Activities calendar

05 October 2018

21:40 - October 5, 2018

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన నాటి నుండే ఎన్నికల కోడ్ అమలులో వుంటుందని స్పష్టం చేసిన ఎలక్షణ్ కమిషన్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదనీ..అమలులో వున్న  పథకాలైన రైతు బంధు పథకం, బతుకమ్మ చీరల పంపిణీలను నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్‌‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు చెక్కుల పంపిణీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే రైతుబంధు వర్తింపజేయాలని సూచించింది. రైతుబంధు జాబితాలో కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని షరతులు విధించింది. చెక్కుల రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లలో జమచేయాలని ఆదేశించింది. అదేవిధంగా రైతుబంధులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూదని తేల్చి చెప్పింది.
 రైతుబంధు చెక్కుల పంపిణీని నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని వివిధ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిని పరిశీలించిన సీఈసీ.. చెక్కులు పంపిణీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో రెండో దఫా రైతుబంధు చెక్కుల పంపిణీకి మార్గం సుగమం అయింది. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పేరుతో రైతబంధు పథకం తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఈసీ నిర్ణయంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

21:07 - October 5, 2018

ఢిల్లీ : పొగాగు ప్రాణాంతకమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కానీ పలువురు పొగాగు ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న క్యాన్సర్ బారిన పడి మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్న దేశాల జాబితాపై కెనడియన్‌ క్యాన్సర్‌ సొసైటీ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా శ్రేయస్సు కోసం పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు జారీ చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌కు ఐదో స్థానం లభించింది. పొగాకు సహా గుట్కాలు, పాన్‌లు వంటి ఉత్పత్తులపై గ్రాఫిక్స్‌తో ఆరోగ్య హెచ్చరికలు చేస్తున్న దేశాల జాబితాను కెనడియన్‌ క్యాన్సర్‌ సొసైటీ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 206 దేశాలకు ర్యాంకులు దక్కగా... వీటిలో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆగ్నేయాసియాలోని ఓ చిన్న దేశం తూర్పు తైమూరు నిలిచింది. ఈ దేశంలో సిగరెట్‌ ప్యాకెట్లపై ముందువైపు 85 శాతం, వెనుక వైపు వంద శాతం స్థలం ఆక్రమించేలా ఆరోగ్య హెచ్చరికలు చేస్తుండడం విశేషం.
పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరికలు వేయడాన్ని తొలిసారిగా 2001లో కెనడా తప్పనిసరి చేయగా.. ప్రస్తుతం 118 దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. భారత్‌లో ఈ నిబంధన సుప్రీంకోర్టు, రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశాలతో 2016లో తప్పనిసరి అయింది. ‘‘ఈ ఏడాది సెప్టెంబరు నుంచి భారత్‌లో సిగరెట్, బీడీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లపై 85 శాతం భాగం హెచ్చరిక కనిపించేలా నిబంధన తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు భారత ప్రభుత్వం క్విట్‌ లైన్‌ నంబర్‌ అనే విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా సదరు ఉత్పత్తి వాడకం ఎంత ప్రమాదకరమైందో నిరక్షరాస్యులకు సైతం తెలిసే వెసులుబాటు ఉంటుంది.’’ అని పొగాకు నియంత్రణ కోసం పని చేస్తున్న భారత స్వచ్ఛంద ఆరోగ్య సంఘం సభ్యుడు బినోయ్‌ మాథ్యు వెల్లడించారు.

20:25 - October 5, 2018

ఢిల్లీ : సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. సంగీతంతో పశువులుకూడా నాట్యం చేస్తాయంటారు. సంగీతానికి దేశం, ప్రాంతం, భాష, శతృవులు, మిత్రులు వంటి తారతమ్యాలు వుండవు. అదొక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అందరు ఆనందంగా విహరించవచ్చు. భాషాభేధం లేని తన సంగీతంతో రాష్ట్రం, ప్రాంతం అంటూ సరిహద్దులు ఉండవని ఓ పాక్‌ గాయకుడు నిరూపించారు. మహాత్మాగాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన గాయకుడు షఫ్‌ఖత్‌ అమనత్‌ అలీ ప్రముఖ భజన గీతం ‘వైష్ణవ్‌ జనతో’ను అద్భుతంగా పాడారు. గాంధీజీ జయంతి వేడుకల్లో భారత్‌తోపాటు వివిధ ప్రపంచ దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 124 దేశాలకు చెందిన కళాకారులు బాపూజీకి ఎంతో ఇష్టమైన భజన గీతాన్ని ఆలపించారు. కానీ అలీ పాట ఎంతో మందికి బాగా నచ్చింది. ఎందరో హృదయాలను కదిలించింది. ఆయన అద్భుతంగా పాడారని భారత్‌, పాకిస్థాన్‌ రెండు దేశాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారత విదేశాంగ శాఖ అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాల్లోని కళాకారులు గాంధీజీకి ఇష్టమైన భజనను ఆలపించేందుకు ముందుకు వచ్చారు. అలీ అద్భుత ప్రదర్శన చేసిన వీడియోను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఎంతో మంది షేర్‌ చేశారు. అలీ శ్రద్ధతో, భక్తితో చాలా బాగా పాడారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

20:01 - October 5, 2018

ఢిల్లీ :  నలుపు, తెలుపు రంగులు పక్క పక్కనుంటే అందరి చూపు నలుపు వైపే మళ్లుతుంది. తెల్లటి కాగితంపై చిన్నపాటి నల్లటి చుక్క వుంటే దానివైపే అందరు చూస్తారు. కానీ తెల్లకాగితంవైపు చూడరు. కానీ నల్లటి అమ్మాయి..తెల్లటి అమ్మాయి పక్క పక్కనుంటే అందరి చూపు తెల్లటి అమ్మాయివైపే మళ్లుతుంది. కారణం తెల్లడి శరీరఛాయ అంటేనే అందరికీ మక్కువ కాబట్టి, శరీరపు రంగు చూస్తారే తప్ప మనసు రంగు ఎవరు చూడరు. ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. కానీ నలుపు తెలుపులు కలగలిని ఓ ఫోటో మాత్రం లక్షలాదిమంది అభినందలను పొందుతోంది. శరీర రంగు ముఖ్యంకాదని ఈ ఫోటో చాటి చెబుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో సందేశాత్మకంగా మారింది.  కెనడా నుండి జైనాబ్ అన్వర్ అనే వ్యక్తి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. తనకు తానుగా తీసుకున్న ఈ ఫోటోలో ఆంతర్యాన్ని గుర్తించాలంటే బంగ్లాదేశ్ కు చెందిన చిత్రకారిణి వసేకా నహర్ గురించి తెలుసుకోవాల్సిందే.
తాను గీసిన చామన ఛాయగా వున్న ఓ యువతి ఓ క్రీమ్ ట్యూబ్ తో వున్న ముఖచిత్రాన్ని నమర్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ట్యబ్ పై ‘డార్క్ అండ్ లవ్లీ’ అని రాసి వుంది. మన శరీర రంగు ఎలా వున్నా..అది అందమే అనేది దానికి అర్థం. చర్మ రంగుపై ఈ హైటెక్ యుగంలో కూడా వివక్ష కొనసాగుతోందని తెలియజేయటానకే ఈ చిత్రం అని నమర్ తెలిపింది. 
కాగా కెనడా నుండి జైనాబ్ అన్వర్ అనే నటి వసేకా గీసిన బొమ్మలో వుండే యువతిలా తనకు తానే ఫోటోను తిసుకుని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. తాను చిన్ననాటి నుండి తాను తెల్లగా మారాలని మార్కెట్స్ లోని క్రీములను వాడేవారని..ఇప్పటికీ సమాజంలో వర్ణ వివక్ష కొనసాగుతోందని..అటువంటివారందరినీ ఈ చిత్రం ఒక సందేశం కావాలని..అందం అంటే రంగు కాదనే విషయాన్ని అందరు తెలుసుకోవాలనీ..తెలుసుకోవాల్సిన అవసరముందని  జైనాబ్ కోరింది. ఈ ఇద్దరి మహిళల సందేశాత్మక చిత్రాలు సోషల్ మీడియాలో ప్రశంసల్ని అందుకుంటున్నాయి. 
 

19:37 - October 5, 2018

విశాఖ: అరిలోవ బాలాజీన‌గ‌ర్ లోని స్థానికులు పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది. 2వేల రూపాయ‌ల నోట్లు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. 2వేల రూపాయ‌ల నోటుని చూసి వారు షాక్ అవుతున్నారు. దీనికి కార‌ణం ఏంటంటే.. ఆ నోట్లు చిరిగిపోయి ఉండ‌ట‌మే. బాలాజీన‌గ‌ర్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో రెండు రోజులుగా చిరిగిన రూ.2వేల నోట్లు వ‌స్తున్నాయి. దీంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. 

ఇలా ఒక‌రికో ఇద్ద‌రికో కాదు.. సుమారు 10మంది ఖాతాదారుల‌కు ఈ అనుభ‌వం ఎదురైంది. వారంద‌రూ వెంకోజీపాలెంలోని బ్యాంకు మేనేజ‌ర్ కు ఫిర్యాదు చేశారు. అయితే న‌గ‌దును తాము డిపాజిట్ చేయ‌డం లేద‌ని, ఏజెన్సీకి అప్ప‌గించామ‌ని, బ్యాంకు మేనేజ‌ర్ స్ప‌ష్టం చేసి త‌మ త‌ప్పేమీ లేద‌న్న‌ట్టు చేతులు దులుపుకున్నారు. కానీ ఏజెన్సీ వాళ్లు మాత్రం మ‌రో వెర్ష‌న్ వినిపిస్తున్నారు. బ్యాంకు ఇచ్చిన నోట్ల‌నే తాము మెషీన్ల‌లో పెడ‌తామ‌ని.. ఇందులో మా త‌ప్పు కూడా ఏమీ లేద‌ని బ‌దులిస్తున్నారు. దీంతో క‌స్ట‌మ‌ర్లు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. అటు బ్యాంకు సిబ్బంది, ఇటు ఏజెన్సీ వాళ్లు.. ఇద్ద‌రూ త‌ప్పించుకోవ‌డంతో వినియోగ‌దారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య ఎవ‌రికి చెప్పాలి మ‌హాప్ర‌భో..? అని ఆవేద‌న చెందుతున్నారు. 

19:27 - October 5, 2018

విజ‌య్ దేవ‌ర‌కొండ‌. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో విజ‌య్ క్రేజ్ కొండంత పెరిగింది. గీత గోవిందం సినిమాతో ఆ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు నోటా సినిమాతో మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ కెరీర్ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘నోటా’ సినిమాతో విజయ్ తమిళంలో కూడా అడుగుపెట్టిన‌ట్టైంది. ఈ సంద‌ర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడాడు. పలు అంశాలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత తనకు భారీగా క్రేజ్ వచ్చిందని విజయ్ తెలిపాడు.

ఇక ఇటీవల ఓ విదేశీ యువతితో విజ‌య్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ యువ‌తి డిన్నర్ చేస్తున్న ఫొటో హాట్ టాపిక్ అయింది. విజ‌య్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రు? అని ఫ్యాన్స్ తీవ్రంగా చ‌ర్చించుకున్నారు. తాజాగా ఆ విష‌య‌మై విజ‌య్ స్పందించాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిదని విజయ్ కితాబిచ్చాడు. ఇక మిగిలిన విషయాలను మరిచిపోవాలని నవ్వుతూ జవాబిచ్చాడు. బెల్జియం దేశానికి చెందిన యువతితో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ యువ‌తి గురించి పెద్ద‌గా వివ‌రాలేవి చెప్ప‌కుండా విజ‌య్ మ‌రోసారి ఎస్కేప్ అయ్యాడు.

తన పేరును ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని సొంత ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టినట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఎవరైనా మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పెట్టినట్లు వెల్లడించాడు. తనకు కథపైనా, వ్యక్తులపైనా నమ్మకం కుదిరితేనే సినిమాను చేస్తానని దేవరకొండ స్పష్టం చేశాడు.

ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ గురించి ఆలోచించేందుకు సమయమే లేదని విజ‌య్ చెప్పాడు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను చేస్తూ తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని తెలిపాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత  యాక్టింగ్ మానేసి దర్శకత్వం-రచన వైపు వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. కానీ అంతలోనే వరుస సినిమా అవకాశాలు వచ్చాయన్నాడు. ప్రస్తుతం దక్కిన గుర్తింపు, క్రేజ్ తో తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

19:24 - October 5, 2018

హైదరాబాద్ : యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఒత్తిడిని జయించాలన్నా..ఫిట్ నెస్ గా వుండాలన్నా...ఆరోగ్యంగా వుండాలన్నా యోగా తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు యోగా అంతే పెద్దగా ప్రాచుర్యం లేదు. కానీ మానసికంగా..శారీకంగా ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు అందరు యోగా వైపే చూస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ యోగావైపే పయనిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన విషయం. కాగా యోగా ఆసనాలు వేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చున్నామా? లేదా సరైన పొజిషన్ లోనే ఆసనాలు వేస్తున్నామా? అనే అనుమానం వుంటుంది. ఇక ఈ అనుమానం మనసులోకి వచ్చింది అంటే యోగా చేస్తున్నా..మనసు మాత్రం దానిపై లగ్నం చేయలేము. మరి దీనికి పరష్కారం చూపిస్తోంది ‘స్మార్ట్ మ్యాట్’ ఇది ఫోన్ తో అనుసంధానమై వుంటుంది. మనం యోగా చేసే పొజిషన్ ని, యోగా చేస్తున్న సమయాన్ని రికార్డ్ చేస్తుంది. అంతేకాదు. మనం కరెక్ట్ గా చేయకపోయినా..సరైన శరీరం ఆసనాల పద్ధతిలో కాకుండా వేరే భంగిమలో  మళ్లితే ఈ స్మార్ట్ మ్యాట్ హెచ్చరిస్తుంది. మన శరీర కదలికల్ని విశ్లేషిస్తుంది. కాళ్లు, చేతులపై ఆసనాల ద్వారా పడే ఒత్తిడిని మనకు సూచిస్తుంటుంది ఈ స్మార్ట్ మ్యాట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్మార్ట్ మ్యాట్ మనకు యోగా ట్రైన్డ్ మాస్టర్ లా మనల్ని గైడ్ చేస్తుంది. ఇది మార్కెట్స్ లోనే కాక ఆన్ లైన్ లో కూడా అందుబాటులో వుంటుంది. మరి స్మార్ట్ గా అవ్వాలంటే ఈ స్మార్ట్ మ్యాట్ మీరు కూడా పక్కనే పెట్టుకోండి. దీని ధర సుమారుగా  రూ.4వేల వరకు వుంటుంది.

 

19:21 - October 5, 2018

కర్ణాటక : ముస్లింల సంప్రదాయాలు చాలా కఠినంగా వుంటాయి. హిందు దేవుళ్ల వైపువ వారు కన్నెత్తికూడా చూడరు. అంతేకాదు..హిందువుల సంప్రదాయాలన్నా..వారి పురాట కథలన్నా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ ఓ ముస్లిం విద్యార్థి మాత్రం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను అవలీలగా చదివేశాడు. అంతేకాదు ఇస్కాన్ సంస్థవారు నిర్వహించిన భగవద్గీత క్విజ్ కార్యక్రమంలో విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. బెంగళూరుకు చెందిన ముస్లిం విద్యార్థి షేక్‌ మొయినుద్దీన్‌ విజేతగానిలిచి అబ్బురపరిచాడు. స్థానిక సంయజనగరలో 7-10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలను ఇస్కాన్‌ నిర్వహించింది. సుభాష్‌ మెమోరియల్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మొయినుద్దీన్‌ 14 పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులను అధిగమించి, మొదటి స్థానంలో నిలిచాడు. క్విజ్‌కు సంబంధించి ఇస్కాన్‌ అందించిన ప్రతులను చదువుకుని పోటీలో గెలిచాననీ..విజేతగా నిలవడం ఆనందంగా వుందని మొయినుద్దీన్‌ తెలిపాడు. విజేతకు గురువారం ప్రశంసాపత్రాన్ని, బహుమతులను ఇస్కాన్‌ ప్రతినిధులు అందించారు.
 

17:52 - October 5, 2018

అమరావతి : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.  ముఖ్యమంత్రినైనా నాపైన కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన కేసీఆర్ సాటి తెలుగు రాష్ట్రం అయిన ఏపీ సీఎం చంద్రబాబుపై మాత్రం తాను నోటికి ఎంతవస్తే అంత మాట్లాడటం మాత్రం సబబుగా భావిస్తున్నారు. తాను చెప్పిన నీతులు తనకు మాత్రం వర్తించవన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తు..ఏపీ సీఎంను తిడితే చాలు ఓట్లు రాలతాయనే సెంటిమెంట్ ను అవలంబిస్తున్నారు. ప్రజాశీర్వాద సభలలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదాస్ప వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై  ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి  మాట్లాడుతు.. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని..నోటి దురద ఎక్కువై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్ నైజమని ఇప్పటికైనా కేసీఆర్ తను మాట్లాడే తీరును మార్చుకోవాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సూచించారు.

17:34 - October 5, 2018

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విపక్షాలపై విమర్శల వర్షం గురిపించారు. మాటల తూటాలు పెంచుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలను ఎండగడుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనితో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంది. తాజాగా వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 58 ఏళ్లు పాలించాయని, రైతు గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని కేసీఆర్ తెలిపారు. శాసనసభలో బండారం బయటపడుతుందని కాంగ్రెస్ వాళ్లు పరారయ్యారని, ఏ నది ఎక్కడుందో కాంగ్రెస్‌ళ్లోకి తెలియదని తెలిపారు. పోతరెడ్డి పాడుకు పొక్క పెట్టింది రాజశేఖరరెడ్డి అని, కాంగ్రెస్ నేత డీకే అరుణ విమర్శలు చేశారని, డీకే అరుణ సిగ్గు లేకుండా రఘువీరారెడ్డికి హారతి తిప్పిందని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లడాలని, పోతరెడ్డిపాడుకు పొక్క పెడితే టీఆర్ఎస్ మంత్రులు రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. 

17:29 - October 5, 2018

కాంగో : నోబెల్ బహుమతి వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపుగా..వారిని గౌవరివిస్తు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2018లో ఇద్దరికి లభించింది. కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్‌వెగె, 2014లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదుల చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైన యాజిదీ తెగ యువతి నదియా మురాద్ లను సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. యుద్ధ రంగంలో లైంగికదాడిని ఓ ఆయుధంగా వాడటంపై వీరు చేసిన పోరాటానికి గానూ నోబెల్ అకాడమీ వీరిని శాంతి బహుమతితో గౌరవించింది.
ఈ అవార్డు కింద అందనున్న 7.35 కోట్లను  ఇద్దరు విజేతలు సమంగా పంచుకోనున్నారు. ప్రపంచంలో అత్యాచారాలు, ఘర్షణలు అధ్యధికంగా చెలరేగే దేశంగా కాంగోకు పేరుంది. అక్కడ రోజుకు కొన్ని వందల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతాయి. వేర్వేరు తెగలు, నాయకుల మధ్య జరిగే అంతర్గత సాయుధ ఘర్షణల్లో సాధారణ మహిళలపై సైనికుల అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. 
1990 దశకంలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచి ముక్‌వెగె వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బాధితులకు చికిత్స అందించడంతో పాటు చదువు నేర్పించి, తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులకు శిక్ష పడేందుకు పోరాడుతున్నారు. ఇక నదియా మురాద్ అనే 25 మహిళ ఇరాక్ లో ఉండగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆమె ఊరిపై దాడిచేశారు. అదే గ్రామానికి చెందిన వందలాది మంది యాజిదీ జాతి పురుషులను, వృద్ధ మహిళలను కాల్చిచంపారు.
అనంతరం నదియా సహా వందలాది మంది యాజిదీ జాతి మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కొన్ని రోజుల అనంతరం నదియాను అమ్మేశారు. చివరికి ఆమె ఎలాగోలా ఐఎస్ఐఎస్ చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యులతో పాటు మిగతా గ్రామస్తులను చంపిన ఉగ్రవాదులకు శిక్ష పడేందుకు పోరాడుతోంది. ఉగ్ర చర్యల కారణంగా మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన యువతులు, మహిళలకు నదియా అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ 2018 సంవత్సరానికి అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.

17:23 - October 5, 2018

వనపర్తి : స్పీకర్‌గా ఉన్న సమయంలో పాలమూరుపై సభలో చర్చలు జరిగేవని..ఇక్కడి పేదరికం విని తనకు ఎంతగానో బాధించిందని మాజీ స్పీకర్, టీఆర్ఎస్ నేత సురేష్ కుమార్ తెలిపారు. వనపర్తిలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత...నాలుగున్నర సంవత్సర కాలంలో వనపర్తి ఎంతగానో అభివృద్ధి జరిగిందన్నారు. తాను ఈ సభకు వస్తుంటే నీళ్ల చప్పుడు హెలికాప్టర్‌లో ఉన్న తనకు వినిపించిందని తెలిపారు. ప్రస్తుతం వలసల గురించి చర్చ జరగడం లేదని..అప్యాయతలు..ప్రేమలు కనిపిస్తున్నాయని తెలిపారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా నిలిచిందన్నారు. ప్రాంతాలకు..సంప్రదాయాలకు భిన్నంగా మహా కూటమి ఏర్పడిందని, ఇది మహా కూటమి..మహా కుట్రనా అని విమర్శించారు. తుఫాన్ వాళ్ల పార్టీలో ఉందని తెలిపారు. 

17:11 - October 5, 2018

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల అరవింద సమేత వీరరాఘవ మూవీ మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..
రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కొత్త అప్‌డేట్స్‌తో అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్‌కి సంబంధించి ఒక వార్త బయటకొచ్చింది.. ఇప్పటివరకూ, అక్షరాలా 93 కోట్ల రూపాయలమేర అరవింద సమేత ధియేట్రికల్ బిజినెస్ జరిగింది.. ఇది తారక్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బెస్ట్ ప్రీ- రిలీజ్ బిజినెస్.. ఏరియాల వారీగా చూస్తే, నైజాం 19.50 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, గుంటూరు 7.5కోట్లు, కృష్ణా 5కోట్లు(అడ్వాన్స్), ప.గో.జిల్లా 4.90కోట్లు, నెల్లూరు 3.30కోట్లు, ఈ‌ లెక్కన ఆంధ్రా, తెలంగాణాలో మొత్తంగా 71కోట్లు బిజినెస్ జరగగా, కర్ణాటక, తమిళనాడు లాంటి ఏరియాలకి 9.50కోట్లు, ఓవర్సీస్ 12.50కోట్లు, ఓవరాల్‌గా 93 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.. జై లవకుశ దాదాపు 80 కోట్లు కలెక్ట్ చేసింది.. ఆ లెక్కన అరవింద సమేత ఫస్ట్ వీక్‌లోనే 100కోట్ల వరకూ షేర్ రాబట్టాల్సి ఉంది... సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే అంతమొత్తం వసూలు చేసే చాన్స్ ఉంది... మరోవైపు ఆంధ్రా, తెలంగాణాలో బెన్ ఫిట్ షోలకోసం ఇప్పటినుండే పోటీ నెలకొంది...

16:46 - October 5, 2018

కర్ణాటక : అనేక సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతల్లో పనిచేసిన ఎస్‌ ఎం కృష్ణ అసంతృప్తితో రాజకీయ సన్యాసం తీసుకోనున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ అధిష్టానం తనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి శాసనసభ ఎన్నికల సమయంలో బీజెపి తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎం ఎస్‌ఎం.కృష్ణ ఇక్క డ కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అతి త్వరలోనే ఎస్‌ఎం.కృష్ణ ఆత్మ కథ విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగే సభలో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపిలపై తనకు పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని కృష్ణ తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది. 
 ఒక వేళ ఇదే కనుక జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయాలపై ప్రభావం చూపడం తథ్యమని బీజెపి నేత ఒకరు తెలిపారు. కాగా ఎస్‌ఎం.కృష్ణ రాజకీయ సన్యాసం చేస్తూనే ఆయన రెండో కుమార్తె శాంభవి తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించాలని బీజేపి భావిస్తోంది.

16:07 - October 5, 2018

హైదరాబాద్ :  అచ్చమైన పచ్చిదనాన్ని పాతరేసిన నిజాయితీకి పట్టంకట్టిన స్వచ్ఛమైన అభిమానులకు అద్దం పట్టింది బిగ్ బాస్ విన్నర్ కౌశల్ విజయం. విన్నర్ గా నిలిచినా..తన సహజమైన ధాతృగుణాన్ని విడలేదు.విన్నర్ గా నిలిచిన కౌశల్ కి వచ్చిన ప్రైజ్ మనీని కూడా క్యాన్సర్ రోగుల కోసం వినియోగిస్తానని చెప్పటం దానికి నిదర్శం. ఒంటరిపోరులో అడుగడుగునా..ప్రతీ క్షణం కౌశల్ కి అండగా వుండి ఓట్లు వేసిన అభిమానులకు కలిసేందుకు స్వయంగా తానే ఓ యాత్రకూడా చేపట్టి అభిమానులను పర్సనల్ గా కలిసి ధన్యవాదాలు తెలుపుతానని కౌశల్ అనటం అతని వ్యక్తిత్వానికి దర్పణంగా కనిపిస్తోంది. 
కౌశల్ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్ సీజన్ 2 అంత గొప్ప సక్సెస్ సాధించంటే దానికి కారణం కౌశలే. ఆయన పేరుతో ఆర్మీ ఏర్పడటం.. అది రోజురోజుకూ భారీగా పెరిగిపోయి.. చివరకు ‘బిగ్‌బాస్’ను శాసించే స్థాయికి చేరుకోవటంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కౌశల్ అర్మీకి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కౌశల్‌కి వ్యతిరేకంగా హౌస్‌లో ఎవరు ప్రవర్తించినా వారిని ట్రోల్ చేయడం ఈ ఆర్మీ చేసింది. అయితే కౌశల్ భార్య నీలిమ కూడా గతంలో ఓ వీడియో సందేశం ద్వారా కంటెస్టెంట్స్ ఎవరినీ ట్రోల్ చేయొద్దని కోరారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
స్వంత ఆలోచన లేకుండా ఎప్పుడు ఎవరికరిపై వాలిపోయి ఆఖరికి ఫైనల్స్ కు చేరే విషయంలో కూడా తనదైన ఎఫట్ చూపించకుండా కేవలం కేవలం జాలితోను, బోండింగ్ ని అడ్డుపెట్టుకుని ఫైనల్ కు చేరుకోవటంలో కూడా సామ్రాట్ తన దైనశైలిలోనే వున్నాడు. కానీ ఎంతవరకూ పనిచేస్తాయి. విలువలేని..నిజాయితీ లేని పనులు? అందుకే ఎలిమినేట్ అయ్యాడు. నిత్యం ప్రజల వద్దకు వచ్చిన ఎలిమినేషన్ లో నుండి విజయం సాధిస్తు వచ్చాడు కౌశల్. వీరిద్దరికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందనే విషయం చూసినవారికి అర్థం అవుతుంది. కానీ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన మేధావులు అనే పేరు పొందినవారికి కూడా అర్థం కాని విషయం ఏమిటంటే..కౌశల్ విజయాన్ని కూడా ఫేక్ గా అభివర్ణించటం వారి అవివేకానికి నిదర్శం. ఈనేపథ్యంలో షో పూర్తయిన తరువాత బైటకొచ్చిన పొడుగుకాళ్ల వీరుడు సామ్రాట్ కౌశల్ ఆర్మీ దెబ్బకు చితైపోయాడు. తనపై తోటి కంటెస్టెన్స్ పై వచ్చే ట్రోల్స్ కి చూడా బిత్తరపోయాడు. తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కౌశల్ పై రాజకీయాలు చేసే గ్యాంగ్ లో నిత్యం పాలు పంచుకునే సామ్రాట్ కౌశల్ కి రిక్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు.  
 ‘‘కౌశల్ అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా నువ్వు కష్టపడుతున్నావు. నేను కూడా 11 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ‘నీ కోరిక ప్రకారం సక్సెస్ అంతా నీ దగ్గరకు వస్తుంది’ అని నీకొక విష్ కూడా రాయడం జరిగింది. నీకు అంత అభిమానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్లీజ్ మరోకోణం కూడా చూడు. అభిమానం పేరుతో మనతో ఇంట్లో అంటే బిగ్‌బాస్ హౌస్ ఉన్న అమ్మాయిల్ని ట్రోల్ చేయడం జరుగుతోంది. అది కూడా గేమ్ అనుకుందాం. కానీ గేమ్ అయిపోయింది. ఇంత అభిమానంతో నీకు రెస్పాన్సిబులిటీ కూడా పెరిగింది. ఆ రెస్పాన్సిబులిటీతోనే ఆ ట్రోల్స్‌ని ఆపు’’ అంటూ సామ్రాట్ రిక్వెస్ట్ చేశాడు. మరి దీనిపై కౌశల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

16:01 - October 5, 2018

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్..మరలా పాత వాడీవేడిని చూపిస్తున్నారు. మాటలు..చేతలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. తనదైన యాసలో మాటల తూటాలు పేల్చే కేసీఆర్ ప్రసంగాలను చాలామంది ఆసక్తిగా వింటుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలపై ఘాటైన మాటల దాడి చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు హడావుడి నెలకొంది. ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం ఎన్నికల ప్రచారంలో దూసుకపోతోంది. గులాబీ బాస్ ఆశీర్వాద్ పేరిట సభలు నిర్వహిస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. విపక్షాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభలు నిర్వహిస్తోంది. వనపర్తిలో కాసేపట్లో ఆశీర్వాద్ బహిరంగసభ నిర్వహిస్తోంది. హుస్నాబాద్, నిజామాబాద్, నల్గొండ సభల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న నాలుగో ఎన్నికల ప్రచార సభ ఇది. గత సభల్లో విపక్షాలను ఎండగట్టిన కేసీఆర్ ఎలాంటి మాటలు పేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందిని సభకు తరలించేలా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 60 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

15:57 - October 5, 2018

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ యంగ్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ రూపొందబోతోంది అనే వార్త ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది..
తమిళ్, హిందీ పరశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకురాలు సుధ కొంగర, సూర్య కాంబోలో మూవీ ఉండబోతోందని గతకొద్ది రోజులుగా ఫిలింవర్గాల్లో చర్చ జరుగుతోంది.. హిందీలో సాలా ఖడూస్‌గా రూపొంది, తమిళ్‌లో ఇరుది సుట్రుగా డబ్ అయి, తెలుగులో గురుగా రీమేక్ అయిన చిత్రాలకి ఆమే డైరెక్టర్... సూర్య, సుధల కాంబోలో రాబోయే మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం  విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేసారు.. అది సెకండ్ హీరో టైప్ క్యారెక్టర్ అని అంటున్నారు.. గీత గోవిందంతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్.. అక్కడ విడుదలవుతున్న నోటా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మనోడి క్రేజ్ మామూలుగా ఉండదు...  చూద్దాం మరి... ఏం జరుగుతుందో....

15:40 - October 5, 2018

హైదరాబాద్ : బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి తరపున చేయడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి తరపున ప్రచారం చేయడం లేదని, ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, నాలుగేళ్ల కాలంలో విపక్షాలు చేసిన వ్యాఖ్యలు బాధపెట్టాయని...ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా జాగృతి తీసుకోలేదని, భవిష్యత్‌లో కూడా తీసుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగను ఆడ బిడ్డలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

15:31 - October 5, 2018

హైదరాబాద్ : సామాన్యుడికి పెను భారంగా మారుతున్న పెట్రోల్ ధరలను తగ్గించేసామని పెద్ద గొప్పగా చెప్పుకునే కేంద్రప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురుస్తోంది. రోజుకొకవిధంగా ధరలను పెంచి ఉదయం లేని ప్రతీ వ్యక్తి ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా వున్నాయో చూసుకోవటం రోజువారి దిన చర్యలో భాగంగా మారేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరించింది. ధరలు పెరుగుతూ ఉంటే చూస్తుండిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేసుకోమన్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. 
ఆకాశానికి అంటిన పెట్రోలు, డీజిల్ ధరల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కల్పిస్తూ, రూ. 2.50 మేరకు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వస్తున్నాయి. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా, చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. 
పలు దేశాల్లో పెట్రోలును రూ. 35కే విక్రయిస్తున్నారని, ఇండియాలో రూ. 90 వసూలు చేస్తూ, కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలు రాష్టాల్లో ఎన్నికలు రానున్నందునే ఈ రెండున్నరను డిస్కౌంట్ గా ఆఫర్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని మరల్చేందుకే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, కేంద్రం సుంకాలను తగ్గించిన తరువాత, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అంతేమొత్తం సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.
 

14:45 - October 5, 2018

తూర్పుగోదావరి : నెలంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేకాని ఓ స్వీపర్ కి  జీతం ఎంత వుంటుంది? మహా వుంటే రూ.10,15వేలు వుండొచ్చు. కానీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా స్వీపర్ కు జీతం ఎంతో తెలుసా? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇది నమ్మటానికి సాధ్యం కాకపోయినా అది అక్షరాల సత్యం. రాజమహేంద్రవరానికి చెందిన స్వీపర్ కోల వెంకటరమణమ్మ వేతనం అక్షరాలా లక్షన్నర రూపాయలు. వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఆమె పే స్లిప్‌ను చూసి చాలామంది ఫేక్ అని కొట్టిపారేశారు. అయితే, అది ఫేక్ కాదని, ఆమె వేతనం రూ.1,47,722 అని తేలింది. ఆమె మాత్రమే కాదు.. ఆమెలా లక్షకుపైగా జీతం తీసుకుంటున్న వారు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్‌కో, ట్రాన్స్‌ కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌ కోలో ప్రాంతాల వారీగా డిస్కమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా  సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని తొలగించారు. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు వారి వేతనాలను భారీగా పెంచారు. ఇంక్రిమెంట్ల విషయంలోనూ అంతే భారీ స్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని స్థాయిల ఉద్యోగులకు బ్రహ్మాండమైన వేతనాలు లభిస్తున్నాయి. సర్వీసు బాగా ఉన్న స్వీపర్, అటెండర్ల జీతం ఐదంకెలు దాటిందంటే వారి వేతనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్‌కో సీఎండీ కంటే 30 ఏళ్ల సర్వీస్ ఉన్న చీఫ్ ఇంజినీర్ వేతనమే ఎక్కువే అంటే ఆశ్చర్యపోక తప్పదు. 
కోల వెంకటరమణమ్మ విషయానికి వస్తే ఆమె 1978లో 16వ ఏట విద్యుత్తు శాఖలో స్వీపర్‌గా చేరారు. 1 ఏప్రిల్ 1981లో ఆమె పర్మినెంట్ ఉద్యోగినిగా మారారు. రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలో స్వీపర్‌గా వెంకట రమణమ్మ  పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైర్ కాబోతున్న ఆమెకు 40 సర్వీస్ అనుభవం వుంది. కాగా ఆమె  సర్వీసుతో పాటు వేతనం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1.47 లక్షల వేతనం అందుకుంటోంది. ఈమె పే స్లిప్ వాట్సాప్‌లోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఆరా తీయగా, లక్షన్నర వేతనం నిజమేనని తేలింది.

14:36 - October 5, 2018

విజ‌య‌వాడ‌: ఏపీలో టీడీపీ నేత‌లు టార్గెట్ గా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. అందుబాటులో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌తో అత్యవ‌స‌రంగా స‌మావేశం అయిన సీఎం చంద్ర‌బాబు.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయించ‌డం బీజేపీకి అల‌వాటేన‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఎన్ని కుట్ర‌లు చేసినా ఏపీని ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల నేప‌థ్యంలో పార్టీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నామని...రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఏపీలోని త‌మ పార్టీ నాయకులకు చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉంద‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, వ్యాపార‌వేత్తలు, సీఎం చంద్ర‌బాబుకి స‌న్నిహితులైన బీదా సోద‌రులు, మంత్రి నారాయ‌ణకు చెందిన సంస్థ‌ల్లో ఐటీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఈ  సోదాల్లో ఆ శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి సంబంధించినవిగా చెప్పుకుంటున్నారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఒక సంస్థ అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం.

టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. బీదా మస్తాన్ రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని ఆయ‌న  మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై కూడా పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు

14:34 - October 5, 2018

గుంటూరు : ఏపీ వ్యాప్తంగా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతన్నాయి. పక్కా ఆధారాలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారు.

ఏపీ ఐటీ దాడుల్లో అధికారులు వ్యూహం మార్చారు. ఐటీ అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. టీడీపీ వర్గాలకు సమాచారం అందడంతో ప్లాన్ బి అమలు చేస్తున్నారు. ఐటీ బృందం ముందుగా బెంజ్ సర్కిల్‌లోని నారాయణ కాలేజీకి వెళ్లింది. టీడీపీ అనుచరులు, టీడీపీకి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు, బిల్లర్లు, కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులు దాడులు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ అధికారులు విజయవాడకు వచ్చారు. మరో రెండు రోజులపాటు దాడులు జరిగే అవకాశముంది. 

అంతకముందు మంత్రి నారాయణ ఆస్తులు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించారు. నారాయణ కాలేజీలో అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ ఆటోనగర్‌లోని ఆఫీసులో సోదాలపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. విజయవాడలో మంత్రి నారాయణ విద్యాసంస్థలతోపాటు పలు పరిశ్రమల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పలువురిపై ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు. నెల్లూరులో నారాయణ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో బీఎంఆర్ ఫ్యాక్టరీపై ఐటీ దాడులు చేస్తోంది. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీకాకులం జిల్లాలోని పలాసలో జీడిపప్పు దళారీ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్నపూర్ణ ఆశ్రమం సమీపంలోని ఇంట్లో అధికారుల రికార్డులు పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాల్లో 200 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులతో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో ఆందోళన నెలకొంది. ఐటీ దాడుల వెనకాల రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు.  

 

 

14:01 - October 5, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పటిష్టమైన స్థితిలో బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పడుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 186 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 24వ సెంచరీ చేశాడు. 92 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. 5 వికెట్ల నష్టానికి టీమిండియా 470 పరుగులు చేసింది. 

 

13:40 - October 5, 2018

నెల్లూరు: ఏపీలోని టీడీపీ నేత‌లు, ప్ర‌ముఖుల ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఐటీ దాడులు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌నే నేప‌థ్యంలో ప‌క్కా ఆధారాల‌తో అధికారులు ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 

కాగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేతలు, వ్యాపార‌వేత్త‌లు బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్రలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ నేత‌ల‌కు చెందిన కంపెనీలపైనా నిన్న మొద‌లైన ఐటీ దాడులు శుక్ర‌వారం కూడా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వారు ఎవరికీ అందుబాటులోకి లేకుండా పోయార‌ని స‌మాచారం. వారిద్దరినీ కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా విఫలమైంది. మ‌స్తాన్ రావు, ర‌విచంద్ర‌లు తమ సెల్ ఫోన్లను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. కాగా, కొందరు తెలుగుదేశం పార్టీ పెద్దలకు మస్తాన్ రావు బినామీగా వ్యవహరిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం విదిత‌మే.

దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ (బీదా మస్తాన్ రావు) కంపెనీల్లో శుక్ర‌వారం ఉదయం కూడా సోదాలు జరుపుతున్న అధికారులు, అక్కడి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కార్యాలయ అధికారుల కాల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నారు. రొయ్యల వ్యాపారంలో ఉన్న వీరు కొన్ని విదేశీ లావాదేవీలు కూడా జరిపినట్టు అధికారులు గుర్తించిన‌ట్టు స‌మాచారం.  బీదా రవిచంద్రకు మంత్రి పదవి వస్తుందని, మస్తాన్ రావును టీటీడీ చైర్మన్ పదవి వరిస్తుందని గతేడాది వార్తలొచ్చాయి. అయితే ప‌ద‌వులు రాకున్నా, వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. బీదా సోద‌రులు సీఎం చంద్రబాబు నాయుడికి స‌న్నిహితులు కూడా. అలాంటి వారిని ఐటీ టార్గెట్ చేయ‌డం చ‌ర్చకు దారితీసింది.

మ‌రోవైపు ఏపీ మంత్రి నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లోనూ ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు సోదాలు జ‌రుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ సోదాలు జ‌రుపుతున్నారు. మొత్తంగా టీడీపీకి చెందిన నేత‌ల ఇళ్లు, ఆఫీసులు, ప‌రిశ్ర‌మ‌ల‌పై ఐటీ అధికారులు దాడులు చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

13:33 - October 5, 2018

నటసింహ నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు... ఆయనకి కోపం ఎక్కువ అనే మాట తరచుగా వింటుంటాం.. బాలయ్య చాలా మంచివాడు, ఆయనకి కల్మషం తెలియదు, చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఇది, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్పేమాట..
ఏది ఏమైనా మంచికి మంచి, పంచ్కి పంచ్ అనేది ఆయన స్టైల్.. రీసెంట్గా బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ కృష్ణాజిల్లాలోని హంసలదీవి ప్రాంతంలో జరుగుతోంది.. షూట్గ్యాప్లో ఒక పెద్దాయన బాలయ్య దగ్గరకి వచ్చి, తాను క్యాన్సర్తో బాధపడుతున్నాననీ, సహాయం చెయ్యమని కోరాడు..  బాలయ్య వెంటనే తను చైర్మన్గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఫోన్ చేసి, ఆ పెద్దాయనకి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాడు.. బాలయ్య లాంటి వ్యక్తి స్పందించిన విధానానికి సదరు పెద్దాయన బాలయ్య కాళ్ళు మొక్కాడు.. బాలయ్య వెంటనే ఆయన్ని పట్టుకుని పైకిలేపి, ధైర్యంగా ఉండమని చెప్పి పంపాడు... దీన్ని ఎవరో వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది..  

13:32 - October 5, 2018

గుంటూరు : ఏపీలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పక్కా ఆధారాలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చాలా గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

తన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడుల వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తన ఇళ్లు, కార్యాలయాలపై ఎలాంటి ఐటీ దాడులు జరుగలేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడులపై ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం కక్షసాధింపుతోనే ఐటీ శాఖను ఉసిగొల్పుతుందని మంత్రి ఆరోపించారు. ఎన్డీఏ నుంచి వైదొలిగినందుకే కేంద్రం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

13:25 - October 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో ఒక స్టైల్ తో అలరిస్తూ విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న విజయ్ దేవరకొండ తాజా చిత్ర ‘నోటా’ చిత్రం ప్రపంచ వ్యాప్తగా రిలీజైంది. ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. రాజకీయ నేపథ్యంతో సినిమా ఉండడంతో చిత్రం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగ్రేటం చేసిన ఈ నటుడు ప్రస్తుతం యూత్ లో ఒక సెన్సేషన్. సామాజిక మాధ్యమాల్లో నోటా మేనియా నెలకొంది. 

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నోటా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ, మెహరీన్, నాజర్, సత్యరాజ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ లో చిత్రంపై అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. రౌడీ సీఎంగా విజయ్ అదరగొట్టాడని కొందరు పేర్కొంటుంటే సెకండాఫ్ సాగదీసినట్లుగా అనిపిస్తోందని ట్వీట్లు చేస్తున్నారు. పొలిటికల్ కథతో రూపొందిన చిత్రం అంతగా బాగాలేదనే పోస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్్స నిరాశపరిచే విధంగా ఉందని..మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదని టాక్్స వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

13:09 - October 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే మలి విడత రైతుబంధు చెక్కుల పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో.. ఈ పంపిణీ జరుగుతుందా ? లేదా ? అనే డైలమాలో అధికారులు పడ్డారు. అయితే మలి విడత చెక్కులను సిద్ధం చేసి రెడీగా ఉంచారు. పైనుండి వచ్చే ఆదేశాలకనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధమయ్యారు. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మలి విడత రైతుబంధు చెక్కుల పంపిణీ జరుగుతుందా ? లేదా ? అనే సందిగ్ధత కొనసాగుతోంది. ప్రజాకర్షక పథకాలను నిలిపివేయాలని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. అయితే.. గతంలోనే ప్రకటించిన పథకాలు కాబట్టి వాటిని కొనసాగించేందుకు అవకాశమివ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. 

అయితే... మలి విడత రైతుబంధు చెక్కుల పంపిణీపై ఇంకా ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఎన్నికల సంఘం నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 18 జిల్లాల్లోని 110 మండలాల్లో రైతులకు ఇచ్చేందుకు 11 లక్షల చెక్కుల సిద్దం చేశారు. బ్యాంకర్లతో అనేక దఫాలుగా సమావేశమై... చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సిద్దమైన చెక్కులను జిల్లాల బ్యాంకులకు పంపించారు. 

ఇదిలావుంటే... రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేస్తామని నల్లగొండ సభలో కేసీఆర్‌ ప్రకటించారు. అయితే.. అధికారులు మాత్రం ఇది కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుందని భావిస్తున్నారు. మరి.. ఈ నేపథ్యంలో చెక్కుల పంపిణీ జరుగుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

12:45 - October 5, 2018

వనపర్తి : ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆశీర్వాద సభలను నిర్వహించింది. నేడు వనపర్తి జిల్లాలో మరో సభను నిర్వహించబోతుంది. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తీవ్రస్థాయిలో మండిపడుతున్న కేసీఆర్‌.. ఇవాళ ప్రతిపక్షాలను మరింతగా టార్గెట్‌ చేయవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. 

ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల కంటే ఒక్క అడుగు ముందంజలో ఉంది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌... 50 రోజుల్లో 50 మీటింగ్‌లు, పంచసభ ప్రణాళికలు ప్రకటించి దూసుకుపోతున్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌, నిజామాబాద్‌, నల్లగొండలో ప్రచారాన్ని నిర్వహించిన కేసీఆర్‌.. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. 

గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఏడు స్థానాలు, కాంగ్రెస్‌ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో గెలిచాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. దీంతో ఈసారి ఉమ్మడి పాలమూర్‌ జిల్లాలో ఎలాగైనా 10 సీట్లకు పైగా సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఇందుకోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదన్న అసంతృప్తి ఉన్న నేతలను ఇప్పటికే అధిష్టానం బుజ్జగించింది. ఇంకా ఏవైనా అసంతృప్తులు ఉంటే.. ఈ సభతో మొత్తం తొలగిపోతాయని నేతలు భావిస్తున్నారు. 

ఇక ఈరోజు జరిగే సభ కోసం పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 3 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వనపర్తిని జిల్లా చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. హామీ మేరకు జిల్లాను ప్రకటించారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్‌ ఈ సందర్బంగా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. గత రెండు సభలలో ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించిన కేసీఆర్‌.. ఈరోజు ఎలాంటి విమర్శలు చేస్తారోనని ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఈ సభ సక్సెస్‌ కోసం పార్టీ శ్రేణులంతా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 

12:38 - October 5, 2018

 చెన్నై...బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరు 4 నుంచి 8 వ తేదీ మధ్య కేరళ,తమిళనాడు,కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. చెన్నైలో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చెన్నై, కాంచీపురం,తిరువళ్లువర్ జిల్లాల్లో ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు శలవు ప్రకటించింది. అక్టోబర్ 7 న కేరళలోని ఇడుక్కి,పాలక్కాడ్,త్రిశూర్ మూడు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం ఒమన్ వద్ద తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించటంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం కోరారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కోటానికి అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. త్రిసూర్,పాలక్కాడ్ ల లోని జలాశయల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. తమిళనాడులోని చెన్నైలో 2015లో కురిసిన వర్ష బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో దక్షిణ కర్ణాటకలోని 12  జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు.

11:59 - October 5, 2018

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘నోటా’..మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...

కథ :
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు వాసుదేవ్.. ఒక స్వామీజీ సలహామేరకు తన కొడుకు వరుణ్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు... అయితే అదే టైమ్‌లో అవినీతి ఆరోపణలతో వాసుదేవ్ జైలుకి వెళ్ళడంతో తప్పక తండ్రి స్ధానంలోకి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రిగా ఏం చేసాడు అనేది నోటా కథ..

నటీనటులు :
విజయ్ దేవరకొండ నటుడిగా సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉన్నాడు... నోటాలో గంభీరంగా కనిపిస్తూ తన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు..హీరోయిన్ మెహరీన్‌ది గెస్ట్ అప్పీరియన్స్‌లా అనిపిస్తుంది.. అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది.. సీనియర్ నటులు నాజర్ అండ్ సత్యరాజ్ తమ అనుభవంతో వారి వారి పాత్రలని రక్తి కట్టించారు... మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు...శ్యామ్.సి.ఎస్. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సో సో‌గా ఉన్నాయి.. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా వర్క్ బాగుంది.. రేమండ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాని పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం బాగానే ఉంది కానీ, ఓవర్ డ్రామాతో కాస్త సాగదీస్తూ.. సహనానికి పరీక్ష పెట్టాడు..‘నోటా’ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.. మన దగ్గర విజయ్ మ్యాజిక్‌తో ఆడేస్తుంది కానీ, తమిళ్‌లో ఏమాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.. ఎందుకంటే, తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా రిలీజ్ అయింది నోటా‌.. తమిళ్‌లో ఇవాళే రిలీజ్ అయిన, విజయ్ సేతుపతి, త్రిషల 96, ఎస్.జె.సూర్య రాక్షసన్ మూవీస్ కి హిట్ టాక్ వచ్చేసింది... మరి వాటి మధ్య నోటా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి...

తారాగణం :  విజయ్ దేవరకొండ, మెహరీన్,  నాజర్, సత్యరాజ్..

కెమెరా     :  సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 

సంగీతం   :    శ్యామ్.సి.ఎస్.

ఎడిటింగ్   :      రేమండ్ 

నిర్మాత    :   కె.ఇ.జ్ఞానవేల్ రాజా

రేటింగ్  : 2.5\5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి
 
 
11:45 - October 5, 2018

విజయవాడ : త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? తదితర వాటిపై ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టివీ సీ ఓటర్ సంయుక్తంగా పార్లమెంట్ స్థానాలపై సర్వే నిర్వహించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి. జనాలను ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారంలోకి రాలేకపోయిన వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ పార్టీ నేత జగన్ గత కొన్ని రోజుల నుండి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో జనసేన అధినేత పవన్ కూడా వచ్చేశారు. ఆయన పోరాట యాత్ర పేరిట జనాల్లోకి వెళుతున్నారు. వామపక్షాలతో కలిసి ఆయన కార్యచారణను రూపొందిస్తున్నారు. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? 

పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 21 సీట్లు నెగ్గుతుందని పేర్కొంది. మిగతా నాలుగు సీట్లు టీడీపీ గెలుస్తుందని సర్వేలో వెల్లడైందని తెలిపింది. అంతేగాకుండా వైసీపీ 41.9..టిడిపి 31.4 ఓట్ల శాతం ఉంటుందని వెల్లడించింది. బీజేపీ ఏ సీటు గెలవదని కానీ 12.5 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ది కూడా అదే పరిస్థితి ఉంటుందని కేవలం 7.2 ఓట్ల శాతం..సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలకు 8.9 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే. 

11:35 - October 5, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం విస్తరించనున్నారా..? దీనిపై ఈరోజు క్లారిటీ రానుందా..? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే వస్తోంది. అమరావతిలో ఈరోజు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ఓ మైనారిటీకి కేబినెట్లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో పాటే.. ఓ ఎస్టీనీ కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఇక మంత్రి వర్గ విస్తరణ జరిగితే... అభ్యర్థుల ఎంపికపై కూడా టీడీపీ కొంత కసరత్తు చేయాల్సిన పరిస్థితి. టీడీపీ తరఫున గెలిచిన మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో.. వలస వచ్చిన చాంద్ బాషా, జలీల్ ఖాన్, మండలి విప్ షరీఫ్ ల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. మండలి చైర్మన్ ఫరూక్ కూడా కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ఇక అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం.. ఆ ప్రాంతంలో పార్టీ శ్రేణుల మనోధైర్యం దెబ్బతినకుండా.. కిడారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఈ అంశాన్నే ప్రధానంగా చర్చకు పెట్టి.. వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

11:22 - October 5, 2018

గుంటూరు : ఏపీలో ఐటీ అధికారులు పంజా విసిరారు. దాడులతో ఐటీ అధికారులు హడలెత్తిస్తున్నారు. పోలీసుల రక్షణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరులలో సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి.

పక్కా ఆధారాలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చాలా గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

మంత్రి నారాయణ ఆస్తులు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణ కాలేజీలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని ఆఫీసులో సోదాలపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. విజయవాడలో మంత్రి నారాయణ విద్యాసంస్థలతోపాటు పలు పరిశ్రమల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పలువురిపై ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు. నెల్లూరులో నారాయణ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో బీఎంఆర్ ఫ్యాక్టరీపై ఐటీ దాడులు చేస్తోంది. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీకాకులం జిల్లాలోని పలాసలో జీడిపప్పు దళారీ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్నపూర్ణ ఆశ్రమం సమీపంలోని ఇంట్లో అధికారుల రికార్డులు పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాల్లో 200 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులతో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో ఆందోళన నెలకొంది. ఐటీ దాడుల వెనకాల రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు.  

11:20 - October 5, 2018

విజయవాడ : ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ రాష్ట్రంలోని నేతలు జనాల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కార్యక్రమాల పేరిట జనాల్లోకి వెళుతున్నారు. జనసేన అధినేత పవన్ కూడా పోరాట యాత్ర పేరిట వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయా బహిరంగసభల్లో పాల్గొంటున్న పవన్ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని నిలదీస్తున్న పవన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని సైతం వదలడం లేదు. జగన్ పార్టీని కూడా తూర్పారబడుతున్నారు. 

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. అక్టోబర్ 9వ తేదీన భారీగా కవాతు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించాలని పవన్ భావించారు. కొవ్వూరు, రాజమండ్రి మధ్య గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే వంతెనపై కవాతు సాగించేందుకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

కానీ ఈ కవాతు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. కవాతుకు అనుమతులు తీసుకోవాల్సి ఉండడం..ఇతరత్రా ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో కవాతును వాయిదా వేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవాతు వాయిదా వేయాలా ? వద్దా ? అనే దానిపై విజయవాడలో గురువారం సాయంత్రం నేతలు చర్చించినట్లు సమాచారం. వాయిదాకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరి కవాతు ఉంటుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. 

11:00 - October 5, 2018

చెన్నై : సూపర్ స్టార్ రజనీ చిత్రం..రోబో 2.0పై అందరి దృష్టి నెలకొంది. భారీ బడ్జెట్ తో శంకర్ ఈ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోబో కు ఇది సీక్వెల్. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండడం విశేషం. గతంలో రజనీ నటించిన కబాలి..కాలా రెండు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. కానీ రజనీ అభిమానులకు మాత్రం చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. రోబో 2.0తో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్నారు. 

సన్ పిక్చర్్స పతాకంపై కళానిధి మారన్ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాకు ‘పెట్టా’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ విడుదలైంది. తాజాగా రజనీకి సంబంధించిన కొత్త లుక్ రిలీజ్ చేశారు. తెల్లడ్రస్ లో..మీసకట్టు..విబూధి రేఖలతో రజనీ లుక్ ఉంది. రజనీ లుక్ చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 

ఇక రజనీ సరసన త్రిష, సిమ్రాన్ లు జత కడుతున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. 

10:42 - October 5, 2018
ఢిల్లీ : ప్రముఖ సెల్ కంపెనీల్లో ఒకటైన మోటోరోలా కొత్త సెల్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. పండుగల నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కంపెనీలు డిఫరెంట్ ఫీచర్లు..ఆకర్షణీయమైన కలర్లు..ఇతరత్ర వాటితో మార్కెట్ లో సెల్ లు విడుదల చేస్తున్నారు. 

తాజాగా మోటోరోలా వన్ పవర్ సేల్ పేరిట ఫ్లిప్ కార్డులో విడుదల చేయనుంది. ఇందుకు మధ్యాహ్నం 12గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఇటీవలే అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ అక్టోబర్ 5 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే....ఇందులో డ్యూయల్ కెమెరాలున్నాయి. టర్బో పవర్ ఛార్జింగ్ ఉంది. రెండేళ్ల వరకు అప్ గ్రేడ్ అందిస్తామని కంపెనీ చెబుతోంది. 8.0 ఓరియోతో వచ్చిన ఫోన్‌కు ఈ ఏడాది చివరినాటికి 'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్స్ కూడా లభిస్తాయి. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ఉంది. సుమారు రెండు రోజుల పాటు పనిచేస్తుందని తెలిపింది. 15 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే ఆరు గంటల పాటు సెల్ పనిచేస్తుందని పేర్కొంది. టైప్‌-సీ కనెక్టర్, బ్లూటూత్ 5.0, హాట్‌స్పాట్, వైఫై డైరెక్టు, 4జీ ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, జీపీఎస్ లాంటి ఫీచర్లున్నాయి.
10:28 - October 5, 2018

కలువకళ్ళ చిన్నది కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తనని హీరోయిన్గా  టాలీవుడ్కి పరిచయం చేసిన గురువు తేజ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో.. కొద్దిరోజుల నుండి థాయ్లాండ్లో షూటింగ్ జరుగుతోంది.
ఈ షూట్లో హీరో సాయి, హీరోయిన్ కాజల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు.. సాయి ఏనుగు దంతాలపై కూర్చుని, కాజల్ని భుజాలపై కూర్చోబెట్టుకుని రకరకాల ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు.. ఇదిలా ఉంటే, కాజల్ ఏకంగా కొండచిలువని మెళ్ళో వేసుకుని, చక్కగా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది.. థాయ్లాండ్లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్ పార్క్లో షూటింగ్ జరుగుతుంది. షాట్ గ్యాప్లో కొండచిలువతో కాజల్ సాహసం చేసింది.. కొండ చిలువని మెడలో వేసుకుంటే  చెప్పలేని థ్రిల్ వస్తుంది.. పాము స్పర్శ మనకు తెలుస్తుంది.. దాని కండరాల కదలిక కొత్త అనుభూతినిస్తుంది.. అది బుసలు కొడుతున్న సంగతి అర్ధమవుతుంది...  ఇదొక కొత్త అనుభూతి అంటూ అమ్మడు ట్వీట్ చేసింది.. ఆన్ లైన్లో ఈ వీడియో చూసినవాళ్ళంతా కాజల్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు...

10:27 - October 5, 2018

ఢిల్లీ : అచ్చం మోడీలా ఉంటాడు...ఆయన బయటకు వస్తే మోడీలాగే ఉన్నాడే..అంటూ కొంత కన్య్పూజన్ అవుతుంటారు. ఎందుకంటే ఆయన అచ్చం మోడీలాగే ఉంటాడు. ఆయనే అభినందన్ పాఠక్. దీనిని కాషాయదళం క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన్ను ప్రచారంలో ఉపయోగించుకొంది. గతంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవు కదా..ఇప్పుడు ఎందుకు ఈ అంశం అని అనుకుంటున్నారా ? ఎందుకంటే అభినందన్ ప్రస్తుతం బీజేపీకి గుడ్ బై చెబుతున్నారంట....

ఉత్తర్ ప్రదేశ్ షహరాన్ పూర్ లో అభినందన్ నివాసం ఉంటున్నారు. మోడీ అంటే తనకు ఎంతో అభిమానం అని అభినందన్ గతంలో ఎన్నోమార్లు చెప్పారు కూడా. గత సంవత్సరం మార్చిలో గోరఖ్ పూర్‌లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభినందన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కానీ అకస్మాత్తుగా ఏమైందో ఏమో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని అభినందన్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషలో మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

కాంగ్రెస్ కు సంబంధించిన నేతలతో అతను సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నానని కీలక నేతలకు చెప్పడం జరిగిందని తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. అభినందన్ పాఠక్ 1999లో లోక్ సభకు ..2012 సంవత్సరంలో రాజ్యసభకు పోటీ చేశారు. షాహన్ పూర్ కార్పొరేటర్‌గా రెండుసార్లు పనిచేశారు. 

10:23 - October 5, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు చిట్టివలపాకలు కాలనీకి చెందిన దుర్గాప్రసాద్, గంగభవాని గతం కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇళ్లళ్లో చెప్పి పెళ్లి చేసుకుందామని ఇరువురూ అనుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రియురాలు గంగాభవాని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త విని మనస్తాపంతో ప్రియుడు దుర్గాప్రసాద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

10:11 - October 5, 2018

ఢిల్లీ : పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు అంతా ఉరుకులు..పరుగులే...ఆఫీసు..ఇళ్లు...బిజీ బిజీగా గడుపుతున్నారు. నవ్వంటే మరిచిపోతున్నారు. కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నవ్వు. నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు పెద్దలు. నేడు స్మైల్ డే...నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనం సాటి రాలేదని నిపుణులు పేర్కొంటుంటారు. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నవ్వు నాలుగు విధాల కాదు..నలభై విధాలుగా గ్రేట్ అని అంటున్నారు.  నవ్వు అనేది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

 • నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి వత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతాయి. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది.
 • ​మీరు రోజుకు ఎంత సేపు నవ్వుతున్నారో చూడండి. ఉదయాన్నే నవ్వుతూ లేవడం అలవాటు చేసుకోండి. అద్దంలో చూస్తూ నవ్వటం అలవాటు చేసుకోండి. 
 • నవ్వు వల్ల సంఘంతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. ఆనంద వెల్లివెరిస్తుంది. నమ్మకం పెంపొందించబడుతుంది.
 • మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. 
 • హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మల్టీ టాస్క్‌ కూడా చేయగల శక్తి లభిస్తుంది.
 • ఎన్నో ప్రశ్నలకు సమాధానం చిన్న నవ్వుతో ఇండికేట్‌ చేయచ్చు. అందుకే హాయిగా నవ్వండి. 
 • వ్యాయామం చేయడానికి సమయం పెట్టుకున్నట్లే రోజూ ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నవ్వడానికీ కేటాయించాలి. 
 • హాస్య కథలు చదవడం...జోక్స్ చెప్పుకోవడం..వినడం ఇలా చేస్తే ఉత్సాహం కలిగిస్తుంది.
 • నవ్వు వల్ల మనుషుల మధ్య ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.
 • హాయిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచే కణాలు పెరుగుతాయి. దీంతో అనారోగ్యం దరిచేరదు. 
 • రోజంతా నవ్వుతూ, సంతోషంగా ఉండేవాళ్లకి మనసులో ఎటువంటి ఆందోళన ఉండదు. 
 • నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
 • నవ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. నవ్వండి..నవ్వించండి..ఆనందంగా ఉండండి...
09:55 - October 5, 2018

వనపర్తి : టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్షాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొన్న నిజామాబాద్, నిన్న నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. నేడు వనపర్తిలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ జరుగనుంది. టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 సీట్లు గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. 

 

09:23 - October 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభంలోనే తారస్థాయికి చేరుకుంటోంది. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రవిమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. అధికార పార్టీ నేతలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను అదేస్థాయిలో అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఒకరిపైమరొరకు ఘాటైన విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తే.. ఆయన.. దీనికి కౌంటర్‌ ఇచ్చారు. మధ్యలో కాంగ్రెస్‌ అగ్రనాయకులూ.. కేసీఆర్‌పై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విపక్షాలపైన.. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుపైనా చెలరేగి పోయారు. నల్లగొండ వేదికగా.. కాంగ్రెస్‌ వారినీ కడిగి పారేశారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేద్దామని సీరియస్‌గా ప్రయత్నించానని...కానీ, అందరూ తెలుగుదేశాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని వాపోయారు. అసలు.. తెలుగురాష్ట్రాల మధ్య తగువులు పెట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకన్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మోర్ మెచ్యూర్డ్ అని అనడంలోనే మోదీ ఉద్దేశం అర్థమవుతోందన్నారు. తనపైకి జాతీయ సంస్థలను ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు అన్నారు. 

అటు పాలమూరు జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ నాయకత్వం.. కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించింది. నాలుగున్నర ఏళ్లలో చేసిందేంటో చెప్పమంటే.. కేసీఆర్‌ ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య కాదని, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణకు ప్రజలకు మధ్య అని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్‌కు ఎందుకని ప్రశ్నించారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటమని ఉత్తమ్‌ అభివర్ణించారు. 

09:00 - October 5, 2018

గుంటూరు : ఏపీలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పక్కా ఆధారాలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చాలా గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

విజయవాడలో మంత్రి నారాయణ విద్యాసంస్థలతోపాటు పలు పరిశ్రమల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పలువురిపై ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు. నెల్లూరులో నారాయణ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  

శ్రీకాకులం జిల్లాలోని పలాసలో జీడిపప్పు దళారీ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్నపూర్ణ ఆశ్రమం సమీపంలోని ఇంట్లో అధికారుల రికార్డులు పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాల్లో 200 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులతో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో ఆందోళన నెలకొంది. ఐటీ దాడుల వెనకాల రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు.  

Don't Miss