Activities calendar

04 October 2018

20:16 - October 4, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ రియాల్టీ షో ఎన్నో భాషల్లో నిర్వహించారు. కానీ తెలుగులో బిగ్ బాస్ 2 లో పాటిస్పెట్ చేసిన కౌశల్ కి వచ్చినంత క్రేజ్ మాత్రం ఎవ్వరికీ రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఏ బిగ్గెస్ట్ సెలబ్రిటీకి కూడా ఇంత ప్రజాదరణ లభించలేదు. ఒక సింగిల్ కంటెస్టెంట్ కి ఇన్ని ఓట్లు రావడమనేది టీవీ చరిత్రలోనే లేదట. నాకు నిన్ననే 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'వారి నుంచి కాల్ వచ్చింది. కొంత సమయం తీసుకుని అనౌన్స్ చేస్తామని అన్నారని కౌశల్ తెలిపారు.  గిన్నిస్ బుక్ లో చోటు దక్కనుండటం ఆనందంగా వుంది. 'బిగ్ బాస్ హౌస్'లో నాతో పాటు వున్న వాళ్లెవరూ బయటికి వచ్చిన తరువాత మాట్లాడలేదని తానే వీలు చూసుకుని వాళ్లకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతాను" అని మరోసారి కౌశల్ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. దటీజ్ కౌశల్ అనిపించుకున్నాడు.

 

19:49 - October 4, 2018

నల్లగొండ : ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీతో నాలుగేళ్లు అంటకాగి తెలంగాణలోని మండలాలను ఏపిలో కలుపుకున్నాడనీ విమర్శించారు. ఇప్పడు రాష్ట్రంలో మహాకూటమి అంటు మరోసారి తెలంగాణపై కన్ను వేశాడనీ..తాను మూడోకన్ను తెరిస్తే ఏమవుతుందో ఆలోచించుకోమని చంద్రబాబుకు హెచ్చరించారు. ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాలను ఒక్కటిగా చేస్తానంటున్నాడనీ..చంద్రబాబు నయ వంచకుడు, నమ్మకద్రోహి అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని కేసీఆర్ నల్లగొండ ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

19:31 - October 4, 2018

నల్లగొండ : ప్రజాశీర్వాద సభలో నల్లగొండ జిల్లా ప్రజల్లో కేసీఆర్ ఎన్నికల్లో గెలుపుకోసం మరోసారి ఉద్యమం సెంటిమెంట్ ను రాజేశారు. ఆనాడు ఉద్యమం సమయంలో జరిగిన సందర్భాలను గుర్తుచేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత తొలిసారిగా 2014ఎన్నికల్లో .. ఎక్కడైతే టీఆర్ఎస్ కు చోటు లేదని చెప్పారో, అక్కడే ఆరు సీట్లు గెలిచామని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని పిలుపు నిచ్చారు. ఐదారు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని.. ఎన్నో సమస్యలను దాటుకుని స్వపరిపాలనలో సమస్యలను, అవమానాలను ఎదుర్కొని బంగారు తెలంగాణ వైపుగా అడుగులు వేస్తున్నామన్నారు. మరోసారి టీఆర్ఎస్ ను గెలిపించి బంగారుతెలంగా కలల్ని సాధించటానికి నల్లగొండలో మరోసారి గులాబీ జెండా విజయం సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని..ఓట్లు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
 

19:13 - October 4, 2018

నల్లగొండ :  ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలల్లో చైతన్యాన్ని మరోసారి రగిలించేందుకు పూనుకున్నారు. ఇంటింటికీ రెండు నెలల్లో నీళ్లు రాబోతున్నాయి. అసెంబ్లీలో చెప్పిన మాట నెరవేరబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంట్ కష్టాలు, ఫ్లోరైడ్ సమస్య, కూలిపోయిన కులవృత్తులు, రైతులు, చేనేతల ఆత్మహత్యలు వంటి పలు సంక్షోభాల నుండి కూలిపోతున్న బతుకుల్ని స్వంత రాష్ట్రంలో సొంత పాలనలో నిలబెట్టుకున్నామని కేసీఆర్ మరోసారి ప్రజల్లో ఉద్వేగాన్ని నింపారు.  పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే తానే స్వయంగా వచ్చి.. రూ. 50 వేలు ఇవ్వమంటే ఆనాడు పాలకులు ఇవ్వలేదనీ..మరలా గతకాలపు పాలకులపై విమర్శల వర్షం కురిపించారు. బోర్లు వేసి వేసి బొర్లా పడ్డ పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికులు. ధైర్యంగా ప్రయాణం ప్రారంభించాం. కరెంట్ సమస్య అన్ని వర్గాలను పట్టిపీడించింది. ఐదారు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నామనీ..మంచినీళ్ల సమస్య పరిష్కారం కావాటానికి మిషన్ భగీరథ 1,50,000 కిలోమీటర్లు, 12 వేల క్లియరెన్స్‌లు దాటుకొని 99 శాతం పూర్తి  అయిందని కేసీఆర్ తెలిపారు.

18:57 - October 4, 2018

నల్లగొండ : జిల్లాలో ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతు..పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాతో నాకు ఉద్వేగభరిత అనుబంధం వుందన్నారు. ముందస్తు ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం.. ఎలక్షన్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి.. ఎలక్షన్లు రావాల్సినటువంటి కారణాలు ఏవో మీకందరికి తెలుసు. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగుడ్డ.. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం. మొన్నటి తెలంగాణ ఉద్యమం.. పిడికిలి బిగించిన నల్లగొండ ప్రజానీకం, ఈ జిల్లాకు నాకు ఉద్వేగపూరితమైన సంబంధం ఉంది. ఫ్లోరైడ్ మీద 8 రోజులు ఉద్యమించాను. అనేక సందర్భాలు, వందలాది సభలలో మీ అందరి ఆశీర్వచనం, ప్రజల సహకారం 2001లో గులాబీ జెండా ఎగిరింది. ఎవరికీ నమ్మకం లేదు. కారు చీకటి. అవమానాలు చేసేవాళ్లు..విమర్శలు చేసేవారనీ..తెలంగాణ ఉద్యమ బాట ఎట్టి పరిస్థితుల్లో వీడను, మడమ తిప్పను.. మడమ తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి చెప్పిన. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచి.. మీ స్ఫూర్తితో 14 ఏండ్లు నిరంతరంగా పోరాడి.. విమర్శలు, అవమానాలుఅధిగమిస్తూ పటిష్టమైన పోరాటంతో తెలంగాణ వచ్చింది. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు స్థానమే లేదని చెప్పిన జిల్లాలో 12 స్థానాలకు 6 స్థానాల్లో గెలిపించారని కేసీఆర్ నల్లగొండ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

18:16 - October 4, 2018

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2'లో కౌశల్ ఒక సునామి. ఒంటరిపోరులో విజయం సాధించిన విజేత కౌశల్. అప్పటి వరకూ సాధారణ సెలబ్రిటీగా వుండే కౌశల్ బిగ్ బాస్ 2 తరువాత ఆ గేమ్ కొనసాగుతున్న నేపథ్యంలోను కూడా బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయాదు. ఇది సాధారణంగా వచ్చిన క్రేజ్ కాదు.ఇది కేవలం అతని వ్యక్తిత్వం..నమ్మినదానినే ఆచరించటం..సాటి వ్యక్తుల పట్ల వుండే గౌవరం..సాటివారికి సహాయం చేసే సహజగుణం కౌశల్ లక్షణం.. వీటితోనే అతని వ్యక్తిత్వం బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చింది. మరింతగా ఇనుమడించింది. దీనిపై గిట్టనివారు ఎన్ని విమర్శలు చేసిన అది వారు అసూయతో చేసేదే తప్ప మరేమీ కాదని అశేష అభిమానులు సాటి చెప్పారు. 16మంది పాల్గొన్న ఈ గేమ్ షోలో ఒక్క కౌశల్ కే ఇంతటి క్రేజ్ వచ్చింది అంటే మిగతా కంటెస్టెన్స్ లో ఎక్కడో ఒక్క చోట అయినా ఫేక్ నెస్ కనిపించకమానలేదు అని ఫ్రూవ్ అయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వానికి దర్పణంగా నిలిచిన నేపథ్యంలో అతని క్రేజ్ తో కెరీర్ మరింతగా బాగుంటుందని నమ్మవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రేజ్ కారణంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. చరణ్ హీరోగా బోయపాటి చేస్తోన్న సినిమాలో కౌశల్ తో ఒక ముఖ్యమైన రోల్ చేయించనున్నట్టు టాక్ వచ్చింది. నెగెటివ్ షేడ్స్ తో ఈ పాత్ర ఉంటుందని సినీ వర్గాల సమాచారం. 

18:03 - October 4, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన లవ్, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... అరవింద సమేత వీరరాఘవ... ప్రస్తుతం ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.. మరోపక్క పాటలు కూడా వైరల్ అవుతున్నాయి.. అరవింద సమేత ఆడియో ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ‌లేదు అని నిరుత్సాహ పడుతున్న అభిమానుల కోసం, ఒక ముప్ఫై సెకన్ల టైటిల్ ట్రాక్ వీడియో బైట్ ప్రోమో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
సిరివెన్నెల వ్రాయగా, అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటలో తారక్, థమన్ కంపోజింగ్‌కి తగ్గట్టు తన స్టైల్‌లో బ్రహ్మాండమైన స్టెప్స్ వేసాడు.. ఫారిన్ డ్యాన్సర్స్‌తో కలిసి మెరుపువేగంతో మూమెంట్స్ చేసాడు... ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.. ప్రోమోనే ఇలా ఉంటే, ఇక ధియేటర్2లో ఫుల్‌సాంగ్ చూస్తే అదిరిపోద్ది అంటున్నారు అభిమానులు... ఈ నెల 11న అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అవబోతోంది..

17:44 - October 4, 2018

సిద్ధిపేట : సీటు వచ్చేదాకా ఒక బాధ. తరువాత ఎన్నికల్లో గెలిచేందుకు మరోబాధ. గెలుపుకోసం నేతలు నానా పాట్లు పడుతున్నారు. సహనాన్ని కోల్పోతున్నారు. వీరా రేపు ఎన్నికల్లో గెలుపొందితే ప్రజాప్రతినిథులుగా చట్టసభల్లో చక్కం తిప్పేది అనిపిస్తుంది. డబ్బులు విసిరేస్తే ఓట్లు రాలిపోతాయి. తరువాత నేనెవరికి సమాధానం చెప్పనక్కర్లేదు..కాబట్టి అందినకాడికి చక్కగా దండుకోవచ్చు..పైరవీలు చేసుకుంటు కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు అనే ఆలోచనలతో నేటి నేతలు వున్నారు. దీనికోసం ఎంతటి పనులు చేసేందుకు కూడా వెనుకాడటంలేదు. ఓట్లు అడగటానికి ప్రజల వద్దకు వెళ్లి క్రమంలో వారిని ఎవరైనా ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తారా? అంటు చిందులు తొక్కుతున్నారు. బూటుకాలితో తన్నుతున్నారు. 
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల వద్దకు వెళ్లిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. తనను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బూటు కాలితో తన్ని తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వొడితల సతీష్.. వారిపైకి ఆగ్రహంతో దూసుకెళ్లి వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో వారంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. వొడితలతోపాటు అనుచరులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

17:21 - October 4, 2018

 

హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఎంత రసవత్తరంగా జరిగిందో ప్రేక్షకులందరూ స్వయంగా చూసారు.. ఎన్నో అవాంతరాలని, మరెన్నో అడ్డంకులని ఎదుర్కొని కౌశల్ విన్నర్‌గా నిలిచాడు.. దీనివెనక కౌశల్ ఆర్మీ ఏ స్ధాయిలో కృషి చేసిందో కూడా అందరికీ తెలిసిందే.. ఎంతో హైడ్రామా నడుమ బిగ్‌బాస్ సీజన్-2 ముగిసింది..
హౌస్‌లో నుండి బయటకొచ్చినా ఇంకా అక్కడి రచ్చ చల్లారినట్టులేదు.. కౌశల్ గురించి, అతని ఆర్మీ గురించి బాబు గోగినేని మాట్లాడుతూ, అదొక ఫేక్ ఆర్మీ, పెయిడ్ ఆర్మీ అన్నాడు.. దీనిపై కౌశల్ కాస్త ఘాటుగానే స్పందించాడు.. తను ఫ్రాడ్ చేసి బిగ్‌బాస్ సీజన్-2‌లో విన్ అయినట్టు ప్రూవ్ చేస్తే, బిగ్‌బాస్ టైటిల్‌ని వాపస్ ఇచ్చేస్తానని అన్నాడు..అంతేకాదు, తను గెల్చుకున్న యాభై లక్షల ప్రైజ్ మనీ కూడా రిటర్న్ చేస్తా అన్నాడు.. కౌశల్ చాలెంజ్‌కి బాబు గోగినేని ఎలా స్పందిస్తాడో మరి...

16:40 - October 4, 2018

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ ఈ పదం గత కొంతకాలంగా సంచలనంగా మారిపోయింది. అన్ని రకాల పనిప్రదేశాలలోను ఈ మాట సర్వసాధారణంగా మారిపోయింది. మహిళలను ఆ కోణంలో తప్ప మరో కోణంలో చూడలేని దౌర్భాగ్యపు సమాజంలో ఈ మాట కామన్ గా మారిపోయింది. దీని బారిన పడిన మహిళలు కొందరు మౌనంగా భరిస్తుంటే కొందరు మాత్రం బహిరంగంగా చెప్పటమే కాక ‘మీ టు’ వంటి ఉద్యమంలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పలువురు పలు విధాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది సామాన్యులకు ఒకలా సెలబ్రిటీలకు ఒకలా బాదించదు. ఆ బాధ అందరికీ ఒక్కటే. కానీ సెలబ్రిటీలు ఈ విషయంపై మాట్లాడితే అది మరింతగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పాపులర్ తార కాజోల్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 
తనుశ్రీ దత్తా-నానా పటేకర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో లైంగిక వేధింపులు ప్రతి చోటా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అభిప్రాయపడింది. ఈ వేధింపులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదనీ, అన్నిచోట్లా జరుగుతున్నాయని పేర్కొంది. 
తానెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదనీ..కానీ తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది.  విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది. ఇది మనకు చాలా అవసరమని కాజోల్ పేర్కొంది. 
 

16:30 - October 4, 2018

ఢిల్లీ : వాహనదారులకు గుడ్ న్యూస్..గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతూ..వాహనాదారులను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అచ్చేదిన్ ఎప్పడూ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉండడం..ప్రభావం చూపుతుందనే దానిపై సీరియస్‌గా ఆలోచించి ధరలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది. లీటర్‌పై రూ.2.50 తగ్గించింది. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. చమురుపై రూ. 2.50 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు, గతంలో పెట్రోల్ ధరలు పెరిగిన సమయంలో రూ. 2 ఎక్సైజ్ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేయడం జరుగుతోందని, ద్రవ్యలోటు మూడు శాతానికి మించకుండా చేశామని చెప్పుకొచ్చారు. ఓపెక్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తులు పెంచడం లేదని, రూ. 5 తగ్గించాలని అనుకున్నా సాధ్యపడలేదని తెలిపారు. 

ధరలు పెరుగుతుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి కూడా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరకు ఆయా రాష్ట్రాలు మరో రూ. లీటర్‌పై రూ.2.50 తగ్గిస్తే సుమారు రూ.5 వరకు వినియోగదారులకు లాభం జరుగుతుందని జైట్లీ సూచించారు. ప్రస్తుతం రూ.2.50 తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.
గురువారం కూడా ధరలు పెరిగాయి ముంబైలో ఏకంగా లీటర్ పెట్రోల్ రూ.90 దాటడం గమనార్హం. ధరలు పెరుగుతుండడంతో వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనదారులు..సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

16:20 - October 4, 2018

హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరస విజయాలతో ఫుల్‌జోష్‌లో ఉన్నాడు.. టాయిలెట్, ప్యాడ్‌మాన్, గోల్డ్ వంటి వైవిధ్య భరితమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు.. అక్షయ్ విలన్‌గా నటించిన 2.ఓ. మూవీకోసం ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. ఈ మూవీలో బర్డ్‌మాన్‌గా సరికొత్త గెటప్లో దర్శనమివ్వబోతున్నాడు అక్షయ్..
ఇదిలా ఉంటే, తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించిన కాంచన (ముని-2) చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యడానికి అక్షయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.. వరసగా కామెడీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న అక్షయ్ కాంచన లాంటి హారర్ సినిమా చెయ్యాడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.. వినోదం, భయం కలగలసిన కథ కాబట్టి తప్పకుండా బాలీవుడ్ ఆడియన్స్‌ని మెప్పించవచ్చు అనేది అక్షయ్ ప్లాన్ అని తెలుస్తోంది..
ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట చేసిన రాఘవ లారెన్సే ఈ రీమేక్ యొక్క దర్శకత్వ బాధ్యతలు చేపడతాడని సమాచారం.... హీరోయిన్‌తో సహా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.. అక్షయ్ నెగెటివ్ రోల్ చేసిన 2.ఓ. నవంబర్‌లో రిలీజ్ కాబోతోంది...  

16:13 - October 4, 2018

ఢిల్లీ : ముందుస్తుపై దూకుడు పెంచిన గులాబీ బాస్ కు సుప్రీంకోర్ట్  ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో వుండగా..ఎటువంటి పథకాలను అమలు చేయకూడదనీ ఈ క్రమంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు చెక్కుల పంపిణీ నిలిపివేయాలని..బతుకమ్మ చీరల పంపిణీకూడా చేయకూడదని టీఆర్ఎస్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. 
తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్ పైన సుప్రీం కోర్టులో గురువారం విచారణలో భాగంగా..అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పై స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. 
ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు.

15:27 - October 4, 2018

ఢిల్లీ : ప్రయాణీకుల పట్ల భారత రైల్వే ఎంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఎటువంటి కారణం తెలుపకుండానే రైల్వే శాఖ ఉన్నట్లుండి 149 రైళ్లను అర్థాంతరంగా రద్దు చేసేసింది. సామాన్యుడికి అందుబాటులో వుండే ఒకే ఒక్క ప్రయాణ సాధనం రైలు. బస్ లు, ఆటోలు వంటి ప్రయాణ సాధనాలకంటే కూడా సామాన్యుడు ఎక్కువగా రైలు ప్రయాణానికే మక్కువ చూపుతుంటాడు. కారణం అనకు పూర్తిగా కాకపోయినా..కనీసమాత్రంగా అందుబాటు ధరలో రైల్వే ప్రయాణం వుంటుందని. ఆ నమ్మకంపై రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపింది. 
భారతీయ రైల్వే అధికారులు ప్రయాణికులకు గురువారం గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రత్యేక కారణాలేమీ తెలియజేయకుండానే భారీ సంఖ్యలో అంటే 149 రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాన్‌లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తినప్పుడు రైల్వే శాఖ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి రైళ్ల రద్దుకు ఆ శాఖ ఎటువంటి ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో అత్యధికం పాసింజర్‌ ట్రైన్‌లే ఎక్కువగా వున్నాయి. అంటే అతి సామాన్యుడి ప్రయాణసాధనానికి గండి కొట్టిందన్నమాట. 
ఈ విషయాన్ని ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేశామని..ప్రయాణికులు కన్‌ఫర్మ్‌ చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అంటూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదలచేసి ల్వే శాఖ చేతులు దులుపేసుకుంది.

15:26 - October 4, 2018

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పొరపాటున తన ట్వీట్‌లో రాంగ్ ఫోటో జతచేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ తన ట్వీట్‌లో వాడకుండా వదిలేసి పాడైపోయిన 108, 102 అంబులెన్సు వాహనాలున్న ఫోటోను తన ట్వీట్‌లో జతచేయడం వివాదాస్పదమైంది. అయితే తెలుగులో రాసి ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అన్న పేరును చూడకుండా ఫోటోను అప్‌లోడ్ చేయడంతో దిగ్విజయ్ సింగ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

గతేడాది సెప్టెంబరులో ఇటువంటి కామెంట్లతో దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు ట్విట్టర్‌లో చేసి నాలిక కరుచుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు తాజాగా పాడై పోయిన అంబులెన్సుల ఫోటోతో మరో సారి వార్తల్లోకి ఎక్కారు.

15:03 - October 4, 2018

నల్గొండ: ప్రజలు సొమ్మునే జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించటంతో ప్రజల్లో ప్రభుత్వ అధికారులంటేనే గౌరవమే కాదు..కనీ విలువ అనేది కూడా లేకుండా పోతోంది. దానికి కారణం వారి అవినీతి..ప్రజల పట్ల వారు వ్యవహరించే తీరుకూడా సక్రమంగా లేకపోవటమే. ఈ వాస్తవాలు ఎన్నో సందర్భాలలో అక్షరసత్యాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాయానికి వెళ్లిన ఓ యువతిపై ఆ కార్యాలయం ఉన్నత అధికారి చేయి చేసుకున్న ఘటనతో బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. 
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత అనే యువతి ఆదాయ, కులధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. ధృవీకరణ పత్రాల కోసం మీసేవా రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్ కౌంటర్ వద్ద నిరీక్షించారు. ఈ సమయంలో ఛాంబర్ నుంచి బయటికి వచ్చిన తహసీల్దార్ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాక మ్మార్వో ప్రమీల తనపై చేయి చేసుకున్నారని బాధితురాలు సరిత విలపిస్తూ తెలిపింది. కాగా, విషయం తెలిసిన సరిత కుటుంబసభ్యులు, బంధువులు కార్యాలయానికి చేరుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగారు. తాను మాత్రం ఎవరిపైనా చేయి చేసుకోలేదని, కంప్యూటర్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతోనే పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టానని ఎమ్మార్వో ప్రమీల తెలిపింది. దీనిపై నిజా నిజాలు తెలియాల్సివుంది.

14:52 - October 4, 2018
ఢిల్లీ : భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు...ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు...అదే ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు..ఈ బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా...నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వహించిన చంద్రాకొచ్చార్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. దీనిని బీఎస్ఈ వెంటనే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో సందీప్ బక్షీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. అక్టోబర్ 3, 2023 వరకు అపాయింట్ మెంట్ పదవీకాలం ఉంటుందని తెలిపింది. 

వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఆమె పదవికీ రాజీనామా చేశారని తెలుస్తోంది. దీనికి ఆమెపై తీవ్ర వత్తిడి వచ్చిందని సమాచారం. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా చందా కొచర్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. కానీ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  చందా కొచ్చర్ తన పదవికి రాజీనామా చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నుంచి ఒత్తిడి పెరిగింది. రుణం మంజూరులో చందాకొచర్ ప్రమేయం ఏదీ లేదంటూ ఇటీవలే బ్యాంకు బోర్డు ఆమెకు మద్దతుగా సైతం నిలిచింది. కొచర్‌ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయని తెలుస్తోంది. 

కాగా  ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది. సంస్థలో మూడు దశాబ్దాలుగా ఆమె పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎన్నో పర్యాయాలు గుర్తింపు పొందారు.
14:42 - October 4, 2018

ఎన్టీఆర్, త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తోన్న లవ్, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అరవింద సమేత వీరరాఘవ... రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్ప్లేస్లోఉంది.. మరోపక్క పాటలుకూడా వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే, ఇప్పుడు  అరవింద సమేత మేకింగ్ వీడియో ఒకటి ఆన్లైన్లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్...  ఈ వీడియోలో త్రివిక్రమ్ ఎన్టీఆర్కి, హీరోయిన్ పూజా హెగ్డేకి సీన్స్ వివరించడం, థమన్తో డిస్కషన్ లాంటివి ఉన్నాయి..
హైలెట్ ఏంటంటే, ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ఈ వీడియోలో మానిటర్ ముందు త్రివిక్రమ్ ఒళ్లో కూర్చుని, యాక్షన్ చెప్తున్నాడు.. అంతేకాదు చేతిలో సినిమాలో ఎన్టీఆర్ వాడిన కత్తి పట్టుకుని హల్చల్ చేసాడు... ఫోటోలో త్రివిక్రమ్ పక్కన ఫైట్ మాష్టర్ ఉన్నాడు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని అర్ధం అవుతుంది.. మా హీరో కొడుకు అప్పుడే నటనలో ఓనమాలు నేర్చేసుకుంటున్నాడని తారక్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. దసరా కానుకగా అక్టోబర్ 11న  అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ కాబోతుంది....

14:41 - October 4, 2018

ఢిల్లీ :  ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పేరొందింది. కాలానుగుణంగా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. పాలకుల అవినీతి,అధికారుల దోపిడీ..చిన్నస్థాయి చిరుద్యోగి నుండి పైస్థాయి అధికారి వరకూ లంచం, లంచం, లంచం. లంచంలేదనిదే ఏపని జరగని పరిస్థితి. అక్కడక్కడా నిజాయితీపరులైన అధికారులున్నా వారిని సక్రమంగా వారి విధులను వారు చేసుకోనివ్వలేని పరిస్థితికి దిగజారిపోతున్న నేపథ్యంలో భారతదేశం అవినీతి దేశంగా మారిపోయింది. ప్రజాస్వామ్య దేశమంటే కేవలం ప్రజల ఓట్లదో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే కాదు..ప్రజలకు అన్ని వసతులు..నీతిగా..నిజాయితీగా..పారదర్శకంగా పాలన అందించాల్సిన పాలకులనుండి అంటెండర్ వరకూ అవినీతి కూపంలో భారత్ కూరుకుపోయింది. ఈ వాస్తవాలు ప్రముఖ  పత్రిక సర్వేలో ఫోర్బ్స్ వెల్లడించింది. కానీ మరోపక్క ప్రదాని మోదిపై ఈ పత్రిక సలు కురిపించింది. 
ఆసియా దేశాల్లో మ‌న భారతదేశం ఎక్కువ శాతం అవినీతి జరుగుతోందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ట్రాన్స్‌ప‌రెన్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ త‌న స‌ర్వే నివేదిక‌లో ఈ అంశాన్ని వెల్ల‌డించింది. అవినీతిని రూపుమాపాల‌ని మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే ఇంకా ఆ దేశం చాలా ముందుకు వెళ్లాల్సి ఉంద‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది. ఆసియాలో ఉన్న ఫైవ్ మోస్ట్ క‌ర‌ప్ట్ కంట్రీస్ జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదికలో తెలిపింది. భార‌త్ త‌ర్వాత వియ‌త్నాం, థాయ్‌లాండ్, పాకిస్థాన్‌, మ‌య‌న్మార్ దేశాలు ఉన్నాయి. భార‌త్‌లో అవినీతి 69 శాతం ఉందని పేర్కొంది. ఆ త‌ర్వాత వియ‌త్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే ప‌నులు జరుగుతాయని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో41 శాతం, పాకిస్థాన్‌లో 40 శాతం, మయన్మార్‌లో 40 శాతం అవినీతి ఉందని పేర్కొంది. భార‌త్‌లో స్కూళ్లు, హాస్పిట‌ళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవ‌ల రంగాల్లో లంచం మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. 

14:20 - October 4, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరుయాత్ర  నిర్వహిస్తున్న ఆయన.. ఈనెల 5 నుంచి పోలవరం యాత్ర చేపట్టబోతున్నారు. దీంతో పవన్‌ పోలవరం యాత్రపై ఉత్కంఠ నెలకొంది. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరాటయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన తన యాత్రలో విమర్శల దాడి పెంచారు. టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. సీఎంపైనా.... మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎవరినీ ఆయన వదల్లేదు. అందరిపైనా సందర్భానుసారం విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌ ఇంతకుముందు కూడా యాత్ర చేశారు. కానీ అప్పుడు అధికారపార్టీపై ఇంత ధాటిగా విమర్శలు గుప్పించిలేదు. అధికారపక్షంపై ఇప్పుడు ఆయన ఒంటి కాలిమీద లేస్తున్నారు.  సీఎంతోపాటు ఆ పార్టీ నాయకుల మీద పదునైన విమర్శలు చేస్తూ... జనసేనపై ఒక్కసారిగా అంచనాలు పెంచారు. 
 
పశ్చిమ యాత్రలో పవన్‌ కల్యాణ్‌ ప్రధానంగా పోలవరంపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. తరచూ పోలవరం ప్రాజెక్ట్‌,  పోలవరం నిర్వాసితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయకుండా 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

పోలవరంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు... పోలవరం సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకునేందుకు కూడా పవన్‌ సిద్ధమయ్యారు. ఈనెల 5న ఆయన పోలవరం నుంచి తన పర్యటన కొనసాగించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో పర్యటించి పనులను పరిశీలించనున్నారు. కొన్ని నెలల క్రితం టీడీపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌లో పవన్‌ పర్యటించి .. పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మళ్లీ ఇప్పుడు పవన్‌ పోలవరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తన రెండు రోజుల పోలవరం పర్యటనలో ఏయే అంశాలు తెరపైకి తీసుకొస్తారో చూడాలి. 

14:04 - October 4, 2018

హైదరాబాద్ : ఎన్నికల షెడ్యూల్‌కు సమయం ఆసన్నం కావడంతో.. ఎలక్షన్‌ కమిషన్‌ అప్రమత్తమైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థులను కట్టడి చేసేందుకు గట్టి నిఘా పెడుతోంది. ప్రజలను ప్రభావితం చేయడంలో మీడియాకు ధీటుగా.. సవాల్ విసురుతున్న సోషల్‌ మీడియాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సాధారణ ప్రజలకు అరచేతిలో అస్ర్తంలాంటి ఈ సైట్లపై సైబర్ నెట్ వర్క్స్ టీంతో పాటు.. నిపుణులతో పర్యవేక్షిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది.

ప్రజలను ప్రభావితం చేయడంలో మీడియాతో పోటి పడుతోంది సోషల్ మీడియా. ఏమాత్రం ఖర్చులేకుండా తమ అభిప్రాయాన్ని స్వేఛ్చగా చెప్పేందుకు అరచేతిలో అస్ర్తంలా మారింది. కానీ.. దీనికీ  కొంత హద్దు ఉందంటోంది ఎన్నికల కమిషన్. సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించిన ఈసీ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాజకీయ పార్టీలు ప్రత్యేక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో.. వాటి నియంత్రణకు నిఘాను ముమ్మరం చేసింది ఈసి. ఎక్కడేం జరిగినా క్షణంలో వైరల్ చేసేందుకు వీలుండడంతో.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్ స్ట్రా గ్రామ్, లింక్ డే ఇన్, వాట్పాప్‌పై దృష్టి పెట్టింది. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి పోస్టుకు ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులే కారణం అవుతారంటోంది ఈసీ. సానుకూల వార్తలు, షార్ట్ ఫిల్మ్‌ ఇలా ఏవైనా  అభ్యర్ధి ఎన్నికల ఖర్చులోకే జమ చేస్తామంటోంది.

కొందరు అకతాయిల పనులతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. ఫేక్ అకౌంట్స్‌తో ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కుల, మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించినా, రాజ్యాంగ సంస్థలను అగౌరవ పరిచినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తోంది ఈసీ. ఈ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియాకు వర్తించే చట్టాలే వీటికీ వర్తిస్తాయంటోంది.
 
సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలైంది. కానీ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులు ఇష్టానుసారం ప్రచారం చేస్తే కుదరదంటున్నారు అధికారులు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఈసీ. ముఖ్యంగా సోషల్ మీడియాను  అదుపు చేయాల్సిన అవసరం ఉందంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఇష్టానుసారం రెచ్చిపోవాలని చూసే.. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు ముకుతాడు వేసేందుకు సిద్ధమవుతోంది ఈసీ. ఎన్నికల కోడ్‌ను పట్టించుకోకుండా.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోయేవారు.. కఠినచర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

13:44 - October 4, 2018

ఢిల్లీ : మొదటి టెస్టు..ఏ మాత్రం అదరడం..బెదరడం లేదు...బరిలోకి దిగి తన ఆట తీరుతో అందర్నీ ఆకర్షించేశాడు. అతనే పృథ్వీ షా...తన తొలి ఇన్నింగ్్సలోనే తనలోని ప్రతిభను చూపెట్టాడు. తన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం విశేషం. 

రాజ్ కోట్ లో వెస్టిండీస్..భారత జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ గా షా దిగాడు. బరిలోకి దిగగానే విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ మూడు పరుగులకే రాహుల్ డకౌట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన పూజారతో షా జత కలిశాడు. బంతిని బౌండరీలకు షా తరలించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూజారాతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పూజారా కూడా బ్యాట్ ఝులిపించాడు. అర్ధ సెంచరీ సాధించి సెంచరీ దిశగా ముందుకెళ్లాడు. కేవలం 130 బంతులను ఎదుర్కొన్న షా 119 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లున్నాయి. 86 పరుగులు చేసిన పుజారా వెనుదిరిగాడు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. 

13:23 - October 4, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ కోడ్ పేరుతో బ్రేక్‌ వేసింది. ఆన్‌ గోయింగ్‌ పథకాలకు అడ్డు ఉండదని పార్టీ భావించి.. బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. దీంతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న రైతుబంధు చెక్కుల పంపిణీ పరిస్థితి ఏంటోనన్న టెన్షన్‌ నెలకొంది. 

తెలంగాణలో శాసనసభ రద్దు అయి దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సీఎం కేసీఆర్‌.. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టకపోయినా పాత పథకాలన్నీ యధావిధిగా కొనసాగుతాయన్నారు. అయితే ప్రభుత్వం రద్దు అయిన నాటి నుండి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పాత పథకాల కొనసాగింపు సందిగ్ధతలో పడింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రజాకర్షక పథకాలు నిలిపివేయాలని ఫిర్యాదులు చేశాయి. 

ప్రధానంగా ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులో బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కులు రెండో విడత పంపిణీ, కంటి వెలుగు, ప్రభుత్వ వాహనాల్లో తిరగడం, అధికార నివాసాల్లో ఉండడం, వారి వారి శాఖలకు సంబంధించిన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న మంత్రులపై ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో సహజంగా గత ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాలకు ఈ కోడ్‌ వర్తించదని నేతలు భావించారు. కానీ రాష్ట్ర ఈసీకి అందిన ఫిర్యాదును పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు రజత్‌కుమార్‌. ఈనెల 12 నుంచి 18 ఏళ్లు నిండి.. తెల్లరేషన్‌ కార్డు కలిగివున్న కోటి ఎనిమిది లక్షల మంది మహిళలకు ఇచ్చే చీరల పంపిణీ ప్రారంభానికి సిద్దమవుతున్న బతుకమ్మ చీరలపై సీఈసీ క్లారిటీ ఇచ్చింది. తక్షణమే బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని లేఖ పంపింది. 

ఇదిలావుంటే.. తెలంగాణలో రైతుకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిదివేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకంలో భాగంగా.. మొదటి విడత గత మే నెల 10న 4 వేల చొప్పున రైతులకు అందించారు. మలి విడత పంపిణీ ఈనెల 5 నుంచి ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అయితే.. దీనిపై కూడా ఈసీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చెక్కుల పంపిణీ సాధ్యమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

అయితే.. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఈసీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటు బతుకమ్మ చీరలు, రైతు బంధు పథకం రెండో విడత పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని కోరనున్నారు. మరి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది సందిగ్ధంగా మారింది. 

13:20 - October 4, 2018

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే హీరో..హీరోయిన్లకు అభిమానులుంటారు. వారి వారి చిత్రాలు విడుదలవుతుందంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ప్రముఖ హీరోల చిత్రాలు రిలీజ్ అయితే మాత్రం సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ ఒక్కోసారి ఈ ఆనందం హద్దులు మీరుతుంటుంది. మరికొంత మంది అభిమానులు వినూత్నంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమిళనాట అభిమానులు ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన ఓ పని సామాజిక మాధ్యమాల్లో గిర్రున తిరుగుతోంది. 

మణిరత్నం దర్శకత్వం వహించిన  ‘చెక్క చివంత వానం’ రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగులో ‘నవాబ్’ పేరిట రిలీజై మంచి కలెక్షన్లతో దూసుకపోతోంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు ప్రధాన పాత్రలు పోషించారు. శింబు పాత్రకు మంచి మార్కులు పడుతుండడంతో అతని ఫ్యాన్్స తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ అభిమాని తన ఆనందాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఓ థియేటర్ వద్ద నెలకొల్పిన కటౌట్ కు పాలాభిషేకం చేయాలని అనుకున్నాడు. కానీ వెరైటీగా చేయాలని అనుకుని ఓ క్రేన్ ను తెప్పించాడు. క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చించుకుని గాల్లోకి లేచాడు. సుమారు 25 ఫీట్ల ఎత్తున్న శింబు  పోస్టర్ కు పాలాభిషేకం చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అభిమానం ఉంటే గిలా ఉంటుందా ? అని ఆశ్చర్యపోయారు. ఇంత పిచ్చి అభిమానం ఏంటా అని అనుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 

 

13:01 - October 4, 2018

ఢిల్లీ: ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి స్వదేశానికి అప్పగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు వీరి తరలింపుపై వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు  కొట్టివేసింది. రోహింగ్యాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.
ఏడుగురు రోహింగ్యా ముస్లింలు 2012 నుంచి అసోంలో అక్రమంగా నివాసముంటున్నారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన వీరు ప్రస్తుతం సిల్చార్‌లోని ఓ శిబిరంలో ఉంటున్నారు. వీరి వద్ద ఎలాంటి నివాస గుర్తింపు లేని కారణంగా తిరిగి వీరిని  మయన్మార్‌ పంపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ ఏడుగురిని మణిపూర్‌లోని మోరె సరిహాద్దు వద్ద సంబంధిత అధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర విచారణ కింద ఈ పిటిషన్‌ను న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ ఏడుగురు అక్రమ వలసదారులని, విదేశీ చట్టం కింద జైలు శిక్షకు గురైనట్లు కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేగాక మయన్మార్‌ ప్రభుత్వం కూడా వీరిని తమ పౌరులుగా గుర్తించిందని చెప్పారు. వాదోపవాదాల అనంతరం ఈ రోహింగ్యాలను మయన్మార్‌ తరలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

13:00 - October 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై అక్కడక్కడ నెలకొన్న అసమ్మతికి అడ్డుకట్ట వేసేందుకే అధికార పార్టీ సమాయత్తమైంది. ఇప్పటికే దారికి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిన గులాబీ పార్టీ... క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేసింది. 

ముందస్తు ఎన్నికలకు సిద్దమైన గులాబీ దళపతి కేసీఆర్‌.. అసెంబ్లీని రద్దు చేసిన రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే... దాదాపు 30 స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని నేతలు అంచనా వేసినా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకే కేసీఆర్‌ పెద్ద పీట వేశారు. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో అసమ్మతి ఒక్కసారిగా రగిలింది. నెలరోజులుగా అసమ్మతి నేతలను హైదరాబాద్‌కు పిలిపించి ఓ వైపు బుజ్జగిస్తున్న పార్టీ పెద్దలు.. మరోవైపు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. 

ఇక నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన నేతపైన పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వరాదన్న డిమాండ్‌ చేస్తున్న నేతలపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలుకూడా పార్టీ దారికి వచ్చారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో నాగార్జునసాగర్‌ టికెట్‌ ఆశిస్తున్న కోటిరెడ్డి వర్గాల మధ్య సమన్వయం కుదిరింది. పార్టీ ప్రకటించిన అభ్యర్థి నోముల నర్సింహయ్యతో కలిసి పని చేసేందుకు అంగీకరించారు. 

మరోవైపు... పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అసమ్మతి నేతలు మద్దతిస్తే.. భవిష్యత్‌లో పార్టీపరంగా గుర్తింపు ఇస్తామన్న సంకేతాలను పార్టీ పెద్దలు ఇస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా వేనెపల్లి బహిష్కరణతో అసమ్మతి నేతలు దారికి వస్తారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. 

12:43 - October 4, 2018

ముంబాయి : స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ 622 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. 2 గంటల ట్రేడింగ్‌లోనే రూ.171000 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద నష్టపోయింది. రూపాయి పతనం, క్రూడాయిల్ ధరలు పెరుగడంతోపాటు ఆర్‌బీఐ వడ్డీ రేటు పెంచనుందనే అంచనాలే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

12:43 - October 4, 2018

పెళ్ళిచూపులు మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తరుణ్ భాస్కర్.. ఫస్ట్మూవీతోనే ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు.. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.. రెండో సినిమా ఈ నగరానికి ఏమైందితోనూ యూత్ ని ఆకట్టుకున్నాడు.. తరుణ్ భాస్కర్ త్వరలో హీరోగా నటించబోతున్నాడని తెలుస్తుంది.. తన పక్కన కేరళకుట్టి నిత్యామీనన్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అనేమాట ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.. తీవ్రవాద నేపధ్యంలో, ఓ తమిళ దర్శకుడు రూపొందించబోయే మూవీలో తరుణ్ భాస్కర్ పాతబస్తీ యువకుడిగా కనిపించబోతుండగా, అతనికి జంటగా నిత్యామీనన్ నటించబోతుందనేది విశ్వసనీయవర్గాల సమాచారం..
ఇంతకుముందు మహానటిలో దర్శకుడు కె.వి.రెడ్డిగా క్రిష్ కనిపించగా, ఆయన సహాయకుడు సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ నటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పూర్తిస్ధాయి హీరోగా చేయబోతుండడం, పైగా నిత్యామీనన్ హీరోయిన్ అనగానే ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తినెలకొంది...
దీంతోపాటు మరో సినిమాలోనూ తరుణ్ భాస్కర్ నటిస్తాడనీ, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఫిలిం వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది...
నటుడిగా ఈ దర్శకుడు  ఆడియన్స్ని ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి మరి...

12:21 - October 4, 2018

ముంబై : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. దీనితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. గత సెషన్ లో 550 పాయిట్లు తగ్గిన సెన్సెక్్స గురువారం ఏకంగా 700 పాయింట్ల మేర పతనం కావడం గమనార్హం. ప్రారంభం నుండే అమ్మకాల వత్తిడి అధికంగా ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, కరెంటు ఖాతాలతో మరింత పెరుగుతుందని అంచనాలు రావడం..దీని ప్రభావం మార్కెట్లపై పడింది. ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం అమ్మకాలపై వత్తిడి పెరుగుతోంది.  

ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ పతనమైంది. వరుసగా మూడో రోజు రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే 73.77కు రూపాయం మారకం పడిపోయింది. రాబోయే రోజుల్లో జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుతుందని అంచనాలున్నా ఆ దిశ కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రూపాయి మారకం విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎగుమతుల విషయాల్లో పలు చర్యలు తీసుకుంటే రూపాయి బలపడే అవకాశం ఉందని, వ్యవసాయ రంగంలో ఈ గ్రోత్ రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొంటున్నారు. 

11:55 - October 4, 2018

వాషింగ్టన్‌: అమెరికాలో నేడు మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కరొలినాలోని ఫ్లోరెన్స్‌ కౌంటీలో ఒక ఆగంతకుడు ఏకంగా పోలీసులపైనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.  ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆగంతకుడు  కొందరు చిన్నారులను బందీలుగా తీసుకుని రెండు గంటల పాటు పోలీసులను తన వద్దకు రానీయలేదు.  సుమారు రెండు గంటల తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఆగంతకుడు  జరిపిన కాల్పుల్లో గాయపడిన పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడు ఎవరో, ఎందుకు కాల్పులు జరిపాడో ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు . ఈ ఘటనపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తంచేస్తూ . మృతి చెందిన పోలీసు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 
ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 23 వేల 408 మంది పోలీసులు సర్వీసులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 112గా ఉన్నట్లు ఆఫీసర్ డౌన్ మెమోరియల్ పేజ్‌లో ఉంది. గత ఏడాది అమెరికాలో 15 వేల మంది తుపాకీ కాల్పుల్లో మరణించారని గన్ వాయిలెన్స్ ఆర్కీ అనే  వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 

11:46 - October 4, 2018

నల్గొండ : జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు సర్వం సిద్ధమైంది. శాసనసభ రద్దు తర్వాత జిల్లా కేంద్రం నల్గొండలో నిర్వహించనున్న ప్రజాశీర్వాద టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  హాజరుకానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి  25వేల మందికి తగ్గకుండా దాదాపు మూడు లక్షల మందిని సభకు తరలించేలా సెగ్మెంటుల అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వాహనాలలో పల్లెల నుంచి జనాలను  సభకు తరలించేలా ఇప్పటికే క్షేత్రస్థాయిలోని మండల స్థాయి నేతలకు బాధ్యతలు అప్పగించారు.

ఇక నల్లగొండ బైపాస్‌ రోడ్డులో మర్రిగూడ చౌరస్తా సమీపంలో 40 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు టీఆర్‌ఎస్‌ నేతలు. వాహనాల పార్కింగ్‌ కోసం ఐదుచోట్ల 160 ఎకరాలను కేటాయించారు. సభాస్థలి పక్కనే హెలిప్యాడ్‌ సిద్దం చేశారు.  వేదిక వెనక దాదాపు 100 అడుగుల దూరంలోనే  ముఖ్యమంత్రి కోసం హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, సభ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సహా పలువురు నేతలు వారం రోజులుగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ నిర్వహిస్తామంటున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. 

అధికారిక షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభావేదిక వద్దకు హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. ఇప్పటికే ప్రకటించిన పార్టీ  అభ్యర్థులు సహా రాష్ట్రంలోని కీలక నేతలంతా దాదాపు 80 నుంచి 90 మంది వరకు కూర్చునేలా వేదికను తయారు చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాని  మిత్రపక్షం సీపీఐతో సమానంగా తెరాస ఆరు స్థానాలు గెలుచుకుంది. అనంతర పరిణామాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతో దాని బలం ఎనిమిదికి పెరిగింది.  మరోవైపు కాంగ్రెస్‌ బలం ఐదు నుంచి నాలుగుకు తగ్గింది. ఈ స్థానాల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి పద్మావతి, సీఎల్పీ తాజా మాజీ నేత జానారెడ్డి,  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పద్మావతి మినహా ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డిలు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ  ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వీరిని ఓడించేందుకు టీఆర్ఎస్  వ్యూహరచన చేస్తోంది. నేడు నిర్వహించనున్న సభలోనూ వీరిని ఓడించేలా ప్రజలు పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  పిలుపునివ్వబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడి అభివృద్ధికి మాత్రం ఎలాంటి సాయం చేయలేదని.. అందుకు  వారిని ఓడించే విధంగానే సభ ఎజెండా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

గురువారం సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి అద్దంకి- నార్కట్‌పల్లి రహదారి నుంచి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు వెళ్లే  వాహనాలను నార్కట్‌పల్లి నుంచి కట్టంగూరు, నకిరేకల్‌ మీదుగా మిర్యాలగూడకు తరలిస్తారు. గుంటూరు, అద్దంకి, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు తిప్పర్తి నుంచి  నకిరేకల్‌ మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. కార్లు ఇతర చిన్న వాహనాలు పానగల్‌ నుంచి కట్టంగూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

11:42 - October 4, 2018

ఢిల్లీ : మళ్లీ జికా వైరస్ కలకలం రేపుతోంది. రాజస్థాన్ లో ఈ వైరస్ బారిన పడి పలువురు చికిత్స పొందుతున్నారు. ఏడుగురు ఈ వ్యాధి బారిన పడినట్లు, అందులో ముగ్గురు గర్భవతులున్నారు. జైపూర్ లోని శాస్త్రీనగర్ లో వైరస్ గుర్తించారు. సెప్టెంబర్ 2018లో 85 సంవత్సరాల వృద్దురాలు ఈ వ్యాధి వచ్చింది. దీనితో జికా వైరస్ మొదటి కేసు నమోదైంది. కొన్ని అనారోగ్యాల కారణంగా ఆసుపత్రిలో చేరగా ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వ్యాధులు సోకాయని వైద్యులు గుర్తించి మరిన్ని వైద్య పరీక్షల కోసం పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. రక్త పరీక్షలో 'పాజిటివ్‌' చూపించిందని ఎస్‌ఎమ్‌ఎస్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యుఎస్‌అగర్వాల్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కేంద్రం వెంటనే అప్రమత్తమైందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

ఎడిస్‌ ఈజిప్టు ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. ఎక్కువగా మోకాళ్ల కింది భాగంలో ఇది కుడుతుంది. కుట్టినప్పుడు ఎలాంటి నొప్పి గాని దురద కాని ఉండదు. జికా వైరస్‌, డెంగీ, గన్యా లాంటి జబ్బులు వస్తాయి. సువాసన గల పూల కుండీలు, నిల్వ ఉన్న నీరు, ఎయిర్‌ కూలర్ల, పాత టైర్లు, కొబ్బరి చిప్పల వద్ద ఎడిస్‌ ఈజిప్టు దోమలు ఎక్కువగా ఉంటాయి. పగటి పూట దోమలు కుట్టకుండా శరీరానికి పూత మందులు రాసుకోవాలి. నిండుగా దుస్తులు వేసుకోవాలి. వ్యాధి ప్రభావం కనిపిస్తే తగిన వైద్యున్ని సంప్రదించాలి.

11:24 - October 4, 2018

ఛండీఘర్ : నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో అనునిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. హర్యానాలో దారుణం జరిగింది. తల్లీకూతురిపై 2నెలలుగా 18 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

హర్యానా రాష్ట్రంలోని కైథాల్ కలాయత్ పట్టణానికి సమీపంలో ఉన్నగ్రామంలో తల్లి, 15 ఏళ్ల కూతురిపై 18 మంది కామాంధులు 2 నెలలుగా సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచారం జరిపిన కామాంధుల్లో ఏడుగురు హర్యానా పోలీసులు కూడా ఉండటం సంచలనం రేపింది. బాలిక ఫిర్యాదు మేర పోలీసులు 18 మంది కామాంధులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఏడుగురు పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు కూడా ఉన్నారని కైథాల్ జిల్లా ఎస్పీ అస్తామోదీ తెలిపారు. నిందితుల్లో ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అస్తామోదీ చెప్పారు.

 

11:11 - October 4, 2018

ఢిల్లీ : దేశంలోనే ప్రముఖ కంపెనీగా పేరొందిన రిలయన్స్‌ సంస్థ పలు రంగాల్లో ప్రవేశిస్తూ కోట్లను ఆర్జిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు...ఇతర కంపెనీలను టెకోవర్ చేస్తోంది. టెలికాం రంగంలో కూడా అడుగు పెట్టిన రిలయన్స్‌ తాజాగా మరోదానిపై కన్నేసినట్లు సమాచారం. త్వరలోనే కేబుల్ రంగంలో కూడా అడుగు పెట్టనుందని టాక్. ఆ సంస్థ త్వరలో అందుబాటులోకి తేనున్న గిగా ఫైబర్‌ హైస్పీడ్‌ హోమ్‌బ్రాండ్‌ సేవల కోసం బడా కేబుల్‌ ఆపరేటర్‌ సంస్థలను కొనుగోలు చేసేందుకు చర్చలు సాగిస్తోంది. 

హాత్‌వే సంస్థ ప్రధానంగా బ్రాడ్‌కాస్టర్ల నుంచి సర్వీసులను కొనుగోలు చేసి స్థానిక కేబుల్‌ ఆపరేటర్లకు అందించే వ్యాపారంలో ఉందనే సంగతి తెలిసిందే. దాదాపు 1.10 కోటి డిజిటల్‌ కేబుల్‌ టీవీ వాడకందారుల, 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ వాడకం దారుల ప్రస్తుతం హాత్‌వే ద్వారా సేవలను పొందుతున్నారు.

దేశంలో అతిపెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ సంస్థ అయిన హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ను కొనుగోలు చేయాలని రిలయన్స్‌ నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు సాగుతున్నాయంట. మొత్తం రూ. 2500 కోట్లకు పైగా ధర పలుకుతోందని తెలుస్తోంది.

11:00 - October 4, 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్.. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌ని ఎన్టీఆర్... కథానాయకుడు‌గా మార్చారు.. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసారు.. అలాగే, జానపద చిత్రాలు చేసేప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉండేవారో తెలిసేలా ఒక పోస్టర్‌ని కూడా విడుదల చేసారు.. ప్రతి కథకీ ఒక నాయకుడు ఉంటాడు.. కానీ, కథగా మారే నాయకుడు ఒక్కడే ఉంటాడు అంటూ ఒక పవర్‌ఫుల్ డైలాగ్ వాడుతూ ట్వీట్ చేసారాయన.. ఇంతకుముందు పోస్టర్స్‌లో అచ్చు తండ్రిలా మారిపోయిన తనయుడు బాలయ్యని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. ఇప్పుడీ జానపద లుక్‌లో బాలయ్యని చూసి అన్నగారిని చూసినట్టే ఉంది‌ అంటున్నారు.. పోస్టర్‌లో.. కెమెరా, లైటింగ్‌ని హైలెట్ చేస్తూ ఆ కాలంనాటి షూటింగ్ వాతావరణాన్ని స్పష్టంగా చూపించారు.. ప్రస్తుతం కృష్ణాజిల్లాలోని దివిసీమలో చిత్రీకరణ జరుగుతోంది..
ఎన్.బి.కె.ఫిలింస్,ఎల్.ఎల్.పి. సమర్పణలో, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నఎన్టీఆర్... కథానాయకుడు చిత్రం‌ 2019 జనవరి‌ 9వ తేదీన  రిలీజ్ కాబోతుంది..

10:51 - October 4, 2018

ముంబయి: స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా మదుపర్లు ఆందోళన పడుతుండడంతో సూచీలు పడిపోతున్నాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
ఈ రోజు సెన్సెక్స్‌ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 155 పాయింట్లకు పైగా పడిపోయి 10700 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్‌ 527 పాయింట్లు నష్టపోయి 35448 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 158 పాయింట్లు నష్టపోయి 10700 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.67 వద్ద ట్రేడవుతోంది.
నేడు ఎన్‌ఎస్‌ఈలో లార్సెన్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంత తదితర కంపెనీలు లాభపడుతున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, గెయిల్‌ తదితర కంపెనీలు నష్టపోతున్నాయి.

10:46 - October 4, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హావా కొనసాగుతోంది. కానీ అందరి చూపు మాత్రం ఒక చిత్రంపైనే ఉంది. ఆ చిత్రమే నందమూరి తారకరావు బయోపిక్ పై. ఆయన తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఫొటోలు విడుదలై అందర్నీ ఆకర్షించాయి. మిగతా పాత్రల్లో పలువురు నటులు కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్, చంద్రబాబునాయుడు పాత్రలో రానాలు కనిపించనున్నారు.

దీనిపై పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువహీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో యువ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా సినిమాలో ముఖ్యపాత్ర పోషించనున్నారని టాక్. తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పాత్ర కోసం విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా కేసీఆర్ ఎన్టీఆర్ అభిమాని అయిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 

ఇక ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దివిసీమలోని హంసదీవీ, కొడూరులో షూటింగ్ కు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. షూటింగ్‌లో బాలకృష్ణ, సుమంత్, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొంటున్నారని సమాచారం. 

10:18 - October 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంబంధ కార్యక్రమాలు చేపడుతోంది. పండుగలకు కూడా అధిక ప్రాముఖ్యతనిస్తూ పలు ఏర్పాట్లు చేస్తోంది. పండుగల సందర్భంగా ప్రజలకు పలు బహుమతులను అందచేస్తో్ంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకొనే ‘దసరా’ పండుగ సందర్భంగా కేసీఆర్ వినూత్న ఏర్పాట్లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధికార జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వు, వృక్షంగా జమ్మిచెట్టులను ఎంపిక చేసిన సంగతి విదితమే. 

అంతేగాకుండా తెలంగాణ ఆడబిడ్డల కోసం బతుకమ్మ పేరిట చీరలను పంపిణీ చేస్తోంది. గతంలో ఈ పంపిణీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి అత్యంత పకడ్బందీగా కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 12 నుండి బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ. 280 కోట్ల వ్యయంతో 96 లక్షల చీరలను సిద్ధం చేసేసింది. అంతేగాకుండా ఆయా జిల్లాలకు కూడా పంపిణీ చేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడం...ముందే అభ్యర్థులను ప్రకటించడం సంచలనం రేకేత్తించింది. దీనితో గత నెల 27వ తేదీ నుండి ఎన్నికల నిబంధనావళి అమల్లోకి 

10:09 - October 4, 2018

హైదరాబాద్....రవీంద్రభారతిలో గురువారం ఉదయం 11 గంటలకు బీసీ విద్యార్థి - యువజన గర్జన సదస్సు  నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల గత సంవత్సరం ఫీజు బకాయిలు రూ.2200 కోట్లను విడుదల చేయాలని, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, బీసీ, ఇబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను మంజూరు చేయాలనే  డిమాండ్‌తో  గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

09:55 - October 4, 2018

హైదరాబాద్ : మళ్లీ చమురు ధరలు పెరిగాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుతుండడంతో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. దీనికారణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు దేశీయ మార్కెట్‌లో రోజుకింత ధరల్ని పెంచుతూపోతున్నాయి. 
గురువారం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 20 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84కు చేరగా, లీజిల్ ధర రూ. 75.45కు పెరిగింది. ముంబైలో పెట్రోలు ధర రూ. 91.34కు, డీజిల్ ధర రూ. 80.10కి చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 89.06, డీజిల్ రూ. 82.07కు పెరిగాయి. విజయవాడలో పెట్రోలు రూ. 88.25, డీజిల్ రూ. 80.92కు, గుంటూరులో పెట్రోలు 88.45, డీజిల్ రూ. 81.12కు పెరిగాయి.

09:44 - October 4, 2018

హైదరాబాద్‌ : తెలంగాణలో మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక రూపుదిద్దుకుంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీల ముఖ్యనేతల సుదీర్ఘ చర్చల అనంతరం మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా సిద్ధమైంది. ఈ ముసాయిదా ప్రతులు నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, బాధ్యుల ఆమోదానికి పంపారు. వారి ఆమోదం అనంతరం ప్రజల ముందు పెట్టి సలహాలు, సూచనలు తీసుకుని ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ మల్లు భట్టివిక్రమార్క, తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నేత దిలీప్‌కుమార్‌తోపాటు ఆ పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను ఖరారు చేశారు.

ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఉండాలనే అభిప్రాయం చర్చకు రాగా అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన ఛైర్మన్‌గా ఉండటం వల్ల కూటమికి విశ్వసనీయత పెంచడమే కాకుండా అని వర్గాల ప్రజల విశ్వాసం పొందేందుకు ఉపయోగపడుతుందని భావించారు.
ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక సీట్ల సర్దుబాటుపై దృష్టిసారించనున్నారు. ఏయే పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఎక్కడకెక్కడ పోటీ చేయాలనే అంశాలపై శుక్రవారంగానీ శనివారం గానీ చర్చించనున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పదో తేదీలోపు సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించాలని నాలుగు పార్టీల నాయకులు నిర్ణయించారు.
ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. 
* ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇచ్చే వరకూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3 వేలు పంపిణీ 
* ఒక్కో రైతు కుటుంబానికి ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ 
* తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌. 
* రూ.10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. 
* కౌలు రైతులకు అన్ని రకాల భద్రత. 
* బలవంతపు భూసేకరణ నిలిపివేత. 
* భూనిర్వాసితుల పట్ల మానవీయ కోణం. యోగ్యులైన వారికి ప్రభుత్వ భూమి పంపిణీ. 
* ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో నిధి. 
* నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి. 
* రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం. 
* ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవడం. ప్రాజెక్టులను పునరాకృతి చేసి ప్రాధాన్యక్రమంలో నిర్మించడం. 
* కేజీ నుంచి పీజీ విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు సమగ్ర విధానం. 
* దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఉచితంగా కార్పొరేటు వైద్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే  కల్పించడం. 
* రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. 
* అన్ని పంటలకు బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు. 
* పేదలకు గృహనిర్మాణ పథకం అమలు, అర్హులందరికీ పక్కా ఇళ్లు. 
* ధర్నా చౌక్‌ పునరుద్ధరణ. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు కల్పన. 
* పంచాయతీల వారీగా ప్రణాళికల రూపకల్పన. వాటికి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపు.
* చాకలి ఐలమ్మ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాల నిర్వహణ. 
* ఆచార్య జయశంకర్‌ పేరిట విద్యాభివృద్ధి కార్యక్రమాలు. 
* కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో శిక్షణ కార్యక్రమాలు. 
* అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు. 
* బీసీ ఉప ప్రణాళిక రూపకల్పన. 
* ఒక ఏఎన్‌ఎం ఉన్నచోట మరొకరి నియామకం. 
* విద్యుత్‌, పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపు. 
* అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్‌ పదవుల భర్తీ. 
* కళాకారులు, ఉద్యమ కుటుంబాలకు పింఛన్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు. 
* పౌరసేవల చట్టం బలోపేతం, లోక్‌పాల్‌ ఏర్పాటు.

09:31 - October 4, 2018

తిరుమల.... వచ్చే జనవరిలో జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ  శుక్రవారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను జారీ చేస్తుంది. గురువారం ఉదయం 10 నుంచి 4 రోజులపాటు నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి. కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు సాధారణ విధానంలో వెంటనే టీటీడీ  వెబ్‌సైట్‌ నుంచి నమోదు చేసుకోవచ్చు. 

 

09:09 - October 4, 2018

తిరువనంతపురం : కేరళలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఆగస్టులో కేరళను వరదలు ముంచెత్తాయి. దారుణమైన ప్రకృతి వైపరీత్యానికి కేరళ ఎదుర్కొంది. ఈ భారీ వర్షాల కారణంగా 231 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా అరేబియా సముద్రం, శ్రీలంక తీరానికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఐఎమ్‌డీ హెచ్చరించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఆదివారం నాడు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని ఆయన అన్నారు. ముందస్తు జాగ్రత్తగా జాతీయ విపత్తు దళాన్ని అందుబాటులో ఉంచాలని కేరళ ప్రభుత్వం కేందాన్ని కోరింది. అక్టోబరు 5 కల్లా మత్స్యకారులు తీరానికి వచ్చేయాలని సూచించారు. ఈ వర్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారయంత్రాంగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. అలాగే మన్నార్‌ నుంచి నీలకురింజి ప్రాంతాలు, ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు పర్యాటకులు రావొద్దని ఆయన సూచించారు. ఈ అల్పపీడనం భారీ తుపాన్‌గా మారే అవకాశం ఉందని, అనంతరం లక్షద్వీప్‌ వైపు ప్రయాణిస్తుందని తెలిపారు.

 

08:59 - October 4, 2018

జోగులాంబ గద్వాల : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. ఈరోజు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాలలో ప్రత్యేక పూజల అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. జోగులాంబ అమ్మవారికి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతితోపాటు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. అనంతరం అలంపూర్, ఐజ, శాంతి నగర్ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ మూడు హెలికాప్టర్లను వినియోగించనుంది. 

08:12 - October 4, 2018

నల్గొండ....ముఖ్యమంత్రి కే.సీ.ఆర్.ఈరోజు నల్గొండలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో నేడు జరిగే టీఆర్ఎస్ సభ ప్రాముఖ్యం సంతరించుకుంది. టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులను ఓడించడమే లక్ష్యంగా నేటి సభ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి 3 రోజులుగా నల్గొండలో ఉండి సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో 12 శాసనసభ స్దానాలకు గాను 6 స్ధానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ ఎన్నిక్లలో  మెజార్టీ స్ధానాలు గెలవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. 

07:57 - October 4, 2018

కొలంబో: శ్రీలంకలో 150 మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. శ్రీలంక ఈశాన్య ప్రాంతం మన్నార్‌ జిల్లాలో మానవ అస్థిపంజరాలు కుప్పలుగా వెలుగుచూశాయి. నిన్న అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ 150కి పైగా అస్థిపంజరాల్ని కనుగొన్నట్లు తెలిపారు. దేశంలో 30 ఏళ్ల క్రితం అంతర్యుద్ధం కొనసాగిన క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారి మృతదేహాలుగా భావిస్తున్నారు. 14 మంది చిన్నపిల్లల అస్థిపంజరాలు తాజాగా బయటపడ్డాయి. 

పాత కో-ఆపరేటివ్‌ స్టోర్‌ స్థలంలో కొత్త భవనం నిర్మించేందుకు మార్చి నుంచి ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. మన్నార్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సంబంధించి ఓ గదిని నిర్మించేందుకూ పనులు నిర్వహిస్తున్నారు. 1983 నుంచి 2009 మధ్యకాలంలో మన్నార్‌ ప్రాంతం ఎల్‌టీటీఈ అధీనంలో ఉంది. 1990లో సుమారు 25 వేల మంది పౌరులు కనిపించకుండా పోయారని వార్తలు వెలువడ్డాయి. 

 

Don't Miss