Activities calendar

26 October 2018

22:26 - October 26, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టులో చుక్కెదురైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. 2022 వరకూ గడువు ఇస్తే రూ. 8500 కోట్లు చెల్లించేందుకు సిద్ధమనే అగ్రిగోల్డ్ ప్రతిపాదనను హైకోర్టు తిరస్కరించింది. శుక్రవారం అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. హాయ్‌ల్యాండ్ విలువ రూ.550 కోట్లని కోర్టు నిర్ణయించింది. కోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.

ఏపీలో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏపీ సీఐడీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించగా.. తెలంగాణలో ఉన్న 195 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని విక్రయించగా వచ్చిన రూ.11 కోట్లను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు.

 

22:03 - October 26, 2018

ఢిల్లీ : ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీయ విమాన సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విమాన ప్రయాణికులకు స్పైస్‌జెట్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.888 నుంచే డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య చేసే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. టిక్కెట్‌ బుక్‌ చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 28 అని పేర్కొంది. ఇటీవల ఇండిగో సంస్థ దేశీయ ప్రయాణాలకు తమ విమాన టికెట్ల ధరలు రూ.899 నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే.  

 

21:53 - October 26, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను విశాఖ పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. శ్రీనివాస్ స్నేహితుడు గిడ్డి చైతన్య, శ్రీనివాస్ బంధువు విజయదుర్గను పోలీసులు తీసుకున్నారు. 
గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై శ్రీనివాసరావు కోడిపందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

21:37 - October 26, 2018

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మహాకూటమి నేతలు చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీని ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో చెప్పాలని డీజీపి ఆదేశించారు. 
ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ప్రకటనలతో కూడిన ఫొటోలు పెట్టారన్న ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని రజత్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని రజత్ కుమార్ ఆదేశించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మహాకూటమి నేతలు నిన్న రజత్ కుమార్‌ను కలిసి తమ ఫోన్లు ట్యాప్ చేస్తూ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఈసీ దృష్టికి తెచ్చారు. ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. తమ భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గుతుందని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తానని రజత్ కుమార్ మహాకూటమి నేతలకు హామీ ఇచ్చారు. దానికనుగునంగానే ఇవాళ రజత్ కుమార్ రాష్ట్ర డీజీపికి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎందుకు జరుగుతోంది? ఇది నిజమేనా? కాదా? ఇంటెలిజెన్స్ అధికారులు దీని ద్వారా వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆయన లేఖ రాశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అలాగే ప్రభుత్వ ప్రకటనలు ముఖ్యమంత్రి ఫోటోల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్వే స్టేషన్లలోని ప్రతి కటౌట్‌పై ముఖ్యమంత్రి ఫొటోలు కొనసాగుతున్నాయని...ఇవ్వన్నీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించరాదని.. ఇది కూడా ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నేతలు చెప్పారు.

మీడియా సంస్థలు కూడా కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాటిలో జరిగే ప్రచారాన్ని కూడా వారి ఖాతాలో జమ చేయాలని.. పెయిడ్ ఆర్టికల్ గా పరిగణించాలని పలు ఫిర్యాదులు చేశారు. 

వీటన్నింటిపైనా ఈసీ రజత్ కుమార్ అధికారులతో సమావేశమై వాటి సాధ్యాసాధ్యాలు...ఏవి ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయి..? ఏవి రావు అనే అంశాలను పరిశీలించి..ఆయా డిపార్టుమెంట్లు రైల్వే, పోలీసులు డిపార్టుమెంట్లకు లేఖలు రాశారు. వారు ఇవ్వాలని కోరారు. రెండు రోజుల్లో వివరణ వస్తే, అది సంతృప్తికరంగా ఉంటే చర్యలు తీసుకుంటామని..లేదంటే వదిలి వేయడానికి అవకాశం ఉందని రజత్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. 

 

19:45 - October 26, 2018

అమరావతి: ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శుక్రవారం తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీవకుమార్ జిందాల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటించి నష్టాలను అంచనా వేసింది. 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడుతో కలిసిన బృంద సభ్యలు తుఫాను సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాను వల్ల రూ. 3,673 కోట్ల నష్టం సంభవించిందని సీఎం వివరించారు. దీనిపై స్పందించి తక్షణం  సహాయం అందించాల్సిందిగా కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు. 

 

 

19:28 - October 26, 2018

పట్నా: 2019 సార్వత్రక ఎన్నికల సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న జనతా దళ్ యనైటెడ్ (జేడీయూ) పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారయ్యింది. సమానంగా సీట్లు పంచుకోవాలని రెండు పార్టీలు శుక్రవారం నిర్ణయించాయి. నితీష్ కుమార్, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఈ మేరకు మీడియాకు పొత్తు వివరాలను ఢిల్లీలో వెల్లడించారు. 
అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు అన్నదానిపై త్వరలో ప్రకటన జారీ చేస్తామని అమిత్ షా తెలిపారు. 

 

 

18:45 - October 26, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ రావుకు కేజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. కాసేపట్లో పోలీసులు నిందితుడిని జడ్డి ముందు హాజరు పర్చనున్నారు. నిందితుడు శ్రీనివాస్ నుంచి మరో ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని విశాఖ సీపీ మహేంద్ర లడ్డా తెలిపారు. జగన్ పైన దాడి చేయాలనే నిందితుడు కత్తి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్ 9 సెల్స్, 9 సిమ్ కార్డులు మార్చినట్లు వెల్లడించారు. పది వేల కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. 

 

 

18:31 - October 26, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్...జగన్ ను పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో జగన్ ను పరామర్శించారని తెలిపారు. చంద్రబాబు సంబంధాలన్నీ రాజకీయ, ఆర్థిక సంబంధాలేనని విమర్శించారు. చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

 

17:20 - October 26, 2018

టర్కీ: రోడ్డు పక్కన నడిచివెళ్లేందుకు నిర్మించిన పేవ్‌మెంట్ కూడా ప్రమాదాన్ని కొనితెస్తుందని ఎవరూ ఊహించరు. టర్కీలో అదే జరిగింది. మాట్లాడుకుంటూ నడిచి వెళుతున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా కుప్పకూలిన పేవ్‌మెంట్‌తో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమయానికి జనం పోగయి వారిద్దరినీ రక్షించారు కాబట్టి సరిపోయింది. దగ్గరలోని ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్, నర్స్ కు భూమి మీద నూకలు ఉన్నయ్ కాబట్టి బతికి బట్టకట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వైరల్ అవుతున్న వీడియో మీరూ చూడండి!

17:17 - October 26, 2018

సమంత గతనెలలో యూటర్న్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, మజిలీ(వర్కింగ్ టైటిల్) మూవీలో నటిస్తుంది.. ఇప్పుడు సమంత చెయ్యబోయే కొత్త సినిమాకి సంబంధించిన అప్‌డేట్ తెలిసింది..  అలా మొదలైందితో దర్శకురాలిగా పరిచయమైన నందినీ రెడ్డితో శ్యామ్ ఒక సినిమా చెయ్యనుందనీ, ఆ సినిమా మిస్ గ్ర్యానీ అనే కొరియన్ మూవీకి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. సమంత ఈ సినిమాలో 70ఏళ్ళ బామ్మగా కనిపించనుందట. అందాల భామ బామ్మగానా? అని ఆశ్చర్యపోతున్నారా.. తన జీవితంలో జరిగిన అనూహ్యమైన సంఘటనల వల్ల, 70ఏళ్ళ బామ్మ కాస్తా 20 ఏళ్ళ అమ్మాయిగా ఎలా మారింది, బామ్మ, భామగా మారిన తర్వాత ఎలాంటి బాధలు పడింది అనేదే మిస్ గ్ర్యానీ కథ.. డిసెంబర్, లేదా, జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది..  

17:13 - October 26, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ పై దాడి డ్రామా అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో దాడి జరిగితే హైదరాబాద్ లో చికిత్స ఏంటీ ? అని ప్రశ్నించారు. దాడి తర్వాత గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం తప్పు అని అన్నారు. 

దాడిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని..దీన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవాలు ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యాయని తెలిపారు. మోడీ కనుసన్నల్లోనే ఇవన్ని జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేంద్రం కనుసన్నల్లో గవర్నర్ పని చేస్తున్నారనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు.

16:47 - October 26, 2018

గుంటూరు : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ ప్రాణాలకు ఇప్పుడే ముప్పొచిందా.. అని ప్రశ్నించారు. అస్పత్రికి వెళ్లేందుకే భయపడే నేత.. ప్రజలకేం సేవ చేస్తారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో జగన్ కు చీపురు పుల్ల కూడా గుచ్చుకోలేదన్నారు. 

 

16:39 - October 26, 2018

కార్తి, రకుల్ ప్రీత్ జంటగా, లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రజత్ రవి శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాకి దేవ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కార్తి సోదరుడు సూర్య, తన ట్విట్టర్ ద్వారా తమిళ్, తెలుగు ఫస్ట్‌లుక్ పోస్టర్లను రిలీజ్ చేసాడు.. ఈ పోస్టర్‌లో కార్తి, చేతిలో హెల్మెట్ పట్టుకుని, స్పోర్ట్స్‌ బైక్ దగ్గర నిలబడి, కాస్త కోపంగా చూస్తున్నాడు. తన ఫేవరెట్ క్రికెటర్ కపిల్ దేవ్ స్ఫూర్తితో, ఈ మూవీకి దేవ్ అనే టైటిల్ పెట్టినట్టు దర్శకుడు చెప్పాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గల్రానీ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. హేరిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నాడు. ఖాకీ తర్వాత కార్తి, రకుల్ ప్రీత్ కలిసి నటిస్తున్నారు. ఖాకీ , చినబాబు వంటి హిట్ సినిమాలతో జోరుమీదున్న కార్తి, దేవ్‌తో హ్యాట్రిక్ కొట్టే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న దేవ్ చిత్రం..తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది..   

16:26 - October 26, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి జరిగిన అనంతరం ప్రధాన పార్టీల మధ్య విమర్శలు..ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో జగన్‌పై దాడి చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. జగన్‌పై జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని..దీని వెనుక సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపణలు గుప్పించింది. జగన్ దాడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతరులు ఖండించారు. దీనిపై గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ వివరణనిచ్చారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. కేంద్రంలో నుండి బయటకు రావడం..ప్రత్యేక హోదా..విభజన హామీలపై టీడీపీ గళం విప్పడంతో ఏపీ రాష్ట్రంపై ఐటీ దాడులు, సీబీఐ దాడులు..ఇతరత్రా వాటిని కేంద్రం చేయిస్తోందని తూర్పారబట్టారు. జగన్ దాడిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ రాష్ట్ర డీజీపికి ఎలా ఫోన్ చేస్తారని, గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలని పేర్కొన్నారు. 
ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీకి బయలుదేరాని బాబు నిర్ణయించుకున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ వేదికగా గళమెత్తాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై జాతియ స్థాయిలో పోరాడాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మద్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో బాబు పలు విషయాలను వెల్లడించనున్నారు. జగన్‌పై కత్తి దాడి..ఏపీలో ఐటీ దాడుల నేపథ్యంలో బాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరి మీడియా సమావేశంలో ఆయన ఎలాంటి అంశాలను వెల్లడిస్తారో వేచి చూడాలి. 

16:02 - October 26, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ లు దాఖలు అయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని...థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై సోమవారం విచారణ జరిపై అవకాశం ఉంది. మరోవైపు జగన్ కు సంఘీభావంగా హైకోర్టులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ పై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. జగన్ కు జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు. 

 

15:37 - October 26, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం ఆంధ్రా పార్టీ అని పొలిమేరల దాకా తరిమితే మళ్లీ కాంగ్రెస్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణాకు తీసుకువస్తోందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పల్లకి మోస్తున్నారని.. ఇది తెలంగాణకు సిగ్గుచేటని హరీష్ రావు అన్నారు.  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బల్లలు చరిచారు అని హరీష్ విరుచుకుపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్పుడు, ఇప్పుడూ వలసవాదుల పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు.
కొడంగల్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిని ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు ప్రసంగించారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపు తధ్యమని హరీష్ రావు అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి తాగు, సాగునీరు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని... ఈ నలభై రోజులు మీరు పార్టీ కోసం కష్టపడితే.. అరవై నెలలు మీ కోసం కష్టపడుతామని కార్యకర్తలతో హరీష్ పేర్కొన్నారు. 
మహాకూటమి గెలిస్తే తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందట అంటూ... అందులో ఒకటి సాగునీటి శాఖ అయితే మరొకటి హోంశాఖ అంటున్నారు. సాగునీటి శాఖను తీసుకొని టీడీనీ తెలంగాణను ఎండబెడుతుందని.. అలాగే హోంశాఖని తీసుకొని ఓటుకు నోటు కేసు నుంచి బయట పడాలని దేశం నాయకులు కుట్ర పన్నుతున్నారని హరీష్ విమర్శించారు. 

 

 

15:29 - October 26, 2018

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మెయిన్ లీడ్స్‌గా, ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో, అప్పారావు బెల్లన నిర్మించిన చిత్రం, వీర భోగ వసంత రాయలు.. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఉపశీర్షిక... ఎటువంటి చడీ చప్పుడూ లేకుండా ఈరోజు విడుదలైన వీర భోగ వసంత రాయలు ఎలా ఉందో చూద్దాం..
కథ : ఈ మూవీలో మొత్తం మూడు కథలు రన్ అవుతుంటాయి. ఒక పిల్లాడు మా ఇల్లు కనబడడం లేదని ఎస్.ఐ. వినయ్(సుధీర్ బాబు)కి కంప్లైంట్ ఇస్తాడు. ఒక వ్యక్తి క్రికెటర్స్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ని హైజాక్ చేసి, వాళ్ళని రిలీజ్ చెయ్యాలంటే 300మందిని చంపాలని షరతు విధిస్తాడు. అతణ్ణి కనిపెట్టడానికి దీపక్ రెడ్డి(నారా రోహిత్), నీలిమ(శ్రియ) ప్రయత్నిస్తుంటారు.  మరోపక్క హైదరాబాద్‌లో ఒక ముఠా అనాధలైన ఆడపిల్లలని వరసగా కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. అసలు ఇవన్నీ చేస్తుంది ఎవరు, పోలీసులు ఈ సమస్యలన్నిటినీ ఎలా సాల్వ్‌ చేసారు అనేది మిగతా కథ..


నటీనటులు & సాంకేతిక నిపుణులు :
దర్శకుడు చెప్పిన పాయింట్‌కి ఫ్లాట్ అవడం వలనే ఈ సినిమా ఒప్పుకున్నట్టున్నారు నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, ఇంకా శ్రీవిష్ణు.. వాళ్ళ ఇమేజ్‌ని పక్కన పెట్టి, ప్రేక్షకులకు మంచి ధ్రిల్లింగ్ మూవీ ఇద్దామనుకున్న వీరిని డైరెక్టర్ సరిగా వాడుకోవడంలో విఫలమయ్యాడు. రోహిత్, సుధీర్ బాబు కలిసి ఒక్క సీన్‌లో కూడా కనిపించరు. శ్రియ సిగరెట్లు కాల్చడానికి బాగానే కష్ట పడింది.. కొద్దోగొప్పో ఉన్నంతలో శ్రీవిష్ణు(వీర భోగ వసంత రాయలు)గా,కాస్త పర్వాలేదనిపిస్తాడు. అతని గెటప్ బాగుంది. దర్శకుడు  ఎంచుకున్న పాయింట్, స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోడానికే లేదు. సినిమాలో పాటలు లేకపోవడం ప్లస్ పాయింటే.. నిర్మాణ విలువల వల్ల మిగతా టెక్నికల్ టీమ్ కూడా సినిమాకి ఏరకంగానూ హెల్ప్ అవలేకపోయారు..


తారాగణం : నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీనివాస్ రెడ్డి, మనోజ్ నందం 


కెమెరా : వెంకట్, నవీన్ యాదవ్


సంగీతం : మార్క్ కె రాబిన్


ఎడిటింగ్ : శశాంక్ మాలి


నిర్మాత : అప్పారావు బెల్లన


కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఆర్.ఇంద్రసేన


రేటింగ్  :  1.5/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

15:17 - October 26, 2018

హైదరాబాద్ : సీబీఐలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సీబీఐ కార్యాలయాల దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధ్యతల నుంచి తప్పించడం, సెలవులపై పంపించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎం.నాగేశ్వర్ రావుకు బాధ్యతలు అప్పగించడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు.

రాహల్ గాంధీ అరెస్టు
సీబీఐ కార్యాలయం దగ్గరకు ర్యాలీగా వెళ్తున్న ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ గెహ్లాట్ సహా విపక్ష నేతలను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 

హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు అరెస్టు
హైదరాబాద్, అమరావతి, కోల్ కతా, లక్నో, బెంగళూరులలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలను చేపట్టింది. దీంట్లో భాగంగా హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయం దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. నిరసన తెలుపుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, సర్వే సత్యనారాయణతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీబీఐ కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై, రాఫెల్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

14:46 - October 26, 2018

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్న గులాబీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత పార్టీ మారనున్నారు. పార్టీ మారనున్నారనే సమాచారంతో ఆ నేతపై వేటు వేసింది. గజ్వేల్ మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర రహదారి అభివృద్ది సంస్థ ఛైర్మన్ తూంకుంట నర్సారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు టికెట్లను ఆశించారు. కానీ వారికి టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర నిరుత్సహాంలో మునిగిపోయారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ గత కొన్ని రోజులుగా నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం..కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఆయన సంప్రదించినట్లు తెలు్స్తోంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిసినట్లు...గురువారం రాత్రి కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతితో నర్సారెడ్డి భేటీ అయినట్లు సమాచారం. శుక్రవారం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు టాక్. అనంతరం నర్సారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. దీనితో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మెదక్ శాసనసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు సమాచారం. 

14:31 - October 26, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఆయన సతీమణి ఉపాసన...సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విశేషాలు...వారి కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వాటిపై పోస్టు చేస్తుంటారు. తాజాగా ఉపాసన ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోను చూసిన చెర్రీ అభిమానులు సంతోష పడుతున్నారు. 
ఆ ఫొటోలో ఉపాసన వెయిట్ తగ్గి కనిపిస్తోంది. 2012లో అపోలో హాస్పటిల్స్ అధినేత వారసురాలు అయిన కామినేని ఉపాసనకు...రామ్‌చరణ్‌కు పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉపాసన చాలా లావుగా ఉందనే విమర్శలు వచ్చాయి. 
గత కొన్ని రోజులుగా ఉపాసన ‘మిసెస్ సీ’... జిమ్‌లో వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలను కూడా పోస్టు చేసింది. ‘అదే శారీ... అదే నేను... ఎప్పుడు ఆనందమే, పాజిటివ్! కేవలం 14 కిలోలు తగ్గారు. శరీరం, మనసు, ఆత్మ! ’ అంటూ ఉపాసన పోస్ట్ చేసిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

14:22 - October 26, 2018

ఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మను శలవుపై పంపటాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టుచేసి స్టేషన్ కు తరలించారు. అంతకుముందు సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. శాంతియుతంగా తాము చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని అరెస్టయిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు.  రాహుల్ గాంధీ  చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. సీబీఐ కార్యాలయానికి రాహుల్ తదితరులు చేరుకోగానే వివిధ పార్టీల నాయకులు సైతం రాహుల్ తో కలిసి ధర్నాలో పాల్గోన్నారు.

Congress chief Rahul Gandhi

14:10 - October 26, 2018

ఢిల్లీ : నేటి తరం మహిళలు తమలో వున్న మల్టీ టాలెంట్ ను నిరూపించుకునేందుకు..ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకోసం వారు విభిన్న రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇప్పటివరకూ పురుషులు మాత్రమే వుండే క్రికెట్ రంగంలోకి వచ్చిన మహిళలు తమ ప్రతిభను చూపిస్తున్నారు. కానీ క్రికెట్ ఎంపైర్స్ గా మాత్రం పురుషులే వున్నారు. ఇప్పుడు ఈ విభాగంలో కూడా మహిళలు ఎంట్రీ ఇచ్చారు. తొలి మహిళా క్రికెట్ ఎంపైర్స్. వారే వృందా రటి, జనని.

ఒకరు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌... మరొకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అదే క్రికెట్‌. ఒకరు క్రికెట్‌పై పట్టుసాధిస్తే... మరొకరికి ఆ ఆట అంటే విపరీతమైన క్రేజ్‌. ఇప్పుడు... ఆ ఇద్దరూ క్రికెట్‌ రంగంలోకి వచ్చేశారు. అదీ మొదటి భారత మహిళా ఎంపైర్లుగా. ఇందుకోసం ఎన్నో పరీక్షలు పాసై... అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు వృందా రటి, జనని.
అంపైరింగ్ చేయటం అనుకున్నంత సులువు కాదు. చాలా ఏకాగ్రత, సునిశితమైన దృష్టి ఉండాలి. నిర్ణయం తీసుకోవడంలోనే అంపైర్‌ సామర్థ్యం తెలుస్తుంది. ఎంతో సునిశితంగా ఆటను, ఆటగాళ్ల కదలికలను గమనించాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సందర్భాను సారంగా క్షణాలలో నిర్ణయం తీసుకోవాలి. లేదంటే క్రికెట్ లో ఆటగాళ్ల తలరాతలు మారిపోతాయి. దేశాల క్రికెట్ చరిత్రలు తిరగబడిపోతాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ మ్యాచ్‌లో అంపైర్‌గా ఎంపిక అవ్వడానికి కూడా అర్హత పరీక్షలు ఉంటాయి. వాటిని సాధిస్తేనే అవకాశం వస్తుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటు సమస్యలను అధిగమించుకుంటు ఎంపైర్ స్థానాన్ని అంది పుచ్చుకున్నారు వృందా రటి, జననిలు. వీరే తొలి మహిళా ఎంపైర్స్. 

-మైలవరపు నాగమణి

14:09 - October 26, 2018

హైదరాబాద్  : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఐదు రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు యువకుడు చేసిన దాడిలో జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన జగన్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. కోళ్ల పందాల్లో వాడే కత్తితో దాడి చేయడంతో జగన్ భుజానికి గాయమైంది. దీనితో వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం 9 కుట్లు వేశారు. 
శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ కావడంతో జగన్ ఆసుపత్రికి బయటకు వచ్చారు. అప్పటికే ఆసుపత్రి వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా మోహరించారు. జగన్ వారికి అభివాదం చేసి లోటస్ పాండ్‌లోని నివాసానికి జగన్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో జగన్ చేపడుతున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలున్నాయి. 
జగన్‌పై దాడి జరిగిన అనంతరం టీడీపీ..వైసీపీ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇదంతా ఒక డ్రామా అని..కేంద్రం ఆడిస్తున్న నాటకంలో భాగమేనని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌పై దాడిని పలువురు నేతలు ఖండించారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యురాలు కవిత, మంత్రి తలసాని సహా పలువురు ప్రముఖులు ఖండించారు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. 

13:52 - October 26, 2018

ఢిల్లీ: సీబీఐలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీకి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. దయాళ్ సింగ్ కాలేజీనుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ వరకు జరిగిన ర్యాలీలో రాహుల్ తో పాటు భారీసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సీబీఐ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. శలవుపై పంపిన అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేశారు.సంస్ధ ప్రతిష్టను దెబ్బతీశారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈనిరసన ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ మద్దతు తెలిపాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సీబీఐ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు  చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి 300 మీటర్లదూరంలోబారికేడ్లు ఏర్పాటు చేసి నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. సీబీఐ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలు ఢిల్లీ పోలీసులు భారీ స్ధాయిలో మోహరించాయి.  చంఢీఘడ్ లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు  వాటర్ కానన్ లు ప్రయోగించారు. 

13:47 - October 26, 2018

తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై, టి.జి.త్యాగరాజన్ సమర్పణలో, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న మూవీ, విశ్వాసం.. నయన తార హీరోయిన్. డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. విశ్వాసంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు విశ్వాసం సెకండ్‌లుక్ విడుదల చేసింది మూవీ‌ యూనిట్.. సాధారణంగా సాల్ట్‌ అండ్ పెప్పర్ లుక్‌లో ఉండే అజిత్, బ్లాక్ హెయిర్, గెడ్డంతో, బైక్‌పై ఉన్నలుక్ బాగుంది. హెల్మెట్ పెట్టుకుని, రెండు చేతులు పైకెత్తి అభివాదం చేస్తున్నాడు తల.. అతని వెనక జనాలందరూ పరిగెత్తడం చూస్తుంటే, ఈ సన్నివేశం పాటలో వస్తుందేమో అనిపిస్తుంది. కోవై సరళ, తంబి రామయ్య, వివేక్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్న విశ్వాసం, 2019 సంక్రాంతికి  గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

13:26 - October 26, 2018

ఉత్తరప్రదేశ్ : బ్రిటీష్ బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న భారతావని ఆగస్టు 15 1947న స్వాతంత్ర్య ఫలాలు అందుకుంది. దీంతో భారతదేశం స్వతంత్ర్యంగా ఎదుగుతోంది. కానీ బ్రిటీష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకుండా వుంటే బాగుండేదనీ..కనీసం మరో 100 సంవత్సరాలు పరిపాలించి వుంటే బాగుండేదని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
బ్రిటీష్‌ పాలకులు ఇImage result for ambedkarప్పటి వరకు మన దేశాన్ని పాలించి ఉంటే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమగ్రాభివృద్ధి సాధించే వారని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లు వారి పాలనా కాలం కొనసాగి ఉంటే బాగుడేందన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ధరంవీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశానికి అంబేడ్కర్‌ వంటి దళిత నాయకుడు లభించాడంటే అది బ్రిటీష్‌ వారి పుణ్యమే. 
ఇప్పటి లాంటి పాలకులు ఉండి ఉంటే ఆయనకు ఏ పాఠశాలలోనూ కనీసం చదువుకునేందుకు సీటు దొరికేది కాదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించే అవకాశం ఉండేది కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. Image result for august 15 freedom fighters

ధరంవీర్‌ వ్యాఖ్యలపై విపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహానుభావులు చేసిన త్యాగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా ఆయనకు ఆంగ్లేయులపై అభిమానం ఉంటే బ్రిటన్‌ శరణార్థిగా ఉండాలని సూచించారు.
 

12:59 - October 26, 2018

విశాఖపట్నం :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి మహిళా స్పీకర్ గా వ్యవహరించిన ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన ఆమె... తట్టుకోలేక, స్పృహ తప్పి పడిపోయారు. ఇదే సమయంలో ఆమె గుండె పోటుకు గురయ్యారు. దీంతో, ఆమెకు డాక్టర్లు హుటాహుటిన చికిత్సను ప్రారంభించారు. గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985 మరియు 1994 లోనూ మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ ఆమె  పనిచేశారు. 
 

12:34 - October 26, 2018

అమరావతి: నేరప్రవృత్తి కలిగిన వారు రాజకీయాల్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న 2వరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి, నక్సలైట్ల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ నాయకులు దాడులకు పాల్పడితే పోలీసులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ఆందప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడిగితే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జగన్ తో కుమ్మక్కై రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకా ఐటీ దాడులు జరుగుతాయని, ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చంద్రబాబునాయుడు అన్నారు. ఐటీ దాడుల వల్ల వ్యాపారస్తులు  భయపడి పోతున్నారని, అభివృధ్దిని అడ్డుకునే పనులు సమాజానికి పనికిరావని ఆయన అన్నారు.  
గురువారంనాడు  విశాఖ విమానాశ్రయంలో  ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగితే గవర్నర్ తనను అడగకుండా నేరుగా డీజీపీ తో మాట్లాడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ల వ్యవస్ధ వలన ఎటువంటి ఉపయోగం లేదని తాను చాలా ఏళ్లుగా చెపుతున్నానని, గవర్నర్లు కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ "గరుడ" అన్నప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదని, అందులో భాగంగానే నిన్న జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగిందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో దేవాలయాల వద్ద దాడులు చేసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్నేళ్లుగా  రాజకీయాల్లో ఉన్నానని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఇక ఎవరి ఆటలు సాగనివ్వను అని ముఖ్యమంత్రి  ధీమాగా చెప్పారు.  

12:19 - October 26, 2018

రాజస్థాన్ : మహిళల విషయంతో తనకో కోరిక వుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. మహిళా ఓటు బ్యాంకులతో అధికారంలోకి వస్తున్న పార్టీలంతా మహిళల కోసం అది చేస్తాం ఇది చేస్తామంటు బీరాలు పలుకుతుంటారు. కానీ మహిళలకు చట్ట సభలకు పంపించేందుకు మాత్రం ఏ పార్టీలు ముందుకు రావు. రాహుల్ గాంధీ మాత్రం  మాట్లాడుతు..కేవలం చట్ట సభలే కాదు రాజ్యాధికారంలో కూడా మహిళలే వుండాలంటున్నారు. అంతేకాదు దాని కోసం తాను కృషి చేస్తానంటున్నారు. పార్టీ పదవుల్లో ఆడాళ్లకు పెద్ద పీట వేయాలని తాను నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సగం మంది ముఖ్యమంత్రులు ఆడాళ్లు ఉండాలన్నదే తన కోరిక అన్నారు. ఇప్పటికి ఇది సాధ్యం కాకపోయినా వచ్చే అయిదారేళ్లలో దీనికి సాకారం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 

Related imageరాజస్ధాన్ మహిళా కాంగ్రెస్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ గురువారం మాట్లాడుతు..ఆడాళ్లను ఇళ్లకే పరిమితం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఆరెస్సెస్ సమావేశాల్లో ఒక మహిళ కూడా కనిపించదన్నారు. బీజేపీకి మహిళా విభాగం ఉన్నప్పటికీ అందులో నిర్ణయాలు తీసుకునేది మగవారేనన్నారు. రాజస్ధాన్ లో బీజేపీకి మహిళా సీఎం ఉన్నా, ఆమె తీసుకొనే నిర్ణయాలన్నీ మగవారికే అనుకూలంగా ఉంటాయన్నారు. పార్టీ పదవుల నియామకం విషాయానికొస్తే ఆడవారి తరపునే తాను ఉంటానన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ దశలను దాటుకుని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది ఆడాళ్లనే పోటీకి పెట్టాలని తాను నిర్ణయించుకుంటున్నట్లు రాహుల్ చెప్పారు. ఆడాళ్లు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది అపోహ మాత్రమేనని రాహుల్ అన్నారు.
 

11:55 - October 26, 2018

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి రాజకీయ రంగు పులుముపుకుంది. టిడిపి..వైసీపీ మధ్య తీవ్ర విమర్శలు పెల్లుబికుతున్నాయి. వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంపాలని ప్రయత్నం చేస్తే విఫలమైందని..కనీసం ఆసుపత్రిలో ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే అది కూడా విఫలం కావడం బాబులో బాధ కనిపించిందన్నారు. మర్డర్ జరిగినా..దాడి జరిగినా ఎక్కడైనా ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చని..ఆసుపత్రికి వెళ్లవచ్చని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందన్నారు. మంత్రి యనమల కేవలం పన్ను పీకించుకోవడానికి ఎక్కడకో వెళ్లి ప్రజాధనం రూ. 3 లక్షలు ఖర్చు పెట్టారని..ఎందుకు అక్కడకు వెళ్లడం..ఆంధ్రలో పన్ను పీకే వారు లేరా ? అంటూ ప్రశ్నించారు. బాబు మాత్రం ఆంధ్రలో ఉంటూ వారి కుటుంబాన్ని హయత్ హోటల్‌లో ఉంచుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించారని తెలిపారు. 
జగన్ అభిమానం ఉండే వారు..ప్రాణాలు తీసుకుంటారు కానీ...నాయకుల ప్రాణాలు తీయరని తెలిపారు. బాబు రక్తంతాగే నరరూప రాక్షసుడని ఆయన ప్రెస్‌మీట్ చూస్తే అర్థమౌతుందన్నారు. దాడి జరిగిన అనంతరం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ నేరుగా ఇంటికి వెళ్లడాని బాబు ఆరోపించారని..ఇది నిరూపించాలని రోజా సవాల్ విసిరారు. 

11:54 - October 26, 2018

ఢిల్లీ : సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై  నమోదు ఐన ఆరోపణలపై 2 వారాల్లోగా  విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు  ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తీసివేస్తూ శలవు పై పంపడాన్నిసవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ  చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. విచారణకు మూడు వారాల గడువు కావాలన్న సీవీసీ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.  సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీవీసీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.  అలోక్ వర్మ స్దానంలో నియమితులైన ఎం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, కేవలం పరిపాలనా పరమైన వ్యవహారాలను మాత్రమే చూడాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై నేటి నుంచి రెండు వారాల్లోగా ఎంక్వయిరీ పూర్తి చేయాలని సీజే స్పష్టం చేస్తూ, కేసు తదుపరి విచారణను నవంబర్ 12 కు వాయిదా వేశారు. 

11:43 - October 26, 2018

విశాల్ హీరోగా, ఎన్.లింగుస్వామి డైరెక్షన్‌లో, పందెంకోడికి సీక్వెల్‌గా రూపొందిన పందెంకోడి2 దసరా కానుకగా, తెలుగు, తమిళ్‌లో భారీగా రిలీజ్ అయింది. హీరోగా విశాల్‌కి 25వ చిత్రం ఇది.. రాజ్ కిరణ్, కీర్తిసురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రధానతారాగణంగా తెరకెక్కిన పందెంకోడి2 మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుటుంది. పందెంకోడి2 ఫస్ట్ వీకెండ్(నాలుగు రోజుల) కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి.. 
నైజాం: 1.42 కోట్లు, సీడెడ్: 1.28 కోట్లు, నెల్లూరు:‌ 0.19 కోట్లు,  కృష్ణ: 0.36 కోట్లు, గుంటూరు: 0.54 కోట్లు, తూర్పుగోదావరి: 0.29 కోట్లు, పశ్చిమగోదావరి: 0.29 కోట్లు, ఉత్తరాంధ్ర: 0.68 కోట్లు... టోటల్ షేర్: 5.05 కోట్లు.. ఇవి, ఆంధ్ర, తెలంగాణలో పందెంకోడి2 వసూలు చేసిన నాలుగు రోజుల షేర్ వివరాలు... 

 

11:42 - October 26, 2018

ఢిల్లీ : టెక్నాలజీ అరచేతిలో కొచ్చేసింది. సామాన్యుడి చేతిలో శివతాండవం ఆడుతున్న సోషల్ మీడియాలో ఒకటైన ఫేస్ బుక్ ఇప్పుడు అందిరి చేతుల్లోను హల్ చల్ చేస్తోంది. క్లాస్ బుక్ లేకున్నా ఫేస్ బుక్ మాత్రం కంపల్సరిగా వుంటోంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఫేస్ బుక్ కు గ్రేట్ బ్రిటన్ చుక్కలు చూపించింది. 

Image result for The Crambridge Analytical Scamకేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం బహిర్గతంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రజల అనుమతితో పనిలేకుండా ఫేస్‌బుక్‌ 2007 నుంచి 2014 వరకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా, ఇతర యాప్‌ డెవలపర్లకు అందించిందని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ దర్యాప్తులో తేలింది.దీంతో ఫేస్‌బుక్‌కు బ్రిటన్ భారీ జరిమానా విధించింది. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఫేస్‌బుక్ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అందించిన కారణంగానే ఈ భారీ జరిమానాను విధించింది. చట్టంలోని గరిష్ట పరిమితి మేరకు ఐదు లక్షల పౌండ్లు, డాలర్లలో చెప్పాలంటే.. 6.44 లక్షల డాలర్ల జరిమానా విధించింది.
 

11:36 - October 26, 2018

ఢిల్లీ : బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ సతీమణి, డచెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్...వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆమె చేసిన చిన్న తప్పిదం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. భర్త ప్రిన్స్ హ్యారీతో కలిసి మేఘన్... ఫిజి నుంచి టోంగాలోని ఫామోటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లారు. స్థానిక గాయకులు పాటలు పాడుతూ వారిని ఆహ్వానిస్తుంటే... రెడ్ కార్పెట్‌పై మేఘన్ హుందాగా నడుస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం గర్భవతి అయిన మేఘన్ ఎరుపు రంగు డ్రెస్ ధరించారు. అయితే డ్రెస్‌ను ధరించే సమయంలో రేట్ ట్యాగ్ తీయడం మర్చిపోయారు. ఆమె నడుస్తున్నప్పుడు వెనకవైపు మోకాలి కింది భాగంలో అది ఊగుతూ కనిపించింది. దీంతో కెమెరా కళ్లన్నీ అటువైపు తిరిగి క్లిక్ మనిపించాయి. రెడ్ ఫ్లోరల్ డ్రెస్ అయిన దాని ధర 444 అమెరికన్ డాలర్లు. ఫిజి నుంచి గంటపాటు ప్రత్యేక విమానంలో ప్రయాణించి టాంగో చేరుకున్న మేఘన్ ఒక్కసారి కూడా తాను ధరించిన అవుట్ ఫిట్‌కు ట్యాగ్ ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. 

11:22 - October 26, 2018

కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొని, వారిపై దౌర్జన్యం చేసిన ఆందోళనకారులను కేరళ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దాడులు చేసిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు...ఇప్పటి వరకు 15వందల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరో 210 మంది ఆందోళనకారుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిపై లుక్‌-అవుట్‌ నోటీసులు జారీచేశారు. ఆందోళనలకు సంబంధించిన వీడియో పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, వారిని పట్టుకొనే ప్రకియ్రను మరింత వేగవంతం చేశారు. అరెస్టులతో కేరళలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

11:19 - October 26, 2018

ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్): దొంగలు విజృంభించారు. తుపాకులతో వచ్చిన 25 మంది దుండగులు 18 గేదలను లారీలలో ఎక్కించుకొని పరారయ్యారు. వీటి విలువ రూ 20 లక్షల పైమాటే. ఈ సంఘటన మజఫర్‌నగర్ జిల్లాలోని రత్నాపురి అనే గ్రామంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. 
దుండగులు డైరీ ఫామ్ నడుపుతున్న నరేష్ కుమార్‌ అతని కొడుకు మోహిత్‌పై తుపాకీ గురిపెట్టి రెండు లారీల్లో బర్రెలను తరలించినట్టు పోలీసులు తెలిపారు. 
దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఠాణా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. సీనియర్ పోలీసు అధికారులు వచ్చి హామీ ఇచ్చిన తరువాత వారు పోరాటం నిలిపేశారు. బర్రెల దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
 

 

11:13 - October 26, 2018

కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు అందించే పరిహారంపై ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రక‌టించిన పరిహారం అందించేందుకు ఇన్నాళ్లు కోడ్ అడ్డువ‌చ్చింది. మాన‌వ‌త్వం కోణంలో ప‌రిగ‌ణించిన సీఈసీ ఎట్టకేలకు పరిహారం అందించేందుకు అనుమ‌తినిచ్చింది. ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన జగిత్యాల జిల్లా కొండగట్టు సంఘటన జరిగి 45  రోజులు దాటింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గానీ.. క్షతగాత్రులకు గానీ ఇంత వరకు పరిహారం అందించలేదు ప్రభుత్వం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు రెండున్నర లక్షలు ప్రభుత్వం తరుపున సాయం అందిస్తామని సంఘటన స్ధలాలనికి వెళ్ళిన మంత్రులు, అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్కరికి కూడా పైసా రాలేకపోవడంతో ఇది రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే కొండగట్టు ప్రమాదం సెప్టెంబర్ 11న జరిగింది. అప్పటికి తెలంగాణలో ప్రభుత్వం రద్దై ఐదు రోజులు అయ్యింది. అంటే సెప్టెంబర్ 6న కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  నష్ట పరిహారం చెల్లింపుపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే తెలంగాణ ప‌ర్యట‌న‌లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర అధికారులు చర్చించి ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

11:01 - October 26, 2018

హైదరాబాద్ :  బీజేపీ అనుబంధ యువజన విభాగమైన బీజేవైఎం హైదరాబాద్ వేదికగా భారీ సదస్సు నిర్వహించబోతుంది. ఈ సదస్సుకు విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్ పేరును ఖరారు చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముగింపు కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారు. ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరయ్యేలా యువమోర్చా వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక యువమోర్చాలో మండలస్థాయి అధ్యక్షుడు, ఆపై స్థాయి నేతలు కలిపి అన్ని రాష్ట్రాల నుంచి 40వేలకు మందికి పైగా హాజరవుతారని బీజేవైఎం వర్గాల సమాచారం. ఈ సదస్సులో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్య కల్పనకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, యువతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించనున్నట్లు తెలుస్తోంది. 

10:59 - October 26, 2018

విశాఖపట్నం : జగన్ పై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే కొన్ని పోలీసు కేసులు నమోదయ్యాయి. నిందితుడిని ఘటన వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత, శ్రీనివాసరావుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 అంటే హత్యాయత్నం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై ప్రేమతో చదువును  పదో తరగతితోనే  దూరం పెట్టిన శ్రీనివాసరావు కూలీ పనులు చేసుకునే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. దీంతో పలు గొడవలకు, ఘర్షణలకు పాల్పడుతుండేవాడని సమాచారం. గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా ఇవన్నీ పోలీస్ విచారణలో వెల్లడికావాల్సి వుంది. కాగా జగన్ పై దాడిని నిరసిస్తు వైసీపీ నేడు నిరసనలను వ్యక్త పరుస్తు ధర్నాలు, ర్యాలీలు చేపట్టింది. కాగా దాడికి గురైన జగన్ మాత్రం పెద్దగా ఏమీ మాట్లాడకపోవటం గమనించాల్సిన విషయం. ఈ దాడిపై పలు పార్టీలు పలు విధాలుగా అభిప్రాయాలను వ్యక్తపరుసస్తున్నాయి.
 

10:53 - October 26, 2018

విశాఖపట్టణం : నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా ? స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో నిందితులను పోలీసులు గుర్తించలేక పోతున్నారా ? పోలీసులు, రెవెన్యూ, ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది మధ్య సమన్వయలోపం కొనసాగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్న సీఎం, నేడు జగన్‌పై దాడి చూస్తోంటే.. ఎయిర్‌పోర్టులో భద్రత డొల్లతనాన్ని తెలియజేస్తోంది. 
విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రతా వ్యవస్థ మరోసారి విఫలమైంది. తన డొల్ల తనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత మరోసారి  చర్చనీయాంశమైంది. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఆయనపై శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్‌ భుజానికి తీవ్ర గాయమైంది. దాడికి పాల్పడిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఓ క్యాంటీన్‌లో పనిచేస్తోన్న వెయిటర్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
జగన్‌ విషయం కాసేపు అటుంచితే....ఇదే  ఎయిర్‌పోర్టులో కొన్ని నెలల క్రితం ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ వింత పరిస్థితి ఎదురైంది. విశాఖలో జరిగిన ధర్మపోరాట సభ ముగించుకుని ఎయిర్‌పోర్టుకు వచ్చిన చంద్రబాబు దగ్గరికి ఓ సాధారణ నేరస్తుడు నేరుగా వెళ్లాడు. వెళ్లిన వాడు ఊరికే ఉన్నాడా అంటే లేడు. ఏకంగా చంద్రబాబుకే ఆశీర్వచనాలు అందించాడు. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి...  స్వామీజీ అవతారం ఎత్తి సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం అందించాడు.  ఈ ఘటన విశాఖ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే జరిగింది. ఓ పాతనేరస్తుడు స్వామీజీ అవతారంలో ఆశీర్వచనం అందించడం అప్పట్లో పెను దుమారం రేపింది. 
ఈ రెండు ఘటనలకు విశాఖ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజే వేదికైంది. వీఐపీలు ప్రవేశించే లాంజ్‌లోనే ఈ పరిస్థితి ఎదురైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో నిఘా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ రెండు ఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. వీఐపీల పరిస్థితే ఇలా ఉంటే..ఇక మామూలు ప్రయాణీకుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. వరుసగా పలు ఘటనలు జరుగుతున్నా.. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్పటికప్పుడు ఏదో హడావుడి చేయడం ఆ తర్వాత మరచిపోవడం సర్వసాధారణమైపోతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే నిఘా వ్యవస్థ నిద్రపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడుతోంది. ఎయిర్‌పోర్టులోకి కత్తులను ఎలా అనుమతిస్తారు? దాడి జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తోందన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఎయిర్‌పోర్టులో భద్రత మాది కాదంటే మాది కాదంటూ ఇటు పోలీసులు... అటు సీఐఎస్‌ఎఫ్‌ వాళ్లు వాదులాడుకుంటోంటే.. నేరస్తులు నైస్‌గా నేతలను టార్గెట్‌ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా విమానాశ్రయ భద్రతా విభాగం మేల్కోవాలని 

10:50 - October 26, 2018

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రోబోకి సీక్వెల్‌గా రూపొందుతున్న మూవీ, రోబో 2.ఓ. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు. అమీ జాక్సన్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌నిర్మించింది. ఏ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన పాటలకి, ఇటీవల విడుదల అయిన టీజర్‌కి స్పందన బాగుంది. ముందుగా దీపావళి నాడు రోబో 2.ఓ. ధియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, పండగకి అయిదారు రోజుల ముందే, అంటే, నవంబర్ 3న రోబో 2.ఓ.  ట్రైలర్‌ని రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ లెక్కన దీపావళికి ముందే ట్రైలర్ ద్వారా, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెప్పబోతున్నారన్న మాట.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమవడం వల్ల పలుమార్లు వాయిదా పడిన  రోబో 2.ఓ. నవంబర్ 29న గ్రాండ్‌గా విడుదలవబోతోంది. రజనీ మరో సినిమా పేట్టా సంక్రాంతికి రిలీజ్ కానుంది..

10:31 - October 26, 2018

విశాఖపట్నం : ఏపీలో జరుగుతున్న కీలక పరిణామాలు ఆందోళగొలుపుతున్నాయి. నిన్న అంటే గురువారం నాడు  విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు రెండు రాష్ట్రాల్లోను తీవ్రంగా కలకల రేపింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు జగన్ వద్దకు సెల్ఫీ కోసమని వచ్చిన కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. జగన్ పై అభిమానంతోనే సానుభూతి పెరగాలని ఇలా చేసానని శ్రీనివాస్ తెలిపాడు. కానీ దీనిపై పలు అనుమానాలు రేకెత్తించేలా వున్నాయి శ్రీనివాస్ వ్యవహారాలు. Image result for jagan attack
పక్కా ప్రణాళికతోనే జగన్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం నిందితుడు కోడి పందేలకు వాడే కత్తిని ఓ తయారీదారు నుంచి కొనుగోలు చేసినట్లు స్థానికుడొకరు చెబుతున్నారు. ఈ సందర్భంగా తయారీదారుడు ‘ఇప్పుడు కోడి పందేలు లేవు.. కేవలం అవి సంక్రాంతి సీజన్ లో మాత్రమే ఆడతారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కత్తి కొనే సమయంలో శ్రీనివాస్ ను ఈ కత్తి నీకెందుకు?’ అని ప్రశ్నించాడని దానికి శ్రీనివాసరావు ‘నాకు ప్రత్యేకంగా పని ఉందని’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిరోజుల క్రితం శ్రీనివాసరావు సోదరుడు కుమార్తె పుట్టిన రోజును ఆ కుటుంబం ఘనంగా నిర్వహించిన సందర్భంగా శ్రీనివాసరావు తన స్నేహితులకు భారీగా పార్టీ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతటి ఆర్థిక స్థోమత లేని శ్రీనివాస్ అంత  భారీగా ఖర్చు చేయం పట్ల కూడా అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పై దాడిలో కుట్ర కోణం దాగుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10:30 - October 26, 2018

కరీంనగర్ : ఎన్నికల వేళ నగదు తరలింపుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినా కొందరు భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో లక్షలకు లక్షలు డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావాలని..తమ అభ్యర్థి..పార్టీ గెలవాలని ఓటర్లను ఆకర్షించేందుకు అక్రమాలకు తెగబడుతున్నారు. 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన  పోలీసులు...ఎలాంటి ఆధారాలులేని 22 లక్షల రూపాయలను పట్టుకున్నారు. హుస్నాబాద్‌లో నివాసం ఉండే అలిగివెల్లి కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి 20లక్షలు, గుర్రాల మహీపాల్  నుంచి 2లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్‌లోని రైల్వేస్టేషన్‌లో పోలీసులు విస్త‌ృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, బాంబ్ డిస్పోజుల్ స్వ్కాడ్‌లతో పో్లీసులు తనిఖీలు నిర్వహించారు. 

10:18 - October 26, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా....ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటి శుక్రవారం హైదరాబాద్‌కు వస్తోంది.  కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కసరత్తును గతనెల 10 నుంచి కొనసాగిస్తున్న ఈ కమిటీ.... అభ్యర్థుల ఎంపికను తుది ఘట్టానికి తీసుకురానుంది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్‌, సభ్యులు జ్యోతిమణి, శర్మిష్టముఖర్జీ.. అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఇవాళ పలువురు ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. పీసీసీ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనంతరం...  డీసీసీ అధ్యక్షులతో, అనుబంధ సంఘాల బాధ్యులతో సమావేశమై చర్చించింది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థి ఎవరనేది తెలుసుకుంది. అనంతరం ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యనేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు సీట్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన ఉండాలనే అంశాలను సేకరించింది. అభ్యర్థుల ఎంపిక తుది కసరత్తులో భాగంగా స్క్రీనింగ్‌ కమిటీ పార్టీ నేతలతో మరోమారు చర్చించనుంది. పీసీసీ ఎన్నికల కమిటీతో ఇప్పటి వరకూ వచ్చిన అభిప్రాయాలను వివరించనుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు తుదిరూపు తెచ్చేందుకు రాష్ట్ర నేతలతో చర్చించనుంది.

09:56 - October 26, 2018

ఢిల్లీ : వేసుకునే వస్త్రధారణను బట్టి మన వ్యక్తిత్వాన్ని, పనితనాన్ని, ఆలోచనలను అంచనా వేయవచ్చు. ఒకో రంగం, ఒకో విభాగం, పనిచేసే స్థాయిని బట్టి వస్త్రధారణ వుంటుంది. అది ఆంక్ష కాదు. కానీ చేసే పని, ఆ పనిచేసే వ్యక్తి వ్యక్తిత్వం, పనితనం వంటి పలు అంశాలు వస్త్రధారణతో తెలుస్తుంది. ఇది మానసిక విశ్లేషకులు సైతం తెలిపుతున్నారు. ఒక్కో రంగుకు ఒకో విధమైన కోణం వుంటుంది. ఆ రంగు పనిచేసే విధానాన్ని తెలియజేస్తుంది. శాంతికి చిహ్నంగా తెలుపు తెలిపితే..తిరుగుబాటుకు, ఉద్యమానికి ప్రతీకగా ఎరుపు వుంటుంది. అలాగే ఆసుపత్రుల్లో ఆకుపచ్చని రంగులతో కూడిన వస్త్రాలను మనం చూస్తుంటాం. అలాగే పనిప్రదేశాలను బట్టి వస్త్రధారణ వుంటుంది. ఈ నేపథ్యంలో వస్త్ర ధారణ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది అంటే వస్త్రధారణ విషయంలో ఆయా స్థాయిలు, పనులు ఆధారపడి వున్నాయనే విషయం గుర్తించాల్సి వుంది. 

Image result for Chief Secretary KM Josephసక్రమమైన వస్త్రధారణ లేకుండా కోర్టు విచారణకు వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి  రంజన్ గొగొయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం చీవాట్లు పెట్టింది.  విశ్రాంత న్యాయమూర్తులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారన్న అంశంపై విచారణ విషయంలో కోర్టు గతంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అరుణాచల్ ప్రదేశ్, గోవా సీఎస్ లు హాజరయ్యారు. వీరిద్దరూ తమ షర్ట్ లపై స్లీవ్ లెస్ జాకెట్లు ధరించి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎస్ ముదురు పసుపు రంగులో మెరిసిపోతున్న జాకెట్ వేసుకుని వచ్చారు. దీంతో రంజన్ గొగొయ్, ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్ ల ధర్మాసనం వారి వస్త్రధారణను ఆక్షేపించింది. కోర్టు ముందుకు సీఎస్ స్థాయిలో హాజరవుతున్న వేళ హుందాగా వస్త్రాలు వేసుకోవాలని హితవు పలికింది. వీరిద్దరూ చెప్పిందేదీ తాము వినబోమని ధర్మాసనం చెప్పడం గమనార్హం. 

-మైలవరపు నాగమణి

09:48 - October 26, 2018

హైదరాబాద్: కేంద్ర ఎన్నికలసంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతేదీ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105మంది అభ్యర్ధులను కూడా ప్రకటించింది. బీజేపీ మొదటి విడతగా 38మంది పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆపధ్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో సమావేశాలు నిర్వహించి వారికి ఎన్నికల్లో విజయం సాధించటంపై దిశానిర్దేశం కూడా చేశారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలోని 19 వార్తా చానళ్ల కార్యక్రమ ప్రసారాలపై ఎన్నికలసంఘం నిఘా పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని వారిలో ఒక్కోరికి 2వార్తాచానళ్ల భాధ్యత అప్పచెప్పింది. వీరు 19 తెలుగు వార్తా చానళ్లు 24 గంటలు ప్రసారం చేసే రాజకీయపార్టీల వార్తలను పరిశీలిస్తారు. వీరు రాజకీయపార్టీల ప్రచారంతో పాటు ఎన్నికల్లో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని రికార్డుచేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. వీటితోపాటు సోషల్ మీడియాలో వచ్చేవార్తా కధనాలను రికార్డుచేసి, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారి పైనా,ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపైనా నిఘాపెట్టి వారిపై కేసులుపెట్టి కఠినచర్యలు తీసుకోనుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించాయనే  ఫిర్యాదులు వస్తే వాటిని ఈసీ రికార్డు చేసిన వాటితో సరిపోల్చుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈప్రక్రియ వలన ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణి నిరోధించవ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది.

09:13 - October 26, 2018

ఢిల్లీ :  ప్రముఖ అంతర్జాల సంస్థ గూగుల్ కు ‘మీటూ’ సెగ పాకింది. ‘మీ టూ’ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా ఈ ఉద్యమానికి లేదు. అన్ని రంగాలలోను వుండేది మనుషులే కాబట్టి ‘మీటూ’ అన్ని రంగాలలను కుదిపేస్తోంది. కాకుంటే సెలబ్రిటీల ముసుగులో కొందరు చేస్తు వెర్రి మెర్రి వెకిలి చేష్టలు ఇకపై భరించబోమంటు ‘మీటూ’ అంటున్నారు నుటి అతివలు. ఇప్పటి వరకూ సిని పరిశ్రమ, బిజినెస్, రాజకీయాలు వంటి పలు కీలక రంగాలలో వుండే వేధింపులు వెలుగులోకి వచ్చాయి. కానీ వెలుగులోకి రానివి ఎన్నో ఎన్నెన్నో. ఈ నేపథ్యంలో ఏ రంగమైనా, ఎటువంటి వ్యక్తులైన వేధింపులను మాత్రం భరించబోమంటు గళమెత్తుతున్నారు అతివలు.  ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమ సెగ ఇప్పుడు గూగుల్‌కు పాకింది.

Image result for googleప్రపంచంలోనే అతి ప్రశాంతమైన పని ప్రదేశం అని పేరొందిన గూగుల్ లో కూడా ఈ సెగ తప్పలేదు. 48 మంది ఉద్యోగులపై లైంగివ వేధింపుల ఆరోపణల వేటు పడింది. వీరిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

08:41 - October 26, 2018

ఢిల్లీ : సీబీఐలో అంతర్గత ఆధిపత్య ధోరణితో సీబీఐ పరువు రోడ్డున పడింది. దీంతో అంతర్మధనంలో పడిన కేంద్ర ప్రభుత్వం పలు కీలక పరిణామాలు తీసుకుంటు మరింతగా అవినీతిని మూటకట్టుకుంటోంది. అవినీతి ఆరోపణలతో వీధిన పడిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అర్ధ రాత్రి హడావుడిగా విధుల నుంచి తప్పించేసింది. మరో అవినీతి అధికారి అనే ఆరోపణలు వున్న రాకేశ్ ఆస్థానాను కూడా తాత్కాలికంగా విధుల నుండి తప్పించి సెలవులపై పంపించివేసింది. దీనిపై ఇద్దరు కోర్టుకెక్కారు. ఈ నేపత్యంలో ఈరోజు అలోక్ వర్మ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్రటు విచారణ చేపట్టనుంది. తాను తప్పేమీ చేయలేదనీ..తనకు న్యాయం చేయాలని కోరుతు అలోక్ వర్మ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను అంగీకరించిన సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ ప్రారంభమైంది.  

Image result for vinith narayanaసుప్రీంకోర్టు ఎంత వరకు అలోక్ వర్మ అంశాలను ఆమోదిస్తుందన్న అనుమానం ఇప్పుడు బీజేపీ నేతలను తొలిచేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వినీత్ నారాయణ్ కేసులో ఎదురైన అనుభవమే ఎక్కడ ఎదురవుతుందోనని బీజేపీ  భయపడుతున్నారు. కాగా కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు సీబీఐలో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని తీర్పు నిచ్చింది.  అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కు పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయించింది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.  
 

08:19 - October 26, 2018

ఢిల్లీ: భారతదేశంలో  పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడి కి చెందిన రూ.255  కోట్ల విలువైన వస్తువులను, ఆభరణాలను గురువారం హాంకాంగ్ లో జప్తు చేసినట్లు  ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మనీలాండరింగ్ చట్టం కింద తాత్తాలిక ఉత్తర్వులను జారీ చేశారు.  ఈ విలువైన వస్తువులను నీరవ్  తన దుబాయ్ కంపెనీల నుండి 26 షిప్ మెంట్ ల  ద్వారా హాంకాంగ్కు ఎగుమతి చేసినట్లు ఈడీ గుర్తించింది. హాంకాంగ్ లోని ఒక లాజిస్టిక్ కంపెనీ గొడౌన్ లో ఈవిలువైన వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.  వీటి విలువ, ఎవరు,ఎవరికి రవాణా చేశారు మొదలైన వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరించామని ఈడీ  వెల్లడించింది.  ఆస్తుల జప్తుకు సంబంధించిన కోర్టు ఆదేశాలను త్వరలో హాంకాంగ్ పంపిస్తామని  ఈడీ అధికారులు తెలిపారు.  పీఎన్బీ ని మోసం చేసిన కేసులో నీరవ్ మోడి కి చెందిన  రూ.4,774 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటి వరకు జప్తు చేసింది. 
2018 ఫిబ్రవరి 14వతేదిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు 14 వేల కోట్ల మేర కుంభకోణం వాటిల్లిందని ఆ బ్యాంక్ ప్రకటించింది.  నీరవ్ మోడి, ఆయన మేనమామ మెహల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన బోగస్ ఎల్ఓయూలను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డారని బ్యాంకు తెలిపింది. అయితే బ్యాంకు ఈ ప్రకటన చేయడానికి నెల రోజులకు ముందే నీరవ్ మోడి దేశాన్ని విడిచి పారిపోయాడు. నీరవ్ మోడి పీఎన్బీని  13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

08:03 - October 26, 2018

చెన్నై : చూడగానే నవ్వుతెప్పించే ఆహార్యం ఆయన సొంతం. తన శైలిలో పండించే హాస్యం, మాట్లాడేతీరు, బాబీ లాంగ్వేజ్ వంటి పలు విధాల హాస్యంతో ప్రేక్షకులను రంజింపజేసిన హాస్య దిగ్గజం రమణారెడ్డి భార్య సుదర్శనమ్మ తన 93 ఏట గురువారం చెన్నైలో కన్నుమూశారు. రమణారెడ్డి 1974లోనే మరణించిన విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శనమ్మ నెలక్రితం ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఇంటివద్దే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. గురువారం సాయంత్రం స్థానిక టి.నగర్‌ వ్యాసర్‌ వీధిలో ఉన్న స్వగృహంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. 1952 నుంచి రమణారెడ్డి కుటుంబం ఇదే ఇంటిలో నివసిస్తోంది. రెండో కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో సుదర్శనమ్మ భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదర్శనమ్మ మృతికి చెన్నైలోని తెలుగు ప్రముఖులు, టీటీడీ స్థానిక పాలక మండలి పూర్వాధ్యక్షుడు ఆనందకుమార్‌ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

07:47 - October 26, 2018

అమరావతి : ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ బయటపెట్టిన ‘ఆపరేషన్‌ గరుడ’! నిజమేనా? బీజేపీ ఏపీపై పగ బట్టిందా? ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అనూహ్య పరిణమాలకు బీజేపీ గతంలోనే స్కెచ్ వేసిందా? ఏపీలో వరుస ఐటీ దాడులు, జగన్ పై దాడి, ఏపీకి నిధులు రాకుండా చేయటం, 2019 ఎన్నికల నాటికి అధికారంలో వున్న టీడీపీ పార్టీని నిర్వీర్యం చేయటానికి జరుగుతున్న కీలక కట్రలు వంటి పలు కీలక, అనూహ్య, తీవ్ర పరిణాలను బట్టి చూస్తే ‘ఆపరేషన్ గరుడ’ నిజమేనని సామాజిక మాధ్యమాల్లో వార్తలు, అభిప్రాయాలు, అనుమానాలు, ప్రశ్నలు నిజమనే నిరూపించేవిధంగా వున్నాయి.

Image result for operation garudaకాగా గతంలో మార్చి 22న శివాజీ చెప్పినట్లుగానే జరుగుతోంది. ‘ఇప్పటికే ఉన్న ముఖ్యమైన పార్టీ నాయకుడిపై ప్రాణ హానిలేని విధంగా దాడి జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. దీంతో... ఇప్పుడు జగన్‌పై దాడి ఆపరేషన్‌ గరుడలో భాగమేనని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు పలువురు పేర్కొన్నారు. నాడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘పసి బిడ్డలాంటి ఏపీని అతిదారుణంగా దెబ్బతీసేందుకు జాతీయ పార్టీ స్కెచ్‌ వేసేందుకు బీజేపీ యత్నిస్తుందనీ..అది ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవ్వరికి అనుమానం రాని విధంగా ఇవన్నీ జరుగుతాయని శివాజీ తెలిపిన విషయం తెలిసిందే. ఇవన్నీ అధికారంలో వుండే పార్టీని దెబ్బతీసే విధంగా వుంటాయని శివాజీ తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకుని మేలుకోవాల్సిన అవసరముందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు పోస్ట్ లు తెలుపుతున్నాయి. Image result for operation garuda
శివాజీ ఆపరేషన్ గరుడ మాటల్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు 
గతంలో హీరో శివాజీ ఆపరేషన్ గరుడలో భాగంగా విపక్షనేతపై హత్యాయత్నం జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ రాష్ట్రాన్ని తగులబెట్టాలని భావిస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Image result for jagan attackసీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం.. 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్‌ గరుడ లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు. ఇలా వచ్చేవారిలో ఒక కొత్త నాయకుడూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది. ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి’’ అని శివాజీ తెలిపిన విషయాన్ని అందరు గుర్తు చేసుకుంటున్నారు. మరి ‘ఆపరేషన్ గరుడ’ నిజమేనా..?!!

 

 
07:18 - October 26, 2018

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం గం.5-30 లకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో  సమావేశం ఆవుతారు.  ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్  అధ్యక్షతన గల వ్యవసాయ సంస్కరణల కమిటీ రూపొందించిన సిఫార్సులను ఆయన రాష్ట్రపతి కి అందచేస్తారు. నరసింహన్ వ్యవసాయ సంస్కరణల కమిటీ లో సభ్యులుగా ఉన్నారు.  
 

 

07:07 - October 26, 2018

ఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో వరో ట్విస్ట్. డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక అధికారి రాకేశ్ ఆస్థానాలను సెలవులపై పంపిన కేంద్రం 13మంది అధికారులపై రాత్రికి రాత్రే వేటు వేసింది. ఒక అధికారినైతే ఏకంగా అండమాన్ కు పంపివేసింది. అంతర్గత కుమ్ములాటలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం మరో కీలకమైన ప్రకటన చేసింది. అవినీతి ఆరోపణలపై సీవీసీ విచారణ పూర్తి చేసే వరకూ ఎం.నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ విధులు కొనసాగిస్తారని, అనంరం సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా కొనసాగనున్నారని సీబీఐ అధికార ప్రతినిధి గురువారం ప్రకటించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు నియామకం నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇదిలావుండగా, సీబీఐ డైరెక్టర్ స్థానం నుంచి తనను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణ జరపనుంది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అరుణ్ జైట్లీ సమర్థించారు. సీబీఐ సమగ్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 

 

Don't Miss