Activities calendar

06 October 2018

21:56 - October 6, 2018

హైదరాబాద్ : పని ఒత్తిడి..నిద్రలేమి, అధిక పనిగంటలు, పనిలో టార్గెట్స్ వంటి పలు అంశాలు మనిషి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంటాయి. కానీ వ్యాయామాలతో కూడా వీటిని దూరం చేసుకోవచ్చు. ప్రతిఒక్కరికీ, ప్రతీరోజూ వ్యాయామం ఎంతో ముఖ్యం. అన్నింట్లో ప్రవేశిస్తున్న టెక్నాలజీ ఫిట్‌నెస్‌లోనూ తన ఒరవడిని సాగిస్తుంటుంది. ఫిట్‌ గ్యాడ్జెట్లపై మక్కువ ఎక్కువ చూపే వారికోసం కంపెనీలు మార్కెట్లోకి కొత్త పరికరాలను విడుదల చేస్తుంటాయి. ఫిట్‌నెస్‌లో మీకు ఒక కోచ్‌లా ఉపయోగపడే పరికరమిది. దేనికైనా ఓ లెక్క వుండాలి. అధికంగా వర్క్ అవుట్ చేస్తే అనర్థాలను దారి తీస్తుంది. అందరికీ కోచ్ ను పెట్టుకునే వీలు వుండదు. అటువంటివారికోసం స్మార్ట్ గా వుండి మరింత స్మార్ట్ గా పనిచేసే చిరు పరికరం వివరాలు మీకోసం..
ఎన్ని రెపిటేషన్స్‌ చేస్తున్నాం? ఎంత సమయం చేస్తున్నాం..? అనేది తెలిస్తే అందంతోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఇందుకు ‘మూవ్‌’ అనే డివైజ్‌ చక్కగా ఉపకరిస్తుంది. మనం ఎంత సేపటిలో ఎన్ని సార్లు ఆ వర్క్‌అవుట్‌ చేశామో ఫోన్‌లో నిక్షిప్తమైన యాప్‌లో రికార్డ్‌ అవుతాయి. బాడీబిల్డింగ్‌లో బైసప్‌, ట్రైసప్‌, సిటప్స్‌... ఇలా వేటినైనా ఎన్ని చేసేమో లెక్కేసి చూపిస్తుంది. పైగా ఎప్పటికప్పుడు హార్ట్‌ రేట్‌ను చూపిస్తూ మనల్ని గైడ్‌ చేయడం దీని ప్రత్యేకత. రన్నింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, వర్క్‌అవుట్‌ ఇలా వ్యాయామం ఏదైనా ఇది మనకు ఒక గైడ్‌లా పనిచేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌. చేతులు, కాళ్లు... ఇలా ఎక్కడైనా దీన్ని ధరించే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్‌ దీన్ని ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. ఇది రూ.4 వేల నుండి రూ.4,500 ల వరకూ వుంటుంది. చిన్న పరికరాలనికి అంత ధర ఎందుకు అనుకుంటున్నారా? చిన్నదే అయిన పనిమాత్రం పెద్దదేనండోయ్..
 

 

21:18 - October 6, 2018

ఢిల్లీ : పేరుకు తగ్గట్లుగానే రాయల్ లుక్ ఆ బైక్ సొంతం. రాయల్ గా కనిపించటమేకాదు..సేల్స్, స్టైల్, ఫీచర్స్, అప్ డేట్స్ వంటివాటిలో నిజంగా ఆ బైక్ రాయలే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలలో తిరుగులేని స్టైలిష్ అండ్ జోష్ బైక్. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350సీసీ విభాగంలో తిరుగులేని ద్విచక్రవాహనాల సంస్థ.  ఆ జోరు కొనసాగించటానికి ఎటికప్పుడు కొత్త మోడళ్లు తీసుకొస్తోంది..మరింత లుక్ తో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తో యువకుల మనసును దోచుకుంటోంది. అంతేకాదు ఈసారి కూడా భారత సైన్యం స్ఫూర్తితో క్లాసిక్‌ సిగ్నల్స్‌ 350 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తీసుకొచ్చింది. 
భారత సైన్యం అత్యధికంగా వాడుతోంది రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిళ్లనే. ఈ అనుబంధం మొదలై 65 ఏళ్లు అయింది. దానికి గుర్తుగా సైన్యం దుస్తుల రంగులైన ఎయిర్‌బోర్న్‌ బ్లూ, స్టార్మ్‌రైడర్‌ సాండ్‌ రంగుల్లో ఈ కొత్త మోడల్‌ని రూపొందించారు. బాడీ ప్యానెల్‌ని ఈ రెండు రంగుల్లో రూపొందిస్తే.. మిగతా ఫ్రేమ్‌, పవర్‌ట్రెయిన్‌, సస్పెన్షన్‌, ఎగ్జాస్ట్‌సిస్టమ్‌.. వీటన్నింటికీ నలుపురంగు అద్దారు.
వేగాన్ని నియంత్రించేలా 280ఎంఎం, 240ఎంఎం ముందు, వెనక డిస్క్‌ బ్రేక్‌లున్నాయి. ట్విన్‌ గ్యాస్‌ ఛార్జ్‌డ్‌ రేయర్‌ షాక్‌ అబ్జార్బర్లు ప్రయాణాన్ని సాఫీగా మార్చితే.. 19, 18 అంగుళాల స్పోక్‌ చక్రాలతో చూడ్డానికి స్టైలిష్‌గా ఉన్నాయి. ఇంజిన్‌లో ఎలాంటి మార్పుల్లేవు. గత స్టాండర్డ్‌ వేరియంట్‌ కన్నా ధర రూ.23వేలు అధికం. రూ.1.62 లక్షలు. రెండు చక్రాలకూ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉండటం పెద్ద ఆకర్షణ. వాటర్‌ రెసిస్టెన్స్‌ పానియర్స్‌ స్టీల్‌ ఇంజిన్‌ గార్డులు, త్రీడీ మెష్‌ టెక్నాలజీ, విండ్‌షీల్డ్‌ కిట్‌, అల్యూమినియం వీల్స్‌ కొత్త ఫీచర్లు.

20:42 - October 6, 2018

అమరావతి. కేంద్రంలోని  బీజేపీ  కుట్ర రాజకీయాలతో  చిన్న చిన్న పార్టీలను అణగదొక్కాలని చూస్తోందని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ  ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు.  టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం అమరావతిలో జరిగింది. అనంతరం  జరిగిన విలేకరుల సమావేశంలో సుజనాచౌదరి  పార్లమెంటరీ పార్టీ సమావేశం వివరాలు తెలియ చేస్తూ కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును అరికట్టటానికి జాతీయ స్ధాయిలో భావసారూప్యం ఉన్న ఎన్డీయే వ్యతిరేక పార్టీలతో కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. దేశంలో మేకిన్ ఇండియా కాస్త, మైక్ ఇన్ ఇండియాగా మారిందని వ్యాఖ్యనించారు.  దేశంలో ఎరువుల రేట్లు,పెట్రోల్ రేట్లు పెరిగిపోయి డాలర్ రేటు పడిపోయిందని ఆయన అన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యుడి పాలిట గుదిబండలా మారుతున్నాయని వచ్చే ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటుకు కృషి చేస్తామని సుజనాచౌదరి చెప్పారు. 

20:38 - October 6, 2018

హైదరాబాద్ : 'బిగ్ బాస్ 2' టైటిల్ విన్నర్ కౌశల్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఇది కేవలం గేమ్ షో విన్నర్ గా అవ్వటం వల్లన వచ్చింది కాదు. గేమ్ లో అతను చూపించిన స్పిరిట్, కమిట్ మెంట్, పట్టుదల, ఒంటరిగా కౌశల్ సాగించిన పోరుకు బాసటగా నిలిచి బ్రహ్మరథం పట్టాయి. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు. ఆ అభిమానంలోంచి పుట్టిందే కౌశల్ ఆర్మీ, గేమ్ లో ఆయన నిబద్ధత..పట్టుదలను చూసిన అభిమానులు చలించిపోయారు. గేమ్ లో భాగంగా కౌశల్ వ్యవహరించిన తీరుకు తోటి సభ్యులు వేరేగా అర్థం చేసుకున్నారు. అసూయ పడ్డారు. కానీ తాను నమ్మినదానికే కట్టుబడ్డ కౌశల్ మాత్రం ఏమాత్ర చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తుది వరకూ దాదాపు ఒంటరిగానే పోరాడారు. దీన్ని ఎవరు అవునన్నా..కాదన్నా పచ్చి నిజం అనే విషయం ప్రేక్షులు నిరూపించారు. కౌశల్ ని విన్నర్ గా నిలిపారు. గేమ్ లో కౌశల్ వ్యవహరించిన తీరుకు ప్లేబోయ్ బిరుదు ఇచ్చారు. యాపిల్స్ టాస్క్ లో తేజస్వి, భానుశ్రీ అన్న మాటలు సాధారణమైనవి కాదు. అయినా కౌశల్ మాత్రం ఏమాత్రం అదరలేదు..బెదరలేదు.  దానికి ఫలితంగా వారు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. 
షో అయినతరువాత కౌశల్ బయటికి వస్తే చాలు .. అభిమానుల సందడి ఒక రేంజ్ లో కనిపిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో భార్య నీలిమతో కలిసి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది తనని ప్లే బాయ్ అని వెటకారంగా అనటం పట్ల నీలిమ తన భర్తమీద వున్న నమ్మకాన్ని ప్రతిబింభిస్తుంది. ఈ అంశంపై నీలిమ మాట్లాడుతు.."గేమ్ లో భాగంగా ఒక అమ్మాయి చేయి పెట్టుకుంటేనే నన్ను ప్లే బాయ్ అంటున్నారు. హౌస్ లో మిగతావాళ్లు హగ్గులు ఇచ్చుకున్నారు .. కిస్సులు పెట్టుకున్నారు .. ఒకరి మీద ఒకరు కూర్చోవడాలు చేశారు. మరి వాళ్లందరినీ ఏమనాలి? పెళ్లి అయిన తరువాత ఆయన బంగారమే. పెళ్లికి ముందే ఆయన తన గతం గురించి అంతా నాకు చెప్పారు. ఆయన ప్లే బాయ్ కాదు .. మాతో గడపడానికే ఆయనకి  సమయం దొరకదు .. అలాంటప్పుడు ఇక వేరే వ్యాపకాలేం ఉంటాయి" అని చెప్పటంతో వారి మధ్య వున్న అన్యోన్యత..నమ్మకం తెలుస్తోంది. భార్యా భర్తలు ఒకరిపై మరొకరికి నమ్మకం అనేది వుంటే వారి కాపురం, కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంకరంగా వుంటుంది. స్ఫూర్తిదాయంకంగా వుంటుంది. మరోపక్క హౌస్ లో దీప్తి నల్లమోతు కూడా కౌశల్ ని వాళ్లావిడ ఎలా భరిస్తోందో అనే మాటకు కూడా నీలిమ చెప్పిన సమాధానం చెప్పుదెబ్బగా భావించవచ్చు..మరి ఇదే బిగ్ బాస్ కంటెస్టెన్స్ కు కౌశల్ భార్య నీలిమ ఇచ్చిన కౌంటర్.

 

19:42 - October 6, 2018

ఢిల్లీ : ఆన్ లైన్ అమ్మకాలలో అన్నింటికంటే ఎక్కువగా సేల్ అయ్యేవి స్మార్ట్ ఐటెమ్సే. వీటిలో స్మార్ట్ ఫోన్స్ దే మొదటిస్థానం. కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు వినియోగదారులు ఆన్ లైన్ లోనే వుంటారు. ఆన్ లైన్ దిగ్గజం ఫిప్ కార్ట్ లో ఈ హవా కొనసాగుతునే వుంటుంది. దీంతో మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ పవర్‌ను ఈ మధ్యే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్‌ను నిర్వహించారు. అయితే సేల్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ మెసేజ్ యూజర్లకు దర్శనమిస్తుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. సేల్‌లో భాగంగా ఒక సెకన్‌కు 100 మోటో వన్ పవర్ ఫోన్లు అమ్ముడయ్యాయని మోటోరోలా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఫోన్‌కు గాను ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు రెండో సేల్‌ను నిర్వహిస్తామని మోటోరోలా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగానే ఈ ఫోన్‌ను సేల్‌కు ఉంచినట్లు మోటోరోలా ప్రతినిధి తెలిపారు. 

19:30 - October 6, 2018

హైదరాబాద్... ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిధ్దంగా ఉందని టీటీడీపీ  అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల తేదీ ప్రకటించటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతలు శనివారం భేటీ అయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. టీటీడీపీ మహాకూటమిలో చేరినప్పటికీ సీట్ల సర్దుబాటు అంశలో ఇప్పటికీ ఒక స్పృష్టత రాకపోవటంతో ఏఏ స్ధానాల్లో  టీడీపీ పోటీ చేయాలనే అంశంపై రమణ వారితో చర్చించారు.ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండటంతో,అధికార పార్టీ ఇప్పటికే ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్లటంతో, మెవిఫెస్టో తయారు చేసుకోవటం,అభ్యర్ధుల ఎంపిక వంటి అంశాలను కూడా వారు  చర్చించినట్లు తెలిసింది

19:25 - October 6, 2018

ఢిల్లీ : స్మార్ట్ ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా ప్రజలు ఆదరిస్తున్నారు. స్మార్ట్ సొసైటీలో స్మార్ట్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు సరికొత్తగా ఏ ఫోన్ వచ్చిన వెంటనే వారి చేతుల్లో వాలిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫ్యాన్స్ కోసం హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ని త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించకపోయినా దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ ఫోన్ పై పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారనే సంచారంతో మంచి ఉత్కంఠతో స్మార్ట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 
హువావే మేట్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 6.43 ఇంచ్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 40 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫోన్‌లో అందించనున్న పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు కూడా సంస్థ వెల్లడి చేయనుంది. మరి ఒక స్మార్ట్ ఫ్యాన్ అంతా హువావే స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. 

 

18:16 - October 6, 2018

హైదరాబాద్ : ఒక వ్యక్తి కోసం ఆర్మీ పుట్టటం సాధారణ విషయం కాదు. దానికి బిగ్ బాస్ 2 రియాల్టీ షో వేదికయ్యింది. షో విన్నర్ కౌశల్ అభిమానులకు అంతు లేకుండా పోతోంది. కౌశల్ బైట కనిపిస్తే చాలు చుట్టుముట్టేస్తున్నారు. అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్నారు. అదే ప్రాంతంలో సినిమా హీరోయిన్ వున్నా పట్టించుకోనంతగా కౌశల్ రేంజ్ పెరిగిపోయింది. దీనికి షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేదికగా నిలిచింది. 
బిగ్ బాస్ షోలో తన సహజమైన శైలితో వ్యవహరించి విన్నర్ గా నిలచిన అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇది ఫేక్ ఆర్మీ అని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా.. వారు మాత్రం ఎప్పటికప్పుడు కౌశల్ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తునే వున్నారు. 
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిమానులు ఆయన ఎక్కడికి వెళ్తున్నా విడిచిపెట్టడం లేదు. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లిన కౌశల్ ని అభిమానులు చుట్టుముట్టారు. ఈ ప్రారంభోత్సవానికి కౌశల్ తో పాటు Rx100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా వచ్చింది. అయితే కౌశల్ ఫాలోయింగ్ ముందు పాయల్ కు అస్సలు గుర్తింపే లేకుండా పోయింది. అస్సలు అక్కడ ఓ సినిమా హీరోయిన్ వుందనే ధ్యాసలోనే కౌశల్ ఆర్మీ వ్యవహరించారు. కౌశల్ కారుని అభిమానులంతా చుట్టుముట్టడంతో అతడు వారి నుండి తప్పించుకొని వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. కౌశల్, కౌశల్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లన్నీ బ్లాక్ చేశారు అభిమానులు. బహుసా కౌశల్ కూడా ఇంతటి అభిమానాన్ని ఊహించి ఉండడు. ఆయనకి దక్కుతోన్న ప్రేక్షకాదరణ హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 
 

18:07 - October 6, 2018

హైదరాబాద్...రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించటానికి ఎన్నికల సంఘం సిధ్దం గా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్  చెప్పారు.   ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున  నాయకులు అధికార వాహనాలను  ఉపయోగించరాదని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్ధలాలలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను 72 గంటల్లోగా తొలగించాలని,   రాష్ట్రంలో  జరుగుతున్న వివిధ అభివృధ్ది పనుల వివరాలను కలెక్టర్లు  3 రోజుల్లోగా తెలియ చేయాలని రజత్ కుమార్ చెప్పారు.జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో  24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏమైనా  ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూంలలో  ఫిర్యాదు చేయవచ్చని  లేదా 1950 నంబరుకు ఫోన్ చేసి తెలపవచ్చని ఆయన తెలిపారు.  ఎన్నికల కోసం 41 వేల కంట్రోల్ యూనిట్స్, 44 వేల  వీవీ పాట్స్ సిధ్దంగా ఉన్నాయని,  అదనంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనుకూడా తెప్పిస్తామని రజత్ కుమార్ చెప్పారు.   నవంబర్  12 న  ఎన్నికల నోటిఫికేషన్  విడుదల అవుతుందని , నవంబర్  19న నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ అని, 20న నామినేషన్లు పరిశీలిస్తామని, నామినేషన్ల ఉప సంహరణకు 22వ తేదీ గడువు  అని రజత్ కుమార్  తెలిపారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అభ్యర్ధులు  ప్రచారం చేసుకోవచ్చని ఆయన  తెలిపారు.   బ్యాంకుల్లో  జరిగే లావా  దేవీలను పరిశీలిస్తున్నామని, కోడ్ ఉల్లంఘన   పరిశీలన కోసం 7 బృందాలను  ఏర్పాటు చేశామని రజత్ కుమార్  చెప్పారు. 

17:49 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా మూవీ నిన్న ప్రేక్షకులముందుకొచ్చింది.. ఊహించినంత కాదుగానీ, ఓ‌ మోస్తరు టాక్ తెచ్చుకుంది.. తమిళ్‌లోనూ పర్వాలేదనిపించుకుంది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఫస్ట్‌డే నోటాకి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే... ఏపీ, తెలంగాణ షేర్ - 4.55 కోట్లు, తమిళనాడు-రూ.1‌కోటి, కర్ణాటక- 60 లక్షలు, యుఎస్- 75 లక్షలు, మిగతా ఏరియాలు - 45లక్షలు, వరల్డ్‌‌వైడ్ షేర్ - 7.3 కోట్లు..షేర్ వివరాలిలా ఉంటే, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ దాదాపు 14‌ కోట్లని తెలుస్తోంది.. గీత గోవిందం బజ్‌ తో ఓపెనింగ్స్ రావడం వరకూ ఓకే కానీ, డివైడ్ టాక్‌తోనూ తొలిరోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే, విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.. వీకెండ్ కాబట్టి శని,ఆది వారాల్లోనూ మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
 

17:36 - October 6, 2018

హైదరాబాద్ : వ్యంగ్యాస్త్రాలు సంధించటంలో కేసీఆర్ ది ఒకరకమైన స్టైల్ అయితే..కేటీఆర్ ది మరో రకమైన స్టైల్. కేసీఆర్ ది మాస్..కేటీఆర్ ది మాస్, క్లాస్ మిక్స్ గా విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వుంటాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో నేతలంతా తమ వాగ్ధాటికి పదును పెడుతున్నారు. ఈ క్రమంలో మహాకూటమిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాలని, ఆ కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరుంటారు? అంటే, ఆ కూటమిలో ఉన్న వాళ్లంతా ఈ పదవి కావాలనేవారేనని, ఈ కూటమి అధికారంలోకొస్తే మూడు నెలలకోసారి సీఎం మారడం ఖాయమని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఈ కూటమిలో తెలంగాణ జనసమితి, సీపీఐ కూడా భాగస్వాములుగా చేరాయని, ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చిందని అన్నారు.

17:28 - October 6, 2018

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 7వ తేదీన మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో నిర్వహించనున్నామని వెల్లడించారు. డిసెంబర్ 11న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 

 

తెలంగాణ 119
నామినేషన్లకు తుది గడువు నవంబర్ 19
నామినేషన్ల ఉపసంహరణ గడువు  నవంబర్ 22
నామినేషన్ల పరిశీలన  నవంబర్ 28
పోలింగ్ తేదీ డిసెంబర్ 7
ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ స్థానాలు 90  (రెండు విడతల పోలింగ్) తొలి విడత 18..మలి విడత 
నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ 16
నామినేషన్ల తుది గడువు అక్టోబర్ 23 
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24
నామినేషన్ల ఉపంసహరణ అక్టోబర్ 26
తొలి విడత పోలింగ్ నవంబర్ 12
72 అసెంబ్లీ...నామినేషన్ల తుది గడువు  నవంబర్ 2
నామినేషన్ల పరిశీలన నవంబర్ 3
నామినేషన్ల ఉపంసహరణ నవంబర్ 5
రెండో విడత పోలింగ్ నవంబర్ 20 
మధ్యప్రదేశ్, మిజోరం (మధ్యప్రదేశ్ 23), (మిజోరం 40) నవంబర్ 2న నోటిఫికేషన్
నామినేషన్ల తుది గడువు నవంబర్ 9
నామినేషన్ల పరిశీలన నవంబర్ 12
నామినేషన్ల ఉపంసహరణ నవంబర్ 14
పోలింగ్ నవంబర్ 28
రాజస్థాన్
నామినేషన్లు తుది గడువు  నవంబర్ 19
నామినేషన్ పరిశీలన నవంబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 22
పోలింగ్  డిసెంబర్ 7 
ఫలితాలు డిసెంబర్ 11

 

17:14 - October 6, 2018

ఢిల్లీ : డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. కాగా ఏపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవ‌ని, సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తాజాగా స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. లోక్‌సభ గడువు వచ్చే జూన్ 3తో ముగుస్తుంది. ఇంకా కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించమని తేల్చి చెప్పారు. ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
 

 

17:00 - October 6, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు 1లో చాలా సాఫీగా నడిచిపోయింది. ఈ షోకు హోస్ట్ గా చేసిన తారక్ కు మంచి పేరొచ్చింది. రెండో బిగ్ బాస్ 2కు హోస్ట్ గా వ్యవహరించిన నాచ్యురల్ స్టార్ నాని మాత్రం ఆడియన్స్ నుండి విమర్శలను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. కొంతమందికి మాత్రమే ఫేవర్ గా వ్యవహరిస్తున్నాడనీ..అడగాల్సిన సంఘటన విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించి తన ఫేవర్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శనలను నాని మూటకట్టుకున్నాడు. ముఖ్యంగా కౌశల్ విషయంలో నాని కావాలని కౌశల్ ని విమర్శిస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇది ఎంతటి తీవ్రస్థాయికి వెళ్లిందంటే..ప్రేక్షకులను  నాని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకునేంత వరకూ వెళ్లింది. 
మొత్తానికి బిగ్ బాస్ షో రెండవ సీజన్ ఇచ్చిన కిక్కుకి నానిలో ఊహించని మార్పు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని అందుకున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో నాని హోస్ట్ గా పరవాలేదు అనిపించే విధంగా చేసిన నాని బిగ్ బాస్ జోలికి మళ్లీ వెళ్లనని ఇటీవల ఒక ఇంటార్వ్యులో వివరణ ఇచ్చారు. అయితే  మరో మంచి షోలకు హోస్ట్ గా చేయాల్సిన అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆమీర్ ఖాన్ కి మంచి గుర్తింపు తెచ్చిన సత్యమేవ జయతే లాంటి షోలు చేయాలని ఉన్నట్లు నానివరించారు. మరి నానికి అలాంటి అవకాశం ఎంతవరకు అందుతుందో చూడాలి. 

16:51 - October 6, 2018

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క‌లో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ చేసిన ప‌ని అత‌డి ఉద్యోగానికి ఎస‌రు తెచ్చింది. అత‌డి 'కోతి' చేష్ట‌లు అత‌డి ఉద్యోగం పోవ‌డానికి కార‌ణం అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ దావణగెరెలో కోతితో బస్సు నడిపించాడు. కోతి స్టీరింగ్‌పై కూర్చుని అటు ఇటు తిప్పితే.. డ్రైవర్ దాన్ని హ్యాండిల్ చేశాడు. ఈ తతంగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కోతి చేసిన పని చూసి కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం బస్సు డ్రైవర్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను గాలికొదిలేయ‌డం క‌రెక్ట్ కాదంటున్నారు. డ్రైవ‌ర్ నిర్లక్ష్యం పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక‌పోతే విష‌యం ఆర్టీసీ ఉన్న‌తాధికారుల వ‌ర‌కు చేరింది. దీంతో స‌దురు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో కానీ.. ఆ కోతి బ‌స్సులోకి దూరింది. గుండ్రంగా ఉన్న స్టీరింగ్ ను చూసి ముచ్చ‌ట‌ప‌డిందో మ‌రో కార‌ణ‌మో కానీ.. 'నేను కూడా బస్సు నడుపుతాను’ అని కోతి బస్సు స్టీరింగ్ పట్టుకుని ఎంతకూ వదల్లేదు. సరేలే ముచ్చపడుతుంది కదా అనుకున్న డ్రైవర్.. సదరు వానరంతో బస్సు నడిపించాడు. ఇదే అత‌డి పాలిట శాప‌మైంది. డ్యూటీలో ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సింది పోయి.. ఈ కోతి చేష్ట‌లు ఏంటి? అని మండిప‌డుతూ అత‌డిని ఉద్యోగంలో స‌స్పెండ్ చేశారు అధికారులు.

16:47 - October 6, 2018
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నది జరుగుతోందా ? ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ ఆలోచనలకుగుణంగా ఫలితాలు వస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించి గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. అపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని గవర్నర్ సూచించారు. సరిగ్గా ఒక నెల అనంతరం అక్టోబర్ ఆరో తేదీన ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేసింది. శనివారం మధ్యాహ్నం 3.00గంటల ప్రాంతంలో నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి రావత్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన 119 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తామని..ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయన్నారు. సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ ప్రచారంలో దూసుకపోతున్నారు. ప్రతిపక్షం కాంగ్రెస్..టీడీపీ..ఇతర పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పొత్తుల అంశం ఒక కొలిక్కి రాగానే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అంటే అక్టోబర్ చివరి వారంలో సీట్ల ఖరారు..అభ్యర్థుల ఖరారు అయితే నవంబర్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టాల్సి ఉంటుంది. కేవలం కొద్ది సమయంలో ప్రభావించే విధంగా ప్రచారం నిర్వహిస్తారా లేదా ? అనేది చూడాలి. అప్పటికే టీఆర్ఎస్ రెండో విడత ప్రచారం కూడా మొదలుపెడుతారని అంచనా. మరి ప్రజలు ఎవరిపై ఆకర్షితులవుతారో చూడాలి. 
16:44 - October 6, 2018

ప్రముఖ శృంగార తార సన్నీలియోని గురించి ఏ వార్త వచ్చినా, వెంటనే తెలుసుకోవాలని కుర్రాళ్ళు‌ తహతహలాడుతుంటారు.. అసలు సన్నీ బాలీవుడ్‌లోకి ఎలా ఎంటర్ అయిందో తెలుసా? తనవల్లేనని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె పూజా భట్ అన్నారు.. చిన్నవయసులోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన పూజా ప్రస్తుతం నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు.. రీసెంట్‌గా జరిగిన ఇండియా‌ టుడే కౌన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆమె, నటిగా తన కెరీర్ గురించీ, నిర్మాతగా, దర్శకురాలిగా తనకెదురైన పరిస్ధితుల గురించీ‌ చెప్తూ..  శృంగార తారగా ఓ వెలుగు వెలుగుతున్న టైంలోనే సన్నీని ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ‌కి తీసుకురావాలనుకున్నానని అన్నారు.. సన్నీ సాధారణ సినిమాల్లో నటించడానికి అమెరికా ఒప్పుకోలేదు.. అప్పుడు నేనే తనని హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసా.. ఇప్పుడు ఇక్కడ తనకంటూ ఫ్యాన్స్ ఉన్నారనీ, ఈ మాట స్వయంగా సన్నీనే తనతో చెప్పిందని పూజా చెప్పుకొచ్చారు..  ప్రస్తుతం హిందీలో సడక్‌‌ 2 మూవీలో, సోదరి అలియా భట్, సంజయ్‌‌దత్‌లతో కలిసి నటిస్తున్నారు పూజా..

 

16:30 - October 6, 2018
ఢిల్లీ: ఎన్నిక‌ల న‌గారా మోగింది. దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ఘఢ్‌, మిజోరాంలతో పాటు తెలంగాణాలో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని, తెలంగాణాకు సంబంధించి ఓటర్ల జాబితా కేసు పెండింగ్ లో ఉంది కనుక తీర్పు వచ్చిన తర్వాత  తుది జాబితాను ప్రకటిస్తామని  సీఈసీ ఓపీ రావత్  చెప్పారు. 
 
చత్తీస్ ఘడ్ లో రెండు ద‌శ‌ల్లో ఎన్నికలు జరుగుతాాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన దక్షిణ చత్తీస్ ఘడ్ లో 18 నియోజకవర్గాలలో నవంబర్ 12న ఎన్నికలు జరుగుతాయి. ఉత్తర  చత్తీస్ ఘ‌డ్ లో మిగిలిన 72 నియోజకవర్గాలలో నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి.  నవంబర్ 28న మిజోరం, మధ్యప్రదేశ్ లలో ఎన్నికలు  జరుగుతాయి. కాగా  తెలంగాణ, రాజస్ధాన్ లలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని  కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 5 రాష్ట్రాల  ఎన్నికల ఫలితాలను  డిసెంబర్ 11న వెల్లడిస్తారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే దశలో  ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 
 
ఎన్నికలు స్వేచ్చాయుతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఓపీ రావత్ చెప్పారు. సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని ఓపీ రావత్  అన్నారు.
 
మధ్యప్రదేశ్
మెత్తం అసెంబ్లీ స్థానాలు  230
బీజేపీ          166
కాంగ్రెస్         63
బీఎస్పీ         04
ఇతరులు      02
 
రాజస్థాన్
మొత్తం స్థానాలు    199
బీజేపీ    163
కాంగ్రెస్    27
ఎన్.పి.ఇ.పి.       4
బీఎస్పీ         3
ఇతరులు       2
 
ఛత్తీస్ గఢ్డ్
మొత్తం అసెంబ్లీ స్థానాలు      91
బీజేపీ 49
కాంగ్రెస్ 39
బీఎస్పీ                     01
ఇతరులు 02
 
మిజోరాం
మొత్తం అసెంబ్లీ స్థానాలు      41
కాంగ్రెస్ 34
మిజో నేషనల్ ఫ్రంట్ 05
మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ 01
16:25 - October 6, 2018

కేరళ : కేరళలో అందరు చదువుల సరస్వతులే. చదువే కాకుండా అక్కడ అమ్మాయిలను సాధికారతవైపు అడుగులు వేసేందుకు ఓ కళాశాల వినూత్న శిక్షణినిస్తోంది. అంతేకాదు అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కూడా ఈ శిక్షణలో భాగంగా కేరళలోని తిరువనంతపురంలో వున్న బిషాప్ కురియాలచేరి మహిళా కళాశాల.. కొబ్బరి చెట్లను ఎక్కేందుకు అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 30 గంటల వ్యవధి ఉన్న ఈ సర్టిఫికెట్ కోర్సును నవంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ప్రాక్టికల్ క్లాసులతో పాటు చెట్లను ఎక్కేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను పాఠాల రూపంలో బోధించనున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి.. తొలి దశలో భాగంగా 100 మంది అమ్మాయిలను ఎంపిక చేయనున్నారు. కొబ్బరి చెట్లను ఎక్కేందుకు కేరళలో సరిపడ మనుషులు దొరకడం లేరు. ఆ చెట్లను ఎక్కేందుకు వేరే ప్రాంతం నుంచి వ్యక్తులను పిలవాల్సి వస్తుంది. ఈ కొరతను అధిగమించేందుకు సర్టిఫికెట్ కోర్సు ఉపయోగపడుతుందన్నారు కళాశాల యాజమాన్యం. అదే విధంగా యువతులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. 

 

15:56 - October 6, 2018

ఢిల్లీ: కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఢిల్లీలో శ‌నివారం ప్రెస్ మీట్ లో నాలుగు రాష్ట్రాల‌తో(మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌డ్, మిజోరాం) పాటే తెలంగాణ‌కు కూడా ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్రక‌టించారు. డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 11న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. తెలంగాణ‌లో మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. నామినేష‌న్ల‌కు తుది గ‌డువు న‌వంబ‌ర్ 19. నామినేష‌న్ల ప‌రిశీల‌న న‌వంబ‌ర్ 28న ఉంటుంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు తుది గడువు న‌వంబ‌ర్ 22. ఇవాళ్టి నుంచే ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుందని ఈసీ చెప్పారు. కాగా తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌ల్లో ఉంద‌న్నారు.

15:46 - October 6, 2018

జమ్మూకశ్మీర్‌ : మరో ఘోర ప్రమాదం...ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ మినీ బస్సు లోయలో పడిపోవడంతో 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. శనివారం ఉదయం జేకే 19 1593 నెంబర్ గల మినీ బస్సు బనిహాల్ నుండి రందాన్‌కు వెళుతోంది.  కేలామోత్ వద్ద జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. సుమారు 200 మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జైంది. మొత్తంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను లోయలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. బస్సులో అధికమంది ప్రయాణించడమే కారణమా ? లేక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? అనేది తెలియాల్సి ఉంది. 

15:32 - October 6, 2018

ఢిల్లీ: కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఢిల్లీలో శ‌నివారం ప్రేస్ మీట్ లో నాలుగు రాష్ట్రాల‌తో పాటే తెలంగాణ‌కు కూడా ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్రక‌టించారు. డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 11న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌న్నారు.

15:32 - October 6, 2018

వాషింగ్‌టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో ఆర్థికమాంద్యాన్ని చవిచూడబోతోంది. 2008 సంవత్సరంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ హెచ్చరించింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మరో పెనుముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. ఆయా దేశాధినేతలు బ్యాంకుల సంస్కరణలను అమలుచేయడంలో అవలంభిస్తున్న నిర్లక్ష్యమే ఈ రాబోయే ప్రమాదానకి కారణమని ఐఎమ్ఎఫ్ అధికారులు పేర్కొంటున్నారు.  ప్రధానంగా రుణాల స్థాయి 2008 స్థాయికంటే పెరగడం ప్రధాన సమస్యగా చెబుతున్నారు. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రమాదపూరిత లావాదేవీలను అదుపుచేయలేకపోవడంతో గ్లోబల్ స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని వాషింగ్‌టన్‌కు చెందిన ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

గత పదేళ్లలో బ్యాంకుల ద్రవ్యనిల్వలను పెంచేందుకు ప్రయత్నాలు జరిగినా.. అలాగే ఆర్థిక రంగంలో కొన్ని కఠిన పర్యవేక్షణలు చేపట్టినా.. నష్టాలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, అస్థిరతను అదుపుచేసే యత్నాలు కొత్త రంగాలకు ఎగబాకే ప్రమాదం ఉందని ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. కాబట్టి ఆర్థిక పర్యవేక్షకులు జరగబోయే పరిణామాలను జాగురూకతతో గమనించి చర్యలు తీసుకోవాలని సూచించింది.   

15:28 - October 6, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై వరుసగా ఐసీ, ఈడీ సోదాలు దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలలో పలు సంచలనం కలిగించింది. పలు మీడియా సంస్థలు కూడా ఇదే అంశంపై ప్రసారాలు కూడా చేశాయి. దీనిపై రేవంత్ మాట్లాడుతు..కావాలనే తనకు హాకాంగ్, మలేషియా, సింగపూర్ లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గంటు గంటలు ప్రసారం చేసాయని..కొన్ని చానల్స్ అయితే ఇప్పటికీ ప్రసారం చేస్తున్నాయని..తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని రేవంత్ హెచ్చరించారు.  ముఖ్యంగా టివి9, టీ న్యూస్, నమస్తే తెలంగాణలలో తప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. వాటి వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని...వెంటనే అవి తప్పుడు వార్తలని ప్రజలకు వివరించాలని హెచ్చరించారు. అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని...లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని రేవంత్ హెచ్చరించారు.

 

15:23 - October 6, 2018

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది.. కంటెంట్ బాగుందనే టాక్ వస్తేచాలు, నటీనటులు కొత్తవారైనా సరే ఆడియన్స్ ధియేటర్స్ బాట పడుతున్నారు.. ఇప్పుడు అదే కోవలో రథం అనే మూవీ రాబోతుంది...
గీత్ ఆనంద్, చాందిని భగ్వనాని హీరో, హీరోయిన్స్‌గా, చంద్రశేఖర్ కానూరి డైరెక్షన్‌లో, రాజ్ గురు ఫిలింస్ బ్యానర్‌పై, రాజా దారపునేని ఈ రథం చిత్రాన్ని నిర్మిస్తున్నారు... ఇంతకుముందు ఈ మూవీలోని ఒక పాటని సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి విడుదల చేసారు.. ఇప్పుడు రథం థియేట్రికల్ ట్రైలర్‌ని డైరెక్టర్ క్రిష్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు... రెండు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది... మంచివాడు పక్కింట్లో ఉంటే మనోడురా అంటాం.. అదే వాడు మనింట్లో ఉంటే మనకెందుకురా అంటాం...18రోజుల యుధ్దం, లక్షల్లో శవాలు, కురుక్షేత్ర యుధ్ధంకూడా ధర్మం కోసమే లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి... హీరో, హీరోయిన్‌లమధ్య రొమాన్స్, హై ఓల్టేజ్ యాక్షన్, ఓ మోస్తరు గ్రాఫిక్స్‌‌తో రూపొందించిన రథం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా అనిపిస్తుంది.. సుకుమార్ పమ్మి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది.. త్వరలో రథం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

15:12 - October 6, 2018

హైదరాబాద్ : పూనమ్ కౌర్...తెలుగు సినిమా నటి..అంతేగాక మోడల్..తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో మానేసింది. అనంతరం ఓ సీరియల్ చేస్తోంది. పురాణ టీవీ షో అయిన స్వర్ణ ఖడ్గం ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మెగా సీరియల్‌ను ‘బాహుబలి’ టీం నిర్మిస్తోంది. ఈ షోకు ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీరియసల్‌లో పూనమ్ రాణిగా కనిపిస్తోంది. 

ఈ అమ్ముడు ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై ఆమె పలు ట్వీట్ చేస్తుంటారు. కానీ తాజాగా చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న రాజకీయాలపై ఆమె ట్వీట్ చేశారు. ‘ఆంధ్ర.. తెలంగాణ అంటూ మనవాళ్ళు ఫైట్ చేసుకుంటే ఎవరికి లాభం ఉండదు.. ఈ ఫైట్ ను చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్న పిల్లి.. కోతి కథ గుర్తుకు వస్తుంది’ అని పిల్లి..కోతితో కూడుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. దీనిపై ఓ నేత స్పందించారు. ‘నోటుకు ఓటు వల్ల ఎవరికి నష్టం మీ ట్వీట్ లో స్పష్టత లేదు.  మీ ట్వీట్ వలన టీడీపీకి ఒక్క ఓటు కూడా పడదు" అని ట్వీట్ చేశాడు.  దీనికి ప్రతిగా పూనమ్ స్పందించారు. ‘మీరు ఎవరి ఫోటోను డీపీగా పెట్టుకున్నావో వారి విలువ తీయకు. అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడితే  చూస్తూ ఊరుకుంటామా.  అసభ్యకరమైన భాషను ప్రయోగించి పంచ్‌లు వేయడానికి ఇదేమి సినిమానా’ అని  ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్్స వైరల్‌గా మారాయి. 

గతంలో కూడా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్స్ వివాదం అయిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ట్వీట్లను తొలగించి వేసింది. అనంతరం సిని క్రిటక్స్ కత్తి మహేష్‌పై కూడా పలు ట్వీట్లు చేశారు. 

15:09 - October 6, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ కు అభిమానుల నుండి వచ్చే ప్రశంసలు..ప్రోత్సాహం..ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తికి ఇంతటి ఆదరణ అనేది చాలా అరుదు. దీనికి పాత్రుడైన కౌశల్ నిజంగా అర్హుడే. అందుకే విన్నర్ గా నిలిచినా..తోటి కంటెస్టెంట్స్ నుండి ఇప్పటికి విమర్శలు వస్తున్నా..వారి పట్ల ఒక కామెంట్ కూడా చేయకపోవటం కౌశలర్ సంస్కారానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అందుకే అతనికి అంతటి ఆదరణ దక్కింది. ఇంకా అది పెరుగుతు వస్తోంది. కైశల్ విజేతగా నిలవడంతో కౌశల్ ఆర్మీ సంబరాలకు అంతేలేదు. ఈ నేపథ్యంలో తన విజయం కోసం కౌశల్ ఆర్మీ చేసిన కృషిని పొగిడిన కౌశల్ ఈ సంధర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తలచుకున్నాడు. ఆయన తనకిచ్చిన ఇన్స్పిరేషన్ ని గుర్తుతెచ్చుకున్నాడు. ''నాకు పవన్ కల్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్రాణం కూడా అన్నారు. ఒక రోజు ఆయన నా భుజం మీద చేయి వేసి నా కృషి, పట్టుదల చూస్తుంటే ముచ్చటగా ఉంది.జీవితంలో ఎంత కష్టపడుతున్నావో.. ఆ కష్టాన్ని పదికాలాల పాటు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నేను బిగ్ బాస్ విజేతగా నిలవడం కోసం పడ్డ కష్టాన్ని జీవితాంతం నిలిచేలా ఉపయోగించుకుంటాను అంటూ కౌశల్ తెలిపారు.  

14:28 - October 6, 2018

గుంటూరు : ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్లొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కోర్టులో రీ కాల్‌ పిటిషన్‌ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

14:08 - October 6, 2018

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. వనపర్తిలో తెరాస ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌ తనపై చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. కేసీఆర్‌ మాటల్లో ఓటమి భయం కనబడుతోందన్నారు. సమాధానం చెప్పలేకే కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఉద్యమ రోజులు అనుకుంటున్నారా? అని నిలదీశారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.

’నాలుగేళ్ల నుంచి నా గురించి ఏమీ మాట్లాడని మీరు ఇప్పడు నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? మీ ఇంట్లో మహిళలు లేరా? జోగులాంబ అమ్మవారు కేసీఆర్‌ను తప్పక శిక్షిస్తుంది అని అన్నారు. తెలంగాణలో పుట్టిన మీకు ఇంత నీచ సంస్కృతి ఎలా వచ్చిందని నిలదీశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. బతుకుదెరువు, కుర్చీ కోసం ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ దొంగ దీక్ష గురించి నిమ్స్‌కు వెళితే తెలుస్తుందని అన్నారు.

 

14:04 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార పర్వంలో గులాబీ బాస్..దళం దూసుకపోతోంది. కేసీఆర్ మాటల తూటాలు పేలుస్తున్నారు. దీనిపై విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా విమర్శలకు పదును పెట్టారు. శనివారం టీఆర్ఎస్ వి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ ను ఏకిపారేశారు. 
ఉత్తమ్ సైనికుడా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. చిల్లర..మల్లర మాటలు మాట్లడాతున్నారని, కాంగ్రెసోళ్లకు బలుపెక్కువ అని ఎద్దెవా చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు వీర సైనికుల్లా పోరాటం చేస్తే.. మరి ఉత్తమ్ ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి బంట్రోత్...విద్యార్థి లోకం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని 

13:54 - October 6, 2018

​క‌రీంన‌గ‌ర్: టీఆర్ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తృటిలో ప్రమాదం త‌ప్పింది. ఈ ఉద‌యం మానేరు డ్యామ్ లో ఆయ‌న బోటింగ్  చేశారు. బోటింగ్ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో ఆయ‌న కాలుజారి నీటిలో పడిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది. ఆయన్ను బయటకు తీశారు. 

వాస్తవానికి నాలుగు రోజుల క్రితం మానేరు డ్యామ్ లో గంగుల బోటింగ్ ను ప్రారంభించాల్సి వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, అధికారులే ఆ పని ముగించారు. రెండు స్పీడ్ బోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉదయం ఎన్నికల ప్రచారంలో ఉన్న గంగుల, సరదాగా కాసేపు బోటింగ్ చేయాలని భావించారు. ఆ క్రమంలోనే కాలుజారి నీటిలో పడిపోయారు. అయితే, లైఫ్ జాకెట్ ను ధరించి ఉండటంతో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. గంగుల సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు హుషారుగా బోటింగ్ చేసిన గంగుల క‌మ‌లాక‌ర్.. చివ‌రి నిమిషంలో మాత్రం సిబ్బందిని హ‌డ‌లెత్తించారు.

13:35 - October 6, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ నటించిన ‘అరవింద సమేత’ రిలీజ్ కు అంతా సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అభిమానులే కాకుండా టాలీవుడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలై అభిమానులను అలరించింది. చిత్ర పోస్టర్్స కూడా అదుర్్స అనిపించాయి. కానీ చిత్ర షూటింగ్ కొనసాగుతుండగానే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హఠాన్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

కానీ ఆయన చనిపోయిన ఐదు రోజులకే సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ‘అరవింద సమేత’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తెలియచేశారు. ఈ కార్యక్రమం మొత్తం భావోద్వేగంగా సాగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చిత్రంలోని పాటలు అలరిస్తున్నాయి. అందులో ప్రధానంగా 
'పెనివిటి' అనే పాట హృదయాలను హత్తుకొంటోంది. ఈ పాట విని అమ్మ ఏడ్చేసిందని జూ.ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారంట. నాన్న చనిపోయిన అనంతరం ఈ పాట చిత్రీకరించడం జరిగిందని...తరువాత అమ్మ..తాను మరింత మానసికంగా ధృఢంగా అయ్యామని పేర్కొన్నారని ఓ వార్త. అరవింద సమేత చిత్రం తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని సినిమాలో కొన్ని పాత్రలు తన మార్పుకి కారణమని ఎన్టీఆర్ వెల్లడించారు.

13:34 - October 6, 2018

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్... ఏ పరిశ్రమలో చూసినా వారసులు, వారి వారసులు వంటి వారసత్వపు హంగామా కనబడుతుంది.. తెరవెనక ఉండే టెక్నీషియన్స్ కానీ, వారి వారసులు కానీ నటీనటులుగా రాణించిన దాఖలాలు ఎక్కడాలేవు... 
ఇప్పుడొక ఫైట్ మాస్టర్ హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడనే వార్త ఫిలిం వర్గాల్లో ఆసక్తిని‌ రేకెత్తిస్తుంది.. వివరాల్లోకి వెళ్తే, తమిళ్‌లో విజయ్ నటించిన లవ్టుడే చిత్రంతో సినీఫీల్డ్‌లోకి ఎంటరై, సేతు, రాజస్ధాన్, నందా, సింహరాశి, అరుల్ వంటి దాదాపు 60 సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన స్టంట్ శివ ఇప్పుడు హీరోగా మారాడు.. యూత్ మూవీ ఫేమ్ విన్సెంట్ సెల్వ డైరెక్ట్ చేస్తున్న ఈ‌ చిత్రం పూజాకార్యక్రమాలు ఇటీవలే చెన్నైలో జరిగాయి..
నిమో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలు నిర్మిస్తుండగా.. నేహ, యోగిబాబు, రోబో శంకర్, నందా, చార్లీ, అప్పుకుట్టి తదితరులు నటిస్తున్నారు.. నెక్స్ట్ఇయర్ ఫస్ట్‌హాఫ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు... 

13:10 - October 6, 2018

హైదరాబాద్ : బుల్లితెరపై ఎన్నో ధారావాహికలు వస్తుంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. అందులో రియాల్టీ షోలు కూడా ఉంటాయి. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ 2 షో ఎంతోమందిని అలరించింది. ఇందులో విజతేగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తరువాత ‘పెళ్లి చూపులు’ అంటూ మరో ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతోంది.  ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఈ షో ప్రసారం చేస్తోంది. ఇందులో వ్యాఖ్యాతగా సుమ..ప్రదీప్ లు వ్యవహరిస్తున్నారు. 

ఇలాంటి షోలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఉత్తరాదిన ఈ కాన్సెప్ట్ తో చాలా కార్యక్రమాలు వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం తొలిసారి. గతంలో ప్రదీప్ వివాహంపై పలు రూమర్్స కూడా వచ్చాయి. దీనితో ప్రదీప్ పెళ్లి చూపులు అంటూ కార్యక్రమం మొదలు పెట్టారు. కొందరు అమ్మాయిలతో మాట్లాడి..ఎంపిక చేసిన వారికి ప్రదీప్ రకరకాల పరీక్షలు నిర్వహిస్తుంటాడు. దీనితో ప్రదీప్ ను ఇంప్రెస్ చేయడానికి 14 మంది అమ్మాయిలు తంటాలు పడుతుంటారు. 

కానీ ఫైనల్ లో గెలిచిన యువతితో ప్రదీప్ వివాహం జరుగుతుందా ? లేదా ? అనేది చర్చ జరుగుతోంది. అయితే ఈ పెళ్లి కేవలం షో వరకు మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ షోలో పెళ్లి చేసుకోడని టాక్. ఈ పెళ్లి చూపులపై మరికొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పెళ్లి చూపులు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

13:09 - October 6, 2018

ఢిల్లీ : దివ్యాంగులకు గుడ్‌న్యూస్. ఢిల్లీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. దివ్యాంగుల సౌకర్యార్థం ఢిల్లీలో కొత్తగా 500 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సులు వచ్చే ఆరు నెలల్లో రోడ్లపైకి రానున్నాయి. ఈ మేరకు తాము సూచించిన ప్రకారం మొత్తం 500 బస్సులను సమకూర్చాలని తయారీ సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం అంగీకార పత్రం జారీ చేసింది. 

మెట్లు లేకుండా ఒకే ఫ్లోర్‌ కలిగి ఉండే ఈ బస్సులకు.. దివ్యాంగులు కూడా సులభంగా ఎక్కేందుకు వీలుగా హైడ్రాలిక్‌ లిఫ్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో ఏర్పాటు చేసే ఒక్కో హైడ్రాలిక్‌ లిఫ్టుకు రూ.3 లక్షల వరకూ ఖర్చవుతుందని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. నగరంలో ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు తాజా చర్యలు చేపట్టినట్లు రవాణా అధికారులు వెల్లడించారు. 

మొదటగా వెయ్యి బస్సులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక చేసుకోగా.. ఆ బస్సులు దివ్యాంగులకు అనుకూలంగా ఉండవంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. గత ఆగస్టులో 500 బస్సులు కొనేందుకు సుప్రీకోర్టు అనుమతిచ్చిందని రవాణాశాఖ అధికారులు వివరించారు. బస్సుల్లో హైడ్రాలిక్‌ లిఫ్టులు సహా.. ప్రభుత్వం సూచించిన ఇతర సూచనల ప్రకారం మార్పులు చేసేందుకు రూ.80 నుంచి 90 కోట్లు అవుతుందని తెలిపారు.

12:59 - October 6, 2018

హైద‌రాబాద్: ప్రేమ పేరుతో కొంద‌రు ఉన్మాదులుగా మారుతున్నారు.ప్రేమించ‌డం లేద‌నే కోపంతో అమ్మాయిల‌ను చంపేందుకు కూడా వెనుకాడ‌టం లేదు. తాజాగా టపాచబుత్రలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఇబ్రహీం అనే వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తనను ప్రేమించలేదంటూ ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం యువతి 90శాతం గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనలో యువతిని కాపాడే ప్రయత్నంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 6 నెలల క్రితం యువతికి, ఇబ్రహీంకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే ఇబ్రహీంకు పెళ్లి అయిన విష‌యం తెలిశాక... యువతి అతనిని దూరం పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇబ్రహీం ఈ దారుణానికి ఒడిగట్టాడు.

బెహ్రైన్ లో ఉండే ఇబ్ర‌హీంకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల విచార‌ణ‌లో తెలిసింది. ఆరు నెలల క్రితం టపాచ‌బుత్రకి చెందిన అజీనా బేగంతో అత‌డికి ఫేస్ బుక్‌లో పరిచయం అయింది. అయితే కొద్దిరోజుల క్రితం భార‌త్ కు వచ్చిన ఇబ్రహీం.. ఆమెను కలవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ యువతి నిరాకరించింది.  పైగా.. నీకు పెళ్లయింది.. న‌న్ను క‌ల‌వొద్దు.. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు... అంటూ అతన్ని దూరం పెట్టింది. దీంతో రాక్షసుడిలా మారిన ఇబ్రహీం ఈ రోజు ఉదయం పెట్రోల్ క్యాన్‌తో ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసాడు. అతడు కూడా పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. తనకు నిప్పంటించుకుని వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దానితో ఆ మంటలు ఆమెను కూడా చుట్టుముట్టాయి.
 
ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందు గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు సంగతి తెలిసి భ‌య‌బ్రాంతుల‌కు లోన‌య్యారు.  పెట్రోల్ కావడంతో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది.

12:46 - October 6, 2018

బీహార్ : భారతదేశంలో పరువు హత్యలు..దాడులు పెట్రేగిపోతున్నాయి. ఏకంగా సొంతవాళ్లనే దారుణంగా చంపేస్తున్నారు. కేవలం వేరే కులం కావడమే ఇందుకు కారణం. తమ కులం కాదని..ఇతర కులం వాడితో ఎందుకు ప్రేమించావంటూ యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవలే నల్గొండ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ లో వేరే కులం వాడిని ప్రేమించిందని గ్రామస్తులు యువతిని చెట్టుకు కట్టేసి దారుణంగా హింసించారు. 

బీహార్ జోగియా మారన్ గ్రామంలో ఓ యువతి..ఓ అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇక్కడ అబ్బాయిది వేరే కులం. వివాహానికి పెద్దలు ఒప్పుకోరని తెలుసుకున్న వీరు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం అక్కడున్న గ్రామస్థులకు తెలిసిపోయింది. ఇంకేముంది ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెను పట్టుకుని పంచాయితీ పెట్టారు. చెట్టుకు కట్టేసి ఆమెను చావబాదారు. సుమారు ఐదు గంటల పాటు నరకం చూపించారు. చివరకు విషయం తెలుసుకున్న రక్షకభటులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రగాయాలపాలై బాధ పడుతున్న యువతిని రక్షించారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

12:44 - October 6, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించిన చిత్రం.. సవ్యసాచి.. ఇటీవల రిలీజ్ చేసిన సవ్యసాచి టీజర్‌‌కి మంచి స్పందన లభిస్తోంది..  ఈ మూవీ ద్వారా చైతూ ఫస్ట్ టైమ్ పక్కా మాస్ మసాలా ఫార్మాట్‌లోకి మారిపోయాడు.. ఎమ్.ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని ఈ నెల 9వ తేదీన రిలీజ్ చెయ్యబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది..  చైతూ క్యారెక్టర్ హైలెట్‌గా  రూపొందుతున్న సవ్యసాచిలో, ఆర్.మాధవన్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, ముకుల్ దేవ్, రావు‌రమేష్ తదితరులు నటిస్తున్నారు... నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రాబోతుంది.. 

12:41 - October 6, 2018

తిరుపతి : సిబిఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. త్వరలో తన ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి వెళ్తానని పేర్కొన్నారు. 

ఏపీలోని 13 జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్మార్ట్ సిటీలు కాదు.. మొదట స్మార్ట్ విలేజ్‌లు కావాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండలని తెలిపారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేయాలని అనుకున్నాను..కానీ పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. 

12:18 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కుమ్మక్కై రైల్వే కేసులను ఉపసంహరించుకున్నారని, అందులో ఎక్కవ కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ బండారాన్ని బయటపెట్టేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని, అందులో భాగంగా మోడీతో కుమ్మక్కై రైల్వే కేసులన్నీ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. 260 కేసులు నమోదు అయితే కేవలం 10 కేసులు ఉపసంహరించుకున్నారని..ఉపసంహరించుకున్న కేసులన్నీ హరీష్..కవిత మధ్య ఉందన్నారు. 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లడిన భాష ఇతర రాష్ట్రాల వారు వింటే గిదేనా తెలంగాణ సంస్కృతి ? అనే అవకాశం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే తెలంగాణ ప్రజలకు అవమానమన్నారు. కేసీఆర్ ఆడే నాటకాలు..నయవంచనలు...రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివితో ఆలోచిస్తున్నారని తెలిపారు. 

కేసీఆర్ ఆడుతున్న నాటకం సమాజం నమ్మడం లేదని..కాంగ్రెస్..టీఆర్ఎస్ పోటీ ఉంటుందని..ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని..మేధావులు..ఇతరులు కాంగ్రెస్ కు మద్దతునిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సమాజంపై మోడీకి ప్రేమ లేదని..కేవలం కేసీఆర్ పై మాత్రమే ప్రేమ ఉందన్నారు. వ్యాపారాలు..టీవీ ఛానెళ్లు..ఇతరత్రా వాటిని కుటుంబానికి కేసీఆర్ పెట్టారని..ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని రేవంత్ పిలుపునిచ్చారు. 

12:10 - October 6, 2018

విజయ్ ఆంటోనీ... బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... యమన్, ఇంద్రసేన, కాశి వంటి విజయ్ గత చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.. ఈ నేపధ్యంలో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా రోషగాడు మూవీతో రాబోతున్నాడు.. విజయ్ ఆంటోనీ, నివేథా పేతురాజ్ జంటగా, గణేష్ డైరెక్షన్‌లో, ఫాతిమా‌విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న చిత్రం.. రోషగాడు.. ఈ మూవీలోని రోషగాడురా.. వీడు మాటంటే పడడురా అనే థీమ్ సాంగ్‌ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లాంచ్ చేసారు.. భాష్యశ్రీ ఈ‌పాటని వ్రాశారు.. ఎప్పటిలానే  విజయ్ ఆంటోనీ ఈ‌మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు...  సాంగ్ ఆద్యంతం సినిమాలో విజయ్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలియచేసేలా ఉంది.. రోషగాడులో విజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా‌ కనిపించబోతున్నాడు...
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రోషగాడు త్వరలో రిలీజ్ కాబోతోంది...

11:58 - October 6, 2018

ఢిల్లీ : రష్యాతో భారత్‌ క్షిపణి బంధం మరింత బలపడింది. ఎస్‌ - 400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. రష్యా నుంచి ఎస్‌-400ను కొనుగోలు చేయవద్దని అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్‌ కొనుగోలు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లింది.

భారత్‌, రష్యా మధ్య  కీలక ఒప్పందాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ - రష్యా 19వ వార్షిక శిఖరాగ్ర ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌కు రష్యా సహకారం ఇందులో ముఖ్యమైనది. అలాగే రష్యా నుంచి ఎస్‌ -400ను కొనుగోలు చేయవద్దని అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్‌ వాటి కొనుగోలు ఒప్పందం చేసుకుంది.

ఒప్పందంపై సంతకాల అనంతరం మోదీ - పుతిన్‌ వివరాలు వెల్లడించారు. అంతరిక్షంలో పరస్పర సహకరించుకోవాలనే ఒప్పందం కూడా ఇందులో కీలకంగా ఉంది. రష్యా భారత దేశానికి కీలక మిత్రదేశమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ఇరు దేశాలు సహజ భాగస్వాములని తెలిపారు. తాజాగా చేసుకున్న పలు ఒప్పందాలతో ఈ సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్టు చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారానికి ముందుకు వచ్చిన రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి కుదిరిన ఒప్పందంలో భాగంగా..  సైబీరియాలోని నోవోసైబిర్‌స్క్‌ నగర సమీపంలో‌ భారత్‌ పర్యవేక్షణ కేంద్రాన్ని నిర్మించనుంది.

11:55 - October 6, 2018

న‌ల్గొండ‌: మ‌ద్యపానం అల‌వాటు ఎంత చేటో చెప్పే ఘ‌ట‌న ఇది. మ‌ద్య‌పానం కార‌ణంగా అనేక కుటంబాలు చిన్నాభిన్నం అయ్యాయి, అవుతున్నాయి. న‌మ్ముకున్న వాళ్లు రోడ్డున ప‌డుతున్నారు. మందు అల‌వాటు నేరాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది. అయినా మందుబాబుల వైఖ‌రిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. చ‌దువురాని వాళ్లే కాదు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం మ‌ద్యానికి బానిస‌లై జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా ఓ తాగుబోతు భ‌ర్త కార‌ణంగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. తాగుబోతు భ‌ర్త వేధింపులు తాళ‌లేక త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఓ త‌ల్లి కాలువ‌లోకి దూకేసింది.

భార్య పిల్ల‌ల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భ‌ర్త రోజు తాగొచ్చి చిత్ర హింసలు పెట్టాడు. ఎంత న‌చ్చచెప్పినా అత‌డిలో మార్పు రాలేదు. భర్త చేష్టలతో విసిగిపోయిన ఆ భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మోహన్‌కు స్వాతితో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి సాత్విక (6), మధునశ్రీ (4), మమంత్‌ కుమార్‌ (3) ముగ్గురు పిల్లలు. మోహన్ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పిల్లల చదువు కోసం వారు నాలుగేళ్ల కిందట అనుముల మండలం హాలియాకు వచ్చేశారు.

ఈ క్రమంలో మోహన్ మద్యానికి బాసయ్యాడు.దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. రోజుమాదిరిగానే శుక్రవారం పిల్లలను బడికి పంపిన స్వాతి, భోజనం తినిపించి తీసుకొస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం వారిని తీసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వీరి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి రాకను చూసిన స్వాతి కొడుకుని కాలువలోకి తోసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి దూకేసింది. వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వాతి, సాత్విక, మధునశ్రీలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆడపిల్లలు ఇద్దరూ మృతిచెందగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం వెతుకున్నారు.

ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అప్ప‌టివ‌ర‌కు క‌ళ్ల‌ముందు ఆడుతూ పాడుతూ అల్ల‌రి చేసిన పిల్లలు విగ‌త‌జీవులుగా మార‌డం చూసి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హరించాల్సిన పోలీసే ఇలా వేధింపులకు పాల్ప‌డ‌టంపై ఆగ్ర‌హం వ్యక్త‌మ‌వుతోంది. ఈ ఘ‌ట‌న చూశాకైనా మ‌ద్యం తాగే వారిలో మార్పు రావాల‌ని ఆశిస్తున్నారు.

11:47 - October 6, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కార్మికులపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిని పెట్టారు. కార్మికుల ప్రయోజనాల కోసం పలు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సింగరేణి కార్మికుల లాభాల వాటాను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నారు. కార్మికుల వేతనాలు..ఇతరత్రా కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ దసరా..దీపావళి పండుగల సందర్భంగా బోనస్ లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దసరా పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ ప్రకటించాలని కోలిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 

ఢిల్లీలోని కోలిండియా యాజమాన్యంతో ఐదు జాతీయ కార్మికుల సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఒక్కొక్క కార్మికుడికి దసరా బోనస్ కింద రూ. 60, 500లను ఈనెల 12 తరువాత కోలిండియా పరిధిలో పంపిణీ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. సింగరేణిలో ప్రస్తుతం 53, 300 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోలిండియా ప్రకటించిన విధంగానే సింగరేణి కూడా బోనస్ పంపిణీ చేయనుంది. సింగరేణి సంస్థలో పంపిణీ తేదీని ప్రకటించనప్పటికీ 12వ తేదీ తర్వాతనే పంపిణీ చేసే అవకాశం ఉంది. 

గత ఏడాది దసరా బోనస్ ను ఒక్కొక్క కార్మికుడికి రూ. 57, 500 పంపిణీ చేశారు. మొత్తం మీద సింగరేణి కార్మికులు వారి జీతాలతో పాటు రూ.60 వేలు దసరా బోనస్‌ రానుంది. అంటే ఒక్కొక్క కార్మికుడికి లక్ష నుంచి లక్షన్నర వరకు అందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

11:25 - October 6, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టబోయే కవాతు వాయిదా పడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈనెల 9వ తేదీన కవాతు నిర్వహించాలని పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పవన్ పోరాట యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరిలో నిర్వహిస్తున్న పోరాట యాత్రలో పవన్ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

అక్టోబర్ 9వ తేదీన భారీగా కవాతు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించాలని పవన్ భావించారు. కొవ్వూరు, రాజమండ్రి మధ్య గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే వంతెనపై కవాతు సాగించేందుకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

కానీ కవాతుకు అనుమతులు తీసుకోవాల్సి ఉండడం..ఇతరత్రా ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో కవాతును వాయిదా వేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవాతు వాయిదా వేయాలా ? వద్దా ? అనే దానిపై విజయవాడలో నేతలు చర్చించారు. ఈనెల 15వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు ఉంటుందని రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాదరం వెల్లడించారు. పాత బ్రిడ్జీ నుండి ధవళేశ్వరం బ్యారేజీకి మారిందని, అంతేగాకుండా జనబాట కార్యక్రమం కూడా కొనసాగుతోందన్నారు. 

11:06 - October 6, 2018

తిరుప‌తి: ల‌క్ష్మీనారాయ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచిత‌మైన పేరు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా అవినీతి రాజ‌కీయ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టిన సిన్సియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్. డ్యూటీలో త‌న‌దైన ముద్ర వేసిన ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్.. ఇప్పుడు రాజ‌కీయాల‌వైపు దృష్టి సారించారు. ఐపీఎస్ కాస్తా పొలిటీషియ‌న్ గా మార‌బోతున్నారు. 

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్ ఆస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసుల విచార‌ణ‌లో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సీబీఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ త‌ర్వాత తన సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా నియ‌మితుల‌య్యారు. ఈ ప‌దవిలో ఉండ‌గానే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ఉద్యోగానికి స్వ‌స్తి ప‌లుకుతూ వీఆర్ఎస్ తీసుకున్నారు.

ఆ త‌ర్వాత ఏపీలో విస్తృత ప‌ర్య‌ట‌ల‌న‌కు ల‌క్ష్మీనారాయ‌ణ శ్రీకారం చుట్టారు. స్థానిక ప్ర‌జ‌ల‌తో స‌మావేశం కావ‌డం వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశానికి ముందు ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ మొద‌లు పెట్టారనే విష‌యం అర్థ‌మైంది. ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయం అనే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

శుక్రవారం తిరుమ‌ల శ్రీవారిని ఆయ‌న దర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ  13 జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని, ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. పర్యటనలో భాగంగా తాను గుర్తించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరుతానన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సౌకర్యం, రుణ సదుపాయాలు లేవన్నారు. పంటల బీమా వంటి సమస్యలను విశదీకరించి ఒక నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. ఆ నివేదికను ప్రభుతం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ల‌క్ష్మీనారాయ‌ణ పొలిటిక‌ల్ ఎంట్రీ దాదాపు ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. గ‌త 5 రోజులుగా చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. తిరుప‌తిలో మీడియా స‌మావేశంలో పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని స‌మాచారం.

10:55 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వెంటనే 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేసి ప్రచార పర్వంలో దూసుకెళుతోంది. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కదనరంగంలోకి దిగి ప్రజా ఆశీర్వాద పేరిట సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలలో విపక్షాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. 

కానీ కాంగ్రెస్ కంటే బాబును టార్గెట్ చేయడం వెనుక మతలబు ఏంటీ ? ఇక్కడ టీఆర్ఎస్ ను ఓడించేందుకు టిడిపి పొత్తుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. విపక్షాలు ఏకం కావాలంటూ ఇతర పార్టీలతో చర్చలు ప్రారంభించింది. తొలుత శత్రువుగా ఉన్న కాంగ్రెస్ తో టిడిపి జత కట్టడం..ఈ పొత్తుకు బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పొత్తుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్ బాబును విమర్శించడం వెనుక మరో వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బాబును లక్ష్యంగా చేసుకుంటే లాభాలు కలుగుతాయని కేసీఆర్ భావించి విమర్శల దాడిని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. 

మహా కూటమి కాదని..అది కాలకూటమి విషమంటూ కేసీఆర్ ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూనే... చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికి సమయం కేటాయిస్తున్నారు. మహా కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే అటు ఢిల్లీకి..ఇటు అమరావతికి బానిసలం కావాలా ? అంటూ ప్రజల్లో ఆలోచన రేకేత్తించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ప్రజల్లో రేకేత్తిస్తే బాబుపై వ్యతిరేకత కలిగే అవకాశం మెండుగా ఉంటుందని కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం. 

మోడీ..కేసీఆర్ లు కలిశారని..అందుకే కేసీఆర్ అలా వ్యవహరిస్తున్నారని టిడిపి పేర్కొంటుంటే..గత నాలుగేళ్లుగా మోడీ చంకనాకింది...బాబు కాదా అంటూ కేసీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ టార్గెట్ ఫలితం ఇస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

10:51 - October 6, 2018

అక్టోబర్ 6వ తేదీ.. ఈరోజు అక్కినేని కుటుంబానికీ, అక్కినేని అభిమానులకీ జీవితాతం గుర్తుండిపోయే రోజు..
ఎందుకంటే, ఇవాళ అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లిరోజు.. పోయిన సంవత్సరం ఇదే రోజున వీరి వివాహం గోవాలో గ్రాండ్‌గా జరిగింది.. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం, తర్వాత అక్టోబర్ 7వ తేదీన క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం చైతు, సమంతల పెళ్ళి ఘనంగా జరిగింది..
వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు... ఈ మధ్యే, చైతు శైలజారెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలతో సందడి చేసారు..
మొన్నటివరకూ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్ళొచ్చిన ఈ జంట.. మ్యారేజ్ తర్వాత మజిలీ అనే మూవీలో నటిస్తున్నారు.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.. చైతు, సమంతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

10:29 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు అంశం హైకోర్టులో విచారణలో ఉంది. ఓటర్ల అంశం తేలకముందే షెడ్యూల్ వస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడయా సమావేశం నిర్వహించనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. 

 

10:26 - October 6, 2018
హైదరాబాద్ : టాలీవుడ్ లో తనదైన స్టైల్..నటనతో అలరిస్తున్న విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం ప్రారంభం అయ్యిందా ? వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ దూసుకపోతున్న విజయ్ కు బ్రేక్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తాజా చిత్రం ‘నోటా’పై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కె.ఇ.జానవేల్ రాజా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. విజయ్ దేవరకొండ సరసన మెహరీన్ నటించగా నాజర్, సత్యరాజ్ లు కీలక పాత్ర పోషించారు. 

పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ఈ నటుడు అర్జున్ రెడ్డితో యూత్ లో ఒక ఐకాన్ గా మారిపోయాడు. అనంతరం వచ్చిన గీత‌ గోవిందంతో అందరి వాడిగా మారిపోయాడు. ఇలా ఏ సినిమా చేసినా వైవిధ్యం కనబరుస్తూ అలరిస్తున్నాడు. ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన నోటా శుక్రవారం రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం రూపొందింది. 

చిత్రం విడుదల కాకముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ సినిమా రిలీజైన అనంతరం భిన్నమైన టాక్్స వినిపిస్తున్నాయి. చిత్రానికి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? పెడితే దానికి సంబంధించిన అంశం ఉండాలి కదా అని ప్రేక్ష‌కులు అంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ కు ఇప్పటి నుండి అసలైన టైం ప్రారంభమైందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ నటించిన నోటా చిత్రంపై రానున్న రోజుల్లో మరిన్ని స్పష్టమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది...
10:22 - October 6, 2018

హైద‌రాబాద్: చిన్న‌చిన్న విష‌యాల‌కే నేటి యువ‌త కంట్రోల్ త‌ప్పుతోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోలేక‌పోతున్నారు. ఆవేశంలో మ‌ర్డ‌ర్లు చేసుకునే వ‌ర‌కు వెళుతున్నారు. తాజాగా ఫోన్ కాల్ లో మొద‌లైన గొడ‌వ‌.. హ‌త్యాయత్నం వ‌రకు వెళ్లింది. టీఆర్ఎస్ నేత కుమారుడిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

వివ‌రాల్లోకి హైదరాబాద్ నగర తెలంగాణ రాష్ట్ర సమితి నేత, గోషామహల్ నుంచి అసెంబ్లీ సీటును ఆశిస్తున్న నంద కిశోర్ వ్యాస్ కుమారుడు ప్రేమ్ వ్యాస్ పై హత్యాయత్నం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. నందకిశోర్ సోదరుడి తనయుడు అమిత్ వ్యాస్ తో కలసి ప్రేమ్ వ్యాస్ తమ హోటల్ లో ఉండ‌గా... ఆకాష్ సోలంకి అనే మిత్రుడు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో గొడవ మొదలైంది.

మాటా మాటా పెరిగి, ఎక్కడున్నావంటే ఎక్కడున్నావంటూ, దమ్ముంటే రావాలంటూ ఇరువురూ సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో అబిడ్స్ సంతోష్ దాబా వద్దకు అమిత్, ప్రేమ్ వ్యాస్ లు మరో ఇద్దరు స్నేహితులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆకాశ్ సోలంకి, దీపక్ అనే యువకులు కత్తులతో దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన వీరిని పోలీసులు ఉస్మానియాకు తరలించి ప్రాథ‌మిక చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం నంద కిశోర్ అనుచరులు వారిని బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ్ వ్యాస్ కు 10 చోట్ల, అమిత్ వ్యాస్ కు 18 చోట్ల గాయాలు అయ్యాయని, వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. వారితో పాటు ఉన్న మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాఫ్తు చేప‌ట్టారు. అన్ని కోణాల్లో కేసుని విచారిస్తున్నారు. ఇది కేవ‌లం యువకుల మధ్య గొడవల కారణంగా జరిగిందా?  లేక రాజ‌కీయ నేప‌థ్యంలో జ‌రిగిందా? అనే కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ జ‌రుపుతున్నారు.

09:59 - October 6, 2018

పంజాబ్ : ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం ఐటీ దాడులు కొనసాగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ పంజాబ్ లో మాత్రం ఐటీ దాడులు జరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక పకోడా దుకాణంపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. 

పకోడాలపై ప్రధాన మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. పకోడాలు అమ్ముకోవడం ఒక ఉద్యోగం లాంటిదే అంటూ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. పకోడాలు వేస్తూ కాంగ్రెస్ నిరసనలు తెలిపాయి. పంజాబ్ లోని లూథియానాలో గిల్ రోడ్డులోని ‘పన్నా సింగ్ పకోరే వాలా’ దుకాణంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అసలు ఈ దుకాణంపై ఐటీ ఎందుకు దాడులు జరిపిందనే దానిపై చర్చ జరుగుతోంది. పన్నా సింగ్ ఫ్యామిలీ 1952లో ఈ షాపును ప్రారంభించింది. పకోడాతో పాటు ఇతర తినుబండారాలు విక్రియిస్తున్నాుడు. ఈ షాపుకు చాలామంది రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు వస్తారని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో అతను ఆదాయాన్ని తక్కువగా చేసి చూపినట్లు ఐటీ అధికారులకు పక్కా సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించినట్లు సమాచారం. మిల్లర్ గంజ్ ప్రాంతంలో ఉన్న పన్నా సింగ్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఈ విషయంపై పన్నా కుటుంబం..ఐటీ అధికారులు స్పందించడం లేదని సమాచారం. కానీ పన్నా సింగ్ కుటుంబం ఐటీ అధికారులకు రూ. 60 లక్షలు అందచేసిందని టాక్. 

09:55 - October 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితిపై రజత్‌కుమార్‌తో సమీక్షించింది. ఓటరు జాబితా, ఈవీఎంల సిద్ధంపై ఆరా తీసింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈనెల 10న మరోసారి కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఎన్నికల  నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ ముగియనున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లీలో సమావేశమైంది.  తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం వివిధ అంశాలపై చర్చించింది.  ఓటరు జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధంలాంటి కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను రజత్‌ కుమార్‌ సీఈసీకి వివరించారు.  అనంతరం ఈసీకి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించారు. మరోవైఐపు ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తుది విచారణ పూర్తయ్యే వరకు ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా ఈసీ దృష్టి సారించింది.

కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ నెల 10న హైదరాబాద్‌కు రానుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సన్నద్దతపై సమీక్షించనుంది. రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్నికల  నిర్వహణ తేదీలపై తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.  రాష్ట్రంలో  ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేష్‌సిన్హా   ఆధ్వర్యంలో అధికారుల బృందం గత నెలలో రాష్ట్రానికి వచ్చి వివిధ అంశాలపై సమీక్షించింది. మరోమారు సమీక్షించేందుకు ఈనెల 10న రానుంది.

09:41 - October 6, 2018
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఏమైనా ధరలు తగ్గాయా ? అంటే లేదనని అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు విమర్శలు..సెటైర్లు వినిపించాయి. సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర ప్రభుత్వం లీటరకు రూ. 2.50 తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి బర్నాల్ పూసిన చందంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని శివసేన ఇటీవలే విమర్శించింది. 
ఇదిలా ఉంటే చమురు ధరలు శనివారం కూడా ఎగబాకాయి. లీటర్ పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల మేరకు పెంచుతున్నట్లు ఐఓసీ ప్రకటించింది. దీనితో హస్తినలో పెట్రోల్ లీటర్ ధర రూ. 81.68, డీజిల్ రూ. 73.24కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోలు రూ. 87.15, డీజిల్ రూ. 76.75...కాగా  హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు రూ. 86.59, డీజిల్ రూ. 79.67కి చేరుకుంది.
09:27 - October 6, 2018

ఢిల్లీ : మిత్రపక్షాలు కోరుకుంటేనే ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధ మని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 'హిందూస్థాన్‌ టైమ్స్‌' సదస్సులో రాహుల్‌ తెలిపారు. కలిసొచ్చే పార్టీలతో జతకట్టి మోడీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని.. మిగతావన్నీ ఎన్నికల తర్వాతనేనని అన్నారు. మోడీ సర్కార్‌ సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించిందని.. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.

ఆర్థిక వ్యవస్థ చితికిపోయి.. రూపాయి చతికిలపడిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడూలేనంత స్థాయికి చేరుకున్నాయని.. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిందని పేర్కొన్నారు. తాను బహిరంగ ప్రదేశాలకు వచ్చి.. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే.. దేశ ప్రధాని అలా చేయలేకపోతున్నారని రాహుల్‌ మోదీని ప్రశ్నించారు. 

09:25 - October 6, 2018

క‌ర్నూలు: మిర్యాలగూడ పరువు హత్య, ఎర్ర‌గ‌డ్డ హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లు మ‌ర్చిపోకముందే..ఏపీలో మ‌రో దారుణం వెలుగుచూసింది. ప్రేమించింద‌నే అనుమానంతో ఓ తండ్రి క‌సాయిలా మారాడు. క‌న్న కూతురినే క‌త్తితో పొడిచాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ దారుణం జరిగింది. ప్రేమించిందనే అనుమానంతో కత్తితో ఏడుసార్లు విచక్షిణారహితంగా పొడిచాడా తండ్రి. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెని కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఆదోని..శంకర్ నగర్‌లో జాన్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండే జాన్..రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టుకునేవాడు. అంతేకాదు కొన్ని రోజులుగా భార్య, కూతురిపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు అంజలి ప్రేమలో పడిందన్న అనుమానంతో.. నిత్యం తిట్టేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. తండ్రి కొట్టేందుకు ప్రయత్నించడంతో బాబాయ్ ఇంటికి పారిపోయింది అంజలి. మరింత కోపంతో రెచ్చిపోయిన జాన్..కూతురిని బయటకు లాక్కొచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాఫ్తు చేప‌ట్టారు. ఆ క‌సాయి తండ్రిని అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

09:22 - October 6, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగుతోపాటు తమిళ్‌లోనూ రిలీజ్ అయింది..
విజయ్ క్రేజ్ దృష్ట్యా తెలుగులో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ, మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది..
ప్రస్తుతం నోటాకి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి టాలీవుడ్‌లో బాబు పాస్ అయిపోతాడు...
ఇక కోలీవుడ్ విషయానికొస్తే, అక్కడ ఈరోజు విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96, విష్ణు విశాల్, అమలా పాల్ నటించిన రాక్షసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి..96 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా, రాక్షసన్ తమిళ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటి అంటున్నారు..
విజయ్.. గీత గోవిందంతో తమిళ్ లోనూ గుర్తింపుతెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాల తాకిడిని తట్టుకుని, విజయ్ దేవరకొండ నోటా ఏమేరకు నిలబడతుందో చూడాలి మరి...

 

09:04 - October 6, 2018

ప్రకాశం : ఏపీలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు, సానుభూతిపరులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా డాడులు నిర్వహిస్తున్నారు. పక్కా ఆధారాలతో, అత్యంత గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. 

ప్రకాశం జిల్లా టీడీపీ నేతల్లో ఐటీ దాడులు గుబులు పుట్టిస్తున్నాయి. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామరావు ఇంటిలో సోదాలు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. పలు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. 

నిన్న మంత్రి నారాయణ ఇళ్లల్లో, కార్యాలయాలు, నారాయణ కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థలపై అధికారులు నిర్వహించారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

08:42 - October 6, 2018

కృష్ణా : ఏపీలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఐటీ అధికారుల సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఐటీ దాడులు నిన్న ప్రారంభమయ్యాయి. విజయవాడలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. లబ్బీపేట, భారతీనగర్, కరెన్సీనగర్, వినాయక్ థియేటర్‌లలో దాడులు జరుగుతున్నాయి. షిష్టుల వారిగా అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇవాళ ప్రజా ప్రతినిధులు ఇళ్లల్లో సోదాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు, రేపు కూడా దాడులు కొనసాగనున్నట్లు సమాచారం. సోదాల్లో 218 మంది సిబ్బంది పాల్గొన్నారు. 

 

08:41 - October 6, 2018

ఢిల్లీ: సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఫేక్ న్యూస్ బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఏది నిజ‌మైన వార్త‌, ఏది న‌కిలీ వార్త అనేది తెలుసుకోలేక‌పోతున్నారు. ఉట్టినే ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్లో ఏదో ఒక న్యూస్ ను క్రియేట్ చేయ‌డం, షేర్ చేయ‌డం, ఫార్వార్డ్ చేయ‌డం. అస‌లు అది నిజ‌మా? కాదా? అని తెలుసుకోరు. పైగా అంద‌రిని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తారు. పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసే ముఠాలు రంగంలోకి దిగాయి అనే న్యూస్ వాట్సాప్ లో వైర‌ల్ గా మార‌డం.. దాని కార‌ణంగా కొంద‌రి ప్రాణాలు పోవ‌డం తెలిసిందే.

ఇక విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు మ‌రో న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఓ వార్త తెగ హడావిడి చేస్తోంది. అదేమిటంటే.. ‘5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించొద్దు... దాంట్లో వైరస్ కలిసింది. వ్యాక్సిన్ తయారుచేసిన కంపెనీ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ విషయం అందరికీ చెప్పండి...’ అంటూ ఓ వార్త వాట్సాప్‌లో తెగ షేర్ అవుతోంది. ఈ విషయం నిజామా! కాదా! అని తెలియకుండానే ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారు చాలామంది. ఈ మెసేజ్ చూసి పిల్లల తల్లిదండ్రులు పోలియో వ్యాక్సిన్ వేయించాలో వద్దో తెలియక కలవరపెడుతున్నారు. 
అయితే అస‌లు నిజం ఏమిటంటే... ఈ మెసేజ్ కేవలం ఓ రూమర్ మాత్రమే అని తేల్చేశారు.

కొన్నాళ్ల కిందట బయోమెడ్ సంస్థ తయారుచేసిన పోలియో వ్యాక్సిన్ వికటించి, కొందరు పిల్లలకు అస్వస్తత కలిగింది. దాంతో ఆ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్లను కేంద్రం వెనక్కి రప్పించింది. అందువల్ల ఎలాంటి అనుమానాలు, భయాలు లేకుండా ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. 

ఇక‌పోతే ‘మీ పిల్లలు జ్వరం, జలుబుతో బాధపడుతున్నప్పుడు.. ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వొద్దు. సాధారణ సందర్భాల్లో వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఓసారి తయారీ తేదీ చూడండి. వ్యాక్సిన్ గురించి చదువుకోండి. సాధ్యం కాని పక్షంలో వ్యాక్సిన్ ఇస్తున్న సిబ్బందికి మీ అభ్యంతరాలను వివరించండని డాక్టర్లు సూచిస్తున్నారు.

నిజానికి మనదేశంలో ఏడేళ్ల కిందటే పోలియో వ్యాధి అంతరించింది. అయితే పోరుగు దేశాల్లో మాత్రం ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ నుంచి పోలియో వైరస్ ఇక్కడికి రాకుండా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయిస్తున్నారు. బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌తో పాటు ఇన్‌యాక్టివేట్ పోలియో వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. దీని కారణంగా వైరస్ పోకే ప్రమాదం ఉండదు. అదీగాక మెసేజ్‌ను ఒక్కసారి నిశితంగా గమనిస్తే... ‘రేపు పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం’అని మొదట్లోనే ఉంది. నిజంగా రేపు పల్స్ పోలియే కార్యక్రమం ఉందా.. లేదా... అని ఆలోచిస్తే ఆ వార్త కేవలం రూమరేనని అందరికీ అర్థమవుతుంది. రేపు...రేపు అంటూ చాలారోజుల నుంచి ఈ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుండడం విశేషం. 

సో.. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే మేసేజ్ ల గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు ఆ మేసేజ్ నిజ‌మో.. కాదో.. తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే ఎలాంటి టెన్ష‌న్స్ ఉండ‌వు.

08:01 - October 6, 2018

హైదరాబాద్ : దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 4,480 బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఎప్పటిలాగే... 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు రంగారెడ్డి ప్రాంతీయ మేనేజర్‌ తెలిపారు. సీబీఎస్‌ హ్యాంగర్‌ కూలిపోవడంతో కడపకు వెళ్లే బస్సులను కాచిగూడ బస్‌స్టేషన్‌ నుంచి నడుపుతామన్నారు. ఈనెల 8 నుంచి 18 వరకు రెగ్యులర్‌ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడపుతామన్నారు.
 

 

Don't Miss