరోపణలు చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ పూర్తిగా ధ్వంసమైతే.. కాంగ్రెస్ సన్నాసులు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగం కోసం ఖర్చు చేసింది 25 వేల కోట్లు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని సాధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని ప్రధాని సహా అనేక రాష్ర్టాల సీఎంలు కొనియాడారని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో కమీషన్లు తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల్లో వాస్తవాలు లేవని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఒక సాక్ష్యం, ఆధారం లేకుండా ఇష్టారీతిన విమర్శలు చేయడం సరికాదని తెలంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

16:19 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ 105 స్థానాలకు టికెట్లు కేటాయించగా.. ఐదు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ ఐదు నియోజకవర్గాలు.. మేడ్చల్, మల్కాజ్‌గిరి, వరంగల్ ఈస్ట్, చొప్పదండి, వికారాబాద్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ ఐదు నియోజకవర్గాలకు మినహాయించి.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నాం. అనేక సర్వేల తర్వాత టికెట్లు ఇచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు.

16:05 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్..డీఎస్ వ్యవహారంపై స్పందించారు. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం..ఈ విషయాన్ని గవర్నర్ కు తెలియచేయడం...ఆయన ఆమోద ముద్ర వేయడం గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. డీఎస్ శ్రీనివాస్ వ్యవహారంపై విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. పార్టీలో చేరుతానని చెప్పారని..ఇందుకు తాము సమ్మతించినట్లు తెలిపారు. కానీ ఆయన నియోజకవర్గంలోని నేతలు తనను కలిశారని...ఆయన కొడుకు వేరే పార్టీలో వెళ్లారని..ఎన్నో విషయాలు చెప్పడం జరిగిందన్నారు. ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని...బాంబులు పేల్చే ఏమీ లేదని..ఇష్టం ఉంటే ఉంటడు..పోతే పోతడు...అని పేర్కొన్నారు.

15:51 - September 6, 2018

హైదరాబాద్ : తాము ఎందుకు వరాలు ప్రకటించలేదో...అసెంబ్దీ రద్దుపై తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం..ఈ విషయాన్ని గవర్నర్ కు తెలియచేయడం...ఆయన ఆమోద ముద్ర వేయడం గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ రద్దు ప్రకటించవద్దని కేబినెట్ ఏకీకృతంగా చెప్పాల్సినవసరం ఉందని..అందుకే ప్రకటించలేదన్నారు. వరాలు ప్రకటిస్తే జీవో ఇవ్వాల్సి ఉంటుందని..అలాంటి అనైతకం చేయలేమన్నారు. కేకే ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఉంటుందని..ఇందులో 15 మంది ఉంటారన్నారు. వంద స్థానాలకంటే అధికంగానే విజయం సాధిస్తామని..ఒంటరిగా పోతామన్నారు. 

15:49 - September 6, 2018

హైదారబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మామూలుగా లేదు. ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ మరో ఊహించని అడుగు వేశారు. ప్రతిపక్షాలు సైతం విస్మయం చెందేలా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 105 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు. సిట్టింగ్ లను మార్చబోమని గతంలోనే చెప్పానని... చెప్పినట్టుగానే అందరికీ సీట్లను ఇస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యల కారణంగా కొందరికి తొలి జాబితాలో సీట్లను కేటాయించలేకపోయామని చెప్పారు. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.

కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులు వీరే..

భద్రాద్రి కొత్తగూడెం : 
1. భద్రాచలం-టి.వెంకట్రావు 
2. పినపాక-పాయం వెంకటేశ్వర్లు 
3. అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు 
4. ఇల్లెందు: కోరం కనకయ్య 
5. కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం 
6. ఖమ్మం-పువ్వాడ అజయ్‌కుమార్‌ 
7. పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు 
8. వైరా-బానోత్‌ మదన్‌లాల్‌ 
9. మధిర: లింగాల కమల్‌రాజ్‌ 
10. సత్తుపల్లి: పిడమర్తి రవి
మహబూబాబాద్‌ 
11. మహబూబాబాద్‌: బానోత్‌ శంకర్‌ నాయక్‌ 
12. డోర్నకల్‌: డీఎస్‌ రెడ్యానాయక్‌
వరంగల్‌(రూరల్‌) 
13. పరకాల: చల్లా ధర్మారెడ్డి 
14. నరసంపేట: పెద్ది సుదర్శన్‌ 
15. వర్థన్నపేట: ఆరూరి రమేష్‌
వరంగల్‌(అర్బన్‌) 
16. వరంగల్‌ వెస్ట్‌: దాస్యం వినయ్‌ భాస్కర్
జయశంకర్‌ భూపాలపల్లి 
17. భూపాలపల్లి: ఎస్‌. మధుసూదన్‌ 
18. ములుగు: అజ్మీర చందూలాల్‌
జనగామ 
19. జనగామ: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 
20. స్టేషన్‌ఘన్‌పూర్‌: డాక్టర్‌ తాడికొండ రాజయ్య 
21. పాలకుర్తి: ఎర్రబెల్లిదయాకరరావు
నల్గొండ 
22. నల్గొండ: కంచర్ల భూపాల్‌రెడ్డి 
23. మిర్యాలగూడ: ఎన్‌.భాస్కర్‌ రావు 
24. నాగార్జునా సాగర్‌: నోముల నరసింహయ్య 
25. దేవరకొండ: రమావత్‌ రవీంద్రకుమార్‌ 
26. మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి 
27. నకిరేకల్‌: వేముల వీరేశం
సూర్యాపేట 
28. సూర్యాపేట: జి.జగదీశ్‌రెడ్డి 
29. తుంగతుర్తి: గ్యెడారి కిషోర్‌కుమార్‌
యాదాద్రి భువనగిరి 
30. ఆలేరు: గొంగిడి సునీత 
31. భువనగిరి: పి.శేఖర్‌రెడ్డి
నిజామాబాద్‌ 
32. నిజామాబాద్‌ అర్బన్‌: గణేష్‌ బిగ్గాల 
33. నిజామాబాద్‌ రూరల్‌: బాజిరెడ్డి గోవర్థన్‌ 
34. ఆర్మూర్‌: ఆసన్నగారి జీవన్‌రెడ్డి 
35. బాల్కొండ: వేముల ప్రశాంత్‌రెడ్డి 
36. బోధన్‌: షకీల్‌ అహ్మద్‌
కామారెడ్డి 
37. బాన్సువాడ: పోచారం శ్రీనివాసరెడ్డి 
38. కామారెడ్డి: గంప గోవర్థన్‌ 
39. జుక్కల్‌: హన్మంతు షిండే 
40. ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్‌ 
41. ఆదిలాబాద్‌: జోగురామన్న 
42. బోధ్‌: రాథోడ్‌ బాబూరావు 
43. ఖానాపూర్‌: రేఖా నాయక్‌
అసిఫాబాద్‌ 
44. అసిఫాబాద్‌: కోవ లక్ష్మి 
45. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌: కోనేరు కోనప్ప
నిర్మల్‌ 
46. నిర్మల్‌: అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి 
47. ముథోల్‌: జి.విఠల్‌రెడ్డి
మంచిర్యాల 
48. మంచిర్యాల: నడిపెల్లి ద్వారకారావు 
49. బెల్లంపల్లి: దుర్గం చిన్నయ్య 
50. చెన్నూరు: బాల్క సుమన్‌
కరీంనగర్‌ 
51. కరీంనగర్‌: గుంగుల కమలాకర్‌ 
52. హుజురాబాద్‌: ఈటల రాజేందర్‌ 
53. మానకొండూరు: రసమయి బాలకిషన్‌
సిరిసిల్ల 
54. సిరిసిల్ల: కేటీఆర్‌ 
55. వేములవాడ: చెన్నమనేని రమేష్‌
జగిత్యాల 
56. జగిత్యాల: డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 
57. కోరుట్ల: కె. విద్యాసాగర్‌రావు 
58. ధర్మపురి: కొప్పుల ఈశ్వర్‌ 
59. పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి 
60. మంథని: పుట్టా మధుకర్‌ 
61. రామగుండం: సొమారపు సత్యనారాయణ
సిద్దిపేట 
62. సిద్దిపేట: తన్నీరు హరీశ్‌రావు 
63. దుబ్బాక: సోలిపేట రామలింగారెడ్డి 
64. గజ్వేల్‌: కె.చంద్రశేఖరరావు 
65. హుస్నాబాద్‌: వడితెల సతీష్‌కుమార్‌
మెదక్‌ 
66. మెదక్‌: పద్మా దేవేందర్‌రెడ్డి 
67. నర్సాపూర్‌: చిలుముల మదన్‌రెడ్డి
సంగారెడ్డి 
68. సంగారెడ్డి: చింతా ప్రభాకర్‌ 
69. నారాయణఖేడ్‌: ఎం.భూపాల్‌రెడ్డి 
70. అంధోల్‌: చంటి క్రాంతి కిరణ్‌ 
71. పటాన్‌చెరు: గూడెం మహిపాల్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ 
72. మహబూబ్‌నగర్‌: వి. శ్రీనివాస్‌గౌడ్‌ 
73. జడ్చర్ల: సీహెచ్‌ లక్ష్మారెడ్డి 
74. దేవరకద్ర: ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి 
75. నారాయణపేట్‌: ఎస్‌.రాజేందర్‌రెడ్డి 
76. మక్తల్‌: సి.రామమోహన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌ 
77. నాగర్‌కర్నూల్‌: మర్రి జనార్దన్‌రెడ్డి 
78. కొల్లాపూర్‌: జూపల్లి కృష్ణారావు 
79. అచ్చంపేట: గువ్వల బాలరాజ్‌ 
80. కల్వకుర్తి: జి.జైపాల్‌యాదవ్‌
వనపర్తి 
81. వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
గద్వాల్‌ 
82. గద్వాల్‌: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 
83. ఆలంపూర్‌: వి.ఎం.అబ్రహాం
వికారాబాద్‌ 
84. పరిగి: కొప్పుల మహేష్‌రెడ్డి 
85. తాండూరు: పట్నం మహేందర్‌రెడ్డి 
86. కొడంగల్‌: పట్నం నరేందర్‌రెడ్డి
రంగారెడ్డి 
87. షాద్‌నగర్‌: వై.అంజయ్య యాదవ్‌ 
88. రాజేంద్రనగర్‌: టి. ప్రకాష్‌గౌడ్‌ 
89. మహేశ్వరం: తీగల కృష్ణారెడ్డి 
90. ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 
91. శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ 
92. ఎల్బీనగర్‌: ఎం.రామ్‌మోహన్‌గౌడ్‌ 
93. చివ్వెంల: కాలే యాదయ్య
మల్కాజ్‌గిరి-మేడ్చల్‌ 
94. కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద‌ 
95. కుక‌ట్‌ప‌ల్లి : మాద‌వ‌రం కృష్ణారావు 
96. ఉప్ప‌ల్ : బేతి సుభాష్ రెడ్డి
హైదరాబాద్‌ 
97. సికింద్రాబాద్ : టి. ప‌ద్మారావు గౌడ్‌ 
98. సనత్‌నగర్‌‌: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ 
99. కంటోన్మెంట్ : జి.సాయ‌న్న‌ 
100. జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్‌ 
101. యాకుత్ పురా: సామ సుంద‌ర్ రెడ్డి 
102. చంద్రాయ‌ణ‌గుట్ట‌: సీతారామ్‌రెడ్డి 
103. కార్వాన్ : జీవన్ సింగ్‌ 
104. బ‌హదుర్‌పుర : ఇనాయ‌త్ అలీ బ‌క్రీ 
105. నాంప‌ల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్‌

15:40 - September 6, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశంలోనే ఒక పెద్ద బఫూన్ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే...ఇక్కడే అమలు కావాలని..కానీ ఢిల్లీలో కాదని తెలిపారు. ఢిల్లీకో గులాం హమ్ కో నహీ బన్ నా..అని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

ఎన్నికల అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

15:22 - September 6, 2018

హైదరాబాద్ : గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆనాడు చెప్పిన అంశాలను ప్రస్తుతం పేర్కొంటున్నానని తెలంగాణ రాష్ట్ర అబద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పీడ విరుగడవుతుందని కాంగ్రెస్ పేర్కొందని..తమ పీడనా ? కాంగ్రెస్ పీడనా అనేది ప్రజలు నిర్ణయిస్తారని...గతంలతో తాను రాజీనామాలు చేసిన అనంతరం జలదృశ్యంలో
తెలంగాణ రాష్ట్రానికి విలన్ నెంబర్ 1 అని ఆనాడు చెప్పడం జరిగిందని..ప్రస్తుతం ఇదే చెబుతున్నానన్నారు. 2014 ముందు ఎన్నో ఘోరాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయని, తాము అధికారంలకి వచ్చిన తరువాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 

15:17 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్నో అమలు చేశామని తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడారు. రైతు బందు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు సంబంధించినవి..ఇలాంటివి 76 అంశాలను తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని తెలిపారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

అందులో భాగంగా ఎన్నికల అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

15:17 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఈ నేపథ్యంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ ప్రటించారు. కొంతమంది అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. బాబూ మోహన్ టికెర్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. పెండింగ్ లో మరికొంతమంది అభ్యర్థులను పెట్టారు. చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. 

15:13 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో వెల్లడించారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. 105 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల, అందోల్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ కేటాయించలేదు. 14 స్థానాలకు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని, వారితో మాట్లాడుతానని..ఇందుకు ఒక వారం సమయం తీసుకుంటానన్నారు. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

15:08 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షలకు అవగాహన లేదని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ రద్దు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేబినెట్ రద్దు..ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిపై ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. నోరు ఉంది కదా అని మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ..కాకతీయ మిషన్ లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని..గత ఐదు నెలల్లో అభివృద్ధి 21.96శాతం సాధించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ప్రాజెక్టులపై 25వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అద్భుతమైన అభివృద్ధి చేయడం జరుగుతోందని, కానీ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

15:08 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా సమయం ఉంది...ఈసీ కూడా అప్పుడే ఎన్నికలు కూడా ప్రకటించలేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించేసింది. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

14:59 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సీఎంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కేసీఆర్ అనుకున్నదే చేశారు. తాను అనుకున్న ప్రకారం తన పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కేసీఆర్ కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు. కేసీఆర్ ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగిస్తూ, జీవో నెంబర్ 134ను జోషి జారీ చేశారు. కాగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. అనంతరం మీడియాకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ తరపున ప్రెస్ రిలీజ్ అందింది.

14:58 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ రద్దు..తదితర విషయాలను ఆయన వెల్లడిస్తున్నారు. 'బాధ్యతయుతమైన పద్దతిలో ముందుకు సాగాలి. ఒక ఆలోచనతో పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లడం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో స్పష్టమైన మెజార్టీతో గెలుపొందాం. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అసహమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి..అభవృద్ధిపై ఇతర రాష్ట్రాలు కొనియాడాయి. తాజాగా ఒక అవార్డు కూడా దక్కింది' అని కేసీఆర్ తెలిపారు. 

కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

14:51 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఎందుకు రద్దు చేశారు ? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నాం ? తదితర విషయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించనున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. 

14:47 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఎందుకు రద్దు చేశారు ? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నాం ? తదితర విషయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించనున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు. అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ మంత్రులు, ఎంపీలు, నేతలతో భేటీ అయ్యారు. ఇక కేబినెట్ రద్దుకు ..ఇతరత్రా విషయాలను కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో చూడాలి. 

14:05 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దుకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. గురువారం ఉదయం కేబినెట్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని రాష్ట్ర మంత్రులు ఆమోదించారు. అనంతరం తీర్మానంపై అందరూ సంతకాలు చేశారు. వీరందరూ గవర్నర్ తో భేటీ అయ్యారు. సభ రద్దుపై ఒక లేఖ అందచేశారు. అనంతరం సభ రద్దు చేస్తున్నట్లు గవర్నర్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. అప్పటి వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించారు. దీనికి సీఎం కేసీఆర్ సమ్మతించారు. 

13:57 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 9 నెలల ముందుగానే ఎందుకు రద్దు చేసినట్లు ? అందులో వ్యూహం ఏమిటీ ? ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు సిద్ధ పడుతున్నారు ? అనే చర్చ జరుగుతోంది. గురువారం సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని రాష్ట్ర మంత్రులు ఆమోదించారు. అనంతరం తీర్మానంపై అందరూ సంతకాలు చేశారు. ఇక ఇక్కడి నుండి కేసీఆర్ గన్ పార్కు వద్దకు వెళ్లనున్నారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. మధ్యాహం తెలంగాణ భవన్ లో 2.30గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. అంతకంటే ముందు సభ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది. ? ఇతరత్రా నిర్ణయాలను ఆయన వెల్లడించనున్నారు.

ఇక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆమోదించాలా ? లేదా ? అనే విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు న్యాయ నిపుణులు, ఇతరుల తో చర్చించనున్నారని తెలుస్తోందిజ పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం సభ రద్దు చేయాలన్న కోరడంతో ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలుస్తోంది. తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి..శాసనసభకు పంపనున్నారు. అనంతరం శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరనున్నారు. 

13:38 - September 6, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠకు కాసేపట్లో తెరపడబోతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు గురువారం ముహుర్తం నిర్ణయించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్, తన మంత్రివర్గ సహచర బృందంతో బయలుదేరారు. అక్కడ ఆయన శాసనసభ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్న లేఖను గవర్నర్ కు అందచేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే నిజాం కాలేజీకి చెందిన నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

13:35 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. రద్దు సిఫార్సును సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ కు అందచేశారు. రద్దు సిఫార్సును లేఖ ద్వారా గవర్నర్ కు అందజేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై వివరణ ఇచ్చారు. ప్రత్యేకబస్సులో సీఎం కేసీఆర్, మంత్రులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఉదయం నుంచి కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగిన సంగతి తెలిసిందే.
9నెలల ముందే అసెంబ్లీ రద్దు 
9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ రద్దుపై అధికార ప్రకటన చేయాల్సివుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి మెజారిటీ ఉండడంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించలేరు. కేసీఆర్ కు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి. 

13:06 - September 6, 2018

హైదరాబాద్‌ : ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ అందించారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడింట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి.. గత అక్టోబరులో ఆ పార్టీని వీడి... కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన రేవంత్‌రెడ్డి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబే కాబట్టి ఆయనకే తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు అప్పట్లో రేవంత్‌ తెలిపారు. దీంతో ఆయన రాజీనామా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉంది. అయితే గురువారం అనూహ్యంగా స్పీకర్ మధుసూదనాచారి ఛాంబర్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఫార్మాట్‌లో సమర్పించి,, దాన్ని ఆమోదించాలని కోరారు.

 

13:05 - September 6, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జాతకాలను పక్కాగా నమ్ముతారు. వాస్తుశాస్త్రం, సంఖ్యల నమ్మకాలు ఇలా కేసీఆర్ అన్ని ముహూర్తాల ప్రకారమే నడుస్తారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. హస్తసాముద్రికం, చిలకజోస్యం, గవ్వలను నమ్ముకుని తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం సీఎం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఏ శాస్త్రిగారు ఏం చెప్పారో! ఆ పిచ్చిలో పడి, రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. అసలు, కేసీఆర్ కు జాతకాలు చెప్పే వాళ్లెవరో, ఆయన జాతకం బాగోలేకపోతే, రాష్ట్రం జాతకాన్ని కూడా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇట్లాంటి పిచ్చోడున్న సభలో.. సభకు, సభ్యులకు, ప్రజాస్వామ్య విలువలకూ గౌరవం లేదు. చట్టాలు, శాసనాల పట్ల వారికి అవగాహన ఉందో లేదో?’ అని ప్రశ్నించారు. 

 

12:15 - September 6, 2018

ఉత్తరప్రదేశ్‌ : భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత వుంది. కాగా ఇటీవలి కాలంలో వివాహ వ్యసవ్థకు తూట్లుపడే సంఘటనలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. కారణం ఏదైనా గానీ..వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఈ విషయంలో చాలా సందర్భాలలో అమాయకులైన పిల్లలు బలైపోతున్నారు. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతోంది. సమాజంలో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతున్న పరిస్థితులకు కూడా ఈ వివాహేతర సంబంధాలు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి చనిపోయినట్లుగా నమ్మించి కట్టుకున్నవాడిని, కన్నవారిని కూడా మోసం చేయటమే కాకుండా పోలీసు వ్యవస్థను కూడా పక్కదారి పట్టించింది.

ఉత్తరప్రదేశ్‌లో చనిపోయినట్లు డ్రామా ఆడిన ఓ మహిళ తన మాజీ ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది. రాహుల్ అనే యువకునికి రూబీ అనే యువతితో 2016లో వివాహం జరిగింది. కొంతకాలం సజావుగానే వున్న రూబీ ఒక్కసారిగా కనిపించకుండాపోయింది. దీంతో అల్లుడిని అనుమానించిన రూబీ తండ్రి తన కుమార్తె భర్త హింసించి చంపేశాడని..కనీసం శవం కూడా కనిపించకుండా మాయం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై రూబీ ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో విచిత్రమైన వాస్తవాలు బైటపడ్డాయి. ఈ వాస్తవాలతో పోలీసులు సైతం విస్తుపోయారు.

రూబీ మృతదేహాన్ని వెతకినా లభించకపోవటం..కానీ రూబీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్‌లో వుంది. దీంతో దిమ్మతిరిగిపోయిన పోలీసులు వారి స్టైల్ లో రూబీ ఫేస్‌బుక్‌ ఆధారంగా ఆమె మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో రూబీ మరణించలేదని..బ్రతికేవుందనీ తెలుసుకున్నారు. అంతేకాదు రూబీ వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రూబీ, ఆమె ప్రేమికుడు, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో విస్తుపోవటం రూబీ తల్లిదండ్రుల వంతైంది. 

11:29 - September 6, 2018

అమరావతి : పార్టీ విషయంలో క్రమశిక్షణను ఉల్లంఘించివారు ఎంతటివారైనా వారిపై సీఎం చంద్రబాబు ఉపేక్షించరు. తాను పాటించే క్రమశిక్షణ అందరు పాటించాలని తరచు ఆయన నేతలకు చెబుతుంటారు. దీనిపై ఎటువంటి రాజీ లేదని చంద్రబాబు పలుమార్లు చెప్పినా కొందరు వాటిని పాటించకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యవహారశైలి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ సమావేశాల తొలి రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించడం ఆనవాయతీగా వస్తోంది. హైదరాబాదులో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించేవారు. అసెంబ్లీ అమరావతికి మారాక... వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్నారు. అయితే, ఈ రోజు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా నివాళి అర్పించాల్సిన బాధ్యతను టీడీపీ ప్రజాప్రతినిధులు విస్మరించారు.

నివాళి అర్పించే కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, జవహర్, ఎమ్మెల్యేలు యామినీబాల, చాంద్ బాషా, రాధాకృష్ణ, శ్రవణ్ కుమార్, పీలా గోవింద్, గణబాబు, మాధవనాయుడు, ఎమ్మల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, గౌరుగాని శ్రీనివాస్, టీడీ జనార్ధన్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు హాజరుకాకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని మండిపడ్డారు. 

11:09 - September 6, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వేడితో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణలు నెలకొన్నాయి. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు వైరి పక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. నిన్న గోల్కొండ హోటల్ లో కుంతియా, ఉత్తమ్ తో టిటిడిపి ప్రెసిడెంట్ ఎల్.రమణ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో టిటిడిపి పొత్తుపై టీకాంగ్రెస్ అభిప్రాయాన్ని సేకరించింది. కాంగ్రెస్ తో పొత్తుకు టిటిడిపి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొత్తు కుదిరితే టిటిడిపికి 14 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత సీట్ల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
మిత్రులవుతున్న శత్రువులు 
ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అంశాలకు టీఆర్ ఎస్ తెరతీయగా ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే...మరోవైపు ముందస్తుకు సన్నదం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఈక్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకున్న వైరి పక్షాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి. గోల్కొండ హోటల్ వేదికగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈనెల 8న ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. బాబుతో భేటీకి ముందు కుంతియాతో రమణ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే కుంతియాతో భేటీ యాదృచ్ఛికమేనని రమణ అంటున్నారు. హోటల్ లో అనుకోకుండా కుంతియాను కలిశానని తెలిపారు.
ఈనెల 14న తెలంగాణలో సోనియా సభ
ఈనెల 14న తెలంగాణలో సోనియా సభ నిర్వహించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లేదా కరీంనగర్ లో సోనియా సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. ప్రస్తుతం రాహుల్ మానససరోవర్ యాత్రలో ఉన్నారు. సెప్టెంబర్ 12న యాత్ర ముగించుకుని ఢిల్లీకి రానున్నారు.

11:07 - September 6, 2018

జపాన్ : జపాన్ కు భూకంపం మరోసారి అతలాకుతరం చేసేసింది. తరచు భూకంపాలతో కుదేలైపోతున్న జపాన్ తిరిగి తిరిగి అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తోంది. జపాన్ ప్రజల ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెడుతున్నాయి భూకంపాలు . ఈ నేపథ్యంలో ఈ ఉదయం శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. హొక్కాయ్ డో దీవిలో ఈ భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ఆచూకీ లభించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా 2017లో జ పాన్ లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. అలాగే 2018లో కూడా ఒకాసా ప్రాంతంలో భూప్రకంపనలు ముగ్గురిని బలిగొన్నాయి. కాగా భూకంపం వచ్చిన ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలను కొన్ని గంటలపాటు మూసివేశారు. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేశారు. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆ ప్రాంతంలో ఉన్న అణు ప్లాంట్లు మామూలుగానే పనిచేశాయి.ప్రపంచంలో 6.0 లేదా అంతకు మించి వచ్చే భూ ప్రకంపనల్లో 20 శాతం జపాన్‌లోనే సంభవిస్తాయనే విషయం తెలిసిందే. 

10:43 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు నేడు ముహూర్తం ఖరారు అయింది. మధ్యాహ్నం అసెంబ్లీ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 1.30లోపు అసెంబ్లీ రద్దు తీర్మానం చేయనుంది. అనంతరం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. కేబినెట్ సిఫారసు లేఖను కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు అందించనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై వివరణ ఇవ్వనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

మంత్రులకు అధికారిక సమాచారం అందింది. మంత్రుల వద్ద పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేయనున్నారు. స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి పర్యటనను రద్దు చేసుకొని తిరిగి హైదరాబాద్ కు చేరారు. ఉదయం నుంచి కేబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ ఉదయం 6.30 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని అనుకున్నా...జరగలేదు. ఇప్పటివరకు మంత్రివర్గం సమావేశం కాలేదు. మధ్యాహ్నం 1.30లకు సమయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తంగా కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. 

 

10:35 - September 6, 2018

అదిలాబాద్ : యువతీ యువకులు ప్రేమించుకోవటం సర్వసాధారణం. వారి ప్రేమకు ఎన్నో ఆటంకాలు కూడా ఏర్పడతుంటాయి. కులం, మతం, ఆస్తులు, అంతస్థులు ఇలా వారి ప్రేమకు ప్రతిబంధాకాలుగా మారుతున్న నేపథ్యంలో కొందరు ప్రేమికులు పెద్దలను ఎదిరించలేక, ఆవేశంతోనో లేక ఆవేదనతోనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చావులో కూడా మేము ఒకటిగానే వుంటామంటు ఓకే తాడుతో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఎందరో ప్రేమజంటలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. కానీ ఈ తరహా ఆత్మహత్య జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవం సంచలనంగా మారింది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వీరి ఆత్మహత్యలకు కారణాలు మాత్రం పూర్తిస్థాయిలో తెలియరాలేదు. స్థానికలు సమచారం మేరకు సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఐతే చెట్టుకు శవాలు వేలాడుతున్న తీరును చూస్తుంటే ఎవరైనా వారిని హత్య చేసి అలా చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైరా వారిని హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

10:12 - September 6, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రోజూ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు, బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రెంటచింతల మండలానికి ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఫైనలైజేషన్ లో ఉన్నాయని పేర్కొన్నారు. 

09:16 - September 6, 2018

 హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడిని పెంచాయి. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అంశాలకు టీఆర్ ఎస్ తెరతీయగా ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే...మరోవైపు ముందస్తుకు సన్నదం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఈక్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకున్న వైరి పక్షాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి. గోల్కొండ హోటల్ వేదికగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈనెల 8న ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. బాబుతో భేటీకి ముందు కుంతియాతో రమణ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే కుంతియాతో భేటీ యాదృచ్ఛికమేనని రమణ అంటున్నారు. హోటల్ లో అనుకోకుండా కుంతియాను కలిశానని తెలిపారు.

 

08:41 - September 6, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరుగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకుండానే మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సమావేశాలకు హాజరుకాకూడదని వైపీపీ సభ్యులు నిర్ణయించుకున్నారు. గతంలో రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరైంది. ఈసారి కూడా మళ్లీ అదే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షం గైర్హాజరవుతుండడంతో.. ఆ పాత్రను తామే పోషిస్తామని అధికారపక్షం అంటోంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరిపై సభావేదికగా టీడీపీ ఎండగట్టేందుకు సిద్ధమవుతుంటే.. రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఖర్చులపై బీజేపీ ఎదురుదాడికి సిద్ధమవుతోంది. 8 నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 
ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత రెండు పర్యాయాలు శాసనసభను బహిష్కరించిన వైసీపీ ఈ సారి కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అటు అధికారపక్షం మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభలో స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకుంది. గత రెండు సమావేశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లే, ఈ సారి కూడా చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను ఆదేశించారు. 
మిత్రపక్షంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైరి పక్షం 
గతంలో మిత్రపక్షంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైరి పక్షం అయ్యింది. దీంతో ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఏ సమస్యలు లేవనెత్తుతారన్నది చర్చనీయాంశమయ్యింది. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం, కేంద్రంపై ఎదురు దాడికి దిగుతామంటున్నారు టీడీపీ సభ్యులు. ఎలాంటి ఆరోపణలు చేసినా, రాష్ట్ర మంత్రులుగా కేబినెట్‌లో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీయనున్నారు. ఇక ఇప్పటి వరకూ కేంద్రం చేసిన సాయం, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పథకాల అమలుపై అసెంబ్లీలో చర్చించనుంది తెలుగుదేశం పార్టీ. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతుండడాన్ని చర్చకు తెచ్చి, కేంద్రం పన్నులు తగ్గించాలని ఒత్తిడి తేవాలనుకొంటోంది. 
సమావేశాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష  
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సభాపతి కోడెల శివప్రసాదరావు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సభ్యులైన ప్రతి ఒక్కరూ సమావేశాలకు రావాలని ఆయన కోరారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపే విషయంలో జాప్యం చేయకూడదని ఆయన అధికారులకు దిశానిర్థేశం చేశారు. అటు, ప్రతిపక్షనేత జగన్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మారిన 22 మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే అసెంబ్లీకి వస్తామని తేల్చి చెప్పారు. స్పీకర్‌ కోడెలపైనా ఈ లేఖలో విమర్శలు చేశారు జగన్‌. స్పీకర్‌ కుర్చీకి అవమానం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం సాయంపైనా చర్చకు వస్తుంది కాబట్టి ఈ సారి సమావేశాలు వాడీవేడిగానే జరిగే అవకాశం ఉంది. 

 

08:10 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మరికొన్ని గంటల్లో ముందస్తు ఎన్నికల సమరశంఖం మోగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరు నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయబోతున్నారు. దీనికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బుధవారం నాటి పరిణామాలు  కేసీఆర్‌ ముందస్తు మంత్రాగాన్నే చూపెడుతున్నాయి. అందరూ అనుకుంటున్నట్టుగానే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం పక్కా అని తేలిపోయింది.
శాసనసభ రద్దు ఖాయం 
తెలంగాణ శాసనసభ రద్దు చేయడం ఖాయమైపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం జరిగే కేబినెట్‌... ఈ నిర్ణయం లాంఛనంగా తీసుకోనుంది. అనంతరం సీఎం మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ రద్దు తీర్మానం ప్రతిని అందజేయనున్నారు. ప్రగతిభవన్‌లో సభ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను కేసీఆర్‌ వివరించనున్నారు.
అసెంబ్లీ రద్దుపై కేబినెట్ భేటీలో నిర్ణయం 
వాస్తవానికి ఇవాళ ఉదయమే కేబినెట్‌ ఉంటుందని అందరూ అనుకున్నారు. మీడియాలోనూ జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా కేబినెట్ భేటీ ఇవాళ మధ్యాహ్నం జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న వెంటనే కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లనున్నారు. అసెంబ్లీ రద్దు సిఫార్సు లేఖను గవర్నర్‌ నరసింహన్‌కు అందజేయనున్నారు.  అసెంబ్లీ సెక్రెటరీ నరసింహాచారికీ అసెంబ్లీ రద్దు సిఫార్సు లేఖను అందించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ మీడియా సమావేశంలో  అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల అంశాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
అసెంబ్లీ రద్దుపై కేసీఆర్‌ మంతనాలు 
అసెంబ్లీ రద్దుపై కేసీఆర్‌ బుధవారమంతా మంతనాలు నడిపారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై అసెంబ్లీ రద్దుపై చర్చించారు. ఉద్యోగుల మధ్యంతర భృతిపైనా ఆయన చర్చలు జరిపారు. మరోవైపు మంత్రులంతా హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. వీటన్నిటిని పరిశీలిస్తే...ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

07:44 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మరో అవార్డు వరించింది. ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్‌ టైమ్స్‌... ఈ ఏడాది బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్‌ గ్రూపు ఎండీ వినీత్‌జైన్‌ ఈ మెయిల్‌ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్‌ 27న జరుగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని ఆయన కేసీఆర్‌ను ఆహ్వానించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు టైమ్స్‌ గ్రూపు ఎండీకి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావడానికి ఆయన సమ్మతించారు. ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని... తెలంగాణ రాష్ట్రానికి లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నానని సీఎం తెలిపారు.
కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ 2017 అవార్డు
2017లో కేసీఆర్ కు మొదటిసారి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అగ్రికల్చర్ లీడర్ షిప్ 2017 అవార్డుకు కేంద్ర ఆహార, వ్యవసాయ మండలి కేసీఆర్‌ను ఎంపిక చేసింది. పాలసీ, లీడర్ షిప్ కేటగిరీ కింద తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త‌ స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న దేశరాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం కేశారు. 

 

07:05 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. అసెంబ్లీ రద్దుకు నేడు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ అసెంబ్లీని రద్దు చేయనున్నారు. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడైనా పిలుపురావొచ్చని హైదరాబాద్ లో మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రగతి భవన్ పిలుపు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నేడు కేబినెట్ కీలక భేటీ కానుంది. అయితే కేబినెట్ సమయం తెలియక మంత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు. మూడు సమయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయం 6.30, ఉదయం 11.30, మధ్యాహ్నం 1.30 సమయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. కేబినెట్ తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్ గవర్నర్ కు అందజేయయనున్నారు. 
ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు నేడు తెర  
తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. నేడు మంత్రివర్గం సమావేశమై ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేయనుంది. మంత్రివర్గ సమావేశ అజెండాలో శాసనసభ రద్దుకు సంబంధించిన అంశం మాత్రమే ఉండనున్నట్లు తెలిసింది. అయితే మంత్రివర్గం ఎన్ని గంటలకు సమావేశమవుతుందన్న దానిపై స్పష్టత రాలేదు. ఉదయం, మధ్యాహ్నం ఇలా పలు సమయాలు వినిపిస్తున్నాయి. ఓ సమాచారం ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు సమావేశమై మంత్రివర్గం తీర్మానం చేస్తుందని, అనంతరం గవర్నర్‌కు అందజేస్తారని తెలుస్తోంది. మరో సమాచారం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేస్తుందని, లేదా 11 నుంచి 12 గంటల మధ్యలో ఉండొచ్చని చెబుతున్నారు. గురువారం ఉదయం ఆరుగంటలకు అందుబాటులో ఉండాలని మాత్రం మంత్రులకు చెప్పినట్లు స్పష్టమవుతుంది. సభ రద్దు నిర్ణయం తీసుకొని, గవర్నర్‌ను కలిసి తీర్మానం అందజేసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడతారని, ఈ సమయంలోనే దాదాపు 50 మంది వరకు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తారని సమాచారం. విలేకరుల సమావేశం తెరాసభవన్‌లో జరగనుంది. మంత్రివర్గ ఆమోదం కోసం వివిధ శాఖల నుంచి భారీగా వచ్చిన ప్రతిపాదనలను పక్కనపెట్టినట్లు తెలిసింది.
అధికారులతో సుధీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్  
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌ లో అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ రద్దు, అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు ఉద్యోగులు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, సలహాదారురాజీవ్‌శర్మ, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, జీఏడీ రాజకీయ కార్యదర్శి అధర్‌సిన్హా, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా కలవలేదు. ఇవాళ సభ రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసిన తర్వాతనే గవర్నర్‌ను కలవనున్నారు.

 

06:46 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుకు నేడు ముహూర్తం ఖరారు అయింది. అసెంబ్లీ రద్దు సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. హైదరాబాద్ లో మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రగతి భవన్ పిలుపు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నేడు కేబినెట్ కీలక భేటీ కానుంది. అయితే కేబినెట్ సమయం తెలియక మంత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు.
మూడు సమయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయం 6.30, ఉదయం 11.30, మధ్యాహ్నం 1.30 సమయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. కేబినెట్ తీర్మానం ప్రతిని కేసీఆర్ గవర్నర్ కు అందజేయయనున్నారు. 

 

Don't Miss