Activities calendar

15 September 2018

22:09 - September 15, 2018

శ్రీకాకుళం : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గదామమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 16 లక్షల కోట్ల ఎంవోయూలు కుదిరాయని.. 32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం అన్నారు. జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఐదారు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో మొదటి స్థానంలో వస్తున్నామని.. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 

21:56 - September 15, 2018

వరంగల్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బస చేసిన గెస్ట్‌హౌస్‌ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ముట్టడించారు. భారీగా తరలివచ్చి బైఠాయించారు. అయితే.. ఇది ఆయనకు వ్యతిరేకంగా కాదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టి.రాజయ్యకు పార్టీ కేటాయించిన టికెట్‌ను రద్దు చేయాలని, కడియమే అక్కడి నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. కార్యకర్తలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ని కోట్లు ఇచ్చినా మీ అభిమానాన్ని కొనలేమన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. కొన్ని కారణాల వల్ల స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రత్యక్షంగా సేవచేయలేకపోయానన్నారు. కేసీఆర్ అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారన్నారు. 

 

21:16 - September 15, 2018

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లాలో ఓ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. చిరాయాకోట్ పట్టణంలో మూడేళ్ల బాబు గత మూడు రోజులుగా కన్పించడం లేదు. పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేయగా, ఓ మహిళ తన బాబు హార్ట్ సర్జరీ కోసం ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. సదరు మహిళ పిల్లవాడు దీర్ఘకాలంగా గుండెజబ్బుతో బాధపడుతుండగా..డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో తన కుమారుడి సర్జరీ ఖర్చు కోసం రెండున్నరేళ్ల పిల్లవాడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపింది.

 

20:50 - September 15, 2018

ఢిల్లీ : కేంద్ర ఈసీ ముందు కాంగ్రెస్‌ పలు అభ్యంతరాలను లేవనెత్తింది. తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. వాటిని సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 30 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని.. 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. 2019 జనవరి 4కి సవరించిన ఓట్ల జాబితా విడుదల కానుందని...అప్పటివరకు ఎన్నికలకు వేచి చూడాలని ఈసీని కోరారు. 

 

19:53 - September 15, 2018

హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు చేశారు. అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆయనపై అసదుద్దీన్‌ ట్వీటర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్నఐదు స్థానాలను కూడా బీజేపీ మళ్లీ ఎన్నికల్లో గెలవలేదని పేర్కొన్నారు. పెట్రోల్‌ ధరల నియంత్రణ, యువతకు ఉద్యోగ కల్పనపై బీజేపీ తమ నిర్ణయాలను వెల్లడించాలన్నారు.

 

18:37 - September 15, 2018

న్యూఢిల్లీ: హర్యానాలో మూడు రోజుల క్రిందట సీబీఎసీ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన 19 ఏళ్ల విద్యార్ధిని సామూహిక అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఓ ఆర్మీ జవాన్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నారు. పంకజ్ ఫౌజీ అనే ఆర్మీ జవాన్ ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు. అతనిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందం రాజస్థాన్ చేరుకుంది. మిగతా ఇద్దరు మనీష్, అతని స్నేహితుడు నీషు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు బాధితురాలికి పరిచయము ఉన్నవారేనని పోలీసులు తెలిపారు.

సామూహిక మానభంగం జరిగి మూడురోజులైనా ఇంతవరకు కేసు ముందుకు కదలలేదు. ఈ కేసుకు సంబంధించి ఏ సమాచారం ఇచ్చినా.. వారికి రూ. లక్ష రూపాయల నజరానా ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. 

పందోమ్మిది ఏళ్ల విద్యార్థినిని ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి ఆమె స్పృహ తప్పిపోయేవరకు సామూహికంగా మానభంగం చేసి బాధితురాలిని బుధవారం నాడు బస్ స్టేషన్ వద్ద వదిలేసి పారిపోయారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ శనివారం మీడియాకు వివరించారు. దీనికోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు ఆయన తెలిపారు.   

            బాధితురాలు కథనం ప్రకారం తన గ్రామానికి దగ్గరలోని కోచింగ్ సెంటర్ కు వెళుతుండగా.. ముగ్గురు వ్యక్తలు తనను కిడ్నాప్ చేసి పొలాల్లోకి లాక్కెళ్లి.. అక్కడ మానభంగం చేసారని తెలిపింది. అంతకు ముందు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించినట్టు ఆమె పేర్కొంది. సంచలనం కలిగించిన ఈ సంఘటనపై రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

18:30 - September 15, 2018

మహబూబ్ నగర్ : టీఆర్ ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందని అమిత్ షా నిలదీశారు. ఎవరికి భయపడి 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడానికి వేళ్లేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్  ఇవ్వాలన్నారు. 2014లో గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు..కానీ సీఎం సీట్లో ఎవరు ఉన్నారు?  ప్రశ్నించారు. 

 

18:16 - September 15, 2018

మహబూబ్ నగర్ : తెలంగాణలో ఎన్నికలు వచ్చే మే లో జరగాలి కానీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మే లో ఎన్నికలు జరిగితే గెలుస్తామని కేసీఆర్ కు నమ్మకం లేదని తెలిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో షా మాట్లాడుతూ ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే గెలుస్తారా అని ప్రశ్నించారు. ఓవైసీకీ భయపడే కేసీఆర్.. సెప్టెంటర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు.  బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందా ? లేదా ? అని అన్నారు. 

 

17:31 - September 15, 2018

నల్గొండ : మిర్యాలగూడలో నిన్నజరిగిన యువకుడు ప్రణయ్ హత్య కలకలం సృష్టిస్తోంది. తన తండ్రే ప్రణయ్ ను హత్య చేయించారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. హంతకుడైన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్యకు ముందు అనేక సార్లు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని వాపోయింది. 

మిర్యాలగూడలో ప్రణయ్ దారుణహత్యకు గురయ్యాడు. ఆరు నెలల క్రితం కోటీశ్వరుడైన మారుతిరావు కుమార్తె అమృతను ప్రణయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే గర్భవతి అయిన భార్యను నిన్నఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందాడు.   

 

16:39 - September 15, 2018

న్యూఢిల్లీ: హర్యానాలో మూడు రోజుల క్రిందట సీబీఎసీ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన 19 ఏళ్ల విద్యార్ధిని సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు చతికిలపడిపోయారు. మూడురోజులైనా ఇంతవరకు ఒక్క క్లూను సేకరించలేక రాష్ట్ర పోలీసులు చేతులెత్తేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ సమాచారం ఇచ్చినా.. వారికి రూ. లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు.

          19 ఏళ్ల విద్యార్థినిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి ఆమె స్పృహ తప్పిపోయేవరకు సామూహికంగా మానభంగం చేసి బాధితురాలిని బుధవారం నాడు బస్ స్టేషన్ వద్ద పడేసి పారిపోయారు. ముగ్గురు వ్యక్తులు ఈ అకృత్యానికి పాల్పడ్డారని అందులో ఒకరు ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.  ఆ ముగ్గురు బాధితురాలికి తెలిసిన వ్యక్తులే అయిఉండవచ్చని భావిస్తున్నారు. నిందుతులను త్వరలోనే పట్టుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ శనివారం మీడియాకు వివరించారు.  

            బాధితురాలు కథనం ప్రకారం తన గ్రామానికి దగ్గరలోని కోచింగ్ సెంటర్ కు వెళుతుండగా.. ముగ్గురు వ్యక్తలు తనను కిడ్నాప్ చేసి పొలాల్లోకి లాక్కెళ్లి.. అక్కడ మానభంగం చేసారని తెలిపింది. అంతకు ముందు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించినట్టు ఆమె పేర్కొంది. సంచలనం కలిగించిన ఈ సంఘటనపై రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

16:14 - September 15, 2018

హైదరాబాద్ : నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అనునిత్యం ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్నపిల్లలను సైతం వదలం లేదు. రోజు రోజుకూ మానవత్వం మంటగలిసి పోతోంది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయినా ఓ కామపిశాచి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని ఆజాన్ ఇంటర్నేషన్ స్కూల్ లో ఐదేళ్ల బాలికపై స్కూల్ ఉద్యోగి జిలానీ అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. నిందితున్ని ఉరితీయాలంటూ ఆందోళన చేపట్టారు.  

 

15:34 - September 15, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిటీల ఏర్పాటుపై స్ర్కీనింగ్ కమిటీ దృష్టి సారించింది.  ఎన్నిక లకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ప్రచార, సమన్వయ, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటుపైనా చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నిన్న ముగ్గురు సభ్యులతో రాహుల్ గాంధీ స్ర్కీనింగ్ కమిటీని వేశారు. భక్తచరణ్ అధ్యక్షతన జ్యోతిమని సెంథిమలై, శర్మిష్ఠ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. 
ప్రచార కమిటీ బాధ్యతలపై కాంగ్రెస్ లో పోటీ పెరిగింది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిలు ప్రచార కమిటీ బాధ్యతలు కోరుతున్నారు. ప్రచార కమిటీ ఆశావహుల్లో కోమటిరెడ్డి, వి.హెచ్, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ చేరుకున్నారు. 
రాష్ట్రంలో పొత్తులపైనా తుది నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. మహాకూటమి పార్టీలతో పొత్తుపై నిర్ణయానికి కాంగ్రెస్ కమిటీలు వేయయనుంది. కాంగ్రెస్, టీడీపీలు బలంగా ఉన్న స్థానాల జాబితాను రూపకల్పన చేయనున్నారు. టీడీపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలన్న అంశంపై ఢిల్లీ స్థాయిలో చర్చ చేస్తున్నారు. తుది నివేదికను రాహుల్ కు సమర్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. 

 

13:47 - September 15, 2018
నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు హైదరాబాద్ కు పరారయ్యారని సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు నగరానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఏ1 నిందితుడు మారుతీరావు, ఏ 2 నిందితుడు శ్రవణ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. 

మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని దుండుగులు అతి దారుణగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కుమార్తె అమృత తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని తండ్రి మారుతీరావు పగబట్టాడని...కిరాయి హంతకులతో హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం గర్భిణీ అయిన అమృతను ప్రణయ్ ఆసుపత్రి నుండి వచ్చారు. తిరిగి వెళుతుండగా నిందితులు మాటు వేసి కత్తితో పొడిచాడు. దీనితో ప్రణయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. అక్కడి నుండి అమృత..ప్రణయ్ తల్లి పరుగులు తీశారు. దీనికంతటికీ కారణం మారుతీరావే కారణమని ప్రణయ్ కుటుంబం ఆరోపించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
13:05 - September 15, 2018

వరంగల్ : జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీలో వర్గ విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లడం...105 నియోజకవర్గాలకు అభ్యుర్థులను ప్రకటించని సంగతి తెలిసిందే. కానీ టికెట్ ఆశించిన వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదిలా ఉంటే స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రం అభ్యర్థి రాజయ్య వద్దని కడియం రావాలని టీఆర్ఎస్ నేతలు...కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 

అభ్యర్థులను ప్రకటించిన అనంతరం జిల్లాకు రాని కడియం శనివారం అక్కడకు హన్మకొండకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కడియం అభిమానులు..టీఆర్ఎస్ నేతలు కడియం ఇంటి వద్దకు చేరుకోవాలని సోషల్ మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు. దీనితో పలువురు కార్యకర్తలు, నేతలు భారీగా కడియం ఇంటికి చేరుకున్నారు. హన్మకొండలోని ఓ విశ్రాంతి భవనం వద్దకు కడియం చేరుకున్నారని నేతలు, అభిమానులు తెలుసుకున్నారు. అక్కడకు ఒక్కరొక్కరుగా కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కడియం మాత్రం బయటకు మాత్రం రావడం లేదు. రాజయ్య వద్దు..కడియం ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. తప్పకుండా కడియం ఎమ్మెల్యే బరిలో నిలవాలని..లేనిచో కడియం కూతురినైనా బరిలో నిలపాలని డిమాండ్ చేస్తున్నారు. 

13:03 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లడారు. కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు..ప్రశ్నలు సంధించారు. జమిలి ఎన్నికలను కేసీఆర్ మొదట సమర్థించారని, కానీ ముందస్తుకు వెళ్లారని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజలప కోట్లాది రూపాయల భారం పడుతుందని..ఈ విషయం తెలిసినా ఎందుకు భారం మోపుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

రాజకీయ స్వార్థం కోసం కోట్ల రూపాయల ఖర్చు మోపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గంలోని ప్రతొక్క సీటుకు పోటీ చేస్తామని ప్రకటించారు. 2014-16 సంవత్సర కాలంలో బీజేపీ పటిష్టత్వానికి కృషి చేయడం జరిగిందని, ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ప్రతిష్ట పెరిగిందన్నారు. 

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితోనే కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణాను రజాకార్ల చేతుల్లోకి పెడుతారా ? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ పలు ప్రయత్నాలు చేశారని, ఇలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే ఇలాంటివి పునరావృతమవుతుందన్నారు. రాష్ట్రంలో మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పివి నరసింహరావు, అంజయ్యలను కాంగ్రెస్ అవమానాలకు గురి చేసిందన్నారు. 

దళితులకు కేసీఆర్ ఒక వాగ్ధానం ఇచ్చారని, ఈ విషయం దళితులు మరిచిపోలేరని తెలిపారు. 2018లో అలాంటి హామీని నెరవేరుస్తారా ? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు, అమరవీరులకు ఎన్నో హామీలిచ్చారని గర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించిందని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హామీ ఏమైందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలన్నారు. 

కేసీఆర్ పాలన చూసిన తరువాత మళ్లీ టీఆర్ఎస్ వస్తుందని అనుకోవడం లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడం లేదా ? తన కుటుంబం కోసం కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూంలు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, మూఢ నమ్మకంతో సచివాలయానికి వెళ్లకపోవడం సబబేనా ? నేరళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే దళితులను వేధించారని, మద్దతు అడిగిన రైతులని ఖమ్మంలో అరెస్టు చేయించారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కనీసం కేంద్ర పథకాలను కూడా ఉపయోగించుకోలేదన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఏమైంది ? అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాల కోసం రూ. 900 కోట్లు నిధులు, 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 16,597 కోట్లు...తెలంగాణకు అనేక విద్యా సంస్థలు మంజూరు...ఎయిమ్్స తో పాటు కొత్త వర్సిటీల మంజూరు చేయడం జరిగిందని అమిత్ షా వెల్లడించారు. 

 

12:42 - September 15, 2018

భోపాల్: అనాథ ఆశ్రమాల్లో జరుగుతున్న లైంగిక దాడులపై దేశం అట్టుడికిపోతుంటే.. అలాంటి మరో సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు తమను లైంగికంగా, శారీరకంగా హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలి 70 సఃవత్సరాలు మాజీ సైనికాధికారి సెక్స్ భాగోతం బయటపడింది.

ఆశ్రమంలో తలదాచుకుంటున్న పిల్లలు పోలీసులను కలిసే ముందు సామాజిక న్యాయ శాఖను ఫిర్యాదు చేసారు. ప్రయివేటు ఆశ్రమాన్ని నడుపుతున్న మాజీ సైనికాధికారిని అరెస్టు చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

బాధితుల కథనం ప్రకారం ఒక బాలుడు లైంగిక వేధింపుల అనంతరం అధిక రక్తస్రావం జరగటంతో మరణించగా.. మరో బాలుడు తలను గోడకేసి కొట్టడంతో మరణించాడు. ఇంకో విధ్యార్థి రాత్రంతా చలిలో ఆరుబయట నిలబెట్టడంతో అస్వస్థత పాలై మరణించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఆశ్రమం 1995 రిజిస్టర్ చేయగా.. ఇందులో 42 మంది బాలురు, 58 మంది బాలికలు 2003 నుంచి ఆశ్రయం పొందుతున్నట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. నలుగురు ఉపాధ్యాయులు ఆశ్రమ బాధ్యతలు చూస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని అనాథ బాలికల ఆశ్రమాల్లో పరిస్థితులపై విచారణ చేసి కొన్ని నిబంధనలను రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అనాథ ఆశ్రమాల్లో అక్రమాలు ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి.  

12:16 - September 15, 2018

పెళ్లయిన క్షణం నుంచి తుది శ్వాస దాకా తోడుగా ఉండే నేస్తంగా జీవిత భాగస్వామిని భావిస్తారు...భార్యా భర్తలు సంతోషంగా జీవించడం...కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండడం...దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా...ప్రస్తుతం అలాంటి పరిస్థితి అక్కడక్కడా కనిపించడం లేదు. చిన్నపాటి ఘటనలకే దంపతులు కీచులాడుకోవడం...సహకరించకపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. భూటాన్ మాజీ ప్రధాని పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

భూటాన్ మాజీ ప్రధాని త్సెరింగ్ టోబ్ గే సతీమణిని ఆయన భుజాలపై మోసుకెళుతున్నట్లు ఆ ఫొటో ఉంది. వారు నడుస్తూ వెళ్తున్న మార్గం బురదమయంగా ఉండడంతో భార్య కాళ్లకు మట్టి అంటకూడదని భుజాలపై మోసుకెళ్లారు. పోస్టులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. భార్య కోసం ఏమైతే చేయగలమో అది చేయాలని సూచించారు. తానేమీ సర్ వాల్టర్ రెలీ అంత గొప్పోడిని కాదని...క్వీన్ ఎలిజబెత్ 1 పాదాలకు బురద అంటకుండా వాల్టర్ రెలీ తన క్లోక్ (దుస్తులు)ను ఓ బురద గుంటపై పరిచి నడిపించిన సంగతి తెలిసిందే. 

11:36 - September 15, 2018

అక్కినేని వారి కొత్త కోడలు మరో సారి తన సత్తా చాటుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్.. మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సమంతా యూటర్న్ మూవీపై స్మాల్ రివ్యూ... 

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్కినేని కోడలు సమంత..తాజాగా యూ టర్న్ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో  టాలీవుడ్, కోలీవుడ్  ఆడియన్స్  ముందుకు వచ్చింది. కన్నడ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీని  తెలుగు, తమిళ లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు. పవన్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీలో, సమంత జర్నలిస్ట్‌గా, ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా నటించారు. మెయిన్ రోల్స్ లో భూమిక, రాహుల్ రవీంద్రన్ నటించారు.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలయిన  వెంటనే మంచి టాక్ వచ్చింది.. ఆడియన్స్.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. సినిమా స్టార్ట్ అయినా దగ్గరి నుండి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఉన్న  సస్పెన్సు ను పటా పంచలు చేస్తూ సమంత మరోసారి తన నటన తో ఆకట్టుకుంది. ఇక ఆది నటన గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండటంతో యూటర్స్ పాజటీవ్ టాక్ తో దూసుకుపోతుందీ మూవీ.

11:30 - September 15, 2018

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా కొన్ని పాటిస్తే పరిమళభరితం అవుతుంది. 
మసాలాలు కావచ్చు..మాడిన వాసనలు కావచ్చు...వాటితో ఇల్లంతా ఓరకమైన ఘాటు వాసన వస్తుంది కదా. అలాంటి సమయంలో స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూసి తేడాను గమనించండి. 
నాలుగు కర్పూరం బిళ్లల్లో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదంటే స్నానాల గదుల్లో ఉంచి చూడండి. ఈ వాసన అధికంగా ఉండడమే కాకుండా ఈగలు రాకుండా చేస్తుంది. 
వానాకాలంలో ప్రతి ఇంట్లో సాంబ్రాణీ పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలూ, క్రిమికీటకాలతో సహా అన్నీ దూరమవుతాయి. దుస్తులన్నీ ఒకే చోట పోగుపడి ఉండి..దుర్వాసన వెదజల్లుతుంటుంటే నిమ్..లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలను ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచండి.
ఒక అర బకెట్ నీళ్లు తీసుకుని అందులో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం కలిపి గదిలో కాస్త చల్లండి..గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది.
కిటికి అద్దాలు దుమ్ము పట్టి ఉంటే కప్పు వెనిగర్ కు చెంచా లావెండర్ ను జోడించాలి. ఓ బట్టను అందులో ముంచి కిటికిలను తుడిస్తే సరిపోతుంది.
కార్పెట్లు మురికిగా ఉంటే కప్పు బేకింగ్ సోడాకు చెంచాడు ఏదైనా సుగంధ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

11:10 - September 15, 2018

జీవితంలో ఆహారం అతి ముఖ్యమైంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతుండి, రాత్రి భోజనం తప్పకుండా చేయాలి. ఈ ఆహారాన్ని సమయానికి తినాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ కొంతమంది అలా చేయకపోతుండడంతో్ అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేళాపాలా లేకుండా ఆహారం తినడం అంత మంచిది కాదని పలువురు సూచిస్తుంటారు. ప్రధానంగా రాత్రి వేళల్లో చాలా మంది ఆలస్యంగా తింటారని పలు పరిశోధనల్లో తేలిందంట.

నిద్ర పోయే ముందు రెండు గంటల గ్యాప్ తో ఆహారం తినాలని, అతి కూడా అతిగా కాకుండా మితంగా తినాలని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువ తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర శాతం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు కొన్నేండ్ల పాటు లేట్ నైట్ జంక్ ఫుడ్ తినే వారిని పరిశోధించారు. పడుకొనే ముందు జంక్ ఫుడ్, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది.

10:46 - September 15, 2018

తిరునల్వేలి: బైక్ లో పెట్రోల్ నింపి బండి స్టార్ చేయగానే మంటలు అంటుకొవడంతో ఓ యువకుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ ఉదయం జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకస్మికంగా మంటలు అంటుకోవడంతో ఆ యువకుడు గాయాలయ్యాయి. ఈ సంఘటన పెట్రోల్ బంకులోని సీసీటీవీలో రాకార్డయ్యాయి. బంకులోని సహాయకులు ఆ యువకుడిని రక్షించి పక్కకు తరలించారు. కాలిన గాయాలతో అతనిని ఆసుపత్రికి తరలించారు.   

10:36 - September 15, 2018

భారీ బడ్జెట్ తో .. భారీ కాస్టింగ్ తో మెగా స్టార్ హీరోగా వస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి.. మెగా పవర్ స్టార్ నిర్మిస్తున్న ఈ మూవీలో మెగా డాటర్ కూడా ఓ రోల్ చేయబోతుందట. మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న మూవీ సైరాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి అదర్ లాంగ్వేజ్ స్టార్ యాక్టర్స్ అందరూ కనిపించబోతున్నారు. మెగా తనయుడు రాంచరణ్  నిర్మిస్తున్నఈ మూవీలో మరో మోగా ఫ్యామిలీ స్టార్ జాయిన్ అవ్వబోతున్నట్టు టాక్.

రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మెగా డాటర్ నిహారిక సైరాలో ఓ క్యారక్టర్ లో కనిపించబోతుందట. సైరాలో ఓ కథాకళి డాన్సర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నిహారిక పదినిమిషాల పాత్ర చేయనున్నరట. ఈ క్యారక్టర్ కోసం స్పెషల్ గా నిహారిక కథకళిలో ట్రైనింగ్ తీసుకుంటోందట. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటిస్తున్నఈ మూవీలో నిహారిక కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

‘ఒక మనసు’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నిహారికా కొణిదెల... అంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్ లలో కనిపించింది. ఆ తరువాత సుమంత్ అశ్విన్ కాంబోలో ‘హ్యాపీ వెడ్డింగ్’ చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినా నిహారిక నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో హీరోయిన్ గా కొణిదెల వారి వారసురాలు సెట్ అయినట్లే అని చెప్పోచ్చు.

10:21 - September 15, 2018
పెద్ద సినిమాలు చేస్తేనే అవకాశాలు భారీగా వస్తాయి అనుకొవడం పొరపాటు అని, ఈమధ్య బాగా ఫ్రూ చేస్తున్నాయి చిన్న సినిమాలు. చిన్న సినిమా అయినా.. ఎఫెక్టీవ్ గా క్రియేటీవ్ గా తీస్తే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ దృష్టిలో పడచ్చు అని ఓ న్యూ డైరెక్టర్ నిరూపించాడు. 

అర్జున్ రెడ్డి చిన్న సినిమా రిలీజ్ అయ్యి, ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ.. అప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ నెట్టుకొస్తున్న విజయ్ దేవరకొండను, స్టార్ ఇమేజ్ వైపు పరుగులు పెట్టించిన సినిమా. ఈ మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ డైరక్టర్ సందీప్ రెడ్డికే దక్కుతుంది. ఇండస్ట్రీఫై బాగా ఎఫెక్ట్  చూపించింది ఈ మూవీ. స్టార్ లందరి చూపు ఈ మూవీపై తిరిగేలా చేసిందీ మూవీ. ఈమూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు.. అంతే కాదు డైరక్టర్ సందీప్ తో కూడా మాట్లాడాడు. తన మూవీ చేసే అవకాశం కూడా ఇచ్చినట్టు న్యూస్ చక్కెర్లు కొడుతోంది. అయితే సందీప్ తో మహేష్ మూవీ కన్ఫాం అన్న టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ లో. 

అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారట. మహేష్ తో ఎప్పటి నుండో సినిమా ప్లాన్ చేయాలి అనకుంటున్న అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించడానికి రెడీ అన్నాడట. అయితే చిన్న సినిమా అయినా ధైర్యం చేసి తీసుకుని, రిలీజ్ చేసిన ఏషియన్ మూవీస్ సునిల్ కూడా ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడట. ఆల్ రెడీ మహేష్ తో మూవీకి కమిట్ మెంట్ తీసుకుని ఉన్నాడట సునిల్. అర్జున్ రెడ్డి రీమేక్ లో ఉన్న సందీప్ దాని తరువాత ఈ మూవీ స్టార్ట్ చేస్తాడని టాక్.
09:56 - September 15, 2018

గోవా : రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారా ? గత కొన్ని రోజులుగా సీఎం పారికర్ క్లోమా సంబంధ సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లి వచ్చిన పారికర్ మరలా అస్వస్థతకు గురయ్యారు. తిరిగి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం మరలా అమెరికాకు వెళ్లాలని పారికర్ యోచిస్తున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం తాత్కాలిక సీఎం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అక్కడ పరిణామలను పరిశీలించేందుకు బీజేపీ అధిష్టానం పరిశీలకులను పంపించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక సీఎం ఎవరనే విషయాన్ని తేల్చేందుకు పార్టీ సీనియర్ల బృందం గోవాకు వచ్చి చర్చలు జరుపనున్నట్లు టాక్. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన రామకృష్ణ సుదిన్ ధవలికర్‌ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రెండోస్థానంలో ఉన్నప్పటికీ స్థానిక మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో పారికర్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

09:40 - September 15, 2018

జమ్మూ కాశ్మీర్ : అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత బలగాలకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతుండడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా కుల్గాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్ టెర్రరిస్టులుగా గుర్తించారు. 
గాలింపులో భాగంగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారం మేరకు భారత బలగాలు గాలింపులు చేపట్టాయి. శుక్రవారం రాత్రి నుండి కొనసాగిన కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో భాగంగా బారాముల్లా, కాజీగండ్ ప్రాంతంలో రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. 

09:06 - September 15, 2018

సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రోబో 2.0’ టీజర్ వచ్చేసింది. ఇలా వచ్చిందో లేదో రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తోంది. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో చిత్రం రూపొందుతోంది. రజనీ..అమీ జాక్సన్, అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అక్షయ్‌ విలన్ రోల్ పోషిస్తుండడం విశేషం. 
తాజా టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. భారీ గ్రాఫిక్స్ రూపొందిన ఈ మూవీ....యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. కేవలం 9గంటల వ్యవధిలోనే 1.40 కోట్లు, 20 గంటల్లో 3 కోట్ల వ్యూస్ వచ్చాయి. టీజర్ కే రెస్పాన్స్ ఇలా ఉంటే...సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

08:49 - September 15, 2018
నల్గొండ : జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మిర్యాలగూడలో పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తున్న ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. ప్రణయ్ మామ మారుతీరావు ఈ హత్యలో కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ప్రేమ వివాహే కారణమని పోలీసులు నిర్దారించారు. హత్య నేపథ్యంలో మిర్యాలగూడ బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హత్య జరిగిన అనంతరం మారుతీరావు హైదరాబాద్ కు పరారయ్యాడు. మాడుగుల పల్లి వద్దనున్న టోల్ గేట్ వద్ద మారుతీరావు ప్రయాణిస్తున్న వాహనం సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాలు లేని ప్రాంతం మీదుగా నిందితులు పారిపోయినట్లు సమాచారం. ఈ హత్యలో ఇతరులు పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పట్టుకొనేందుకు బృందాలు రంగంలోకి దిగాయి..తప్పకుండా నిందితులను పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. 
08:11 - September 15, 2018

హైదరాబాద్: బాబ్లీ కేసులో...ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు వ్యూహామేంటీ ? సీఎం సహా 16 మందికి నోటీసులు జారీ చేయడంతో....చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు వెళితే మంచిందని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు....కోర్టు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐదారు రోజుల్లో ధర్మాబాద్ కోర్టులో లొంగిపోతే రాజకీయంగా తెలంగాణలో మరింత ఉపయోగకరంగా ఉంటుందని దేశం నేతలు యోచిస్తున్నారు.

దీంతో వచ్చే మైలేజీతో కాంగ్రెస్ తో సీట్ల బేరం మరింత సమర్థవంతంగా చేయొచ్చన్న ఆలోచన దేశం శ్రేణులు చేస్తున్నట్టు సమాచారం. బాబ్లీ ప్రకంపనలు ఏపీలో అంతగా ఉపయోగపడకపోయినా తెలంగాణలొ దాని ప్రభావం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. ఈ నెల 21న లేదా కొంచెం ముందుగా చంద్రబాబు ధర్మాబాద్ లో ముందస్తుగా లొంగిపోయేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్టు సమాచారం.   

          బాబ్లీ విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వడంతో...తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. నోటీసులపై చంద్రబాబు, సహచర మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల క్రితం జరిగిన బాబ్లీ ఇష్యూను తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ మరచిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎనిమిది ఏళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో....నోటీసుల వెనుక ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందంటూ తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు....పార్టీ సీనియర్ నేతలు, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. రాజకీయ ఎత్తుగడతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

          రాజకీయ కుట్ర దాగి ఉందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ....సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు రెడీ అవుతోంది. రాజకీయ కుట్రతోనే నోటీసులు జారీ చేశారన్న అంశాన్ని....ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాంగా తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్-బీజేపీ, ఏపీలో జగన్-బీజేపీల మైత్రిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరింత ఎదురుదాడికి దిగాలని టీడీపీ సిద్ధమైంది. ఏపీలో బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సఫలమయ్యామన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మైత్రి బంధాన్ని ఎండగట్టాలంటే ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుతో పాటు ఇతర 16 మంది నేతలు లొంగిపోతే తెలంగాణలో పార్టీ పట్టు పెంచుకోవచ్చని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు పవన్ కానీ.. అటు జగన్ కు కానీ తెలంగాణలో అసలు

పట్టేలేదు కాబట్టి..బాబ్లీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీ-టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.

07:57 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. పాలమూరు బహిరంగ సభ వేదికగా...ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ బీజేపీ నేతలకు....దిశానిర్దేశం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు సూచనలు చేయనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్...బహిరంగ సభలతో దూసుకెళ్తున్నారు. మహాకూటమి నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బీజేపీ సైతం ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.....ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు సూచనలు చేయనున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన షా....ఇందుకనుగుణంగా డైరెక్షన్ కూడా ఇచ్చారు. పాలమూరులో జరగనున్న బహిరంగ సభ నుంచి...అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

మరోవైపు అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు మేధావులు, ప్రముఖులు, ప్రజా సంఘాల్లో యాక్టివ్ గా ఉన్న వారిని గుర్తించి చేర్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. అంతటితో ఆగని అమిత్ షా....గెలుపు గుర్రాలను వెతికి పట్టుకునేందుకు సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారంతో హోరెత్తిస్తూనే...బలమైన నేతలను బరిలోకి దించేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ. అమిత్ షా ప్రచార హోరుకు పార్టీ ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

07:19 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణాలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మండి పడ్డారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను టార్గెట్‌ చేసిందని ఆరోపిస్తున్నారు. బలమైన కాంగ్రెస్‌ నేతలను అక్రమ కేసులతో టీఆర్ఎస్‌  వేధిస్తోందంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్సించారు టీ కాంగ్రెస్‌ నేతలు. అక్రమ కేసులు, అరెస్టులతో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.  అక్రమ కేసులపై డీజీపీ ఫిర్యాదు చేశారు టీ కాంగ్ నేతలు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాస్ పోర్ట్ కేసు, గండ్ర వెంకటరమణారెడ్డి పై అక్రమ ఆయుధాల కేసు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు... రేవంత్ రెడ్డిపై పెట్టిన జూబ్లీహిల్స్ హౌసింగ్ కేసులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. 

తెలంగాణలో  పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ కుమార్‌. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీజీపీని  కోరామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వాపస్ తీసుకోక పోతే తీవ్ర పరిణామాలు  ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు దాసోజు శ్రవణ్‌ కుమార్. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో.. బలమైన కాంగ్రెస్‌ నేతలను దెబ్బతీసేందుకే  అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతోనే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ది చెప్తారన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో  ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను  టీఆర్ఎస్ టార్గెట్‌ చేసిందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

07:06 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎం మిషన్లు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు... ప్రక్రియను కేంద్ర ఎన్నిక కమిషన్‌ వేగవంతం చేసింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 32 వేల 574 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాల పరిశీలనకు ఏర్పాట్లు  చేశామన్నారు. ఓటర్ లిస్ట్‌లతో పోలింగ్ బూత్‌ల వారిగా విభజన జరుగుతోందన్న ఆయన... ఓటర్ జాబితాలోని అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

06:56 - September 15, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో  రెండో రోజు శ్రీవారు హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. హంస వాహనంపై ఆసీనులైన శ్రీవారు వీణాపాణియై చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులతో తిరుమాడ వీధులు జనసంద్రంగా మారాయి.
సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. శ్రీ మలయప్ప సా్వమి ఆలయ పరివార దేవతలతో కలిసి ఊరేగారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. మంగళవాయిద్యాల నడుమ అర్చక స్వాములు స్వర్ణ ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరించారు. రాత్రి 8గంటలకు శ్రీ వారు పెద్దశేష వాహనంపై ఊరేగారు. 

06:42 - September 15, 2018

ఢిల్లీ : ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. గ్రూప్‌-బీలో  శ్రీలంక, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుంది. ఈ  మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ ప్రదర్శన అద్భుతంగా ఉండగా...లసిత్‌  మలింగ చేరికతో శ్రీలంక సైతం పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలి  మ్యాచ్‌లో ఇరుజట్లూ ఫేవరెట్స్‌గానే కనిపిస్తున్నాయి. స్వదేశంలో దక్షిణాప్రికా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక..  ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి ఆత్మవిశ్వాసం  నింపుకునేందుకు సిద్ధమైంది. ఇక సూపర్ ఫాంలో ఉన్న  బంగ్లాదేశ్‌ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతోంది. ఇరుజట్లు  మ్యాచ్‌కు ముందు కఠోర సాధన చేశాయి.

ఇరుజట్లు ఇప్పటి వరకు వన్డేల్లో 44 సార్లు తలపడగా శ్రీలంక  36 మ్యాచ్‌ల్లో గెలిచి తన ఆధిపత్యం చాటుకుంది. బంగ్లాదేశ్‌  కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో  ఫలితం తేలలేదు. ఇరుజట్ల మధ్య ఈక్వేషన్స్‌ ఎలా  ఉన్నా..ప్రస్తుత ఫాం ప్రకారం చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం  లంకకు అంత సులువేం కాదు.

ఇరుజట్లలోనూ కీలక ఆటగాళ్లున్నారు. బంగ్లాదేశ్‌లో షకీబ్‌,  ముష్పికర్‌, మహ్మదుల్లా వంటి సీనియర్లు మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సమర్థులు. ఇక శ్రీలంక జట్టులోనూ తిశార పెరీరా, ఉపుల్‌ తరంగ, లసిత్‌ మలింగ కీలక ఆటగాళ్లు. ఏడాది తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడుతున్నమలింగపైనే అందరూ ఫోకస్‌ చేశారు. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగబోయే ఈ  మ్యాచ్‌కు దాదాపు 24వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే  అవకాశం ఉంది. ఇక్కడి వాతావరణం 40 డిగ్రీ సెల్సియస్‌ కు  పైగానే ఉండటంతో ఆటగాళ్లు చమటలు కక్కాల్సిందే. పిచ్‌ పరిస్థితులు తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను మంచు ప్రభావితం చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు మొదలవనున్న ఈ మ్యాచ్‌ స్టార్‌  స్పోర్ట్స్‌-1లో లైవ్‌ టెలికాస్ట్‌ అవుతుంది.

Don't Miss