Activities calendar

16 October 2018

21:42 - October 16, 2018

జగిత్యాల: ప్రేమ జగడాలు విషాదానికి దారితీస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు... ప్రాణాలు హరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది.
 పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తులు పడుతున్నాయి. చదువుకోవాల్సినవారు ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి చిక్కుల్లో పడుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో పక్షం రోజుల వ్యవధిలో ముగ్గురి యువకుల ప్రాణాలు ప్రేమ వ్యవహారాలకు బలికావడం తీవ్ర కలకలం రేపింది.

జగిత్యాల జిల్లా తాటిపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాధినేని నవీన్, శ్రవణ్ అనే యువకులు మద్యం సేవించారు. తర్వాత మాటమాట పెరగడంతో ఇరువురు కత్తులతో పరస్పరం దాడికి దిగారు. ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత శ్రవణ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనాస్థలిని డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు.  కాగా నవీన్‌ను చంపడానికి ఉపయోగించిన కత్తిని శ్రవణ్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడని తేలింది. గతంలో రెండుసార్లు శ్రవణ్, నవీన్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రవణ్ ఆన్‌లైన్‌లో కత్తిని బుక్‌చేసి తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 

21:27 - October 16, 2018

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ స్పందించింది. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలను ప్రజలకు ఇస్తుందో.. వాటిని మక్కీకి మక్కీ దించేశారని ఎద్దేవా చేశారాయన. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కలిగిందన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పథకాలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారని ఉత్తమ్ అన్నారు. మేము పథకాలను ప్రకటిస్తే హేళన చేశారు మరిప్పుడు అవే పథకాలను ఎలా ప్రకటించారని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఆసరా పెన్షన్లను రెట్టింపు చేస్తామంటే కేసీఆర్, కేటీఆర్ తమను ఎద్దేవా చేశారని.. ఇప్పుడు పెన్షన్లను డబుల్ చేస్తామని హామీ ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ఉత్తమ్ ప్రశ్నించారు. అలాగే, నిరుద్యోగ భృతి ఇస్తామని మేం చెబితే.. పెద్ద రాద్ధాంతం చేసిన టీఆర్ఎస్ అధినేత.. ఇప్పుడు తమ దారిలోకే వచ్చారన్నారు. నిరుద్యోగ భృతిపై ఎలా ఇస్తారు? ఎవరిని నిరుద్యోగులుగా గుర్తిస్తారు? లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు 13లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు ఎలా చెబుతారని ఉత్తమ్ నిలదీశారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్.. ఇప్పుడెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారన్న ఉత్తమ్.. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నిజం తెలిసివచ్చిందన్న ఉత్తమ్.. ఇది కాంగ్రెస్ విజయం అని అభివర్ణించారు.

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయని కేసీఆర్.. ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..

* మనిషికి 7కిలోల సన్నబియ్యం
* రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం
* ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం
* దళితులు, గిరిజనులకు సన్నబియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు
* దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

21:06 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై సెటైర్లు విసిరారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వస్తే తాను భయపడతానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు తెచ్చిందే తాను అని..గట్స్  లేనివాడ్నయితే ఎన్నికలు తీసుకొస్తానా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అని అన్నీ సర్వేలు తేల్చాయని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఈ క్రమంలో 100 సీట్లు కంటే ఎక్కువగా గెలవటమే తమ యత్నమన్నారు. అంతేకాదు నాలుగైదు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ లీడింగ్ పార్టీ అని పేర్కొన్నారు. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచామని కేసీఆర్ గుర్తు చేశారు. 

20:43 - October 16, 2018

ఉత్తరప్రదేశ్‌ : రైలు ఇంజన్ మంటల్లో చిక్కుకుంది. కానీ రైల్ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన  డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. ప్యాసింజన్ రైలు ఇంజను మంటల్లో చిక్కుకోవడంతో డ్రైవరు సమయస్ఫూర్తిగా వ్యవహరించి రైల్వే క్రాసింగ్ సమీపంలో నిలిపివేశారు. ఇంజన్ నుంచి పెద్ద ఎత్తున పొగలు బయటకు చిమ్మడం గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడకపోవటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
 

 

20:24 - October 16, 2018

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రులంతా తెలంగాణవారేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న కేసీఆర్.. ఇక్కడ అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని ఆంధ్రులకు చంద్రబాబు శనిలా తయ్యారయ్యారని, చంద్రబాబు ఉడుములా వచ్చి గొడవలు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిపైనా కేసీఆర్ మండిపడ్డారు. జైపాల్ రెడ్డి అంటే గతంలో గౌరవం ఉండేదని, ఇప్పుడా గౌరవం పోయిందని చెప్పారు. వయసు పైబడటంతో జైపాల్ రెడ్డి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలనెవరినీ మార్చమని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రణాళిక కమిటీకి వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చాయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నాలుగేళ్లుగా ప్రజలు కోరిన అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామన్నారు. కాగా ఇప్పుడు విడుదల చేసింది పాక్షిక ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే అని కేసీఆర్ చెప్పారు.

20:23 - October 16, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇది సాధారణమైన వ్యక్తులు పెట్టింది కాదు. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు. ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా..పైకి రావాలన్నా..పేరు తెచ్చుకోవాలన్నా కమిట్ అవ్వాల్సిందే అంటూ శ్రీరెడ్డి పలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వచ్చిందని.. ఆమె తమిళనాటకు వచ్చినప్పుడే ఆమెకు నిరసన తెలిపామని వారాహి తెలిపారు. 

Image result for sri reddyశ్రీరెడ్డి వంటి వారెందరో ప్రముఖులపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని..ఇలాంటి వారి బారి నుంచి అమాయకులైన పురుషులను కాపాడేందుకే ‘మీటూ మెన్’ ప్రారంభించామని వారాహి తెలిపారు. ఐదేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ఓ పారిశ్రామికవేత్తకు, ఓ సినిమా నటికీ మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన సంగతులను వెల్లడించకుండా ఉండాలంటే, తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ శ్రీరెడ్డి బ్లాక్  మెయిల్ చేస్తున్నట్టు ఆ పారిశ్రామికవేత్త తనకు తెలిపారని వారాహి పేర్కొన్నారు. ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కొనేందుకే ఈ ఉద్యమాన్ని ప్రారంభించానని వారాహి స్పష్టం చేశారు.
 

19:46 - October 16, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా వున్న టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోని ఈరోజు కేసీఆర్ విడుదల చేశారు. రైతులకు వరాలు కురిపించిన కేసీఆర్ నిరుద్యోగ భృతి విషయంలో కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో కేసీఆర్ మాట్లాడుతు..ఏ ప్రభుత్వం పెంచని విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల జీతాలను భారీగా పెంచామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకుండా కొందరు కేసులు వేశారని ధ్వజమెత్తారు. చిన్న ఉద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు గాబరా పడొద్దని సూచించారు. తప్పకుండా ఐఆర్ ఇస్తామని, సముచితమైన రీతిలో పెంచుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు చెప్పినవీ చేయలేదని, తాము మాత్రం చెప్పనవి కూడా చేశామని వివరించారు. వందశాతం అమలు చేసే హామీలే ఇస్తున్నామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ వాళ్లు వచ్చేది లేదు చేసేది లేదని, అందుకే అడ్డగోలు హామీలు ఇస్తున్నారంటూ విమర్శించారు.
 

 

19:25 - October 16, 2018

విజయవాడ: ఏపీలో అవినీతి రాజ్యం ఏలుతోందని, పరిపాలన గాడి తప్పిందని, వారసత్వ రాజకీయాలు చెల్లవని టీడీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? అని కూడా పవన్ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లను విమర్శిస్తూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్‌కు ఘాటుగా బదులిస్తున్నారు. 

పవన్‌ కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌పై కవాతు పేరుతో పిచ్చి ప్రేలాపనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలకు ఎదురీదుతూ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జలీల్‌ఖాన్ హెచ్చరించారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైతే ఇంతవరకు వారి కటుంబాలను పరామర్శించే తీరిక పవన్‌కు లేకపోయిందన్నారు. దీన్ని బట్టి చూస్తే గిరిజనులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని జలీల్‌ఖాన్ ధ్వజమెత్తారు.

వారసత్వ రాజకీయాలు చెల్లవు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైనా జలీల్‌ఖాన్‌ స్పందించారు. రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. పవన్‌, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని నిలదీశారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కనీసం 18 సీట్లు అయినా వచ్చాయని గుర్తు చేసిన జలీల్ ఖాన్.. వచ్చే ఎన్నికల్లో పవన్‌కు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌పైనా జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రజాసమస్యల కంటే ప్రభుత్వంపై విమర్శలకే జగన్‌ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో సానుభూతి కారణంగా జగన్ పార్టీకి 67 సీట్లు వచ్చాయని, ఈసారి 30 సీట్లు కూడా కష్టమేనని జలీల్‌ఖాన్‌ జోస్యం చెప్పారు. 

మొత్తంగా పవన్ చేసిన విమర్శలను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. పవన్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయింది.

19:20 - October 16, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లోఎంటరైపోయింది.. ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ మార్క్ దాటేసింది.. తెలుగు రాష్ట్రాల్లో, కొన్నిఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్‌నెలకొల్పింది.. ఇప్పుడు మరో అరుదైన రికార్డు అరవింద సమేత సొంతం చేసుకుంది..
ఆన్‌లైన్ టికెట్స్ బుకింగ్‌లో పాపులర్ అయిన బుక్ మై‌ షోలో, అక్షరాలా 1.2మిలియన్‌ల అరవింద టికెట్లు అమ్ముడుపోయాయి.. ఈ విషయాన్ని స్వయంగా బుక్ మై‌‌షో వారు తెలియచేస్తూ, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసారు.. బాహుబలి తర్వాత బుక్ మై షో లో హైయ్యెస్ట్ టికెట్స్ అమ్మింది ఈ సినిమాకేనని అన్నారు.. ఈ రకంగా అరవింద సమేత మరో రేర్ ఫీట్ సాధించినట్లైంది..

19:13 - October 16, 2018

హైదరాబాద్: రైతన్నలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే రూ.8వేలు అందిస్తున్న విషయంతెలిసిందే..ఈ ఎన్నికల నేపథ్యంలో రూ.10వేలకు పెంచారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే.. మళ్లీ అధికారం ఇస్తే..రైతన్నలకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా ఇస్తున్న ఎకరానికి రూ.4వేల నగదును రూ.5వేలకు పెంచుతామని ప్రకటించారు. రుణమాఫీ విషయంలో గతంలో మాదిరిగా సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా, రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 

19:02 - October 16, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మేనిఫెస్టో రూపకల్పన చేసింది. టీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేసింది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో చెప్పేశారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద రూ.3,016 ఇస్తామన్నారు.  57ఏళ్లు పూర్తి అయిన వారందరికి ఆసరా ఫించన్లు, వికలాంగులకు రూ.3,016 ఫించన్, రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ ఇస్తామన్నారు. 

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రణాళిక కమిటీకి వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చాయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నాలుగేళ్లుగా ప్రజలు కోరిన అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామన్నారు. కాగా ఇప్పుడు విడుదల చేసింది పాక్షిక ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే అని కేసీఆర్ చెప్పారు.

 

టీఆర్ఎస్ మేనిఫెస్టో

* ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు
* మహిళా స్వయం సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల నిర్వహణ
* నిరుద్యోగ భృతి రూ.3016 అందించాలని నిర్ణయం
* 57 ఏళ్లు పూర్తి అయిన వారందరికీ ఆసరా ఫించన్లు
* ఆసరా ఫించన్లు రూ.1000 నుంచి రూ.2016కు పెంపు
* వికలాంగులకు రూ.3016 ఫించన్
* రైతులకు ఒకే దఫాలో రూ.లక్ష రుణమాఫీ
* రుణమాఫీతో 45.5లక్షల మంది రైతులకు లబ్ది
* రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు
* రైతు సమన్వయ సమితులకు గౌరవభృతి
* రెడ్డి, వైశ్యుల్లో పేదల కోసం కార్పొరేషన్లు
* డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కొనసాగిస్తాం
* 2లక్షల 60వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
* మహిళా గ్రూపులకు సబ్సిడీలు
* ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన

19:00 - October 16, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తులపై కమిటీ సమావేశమయ్యింది. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశం అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతు..వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చినయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలు కోరిన అంశాలను గమనంలోకి తీసుకున్నామనీ..ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని..టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌వంటిదని కేసీఆర్ అన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెడతామన్నారు. విభజన సమయంలో సమస్యలు చాలా వున్నా ఏడాది తర్వాత కల్యాణలక్ష్మీ పథకంపై ఓ అవగాహనకు రాలేదనీ ఇపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. నాలుగేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సున్నా అని కేసీఆర్ వెల్లడించారు.
 

18:26 - October 16, 2018

కేరళ : శబరిమల ఆలయం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా తయారయ్యింది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీనిపై సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ స్పందిస్తు రేపు శబరిమల ఆలయానికి వెళతానంటు ప్రకటించింది. దీనిపై కేరళలోని పలు సంఘాలు తీవ్రంగా మండిపతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరాయి విజయన్ స్పందిస్తు శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు. ఈ తీర్పును పున:సమీక్షించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం రివ్యూ పిటీషన్ వేయడంపై ఆయన్ని ప్రశ్నించగా.. అది దేవస్థానం ఇష్టాయిష్టాలకు సంబంధించిందని అన్నారు. ఈ తీర్పును అమలు పరిచేందుకు ముందుగా శబరిమల ఆలయ పురాతన సంప్రదాయాలు తెలిసిన వారితో ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. శబరిమలకు వెళ్తున్నమహిళా జర్నలిస్టులను నీలక్కల్ వద్ద బస్సులో నుంచి దింపేసిన ఘటనపై  విజయన్ స్పందిస్తూ.. ఇక్కడికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 

18:19 - October 16, 2018

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది, మీ టూ ఉద్యమం.. గంట గంటకీ ఆరోపణలు చేస్తున్నవారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. సమంత, విశాల్ కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.. మీ టూ లో తమిళ నటి రిత్విక తనుకూడా  లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పగా, కోలీవుడ్‌లో మరో నటి, తన సహ నటుడిపై కేసు పెట్టింది..
నటిగా తెలుగుతో పాటు తమిళ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న రాణి అలియాస్ రక్ష, ప్రస్తుతం ఒక తమిళ్ సీరియల్‌లో నటిస్తోంది.. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో సహనటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక, లైంగికంగా వేధించాడనీ రక్ష సెంగుడ్రమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. ఈ హఠాత్పరిణామంపై కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
 
  

17:48 - October 16, 2018

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా డిగ్గీరాజా మాట్లాడిన మాటలు యాధృచ్చికంగా అన్నారా? లేదా ఆయనగారి సామర్థ్యం గురించి తెలిసే మాట్లాడారా? అనే ప్రశ్న కాంగ్రెస్ నేతల్లో తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి వచ్చినా తప్పనిసరిగా వారు విజయం సాధిస్తారని..కానీ తాను  ప్రచారానికి దూరంగా ఉంటేనే కాంగ్రెస్ నేతలు విజయం సాధిస్తారనీ.. తాను ప్రచారం చేసినా, బహిరంగ సభల్లో మాట్లాడినా పార్టీకి ఓట్లు తగ్గిపోతాయని డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన అలా ఎందుకు అనాల్సి వచ్చింది? యాదృచ్ఛికంగా అన్నారా? సీరియస్‌గానే అన్నారా అనేది మాత్రం తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. 
 

17:48 - October 16, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలకు అవినీతి తప్ప మరేమీ కనిపించదని హరీష్‌రావు అన్నారు. ఏళ్లుగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు చేయలేని పనులు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చేసిందని హరీష్‌రావు చెప్పారు. తాగు, సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన చెప్పారు. నీరు అందించడం చేతకాదని కాంగ్రెస్ వాళ్లు చేతులు ఎత్తేస్తే.. తాము ఛాలెంజ్‌గా తీసుకుని నీరు అందించామని హరీష్‌రావు చెప్పారు. కేంద్రమంత్రిగా పని చేసినా, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్నా.. జైపాల్ రెడ్డి కనీసం సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లాకు, కల్వకుర్తి నియోజకవర్గానికి నీటి సదుపాయం కల్పించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. మీ జిల్లాకు, నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీష్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15వేల గ్రామాలకు కృష్ణా, గోదావరి, మంజీరాల నుంచి శుద్ది చేసిన తాగునీరుని అందిస్తే అబినందిచాల్సింది పోయి విమర్శించడం దుర్మార్గమైన చర్య అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి పుట్టి పెరిగిన కల్వకుర్తి నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నీళ్లు వచ్చాయని హరీష్ గుర్తు చేశారు.

17:26 - October 16, 2018

మంచిర్యాల : తొలివిడతగా గులాబీ బాస్ కేసీఆర్ 105 మంది  అభ్యర్థులను ప్రకటించేసారు. కానీ ఇప్పటివరకూ మహాకూటమి గానీ..బీజేపీ గానీ ఇప్పటివరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాని ఇప్పటివరకూ ప్రకటించిన మంచిర్యాల జిల్లా అభ్యర్థులపై కేసీఆర్ కన్నేసారు. ఆయా నియోజకవర్గాల్లో నియమించిన ప్రత్యేక వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులకు ఉన్నట్టుండి ఫోన్‌ చేసి, ‘ఎక్కడ ఉన్నావ్‌.. ప్రచారం ఎలా సాగుతోంది? ఎక్కడెక్కడ ప్రచారం పూర్తయింది? సహకరిస్తున్నవారెందరు? ప్రచారానికి సహకరించినవారెవరు? వంటి పూర్తి వివరాలు కేసీఆర్ సేకరిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. అభ్యర్థులు ప్రచారంలో వుండగానే కేసీఆర్‌ ఫోన్‌చేసి..ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అభ్యర్థులకు చెమటలు పడుతున్నట్లు సదరు అభ్యర్థుల అనుచరులు పేర్కొంటున్నారు.
 ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న నేతలపై కూడా కేసీఆర్‌ నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వారికి కూడా ఫోన్‌ చేసి ప్రతీ అంశంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాలలో అసమ్మతి నేతలు, అసంతృప్తివాదుల తీరుపైనా వాకబు చేస్తున్నట్లు సమాచారం. వారు ప్రచారంలో పా ల్గొంటున్నారా? లేదా? అని ఆరా తీస్తున్నట్లుగా అభ్యర్థులు, ఇన్‌చార్జిల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాగా గులాబీ బాస్ నియమించిన సీక్రెట్ ఏజెంట్స్  ద్వారా అందిన సమాచారాన్ని బట్టి చూస్తే అభ్యర్థుల్లో దడ మొదలైంది. టిక్కెట్ సంపాదించటం ఒక ఎతైతే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ ప్రాపకం పొందటం మరో ఎత్తు. మరి దీంతో మరింత జాగ్రత్తగా తమ తమ నియోజక వర్గాల ప్రచారంలో నేతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ఎవరికి ఫోన్ వస్తుందోనని నేతలంతా హడలిపోతున్నారు.

17:07 - October 16, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ దసరా బ్లాక్ బస్టర్‌గా కన్‌ఫమ్ అయిపోయింది. వంద కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవాలనే తారక్ కోరిక ఈ సినిమాతో తీరిపోయింది..
రీసెంట్‌గా అరవింద సమేత లోని ఒక పాటని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. పెంచల్ దాస్ రచన, గానం చేసిన రెడ్డమ్మ తల్లి అనే ఈ సాంగ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది.. బసిరెడ్డి చనిపోయాక అతని భార్య కోణంలో, బ్యాగ్రౌండ్‌లో ఈ పాట వస్తుంది.. రాయలసీమ యాసపై పట్టున్న  పెంచల్ దాస్  పాటని అద్భుతంగా వ్రాయడమేకాక, అంతే అద్భుతంగా ఆలపించాడు.. వీడియోలో సంగీత దర్శకుడు థమన్‌తో పాటు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కూడా ఉన్నారు..అప్‌లోడ్ చేసిన కొద్ది టైమ్‌లోనే రెడ్డమ్మ తల్లి సాంగ్ వైరల్ అయిపోతుంది.. 

16:47 - October 16, 2018

ఉత్తర్ ప్రదేశ్ : భారతదేశంలోని పలు నగరాల పేర్లను ఆయా రాష్ట్రాలు మార్చేస్తున్నాయి. గతంలో పలు రాష్ట్రాలు ముఖ్యమైన ప్రాంతాల పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్ నగరం పేరును మార్చేశారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలహాబాద్ పేరును మార్చవద్దంటూ పలు నిరసనలు..వినతులు పెల్లుబికినా పేరు మార్చడానికే ఆయన సిద్ధమయ్యారు. అలహాబాద్ జిల్లా పేరును అధికారికంగా ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ప్రకటన విడుదల చేస్తామని సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపుతుందని రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు తెలిపారు.
Image result for Allahabad Is Now "Prayagraj", UP Minister Yogi Adityanathప్రయాగ్‌రాజ్ అంటే..నదులు కలిపే సంగమం అని పేర్కొంటారంట. వాస్తవానికి పురాతనంలో ప్రయాగ్ అనే పేరు ఉందని తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో పేరు మార్చారని..అక్కడో కోటను నిర్మించి చుట్టపక్కల ప్రాంతానికి ఇలహాబాద్ అనే పేరు పెట్టారని..ఆ తర్వాత అక్బర్ మనువడు షాజహాన్ ఆ పేరును అలహాబాద్‌గా మార్చారని చరిత్ర చెబుతోంది. 
ఇదిలా ఉంటే అలహాబాద్ పేరు మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పేరును మార్చడమంటే దాని ప్రాముఖ్యతను తగ్గించడమేనని వాదిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా తప్పుబట్టారు. యోగి సర్కార్ ఊర్ల పేర్లు మార్చడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇక్కడ వచ్చే ఏడాది కుంభమేళా జరుగనున్న నేపథ్యంలో పేరు మార్చడం గమనార్హం. యూపీ గవర్నర్ రామ్ నాయక్ కూడా పేరు మార్పుపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

16:42 - October 16, 2018

కేరళ : శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిననాటినుండి ఈ అంశంపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పును నిరసిస్తు కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఈ వేడి చల్లారకముందే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కేరళ ప్రభుత్వానికి మరో ఝలక్ ఇచ్చింది. తాను రేపు శబరిమలకు వస్తున్నానని..నా రక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని అగ్నికి ఆజ్యం పోసింది. కాగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాల్లో ప్రవేశం కోరుతూ, సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, పోలీసుల సాయంతో ఆలయాల్లోకి వెళ్లి పూజలు చేసి వస్తున్న హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్, రేపు శబరిమలకు వస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. 
సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, తాను అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు రేపు అంటే బుధవారం నాడు వెళుతున్నానని ప్రకటించారు. కాగా తన రక్షణ బాద్యత కేరళ ప్రభుత్వం వహించాలన్నారు. కేరళలో జరుగుతున్న నిరసనల గురించి తాను పట్టించుకోబోనని, ఓ వర్గం వారు చేస్తున్న నిరసనలు కోర్టు తీర్పులను అడ్డుకోలేవని తృప్తీ దేశాయ్ మరోసారి స్పష్టం చేశారు. 
కాగా, తృప్తీ దేశాయ్ చేసిన ప్రకటన గురించి తెలుసుకున్న కేరళ సంఘాలు మరింతగా మండిపడుతున్నాయి. అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం వద్దకు వెళ్లనివ్వబోమని..ఆమెను అడ్డుకునేందుకు ఆత్మహత్య కూడా చేసుకుంటామని హెచ్చరించారు. కేరళ మహిళల మనోభావాలను దెబ్బతీయకుండా తృప్తీదేశాయ్ వెనక్కు వెళ్లిపోవాలన్నారు. కాగా తృప్తీ తన నిర్ణయం మార్చుకోకుంటే ఆమె తీవ్ర పరిణామాలను  ఎదుర్కోవాల్సిందేనని మహిళలు హెచ్చరించారు. కాగా లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త తృప్తీ దేశాయ్  పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. కాగా ఆమె  ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రస్తుతం వున్న పరిస్థితుల రీత్యా తృప్తీ ఎంట్రీతో ఎటువంటి పరిణామాలు సంభవించనున్నాయో వేచి చూడాల్సిందే.

16:41 - October 16, 2018
హైదరాబాద్: అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి దేశవ్యాప్తంగా భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో హీరా గోల్డ్ ఛైర్మన్ నౌహెరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కొంతకాలం క్రితం మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ పెట్టిన నౌహెరా షేక్.. కర్నాటక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి భారీగా డబ్బు వసూలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్టుగా నౌహెరా షేక్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఇది వరకే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. నౌహెరా మోసాల గురించి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
16:12 - October 16, 2018
శ్రీకాకుళం: జిల్లాలో తిత్లీ తుపాను వల్ల జరిగిన నష్టం వివరాలను బుధవారం సాయంత్రంలోగా అందచేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృధ్దిశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. మంగళవారం మందస సబ్‌ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు. ఈ రాత్రికి సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవ్వాలని లోకేష్ ఆదేశించారు. అనంతరం డీఆర్డీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తుఫాను ధాటికి జిల్లాలో 5వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనా వేశామని, తండాలలో ఎక్కువ ఇళ్లు పడిపోయాయని అధికారులు మంత్రికి తెలిపారు. జిల్లాలో తాగునీరు అందని ప్రాంతాలకు యుధ్దప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.

16:01 - October 16, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. తెలంగాణలో రాహుల్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ ఒక్కరోజు పర్యటనకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలే ఇందుకు కారణం. 

తెలంగాణలో రాహుల్ పర్యటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ టూర్ ఉన్నందున దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలంలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మూడు రోజులుగా చేపడుతున్నారు. అంతలోనే రాహుల్‌ జిల్లా పర్యటన రద్దయినట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే అర్ధాంతరంగా రాహుల్‌ పర్యటన రద్దు కానుందనే వార్తలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నింపింది.

16:01 - October 16, 2018

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మెయిన్ లీడ్స్‌గా, ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో, అప్పారావు బెల్లన నిర్మిస్తున్న చిత్రం, వీర భోగ వసంత రాయలు.. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఉపశీర్షిక... రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..  ఎవరో విమానాన్ని హైజాక్ చేస్తే, సిబిఐ ఆఫీసర్స్ అయిన రోహిత్, శ్రియ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించడం, పోలీస్ అయిన సుధీర్ బాబు దగ్గరకి చిన్నపిల్లాడొచ్చి మా ఇల్లు కనబడడంలేదని చెప్పడం ట్రైలర్‌లో ఆసక్తికరంగా అనిపిస్తుంది..
ట్రైలర్‌లో పిల్లల కిడ్నాపింగ్ ప్రస్తావన కూడా వచ్చింది.. నారా రోహిత్ నెరిసిన గెడ్డం, జుత్తుతో సీరియస్‌గా కనిపిస్తే, శ్రియ హెయిర్ కట్తో, స్టైల్‌గా స్మోక్ చేస్తూ కనబడింది.. పోలీస్‌గా సుధీర్ బాబు ఓకే కానీ, అతనికి వేరెవరో డబ్బింగ్ చెప్పడంతో కొంచెం తేడాగా అనిపిస్తుంది.. శ్రీనివాస రెడ్డి, శశాంక్ తదితరులు నటిస్తున్న  వీర భోగ వసంత రాయలు అక్టోబర్ 26న రిలీజ్ కాబోతోంది...

 

15:59 - October 16, 2018

ఢిల్లీ : స్మార్ట్ ఇప్పుడు అందరి చేతుల్లోను ఇదే. స్మార్ట్ ఫోన్స్ ఏ కంపెనీ విడుదల చేసినా..అది క్షణాల్లో స్మార్ట్ అభిమానుల చేతుల్లో హొయలు పోతుంది. ప్రపంచం అంతా స్మార్ట్ గా మారిపోతున్న క్రమంలో అన్ని మొబైల్ కంపెనీలు పోటీలు పడి మరీ స్మార్ట్ ఫోన్స్ ని మరింత స్మార్ట్ గా ఎలా తయారు చేయాలో అనే పనిలో స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. దీంతో ప్రపంచం మరింత స్మార్ట్ ను సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో హువావే సబ్ బ్రాండ్ సంస్థ అయిన ఆనర్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ కొద్దిసేపటి క్రితం భారత మార్కెట్లో విడుదల అయింది. ఆనర్ 8ఎక్స్‌ పేరిట విడుదలైన ఈ ఫోన్లో భారీ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరాలు లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ నెల 24 నుండి అమెజాన్ సైట్‌ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ వేరియంట్ లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.14,999 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.18999గా ఉంది.
 

 

15:36 - October 16, 2018

నల్గొండ :  చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు పరిపాలించిన ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం. శాతవాహన, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండిన, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, కుతుబ్‌షాహీ, ఆసఫ్‌ జాహీ వంటి పలు చారిత్రక పాలనలను రుచి చూసిన జిల్లా నల్లగొండ ప్రాంతం. అంతేకాదు ఆధునిక రాజకీయ పరిపాలన అంతటికీ ఈ జిల్లా  ఒక ప్రదర్శనశాలవంటిది.  మహాకవులు, పోరాటయోధులు, సాహితీవేత్తలు పుట్టిన గడ్డ నల్గొండ గడ్డ.
జిల్లా పుట్టు పూర్వోత్తరాలు..
గ్రంథాలయ ఉద్యమాలకు, భూదానోద్యమాలకు, తెలంగాణా సాయుధ పోరాటాలకు, విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన నల్గొండ జిల్లా ఎన్నెన్నో మార్పులతో 1905లో ప్రత్యేకంగా ఏర్పడింది. పట్టణం ప్రాచీన నామం నీలగిరి. రెండు నల్లరాతి కొండల నడుమ ఉన్న ప్రదేశం కావడంతో దీనికి నీలగిరి అని పేరు వచ్చింది. నీలగిరి క్రమంగా నల్లకొండ.. నల్లగొండ... నల్గొండగా స్థిరపడింది. 1961 దాకా జిల్లా సరిహద్దుల్లో  ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో కూడా కొత్త జిల్లాల ఏర్పటులో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా నల్లగొండ నుంచి సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు అవతరించాయి. 

నల్గొండ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
నియోజకవర్గం మహిళలు ఫురుషులు
నల్గొండ 1,06,989  1,04,780 
నాగార్జునసాగర్ 1,02,841  1,01,769 
మిర్యాలగూడ 1,04,023  1,01,817 
హుజూర్‌నగర్  1,10,581 1,08,104 
సూర్యాపేట 1,02,506 1,00,850 
కోదాడ 1,07,564  1,04,780 

రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఇటీవల ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓటరు జాబితాలో పూర్వ నల్గొండ జిల్లాలోని పన్నెండింటిలో సగం స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువున్నారు. అయినా.. వారికి ఆ సెగ్మెంటుల్లో పోటీచేసే అవకాశం నామమాత్రంగానే ఉంది. నల్గొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఒక్క కోదాడలో మినహాయిస్తే ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలే కాదు చిన్న పార్టీలు కూడా మహిళలకు టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖత చూపించకపోవడం గమనార్హం.   కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా పోరాటాలు సాగేవి. చైతన్యం వెల్లివిరిసేది. అయినా మహిళలకు రాజకీయాల్లో ఎమ్మెల్యే తరహా పదవులను చేరుకోవడం కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్, మునుగోడు, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడం గమనార్హం. మహిళలు ఎన్నికకాని ఆరు నియోజకవర్గాల్లో నాలుగింటిలో మహిళ ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారని తాజాగా ప్రకటించిన ఓటరు జాబితాలో వెల్లడించడం తెలిసిందే. 

 

15:32 - October 16, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రత్యేకంగా కవితకు చికిత్స అందిస్తున్నారు. ఎంపీ కవితను తండ్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ ప్రచార బాధ్యతలను కవిత చూసుకుంటున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఇవాళ కూడా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా పర్యటనలన్నీ రద్దయ్యాయి.

15:18 - October 16, 2018

‘#మీ టూ’ హ్యాష్ ట్యాగ్ మీ టూ ఉద్యమం అసలు ఎలా ఉద్భవించిందొ తెలుసా? ఇప్పుడ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం సంచలనాలు సృష్టిస్తే.. భారత్‌లో పెద్ద ప్రకంపనాలనే సృష్టిస్తోంది. దీని తాకిడికి భారతీయ సినీ రంగం అతలాకుతలం అవుతోంది. సినిమాలు ఆగిపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు ఆవిరిఅయిపోతున్నాయి. ఇంతటి సునామీకి కారణం ఎవరో తెలుసా? తరానా బూర్కే అనే అమెరికన్ బ్లాక్ ఉమన్. 
అసలు తరానా 2006 సంవత్సరంలోనే మీ టూ ఉద్యమాన్ని రూపొందించినా.. అది కార్యారూపం దాల్చి జనం మధ్యకు రావడానికి పదేళ్ల పైనే పట్టింది. ఈ  ‘మీ టూ’ ఉద్యమం అక్టోబర్ 15, 2017లో జనబాహుళ్యంలోకి వచ్చింది. మహిళలు ఎదుక్కొంటున్న లైంగిక వేధింపులు, దాడులను భరించిన మహిళలు ఎలుగెత్తి చాటిచెప్పే వేదిక ‘మీ టూ’. ఏడాది తర్వాత తరానా వెనక్కితిరిగి చూసుకుంటే తను కలలు కన్న ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో తరానా ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్భంగా తరానా ఈ విధంగా ట్వీట్ చేసింది.

‘‘అసలు ‘మీ టూ’ ఉద్యమం 20 ఏళ్ల కిందే ప్రారంభం అయ్యింది. పదేళ్ల క్రితం ఈ ఉద్యమం ఓ రూపు దాల్చింది. ఏడాది క్రితం ఈ శక్తిని ప్రపంచం అర్ధం చేసుకొంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఈ ఉద్యమాన్నిమరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా చాలా చేయాల్సిఉంది’.’ 
 

14:45 - October 16, 2018

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పని చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

14:29 - October 16, 2018

శ్రీకాకుళం: తిత్లీ తుపాను ధాటికి కకావికలమైన  శ్రీకాకుళం జిల్లాలో సహయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.  పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి లోకేష్ శ్రీకాకుళంలోనే ఉండి తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో  సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  మరో వైపు తుపాను బాధితుల సహాయార్ధం దాతలు పెద్ద ఎత్తున్న ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. సినీ రంగానికి చెందిన ఎందరో తమ వంతు సహాయం ప్రకటించారు. ఈవిషయంలో  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు  మొట్టమొదటిసారిగా 50వేల రూపాయలు సాయం ప్రకటించి  ఆదర్శంగా నిలిచారు.

మరో హీరో  నిఖిల్ సిధ్దార్ధ తుపాను బాధిత ప్రాంతాల్లో  పర్యటిస్తూ బాధితులకు భోజన సదుపాయం, దుప్పట్లు,అవసరమైన వారికి బియ్యం, తాత్కాలిక విద్యుత్ సౌకర్యం కోసం పోర్టబుల్ జనరేటర్లను అందించారు. తుపాను బాధితులకు 20 లక్షల రూపాయల సాయం ప్రకటించిన నందమూరి సోదరులకు లోకేష్ అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్,కళ్యాణ్ కళ్యాణ్ రామ్ లు  తుపాను బాధితులకు ధనసహాయం చేసి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారని లోకేష్ ట్విట్టర్ లో వారిని అభినందించారు. తుపాను బాధితులకు సాయం చేసిన అందరికీ లోకేష్  కృతజ్ఞతలు తెలుపుతూ ,సమాజంలోని అన్ని వర్గాల  వారు  తుపాను బాధితులకు సహాయం చేయటానికి  ముందుకు  రావాలని  కోరారు.

14:29 - October 16, 2018

కర్నాటక : రుణం కావాలని అడిగిన మహిళపై ఓ బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లోన్ మంజూరు చేయమంటే తన కోరిక తీర్చమన్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది.  
కర్నాటకలోని దవనగిరిలో ఓ మహిళ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లింది. రుణం కావాలని మేనేజర్‌ను అడిగింది. అయితే రుణం కావాలని అడిగిన ఆ మహిళపై బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీరిస్తే లోన్ మంజూరు చేస్తానన్నాడు. రుణం కావాలని అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చితేనే లోన్ మంజూరు చేస్తామనడంతో ఆగ్రహించిన మహిళ బ్యాంకు మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది. అతని చొక్కా పట్టుకుని చితకబాదింది. చెప్పుతో, కట్టెతో దాడి చేసింది.  

14:22 - October 16, 2018

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. కంగనా రనౌత్ క్వీన్ దర్శకుడిపై, తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చెయ్యడంతో, ఈ మీ టూ ఉద్యమం ఊపందుకుంది.. మరోవైపు సింగర్ చిన్మయి, సమంత, విశాల్ వంటివారు కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు.. ఇకనుండి తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టబోమని మేకర్స్, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనే వారితో కలిసి పని చెయ్యం అని కొందరు హీరోలు తేల్చి చెప్పారు..
ఇప్పుడీ మీ టూ లో తమిళ నటి రిత్విక కూడా చేరింది.. తమిళనాట పలు చిత్రాలద్వారా గుర్తింపు తెచ్చుకున్న రిత్విక, తమిళ బిగ్‌బాస్ 2 టైటిల్ విన్ అయింది.. రీసెంట్‌గా ఒక తమిళ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో, ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతున్న మీ టూ గురించి మాట్లాడుతూ, తనుకూడా చిన్నతనంలో  లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాననీ, అప్పుడు ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాననీ, ఇప్పుడు బాధిత మహిళలంతా ధైర్యంగా గొంతు విప్పుతున్నారు, వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుందని రిత్విక చెప్పుకొచ్చింది..
 

 

13:46 - October 16, 2018

ఇస్లామాబాద్ పాకిస్థాన్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద 3 బ్యాంకు ఖాతాలు వెలిశాయి. ఆ ఖాతాల నుంచి రూ.460కోట్ల లావాదేవీలు జరిగాయి. పాకిస్థాన్‌లో ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ(ఎఫ్‌ఐఏ) ఈ భారీ మోసాన్ని గుర్తించింది. 

కరాచీకి చెందిన ఇక్బాల్‌‌ అరయాన్‌ అనే వ్యక్తి మే 9, 2014లో మరణించారు. చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఎవరో 3 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.460 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎఫ్‌ఐఏ విచారణలో బయటపడింది’ అని పాక్‌ జియో టీవీ వెల్లడించింది.

పలువురు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు కేసులు రావడంతో సుప్రీంకోర్టు జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌(జేఐటీ)ని నియమించింది. ఇందులో భాగంగానే ఎఫ్‌ఐఏ పలు బ్యాంకుల్లోని ఖాతాదారుల లావాదేవీలను పరిశీలిస్తుండగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేద ప్రజల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి కొందరు బ్యాంకు అధికారులు భారీ మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నట్లు ఎఫ్‌ఐఏ విచారణలో వెల్లడైంది. 

 

13:41 - October 16, 2018

ఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకొనే రాంపాల్ బాబాకు జీవిత ఖైదీ పడింది. జంట హత్య కేసులో ఆయన దోషిగా తేలిన సంగతి తెలిసిందే. రాంపాల్ తో పాటు 14 మందికి జీవిత ఖైదును విధిస్తున్నట్లు ఛండీగడ్ కోర్టు వెల్లడించింది. రూ. 2.05 లక్షల నగదు జమ చేయాల్సిందిగా రాంపాల్ తరపు న్యాయవాదికి సూచించారు. రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 
2014 నవంబర్లో రాంపాల్ అనుచరులకు...పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించగా ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు రాంపాల్ ను అరెస్టు చేశారు. హిసార్ జిల్లాలోని బర్వాల పట్టణానికి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో రాంపాల్ ఆశ్రమం ఉంది. విచారణలో ఆశ్రమంలో మారణాయుధాలు లభ్యమైన సంగతి తెలిసిందే. గతంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 

13:13 - October 16, 2018
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే మాటను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.గత ఎన్నికల్లో పెట్టుకున్నపొత్తుల వల్లే అధికారంలోకి వచ్చామనే విషయాన్ని మేము ఒప్పుకున్నామని, మీరు ప్రచారం చేసిన విషయాన్నిమేము కాదనటం లేదని సోమిరెడ్డి అన్నారు. రాజకీయ నాయకుడిగా మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటించి మాట్లాడాలని మంత్రి పవన్ కళ్యాణ్ కు సూచించారు. గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వటంపట్ల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిత్లీ తుపాను తర్వాత శ్రీకాకుళంలోనే ఉండి ప్రజల అవసరాలు గుర్తిస్తూ గ్రామాల్లో సాధరాణ పరిస్ధితులు నెలకొనేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏమి అనుభవం ఉందని మీఅన్నయ్య చిరంజీవిగారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారని సోమిరెడ్డి పవన్ ను ప్రశ్నించారు. ఛాయ్‌వాలాగా ఉన్న మోదీ ప్రధాని అయ్యారని సోమిరెడ్డి గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ చేసే చేతలకు,మాట్లాడే మాటలకు పొంతన ఉండటంలేదని, రాజకీయ నాయకుడిగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. పవన్ కళ్యాణ్ తనకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశ్యం లేదంటారు,అభిమానులతో కాబోయే సీఎం అనిపించుకుంటారని, ఒకోసారి హింసకు వ్యతిరకం అంటారు,యుద్దంచేస్తానని మరోసారి అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 
13:12 - October 16, 2018

పనాజీ : గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగులనుందా ? ఆ పాచెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే అవునని తెలుస్తోంది. దయానంద్...సుభాష్ షిరోడ్కర్ లు మంగళవారం వారు న్యూఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వెలువుడుతున్నాయి. నేరుగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ బీజేపీ కండువాలు కప్పుకోనున్నట్లు సమాచారం. వీరి వెంట కేంద్ర మంత్రి అయూష్ ఉన్నట్లు తెలుస్తోంది. 
గత నెలలో కాంగ్రెస్ శాసనసభపక్షం రాష్ట్ర గవర్నర్ ను కలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని కోరింది. పారికర్ ఆరోగ్య విషయాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ పై విధంగా కోరింది. కాంగ్రెస్ కు 16 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 14కి తగ్గింది. గోవాలో 40స్థానాల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో, బిజెపి 14 స్థానాల్లో విజయం సాధించాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 21 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది.
2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రెండోస్థానంలో ఉన్నప్పటికీ స్థానిక మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో పారికర్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

13:09 - October 16, 2018

ఢిల్లీ : వాట్సాప్‌‌ మార్పులు చేస్తోంది. ‘సందేశాల డిలీట్‌’ సదుపాయంలో వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. ఇతరులకు పంపిన సందేశాలు/ సమాచారం వారు చూడకముందే తొలగించేందుకు ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ ఫీచర్‌ తోడ్పడుతోంది. దీన్ని గత ఏడాదే ప్రవేశపెట్టారు. పొరపాటున వేరేవారికి లేదా తప్పుడు సందేశాలు/సమాచారం పంపినప్పుడు ఇది ఉపయోగపడుతోంది. సందేశ ఉపసంహరణ సమయం మొదట దీనిలో ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. తర్వాత దీన్ని గంట ఎనిమిది నిమిషాల 16 సెకన్లకు పెంచారు. అంటే ఈ సమయంలోపు మన సందేశాన్ని వెనక్కు తీసుకోవచ్చు. దీనిలో తాజాగా వాట్సాప్‌ మార్పులు తీసుకొచ్చినట్లు వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ తెలిపింది. 

ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం కొత్తగా సిద్ధం చేసిన బీటా వెర్షన్‌లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. తాజా మార్పుల ప్రకారం.. సందేశాలు డిలీట్‌ చేసేందుకు ఎదుటివారికి వాట్సాప్‌ వినియోగదారుడు ఓ అభ్యర్థనను పంపాల్సి ఉంటుంది. దీన్ని 13 గంటల ఎనిమిది నిమిషాల 16 సెకన్లలోపు అవతలి వ్యక్తి ఆమోదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సందేశాలు డిలీట్‌ చేయడం కుదరదు. ఎదుటి వ్యక్తులు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినప్పుడు ఈ సమయం మించిపోయే అవకాశముందని, ఫలితంగా డిలీట్‌ సదుపాయం పనిచేయదని వాబీటాఇన్ఫో వివరించింది.

 

12:41 - October 16, 2018

డిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను వెనక్కి తీసుకుంది. కేంద్రప్రభుత్వం  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.190.78 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికే మొగ్గు చూపి.. పీఎంఏవై పథకాన్ని నిరాకరించడంతో నిధులు తిరిగి ఇవ్వాల్సిందిగా కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. 

 

12:35 - October 16, 2018

ఢిల్లీ : టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ లను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్ లో ఉంది. ఇదే ఊపును వన్డేలో కూడా చూపించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. భారత్ లో వెస్టీండీస్ టూర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఉప్పల్ లో రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. అనంతరం టీమిండియా జట్టుకు ఆరు రోజుల విరామం దొరికింది. ఐదు వన్డేల సిరీస్ ఈనెల 21వ తేదీ నుండి ప్రారంభం కానుంది. గౌహతిలో తొలి వన్డే జరుగనుంది. నవంబర్ 1వ తేదీన తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో ఆఖరి వన్డేతో సిరీస్ ముగియనుంది. ఈ వన్డేలకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ..రోహిత్‌శర్మ ఉపసారథిగా బాధ్యతలు పంచుకోనున్నారు. టెస్టు సిరీస్ మాదిరిగానే వన్డేసిరీస్‌ను సైతం విరాట్ సేన క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరి వెస్టిండీస్ ఎలాంటి ఆటను కనబరుస్తుందో వేచి చూడాలి. 

మ్యాచ్‌ల షెడ్యూల్..
తొలివన్డే  అక్టోబర్ 21 గువాహటి బసపర మైదానం
రెండోవన్డే  అక్టోబర్ 24 విశాఖపట్నం వీడీసీఏ క్రికెట్ స్టేడియం
మూడోవన్డే అక్టోబర్ 27 పుణె మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం
నాలుగోవన్డే  అక్టోబర్ 29  ముంబై  బ్రబౌర్న్ స్టేడియం
ఐదోవన్డే  నవంబర్1 తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం

 

12:27 - October 16, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా.. చందూ మొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌‌బ్యానర్‌పై.. నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించిన చిత్రం.. సవ్యసాచి.. ఇటీవల రిలీజ్ చేసిన సవ్యసాచి టీజర్‌‌కీ, వైనాట్ అంటూ సాగే ఫస్ట్‌సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది.. ఇప్పుడు, సవ్యసాచి‌లోని సెకండ్ సాంగ్‌ని ఆన్‌లైన్‌లో  రిలీజ్ చేసింది‌ మూవీ యూనిట్.. ఒక్కరంటే ఒక్కరూ, ఇద్దరంటే ఇద్దరూ, ఒక తనువున ఎదిగిన కవలలు, ఒక తీరున కదలని తలపులు అనే ఈ సాంగ్ ఆద్యంతం వినసొంపుగా ఉంది.. ఒక తల్లి తన ఇద్దరు పిల్లల గురించి వివరించే నేపధ్యంలో వచ్చే పాట ఇది.. రామజోగయ్య సాహిత్యం, కీరవాణి సంగీతం, శ్రీనిధి తిరుమల గాత్రం చక్కగా కుదిరాయి..
లిరికల్ వీడియోలోని విజువల్స్ కూడా బాగున్నాయి.. నవంబర్ 2న  సవ్యసాచి విడుదల కానుంది..

 

12:11 - October 16, 2018

ఢిల్లీ : పసిడి ధరలు మళ్లీ పరుగు పెడుతున్నాయి. సోమవారం బంగారం ధర 200 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 32 వేల 250 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, పండగసీజన్‌, స్థానిక నగల వర్తకం తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధర.. అమాంతం 350 రూపాయలు పెరిగి 39 వేల 750 రూపాయలకు చేరింది. 

 

11:55 - October 16, 2018

ఢిల్లీ : గిన్నీస్ బుక్లో స్థానం సంపాందించేందుకు వినూత్నంగా పలువురు ప్రయత్నిస్తుంటారు.  ప్రపంచంలో ఎక్కడైనా.. ఎలాంటి విషయానికైనా ఓ రికార్డ్ అంటూ క్రియేట్ అయ్యిందంటే… అది గిన్నీస్ బుక్లో ఎంట్రీ కావాల్సిందే. అంతగా ఫేమస్ అయింది గిన్నీస్. అందులోకి తాజాగా ‘కిచిడీ’ ఎక్కింది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి కిచిడీ తయారు చేసి గిన్నీస్ లోకి ఎక్కాడు. 
విష్ణుకుమార్...నాగ్పూర్ వాసి. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మూడు వేల కిలోల భారీ కిచిడీ తయారు చేయాలని భావించాడు. ఇందుకు 275 కిలోల బియ్యం, 125 కిలోల పెసరపప్పు, 150 కిలోల శనగపప్పు, 3 వేల లీటర్ల నీళ్లు, 150 కిలోల నెయ్యి ఉపయోగించాడు. అనుకున్నట్లుగానే కిచిడీ తయారు చేశాడు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై విష్ణుమనోహర్‌ను అభినందించారు. 
గతంలో కూడా చాలా మంది భారీ కిచిడీలను తయారు చేసి గిన్నీస్ లో స్థానం సంపాదించారు. గత ఏడాదే ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తయారుచేసిన 918 కిలోల కిచిడీ ఇండియా బుక్ఆఫ్ రికాలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 

11:50 - October 16, 2018

కేరళ : శబరిమలలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఓవైపు రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతుండగా.. ఈరోజు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సమావేశం కానుంది. నెలవారీ పూజల కోసం రేపు ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే అంశంపై బోర్డు చర్చించనుంది. 

ఇదిలావుంటే.. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు ఉధృతస్థాయికి చేరాయి. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గత వారం ప్రారంభించిన భారీ ర్యాలీ కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. మరోవైపు రేపు ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. 

ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు హిందూ సంఘాలు కూడా సుప్రీంతీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకోబోమని వెల్లడించింది. అయితే.. మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నందుకు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇలాంటి తరుణంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

11:23 - October 16, 2018

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ యూ తర్వాత నటిస్తున్న కొత్త సినిమా, తేజ్ బర్త్‌డే..సందర్భంగా నిన్న లాంచ్ అయింది.. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో, శ్రీమంతుడు, జనతా‌ గ్యారేజ్, రంగస్ధలం వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు.
'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా చేస్తుంది.. చిత్రలహరి అనే టైటిల్ అనుకుంటున్నారు.. దర్శకుడు కొరటాల శివ చేతులమీదగా పూజా కార్యక్రమాలు జరిగాయి.. ఈ సినిమా కోసం గెడ్డం పెంచి కొత్త లుక్‌లోకి మారిపోయాడు తేజ్.. నవంబర్ 2నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది.. ఈ మూవీకి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కెమెరా :కార్తీక్ ఘట్టమనేని.. 

 

 

 

 

 

 

11:09 - October 16, 2018

ఢిల్లీ :  ఏమీ కావాలన్నా ఆన్‌లైన్.. ఒక ఫోన్ ను చేతిలో పట్టుకుని నచ్చిన వాటిని క్లిక్ చేయడం..వాటి ధరను ఆన్‌లైన్‌లోనే చెల్లించడం..గడప దాటకుండానే ఆ వస్తువు ఇంటికి చేరుతున్నాయి. తినే తిండి నుండి మొదలుకుని కట్టుకొనే బట్ట..వాడే వస్తువులు కూడా అంతా ఆన్ లైన్ లోనే లభిస్తున్నాయి. అంతేగాకుండా ఫలానా ఐటమ్ కొంటే మరొక ఐటమ్ ఉచితం అని ఆఫర్్స..డిస్కౌంట్లు ఆయా సంస్థలు ప్రకటిస్తుండడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ సీజన్ లైతే సరేసరి...ప్రధానంగా దసరా..దీపావళి..పండుగ సీజన్ లో ఆన్ లైన్ కళకళాడుతోంది...
దసరా..దీపావళి పండుగ సీజన్ ను ఇ కామర్స్ సంస్థలు మంచిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఆయా కంపెనీలు భావిస్తున్నట్లుగానే ఆన్ లైన్ మార్కెట్ కళకళలాడుతోంది. అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. పండుగ సీజన్ కావడంతో ఈ-కామర్స్ సంస్థలకు కాసుల వర్షం కురుస్తోంది. దిగ్గజ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 15,000 కోట్ల మేర అమక్మాలు జరిపినట్లు అంచనా వేస్తున్నారు. 
ఆన్ లైన్ లో వివిధ వస్తువులకు డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో నెటిజన్లు కొనుగోలుకు ఎగబడుతున్నారు. స్మార్్ట ఫోన్లు, గృహోపకరణాలుకు ఎక్కువగా డిమాండ్ ఉంది. అంతేగాకుండా పండుగ సీజన్ కావడంతో దుస్తులకు కూడా మంచి గిరాకీ ఉన్నట్లు ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే వ్యవధిలో రూ.10,325 కోట్లుగానే ఉన్నాయని చెప్పింది. అంటే ఈసారి ఏకంగా 64 శాతం వృద్ధి చెందడం పట్ల ఆయా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 
ధరలు తగ్గించడం, ఆఫర్లు ప్రకటించడంతో ఆన్ లైన్ లో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాకుండా వాడిన వస్తువులకు సంబంధించిన వాటికి కూడా గిరాకీ బాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పథకాల వల్ల కొత్త వినియోగదారులు కూడా లభించారని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆన్ లైన్ అమ్మకాలు ఈసారి దాదాపు రూ.22 వేల కోట్లను తాకవచ్చని పేర్కొన్నది. 

10:42 - October 16, 2018

టాలీవుడ్ లో బాహుబలి..బాహుబలి 2తో ఒక ఊపు ఊపిన ప్రభాస్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయలో పేరు తెచ్చుకున్న ఈ చిత్రాలతో ప్రభాస్ మేనియా ఒక్కసారిగా మారిపోయింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ కొన్ని సంవత్సరాల వరకు పని చేశారు. ఆ మధ్యకాలంలో సినిమాల అవకాశాలు వచ్చినా రాజమౌళికి ఇచ్చిన మాట మేరకు సినిమాలను వదులకున్నాడు. ఆ రెండు సినిమాలు ఘనవిజయం సాధించడంతో పాటు రికార్డులు సృష్టించాయి. 
అనంతరం ప్రభాస్ ఏ చిత్రంలో నటిస్తారు ? దర్శకుడు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే చిత్ర టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో మరింత ఉత్కంఠ నింపారు చిత్ర యూనిట్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన లుక్్స గాని ప్రభాస్ సంబంధించిన ఫొటోలు గాని ఇంతవరకు విడుదల కాలేదు. దీనితో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 
ఈ సినిమాలోనే గాకుండా రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకొంటోంది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే అక్టోబ‌ర్ 23. ఆ రోజున ఈ సినిమాలకు సంబంధించిన లుక్్స..టీజర్్స విడుదలయ్యే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. సాహో చిత్ర టీజర్, రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్్ట లుక్, టైటిల్ రివీల్ చేయనున్నారని టాక్. అదే నిజమైతే అంటే ఒకే రోజు అభిమానులకి డ‌బుల్ ట్రీట్ అంద‌నుందన్న‌మాట‌. 

10:36 - October 16, 2018

కృష్ణా : విజయవాడలో విషాదం నెలకొంది. ఐటీ అధికారుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐటీ శాఖా జరిమానా లక్షల్లో వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదాయ పన్ను బిల్లు చెల్లించాలని సాదిక్‌పై ఐటీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారుల వేధింపులు తాళలేక రెండ్రోజుల క్రితం బందరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడలోని సనత్ నగర్‌కు చెందిన సాధిక్ ఆటో మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. బాడీ బిల్డింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐటీ శాఖ అధికారులు రూ.50 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలని సాదిక్‌కు నోటీసులు పంపించారు. అయితే తన అకౌంట్‌ ట్రాన్సాక్షన్స్‌ బట్టి ఇంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని... వ్యాపారం కూడా అంతంతమాత్రంగా జరుగుతుందని ఐటీ అధికారుల దగ్గరికి వెళ్లి సాదిక్ తన గోడును విన్నవించుకున్నాడు. కానీ రూ.50 లక్షలు కాదు.. రూ.20 లక్షలైనా కట్టాల్సిందేనని.. లేనిపక్షంలో ఐటీకి సంబంధించిన చట్టాలు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సాదిక్ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. తన సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గత రెండ్రోజుల క్రింతం నమాజ్ చేసుకున్న సాదిక్ బందరు రోడ్డులోని కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాదిక్ ఇంటికి రాకపోవడంతో ఎక్కడిక్కెలాడో తెలియడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చుచ్టుపక్కల అతని కోసం వెతికారు. ఇవాళ ఘంటసాల సమీపంలోని కాలువలో సాదిక్ మృతదేహం లభ్యం అయింది. కాగా, సాధిక్ చనిపోవడానికి ప్రధానంగా ఐటీ అధికారుల వేధింపులే కారణమని అతని భార్య, కుటుంబ సభ్యులు అంటున్నారు.  

10:24 - October 16, 2018

ముంబై : మీటూ..రోజు రోజుకు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్యమానికి భాషా బేధాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. మీటూ సెగ బాలీవుడ్ లోని ప్రముఖులకు తాకుతుండడంతో సంచలనం సృష్టిస్తున్నాయి. తమను గతంలో వేధించారంటూ ప్రముఖ దర్శకులు..నటులపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరిపై ఎప్పడు ఆరోపణలు చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ జాబితాలో నానా పటేకర్, అలోక్ నాథ్, వికాస్ బహ్ల్, సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, భూషణ్ కుమార్, ముకేశ్ చబ్రా తదితరులు చేరారు. వీరిపై పలువురు తీవ్ర ఆరోపణలు చేయగా వీటిని వారు ఖండిస్తున్నారు. 
తాజాగా, యాక్షన్ చిత్రాల దర్శకుడు, నటుడు విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ కూడా చేరాడు. మసాన్, రాజీ, సంజు సినిమాల్లో తన నటనతో విక్కీ కౌశల్ ఆకట్టుకున్నారు. ఆయన తండ్రి శామ్ కౌశల్ ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నమీత ఆయనపై లైంగిక ఆరోపణలు చేసింది. ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించేవాడని, ఓసారి షూటింగ్ సమయంలో తన గదిలోకి తీసుకెళ్లి వోడ్కా తాగమని బలవంతం చేశాడని ఆరోపించింది. అంతేగాకుండా ఓ పోర్న్ వీడియోను కూడా చూపించాడని వెల్లడించింది. మరి దీనిపై కౌశల్ అందరిలాగే ఖండిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

10:12 - October 16, 2018

పనాజీ: ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్ భారతదేశంలోని అన్ని రంగాల్లో దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇందులో భాగంగా దేశ సమాచారాన్ని దొంగిలించేందుకు వెబ్‌సైట్లను హ్యక్ చేయడం ప్రారంభించింది. దీనికి పరాకాష్టగా గోవా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన గుర్తుతెలియని గ్రూపు బీజేపీ పోర్టల్‌ గోవాబీజేపీ డాట్ ఆర్జీను హ్యాక్ చేసింది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఒక ఇమేజ్ దర్శనం ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఆ ఇమేజీ మీద ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’ అనే అక్షరాలు కనిపించాయి. ఇది పాక్ దుండగుల పనిగా భావిస్తున్నారు.  హ్యక్ గురైన సైట్‌లో ‘‘జై హింద్ జై భారత్’’ స్లోగన్‌తో బీజేపీ నేతలు ఈ సైట్ ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

 

 

 

10:02 - October 16, 2018

హైదరాబాద్ : చమురు ధరలు కిందకు దిగి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నా ఏ మాత్రం ధరల్లో తగ్గుదల లేదు. దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన పడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ పై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా అమాంతం పైకి ఎగబాకుతుండడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. గత ఆగస్టు నుండి చమరు ధరలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు పెల్లుబికాయి. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు కొంత ఊరట కలిగించేందుకు కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని రెండున్నర రూపాయల మేర తగ్గించింది. కానీ వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఈ పెట్రో ధరల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు.
మంగళవారం కూడా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై 11 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. దీనితో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.83కు, డీజిల్ ధర రూ. 75.69కి చేరుకుంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.29, డీజిల్ ధర లీటర్ కు రూ. 79.35..హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 87.81కు, విజయవాడలో పెట్రోలు రూ. 87.05కు, డీజిల్ రూ. 81.17కి చేరుకుంది. 

09:45 - October 16, 2018

ముంబై : తన అందం..అభినయంతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న మోడల్ అనంతలోకాలకు వెళ్లిపోయింది. దుర్మార్గుడు ఆమెను అంతమొందించారు. ఏకంగా ఆమె మృతదేహాన్ని బ్యాగులో కుక్కి చెత్తకుండిలో పడవేయడం వాణిజ్య రాజధానిలో తీవ్ర సంచలనం సృష్టించింది. దారుణ హత్యకు గురైంది ఎవరో కాదు...రాజస్థాన్ అందాల ముద్దుగుమ్మ ‘మానసి దీక్షిత్’...
 రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో మానసి దీక్షిత్ (20) నివాసం ఉంటూ మోడలింగ్ చేస్తున్నారు. అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆరు మాసాల క్రితం ముంబైకి మకాం మార్చింది. అంధేరి ప్రాంతంలోని మిల్లత్ నగర్ లో నివాసం ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ అనే వ్యక్తితో మానసికి పరిచయం ఏర్పడింది. సయ్యద్ (19) డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. వీరిద్దరి మద్య స్నేహం చిగురించింది. 
Dead body of aspiring model from Rajasthan found in suitcase; accused arrestedమలాద్ ప్రాంతంలో ఉన్న మైండ్ స్పేస్ వద్ద చెత్త కుండీలో పెద్ద సూట్ కేసును ఓ యువకుడు పడేశాడని ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనితో ఘటనా ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు సూట్ కేసు ఓపెన్ చేసి చూడగా దీక్షిత మృతదేహం కనిపించింది. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతం..పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు. మానసి..సయ్యద్ లు గొడవపడుతున్నట్లు..అకస్మాత్తుగా సయ్యద్ ఆమెపై దాడి చేయడం...అక్కడికక్కడనే మానసి దీక్షిత్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి క్యాబ్ లో తరలించి చెత్తకుండిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా హస్తం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

09:40 - October 16, 2018

హైదరాబాద్ : విదేశీ మద్యానికి క్రేజ్‌ పెరుగుతోంది...విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల బ్రాండ్‌లకు నగరంలోని మద్యం ప్రియులు ఫిదా అవుతున్నారు..దీనికితోడు విదేశీ మద్యం తాగడం అన్నది హోదాకు చిహ్నంగా మారిపోతోంది.. ఏ చిన్న ఫంక్షన్‌కానీ, బంధువులు, స్నేహితులు కలిసినప్పుడు మద్యం తాగాలనుకుంటే మాత్రం పక్కాగా విదేశీ మద్యానికి పెద్దపీట వేస్తున్నారు.. 

గతంలో అయితే ఫారిన్‌లిక్కర్‌ తాగాలంటే దొరికేది కాదు..దొంగచాటుగా అమ్మేవారి నుంచి కొనేవారు. కానీ గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో నగరంలోనూ పెద్దసంఖ్యలో మద్యం మాల్స్‌ వెలుస్తున్నాయి..జంటనగరాల్లోని ప్రతిమద్యం దుకాణంలోనూ ఏదో ఒక విదేశీ బ్రాండ్‌ దొరుకుతుందంటే విదేశీ మద్యానికి ఏ స్థాయిలో క్రేజ్‌ పెరిగిందో తెలుసుకోవచ్చు. 

హైదరాబాద్‌ నగరంలో మద్యం అమ్మకాల్లో 40శాతం వాటా వరకు విదేశీ మద్యం అమ్మకాలు పెరిగాయి..పండగ సీజన్‌ ప్రారంభమైంది. దసరా దాని తర్వాత దీపావళి ఆ తర్వాత క్రిస్మ్‌స పండగలు రానున్నాయి. దీంతో ఇప్పటికే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పటికే గత ఏడాది కంటే ఈసారి 10శాతం అమ్మకాలు పెరిగాయి..పండగల సీజన్‌లో మరో 10శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. మూడు నెలల్లో మద్యం అమ్మకాల విషయానికి వస్తే అంతకుముందు నెలకు 220కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, అది ప్రస్తుతం 280 కోట్లకు చేరింది..

చాలామంది వినియోగ దారులు తమ హోదాను చాటుకునేందుకు విదేశీ మద్యం కొనుగోలుచేస్తున్నారు..ధర ఎక్కువ ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే విదేశీ మద్యం ద్వారా 10 నుంచి 15శాతమే కమీషన్‌ వ స్తున్నా వ్యాపారులు వాటినే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. దేశీయ మద్యానికంటే విదేశీ మద్యం ధరలు ఎక్కువగా ఉండడం, ఎక్కువ టర్నోవర్‌సాధిస్తే ఎక్కువ లాభం వస్తుందని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు..నగరంలో విదేశీమద్యం అమ్మకాలు ఏస్థాయిలో జరుగుతున్నాయంటే రోజుకు 10కోట్ల నుంచి 15కోట్ల వ్యాపారం జరుగుతుందని అమ్మకం దారులు చెబుతున్నారు. 

నగరంలోని సంపన్నవర్గాలను టార్గెట్‌ చేసుకుని వెలుస్తున్న విదేశీ మద్యానికి ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వారు, నయాసంపన్న వర్గాలు కూడా ఆకర్షితులవుతున్నారు. మద్యం ప్రియులు జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనుకునే జానీవాకర్‌ ఎక్సో అనే మద్యం బాటిల్‌  ధర లక్షా 25వేలు అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇదినిజం. ఇక డామ్‌ తెరిగ్నమ్‌ అనే మరో రకం మద్యంధర 36వేలకు లభిస్తోంది. వాటినీ కొనేవారున్నారని వ్యాపారులు తెలిపారు. ఇలా మొత్తానికి హైదరాబాద్‌ నగరంలో విదేశీ మద్యం తన మార్కెట్‌ను రోజురోజుకు పెంచుకుంటోంది.

09:35 - October 16, 2018

జగిత్యాల : జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని హత మార్చాడు. తాటిపెల్లిలో నివాసముంటున్న నవీన్, శ్రవణ్ స్నేహితులు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో నవీన్, శ్రవణ్ గొడవ పడ్డారు. శ్రవణ్ పెన్ కత్తితో నవీన్‌ను పొడిచాడు. చాతీపై ఎక్కువగా కత్తి పొట్లు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌ను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి యవకుడు మృతి చెందాడు. నవీన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శ్రవణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. 

 

 

08:36 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీలో నేతల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయంతో అసమ్మతి నేతలపై వేటు వేస్తోంది. పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో అసమ్మతి నేతలు దారికి వస్తారని గులాబి పార్టీ భావిస్తోంది.

క్రమశిక్షణపై రాజీపడేది లేదన్న సంకేతాలను తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తోంది. పదవుల్లో ఉన్నా నియమావళిని ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్లు దక్కించుకునేందుకు పోటీపడిన నేతలు.. పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు తెరలేపడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ అన్ని వ్యూహాలు అమలుచేస్తోంది. ఓ వైపు బుజ్జగిస్తూనే.. మరోవైపు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. కొంతమంది నేతలు దారికి వస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. దీంతో దారిలోకి రాని నేతల వ్యవహారంపై గులాబీ బాస్‌ సీరియస్‌గా ఉన్నారు. 

ఇప్పటికే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో సీనియర్‌ నేత వేనెపల్లి వెంకటేశ్వరరావుపై బహిష్కరణ వేటుపడింది. తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను కూడా పార్టీ నుండి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాములునాయక్‌.. విపక్ష పార్టీ కీలకనేతలతో భేటీ అయ్యారన్న సమాచారంతో పాటు.. పార్టీని వీడేందుకు సిద్దమయ్యారన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సస్పెన్షన్‌ నిర్ణయాన్ని రాములునాయక్‌ తప్పుపట్టారు. గిరిజన నేతను అయినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఇంకా ఎన్నికలకు 45 రోజుల గడువు ఉండడంతో.. కేసీఆర్‌ ప్రచారం ముమ్మరం చేయకముందే.. అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. మాట వినని నేతలపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలను ఇస్తోంది. మరి ఇప్పటికైనా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గుతారా.. లేకపోతే పార్టీని ఢీకొట్టేందుకు సాహసం చేస్తారా ! అనేది చూడాలి. 

08:08 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెట్టబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపై చర్చించేందుకు ఇవాళ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై కూడా నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా హాజరుకానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పెండింగ్‌ ఉన్న అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికార పగ్గాలు చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు అనేక ప్రణాళికలు రచించిన అధికార పార్టీ.. గెలుపు లక్ష్యంగా అనేక కసరత్తులు చేస్తోంది. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే ప్రచార పర్వానికి తెరదీసిన టీఆర్‌ఎస్‌.. ఇప్పటికే దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్‌ తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయగా.. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం ఉండడంతో దసరా పండుగ తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది. 

ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మన్ననలు పొంది.. పట్టును నిరూపించుకునేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఇవ్వాల్సిన హామీలపై పార్టీ కసరత్తు చేస్తోంది. నెల రోజుల క్రితం నుంచే అన్ని వర్గాల ప్రజల నుంచి పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కేకే అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. మంత్రులు కూడా శాఖలవారీగా.. తమ శాఖలకు సంబంధించిన వివరాలను కమిటీకి తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై పార్టీపరంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఓ మెట్టు దిగేందుకు కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. సొంత ఇంటిస్థలం ఉంటే లబ్ధిదారులకు 5 లేదా ఆరు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం నేరుగా ఆర్థికసహాయం చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరుకానుండడంతో మరిన్ని ప్రజాకర్షక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే.. ఈ సమావేశం పాక్షికంగా మాత్రమే మేనిఫెస్టోను ప్రకటించనుంది. దసరా తర్వాత పూర్తి హామీలను పార్టీ ప్రకటించనుంది. ఇక ప్రకటించని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కేసీఆర్‌ ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Don't Miss