Activities calendar

15 October 2018

21:44 - October 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో జనసేన పోటీ చేయరాదని... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రకు ప్రజా స్పందన బాగుందని..టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని మరోసారి చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం ఖాయమని వీహెచ్ ధీమా వ్యక్తంచేశారు. 
 

 

21:23 - October 15, 2018

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, సంస్థలపై జరిగిన ఐటీ దాడులను టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంపీ రమేష్ బినామీగా పని చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబును అడ్డం పెట్టుకుని పెద్ద కాంట్రాక్టర్లను బెదిరించి సబ్ కాంట్రాక్టులు సీఎం రమేష్ పొందుతున్నారని అంబటి రాంబాబు అన్నారు.

సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని అంబటి ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్‌ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. సీఎం రమేష్ తన కుటుంబసభ్యులకు తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుచుకునే లాకర్లు ఉండటమేంటని అంబటి ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేశ్‌ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్‌ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని అంబటి వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ సారా కాంట్రాక్టర్‌ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్‌హౌజ్‌ రాజకీయాలే కారణమని అంబటి ఆరోపించారు. అసలు సీఎం రమేష్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార టీడీపీకి భయమెందుకు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

21:13 - October 15, 2018

బీహార్ : జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. వర్శిటీలో వుండగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్ని విస్తృతంగా వార్తల్లో నిలిచిన కన్హయ్య కుమార్ పై మరోకేసు నమోదయ్యింది. కన్హయ్యపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులతో ఘర్షణకు దిగారని ఆరోపిస్తూ ఎయిమ్స్ యాజమాన్యం ఆయనపై కేసుపెట్టింది. కన్హయ్య కుమార్‌తో పాటు బీహార్ ఏఐఎస్ఎఫ్ చీఫ్ సుశీల్ కుమార్ సహా 80 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. కన్హయ్య, ఆయన మద్దతుదారులు ట్రామా ఎమర్జెన్సీ యూనిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం వల్లే ఘర్షణ చోటుచేసుకున్నట్టు ఎయిమ్స్ జూనియర్ వైద్యులు ఆరోపించారు.
 ట్రామా ఎమర్జెన్సీ యూనిట్‌ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డుపై కన్హయ్య అనుచరులు చేయిచేసుకున్నారని..దీంతో వార్డు లోపల డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు కన్హయ్య అనుచరులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎస్ఎఫ్ నేతలు, జూనియర్ డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి నిరసనగా ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత జూనియర్ డాక్టర్‌లు అర్థాంతరంగా విధుల నుంచి నిష్క్రమించారు. ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తి మేరకు కొద్ది సేపటికే తిరిగి వైద్య సేవలు ప్రారంభించారు. కాగా ఈరోజు ఉదయం నుండి జూనియర్ డాక్టర్లంతా ధర్నాకి దిగారు.  కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న కన్హయ్య కుమార్‌కు ఈ పరిణామాలు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య కుమార్ పోటీచేస్తున్నట్టు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

20:38 - October 15, 2018

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, మోదీ.. ఏపీని దారుణంగా మోసగించారని పవన్ ఆరోపించారు. 

ఏపీలో జరుగుతున్న దోపిడీలు, దారుణాలపై సీఎం చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని, ఆయన తన పద్ధతి మార్చుకోవాలని పవన్ సూచించారు. ఏ విషయంలోనూ చంద్రబాబు తనను సంప్రదించలేదని, చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఉన్నపళంగా తాను మారిపోయానని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా మౌలిక సదుపాయాలు లేవని, విజన్ 2020లో చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు, రోడ్లు ఎక్కడ ఉన్నాయని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని, అవి జన్మభూమి కమిటీలా? గూండా కమిటీలా? అంటూ టీడీపీ నేతలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లోనే తమ పార్టీకి బలం ఉందని, అయినప్పటికీ ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేకనే పోటీ చేయలేదని పవన్ వెల్లడించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచినా ఎటువంటి పదవులూ ఆశించలేదన్నారు. రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని మాత్రం నాడు చంద్రబాబును కోరానని పవన్ గుర్తుచేసుకున్నారు. జనసేన పార్టీ భవన నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వలేదని, టీడీపీ పల్లకీని తమ పార్టీ ఎప్పుడూ మోస్తూనే ఉండాలా? అని పవన్ నిలదీశారు.

20:18 - October 15, 2018

హైదరాబాద్ : జబర్దస్త్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తు ఎన్నాళ్టినుండో మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహిళలను కించపరుస్తు ఈ కార్యక్రమంలో స్కిట్స్ వున్నాయంటు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా నటిస్తూ అసభ్యకరమైన పదజాలంతో స్కిట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆ స్కిట్ చేసిన జబర్దస్త్ కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్‌ సీఐ ప్రకాశ్‌కు తెలంగాణ గల్ఫ్‌ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
 

 

19:59 - October 15, 2018

రాజమండ్రి: ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంతో ముఖ్యమంత్రులు కాలేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తాత ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కావాలని నారా లోకేష్ అనుకున్నప్పుడు, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ జగన్ అనుకున్నప్పుడు.. ఒక మున్సిబు ముని మునవడు, పోస్ట్ మ్యాన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? అని పవన్ ప్రశ్నించారు. నేను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను అని పవన్ అన్నారు. అయితే సీఎం పదవి తనకు అలంకారం కాదని పవన్ స్పష్టం చేశారు. ఇక సభలో 'సీఎం..సీఎం' అంటూ అభిమానులు చేసిన నినాదాలపై స్పందించిన పవన్ 'మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది' అని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వంతెనపై జనసేన కవాతు ముగిసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

19:40 - October 15, 2018

రాజస్థాన్‌ : సాధారణంగా మనుషుల కళ్లకంటే పశువుల కళ్లు చాలా ఆరోగ్యంగా వుంటాయి. పశువులకు కళ్ల జబ్బులు వచ్చినట్లుగా మనం విని వుండం. ఎందుకంటే శాఖాహారం తినే జంతువులైనా..మాంసాహారం తినే మృగాలైనా రా మెటీరల్ మాత్రమే తింటాయి. అంటే ఉడికించని ఆహారం అన్నమాట. అందుకే వాటికి సాధారణంగా కళ్ల జబ్బులే కాదు ఎటువంటి జబ్బులు రావు. కానీ ఓ ప్రాంతంలోని జంతువులకు మాత్రం కంటి జబ్బులు వచ్చాయి. అదే మండోర్‌లో గల ఒక గోశాలలోని ఐదు ఆవులకు వైద్యులు కంటి ఆపరేషన్ చేశారు. వినటానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా..నమ్మల్సిన నిజం. గోశాలలో వుండే ఐదు ఆవులకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఫలితంగా వీటిలోని మూడు గోవులు చక్కగా చూడగలుగుతున్నాయట. దీంతో కంటిజబ్బులు వున్న మరో వంద గోవులకు ఆపరేషన్ చేయనున్నారట. దేశంలోని ఒక గోశాలలో ఆవులకు కంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే ప్రధమం. ఈ సందర్భంగా గోశాల కోశాధికారి మాట్లాడుతూ గోశాలలో ఆవులకు కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకమైన థియేటర్ ఏర్పాటు చేశాం. గతనెలలోనే దీనిని ప్రారంభించాం. పశువైద్య నిపుణులు సురేష్ కుమార్ బృందం గోవులకు ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు. 
 

 

19:15 - October 15, 2018

పశ్చిమగోదావరి : పాములు, జెర్రులు, తేళ్లు వంటి చైనీయులు బహు ఇష్టంగా తింటారు. కొన్ని చేపలు పాముల వలె వుంటాయి. కానీ వీటిని కూడా చేపల ప్రియులు బహు ఇష్టంగా తింటారు. వీటిలో ప్రథమస్థానం మలుగు పాముదే. టేస్ట్ లో కూడా చేపలకు ఏమాత్రం తీసుపోదు అంటారు ఈ పాము కూరను తిన్నవారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పాములు ఎంత రుచి గురించి కథలు కథలుగా చెబుతారు. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి పాము అంతా మాంసంతో మెత్తగా  ఉండే ఈ రకం చేప పాముకు మాంసాహారుల్లో  మంచి గిరాకీ ఉంది. అదే మలుగు పాము. ఓమేగా-3, ప్రొటీన్‌ ఉండే ఈపాము చాలా రుచిగా ఉంటుంది. పలు విధాలుగా వండుకునే ఈ పాముకు ప్రస్తుతం మార్కెట్‌లో దీనికి చాలా డిమాండ్‌ ఉంది. డెల్టాలో బురద నేలలోను, కొల్లేరులోను ఇవి లభ్యమవుతాయి. ఆదివారం నాడు పట్టణంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఇవి విక్రయించారు. కిలో రూ.300 నుంచి 400 పలికింది. ఇవి పాము సైజ్‌ను బట్టి రేటు పలుకుతు మాంసాహార ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా మటన్ కూడా ఒకో సందర్భంలో కాస్త తగ్గుతుంటుంది. కానీ మలుగు పాము రేట్లు మాత్రం పెరిగిపోతుంటాయనీ..ఎందుకంటే ఇవి అన్ని ప్రాంతాలలోను లభించవు కాబట్టి మటన్ అయితే ఎక్కడైనా దొరుగుతుందని అందుకే మలుగు పాము రేటు మటన్ కంటే కాస్త ఎక్కువే వుంటుందంటున్నారు వ్యాపారులు. 
 

18:51 - October 15, 2018

తూర్పు గోదావరి : జనసేన కవాతులో పెను ప్రమాదం తప్పింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై జనసేన పార్టీ కవాతుకు భారీగా తరలివచ్చిన జనసైనికులు ఈ కవాతులో పాల్గొన్నారు. ‘జనసేన’ జెండాలు, అన్ని మతాలు ఒక్కటేనని తెలుపుతూ రూపొందించిన జెండాలను చేతపట్టిన పవన్ అభిమానులు కవాతులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్న బహిరంగ సభా వేదిక వద్ద ఓ పాత రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ రేకుల షెడ్డుపై జనసేన  అభిమానులు భారీగా ఎక్కడంతో ఈ రేకుల షెడ్డు కూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. అందరూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం.
 

18:34 - October 15, 2018

విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమి పెంపు కొనసాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 132 విడుదల చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఓసీలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. 2029 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. రాబోయే డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వయో పరిమితిని పొడిగించింది.

త్వరలోనే డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ క్రమంలో తమ వయోపరిమితి అయిపోయిందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త వినిపించి వారి ఆందోళనను దూరం చేసింది. అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 45 సంవత్సరాలకు పెంచాలని కొంతకాలంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 34 నుంచి 42 సంవత్సరాలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం మేలు చేసినట్టు అయింది. అన్ని రంగాల ఉద్యోగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

ఏపీపీఎస్సీ ద్వారా 12వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 11వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అన్ని ప్రభుత్వ రంగాల్లోని దాదాపు 22వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్న క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచటం శుభపరిణామం అని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

17:49 - October 15, 2018

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వంతెనపై జనసేన కవాతు తర్వాత బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తూర్పుగోదావరిలో తనపై ఇంత ప్రేమ ఉంటుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై కవాతుకి తరలివచ్చిన వారందరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. జన సైనికులను కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులుగా, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలుగా పవన్ అభివర్ణించారు. 

అదే సమయంలో కవాతు ఎందుకు చేయాల్సి వచ్చింది? కవాతు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అనేది పవన్ వివరించారు. 

‘కవాతు ఎవరు చేస్తారు? మిలిటరీ సైనికులు. సామాన్య ప్రజలు కవాతు చేయరు. మరి, మనం ఎందుకు కవాతు చేయాల్సి వచ్చింది?’ అవినీతిని, దోపిడీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఈ కవాతు చేయాల్సి వచ్చింద అని పవన్ అన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని, అవినీతితో పాలనా వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని పవన్ విమర్శించారు. నిరుద్యోగ సమస్యతో యువకులు రగిలిపోతున్నారని పవన్ పాలకులపై మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని పవన్ ధ్వజమెత్తారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. అన్ని పార్టీల్లా కాకుండా జనసేన బాధ్యతతో నడిచే పార్టీ అని పవన్ చెప్పుకొచ్చారు.

17:44 - October 15, 2018

ఢిల్లీ : 'మీ టు' ఉద్యమం పలు రంగాలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. తమకు జరిగిన సంఘటనలపై గళం ఎత్తి ఎలుగెత్తి చాటుతున్నారు మహిళలు. బాధ పడినవారు కాదు బాధ పెట్టినవారే తలదించుకోవాలని మహిళలు గళమెత్తుతున్నారు. తమలో వున్న నైపుణ్యాలను నిరూపించుకునేందుకు మహిళలు పలు రంగాలలో అడిగిడి తమ సత్తా చాటుతున్నారు. కానీ పలు వేధింపుల మాటున మౌనంగా రోదిస్తు తమతాము నిరూపించుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో మౌనం మీడి మీటు అంటున్నారు. వేదికలపై తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు. పెద్దల ముసుగులో ప్రబుద్ధులు జరుపుతున్న హేయమైన హింసను బట్టబయలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేని కొందరు మహిళలపై మరోవిధంగా మాటలతో దాడి చేస్తున్నారు. కాగా ఆ దాడి చేసేవారిలో మహిళలు వుండటం విచారించదగిన విషయం. వారు కూడా ప్రజాప్రతినిధులుగా వుండే మహిళలు కావటం మరింత సిగ్గుచేటైన విషయం. 
సినీ పరిశ్రమతో పాటు మీడియా, రాజకీయ రంగాల్లో తమను లైంగికంగా వేధించిన ప్రబుద్ధుల పేర్లను మహిళలు ‘మీ టూ’ ఉద్యమం కింద బయటపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ బాధిత మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెరీర్ లో ఎదుగుదల, సొంత ప్రయోజనాల కోసం కొందరు మహిళలు రాజీ పడతారని వ్యాఖ్యానించారు.


కెరీర్లో ముందుకు వెళ్లేందుకు.. కెరీర్‌ను డెవలప్ చేసుకునేందుకు కొందరు మహిళలు విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తారని..అందుకే మహిళలు ఇబ్బందులకు గురవుతారని..ఈ క్రమంలో ప్రయోజనాలు పొందినవారే ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఉషా ఠాకూర్ లైంగిక వేధింపులకు గురైన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా  గతంలో కూడా ఉషా ఠాకూర్ నవరాత్రి ఉత్సవాల వద్దకు హిందూ అమ్మాయిలను చూడటానికే ముస్లిం యువకులు వస్తారనీ, వారిని అనుమతించకూడదని ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం గమనించాల్సిన విషయం. కాగా బీజేపీ నేతలే ఎక్కువగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం మరింతగా గమనించాల్సిన విషయం. 

16:48 - October 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి..ముందే అభ్యర్థులను ప్రకటించేసిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తులు వ్యక్తమౌతున్నాయి. టికెట్ రాని కొంతమంది ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్లీ రాములు నాయక్ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. 
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితో రాములు నాయక్ రహస్యంగా భేటీ అయ్యారని పేర్కొటూ ఆ పార్టీ అధిష్టానం అతడిపై సస్పెండ్ వేటు వేశారు. దీనిపై రాములు నాయక్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే సస్పెండ్ చేశారని, 20 ఏళ్ల నుండి కేసీఆర్‌ను నమ్ముకున్నానని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని..టీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు బయటకు వస్తారని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని రాములు నాయక్ పేర్కొనడం గమనార్హం. 

16:48 - October 15, 2018

గుంటూరు : పితృస్వామ్య భావజాలం కలిగిన సమాజంలో బాధలకు, వేదనలకు, హింసలకు గురయ్యేది స్త్రీలే.  మాతృస్వామ్యంలో వున్న సమాజంలోను హింసిలకు గురయ్యింది స్త్రీలే. మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యంలోకి సమాజం పరిణామం చెందినా స్త్రీలకు బాధలను, హింసలు, అణచివతేలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకువచ్చింది. అయినా స్త్రీ జాతిపై హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటంలేదు. ఈ నేపథ్యంలో మహిళలకు అంత్యంత పటిష్టమైన చట్టం 498ఎ. కానీ  ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని కొందరి వాదన. ఈ చట్టాన్ని సవరించాలని ఎంతోకాలంగా దేశంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో భార్యా బాధితులుగా చెప్పుకుంటున్న కొందమంది మహిళలకేనా చట్టాలుండేది..వారేనా బాధలు పడేది మాకు కూడా బాధలున్నాయనీ..మేము కూడా మహిళల చేతిలో హింసలకు గురవుతున్నామనీ..మాకు కూడా ఓ సంఘం కావాలని కోరుకుంటున్న కొందమంది పురుషులు భార్యా బాధితుల సంఘాలను స్థాపించారు. 
మాజంలో భార్యా బాధితులు కూడా వున్నారా? వారు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారా? అంటే వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం. సమాజంలో నైతిక మద్దతు కూడా కూడగట్టుకునేందుకు బాధితులందరూ కలిపి ఇటీవల సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఈ దేశంలో తాము పౌరులమేనని, తమకు హక్కులు కావాలంటూ నిలదీస్తున్నారు. ఇటువంటి సంఘాలు మన రాష్ట్రంలోనే పదుల సంఖ్యలో ప్రతి జిల్లాలో వెలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఎఫ్‌ పేరుతో పదివేల మందితో వీరికి సలహాలు, సహాయాలు అందించేందుకు బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. 
10వేలమందితో జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన..
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈనెల 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కూడగట్టి సుమారు పదివేల మందితో రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 
మహిళా కమిషన్‌ కాకుండా పురుష కమిషన్ కోసం డిమాండ్ : 
మహిళా కమిషన్‌ కాకుండా పురుష కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రధానంగా వీరు డిమాండ్‌ చేశారు. ఈ సమా వేశానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు హరిహరన్‌, అన్షుత్‌వర్మలు వచ్చి మద్దతు తెలపడం కొసమెరుపు.
భార్యాభాధితుల  సోషల్‌ మీడియాలో మద్దతు...
భార్యాభాధితుల సంఘాలు సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. దీనికి రాష్ట్రవ్యా ప్తంగా అనేక సంఘాలు ఏర్పాటు కావడంతో అందరూ కలిసి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నారు. వీరికి లభిస్తున్న మద్దతు ఈ సంఘాలకు దానిలోని సభ్యులకు మద్దతుగా ఉంటుంది.  ఈ సంఘాల ఏర్పాటు ఏ స్థాయికి వెళ్ళిదంటే మండలాలు, జిల్లాల వారీగానే కాకుండా హైదరాబాద్‌ కేంద్రంగా సాఫ్ట్‌వేర్‌ భార్యా బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఇటీవల దాని ప్రథమ వార్షికోత్స వాన్ని నిర్వహించారు. 300 మంది సమావేశానికి హాజరయ్యారు.
విజయవాడలో భార్యా బాధితుల సంఘం..
ఈనెల 1వ తేదీన విజయవాడలో ఏపీ భార్యా బాధితుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమా వేశంలో వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. తామంతా సంఘటితంగా పోరాడి పురుషుల హక్కులు సాధించే వరకు పోరాటాన్ని కొన సాగించాలని నిర్ణయించుకున్నారు. సమావేశంలో ప్రధా నంగా వారుఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
భార్యా బాధితుల సంఘాల డిమాండ్స్ ..
 498 ఎ సెక్షన్‌ను పునఃసమీక్షించాలి. దీని ప్రకారం కేసు నమోదు చేసే ముందే పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా అరెస్టులకు వెళ్ళకూడదు. విచారణను ఎమ్మార్వో లేదా ఆర్డీవోల సమక్షంలో నిర్వహించాలి. కేసు న మోదు అయినా ఏడాది లోపు విడాకులు మంజూరు చేసేలా చట్టం తేవాలి.ఎంసీ, డీవీసీ సెక్షన్లను పూర్తిగా చట్టంలో నుంచి తొలగించి, కోర్టులో ఉన్న పెండింగ్‌లో ఉన్న కేసులపై మరలా కేసులు పెట్టకుండా చూడాలి. ఈ సంఘాల్లో చేరుతున్న వారిలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉంటున్నారు. వారిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతస్థాయి డాక్టర్లు, నాయకులు, మంత్రులు ఉన్నారు. వీరు ఇటీవలఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.
 

 

16:31 - October 15, 2018

రాజమండ్రి: జనసేన కవాతులో అపశ్రుతి చోటు చేసుకుంది. కవాతులో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతును విరమించుకున్నారు. తన కారులోనే ఆయన బ్యారేజ్‌పై ముందుకు సాగారు. పోలీసుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ కారు నుంచి కిందకు దిగలేదు. సభాస్థలికి కారులోనే బయలుదేరారు. కవాతుకు ఊహించని విధంగా జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు ఈ కవాతుకు ఏర్పాట్లు చేశారు. జనసేన కార్యకర్తలతో బ్యారేజీ కిక్కిరిసిపోవడంతో పవన్ కారు దిగలేకపోయారు. ధవళేశ్వరం వంతెన మొత్తం జనసైనికులతో నిండిపోయింది. 

కాగా అంతకుముందు కవాతు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ధవళేశ్వరం వంతెనపై ‘జనసేన కవాతు’కు రాజ మహేంద్రవరం పోలీసులు నో చెప్పారు. కవాతుకు అనుమతిని నిరాకరిస్తూ నోటీసులు జారీచేశారు. కవాతు నిర్వహించేందుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని పోలీసులు అందులో పేర్కొన్నారు. బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని అందులో వెల్లడించారు. యాత్రకు దాదాపు 3లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందనీ, కాబట్టి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. కానీ జనసేన నాయకులు మాత్రం పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా కవాతు ప్రారంభించారు. ధవలేశ్వరం బ్యారేజీపై మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభమైంది. దాదాపు గంటన్నరసేపు ఈ కవాతు సాగనుంది. కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే ఆయన ఏం మాట్లాడతారు, ఏయే అంశాల గురించి ప్రస్తావిస్తారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా రాజమండ్రి రూరల్‌లో పవన్ ఈ సభలో మాట్లాడుతున్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. రాజమండ్రిలోని పిచ్చుకలంక నుంచి కాటన్ విగ్రహం వరకూ 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనుంది. అనంతరం కాటన్ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. అయితే ఈ స్థలంలో 10,000 మంది మాత్రమే సరిపోతారనీ, అంతకుమించి ప్రజలు హాజరైతే తొక్కిసలాట చోటుచేసుకునే ప్రమాదముందని పోలీసులు నోటీసులో హెచ్చరించారు. కాబట్టి బహిరంగ సభ కోసం మరో ప్రాంతాన్ని చూసుకోవాలని సూచించారు. 

16:14 - October 15, 2018

శ్రీకాకుళం : ఆపదలో ఉన్న సమయంలో ఏమి చేస్తాం ? అంటే ఆదుకుంటాం..ఇంకేం చేస్తాం ? అంటారు కదా..కానీ ఆపదలో ఉండి..అన్నీ కోల్పోయిన వారిని ఇంకా పీల్చేస్తున్నారు. తినే ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏపీ రాష్ట్రంపై తిత్లీ తుపాన్ ఎలాంటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే. ప్రధానంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయింది. భారీ ఆస్తినష్టం సంభవించింది. కరెంటు స్తంభాలు..చెట్లు..ఇళ్లు కూలిపోయాయి. దీనితో ఎంతో మంది నిరాశ్రలయ్యారు. వీరిని ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలకు దిగుతోంది. కానీ ఎంతో మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తుపాన్ తీవ్రత తగ్గింది..నాలుగు రోజులైంది...అయినా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. 
కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన వారే నిలువునా దోచేస్తున్నారు. రవాణా లేకపోవడంతో నిత్యావసర వస్తవుల ధరలను అమాంతం పెంచేస్తూ డబ్బులను దండుకోవాలని చూస్తున్నారు. దీనితో సామాన్యుడు దిగాలుతో కృంగిపోతున్నాడు. సర్వస్వం కోల్పోయిన వారు ఏమి తినాలో..ఎలా బతకాలో తెలియలేక బిక్కుబిక్కుమంటున్నాడు. ఏకంగా గుడ్డు రూ. 5 పలుకుతోందంట. మొన్నటి వరకూ 20లీటర్ల వాటర్ క్యాన్ రూ.10 నుంచి రూ.20 అయితే.. ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. కిలో టమాట ఏకంగా రూ. 40 పలుకుతోందని తెలుస్తోంది. పాలు..పెట్రోల్ ధరలను కూడా పెంచేశారని తెలుస్తోంది. 

15:52 - October 15, 2018

ఢిల్లీ : సాధారణంగా సినిమాలలో హీరోలకు, విలన్లకు డూప్ లను చూస్తుంటాం. అబ్బ భలే చేసారే అనిపిస్తుంది. కానీ మనిషిని పోలిన మనిషులు ఏడుగురు వుంటారని పెద్దలు చెబుతుంటారు. కానీ అటువంటివారిని ఒకేచోట చూస్తే మాత్రం సినిమాలలో చూసినదానికంటే వాస్తవంగా చూస్తే మాత్రం ప్రపంచంలో ఎనిమిదో వింత చూసినంత సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. అదే సెలబ్రిటీలైతే ఆ ఆశ్చర్యానికి అంతే వుండదు. కానీ ఇప్పుడు నాయకుల డూప్ ల కాలం వచ్చింనట్లుగా వుంది.అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాదిరే ఉన్న ఆ వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మన ప్రధాని నరేంద్రం మోదీ వంతు వచ్చింది. అచ్చం ఆయన మాదిరే ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోదీని పోలిన వ్యక్తి టీషర్ట్ ధరించి, మంచూరియా తయారు చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి పేరు కానీ, వివరాలు కానీ తెలియరాలేదు. మన ప్రధాని గతంలో పకోడీలు అమ్మినట్లుగా తెలుసు. కానీ ఇప్పుడు మన తాజా డూప్ మోదీ మాత్రం మంచూరియా తయారు చేసిన అమ్ముకుంటున్నాడు. ఏది ఏమైనా ప్రపంచంలో వింతలకు మాత్రం లోటు లేదు. మనిషి మేథస్సు ఎంతగా పెరిగినా కొన్ని వింతలను రహస్యాలను మాత్రం మనిషి మేథస్సుకు అందకుండా వుంది. ఏది ఏమైనా ఈ నాయకుల డూప్ లను మాత్రం ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. 

15:25 - October 15, 2018

రాజమండ్రి: తీవ్ర ఉత్కంఠ పరిణామాల నడుమ ఎట్టకేలకు జనసేన కవాతు ప్రారంభమైంది. పోలీసుల ఆంక్షలను పట్టించుకోని జనసైనికులు కవాతును ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక జనసైనికుల్లో నూతనోత్సాహం నింపింది. కవాతు కోసం జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పిచ్చుకలంక జనసంద్రంగా మారింది. ధవలేశ్వరం బ్యారేజీపై మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభమైంది. దాదాపు గంటన్నరసేపు ఈ కవాతు సాగనుంది. కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే ఆయన ఏం మాట్లాడతారు, ఏయే అంశాల గురించి ప్రస్తావిస్తారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా రాజమండ్రి రూరల్‌లో పవన్ ఈ సభలో మాట్లాడుతున్నారు. 

కాగా అంతకుముందు ధవలేశ్వరం బ్యారేజీపై ‘జనసేన కవాతు’కు రాజ మహేంద్రవరం పోలీసులు నో చెప్పారు. కవాతుకు అనుమతిని నిరాకరిస్తూ నోటీసులు జారీచేశారు. కవాతు నిర్వహించేందుకు ధవలేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని పోలీసులు అందులో పేర్కొన్నారు. బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని అందులో వెల్లడించారు. యాత్రకు దాదాపు 3లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందనీ, కాబట్టి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. రాజమండ్రిలోని పిచ్చుకలంక నుంచి కాటన్ విగ్రహం వరకూ 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనుంది. అనంతరం కాటన్ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. అయితే ఈ స్థలంలో 10,000 మంది మాత్రమే సరిపోతారనీ, అంతకుమించి ప్రజలు హాజరైతే తొక్కిసలాట చోటుచేసుకునే ప్రమాదముందని పోలీసులు నోటీసులో హెచ్చరించారు. కాబట్టి బహిరంగ సభ కోసం మరో ప్రాంతాన్ని చూసుకోవాలని సూచించారు. అయిన అవేవీ జనసేన అధినేత లెక్కచేయలేదు. చెప్పినట్టుగానే కవాతు ప్రారంభించారు.

15:24 - October 15, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తున్న చిత్రం ‘అరవింద సమేత’పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవలే ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. వంద కోట్ల క్లబ్‌లోకి చేరి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలోని పలు ప్రజా సంఘాలు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంపై సినీ పరిశ్రమ కక్ష గట్టిందని, కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని మరలా చూపెడుతూ రెచ్చగొడుతున్నారని తెలిపారు. వెంటనే అభ్యంతకర సన్నివేశాలు..మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సీమ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫ్యాక్షన్ సన్నివేశాలు తొలగించాలని లేనిక్షంలో సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి అరవింద చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:20 - October 15, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు జిల్లాలోని పిచ్చుక లంక నుండి ప్రారంభమైంది. మధ్యాహ్నం పిచ్చుకలంక నుంచి కాటన్ విగ్రహం వరకూ 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనుంది. అనంతరం కాటన్ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. మధ్యహ్నాం 3గంటకు ప్రారంభైన కాటమరాయుడు కవాతు కాటన్ విగ్రహం వరకూ కొనసాగనుంది. ఈ కవాతులో వేలాదిమంది జనసేన పాల్గొంది. కాగా పోలీసులు జనసేన కవాతుకు అనుమతిని నిరాకరించారు. అయినా జనసేన తన కవాతులను మాత్రం ప్రారంభించిన కొనసాగిస్తోంది. 
పోలీసులు నోటీసులు పేర్కొన్న అంశాలు : 
జనసేన కవాతులకు రాజమండ్రి పోలీసులు షాక్ ఇచ్చారు. అయినా జనసేన తన కవాతును కొనసాగించింది.   ధవళేశ్వరం బ్యారేజీపై ఈరోజు నిర్వహించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జనసేన కవాతుకు అనుమతిని నిరాకరిస్తూ నోటీసులు జారీచేశారు. కవాతు నిర్వహించేందుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని పోలీసులు నోటీసులో తెలిపారు. బ్యారేజ్ యొక్క పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని ..ఈ కవాతుకు, యాత్రకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందనీ, కాబట్టి అనుమతి ఇవ్వలేమని రాజమండ్రి పోలీసులు స్పష్టం చేశారు. అయినా చివరి గంటలో పోలీసులు అనుమతిని నిరాకరిస్తున్నట్లుగా తెలపటం గమనించాల్సిన విషయం. పోలీసులు నోటీసులకు పట్టించుకోని జనసేన మాత్రం తన కవాతును విజయవంతంగా కొనసాగిస్తోంది. కాగా కాటమరాయుడు కవాతు కాటన్ విగ్రహం వరకూ కొనసాగి జనసేనా ప్రసంగంతో ముగియనుంది.

14:49 - October 15, 2018

ఖమ్మం : పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ వెనుకబాటుకు గురైందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సినీ నటి భూక్యా రేష్మారాథోడ్ అన్నారు. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ పాలకులు అనుసరిస్తున్న విధానాలతో నేటికీ అభివృద్ధి చెందలేదన్నారు. ఆదివారం జూలూరుపాడులో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే వైరా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకుండా దానిని మెదక్‌కు తరలించాలని చూసిందని పేర్కొన్నారు. 

 

14:20 - October 15, 2018

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం మారుమూల గ్రామాలైన గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేటలలో బడి లేదు.. గుడి లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు.. ఎటుచూసినా తాటికమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలు. ఆ గ్రామాలకు సరైన రోడ్లు లేవు. 30 సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పలు పార్టీల నాయకులు రావడమే కానీ ఊరికి చేసినదేమీ లేదంటున్నారు ఆ గ్రామస్తులు.. నిత్యం మోసపు నాయకుల మాటలతో మోసపోతున్నామని..  ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతమంటున్నారు. రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.  గ్రామస్తులు అంతా ఏ పార్టీకి ఓటు వేసేది లేదని తీర్మానం చేసుకున్నారు.

గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేట గ్రామాలలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. తమ ఊరు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధానంగా తమ ఊరిలో కనీస సౌకర్యాలైన తాగునీరు, సాగునీరు , రోడ్లు, బడి, కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి మోసం చేశారని, మద్యం , చీరలు ఎరగా పెట్టి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఊరి కోసం ఏమీ చేయలేదంటూ, తాగునీరు లేక నానా కష్టాలు పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చారు.. ఈ సారి ఏ నాయకుడు వచ్చిన ఎవరికి ఓటు వేసేదీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో బడి లేక మండలానికి వెళ్లాల్సి వస్తుందని, చిన్న పిల్లలను పది కిలోమీటర్ల దూరంలో బడికి పంపలేక పోతున్నామని, చాలా మంది బడిమానేసి ఇంట్లో ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు ఏ అధికారి తమ గ్రామాలకు రారని కేవలం ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలప్పుడే వీరంతా కనిపిస్తారని.. అందుకే ఈ సారి ఎవరూ వచ్చిన తమ సమస్యల పై స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పడే ఓట్లు వేయడానికి ఆలోచిస్తామంటున్నారు..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకూడదని గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నారు.. ఏ పార్టీ నేతలైనా  సరే తమకు నమ్మకం కల్పించనంత వరకు ఓటు వేసేది లేదంటున్నారు గ్రామస్తులు.. మాయమాటలు చెప్పె వారిని ఊరి పొలిమెరల్లోనే తరిమి కొడతామంటున్నారు. 

13:49 - October 15, 2018

నల్లగొండ : మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రణయ్ హత్యపై రోజురోజుకు కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రణయ్ భార్యకు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవలే ఫేస్‌బుక్‌లో ముగ్గురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామంటూ ఓ జంట అమృతను సంప్రదించారు. వరుస ఘటనలతో అమృత భయాందోళనకు గురైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాణహాని ఉందంటూ పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరింది.

ప్రణయ్ హత్య జరిగిన అనంతరం ఆమెకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందని అమృత చెబుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రణయ్ ఇంటికి సాయుధ బలగాల భద్రత కల్పించారు. ఆమె ఇంటి వద్ద ఇద్దరు పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ పటాన్‌చెరుకు చెందిన ఓ జంట ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటున్న అమృతను కలిశారు. ’ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని.. ప్రణయ్, మారుతీరావుకు గత జన్మలో శత్రుత్వం ఉందని ప్రణయ్ చెప్పారు.. పోయిన జన్మలోని వ్యక్తిగత కక్షలతో ఈ జన్మలో నన్ను హత్య చేశాడని... ప్రణయ్ మాతో చెప్పాడు.. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఆయన మాతో చెప్పారు’. అని దంపతులు చెప్పారు. దీంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మాయమాటలు చెప్పి డబ్బులు లాగడానికి వచ్చారా ? లేదా వేరెవరైనా కావాలని వారిని పంపించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

13:28 - October 15, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. నారాయణ్ ఖేడ్ టికెట్ ఆశించి భంగ పడ్డ రాములు నాయక్ తన అసమ్మతిని తెలిపినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవటంతో, నిన్న కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర  వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాతో భేటీ అయ్యారు. కుంతియా నుంచి  స్పష్ట మైన హామీ రావటంతో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు  సిధ్దమయ్యారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా, ఇల్లెందు నియోజక వర్గం నుంచి రాములు నాయక్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతించటంతో ఆయన ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలోంచి టికెట్లు రాని నాయకులు ఇతర పార్టీలకు వలసలు వెళుతున్నారు. అధికార పార్టీలో టికెట్లు రాని నాయకులను ఆకర్షించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్  తనకు ఆందోల్  టికెట్ కేటాయించక పోవటంతో టీఆర్ఎస్కు  రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్లోకి చేరుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే  టికెట్ ఆశించి భంగపడ్డ రాములు నాయక్కు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగించింది. ఈ ఎన్నికల్లో కూడా తనకు టికెట్ కేటాయించక పోవటంతో, రాములు నాయక్ కుంతియా హామీతో  సోమవారం మధ్యాహ్నం  కాంగ్రెస్ లో చేరనున్నారు. 

12:52 - October 15, 2018

హైదరాబాద్: ‘#మీ టూ’ సృష్టిస్తున్న సునామీతో దేశం అల్లకల్లోలం అవుతోంది. సినిమా, మీడియా, రాజకీయ, కార్పొరేట్ రంగాలను ఇది భారీగా కుదిపేస్తోంది. లైంగిక వేధింపుల బారిన పడిన ఎందరో వనితలు గళం విప్పి సోషల్ మీడియా వేదికగా తన బాధలను ప్రజలతో పంచుకుంటున్నారు. దీనిపై ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో కేంద్ర, రాష్ట్ర సర్కర్‌లు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో ఎన్నడూ మన దేశంలో ఇటువంటి న్యాయపరమైన సంకటస్థితి తలెత్తలేదు. మన చట్టాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అన్నది అనుమానమే. అందుకే ‘మీ టూ’ కేసులను విచారణ చేసేందుకు తక్షణ చర్యగా కేంద్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నలుగురు రిటైర్డ్ న్యాయవాదులతో ఓ కమిటీని నియమించారు. Image result for me too
వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులపై చట్టం ఏం చెబుతోంది?
సాధారణంగా చెప్పాలంటే..మహిళ ఉద్యోగిని శారీరకంగా, భావోద్వేగం(ఎమోషనల్‌)గా, ఆర్థిక స్వేచ్ఛ, భధ్రతకు భంగం కలిగించడమే సెక్సువల్ హెరాస్‌మెంట్ కిందకు వస్తుంది. న్యాయపరంగా చెప్పాలంటే... 
1) శారీరకంగా తగలడంతో పాటు కవ్వించే చర్య
2) లైంగిక ఉద్దేశ్యాన్ని కలిగించే విధంగా మాట్లాడటం 
3) లైంగిక వాంఛతో డిమాండ్ లేదా కోరికలు వెలిబుచ్చడం
4) అశ్లీల చిత్రాలు చూపించడం
5) ఇవికాక ఇష్టపడని లైంగిక సంబంధమైన వ్యాఖ్యలు లేదా వ్యాఖ్యలు లేని ప్రవర్తన 

వీటితో పాటు బాధితురాలు లైంగిక వేధింపులు జరిగినట్టుగా వేదనకు గురైనా..భావించినా, ఆరోగ్య, భద్రత సమస్య తలెత్తినట్టుగా పనిచేసే చోట భావించినా..లైంగిక వేధింపులుగానే పరిగణించబడుతుంది. 

Image result for sexual harassment at work placeఅలాగే... యజమాని కానీ.. బాధితురాలితో కలిసి పనిచేసే వ్యక్తులు కాని తమ చర్యల ద్వారా లేదా మాటల ద్వారా లేదా సంజ్ఞల ద్వారా బాధితురాలికి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తే దాన్ని లైంగిక వేధింపులుగానే పరిగణిస్తారు. 
2013 లైంగిక వేధింపుల చట్టం ఇదే చెబుతోంది! 
నీ కిది నాకిది (క్విడ్ ప్రో కో) గురించి కూడా అంటే ఇచ్చి పుచ్చుకొనే దానిపై కూడా ఈ చట్టం సవివరంగా వివరించింది. కొన్ని పరిస్థితులకు తలోగ్గి మహిళా బాధితురాలు ఇష్టపూర్వకంగా సమ్మతించినా అది లైంగిక వేధింపుల కిందే భావించబడుతుంది. ఈ చట్టంలో ఇది చాల ముఖ్యమైన నిబంధన ఎందుకంటే నిందితుడు తన వాదనను బలపరుచుకొనేందుకు ఇష్టపూర్వక చర్యగా పేర్కొనవచ్చు. ఈ వాదనలో బాధితురాలు యొక్క వాదనకే ఎక్కువ బలాన్ని చేకూర్చేందుకు చట్టం వీలు కల్పించింది.  ఈ చట్టం ప్రకారం శారీరక కలయిక ఒక్కటే లైంగిక వేధింపులు కాదు... తిట్టడం, శారీరక కోర్కెలు వ్యక్తపరిచే విధంగా జోకులు పేల్చడం, లైంగికంగా భావాలు వ్యక్తీకరించడం, అశ్లీల చిత్రాలను షేర్ చేయడం, వ్యక్తిగత ఖ్యాతికి భంగం కలిగిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడంతో పాటు ఎటువంటి చర్య అయినా పనిచేసే ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయటాన్ని లైంగిక వేధింపుల కిందే భావిస్తుంది ఈ చట్టం. 

Image result for sexual harassment at work placeఈ చట్ట ప్రకారం.. ఏదేని వ్యక్తి పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిరూపించబడితే అతనికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 కింద 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 
అయితే ఈ చట్టంకానీ.. చట్టం రూపొందించిన మార్గదర్శకాలు కానీ  ఎక్కడా ఎంత సమయంలోపు లైంగిక వేధింపుల కేసు రిజిస్టర్ చేయాలి అనేది నిర్ధారించలేదు. కాబట్టి ఎంత కాలం తర్వాతైనా ఫిర్యాదు చేయవచ్చు అని అర్థం చేసుకోవాలి. 
2013 లైంగిక వేధింపుల చట్టం ఎలా వచ్చింది?

  • 1997 లో మొదటిసారి ఈ చట్టం అవసరాన్ని గుర్తించారు
  • ఈ చట్టం రూపొందించడానికి ఉపయోగపడింది కేవలం ఒక పిటీషన్
  • ‘విశాఖ’ అనే స్వచ్ఛంధ సంస్థ రాజస్థాన్‌లో 1992లో జరిగిన ఒక గ్యాంగ్‌రేప్ కేసును సుప్రీంకోర్టులో 1997లొ సవాల్ చేసింది.
  • దీంతో పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఐపీసీ సెక్షన్ 354 కింద 509 కింద డీల్ చేయాలని కోర్టు భావించింది. 
  • సెక్షన్ 354 అంటే మహిళలు గౌరవంగా జీవించే హక్కును కాలరాయడం. సెక్షన్ 509 ఏం చెబుతోందంటే.. భావ వ్యక్తీకరణ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ లేదా మహిళల అవమానానికి గురిచేసే చర్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయి.
  • రాజస్థాన్‌ సంఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత ‘విశాఖ’ అనే స్వచ్ఛంధ సంస్థ రూపొందించిన మార్గదర్శకాల ద్వారా.. సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్‌ వర్క్‌ప్లేస్ (ప్రివెంక్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెశల్) చట్టం, 2013 ను పార్లమెంటు ఆమోదించింది. 
12:47 - October 15, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాను ఉద్దానం కిడ్నీ బాధితులకు శాపంగా మారింది. ఉద్దానం కిడ్నీ బాధితులపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కరెంటు లేకపోవడంతో సోంపేట డయాలసిస్ కేంద్రం పనిచేయడం లేదు. డయాలసిస్ అందుబాటులో లేక కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ డయాలసిస్ కేంద్రాలకు వెళ్లలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మార్గాలు లేకపోవడంతో కిడ్ని రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  

 

12:42 - October 15, 2018

ముంబై : మీటూ..దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సైతం ఆ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు గతంలో ఎదురైన దారుణ ఘటనలను పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా బాలీవుడ్ లో తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ పలువురు హీరోయిన్లు..సింగర్్స..ఇతరులు ముందుకొస్తున్నారు. దీనితో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అవుతోంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై తను శ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ప్రారంభమైంది. తాము కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యాయమని పలువురు నటులు..దర్శకులపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
Image result for meeto saif ali khanతాజాగా ఈ జాబితాలో నటుడు సైఫ్ ఆలీఖాన్ కూడా చేరారు. తాను కూడా వేధింపులకు గురయ్యాయని సైఫ్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం జరిగిందని, కానీ అవి లైంగిక వేధింపులు మాత్రం కాదన్నారు. ఆ వేధింపులను తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు మండిపోతుందన్నారు. మీటూ ఉద్యమం ద్వారా ఇతరుల తప్పొప్పులు..వారి నిజస్వరూపాలు బయటపడుతాయని, ఎలాంటి వేధింపులో తాను ప్రస్తుతం బయటపెట్టలేనని..తాను సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తినని తెలిపారు. సినీ పరిశ్రమలో ఏదీ జరిగినా మంచికేనని, ఎవరైనా ఎవరైనా ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తాను చూస్తూ ఊరుకోనని తెలిపారు. మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లయితే బయటకు వచ్చాయో... ఇకపై వారితో కలసి పని చేయబోనని సైఫ్ తేల్చిచెప్పారు. 

12:22 - October 15, 2018

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గోనెసంచిలో పెట్టి కాల్చి వేశారు. చెన్నాపురం చెరువులో నీళ్లు లేని గుంతలో కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలిన గాయాలతో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిని హత్య చేసి గోనెసంచిలో పెట్టి కాల్చి వేశారు. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీమ్‌తో 
ఘటనాస్థలికి చేరుకుని సమాచారాన్ని సేకరిస్తున్నారు. చుట్టుపక్కలున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతుడు 30 నుంచి 35 వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు కారణం ప్రేమ వ్యవహారామా? లేదా మరేదైనా కారాణాలున్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

12:11 - October 15, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిత్లీ తుపాన్ బీభ్సత్సం సృష్టించింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ఈ తుఫాన్ తో ప్రాణ నష్టంతో పాటు అరటి తోటలు..కొబ్బరి చెట్లు..ఇళ్లు నేలకూలిపోయాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకొనేందుకు ముందుకు రావాలని బాబు పిలుపునిచ్చారు. 
Image result for titli srikakulamబాబు పిలుపుతో పలువురు విరాళం..సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఏదైనా కష్టమొస్తే తామున్నామంటూ టాలీవుడ్ పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ఈ సందర్భంగా తిత్లీ తుపాన్ కు కూడా పలువురు హీరోలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, సంపూర్ణేశ్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి తమ సాయాన్ని ఏపీ సీఎం రిలీఫ్‌కు ప్రకటించారు. తాజాగా నందమూరి సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సాయాన్ని ప్రకటించారు. తిత్లీ బాధితుల కోసం ఎన్టీఆర్ రూ.15 లక్షల సాయం, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించారు. కేరళలో వచ్చిన భారీ వరదలతో నష్టపోయిన వారి కోసం కూాడా గతంలో ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

11:38 - October 15, 2018

కరీంనగర్ : జిల్లాలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ఎందుకంటే వారి సంఖ్య ప్రస్తుతం అధికంగా ఉంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు నమోదైన జాబితాలో 8,90,229 ఓటర్లున్నారని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ ప్రకటించారు. అందులో 4,43,342 మంది పురుషులుండగా 4,46,832 మంది మహిళలున్నారని వెల్లడించారు. 55 మంది ఇతర ఓటర్లున్నారని, ఓటర్ల జాబితా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచామనీ తెలిపారు. ఇటీవలే ఓట్లు గలంతయ్యాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం..దీనిపై కోర్టు విచారించడం జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గత నెల 10వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 8,08,282 ఓటర్లుంటే ప్రత్యేక ఓటర్ల నమోదు..సవరణల అనంతరం జిల్లా వ్యాప్తంగా 81,947 ఓటర్లు పెరిగారు. 
Image result for collector sarfarazసెప్టెంబర్ 10 వరకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 4,06,825 మంది పురుషులు ఉండగా 4,01,420 మంది మహిళలున్నారు. కొత్తగా ఓటర్లకు అవకాశం కల్పించడంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. 1,01,682 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీటిని విచారణ అనంతరం 19,735 అనర్హులని తొలగించారు. మొత్తంగా 8,90,229 మంది ఓటర్లున్నారు. చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఓటర్ల నమోదులో మహిళలు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. Image result for collector sarfaraz meeting voters list
మరోవైపు ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి నామినేషన్ల చివరి రోజు (నవంబర్ 19) వరకు కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఓటరు నమోదు కొనసాగుతుందని అధికారులు పేర్కొనడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సప్లమెంటరీ-2 జాబితాలో చేర్చి తుది జాబితాను విడుదల చేస్తారు. 
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఓటర్ల సంఖ్యపై పలు విమర్శలు గుప్పించాయి. కరీంనగర్ నియోజకవర్గంలోనే 95వేల ఓట్లు మాయమయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. 2014లో 15,50,834 ఓటర్లు ఉంటే, ప్రస్తుతం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 13,23,433 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, మిగతా 2 లక్షల పైచిలుకు ఓట్లు ఎక్కడికి పోయాయని ఆ పార్టీ నేత పొన్నం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
- తూపురాణి మధుసూధన్

11:23 - October 15, 2018

ఢిల్లీ : టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ భారత్‌ తరపున ఏడుగురు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఆ తర్వాత స్థానాన్ని ఉమేశ్‌ ఆక్రమించాడు. 

హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన ఉమేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించాడు. ఫలితంగా తొలిసారి 10 వికెట్లను సాధించాడు. అంతకముముందు కపిల్‌దేవ్‌, చేతన్‌ శర్మ, వెంకటేశ్‌ ప్రసాద్‌, జవగళ్‌ ప్రసాద్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు మాత‍్రమే టీమిండియా తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన పేసర్లు. కాగా, కపిల్‌దేవ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు రెండేసి సార్లు ఆ ఘనత సాధించారు. 

10:48 - October 15, 2018

అమెరికా : వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతిభావంతులే తమ దేశంలోకి ప్రవేశించాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద నేను కఠినంగా ఉంటా... విదేశీయులు మా దేశంలోకి చట్టబద్దంగా మాత్రమే రావాలి.. అక్రమంగా కాదు.. వారు ప్రతిభ ప్రాతిపదికన రావాలని కోరుకుంటున్నానని వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్‌ తెలిపారు. ఈ ప్రతిపాదన వల్ల భారత్‌ వంటి దేశాల నుంచి వెళ్లే సాంకేతిక నిపుణులకు ప్రయోజనం కలగనుంది. 

 

10:40 - October 15, 2018

పశ్చిమ గోదావరి: టోర్నడో...దీనిని భారీ సుడిగాలి అంటారు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో ఎక్కువగా కనిపించే టోర్నడో ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపించి స్ధానికులను కొద్దిసేపు భయభ్రాంతులకు గురి చేసింది. విదేశాల్లో వచ్చే టోర్నడోల తాకిడికి భారీ నష్టాలు జరుగుతూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరులో గోదావరి తీరం వద్ద ఆదివారం సాయంతం టోర్నడో ఏర్పడింది. దీని ప్రభావంతో ఇసుక సుడులు తిరుగుతూ గాల్లోకి లేచింది. ఇది చూసిన మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరో వైపు  తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం గొమ్ముఅయ్యవారిగూడెం పరిధిలోకూడా ఈటోర్నడో కనిపించింది. దీన్ని గమనించిన కొందరు యువకులు తమ సెల్ ఫోన్ లలో ఫోటో తీశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.  
2017వ సంవత్సరం సెప్టెంబర్ 6న కూడా జిల్లాలోని ఆకివీడు మండలం కోళ్లపర్రు, గుమ్ములూరులో టోర్నోడోలు కనిపించాయి. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన టోర్నడోల ధాటికి సముద్రంలోని, చెరువుల్లోని చేపలు, రొయ్యలు గాల్లోకి వెళ్ళి తిరిగి జనావాసాలపై  వర్షంలాగా కురవడం మనం చూశాం. 2016 జులై 31న  కరీంనగర్ లోని దిగువ మానేరు జలాశయంలో కూడా టోర్నడో ఏర్పడింది  ఆసమయంలో నీరుసుడులు తిరుగుతూ పైన మేఘాలను తాకింది.

10:39 - October 15, 2018

బెంగళూరు : రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల ఎదుటే స్కూల్ ప్రిన్సిపల్ ను చంపేశారు. దీనితో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బెంగళూరులోని అగ్రహార దసహళ్లిలోని హవనూర్ పబ్లిక్ స్కూల్ లో చోటు చేసుకుంది. హవానూర్ పబ్లిక్ స్కూల్ కు 60 వయస్సు కలిగిన రంగనాథ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్ లో విద్యార్థులకు క్లాస్ లు చెబుతుంటారు. యదావిధిగా ఆదివారం పదో తరగతి విద్యార్థులకు రంగనాథ్ క్లాస్ చెబుతున్నారు.
qpbdmfq8ఆ సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు ధరించి క్లాస్ రూంలోకి ప్రవేశించారు. క్లాస్ రూంలోనే ఆయనపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. రంగనాథ్ అక్కడకికక్కడే కూలిపోయి మృతి చెందాడు. కళ్లెదుటే ఘోరం జరిగిన ఘోరాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోనలకు గురయ్యారు. 
స్కూల్ లో ప్రవేశించే సమయంలో సెక్యూరిటీ గార్డుపై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మహాలక్ష్మీ లేఅవుట్ ప్రాంతంలో ఓ నిందితుడ్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను  పోలీసులు పరిశీలిస్తున్నారు. 

10:30 - October 15, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే కవాతు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి జనసేన కవాతు ప్రారంభం కానుంది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు బ్యారేజీ పై రెండున్నర కిలోమీటర్ల వరకు జనసేన కవాతు జరగనుంది. సాయంత్రం 5గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి దగ్గర పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది..

రాజకీయ జవాబుదారితనమే జనసేన కవాతు ఉద్ధేశ్యమన్న పవన్ కల్యాణ్  నవతరం రాజకీయాల కోసమే జనసేన ప్రజాపోరాటయాత్ర చేస్తుందన్నారు. కవాతులో పాల్గొనబోతున్న జనసైనికులందరికి ట్విట్టర్ ద్వారా పలు సూచనలు చేశారు పవన్. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి, ఒక క్రమశిక్షణతో ముందుకు వెళదాం, కలిసి నడుద్దాం, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజ్‌ పై నిర్వహిస్తున్న జనసేన కవాతుకు రెండు లక్షల మంది వస్తారని పార్టీ నాయకుల అంచనా. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి కవాతు ప్రారంభమై ధవళేశ్వరం కాటన్‌ విగ్రహం వరకు సాగుతుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ నేతలు. ధవళేశ్వరం-వేమగిరి రోడ్డు ఫేసింగ్‌లో సభ నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చే అభిమానులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఎక్కడికక్కడ తాగునీరు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ కవాతుకు సంబంధించి ఇరిగేషన్‌, పోలీస్‌, మత్స్యశాఖ, రెవెన్యూశాఖల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని జనసేన నాయకులు తెలిపారు..

బ్యారేజ్‌వద్ద కవాతు జరిగే సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్‌కు ఇరువైపులా గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు పార్టీ నాయకులు.. కవాతుకు వచ్చినవారు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని, 1200మంది వలంటీర్లను నియమంచామని, కవాతు జరిగే ప్రదేశం నుంచి సభ జరిగే ప్రాంతం వరకు 15 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు..

10:07 - October 15, 2018

హైదరాబాద్ : దసరా..దీపావళి..పండుగలను క్యాష్ చేసుకోవాలని...వివిధ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆన్ లైన్ లో వివిధ డిస్కౌంట్లు..ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆన్ లైన్ లో కొద్ది రోజుల్లోనే 40 లక్షలకు పైగా సెల్ ఫోన్ లు విక్రయాలు జరిగాయని సమాచారం. అమెజాన్..ప్లిఫ్ కార్టు..ఇతర సంస్థలు ఆన్ లైన్ లలో హావా కొనసాగిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. యోనో యాప్ ను ముందుకు తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్ లో కొనుగొళ్లు జరిపే వారికి భారీ రాయితీలు..క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 16 నుండి 21 మధ్య యోనో ద్వారా జరిపే కొనుగోళ్లపై పది శాతం రాయితీ..క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, నగలు, ఫ్యాషన్, గిఫ్ట్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో పలు ఆఫర్లు ఉన్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే ఈ కామర్్స సంస్థలు యోనోతో 85 శాతం మేర ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. మరి ఈ పండుగ సీజన్ లో ఎస్‌బీఐ ఎలాంటి ఫలితాలు కనబరుస్తుందో చూడాలి. 

09:59 - October 15, 2018

గుంటూరు : ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 17, 18, 19 తేదీల్లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొనాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం 'వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌' కార్యక్రమంలో 'భారతదేశ వ్యవసాయ రంగం-టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై' కీనోట్‌ ప్రసంగం ఇవ్వాలని లోకేశ్‌కు ఆహ్వానం అందింది. అయితే.. తిత్లీ తుపాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటిస్తుండడంతో అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. శ్రీకాకుళంలో పరిస్థితులు మెరుగుపడే వరకు లోకేశ్‌ అక్కడే ఉండి పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. 

 

09:48 - October 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ‘ముందస్తు’ హడావుడి నెలకొంది. వివిధ పార్టీల కీలక నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. 90 శాతానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థి పార్టీలను కంగుతినిపించిన గులాబీ అధిపతి కేసీఆర్.. ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాకముందే ప్రచార పర్వంలోకి దిగిపోయారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. వరంగల్ సభను పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. 
ఇటీవలే ఈసీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేసింది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..11న ఫలితాల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే డిసెంబర్ 7కు సమయం కొద్దిగానే ఉండడంతో కేసీఆర్ ప్రకటించిన 50 రోజుల్లో వంద సభలు పూర్తవుతాయా ? అనే చర్చ జరుగుతోంది.
Image result for kcr in nalgonda electionకానీ దసరా పండుగ తరువాత కేసీఆర్ పూర్తిగా ప్రచార పర్వంలో దిగుతారని తెలుస్తోంది. ఈ పండుగ సీజన్ లో ప్రజలు ఎక్కువ శాతం ఇతర ఊర్లలోకి వెళుతారని..ఈ సమయంలో ప్రచారం నిర్వహిస్తే అంతగా సక్సెస్ కాదని కేసీఆర్ యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పటివరకూ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను అభ్యర్థులే చూసుకోవాలని గులాబీ బాస్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పండుగ అనంతరం కేసీఆర్ విశ్వరూపం చూపెడుతారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. పండుగ తరువాత జిల్లాల స్థాయిలో బహిరంగసభలు నిర్వహిస్తారని..అనంతరం నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
Image result for kcr angryటీఆర్ఎస్ ను ఓడగొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయి. దీనికి మహా కూటమి పేరు పెట్టి కలిసి బరిలోకి దిగనున్నాయి. కాంగ్రెస్..టిడిపి..టీజేఎస్,సీపీఐ..ఇతర పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. కానీ ఈ పార్టీల మధ్య ఇంకా పొత్తులు ఖరారు కాలేదు..అలాగే అభ్యర్థుల విషయాల్లో తర్జనభర్జనలు పడుతున్నాయి. పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పలు ఆంక్షలు విధిస్తోందని..దీనితో మహా కూటమి ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మహా కూటమిపై కేసీఆర్ తీవ్రంగా విరుచుక పడుతున్న సంగతి తెలిసిందే. మరి పండుగ తరువాత కేసీఆర్ ఎలాంటి ప్రచారం నిర్వహిస్తారో వేచి చూడాలి. 
-తూపురాణి మధుసూధన్

09:40 - October 15, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ఓటర్లందరి పేరిట లేఖలు రాయనున్నారు. శాసనసభ ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని, సమతులాభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ గెలిపించాలని కోరుతూ కేసీఆర్‌ రాష్ట్రంలోని ఓటర్లందరి పేరిట లేఖలు రాయనున్నారు. ఈ నెలాఖరులో వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సందర్బంగా ప్రతి ఇంటికి టీఆర్‌ఎస్‌ సందేశం చేరాలని భావిస్తున్న కేసీఆర్‌.. ఇప్పటికే పార్టీ శ్రేణుల ద్వారా ప్రచారానికి ఆదేశించారు. 

కొత్త ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో రెండు కోట్ల 73 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లకు లేఖలు రాయడం ద్వారా వారికి చేరువ కావచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే దీనిపై దృష్టి సారించిన నేతలు.. లేఖలో ఏయే అంశాలు ఉండాలనే దానిపై చర్చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు.. రాష్ట్ర వృద్ధిరేటు, ఇతర అంశాలను పొందుపర్చాలని నిర్ణయించారు. లేఖలు తెలుగుతో పాటు ఉర్దూ భాషల్లో ముద్రించనున్నారు. 

 

09:28 - October 15, 2018

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. బౌలింగ్ చేస్తున్న సమయంలో రక్తపు వాంతులు అవుతున్నాయి. ఇతని ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా ఇలా అవుతోందని తెలుస్తోంది. బౌలింగ్ చేసే సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం ఎగజిమ్మి బయటకు పడుతోంది. కానీ దీనివల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఖచ్చితంగా మాత్రం చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తపు వాంతులు అవుతుండడంతో హేస్టింగ్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తాను బాక్సింగ్..రోయింగ్ చేయడం..బరువులు ఎత్తడం..ఇతరత్రా పనులు చేస్తానని...కానీ బౌలింగ్ చేసే సమయంలోనే ఇలా ఎదురవుతోందని హేస్టింగ్స్ వాపోతున్నాడు. ఇకపై బౌలింగ్ చేస్తానో లేదో తెలియదని పేర్కొంటున్నాడు. జాన్ హేస్టింగ్స్ ఇప్పటివరకూ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 9 టీ-20 మ్యాచ్ లు, 29 వన్డేలు ఆడాడు. 

 

09:12 - October 15, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ దసరా కలిసొచ్చింది. ఆయన నటించిన ‘అరవింద సమేత’ ఇటీవలే విడుదలై బాక్సా:ఫీస్‌ను షేక్ చేస్తోంది. రికార్డులు బద్దలు కొడుతుండడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుష్ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ నెల 11న విడుదలైన ‘అరవింద సమేత’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి పోటీగా ఏ చిత్రం లేకపోవడంతో హావా కొనసాగుతోంది. ఏ తెలుగు హీరోకూ సాధ్యంకాని రికార్డును ఈ యంగ్‌టైగర్ సొంతం చేసుకున్నాడు. వ‌రుస‌గా నాలుగు మూవీలు వంద కోట్ల‌ను రాబ‌ట్టిన హీరోగా ఎన్టీఆర్ చ‌రిత్ర సృష్టించాడు.
అరవింద సమేత విడుదలైన అనంతరం రూ. 100 కోట్లు సాధించి తన సత్తా ఏంటో చూపెట్టాడు. నాన్నకు ప్రేమతో..జనతా గ్యారేజ్, జై లవకుశ చిత్రాలు కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. అమెరికాలో సైతం దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రూ. 1.7 మిలియన్ డాలర్లు  వసూలు చేసినట్లు టాక్. ఈ సినిమా గురించి ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ దర్శకత్వం, సంగీతం..ఇతర నటీ నటుల నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధానంగా ప్రతినాయకుడిగా నటించిన జగపతిబాబు నటనను మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. హారికా, హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చిన‌బాబు ఈ మూవీని నిర్మించాడు.
సమీపంలో మరో చిత్రం లేకపోవడంతో అరవింద మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని, దసరా సెలవుల నేపథ్యంలో బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నెల 18న హీరో రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 

08:40 - October 15, 2018

కువైట్‌ : కువైట్‌లో కడప జిల్లావాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యజమాని వేధింపులు, పని ఒత్తడి తట్టుకోలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లికి చెందిన గండికోట ఆనంద్ జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. కువైట్ సేట్ వేధింపులు, పని ఒత్తిడి తట్టుకోలేక మహబుల్ల ఏరియాలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

 

08:40 - October 15, 2018

చిత్తూరు:కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు  తిలకించడానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో  భాగంగా 6వ  రోజు సోమవారం  మలయప్ప స్వామి ఉదయం 9 గంటలకు  హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించునున్నారు.  రామాయణంలో  హనుమంతుడి స్ధానం  చాలా ప్రముఖమైనది.  హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. తిరుమలలో  సోమవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది.  స్వామి వారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సర్వ, దివ్య దర్శనం భక్తులకు టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది. ఉచిత దర్శనానికి 20 గంటలు, సర్వ, దివ్య ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.  ఉదయం హనుమంతవాహానం పై  విహరించిన స్వామి వారు  సాయంత్రం పుష్పపల్లకిపై  ఊరేగనున్నారు. రాత్రికి  మలయప్ప స్వామి గజవాహనంపై  తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

07:46 - October 15, 2018

విశాఖపట్నం: సెప్టెంబర్ 23న విశాఖ  జిల్లా సర్రాయి  వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే  సివేరి సోమల హత్య కేసులో 4 గురు నిందితులను  అరెస్టు చేసినట్లు  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌ చీఫ్‌)అధికారి  ఫకీరప్ప, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన  నాయకులే ఈహత్యలో మావోయిస్టులకు సహకరించారని వారు తెలిపారు. డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు–ఈశ్వరి దంపతులతో  పాటు గెమ్మిలి శోభన్, కొర్ర కమలలు ఈహత్య కేసులో కీలక నిందితులను వారుచెప్పారు. వీరు ఇచ్చిన పక్కా సమాచారంతోనే మావోయిస్టు పార్టీ కోరాపుట్‌ డివిజన్‌ దళం పక్కా వ్యూహంతో  లివిటిపుట్టు వద్ద ఈ దారుణానికి పాల్పడిందని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన నలుగురు గతంలో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ప్రొటక్షన్‌ గిరిజన రైట్స్‌ (ఓపీజీఆర్‌) గ్రూపులో పనిచేసినట్టు సిట్‌ అధికారి ఫకీరప్ప తెలిపారు. గత రెండేళ్లుగా ఎదురు కాల్పులు, పోలీసుల ఎదుట మావోల లొంగుబాటు కారణంగా ఏజెన్సీలో ఉనికి చాటుకోడానికి ప్రముఖ వ్యక్తల కదలికల సమాచారాన్నిఇవ్వమని మావోలు వీరిపై ఒత్తడి తెచ్చినట్లు ఫకీరప్ప చెప్పారు. అరెస్టు చేసిన నిందితుల వద్దనుంచి మావోయిస్టులు ముద్రించిన 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు,10 కిలోల సామర్థ్యం కలిగిన ఓ మందుపాతర, ఎలక్ట్రికల్‌ వైరును స్వాధీనం చేసుకున్నామని సిట్‌ చీఫ్‌ తెలిపారు. కాగా కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలపై ఇంతవరకు మవోయిస్టు పార్టీ ఎటువంటి ప్రకటన చేయకపోవటం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట మావోలు విడుదల చేసిన లేఖపై సందేహాలు వస్తున్నందున ఆ లేఖ అసలుదా? లేక నకిలీదా? అని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. 

07:34 - October 15, 2018

హైదరాబాద్ : తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తుపాను బాధితులకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతేకాకుండా తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న సిక్కోలును ఆదుకోవావడానికి ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో పలువురు అభిమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విజయ్‌దేవరకొండపై ప్రజలు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి మరింతమంది ముందుకు వచ్చి శ్రీకాకుళం ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇటీవలే వరదలతో అతలాకుతలమైన కేరళకు విజయ్‌దేవరకొండ రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన సంగతి తెలిసిందే.

 

Don't Miss