Activities calendar

20 October 2018

21:01 - October 20, 2018

హైదరాబాద్: 50 ఏళ్లు  దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అసమర్ధ విధానాల వల్లే గతంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పిందని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.  కాంగ్రెస్పార్టీ మైనార్టీలపై హఠాత్తుగా ప్రేమ కురిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ వ్యక్తి అయిన పీవీ నరసింహారావును  కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, ఆయన స్మారకార్దం ఘాట్ నిర్మించే  విషయంలోనూ, అంత్యక్రియల విషయంలోనూ వివక్ష చూపించారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం  పీవీ నరసింహారావు, జయశంకర్, కుమ్రంభీం పేర్లను జిల్లాలకు, యూనివర్సిటీలకు   పెట్టి వారిని గౌరవించుకుందని కేటీఆర్ చెప్పారు. గత 4 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని, కాంగ్రెస్ హాయాంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు పచ్చని జిల్లాగా మారుతోందని ఆయన చెప్పారు. తెలంగాణలో అమలు చేసిన రైతు రుణ మాఫీ విధానాన్నే కర్ణాటక రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారని,  రాహుల్ తన ప్రసంగంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటే మంచిదని కేటీఆర్ హితవు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టుపై రాహుల్‌ గాంధీ పచ్చి అబద్దాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. "కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని.. రూ.17వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెంచారని, 2013 భూసేకరణ చట్టం తర్వాత పరిహారం పెరిగింది. కొత్త ప్రాజెక్టుల కారణంగా ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు. 

19:55 - October 20, 2018

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీపార్టీబోర్డు సమావేశం ఢిల్లీలో ప్రారంభమయ్యింది. ఈసమావేశంలో 5 రాష్ట్ర్రాలో జరుగుతున్నఎన్నికలలో ఏవిధమైన వ్యూహాం అనుసరించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. 5 రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులుకూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్,సుష్మాస్వరాజ్ లతో కూడిన 12 మంది సభ్యుల పార్లమెంటరీ బోర్డు ఏ  రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై  చర్చిస్తోంది.  మరికొద్దిసేపట్లో  తెలంగాణలో  పోటీ చేసే అభ్యర్ధుల మొదటి విడత జాబితాను మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. తొలి విడతలో 35మంది అభ్యర్ధులను ప్రకటిస్తారు.వీరిలో సిట్ఠింగ్ ఎమ్మెల్యేలతో సహా ఇంతకు ముందు పోటీచేసి ఓడిపోయిన వారు,ప్రజాబలం ఉన్నవారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  తెలంగాణాలో బీజేపీ ఒక్కటే ఏ  పార్టీతో పొత్తుపెట్టుకోకుండా 119 స్ధానాల్లో ఒంటరిగాపోటీ చేస్తోంది. తెలంగాణలో ఉన్నపరిస్ధితులను రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  ఇప్పటికే కేంద్ర అధినాయకత్వానికి వివరించారు.ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం  తయారు చేసిన జాబితాను లక్ష్మణ్  పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అందించారు. మరి కొద్ది సేపట్లో బీజేపీ  అధిష్టానం తెలంగాణ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేస్తుంది. 

19:33 - October 20, 2018

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ  దేశానికి కాపలాదారులా కాకుండా అంబానీలకు కాపలా దారులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావనా యాత్రలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ తీసుకున్ననిర్ణయాల వల్ల అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ అన్నారు. దేశంలో అమలు చేస్తున్న జీఎస్టీ వల్ల చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారని ఆయన ఆరోపించారు. రైతుల రుణాలు మాఫీచేయని బీజేపీ ప్రభుత్వం విజయ్మాల్యాకు చెందిన 9వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీచేసిందని రాహుల్ ఆరోపించారు. బ్యాంకులను మోసంచేసి విజయ్మాల్యా, నీరవ్మోడీలాంటి ఆర్ధికనేరగాళ్లు దేశం విడిచిపారిపోవటానికి మోడీ ప్రభుత్వం సహకరించిందని ఆయన చెప్పారు. రక్షణమంత్రి ప్రమేయం లేకుండా యుధ్దవిమానాల తయారీని రిలయన్స్కు అప్పగించారని, హెచ్ఏఎల్ తయారు చేయాల్సిన యుధ్దవిమానాలను అంబానీలకు అప్పగించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ మోడీని విమర్శించారు. మోడీ అవినీతిని గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పాల్సిన పరిస్దితి వచ్చిందని చెపుతూ రాహుల్ గాంధి, రాఫెల్ కుంభకోణం వ్యవహారాలను చెప్పుకొచ్చారు. ధనికులైన తన మిత్రులు లబ్ది పొందేందుకే మోడీ  పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్నికేసీఆర్ సమర్ధించారని, పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తోందని రాహుల్  చెప్పారు.

18:12 - October 20, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ప్రధాన రాజకీయపార్టీలు అధికారం కైవసం చేసుకోవటానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్,కామారెడ్డిలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. జిల్లాల పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకుని చార్మినార్ వద్ద  జరిగే రాజీవ్సద్భావనా ర్యాలీలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్న నేపధ్యంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు సవాల్ విసిరారు. వీరిద్దరు తనపై హైదరాబాద్  పార్లమెంట్ స్ధానం  నుంచి పోటీ చేయాలని ఓవైసీ కోరారు. హైదరాబాద్ భిన్నజాతుల సంస్కృతికి నిదర్శనం అని, ఇక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చని ఒవైసీ పేర్కొన్నారు.  శత్రువులైనా,మిత్రులైనా  హైదరాబాద్‌  అందరికీ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు

 

18:04 - October 20, 2018

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. ఏ ముహూర్తాన తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చేసిందో.. ఇక అక్కడినుండి రచ్చ మొదలైంది.. ఇప్పుడు మీ టూలో యాక్షన్ కింగ్ అర్జున్ పేరుకూడా వినబడుతుంది.. మెన్నీమధ్యే అర్జున్ 150వ సినిమా కురుక్షేత్రం రిలీజైంది.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతి హరిహరన్ తాజాగా అర్జున్‌పై ఆరోపణలు చేసింది.. కురుక్షేత్రం‌లో శృతి, అర్జున్ భార్యగా నటించగా, షూటింగ్ టైమ్‌లో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, రిహార్సల్స్ అప్పుడు తనని హగ్ చేసుకోవడమేకాక, తన చేతితో ఆమె వీపుపై రాసాడనీ, అప్పుడు చెప్పాలంటే ధైర్యం చాల్లేదు.. ఇప్పుడు మౌనంగా భరించకూడదనే జరిగిందంతా బయటపెట్టాను అని చెప్పుకొచ్చింది శృతి హరిహరన్..
అయితే, తమ అభిమాన హీరోపై శృతి చేసిన ఆరోపణల విషయంలో అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. షూటింగ్‌లో ఆయన చేసిన దానికి లైంగిక వేధింపులు అని చెప్పి, దాని ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలనేది ఆమె ప్లాన్ అని కొట్టిపారేస్తున్నారు... దీనిపై అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..  

17:50 - October 20, 2018
బీజింగ్: రాజు తలుచుకంటే కొదువేముంది.. వింతలు విడ్డూరాలకు నిలయం చైనా. అనుకుంటే ఏదైనా సాధించేస్తారు. చైనా మరో అధ్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. అక్కడి ప్రజలు ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని రోజూ పాడుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే.. వీధి దీపాల కోసం కరెంటు బిల్లులు నెల నెలా తడిసి మోపెడవుతుండటంతో చైనా పాలకులు ఏకంగా ఒక చంద్రుడినే సృష్టించేస్తున్నారు. దీంతో పగలే వెన్నెల అన్న విధంగా నిత్యం చంద్రుడు అందుబాటులో ఉండి వెన్నెలను కుమ్మరిస్తూ ఉంటాడు. 2020 కల్లా నగర వీధులను చంద్రుని వెలుతురుతో నింపేదానికి చైనా శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం కృత్రిమ చంద్రుడిని ఆకాశం మీదకు అంటే ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు. మానవునిచే నిర్మితం కాబోతున్న చంద్రుడిని దేశ నైరుతీ భాగాంలోని సీచువన్ ప్రొవిన్స్‌లోని చెంగ్డూ నగరంలో ఈ అధ్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు. అది ఎలా అంటే.. వెలుగులు విరజిమ్మే శాటిలైట్‌ను ఆకాశంలో ప్రవేశపెడతారు. దీని మీద కాంతి పరావర్తనం చెంది నగరంమీదకు కాంతిని వెదజల్లుతుంది. ఈ శాటిలైట్ వీధిదీపాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు చంద్రుడు కాంతి కంటే  ఈ శాటిలైట్ ప్రసరించే కాంతి 8 రెట్లు అధికంగా ఉంటుందట. ఎందుకంటే ఇది చంద్రుడి కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి. ఒరిజినల్ చంద్రుడు 3.80 లక్షల కి.మీ ల దూరంలో ఉండగా.. ఈ కృత్రిమ చంద్రుడు భూమికి 500 కి.మీ దూరంలో ఆవిష్కరించనున్నారు. ఈ చంద్రుడుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో తెలుసుకోవచ్చు.
17:47 - October 20, 2018

ఢిల్లీ : అయోధ్యలో రామజన్మ భూమి వివాదం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రం కాబోతోందా? ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఈ సందేహం  రాక మానదు. తరచుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రకటనలు చూస్తుంటేఅదే నిజమనిపిస్తోంది. రామ జన్మభూమి నిర్మాణానికి అంతా సహకరిస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు.

Image result for BHAGAVATH rSS AND UDDAV THAKREదేశంలోనే వివాదాస్పదమైన అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది బీజేపీ. యూపీలో అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అది ఎటూ తేలలేదు. కానీ ఇప్పుడు తాజాగా రానున్న ఎన్నికల్లో మరోసారి రామజన్మ భూమిని అస్త్రంగా ఉపయోగించటానికి బీజేపీ రెడీ అయిపోయింది. దీనిపై ఎన్ని వివర్శలు వచ్చినా రామ జన్మ భూమిలో అయోధ్యను నిర్మించి తీరతామని ప్రకటిస్తు వచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి రామజన్మ భూమి వివాదాన్ని తెరపైకి తెచ్చిన భగవత్ ప్రకటనతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి దూరంగా వున్న శివసేన కూడా ఇదే పంథాను అవలంభిస్తోంది. రామమందిరం నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తోంది. దీనికోసం నవంబర్ 25 అయోధ్యకు వెళతానని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. 

Image result for supreme court ayodhyaమరోవైపు సుప్రీంకోర్టులో బాబ్రి మసీదు, రామ జన్మభూమి కేసులు ఇంకా పెండింగ్ లోనే వున్నాయి. ఈ అంశంపై పలుమార్లు విచారణ కొనసాగుతున్నా ఇంతవరకూ ఎటూ తేలలేదు. దీంతో బాబ్రి మసీదు, రామ జన్మభూమి వివాదాలపై ఎన్నికల ముందు తీర్పు వెలువరించవద్దనీ..అలా చేస్తే అల్లర్లు చెలరేగుతాయని సుప్రీం కోర్టులో పలు పిటీషన్స్ దాఖలైయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం రామ జన్మభూమి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన యత్నిస్తున్నాయి. 

17:08 - October 20, 2018

హైదరాబాద్: రాష్ట్ర్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి 105మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికలలో అన్ని పార్టీల కంటే ముందు దూసుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో రెడ్డి సామాజికవర్గం ఆనందోత్సాహాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పై ఓటుకు నోటుకేసు, ఐటీ దాడుల నేపధ్యంలో రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతోందనే ఊహాగానాలు జరుగుతున్న వేళ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డికార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో ఆ సామాజికవర్గంలోని అట్టడుగు వర్గాలకు ఈవార్త ఊరట కల్పించిందనటంలో సందేహం లేదు. రెడ్డి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేతలు నిన్న కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు.  టీఆర్ఎస్ కు చెందిన రెడ్డి సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, మరికొందరు రెడ్డిసామాజికవర్గ నాయకులతో కలిసి శనివారం బేగంపేటలోని  సీఎం క్యాంపు కార్యాలయంలో ఆపధ్దర్మ మంత్రి కేటీఆర్ ను  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  కేటీఆర్ ను  కలిసిన వారిలో ఎంపీలు మ‌ల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు తాజా మాజీఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు ఉన్నారు. 

16:54 - October 20, 2018

అమృతసర్: దసరా వేడుకల్లో జరిగిన విషాదంతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. దాదాపు 61 మంది మృత్యవాత పడిన ఈ ఘటనలో రావణాసురుడు వేషం వేసిన  నటుడు దల్బీర్ సింగ్ కూడా మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. ఊహించని రీతిలో రైలు దూసుకురావడంతో రైలు పట్టాల మీదనుంచి రావణ దహనం దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు మరణించిన సంగతి తెలిసిందే. 
దల్బీర్ సింగ్ అప్పుడే స్టేజీ మీద తన పాత్ర ముగించి షీల్డ్ తీసుకొనేందుకు ఎదురుచూస్తుండగా రైలు మృత్యరూపంలో తరలివచ్చింది. దల్బీర్‌కు భార్య, 8 సంవత్సరాల కూతురు ఉన్నారు. ప్రతీ సంవత్సరం జరిగే రామ్‌లీల వేడుకల్లో దల్బీర్ పాల్గొనేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

 

16:49 - October 20, 2018

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు, దానికి తోడు వారాంతం.. దీంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనానికి దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు.

16:39 - October 20, 2018

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా గీత గోవిందం కంటే ముందే రిలీజ్  కావాల్సింది కానీ, ఏవో కారణాల వల్ల కుదరలేదు.. మధ్యలో సినిమా పైరసీకి గురైన సంగతి తెలిసిందే.. ఈలోపు గీత గోవిందం రిలీజవడం, సూపర్ డూపర్ హిట్ అవడం జరిగిపోయింది.. ఎట్టకేలకు టాక్సీవాలా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయింది.. యువి క్రియేషన్స్, జిఎ2 పిక్చర్స్ సంయుక్తంగా, ఎస్‌కెఎన్ నిర్మాణంలో, రాహుల్ డైరెక్ట్ చేస్తున్న టాక్సీవాలా మూవీ నవంబర్ 16న విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు..
ప్రియాంక, మాళవికా నాయర్ హీరోయిన్స్ కాగా, ఉత్తేజ్, రవిప్రకాష్ ఇతర పాత్రలు చేస్తున్నారు.. టాక్సీవాలా నవంబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది..

 

16:26 - October 20, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్‌కు 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కరవు ప్రాంతం అయిన పాలమూరు కృష్ణ నీటితో సస్యశ్యామలం అవుతోందన్నారు. తెలంగాణ భాషా సాంస్కృక శాఖ సౌజన్యంతో నిర్వహించిన తెలంగాణ జలకవితోత్సవం పుస్తకావిష్కరణ సభలో హరీష్‌రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే తమకు ముఖ్యం అన్న హరీష్.. ఏ ఉద్దేశ్యంతో అయితే తెలంగాణ సాధించామో అది నెరవేరుతుందన్న అనుభూతి కలుగుతోందన్నారు. నేతలు గెలవకపోయినా ప్రజలకు మేలు చేయాలని హరీష్ సూచించారు. ఒక్క ఎకరానికి నీరు అందని వనపర్తిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 65వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్టు చెప్పారు. విపక్షాలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని హరీష్ మండిపడ్డారు. కళ్లు ఉండి కూడా అభివృద్దిని చూడలేని వారిని ఏమనాలి? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో పని చేస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని హరీష్‌రావు చెప్పారు. నీటి కోసం నిరంజన్‌రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పని చేశారని హరీష్‌రావు ప్రశంసించారు.

16:25 - October 20, 2018

ఢిల్లీ : భారత టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. ఓ చరిత్ర. ఓ రికార్డ్. టెలీకాం రంగంలోని పేరుతో అడుగుపెడుతూనే రిలయన్స్ సంస్థ ప్రకంపనలు సృష్టించింది. అతి స్వల్ప కాలంలోనే ఏకంగా 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా వినియోగదారులకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. ‘మై జియో’ యాప్ ద్వారా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రిచార్జీ చేసుకునే వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది. 

Image result for my jio appఇలా రీచార్జ్ చేసుకుంటే రిడీమ్ కూపన్లు లభిస్తాయనీ, వీటిని రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్లలో వాడుకోవచ్చని వెల్లడించింది. రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసేవారికే ఇది వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ తెలిపింది. అలాగే రిడీమ్ కూపన్లను డిసెంబర్ 31లోపు వాడుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మరోవైపు రూ.1,699తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. దీంతో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు1.5 జీబీ 4జీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ లు, అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఏడాది పాటు పొందవచ్చు.
 

 

16:20 - October 20, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్వాస సంబంధమైన వ్యాధులు గత కొన్ని ఏళ్లుగా విజృంభించి ప్రజల జీవితాలపై మరణశాసనాన్ని లిఖిస్తున్నాయి. 2016 సంవత్సరంలో.. 29,000 వేల మంది క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ (సీఓపీడీ) (ఊపిరితిత్తుల వ్యాధులు) కారణంగా ఆంద్రప్రదేశ్‌లో మరణించినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య తెలంగాణలో 19,000 గా గుర్తించారు. దేశవ్యాప్తంగా 2016 సంవత్సరంలో ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల  8.48 లక్షల మంది మరణించారు. 
ఇదే సంవత్సరంలో ఆస్థమా వ్యాధి కారణంగా మరణాల సంఖ్య తెలంగాణలో 4 వేలుకు చేరుకోగా, ఆంద్రప్రదేశ్‌లో 6 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 1.83 లక్షలుగా పేర్కొన్నారు. 
రాష్ట్రాల వారీగా ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రతపై లాన్సెట్ 2018 నిర్వహించిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో తక్కువే అయినప్పటికీ.. వ్యాధి తీవ్రత అధికమేనని నివేదిక తేల్చింది. తెలంగాణ కంటే ఏపీలో ఆస్థమా వ్యాధి ప్రభావం అధికంగా ఉంది. ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రత అధికంగా ఉండటానికి కారణాలు అనేకం. వాయి కాలుష్యం, మితిమీరిన టుబాకో వాడకంతో పాటు పనిచేసే ప్రదేశాల్లో దుమ్ము, ధూళీ వంటి ఆంశాలు సీఓపీడీ వ్యాధుల విజృంభణకు కారణమని నివేదిక స్పష్టం చేసింది.

 

 

15:39 - October 20, 2018

తిరుపతి: హిజ్రా అని ముందే తెలుసు... అయినా ప్రేమించాడు, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. 10 నెలల కాపురం తర్వాత.. ఇప్పుడు హిజ్రా అని తెలిసి బయటకు గెంటేశాడా భర్త. నువ్వు హిజ్రా అనే విషయం నాకు ఇప్పుడే తెలిసిందని అంటున్నాడు. దీంతో భర్త చేతిలో తాను మోసపోయానని దీపిక అనే హిజ్రా ఆందోళకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. విశాఖలో ఈ ఘటన జరిగింది.

దీపిక ఉదంతంపై రాయలసీమ ట్రాన్స్‌జెండర్ అధ్యక్షురాలు హాసిని స్పందించింది. ట్రాన్స్‌జెండర్ అని తెలిసే దీపికను సురేష్ పెళ్లి చేసుకున్నాడని, పెళ్ళికి ముందు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడని హాసిని తెలిపింది. కట్నకానుకల కింద 6లక్షలు నగదు, 10 తులాలు బంగారం కూడా సురేష్ తీసుకున్నాడని చెప్పింది. అయితే 10 నెలల కాపురం తర్వాత దీపికను బయటకు గెంటేయడం అన్యాయం అని హాసిని అంది. దీపికను కొట్టి చిత్రహింసలు పెట్టిన వీడియోలను మీడియాకి, పోలీసులకు ఇచ్చామంది. దీపికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని హాసిని చెప్పింది. 4 నెలలు ప్రేమించి 10 నెలలు కాపురం చేశాక.. ఇప్పుడు దీపిక ట్రాన్స్‌జెండర్ అనే విషయం నాకు తెలియదు అని సురేష్ చెప్పడం చాలా విడ్డురంగా ఉందని హాసిని అంది. ఈ వ్యవహారంలో సురేష్‌ను శిక్షించాలని, దీపికకు న్యాయం జరిగేలా చూడాలని హాసిని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

15:37 - October 20, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన  హలో గురు ప్రేమకోసమే... దసరా కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే.. రీసెంట్‌గా తెలంగాణా ఐ.టీ. మంత్రి కేటీఆర్.. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసారు.. ఇన్ని రోజలు ఎలక్షన్‌ల హడావిడితో బిజీగా ఉన్నా, దసరా పండగ వల్ల కొంచెం విరామం దొరికింది.. పిల్లలతో కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమా చూసాను.. వినోదాత్మకమైన కుటుంబ కథా చిత్రమిది.. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు.. వెంటనే థ్యాంక్స్‌అండీ, మీరు మీ ఫ్యామిలీతో కలిసి సినిమాని ఎంజాయ్ చెయ్యడం మాకు సంతోషంగా ఉంది అని రామ్, థ్యాంక్యూ సర్ అని అనుపమ పోస్ట్ చేసారు..

15:32 - October 20, 2018

ఆదిలాబాద్ : దేశంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న మోదీ మాట ఏమైందనీ..జీఎస్టీ పేరుతో ప్రజలపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించి ప్రజల నడ్డి విరుస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.  ఇంటింటికీ తాగునీరు ఇస్తామనీ..దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామనీ..డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ ఇచ్చిన  హామీలు ఎంతవరకూ నెరవేర్చారని ప్రశ్నించారు. నమ్మించి మోసం చేసిన  మోదీ, కేసీఆర్ ల పాలనకు రాబోయే ఎన్నికల్లో చరమగీతం పాడాలని  జిల్లాలోని భైంసాలో నిర్వహించిన బహింరంగ సభలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.  అధికారంలోకి వస్తే... ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

 

15:14 - October 20, 2018

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో పాత వైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పట్టుదలగా వుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బహింరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు జిల్లాలోని భైంసాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు.

Image result for modiప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాఫెల్ స్కాం ద్వారా తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు కట్టబెట్టారని అన్నారు. జీఎస్టీ పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను మోదీ నడిరోడ్డుపై నిలబెట్టారని విరుచుకుపడ్డారు. 

Image result for anil ambani and adaniయూపీఏ హయాంలో పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేశామన్నారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ...అంబానీలు, అదానీల వంటి 15 మంది కార్పొరేట్లకు ఆయన కాపలాదారుడిగా ఉన్నారని అన్నారు. దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ... దొంగలా మారారని ఎద్దేవా చేశారు.

 

14:48 - October 20, 2018

నిర్మల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్కర్ పేరు నచ్చదని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం అంబేద్కర్ నామస్మరణ చేస్తుంటే.. కేసీఆర్‌కు మాత్రం నచ్చడం లేదన్నారు. అందుకే ఏ పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాజెక్టును సైతం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో రాహుల్ గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ దండుకుందని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులను భారీగా పెంచారని మండిపడ్డారు. రీ డిజైన్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు.

రైతులకు లాభం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని ప్రధాని మోదీ సూచనలలో కేసీఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని రాహుల్ మండిపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం భూములను లాక్కునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్, మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెబుతున్నారని రాహుల్ అన్నారు.

14:42 - October 20, 2018

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది, మీ టూ ఉద్యమం.. గంట గంటకీ ఆరోపణలు చేస్తున్నవారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. రకరాల పరిస్ధితుల్లో వేధింపులకు గురైనవారు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.. పలువురు ప్రముఖులు బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మీ టూ గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు.. మీ టూలో ఆరోపణలు చేస్తున్న వారు నిజంగా వేధింపులు ఎదుర్కొని ఉంటే, న్యాయం జరిగేవరకూ ఓపికగా ఉండాలి.. వైరముత్తు‌పై వచ్చిన ఆరోపణల విషయంలో నిజా నిజాలు వెలుగు చూడాలనీ, సొంత ప్రయోజనాల కోసం మీ టూని మిస్‌యూజ్ చెయ్యొద్దని సలహా ఇచ్చారు.. శంకర్ డైరెక్షన్‌లో చేసిన 2.ఓ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ప్రస్తుతం పేట్టా సినిమాలో నటిస్తున్నారు రజనీ..  

14:35 - October 20, 2018

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 91 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు. ఈరోజు ఆయన హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల  సంఘం ఇటీవల ప్రకటించిన ఓటర్ల లిస్టులో జరిగిన అవకతవకలు సవరించి ఈనెల 25వ తేదీ  లోగా కొత్త ఓటర్ల లిస్టును రాజకీయ పార్టీలకు పంపిణీ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు పక్కా భవనాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శిదిలావస్ధలో ఉన్నపోలింగ్ బూత్ లను గుర్తించి వాటిని మార్చాలని,  పోలింగ్ కేంద్రాలకు  విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ సూచించారు. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,  రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని రజత్ కుమార్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 91 సమస్యస్మాత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, సమస్యత్మాక ప్రాంతాల గుర్తింపుపై పునరాలోచించుకుని ఒక నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన  జిల్లా అధికారులను కోరారు. 

14:27 - October 20, 2018

నిర్మల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ చీఫ్ ఉతమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాలో రాహుల్ గాంధీ ప్రజా గర్జన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తోందన్న ఉత్తమ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10సీట్లు తామే గెల్చుకుంటామన్నారు. నాలుగేన్నర ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించిన ఉత్తమ్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరికి ఎంఎస్‌పీ బోనస్ ఇచ్చి రూ.2వేలకు కొనుగోలు చేస్తామన్నారు. మొక్కజొన్నను రూ.2వేలకు.. పత్తిని రూ.7వేలకు.. మిర్చి, పసుపు రూ.10వేలకు కొనుగోలు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిర్మల్ జిల్లా భైంసాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి, సబిత తదితరులు సభలో పాల్గొన్నారు.

14:02 - October 20, 2018

హైదరాబాద్ : ఖైరతాబాద్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది భారీ గణేషుడు. తరువాత రాజకీయంగా చూసుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత వుంది. ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది. హైదరాబాద్‌కు  హార్ట్ ఆఫ్ ది సిటీగా పేరొందిన నియోజకవర్గం ఖైరతాబాద్. రాష్ట్రంలో ఖైరాతాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ప్రతిష్ఠాత్మకమైనది. ఏ ఎన్నికలైనా, అందరి చూపూ ఈ నియోజకవర్గంపైనే ఉంటుంది. మంత్రులు, ప్రముఖులు ఉండే ఈ సెగ్మెంట్‌ ఎప్పుడూ హాట్‌సీట్‌గానే పరిగణిస్తారు. ఇక్కడి నుంచి గెలిచిన వారికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసే వారి జాబితా చాంతాడంత ఉంటుంది. చివరి నిమిషం వరకు పార్టీ అధిష్ఠానాలు ఈ సీటు విషయంలో నాన్చుడు దోరణితోనే వ్యవహరిస్తాయి. కాంగ్రెస్కు కంచుకోటగా వుండే ఖైరతాబాద్ నుండి  ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. 

Image result for kcr 105ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించి ముందస్తులో ముందుగా వున్న టీఆర్ఎస్ కూడా ఖైరతాబాద్  నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక కాంగ్రెస్ కూటమి ఇంకా సీట్ల సర్ధుబాటు కానేలేదు. దీంతో ఆయా పార్టీల నుండి పలువురు నేతలు ఖైరతాబాద్పై ఆశలు పెంచుకుంటున్నారు. దీంతో పలువురు ఆశావాహులు టిక్కెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు జరుపుతుండగా ఆ పార్టీ అధిష్ఠానం మనస్సులో ఎవరున్నారో బహిర్గతం కావటం లేదు. మాజీ ఎమ్మెల్యే దివంగత పీజేఆర్ మరణాంతరం ఆ బాధ్యతలను అప్పటి కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తీసుకున్నారు. అనంతరం ఓ సారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్ల పాటు ఆయన పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇదే క్రమంలో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిపోగా దానంతోపాటు సీనియర్ నేతలు వెళ్లిపోయారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజల నాడి తెలిసిన నేత కరువయ్యాడు. 
khairatabadఆశావహుల నిరాశ..
ఇక కాంగ్రెస్ లోంచి టీఆర్ఎస్ లోకి వచ్చి అధిష్టానం మెప్పు పొందిన దానం నాగేందర్‌కు ఈ స్థానం కేటాయిస్తున్నట్లు అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎక్కువ మంది ఆశవాహులున్న నియోజకవర్గం ఖైరతాబాద్‌. సుమారు పది మంది వరకు ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించారు.Image result for danam and pjrదానం నాగేందర్‌, విజయారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్దన్‌రెడ్డి, మాజీ మంత్రి కేవీఆర్‌ కుమార్తె, కార్పొరేటర్‌ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మిలతో పాటు పలువురు పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా దానం నాగేందర్‌, విజయారెడ్డి, మన్నె గోవర్దన్‌, విజయలక్ష్మి పేర్లు వినిపించాయి. చివరిలో దానం, విజయారెడ్డిలలో ఎవరికో ఒకరికి టికెట్‌ ఖాయమనే ప్రచారం కూడా కొనసాగింది.
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం..
ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మాజీ కార్పొరేటర్లు, పార్టీలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్‌కే షరీఫ్, కృష్ణా యాదవ్  టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు. ఇద్దరూ నేతలు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవంతో ఉండటంతో పాటు మూడు దశాబ్దాలకు పైగా ఆ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ వెంట పనిచేసిన అనుభవం వీరికి వుంది.  మరో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించిన క్రమంలో పోటా పోటీగా ఆయన మెప్పు పొందేందుకు సదరు నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే అదిష్ఠానం మనస్సులో మాత్రం ఇతర జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఖైరతాబాద్‌ను ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. Image result for CHINTALA RAMACHANDRA REDDYఅధికారికంగా ప్రకటించకపోయినాగానీ బీజేపీ నుండి గతంలో ఖైరతాబాద్ నుండి గెలిచిన చింతల రామచంద్రారెడ్డికే బీజేపీ ఈ సారికూడా టికెట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కూటమిలో సీట్ల సర్ధుబాటులో భాగంగా ఖైరతాబాద్ టిక్కెట్ ను ఏ పార్టీ ఏనేత సాధించుకుంటాడో వేచి చూడాలి. టిక్కెట్ గెలుచుకున్నంతమాత్రాన ఖైరతాబాద్ ప్రజల నాడి తెలుసుకునే నేత ఎవరో వేచి చూడాల్సిందే.

-మైలవరపు నాగమణి.

13:56 - October 20, 2018

విజయవాడ: రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చాలా ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా మృతి చెందుతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల వారి ప్రాణాలు పోతున్నాయి. ఇక మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయడం కారణంగా ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనదారుల భద్రతకు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఇకపై కృష్ణా జిల్లాలో టూవీలర్ నడిపే వారికి హెల్మెట్ మస్ట్ అని కలెక్టర్ స్పష్టం చేశారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1100 జరిమానా విధిస్తామని చెప్పారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే క్రిమినల్‌ కేసుతో పాటు లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. శనివారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 

క్యాంపు కార్యాల‌యంలో ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు హెల్మెట్లు వినియోగం త‌ప్పనిస‌ర‌న్నారు. ర‌హ‌దారి ప్ర‌మాదాల నివార‌ణ‌కు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కలెక్టర్ వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్‌లపై స్పెషల్ ఫోకస్ పెడతామన్నారు.

13:46 - October 20, 2018

మీరట్: కోతులు సృష్టించిన బీభత్సానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక కోతుల గుంపు ఉత్తరప్రదేశ్‌లోని భాగ్ఫట్ జిల్లా టిక్రీ అనే గ్రామానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తిపై రాళ్లు రువ్వడంతో అతను మరణించాడు. 
వివరాల్లోకి వెళితే..  ధర్మపాల్ సింగ్ అనే వ్యక్తి కట్టెలు ఏరుకుంటుండగా.. కోతుల గుంపు అతనిపై ఇటుకలతో దాడి చేశాయి. అక్కడ ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోని ఇటుకలను అందుకొని ధర్మపాల్‌పై విసిరాయి. దీంతో అతని తలపై, గుండెలపై ఇటుకలు తగిలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మరణించాడు. 
దీంతో అతని కుటుంబ సభ్యులు కోతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
ఈ ఫిర్యాదుపై కేసు ఎలా నమోదు చేయాలో తెలియక తికమకపడ్డ పోలీసులు ‘‘యాక్సిడెంట్’’ గా స్టేషన్ డైరీలో రాసి చేతులు దులుపుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన తెలియచేసిన బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. 
కోతుల దండు దాదాపు 20 ఇటుకలను ధర్మపాల్‌పై విసరాయని మృతుని బంధువు కృష్ణపాల్ సింగ్ ఆరోపించారు. కోతుల వల్ల తమ జీవితాలు దుర్భరమవుతున్నా అధికారులు వాటిని తరిమేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
అయితే.. ఇదేం చోద్యం...కోతులపై కేసు ఎలా నమోదు చేయాలని పోలీసులు వాదిస్తున్నారు.  

 

 

13:30 - October 20, 2018

విజయ్ దేవరకొండ కొత్త సినిమా నిన్న ప్రారంభమైంది.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై, కేఎస్ రామారావు సమర్పణలో, కేఎస్ వల్లభ నిర్మిస్తుండగా, ఓనమాలు, మళ్ళీమళ్ళీ ఇదిరాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ముహూర్తపు సన్నివేశానికి కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.. ఈ మూవీలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె హీరోయిన్స్‌గా నటిస్తుండగా, గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అశ్వినీ దత్, బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కళ్యాణ్, దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.. 

12:49 - October 20, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. విజయ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓగా కనిపించబోతున్నాడు.. ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకోవడానికి స్వదేశానికి తిరిగి వచ్చే ఎన్ఆర్‌ఐగా, తన స్టైల్‌తో, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో విజయ్ రెచ్చిపోయాడు.. అక్కడక్కడా తెల్లబడ్డ గెడ్డంతో విజయ్ లుక్ బాగుంది.. ఇప్పటివరకు విజయ్‌తో తీసిన సినిమాల్లో దేశ రక్షణ, రైతు సమస్యలు చూపించిన  మురగదాస్ ఈ సారి ఓటు హక్కు గొప్పదనం తెలిపే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు.. టీజర్‌కి ఏ.ఆర్. రెహమాన్ బ్రహ్మాండమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.. యూట్యూబ్‌లో సర్కార్ టీజర్ హైయ్యెస్ట్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సర్కార్‌లో, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి, యోగిబాబు తదితరులు నటించారు.  దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళ్‌లో సర్కార్ భారీగా రిలీజ్ కానుంది.. 

12:46 - October 20, 2018

హైదరాబాద్: తన్నీరు హరీష్ రావు... పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కేసీఆర్ మేనల్లుడే అయినా.. పార్టీలో తనకంటూ ఓ గుర్తింపు పొందారు. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి సత్తా, ఆకర్షణ కలిగిన నేతగా హరీష్‌కు పేరుంది. అభిమానులు ఆయనను అరడుగుల బుల్లెట్‌గా అభివర్ణిస్తారు. ఎమ్మెల్యేగానే కాదు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారనే గుర్తింపు ఉంది. సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు.. ప్రస్తుతం జాతీయ రికార్డ్‌కు అడుగు దూరంలో ఉన్నారు. 

Image result for harish raoసిద్దిపేట నుంచి మరోసారి గెలిస్తే జాతీయస్థాయిలో ఆయన రికార్డ్ సృష్టించనున్నారు. ఈసారి గెలిస్తే వరుసగా ఆరోసారి విజయం సాధించినట్లు అవుతుంది. అలా ఆరుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన యువ ఎమ్మెల్యేగా(46ఏళ్ల వయసులోనే) హరీష్ రికార్డ్ సృష్టించనున్నారు. పిన్న వయసులోనే(46ఏళ్లు) ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు హరీష్ పేరిట నమోదు కానుంది. ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన హరీష్, కేవలం 14 ఏళ్ల వ్యవధిలోనే ఆరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే రికార్డే.  ఆరోదఫా విజయం నాటికి హరీష్ వయసు 46ఏళ్లు. దీంతో దేశంలోని ఎమ్మెల్యేల్లో ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన జాబితాలో అతి పిన్న వయసు ఎమ్మెల్యేగా హరీష్ రావు ప్రత్యేకతను సొంతం చేసుకోనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు హరీష్ రెండుసార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొదటి నుంచి సిద్దిపేట నుంచే గెలుస్తున్నారు. మెజార్టీలో రికార్డులు సృష్టిస్తున్నారు. కేసీఆర్ కేంద్రమంత్రి అవడంతో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా... నాటి నుంచి హరీష్ అక్కడ పోటీ చేస్తున్నారు. 

2004 ఉప ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో, 2009 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో హరీష్ గెలుస్తూ వచ్చారు. 2018లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ఈసారి కూడా గెలిస్తే 14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలవడం, 46 ఏళ్లకే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జాతీయస్థాయి రికార్డ్ సృష్టించనున్నారు.

కాగా, ప్రస్తుతం కేరళకు చెందిన ఎమ్మెల్యే కేఎం మణి ఖాతాలో ఆరుసార్లు గెలిచిన యువ ఎమ్మెల్యేగా రికార్డ్ ఉంది. కేఎం మణి 1982లో 49 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు.  Image result for km mani mlaఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు గులాబీ దళపతి కేసీఆర్ సైతం ఏడుసార్లు గెలిచి ఎనిమిదో దఫా విజయం కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఆరో గెలుపు నాటికి ఆయన వయసు 50 ఏళ్లు. తెలంగాణకు చెందిన నేతలు బాగారెడ్డి (కాంగ్రెస్) - జహీరాబాద్ నుంచి, జానారెడ్డి (కాంగ్రెస్) నాగార్జున సాగర్ నుంచి, కే చంద్రశేఖర రావు (టీఆర్ఎస్) సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు గెలిచారు. బాగారెడ్డి 53, జానారెడ్డి 63, కేసీఆర్ 50 ఏళ్ల వయస్సుల్లో ఆరోసారి గెలిచారు. 

పేరు పార్టీ నియోజకవర్గం గెలుపు వయసు
బాగారెడ్డి కాంగ్రెస్ జహీరాబాద్ 6సార్లు 53
జానారెడ్డి కాంగ్రెస్ నాగార్జునసాగర్ 6సార్లు 63
కేసీఆర్ టీఆర్ఎస్ సిద్ధిపేట,గజ్వేల్ 6సార్లు 50
హరీష్‌రావు టీఆర్ఎస్ సిద్ధిపేట 5సార్లు 46

ఇక జాతీయ స్థాయి నాయకుల విషయానికి వస్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 60 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కరుణానిధి 1980లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయన వయసు 56. కేరళకు చెందిన కేఎం మణి 1982లో 49ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు. 23 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసు 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 56 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. గణపతిరావు దేశ్‌ముఖ్

Image result for KARUNANIDHIమహారాష్ట్ర నుంచి 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 50 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి తొమ్మిదిసార్లు గెలిచారు. 1972 నుంచి 2009 వరకు గెలిచారు. 52 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు.ఇప్పుడు హరీష్‌రావు వయసు 46 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే.. అతి పిన్న వయసులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నారు.

12:41 - October 20, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 105 మంది ఎన్నికల అభ్యర్థులకు ఖరారు చేసిన ప్రకటించటం..పాక్షిక మేనిఫెస్టోని ప్రకటించటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచరంలోను, అభ్యర్థుల ప్రకటనలోను, మేనిఫెస్టో ప్రకటనలోను గులాబీ పార్టీ ముందస్తుకు దూసుకుపోతుంటో మరోపక్క కాంగ్రెస్ కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్ధుబాటులో తలమునకలవుతోంది.

Image result for congress uttam kumar90 స్థానాల్లో మేమే పోటీ అంటున్న కాంగ్రెస్..
కూటమికి నేతృత్వం వహించేది తామే అనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 90 స్థానాలకు పోటీచేయాలని గట్టిగా అనుకుంటోంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 36 సీట్లకు తగ్గకుండా బరిలోకి దిగాలనేది వారి ఆలోచన. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి మొత్తం 35 స్థానాల్లో తమకు అనుకూల పవనాలు ఉన్నట్లు లెక్క వేసుకుంటోంది. కనీసం 20 సీట్లయినా కేటాయించకపోతే.. వారు కూటమిలో జట్టుకట్టడానికి ఒప్పుకోకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Image result for congress uttam kumar ramanaసీట్ల కేటాయింపుకోసం పలుమార్లు భేటీలు..
కాగా సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు మార్లు కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన జనసమితి అధ్యక్షుడు కోదండరామ శుక్రవారం నాడు కూడా మరోసారి భేటీ అయినా ఎటూ తేలకుండానే భేటీ ముగిసింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై మాత్రం కోదంరామ్ పార్టీ పోటీలోకి దిగేందుకు నిరాకరిస్తోంది. ఈ నేపత్యంలో సీట్ల సర్ధుబాటు..ఇంకా పలు అంశాలపై కూటమితో సర్ధుబాటు చేసుకోకుంటే ఒంటరిగా అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగడానికైనా కోదండరాం సిద్ధంగానే ఉన్నట్లుగా భేటీలో జరుగుతున్న జాప్యాన్ని చూస్తే అనుమానాలు రేగుతున్నాయి. ఇక నాలుగో పార్టీ అయినా సీపీఐ కనీసం నాలుగైనా కేటాయించాలని పట్టుపట్టవచ్చు. ఈ ప్రకారం లెక్కవేస్తేనే 90+36+20+4=150  సీట్లు వారికి అవసరం అవుతాయి.

Image result for l ramanaరాష్ట్రంలో గత ఎన్నికల్లోనే 15 స్థానాల్లో గెలిచి రెండో ప్రతిపక్ష స్థానంలో వున్న టీడీపీ తక్కువలో తక్కువగా చూసుకున్నా 15 సీట్లన్నా ఇవ్వకంటే అసలు ప్రతిపాదించడంలోనే అర్థముండదు. మిగిలిన తెజస, సీపీఐలకు కలిపి 10, 4 వంతున పంచుతారని లెక్కవేస్తే మాత్రమే... వాటి వాటా 29  స్థానాలు అవుతాయి. అప్పుడిక కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీచేయడం కుదురుతుంది. కానీ, ఇంత నీచమైన కేటాయింపులకు తెదేపా, తెజస, సీపీఐ ఒప్పుకుంటాయా అనేది ప్రశ్న. కాగా ఈ పొత్తుల ఖారారుగే సమయం వెచ్చించిన కూటమి..సీట్ల సర్ధుబాటు త్వరగా చేసుకుని ఇకనైనా ప్రచారంలో పూర్తిస్థాయి క్లారిటీతో పాల్గొంటే గులాబీ పార్టీకి సమంగా కాకపోయినా కాస్తలో కాస్తైనా ముందుకు వెళ్లగలిగే అవకాశముంది. కాగా చంద్రబాబు మాత్రం.. పంతాలకు పోకుండా, ఏ పార్టీ గెలవగల స్థానాలను వారికి ఇచ్చేసేలాగా పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. మరి.. ఎవరు ఎన్ని మెట్లు దిగుతారో.. పొత్తు బంధాలు ఎలా కుదురుతాయో చూడాలి.

-మైలవరపు నాగమణి.

12:03 - October 20, 2018

కర్నూలు : వైసీపీ నేత ఇంటి ఆవరణలోని గడ్డివాములో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా పెయింట్స్ బకెట్స్ లో పెట్టి గడ్డివాములో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని వైసీపీ నేత అనంతరెడ్డికి చెందిన నివాసంలోని పెరటిలో వున్న గడ్డివాములో నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. క్లూస్ టీమ్, బాంబ్ స్వ్కాడ్ సహకారంతో పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ బాంబులు నివాసపు ఆవరణలో దాచి పెట్టి వుంచటానికి గల కారణాలేమిటి? ఫ్యాక్షన్ గొడవలా? లేక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే బాంబులను దాచి వుంచారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా సీఐ తెలిపారు. 
 

11:42 - October 20, 2018
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ కరెన్సీ నోట్ల కలకలం చెలరేగింది. కరెన్సీ నోట్లు కట్టలుకట్టలుగా బయటపడుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో కోట్లాది రూపాయల హవాలా నగదు పట్టుబడుతోంది. భారీగా హవాలా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏపీ నుంచి హవాలా డబ్బు తీసుకొచ్చారని, దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి. 
 
హైదరాబాద్ నుంచి జగిత్యాలకు కారులో డబ్బు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఆ కారు టీడీపీ నేతది కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యదర్శి వల్లభనేని అనిల్‌కుమార్ కారులో తరలిస్తున్న రూ.59 లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపుతున్నది. అనిల్‌కుమార్ డ్రైవర్ మహేష్.. ఏజెంట్లకు అప్పగించేందుకు ఆ డబ్బుని తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నమస్తే తెలంగాణ కథనాల ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు అనిల్‌కుమార్ అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. తెలంగాణలో పంచేందుకు ఏపీ నుంచి ఆ డబ్బు తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. సొమ్మును క్షేత్రస్థాయిలోని నాయకులకు హవాలా మార్గంలో పంపి.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించారని చెబుతున్నారు.
Chandrababuకోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. హవాలా దందాలో డబ్బు మార్పిడి చేసుకుంటుండగా సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి, ఐదుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో వల్లభనేని అనిల్‌కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్, పూజ ఫ్యాషన్ షోరూం నిర్వాహకులు గమాన్‌సింగ్ రాజ్‌పురోహిత్, నేపాల్ సింగ్ అలియాస్ మైపాల్ (తండ్రీకొడుకులు), విజయవాడకు చెందిన దమాలూరి శ్రీనివాసరావు, బౌండరీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిరిసిల్ల అవినాశ్ ఉన్నారు. వీరి నుంచి రూ.59లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
 
అనిల్‌కుమార్ తన వెర్నా కారు (ఏపీ 09సీఎఫ్ 1144)లో రూ.59 లక్షలుపెట్టి డ్రైవర్‌కు అప్పగించాడని, ఈ డబ్బును అనిల్‌కుమార్ స్నేహితుడైన వర్మ ఆదేశాలతో కోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో ఇచ్చేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి డ్రైవర్ మహేశ్ పూజ స్టోర్స్‌కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. పూజ ఫ్యాషన్స్ నిర్వాహకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 0.6% నుంచి 08% కమిషన్‌తో హవాలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నగదుతోపాటు డబ్బు తరలింపునకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన ఐదుగురిని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నామని డీసీపీ వివరించారు. 
Ramana
 
కాగా, ఈ డబ్బు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు హవాలా మార్గంలో తరలిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని డీసీపీ చెప్పారు. అనిల్‌కుమార్ స్నేహితుడు వర్మ ద్వారా డబ్బుని జగిత్యాల జిల్లాకు తరలించేందుకు సన్నాహాలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది? అనిల్‌కుమార్‌కు ఆ డబ్బుతో సంబంధం ఉందా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు. అనిల్‌కుమార్ డ్రైవర్‌ను విచారిస్తే హవాలాకు సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా డబ్బు తరలింపునకు టీడీపీ నేత వల్లభనేని అనిల్‌కుమార్ కారు వినియోగించడం అనేక అనుమానాలకు దారితీసింది.
11:33 - October 20, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థులు ముందస్తు వేడిని పెంచుతున్నారు. పార్టీ అభ్యర్థులను  ప్రకటించిన అనంతరం తొలి విడత ప్రచారాన్ని పూర్తిచేసుకుంది. తాజాగా పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటించి ముందస్తు ముందున్నాం అనే సంకేతాలను వెల్లడించింది. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుండి ఇప్పుడు బైటకొచ్చిన నేతలు మలి విడత ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ యాభైరోజులు, వందసభలు అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సందడి  ప్రారంభంకానున్నట్లుగా గాలాబీ నేతల సమాచారం. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే పథకాలు, ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయడం, ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేసేలా, ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో మరోసారి కేసీఆర్ భేటీ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. 

Related imageఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అవగాహన సదస్సును ఈ నెల 21న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో కేసీఆర్ తో పాటు పార్టీ ఎంపీలను కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో  అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సమావేశంలో అవగాహన కల్పిస్తారు. కాగా ఇప్పటికే  పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.తాజాగా పార్టీకి కీలకమైన మ్యానిఫెస్టో పాక్షిక అంశాలను ప్రకటించిన నేపథ్యంలో వరుసగా సభలకు శ్రీకారం చుట్టనున్నారు.

 

11:28 - October 20, 2018

 హీరో సుమంత్ చాలాకాలం తర్వాత మళ్ళీరావా వంటి డీసెంట్ హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చాడు.. ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యపురం.. హీరోగా సుమంత్‌కి 25వ సినిమా.. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది..
టీజర్‌లో సినిమా ఎలా ఉండబోతుందో క్లుప్తంగా చూపించారు. ఒక ఊరు, ఆ ఊరి ఆలయం చుట్టూ జరిగే కథ ఇదని తెలుస్తోంది.. టీజర్ చూసేప్పుడు నిఖిల్ కార్తికేయ సినిమా పోలికలున్నట్టనిపించినా, హారర్,థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తుంది.. సరేష్, భద్రం తదితరులు నటిస్తున్న సుబ్రహ్మణ్యపురం చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నాడు...   

సుబ్రహ్మణ్యపురం టీజర్.. మీరూ ఓ లుక్కెయ్యండి...

10:59 - October 20, 2018

నల్లగొండ : ముందస్తు ఎన్నికల వే‘ఢీ’ రోజురోజుకూ రాజుకుంటోంది. దసరా పండుగను పురస్కరించుకుని ప్రచార వేడిని తగ్గించిన పార్టీలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా బతుక్మతో పలువురు నాయకులు ఆయా ప్రాంతాలలో  ఓటర్లను ఆకట్టుకునేందుకు మహిళలతో బతుకమ్మలు ఆడిపాడారు. దసరా సరదాలు తగ్గిన వేళ అన్ని పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాలలో వ్యూహాప్రతివ్యూహాలకు పదును పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 
Image result for trs flagsగులాబీ దూకుడు..
ఇప్పటికే నల్గొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి బహిరంగ సభలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పాల్గొని పన్నెండు మంది అభ్యర్థులందరినీ గెలిపించేకు నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో  పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఈనెల 16న హైదరాబాద్‌ తెరాస ‘మినీ మేనిఫెస్టో’ను వెల్లడించింది. రూ.లక్ష రుణమాఫీ, రైతుబంధు సాయం రూ.పదివేలకు పెంపు, నిరుద్యోగభృతి, ఆసరా సాయం పెట్టింపు, ఉద్యోగాలు, రెండు పడక గదుల్లో మార్పులు ఇలాంటి హామీలతో ఓటర్లను ఆకర్షించే మేనిఫెస్టోను ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే కాకుండా.. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రచార ఆయుధాలుగా చేసుకుని అభ్యర్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేసీఆర్‌ నల్గొండ జిల్లా అభ్యర్థులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు పది మంది పేర్లను ప్రకటించిన అధినేత.. మిగిలిన కోదాడ, హుజూర్‌నగర్‌ స్థానాల్లో గట్టి అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేశారు. ఇవి దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌ తొలి జాబితా ప్రకటించిన వెంటనే ఆయా చోట్ల నిలిపే అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పది స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులంతా ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. అధినేత ఆదేశాలతో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. శుక్రవారం ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు. 
కాంగ్రెస్ కు వీడని కష్టాలు..
Image result for congress flagsకాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 13న చేపట్టాల్సిన రోడ్డుషో చేపట్టాలని అనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడటంతో ప్రచారంలో వెనకబడినట్లు కనిపిస్తున్నా.. ఆ లోటు పూడ్చేందుకు దిల్లీ నాయకత్వంతో జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో నేతలు తలమునకలయ్యారు. మరోపక్క మహాకూటమిలో పొత్తులు, సీట్లు,అభ్యర్థుల ఖరారు ఇంకా తేల్చకుండా కాంగ్రెస్ కూటమి చాలా వెనుకబడే వుంది. మరి కారు దూకుడుకు..బీజేపీ పట్టుదలకు సమంగా హస్తం పార్టీ , ఆ పార్టీ కూటమి సత్తా చాటుతుందో లేదో వేచి చూడాలి. 

Related imageఒంటిరిగా బరిలోకి బీజేపీ..
ఇక తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించాలనే ఉద్ధేశ్యంతో వున్న కాషాయదళం ఒంటరిగా బరిలో దిగుతున్న భాజపా మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 30 అభ్యర్థులను ఖరారు చేసేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ఖరారు చేసిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా..రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది.  దీంతో జిల్లాలోని రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ భాజపా ఈ సారి శాసన సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనుంది. నాలుగేళ్ల మూడు నెలల తెరాస పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని.. పలు దఫాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపలేదని, ఆ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని, అవకాశమిస్తే తెలంగాణ తలరాతను మారుస్తామనే నినాదంతో ముందుకుసాగుతోంది. తమ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమని అమిత్‌షా సభలతో చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య ముందస్తు వేడి రాజుకుంది. 

10:17 - October 20, 2018

మైసూరు: దసరా పేరెత్తగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మైసూరు. ఎందుకంటే భారతదేశంలో మైసూరులో జరిగినంత గొప్పగా దసరా వేడుకలు మరెక్కడా జరగవు. మైసూరు రాజకుటుంబీకుల ఆధ్వర్యంలో నగరంలో విజయ దశమి వేడులకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మైసూరు ప్యాలెస్.. విద్యుద్దీపాలతో ధగధగ మెరిసిపోతుంది. రాజప్రాసాదాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఏనుగుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. దసరా ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు మైసూరు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటాలానే ఈసారి కూడా అందరి చూపు మైసూరుపై ఉంది. ఎప్పుడెప్పుడు ప్యాలెస్‌లో దసరా వేడుకలు చూసి పులకించిపోదామా అని వెయిట్ చేస్తున్నారు. అయితే వారికి ఈసారి నిరాశ తప్పదు. మైసూరు ప్యాలెస్‌లో దసరా వేడుకలు రద్దయ్యాయి. ఇందుకు కారణం మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకోవడమే.

శుక్రవారం ఒకేరోజున ఇద్దరు పెద్దలు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం రాజమాత ప్రమోదాదేవి తల్లి పుట్టచిన్నమ్మణ్ణి (98) కన్నుమూయగా, మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె (ప్రమోదాదేవి వదిన మరదలు) విశాలక్షి దేవి (58) సాయంత్రం వేళ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సంతాప సూచకంగా మైసూర్ ప్యాలెస్‌లో నిర్వహించే దసరా సంబరాలను రద్దు చేశారు.

రాజవంశీయుడు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు సోదరి విశాలాక్షి (58) శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమాత ప్రమోదాదేవికి స్వయానా ఆమె మరదలు (ఆడబిడ్డ). మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె కూడా. శుక్రవారం ఉదయమే ప్రమోదాదేవికి మాతృవియోగం కల్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాలాక్షి మరణంతో ఒడెయరు కుటుంబంలో ఒకేరోజున ఇద్దరు కన్నుమూసినట్లైంది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. వారి మృతిపట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

09:17 - October 20, 2018

పంజాబ్: మనిషిలో మానవత్వం కనుమరుగైపోతోంది. పక్కవాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. చావుబతుకుల్లో ఉన్నవారిని కాపాడాల్సింది పోయి సెల్ఫీలు దిగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చూశాం. తాజాగా మరోసారి అలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని జోడా పాఠక్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 61 మంది చనిపోయారు. 70మంది గాయపడ్డారు. అప్పటివరకు రావణ దహన వేడుకలను ఆనందంగా చూస్తున్న వారు.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరవేగంగా దూసుకొచ్చిన జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు తమ పాలిట మృత్యుశకటం అవుతుందని పసిగట్టలేకపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్దినిమిషాల ముందు వరకూ ఉన్న ఆనందాతిరేకాలు ఆవిరయ్యాయి. ఆక్రందనలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది.

కాగా.. రావణ దహన వేడుకలు చూసేందుకు వచ్చిన వారు ప్రాణాలు కోల్పోడానికి అనేక కారణాలు వినిపిస్తున్నా.. అందులో సెల్ఫీల పిచ్చి కూడా ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది. సెల్ఫీల కోసం ప్రజలు పోటీలు పడి రైలు రాకను గమనించకపోవడంతో ప్రాణనష్టం భారీగా ఉందని చెబుతున్నారు. 

ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే.. రైలు ఢీకొడుతున్న దృశ్యాలను కూడా కొందరు సెల్‌ఫోన్లలో బంధించడం. అంతేకాదు, ఆ దృశ్యాలను చిత్రీకరించలేకపోయిన వారు, అవి తీసిన వారి నుంచి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవడం గమనార్హం. ఇక తీవ్రంగా గాయపడి ప్రాణాపాయంలో ఉన్నవారికి సాయం చేయాల్సింది పోయి.. వారితో సెల్ఫీలు దిగారు కొందరు మనసు లేని మనుషులు. ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న వారికి సాయం అందించాల్సింది పోయి వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం మరింత బాధాకరమని స్థానికులు చెబుతున్నారు. 

Image result for punjab train accident selfiesరైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేర్వేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశమే లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో వారి కళ్లకు ఏదీ సరిగా కనిపించలేదు. ఈ అయోమయంలో.. వేగంగా దూసుకొచ్చిన రైలు కిందపడి నలిగిపోయారు.

08:31 - October 20, 2018

పంజాబ్‌: అమృత్‌సర్‌లో దసరా పండుగ వేళ చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం పెను విషాదం మిగిల్చింది. రోజంతా దసరా పండుగను వేడుకగా చేసుకొని.. సాయంత్రం రావణ దహనకాండను కళ్లారా చూసేందుకు జనాలు ఉత్సాహంతో వచ్చారు. రావణ దహన వేడుకలను చూస్తూ అప్పటివరకు ఆనందంగా గడుపుతున్న వారిని మృత్యువులా దూసుకొచ్చిన రైలు బలితీసుకుంది. రావణ దహనాన్ని పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ప్రజలపైకి దూసుకొచ్చిన రైలు ఏకంగా 61మంది ప్రాణాలు బలితీసుకుంది. 72మందిని గాయపరిచింది. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుపచక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్దినిమిషాల ముందు వరకూ ఉన్న ఆనందాతిరేకాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆక్రందనలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని జోడా పాఠక్‌ వద్దచోటు చేసుకున్న ఈ ప్రమాదం అనేక కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది.

కాగా, ఈ ఘోర రైలు ప్రమాదం వెనుక ఉన్న కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. హారన్ కొట్టని రైలు, మైకుల మోత, బాణాసంచా పేలుళ్ల శబ్దం, బాణాసంచా నిప్పురవ్వలు, సెల్ఫీలు.. ఇలా పలు కారణాలు ప్రమాదానికి దారితీసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుంటున్న రైలు కొంచెం కూత పెట్టినా ప్రమాద తీవ్రత తగ్గేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు, రైలు వస్తున్న విషయాన్ని గుర్తించిన కొందరు పక్క ట్రాక్‌పైకి వెళ్లాలని భావించారు. అయితే అటునుంచి మరో రైలు రావడంతో వారికి మరో మార్గం కనిపించలేదని చెబుతున్నారు. అయితే, ఆ రైలు అప్పటికే వెళ్లిపోయిందని మరికొందరు చెబుతున్నారు. కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించారని, అందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

ప్రమాదానికి కారణమైన డీఎంయూ 74943 రైలు ఆ ప్రాంతవాసులకు చిరపరిచతమే. హోషియాపూర్ నుంచి జలంధర్ వెళ్లే ఈ రైలులో చాలామంది స్వర్ణదేవాలయానికి వెళ్తుంటారు. ఈ రైలు సమయం అందరికీ తెలుసు. సాయంత్రం 6:50 గంటలకు జోడాపాఠక్‌కు చేరుకుంటుంది. అయితే, దసరా రోజున రైళ్లు ఈ ప్రాంతం గుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. దీంతో జనాలు భయం లేకుండా ట్రాక్‌లు దాటుతుంటారు. ప్రమాద సమయంలో మైకుల్లో పాటలు హోరెత్తుతుండడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు.

రావణ దహనం సందర్భంగా బాణాసంచా నిప్పు రవ్వలు ఎగిరి పడుతుండడంతో అందరూ దూరంగా జరిగి పట్టాలపైకి చేరుకున్నారు. మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ బిజీ అయిపోయారు. బాణసంచా పేలుడు తప్ప వారికి రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు. మరోవైపు రైలు కూడా హారన్ మోగించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఊహించని విధంగా 15 సెకన్ల వ్యవధిలోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది.

రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేర్వేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో వారి కళ్లకు ఏదీ సరిగా కనిపించలేదు. ఈ అయోమయంలో.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు.

ఈ దుర్ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన చిన్నారిని కోల్పోయిన ఓ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కాగా, పండుగ సమయంలో ఆ ప్రాంతంలో రైళ్లను నెమ్మదిగా నడపాలని తాము అధికారులను, స్థానిక నేతలను ఎప్పటి నుంచో కోరుతున్నామని, అయినా ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. బాణసంచా పేలుడు మోతలో రైలు చప్పుడు తమకు వినిపించలేదని మరో వ్యక్తి చెప్పాడు. డ్రైవర్‌ హారన్‌ కొట్టలేదని ఆరోపించారు.

Don't Miss