Activities calendar

18 October 2018

20:24 - October 18, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ కనుమరుగైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి బీజేపీ రాకపోవచ్చని జోస్యం కూడా చెప్పారు. ఎన్డీయే వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విజయశాంతి అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రధానంగా టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పోటీ అని విజయశాంతి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ అని ఆమె విమర్శించారు. తాము వాస్తవాలు చెబుతుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. దొంగ ఎప్పుడూ దొంగతనం చేసింది చెప్పడని... అలాగే టీఆర్ఎస్ నేతలు చేసిన దోపిడీని ఒప్పుకోరని ఆమె అన్నారు. 

మరోవైపు మెదక్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. సిద్ధిపేట మినహాయించి ఇతర స్థానాల్లో ఒక్క సీటు ఇచ్చినా పార్లమెంటు సీటు గల్లంతవుతుందని హెచ్చరించారు. పొత్తులో భాగంగా మహాకూటమిలోని పార్టీలకు ఇతర సీట్లు ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరించారని విజయశాంతి తేల్చి చెప్పారు.

19:24 - October 18, 2018

హైదరాబాద్: తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడిన మాధవి కోలుకుంది. మృత్యువు నుంచి బయటపడింది. నెల రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై సెప్టెంబర్ 19వ తేదీన ఎర్రగడ్డ వద్ద అమ్మాయి తండ్రి మనోహరాచారి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మాధవి ఎడమ చేయి సగానికి పైగా తెగిపోయింది. మెడ, చెవికి బలమైన గాయాలయ్యాయి. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం తెగిపోయింది. మాధవి భర్త సందీప్‌కు కూడా ముఖం, చేయిపై గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన మాధవిని సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించగా నెల రోజుల పాటు పలు సర్జరీలు, చికిత్సలు అందించారు. బుధవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఇంకా పూర్తిగా కోలుకోని మాధవి ఇబ్బంది పడుతూనే మీడియాతో మాట్లాడింది. తాను పుట్టింటికి వెళ్లనని, భర్త సందీప్‌తోనే ఉంటానని చెప్పింది. తనపై దాడి చేసిన తండ్రికి తగిన శిక్ష పడాలని డిమాండ్‌ చేసింది. తనకు, భర్త, అత్త, ఆడపడుచులకు తన తండ్రి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరింది. 

ప్రాణాపాయ స్థితిలో తమ ఆస్పత్రికి వచ్చిన మాధవికి ఎన్నో శస్త్రచికిత్సలు చేశామని, సగానికి పైగా తెగిపోయి వేలాడుతున్న చేతిని అతికించామని, ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి పూర్వ స్థితికి తెచ్చామని యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఆమెకు మరో ఏడాది పాటు చికిత్స అవసరమని చెప్పారు. మాధవి చికిత్సకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందని ఆమె భర్త సందీప్‌ తెలిపారు.

‘‘నాన్నా.. పశ్చాత్తాప పడినా నిన్ను క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. కని, పెంచిన చేతులతోనే కసితీరా దాడి చేశావు. మరో వేటు పడి ఉంటే బతికే దాన్ని కాదేమో. ప్రభుత్వం ఆదుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అండగా నిలిచారు. యశోదా ఆస్పత్రి డాక్టర్లు ప్రాణం పోశారు. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా ఏడాది పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నీ కూతురిగా పుట్టినందుకు భరించలేని నొప్పి ఇచ్చావు. మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నా తండ్రికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే’’ అని తండ్రి చేతిలో గాయపడిన మాధవి కన్నీటి పర్యంతమైంది. 

సందీప్‌పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావించానని, ఇదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పానని మాధవి తెలిపింది. అయితే, వారు అంగీకరించకపోవడం వల్లే ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని వివరించింది. తనలాంటి పరిస్థితి మరే ప్రేమ జంటకు రాకూడదని, దాడి చేసిన వారెవరైనా శిక్ష అనుభవించి తీరాల్సిందేనని మాధవి స్పష్టం చేసింది.

18:08 - October 18, 2018

హైదరాబాద్: బేగంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్య తనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిందనే కోపంతో భర్త ఉన్మాదిగా మారాడు. కొబ్బరి బోండాల కత్తితో పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా నరికాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో భార్యతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

బేగంపేట ప్రాంతంలో నివాసం ఉండే కౌసర్‌బీ, రహీం దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. రహీం తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ వేధింపులు భరించలేని భార్య గురువారం తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేటలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. తన భార్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందని తెలుసుకున్న రహీం కోపంతో ఊగిపోయాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తితో స్టేషన్‌కు చేరుకున్న అతడు మహిళా పోలీసులు అడ్డుకుంటున్నా వారి నుంచి తప్పించుకుని భార్యతో పాటు కుటుంబసభ్యులు సల్మాన్, మస్తాన్ బేగం, షకీరా, షాహిన్‌లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రహీంపై 324, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రహీంను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది.

17:49 - October 18, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుఫానుతో గూడు చెదిరిపోయిన పక్షుల్లా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. తినేందుకు తిండి లేక..తాగేందుకు మంచి నీరు లేక విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని కష్టాలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించారు. తిత్లీ బాధితులను  కొందరు అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసిందని... అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..తుపాను వల్ల పచ్చటి ఉద్దానం మొత్తం నాశనం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని... జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రంగాల వారీగా నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు.
ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. కేరళకు తుపాను వస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని... ఇక్కడి తుపాను బయట ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయట ప్రపంచానికి తీసుకెళ్తామన్నారు. కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 

17:29 - October 18, 2018

తిరుమల : శ్రీవారి పుష్కరిణి.. తిరుమలపై వెలసిన శ్రీమన్నారాయణుడు తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వయంగా రప్పించిన తీర్థమిదేనని భక్తులు నమ్ముతారు. సకల పాపనాశనిగా ఈ పుష్కరిణికి పేరుంది. సకల పాపనాశనిగా ఈ పుష్కరిణికి పేరుంది. తారకాసురుని సంహరించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ఇక ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పుష్కరిణిలో చక్రస్నానానికి అంతటి విశిష్టత ఉంది. చక్రస్నానం అనంతరం నిర్వహించే ధ్వజావరోహణతోనే బ్రహ్మోత్సవాలు ముగియడం విశేషం. 
శ్రీవారి కంటే భిన్నమైంది మరొకటి లేదు. విద్యల్లో కెల్లా వేద విద్య, మంత్రాల్లో ప్రణవం, ప్రియమైన వస్తువుల్లో ప్రాణం, ధేనువుల్లో కామధేనువు, ఆయుధాల్లో వజ్రాయుధం, పక్షుల్లో గరుడుడు, వృక్షాల్లో కల్పవృక్షం తీర్థాల్లో గంగా మాదిరిగా క్షేత్రాలలో తిరుమలేశుని ఆలయం శ్రేష్టమైనది. అందుకే భక్తజనులు శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూదేవి, శ్రీదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో ప్రధాని పూజారులు  చక్రస్నానం నిర్వహించారు. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం అంగరంగ వైభంగా..కన్నుల పండవగా సాగింది. చక్రస్నానం అనంతరం రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి కాబట్టి భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చు. దీంతో భక్తులు శ్రీవారి చక్కస్నానం అయిన తరువాత స్నానం చేసేందుకు బారులు తీరారు. 
అంతకు ముందు రాత్రి శ్రీవారు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున  అశ్వరూఢుడై స్వామి విహరించారు. కలి ప్రభావం నుంచి భక్తులను కాపాడి దుర్మార్గుల్ని శిక్షిస్తానని సందేశమిస్తూ.. అశ్వవాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. గురువారం ఉదయం మూడు గంటల పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామి మహారథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. వేలాది మంది భక్తులు తిరువీధుల్లో రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. 
 

17:05 - October 18, 2018

తన తండ్రి స్వర్గీయ, ఎన్టీఆర్ జీవిత కథతో, నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఎన్టీఆర్.. కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. రెండు భాగాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ మూవీ యూనిట్ చాలా స్పీడ్‌గా ఉంది.. నిన్న షూటింగ్ లొకేషన్‌లో తీసిన ఫోటోని విద్యా బాలన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. ఈ రోజు దసరా సందర్భంగా, తన తండ్రి స్వర్గీయ, నందమూరి హరికృష్ణ‌గా నటిస్తున్న ఆయన తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ రిలీజ్ చేసారు.. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం తర్వాత, చైతన్య రథం నడపడం దగ్గరినుండి, పార్టీ కార్యక్రమాల వరకూ చాలా వ్యవహారాలు హరికృష్ణ‌ చూసుకునేవారు.. ఇప్పుడీ స్టిల్ చూస్తే ఆ రోజులు గుర్తుకొస్తాయి.. రామారావు గెటప్‌లో బాలయ్య దీర్ఘంగా ఆలోచిస్తుండగా,  హరికృష్ణ‌గా మారిన కళ్యాణ్ రామ్ ఆయనకేదో చెప్తున్నట్టు ఉన్న ఈ లుక్ అభిమానులకి అసలైన పండగ ఆనందాన్నిచ్చింది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..

16:51 - October 18, 2018

హైదరాబాద్ : అమ్మలేని జన్మ లేదు. జన్మాత లేని జగతి లేదు. జన్మాత అయిన ఆ ఆది పరాశక్తికే ఈ సకల సరాచర జగత్తికి శక్తి, యుక్తి,భుక్తి ముక్తి ప్రదాయని అమ్మవారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గరమ్మల మూలపుట్మ దుర్గమ్మ అంటు పూజించి,  పరవశించి, తరించిపోయే పది రోజుల పండగ, నవరాత్రుల పండగే దసరా నవరాత్రి  ఉత్సవాలు. దేశమవంతా దసరా ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఊరూవాడా.. ప్రతీ ఆలయం అమ్మవారి అపురూప అవతార అలంకరణతో అమ్మవారి  నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. చెడుపై మంచి సాధించిన దసరా మహిళలందరినీ పండుగ, స్త్రీ అబల కాదు సబల అని నిరూపించి లోకానికి చాటి చెప్పిన పండుగ దసరా వేడుక. అమ్మ శక్తి స్వరూపిణిగా అవతరించిన పండుగ దసరా వేడుక. ఈ శరన్నవాత్రి వేడుక గురించి దసరా పర్వదినం వేడుక గురించి..విజయదశమి వైభవం  విశేషాలను తెలుసుకుందాం. ఈ దసరా మహోత్సవాల గురించి ఎన్నో కథలు వున్నాయి. మరి ఆ కథల విశేషాలను తెలుసుకుందాం. ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ నవరాత్రి ఉత్సవాలు..10వ రోజు విజయదశమి పండుగగాను జరుపుకుంటుంటాం.
 

 

 

16:48 - October 18, 2018

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తివారీ.. సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఆయన.. గతేడాది సెప్టెంబర్ 20న మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు. 

పుట్టిన రోజు నాడే తివారీ మరణించడం విషాదకరం. 1925, అక్టోబర్ 18న నైనిటాల్ జిల్లాలో తివారీ జన్మించారు. తివారీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించారు.

ఎన్డీ తివారీ పూర్తి పేరు పండిట్ నారాయణ దత్ తివారీ. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా పనిచేశారాయన. 1976లో తొలిసారి సీఎం అయ్యారు. 1984లో రెండోసారి, 1988లో మూడోసారి యూపీ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. దీంతో పాటు కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఎన్డీ తివారీకి ఉంది.  యూపీ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా ఎన్డీ తివారీ సేవలు అందించారు. 2002 నుంచి 2007 మధ్య ఆయన ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా ఎన్డీ తివారీ పనిచేశారు. 2007 ఆగస్ట్ 22 నుంచి 2009 డిసెంబర్ 26 వరకు ఆయన ఏపీ గవర్నర్‌గా సేవలు అందించారు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. ఎన్డీ తివారీ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో లైంగిక చర్యలకు పాల్పడుతున్నాంటూ అప్పట్లో ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వీడియో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని, బ్లాక్‌మెయిల్ చేశారని కేసు కూడా నమోదైంది. ఆ ఘటనకు సంబంధించి తివారీ బహిరంగ క్షమాపణ చెప్పారు.

16:23 - October 18, 2018

తిరుమల : తిరుమల అంటే గుర్తుకొచ్చే శ్రీ వేంకటేశ్వర స్వామి. వెంకన్న అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనకు, ఆయన భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. లడ్డూల పేరుతో కూడా శ్రీవారి సన్నిథిలో అక్రమాలు సర్వసాధారణంగా జరిగటం రివాజుగా మారిపోయింది.  ఈ నేపథ్యంలో తిరుమలలో బ్యాంకుల నిర్వహణ పరిధిలోని లడ్డూ కౌంటర్లలో అక్రమాలు జరిగినట్లు టీటీడీ నిఘా విభాగం గుర్తించింది. ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 22 లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్యాంకుల నిర్వహణలోని కౌంటర్లలో ఒప్పంద ఉద్యోగులు లడ్డూలు విక్రయించారు. రద్దీ దృష్ట్యా టోకెన్ స్కానింగ్ లేకున్నా లడ్డూలు అందించాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ లేకపోవడంతో కాంట్రాక్ట్  సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. ప్రాథమికంగా 16 వేల లడ్డూలు పక్కదారి పట్టినట్లు నిఘా విభాగం అధికారులు గుర్తించారు. అధిక మొత్తంలో అక్రమాలు జరిగినట్లు టీటీడీ నిఘా విభాగం అనుమానిస్తుంది. ఈ నెల 14 నుంచి లడ్డూ కౌంటర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. లడ్డూల అక్రమాలపై నిఘా విభాగం అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ లడ్డూల అక్రమలకు అడ్డుకట్ట పడకపోవటంతో శ్రీవారి భక్తులు స్వామీ..ఈ లడ్డూల మాయగాళ్లను కనిపెట్టవయ్యా అంటు స్వామివారికి మొరపెట్టుకుంటున్నారు.
 

16:21 - October 18, 2018

ఢిల్లీ: మీ టూ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను విచారించిన పాటియాలా హౌస్ కోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున ఎంజే అక్బర్ స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేయనుంది.

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియా రమణిపై ఎంజే అక్బర్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. ప్రియా రమణి తన పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆరోపణలు చేసిందంటూ సోమవారం (అక్టోబర్ 15) ఆయన పాటియాలా హౌస్‌ కోర్టులో కేసు వేశారు. తనపై అన్యాయంగా నిందలు మోపుతున్నారనీ, మహిళా పాత్రికేయులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమనీ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకే ఇలాంటి అంశాలు ముందుకుతెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంజే అక్బర్ దావాపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

మీ టూ ఉద్యమం దేశంలో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. మీ టూలో భాగంగా కొంత మంది మహిళా జర్నలిస్టులు ఎంజే అక్బర్‌‌పై సంచలన ఆరోపణలు చేశారు. అక్బర్ పనిచేసిన మీడియా సంస్థలలో చాలామంది మహిళలు ఆయన నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. 

అక్బర్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఈ అంశంపై స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన తరుణంలో వ్యక్తిగతంగా పోరాడటమే మంచిదని భావించిన అక్బర్.. తన పదవికి రాజీనామా చేశారు.

భారతదేశంలోని ప్రముఖ సంపాదకులలో ఒకరుగా పేరు పొందిన అక్బర్.. ది టెలిగ్రాఫ్, ది ఏసియన్ ఏజ్ వంటి పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరిచారు. ఆ సమయంలో ఆయనతో పని చేసిన కొందరు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆరోపణలు చేశారు.

16:19 - October 18, 2018

విశాల్ హీరోగా, ఎన్.లింగుస్వామి డైరెక్షన్‌లో దాదాపు 13‌ఏళ్ళక్రితం పందెంకోడి చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. తమిళ్‌తోపాటు తెలుగులోనూ చాలా బాగా ఆడింది.. ఫ్యాక్షనిజం, ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు.. లవ్, కామెడీ కలగలసిన పందెంకోడి చిత్రానికి కొనసాగింపుగా.. ఇప్పుడు పందెంకోడి 2 రూపొందింది.. హీరోగా విశాల్‌కి 25వ చిత్రం ఇది..  ఈ మూవీని ఠాగుర్ మధు తెలుగులో సమర్పిస్తున్నాడు.. దసరా కానుకగా, తెలుగు, తమిళ్‌లో ఈ రోజు  విడుదలైన పందెంకోడి 2 ఎలా ఉందో చూద్దాం..
కథ :
తొలిభాగం అందరికీ తెలిసిందే కనక, సింపుల్‌గా చెప్పాలంటే, వీరభధ్ర స్వామి జాతరలో చిన్న వివాదం, చిలికి చిలికి రెండు కుటుంబాల మధ్య పగగా మారుతుంది.. ఒక కుటుంబంలో అసలు వారసుడనేవాడే లేకుండా చెయ్యాలని మరో కుటుంబం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి టైమ్‌లో  ఊళ్ళోకి వచ్చిన హీరో, ఆ సమస్యని  ఎలా పరిష్కరించాడు అనేదే పందెంకోడి2 కథ..
నటీనటులు & సాంకేతిక నిపుణులు
విశాల్ మొదటి భాగంలోలానే పొగరెక్కిన పందెంకోడిలా రెచ్చిపోయాడు.. రాయలసీమ యాసలో అతని డైలాగ్ డెలివరీ బాగుంది.. తమిళ్‌లో హీరోయిన్లకి, హీరోకి ధీటుగా నటించే సత్తా ఉన్న పాత్రలు సృష్టిస్తుంటారు దర్శకులు.. ఈ మూవీలో కీర్తిసురేష్ క్యారెక్టర్ అలానే ఉంటుంది.. ధైర్యంగల పల్లెటూరి యువతిగా కీర్తి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది..  వరలక్ష్మీ శరత్ కుమార్ తన నటనతో అద్భుతమైన విలనిజాన్ని పండించింది.. సినిమాకి ఆమె నటన హైలెట్ అయింది.. వీళ్ళిద్దరూ తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.. రాజ్ కిరణ్ మరోసారి తన నటనతో మెప్పించగా, గంజ కరుప్పు, రామ్ దాస్, కబాలి విశ్వనాధ్ వంటివారు ఉన్నంతలో బాగానే చేసారు.. యువన్‌‌ శంకర్‌ రాజా పాటలు ఓ మాదిరిగా ఉన్నా, ఆర్ఆర్‌తో ఆకట్టుకున్నాడు.. కెమెరా, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.. దర్శకుడు లింగుస్వామి, సీక్వెల్ కాబట్టి పదునైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాడు.. ఎమోషన్‌తో ఆకట్టుకున్నాడు..  లాజిక్స్ పక్కనపెడితే పందెంకోడి2 చూడడానికి బాగానే ఉంటుంది.. 
తారాగణం :  విశాల్‌, కీర్తిసురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాజ్ కిరణ్, గంజ కరుప్పు, రామ్ దాస్, కబాలి విశ్వనాధ్
కెమెరా     : కె.ఎ.శక్తివేల్
సంగీతం   : యువన్‌‌ శంకర్‌ రాజా 
ఎడిటింగ్  : ప్రవీణ్ కె.ఎల్.
సమర్పణ  :  ఠాగుర్ మధు 
నిర్మాతలు : విశాల్, జయంతిలాల్, అక్షయ్  జయంతిలాల్‌
దర్శకత్వం : ఎన్.లింగుస్వామి 
రేటింగ్      : 2.5/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

15:57 - October 18, 2018

చెన్నై : దసరా వచ్చిందంటే చాలు చెన్నైలోని ఓ ఇంట్లో బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ ఇల్లు మరెవరిదో కాదు ప్రముఖ రచయిత, నటుడు, యాంకర్ అయిన గొల్లపూడి మారుతీరావు ఇల్లు. చెన్నై టీ నగర్ లోని గొల్లపూడివారి ఇంట్లో గత 18 ఏళ్ల నుండి వివిధ రకాల థీమ్స్ తో ఈ విభిన్నమైన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది. చెన్నైలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు కొలువుదీరే శివాని నిలయంలో ఈ బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. గొల్లపూడి మారుతీరావు కోడళైన శివానీ, సునీతల విభిన్న ఆలోచనలకు ప్రతిబింభంగా కొలువుదీరుతోంది ఈ బొమ్మల కొలువు రాబోయే తరాలకు తెలుగు సంప్రదాయాలను అందించేవిధంగా ఏర్పాటు చేస్తుంటారు శివానీ, సునీతలు. వీరి ఇంట్లో బొమ్మల కొలువును చూసేందుకు చెన్నై ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. దీంతో గొల్లపూడివారి గూటికి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఇది గత 18 సంవత్సరా లనుండి కొనసాగుతోంది. 
 

 

15:55 - October 18, 2018

ముంబై: దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలను మీ టూ ఉద్యమం కుదిపేస్తోంది. మీ టూ కారణంగా కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కాగా మీ టూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రో ధరల పెరుగుదల, రూపాయి పతనం, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే మీ టూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానాపటేకర్‌పై నటి తనూశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు నమ్మబుద్ది కావడం లేదన్నారు. పటేకర్ అసభ్యంగా ప్రవర్తించే (ఇన్‌డీసెంట్) వ్యక్తే కావచ్చని, అయితే, మహిళలతో అలా ప్రవర్తించారంటే మాత్రం నమ్మలేకపోతున్నానని ఠాక్రే అన్నారు. మీ టూ ఉద్యమం చాలా తీవ్రమైందేనన్న ఆయన దీనిపై సోషల్ మీడియాలో రచ్చ అనవసరమన్నారు. దీనిపై కోర్టులు కూడా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ పార్టీని సంప్రదిస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని రాజ్‌ఠాక్రే హామీ ఇచ్చారు. లైంగిక వేధింపులు జరిగిన పదేళ్ల తర్వాత స్పందిస్తే కుదరదని, ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని బాధిత మహిళలకు రాజ్‌ఠాక్రే సూచించారు. దయచేసి ఇకపై ట్విట్టర్‌లో మీ టూ ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

15:20 - October 18, 2018

వాషింగ్‌టన్: హెచ్-1బీ కింద వచ్చే వృత్తుల వర్గీకరణను మార్చడంతో పాటు.. హెచ్-1బీ వీసా నిబంధనలను మార్చివేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాలోని భారతీయ కంపెనీలకు అవసరమైన విదేశీ ఉద్యోగుల యెక్క వర్కింగ్ వీసా కేటగిరీ నిబంధనలను సరికొత్తగా నిర్వచిస్తారు.  
యూనిఫైడ్ ఫాల్ అజెండా ఆప్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా రాబోయే మార్పుల వల్ల అమెరికాలోని భారతీయుల ఐటీ కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే చిన్న, మధ్యతరహా ఒప్పంద ఐటీ కంపెనీలపై కూడా ఈ నిబంధనల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2019 జనవరి కల్లా అమల్లోకి తెచ్చేందుకు యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రయత్నాలు ప్రారంభించినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) బుధవారం తెలిపింది. 
‘ప్రత్యేక వృత్తి నైపుణ్యం’ అంటే ఎలా ఉండాలి అన్నదాన్ని నిర్వచించడంతోపాటు హెచ్-1బీ ద్వారా అత్యంత ఉత్తమ తెలివితేటలు కల్గిన విదేశీ నిపుణలను మాత్రమే దేశంలోకి రప్పించేందుకు వీలుగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే ‘ఉపాధి’, యజమాని-ఉద్యోగి అనే పదాలను సైతం సరికొత్తగా నిర్వచించాలని అమెరికా యోచిస్తోందని డీహెచ్ఎస్ తెలిపింది. దీంతోపాటు హెచ్-1బీ వీసా ఉన్నవారికి సైతం వేతన నిర్ణయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్-1బీ వలస ఉద్యోగులకు వారి హెచ్ 4 జీవిత భాగస్వామ్యులను ఉద్యోగం పొందే నిబంధనలను తీసివేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని డీహెచ్ఎస్ తెలిపింది. 
 

 

15:11 - October 18, 2018

శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వంపైన ఇటు రాష్ట్రంలోని విపక్షాలపైన మండిపడ్డారు. బీజేపీ, జగన్, పవన్‌ల తీరుని తప్పుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

జిల్లాలోని తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. బీజేపీతో పాటు జగన్‌, పవన్‌లపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లాలో సహాయక చర్యలు నిలిచిపోవాలని కేంద్రం కోరుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి, తనను విమర్శించి వెళ్లపోయారని, తుపాను బాధితులను పరామర్శించేందుకు మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా ఉండాల్సిన కేంద్రం ఏపీపై దాడులు చేయిస్తూ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని, కానీ కేంద్రం పప్పులు ఇక్కడ ఉడకవని చంద్రబాబు తేల్చి చెప్పారు.

పక్క జిల్లాలో పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి గంట దూరంలో ఉన్న శ్రీకాకుళం వచ్చి తుపాను బాధితులను పరామర్శించేంత తీరిక లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని ఎదురుచూస్తున్న ఆయనకు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే సమయం ఉంటుందని, కానీ తుపానుతో అల్లాడిపోతున్న ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఇక, అంతా అయిపోయాక పవన్ వచ్చి పరామర్శించి వెళ్లారని చంద్రబాబు అన్నారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారాయన. 

మరోవైపు తిత్లీ తుఫాను కారణంగా రూ.3,466 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక సమర్పించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను  పర్యవేక్షించిన సీఎం.. నిత్యవసరాల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ రైతు బజార్ల ద్వారా కూరగాయలు అమ్మేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

15:05 - October 18, 2018

హైదరాబాద్ : నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో భారీగా జనాభా వుండటంతో ఏఒక్క అంటువ్యాధి వచ్చినా అది త్వరగా విస్తరించే అవకాశం వుంటుంది. దీనికి తోడు నగరంలో వుండే స్లమ్స్, మురికివాడలు..డ్రైనేజ్ వంటి పలు కారణాల వల్ల వ్యాధులు తీవ్రంగా ప్రభలే అవకాశాలుంటాయి. కాగా శీతాకాలం దాదాపు వచ్చేసినట్లే. శీతాకాలం అంటే వ్యాధుల కాలం అన్నమాట. ఏమాత్రం అజాగ్రత్తగా వున్న పలు వ్యాధులు ఇబ్బందులకు గురిచేసేస్తాయి. దీంతో నగరంలో స్వైన్‌ప్లూ వేగంగా విస్తరిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 

Image result for health swine fluవృద్ధులు, గర్భిణులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధులు, రక్తపోటు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులున్న వారికి స్వైన్ ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉందని, వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 మంది స్వైన్ ఫ్లూ కారణంగా మరణించడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ ఈ ప్రకటన చేసింది. పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ మరో నలుగురు ఆసుపత్రిలో చేరినట్టు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.  
స్వైన్‌ఫ్లూ లక్షణాలు..Related image
జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలుంటే దానిని స్వైన్‌ఫ్లూగా అనుమానించవచ్చు. ఇవి తీవ్రమైతే వెంటనే వైద్యులను స్పందించాలి. ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్ల వచ్చు. బయటకు వెళ్లేటప్పుడు నోటికి మాస్కులు ధరించటం, కరచాలనం, దగ్గినా, తుమ్మినా వెంటనే చేతులు కడుక్కోవటం వంటి పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడం మంచిది.

14:42 - October 18, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే... దసరా కానుకగా ఈ రోజు  ప్రేక్షకులముందుకు వచ్చిన హలో గురు ప్రేమకోసమే ఎలా ఉందో చూద్దాం..
కథ :
కాకినాడలో అమ్మ,నాన్నతో ఉంటూ, హాయిగా బతికేసే ఈ జనరేషన్ కుర్రాడు సంజు(రామ్), జాబ్ గురించి హైదరాబాద్ వస్తూ, ట్రైన్‌లో కనబడ్డ అను(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు.. హైదరాబాద్‌లో వాళ్ళఫ్యామిలీ ఫ్రెండ్ విశ్వనాధం(ప్రకాష్ రాజ్ ) ఇంట్లో ఉంటూ, ట్రైనర్‌గా ఐటీ‌లో జాయిన్ అవుతాడు.. ఆఫీస్‌లో..(రీతు)ప్రణీతని లవ్ చేస్తాడు.. అనుని లవ్ చెయ్యడానికి విశ్వనాధం సలహాలు తీసుకుంటుంటాడు సంజు.. సడెన్‌గా అనుకి వాళ్ళనాన్న అమెరికా సంబంధం ఖాయం చేస్తాడు.. అలాంటప్పుడు సంజు తన ప్రేమకోసం ఏం చేసాడు అనేది హలో గురు కథ..
నటీనటులు & సాంకేతిక నిపుణులు :
పేరుకి తగ్గట్టే రామ్ ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్‌ చేసాడు.. కామెడీ, ఎమోషన్ సీన్స్‌లో బాగా నటించాడు.. అనుపమ పర్వాలేదనిపంస్తుంది.. ప్రణీత కూడా అంతే.. ప్రకాష్ రాజ్ తండ్రిగా తనదైన శైలి నటనతో అలరించాడు.. రామ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.. సితార, పోసాని తదితరులు ఉన్నంతలో ఓకే అనిపించారు..
విజయ్ కె చక్రవర్తి కెమెరా వర్క్ బాగానే ఉంది.. దేవిశ్రీ సంగీతం యావరేజ్‌గా ఉంది.. దిల్‌రాజు  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. దర్శకుడు పాతకథని కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు.. కామెడీ తోడవడంతో పాస్ మార్కులతో గట్టెక్కేసాడని చెప్పాలి.. ఈ దసరాకి కుర్రకారు టైమ్ పాస్ చేసే సినిమా..  హలో గురు ప్రేమకోసమే..

తారాగణం : రామ్,  అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, సితార, పోసాని, వి.జయప్రకాష్. 
కెమెరా     : విజయ్ కె చక్రవర్తి 
సంగీతం   :  దేవిశ్రీ ప్రసాద్ 
ఎడిటింగ్  :  కార్తీక శ్రీనివాస్

సమర్పణ  :   దిల్‌రాజు 
నిర్మాత    :  శిరీష్, లక్షణ్ 

దర్శకత్వం :  త్రినాధరావు నక్కిన  


రేటింగ్      :  2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

14:37 - October 18, 2018

పశ్చిమగోదావరి : 2019 అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు అన్ని పార్టీలు సమాయత్తవం అవుతున్నాయి. కానీ ఇప్పటివరకూ జనసేన పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో  ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో కీలక నియామకాలు చేపడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయవాది ఉండపల్లి రమేశ్ నాయుడును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. రమేశ్ నాయుడు స్వస్థలం భీమవరం. రమేశ్ తో పాటు మరో 11 జిల్లాలకు లీగల్ సెల్ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. కాగా రమేశ్ నాయుడు ప్రస్తుతం చిరుపవన్‌తేజం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మెగాఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడిగా, కాపు యువసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన రమేశ్ యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అప్పటి నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ప్రారంభించాక ఆ పార్టీ అనుచరుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 

 

13:47 - October 18, 2018

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన విమర్శలపై టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడునుద్దేశించి మహిషాసురడని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. జగన్ ఓ రాక్షసుడు...రాక్షస కృత్యాలు చేయడం...రాక్షస భాష మాట్లాడడంలో ఆయనకు మించిన వారు లేరని సునీత వ్యాఖ్యానించారు. అసలు సిసలు మహిషాసురుడు జగనేనని, ‘పసుపు - కుంకుమ’ పథకాన్ని జగన్ హేళన చేయడం సబబుకాదన్నారు. 
డ్వాక్రా పథకాల అమలు తీరుతెన్నులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని...జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు ‘జగనాసురుడు’ని చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని, కోటి మంది డ్వాక్రా మహిళలను జగన్ అవమానించారని తెలిపారు. మరో పది రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, ‘పసుపు - కుంకుమ’ పథకం తుది విడత నిధులను విడుద చేయడం జరిగిందన్నారు. వైఎస్ హాయాంలో డ్వాక్రా మహిళలకు కేవలం రూ. 276 కోట్లు మాత్రమే నిధులిచ్చారని కానీ బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా రూ. 11, 180 కోట్లు ఇచ్చామన్నారు. మంత్రి సునీత చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మరలా ప్రతి కౌంటర్ ఇస్తారోమో చూడాలి. 

13:31 - October 18, 2018

ఆస్ట్రేలియా : క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఓ చరిత్ర ఆవిషృతమయ్యింది. ఇప్పటి వరకూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది జరగలేదు. అంతటి సంచలన ఘన విజయానికి నాంది పలికారు నారీ మణులు. ఓ క్రికెట్ మ్యాచ్ లో 571 పరుగుల తేడాతో విజయం సాధించిందో జట్టు. ఇది వినటానికి వింతగా..నమ్మలేనంతగా వున్న వాస్తవం. పచ్చినిజం. ఈ సంచలనానికి వేదికగా నిలిచారు మహిళా క్రికెటర్స్. 
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ స్థానిక టోర్నీలో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌‌, పోర్ట్‌ అడిలైడ్‌ మహిళల జట్లు ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌ వైడ్‌ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న వేళ తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 3 వికెట్ల నష్టానికి 596 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన  పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు కేవలం 25 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు 10.5 ఓవర్లలో 25 పరుగులే చేయగా, నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 571 పరుగుల తేడాతో గెలిచింది. నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టులో నలుగురు సెంచరీలు సాధించడం మరో రికార్డు. టెగాన్‌ మెక్‌ ఫార్లిన్‌ 136, టాబీ సవిలీ 120, శామ్‌ బెట్స్‌ 124, డార్సీ బ్రౌన్‌ 117 పరుగులు చేశారు. గుర్తింపు పొందిన క్రికెట్ ఫార్మాట్లలో ఇదే అత్యధిక స్కోరు, భారీ విజయం.

 

13:17 - October 18, 2018

హైదరాబాద్ : అందమైన నగరం..ఎన్నో విశిష్టతలకు..ప్రకృతి సిద్ధమైన అందాలతో పాటు మానవుడు సృష్టించిన మరో ప్రకృతి మహానగరం..ఎంతో మంది హైదరాబాద్ నగరాన్ని వీక్షించడానికి వస్తుంటారు. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయులలో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్షా చేత 1591 లో ఏర్పాటయింది. ఈ నగరంలో వివిధ దేశాలు..రాష్ట్రాల వారు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం నగరంలో నివాసం ఉంటున్న కొంతమందిపై హాట్ చర్చ సాగుతోంది. వారే ‘రోహింగ్యాలు’. దేశం నుండి మరోదేశం వెళ్లాలంటే ఆయా విదేశాంగ శాఖ నియమించిన నిబంధనలకు లోబడి ఉండాల్సి వస్తుంది. Image result for hyderabad rohingyasకానీ పూర్తి నిబంధనలకు విరుద్ధంగా, ఆంక్షలను తుంగలో తొక్కి రోహింగ్యాలు నగరంలో నివాసం ఉంటున్నారని ప్రధాన పత్రికలు హైలెట్ చేస్తున్నాయి. కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీరి టాపిక్ రావడం గమనార్హం. ఆరేళ్లుగా నగరంలో వీరుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 
మయన్మార్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలు...ఆ దేశంలో ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడంతో రోహింగ్యాలపై ఆ దేశం సైనిక చర్యకు దిగింది. దీనితో వారి నుండి తప్పించుకోవడానికి ఇతర దేశాల వైపు బయలుదేరారు. కానీ కొన్ని దేశాలు వారిని వ్యతిరేకించాయి. కొన్ని దేశాలు సహకరించినా వారిని మాత్రం వారి దేశంలోకి అనుమతించలేదు. 2016-17 సంక్షోభానికి ముందు మయన్మార్‌లో దాదాపు 13 లక్షల రోహింగ్యాలు ఉన్నట్లు అంచనా. భారత్‌లో 40,000 మంది రోహింగ్యాలు చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఆగస్టులో వెల్లడించిన సంగతి తెలిసిందే.
Image result for hyderabad rohingyasహైదరాబాద్‌కు మాత్రం వేలాది సంఖ్యలో రోహింగ్యాలు నివాసం ఉంటున్నారని కథనాలు వెలువడుతున్నాయి. వీరికి ఓటరు గుర్తింపు కార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి కొంతమంది రాజకీయ పార్టీ నేతలు అండదండలున్నట్లు పుకారు షికారు చేస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్‌, సహేన్‌ నగర్‌, శాస్త్రీ నగర్‌, పహాడిషరీఫ్‌, కంచన్‌బాగ్‌లతో పాటు, పాతబస్తీ పరిధిలో ఛత్రినాక, డబీర్‌పురా, చాంద్రాయణగుట్ట అధికంగా తిష్టవేస్తున్నట్లు గుర్తించారు. సైబారాబాద్‌ కమిషనరేట్‌ ప్రాంతంలో కూడా పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆశ్రయం పొందుతున్నారు. వందలమంది రోహింగ్యాలు గుడిసెలు వేసుకుని చిన్నా చితకా పనులు చేసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరి నివాసంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

13:04 - October 18, 2018

ఢిల్లీ : దేవభూమిగా చెప్పుకునే కేరళ అట్టుడుకుతోంది. శబరిమలలో మహిళల ప్రవేశం విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థిలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తామని ప్రకటించిన అంశంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోను మహిళలను ప్రవేశించనివ్వం అని రోడ్లపైనా..శబరిమలకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో జరుగుతున్న అంశాలను కవర్ చేసేందుకు వచ్చిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినీ రాజ్, శబరిమలకు వెళ్లాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆమెను అడ్డుకున్న నిరసనకారులు, రాళ్లను విసిరి తరిమికొట్టారు. తన సహచరుడైన ఓ విదేశీయుడితో కలసి ఆమె పంబ గేట్ వేను దాటుతున్న సమయంలో పెద్దఎత్తున నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు ఆమెను అడ్డుకున్నారు. అప్పటివరకూ సుహాసినీకి రక్షణగా వచ్చిన పోలీసులు సైతం చేతులెత్తేయడంతో, వారిద్దరూ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 

Image result for suhasini rajతాను దేవాలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునేందుకు రావడం లేదని, కేవలం రిపోర్టింగ్ చేయడానికి మాత్రమే వచ్చానని అమె చెబుతున్నా, నిరసనకారులు ఎవరూ వినలేదు.భక్తులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. మార్గమధ్యంలో కూర్చుని నినాదాలు చేశారు. రాళ్లు విసిరారు. ఇక ఆమెకు వెనుదిరగడం మినహా మరో మార్గం కనిపించలేదు. కాగా శబరిమలలో నిన్న గర్భగుడి తలుపులు తెరచుకోగా, ఇంతవరకూ నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేకపోవటం గమనించాల్సిన విషయం. 

12:56 - October 18, 2018

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరో నటవారసుడు సినీ రంగప్రవేశం చెయ్యబోతున్నాడు.. కృష్ణ అల్లుడు, గుంటూరు ఎం.పి. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్‌ని హీరోగా పరిచయం చేస్తూ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం దసరా సందర్భంగా, ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
నన్నుదోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.. కొత్త కుర్రాడు శశి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ సినిమాకి అదేనువ్వు.. అదేనేను.. అనే టైటిల్‌ని ఫిక్స్‌చేసారు.. సూపర్ స్టార్ కృష్ణ హీరో,హీరోయిన్లపై క్లాప్ నివ్వగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కథని దర్శకుడికి అందచేసారు. గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్, మంజులతో పాటు, పలువురు కృష్ణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.. ధృవ ఫేమ్ హిప్‌హాప్ తమిజ సంగీతమందిస్తున్నాడు.. 

12:20 - October 18, 2018

ఢిల్లీ : ప్రతీ సంవత్సరం దసరా వచ్చిందంటే చాలు ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ సేల్స్ సంచలనం సృష్టిస్తునే వుంది. సేల్స్ ఐటెమ్స్ పెట్టిన నిమిషాలలోనే భారీగా సేల్స్ తో అమెజాన్ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ దసరా   సందర్భంగా అక్టోబర్‌ రెండో వారంలో గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరుతో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ రెండో విడత మెగా ఆఫర్‌ను ప్రకటించింది. 

Related imageఈనెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు మరోసారి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని రెండో విడత అమ్మకాలకు అమెజాన్‌ ముందుకు వస్తోందని భావిస్తున్నారు. కొనుగోలు సమయంలో అమెజాన్‌ పే యూజర్లకు రూ.250 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

Image result for amazon led tvఐదు రోజుల పాటు జరగనున్నరెండో రౌండ్‌ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, హోమ్‌ అప్లియెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ పై పలు డీల్స్‌ను ప్రకటించింది. ఈ సారి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రతి రోజూ రెడ్‌మి 6ఏ ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. 

Image result for amazon selling booksఅమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, మూడో జనరేషన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లో అందించనుంది. అలెక్స్‌ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌ను కేవలం రూ.19కే అమ్మాలని  అమెజాన్ నిర్ణయించింది. 
 

 
12:00 - October 18, 2018

ఢిల్లీ : అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి దేశవ్యాప్తంగా భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో హీరా గోల్డ్ ఛైర్మన్ నౌహెరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.కొంతకాలం క్రితం మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ పెట్టిన నౌహెరా షేక్.. కర్నాటక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి భారీగా డబ్బు వసూలు చేసిన నౌహీరా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్టుగా నౌహెరా షేక్‌పై ఫిర్యాదులు రావటంతో ఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. నౌహెరా మోసాల గురించి పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నౌహీరా దోపిడీ ప్రస్థానం ఇలా ప్రారంభమయ్యింది.  
నౌహీరా నేపథ్యాన్ని పరిశీలిస్తే, తిరుపతికి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి కుమార్తె నౌహీరా. కేవలం 10వ తరగతి వరకూ చదువుకున్న నౌహీరాకు, చిన్న వయసులోనే మరో కూరగాయల వ్యాపారితో వివాహం జరిగింది. ఆపై అతన్ని వదిలేసిన ఆమె, మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతన్ని కూడా వదిలించుకుంది. తన తెలివితేటలను పెట్టుబడిగా పెడుతూ, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ వచ్చింది. దుబాయ్ యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ఇచ్చిందని చెబుతూ, ప్రకటనలు ఇచ్చుకుంది. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించి, 15 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుని తన దందాను సాగించింది. ఈ క్రమంలో ఆమె మరో వివాహం చేసుకుంది.
రూ. లక్ష పెట్టుబడిగా పెడితే, నెలకు రూ. 3,300 వడ్డీ ఇస్తానని పేదలకు ఆశ చూపింది. తన సంస్థలో వాటాలు ఇస్తానని బాండ్ రాసిచ్చింది. నెలనెలా సక్రమంగా వడ్డీ పడుతూ ఉండటంతో, ప్రజలు ఆమె వలలో పడ్డారు. రూ. 2 వడ్డీపై అప్పు తెచ్చి మరీ ఆమె సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆమె కస్టమర్లలో 90 శాతం మంది ముస్లింలే ఉండటం గమనార్హం. ఆమెను మరింత లోతుగా విచారించాల్సి వుందని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేసిన అనుభవంతో 2010లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను స్థాపించిన ఆమె, మొత్తం 15 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. బంగారం వ్యాపారం చేస్తున్నామని ఆమె చెప్పుకున్నప్పటికీ విదేశాల్లో శాఖలున్న హీరా గ్రూప్ మనీ ల్యాండరింగ్ కు కూడా పాల్పడిందని చెబుతున్న పోలీసులు, తమకు అందిన సమాచారం మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్, ఎస్ఎఫ్ఐఓ లతో పంచుకుంటున్నట్టు తెలిపారు.
2010-11లో రూ. 27 లక్షలుగా ఉన్న హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరు సంవత్సరాల్లో అంటే... 2016-17లో రూ. 800 కోట్లకు పెరిగింది. హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ అరెస్ట్ తరువాత, కేసును విచారించిన సీసీఎస్ పోలీసులు, ఈ డబ్బుకు లెక్కలు లేవని, పూర్తిగా హవాలా సొమ్మేనని తేల్చారు. 
    

11:47 - October 18, 2018

ముంబయి: ముకేష్ అంబానీకి చెందిన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రెండో త్రైమాసిక నివేదికల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రికార్డు స్థాయిలో నికర లాభాలను ఆర్జించింది. జులై-సెప్టెంబరు మాసాలకు గాను రూ 9,516 కోట్ల లాభాన్ని సాధించింది. గత త్రైమాసిక ఫలితాల్లో అంటే ఏప్రిల్-జూన్ మాసాల లాభాల కంటే ఇది రూ 57 కోట్లు ఎక్కువ. అంటే 0.6 శాతం అభివృధ్ది సాధించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే 17.4 శాతం అధికమని కంపెనీ ప్రకటించింది. అలాగే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ క్వార్టర్‌లో రూ 681 కోట్ల లాభాన్ని సాధించింది. ఇంతకుముందు క్వార్టర్‌లో రూ. 612 కోట్ల లాభాన్ని రికార్డు చేసి 11.2 శాతం అభివృద్ధిని నమోదు చేసింది.
 

 

11:43 - October 18, 2018

శ్రీకాకుళం: జనసేన పార్టీలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి..వైసీపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు, మాజీ నేతలు జనసేన వైపు తొంగి చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పవన్ సమక్షంలో జనసేనలోకి వెళ్లారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ కృష్ణమూర్తి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన జనసేనలో చేరిపోయారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిత్లీ తుపాన్ బాధితులను పరామార్శిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం సిక్కోలుకు వెళ్లిన చదలవాడ పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ కండువాను కప్పి జనసేనలోకి సాదారంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. 
తిత్లీ తుఫాన్ బాధితుల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని...కట్టుబట్టలతో మిగిలిపోయారని పేర్కొన్నారు. విపత్తు సంభవించిన సమయంలో పెద్ద మనస్సుతో వ్యక్తులు ముందుకు రావాలన్నారు. కేరళలో వరదలకు స్పందించిన వారు తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోకపోవడం బాధాకరమన్నారు. తెలుగువారంతా శ్రీకాకుళం బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలు స్పందించి జిల్లాను ఆదుకోవాలని, ఇంత జరిగినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. జనసైనికులు ఈ విపత్తును ప్రపంచానికి తెలియచేయాలని..తాను ఓట్ల కోసం రాలేదని..సహాయం చేసేందుకు వచ్చానన్నారు. 
ఇంత విపత్తు సంభవించిన సమయంలో తామున్నామంటూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనం వాడుకోవద్దని..తమ పార్టీ కూడా బాధితులకు సహాయం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎంత బాగా చేస్తున్నామో కాకుండా ఇంకా చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రామకృష్ణ మిషన్ లాంటి స్వచ్చంద సంస్థలు విపత్తుపై స్పందించి సహాయం చేయాలని కోరారు. 
ప్రజల తలరాతలు మార్చేందుకు ఒక డైనమిక్ రూపంలో పవన్ వచ్చారని చదలవాడ తెలిపారు. పవన్ ఆలోచనలకు ఆకర్షితుడినై చేరారన్నారు. 

11:22 - October 18, 2018

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం త్వరలో రానుంది. దీనితో అతను నటిస్తున్న చిత్రాలకు సంబంధించి ఏవైనా విశేషాలు తెలిసే అవకాశం ఉందా ? ఆయా చిత్రాలకు సంబంధించి లుక్స్, టీజర్స్ విడుదలవుతాయా ? అని అభిమానులు తెగ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. కానీ తప్పకుండా స్పెషల్ ఉంటుందని ప్రభాస్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
Image result for PRABHAS sahoప్రభాస్...బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతీని సంపాదించుకున్నాడు. కేవలం సంవత్సరాల తరబడి ఈ సినిమాలకు మాత్రమే పని చేసిన ఈ హీరో..మరో చిత్రాలకు సైన్ చేయలేదు. ఈ సినిమాల అనంతరం సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనితో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా లుక్స్, టీజర్స్ విడుదల కాలేదు. సాహో సినిమా షూటింగ్‌కు ముందే ఓ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
Image result for prabhas radha krishna movieప్ర‌భాస్ బ‌ర్త్‌డే అక్టోబ‌ర్ 23. ఆ రోజు ప్ర‌త్యేక విష‌యం షేర్ చేసుకోబోతున్నాను అని ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. అంతేకాదు అంద‌రికి ద‌స‌రా శుభాకాంక్ష‌లు కూడా తెలిపారు. కానీ ప్రభాస్ పోస్టు దేనిపై ఉంటుందా ? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ప్రభాస్ పెళ్లి విషయం ఉంటుందా ? లేక చిత్రాల గురించి ఉంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాహో మూవీ మేకింగ్ వీడియో లేదా రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న‌ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే అప్పటి వరకు ఆగ‌క తప్ప‌దు.

11:20 - October 18, 2018

విజయవాడ :  దసరా సందర్భంగా చేసుకునే ఉత్సవాలు కేవలం ఆర్భాటాలు మాత్రమే కాదు. దసరా నవరాత్రిలో ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అవతారాలను గమనిస్తే అంతరార్థం అర్థం చేసుకుంటే జీవితంలో వచ్చే పలు విధాల మార్పులను, ఇబ్బందులను, సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. అమ్మవారిని ఆరాధించడం అంటే కేవలం పూజలు చేయటం,స్తోత్రాలు పఠించడం, హంగులు, ఆర్భాటాలు మాత్రమే కాదు. దేవీ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అమ్మవారి కథల నుంచి స్ఫూర్తిని పొందాలి. ప్రతి మహిళా తనలో దాగిన మానవత్వ ఔనత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. యుక్తితో, శక్తితో... దృష్ట శక్తుల్ని ఎదుర్కోవాలి. ఆరాధించడం అంటే ఆనుసరించడమే. శరన్నవరాత్రుల్లో వివిధ రూపాల్లో శక్తి స్వరూణి అయిన అమ్మవారిని ఆరాధించడం...  ప్రతి మహిళా తమలో ఉన్న శక్తిని జాగృతం చేయడానికే అని గుర్తించాలి. అప్పుడే ఆరాధ్య దేవతలకు ప్రతిరూపంగా ఆదర్శ నారీమణులు రూపొందుతారు. 

Image result for LALITHA tripura sundari avatharamలలితాతత్వంలోని లాలిత్యం..
అమ్మవారి అలంకారాల్లో ప్రధానమైంది లలితా త్రిపురసుందరీదేవి. మాతృమూర్తుల రూపంలో కనిపించే వారంతా లలితా దేవితో సమానమని భావించాలి. లలిత అనే పేరులోనే లాలిత్యం వుంది. లలితాదేవి స్వభావం మృదుత్వానికి మారుపేరుగా వుంటుంది. ప్రతి మహిళా ఇలాంటి తత్వాన్ని అలవర్చుకుంటే ఇంట్లో  వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఇంటి వాతావరణ ప్రశాంతంగా వుంటే సమాజం కూడా ప్రశాంతంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కార మార్గాన్ని సులువుగా కనుక్కోవచ్చు. ఇదే లలితా త్రిపురసుందరీదేవి అవతారంలో మహిళలకు ఇచ్చే సందేశం. ఓర్పు, నేర్పుతో వివేకంతో ఇల్లు దిద్దుకోదగిన గుణం కనిపించే ప్రతి మహిళదీ లలితా తత్వమే. తత్వమే ప్రతీ ఇంటికీ కావాల్సింది. 

Image result for RAJESWARI DEVI AMMAVARUరాజరాజేశ్వరి దేవి అవతారంలోని సందేశం..
లలితా దేవికే రాజరాజేశ్వరి అని మరో పేరు. లాలిత్యంతో ఇల్లు చక్కబెట్టుకునే మహిళే అధికార గుణం సందర్భానుసారంగా అలవరచుకోవాలని చెప్పే అవతారమే రాజరాజేశ్వరి దేవి అవతారం. నేటి మహిళలు కేవలం ఇంటికే పరిమతం కావట్లేదు. పలు వృత్తుల్లో మగవారికి దీటుగా కొలువు దీరుతున్నారు. రాజరాజేశ్వరీ దేవి తన కనుసన్నలతోనే త్రిమూర్తుల్ని శాసిస్తుందని.. సృష్టి స్థితి లయాలను వారు సక్రమంగా నిర్వహించేందుకు శక్తియుక్తులను ఇస్తుందని వేద వ్యాసులు, ఆదిశంకరులు తమ రచనల్లో స్పష్టం చేశారు. నేటి కాలంలో మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. వీరికి రాజరాజేశ్వరీ దేవి అవతారం తెలిపే తత్వం చాలా అవసరం. ఉద్యోగుల్లో కొందరు పని దొంగలు ఉంటారు. అసమర్థత, సోమరితనం, నిర్లక్ష్యం... ఇలా పలు కారణాల వల్ల కర్తవ్య నిర్వహణ సాగించలేరు. అలాగని వారిని వదిలేసి లాభం లేదు. వారు తమ కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేలా చూపులతో శాసించగలగాలి. పని తీరును వివరిస్తూ... శక్తియుక్తులను సూచిస్తూ కర్తవ్య నిర్వహణలో సమస్యలను పరిష్కరించగలగాలి. ఈ స్ఫూర్తిని మనం రాజరాజేశ్వరి నుంచి తీసుకోవాలి. ఇదే రాజేశ్వరీ దేవి అవతారం ఇచ్చే సందేశం.

Related imageఆరోగ్యాన్నిచ్చే అన్నపూర్ణాదేవి..
మహిళలు సహజంగా మృదు స్వభావులు. ఎవరైనా ఆకలితో వున్నారంటే వారి మనసు తల్లడిల్లిపోతుంది. అన్నపూర్ణగా అన్నం పెడతుంది. సకల జగానికి అన్నం పెట్టే పరమశివుడికే ఆహారం అందిస్తూ దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి. ఏ గృహిణి అయినా శుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా వండాలి. అప్పుడే ఇంటిల్లిపాదీ కడుపునిండా తింటారు. దాంతో ఆరోగ్యం మంచిగా వుంటుంది. ఆరోగ్యంతో ఇల్లు బాగుంటే సమాజం కూడా ఆరోగ్యంగా వుంటుంది. అందుకే ప్రతీ మహిళా అన్నపూర్ణాదేవిగా మారి వారి వారి పరిధి మేరకు, శక్తి మేరకు ఆరోగ్యంకూడిన ఆహారం అందించే అన్నపూర్ణాదేవిగా మారాలని అన్నపూర్ణాదేవి అవతారం ఇచ్చే సందేశం.

Related imageలక్ష్మీ దేవిగా అమ్మవారి అవతారం..
సంపదలిచ్చే తల్లిగా మహాలక్ష్మిని కొలుస్తాం. సకల సంపదలకు నిలయమైన లక్ష్మీదేవిని పూజిస్తాం. ఉద్యోగినులైన మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ వుండాలని..అయితే ఉద్యోగినులైనా, గృహిణులైనా దుబారా నివారించి... పొదుపు పాటిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చినట్టేననీ..అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా పొదుపరిగా ఇంటిని నెట్టుకురావడం తెలిస్తే... నేటి మహిళ మహాలక్ష్మే. సమయానుకూలంగా..సందర్భానుసారంగా ఆర్థిక స్వేచ్ఛను ప్రతీ మహిళ గుర్తెరిగి వ్యవహరిస్తే ప్రతీ ఇల్లు లక్ష్మీదేవి నిలయంగా మారుతుందని లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారి సందేశం తెలుసుకుని తీరాలి.

Image result for GAYATHRIDEVI  avatharamగాయత్రిదేవిగా అమ్మవారు..
ప్రతీ మనిషికి బుద్ధి ప్రధానం. ఈ బుద్ధి తిన్నగా లేకుంటే ఎన్నో ప్రమాదాలకు, అరాచకాలకు నిలయంగా  సమాజం తయారవుతుంది.  శక్తులను..ఆలోచనల్ని విస్తృతం చేసే తల్లిగా  గాయత్రి సందేశమిస్తుంది. ఆ స్ఫూర్తిగా ప్రతి మహిళా బుద్ధెరికి ప్రవర్తిస్తే కుటుంబాన్ని కూడా బుద్ధి, గుణం వంటి గుణాలను అలవరిచేందుకు ఉపకరిస్తుంది. అంతేకాదు తన తోటివారికి కూడా ఆ ప్రశాంతతను అందించటమే కాదు..సమాజంలో కూడా ప్రశాంతతను అందించేలానేదే గాయత్రిదేవి అవతారంలో అమ్మవారి సందేశం. 

Related imageవిద్యావంతురాలిగా..
చేతిలో పుస్తకం, తెల్లటి హంస, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతు..వికాశానికి మారుపేరుగా..చదువుల తల్లి సరస్వతీ దేవిగా శరన్నవరాత్రుల్లో సప్తమీ మూలా నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతిగా,  విద్యాధి దేవతగా ఆరాధిస్తాం. స్త్రీవిద్య కావాలని నినాదం అమ్మవారి అవతారం తెలుపుతుంది. విద్య వల్ల వివేకం, విజ్ఞత పెంపొంది సంతానానికి సంస్కారం అందించడంలో విద్యావంతురాలైన గృహిణి పాత్ర బహు కీలకంఅనేది తెలుసుకోవాలి. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అనేది విద్యావతిగా సరస్వతీదేవి అవతారం తెలిపే సందేశం. ఇల్లాలు విద్యావంతురాలైతే విద్యద్వారానే వస్తుంది కాబట్టి సమాజానికి విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపే అవతారమే సరస్వతీదేవి అవతారం.

Related imageజగన్మాత శక్తి..
దుర్గా,అపరకాళికగా..మహిళాసుర మర్థినిగా రాక్షస సంహారం చేసే విజయదుర్గగా అమ్మవారి చివరి అవతారం ప్రతీ మహిళకు నేటి ప్రస్తుత పరిస్థితిని బట్టి చాలా అవసరం. ఈ శక్తిని మానసికంగా..శారీరకంగా ప్రతి మహిళా అలవరచుకోవాల్సిన అవుసరం ఎంతైనా వుంది. పరాక్రమవంతులైన రాక్షసులను సైతనం చీమల్లా నలిపివేసి లోకానికి శాంతిని చేకూర్చిన అపరకాళిగా నేటి మహిళలు మారాలి. ఎన్నెన్నో దుర్మార్గాలు చేసి.. తమ తెలివితో చావు తప్పించుకోవాలని చూసిన మధుకైతములను అమ్మవారు కడతేర్చిందని దేవీ భాగవతం చెబుతోంది. అలానే స్త్రీ అంటే విలాస వస్తువుగా భావించి కేవలం కాముక దృష్టితో చూడటం మహిషాసుర లక్షణం. నేటి మహిళ అలాంటి మహిషాసురుల్ని తన శక్తియుక్తులతో ఎదుర్కోవాలి. తాను అబల కాదు సబల అని నిరూపించుకోవాలి. దున్నపోతు స్వభావం అనే అసురత్వాన్ని నశింపచేసి జయకేతనం ఎగురవేసే ప్రతి మహిళా మహిషాసుర మర్దిని. చెడు బుద్ధితో చూసే పురుషుడిని..మహిళలను విలాసవస్తువుగా..స్వంత ఆస్తిగా భావించే అహం..పురుష దర్పం అణచివేసే అమ్మవారిగా విజయదర్గ దేవిగా ప్రతీ మహిళ తన శక్తి సామర్థ్యాలను అలవరచుకోవాలనీ..కుటుంబానికి ఒక శక్తిగా నిలబడి మంచీ చెడు విచక్షణను తెలిపి దశాదిశా నిర్ధేశిగా ప్రతీ మహిళా అమ్మవారి అవతాలలోని అంతర్యాలను తెలుసుకుని తమకు అన్వయించుకుంటే ప్రతీ ఇంటితో పాటు సమాజం కూడా ప్రశాంతంగా..ఆరోగ్యంగా..విద్యావంతంగా..వికాశవంతంగా..విజయవంతంగా తీర్చిదిద్దబడుతుంది. ఇలా ప్రతీ అవరాలలోను అమ్మవారు మహిళలకే కాదు సమాజానికి ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని ఆ అమ్మవారి ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే సమాజం ఉచ్ఛస్థితికి చేరుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

 

11:03 - October 18, 2018
జియోలాన్: రైల్వేస్టేషన్‌లో లగేజీ చెక్‌చేసే ఎక్స్ రే బాక్స్‌లోకి ఓ బాలుడు దూరి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన దక్షిణ చైనాలోని జియోలాన్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ వీడియో చైనాలొ వైరల్‌గా మారింది. పక్కనే ఉన్న తండ్రికీ, సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా బాలుడు ఎలా లోపలికి వెళ్లాడో అన్నది అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీన ఈ సంఘటన జరిగినట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది. రేడియేషన్ ప్రభావం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయతే బ్యాగులతోపాటు బాలుడిని కూడా చూడటంతో సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడి తేరుకొనే లోపే బాలుడు బయటకు వచ్చాడు. ‘నా కొడుకు ఎక్కడా’ అంటూ బాలుని తండ్రి వెనక్కి రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో ఇదే తరహాలో ఓ మహిళ తన బ్యాగు సామాను భధ్రమో కాదో తెలుసుకొనేందుకు ఎక్స్ రే బాక్స్ లోకి దూరటం జరిగింది. ఈ వీడియోని మీరూ చూడండి!!
10:26 - October 18, 2018

కేరళ : రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడం లేదు. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని మహిళలు వెల్లడిస్తుండడం...వారిని దర్శనం చేసుకోనివ్వమని ఆందోళనకారులు పేర్కొంటుండడంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం ఆలయ తలుపు తెరవడంతో స్వామి వారిని దర్శించుకొనేందుకు బయలుదేరారు. కానీ వారిని ఆలయానికి కొద్ది దూరంలోనే ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం..తోపులాట చోటు చేసుకున్నాయి. అప్పటికే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. Image result for kerala sabarimala women journalist
ఇటీవలే 10 నుండి 50 ఏళ్ల మహిళలు అయ్పప్ప స్వామి వారి దర్శనానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీనిని పలువురు వ్యతిరేకించారు. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ప్రవీణ్ తోగాడియా అంతరాష్ట్రీయ హిందూ పరిషత్, శబరిమల పరిరక్షణ సమితి కేరళలో 24గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. 12 గంటల బంద్‌కు శబరిమల యాక్షన్ టీం పిలుపునిచ్చింది. కొజికోడ్, అటింగళ్, ఛెథ్రాల ప్రాంతాల్లో బస్సులపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. రాష్ట్ర బీజేపీ నేతలు బంద్‌కు మద్దతు తెలియచేశారు. ఆలయానికి వచ్చే బస్సులను తనిఖీలు చేస్తున్న ఆందోళనకారులు మహిళలుంటే వారిని కిందకు దింపివేస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులకు దిగారు. 
Image result for kerala sabarimala women journalistసుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు తీసుకొంటోంది. మహిళలు..మహిళా జర్నలిస్టులపై దాడులకు దిగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. పథనం తిట్ట జిల్లాలో 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సన్నిధానం, పంబా నిలక్కల్, ఇలవుంగల్ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిలక్కల్ వద్ద మీడియా వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. పంబా వద్ద ఆంగ్లపత్రిక మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నలుగురి కంటే ఎక్కువ మంది ఉండవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

10:19 - October 18, 2018

శ్రీకాకుళం : అసలే వెనుకబాటుకు గురైన జిల్లా. పులిమీద పుట్రలా తుఫానుల తాకిడికి అల్లాడిపోతోంది. ఆహారపానీయాలకు చిన్నారుల నుండి పెద్దవారి వరకూ అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఎంతగా స్పందించినా తిత్లీ  తుపాను దెబ్బనుండి ఇప్పుడిప్పుడే కాస్తగా కోలుకుని పంట నష్టాలను అంచనావేసుకునే క్రమంలోనే మరో ప్రమాదం పొంచి వుండటంతో శ్రీకాకుళం వాసులు చిరుగుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రాణాలతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లినా ప్రాణాలతో బైటపడి తిరిగి కోలుకుంటున్న సమయంలో మరో ప్రమాదంతో ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. వందలాది ఎకరాల్లో అరటి, జీడి మామిడి పంటలతో పాటు కొబ్బి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు మరోసారి తుపాను ప్రమాదం ఉందని వార్తలు రావడంపై జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఈ నెల 23న ఉత్తర అండమాన్, అగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు ఓ బులెటిన్ ను కూడా విడుదల చేసింది. అల్పపీడనం తొలుత బలపడి వాయుగుండంగా, ఆతర్వాత తుఫానుగా మారినప్పుడే దాని గమనం తెలుస్తుందని వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోసారి బంగాళాఖాతంలో తుపాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతామని వెల్లడించారు. తుపాను ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అయితే అప్పుడే ప్రజల్లో తుపాను గురించి వదంతులు రెచ్చగొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. 

 

09:16 - October 18, 2018

విశాఖపట్టణం : మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్యెల్యే సివేరు సోమను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపిన అనంతరం పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తూ తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి మావోలు లేఖ విడుదల చేశారు. ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌పై లేఖను విడుదల చేశారు. మావోయిస్టు గాలికొండ పేరిట లేఖ విడుదలైంది. టిడిపి ప్రజాప్రతినిధులు బినామీల పేరిట మైనింగ్ చేస్తున్నారని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే పీలా గోవింద్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజులు అక్రమ మైనింగ్‌ల్లో ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పించారు. ఎమ్యెల్యే గిడ్డి ఈశ్వరీ, మణికుమారి అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నరాంటూ లేఖలో పేర్కొనడం కలకలం రేపుతోంది. అక్రమ మైనింగ్ ఆపకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

08:55 - October 18, 2018

హైదరాబాద్ : సెప్టెంబర్ 19 ఎర్రగడ్డలో చోటు చేసుకున్న ఘటనను ఎవరూ మరిచిపోలేరు..కూతురు మాధవిపై తండ్రి మనోహారాచారి చేసిన దాడి తీవ్ర కలకలం రేపింది. తీవ్రగాయాలపాలైన మాధవి యశోదా ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడి చివరకు గెలిచింది. బుధవారం ఆసుపత్రి నుండి ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడింది. ఆమె మాటలు వింటుంటే గాయం శరీరానికే కాదు..మనస్సుకు కూడా అయ్యింది. ఒక తండ్రి ఇలా చేస్తాడా ? అని ఆమె మాటల్లో వ్యక్తమయ్యింది. 
Image result for erragadda incident madhavi dischargeనాన్ను క్షమించేంత మనస్సు తనకు లేదని..కసితీరా దాడి చేశాడని..కానీ తీవ్రగాయాలైన తనను ప్రభుత్వం ఆదుకుందని..మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అండగా నిలిచారని మాధవి పేర్కొంది. అంతేగాకుండా యశోదా ఆసుపత్రి వైద్యులు తనకు ప్రాణం పోశారని..ఇందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించింది. సందీప్‌పై పూర్తి నమ్మకంతోనే పెళ్లికి ఒప్పుకున్నానని మాధవి తెలిపింది. తన భార్యను ఆరోగ్యపరంగా, ఆమె తండ్రి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటానని సందీప్‌ చెప్పాడు. చికిత్సకయ్యే ఖర్చు తన దగ్గర లేదని..కానీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అండగా నిలిచారని..మరో ఏడాది పాటు జరిగే చికిత్సకు కూడా తలసాని చూసుకుంటానని చెప్పారని సందీప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మాధవి పూర్తిగా కోలుకోవాలంటే ఏడాది సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. 
Image result for erragadda incidentఅసలేం జరిగింది ? 
ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌కు చెందిన సందీప్..బోరబండ వినాయకరావునగర్‌కు చెందిన మాధవిలు ప్రేమించుకున్నారు. కానీ మాధవి తండ్రి మనోహారాచారి కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. వివాహానికి ప్రయత్నాలు జరుగుతుండడంతో మాధవి..సందీప్‌లు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దీనితో మాధవి తండ్రి ఆగ్రహానికి గురయ్యాుడు. ఆమెతో రోజు మాట్లాడినట్లు నటిస్తూనే సెప్టెంబర్ 19 ఉదయం ఫోన్ చేశాడు. కొత్త బట్టలు ఇప్పిస్తానని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్దకు రావాలని మాధవికి చెప్పాడు. దీనితో మాధవి..సందీప్‌లు అక్కడకు చేరుకున్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన మనోహారాచారి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొబ్బరి బోండాలు నరికే కత్తితో మాధవి..సందీప్‌లపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఎడమ చేయి పూర్తిగా తెగిపోయింది. Image result for erragadda incidentఆమె ముఖంపై..మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సందీప్‌కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. తీవ్రగాయాల పాలైన మాధవిని యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేశారు. సుమారు 8గంటల పాటు వైద్యుల కృషితో మాధవి ప్రాణాలు నిలిచాయి. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రస్తుతం మాధవి కోలుకొంటోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఫిజియోథెరపీ ద్వారా కొంత వ్యాయామం చేయాల్సి ఉంటుందని వైద్యులు చేశారు. మనోహారాచారి కటకటాలెక్కిస్తున్నాడు. 

08:10 - October 18, 2018

హైదరాబాద్ : నగరంలో బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కురిసిన కుండపో్త వానతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ప్రధాన కూడళ్లలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడదింది. ఊహించని రీతిలో వాన కురవడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యూసుఫ్ గూడలోని కృష్ణానగర్‌లో రోడ్లపై నీటి ప్రవాహం పోటెత్తింది. 
దసరా సందర్భంగా ఈ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కృష్ణానగర్‌లోని సి బ్లాక్ పరిధిలోని అమ్మవారి మంటపాలు నీట మునిగిపోయాయి. ఓ అమ్మవారి విగ్రహం నీటిలో కొట్టుకపోతుండడం చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. 

07:43 - October 18, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని తిత్లీ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. బుధవారం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడ, సీతానగరం గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భావనపాడులో తుపాన్‌ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 400 ఎకరాల పైచిలుకు జీడిమామిడి తోటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. తుపాన్‌నష్టాన్ని జనసేన సైనికులు అంచనా వేస్తున్నారని..నివేదిక వచ్చిన తర్వాత తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు పవన్‌ తెలిపారు. గురువారం వజ్రపుకొత్తూరులో పవన్‌ పర్యటించనున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం బాతుపురంలోని బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడనున్నారు. 

07:33 - October 18, 2018

విజయనగరం : వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పొడిగించారా ? తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు పాదయాత్ర కొనసాగనుందా ? నవంబర్‌లో ముగియాల్సిన పాదయాత్ర డిసెంబర్‌ చివరి వరకు సాగనుందా ? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అసలు జగన్‌ పాదయాత్ర పొడిగించడానికి కారణాలేంటి ? వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారం దిశగా తీసుకువెళ్లే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. అప్పటినుండి 11 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 జిల్లాల్లో పాదయాత్ర ముగియగా.. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 288 రోజుల్లో 3,158 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దాదాపు 125 నియోజకవర్గాలను టచ్‌ చేశారు. అయితే వచ్చే నెలలో ముగియాల్సిన పాదయాత్రను మరో నెల పొడిగించారు జగన్‌. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 5వ తేదీతో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అయితే.. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. పాదయాత్ర మరో నెల రోజులపాటు పొడిగించారు. విజయనగరం జిల్లాలో ఉన్న పాదయాత్రను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కవర్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ పాదయాత్ర చేయాలని జగన్‌ నిర్ణయించారు. 
ఇక పాదయాత్ర అనంతరం బస్సుయాత్ర చేసేందుకు జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. పాదయాత్ర అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. పాదయాత్ర తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని.. సంక్రాంతి తర్వాత బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. అయితే బస్సుయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుండి బస్సుయాత్ర చేపడితే.. ఆసక్తిగా ఉంటుందనేది వైసీపీ యోచన. 
మొత్తానికి ఎన్నికలయ్యే వరకు ఏదోవిధంగా ప్రజల్లో ఉండాలని జగన్‌ భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా ఏపీలో ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్‌ నమ్ముతున్నారు. దీంతో వచ్చే నెలలో ముగియాల్సిన పాదయాత్రను డిసెంబర్‌ చివరి వరకు పొడిగించారు. 

07:26 - October 18, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల హీట్‌ మరింత పెరిగింది. మహాకూటమి పొత్తులపై కాంగ్రెస్‌ మరింత స్పీడ్‌ పెంచింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై అధిష్టానం పెద్దలతో పీసీసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈనెల 25, 26న కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేసి.. పలువురు టీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మహాకూటమిలో సీట్ల కేటాయింపు, పొత్తుల మార్గదర్శకాలపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు గులాంనబీ అజాద్‌, జైరాం రమేశ్‌, ఏకే ఆంటోనీలను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌లు కలిసి చర్చించారు. సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేతలు తెలిపారు. ఇక తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత పొత్తుల ప్రక్రియపై స్పష్టత వస్తుందని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కోసం ఈనెల 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. 
మరోవైపు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతుందంటున్నారు. నాలుగేళ్లు అధికారంలోకి ఉన్న టీఆర్‌ఎస్‌.. నిరుద్యోగులకు ఏమీ చేయకుండా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటే ప్రజలు నమ్మరంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. 
ఇక ఇదిలావుంటే.. మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను కాంగ్రెస్‌ ముమ్మరం చేసింది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ-మురళి దంపతులు, భూపతిరెడ్డిని చేర్చుకుని టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చింది. మరోవైపు రాహుల్‌ పర్యటనలోపే మరికొంతమంది టీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఎంపీలు సర్వేశ్వర్‌రెడ్డి, నగేశ్‌లు కాంగ్రెస్‌ నేతలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న డీఎస్‌ చేరిక లాంఛనప్రాయమేనని.. ఈ మధ్య టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించబడ్డ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. అదేవిధంగా మరికొంతమంది టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రధానంగా శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, మాజీమంత్రి గడ్డం వినోద్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు.. మరో ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. 
మొత్తానికి ప్రచారంతో ఎన్నికల సమరాన్ని వేడి పుట్టిస్తూనే.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో టీఆర్‌ఎస్‌ను మరింత డిఫెన్స్‌లోకి నెట్టేందుకు కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. మరి కాంగ్రెస్‌ స్పీడ్‌ను టీఆర్‌ఎస్‌ ఎలా అడ్డుకుంటుందో చూడాలి..! 

07:11 - October 18, 2018

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం బెజవాడ దుర్గమ్మ రెండు అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దని రూపంలో దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 11 గంటల వరకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దుర్గమ్మకు ఇరుముడి సమర్పించేందుకు భవానీ స్వాములు భారీ ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 

06:56 - October 18, 2018

ఢిల్లీ : ప్రొ- కబడ్డీలో యు ముంబా మరో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. హరియాణా స్టీలర్స్‌పై 42-32 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో హరియాణా స్టీలర్స్‌కు సొంతగడ్డపై మరో ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌పై.... బెంగళూరు బుల్స్‌ 44-35 తేడాతో విక్టరీ కొట్టింది. యు ముంబా మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వరుసగా పాయింట్లు రాబట్టుతూ ప్రత్యర్థికి చాన్స్‌ ఇవ్వకుండా జాగ్రత్తపడింది. ప్రథమార్థం అయ్యేసరికి 24-13తో ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లోనూ యుముంబా ఆధిక్యం కొనసాగించింది. మరో నాలుగు నిమిషాలే మిగిలి ఉన్న సమయంలో 27-33తో ప్రత్యర్థి హరియాణా చేరువగా వచ్చినా.. చివరి నిమిషాల్లో ముంబా ఆటగాళ్లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. యు ముంబా జట్టులో సిద్దార్థ్‌ దేశాయ్‌ అద్భత ప్రదర్శన చేశారు. ఏకంగా 15 రైడ్‌ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతను కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 50పాయింట్లు సాధించాడు. 
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌- తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది.  44-35 తేడాతో బెంగళూరు జట్టు... తమిళ్‌ తలైవాస్‌ను ఓడించింది. ఫస్టాప్‌ ముగిసేసరికి 25-14 ఆధిక్యంలో బెంగళూరు నిలిచింది. సెకండాఫ్‌లో తమిళ జట్టు కొంచెం పోటీ ఇచ్చింది. కానీ ప్రత్యర్థి ఆధిక్యాన్ని మాత్రం తగ్గించలేకపోయింది. ఆ జట్టు కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. అతను 9 పాయింట్లు సాధించాడు. అజయ్‌కి సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో తలైవాస్‌కు మరో ఓటమి తప్పలేదు.  బెంగళూరు విజయంలో పవన్‌ సెహ్రావత్‌ 16 పాయింట్లు, కాశీలింగ్‌ 12 పాయింట్లు సాధించి కీలకపాత్ర పోషించారు. ఈ సీజన్‌లో తలైవాస్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి... ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్‌లోనూ పరాజయం చవి చూసింది.

06:47 - October 18, 2018

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా అంబరాన్నంటాయి.  తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మను పేర్చిన తెలంగాణ ఆడపడుచులు.. పూల జాతరను ఘనంగా జరుపుకున్నారు. పట్టణాలు, నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోటా సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  బతుకమ్మల దగ్గర సంప్రదాయబద్దంగా ఆడిపాడుతూ సందడి చేశారు.
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ముగిశాయి. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. 9వ రోజు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా అంటూ చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి.
 సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ జనసంద్రమైంది. మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షం పడుతున్నా... ఆ వర్షంలోనే బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు లయబద్దంగా నృత్యాలు చేస్తూ అలరించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో 25 దేశాలకు చెందిన విదేశీ మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ సంస్కృతిని విదేశీవనితలు కొనియాడారు.
వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి బతుకమ్మ వేడుకలతో సందడిగా మారింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గుంపులు గుంపులుగా బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు.  ఆతర్వాత బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం కోమటి చెరువు దగ్గర జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భార్య శ్రీనిత, కూతురు వైష్ణవితో కలిసి సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.  వచ్చే బతుకమ్మ పండుగనాటికి చెరువులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలతో కళకళలాడుతాయని అన్నారు
మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలం కోనాపూర్‌లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడిపాడారు. 
మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్‌ సతీమణి జమున పాల్గొన్నారు. ఆమెతోపాటు ఈటెల కూతురు, కోడలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుందని... బతుకమ్మ ఉత్సవాలను మహిళలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా పేర్చి. వాటిని ఒకచోటకు చేర్చి.. వాటి చూట్టూరా తిరుగుతూ ఆడిపాడారు. అనంతరం వాటిని నిమజ్జనం చేశారు. బతుకమ్మ సంబరాలతో పల్లెపల్లెనా సందడి నెలకొంది.

Don't Miss