Activities calendar

24 October 2018

22:39 - October 24, 2018

ఢిల్లీ : ప్రధాని మోడీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ను డమ్మీ చేశారని పేర్కొన్నారు. దేశ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

 

22:32 - October 24, 2018

హైదరాబాద్ : హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నౌహీరా షేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ప్రాసిక్యూషన్ వాదనలతో సంత‌ృప్తి చెందని కోర్టు.. కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రూ.5 లక్షలతోపాటు రెండు షూరిటీలతో రూ.5 కోట్లను ఈనెల 29లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సమయానికి డిపాజిట్ చేయకపోతే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతోపాటు కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని.. నౌహీరా షేక్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

నౌహీరా తరపు న్యాయవాది వినీత్‌దండా కోర్టులోకి వస్తున్న సమయంలో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై అతని బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు బౌన్సర్లను పోలీసీులు అరెస్టు చేశారు.  

 

21:49 - October 24, 2018

గుంటూరు : ప్రధాని మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ పాలనలో సీబీఐ నిర్వీర్యమైందన్నారు. ఈమేరకు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్థానను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. పోరాటాలు చేసే వారిపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేస్తుందని తెలిపారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

21:34 - October 24, 2018

వాషింగ్టన్ : అమెరికాలో బాంబ్ పార్సిళ్లు కలకలం రేపాయి. వైట్ హౌస్, ఒబామా, హిల్లరీకి దుండగులు బాంబ్ పార్సిళ్లు పంపించారు. పార్సిళ్లలో భారీగా పేలుడు పధార్థాలు ఉన్నాయి. సీక్రెట్ సర్వీస్ తనిఖీల్లో గుర్తించి సీజ్ చేశారు. మీడియా సంస్థలకూ బాంబు పార్సిళ్లు పంపారు. పార్సిళ్లపై ఎఫ్‌బిఐ దర్యాప్తు మొదలు పెట్టింది. 

 

21:23 - October 24, 2018

నాగర్‌కర్నూలు : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కేసులతో కాంగ్రెస్‌ అడ్డుకోవాలని చూస్తోందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూలులో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. వలస పోయినోళ్లను టీప్రభుత్వం వాపసు తెస్తుంటే.. కాంగ్రెస్‌ వలస వాదులను భుజాన మోసుకొస్తుందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌, తెదేపా కూటమి అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీళ్లిస్తారా? అని ప్రశ్నించారు. శ్రీశైలం చంద్రబాబు జాగీరు కాదని, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీళ్లు తోడుకోవడం తమ హక్కు అని హరీశ్‌ పునరుద్ఘాటించారు. 1000 మంది చంద్రబాబులు అడ్డంపడినా, వెయ్యి మంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా కచ్చితంగా కల్వకుర్తి మోటార్లు నడుపుతామని, రైతన్నలకు నీళ్లందిస్తామని హరీశ్‌రావు అన్నారు.

ప్రాజెక్టులపై చంద్రబాబు ఢిల్లీకి మళ్లీ ఉత్తరం రాశారన్నారు. కాంగ్రెస్‌ ముసుగుతో చంద్రబాబు తెలంగాణలోకి రావాలని చూస్తున్నారని, ఆయన్ను నమ్ముకుని కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణకు నీళ్లు ఆపాలని లేఖలు రాసిన చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవడం దుర్మార్గమన్నారు.

21:06 - October 24, 2018

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 3,200 కిలోమీటర్ల  మైలు రాయిని దాటింది. ఈసందర్బంగా విజయనగరంజిల్లా సాలూరు మండలం బాగువలస వద్ద  జగన్ కానుగ మొక్కను నాటారు. 293వ రోజు ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాసాలూరు మండలంలో జరుగుతున్న సమయంలో రాష్ట్రప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రజలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలు  పర్మినెంట్ చేయాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. 

20:48 - October 24, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 17న సంగారెడ్డి రోడ్‌షోలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుమతించిన సమయానికి మించి రోడ్‌షో నిర్వహించారంటూ ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సంగారెడ్డి పట్టణ పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 506 సెక్షన్లు, టీఎస్‌ ఏరియా పోలీస్‌చట్టంలోని సెక్షన్‌ 26 కింద కేసు నమోదు చేశారు.
కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో ఇటీవల జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమరవాణా, పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు కావడంతో ఆయనకు జైలు శిక్ష పడింది. బెయిల్‌పై బయటకు వచ్చిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

20:25 - October 24, 2018

ఢిల్లీ : త్వరలో వీకాన్‌ రొక్‌ 3డీ మొబైల్స్ మార్కెట్‌లోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీ వీకాన్‌ రొక్‌ 2019లో భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీని కోసం భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో జత కట్టింది. 3డీ మొబైల్స్‌ విక్రయించడంతో పాటు మొత్తం 25 పట్టణాల్లో వైఫై సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకొంది. భారత్‌కు చెందిన వీకాన్‌ అమెరికాకు చెందిన రొక్‌ కార్పొరేషన్లు సంయుక్తంగా వీకాన్‌ రొక్‌ను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే వీకాన్‌ రొక్‌ కార్పొరేషన్‌ నాసాతో కలిసి కమ్యూనికేషన్‌ టెక్నాలజీపై పనిచేస్తోంది. ముఖ్యంగా వైఫై, మొబైల్‌ హ్యాండ్‌సెట్లకు సంబంధించి ఇరు సంస్థల భాగస్వామ్యం ఉంది. వీకాన్‌ ఉత్పత్తి చేసే రొకిట్‌ 3డీ మొబైల్‌ను 2019 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

 

20:15 - October 24, 2018

ఢిల్లీ: భారతదేశంలో సినీ,క్రీడా,రాజకీయ రంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న" మీటూ" ఉద్యమంలో చాలా మంది ప్రముఖులు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇందులోవాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో ప్రస్తుతానికి తేలనప్పటికీ, మీటూ ఉద్యమం పేరు చెపితేనే పలువురు హడలిపోతున్నారు. మీటూ దెబ్బకు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ఏకంగా తన పదవినే కోల్పోవాల్సివచ్చింది.  ఈ  పరిస్ధితుల్లో పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన నలుగురు మంత్రులతోకూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నిర్మలాసీతారామన్, మేనకాగాంధీ ఈబృందంలో ఉన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్నలైంగిక వేధింపులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలను ఈబృందం పరిశీలిస్తుంది.  పనిప్రదేశాల్లో వేధింపులకు గురైన మహిళలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా షీబాక్స్ (www.shebox.nic.in) ద్వారా, wcd@nic.in  ను కేంద్రమంత్రి  మేనకాగాంధీ ఏర్పాటు చేయించారు. 

19:03 - October 24, 2018

ముంబై: మహారాష్ట్ర సీనియర్ అధికారులను, మీడియా బృందాన్ని తీసుకెళుతున్న పడవ తిరగబడిన సంఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. అధికారుల బృందంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. 
సముద్రంలో ఉన్న చత్రపతి శివాజీ మెమోరియల్‌ను సందర్శించేందుకు అధికారులతో పాటు 40 మంది ప్రింట్, టీవీ మీడియా సిబ్బంది ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. హెలీకాప్టర్ల ద్వారా, ఇతర మెరైన్ సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషనతో అందరు సురక్షితంగా మెమోరియల్‌కు చేరుకున్నారు. అయితే ఒకరు అచూకీ ఇంకా లభించలేదు. ఈ సంఘటనతో మెమోరియల్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. 

 

 

18:59 - October 24, 2018

హైదరాబాద్: తెలంగాణాలో బీజేపీని అధికారం లోకితీసుకు రావటానికి నేటి నుంచిపార్టీ కోసం కష్ట పడతానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. ఇన్నాళ్ళు రాష్ట్రంలో  దారుసలాం కనుసన్నల్లో  రాష్ట్రంలో పార్టీలు పనిచేశాయని, త్వరలో లాల్ దర్వాజా కనుసన్నల్లో  రాజకీయాలు నడుస్తాయని ఆయన అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో సమావేశం అయిన తర్వాత, బుధవారం హైదరాబాద్ చేరుకున్న స్వామీజీ మొదట చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి  ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్సి మురళీధరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

"రాజకీయాల్లోకి రావాలంటే ఫాదర్ అన్నా ఉండాలి గాడ్ ఫాదర్ అన్నా ఉండాలి, నాకు దేవుడు తప్పు ఎవరూ దిక్కులేరని" స్వామిజీచెప్పారు. గత 25 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై పోరాడాను అని, మారుమూల ప్రాంతాల్లో పర్యటించానని అక్కడి ప్రజల జీవన స్ధితిగతులు పరిశీలించానని, వారి జీవితాలు బాగుచేయాలంటే రాజకీయాల్లోకి రావటం ఒక్కటే మార్గమని ఆలోచించి బీజేపీలో చేరానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు.

ఇన్నాళ్లు ధర్మంకోసం పోరాడావు ఇప్పుడు దేశం కోసం పాటు పడమని తన తల్లి,గురువు చెప్పటంతో నాఆలోచనలకు తగ్గ పార్టీ బీజేపీ అనిభావించి బీజేపీలో చేరినట్లు పరిపూర్ణానంద తెలిపారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచనలు మేరకు తాను పనిచేస్తానని, అందరినీ కలుపుకుపోయి బీజేపీని ఆధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తానని పరిపూర్ణానంద  చెప్పారు. పార్టీకోసం అన్ని రాష్ట్రాలలో పనిచేస్తానని, ఇక కురుక్షేత్రం మొదలైందని, రాష్ట్రంలో కుటుంబపాలనను అంతంచేస్తామని,తెలంగాణ ఇంక కాషాయ తెలంగాణా కాబోతోందని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

18:16 - October 24, 2018

టీజర్, ట్రైలర్లతోనే సినిమాలపై ఆసక్తి పెంచేలా చెయ్యడం ఈ జనరేషన్ మేకర్స్ స్టైల్.. లేకపోతే  ప్రేక్షకులను ధియేటర్లలకు రప్పించలేరు.. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన ట్రైలర్‌తో ఆడియన్స్ ముందుకువచ్చింది బాలీవుడ్ పీహూ టీమ్.. 
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వినోద్ కాప్రి డైరెక్షన్‌లో, సిద్ధార్థ్ రాయ్ కపూర్, శిల్పా జిందాల్, రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న పీహూ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.. రెండేళ్ళ పాప ఇంట్లో ఒంటరిగా తిరుగుతూ, నిద్రపోతున్న తల్లిని లేపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఎంత పిలిచినా తల్లి లేవదు.. ఆమె చేతిపై గాయాలుంటాయి. ఆ చిన్నారి ఇళ్ళు పీకి పందిరి వేస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో, స్నానం చెయ్యడానికని ఆన్ చేసి మర్చిపోయిన గీజర్ పేలిపోవడం, బ్రెడ్ ముక్కలు మాడిపోవడం, వేడెక్కువై లైట్లు పేలిపోవడం.. ఇలా, అంతా గందరగోళంగా అవుతుండగా, పాప చేతిలో ఉన్న బొమ్మ జారి కింద పడితే, పాప బొమ్మకోసం కిందకు దూకడానికి ట్రై చెయ్యడం చూస్తే మాత్రం, వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇంట్లో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త వహించాలో తెలియచెప్పేలా ఉంది పీహూ ట్రైలర్.. నవంబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..

17:55 - October 24, 2018

హైదరాబాద్: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న స్వామి పరిపూర్ణానంద ఢిల్లీలో  బీజేపీ అధిష్టానంతో సమావేశం అయ్యి బుధవారం రాష్ట్రానికి తిరిగివచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు,స్వామివారి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిజి చార్మినార్ వద్దకు చేరుకుని  భాగ్యలక్ష్మిఅమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం స్వామిపరిపూర్ణానంద బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. 

17:47 - October 24, 2018

రోమ్‌ :మెట్రో ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. ఇటలీలోని ఓ మెట్రో స్టేషన్‌లో ఉన్నట్టుండి స్పీడ్ పెరగటంతో ఎస్కలేటర్ మీద నుంచి దిగుతున్న ప్రయాణీకులు ఒకరిపై ఒకరు పడి పలువురు గాయపడ్డారు. రోమ్ నగరంలో జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ఫుట్‌బాల్ గేమ్‌ను వీక్షించి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్పీడు పెరగటంతో ఒకరి మీద ఒకరు పడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఎస్కలేటర్ స్పీడు పెరగటానికి కారణంపై అధికారలు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

16:53 - October 24, 2018

ఢిల్లీ : హాలీవుడ్‌లో మొదలైన ‘మీ టూ’ భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు గతంలో జరిగిన చేదు అనుభవాలను స్వేచ్చగా మహిళామణులు నినదిస్తున్నారు. దీనితో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి. తాజా, మాజీ హీరోయిన్లు.., . సెలెబ్రెటీలు..,లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా వెల్లడిస్తు మీ టూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తు్న్నారు. ఇవన్నీ నిజం కాదని ఆరోపణలు వచ్చిన వారు వీటిని ఖండిస్తున్నారు. 
తాజాగా ప్రముఖ టెలివిజన్ నటి సొనాల్ వెంగురేల్కర్ స్పందించింది. తనతో ఫొటోగ్రాఫర్, కాస్టింగ్ డైరెక్టర్ రాజ బజాజ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఇదంతా 19 ఏళ్ల వయస్సులో జరిగిందని తెలిపారు. ఓ ఆన్ లైన్ పోర్టల్‌లో అడిషన్ కోసం సంప్రదించడం జరిగిందని, అడిషన్‌లో తాను పొల్గొనడం జరిగిందన్నారు. Image result for Sonal Vengurlekarఓ రోజు తన దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడని, బలవంతంగా ఛాతీపై క్రీమ్ రాసేందుకు యత్నించాడని వెల్లడించింది. Image result for Raja Bajaj sexual harassmentమరలా తన గదికి వచ్చిన బజాజ్ తాంత్రిక విద్యలు నేర్పిస్తానని..రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చని..కానీ దుస్తులు తొలగించి తన ఎదుట కూర్చొని తాను చెప్పిన మంత్రాలను చెప్పాలని డిమాంఢ్ చేశాడని ఆరోపించింది. షాక్‌కు గురైన తాను బజాజ్‌పై 2012లో కస్తుర్బామార్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాజా బజాజ్ ఆమె ఆరోపణలని తోసిపుచ్చారు. సొనాల్ తన ఇంటికి వచ్చి మూడు లక్షలు డిమాండ్ చేసిందని, ఆ తరువాత లక్షన్నర కి దిగివచ్చిందని దానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. 

 
16:40 - October 24, 2018

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్ధ (సీబీఐ) లో అధికారుల మధ్య అంతర్గతపోరు మొత్తానికి సంస్ధ పరువును బజారుకీడ్చి ప్రభుత్వాన్నిఇరకాటంలోకి నెట్టుతోంది. ఇప్పటికే విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలెట్టాయి. ఇద్దరు అధికారులను శలవుపై పంపినప్పటికీ, అందులో ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏరికోరి తెచ్చుకున్నఅధికారి రాకేష్ఆస్ధానా కూడా ఉండటంతో విపక్షాల విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. విచారణలో పారదర్శకత, సీబీఐ సమగ్రత, విశ్వసనీయత కాపాడటానికే ఇద్దరు అధికారులను ప్రభుత్వం శలవుపై పంపిందని కేంద్రఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 
మోడీ ప్రభుత్వం సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీసిందని, రాజకీయ ప్రతీకారాలకు, కుట్ర రాజకీయాలకు సీబీఐ బలవుతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ డీల్ కు సంబంధించిన కేసు కాగితాలు తెప్పిస్తున్నందునే  అలోక్ వర్మను  తప్పించారని రాహుల్ విమర్శించారు.
ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోటానికి, తమకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన అధికారిని రక్షించేందుకే, ఇంకో అధికారిని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తొలగించిందని సీపీఐ  జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 
మోడీ సీబీఐని కాస్తా(బీబీఐ) బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా మార్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. 
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను శలవుపై పంపించడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. లోక్ పాల్  చట్టపరిధిలో ఏర్పాటైన సంస్ధపై కేంద్రం పెత్తనం ఏంటని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో దాచటానికి ప్రయత్నిస్తోందని, రాఫెల్ కుంభకోణంపై అలోక్ వర్మ విచారణ చేపట్టాలనుకున్నారా? ఆయన్ను తప్పించడానికి, రాఫెల్ కుంభకోణానికి ఏమైనా సంబంధం ఉందా ? అని కేజ్రీవాల్   ప్రశ్నించారు.

 

16:25 - October 24, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్నామధ్య రిలీజ్ చేసిన టీజర్‌ అండ్ సాంగ్స్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి ధియేట్రికల్ ట్రైలర్‌ని ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్‌‌ని నాగచైతన్య వాయిస్ ఓవర్‌తో మొదలుపెడితే, ట్రైలర్‌ని విలన్ పాత్రధారి మాధవన్ వాయిస్‌తో స్టార్ట్ చేసారు. భారతంలో అర్జునుడికి రెండుచేతులకు సమానమైన బలంఉండేది.. అలాంటి శక్తి ఒక హీరోకి ఉంటే ఎలా ఉంటుంది, అతని ఎడమ చెయ్యి అతని   ఆధీనంలో లేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న సవ్యసాచిలో, కామెడీ, ఎమోషన్, లవ్ అండ్ సెంటిమెంట్ వంటివన్నీ ఉన్నాయనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విలన్‌కీ, హీరోకీ మధ్య జరిగే వార్  ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనిపిస్తుంది.. ఎమ్.ఎమ్.కీరవాణి నేపధ్యసగీతం, యువరాజ్ కెమెరా వర్క్ బాగున్నాయి.. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.. ఈ మూవీ ద్వారా చైతూ  మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.. భూమికాచావ్లా, వెన్నెల కిషోర్, ముకుల్ దేవ్, రావు‌రమేష్ తదితరులు నటిస్తున్న సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

 

15:56 - October 24, 2018

ఖమ్మం: వైరాలో ప్రస్తుతం సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ మదన్ లాల్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించడంతో ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన మదన్‌లాల్‌... ఆ తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరారు. కొత్త పార్టీలోనూ పట్టు సాధించారు. ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు ఇంకా ఆశావహుల విషయంలో ఫీట్లు చేస్తుంటే మదన్‌లాల్‌ ప్రచారంతో దూసుకుపోతున్నారు.

* 2014లో వైరాలో విజయం సాధించిన బానోత్‌ మదన్‌లాల్‌
* వైసీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్‌

వైరాలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బానోత్‌ మదన్‌లాల్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి ఈసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. మదన్‌లాల్‌కు మండలాల వారీగా ఉన్న పట్టు, పరిచయాలు కలిసొచ్చే అంశం. గ్రామ గ్రామాన బలమైన క్యాడర్ ఉంది. చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు ఎలాగైనా గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు.

Image result for banoth madanlal trsఅయితే.. బలమైన నాయకగణంతో ఉన్న ఎంపీ పొంగులేటి వర్గీయులతో సఖ్యత లేదు. మదన్‌లాల్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. మదన్‌లాల్ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అవుతారా లేక బీ-ఫామ్ సమయంలో అభ్యర్ధిని మారుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. 

2014 ఎన్నికల్లో..
వైసీపీ నుంచి పోటీ చేసిన మదన్‌లాల్‌కు 59,318 ఓట్లు
టీడీపీ అభ్యర్థి బాలాజీ నాయక్‌కు 48,735 ఓట్లు
టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన బానోత్‌ చంద్రావతికి 7,704 ఓట్లు 

ఎస్టీ రిజర్వు స్థానమైన వైరాలో గత ఎన్నికల్లో మదన్‌లాల్‌ వైసీపీ నుంచి పోటీ చేసి 59వేల 318ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి బాలాజీ నాయక్‌ 48,735 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం బాలాజీ నాయక్‌ సైతం గులాబీ గూటికి చేరారు. ఇక సీపీఐ నుంచి పోటీ చేసిన నారాయణకు 27,071 వచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన బానోత్‌ చంద్రావతికి 7,704 ఓట్లు పడ్డాయి. 

వైరా నియోజకవర్గంలో కొణిజర్ల, వైరా, ఏన్కుర్, జూలూరుపాడు, కామేపల్లి మండలాలున్నాయి. 1978 నుంచి 2009 వరకు సుజాతానగర్ నియోజకవర్గంగా ఉండగా.. ఇది రద్దై 2009లో వైరా పేరుతో ఎస్టీ నియోజకవర్గం ఏర్పడింది. సుజాతానగర్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 8సార్లు ఎన్నికలు జరిగాయి. 4సార్లు సీపీఐ నుంచి మహ్మమద్ రజబ్ అలీ గెలుపొందారు. అంతకు ముందు రెండు సార్లు విజయం సాధించారు. జిల్లాలో అత్యధికంగా గెలుపొందిన నేతగా రజబ్ అలీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఖమ్మంలో సీపీఎం పక్షాన ఒక్కసారి, సీపీఐ పక్షాన మరోసారి గెలుపొందారు. 1994 ఎన్నికల తరువాత రజబ్ అలీ మరణించటంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 1999, 2004లో రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. మూడు సార్లు రెడ్డి, ఒక్క సారి కమ్మ, మూడు సార్లు ముస్లింలు ఇక్కడ ఎన్నికయ్యారు.

* వైరా నియోజకవర్గంలో ఐదు మండలాలు
* కొణిజర్ల, వైరా, ఏన్కుర్, జూలూరుపాడు,  కామేపల్లి మండలాలు
* 1978 నుంచి 2009 వరకు సుజాతానగర్ నియోజకవర్గంగా ఉన్న వైరా 
* సుజాతానగర్ నియోజకవర్గంలో ఒక ఉపఎన్నికతో సహా 8 సార్లు ఎన్నికలు 
* జిల్లాలో అత్యధికసార్లు గెలుపొందిన నేతగా రజబ్ అలీ
* 1999, 2004లో రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపు

2014లో వైరాలో వైసీపీ అభ్యర్ధి మదన్‌లాల్ తన సమీప టీడీపీ అభ్యర్ధి బాలాజీ నాయక్‌పై గెలుపొందారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి మదన్‌లాల్ అధికార టీఆర్ఎస్‌లో చేరారు. వైరాలో సిపిఐ తరుపున 2009లో గెలుపొందిన బానోత్ చంద్రావతి బీజేపీలోకి వెళ్లి అక్కడ నుంచి టీఆర్ఎస్‌‌లోకి మారి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం చంద్రావతి టీఎస్‌‌పీఎస్‌సీ సభ్యురాలిగా ఉన్నారు.

15:39 - October 24, 2018

Image result for సిరిసిల్లకరీంనగర్ : సిరిసిల్ల నియోజకవర్గం...13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి. చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా నివాసం ఉంటున్నారు. సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు ఇక్కడి నుండి ఐదు సార్లు విజయం సాధించారు. ఇక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే కె.తారకరామారావు గెలుపొందారు. తాజాగా ఈయన ఈ నియోజకవర్గం నుండే మరోసారి బరిలోకి దిగుతున్నారు. 
Image result for కేటీఆర్ ఎన్నికల ప్రచారంసీపీఐ కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉండేది. 1952, 1957 సంవత్సరాల్లో ద్విసభ్య శాసనసభగా సిరిసిల్ల కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రాగానే ఇక్కడి ఓటర్లు వినూత్నంగా తీర్పునిస్తున్నారు. కొత్త కొత్త నాయకులకు ఓటర్లు పట్టం కడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని పార్టీల వారికి ఇక్కడి ఓటర్లు ఆదరణ చూపారు. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు...కమ్యూనిస్టు పార్టీ నాలుగు సార్లు.., టీడీపీ ఒకసారి.., స్వతంత్ర అభ్యర్థి ఒకసారి ప్రాతినిథ్యం వహించారు. 
1952లో జె.ఆనందరావు పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967, 1978, 1985, 1994, 2004 సంవత్సరాల్లో చెన్నమనేని రాజేశ్వరరరావు గెలుపొందారు. సీపీఐ తరపున నాలుగుసార్లు గెలుపొందగా టీడీపీ నుండి ఒకసారి గెలుపొందారు. 1999లో చెన్నమనేని పరాజయం పొందారు. Related image
2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో బరిలోకి దిగిన కేటీఆర్ కేవలం 171 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 68, 220 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఉప ఎన్నికతో కలిపి వరుసగా మూడుసార్లు కేటీఆర్ ఇక్కడి నుండి విజయం సాధించారు. 

సంవత్సరం గెలుపొందిన ఎమ్మెల్యే పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
1952  జె.ఆనందరావు  పీడీఎఫ్  38,421 ఆర్.ఎం.కె.రావు  సోషలిస్టు 13342
1952  జె.ఎం.రాజమణిదేవి (ద్విసభ్య నియోజకవర్గం)  ఎన్‌సీఎఎ 31, 624 ఎన్.ఆర్. బాబయ్య కాంగ్రెస్  12,786
1957 కె.నరసయ్య పీడీఎఫ్  19,100 ఆర్.దేవి   కాంగ్రెస్ 18,362
1957 అమృత్‌లాల్ శుక్లా (ద్విసభ్య నియోజకవర్గం) పీడీఎఫ్ 19,099 ఎ.వి.ఆర్.రెడ్డి   కాంగ్రెస్ 16,719
1962 జె.నర్సింగరావు కాంగ్రెస్  15,811   జి.ఎల్.నరసయ్య స్వతంత్ర  6,691
1967 చెన్నమనేని రాజేశ్వరరావు సీపీఐ  23,525  జె.నర్సింగరావు  కాంగ్రెస్  15,193
1972 జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ 25,821   సీ.హెచ్. రాజేశ్వరరావు  సీపీఐ   23,135
1978 చెన్నమనేని రాజేశ్వరరావు సీపీఐ 28,685 నాగుల మల్లయ్య  కాంగ్రెస్ (ఐ) 18,807
1983   వి.మోహన్ రెడ్డి   టీడీపీ 27,508  రేగులపాటి పాపారావు  కాంగ్రెస్  19,809
1985  చెన్నమనేని రాజేశ్వరరావు  సీపీఐ  43,664  ఆర్.శంకరయ్య  కాంగ్రెస్  20,101
1989 ఎన్.వి.కృష్ణయ్య స్వతంత్ర  26,430  రేగులపాటి పాపారావు స్వతంత్ర 25,906
1994  చెన్నమనేని రాజేశ్వరరావు  సీపీఐ  36,154 రేగులపాటి పాపారావు  స్వతంత్ర 31,637
1999 రేగులపాటి పాపారావు కాంగ్రెస్  58,638 చెన్నమనేని రాజేశ్వరరావు టీడీపీ  48, 986
2004  చెన్నమనేని రాజేశ్వరరావు  టీడీపీ  36, 783 కేకే మహేందర్ రెడ్డి  స్వతంత్ర  36,612
2009 కె.తారకరామారావు టీఆర్ఎస్ 171 కె.కె.మహేందర్ రెడ్డి స్వతంత్ర  
2010 కె.తారకరామారావు (ఉప ఎన్నిక) టీఆర్ఎస్ 87,876 కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ 19,656
2014 కె.తారకరామారావు  టీఆర్ఎస్ 92,135   కొండూరి రవీందర్‌రావు కాంగ్రెస్ 39,131
2018   ?    ?    ?    ?    ?    ? 

 ఏళ్ల తరబడి ఆసక్తికర పరిణామాలకు వేదికగా నిలుస్తున్న సిరిసిల్లలో ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. 

- తూపురాణి మధుసూధన్

14:22 - October 24, 2018

హైదరాబాద్ : ఎన్నికలు..ఎందరికో ఉపాధిని కలిగిస్తుంటాయి. అధికారంలోకి రావాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో ఓటర్లు కీలకం. ఓటర్‌ని ఆకర్షించేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచనలు చేస్తుంటాయి. గతంలో ఎన్నికలు రాగానే గోడ రాతలు, పోస్టర్లు, స్టిక్కర్లు ఇతరత్రా కనిపించేవి. కానీ కాలం మారింది.. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చురుకైన పాత్రను పోషిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే ఒక్క నిమిషంలో ప్రపంచం తెలిసేలా చేస్తున్నాయి ఈ సామాజిక మాధ్యమాలు. ఫేస్ బుక్..యూ ట్యూబ్, ట్విట్టర్, వాట్సప్ వేదికల ద్వారా ప్రచారం నిర్వహించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయని ప్రచారం జరిగింది. 
Image result for election 2018 social media campaign telanganaతాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు డిసెంబర్ నెలలో జరుగబోతున్నాయి. దీనితో ఆయా పార్టీలు సామాజిక మాధ్యమాలపై కన్నేశాయి. ఇందులో నిపుణులైన కొంతమందిని నియమించుకుని పార్టీని..అభ్యర్థి..అధికారంలోకి వస్తే పార్టీ ఏం చేయబోతుందనే దానిపై విసృ‌తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకున్నాయంట. ప్రత్యర్థుల లోటుపాట్లు..తాము చేసిన అభివృద్ధి పనులు...తదితర సందేశాలను రూపొందించి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా ఇతరులకు చేరవేస్తున్నారు. ఇందుకు ఆయా పార్టీలు..అభ్యర్థులు ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. 
Image result for election 2018 social media campaign telanganaఇప్పటికే ఖరారైన అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను తెగవాడేస్తున్నారు. పార్టీల మీటింగ్‌లు..విశేషాలను...యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా ఉండటానికి ఆయా వీడీయోలకు హంగులు కూడా జోడిస్తున్నారు. ఇందుకు వీడియో ఎడిటర్లు..ఇతరత్రా వారిని నియమించుకుంటున్నారు. వీరికి ప్రస్తుతం యమ క్రేజ్ ఉందంట. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. ప్రత్యర్థులు వాటిపై విమర్శలు కురిపిస్తున్నారు. గ్రూపుల్లోనే వాద ప్రతివాదాలు జరుగుతూ గొడవలకు దారి తీస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్నిరకాల సామాజిక మాధ్యమాలపై ఈసీ డేగకన్ను పెట్టింది. గతంలో ఎన్నికల నియావళి ఉల్లంఘనపై ఫిర్యాదులను నేరుగా స్వీకరించేది. ప్రస్తుతం సి-విజిల్ అనే యాప్‌ని రూపొందించింది. అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల నియామవళి ఉల్లంఘించినట్లైతే పౌరులు చిత్రాలు...వీడియోలు తీసి సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ దోహదపడుతుందంట. మరి నెట్టింటి ప్రచారం..రాజకీయం అభ్యర్థుల తలరాతను మారుస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 
- తూపురాణి మధుసూధన్

14:18 - October 24, 2018

అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ.. జయమ్ము నిశ్చయమ్మురా, భరత్ అనే నేను, గీత గోవిందం వంటి సినిమాలతో యంగ్ కమెడియన్‌గా రికగ్నైజ్ అయ్యాడు. ఇప్పుడు ఒక విషయంలో రీల్ లైఫ్‌లో జరిగే ఒక సంఘటనని, రియల్ లైఫ్‌లో చేసి చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే, రాహుల్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసాడు. ఆ పిక్‌లో మనోడు ఒకమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు.. అది కూడా, సముద్ర తీరంలో కావడం విశేషం. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి అనుకునే లోపే, మేమిద్దరం 2019 జనవరి 15న పెళ్ళి చేసుకోబోతున్నాం.. అంటూ, సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. రాహుల్ తన మ్యారేజ్ సంగతి చెప్పగానే చాలామంది అతనికి శుభాకాంక్షలు లెలుపుతున్నారు. రాహుల్ నటిస్తున్న మిఠాయి సినిమా నవంబర్‌లో రిలీజ్‌ కానుంది..

13:57 - October 24, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ చెప్పారు. డబ్బు, మద్యం, నగదు పంపిణీపై నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశామని.. కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రావత్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు రావత్ బృందం తెలంగాణలో పర్యటించింది. 

ఈ సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణలో ఓపీ రావత్ మీడియాతో మాట్లాడారు. తమ పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యామని, విస్తృతంగా చర్చలు జరిపామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయాలని పార్టీలు సూచించాయని.. వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని రావత్ చెప్పారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని సవరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల వినతులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పక్క రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారులపై నిఘా పెట్టాలని, పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ ప్రకటనలను మానిటర్ చేయాలని కొన్ని పార్టీలు సూచనలు చేశాయని ఓపీ రావత్ పేర్కొన్నారు. పింక్ కలర్ పోలింగ్ కేంద్రాలు ఉండవని.. కేవలం మహిళా పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉంటాయని రావత్ తెలిపారు. ఈసారి కొత్తగా వీవీ ప్యాట్‌లను ప్రవేశ పెడుతున్నామన్నారు.

తెలంగాణలో మొత్తం ఓటర్లు 2.73కోట్లు
పురుష ఓటర్లు - 1.31కోట్లు
మహిళా ఓటర్లు - 1.35కోట్లు
సర్వీస్ ఓటర్లు - 9,262 
థర్డ్‌జెండర్ ఓటర్లు - 2,663
మొత్తం పోలింగ్ కేంద్రాలు - 32,574

తెలంగాణలో మొత్తం 2.73కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. 1.31కోట్ల మంది పురుష ఓటర్లు, 1.35కోట్ల మంది మహిళా ఓటర్లు.. 9వేల 262 సర్వీసు ఓటర్లు.. 2,663 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 32వేల 574 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.

13:50 - October 24, 2018

హైదరాబాద్ : కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలను కార్యకర్తల సమ్మేళనాలకు ఆహ్వానిస్తూ ఉత్సాహాన్ని నింపుతు..అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న భాజపా ఈ సారి తన సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇంటింటికీ ప్రచారం సాగిస్తూనే.. నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో పార్టీకి చెందిన మాజీలతో పాటు.. మొత్తం పది స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావడంతో.. ప్రచారం ఊపందుకుంది. నగరంలో భాజపా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారు తమ నియోజకవర్గాలలో పాదయాత్రలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

Image result for rammadhav and telanganaఎల్‌బీనగర్‌ తదితర స్థానాల్లో నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యాలయాలను ప్రారంభించి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, మురళీధర్‌రావులతో మల్కాజిగిరి, ముషీరాబాద్‌లలో సదస్సులు నిర్వహించారు.రాజేంద్రనగర్‌, సికింద్రాబాద్‌లలో నియోజకవర్గ స్థాయి సదస్సులు..నాంపల్లి, సనత్‌నగర్‌, చేవేళ్ల నియోజకవర్గాల సదస్సులను నిర్వహించారు.

Image result for bjp jp nadda and rammadhavకేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరై భాజపా గెలుపు ఆవశ్యకత గురించి కార్యకర్తలకు వివరించారు. గత మూడు రోజుల నుండి కొనసాగుతున్న సదస్సులు సమావేశాల నేపథ్యంలో ఈరోజు కూడా  శేరిలింగంపల్లి, మలక్‌పేటలలో సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు జరిగాయి. అనంతరం ర్యాలీలు,  ఇతరత్రా ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు కాషాయదళం ప్రణాళికలు రూపొందించారు.

Image result for paripurna swamy in bjpనేటి సభలో పరిపూర్ణానంద స్వామి.. 
ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరిన పరిపూర్ణానంద స్వామి బుధవారం నగరానికి రానున్నారు. పార్టీలో చేరాక మొట్ట మొదటిసారి ఆయన నగరానికి వచ్చి అనంతరం సభలో పాల్గొంటారని సమాచారం. 
 

13:37 - October 24, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. నేతల జీవితాల ఆధారంగా పలువురు దర్శకులు సినిమాలను రూపొందిస్తున్నారు. అందులో ప్రధానంగా ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్ బయోపిక్ అయితే ముగ్గురు నిర్మాణం చేపడుతుండడం విశేషం. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చిత్రం రూపొందుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే కేతి రెడ్డి జ‌గ‌దీష్‌రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గంధమ్‌’ అంటూ మ‌రో బ‌యోపిక్‌ని తీస్తున్నారు. 
Image result for Sri Reddy in Lakshmi's Veeragrandham Kethi Reddyఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనలను చూపిస్తానని, నటీ నటుల ఎంపిక జరుగుతోందని కేతిరెడ్డి పేర్కొన్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి కీలకం. ఈ పాత్రను ఎవరు పోషించనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాశమైంది. ఈ పాత్రకు శ్రీరెడ్డిని కేతిరెడ్డి ఎంపిక చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 
గతంలో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ను శ్రీరెడ్డి కదిపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింద. ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకంగా అర్థనగ్న ప్రదర్శన చేసి టాలీవుడ్‌ని షేక్ చేసేసింది. అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి మకాం తమిళనాడుకు మార్చింది. తాజాగా కేతిరెడ్డి నిర్మిస్తున్న ‘ల‌క్ష్మీస్ వీర‌గంధమ్‌’లో 

13:17 - October 24, 2018

మీ టూ ఉద్యమం.. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది.. పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోంది.. రోజురోజుకీ ఆరోపణలు చేస్తున్నవాళ్ళతోపాటు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. రీసెంట్‌గా ఒకప్పటి బాలీవుడ్ నటి, దర్శకురాలు, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ భార్య, సోనీ రాజ్దాన్ తనకెదురైన మీ టూ మూమెంట్ గురించి బయటపెట్టడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకెటువంటి లైంగిక వేధింపులు ఎదురవలేదని చెప్పిన సోనీ, అదే సమయంలో, తనపై రేప్ అటెంప్ట్ జరగబోయిందని చెప్పి షాక్ ఇచ్చారు.. ఒక సినిమా షూటింగ్ టైమ్‌లో ఒకవ్యక్తి నాపై అఘాయిత్యం చెయ్యబోయాడు.. నా ఫేట్ బాగుండి అతగాడి బారినుండి బయటపడ్డాను, అతని పేరు చెప్పదల్చుకోలేదు. ఎందుకంటే అతనొక్కడు చేసిన తప్పువల్ల అతని ఫ్యామిలీ బాధపడకూడదు. అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. అతను చేసిన తప్పులకు ఈ పాటికే శిక్ష అనుభవించి ఉంటాడు. ఇక నటుడు అలోక్ నాథ్ విషయానికొస్తే, నేనూ అలోక్‌తో కలిసి పని చేసాను. తప్ప తాగి ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చెయ్యడం చూసాను. అతను నన్ను చూసే చూపులు చాలా చెండాలంగా ఉండేవి అంటూ, సినీ పరిశ్రమలో తనకెదురైన చీకటి అనుభవాల గురించి చెప్పకొచ్చారు సోనీ.. ఈమె బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తల్లి.

13:04 - October 24, 2018

ఢిల్లీ: సీబీఐలో లంచాల వివాదం, వర్గ పోరు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు టార్గెట్ చేయడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరుకున పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపించింది. రాత్రికి రాత్రే సీబీఐ డైరెక్టర్‌ను మార్చేసింది. తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.

Image result for cbi new directorసీబీఐ డైరెక్టర్ బదిలీ అంశం వివాదాస్పదం మారడంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కేంద్రం చర్యలను సమర్థించుకున్న జైట్లీ.. సీబీఐ ప్రతిష్టను కాపాడేందుకే వారిని సెలవుపై పంపి.. సీబీఐ డైరెక్టర్‌ను మార్చామని వివరించారు. అలోక్ వర్మ, ఆస్థానాలను సెలవుపై మాత్రమే పంపామని జైట్లీ గుర్తు చేశారు. ఆ ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో విచారణలో తేలుతుందన్నారు. పారదర్శకంగా విచారణ జరిగేలా చూస్తున్నామన్నారు. విచారణ సమయంలోనే ఎవరు దోషులో చెప్పడం సరికాదన్నారు. సీబీఐని విచారించే అధికారం ప్రభుత్వానికి లేదన్న అరుణ్ జైట్లీ.. సీబీఐ కేసులను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిశీలిస్తోందని వెల్లడించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని, ఇద్దరిలో ఎవరు తప్పు చేశారన్నది విచారణలో తేలుతుందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలని జైట్లీ అన్నారు. అవినీతి ఎవరు చేసినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

13:03 - October 24, 2018

ఢిల్లీ : పలు కీలక పరిణామాల మధ్య సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు నియమించిన విషయం తెలిసిందే. దీంతో నాగేశ్వరరావు స్వగ్రామంలోను, ఆయన బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మన్నెం నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శలు చేశారు. ఆయన  అవినీతి అంటే తెలియనివారు కాదనీ ఆరోపించారు. నాగేశ్వరరావుపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఈరోజు మీడియాతో మాట్లాుడుతు ఈ వ్యాఖ్యలు చేశారు.

Image result for prashant bhushanదీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. కాగా, తనను నిబంధనలకు విరుద్ధంగా తప్పించారని ఆరోపిస్తూ అలోక్ వర్మ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
కాగా పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. కొత్త సీబీఐ బాస్ గా తెలుగు వ్యక్తి, వరంగల్ వాసి మన్నెం నాగేశ్వరరావును నియమించిన నేపథ్యంలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నాగేశ్వర్ రావుపై పలు ఆరోపణలు చేయటం కీలకంగా మారింది.

12:57 - October 24, 2018

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది ? ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీకి చెందిన నేతలు షాక్‌లిస్తున్నారు. పార్టీ నుండి ఒక్కొక్కరూ వీడుతుండడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఇటీవలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. సభ విజయవంతమైందని..కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిందని పార్టీ నేతలు భావించారు. కానీ వారి ఆనందం కొన్ని రోజులే నిలిచింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని కొంతమంది నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. హుస్నాబాద్ టికెట్ తనకివ్వకుండా వేరే వారికివ్వాలని పార్టీ చూస్తోందని..దీనితో మనస్థాపానికి గురైన ఆయన పార్టీని వీడాలని యోచించినట్లు తెలుస్తోంది. కొన్ని విషయాలను పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖను రాసినట్లు సమాచారం. 
Image result for karimnagar bjp state presidentపార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కొత్త శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు, బుధవారం రాత్రి 9గంటలకు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను కలుసుకున్నారని తెలుస్తోంది. 
మరోవైపు నేతలు వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదని..ఇతరులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొత్త వారిని పార్టీలోకి చేరిపించుకొనేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు, నాలుగు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నాలను ఇప్పటికే బీజేపీ నేతలు చేపట్టినట్లు టాక్. చొప్పదండి, హుస్నాబాద్, జగిత్యాల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన కొంతమంది నేతలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ బలోపేతం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయా ? టీఆర్ఎస్ పార్టీ ఎలా ఢీకొననుందో చూడాలి. 

12:35 - October 24, 2018

వరంగల్ : కృషి పట్టుదల వుంటే సామాన్యుడు సైతం అసామాన్యుడిగా మారే అవకాశం వుందని నిరూపించారు మన తెలుగు తేజం, తెలంగాణ వాసి మన్నెం నాగేశ్వరరావు. సీబీఐ డైరెక్టర్ గా మంగళవారం అర్థరాత్రి నాగేశ్వరరావు ఇంటి తలుపుతట్టి మరీ అత్యుత్తమ పదవి వరించింది. సోమవారం రాత్రి వరకూ ఓ ఐపీఎస్ గా మాత్రమే వున్న నాగేశ్వరరావు తెల్లవారే సరికల్లా జాతీయ సీబీఐ డైరెక్టర్ గా అత్యుత్తమ స్థానంలో కూర్చున్నారు. 

Image result for mannem nageswararaoఅనూహ్య పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు మన్నం పిచ్చయ్య, శేషమ్మలకు ఆయన రెండో సంతానం. నాగేశ్వరరావుకు ఓ అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదివిన ఆయన... తిమ్మంపేటలో పదో తరగతి వరకూ చదివారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి తరువాత సీకేఎం కళాశాలలో డిగ్రీ చేశారు. ఉస్మానియాలో పీజీ చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఒడిశా కేడర్‌లో ఐపీఎస్‌గా చేరినా.. ఎక్కువకాలం ఛత్తీస్‌గఢ్‌లో పని చేశారు. ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు.
మన్నెం నాగేశ్వరరావు అరుదైన అవకాశం దక్కించుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని చేపట్టారు. Image result for jd lakshmi narayana
దక్షిణాది రాష్ట్రాల జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తరువాత ఆ స్థానంలో నాగేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ని సీబీఐ నూతన డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. నాగేశ్వరరావు కృషి, దీక్ష, అంకితభావమే ఆయన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి సీబీఐ డైరెక్టర్ స్ధాయికి తీసుకెళ్లిందని బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

12:30 - October 24, 2018

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నాలుగో తరగతి విద్యార్థి జోసఫ్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 10వ తరగతి విద్యార్థి కొట్టడం వల్లే జోసఫ్ చనిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 10వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. హాస్టల్ వార్డెన్ ప్రతాప్, హెచ్‌ఎం వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఖమ్మంలోని ఖానాపురానికి చెందిన దేవత్‌ రవి, పర్వీన్‌ కుమారుడు 10ఏళ్ల దేవత్‌ జోసఫ్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం జోసఫ్ హాస్టల్‌లో విగతజీవిగా కనిపించాడు. ట్రంకు పెట్టెలో జోసెఫ్ మృతదేహం ఉండటంతో విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. 

సెల్‌ఫోన్ కోసం జోసెఫ్‌‌తో పదో తరగతి విద్యార్థి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అదే హాస్టల్‌లో ఉంటూ దగ్గర్లోని రిక్కాబజార్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థితో జోసఫ్‌కు మాటామాటా పెరిగిందని... సదరు టెన్త్‌ విద్యార్థి.. మరికొందరు విద్యార్థులతో కలిసి జోసఫ్‌ను తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలై... జోసఫ్ అక్కడికక్కడే చనిపోయాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థి తన సైకిల్‌పై జోసఫ్‌ను బయటకు తీసుకువెళ్లడం చూశామని , ఆ తర్వాత వాళ్లు తిరిగి ఎప్పుడు వచ్చారో తెలియదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. 

కాగా, హాస్టల్ సిబ్బంది నిర్లక్షమ్యే తమ పిల్లాడి మృతికి కారణం అని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలపై దాడిచేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. వసతి గృహం సంక్షేమాధికారితోపాటు డీటీడీఓ, ఏటీడీఓ పర్యవేక్షణ సక్రమంగా లేకే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12:04 - October 24, 2018

ఢిల్లీ : కంచె చేను మేసినట్లుగా వుంది సీబీఐలో ముదురుతున్న లంచాల వివాదం. కేంద్ర దర్యాప్తు సంస్థలో డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్రమోదీ  డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించి తెలుగు తేజం..తెలంగాణ వాసి అయిన మన్నెం నాగేశ్వరరావుకు డైరెక్టర్ గా బాధ్యలను అప్పగిస్తు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింతగా ముదిరినట్లుగా కనిపిస్తోంది.

Image result for alok verma with supreme courtవేటుకు గురైన అలోక్ వర్మ తనకు న్యాయం చేయాలంటు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ సెలవుపై వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే తనను అకారణంగా తొలగించారని చెబుతూ అలోక్ వర్మ ఈ రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎలాంటి తప్పు లేకపోయినా ప్రభుత్వం తనను బాధ్యతల నుంచి తప్పించిందని అలోక్ వర్మ కోర్టు పిటీషన్ లో తెలిపారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకున్నారని వాపోయారు.  ఈ మేరకు అలోక్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించింది.ఈ సందర్భంగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 

11:59 - October 24, 2018

తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇప్పటికే తమవంతు సహాయ మందించగా, రామ్ చరణ్ బాధిత ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపాడు.. నారా బ్రహ్మణి విరాళంతో పాటు, పది గ్రామాల్ని అడాప్ట్ చేసుకున్నారు..
ఇప్పుడు మరికొంతమంది సినీ ప్రముఖులు ఏపీ సీఎమ్ చంద్రబాబుని కలిసి చెక్కులను అందించారు..
సినీనటుడు రాజశేఖర్ దంపతులు రూ.పది లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందించారు.. సినీ నిర్మాత, భవ్య సిమెంట్స్ అధినేత వి.ఆనందప్రసాద్ రూ.పది లక్షల విరాళమివ్వగా, నిర్మాత కే.ఎస్.రామారావు, అశోక్ కుమార్ తదితరులు చంద్రబాబుని కలిసి చెక్కునందించారు.. అలాగే, విశాఖపట్నం పోర్టు ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించగా, పోర్టు చైర్మన్ కృష్ణబాబు రూ.26.91 లక్షల చెక్కును సీఎమ్‌కు అందించేసారు.. 

 

11:49 - October 24, 2018

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఈసీ అన్ని వర్గాలను అప్రమత్తం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అనుమతి లేనిదే ప్రచార సామాగ్రిని ముద్రించరాదంటూ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులను ఆదేశించింది. 

 

* ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేస్తున్న ఈసీ
* అభ్యర్థి ఖర్చు, ప్రచార సామాగ్రిపై దృష్టి పెట్టిన ఈసీ
* ప్రింటర్ల యజమానులతో ఈసీ భేటీ 
* అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు

హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిబంధనలపై ప్రింటర్ల యాజమానులతో ఈసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల జాయింట్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రిచంద‌న, జాయింట్ క‌లెక్టర్‌ ర‌వి, ఎన్నిక‌ల వ్యయ నోడ‌ల్ అధికారి ద్రాక్షమ‌ణి ఈ స‌మావేశాన్ని నిర్వహించారు. ప్రచురణ సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

* అనుమతి లేకుండా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే చర్యలు
* ఎన్నికలు జరిగే అన్ని రోజుల్లో తప్పనిసరి నియమం
* పోస్టర్లు, పాంప్లెట్స్‌ ప్రింటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈసీ వివరణ
* కరపత్రాలపై ప్రచురణ కర్త పేరు, ప్రచురణ సంఖ్య తప్పనిసరి
* కరపత్రాలకు సంబంధించిన సమాచారం ఈసీకి అందించాలని సూచన

ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ముందస్తు అనుమతి లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ముద్రిస్తే సంబంధిత ప్రింటర్లపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికలు జరిగే అన్ని రోజులు ఈ నియమం తప్పనిసరని తేల్చి చెప్పింది. పోస్టర్లు, పాంప్లెట్స్‌ ప్రింటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వివరణ ఇచ్చింది. ప్రింట్‌ చేసిన కరపత్రాలు, పోస్టర్లు, హాండ్‌బిల్స్‌పై ప్రచురణ కర్త పేరు, ప్రచురించిన సంఖ్య అలాగే ప్రింటర్‌ వివరాలను విధిగా ప్రింట్‌ చేయాలని సూచించింది. ప్రింట్‌ చేసిన కరపత్రాలకు సంబంధించిన సమాచారాన్ని అపెండెక్స్‌-బిలో పూర్తి చేసి... ప్రింట్‌ చేసిన కాపీని జతపరిచి ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. 

* నిబంధనలు ఉల్లంఘిస్తే 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా
* అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు

నిబంధనలు ఉల్లంఘించి... ప్రచురణ కర్త పేరు, ప్రింటర్‌ పేరు లేని కరపత్రాలను ముద్రిస్తే 6 నెలల జైలు శిక్ష, లేదా రెండు వేల జరిమానా ఒక్కోసారి రెండూ విధిస్తామని ఈసీ తెలిపింది. పోటీ చేసే అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే ప్రింటర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల జాయింట్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు. 

ఇప్పటికే ఎలక్షన్‌ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం... అభ్యర్థి ఖర్చు, ప్రచార సామాగ్రిపై కూడా దృష్టి సారించింది.

11:43 - October 24, 2018

ఢిల్లీ : ఎలాంటి అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరించిన నౌహీరాను 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. హీరా గ్రూప్ అధినేత నౌహీరాను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్...పోలీసుల తరపున వాదనలను వినిపించారు. తమ క్లయింట్‌పై ఉద్దేశ్య పూర్వకంగానే కక్ష్యతో కేసులు నమోదు చేశారని... పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వకుండా నౌహీరాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపున న్యాయవాది కోర్టును కోరారు. డిపాజిట్ దారులకు నష్టం కలుగకుండా చూసేందుకు 25 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇప్పటికే ఇండియాతో పాటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 బ్యాంకు అకౌంట్లను హీరా సంస్థ క‌లిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా ఖాతాల్లో హీరా గ్రూప్ జరిపిన లావాదేవిల ఏ విధంగా ఉన్నాయి ? ఆ ఖాతాలు చూసిన తర్వాత ప్రజల దగ్గరి నుంచి ఎంత మెుత్తంలో డబ్బులు వసూలు చేశారన్న దానిపై ఆమెను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

 

11:35 - October 24, 2018

శ్రీకాకుళం : తిత్లీ దెబ్బకు అంధకరమైన శ్రీకాకుళంలో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి. పన్నెండు రోజులుగా విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలకు ఫలితం లభించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో 98 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగిందని...మరికొన్ని రోజుల్లోనే వ్యవసాయానికి కూడా కల్పిస్తామని మంత్రి కళా వెంకటరావు తెలిపారు. తిత్లీ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం జిల్లా పూర్తిగా అంధకారమయమైంది. దాదాపు పన్నెండు రోజులుగా పది వేలమంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి ఎట్టకేలకు వెలుగులు నింపారు. జిల్లాలోని 18 మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది.Image result for Cyclone-Titli-Electricity-Department-Restore-Electricity-Supply
దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విద్యుత్ శాఖ...అహర్నిశలూ శ్రమించడంతో మంగళవారం నాటికి 98శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగామని ఆ శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. నాలుగైదు గ్రామాలకు మినహా మిగతా ప్రాంతాలన్నింటికీ విద్యుత్ పనులు పూర్తి చేయగలిగామని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అయితే తిత్లీ విద్యుత్ శాఖకు మంచి గుణపాఠం నేర్పిందని.. ఈ అనుభవంతో కొత్త  ఆలోచనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద పన్నెండు రోజుల పాటు చీకట్లో మగ్గి..నరకం అనుభవించిన సిక్కోలు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

11:31 - October 24, 2018

తిరుమల : కలియుగ దైవం తిరుమల వెంకన్న సన్నిధి రాజకీయాలకు వేదిగా మారిపోతోంది. టీటీడీ బోర్ట్, ప్రభుత్వం, అర్చకుల మధ్య వెంకన్న నలిగిపోతున్నాడు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకన్న దేవాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తులకు, ఆభరణాలకు కొదవేలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారింది. శ్రీనివాసుడు ఆస్తులు, ఆభరణాల విషయంలో ఎంతటి వివాదం రేగిందో తెలిసిన విషయమే. ఈ వివాదంలో ప్రధాన వ్యక్తి  శ్రీ వెంకటేశ్వరుని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.

టీటీడీ చరిత్రలో ఇలా మాజీ ప్రధానార్చకుడిపై పరువు నష్టం కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. దేవస్థానంలో మిరాశీ అర్చకులు, వంశపారంపర్య అర్చకుల పదవీ విరమణ వయసును నిర్దేశిస్తూ, టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తరువాత, పలువురు తమ అర్చకత్వ పదవులకు దూరంకాగా, వారిలో రమణ దీక్షితులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన టీటీడీ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. 
స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నగలను కాజేశారని, ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పరమ పవిత్రమైన ఆలయం పరువు పోయిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రమణదీక్షితులపై టీటీడీ  రూ. 200 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది.  శ్రీవారి ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహించిన వ్యక్తపై పరువు నష్టం దావా వేయటం టీటీడీ చరిత్రలో తొలిసారి కావటం విశేషం. మరి దీనిపై రమణదీక్షితులు ఎలా స్పదిస్తారో వేచి చూడాలి.

11:27 - October 24, 2018

న్యూఢిల్లీ: ఢిల్లోలోని భారత అత్యున్నత నేర విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆఫీసులో అర్థరాత్రి ఉత్కంఠ మధ్య ఇద్దరు టాప్ బాస్‌లైన అలోక్ వర్మ ఆయన డిప్యూటీ రాకేష్ రాస్థానాలను ఆగమేఘాల మీద శలవ మీద బయటకు పంపారు. ఈ మేరకు అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు ఆదేశాలు జారీచేశారు. జేడీగా ఉన్న వరంగల్‌కు చెందిన ఎమ్ నాగేశ్వరరావును తాత్కాలికి సీబీఐ చీఫ్‌గా నియమించారు. సీబీఐకు అధికారిక నియంత్రణ సంస్థ అధిపతి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి తన రాజీనామాను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. సీబీఐ అంతర్గత వ్యవహారాలపై తక్షణం నివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాని కోరినట్టు సమాచారం.
ఇంటి గుట్టు రచ్చకీడ్చిన ఇద్దరు సీబీఐ టాప్ బాసులను ఆఫీసులోకి అడుగుపెట్టకుండా సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా కారు డ్రైవర్లను వెంటనే విధులనుంచి తప్పించారు. వారి ఆఫీసు గదులని సీజ్ చేసి ఆఫీసులను నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 
ఇది ఇలా ఉంటే అలోక్ వర్మ అర్థరాత్రి ఆదేశాలపై బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసేందుకు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసును శుక్రవారం విచారించే అవకాశం ఉంది. 

 

 

11:24 - October 24, 2018

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోంది. నిత్యం లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలతో తిరుమలకు వచ్చినా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేది క్షణకాలం మాత్రమే...ఆ క్షణకాలం దర్శనానికి 15 నుండి 20 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిందే..మరోవైపు ప్రముఖుల తాకిడితో భక్తుల దర్శనం మరింత ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమలకు భక్తజన తాకిడి గత కొద్ది నెలలుగా నిరంతరం కొనసాగుతోంది. నిత్యం 80 వేల మందికి తక్కువ కాకుండా దర్శనాలు చేయిస్తున్నారు. గత పదేండ్లతో పోల్చితే తిరుమలకు భక్తుల రాక ప్రస్తుతం బాగా పెరిగింది. భక్తులు  పెరుగుతున్న కారణంగా టిటిడికి ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే దీన్ని నియత్రించేందుకు టిటిడి కొత్తగా ఆలోచిస్తోంది. ఇకపై విఐపీలకు బ్రేక్ దర్శనాన్ని నెలకు ఒక్కసారే కల్పించేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. 
Image result for tirumala huge crowdఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రద్దీ రోజుల్లోనే అధికంగా వస్తున్నారు. వారి వల్ల సాధారణ భక్తులు దర్శనానికి ఆలస్యమవుతోంది. విఐపీల దర్శనం అయిపోయిన తరువాత కూడా దర్శనం  పునరుద్దరించడానికి పావుగంట సమయం పడుతుంది. ఈ సమయంలో సుమారు వెయ్యి మందికే దర్శనం ఆగిపోతుంది.
నిత్యం తిరుమలకు వెల్లువలా వచ్చే రద్దీని తట్టుకోవాలంటే భక్తులను తిరుపతిలోనే కట్టడి చేయాలన్నది టిటిడి ఆలోచన. దీనికోసం అలిపిరిలో సుమారు 2 వేల గదులు నిర్మించాలని ఇటీవలె పాలకమండలిలో తీర్మానించారు. మొదటి  దశలో 120 కోట్లతో 500 గదులు నిర్మించాలని టిటిడి పాలకమండలి తీర్మాణం చేసింది. Related image
గత నెలలో ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1,02,219 ఇది తిరుమలలో రెండవ రికార్డు. గతంలో 2016 లో 1,02,617 మంది ఒకేరోజు స్వామివారిని దర్శించుకోవడం ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి రికార్డులు భవిష్యత్‌లో బ్రేక్ చేయడం కష్టమేమి కాదు. మరి టిటిడి అందుకు తగ్గట్లుగా ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

11:17 - October 24, 2018

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామాచంద్ర స్వామి దేవస్థానంలో శబరి స్మృతియాత్ర బుధవారం జరుగనుంది. శ్రీ సీతారామాచంద్ర స్వామి అపర భక్తురాలైన గిరిజన మహిళ శబరిమాతకు గౌరవార్థం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస  శుద్ధపౌర్ణమి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం వేలాది మంది గిరిజనులు భద్రాచలం చేరుకుని మేళాతాళాలు, మంగళవాయిద్యాలతో గిరిప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత దేవాలయానికి చేరుకుని చిత్రకూట మండపం నందు ప్రత్యేక  పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ కార్యక్రమం జరుగనుంది. 

 

11:15 - October 24, 2018

వరంగల్: నిన్నటి వరకూ దూరం దూరంగా ఉంటున్న ఆ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒక్కటయ్యారు. కార్యకర్తల సమావేశంలో చేతులు కలిపి అన్నదమ్ములమని చాటారు. అసమ్మతి లేదని.. అంతా సమ్మతే నంటూ.. గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని చాటారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తాజా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి- సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కటయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసమ్మతి లేదని కడియం స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను, రాజయ్య కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

Station Ghanpur TRS candidate Thatikonda Rajaiah flanked by KT Rama Rao and Kadiyam Srihari

స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి నలుగురు నాయకులు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ మహాకూటమి నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

చిన్నచిన్న విబేధాలను పక్కనపెట్టి ఏకతాటిపై పనిచేస్తామని కడియం.. రాజయ్య ముక్త కంఠంతో స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు కలిసిరావడంతో కార్యకర్తల్లో కొత్త జోష్‌ నెలకొంది.

 
11:07 - October 24, 2018

విజయవాడ : నగర మేయర్ నివాసంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ శాఖకు పన్ను చెల్లించకపోవటంతో మేయర్ కోనేరు శ్రీధర్ నివాసంలో మూడు గంటలపాటు ఎనిమిదిమంది  జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేఎంకే ఈవెంట్స్ సంస్థకు డైరెక్టర్ గా వున్న మేయర్ భార్య వున్నారు. ఈ క్రమంలో కేఎంకే ఈవెంట్స్ సంస్థ జీఎస్టీ పన్ను చెల్లించకపోవటంతో అధికారులు తనిఖీలు నిర్వహించి విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేఎంకే ఈవెంట్స్ కు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవటంతో జీఎస్టీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా ఈ దాడులపై మేయర్ కోనేరు శ్రీధర్ స్పందిస్తు..తమ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసారనే వార్తలు వస్తున్నాయనీ..కానీ జీఎస్టీ అధికారులు మాత్రమే తనిఖీలు చేశారని స్పష్టం చేశారు. కాగా తాము ఐటీ పన్నులు కూడా సక్రమంగానే చెల్లిస్తామని ఇటువంటి తనిఖీలు సాధారణమేనని తెలపారు.
 

11:06 - October 24, 2018

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోసం...  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను నిలిపివేశారు. ఈ నెల 17న దుర్గాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు జస్టిస్‌ గొగోయ్‌ ఆయన సతీమణితో కలిసి అసోంలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయానికి వెళ్లారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆలయంలో ఉండటంతో జస్టిస్‌ గొగోయ్‌ను వెళ్లకుండా ఆపేశారు. అంతటితో ఆగని అధికారులు అమిత్ షా...ఆలయం నుంచి బయటకు వెళ్లే వరకు ఆయనను వేచివుండేలా చేశారు. ప్రొటోకాల్‌ను ధిక్కరించి, భారత ప్రధాన న్యాయమూర్తితో అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురు సీనియర్‌ అధికారులను సస్సెండ్‌ చేశారు. ప్రొటోకాల్ ధిక్కరించి, చీఫ్ జస్టిస్‌కు భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పులక్ మహంతాతోపాటు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భన్వర్‌లాల్ మీనా, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత ప్రతిమ్ కథకోతియాను సస్పెండ్ చేశారు. రాజకీయ నేతలు ఆలయంలో ఉంటే.. భారత ప్రధాన న్యాయమూర్తిని ఆలయం బయట వేచి ఉండేలా చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

10:52 - October 24, 2018

తమిళనాడు : కాంచిపురంలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందారు. కాంచిపురంలోని ఓ నివాసంలో దీపావళి విక్రయాల కోసం పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వచేసి ఉంచారు. అయితే ఆ బాణాసంచా పేలడంతో నివాసంలో ఉన్న తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురు సజీవదహనం కాగా...మరో మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోయింది. తీవ్రగాయాలైన మరో ఐదుగురికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం...సత్వర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కాంచిపురం ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.

 

10:50 - October 24, 2018

హైదరాబాద్ : మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా? మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్థం మారిపోతోందా? దీనికి కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వివాహితుల్లో పెరుగుతున్న వివాహేతర సంబంధాల నేపథ్యంలో నేరాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని సంతోష్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ఆమె ప్రియుడుగా చెబుతున్న వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మంటలు తాళ లేక ఆసుప్రతికి తీసుకెళ్లే క్రమంలోనే మృతి చెందింది. పంజాబ్ కు చెందిన సానియాపై సల్మాన్ అనే ఆమె ప్రియుడు తనను పట్టించుకోవటంలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సానియాను ఉరి వేసిన అనంతరం  కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాగా నిందితుడు సల్మాన్ పీఎస్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

10:46 - October 24, 2018

విశాఖపట్నం : బుధవారం భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే భారీ స్కోరును చేజ్ చేసిన టీమిండియా....రెండో వన్డేలోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు విశాఖలో ఇప్పటి వరకు 8 వన్డే మ్యాచ్‌లు జరిగితే...ఇందులో ఒకే ఒక్క దాంట్లో మాత్రమే ఓడిపోయింది. టీమిండియాకు లక్కీ గ్రౌండ్‌గా పేరున్న విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో....అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ జట్టు అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.
ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే... ఊహించని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో విశాఖ సాగర తీరంలో క్రికెట్ సందడి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన విశాఖ మైదానంలోనూ విజయం సాధించి...సిరీస్‌లో ముందంజ వేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో విండీస్ జట్టు 322 పరుగులు చేసినప్పటికీ...టీమిండియా బ్యాట్స్‌మెన్లు సునాయాసంగా టార్గెట్‌ను చేజ్ చేశారు. తొలి వన్డేలో సెంచరీలతో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు...ఈ మ్యాచ్‌లోనూ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియా 8 వన్డేలాడితే...ఇందులో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. అదే విధంగా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు ఈ మైదానంలో మంచి రికార్డులున్నాయి. 2005లో ఇక్కడే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని.. 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమ్రోగేలా చేశాడు. ఇప్పుడు ఇక్కడే వన్డే జరగనుండటంతో అందరి కళ్లు ధోనిపైనే ఉన్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరో రికార్డును సృష్టించనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకోనుంది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే...మరో 411మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. విశాఖ పిచ్‌ ఎప్పట్లాగే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని. నగరంలో నిన్నటి నుంచి మంచు పడటంతో టాస్‌ కూడా కీలకం కానుంది. వర్షం కురిసినా మ్యాచ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా రెండు సూపర్‌ సాఫర్‌ యంత్రాలను మైదాన సిబ్బంది సిద్ధం చేశారు.
వన్డే మ్యాచ్‌కు 2వేల మంది పోలీసులతో అధికారులు  పటిష్ట భద్రత ఎర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మ్యాచ్ ముగింపు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటంతో... స్టేడియం చుట్టు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. టిక్కెట్ పాస్‌పై ఉన్న గేట్లలో మాత్రమే అభిమానులు వెళ్లాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా మూడు ప్లేసుల్లో పార్కింగ్ ఎర్పాటు చేశారు.

10:45 - October 24, 2018

వికారాబాద్: వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యుడిని దైవంతో సమానంగా చూస్తారు. కానీ కొందరు డాక్టర్ల కారణంగా పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. బాధ్యత లేకుండా ప్రవరిస్తున్నారు. విధులకు ఫుల్లుగా మందుకొట్టి వస్తున్నారు. పరిగి ప్రభుత్వాస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ ప్రవీణ్ కుమార్ మద్యం సేవించి డ్యూటీకి వస్తున్నారు. విధులు పక్కన పెట్టి మద్యం మత్తులో తూలుతున్నారు. చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు నరకం చూపిస్తున్నారు. చికిత్స చేయమని కోరితే వారిపై తిరగబడుతున్నారు. మీకు చికిత్స ఎందుకు చేయాలి? దిక్కున చోట చెప్పుకోండి.. సీఎంకి చెప్పుకున్నా నేను భయపడను అంటూ మద్యం మత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ తీరుతో ఇటు పేషెంట్లు, అటు ఆస్పత్రి సిబ్బంది విసిగిపోయారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

10:37 - October 24, 2018

ఢిల్లీ : ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ జట్టు రెండోసారి ఓటమి పాలయింది. యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో 40-21 తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి యు ముంబా జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముంబా సాధించిన 40 పాయింట్లలో సిద్ధార్థ దేశాయ్ ఒక్కడే 17 పాయింట్లు సాధించాడు. క్రమం తప్పకుండా యు ముంబా పాయింట్లు సాధించడంతో...తెలుగు టైటాన్స్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ...కెప్టెన్ రాహుల్ చౌదరి సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలోనే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగా డిగా స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి రికార్డు సృష్టించాడు.  మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌, తలైవాస్‌  హోరాహోరీగా పోరాడాయి. మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరికి తమిళ్ తలైవాస్ జట్టు 36-31 స్కోరు తేడాతో పుణెరి పల్టాన్ పై విజయం సాధించింది.

10:33 - October 24, 2018

ఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. సింగిల్స్‌ తొలిరౌండ్లో మూడోసీడ్‌ సింధు 21-17, 21-8 తో అమెరికా స్టార్‌ బీవెన్‌ జాంగ్‌ను చిత్తుచేసింది. ఈ విజయంతో సింధు.. గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో జాంగ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌ ఆరంభంలో జాంగ్‌ పైచేయి సాధించినప్పటికీ...సింధు క్రమంగా పుంజుకుంది. 7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆమె.. తర్వాత దాన్ని 10-6కు పెంచుకుంది. ఐతే జాంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. 16 పాయింట్ల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత సింధు పైచేయి సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో రెండో గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి...మ్యాచ్‌లో విజయం సాధించింది. 

 

10:26 - October 24, 2018

గుంటూరు : భూగర్భాలను దొలిచేస్తు..దోచేస్తు మైనింగ్ మాఫియా చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకోకపోవటంపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆరావళి పర్వతాలను దొలిచేస్తు దోచేసుకుంటున్న మైనింగ్ మాఫియాపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో అక్రమ సున్నపురాయి తవ్వకాలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అక్రమార్కులకు అండగా నిలిచిన ప్రభుత్వాధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం హైకోర్టు అభిప్రాయపడింది. 

ప్రభుత్వం ఆదాయం కోల్పోవడానికి కారణమైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సీబీఐలను ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. ఈ కేసును సీఐడీకి అప్పగించామని తెలిపారు. పూర్తిగా తుది  వివరాలను సమర్పించేందుకు  మరో 3 వారాల గడువు కావాలన్నారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. గత మూడున్నరేళ్లుగా గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, నడికుడి, కేశనుపల్లి, కోనంకి, కొండమోడు తదితర ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వి రవాణా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు రూ.320 కోట్ల విలువైన సున్నపురాయిని కొందరు అక్రమంగా తవ్వి అమ్ముకున్నట్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
 

10:26 - October 24, 2018

ఢిల్లీ : తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో...కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం తమిళ టీజర్‌ రికార్డు సృష్టించడంతో... తాజాగా తెలుగు టీజర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. అతనొక కార్పొరేట్‌ మాన్‌స్టర్‌‌.... ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వారిని అంతం చేసి వెళ్తాడు.... అతను ఇప్పుడు ఇండియాకు వచ్చాడు... అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఒక్కరోజులో ఏం మారుతుందో, మారబోతోందో ఓ మూల నిల్చుని వేడుక చూడండంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌ థియేటర్‌లో కాసులు కురిపించనుంది. 

 

09:50 - October 24, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు... రిజర్వేషన్ల అంశం తేలిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

* పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఆదేశం
* మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు
* ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 90(స్పెషల్ ఆఫీసర్లు) కొట్టివేత
* కోర్టు తీర్పుపై జనసేన హర్షం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని, వారికి పాలనపై పట్టు లేదంటూ మాజీ సర్పంచ్‌లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నాళ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తారని మాజీ సర్పంచ్‌లు ప్రశ్నించారు. మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం...రాష్ట్రాంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 90ని కోర్టు కొట్టివేసింది.

* ఏపీలో దాదాపు 12వేల 880 గ్రామ పంచాయితీలు
* లక్షా 30వేల 870 వార్డులు 
* సర్పంచ్‌ల పదవీ ముగియంతో ప్రత్యేక అధికారుల పాలన
* కోర్టు తీర్పుపై మాజీ సర్పంచ్‌లు హర్షం

ఏపీలో దాదాపు 12వేల 880 గ్రామ పంచాయితీలు... లక్షా 30వేల 870 వార్డులు ఉన్నాయి. ఆగస్టులోనే సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో...ఏపీ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీవో జారీ చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే కోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో...ఓటర్ల జాబితాను సిద్దం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ప్రకటించడంపై  పిటిషనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు....రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. రిజర్వేషన్ల అంశంపై తేలగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామన్న జనసేన... మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. 

09:36 - October 24, 2018

ఉత్తరప్రదేశ్ : జనసేన అధినేత ఏం చేసినా సంచలనమే. ఆయన క్రేజ్ అటువంటిది. ఎవ్వరూ ఊహించని పనులు..రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని భేటీలు పవన్ కళ్యాణ్ స్పెషల్. ఏపీలో అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న పవన్ హఠాత్తుగా యూపీ రాజధాని లక్నోకు బయలుదేరారు. ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, మీడియాకు సమాచారం లేకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్, లక్నోకు బయలుదేరి వెళ్లారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలిసి, ఆమెతో చర్చలు జరిపేందుకే పవన్ వెళ్లినట్టు తెలుస్తోంది. మాయావతితో పాటు ఆయన మరికొందరు నేతలనూ పవన్  కలుస్తారని సమాచారం. వీరిమధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు సమాచారం. మాయావతితో పాటు అఖిలేష్ యాదవ్ నూ పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 

09:08 - October 24, 2018

ఢిల్లీ: నూతన సీబీఐ డైరెక్టర్‌గా గత రాత్రి నియమితులైన తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు అప్పుడే పని మొదలు పెట్టేశారు. విధుల్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన రంగంలోకి దిగిపోయారు. నియామకపు ఉత్తర్వులను తెల్లవారుజామున అందుకున్న ఆయన, ఈ ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లి తన సిబ్బందితో తనిఖీలు ప్రారంభించారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాల ఛాంబర్లతో పాటు, వారి ప్రత్యేక సిబ్బంది గదుల్లో గంటన్నరగా తనిఖీలు జరుగుతున్నాయి. వారు వాడిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను, ఇతర దస్త్రాలను నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్థానా, వర్మలతో పాటు దేవేందర్ చాంబర్లలోనూ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం. కార్యాలయంలోని 10, 11వ ఫ్లోర్‌లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాల మధ్య చోటు చేసుకున్న వర్గపోరు కారణంగా.. సీబీఐలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన నియామకాల కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. అలోక్ వర్మపై వేటు వేయాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు రాత్రికి రాత్రే సీబీఐ డైరెక్టర్‌ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలోక్ వర్మ, ఆస్థానాలను సెలవుపై పంపిన కేంద్రం.. తెలుగు అధికారి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమించింది. మన్నెం నాగేశ్వరరావు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

* అప్పుడే పని ప్రారంభించిన నూతన సీబీఐ డైరెక్టర్
* సీబీఐ కేంద్ర కార్యాలయంలో సోదాలు
* 10, 11వ ఫ్లోర్‌లో సోదాలు
* మన్నెం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు
* ఆస్థానా, దేవేందర్, మరికొందరు అధికారుల ఛాంబర్లలో సోదాలు
* హార్డ్ డిస్క్‌లు, ఫైళ్లు స్వాధీనం
* అలోక్ వర్మ, ఆస్తానా ఛాంబర్లు సీజ్

09:08 - October 24, 2018

రాజస్థాన్ :  ఒకవైపు ఆహ్లాదం పంచే పర్వత పంక్తులు.. మరోవైపు పచ్చటి పంట పొలాలతో  కళకళలాడే నదీ తీర మైదానాలు.. ప్రపంచమంతా వైవిధ్యభరితమైన భూస్వరూపాల  సమ్మేళనం. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఉద్భవించిన తీరు ఆశ్చర్యగొలుపుతు..ప్రకృతి మాత ఒడిలో వున్నామా అనిపించే అందమైన పర్వతాలు ఆరావళీ పర్వత శ్రేణులు. ఇవి  పశ్చిమభారతంలో గల ప్రాచీన పర్వత ఫంక్తులు. వీటి పొడవు 300 మైళ్ళు వాయువ్యం నుండి బయలుదేరి నైఋతి దిశగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఈ ఆరావళి పర్యతాలలో 31 కొండలు మాయమైపోయట!!!.

Related imageభూములను చోరీలు చేసే బడా వ్యాపారస్థులతో ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ దారుల దోపిడీకి ఆరావళి పర్వతాలలోని 31 పర్వతాలు మాయం అయిపోవటంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం షాక్ అయ్యింది. రాజస్థాన్‌ ప్రభుత్వం తమకు సమర్పించిన నివేదిక, కేంద్రీయ సాధికారత సంస్థ (సీఈసీ) అందించిన వివరాలను పరిశీలించిన మీదట 48 గంటల్లో అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు కొండలు మాయమవడంపై సీరియస్ అయింది.
గనుల తవ్వకాల వల్ల రాజస్థాన్‌కి రూ.5000 కోట్ల రాయల్టీ వస్తున్న మాట వాస్తవమేనని.. కానీ దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి ఆ కొండలు మాయమవడమే కారణమని తెలిపింది. కొండలు ఇలాగే మాయమైతే దేశ పరిస్థితి ఏంటని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని జస్టిస్‌ లోకుర్‌ ప్రశ్నించారు. ఆరావళి పరిధిలో అక్రమ మైనింగ్‌ను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.

08:29 - October 24, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని ఓడించటమే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో ఏర్పడిన మహా కూటమి సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ అధిష్టాలు రంగంలోకి దిగటంతో సీట్ల పంపకాలు ఓ సర్ధుబాటు జరిగింది. అన్ని పార్టీలూ పట్టువిడుపులను ప్రదర్శించడం గమనించాల్సిన విషయం.  ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి, నెగ్గాలంటే తగ్గాలన్న సూత్రాన్ని పాటించడంతో సమస్య సద్దుమణిగింది.

  • తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు..
  • కాంగ్రెస్ : 90
  • టీడీపీ : 15
  • టీ.జేఎస్: 10
  • సీపీఐ :  4 ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, అందుకు మిగతా పార్టీలు కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది.

సీట్ల సంఖ్యపై నేడో, రేపో, అధికారిక ప్రకటనను వెలువరించనున్న మహాకూటమి నేతలు, ఆపై తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సంకేతాలను వెలువరుస్తూ అభ్యర్థుల పేర్లను ఉమ్మడిగా ప్రకటిస్తారని సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న లోక్ సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మహాకూటమి నేతలు అంటున్నారు. వివిధ సర్వేల ఆధారంగా, ప్రతి సీటు నుంచి బలమైన అభ్యర్థినే ఎంపిక చేయాలని అన్ని పార్టీలూ ఓ నిర్ణయానికి వచ్చాయి. మహాకూటమి తొలి జాబితాలో 60 మంది పేర్లు వెల్లడికావచ్చని సమాచారం. కాంగ్రెస్ తరఫున 40 నుంచి 50 మంది పేర్లు, టీడీపీ నుంచి 8, టీజేఎస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తూ, మొత్తం జాబితాలో 35 బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉండేలా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ భావిస్తోంది.
 

07:57 - October 24, 2018

ఢిల్లీ : అవినీతిని ప్రక్షాళన చేసే సంస్థే అవినీతి ఊబిలో కూరుకుపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అంతర్మధనంలో పడింది. ఈ నేపథ్యంలో ఆరోపణల్లో కూరుకుపోయిన సీబీఐని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏ మాత్రం ముందస్తు ఊహాగానాలు లేకుండా డైరెక్టర్ ను రాత్రికి రాత్రే మార్చారు. సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఎం నాగేశ్వరరావును నియమిస్తున్నట్టు గత అర్థరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయరామారావు తరువాత సీబీఐ డైరెక్టర్ గా నియమించబడిన మరో తెలుగు వ్యక్తి నాగేశ్వరరావే కావడం గమనార్హం. 

Image result for modiప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తున్నట్టు నియామకాల విభాగం ప్రకటించింది. 1986 బ్యాచ్ కి చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన ఒడిశా డీజీపీగానూ పనిచేశారు. డీవోపీటో ఉత్తర్వులతో ఆయన తక్షణమే బాధ్యతలను చేపట్టారు. మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌‌.

కాగా సీబీఐ  డైరెక్టర్లు- అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాల అంచాల బాగోతంపై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. 

Image result for cbi asthanaసీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానాను ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్  22 న సీబీఐ లో ప్రత్యక డైరెక్టర్‌గా  గతంలో  గోద్రాలో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనకాండ కేసు దర్యాప్తు చేశారు. సీబీఐలో ఆయన్ను నియమించినప్పుడు లోకాయుక్త చట్టాలు ఉల్లంఘించి  ఆయన్ను నియమించారని పిల్  దాఖలైంది. ఈ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. మరో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు, ఆస్థానాతో విబేధాలున్నాయి.ఆస్థానాకు సీబీఐ డైరక్టర్ గా పదోన్నతి రావడంతో విబేధాలు మరింత పెరిగాయి. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ అనే కంపెనీ డైరీలో ఒక చోట రూ.3.8 కోట్లను ఆస్థానాకు చెల్లించినట్లు ఉండడాన్ని కారణంగా చూపించి, ఆయన పదోన్నతిని అడ్డుకునేందుకు  అలోక్‌వర్మ ప్రయత్నించడంతో ఇద్దరు అత్యున్నతాధికారుల మధ్య వైరం మరింత పెరిగింది. అప్పటి నుంచి పలు కేసుల విచారణలో, అంతర్గత బదిలీల్లో వీరిద్దరి మధ్య ఆరోపణలు, చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి అలోక్ వర్మ స్థానంలో రాత్రికి రాత్రే తెలుగు వ్యక్తి అయిన ఒడిశా క్యాడర్ కు చెందిన ఎం. నాగేశ్వరరావును సీబీఐ కొత్త డైరెక్టర్ గా నియమించటం గమనించాల్సిన విషయం.

07:11 - October 24, 2018

ఉత్తరప్రదేశ్ : ఓ సీఎం కాళ్లపై మరో సీఎం కాళ్లమీద పడి నమస్కరించిన ఘటన చోటుచేసుకుంది. పాదాభివందనం చేస్తేనే రాజకీయాల్లో ఎదగగలం అనే ఉద్ధేశంతోనే ఏమో మరి ఓ సీఎం తనకంటే దాదాపు 20 సంవత్సరాల వయసు వున్న మరో సీఎం కాళ్లమీద పడి ఆశీస్సులు తీసుకున్న ఘటనతో రాజకీయాల్లో ఎదుగుదల కోసం నేతలు ఎంతటి స్థాయికన్నా దిగజారతారనే విషయం మరోసారి తేటతెల్లమయ్యింది. మరి కాళ్ల మీద పడిన సీఎం ఎవరు? ఏ సీఎం కాళ్లమీద పడ్డారో తెలుసుకుందాం..

Image result for yogi adityanath and raman singhఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి  చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ నమస్కరించారు. చత్తీస్ గఢ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజ్ నంద్ గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన వేళ సీఎం రమణ్ సింగ్ యోగి కాళ్ళకు నమస్కరించారు. తనకన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్నవాడైన ఆదిత్యనాథ్ కు రమణ్ సింగ్ పాదాభివందనం చేయడం గమనార్హం. 

Don't Miss