Activities calendar

07 October 2018

21:52 - October 7, 2018

హైదరాబాద్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగారా  మోగటంతో  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఈ రోజు  శాంతి భధ్రతల  అంశంపై  సచివాలయంలో  పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం లో లాఅండ్ ఆర్డర్ డీజీ  జితేందర్ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు , హోంశాఖ అధికారులు పాల్గోన్నారు. నగదు,మద్యం సరఫరాపై నిరంతర నిఘా ఉండేలా చూడాలని రజత్ కుమార్ పోలీసు  అధికారులను ఆదేశించారు,  గత ఎన్నికల్లో అలజడి సృష్టించిన వ్యక్తులు, రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను  తెప్పించుకున్న రజత్ కుమార్  తదుపరి  తీసుకోవాల్సివ  చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో  పెడుతున్నఖర్చు, అభ్యర్దులు రక్షణ కోసం వాడుతున్న ఆయుధాల లైసెన్సుల వివరాలను, వారి కదలికలపై నిఘా పెట్టాలని రజత్ కుమార్ ఆదేశించారు. శాంతి భద్రతల సమస్య సృష్టించే వ్యక్తులను ముందుగానే  గుర్తించి వారిపై బైండోవర్ కేసులను పెట్టాలని కూడా ఆయన చెప్పారు.

 

20:57 - October 7, 2018

ప్రపంచంలో నేడు టెక్నాలజీ పెరిగి పోయి అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగి పోయింది, వీటి పుణ్యామా అని సినీహీరో  మొదలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్లలోని  సోషల్ మీడియాలో  చాలా వార్తలు పుకార్లు  షికార్లు చేస్తుంటాయి. ఒకోసారి ఏవార్త నిజమో అబద్దమో కూడా తెలుసుకోలేనంతగా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి అలా చేసిన వారిపై  సైబర్‌ నేరం  కింద కేసులు పెడుతున్నప్పటికీ  ఇవి  వైరల్ అవుతూనే  ఉన్నాయి. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు, బీహార్  దొంగలు. చెడ్డీ గ్యాంగ్ ముఠాల గురించి వార్తలు వైరల్  అయ్యి కొందరు అనామకులు జనాల చేతిలో దెబ్బలు తిన్న వార్తలు మనం చూశాం. ఇలా వైరల్ ఐన వార్తల్లో లేటెస్ట్ గా మన దేశంలోని ప్రముఖ  స్పైసెస్‌ బ్రాండ్‌ ఎండీహెచ్‌ కంపెనీ యజమాని  99 ఏళ్ల  మహాశయ్‌ ధరమ్‌పాల్‌ గులాటి  మరణించారనే వార్త పుకార్లు చేసింది. ఈ వార్త చూసిన  కంపెనీ  యాజమాన్యం మహాశయ్‌ జీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని  ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. 

20:20 - October 7, 2018

రాజకీయ చర్చకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వాటిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ కాంగ్రెస్ కి చాలా కీలకమైనవి.  ఎందుకంటే ఇక్కడ ఆపార్టీ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ లలో  ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా  వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా రాజస్తాన్ విషయమే చూస్తే, ఆరునెలల క్రితం జరిగిన బై ఎలక్షన్స్‌లో రెండు ఎంపీ స్థానాలు ఓ ఎమ్మెల్యే సీటులో కాంగ్రెస్పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ముఖ్యమంత్రి వసుంధరాజె మళ్లీ  అధికార  పీఠం తనదే అఁటున్నారు. ఇంతకీ ఈ రెండు పార్టీల బలాబలాలు రాజస్ధాన్లో ఎలా ఉన్నాయ్, ఎవరి సత్తా ఎంత అనేది ఒకసారి  చూద్దాం.
200 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న రాజస్ధాన్ లో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో  ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1990 నుంచి  బిజెపి  అధికారం  చేజిక్కుంచుకుంటూ  వస్తోంది.  1998 నుంచి ఇక్కడ ప్రతి 5 ఏళ్లకు ఓసారి  పార్టీ అధికారంలోకి వస్తోంది. 2013లో జరిగిన ఎన్నికలలో 45.50 శాతం ఓట్లతో బిజెపి విజయ దుంధుభి మోగించింది. 160 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2014 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 55.1శాతం ఓట్లతో మొత్తానికి మొత్తం ఎంపీ సీట్లు అంటే, 25 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. ఐతే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయ్. కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్‌ ముందుండి పోరాటం సాగించారు.ఓటర్లు కూడా ఐదేళ్లకోసారి ఇక్కడ పార్టీలను మార్చేస్తున్నారు, ఇది కూడా  కాంగ్రెస్ కు ఆశాదీపంలా కనిపిస్తోంది. బిజెపిలోని  లుకలుకలు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళలో బిజెపికి సీనియర్ పొలిటీషియన్ ఘన్ శ్యామ్ తివారీ  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. విద్యాశాఖామంత్రిగా పని చేసిన శ్యామ్ తివారీ పార్టీలో 30ఏళ్లుగా పనిచేశారు.సిఎం వసుంధర రాజెతో విబేధాలతోనే ఆయన పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఈయన కుమారుడు అఖిలేష్ తివారీ సొంతంగా భారత్ వాహిని పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. 200 సీట్లలో అభ్యర్ధులను దింపుతామంటూ ప్రకటించారు. ఘన్ శ్యామ్ తివారీ రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ మెజార్టీ సాధించిన నేతగా రికార్డు ఉంది. అలాంటిది ఈయన పార్టీ మారితే ఖచ్చితంగా వచ్చే బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తారని అంటున్నారు
మరోవైపు కాంగ్రెస్ విషయమే చూస్తే, ఈ మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఎక్కడాలేని సానుకూలత ఇక్కడ కన్పిస్తుందని ఆ పార్టీనేతలు చెప్తున్నారు. ప్రస్తుతం  రద్దైన శాసనసభలో కాంగ్రెస్ కి 25 స్థానాలు ఉన్నాయి. 1998 నుంచి అధికారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుందనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమా కన్పిస్తుంది వారి మాటల్లో. దీనికి తోడు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం తమకి అడ్వాంటేజ్‌గా మారుతుందని ఆ పార్టీ నేతల అంచనా వేస్తున్నారు. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ మండ్ గఢ్ అసెంబ్లీ సీటు గెలిచింది. అజ్మీర్, అల్వార్ లోక్సభ సీట్లనూ కైవసం చేసుకుంది. ఈ మూడు సీట్లూ బిజెపివే కావడం విశేషంగా చెప్పుకోవాలి. అలానే 6 జెడ్పీటీసీలలో 4 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 21 పంచాయితీ సమితిలలో 12 చోట్ల విజయం సాధించడం కూడా ఆ పార్టీలో ధీమా కలిగిస్తోంది.
అధికారంలో ఉన్న బిజెపికి మైనస్ పాయింట్లుగా  చెప్పుకోవాల్సివస్తే ముందుగా  వసుంధర రాజె సింధియా పేరునే చెప్తున్నారు. ఆమె నిరుద్యోగ సమస్యని పట్టించుకోకపోవడం తమ కొంప ముంచుతుందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఐతే 2013లో 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ,  కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకపోవడం కాస్త రిలీఫ్. ఆ మేరకు ఓట్లలో చీలిక  తమకి సాయపడుతుందని బిజెపి అంచనా వేస్తోంది. అదే కాంగ్రెస్ సిఎం కాండిడేట్‌గా అశోక్ గెహ్లాట్‌ను కనుక రంగంలోకి దింపితే బిజెపి ఆశలు గల్లంతైనట్లే భావించాలంటారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా  తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ నేతని కాంగ్రెస్ ప్రస్తుతం లైమ్ లైట్‌లోకి తీసుకురావడం లేదు. రాహుల్ గాంధీ తన టీమ్‌లోని సచిన్ పైలెట్‌నే ప్రమోట్ చేస్తున్నారు.

19:51 - October 7, 2018

హైదరాబాద్... స్వామి పరిపూర్ణానంద బీజీపీ సీఎం అభ్యర్ధి గా పోటీ చేస్తున్నారా..,కొన్నాళ్లగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు  ఇప్పుడు మరింత బలం చేకూరు తోంది, స్వామి పరిపూర్ణానందను  బీజీపీ అధిష్టానం  ఢిల్లీ కి పిలిపించింది,  కాకపోతే ఆయన తెలంగాణ నుంచి  పోటీ చేస్తారా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు,  రెండు తెలుగు రాష్ట్రాల్లో  జనాకర్షణ  ఉన్న నాయకుడి  కోసం ల వెదుకుతున్న  బీజీపీకి   పరిపూర్ణానంద ఇటీవలి కాలంలో హిందుత్వ అంశాలపై చేసిన పోరాటం బీజేపీ అధినాయకత్వం  గుర్తించింది, దాంతో ఆయనతో సంప్రదింపులుజరిపేందుకు ఢిల్లీ   పిలిపించారు, 

 

18:16 - October 7, 2018

ఢిల్లీ..వెయ్యి కాదు..రెండు వేలు కాదు..ఏకంగా లక్షా 20వేల  ఉద్యోగాలు భర్తీ చేయటానికి రైల్వే శాఖ సిద్ధమైంది.ఇందుకోసం  2కోట్ల 37లక్షలమంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు  ఈ ప్రక్రియ పెద్ద యజ్ఞంలా మారింది. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే  ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తగ్గిపోయింది.  కానీ ఆర్ఆర్బీ చాలా  ఏళ్ల తర్వాత ఈస్థాయిలో నియామకాలు చేపట్టింది.ఏడో వేతన సవరణ జరిగిన తర్వాత రైల్వేలలో ప్రారంభ జీతమే అదిరిపోయే స్థాయిలో ఉంది. అందుకే ఇప్పడు రైల్వే బోర్డు ప్రకటించిన లక్షా ఇరవైవేల ఉద్యోగాలకు అప్లికేషన్లు భారీగా వచ్చి చేరుతున్నాయ్. ఇప్పటికే 2,37,00,000మంది తమ అదృష్ఠాన్ని పరీక్షించుకునేందుకు ధరఖాస్తు చేశారు. 
నియామకాల ప్రక్రియకే రూ.800కోట్ల ఖర్చుఅవుతుదని  రైల్వే  అధికారులు అంచనా వేశారు.అభ్యర్ధులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారనే చాలా పోస్టులకు ఐటిఐ తప్పనిసరి చేసారు.వయో పరిమితి రెండేళ్లు పెంచారు. దీంతో అప్లికేషన్ల సంఖ్య రెండుకోట్లను దాటేసింది. అలా వీరి ఎంపిక ప్రక్రియ మరింత వ్యయభరితం కానుంది.  ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలి వద్ద జరిగిన రైలు  ప్రమాదంతో రైల్వేల భద్రతపై పలు   విమర్శలు విన్పించాయ్. ఆ ఇన్సిడెంట్లో 23మంది కేవలం రైల్వేల నిర్లక్ష్యంతో చనిపోయారని ఆరోపణలున్నాయ్. ఇలాంటి ఘటనల నేపధ్యంలోనే ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా అటు పీయాష్ గోయల్ కానీ  ఇటు ఆర్ఆర్బి ఛైర్మన్ లోహానీ కానీ నియామకాల ప్రక్రియంపై దృష్టి పెట్టాల్సివచ్చిందంటారు. దీంతో అనివార్యంగా ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది.  తద్వారా రైల్వేలపై భారమూ పెరుగుతోంది. ఐతే ఉద్యోగార్ధులకు మాత్రం ఇదో గోల్డెన్ ఛాన్స్‌గా కన్పిస్తోంది. 

17:39 - October 7, 2018

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు..కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతోంది.
ఆల్ రెడీ యూనిట్‌లో కొంతమంది అక్కడికి వెళ్లగా, రీసెంట్‌గా చిరు కూడా బయల్దేరారు.. ఎయిర్ పోర్ట్‌లో నడిచివెళ్తున్న చిరు పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.. టూ పాకెట్స్ ఉన్న బ్లాక్ డెనిమ్ షర్ట్, ఫేడెడ్ బ్లూ జీన్స్‌లో చిరు కిరాక్ ఉన్నాడు.. దానికి తోడు సైడ్‌కి తగిలించుకున్న బ్యాగ్.. బిగ్ బాస్ స్టైల్‌ని మరింత పెంచింది..చిరుకి అరవై ఏళ్ళు అని ఎవరైనా అంటే, వాళ్ళని ఐ టెస్ట్ చేయించుకోమని చెప్పండి.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్... 

17:09 - October 7, 2018

విశాఖ‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు పూర్త‌య్యాయి. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు అశ్రున‌య‌నాల‌తో తుదివీడ్కోలు ప‌లికారు. గీతం యూనివ‌ర్సిటీ స‌మీపంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ద‌హ‌న సంస్కారాలు పూర్తి చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాల‌కృష్ణ, ప‌లువురు మంత్రులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. అంత‌కుముందు అశేష జ‌న‌వాహిని న‌డుమ అంతిమ‌యాత్ర సాగింది. అంత‌కు క్రితం మూర్తి భౌతిక‌కాయానికి ప‌లువురు ప్ర‌ముఖులు నివాళి అర్పించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప‌లురువు మంత్రులు, టీడీపీ నేత‌లు, బీజేపీ నేత పురంధేశ్వ‌రి మూర్తి భౌతిక‌కాయానికి నివాళి అర్పించారు. మూర్తితో త‌న‌కున్న అనుబంధాన్ని సీఎం చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు.

ఈ నెల 2న ఎంవీవీఎస్‌ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం(అక్టోబ‌ర్2) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్‌ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్‌ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ ముందు వెళ్తున్న ఫోర్డ్‌ ఎఫ్‌–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్‌ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్‌ పక్కన శివప్రసాద్‌ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు.

16:50 - October 7, 2018

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి వెళ్తున్నాడు.. బిగ్ బాస్ హౌస్‌లో తనకెదురైన పరిస్ధితుల గురించీ, కౌశల్ ఆర్మీ తనకి సపోర్ట్ చేసిన విధానం గురించీ ఇంటర్వూలవీ ఇస్తూ బిజీబిజీగా ఉన్నాడు..
మధ్యమధ్యలో కౌశల్‌కి గిన్నిస్ రికార్డ్, కౌశల్‌కి డాక్టరేట్ అంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.. ఇప్పుడు దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు... తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకున్న ఒకేఒక ఫ్రెండ్ ఉదయ్ కిరణేనని, తనకి నానీని చూసినప్పుడల్లా ఉదయే గుర్తొస్తాడని కౌశల్ అన్నాడు... నాని కూడా ఉదయ్‌లానే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేకుండా హీరోగా ఎదిగాడనీ, పైగా వీళ్లిద్దరూ బేగంపేట్ ఏరియానుండే వచ్చారనీ, బిగ్ బాస్ హౌస్‌లో‌, నేను‌ ఉదయ్ గురించి మాట్లాడిన ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదనే సంగతి బయటకొచ్చాకే నాకు తెలిసింది, ఆ విషయాలన్నీ అభిమానులతో పంచుకుంటాను అని అన్నాడు.. కౌశల్, ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడిన ప్రతిసారీ నా ఉదయ్ కిరణ్ అని సంభోధించడం విశేషం..

16:21 - October 7, 2018

తిరువనంతపురం....ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళలు అందరినీ అనుమంతించాలన్న సుప్రీం నిర్ణయాన్నిఆలయంలోని కొందరు పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఆలయ సాంప్రదాయలకు విరుధ్దంగా ఉందని వారు వాదిస్తున్నారు. ఆలయంలో భద్రత  కోసం మహిళా కానిస్టేబుళ్ళ నియామకాన్నికూడా వారు వ్యతిరేకిస్తున్నారు. సెప్టెంబరు 28న నాటి సుప్రీం తీర్పుపై చర్చించడానికి ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించ తలపెట్టిన సమావేశాన్నిబహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుపై ముందు పిటీషన్వేస్తే తదనంతరం దానిపై చర్చించటానికి సిధ్దంగా ఉన్నట్లు శబరిమల ఆలయ ప్రధాన తంత్రి మోహనారు కండరావు చెబుతున్నారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా  పిటీషన్  వేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని,ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశాన్ని చర్చల ద్వారా ఆచరణలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి  పినరయ్ విజయన్ చెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఇటీవల కేరళలోని కొట్టాయం,మలప్పురం జిల్లాల్లో మహిళలు భారీగా నిరసన ర్యాలీలు చేపట్టారు. సంస్కృతి సాంప్రదాయాలను కాలరాయొద్దని,భక్తుల మనోభావాలకు భంగం కలిగించవద్దని కోరూతూ, 50 ఏళ్లు వచ్చేవరకు మేము ఆలయంలోకి వెళ్లమని రాసిన ప్ల కార్డులతో వారు చేపట్టిన నిరసన ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింంది. కొన్నిజిల్లాల్లో నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. కాగా శబరిమలలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద శనివారం కొందరు  భక్తులు నిరసన ప్రదర్సన  చేపట్టారు. 

16:19 - October 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. దీనితో మరలా అధికారంలోకి రావాలని టీఆర్ఎస్...తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్..ఇతర పార్టీలు ప్రజలను కోరుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో గులాబీ బాస్..దళం దూసుకపోతోంది. కాంగ్రెస్..ఇతర పార్టీల మధ్య ఇంకా పొత్తులు ఖరారు కాలేదు. దీనితో తెలంగాణ రాష్ట్రంపై ఇతర రాష్ట్రాల నేతలు దృష్టి సారించారు. ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి షాకింగ్ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చూస్తుంటే ‘హంగ్’ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయని, కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండడమే కారణమని ఆయన పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు. కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆప్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. పార్టీ అభ్యర్థులను పరిశీలన జరుపుతున్నామని, అక్టోబర్ 15వ తేదీన తొలి జాబితా విడుదల చేస్తామని ఆప్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెల్లడించారు. 

16:16 - October 7, 2018

సిద్ధిపేట: ఎన్నిక‌లకు తేదీలు ఖ‌రారు కావ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిని, మ‌హాకూట‌మిని టీఆర్ఎస్ నేత‌, ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీష్ రావు టార్గెట్ చేశారు. మహాకూటమి ఓ అతుకుల బొంత అని హ‌రీష్ రావు మండిపడ్డారు. తెలంగాణను దోచుకోవడానికే మహాకూటమి పుట్టిందని ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బు కోసమే మహా కూటమి ఏర్పడిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ నిరోధకులుగానే మహాకూటమి పని చేస్తోందన్నారు. 

నదీ జలాలు, ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పాలని హ‌రీష్ రావు సవాల్ విసిరారు. ఏపీ పక్షాన నిలబడతారా? తెలంగాణ పక్షాన నిలబడతారా? అని అడిగారు. 

రాదనుకున్న తెలంగాణను తెచ్చింది టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పిన హ‌రీష్ రావు.. తెచ్చిన తెలంగాణను నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా టీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ జతకడుతోందని, ఇక ఏమనాలని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కుతంత్రాలకు పాల్పడుతున్నారని.. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కలవడం విడ్డూరంగా ఉందని హ‌రీష్ రావు వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ పైన ఒంట‌రిగా పోటీ చేసే ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని హరీష్ రావు విమ‌ర్శించారు.  ప్రజలు మహా కూటమికి ఓట్లతో బుద్ధి చెప్పాలని హ‌రీష్ రావు పిలుపునిచ్చారు. 

మందపల్లిలో నిర్వహించిన ఏకగ్రీవ తీర్మాన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను అన్ని కుల సంఘాలు ఆయనకు అందించాయి.

వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని.. ఇక బోర్లు, బావులు ఎండిపోవడం వంటివి ఉండవని.. చెరువులు నిరంతరం జలసిరితో క‌ళ‌క‌ళ‌లాడుతాయని హ‌రీష్ రావు అన్నారు. వలసలు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావడమే టీఆర్‌ఎస్ అజెండా అని హరీష్ రావు స్ప‌ష్టం చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఈ 60 రోజులు అందరూ పట్టుదలతో పని చేయాలని, రాబోయే ఐదేళ్లు మీకోసం పని చేస్తానని పేర్కొన్నారు.

15:56 - October 7, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి‌ శ్రీను‌ల కాంబినేషన్‌లో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్‌లో జరుగుతోంది.. భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని చెర్రీ ఫ్యాన్స్‌#RC12‌గా పిలుచుకుంటున్నారు.. గతకొద్ది రోజులుగా ఈ సినిమాకి స్టేట్ రౌడీ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి.. ఇప్పుడు, వినయ విధేయ రామ అనే టైటిల్‌ని ఫిక్స్‌చేసారని తెలుస్తుంది..ప్రొడ్యూసర్ దానయ్య రీసెంట్‌గా ఈ టైటిల్‌ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై రిజిస్టర్ చేయించడంతో, చరణ్, బోయపాటి సినిమాకోసమే ఈ టైటిల్ అనే మాట వినబడుతోంది... దసరాకి టైటిల్‌తోపాటు, ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసే చాన్స్‌ఉందని అంటున్నారు..

15:32 - October 7, 2018

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండల కేంద్రంలోని పెద్దచెరువు సమీపంలో శనివారం పశువుల కాపరులు భారీ కొండచిలువను పట్టుకున్నారు. చెరువు పక్కనే ఉన్న నల్లవాగు పొదల్లో గత కొంతకాలంగా కొండచిలువ సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు. పశువులను మేతకు తోలుకెల్లగా వాగుపొదల్లో కొండచిలువ కోతిని మింగుతుండటాన్ని కాపరులు చూసి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో గాంధీనగర్‌కు చెందిన కొంత మంది యువకులు అక్కడకు చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. అది సుమారు 15 అడుగుల పొడవు, 60 కేజీల బరువు ఉన్నట్లు యువకులు తెలిపారు. మింగిన కోతిని బయటకు తీసిన అనంతరం.. కొండచిలువను కారేపల్లి ఫారెస్ట్‌ రేంజ్ అధికారులకు అప్పగించగా దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

 

15:25 - October 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీతగాడని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ మైనార్టీ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్..షబ్బీర్ లు టీఆర్ఎస్..నేతలపై దుమ్మెత్తిపోశారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్ తెలిపారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చిందని, మోడీ దగ్గర పని చేస్తూ మైనార్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మహా కూటమి అనేది ప్రజా కూటమి అని, కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కోన్నారు. అంతేగాకుండా కేసీఆర్ ను ఓడించేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని మరో నేత షబ్బీర్ ఆలీ తెలిపారు. షాది ముబారక్ పథకం అమలు చేశామంటూ ముస్లింలను మభ్య పెడుతున్నారని, కానీ షాది ముబారక్ పథకం కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. 

15:16 - October 7, 2018

జగిత్యాల : తెలంగాణలోనే ప్రసిద్దిగాంచిన గ్రామంలో స్మశాన వాటికకు గతి లేదు.. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురిలో దహన సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. పాలకులు, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో.. మా ఊరి స్మశానం మేమే నిర్మించుకుంటామంటూ యువత ముందుకొచ్చి వినూత్నరీతిలో నిరసన తెలిపింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా ఉన్న ధర్మపురిపై 10టీవీ కథనం..

జగిత్యాల జిల్లా ధర్మపురి దక్షిణ కాశీగా పేరొందింది. కానీ అక్కడి వాస్తవ పరిస్థితి మాత్రం  పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది.  ఇక్కడ కాటిలో కష్టాలు తిష్టవేశాయి. శవాలకు అంతిమ సంస్కారం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సమస్యను స్థానికులు ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తిసుకెళ్ళినా స్పందన లేదు. దీంతో.. విసిగివేసారిన  స్థానిక యువత 'నా ఊరి స్మశాన వాటిక నేనే నిర్మించుకుంటా' అన్న నినాదంతో  భిక్షాటన  చేపట్టారు...   
 
గతంలో అక్కడున్న గోదావరి నదిలోనే అంతిమ సంస్కారాలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు... ఎందుకంటే..  ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి  భారీగా వరద నీరు.. ధర్మపురిలోని పుష్కర ఘాట్లకు చేరడంతో సమస్య జఠిలమైంది. దీంతో శ్మశాన వాటిక నిర్మాణం కోసం యువత కదిలింది.. తప్పనిసరి పరిస్థితిలో సుమారు 500 మంది యువకులు భిక్షమెత్తి.. దాదాపు 30 వేల రూపాయలు సేకరించారు. 

సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న దేశ విదేశీయులు స్పందిస్తున్నారు.  వారంతా విరాళాలిచ్చేందుకు సైతం ముందుకొస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఓ స్మశాన వాటికను నిర్మాణం చేసేలా చూడాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 

15:13 - October 7, 2018

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాయ‌కుల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. టీఆర్ఎస్, బీజేపీ నేత‌లను మావోయిస్టులు టార్గెట్ చేశార‌ని నిఘావ‌ర్గాలు నివేదిక ఇచ్చిన‌ట్టుగా సమాచారం అందుతోంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో నాయ‌కుల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు క్ర‌మంలో పోలీసు శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. నాయ‌కుల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర‌, మిజోరం, ఛ‌త్తీస్ ఘ‌డ్, రాజ‌స్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మెరుపుదాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని జాతీయ ద‌ర్యాఫ్తు సంస్థ‌(ఎన్ఐఏ) అధికారులు, నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. రాజ‌కీయ నాయ‌కులే టార్గెట్  గా మెరుపు దాడులు చేసేందుకు మావోయిస్టులు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎన్నిక‌లు జ‌రిగే 5 రాష్ట్రాల‌కు చెందిన యావ‌త్ పోలీసు యంత్రాంగం స‌మాయ‌త్తం కావాలని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎన్ఐఏ అధికారులు హెచ్చ‌రించారు. ఈ మేర‌కు తెలంగాణ డీజేపీకి నిఘా వ‌ర్గాల నుంచి లేఖ అందింది. 

ఇటీవ‌లే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో అర‌కు టీడీపీ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, ఆయ‌న అనుచ‌రుడు శివేరి సోమ‌ల‌ను మావోయిస్టులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. అలాంటి మెరుపు దాడులు తెలంగాణ‌లోనూ జ‌ర‌గొచ్చ‌ని, టీఆర్ఎస్- బీజేపీ నాయ‌కులను మావోయిస్టులు టార్గెట్ చేయొచ్చ‌ని నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల‌తో తెలంగాణ పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. అన్ని జిల్లాల‌ పోలీసు అధికారుల‌ను అల‌ర్ట్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనే నాయ‌కుల‌కు గ‌ట్టి భ‌ద్రత క‌ల్పించాల‌ని సూచించారు. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో(ఆదిలాబాద్, భ‌ద్రాచ‌లం, వ‌రంగ‌ల్)  గ‌ట్టి బందోబ‌స్తు క‌ల్పించాల్సిందిగా ఉన్న‌తాధికారులు ఆదేశించారు. 

ఎన్నిక‌ల తేదీలు ఖ‌రారు కావ‌డంతో ముమ్మ‌రంగా ప్ర‌చారం చేయాల‌ని అన్ని పార్టీల నాయ‌కులు రంగంలోకి దిగుతున్న వేళ.. మావోయిస్టులు మెరుపు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేయడం.. తెలంగాణ‌లోని రాజ‌కీయ నాయ‌కులను టెన్ష‌న్ పెడుతోంది. 

14:43 - October 7, 2018

తారక్, త్రివిక్రమ్‌ల అరవింద‌ సమేత వీరరాఘవ.. ప్రమోషన్స్‌పీక్స్‌లో ఉన్నాయి.. తారక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వరసగా ఇంటర్వూలు ఇస్తున్నాడు... 
ఒక హీరోగా సినిమాని ఎలా తన భుజస్కందాలపై మోస్తాడో, అలానే ఈ ప్రమోషన్స్‌ని కూడా తన రెస్పాన్సిబులిటీగా తీసుకున్నాడు తారక్..
ఈ మధ్య నందమూరి కుటుబంలో జరిగిన విషాదం నుండి తారక్ ఇంకా బయటకి రాలేదు.. రీసెంట్‌గా ఓ‌‌ఇంటర్వూలో తన తండ్రి మరణించడానికి ముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు తారక్.. నాన్నగారు కొద్దిరోజుల క్రితం ఫోన్ చేసి, నాన్నా, పలావ్ తినాలనిపిస్తుంది పంపించరా అన్నారు.. ఆయనంత ప్రేమగా అడిగేసరికి స్వయంగా నేనే బిర్యాని వండి తీసుకెళ్ళాను... నాన్నగారికి నా చేతులతో పెట్టడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు అంటూ ఎమోషనల్గా చెప్పాడు ఎన్టీఆర్.. అరవింద సమేత అక్టోబర్ 11న విడుదల అవుతోంది...

14:43 - October 7, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగూడెంలోని ప్యూన్‌ బస్తీలో ఉన్న సాయిబాబా మందిరంలో గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మెన్‌ను హత్య చేసి హుండీని చోరీ చేశారు. హత్య జరిగిన విషయాన్ని ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. 

 

14:35 - October 7, 2018

చెన్నై : పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళ నటుడు విశాల్ బృందం మరో సినిమా పైరసీ కాకుండా కాపాడింది. తమిళనాడు రాష్ట్రంలో పైరసీని అరికట్టేందుకు విశాల్, అతని బృందం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘96’ సినిమా ఇటీవలే విడుదలైంది. అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమాను ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ఆన్ లైన్ లో విడుదలైనట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే తమిళనాడులోని మినీ ఉదయం థియేటర్ లో సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ కు చెందిన బృందం వీక్షిస్తోంది. థియేటర్ లో ఓ సీటు వద్ద ఫోన్ లైట్ వెలగడం బృందం గమనించింది. ఓ వ్యక్తి సినిమాను చూస్తూ తన ఫోన్ లో రికార్డు చేస్తున్నట్లు గమనించారు. వెంటనే వారు ఫోన్లతో ఫోటోలు తీసి పోలీసులకు పట్టించారు. పైరసీని అరికట్టేందుకు విశాల్, అతని బృందం కృషిని పలువురు అభినందిస్తున్నారు. 

14:25 - October 7, 2018

చిత్తూరు : స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన భక్తులను దోచుకున్నారు దొంగలు. భీమవరానికి చెందిన భక్తులు తిరుమలలోని శంకుమిట్ట కాటేజిలో 205 గదిని అద్దెకు తీసుకున్నారు. వస్తువులన్నీ గదిలో పెట్టి స్వామివారి దర్శనానికి వెళ్లారు.దర్శనానంతరం తిరిగి వచ్చి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. సెల్‌ఫోన్లు, ఆభరణాలతో పాటు.. 25 వేల నగదు చోరీ అయ్యాయి. అయితే.. ఇది ఇంటి దొంగల పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 

 

14:03 - October 7, 2018

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీలు ఖ‌రారు కావ‌డంతో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ప్ర‌చార‌ప‌ర్వాన్ని ప‌రుగులు పెట్టించేందుకు సిద్ధమ‌వుతున్నాయి. ఈ విష‌యంలో టీఆర్ఎస్ ముందుండ‌గా.. ప్ర‌తిపక్షాలు ఇంకా పొత్తులు, చ‌ర్చ‌ల వ‌ద్దే ఆగిపోయాయి. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌హాకూట‌మిలోకి ఇత‌ర పార్టీలు కూడా రావాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆశిస్తున్నారు. తాజాగా టీ పీపీసీ ఎన్నిక‌ల వ్యూహ క‌మిటీ చైర్మ‌న్, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి వి.హ‌నుమంత‌రావు జ‌న‌సేన గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన మ‌హాకూట‌మిలోకి వ‌స్తే ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన సొంతంగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయ‌ని వీహెచ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప‌వ‌న్ మ‌హాకూట‌మిలోకి రావాల‌ని వీహెచ్ కోరారు. ప్రజాస్వామ్యంలో విలువ‌లు లేకుండా పోతున్నాయని ప‌వ‌న్ పార్టీ పెట్టారని వీహెచ్ గుర్తు చేశారు. కాగా తెలంగాణ‌లో 25సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని... అయితే తెలంగాణ‌లో దొర‌ల పాల‌న‌కు తెర‌దించేందుకు విప‌క్షాల‌న్నీ ఏక‌మైన వేళ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ పోటీ చేసి ఓట్లు డివైడ్ చేయ‌డం మంచి సంప్ర‌దాయం కాదని వీహెచ్ హిత‌వు ప‌లికారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసి ఓట్లు చీల్చి ప్ర‌జాస్వామ్యాన్ని అవినీతిప‌రుల‌కు ఇవ్వొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ కూడా మ‌హాకూట‌మిలో క‌ల‌వాల‌ని వీహెచ్ కోరారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింద‌ని..ఇందిరా విజ‌యర‌థం పేరుతో తాను ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వీహెచ్ వెల్ల‌డించారు.

13:59 - October 7, 2018

సూర్యాపేట : జిల్లాలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో పెట్టే నగదులో అవకతవకలు జరిగాయి. సొంత సంస్థకే క్యాషియర్ కన్నం పెట్టాడు. ఆంధ్రాబ్యాంక్‌ను బురిడీ కొట్టించాడు. ఆంధ్రాబ్యాంకు హుజూర్‌నగర్ బ్రాంచ్‌లో గంగాధర రామకృష్ణ 3 సంవత్సరాలుగా హెడ్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో రామకృష్ణ చేలివాటం ప్రదర్శించారు. రూ.58.89 లక్షలతో రామకృష్ణ పరాయ్యారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

13:55 - October 7, 2018

యంగ్‌‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబోలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)నిర్మించిన చిత్రం..అరవింద‌ సమేత వీరరాఘవ.. పూజా‌హెగ్డే, ఈషా‌రెబ్బా‌ హీరోయిన్స్.. సినిమా రిలీజ్‌కి మరికొద్ది రోజులే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ‌ యూనిట్..
తారక్, త్రివిక్రమ్కలిసి అన్ని ఛానల్స్‌కి ఇంటర్వూలు ఇస్తున్నారు... మరోవైపు, రోజుకో కొత్త పోస్టర్‌తో పాటు, సాంగ్ ప్రోమోలు కూడా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు.. అభిమానులు వచ్చి ఇబ్బందిపెట్టొద్దని, ఓన్లీ మీడియా వారికి మాత్రమే ప్రవేశం అంటూ, తన ఆఫీస్‌లోనే తారక్ చాలా ఓపికగా ఇంటర్వూలు ఇస్తున్నాడు.. అతని మాటల్లో అరవింద సమేత హిట్ ఖాయం అనే కాన్ఫిడెంట్ కనబడుతోంది.. అరవింద రిలీజ్ కోసం నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. దసరా కానుకగా అక్టోబర్ 11న అరవింద సమేత వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది...

13:50 - October 7, 2018

హైదరాబాద్ : నగర శివారులోని అల్వాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ టెంట్ హౌస్ లో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఘటనలో భారీగా ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఎవరో కావాలని చేశారని యజమానురాలు వాపోయింది. పంచాశిలా హిల్్సలో ఉంటున్న ఓ టెంట్ హౌస్ గోడౌన్ లో ప్రమాదం జరిగిందని, విషయం తెలుసుకుని తాము ఇక్కడకు చేరుకోవడం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. టెంట్ హౌస్ లో బట్టలు ఉండడంతో మంటలు చెలరేగాయని, మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. గౌడోన్ లో షార్ట్ సర్యూట్ కారణమని తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
తాము ఇటీవలే దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 25 లక్షలు వెచ్చించడం జరిగిందని టెంట్ యజమానురాలు మీడియాకు తెలిపారు. ఈ బిజినెస్ లో పార్ట్నర్ కూడా చేరాడని, కానీ కేవలం 15 రోజుల్లోనే వెళ్లిపోయాడని తెలిపారు. ఆ సమయంలో తాము డబ్బు కూడా చెల్లించడం జరిగిందని తెలిపారు. 

13:36 - October 7, 2018

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ మెజెంజర్‌లో కొత్త ఫీచర్ రానుంది. ఫేస్‌బుక్‌ త్వరలో వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ను మెసెంజర్‌ యాప్‌లో ప్రవేశపెట్టనుంది. వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ మనం చెప్పే మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మారుస్తుంది. దీంతోపాటు ఫోన్‌ను తాకకుండానే ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపే వీలుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే విడుదల చేస్తామని ఫేస్‌బుక్‌ సంస్థ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. 

యాప్‌ నుంచి చేసే కాల్స్‌ను నియంత్రించే వెసులుబాటు, రిమైండర్లు క్రియేట్‌ చేసుకునే సౌకర్యం కొత్త ఫీచర్‌లో చేర్చుతున్నట్లు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఇతర మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతోనే కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. 

 

13:34 - October 7, 2018

హైదరాబాద్ : సీతాఫలాల సీజన్‌ వచ్చేసింది. మార్కెట్లో నిగనిగలాడుతూ ఆకట్టుకుంటున్నాయి. సీతాఫలం.. ఈ మాట వింటేనే నోరూరుతుంది. ఈ పండులో అంతటి తియ్యదనంతో పాటు పుష్కలమైన పోషకాలు కూడా ఉన్నాయండోయ్.. చలికాలంలో విరివిగా ఈ ఫలాలు లభిస్తాయి. ఆహార పదార్థాంగా ఆకలిని తీర్చడం కాదు..ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయి. కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు. ఇక దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చదవండి..

 • బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. 
 • విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు.
 • కేన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. 
 • సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. 
 • ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. 
 • గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు.
 • పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.
 • చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది.
 • మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. 
 • సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.
 • సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.
 • సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
13:11 - October 7, 2018

హైదరాబాద్ : ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్ గుర్తుందా.. శవానికి వైద్యం చేసినట్లు డాక్టర్లు నటించడం. సేమ్ అదే సీన్ హైదరాబాద్‌లో జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థి చనిపోయిన విషయాన్ని కటుంబ సభ్యులకు చెప్పకుండా వైద్యం చేస్తున్నట్లుగా వైద్యలు నటించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. శస్త్ర చికిత్స చేస్తుండగా విద్యార్థి మ‌ృతి చెందాడు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు డాక్టర్లు హడావిడి చేశారు. చివరికి మృతి చెందాడని చెప్పారు. 

సాత్విక్ రెడ్డి అనే విద్యార్థి కూకట్ పల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న మధ్యాహ్నం కూకట్ పల్లిలోని ల్యాండ్ మార్క్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ టెస్టులు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి వెళ్లాడు. కొన్ని పరీక్షల అనంతరం యువకుడికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అందుకు వారు అంగీకరించారు. సాయంత్రం 5 గంటలకు సాత్విక్ రెడ్డికి వైద్యులు శస్త్ర చికిత్స ప్రారంభించారు. అయితే అతనికి అనస్తీషియా ఇచ్చిన డాక్టర్ డ్యూటీ అయిపోయిందంటూ హడావిడిగా ఆపరేషన్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అతని స్థానంలో సబంధంలేని మరో డాక్టర్ వచ్చాడు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స చేస్తుండగానే సాత్విక్ రెడ్డి మృతి చెందాడు. అయితే అతడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా సాయంత్రం 5 గంటల నుంచి వైద్యం చేస్తున్నట్లు హడావిడి చేసి.. రాత్రి 10 గంటలకు సాత్విక్ రెడ్డి మరణించాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయాడని తెలిపారు. కాగా సాయంత్రం 7 గంటలకే అతను మరణించినట్లు ఈసీజే రిపోర్టు రావడం గమనార్హం. 

అయితే సాయంత్రం 7 గంటలకు సాత్విక్ రెడ్డి బాగానే ఉన్నాడని, చికిత్స చేస్తున్నామని చెప్పి..రాత్రి 10 గంటలకు మరణించాడని వైద్యులు చెప్పారని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. సంబంధంలేని ఆపరేషన్ చేయడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి చనిపోయాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

12:56 - October 7, 2018

హైద‌రాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో 119 స్థానాల‌కు ఒకే ద‌శ‌లో పోలింగ్ నిర్వ‌హించున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల తేదీని అనౌన్స్ చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రక‌ట‌న రావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించింది. అంద‌రూ ఒకే చోట కాకుండా విడివిడిగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. రోడ్డు షోలు, స‌భ‌లు, పాద‌యాత్ర‌లతో జ‌నంలోకి వెళుతున్నారు. 

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా పాద‌యాత్ర చేస్తుండ‌గా, కోదాడ‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రైతు గ‌ర్జ‌న స‌భ‌లో పాల్గొంటారు. ఇక కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ష‌బ్బీర్ అలీ, పొన్నం ప్ర‌భాక‌ర్  రోడ్ షోల పాల్గొంటారు. అన‌త‌రం మైనార్టీ స‌భ‌ల్లో పాల్గొంటారు. మైనార్టీల‌కు కాంగ్రెస్ ఏం చేసింది అనేది వారు తెలియ‌జేస్తారు. అలాగే మైనార్టీల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎలా మోసం చేసిందో చెప్ప‌బోతున్నారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార జోరును పెంచింది. వ్యూహాత్మంగా, ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతోంది. ఎవ‌రు ఎక్క‌డ ప్ర‌చారం చేయాల‌నే దానిపై ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. పార్టీలోని ప్ర‌ముఖ నాయ‌కులు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేయ‌బోతున్నారు. మ‌రోవైపు తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీలో పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటుపైనా మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

12:53 - October 7, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 విజేత కౌశల్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే ప్రసారమయిన బిగ్ బాస్ 2లో సుమారు 39.5 కోట్ల ఓట్లు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన కౌశల్ రూ. 50 లక్షల ప్రైజ్ ను ఎగురేసుకపోయాడు. కానీ ఈ డబ్బును క్యాన్సర్ బాధితులకు అందచేయడం జరుగుతుందని ప్రకటించి మానవతా వాదిగా నిలిచాడు. ఇటీవలే గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన కౌశల్ తాజాగా డాక్టరేట్ అవార్డును అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సామాజిక పేజీ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. 

‘అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. మీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్‌కు తొందరలో డాక్టరేట్ రాబోతోంది. ఎందుకు రాబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయం నేను కొన్ని రోజుల తర్వాత చెబుతాను’ అని కౌశల్ పేర్కొన్నారంట. కానీ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ ఈ డాక్టరేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే బిగ్ బాస్ 2 తరువాత బయటకు వచ్చిన పలు ప్రోగ్రామ్్స లో పాల్గొంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ షాపింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కౌశల్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

12:21 - October 7, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెంచుకున్న కుక్క చనిపోవడానికి కారణమని పేర్కొంటూ యజమాని ఆటోడ్రైవర్ ను దారుణంగా హతమార్చాడు. వెంటపడి మరీ నరికాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఢిల్లీలో విజేంద్ర రాణా అనే ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ద్వారక మోహన్ గార్డెన్ మీదుగా వస్తున్నాడు. ఆ సమయంలో అంకిత్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో వెళుతున్నాడు. ప్రమాదవశాత్తు ఆటో కింద కుక్కపడి పోయింది.

తీవ్ర ఆగ్రహానికి గురైన అంకిత్..విజేంద్రతో ఘర్షణకు దిగాడు. విజేంద్ర సోదరుడు వారించే ప్రయత్నం చేశాడు. కానీ అంకిత్ కత్తితో విజేంద్రపై దాడికి పాల్పడ్డాడు. కత్తి తీసుకుని రాణాతో పాటు ఆటోలో ఉన్న అతని సోదరుడి వెంట పడ్డాడు. చివరికి ఆటోను ఆపి కత్తితో దాడి చేశాడు. దీనితో ఇరువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా విజేంద్ర మృతి చెందాడు. దాడి జరిగిన సమయంలో అంకిత్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12:11 - October 7, 2018

ఈ వారం నోటాతో పాటు రిలీజ్ అయిన మరో సినిమా.. భలేమంచి చౌక బేరమ్.. దర్శకుడు మారుతి కథ అందించాడు.. ఇంతకుముందు మారుతి కథలిచ్చిన రోజులుమారాయి, బ్రాండ్ బాబు సినిమాలు పరాజయం పాలయ్యాయి... రోజులుమారాయిని డైరెక్ట్ చేసిన మురళీకృష్ణ దర్శకత్వంలో, కేరింత నూకరాజు, నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా,  తెరకెక్కిన భలే మంచి చౌక బేరమ్ ఎలా ఉందో చూద్దాం..

కథ :      

దుబాయివెళ్ళి డబ్బు సంపాదించి, తమకుటుంబాలని బాగా చూసుకోవాలనుకునే ఇద్దరు కుర్రాళ్ళు, సలీమ్(నూకరాజు), పార్ధు(నవీద్)..
ఒక బ్రోకర్ మోసం చెయ్యడంతో, హైదరాబాద్‌లో ఒకేరూమ్‌లో ఉంటూ.. ఒకరు వ్యాన్ డ్రైవర్‌గా, ఇంకొకరు కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటారు.. ఒకానొక రోజు ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ వ్రాసిన దేశ రహస్యాలు అనే ఫైల్ కొరియర్ బాయ్ అయిన సలీమ్ చేతికొస్తుంది.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని, లైఫ్‌లో సెట్ అయిపోదామనుకుంటారు.. వాళ్ళ ప్లాన్ ఫలించిందా, లేదా, చివరకి ఆ ఫైల్ ఎవరి చేతికి చేరింది అనేదే  భలే మంచి చౌక బేరమ్ కథ..
నటీనటులు :

కేరింత, నాన్న..నేను..నా బాయ్ ఫ్రెండ్ లాంటి సినిమాల్లో  చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న నూకరాజు ఈ సినిమాలోనూ తనస్టైల్ కామెడీతో అలరించే ప్రయత్నం చేసాడు.. నవీద్ కటౌట్ బాగుంది కానీ నటన పరంగా ఏమంత ఆకట్టుకోలేక పోయాడు..
హీరోయిన్ యామిని భాస్కర్ ఉన్నంతలో ఓకే అనిపిస్తే, రాజారవీంద్ర ఫుల్ లెంగ్త్ రోల్‌లో తన క్యారెక్టర్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు..  ఉగ్రవాదిగా చేసిన ముజ్ తబా అలీఖాన్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు..
సాంకేతిక వర్గం :

హరి గౌర పాటలు ధియేటర్‌లోనే మర్చిపోతాం.. ఆర్ఆర్ పర్వాలేదు.. తక్కువ బడ్జెట్ సినిమా అయినా, తన కెమెరా వర్క్తో క్వాలిటీ చూపించాడు కెమెరా మెన్ బాల్ రెడ్డి.. మారుతి కాన్సెప్ట్ కామెడీ పరంగా వర్కవుటయ్యేదే కానీ, టేకింగ్ విషయంలో డైరెక్టర్ తడబడడంతో భలే మంచి చౌక బేరమ్ ఆకట్టుకోలేక పోయింది...


తారాగణం :  పార్వతీశం (కేరింత నూకరాజు), నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్..

కెమెరా     :  బాల్ రెడ్డి

సంగీతం   :  హరి గౌర

కథ         మారుతి

నిర్మాత     ఆరోళ్ళ సతీష్ రెడ్డి

స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ : మురళీకృష్ణ
 

రేటింగ్ 2/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

12:01 - October 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముందుస్తు ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణ కోసం నోడల్ ఫీసర్‌గా అదనపు డీజీపీ జితేందర్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు పని చేస్తామన్నారు. దాదాపు 32500 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కసర్తతు చేస్తున్నామని చెప్పారు.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి కేంద్ర బలగాలను మోహరిస్తామని తెలిపారు. సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత అనుభవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లాండ్ ఆండ్ ఆర్డర్ చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.  

 

11:57 - October 7, 2018

హైదరాబాద్ : బుల్లితెరపై బిగ్ బాస్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 ప్రసారమయ్యాయి. ఇందులో బిగ్ బాస్ మొదటి భాగంలో జూ.ఎన్టీఆర్ అలరించగా బిగ్ బాస్ 2లో నేచురల్ స్టార్ నాని ప్రవేశించాడు. తాజాగా బిగ్ బాస్ 3 త్వరలో ప్రసారమవుతోందని తెలుస్తోంది. కానీ ఇందులో హోస్్ట అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

బిగ్ బాస్ 1లో జూ.ఎన్టీఆర్ అదరగొట్టాడు. వెండితెరపై తన నటనతో విశ్వరూపం చూపెట్టిన యంగ్ టైగర్ బుల్లితెరపై కూడా దుమ్ము దులిపేశాడు. మొదటిసారి బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ గా దులిపేశాడు. తనదైన స్టైల్..మేనరిజంతో బిగ్ బాస్ 1ని సకె్స్ చేయడంలో సఫలం అయ్యారు. ఇందులో ఫైనల్ మ్యాచ్ లో శివ బాలజీ నిలిచాడు. అనంతరం కొద్ది రోజులకు బిగ్ బాస్ 2 మొదలైంది. 

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరొందిన నాని బిగ్ బాస్ 2కి హోస్్టగా వచ్చాడు. సీరియస్..కామెడీ..జోక్్స తదితర వాటిని అనుకరిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు నాని. కానీ ఎన్టీఆర్ లా మాత్రం అలరించ లేకపోయాడని టాక్. ఇక షోలో ఎన్నో ఘటనలు జరిగాయి. ఎలిమేనెట్ అయిన అనంతరం పలువురు వ్యాఖ్యలు చేయడం మరింత వివాదాస్పదమయ్యాయి. చివరకు కౌశల్ విజేతగా నిలిచారు. 

మరోసారి బిగ్ బాస్ 3 వస్తే ఎన్టీఆర్ మరోసారి హోస్్ట గా వస్తారని ప్రచారం అవుతోంది. త్వరలోనే షూటింగ్ కొనసాగిస్తారని తెలుస్తోంది. కానీ దీనికి తారక్ నో చెప్పాడని మరో ప్రచారం జరుగుతోంది. ఆడియన్స్ ని అలరిస్తూనే ఇంటి సభ్యుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించిన నాని సీజన్ 3కి కొనసాగే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3లో ఉంటారని..పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ బిగ్ బాస్ 3 ఉంటుందా ? లేదా ? ఉంటే ఎవరు హోస్్ట అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

11:53 - October 7, 2018

విజయవాడ: జ‌న‌సేన టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే ద‌య‌చేసి నమ్మొద్దని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జ‌న‌సేన పార్టీలో టిక్కెట్లు కేటాయించేందుకు ఓ కమిటీ ఉంటుందని ప‌వ‌న్ తెలిపారు. టిక్కెట్ల కేటాయింపు విధానంలో పారదర్శకత ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. జనసేన నిర్మాణం ఆలస్యమైనా పక్కాగా ఉంటుందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

విజయవాడ భారతీనగర్ లోని పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ప‌వ‌న్ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. ధవళేశ్వరం బ్యారేజిపై నిర్వహించే భారీ కవాతుతో జనసేన పార్టీ సత్తాను దేశవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ఆ కవాతు తర్వాత దేశం మొత్తం జనసేన గురించే మాట్లాడుకోవాలన్నారు. కవాతుకు అందరూ సహకరించాల‌ని పవన్ విజ్ఞ‌ప్తి చేశారు. జనసేనకు తూర్పుగోదావరి జిల్లా ఆయువుపట్టు అన్న ప‌వ‌న్... 19 నియోజకవర్గాల్లో 20 నుంచి 22 రోజుల పాటు పర్యటిస్తానన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో మరో రెండ్రోజుల్లో పోరాట యాత్ర పూర్తవుతుందని ప‌వ‌న్ పేర్కొన్నారు.  15న కవాతుతో తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టి పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందన్న ప‌వ‌న్... తూర్పుతోనే మార్పు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి జిల్లాలో చాలా బలముందన్న ప‌వ‌న్ ఇక్కడ పట్టు సాధించలేకపోతే ఆ తప్పు నాయకులదే అవుతుందన్నారు. పార్టీలో కోటరీలు కట్టే విధానానికి తాను వ్యతిరేకమ‌ని.. పితాని బాలకృష్ణ మినహా జనసేన పార్టీ నుంచి ఎవరికీ సీటు ఇవ్వలేదని పవన్‌ ప్రకటించారు.

11:07 - October 7, 2018

రాజ్ కోట్:  భార‌త క్రికెట్ జ‌ట్టు చెల‌రేగిపోయింది. సొంత‌గ‌డ్డ‌పై ఆల్ రౌండ్ షో తో అద‌ర‌గొట్టింది. స్వదేశంలో త‌మ‌కు తిరుగులేద‌ని చాటి చెప్పింది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌ జట్టుతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. మరో రెండు రోజుల ఆట‌ మిగిలుండగానే విజ‌య‌భేరి మోగించింది. సమష్టిగా రాణించిన టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి. వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. విరాట్ కోహ్లి (139: 230 బంతుల్లో 10x4), పృథ్వీ షా (134: 154 బంతుల్లో 19x4), రవీంద్ర జడేజా (100 నాటౌట్: 132 బంతుల్లో 5x4, 5x6) సెంచరీలతో కదం తొక్కారు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో విరాట్ సేన  1-0తో ఆధిక్యంలో నిలిచింది. యువ సంచ‌ల‌నం పృథ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.

శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడిన వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భార‌త జ‌ట్టు ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 262 పరుగులతో గెలిచిన రికార్డును ఈ సందర్భంగా విరాట్ సేన అధిగమించింది. మరోవైపు విండీస్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి.

విండీస్‌పై గెలుపుతో భార‌తో మ‌రో అపూర్వ ఘ‌న‌త‌ను కూడా సాధించింది. స్వదేశంలో టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో భారత్ వందో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 266వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకుంది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో శతక విజయాలు పూర్తి చేసిన నాలుగో జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియా (238 విజయాలు.. 415 మ్యాచులు) అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ (217 విజయాలు.. 515 మ్యాచులు), దక్షిణాఫ్రికా (104 విజయాలు.. 230 మ్యాచులు) టాప్-3లో ఉన్నాయి. 1952లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ తొలి టెస్టు విజయాన్ని రుచి చూసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ 649/9(149.5)డిక్లేర్డ్
విండీస్ తొలి ఇన్నింగ్స్ 181 ఆలౌట్(48)
విండీస్ రెండో ఇన్నింగ్స్ 196 ఆలౌట్(50.5)

11:03 - October 7, 2018

ముంబై : దేశ వాణిజ్య ప్రాంతంగా పేరొందిన ముంబైలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ మోడల్ తన తల్లిని చంపేశాడు. ఆలస్యంగా ఈ దారుణ ఘటన లోఖండ్వాలో చోటు చేసుకుంది. తల్లి..కుమారుడు డ్రగ్్సకు అలవాటు పడినట్లు..పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...లక్ష్యసింగ్ (23) ఓ మోడల్. అతని తల్లి సునీతా సింగ్..లు లోఖండ్వాలా ప్రాంతంలోని క్రాస్ గేట్ లో నివాసం ఉంటున్నారు. 

బుధవారం మధ్యరాత్రి సునీత, లక్ష్య, ఇతని ప్రియురాలు డ్రగ్్స తీసుకున్నట్లు ఆ సమయంలో ఇద్దరు పనివాళ్లు ఇంట్లోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలో సునీత ఇరువురితో వాగ్వాదానికి దిగినట్లు, ఈ సమయంలో ఆవేశానికి లోనైన లక్ష్యసింగ్ తల్లిపై పిడిగుద్దులు కురిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం సునీతను బాత్ రూంలో పడేసి లాక్ వేసినట్లు, ఈ సమయంలో సునీత తన తలను వాస్ బేసిన్ కు వేసి బాదుకున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున బాత్ రూం ఓపెన్ చేసి చూడగా సునీత మృతి చెందింది. నిందితుడు లక్ష్యను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు అక్టోబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. 

10:47 - October 7, 2018

పాట్నా : భారతదేశంలో ప్రేమికుల హత్యలు..ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తమ కులం కాదని..దాడులు..దారుణాలకు పెట్రేగిపోతున్నారు. పరువు హత్యలు కూడా ఇందులో చోటు చేసుకుంటుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. పాట్నాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

బీహార్ లోని గర్దనీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విష్ణుపురి ప్రాంతంలో మైనర్ యువతి..మైనర్ యువకుడు ప్రేమించుకున్నారు. అమ్మాయి వయస్సు 16 కాగా..అబ్బాయి వయస్సు 17 ఏళ్లు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీనితో వారిని మందలించారు. దీనితో వారి నివాసాల నుండి పారిపోయి వేరే దగ్గర నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడదీయాలని కుటుంబసభ్యులు భావించారు. దీనితో తాము ఒక్కటిగా జీవించలేమని భావించి ఆ మైనర్ ప్రేమికులు విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు..ఇతరులు గమనించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ చికిత్స పొందుతూ వారిరిరువురూ స్వల్ప వ్యవధిలోనే కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

10:32 - October 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కూత కూసింది. శనివారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేసింది. డిసెంబర్ 7వ తేదీ పోలింగ్..డిసెంబర్ 11న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించింది. దీనితో ఒక్కసారిగా చూపు కేసఆర్ వైపు మళ్లింది. ఎందుకంటే సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్మే కేసీఆర్ కు ఆ తేదీలు కలిసొస్తాయా అనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 7వ తేదీ అమవాస్య అయ్యింది. అదే విధంగా పోలింగ్ తేదీ 11 చవితి అయ్యిందని కొంతమంది పేర్కొంటున్నారు.

కేసీఆర్ ముహూర్తాలు..సెంటిమెంట్లను బలంగా విశ్వసిస్తారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య ‘6’. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 6న శాసనసభ రద్దు చేశారు. సుమారు 9 నెలల ముందుగానే తొలి అసెంబ్లీ రద్దయినట్లైంది. ఇక పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా ‘6’ వచ్చే విధంగా చూశారు. 105 (1+0+5=6) మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం దానికి బలం చేకూరుస్తోంది. కానీ ఈసీ ప్రకటించిన దానిలో ‘6’ సంఖ్య రావడం లేదు. 

డిసెంబరు 7న పోలింగ్ అంటే (07-12-2018 : 0+7+1+2+2+0+1+8 = 21 : 2+1 = 3)
డిసెంబర్ 11 ఫలితాలు అంటే (1112-2018 : 1+1+1+2+2+0+1+8 = 16: 1+6 = 7)


అందులో అమావాస్య, చవితి రావడంతో అంత శుభసూచికం కాదని సోషల్ మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కానీ కొంతమంది మాత్రం కేసీఆర్ కు అనుకూలంగా ఉందని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. 

10:10 - October 7, 2018

హైదరాబాద్ : చమురు ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వాహనదారులకు చిక్కలు చూపెడుతున్నాయి. ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో లీటర్ కు రూ. 2.50 తగ్గిస్తున్నట్ల కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటించారు. కానీ ధరలు మాత్రం పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. శనివారం పెరిగిన ధరలు ఆదివారం కూడా కంటిన్యూ అయ్యాయి. ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వం చమురు కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 14 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ రూ.81.82కు, డీజిల్ లీటర్ పెట్రోల్ రూ.73.53కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 14 పైసలు, డీజిల్ 31 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ రూ.87.29, డీజిల్ రూ.77.06కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 85.04, డీజిల్ లీటర్ రూ. 77.73, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 82.46, డీజిల్ లీటర్ రూ. 73.90, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 86.59, డీజిల్ లీటర్ రూ. 79.98 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అధిక స్థాయిలో ఉండటం వల్లే ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెబుతున్నారు. 

09:45 - October 7, 2018

విశాఖ‌: అమెరికాలోని అలస్కా వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన గీతం వర్సిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం ఆదివారం ఉద‌యం విశాఖకు చేరుకుంది. అదే ప్ర‌మాదంలో మృతి చెందిన వీవీఆర్‌ చౌదరి పార్థివదేహం కూడా విశాఖ‌కు చేరుకుంది. విశాఖ నుంచి మూర్తి స్వగ్రామమైన సిరిపురంలోని స్వ‌గృహానికి భౌతిక‌కాయాన్ని త‌ర‌లించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు  గ్రామస్తులు, ప్రముఖల సందర్శనార్థం మూర్తి భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం రామ్ నగర్ లోని టీడీపీ కార్యాలయానికి మూర్తి పార్థివదేహాన్ని తరలించి, అక్కడ పార్టీ నేతలు, నాయకులు నివాళులర్పించిన తదుపరి అక్కడి నుంచి రుషికొండకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది.  అనంత‌రం ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబసభ్యులు మూర్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. గీతం డీమ్డ్‌ వర్సిటీ సమీపంలో అంత్యక్రియలు జ‌రుపుతారు.

కాగా, ఈ తెల్లవారుజామున అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మూర్తి పార్థివదేహాన్ని, అక్కడ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు తరలించారు. ఉద‌యం 7.30గంట‌ల‌కు భౌతిక‌కాయం విశాఖ‌కు చేరుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు.

అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రభుత్వం 1316 చదరపు గజాల స్థలాన్ని మార్కెట్‌ విలువ ఆధారంగా కేటాయించింది. ఈ స్థలాన్ని మూర్తి స్మారకంగా కుటుంబ సభ్యులు అభివృద్ధి చేయనున్నారు. 

ఈ నెల 2న ఎంవీవీఎస్‌ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం(అక్టోబ‌ర్2) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్‌ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్‌ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ ముందు వెళ్తున్న ఫోర్డ్‌ ఎఫ్‌–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్‌ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్‌ పక్కన శివప్రసాద్‌ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు. 

09:41 - October 7, 2018

కిన్‌షాసా : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వాహనాల్లో ఉన్న వాళ్లు ఉన్నట్లే అగ్నికీలల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలకు మంటలు అంటుకోవడంతో బుగ్గయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వెళ్లాల్సిన వాహనాలను నిలిపివేశారు. 

క్షతగాత్రుల ఆర్తనాదాల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కాంగో తాత్కాలిక గవర్నర్‌ అటో మటుబువనా ధ్రువీకరించారు. హైవే పక్కన ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

09:11 - October 7, 2018

ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా పొదుపు చర్యలో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల్లో ప్రీమియం ప్రయాణికులకు ఆహారంతో పాటు అందించే ఛీజ్‌ను సగానికి సగం తగ్గించింది. దీని వల్ల సుమారు రూ.2.5కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ఎయిరిండియా కేటరింగ్‌ సర్వీస్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం అందించబోమంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

అంతర్జాతీయ విమానాల్లో ప్రీమియం ప్రయాణికులకు విమాన సిబ్బంది ఆహారంతో పాటు ఛీజ్‌ ఇస్తుంటారు. కానీ, ప్రయాణికులు దాన్ని బాగా వేస్ట్‌ చేస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. ’అందుకే మెనూలో మార్పులు చేశాం. గతంలో ప్రయాణికులకు అందించే ఛీజ్‌ను సగానికి సగం తగ్గించాం. దీని వల్ల ఏడాదికి సుమారు రూ.2.5కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది’ అని ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు తూర్పు మార్గంలో వీచే గాలుల కారణంగా విమానాలు అనుకున్న సమయాని కంటే ముందుగానే గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. దీని వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో విమానాలు నడిపే పైలెట్లు విమాన వేగాన్ని తగ్గించాలని ఎయిరిండియా పైలెట్లకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల విమానం గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడంతో పాటు ఇంధనాన్ని ఆదా చేసినట్లు అవుతుందని ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. 2017లో ఎయిరిండియా దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం అందించడం నిలిపివేసింది. దీని వల్ల ఎయిరిండియాకు ఏడాదికి రూ.7 నుంచి రూ.8కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు.

 

08:53 - October 7, 2018

విజ‌య‌వాడ‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా, నిధులు ఇవ్వ‌కుండా తీర‌ని అన్యాయం చేశార‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

మోదీ ప్రభుత్వాన్ని  గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్ర‌బాబు పార్టీ నేతలకు సూచించారు. శనివారం రాత్రి ఉండవల్లిలో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో చంద్రబాబు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే ఆ దిశగా పనిచేయాలని, అక్కడి నుంచే మోదీ పతనం ప్రారంభం కావాలని అన్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికి అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి వారిని ఒకే తాటిపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు నాయుడు.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రంతో విబేధించి ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్, నిధుల విష‌యంలో బీజేపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. తాజాగా ఏపీలోని టీడీపీ నాయ‌కుల సంస్థ‌ల‌పై ఐటీ శాఖ దాడులు జ‌ర‌ప‌డం కూడా చంద్ర‌బాబుకి ఆగ్ర‌హం తెప్పించింది. ఇదంతా మోదీ ప‌న్నిన కుట్ర అని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

08:06 - October 7, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1046 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. 1867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 

 

Don't Miss