Activities calendar

25 October 2018

22:55 - October 25, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు విచారించారు. జగన్‌కు సానుభూతి రావాలనే ఆయన దాడి చేశానని శ్రీనివాస్‌ పోలీసుల విచారణలో తెలిపారు. ’జగన్ సీఎం కావాలనే నా కోరిక’ అని చెప్పారు. పోయిన సారే జగన్ సీఎం కావాల్సింది...కానీ అప్పుడు కాలేదన్నారు. నిందితుడు శ్రీనివాస్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. విచారణ అనంతరం విశాఖ డీసీపీ మహేంద్రపాత్రుడు మీడియాతో మాట్లాడారు.

వైఎస్ అంటే తన కుటుంబానికి అభిమానమని విచారణలో శ్రీనివాస్ చెప్పారని డీసీపీ తెలిపారు. తను రాసుకున్న11 పేజీల లేటర్ దొరికిందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏమి చేయాలో నిందితుడు శ్రీనివాసు లేఖలో రాసుకున్నాడని తెలిపారు. 

ప్రాథమిక విచారణ తర్వాత జగన్ హైదరాబాద్ వెళ్లారని డీసీపీ తెలిపారు. కత్తితో ఎయిర్‌పోర్టులోకి ఎలా వెళ్లారో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ’పుకార్లను నమ్మొద్దు...పుకార్లను ప్రచారం చేయొద్దు’ అని డీసీపీ తెలిపారు.  

 

22:18 - October 25, 2018

హైదరాబాద్‌ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని పలువురు రాజకీయ నేతలు ఖండించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేశారు.  

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ దాడిపై స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తక్షణమే దర్యాప్తు జరగాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదు. జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు. 

 

21:58 - October 25, 2018

సూర్యపేట : తనకు హుజూర్ నగర్ టికెట్ ఇవ్వాలని.. ఇవ్వకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శంకరమ్మ అన్నారు. ’ఇస్తే హుజూర్ నగర్ టికెట్.. పోతే నా ప్రాణం’ అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి అడ్డుపడకుండా తనకు టికెట్ రావడానికి సహకరించాలని కోరారు. 

బీసీ మహిళగా పుట్టడం తప్పు అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీసీ కుటుంబం నుంచి శ్రీకాంతాచారి త్యాగం చేయడం పాపంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేరు కోసం తన కొడుకు త్యాగం చేయలేదని...తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. కేసీఆర్ చనిపోకూడదు..బతకాలని తన కుమారుడు ఆనాడు త్యాగం చేశారని పేర్కొన్నారు. 

21:20 - October 25, 2018

హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల గురించి అడిగితే కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని నాయక్ ఆరోపించారు. రిజర్వేషన్లు అడిగిన గిరిజనులను అవమాన పరిచిన భూపాల్ రెడ్డిపై వేటు వేయాలని సీఈవోకు వినతిప్రతం సమర్పించామని ఆయన తెలిపారు. ఈ విషయంపై సీఈవో సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

 

20:50 - October 25, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమిలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు సీట్ల కోసం కుస్తీ పట్టిన నేతలంతా ఇప్పుడు చివరి అంకంలో త్యాగాలకు సిద్ధపడుతున్నారు. కూటమిలోని కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోసం మూడు పార్టీల అధ్యక్షులూ సీట్ల తాగ్యం చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోసం ఎల్.రమణ జగిత్యాల టికెట్‌ను త్యాగం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 

ఇక సీట్ల విషయంలో కాంగ్రెస్‌తో పోరాడుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం మహాకూటమి గెలిస్తే డిప్యూటీ సీఎం స్థాయి పదవి కోదండరాంకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.  

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హుస్నాబాద్ టికెట్ కోసం పట్టుబట్టారు. హుస్నాబాద్ టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చాడా స్పష్టం చేశారు. మరో చోట పోటీకి చాడా, ప్రవీణ్ రెడ్డి ససేమిరా అంటున్నారు. అయితే ఆ సీటును వదులకోవడానికి కాంగ్రెస్ కూడా సిద్ధంగా లేదు. 

 

19:49 - October 25, 2018

గుంటూరు : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన అమరావతిలో పలువురు మంత్రులతో సమావేశం అయ్యారు. జగన్‌పై దాడి, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధంలేని విషయమని స్పష్టం చేశారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని అన్నారు. 

పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేందుకు జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూర్చుని జగన్ విశ్రాంతి తీసుకుంటుండగా.. వెయిటర్ శ్రీనివాస్ జగన్‌పై కోళ్లపందాలకు వాడే కత్తితో దాడికి పాల్పడ్డాడు. 

 

19:07 - October 25, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో వ్యక్తి కలకలం సృష్టించాడు. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి అనంతరం ఆయన హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు జగన్ అభిమానులు భారీగా తరలొచ్చారు. అయితే ఆ గుంపులో గుర్తు తెలియన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఎస్ వోటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి సంబంధించిన పూర్తి అధారాలు సేకరించిన తర్వాత ఎయిర్ పోర్టులో పని చేసే వ్యక్తి అని తేలడంతో అతన్ని పోలీసులు వదలివేశారు. 

 

18:47 - October 25, 2018

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి అమానుషమైన చర్యగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకుడిపై హింసకు పాల్పడడం అనేది అరుదుగా జరిగే సంఘటన.. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తీవ్రస్థాయిలో ఖండించాలన్నారు. ఏదైనా సరే...హింస వెనుక ఒక కారణం ఉంటుందన్నారు. కక్ష ఉంటే తప్ప ఎవరిపైనా కత్తితో దాడి చేయరని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తికి, జగన్ కు మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయని ఎవరూ భావించడం లేదన్నారు. ఒక కారణం లేకుండా హింస చేశారంటే తాను నమ్మనని చెప్పారు. దాడి వెనుక ఏ శక్తులు ఉన్నాయో తెలియాలన్నారు. ఇది ఒక హింసాత్మక చర్య అన్నారు. 

ప్రభుత్వం కూడా దాడిని ఖండించి, న్యాయపరమైన చర్యలు తీసుకొని..ఘటనపై ఎంక్వైరీ వేసి ఉంటే కొంత వరకు అనుమానాలకు తావిచ్చేది కాదన్నారు. కానీ ప్రభుత్వంలో ఉండి టీడీపీ నేతలు దాడిపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు హిట్లర్ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. 

ప్రతిపక్షాలపై, ఇతర రాజకీయ పార్టీలపై టీడీపీ నేతలు ప్రతి రోజు వ్యక్తిగతంగా దాడులు చేస్తూ అనేకమంది నాయకులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్థైర్యం, ధైర్యం కోల్పోయిన పార్టీ అని ఎద్దేవా చేశారు. దాడిని టీడీపీ చేయించిందనడానికి తన వద్ద ఆధారాలు లేవన్నారు. కానీ చర్యను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడే భాష, చర్యలు మాఫియా లాగా ఉన్నాయన్నారు. 

 

18:42 - October 25, 2018

హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు సుశి గణేషన్‌పై లైంగిక ఆరోపణలు చెయ్యడం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ వేడి చల్లారక ముందే బాలీవుడ్ భామలు తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ మరోసారి మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే ఈ సారి రాఖీ, తనుశ్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దెబ్బకి బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇంతకీ రాఖీ, తనుని ఏమందయ్యా అంటే.. తనుశ్రీ దత్తా ఒక లెస్బియన్, తను ఆడవాళ్ళతో చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తది, నాతోనూ చాలాసార్లు టూ‌మచ్‌గా ప్రవర్తించింది.. 12 ఏళ్ళ క్రితం నేనూ, దత్తా మంచి ఫ్రెండ్స్.. ఆమె అప్పట్లోనే డ్రగ్స్ తీసుకునేది. ఆమెకి ఆడవాళ్ళంటే మోజు, నా పర్మిషన్ లేకుండా ఎన్నోసార్లు నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసింది, బలవంతంగా ముద్దులు పెట్టేది, అక్కడితో ఆగకుండా పలుసార్లు నాపై అత్యాచారం చేసింది.. అంటూ, తనుశ్రీ దత్తాపై సంచలన ఆరోపణలు చేసింది రాఖీ సావంత్.. రాఖీ చేసిన ఆరోపణల గురించి తనుశ్రీ ఏమని స్పందిస్తుందో చూడాలి.. 

18:39 - October 25, 2018

బిచ్చగాడు సినిమా విజయం తర్వాత తమిళ్ నటుడు విజయ్ అంటోనీ నటించిన అన్ని చిత్రాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా రోషగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నివేదిత థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. పోలీసులు సామాన్యులు కాదు పుడింగులే అంటూ  విజయ్ ఆంటోనీ టీజర్‌లో కనిపించాడు. గత సినిమాలతో పోల్చితే డైలాగ్ డెలివరీలో  రోషగాడులో ప్రత్యేకత కనిపిస్తోంది. ఇదుగో టీజర్ మీకోసం..
 

17:37 - October 25, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ దసరా కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. దసరా సినిమాలతో పాటు, తారక్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.
ఇప్పటికే ఓవర్సీస్‌లో 2 మిలియన్ మార్క్ దాటేసింది.. మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగానే రన్ అవుతోంది. కొన్నిఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా అరవింద సమేత సాధించిన పదకొండు రోజుల కలెక్షన్స్ వివరాలు తెలిసాయి.. నైజాం: 20.23 కోట్లు, సీడెడ్: 15.79 కోట్లు, నెల్లూరు:‌ 2.48 కోట్లు,  కృష్ణ: 4.73 కోట్లు, గుంటూరు: 7.68 కోట్లు, తూర్పుగోదావరి: 5.32 కోట్లు, పశ్చిమగోదావరి: 4.55 కోట్లు, ఉత్తరాంధ్ర: 8.12 కోట్లు... టోటల్, ఏపీ+తెలంగాణ 11 రోజుల షేర్ 68.87 కోట్లు... కర్ణాటక 9.03 కోట్లు, ఓవర్సీస్ 8.52 కోట్లు, మిగతా ఏరియాలు 4.70 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ 91.22 కోట్లు.. ఇవి, ఆంధ్ర, తెలంగాణతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా   అరవింద సమేత పదకొండు  రోజుల షేర్ వివరాలు... 

 

17:36 - October 25, 2018

ట్రిస్సూర్ (కేరళ): సంగీతానికి రాళ్లు కరగటం మాటేమో కానీ.. వినసొంపైన సంగీతానికి నిద్ర మాత్రం తప్పకుండా వస్తుంది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం ఇదే వర్తిస్తుందని నిరూపించాడు కేరళకు చెందిన ఏనుగును సాకే ఓ మావటి. 
40 ఏళ్ల వయస్తున్న ఏనుగును పాట పాడి నిద్రపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చైనాకు చెందిన ఒక వెబ్‌సైట్ ఈ వీడియోను పోస్టు చేస్తే ప్రపంచం యావత్తు దీన్ని వీక్షిస్తోంది. 
ఈ వీడియో ట్రిస్సూర్ జిల్లాలోని పెరుమ్‌పులిసెరీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. మావటివానిగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న కే సీ శ్రీకుమార్ 1984లో విడుదల అయిన ‘‘మంగళం నెరున్ను’’ అనే మళయాళ సినిమాలోని పాటను పాడి ఏనుగును నిద్రపుచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఏనుగు తొండాన్ని నిమురుతూ పాడిన పాటకు ఏనుగు ఎంచక్కా నిద్రలోకి జారుకుంది. ఈ వీడియో 1.2 లక్షల మంది వీక్షించడం విశేషం.

17:34 - October 25, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై దాడి సంచలనం సృష్టించింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. చికిత్స కోసం జగన్ ను హైదరాబాద్ తరలించారు. నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే జగన్ కు ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. అన్ని పరీక్షలు నిర్వహించాలన్నారు. మరికొద్ది సేపట్లో లోటస్ పాండ్ లోని తన నివాసానికి జగన్ చేరుకోనున్నారు. 

విశాఖ ఎయిర్‌పోర్టులోని వెయిటర్స్ లాంజ్‌లో జగన్ ఉండగా.. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. వెంటనే ఆయనకు చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ రావుగా గుర్తించారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జగన్ పై దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. 

 

17:11 - October 25, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేశాడు. వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్.. దాడి ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక తనకు అందించాలని డీజీపీని ఆదేశించారు. ప్రముఖ వ్యక్తులకు భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దాడులను ప్రోత్సహించేది లేదని చెప్పారు. 

 

16:53 - October 25, 2018

రంగస్దలం రంగమ్మత్త అనసూయ ప్రస్తుతం, అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఫుల్ బిజీగా ఉంది. సాధారణంగా కొంతమంది ఆడవాళ్ళని, వాళ్ళకంటే తక్కువ వయసున్నవాళ్ళు ఆంటీ అని పిలిస్తే, వాళ్ళకి ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ, అనసూయకి మాత్రం తనని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే అస్సలు కోపం అనేదే రాదట. రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో అనసూయని ఒకతను ఆంటీ అని పిలిచాడు. అయితే అను ఏం ఇబ్బంది పడలేదు.. పైగా తన పిల్లల స్నేహితులు తనని ఆంటీ అనే పిలుస్తారని, అందులో పెద్దగా ఫీల్ అవడానికేం లేదని, ఆంటీగా ఉండడానికి తానేమీ ఇబ్బంది పడనని చెప్పుకొచ్చింది.. అంతేకాక, వయసు పెరగడాన్ని, దాంతో వచ్చే మార్పులను గౌరవంగా స్వీకరిస్తానని, యాభైఏళ్ళు వచ్చినా ఇలాగే కనిపించాలని కోరుకుంటానని అంది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి.. కథనం రిలీజ్‌కి రెడీ అవుతోంది..

 

16:28 - October 25, 2018

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. కాగా జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్.. టీడీపీకి చెందిన వాడని వైసీపీ నాయకులు.. కాదు.. జగన్ అభిమాని అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్ అన్న సుబ్బరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్‌కు అభిమాని. ఎలాంటి గొడవలు పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అని చెప్పాడు.

మరోవైపు శ్రీనివాస్ జగన్ అభిమాని అని చెప్పే విధంగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తిరుగుతున్నాయి. న్యూ ఇయర్, పొంగల్ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో శ్రీనివాస్ రూపొందించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్ ఫొటో పక్కన తన ఫొటో ఉంచి విషెస్ చెబుతూ ఈ పోస్టర్ తయారు చేయించాడు శ్రీనివాస్.

16:09 - October 25, 2018

చెన్నై : మీ టూ..రాజకీయాలు..సినీ రంగం...ఇలా ప్రతి రంగంలోకి అడుగు పెడుతోంది. ఆయా రంగాలకు చెందని ప్రముఖులపై ఆరోపణలు గుప్పిస్తుండడంతో తీవ్ర సంచలనం రేకేత్తిస్తున్నాయి. బాలీవుడ్‌లో మొదలైన మీ టూ ఇతర వుడ్‌లకు పాకింది. కానీ దీనిని ఆరోపణలు వచ్చిన వారు ఖండిస్తున్నారు. తమిళ, తెలుగు రంగాల్లో మంచి పేరు పొందిన యాక్షన్ కింగ్ ‘అర్జున్’పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కన్నడ నటి శ‌ృతీ హరిహరన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేయడంతో ఆయన అభిమానులు..ఇతర నటీ నటులు షాక్ తిన్నారు. 
తమిళ్, కన్నడ ద్విభాషా చిత్రం 'నిబుణన్‌' (కన్నడలో 'విస్మయ') సెట్స్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని...ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారని శ‌ృతీ హరిహరన్‌ తెలిపింది.
ఈ ఆరోపణలపై పలువురు స్పందించారు. అర్జున్ తమకు ఎప్పటి నుండో తెలుసని..చాలా మంచివాడని సినీ ప్రముఖులు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి శ‌ృతీ హరిహరన్‌ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన దగ్గర ఆధారాలున్నాయని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనపై పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని 

16:08 - October 25, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన ముద్దాయి దొరికాడని...పోలీసుల కస్టడీలో అతడు అన్ని విషయాలు చెబుతాడన్నారు. దాడి రాజకీయ శతృత్వంతో చేశారా? వ్యక్తిగత గొడవలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? అనే అంశాలు విచారణలో వెల్లడవుతాయని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు వారి నాయకుడు జగన్ ను కాపాడుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

అయితే ఈ సంఘటనను తీసుకుకొని వైసీపీ ఆందోళనలు చేస్తే వారు అభాసుపాలవుతారని చెప్పారు. నిరసనలు తెలియజేవచ్చు కానీ...ఆందోళనలు చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కల్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

 

16:05 - October 25, 2018

హైదరాబాద్: తనపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. నేను క్షేమంగా ఉన్నానని జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజల ప్రేమ, ఆశీర్వాదం తనను కాపాడాయని చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు నేను భయపడను అన్న జగన్.. ప్రజల కోసం మరింతగా కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు. పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని.. తన ప్రజా సంక్షేమ పోరాటాలను ఆపలేవని జగన్ పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని జగన్ కోరారు. 

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కత్తిపోటుకు గురైన జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య నేరుగా నగరంలోని సిటీ న్యూరో సెంటర్‌కు బయల్దేరారు. భార్య భారతి జగన్ వెంట ఉన్నారు. 

సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో జగన్ భుజానికి చికిత్స జరుగుతోంది. జగన్ భుజానికి తగిలిన గాయానికి మూడు కుట్లు వేసినట్టు తెలుస్తోంది. జగన్‌కు గాయమైన ప్రదేశంలో రక్తనమూనాలను పరిశీలించాల్సి ఉందని, కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న విషయం పరీక్షల తర్వాత తేలే అవకాశం ఉందని సమాచారం.

15:50 - October 25, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ చిత్ర ట్రైలర్ షేక్ చేస్తోంది. ఆయన జన్మదిన సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవలే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరిట ట్రైలర్‌ని విడుదల చేసింది. హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ట్రైలర్ ఉండడం పట్ల అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ మరో చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ నిర్మితమౌతోంది. 
ఇటీవలే ఇటలీలో షూటింగ్ ప్రారంభమైంది కూడ. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఆస్కార్ విజేత, లెజండరీ సంగీత దర్శకులు రెహమాన్‌తో ప్రభాస్ కలిసి ఉన్న ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనితో ప్రభాస్ చిత్రం కోసం రెహమాన్ సంగీతం అందిస్తున్నారా ? అనే టాక్ మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ రెహమాన్ సంగీతం అందిస్తే మాత్రం ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణగా నిలవనుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే గాని అసలు విషయం తెలియదు. 

15:40 - October 25, 2018

న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరంను ముద్దాయి నెంబర్ 1 గా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం చార్జిషీటు దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో చిదంబరంను ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ ఈడీ ఈ కేసును దాఖలు చేసింది. తమిళనాడుకు చెందిన పి. చిదంబరం ఆయన కొడుకు కార్తిక్ చిదంబరంపై ఈడీ విచారణ చేసింది. కార్తీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ కేసులో 9 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో చిదంబరం, ఎస్ భాస్కరన్‌తో పాటు నాలుగు మాక్సిస్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. చార్జిషీటుపై విచారణకు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయవాది ఓపీ సైనీ నవంబర్ 26 కు వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండవ చార్జిషీటు కాగా.. చట్టాలను ఉల్లంఘించి ఎఫ్ఐపీబీ ఆమోదించారని చిదంబరంపై ఆరోపణలును నమోదుచేశారు. 
మొదటి చార్జిషీటులో  కేంద్ర టెలీకామ్ మాజీ మంత్రి దయానిధి మారన్ ఆయన తమ్ముడు కళానిధి మారన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. 
మార్చి 2006లో చిదంబరం మారిషస్‌కు చెందిన మాక్సిస్ గ్రూప్ కంపెనీ గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్స్‌కు ఎఫ్ఐపీబీ అనుమతులను ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. 

 

15:40 - October 25, 2018

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందిన వ్యక్తి అన్నారు. పబ్లిసిటీ కోసమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని డీజీపీ వ్యాఖ్యానించారు. డీజీపీ మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లోనే జగన్ పై దాడి జరిగిందని తెలిపారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తి విమానాశ్రయం లోపలికి ఎలా వచ్చిందనే విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో భద్రత మొత్తం సీఐఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు తెలిసిందని.. పబ్లిసిటీ కోసమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని డీజీపీ అన్నారు. నిందితుడి వద్ద 10 పేజీల లేఖ ఉందని.. దాన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది రాష్ట్ర పోలీసులకు అందించారని పేర్కొన్నారు. ఆ లేఖపై విచారణ జరిపి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని డీజీపీ తెలిపారు.

15:36 - October 25, 2018
హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని ఏపీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగన్‌పై దాడి అమానుషం అన్నారు. 
 
ఆధునిక సమాజంలో ఇటువంటి పిరికిపంద చర్యలకు స్థానం లేదని చెబుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదని మంత్రి జవహర్ అన్నారు. అసలు ఎయిర్‌పోర్ట్ లోపలికి ఓ వ్యక్తి కత్తిని ఎలా తీసుకెళ్లగలిగాడని ప్రశ్నించారు. కేంద్ర బలగాల అధీనంలో ఉండే ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి ఎలా జరిగిందన్న విషయం పోలీసుల విచారణలో బయటపడుతుందని చెప్పారు.
 
ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్ష నేతపై దాడిని తీవ్రమైన చర్యగా ఆయన అభివర్ణించారు. మరోసారి ఇలాంటి చర్యలు జరక్కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి కుట్రదారులను శిక్షించాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
14:46 - October 25, 2018

త్రిష.. తెలుగు, తమిళ్‌లో దశాబ్దానికి పైగానే హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. రీసెంట్‌గా త్రిష నటించిన 96 అనే తమిళ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు త్రిష, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెటప్‌లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చూడ్డానికి డిజిటల్ పెయింటింగ్‌లా ఉన్న ఈ పోస్టర్‌ని, వికటన్ అనే తమిళ మ్యాగజైన్ వాళ్ళు పబ్లిష్ చేసారట. ఫోటోలో త్రిష, షార్ట్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అచ్చు ఇందిరలా బాగుంది. సదరు మ్యాగజైన్ వారు ఈ ఫోటోని ఎందుకు ప్రచురించారో తెలాయదు కానీ, త్రిష త్వరలో ఇందిరా గాంధీ బయోపిక్‌లో నటించబోతుంది అనే ప్రచారం కూడా మెదలైపోయింది. మరో వైపు తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్‌లోనూ త్రిష నటించనుంది అని కూడా తెలుస్తోంది. ఏదేమైనా త్రిష, మాజీ సీఎమ్, మాజీ పీఎమ్ బయోపిక్స్‌లో లీడ్ రోల్స్ చెయ్యనుంది అనే రూమర్స్ రావడం ఆమె అభిమానులకు కిక్ ఇస్తోంది..   

14:40 - October 25, 2018
విశాఖ: వైసీపీ అధినేత జగన్‌పై కత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేందుకు జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూర్చుని జగన్ విశ్రాంతి తీసుకుంటుండగా.. వెయిటర్ శ్రీనివాస్ జగన్‌పై కోళ్లపందాలకు వాడే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. కాగా శ్రీనివాస్ ఎవరు? అతడి నేపథ్యం ఏంటి? జగన్‌పై ఎందుకు దాడి చేశాడు? జగన్‌ను చంపాలని చూశాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
 
జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్.. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్ రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌ది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. శ్రీనివాస్ ఏడాదిన్నర కాలంగా అక్కడ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ రెస్టారెంట్ టీడీపీకి చెందిన హర్షవర్ధన్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. 
 
దాడి జరిగిన వెంటనే శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, విచారణ జరుగుతోందని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. 
 
Image result for attack on jagan
 
 
 
Image result for attack on jagan

14:34 - October 25, 2018

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఆయనపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని వెయిటర్స్ లాంజ్‌లో జగన్ ఉండగా.. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజంకి గాయమైంది. వెంటనే ఆయనకు చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. 
ప్రభుత్వ లోపం..నిఘా వైఫల్యం కారణంగానే దాడి జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. దాడి జరిగిన అనంతరం వైసీపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. దాడి చేసింది శ్రీనివాస్ రెడ్డి అని, పందెం కోళ్లకు ఉపయోగించిన కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. కత్తికి విషం కూడా ఉందని తెలుస్తోందని...అసలు కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం..సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. జగన్ హత్య చేసేందుకు పథకం రూపొందించారని, సీఎం చంద్రబాబు నాయుడికి హత్యా రాజకీయాలు చేసే పేరుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇంకా తీవ్ర విమర్శలు...ఆరోపణలు పెల్లుబికే అవకాశం ఉంది.

14:12 - October 25, 2018

విశాఖపట్టణం : పట్టణ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట వివిధ జిల్లాల్లో విసృతంగా పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంటోంది. దీనితో ఆయన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ వేసి కోర్టుకు హాజరవుతున్నారు. 
అందులో భాగంగా ఆయన గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. లాంజ్‌లో కూర్చోగా ఫ్యూజన్ ఫుడ్స్‌ క్యాంటీన్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనితో జగన్ భుజానికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


దాడి ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండించింది. నిఘా వైఫల్యమేనని ఆరోపిస్తున్నట్లు సమాచారం. కానీ ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగించే విశాఖ ఎయిర్ పోర్టులోకి కత్తితో ఓ యువకుడు ఎలా ప్రవేశించాడన్నది తెలియరావడం లేదు. నిఘా లోపించడంతో కత్తితో ప్రవేశించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

14:04 - October 25, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడిపై రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టులోకి వచ్చిన జగన్‌పై శ్రీనివాస్ అనే వెయిటర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనితో జగన్ భుజానికి గాయాలయ్యాయి. చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా చిన రాజప్ప మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తి ఎవరనేది విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులో వర్కర్ అని, కానీ అతని వద్ద కత్తి ఎలా వచ్చిందనేది తెలియలేదని తెలిపారు. ముమ్మిడివరం వద్ద ఓ విలేజ్ అని తెలుస్తోందని, ఇతరత్రా సమాచారం ఓ గంటలో తెలియచేస్తామన్నారు. ఘటనను ఖండించడం జరుగుతోందని, కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. 

14:00 - October 25, 2018

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఘటన చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. పక్కా పథకం ప్రకారమే జగన్‌పై కత్తితో దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. జగన్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్టులో ఒక వ్యక్తి కత్తితో ఎలా సంచరిస్తున్నాడు? అని రోజా ప్రశ్నించారు. జగన్‌కు ఏమైనా జరిగితే ఊరుకోము అని ఆమె హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతకే భద్రత లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని రోజా ప్రశ్నించారు. జగన్‌పై దాడి కక్షసాధింపే అన్న రోజా.. ఈ దాడి వెనుక ఎవరున్నారో దర్యాఫ్తు చేయించాలన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

గతంలో ఇదే వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్‌ను రన్‌వే పైనే పోలీసు అధికారులు నిర్బంధించారని రోజా గుర్తు చేశారు. లోకల్ పోలీసులు సివిల్ డ్రస్సులో వచ్చి అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా చాకుతో ఆయనపై ఓ దుండగుడు దాడికి యత్నించాడని.. రాజకీయంగా జగన్‌ను అంతమొందిచేందుకు యత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. 

విశాఖ ఎయిర్‌పోర్టులోని వెయిటర్స్ లాంజ్‌లో ఉండగా.. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజంకి గాయమైంది. సెల్ఫీ కోసం అని జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ పలకరించాడు. ఇంతలోనే దాడికి దిగాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. పోలీసులు శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికిత్స చేయించుకుని, అనంతరం, విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు.

13:59 - October 25, 2018

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని దృష్టిలోపెట్టుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ కేటాయించి, #RRR మూవీని నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు నిర్మాత దానయ్య. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌లు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారో తెలుసా? ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరూ 15 నుండి 20 కోట్లు తీసుకునే స్దాయిలో ఉన్నారు. అది కూడా కాల్షీట్ల ప్రకారం.. జక్కన్నతో సినిమా అంటే దాదాపు రెండు సినిమాలకు సరిపడే డేట్స్‌ఉండాల్సిందే.. ఇక రాజమౌళి సంగతి చెప్పక్కర్లేదు. #RRR‌కి ఈ ముగ్గురూ, తమ పారితోషికాల కింద, వాటాల రూపంలో లాభాలను పంచుకోబోతున్నారని తెలుస్తోంది. ఎవరికి ఎంత శాతం అనేది తెలియదు కానీ, ఈ మేరకు ఫిక్స్అయ్యారని సమాచారం. నవంబర్ 18న షూటింగ్ స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. 2020లో #RRR రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తారక్, చెర్రీ కలిసి రాజమౌళి #RRR‌లో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.. బోయపాటితో చరణ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది..  

13:29 - October 25, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసు విషయం ఇప్పటికే పలు వార్తలు వస్తునే వున్నాయి. బాధితురాలు అమృత విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు ఆమెపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై కన్ను వేసి ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో  నిందితులకు బెయిల్ ను న్యాయమూర్తి నిరాకరించారు. బెయిల్ పై వాదనల సందర్భంగా కోర్టు హాల్ లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టుకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ మోకిని సత్యనారాయణగౌడ్‌ వాదనలు వినిపించారు.

Image result for pranay amruthaఅదే సమయంలో అమృత వర్షిణి తరఫున హుస్సైబ్ హైమద్ వాదిస్తూ, ఈ కేసులో నిందితులకు బెయిల్ లభిస్తే, సాక్ష్యాలు తారుమారవుతాయని, తనకు ప్రాణహాని కల్పించే అవకాశం ఉందని అమృత తరఫున విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇవ్వరాదని తన క్లయింట్ వేడుకుంటున్నారని తెలిపారు. దీంతో ఏ1 మారుతీరావు సహా నిందితులందరికీ బెయిల్ ను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.
 

13:20 - October 25, 2018

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ సోదాల కలకలం చెలరేగింది. ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. జూబ్లీహిల్స్, సోమాజిగూడలోని నవయుగ కార్యాలయంలో ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. సుమారు 20మంది అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారని సమాచారం. నవయుగ సంస్థ పోలవరం ప్రాజెక్టు సహా పలు కాంట్రాక్టులను చేపట్టింది. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని దాడులలో నవయుగ 40కి పైగా కంపెనీలు నిర్వహిస్తున్నట్లు, వాటిలో డొల్ల కంపెనీలు ఉన్నట్లు అదికారులు గమనించారు. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలు ఉల్లఘించినట్టు నవయుగ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్టు సమాచారం. 

నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌, నవయుగ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్, నవయుగ రోడ్‌ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపెనీ లిమిటెడ్, కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్‌ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం.

13:19 - October 25, 2018

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాంజ్‌లో జగన్ కూర్చుని ఉండగా.. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తం అయిన సెక్యూరిటీ.. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. ఎయిర్‌పోర్టులోనే ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్‌ జగన్‌ విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు.

294వ రోజు పాదయాత్ర ముగించుకుని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాంజ్‌లో ఉన్న జగన్‌ వద్దకు వచ్చిన వెయిటర్ శ్రీనివాస్‌.. మన పార్టీకి 160సీట్లు వస్తాయా సార్? అని పలకరించాడు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చాడు. వస్తూనే.. జగన్‌పై కత్తితో దాడి చేశాడు. 

 

Image result for attack on jagan

12:48 - October 25, 2018

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు రౌడీలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో మహిళలకు అప్పులే మిగిల్చారని, ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఎవరిని ఉద్దరించారని టీడీపీకి ఓట్లు వేయాలి? అని నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రచారానికి చంద్రబాబు వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు.

* చంద్రబాబు రౌడీలా ప్రవర్తిస్తున్నారు
* మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు
* ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ చయలేదు
* ఐదేళ్లలో మహిళలకు అప్పులే మిగిల్చారు
* టీడీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలి?
* చంద్రబాబు ఎవరిని ఉద్దరించారని ఓట్లు వేయాలి?
* ఐదు సంతకాల సంగతి ఏమైంది? 
* ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు

12:47 - October 25, 2018

ఢిల్లీ : స్మార్ట్ ఫోన్..ప్రతొక్కరి చేతుల్లో కనబడుతోంది. ఆయా కంపెనీలు ఆఫర్స్...డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనితో వివిధ ఫీచర్లతో కూడిన సెల్ ఫోన్‌లు కొనుగోలు చేస్తూ విపరీతంగా వాడేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుండి మొదలు పక్కన పడుకొనే వరకు కొంతమంది ఫోన్‌లను తెగవాడేస్తుంటారు. ఫోన్‌ల వాడకంలో చిన్నా..పెద్దా అనే తేడా లేదు. స్కూల్ పిల్లాడి నుండి మొదలుకొంటే వ‌ృద్దుల వరకు వాడేస్తున్నారు. యూ ట్యూబ్, ఫేస్ బుక్, వాట్సప్‌లతో సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తూ..పోస్టులు పెడుతూ..షేరింగ్ చేస్తూ యమ బిజీగా మారిపోతున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొబైల్‌ ఎక్కువగా వాడడంతో చేతి వేళ్లు కదిలించలేని పరిస్థితి వచ్చిందట. 
చికిత్స చేసిన వైద్యులు.. సూచనచైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువగా అలావాటు కావడంతో చేతివేళ్లు ముడుచకపోయాయని వీడియో చూస్తే తెలుస్తోంది. వారం రోజు పాటు ఏకధాటిగా మొబైల్ వాడినట్లు సమాచారం. ఆమె వేళ్లు వంగి.. బిగుసుకుపోయాయి. కొన్ని వేళ్లు అయితే పూర్తిగా ఒంగిపోయాయి. దీంతో వైద్యుల్ని సంప్రదించగా ఆమె వేళ్లకు చికిత్స అందించారు. ఫిజియోథెరపీతో వేళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. సో..స్మార్ట్ ఫోన్ వాడకంలో జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నారు. 

12:46 - October 25, 2018

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో, ధనుంజయ, ఇర్రా మోర్, జంటగా, సిద్దార్థ డైరెక్షన్‌లో, ఒక నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న మూవీ.. భైరవ గీత. ఆఫీసర్ డిజాస్టర్ తర్వాత భైరవ గీతని అరవింద సమేతకి పోటీగా అక్టోబర్ 12న రిలీజ్ చెయ్యాలనుకుని పోస్టర్లు కూడా వేసారు.. కానీ, సినిమా విడుదల కాలేదు.. తర్వాత అక్టోబర్ 26 అన్నారు.. అదీలేదు.. ఇప్పుడు నెక్స్ట్‌మంథ్‌కి షిఫ్ట్ అయ్యారు.. నవంబర్ 22న భైరవ గీత విడుదల అంటూ కొత్త పోస్టర్లు రిలీజ్ చేసారు. హీరో, హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ రొమాన్స్‌ని హైలెట్ చేస్తూ ఈ పోస్టర్స్ డిజైన్ చేసారు. ఇక ట్రైలర్‌లోనూ వర్మ రక్త చరిత్ర పోలికలు కనిపించాయి.. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన భైరవ గీత సినిమాని హిందీ, తమిళ్‌లోనూ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 
  

12:18 - October 25, 2018

ఢిల్లీ : వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వపార్టీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కూడా ఆయన వెనుకడరనే మాట మరోసారి నిరూపించబడింది. సీబీఐలో జరుగుతున్న అవినీతిని దృష్టిలో పెట్టుకున్న ఆయన తమ ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని, అటువంటప్పుడు తాను అవినీతిపై పోరాడడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..సీబీఐ తదుపరి లక్ష్యం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి రాజేశ్వర్ సింగ్ అని జోస్యం చెప్పిన ఆయన.. రాజేశ్వర్ సింగ్‌పై వేటేయాలని ‘పాత్రధారులు’ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తాను చెప్పినట్టుగా జరిగితే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై తాను పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొనటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
 

12:08 - October 25, 2018

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు. తీరా వారిచ్చిన నోట్లను పరిశీలించగా అవి ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’’ పేరుతో ఉన్న నకిలీ నోట్లగా గుర్తించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది.  
వివరాల్లోకి వెళితే.. ఓ జంట లుథియానాలోని ఓ జువెలరీ షాపుకు వెళ్ళారు. వారు 56 గ్రాముల బంగారం రూ. 1.90 లక్షలు పెట్టి ఖరీదు చేశారు. క్యాష్ పే చేశారు.. వెళ్ళిపోయారు. తీరా వాళ్లు వెళ్లిన తర్వాత చూసుకుంటే అవి నకిలీ నోట్లుగా గుర్తించాడు షాపు యజమాని శ్యామ్ సుందర్ వర్మ. దంపతులు నోట్లను పాలిథిన్ బ్యాగులో చుట్టి తెచ్చారు. లెక్క చూసిన తర్వాత డబ్బులు చెల్లించి వారు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ కిలాడీ దంపతులు కారులో వచ్చినట్టు గమనించారు. కనీసం కారు మీద రిజిస్ట్రేషన్ నెంబరు కూడా లేకపోవడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ దంపతుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. 

 

 

12:01 - October 25, 2018

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్న విరాట్.. తాజాగా మరో మైలురాయి సాధించాడు.

తనకి అచ్చొచ్చిన విశాఖపట్నం మైదానంలో విరాట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫాస్టెస్ట్‌ 10వేల పరుగుల ప్రపంచ రికార్డు, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఫాస్టెస్ట్‌ 1000 పరుగుల ప్రపంచ రికార్డుతోపాటు, వన్డేల్లో తన 37వ సెంచరీని సాధించాడు. 213వ వన్డేలో 205వ ఇన్నింగ్స్‌లో కోహ్లి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

Image result for virat kohli 10000 runs in odiఅతి తక్కువ ఇన్నింగ్స్‌లలో పదివేల పరుగుల మార్కును అందుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు విరాట్. అతి తక్కువ వయసులో (29 ఏళ్ల 353 రోజులు) ఈ రికార్డు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. తొలి ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ 27 ఏళ్ల 341 రోజుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. అద్భుత బ్యాటింగ్‌, సవాళ్లను అధిగమించే తత్వంతోపాటు నాయకత్వ పటిమతో కలగలిసిన కోహ్లీ.. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారాడనడంలో అతిశయోక్తి లేదు. గతంలో వేగవంతమైన 10 వేల మార్క్‌ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేర ఉంది. ఇందుకు టెండూల్కర్‌ 266 వన్డేల్లో 259 ఇన్నింగ్స్‌లను ఆడగా.. 29 ఏళ్ల కోహ్లీ 213 వన్డేల్లో 205 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. 

Image result for virat kohli 10000 runs in odiప్రపంచంలో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న వారిలో కోహ్లీ 13వ వాడు. 17 ఏళ్ల క్రితం టెండూల్కర్‌ ఆస్ట్రేలియాపై ఈ ఫీట్‌ను సాధించగా.. కోహ్లీ విండీస్‌పై ఆడుతూ తన 37 వన్డే సెంచరీని పూర్తి చేసుకుంటూ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ వన్డేలో కోహ్లీ 129 బంతుల్లో 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం.

 

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో  ఫాస్టెస్ట్‌ 1000 రన్స్‌
* ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ మరో రికార్డు. కోహ్లీ ఇందుకు ఆడిన ఇన్నింగ్స్‌లు 11 మాత్రమే. గతంలో ఈ రికార్డు కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా (15 ఇన్నింగ్స్‌ల) పేర ఉంది.
* కెప్టెన్‌గా కోహ్లీ 15వ సెంచరీ చేసి అత్యదిక సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు 
* 2008లో అండర్‌ 19 జట్టుకు నేతృత్వం.. కప్ భారత్ కైవసం. అదే ఏడాది జాతీయ జట్టులోకి ఎంట్రీ 
అన్ని ఫార్మాట్లలో రాణించిన కోహ్లీ వన్డేలతోపాటు టెస్టుల్లోనూ ప్రపంచ నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. 

పదివేల మార్కును చేరిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌
విరాట్‌ కోహ్లీ (భారత్‌) : 213 వన్డేల్లో
సచిన్‌ టెండూల్కర్‌ (భారత్‌): 266 వన్డేల్లో
సౌరవ్‌ గంగూలీ (భారత్‌): 272 వన్డేల్లో
రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) : 272 వన్డేల్లో
జాక్వెస్‌ కలిస్‌ ( దక్షిణాఫ్రికా): 286 వన్డేల్లో
మహేంద్ర సింగ్‌ ధోనీ( భారత్‌): 320 వన్డేల్లో
బ్రియాన్‌ లారా (వెస్టిండీస్‌) : 287 వన్డేల్లో
రాహుల్‌ ద్రవిడ్‌ (భారత్‌) : 309 వన్డేల్లో

 

తక్కువ ఇన్నింగ్స్‌లలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు
2018- కోహ్లీ - 11 ఇన్నింగ్స్‌లు
2010- హషీం ఆమ్లా - 15 ఇన్నింగ్స్‌లు
2012- విరాట్‌ కోహ్లీ-  15 ఇన్నింగ్స్‌లు
1983- డేవిడ్‌ గ్రోవర్ ‌- 17 ఇన్నింగ్స్‌లు
2011- షేన్‌ వాట్సన్‌ - 17 ఇన్నింగ్స్‌లు
2013- కె సంగకర - 17 ఇన్నింగ్స్‌లు
2015- ఎబి డివిలియర్స్‌ - 17ఇన్నింగ్స్‌లుకోహ్లీ వన్డేల్లో 10కె రన్స్‌ 

ఇన్నింగ్స్‌ : 205 ( గతంలో టెండూల్కర్‌ 259)
కెరియర్‌ ప్రారంభించిన తర్వాత 3,270 రోజుల్లో (ద్రవిడ్‌ 3,969 రోజుల్లో)
ఆడిన బంతులు 10,813 ( జయసూర్య 11, 296)
అత్యధిక సగటు : 59.17 ( ధోనీ 51.30)
అతిపిన్న వయసులో (29 ఏళ్ల 353 రోజులు) ఈ రికార్డు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు. తొలి ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ 27 ఏళ్ల 341 రోజులు

ఒకే వేదికపై కోహ్లీ అత్యధిక సెంచరీల నమోదు

మీర్‌పూర్‌లో… 4 (13 ఇన్నింగ్స్‌లు)
కొలంబోలో… 4 (8 ఇన్నింగ్స్‌లు)
విశాఖపట్టణం…3 (5 ఇన్నింగ్స్‌లు)

విండీస్‌పై చివరి మూడు వన్డేల్లో కోహ్లీ సెంచరీలు

2017 కింగ్‌స్టన్‌లో.. 111(115 బంతులు) నాటౌట్‌
2018 గువాహటిలో.. 140(107 బంతులు)
2018 వైజాగ్‌లో.. 157 (129బంతులు) నాటౌట్‌

11:52 - October 25, 2018

హెబ్బా పటేల్...కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన భామ. 2014 సంవత్సరంలో తిరుమనం ఎనుం నిఖా చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగులో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’తో సంచలనంగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొన్ని చిత్రాలు చేసినా అంతగా విజయాలు సాధించలేదు. తాను బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తానని వెల్లడించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
‘24 కిస్సెస్’...లో హెబ్బా నటిస్తోంది. ఇందులో అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాను అయోధ్య కుమార్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా టైటిల్ లాగానే హెబ్బా రెచ్చిపోయింది. ముద్దుల వర్షం కురిపించారు. అందచందాలను ఆరబోసిన హెబ్బా మరోసారి కనువిందు చేయనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ సాంగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. హెబ్బ...అరుణ్ మధ్య సన్నివేశాలను హాట్ హాట్‌గా తెరకెక్కించారు. 
మొత్తం కథని రావు రమేష్‌కు హీరో ఆదిత్ వివరిస్తుంటాడు. రావు రమేష్ డైలాగులు హాస్యాన్ని పండించే విధంగా ఉన్నాయి. యువతని ఆకర్షించేలా రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

11:42 - October 25, 2018

విశాఖపట్నం : సాధారణంగా అతివలు అబలలు అంటారు. కష్టాలు వచ్చినప్పుడు వారు తట్టుకోలేరు అందుకే వారు ఏడ్చి తమ బాధను తగ్గించుకుంటారంటారు. ఏడుపు ఆడవాళ్లు సొత్తు అన్నట్లు వుంటారని సాధారణ నానుడి. కానీ..కష్టాలు వచ్చినప్పుడు నిబ్బరం చూపి ఆత్మవిశ్వాసం మా సొత్తు అని సాటి చెబుతున్నారు నేటి స్త్రీలు. దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి. సివేరి సోమ సంతాపసభలో పాల్గొన్న ఆమె మొదటిసారి ప్రజల సమక్షంలో తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. లివిటిపుట్టు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మౌనాన్ని వీడి, ధైర్యంగా నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. మనం నిశ్శబ్దంగా వుంటే ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాలు ఇచ్చే వారు అటువంటి పనులు మానుకోవాలని సూచించారు.

Image result for kidari wifeమనం  సైలెంట్‌గా వుంటే వారు హత్యలు చేస్తునే వుంటారు : పరమేశ్వరి
మనం  సైలెంట్‌గా ఉన్నంత కాలం మావోయిస్టులు వయలెన్స్ చేస్తూనే వుంటారనీ..అందుకే కష్టాలలో వున్నాగానీ..మనల్ని బాధిస్తున్నవారి పట్ల మౌనాన్ని వీడి తిరుగుబాటు గళం వినిపించాలని పరమేశ్వరి పిలుపునిచ్చారు. ప్రజల కోసం తన  భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించే వారు. ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడపడానికి ఇష్టపడేవారు. అటువంటి సేవాభావం ఉన్న తన భర్తతోపాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు ఎందుకు హత్య చేశారు?’’ అని దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి ప్రశ్నించారు. మరి పరమేశ్వరి వంటి ఆత్మ విశ్వాసం ప్రతీ ఒక్కరు అలవరచుకోవాలని ఆశిద్దాం.
 

11:39 - October 25, 2018

గత కొద్ది రోజులుగా బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు, కన్నడ సినీ పరిశ్రమలోనూ అలజడి రేపుతుంది మీటూ ఉద్యమం.. రీసెంట్‌గా, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ భార్య, సోనీ రాజ్దాన్, సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనపై రేప్ అటెంప్ట్ జరగబోయిందని చెప్పడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.. ఇప్పుడు హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు సుశి గణేషన్‌పై లైంగిక ఆరోపణలు చెయ్యడం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్‌ ‌ది ఇండస్ట్రీ అయింది. గతకొద్ది రోజుల క్రితం సుశి గణేషన్‌ తనని లైంగికంగా వేధించాడని దర్శకురాలు లీనా చెప్పడం జరిగింది. అమలా పాల్‌ని, సుశి గణేషన్‌ తిరుటుపాయలే2 సినిమా చేస్తున్నప్పుడు పలు రకాలుగా వేధించేవాడట. కావాలని ఎక్కడపడితే అక్కడ తాకడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం, లైంగికంగా ప్రేరేపించాలని ప్రయత్నించడం చేసేవాడని, కావాలని తనకు అవకాశాలిప్పించాలని ట్రై చేసేవాడని చెప్పుకొచ్చింది.. అయితే,  అమలా పాల్‌, సుశి గణేషన్‌‌‌పై ఆరోపణలు చేసిన తర్వాత, సుశి, అతని భార్య కలిసి, అమల పాల్‌కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారనీ, తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పింది అమల.. 

11:34 - October 25, 2018

ఢిల్లీ: అవినీతి ఆరోపణల కారణంగా సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం చెలరేగింది. ఆయన ఇంటి ముందు అనుమానాస్పద రీతిలో మాటు వేసిన  నలుగురు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలోక్ వర్మ ఇంటి గేటు ముందు ఓ కారులో కూర్చుని ఆ నలుగురు నిఘా పెట్టారు. దీంతో ఆ నలుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం అక్బర్ రోడ్డులో ఉన్న అలోక్ వర్మ ఇంటి ముందు ఈ ఘటన జరిగింది. ఆ నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. వారు ఎవరు? ఎందుకొచ్చారు? వారిని ఎవరు పంపారు? వర్మ ఇంటి ముందు  ఏం చేస్తున్నారు? అనే వివరాలను రాబడుతున్నారు.

కాగా వీరంతా ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన వ్యక్తులని వార్తలొస్తున్నాయి. వర్మ కదలికలను నిశితంగా గమనించడం కోసం ఆయన నివాసం వద్ద వీరు మాటు వేసినట్టు కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆ నలుగురు రాకేశ్ ఆస్థానా మనుషులా? అనే అనుమానాలు లేకపోలేదు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సీబీఐలో అవినీతి ఆరోపణలు, వర్గపోరు వివాదానికి దారితీశాయి. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా అవినీతి ఆరోపణలు చేశారు. ఆస్థానా లంచం తీసుకున్నట్టు అలోక్ వర్మ కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఇద్దరు టాప్ బాస్‌ల మధ్య గొడవ ముదిరింది. ఇద్దరు అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకోవడంతో.. ఆ ఇద్దర్నీ కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. సెంట్రల్ విజిలెన్స్  సిఫారసుతో ఆపద్ధర్మ డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర రావును నియమించారు.

11:26 - October 25, 2018

ఢిల్లీ : ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుండి అధికారికంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 2012, 2016 ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 270 మ్యాచ్‌ల్లో ఆడాడు. 2016 సంవత్సరంలో ‘ఛాంపియన్’ పేరిట సాంగ్ రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. 
రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ పలు విషయాలు తెలియచేశాడు. ‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్న’ అని బ్రావో వెల్లడించాడు. 
164 వన్డేలు ఆడిన ఇతను 2968 రన్స్ చేశాడు. అంతేగాకుండా 199 వికెట్లు తీశాడు. 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 సగటుతో 2200 పరుగులు చేశాడు. అలాగే 86 వికెట్లు తీశాడు. ఇక టీ 20 విషయానికి వస్తే 66 టీ20ల్లో ఆడిన బ్రావో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. మరి ఐపీఎల్‌లో కొనసాగుతాడా ? లేదా ? అనేది చూడాలి. 

11:09 - October 25, 2018

తమిళనాడు : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగా వుంటాయి. దివంగత సీఎం జయలలిత మరణం తరువాత పలు కీలక పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పడి ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. అధికారం కోసం నేతలు చేస్తున్న జిమ్మిక్కులతో తమిళనాటు ప్రభుత్వం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. Image result for sasikala and jayalalitha

స్నేహితురాలు జయలలిత మరణం తరువాత అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పలు వ్యూహాలు పన్నిన శశికళ ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయినా జైలు నుండి రాజకీయాలు నడిపి దినకరన్ తో పలు జిమ్మిక్కులు చేశారు. అయినా న్యాయస్థానం నుండి షాక్ ఎదుర్కోక తప్పలేదు. 

Image result for sasikala and dinakaranశశికళ బంధువు..డీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆ 18మంది ఎమ్మెల్యేలు అనర్హులేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. 
కాగా, ఈ 18 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని తమిళనాడు మంత్రి ఒకరు వెల్లడించారు. అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. మరి త్వరలో తమిళనాట కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది న్యాయంస్థానం ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే. కాగా మరి  దినకర్ తన ఎమ్మెల్యేలతో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేక ఎన్నికలకు వెళతారా? అనే విషయం కోసం వేచి చూడాల్సి వుంది. 
 

 
11:01 - October 25, 2018
శ్రీకాకుళం : ఏపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం చెలరేగింది. ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ఐటీ దాడుల కలకలం చెలరేగింది. వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఆదాయ పన్నుశాఖ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. 8 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
ఉక్కునగరం విశాఖలోనే కాదు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ దాడుల కలకలం చెలరేగింది. రణస్థలం మండలం బంటుపల్లిలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ ఈశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
 
అటు విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. దువ్వాడలోని టీజీఐ, ట్రాన్స్‌వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉషోదయాలు చార్టెడ్ అకౌంట్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మినరల్ కంపెనీకి చెందిన కొన్ని అకౌంట్లు ఇక్కడ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నగంరలోని పలు కంపెనీలపైనా అధికారులు నిఘా పెట్టారు.
 
* విశాఖలో తెల్లవారుజాము నుంచి ఐటీ దాడులు
* దువ్వాడ ఎస్ఈజెడ్‌లో విస్తృత తనిఖీలు 
* 8 బృందాలుగా విడిపోయి తనిఖీలు
* గాజువాక మండలం దువ్వాడలోని టీజీఐ కంపెనీలో దాడులు
* నగరంలోని పలు కంపెనీలపైనా నిఘా
* ట్రాన్స్‌వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలో సోదాలు
* ఉషోదయాలు చార్టెడ్ అకౌంట్ ఇంట్లో సోదాలు 
* తమిళనాడులోని మినరల్ కంపెనీకి చెందిన కొన్ని అకౌంట్లు ఇక్కడ ఉన్నట్టు సమాచారం
* రియల్ ఎస్టేల్ కార్యాలయాల్లోనూ దాడులు
* రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ ఈశ్వరరావు ఇంట్లో సోదాలు
11:00 - October 25, 2018

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో సీనియర్లను పోటీలో దింపరాదని నిర్ణయించింది. సీనియర్ల సేవలను ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను నిరోధించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో పిసిసి చీఫ్‌లు కూడా ఉన్నారు. సీనియర్లంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. Image result for madhya pradesh and rajasthan congressమధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌ నాథ్, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌, సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్, సిపి జోషిలు అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరిని సిఎం అభ్యర్థిగా ప్రకటించాలో అర్థంకాక కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది.
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీనియర్‌ నేతలను తమ తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా ...రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేలా కొత్త ఫార్ములాను అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఈ ప్రణాళికను 2 వందలపైకి అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో అమలు చేయనుంది. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ నాయకుడు ఎవరన్న ప్రశ్న తలెత్తదని...పార్టీ కార్యకర్తలంతా గెలుపు కోసం కృషి చేస్తారని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. 

Image result for Madhya Pradesh And Rajasthan Assembly Election Congress Senior leaders

కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యంగా రాజస్థాన్‌లో నాయకత్వ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గెహ్లాట్‌ సీనియర్‌ నేత కాగా...పైలెట్‌ యువనేతగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఎఐసిసి కార్యదర్శిగా రాహుల్‌గాంధీ నియమించారు. గెహ్లాట్‌కు ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలతో సంబంధాలున్నాయి. ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా...2013 ఎన్నికల్లో అశోక్‌ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ యువనేతగా రాజస్థాన్‌ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేశారని గుర్తింపు పొందారు.
Image result for madhya pradesh congressఇక మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌...వీరిద్దరూ ఎంపీలే కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో వీరు పోటీ చేయాలా వద్దా అన్న ప్రశ్న కాంగ్రెస్‌ పార్టీకి తలెత్తడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్‌ నేతలు పోటీ చేయొద్దన్న నిర్ణయం ఇదే తొలిసారి కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1998లో అశోక్‌ గెహ్లాట్‌  రాజస్థాన్‌ సిఎం అయ్యారు. ఎంపీగా ఉన్న గెహ్లాట్‌ను పార్టీ హైకమాండ్‌ సిఎంగా పంపిన విషయాన్ని గుర్తు చేశాయి. 2012 లో ఎంపీగా ఉన్న విజయ్‌ బహుగుణ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా కాంగ్రెస్‌ ఆయనను సిఎంగా నియమించింది. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
Image result for madhya pradesh congressకాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీయే శత్రువని పేరుంది. సిఎం అభ్యర్థిగా ఏ  ఒక్కరి పేరు ప్రకటించినా....అసమ్మతి రాజుకోవడం ఖాయం. అంతర్గత కలహాలు పార్టీని దెబ్బతీయకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్లను బరిలోకి దింపకూడదనే నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధతరం నేతలను పక్కన బెట్టాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ఈ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది.

10:50 - October 25, 2018

భోపాల్ : శాసనసభకు నవంబర్‌ 28న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొంది. అధికారం కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. Image result for madhya pradesh election 2018ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీని దాదాపు ఓడించినంత పనిచేసిన కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్‌లోనూ అదే హవా కొనసాగించి అధికారంలోకి రావడం ద్వారా వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని భావిస్తోంది.
విస్తీర్ణం పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం జనాభా 7.25 కోట్లు. జనాభా పరంగా ఐదో అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ లెక్కలు చాలు మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయని చెప్పడానికి. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 
Image result for madhya pradesh election 2018మధ్యప్రదేశ్‌లో 2003 నుంచీ బీజేపీనే అధికారంలో ఉంది. గత 13 ఏళ్లుగా సిఎంగా కొనసాగుతున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని బిజెపి నిర్ణయించింది. అయితే శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని అవినీతి, కుంభకోణాలు కూడా వెంటాడుతున్నాయి. 2013లో వెలుగు చూసిన వ్యాపం కుంభకోణం ప్రభుత్వాన్ని కుదిపేసింది. వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలను, ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను వ్యాపం బోర్డు నిర్వహిస్తుంది. పరీక్షల నిర్వహణలో పలు అక్రమాలు జరిగాయనీ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాగే 500 కోట్ల విలువైన భూములను ప్రభుత్వం ఆరెస్సెస్‌కు ధారాదత్తం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 'సింహస్త' కుంభకోణంలో 2,500 కోట్ల అవినీతి, అక్రమ ఇసుక తవ్వకాలు, చెరువులు, ఆనకట్టల నిర్మాణంలో అక్రమాలు, మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి తదితర ఆరోపణలు బీజేపీకి మైనస్‌గా మారాయి.  
Image result for madhya pradesh scamsమరోవైపు రైతుల ఆత్మహత్యలు బీజేపీకి ఇబ్బందిగా పరిణమించాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్‌లో 11 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో పెరుగుదల శివరాజ్‌ ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. మాంద్‌సౌర్‌లో మద్దతు ధర కోసం ఆందోళన జరుపుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడం కూడా శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు కూడా పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక తెలిపింది. ఈ ఎన్నికల్లో రైతుల సమస్యలే కాంగ్రెస్‌ ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంది.  
Image result for madhya pradesh municipal electionsశివరాజ్‌సింగ్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతరేకత ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. మొత్తం 20 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 13 చోట్ల బిజెపి విజయం సాధించినప్పటికీ...కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు అనూహ్యరీతిలో విజయం లభించింది. రాగోగఢ్‌ పురపాలక సంఘంలో 24 వార్డులకుగాను కాంగ్రెస్‌ 20, బీజేపీ కేవలం 4 వార్డుల్లో గెలుపొందాయి. చిత్రకూట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 14,133 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గత 15 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినా.. కొంతవరకు అభివృద్ధి కూడా జరిగింది. 
Image result for madhya pradesh municipal electionsముఖ్యంగా సిఎం చౌహాన్‌పై ప్రజల్లో సానుకూలత ఉండడం బిజెపికి కలిసొచ్చింది. అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన మధ్యప్రదేశ్‌ను శివరాజ్‌ సింగ్‌ అభివృద్ధి దిశగా నడిపించారు. విద్యుత్‌ ఉత్పత్తిలో మిగులు,  ప్రైవేటు రంగంలో గణనీయ అభివృద్ధిని చూపారు. విద్య, వైద్యరంగాలు, మౌళిక వసతుల కల్పనలో పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర వృద్ధి రేటును రెండంకెలకు తీసుకువెళ్లారు. రైతుల కోసం కూడా పలు పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైంది 'భవంతర్‌ భూఘటన యోజన'. ఈ పథకం ప్రకార వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ ధర, కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉంటే.. ఆ తేడాను రైతుల ఖాతాల్లోకే నేరుగా జమ చేస్తారు. ఈ పథకంలో 16 లక్షల మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే, ఈ పథకం కూడా రైతుల కన్నా దళారులకే ఎక్కువ ఉపయోగపడుతోందని విమర్శలున్నాయి.
15 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. కొన్ని సీట్లు తగ్గినా అధికారంలోకి బిజెపియే వస్తుందని కూడా కొన్ని సర్వేలు అంచనా వేశాయి. శివరాజ్‌సింగ్‌ ప్రజావ్యతిరేకతను ఎంతవరకు అధిగమిస్తారన్నది వేచి చూడాలి.

10:43 - October 25, 2018

హైదరాబాద్ : ఒక్కొ సంప్రదాయానికి కట్టుబట్లలో అనేక విభిన్న కోణాలుంటాయి. ఈ క్రమంలోనే ముస్లింలకు బురఖా అత్యంత ఆంక్షలతో కూడిన సంప్రదాయం. ముస్లిం కుటుంబాలలో ఆడబిడ్డ పుట్టిందంటే బురఖా వేయాల్సిందే. బురఖాపై ఎన్ని వివాదాలు వున్నా..వచ్చినా ముస్లిం మహిళలు బురఖా లేనిదే గడప దాటరు గాక దాటరు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న క్రమంలో ముస్లిం మహిళలు ఓటు వేయాలంటే బురఖా తొలగించాల్సిందేనని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు.

Image result for muslim women votingడిసెంబర్ 7న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే ముస్లిం మహిళలు, గుర్తింపు కోసం అధికారుల ముందు తమ బురఖాను తొలగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. పురుష పోలింగ్ అధికారుల ముందు వారు బురఖాను తీయాల్సిన అవసరం లేదని, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించామని..తెలంగాణలో ముస్లిం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా సిబ్బందిని, బందోబస్తుకు మహిళా పోలీసులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. పింక్ పోలింగ్ కేంద్రాల స్థానంలో ఎటువంటి రంగూ లేని పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తామని రావత్ తెలిపారు.

10:36 - October 25, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉంది. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో పలు నియోజవర్గాల జాబితాను ఇప్పటికే  సిద్ధం చేసింది. మహాకూటమి తరపున పోటీ చేసేందుకు 14 నియోజకవర్గాలను టీడీపీ ఎంపిక చేసుకుంది. మహాకూటమిలో పొత్తులు.. సీట్ల పంపకాలు  కొలిక్కిరావడంతో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తలామునకలైంది. ముందుగా 30 స్థానాల్లో పోటీచేయాలని  ప్రతిపాదనలు ఇచ్చినా తర్వాత గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనే బరిలోకి దిగాలని టీడీపీ నిర్ణయించుకుంది. దీంతో 14 స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ టీడీపీ రెడీ అవుతోంది. చంద్రబాబుతో సమావేశమైన తెలంగాణ నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై చర్చించినట్టు సమాచారం. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్‌కు అందచేసినట్లు తెలిసింది. 

నియోజకవర్గం అభ్యర్థి పేరు
శేరిలింగంపల్లి భవ్యా ఆనంద్ ప్రసాద్
కూకట్‌పల్లి  ఇ.పెద్దిరెడ్డి
కుత్బుల్లాపూర్ అరవింద్ కుమార్ గౌడ్ / కూన వెంకటేశ్ గౌడ్
రాజేంద్రనగర్  గణేష్ గుప్తా / సామా భూపాల్ రెడ్డి
జూబ్లీ హిల్స్ అనుషా రాం / ప్రదీప్ చౌదరి
ఖమ్మం నామా నాగేశ్వర్ రావు
సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య
అశ్వరావ్‌పేట మచ్చా నాగేశ్వర్‌ రావు
మక్తల్ కొత్తకోట దయాకర్ రెడ్డి
దేవరకద్ర సీతా దయాకర్ రెడ్డి
జడ్చర్ల ఎర్ర శేఖర్
వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ మండవ వెంకటేశ్వర్ రావు
కోరుట్ల ఎల్. రమణ

వీరి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. మహాకూటమిలో ఇతర పార్టీలు డిమాండ్ చేసే స్థానాలను దృష్టిలో ఉంచుకుని ఈ 14  నియోజకవర్గాలను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మరో రెండు మూడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

10:21 - October 25, 2018

ఢిల్లీ : బాలీవుడ్‌ బాద్ షా షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో...మనందరికి తెలుసు. 1995లో విడుదలైన ఈ సినిమా... 12 వందలు వారాలుగా దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. సినిమా రిలీజై 23 ఏళ్లవుతున్నా...ఇప్పటికీ ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ముంబయిలోని మరాఠా మందిర్‌లో ఈ సినిమాను ప్రదర్శితమవుతోంది. సినిమాను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న అభిమానులు షారుక్‌ ఖాన్ ట్విటర్‌ వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమాభిమానాలే రాజ్‌, సిమ్రన్‌ల ప్రేమ కథను 12వందల వారాలుగా బతికిస్తూ వచ్చాయి. అందరికీ ధన్యవాదాలు అంటూ షారుక్ ట్వీట్ చేశారు.

10:02 - October 25, 2018

హైదరాబాద్ : టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఈ ఎన్నికల తరువా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. లేకుంటే చేసేందుకు ఏ పని వుండదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ మునిగిపోయిన పడవలేనని లక్ష్మణ్  వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని  టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహాకూటమికి ప్రజలపై ఏమాత్రం నమ్మకం లేదనీ..నాలుగు సీట్లు సంపాదించడం కోసమే ఈ కూటమి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. Image result for maha kutamiటీడీపీతో పొత్తు పెట్టుకున్న టీజేఎస్ అధినేత కోదండరామ్ ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్వహించే బహిరంగ సభలు నాలుగు సభలలో ప్రధాని మోదీ పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు. స్వామి పరిపూర్ణానంద రాకతో బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. 
 

09:53 - October 25, 2018
విజయవాడ: ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అనేక సాంకేతిక కారణాల వల్లే నోటిఫికేషన్ ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారు. డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా ప్రకటించారు.
 
ఢీఎస్సీ షెడ్యూల్..
* రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* నవంబర్ 1 నుంచి ఫీజ్ పేమెంట్
* నవంబర్ 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్
* నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు
* నవంబర్ 19 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాల ఎంపిక
* నవంబర్ 29 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
* స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజ్) - డిసెంబర్ 6 నుంచి 10 వరకు పరీక్ష
* స్కూల్ అసిస్టెంట్స్(లాంగ్వేజ్) - డిసెంబర్ 11న పరీక్ష
* డిసెంబర్ 12, 13న పీజీ టీచర్స్ రాతపరీక్ష
* లాంగ్వేజ్ పండిట్స్ పోస్టులు - 452
* 7,675 ఉద్యోగాలు భర్తీ
* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంపు
* జనరల్ అభ్యర్థులకు 42 నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెంపు
* దివ్యాంగులకు 52 నుంచి 54 ఏళ్లకు వయోపరిమితి పెంపు
 
ఇప్పటికే అనేకసార్లు నోటిఫికేషన్‌ వాయిదాలు పడింది. చివరకు మోక్షం లభించింది. ఈ డీఎస్సీలో 7,675 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలకు మళ్లీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
09:39 - October 25, 2018

తమిళనాడు : కొందరు నటులు మాత్రమే. మరికొందరు దర్శకులు మాత్రమే. కానీ నటులను తయారుచేసినవారు మాత్రం కొందరే వుంటారు. నటనలో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూస్ చాలామంది స్థాపిస్తారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే నటులను తయారు చేస్తాయి. వాటిలో అత్యంత పేరెన్నికగన్న ఇనిస్టిట్యూట్ ‘కూత్తుపట్టరై’. ఆ ఇనిస్టిట్యూట్ ను స్థాపించి నటులు విజయ్ సేతుపతి, విమల్, విదార్థ్‌లతోపాటు మరెందరినో తీర్చిదిద్దిన ‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి తన 82 ఏట అనారోగ్యంతో మృతి చెందారు. తంజావూరు జిల్లా పుంజై గ్రామానికి చెందిన ముత్తుస్వామి 'కూత్తుపట్టరై' పేరిట నట శిక్షణ కేంద్రాన్ని స్థాపించి సినీ పరిశ్రమకు కొత్త ముఖాలను పరిచయం చేశారు. తొలుత వీధినాటకాల్లో శిక్షణ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చెన్నైలో శిక్షణ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ కళాకారులను తీర్చిదిద్దింది ఇక్కడే. అంకితభావానికి మారుపేరైన ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతికి కోలీవుడ్ సంతాపం తెలిపింది.

 

09:25 - October 25, 2018

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించే ప్రచార తారల జాబితా సిద్ధమయ్యింది. మొత్తం 40మంది పేర్లతో సిద్ధమైన ఈ జాబితాలో ప్రధాన ప్రచార తారగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహరించనున్నారు. 100 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ పర్యటించనున్నారు. కడియం శ్రీహరి, మహమూద్‌అలీ మరో 15మంది తాజా మాజీ మంత్రులు, 14మంది లోక్‌సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, మరో ముగ్గురు పార్టీ విప్‌లకు ఈ జాబితాలో అవకాశమిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్‌ బుధవారం సమావేశమై జాబితా ఖరారు చేశారు. దీనిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి  పంపించనున్నారు. కేసీఆర్‌ నియోజకవర్గాల ప్రచారయాత్ర నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. 

ఇక ఉమ్మడి జిల్లాల సభలపైనా కేసీఆర్ చర్చించారు. రాహుల్‌ గాంధీ సభ అనంతరమే ఈ సభలను జరపాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 28న రాహుల్‌ సభ జరిగితే... 29 నుంచి సీఎం సభలు ప్రారంభం కానున్నాయి. మొదట వరంగల్‌ లేదా ఖమ్మం ఆ తర్వాత  కరీంనగర్‌ సభలు జరిగే వీలుంది. హైదరాబాద్‌లో పరేడ్‌ మైదానంలో ఆ తర్వాతి సభ ఉండనుంది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై సీఎం కేసీఆర్‌ బుధవారం ఆరా తీశారు. ఇక రాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారుల మద్దతు కోరుతూ సీఎం కేసీఆర్‌ రాసిన లేఖలను కొరియర్‌ ద్వారా పంపించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. దీని కోసం కొరియర్‌ సంస్థను ఖరారు చేసింది. శుక్రవారం నుంచి వాటి పంపిణీ ప్రారంభించనుంది.

09:21 - October 25, 2018

ఉత్తరప్రదేశ్ : అత్తాకోడళ్ల మధ్య రొట్టె మాడింది అనే చందంగా మారింది కాన్పూర్ లోని ఓ అన్నదమ్ముల పరిస్థితి. ఓ బంగారం షాపులో జరిగిన భారీ దోపిడీల్లో కూడా రికార్డ్ సృష్టించింది. వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల రూపాల విలువైన పసిడి దోపిడీకి గురైంది. అంతేకాదు ఈ దోపిడీయే ఈ శతాబ్ధంలోకెల్ల ఇండియాలో నమోదైన అతిపెద్ద దోపిడీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, బిర్హానా రోడ్డులో ఉన్న ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు రూ. 140 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించుకు వెళ్లారు. 10 వేల క్యారెట్ల విలువైన డైమండ్స్, 100 కిలోల బంగారం, 500 కిలోల వెండి, ఐదు వేల క్యారెట్ల విలువైన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్టు సమాచారం. ఈ షాప్ ను యజమానుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఐదేళ్ల క్రితం మూసివేయగా, ఇంత భారీ దొంగతనం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
షాపు యజమానుల మధ్య నెలకొన్న వివాదంతో కోర్టుకు ఎక్కారు. దీంతో 2013లో జ్యూయెలరీ షాపును కోర్టు ఆదేశాలతో షాపును సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేసు పరిష్కారం కాగా, తిరిగి షాపును తెరచుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మంచిరోజు చూసి షాపును తెరవాలని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆభరణాలతో పాటు షాపుకు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా దొంగలు తీసుకెళ్లినట్టు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు.

 

08:53 - October 25, 2018

వైజాగ్: బంతి బంతికి టెన్షన్ టెన్షన్...అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ....ప్రత్యక్షంగా చూస్తున్న వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారికి...గుండె లబ్ డబ్ మనేలా చేసింది వైజాగ్ వన్డే మ్యాచ్. సాగర తీరంలో జరిగిన రెండో వన్డే ఫ్యాన్స్‌కు ‌మంచి కిక్కిచ్చింది. భారత్-విండీస్ జట్లు నువ్వా ? నేనా ? అన్నట్లు చివరి బంతి వరకు పోరాటం చేశాయి. విండీస్ బ్యాట్స్‌మెన్ షైహోప్ ఇన్నింగ్స్ చివరి బంతిని ఫోర్‌గా మలిచి...మ్యాచ్‌ను టై చేశాడు. 

వైజాగ్ వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్-విండీస్ జట్లు అద్భుతంగా పోరాడాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మజా ఎలా ఉంటుందో చూపించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు....విండీస్ జట్టుకు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో సెంచరీతో వీరవిహారం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ....ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగినప్పటి నుంచి ఇన్నింగ్స్ చివరి వరకు విండీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి...అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు త్వరగా ఔటయినప్పటికీ....మరో బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుతో కలిసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

73 పరుగులు చేసిన అంబటి రాయుడు ఔటైనా తర్వాత కోహ్లీ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. పట్టపగలే విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరైనా సరే...బౌండరీల  మీద బౌండరీలు కొట్టాడు. విరాట్ విధ్వంసం ధాటికి విండీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 129 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 157 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.

భారీ విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టుకు...ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న కీరన్ పావెల్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత విండీస్ బ్యాట్స్‌మెన్....చంద్రపాల్ హేమరాజ్, మార్లోన్ శ్యామూల్స్‌ను...స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్....వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షైహోప్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్సర్లతో భారత్ బౌలర్లను వణికిపోయేలా చేశారు. వీరిద్దర బ్యాటింగ్ దెబ్బకు విండీస్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే 32వ ఓవర్‌లో చాహల్....94 పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

హెట్‌మెయిర్ ఔటయినప్పటికీ షైహోప్ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. సమయం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ...విండీస్ జట్టును లక్ష్యంగా పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసిన షైహోప్....తన జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమైతే....ఈ సమయంలో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 5 బంతులకు 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతి వచ్చేసరికి అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లలో ఒకటే ఉత్కంఠ. 5 పరుగులు చేస్తే విండీస్ విన్ అవుతుంది....ఫోర్ కొడితే మ్యాచ్ డ్రా అవుతుంది. అయితే ఫోర్ కొట్టి...మ్యాచ్‌ను టై చేశాడు షైహోప్. 

49వ ఓవర్‌లో షమీ 6 పరుగులివ్వడంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. భారత జట్టు విజయం దాదాపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో విండీస్ బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయకంగా పోరాడారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే అవకాశం ఉమేశ్ యాదవ్‌కు దక్కింది. తొలి మూడు బంతులకు ఉమేశ్ 7 పరుగులిచ్చాడు. నాలుగో బంతికి నర్స్ ఔట్. ఐదో బంతికి రెండు పరుగులు.. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరం కావడంతో మళ్లీ విజయం విరాట్‌సేన వైపే మొగ్గింది. కానీ ఉమేశ్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా వేసిన చివరి బంతిని హోప్ లాగిపెట్టి కొట్టడంతో పాయింట్ దిశలో బౌండరీ వైపు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. రాయుడు అడ్డుకునేందుకు జారినా బంతి రోప్‌ను ముద్దాడటం.. మ్యాచ్‌ టై కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోగా, విండీస్ వీరులు సంబరాలు చేసుకున్నారు.

స్కోర్లు.. 
భారత్‌ 321/6
విండీస్‌ 321/7
కోహ్లీ(157 నాటౌట్‌) వన్డేల్లో 37వ సెంచరీ
షైహోప్‌(123 నాటౌట్)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - కోహ్లీ

08:40 - October 25, 2018

హైదరాబాద్ :  బీజేపీలో కాషార రంగు రాజకీయాలకు సరికొత్త అర్థాలను చెబుతోంది. ఇప్పటికే బీజేపీలో పలువురు స్వామీజీలు తమ పాత్రను సక్రమంగా నెరవేర్చుస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సాములోరు కొన్ని రాష్ట్రాలలో అధికారంలో వుండి చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ మరో సాములోరిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆయనే స్వామీ పరిపూర్ణానంద.  బీజేపీలో చేరి అమిత్ షాతో జరిపిన చర్చల్లో ఎన్నో అంశాల గురించిన ప్రస్తావన వచ్చిందని, తన ఆలోచనలే అమిత్ షా మాటల్లో కనిపించాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల గురించి, పర్యటన ఎలా ఉండాలనే విషయం గురించి ఇక్కడి నేతలు చెబుతారని అమిత్ షా తనతో అన్నారని పరిపూర్ణానంద చెప్పారు. ఈ సందర్భంగా నేటి ‘రాజకీయం’ గురించి ఆసక్తికర నిర్వచనం చెప్పారు. ‘రా’ అంటే రావణుడు, ‘జ’ అంటే జరాసంధుడు, ‘కీ’ అంటే కీచకుడు, ‘య’ అంటే యముడు అని అభివర్ణించారు.  

Image result for paripurna swamy amith shaghధర్మ పరిరక్షణ కోసమే తాను బీజేపీలో చేరానని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి దీక్ష ముగిసిన అనంతరం పార్టీలో చేరానని అన్నారు. అమ్మవారి అనుమతి లభించకపోతే పార్టీలో చేరనని అమిత్ షాతో చెప్పానని, నవరాత్రులు పూర్తయిన తర్వాత ఢిల్లీ వస్తానని ఆయనతో చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అమిత్ షా తన స్వగృహానికి ఆహ్వానించి తనతో ఎంతో ప్రేమగా మాట్లాడారని, ఆయన మాటలతో తనకు రెట్టింపు ధైర్యం వచ్చిందని అన్నారు.

08:21 - October 25, 2018

విశాఖపట్నం : నగరంలో భారీ అవినీతి సోదాలు జరగనున్నాయి. ఈ దాడుల అనుబంధంగా విజయవాడ, నెల్లూరు,గుంటూరు నగరాలలో కూడా ఐటీ సోదాలు జరిగే అవకాశమున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఐటీ బృందాలు ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న క్రమంలో ఈరోజు తెల్లవారుఝామునుండే ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గాజువాక, దువ్వాడ ఎస్ఈజెడ్ లో సోదాలు కొనసాగుతున్నాయి. దువ్వాడలోని టీజీఐ కంపెనీ, ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. 
ఇప్పటికే ఏపీలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖలోని పారిశ్రామికవేత్తలు, టీడీపీకి చెందిన కీలక నేతలు, చిట్ ఫండ్ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు ఇప్పటికే విశాఖకు చేరుకుని తనిఖీలను కొనసాగిస్తున్నారు. 
 

08:00 - October 25, 2018

అమరావతి: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సీబీఐ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనపై నిప్పులు చెరిగారు. సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలోకి ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందనీ..మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని, రాఫెల్ కుంభకోణంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్ ను అనధికారికంగా తప్పించారని చంద్రబాబు ఆరోపించారు. 

Image result for cbi rakesh asthana and  modiఆస్థానాను కాపాడేందుకు మోదీ : చంద్రబాబు
ప్రధాని మోదీ వద్ద పని చేసే ఆస్థానాను కాపాడేందుకు సీబీఐ డైరెక్టర్ ని మార్చే పరిస్థితికి వచ్చారని మండిపడ్దారు. సీబీఐ డైరెక్టర్ గా ఎవరినైనా నియమిస్తే రెండేళ్ల వరకు కొనసాగించాలని, ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు కల్పించుకోకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.  ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే.. ఈ ముగ్గురు కలిసి సీబీఐ డైరెక్టర్ ని నియమిస్తారని.. ఏదైనా సమస్య ఉంటే ఆ ముగ్గురు మాత్రమే పరిష్కరిస్తారన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని అన్నారు.  ఒక అవినీతి అధికారిని రక్షించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుండటం ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Image result for central vigilance commissionసీబీఐ డైరెక్టర్ ని తొలగించే అధికారం సీవీసీకి కూడా లేదు : చంద్రబాబు  
సీబీఐ డైరెక్టర్ ని తొలగించే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి కూడా లేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో దీనిపై కూడా సీబీఐ విచారణ చేస్తుందనన్న భయంతో ఆ సంస్థ డైరెక్టర్ ని తీసేసే పరిస్థితికొచ్చారని చంద్రబాబు విమర్శించారు. 

 

07:21 - October 25, 2018

ఢిల్లీ : గతం ఎప్పుడు ఘనమే. వర్తమానం కత్తిమీద సాములాంటిది. భవిష్యత్తు ఆశను పుట్టిస్తుంది. అందుకే గతంలో జరిగిన పరిణామాలన్నీ మన మంచికే అంటారు. ఈ నేపథ్యంలో అవినీతిని ఏరిపారేసే సంస్థే అవినీతిమయంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ సంస్థ మాజీ ఉద్యోగులంతా దానిపై ఈసడించుకుంటున్నారు. అదే  దేశ అత్యున్నత దర్యాప్తు  సీబీఐ. ఇప్పుడు దేశం యావత్తు ఇదే చర్చ కొనసాగుతోంది. అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీబీఐ గురించి తెలిసేకొద్దీ ఆ సంస్థలో పనిచేసి విరమణ పొందినవారంతా విస్తుపోతున్నారు. అవమానకరంగా భావిస్తున్నారు. సీబీఐ పరువు ప్రతిష్ఠలను రచ్చకీడ్చిన అంతర్గత కలహాలపై ఆ సంస్థ మాజీ అధికారులు విస్తుబోతున్నారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ చరిత్రలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితి ఎప్పుడూ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Related imageఇంతటి అవమానకర పరిస్థితులా: ఖరాయత్ 
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలో ఇలాంటి అవమానకర పరిస్థితులు గతంలో ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య గొడవల విషయం తెలిసి విస్తుపోయినట్టుగా తెలిపారు.సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండడం దురదృష్టకరమని ఆ సంస్థ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ఎస్ ఖరాయత్ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఖరాయత్ పేర్కొన్నారు.  సీబీఐ విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ జాయింట్ డైరెక్టర్ ఎన్‌కే సింగ్ అన్నారు. తాజా పరిణామాలు దురదృష్టకరమని పేర్కొన్న ఆయన ఇటువంటి తరహా ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని వారు పేర్కొన్నారు.

Image result for cbi Ex JOINT director NK SINGHతరహా ఘటనల గురించి ఎప్పుడూ వినలేదు : ఎన్ కే సింగ్
సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌కే సింగ్‌ కూడా తాజా పరిణామాలు దురదృష్టకరమని చెప్పారు. ‘‘సీబీఐలో గతంలో ఒడిదుడుకులు ఉన్నాయి కానీ... ఇవాళ్టి తరహా ఘటనల గురించి ఎప్పుడూ విన్నది లేదు. సీబీఐ విశ్వసనీయతను కోల్పోయింది’’ అని ఎన్‌కే సింగ్‌ అన్నారు. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఒకరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండడం దురదృష్టకరం. సీబీఐ గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవకపోవడం నన్ను దిగ్ర్భాంతికి గురి చేస్తోంది’’ అని సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో సీబీఐలోకి తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించేవారనీ..ఆయా అధికారుల రికార్డును క్షుణ్ణంగా చూసేవారనీ..గతంలో పనిచేసిన ఐదారుగుర్ని కనుక్కునేవారు’’ అని మరో మాజీ అధికారి చెప్పారు. ‘‘సీబీఐ నేరుగా ప్రధాని పరిధిలో ఉంది. ఈ తరహా ఘటన సీబీఐ చరిత్రలోనే లేదని మరో అధికారి వాపోయారు. 

Image result for cbi కాగా సీబీఐ సంస్థలోని ఇద్దరు అత్యున్న అధికారంలో వున్న రాకేశ్ ఆస్థానా, అలోక్ వర్మల ఆధిపత్య పోరులో భాగంగా వారి అవినీతి భాగోతం బైపడటంతో వారిద్దరిని సంస్థ నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైదేశం యావత్తు విస్తుపోతోంది. మరి చివరికి ఈ పరిణామాలు దేనికి దారి తీయనున్నాయో వేచి చూడాల్సిందే.

 

Don't Miss