Activities calendar

08 September 2018

20:05 - September 8, 2018

హైదరాబాద్ : టీడీపీ అధినేత..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ కు విచ్చేసారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ వ్యూహాలు, పొత్తులు వంటి విషయాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ముప్పై ఆరేళ్లుగా పార్టీని కాపాడుతున్న టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పిలుపుతో తరలివచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 

ఈరోజున తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందంటే దానికి కారణం నాడు టీడీపీ చేసిన కృషేనని, హైదరాబాద్ అభివృద్ధి కోసం నాడు ప్రపంచం మొత్తం తిరిగానని అన్నారు. హైదరాబాద్ లో చాలా ప్రాజెక్టులు నాడు తాను ప్రారంభించినవేనని, రాష్ట్ర విభజన తర్వాత తనపై గురుతర బాధ్యత పడిందని అన్నారు. తెలుగుజాతి మధ్య విభేదాలు ఉండకూడదని చెప్పానని, ఇద్దరికీ నష్టం కలగకుండా, ఒప్పించి మాత్రమే విభజన చేయాలని సూచించానని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.

19:15 - September 8, 2018

ఢిల్లీ : దేశ రాజధాని కేంద్రంగా మరో భారీ స్కామ్ బైటపడింది. ఫ్యూచర్ కేర్ లైఫ్ గ్లోబల్ కంపెనీ భారీ స్కామ్ బైటపడింది. కోట్లాది రూపాల్ని మల్టీ నేషనల్ కంపెనీలు కొల్లగొడుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసుకుంటు మల్టీ నేషనల్ కంపెనీలు కోట్ల రూపాల్ని కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.1200ల కోట్ల స్కామ్ కు ఫ్యూచర్ కేర్ లైఫ్ గ్లోబల్ కంపెనీ భారీ స్కామ్ కు పాల్పడింది. ఈ కంపెనీకి చెందిన సీఎండీ రాధే శ్యామ్ తో సహా మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు తమ అమోఘమైన తెలివితేటలతో రూ.1200ల కోట్లు కొల్లగొట్టారు. వారు చదివింది 7వ తరగతి మాత్రమే. కానీ వారిని దేశ వ్యాప్తంగా దాదాపు 20లక్షల మంది ఖాతాదారులతో బిజినెస్ కొనసాగించారు. కరక్కాయ స్కామ్ మరువక ముందే బయటపడ్డ మరో భారీ స్కామ్. ఒకటి కాదు రెండు కాదు గొలుసుకట్టుగా ఏకంగా 1200 కోట్లు కొళ్ళగొట్టారు. ప్రధాన నిందితులు ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాధేశ్యామ్, సురేందర్ సింగ్. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఎండీ, సీఈవోలుగా వుంటు..అత్తెసరు చదువే అయినా సూటు బూటు వేసుకుని జనాన్ని మోసం చేయడంలో మాత్రం వీళ్లు అందెవేసిన చేయిగా మారి మోసాలకు తెరతీసారు. హర్యాణకు చెందిన ఈ ఇద్దరు ఢిల్లీ కేంద్రంగా మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ అడ్డాగా మల్టీ లెవల్ మార్కెటింగ్ కి తెరతీశారు. ఇందులో తమ వద్ద ఉన్న ప్రొడక్ట్స్ మార్కెటింగ్ స్కీమ్ లో చేరితే కేవలం 7500 పెట్టుబడితో రెండేళ్ళలో 60,000 లాభం, కమీషన్లు ఇస్తామని నమ్మించారు.

కొన్ని రాష్ట్రాల్లో పత్రికల్లోని క్లాసిఫైడ్స్ లో యాడ్స్ ఇచ్చారు. తమ హెల్త్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ లో పెట్టే రూ.7500 పెట్టుబడిలో 2500 మెంబర్ షిప్ కోసం, మిగిలిన 5000 రూపాయలకు మెడిసిన్స్, బట్టలు డెలివరీ చేసేవాళ్ళు. దీంతోపాటు చైన్ సిస్టమ్ లో ఎంతమంది మెంబర్స్ ను చేర్పిస్తే వాళ్ళ టార్గెట్లను బట్టి పది లెవెల్స్ లో కమీషన్లు 5000ల నుండి కోటి రూపాయల వరకు ఫిక్స్ చేశారు. దేశ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా మెంబర్స్ ని తన మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉచ్చులోకి లాగారు.

ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ స్కామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు హర్యాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాలలో కూడా సాగిన ఈ గొలుసుకట్టు దందాలో బాధితులంతా.. నిరుద్యోగ యువత, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులే. హై లెవల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో పక్కా స్కెచ్ వేసి 1200 కోట్లు దోచేశారు. ఐతే, కూకట్ పల్లిలోని ఓ బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా… ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్స్ ఆఫెన్సెస్ వింగ్ కేసును దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాధే శ్యామ్ తో పాటు సురేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఐదు బ్యాంకుల్లోని రూ.200 కోట్లను సీజ్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండడంతో పూర్తి ఆధారాలతో ఆర్ధిక నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

17:57 - September 8, 2018

హైదరాబాద్ : ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించిన కొండా దంపతులపై వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భార్య ఒక దిక్కుకు పోతే, భర్త ఇంకో దిక్కుకు వెళతారని ఎద్దేవా చేశారు. ఈ రకంగా జరుగుతుంటే పార్టీ కానీ, ప్రజలు కానీ కళ్లు మూసుకుని వూరుకుంటారా? అంటు ప్రశ్నించారు.

సురేఖ గారు..వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారనీ ..ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో త్వరంలో మీకే తెలుస్తుందిలెండి అంటు చురకలు అంటించారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి అన్నీ తమవేనని నరేందర్ ధీమా వ్యక్తంచేశారు. మీ రాజకీయ నైపుణ్యం, మీ బలం, బలగం అన్నీ చూద్దామనీ..చూసుకుందామని కొండా సురేఖ దంపతులకు మేయర్ సవాల్ విసిరారు. మరో మహబూబాబాద్ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ను చిన్న మాట అన్నా మీ బతుకేందో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని చూసి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. 

17:21 - September 8, 2018

హైదరాబాద్ : వందలాది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ క్రమంలో పలు పరిణామాల నేపథ్యంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల్లో శంకరమ్మ టికెట్ పై మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనను కాదని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్ ను మరొకరికి ఇస్తే... 10 నిమిషాల్లోనే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనకు టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను నిలుపుకుంటారని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాదులోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నిన్న హల్ చల్ చేశారు.

16:51 - September 8, 2018

నాగర్ కర్నూలు : జిల్లాలోని గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్ రెచ్చిపోయాడు. మనిషిననే సంగతి మరచిపోయాడు. కనీసం ప్రిన్సిపల్ స్థానంలో వున్న విలువల్ని సైతం మరిచిపోయి పశువులా మారిపోయి విచక్షణ మరచి విద్యార్థిని గొడ్డును బాదినట్లుగా బాదాడు. ఇంటర్ విద్యార్థి ఆదిత్యపై తన ప్రతాపాన్ని చూపిన ప్రిన్సిపల్ సురేంద్ర అతన్ని చితకబాదాడు. దీనికి మరో ముగ్గురు నవీన్, లక్ష్మణాచారి, రమేశ్ అనే లెక్చరర్లు ప్రిన్సిపల్ కు సహకారం అందించారు. దీంతో ఆదిత్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా హాస్టల్ లో వున్న ఇద్దరు విద్యార్ధుల మధ్య తలెత్తిన వివాదాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆదిత్యను పిలిచిన ప్రిన్సిపల్ సురేంద్ర జరిగిన విషయాన్ని విచారించకుండానే ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ఈ దారుణానికి మరో ముగ్గురు లెక్చరర్లు సహకరించటంతో తీవ్రంగా గాయపడిన ఆదిత్యను చూసిన తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. 

16:26 - September 8, 2018

జీవితం అనేది అందరికి వడ్డించిన విస్తరికాదు. కష్టంతో, కమిట్ మెంట్ తో..కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి చిన్ని చిన్నివాటికే బేజారైపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖిరి ఆ జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితులకు దిగజారిపోతున్న నేటితరం యువతను చూస్తుంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్ మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం తీసుకోవటంతో తన 26 ఏళ్ల వయసులోనే మిల్లర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్ననాటే పెద్ద పేరు..ప్రేమలో పడటం..ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టులు వంటి పలు సమస్యలతో మిల్లర్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికే డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

ప్రియురాలు అరియానా గ్రాండే తనకు బ్రేఇకప్ చెప్పి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో ఎగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో విడిపోయినప్పటి నుండి మిల్లర్ తీవ్రంగా కృంగిపోయాడని..తన చివరి ఇంటర్వ్యూలో కూడా మిల్లర్ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

15:56 - September 8, 2018

హైదరాబాద్‌ : ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పలు సమస్యలను ఫేస్ చేస్తోంది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో విపక్షాలు కూడా ఎన్నికలలో అవలంభించాల్సిన వ్యూహాలపై..పొత్తులపైనా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ.టీడీపీపై యోచించేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ..పార్టీల విధి విధానాలపై నేతలతో ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, కో దండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని.. తెదేపా బలం చెక్కు చెదరలేదని..ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో తెదేపాకు వన్నె తగ్గలేదన్నారు. వారి అభిమానమే పార్టీకి తరగని ఆస్తి అనీ..కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఎప్పటికీ తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 

14:44 - September 8, 2018

కృష్ణా : విజయవాడలో విషాదం నెలకొంది. అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ చిట్టినగర్ లో నివాసముంటున్న రవికిరణ్...అమరావతిలో ఇల్లు నిర్మించానని చెప్పి తల్లిదండ్రుల దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు. ఇవాళ గృహప్రవేశం అంటూ బంధువులు, ఆప్తులకు తల్లిదండ్రులు కార్డులు పంచారు. తీరా చూస్తే అమరావతిలో ఇల్లు లేకపోవడంతో తల్లిదండ్రులు కొడుకుని నిలదీశారు. ఇచ్చిన డబ్బులు ఏం చేశావని కొడుకును నిలదీశారు. కుమారుడు, తండ్రి మధ్య ఘర్షణ నెలకొంది. మనస్థాపానికి గురైన రవికిరణ్ అవమాన భారంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.  

 

13:46 - September 8, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై కొండా సురేఖ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. జాబితాలో తన పేరును ప్రకటించకపోవండపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్రమనస్థాపాన్ని వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేశారు. నాలుగు సార్లు వరుసుగా గెలిచిన తనను ఆపడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ లో 12 టిక్కెట్లు ప్రకటించి తనను మాత్రమే ఎందుకు ఆపారని నిలదీశారు. 'పార్టీలో మేం చేసిన తప్పేంటి ? మేం చేసిన నష్టమేంటీ ?' అని అడిగారు. తనకు టికెట్ ఇవ్వనందుకు స్పష్టంగా సమాధానం చెప్పాలన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం అంటే బీసీలను అవమానపరచడమేనని స్పష్టం చేశారు. ఎవరి ప్రభావంతో తనకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరి సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలన్నారు. బీఫామ్ ఇచ్చిన వారికి నూటికి నూరుపాళ్లు సీటు ఇస్తామని చెప్పాలన్నారు. ఇప్పుడు ప్రకటించిన 105 మందికీ బీ.ఫాం ఇస్తారా? అని ప్రశ్నించారు. 105 మంది జాబితాలో ఎన్నికల నాటికి సగం మందిని లేపేస్తారని పేర్కొన్నారు. 
కేటీఆర్ పై విమర్శలు 
కేటీఆర్ పై సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ ద్వారానే తాము టీఆర్ ఎస్ లో చేరామని... కానీ కేటీఆర్ తమకు ఏ రోజూ అండగా నిలబడలేదన్నారు. తమకు అన్యాయం చేసింది కేటీఆరే అని ఆరోపించారు. కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్... తన వాళ్లకే మంత్రి పదువులు ఇచ్చుకుంటారని తెలిపారు. అందుకే తమలాంటి వాళ్లను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
పొమ్మనలేక పొగబెడుతున్నారు... 
తమ ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తమ అనుచరులపైనే రౌడీ షీట్లు తెరిపించారని పేర్కొన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని..'మమ్మల్ని పొమ్మనలేక పొగబెడుతున్నారు' అని వాపోయారు. తనకు గానీ, తన కుమార్తెకు గానీ ఎవరో ఒకరికే టికెట్ ఇస్తామన్నారని తెలిపారు. భూపాలపల్లి ఇవ్వడం కుదరదు, పరకాకల ఇస్తామన్నారని చెప్పారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తామన్నామని తెలిపారు. వరంగల్ ఈస్ట్ కే టికెట్ ఇవ్వమని చివరగా చెప్పామన్నారు. భూపాలపల్లిలో మధుసూదనాచారికి టికెట్ ఇవ్వకపోతోనే తమకివ్వమని చెప్పామని తెలిపారు. భూపాలపల్లిలో మధుసూదనాచారిపై వ్యతిరేకత ఉందన్నారు. తమ సపోర్టుతోనే మధుసూదనాచారి గెలిచారని పేర్కొన్నారు. 
పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా?  
తనపై ఒత్తిడి చేసి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట మేరకు వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. వరంగల్ ఎంపీ సీట్ నుంచి కడియం నిలబడితే ఖర్చంతా తామే పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తామే ఖర్చు పెట్టామని తెలిపారు. ఆయన ముద్దై, పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా? అని ప్రశ్నించారు. 
తెలంగాణ.. కల్వకుంట్ల వారి ఇల్లు కాదు...
తనకు మంత్రి పదవి, మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనకు, మురళికి బిఫామ్ లు తప్ప టీఆర్ ఎస్ నుంచి తమకేమీ రాలేదన్నారు. మమ్మల్ని వ్యతిరేకించే ఎర్రబెల్లిని పార్టీలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకునేటప్పుడూ తమకు చెప్పలేదన్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్ ఎస్ చరిత్రలో నిలిచిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై వివరణ వచ్చాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఉన్నంత వరకు తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎక్కడైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటామన్న విషయంపై బహిరంగ ప్రకటన చేస్తామని చెప్పారు. వారు తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

 

13:12 - September 8, 2018

హైదరాబాద్ : కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ ద్వారానే తాము టీఆర్ ఎస్ లో చేరామని తెలిపారు. కానీ కేటీఆర్ తమకు ఏ రోజూ అండగా నిలబడలేదన్నారు. తమకు అన్యాయం చేసింది కేటీఆరే అని ఆరోపించారు. కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్... తన వాళ్లకే మంత్రి పదువులు ఇచ్చుకుంటారని తెలిపారు. అందుకే తమలాంటి వాళ్లను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

12:49 - September 8, 2018

హైదరాబాద్ : తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. నాలుగు సార్లు వరుసుగా గెలిచిన తనను ఆపడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ లో 12 టిక్కెట్లు ప్రకటించి తనను మాత్రమే ఎందుకు ఆపారని నిలదీశారు. 'పార్టీలో మేం చేసిన తప్పేంటి ? మేం చేసిన నష్టమేంటీ ?' అని అడిగారు. 

12:40 - September 8, 2018

హైదరాబాద్ : తనపై ఒత్తిడి చేసి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని కొండా సురేఖ పేర్కొన్నారు. కేసీఆర్ మాట మేరకు వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. వరంగల్ ఎంపీ సీట్ నుంచి కడియం నిలబడితే ఖర్చంతా తామే పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తామే ఖర్చు పెట్టామని తెలిపారు. ఆయన ముద్దై, పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి, మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనకు, మురళికి బిఫామ్ లు తప్ప టీఆర్ ఎస్ నుంచి తమకేమీ రాలేదన్నారు. 

12:14 - September 8, 2018

హైదరాబాద్ : కేటీఆర్ పై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ప్రకటించకపోవడం బాధ కలిగించిందన్నారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ మహిళగా తనను అవమానించారని ఆవేవన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ లో భారీ మెజార్టీతో గెలిచినా తనను పక్కన పెట్టారని వాపోయారు. పరకాల టికెట్ ఇస్తేనే టీఆర్ఎస్ లోకి వస్తామని చెప్పామని తెలిపారు.

 

10:39 - September 8, 2018

హైదరాబాద్‌ : కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని బఫూన్‌ అని కేసీఆర్‌ విమర్శించటంపై ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా మండిపడ్డారు. కేసీఆర్ పై కుంతియా త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఉద్ధేశించి కుంతియా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సచివాలయానికి వెళితే చస్తావని జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి నాలుగేళ్లుగా ఆ గడపదొక్కని బఫూన్‌ ప్రపంచంలో కేసీఆర్‌ ఒక్కడేనని ఘాటుగా విమర్శించారు. 'నెల వ్యవధిలోనే మోదీని 3సార్లు కలిశావు కదా? రాష్ట్రానికి ఏం సాధించావు? పోలవరంలా ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా సాధించావా?' అని నిలదీశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్‌ఎ్‌సను విలీనం చేస్తానని సోనియాగాంధీ పాదాలకు మొక్కలేదా? అని ప్రశ్నించారు. సురేశ్‌రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రె స్‌కు వచ్చే నష్టమేమీ లేదని కుంతియా స్పష్టం చేశారు. 
కేసీఆర్ ది దిగజారుడు భాష : ఉత్తమ్‌ 
'కేసీఆర్‌ దొంగ పాసుపోర్టుల వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనది దిగజారుడు భాష’అంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీని, మాజీ ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్‌ది కాదన్నారు. 'కేసీఆర్‌ది పూర్తిగా దిగజారుడు భాష. ఆయన భాషను చూశాక ‘కేసీఆర్‌ గారు' అంటూ సంబోధించాల్సిన అవసరం లేదు. సీఎం పదవికి ఆయన అనర్హుడని ప్రజలు భావిస్తున్నారు’అని అన్నారు. శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు పట్టిన శని వదిలిందన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. బీసీల ఆత్మగౌరవమని మాట్లాడే కేసీఆర్‌ తన నాలుగేళ్ల పాలనలో ఒక్క కులసంఘానికి చెందిన భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

 

10:14 - September 8, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఓ రిసార్ట్స్ పై పోలీసులు దాడి చేశారు. రంపచోడవరం మండలంలోని ఏ1 రిసార్ట్స్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో రంపచోడవరం పోలీసులు రిసార్ట్స్ పై దాడి చేశారు. 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో 22 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

09:50 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు తెరలేసింది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ సమీకణలు శరవేగంగా మారుతున్నాయి. అసలు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌... నమ్మకమే జీవితమన్నది ఆయన సూత్రం. అయితే తన మీద, తన పనితీరు మీద కాకుండా జాతకాలు, తిథులు, నక్షత్రాలు, రాశుల మీద నమ్మకం పెట్టుకోవటం ఆయన రివాజు. వాటి ప్రకారం నడుచుకోవటం.. నిర్ణయాలు తీసుకోవటమే కేసీఆర్‌కు పరమావధి. శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు, జాతకాలపై ఉన్న నమ్మకం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఫామ్‌హౌజ్‌లో చండీయాగం చేయటంతోపాటు ఇతర యాగాలను నిర్వహించటం, తెలంగాణతోపాటు ఏపీలోని పలు దేవాలయాలను సందర్శించి.. అక్కడి దేవుళ్లకు మొక్కులు చెల్లించటం, ఇందుకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వెచ్చించటం తదితర పరిణామాలన్నీ ఈ కోవలోకి చెందినవే. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులను కలిసినప్పుడు ఆయన అనేకమార్లు వారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన విషయం విదితమే. 
పక్కా ప్రణాళిక ప్రకారం శాసనసభ రద్దు
గురువారం గవర్నర్‌ను కలిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'రాష్ట్రం బాగు కోసమే...' శాసనసభను రద్దు చేశామంటూ కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ 'జాతకాలు, నమ్మకాలే...' ఇందుకు కారణమన్నది నిర్వివాదాంశం. ఆ రోజు ప్రగతి భవన్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ముందు కేసీఆర్‌ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం.. జాతకాన్ని చూసుకునే కేసీఆర్‌ శాసనసభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు సెప్టెంబరులోనే ఆయన సభను రద్దు చేయటానికిగల కారణాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత కరీంనగర్‌గా ఎంపీగానూ పనిచేసిన కేసీఆర్‌.. ఉప ఎన్నికల సందర్భంగా ఆయా పదవులకు రాజీనామా చేసింది కూడా సెప్టెంబరులోనే. అంటే ఆ నెల తనకు బాగా అచ్చొచ్చిందని ఆయన భావించారు. అందుకనుగుణంగానే సెప్టెంబరులోనే సభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఆయన అపర చాణుక్యుడు.. మంచి వ్యూహకర్త అంటూ మీడియా ఆకాశానికెత్తేసిన తరుణంలో... వీటికంటే మించి పలు పథకాల్లోని వైఫల్యాలే కేసీఆర్‌ను ముందస్తుకు వెళ్లేలా ముందుకు నెట్టాయని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు.
ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత 
పైకి కేసీఆర్‌ ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నా అనేక ప్రతిష్టాత్మక పథకాలు పూర్తి కాకపోవటం ఆయన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని సమాచారం. దీనికితోడు పదిహేను రోజులకొకసారి, నెల రోజులకొకసారి వాటిపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించటం.. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించటం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇదే సమయంలో వాటిని పూర్తి చేసేందుకు నిర్దిష్టంగా కొన్ని తేదీలను కూడా ఆయన ప్రకటించేవారు. గత నెలలో మిషన్‌ భగీరథ మీద ఆయన రివ్యూ నిర్వహించారు. ఆగస్టు 15 అర్థరాత్రి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందిస్తామంటూ ఆ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు ఆయన నోరెత్తటం లేదు. రాజీనామా అనంతరం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన దాని గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. దీంతోపాటు పెన్షన్ల పంపిణీ కూడా కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని భారీ స్థాయిలో పెంచిన సంగతి తెలిసిందే. తొలుత ప్రతినెలా మొదటి వారంలో చేతికందిన పెన్షన్లు.. ఇప్పుడు చివరి వారానికిగానీ రావటం లేదన్నది బాధితుల ఆవేదన. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్య కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్ద ఇబ్బందిగా మారింది. షరా మామూలుగా దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, లక్షలాది ఉద్యోగులు... ఇవన్నీ తీరని సమస్యలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇది ఇంకా పెరగకముందే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్‌ యోచించారు. అందులో భాగంగానే ఆర్నెళ్ల క్రితం నుంచే తన పరివారంతో సమాలోచనలు జరిపారు. తనకు జాతకాల మీదున్న నమ్మకంతో పక్కా వ్యూహం ప్రకారం.. సెప్టెంబరులోనే శాసనసభను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్‌ను లోన మాత్రం పథకాల వైఫల్యాల భయం వెంటాడుతున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సంఖ్యా శాస్త్రం దృష్ట్యా కూడా కేసీఆర్‌ 'ఆరు' అనే అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఈ క్రమంలోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. ఇక్కడ ఒకటి, సున్న, ఐదులను కలిపితే 'ఆరు' వస్తుంది. ఈ జాబితాను ప్రకటించిన తేదీ కూడా ఆరే కావటం గమనార్హం.

 

09:25 - September 8, 2018

తూర్పు గోదావరి : ఓట్లేశారు.. కానీ వారి పాట్లు పట్టించుకునే వారే కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఎవరికి ఓటేయాలో కూడా తెలియని సందిగ్ధంలో పడ్డారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపేయడంతో ఇప్పుడు 6మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల పరిస్థితి ఆయోమయంగా ఉంది.
తెలంగాణలోని ఆరు మండలాలు ఏపీలో విలీనం
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణాకి చెందిన భద్రాచలం డివిజన్ లోని ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరిలో విలీనం చేయగా, చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాలను తూర్పు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకి రాకుండా కేంద్రం ఆర్డినెన్స్ రూపంలో తీసుకున్న ఈ నిర్ణయానికి తాను పట్టుబట్టడమే కారణమని చంద్రబాబు అప్పట్లో పదే పదే చెప్పుకున్నారు.
గందరగోళంగా ఆ నియోజకవర్గాల పరిస్థితి 
ఐతే.. నాలుగేళ్లు గడిచిపోయినా ఆ నియోజకవర్గాల పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో ఓట్లేసిన వారిని ఏపీలో కలిపేయడంతో అటు తెలంగాణా నుంచి నిధులు రాక, ఇటు ఏపీ సర్కారు పట్టించుకోక రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. చివరకు విద్య, వైద్య అవసరాలు తీర్చడానికి కూడా తగిన నిధులు లేకపోవడంతో మన్యం వాసులు నరకం అనుభవించారు. వచ్చే ఎన్నికల తర్వాతైనా తమకు కొంత ఉపశమనం దక్కుతుందని ఆశించిన విలీన మండలాల ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరింత షాక్‌నిస్తున్నాయి. తాజాగా తెలంగాణా అసెంబ్లీ రద్దయ్యింది. ఎన్నికలకు సిద్దమవుతోంది. దీంతో భద్రాచలం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చింతూరు డివిజన్ జాబితాను చేర్చడం కలకలం రేపుతోంది. తమను మళ్లీ తెలంగాణాలో ఓటేయాలని చెప్పడం ఏవిధంగా సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చివరకు రద్దయిన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సున్నం రాజయ్య కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. విలీన మండలాల ప్రజల ఓట్లను ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేర్చడంలో చేసిన జాప్యం కారణంగానే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నాయి. 
విలీన మండలాల వ్యవహారంపై అస్పష్టత
విలీన మండలాల వ్యవహారంలో స్పష్టత లేకపోవడం చాలామందిని గందరగోళానికి గురి చేస్తోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని రెవెన్యూ పరంగా ఏపీలో ఉన్న మండలాల ఓట్లను ఏపీలోనే కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి భిన్నంగా ఓట్లను తెలంగాణా అసెంబ్లీకి వేసి, పాలన ఏపీలో అంటే ఎటూ కానివాళ్లుగా ముంపు మండలాల ప్రజలు మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

09:01 - September 8, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన ఎన్నికల అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడానికి కారణం ఏంటి ? కొండా సురేఖ విషయంలో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమేంటి? ఇంతకు టీఆర్‌ఎస్‌లో కొండా సురేఖ పరిస్థితి ఏంటి? కొండా దంపతుల దారెటు? 

ఫైర్ బ్రాండ్ గరమ్

తెలుగు రాష్ట్రాలలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ ప్రస్తుతం వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అసెంబ్లీ రద్దుతో ఎమ్మెల్యేలంతా తాజా మాజీలయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. ఈ లిస్ట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 12 నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను.. అందులోనూ అందరూ సిట్టింగులనే ప్రకటించారు. కేవలం వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పేరును  పెండింగ్‌లో పెట్టారు. అసలు తూర్పు టికెట్ ప్రకటించకపోవడం వెనుక ఏం జరిగిందంటూ అటు కొండా అనుచరుల్లో, ఇటు తూర్పు నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా కొండా సురేఖకు టికెట్ కేటాయించకుండా పెండింగ్ పెట్టడమంటే వారికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది.
తనకు, తన కూతురికి టిక్కెట్లు ఇవ్వాలన్న కొండా సురేఖ? 
కొండా సురేఖ ఈసారి తనకు , తన కూతురికి టిక్కెట్లు ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. పరకాల, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలు తమకు వదిలివేయాలని కోరినట్టు సమాచారం. అందుకు గులాబీబాస్‌ సుముఖత వ్యక్తం చేయనట్టుగా తెలుస్తోంది. కొత్తగా వారసుల పేర్లను ఇప్పట్లో ప్రకటించేది లేదని.. తూర్పులో పోటీ చేస్తారా లేదా అని అడిగినట్టు సమాచారం. అందుకు ఇస్తే.. రెండు టిక్కెట్లు ఇవ్వాలని.. లేకుంటే తమకు వేరే దగ్గరి నుంచి ఆఫర్స్‌ వస్తున్నట్టు సురేఖ స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్‌ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. 
మళ్లీ సొంతగూటికి కొండా దంపతులు  
తమ డిమాండ్‌కు గులాబీబాస్‌ అంగీకరించకపోవడంతో రాజకీయ భవిష్యత్‌పై కొండా దంపతులు దృష్టి సారించారు. పార్టీ మారాలా ... వద్దా అన్నదానిపై అనుచరులతో సమావేశమయ్యారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో దాదాపు దారులు మూసుకుపోవడంతో కొండా దంపతులు కాంగ్రెస్‌తో టచ్‌లోకొచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనకు, తన కూతురికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నుంచి కొండా సురేఖ, పరకాల నుంచి తన కూతురు సుస్మితకు టిక్కెట్ల కావాలని కోరినట్టు సమాచారం. దీనికి కాంగ్రెస్‌ పెద్దలు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొండా దంపతులు మళ్లీ సొంతగూటికి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈనెల 12న కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌.. తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండా దంపతులు ఆజాద్‌ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. 

 

08:40 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని, డిసెంబర్‌లో ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ అంటున్నారని.. కానీ డిసెంబర్‌లో మాకు మద్దతు ఇచ్చేది ఎవరని నేను అడుగుతానని అక్బరుద్దీన్‌ అన్నారు. కర్నాటకలో కుమారస్వామి సీఎం అయినప్పుడు ఇక్కడ తానెందుకు ముఖ్యమంత్రిని కాలేనని ప్రశ్నించారు. 

08:20 - September 8, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఉప్పు నిప్పులా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్. అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ఏకమవుతున్నాయి. దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు... తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా ఏకమై ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపన 
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో...కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తో తలపడింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత....తెలుగుదేశం పార్టీ బలహీన పడింది. అటు కాంగ్రెస్‌ పార్టీ సైతం కేసీఆర్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయ్. 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉంటుందంటూ చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.  వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో టీడీపీతో పాటు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తుపై అటు టీడీపీ కూడా సానుకూలంగానే ఉంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడితో టీటీడీపీ నేతలు చర్చలు జరిపారు. భావస్వారూప్యం ఉన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగుతామంటూ టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... శనివారం టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఇందులో కాంగ్రెస్‌తో పొత్తుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రీ సవ్యంగా కొనసాగుతుందో ? లేదో ? చూడాలి. 

 

 

07:58 - September 8, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ ఎస్... విపక్ష పార్టీలను మరింత బలహీనం చేసే పనిలో పడింది. మరోసారి టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రం ప్రయోగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్‌కు మరోషాక్‌ ఇచ్చింది. అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజునే... కాంగ్రెస్‌ నేతలను కారెక్కించుకునేలా పావులు కదిపి విజయంవంతం అయ్యింది.
ప్రతిపక్ష పార్టీలపై పైచేయి సాధించాలన్న వ్యూహం 
ఎన్నికల వేడి రాజుకున్న తెలంగాణాలో అధికార పార్టీ మరో సారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ప్రతిపక్ష పార్టీలపై  మాసికంగా పై చేయి సాధించాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. తొలిసారి అధికార పగ్గాలు దక్కించుకున్న గులాబి పార్టీ....ఆ వెంటనే పెద్ద ఎత్తున విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుని  ఆ పార్టీలు కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. 63 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో అడుగు పెట్టిన టీఆర్ ఎస్.. తన సంఖ్యా బలాన్ని 90 కి పెంచుకుంది.  టిడిపి, కాంగ్రెస్,  వైసిపి, సిపిఐ, సమాజ్ వాది పార్టీలకు  చెందిన శాసనసభ్యులు  అధికార పార్టీలో చేరారు. .
టీఆర్ ఎస్ గూటికి సురేష్‌రెడ్డి 
మొన్నటికి మొన్న అసెంబ్లీని రద్దు చేసిన గులాబీపార్టీ..  మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను కారెక్కించుకుంటే ఆ ప్రభావం ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందన్న ధీమాలో అధికార పార్టీ ఉంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి దానం నాగేందర్‌ను కారెక్కించుకున్న గులాబీ బాస్‌... ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నేత, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. సురేష్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణా గత నాలుగేళ్లుగా అభివృద్ధిలో దూసుకు పోతుందని, అభివృద్ధికి ఎక్కడా ఆటంకం కలుగరాదన్న అభిప్రాయంతో తాను టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు సురేష్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి కొంత మంది నేతలతోనే అధికార పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మరికొంతమంది నేతలు గులాబి గూటికి చేరడం ఖాయమన్న ధీమా అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

07:41 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. సుప్రీం కోర్టు 2002లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రద్దైన అసెంబ్లీకి త్వరగా ఎన్నికలు నిర్వహించడాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తైన వెంటనే ఎలక్షన్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. అటు కేంద్రం నుంచి ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 11న హైదరాబాద్ కు రానున్నారు.
అసెంబ్లీ రద్దయితే వీలైనంత త్వరలో ఎన్నికలు 
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఈనాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ఓపి రావత్‌ ఢిల్లీలో తెలిపారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు నిర్వహించాలన్న దానిపై చట్టంలో ప్రత్యేక నిబంధన అంటూ ఏదీ లేదన్నారు. ఎప్పుడైనా అసెంబ్లీ రద్దయితే వీలైనంత త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని సుప్రీంకోర్టు 2002లో రూలింగ్‌ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి అనవసరంగా లాభం చేకూర్చవద్దని... 6 నెలల సమయముందని అన్ని రోజులు పాలన చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టమైన రూలింగ్‌ ఇచ్చిందని రావత్‌ స్పష్టం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్‌
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి బేగంపేటలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబిత సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల ఏర్పాట్లు, బూత్‌ లెవర్‌ ఆఫీసర్ల నియామకంపై చర్చించారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకుంటాయని రజత్‌కుమార్ తెలిపారు. 
ఈనెల 11న హైదరాబాద్ కు ఈసీ అధికారులు
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే అవకాశాలున్నాయి.

 

07:06 - September 8, 2018

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్ లో చేరిన వివిధ పార్టీల నేతలకు ఆశాభంగం కల్గింది. వలస నేతల ఆశలు ఆవిరయ్యాయి. సీటు పక్కా అనుకుని పార్టీలో చేరిన నేతలకు కేసీఆర్ మొండిచెయ్యి చూపించారు. వారు కన్నకలలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. టికెట్‌ గ్యారంటీ అనుకొని కొందరు చేరితే..పక్కా హామీతోనే మరికొందరు టీఆర్ ఎస్ లో చేరారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన 105 స్థానాల్లో వారి పేర్లు గల్లంతయ్యాయి. దీంతో వాళ్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. సొంత పార్టీలో ఉన్నా టికెట్‌ దక్కేదేమో? అని ఇప్పుడు వాపోతున్నారు. కారు పార్టీలో టికెట్‌ ఖరారు కాకపోవడంతో పలువురు నేతల్లో అంతర్మథనం మొదలైంది. అటూ ఇటూ కాకుండా పోయామేమో? అని అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. కొందరు మాత్రం చివరి నిమిషం వరకు చూద్దామని ఆశతో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనే అయింది గానీ, బీ ఫాం ఇవ్వలేదనుకొని, తమదైన రీతిలో అధిష్ఠాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ నేతలకు టికెట్లు దక్కపోవడంతో ఆయా నేతల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, సీపీఐ, కాంగ్రెస్‌ తరఫున 2014 ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్‌ఎ్‌సలో చేరిన ఎమ్మెల్యేలందరికీ పార్టీ టికెట్‌ ఇస్తున్నామని కేసీఆర్‌ గురువారం ప్రకటించారు. తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నుంచి నేతలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు. వారిలో నల్లగొండ జిల్లా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు పలుచోట్ల నేతలకు టికెట్‌ దక్కలేదు.
ఉమామాధవరెడ్డి, సందీప్ రెడ్డికినిరాశ 
ఉమ్మడి నల్లగొండ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన ఉమామాధవరెడ్డిని ఆలేరు లేదా భువనగిరి నుంచి బరిలో దింపుతారని ప్రచారం జరిగినా ఆమెకు ఎక్కడా టికెట్‌ దక్కలేదు. ఆమె కుమారుడు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు తనదే హామీ అని కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఆయనకూ టికెట్‌ దక్కలేదు. నాగార్జునసాగర్‌ టికెట్‌ ఆశించి గులాబీ గూటికి చేరిన సీఎల్పీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు ఎంసీ కోటిరెడ్డికి అవకాశం దక్కలేదు. పీఆర్పీ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్నా మిర్యాలగూడ నుంచి అమరేందర్‌రెడ్డి ఓడిపోయారు. ఆయనపై విజయం సాధించి టీఆర్‌ఎస్ లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకే టికెట్‌ దక్కింది. 

 

Don't Miss