Activities calendar

27 October 2018

22:19 - October 27, 2018

హైదరాబాద్‌ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వాయిదా పడింది. పాదయాత్రను నవంబర్‌ 2కు వాయిదా వేశారు. మొన్నటి వరకు విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగింది. గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందేలకు వాడే కత్తితో దాడి చేశాడు. జగన్ భుజానికి గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు శస్త్రచికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్‌ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో జగన్ నవంబర్‌ 2 వరకు పాదయాత్రకు విరామం ప్రకటించారు. నవంబర్‌ 3 నుంచి విజయనగరం జిల్లాలో యథాతథంగా జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు.

 

21:57 - October 27, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఈఓ రజత్ కుమార్ హెచ్చరించారు. నామినేషన్ రోజు నుంచి అభ్యర్ధుల ఖర్చు వివరాలు సేకరిస్తామన్నారు. ప్రైవేటు సమావేశాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీల సమావేశాలు, శాంతిభద్రతల విషయంలో పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 59 ఫిర్యాదులు అందాయని అందులో 11 పరిష్కారమయ్యాయన్నారు. సోషల్ మీడియా పోస్టులు, పేయిడ్ మీడియా పై ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని రజత్ కుమార్ అన్నారు.

 

21:38 - October 27, 2018

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం దొంగలు బరితెగించారు. కూంబింగ్‌ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై రాళ్ళతో దాడి చేశారు. చంద్రగిరి మండలం భీమవరం సమీపంలోని ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లొంగిపోవాలంటూ హెచ్చరించిన పోలీసులపై స్మగ్లర్లు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి, 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రాళ్ళ దాడిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కోదండంకు గాయాలయ్యాయి. గాయపడ్డ అధికారిని ఆసుపత్రికి తరలించారు.

 

20:41 - October 27, 2018

ప్రకాశం : జిల్లాలోని ఒంగోలు చర్చి సెంటర్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లా కోర్సులో సీటు రాలేదని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన పోలీసులు, స్థానికులు విద్యార్థిని అడ్డుకున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థిని విచారిస్తున్నారు. 

 

19:41 - October 27, 2018

హైదరాబాద్ : ఎట్టకేలకు కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల కసరత్తును పూర్తి చేసింది. భారీ స్థాయిలో కసరత్తు చేసింది. నవంబర్ 1న టీకాంగ్రెస్ మేనిఫెస్టో, అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. మాజీ సైనికులకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గోల్కొండ హోటల్ లో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు, ఐదు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సైనికుల కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. మొత్తంగా రెబల్స్ రంగంలో ఉండకుండ కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంది.

 

19:03 - October 27, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో పత్రికల్లో, టీవీ చానెళ్లల్లో ప్రకటనలు ఇస్తూ బాబు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అధికారులను అడ్డు పెట్టుకొని అరాచకానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా డబ్బుల వరద పారుతోందన్నారు. 500 కోట్ల రూపాయలకు రాహుల్ గాంధీతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు విషయంలో ఖచ్చితంగా ఈసీ స్పందించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సంపాదించిన డబ్బు మూటలను తెలంగాణకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకుని.. పోలీసు వాహనాలు, అంబులెన్సుల ద్వారా డబ్బును ఇక్కడికి పంపిస్తున్నారని తెలిపారు. అధికార యంత్రాంగాన్ని, వారి ఇంటెలిజెన్సీ వ్యవస్థను ఇక్కడ మోహరించి, డబ్బును పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఏపీ అధికారులపై దృష్టి సారించాలని కోరారు. 

చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ ఎవరైనా సరే.. వారి వాహనాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వీరు రిపీట్ అఫెండర్స్ అని అన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఇన్నోవా కారులో 3 కోట్ల రూపాయలను దాచుకున్నారని ఆరోపించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఏం పని అని ప్రశ్నించారు. ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో తిష్ట వేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగంతో, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతూ ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. 

డీఎస్ పీ బోసు, తెలంగాణలో ఉండే ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డికి రెగ్యులర్ గా కాంటాక్టులో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వారిని కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మధ్య జరుగుతున్న అరాచకీయానికి అనుసంధాన కర్తలుగా రేవంత్ రెడ్డి, ఎల్.రమణలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో తాము ఆరోపించినట్లుగా ప్రస్తుతం ఇవన్నీ వాస్తవాలుగా తేలుతున్నాయన్నారు. వీటన్నింటిపైనా ఈసీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వీటిని ఈసీ ఉపేక్షిస్తే.. ఎక్కడైనా తమ కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై.. డబ్బు పంచుతూ ఎవరైనా దొరికితే వారిపై దాడులు జరిపితే దానికి తమ బాధ్యత కాదన్నారు. 

18:26 - October 27, 2018

హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేస్తున్న దంపతులు రమ్య, ప్రవీణ్ కుమార్ బైక్ వెళ్తున్నారు. గచ్చిబౌలిలో బైక్ వెళ్తున్న దంపతులను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భార్య రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ప్రవీణ్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

 

17:58 - October 27, 2018

విజయ్ దేవరకొండ నటించిన నోటా ఈ నెల 5న విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది.. ఫస్ట్‌డే టాక్‌తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే సరికి, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే చాన్స్ ఉంది అనుకున్నారు. కట్ చేస్తే, నోటా క్లోజింగ్ కలెక్షన్స్ మాత్రం ఊహించని షాక్ ఇచ్చాయి.. 23 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్మితే, ఫుల్‌రన్‌లో పది కోట్లు కూడా రాబట్టలేక పోయింది.. నోటా ఓవరాల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ లెక్కలు ఇలా ఉన్నాయి..
నైజాం: 3.42 కోట్లు, సీడెడ్: 1.05 కోట్లు, నెల్లూరు:‌ 0.32 కోట్లు, కృష్ణ: 0.53 కోట్లు, గుంటూరు: 0.60 కోట్లు, తూర్పుగోదావరి: 0.58 కోట్లు, పశ్చిమగోదావరి: 0.37 కోట్లు, ఉత్తరాంధ్ర: 0.82 కోట్లు... టోటల్, ఏపీ+తెలంగాణ షేర్ 7.69 కోట్లు. మిగతా ఏరియాలు 0.83 కోట్లు. ఓవర్సీస్ 1.30 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ షేర్  9.82 కోట్లు. ఈ లెక్కన నోటా డిస్ట్రిబ్యూటర్‌లకు 55 శాతానికి పైగా నష్టాలు వచ్చాయి..

 

17:23 - October 27, 2018

వివాదాల వర్మ.. సారీ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా తిరుపతి వెంకన్న సన్నిధిలో పూజలు చేసి, అందరికీ షాక్ ఇచ్చాడు. లక్షీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వర్మ, లక్షీ పార్వతితో కలిసి, ప్రసాదం తీసుకుని, గుళ్ళోనుండి బయటకు వస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.. నాస్తికుడైన వర్మ, సడెన్‌గా ఆస్తికుడిగా మారడంతో చాలామంది నెటిజన్‌లు కాస్త సరదాగా, ఇంకొంచెం కొంటెగా స్పందించారు..  దైవ దర్శనం చేసుకున్న నేపథ్యంలో, అతనిపై వచ్చిన ఒక కార్టూన్‌ని వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఆ కార్టూన్‌లో, మీ డూప్ గుళ్ళో కనబడ్డాడు అని వ్రాసి ఉంది.. అది చూసి నెటిజన్స్, ఓ.. ఆయన మీ డూపా? ఇంకా మీరేనేమో అనుకున్నాం గురువుగారూ.. అంటూ సెటైర్లు వేస్తున్నారు..

17:08 - October 27, 2018

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రక్తంలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన రక్తానికి సంబంధించిన రిపోర్టు వచ్చిందని తెలిపారు. శుక్రవారం ఆయన నివాసానికి వచ్చిన వైద్యులు మరోసారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు. 
జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకి గురువారం మధ్యాహ్నం వచ్చారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూర్చుని ఉండగా వెయిటర్ శ్రీనివాస్ జగన్‌పై కోళ్లపందాలకు వాడే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడికి పాల్పడిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్ రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌ది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. పోలీసులు శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం  కోర్టు ఇతనికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దాడి టీడీపీ..వైసీపీ మధ్య తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. 

 

16:55 - October 27, 2018

హైదరాబాద్ : బాహుబలిగా ముందస్తుకెళ్లిన కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పై కార్యకర్తల్లో, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల జీవితాలు కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నాయన్నారు. 

 

16:14 - October 27, 2018

హైదరాబాద్ : మహిళల భద్రతకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం వల్లే హైదరాబాద్ లో మహిళలు సురక్షింతంగా ఉన్నారని తెలిపారు. ఈమేరకు ఆయన తాజ్ డెక్కన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఐటీ రంగం, ఇండస్ట్రీలో మహిళలు అధికంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. షీ టీమ్ లాంటి కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని..ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. మహిళా భద్రతకు పెట్టపీట వేశారని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో కూడా కంపార్ట్ మెంట్ లైజ్ చేశారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే..హైదరాబాద్ లో కరెంటే ఉండదని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే స్వయం సమృద్ధిని సాధించామని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్ సమస్యను పూర్తిగా అధిగమించామని చెప్పారు. 

గతంలో హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రంగా ఉండేదని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య తీరిందన్నారు. హైదరాబాద్ లో 90 శాతం ప్రాంతాలకు నీటి సమస్య లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక గోదావరి జలాల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి.. హైదరాబాద్ లో 90 శాతం వాటర్ సప్లై సమస్య తీర్చగలిగామని పేర్కొన్నారు. కృష్ణా జలాలను నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేస్తున్నామని....గోదావరి జలాలను రామగుండం దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు వెంబడి అనుసంధానం చేసి హైదరాబాద్ లో శాశ్వతంగా నీటి సమస్యను తీర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. 

దేశంలో లాండ్ ఆండ్ అర్డర్ ముఖ్యమన్నారు. ఎవరైనా బయటి దేశం, వేరే రాష్ట్రం నుంచి కొత్త ప్లేస్ కు వస్తే... మొదటగా రెండు అంశాలను చూస్తారని.. రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్,..రెండోది అక్కడున్న పోలిసింగ్ ఎట్లా వుంది? అనే అంశాలను చూస్తారని చెప్పారు. కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే 300 కోట్ల రూపాయలకు పైగా పోలీసు డిపార్ట్ మెంటుకు ఇస్తే చాలా మంది ఆశ్చర్యపోయారని చెప్పారు. ప్రజలకు భద్రత కల్పించారు.

16:13 - October 27, 2018

ఢిల్లీ : తనపై రేపో..మాపో దాడి చేస్తారని...తాను భయపడనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేశారు. శనివారం ఆయన ఢిల్లీకి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం జాతీయ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా గత నాలుగున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను తెలియచేశారు. 
ఎన్డీయేతో విబేధించిన వెంటనే తమను వేధించడం మొదలు పెడుతున్నారని, తమిళనాడు తరహాలో ఏపీలో కుట్ర చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఢిల్లీ, బీహార్, పాండిచ్చేరిలో ప్రభుత్వాలను టార్గెట్ చేశారని వివరించారు. ఐటీ రైడ్స్ పేరిట ఏపీపై దాడి చేశారని, పెట్టుబడిదారులను భయపెట్టేందుకు ఐటీ దాడులు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.
తంలో గవర్నర్ ఎప్పడూ పరిపాలనలో జోక్యం చేసుకోలేదని వివరించారు.  కీలక పదవుల్లో గుజరాతీలే ఉన్నారన్నారు. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటీ ? అని ప్రశ్నించారు. ఇలా చేస్తుంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్నారు. ప్రధాని, పాలక పక్షం ఒకే రాష్ట్రం నుండి ఉండరాదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొనేసాగుతామన్నారు. 

16:00 - October 27, 2018

చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, రామకృష్ణా రెడ్డి సమర్పణలో, శేఖర్ రెడ్డి జీ.వీ.ఎన్. నిర్మిస్తున్న మూవీ.. ఏడు చేపల కథ.. శ్యామ్ జే చైతన్య దర్శకుడు.. అభిషేక్ హీరో.. బిగ్‌బాస్ భానుశ్రీ‌, అయేషా సింగ్‌తో పాటు మరికొంతమది లీడ్ రోల్స్ చేసారు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో రొమాన్స్.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలను మించిపోయింది. తన కోరికలను కంట్రోల్ చేసుకోలేని, ఆడవాళ్ళని చూస్తే, ఆత్రం ఆపుకోలేని, టెంప్ట్ రవిగా అభిషేక్ అదరగొట్టేసాడు.. ఇక ఫీమేల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ ఒకరిని మించి ఒకరు శృంగార రసం ఒలకబోసారు. టీజర్ చూసి, కుర్రాళ్ళు గుటకలు మింగుతున్నారు.. టీజర్‌కే ఇలా అయితే, ఇక ట్రైలర్, సినిమా చూస్తే ఏమైపోతారో? రిలీజ్ చేసిన తక్కువ టైమ్‌లోనే అక్షరాలా అయిదు లక్షల వ్యూస్ వచ్చాయంటే, టీజర్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోండి.. పనిలో పనిగా టీజర్‌పై ఓ లుక్కేసుకోండి.. 

15:48 - October 27, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. గత నాలుగేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇటీవలే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం పలు విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవలే ఏపీలో జరిగిన పరిణామాలను దేశ రాజధాని వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టే ప్రయత్నం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. 
ఏపీలో పునర్ విభజన చట్టం హామీలు నెరవేర్చలేదని, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉందన్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతు తీసుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. నేర చరిత ఉన్న పార్టీలకు మద్దతిస్తున్నారని, అందుకే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వ తీరువల్ల అవిశ్వాస తీర్మనం పెట్టడం జరిగిందన్నారు. 
రాష్ట్రాల మధ్య ప్రధాని సమస్యలు సృష్టిస్తున్నారని, కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారని, మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. చెప్పిన హామీలేవీ మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారని, రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. రైతుల ఆదాయన్ని ఎక్కువ చేస్తామన్నారు ఏమైందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 

15:27 - October 27, 2018

ఢిల్లీ : దేశ రాజధాని వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేశారు. శనివారం ఆయన ఢిల్లీకి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం జాతీయ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా గత నాలుగున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను తెలియచేశారు. 
ప్రతి అకౌంట్‌లో రూ. 15 లక్షల నగదు వేస్తామని చెప్పారని మరి ఆ నగదు ఏమైందని ప్రశ్నించారు. దేశంలో ఏమి జరుగుతోంది ? ప్రదానంగా ఏపీలో ఏం జరుగుతోందనే దానిపై వెల్లడించానికి తాను ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. బీజేపీ - ఎన్డీయే ఎన్నికలకు రాకముందు ప్రజాస్వామ్యం రక్షిస్తామని..దేశంలో ఉన్న రాష్ట్రాలను బలోపేతం చేస్తామని..అవినీతిని అంతమొందిస్తామని..దేశాన్ని అభివృద్ధి దిశగా పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని...యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని..ఇలా అనేక హామీలిచ్చిందని తెలిపారు. 
ఎన్నికలకు ముందు అచ్చే దిన్ అంటూ హామీలిచ్చిందని..ఆ మంచి రోజులు ఎప్పుడొస్తాయని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ మనీ కోసం నోట్ల రద్దు చేస్తున్నామంటు పేర్కొన్నారని, కానీ బ్లాక్ మనీ ఎక్కడా అని ప్రశ్నించారు. అనంతరం రెండు వేల రూపాయల నోటును తీసుకొచ్చారని, తిత్లీ తుపాన్ కారణంగా రాష్ట్రంలో డబ్బు విషయంలో ఏర్పడిన సమస్యపై ఆర్బీఐతో మాట్లాడడం జరిగిందన్నారు. 

15:09 - October 27, 2018

ఢిల్లీ : ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఆ పార్టీలో అధిష్టానం చెప్పిందే వేదమన్నారు. టీఆర్ఎప్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను కేబినెట్ లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

15:07 - October 27, 2018

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఓ పది రోజుల అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని పేర్కొంటోంది. గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం..కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రయివేట్‌ కార్లు ప్రతిరోజూ రోడ్డుపై తిరిగే అవకాశం లేదు. నెంబర్‌ ప్లేట్‌ సరి బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు కారును బయటకు తీయాల్సి ఉంటుందని..పలు చర్యలు తీసుకుంది. 
తాజాగా నవంబర్ మాసం వస్తోంది. ఈ నెల నుండి దేశ రాజధాని విషవాయువులు మరింతగా వ్యాపించనున్నాయని తెలుస్తోంది. నవంబర్ మాసంలో వచ్చే దీపావళి పండుగ నేపథ్యంలో్ మరింత ఆందోళన నెలకొంది. పటాసులు కాలవడం..ఉన్న వాతావరాణానికి మరింత కాలుష్యం జోడయితే పరిస్థితి మరింత దిగజారనుందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది. బొగ్గు ఆధారంగా పనిచేస్తున్న థర్మల్‌ప్లాంట్‌ను సైతం మూసివేయాలని సూచించిందని తెలుస్తోంది. మరి ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

14:14 - October 27, 2018

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై  విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ చేయించాలనే డిమాండ్ తో ఆపార్టీకి  చెందిన ముఖ్యనేతలు ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో వారు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి జగన్ పై హత్యాయత్నం జరిగిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై వివరించనున్నారు. మొదటగా రాష్ట్ర గవర్నర్ ను  హైదరాబాద్ లో కలిసి ఢిల్లీ వెళ్లాలనుకున్నప్పటికీ, గవర్నర్ ఢిల్లీ పర్యటనలో  ఉన్నందున, గవర్నర్ తిరిగి వచ్చాక ఆయనకు కూడా వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈపర్యటనలో పార్టీకి చెందిన మాజీ ఎంపీలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్ధసారధి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వెళ్లనున్నారు.  ఢిల్లీ పర్యటన విషయంపై  ఈ మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది.

14:02 - October 27, 2018

న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపడింది. సిరియా కంటే పాకిస్థాన్ మూడు రెట్లు టెర్రర్ రిస్క్ కలిగిఉన్న దేశమని.. పాకిస్థాన్ టెర్రరిస్టులకు స్వర్గధామం అని ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన  స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్ రూపొందించిన ‘‘హుమానిటీ ఎట్ రిస్క్ - గ్లోబల్ టెర్రర్ త్రెట్ ఇండికెంట్’’ అనే నివేదిక  తేల్చి చెప్పింది. 
1947లో భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత విడిపోయి ఏర్పడ్డ పాకిస్థాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారటంతోపాటు.. మానవజాతికే ప్రమాదకరంగా మారిన అండర్‌వరల్డ్ ఏజంట్లకు ఇది నిలయంగా మారింది.  
నివేదిక పేర్కొన్న అంశాలు ఇవే..

  • అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు, లష్కరే-ఈ- తాయిబా(ఎల్ఈటీ) సంస్థలు ప్రపంచ భధ్రతకు ముప్పుగా పరిణమిస్తే.. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాద మూలాలతో పాకిస్థాన్ వీటన్నిటి కంటే ఉగ్రవాద సురక్షిత ప్రాంతాలుగా ప్రధమ స్థానంలో నిలిచిన మాట వాస్తవం. Related image
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూపులను పరిశీలిస్తే.. పాకిస్థాన్ వాటిఅన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తోంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఆఫ్గనిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని నివేదిక వెల్లడించింది. 
  • ఏ రూపంలో పెరుగుతున్న ఉగ్రవాదమైనా.. సామూహిక మానవ వినాశనం కలిగించే ఆయుధాల దుర్వినియోగం, ఆర్ధిక అంతరాయాలు ఇప్పటినుంచి 2030 వరకు మానవజాతి అభివృద్ధికి, జాతి మనుగడకు ముప్పుకలింగించే ప్రమాదాలే. ఇవన్నీకూడా ఏదో రూపంలో ఉగ్రవాదానికి సంబంధించినవేనని నివేదిక హెచ్చరించింది.     
  • ప్రపంచంలో దాదాపు 200 గ్రూపులు మతం పేరుతో తమ తమ భావజాలాన్ని అమలు చేసేందుకు ఉగ్రవాదం అనే మార్గాన్ని ఎంచుకొని చెలరేగిపోతున్నాయని స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూపు తమ నివేదికలో పేర్కొంది. 
  • ఐస్ఐస్ లాంటి ఉగ్రవాద సంస్థలు మీడియా దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా పైకెదిగి కిందకు పడిపోయినా దీని ప్రభావం కొంతమేరకు ఉగ్రవాద నెట్‌వర్క్ మీద పడిందనీ.. అయతే ఆల్‌ఖైదా లాంటి సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయని నివేదిక తెలిపింది. 
  • ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం.. ఆల్‌ఖైదా ప్రభావం కొద్దిగా  తగ్గినప్పటికీ.. అతని కొడుకు హమాజా బిన్ ఒసామా బిన్ లాడెన్ ఉగ్రవాద సంస్థ బాధ్యతలు చేపట్టారని. అతన్ని అందరూ ‘‘ఉగ్రవాదానికే యువరాజు’’ అంటూ కీర్తిస్తూ నెత్తినపెట్టుకుంటున్నారిని రిపోర్ట్ పేర్కొంది. 


 

 

13:45 - October 27, 2018

ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్  పై  చేస్తున్న కక్ష సాధింపు చర్యలను జాతీయ మీడియాలో వివరించేందుకు ఢిల్లీ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలతో  ఏపీ భవన్ లో సమావేశం అయ్యారు. కేంద్రం చేస్తున్న కుట్రలను, ఐటీ దాడులను, జగన్ పై దాడి సంఘటన, గవర్నర్ తీరు, ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల అమలులో కేంద్రం ఏపీకి చేస్తున్న సహాయ నిరాకరణ, తిత్లీ తుపానుపై కేంద్రం స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై ఆయన ఈమధ్యాహ్నం జరిగే విలేకరుల సమావేశంలో వివరిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఎంపీల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీయేకి వ్యతిరేకంగా టీడీపీకి మద్దుతు ఇచ్చే జాతీయ స్ధాయి నాయకులను కూడా కలిసి కేంద్రం చర్యలను వివరించనున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ,తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబెరైన్, శరద్ యాదవ్, కేంద్ర ఆర్ధిక శాఖమాజీ మంత్రి యశ్వంత్ సిన్హా లతో చంద్రబాబు నాయుడు  భేటీ కానున్నారు. 

 

13:32 - October 27, 2018

బియ్యం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువగా రైసే తింటారు. సాధారణంగా బియ్యం తెల్లగానే వుంటాయి. కానీ తెల్లగానే కాదు... నల్లగానూ ఉంటాయని మీకు తెలుసా..? చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు "సూపర్ ఫుడ్"గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యాయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధక్లు చెబుతున్నారు. "చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్‍బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, "విటమిన్ ఈ" ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయానానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.Image result for బ్లాక్ రైస్
బ్లాక్ రైస్ ఉపయోగాలు..
బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, పర్పుల్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఇలా రకరకాల పేర్లతో రకరకాల రంగులతో లభించే రైస్ లలో బ్లాక్ రైస్ వెరీ వెరీ డిఫరెంట్. చక్కర స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది. బ్లాక్‌ రైస్‌ తీసుకోవడం వల్ల అనేక కాన్సర్‌ల నుండి రక్షణ పొందవచ్చు. ఈ నల్లబియ్యలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. వీటిలో వుండే ఆంథోసైనియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా మారి శరీరంలోని కణజాలలో వచ్చే వాపులను నియంత్రించే పదార్థాలుగా పనిచేస్తాయని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. అంతేకాదు రక్తంలో  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అధికంగా శరీరంలో ఏర్పడే చెబు కొలెస్ట్రాల్ వల్ల రక్త నాళాల్లో ఏర్పడ్డ గడ్డలను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. నల్ల బియ్యం తినటం వల్లన అనేక క్యాన్సర్స్ ను నియంత్రిస్తుందట.  కొవ్వు అధికంగా వుండే ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే ఫాటీ లివర్ డిసీజెన్ నుండి కూడా ఈ నల్లబియ్యం కాపాడతాయి. అలాగే సాధారణ బియ్యంలో వలెనే వీటిలో కూడా పిండి పదార్ధాలు ఎక్కువగా వుంటాయి.అందుకని అధిక మోతాదులో కంటే పరిమితమైన మోతాదులో వీటిని తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి చాలా ఉపయోగం అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.

 

13:26 - October 27, 2018

ముంబై : బాలీవుడ్ చిత్రం ’హౌస్ ఫుల్ 4’ సినిమా వణుకుతోంది. ఎందుకంటే ఈ చిత్రంపై ‘మీ టూ’ ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ‘మీ టూ’ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తమకు గతంలో జరిగిన వేధింపులను స్వేచ్చగా వెల్లడిస్తున్నారు. ఇందులో ప్రముఖుల సైతం ఉంటుండడంతో సినిమా రంగం వేడెక్కుతోంది. ప్రధానంగా షూటింగ్ జరుపుకుంటున్న హౌస్ ఫుల్ 4 చిత్రంపై మరోసారి ఆరోపణలు పెల్లుబికాయి. తనను లైంగికంగా వేధించారంటూ ఓ జూనియర్ ఆర్టిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
గురువారం రాత్రి ‘హౌస్ ఫుల్ 4’ సినిమా షూటింగ్ చిత్రకూట్ గ్రౌండ్‌లో జరుగుతోందని, కాసేపు విరామం దొరకడంతో తాను ఓ పక్కన కూర్చొవడం జరిగిందని ఓ జూనియర్ డ్యాన్స్ ఆర్టిస్టు జాతీయ ఛానెల్‌తో తెలిపింది. పవన్ షెట్టీ, సాగర్...మరో ఇద్దరితో కలిసి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం ప్రైవేట్ పార్ట్స్‌ని తాకారని తెలిపింది. ఆ సమయంలో రితీశ్ దేశ్ ముఖ్, అక్షయ్ కుమార్ లేరని తెలియచేసినట్లు, దీనితో తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. 
ఇప్పటికే ‘హౌస్ ఫుల్ 4’ దర్శకుడు సాజిత్ ఖాన్ బాధ్యతల నుండి తొలగించబడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపిక అయిన నానా పాటేకర్‌ను తొలగించి ఆయన స్థానంలో రానాను తీసుకున్నట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వస్తున్న ఆరోపణలతో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

12:54 - October 27, 2018

హైదరాబాద్: మాజీ కాంగ్రెస్ నేత, టీఆర్ఎస్‌కు ఇటీవలే గుడ్ బై చెప్పిన ధర్మపురి శ్రీనివాస్ సొంత గూటికి (కాంగ్రెస్) చేరారా ? లేదా ? అనే తెగ చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదా ? అంటే అవునని అనిపిస్తోంది. శనివారం డి.శ్రీనివాస్‌తో పాటు ఇతరులు హస్తినకు చేరుకున్నారు. ఇతరులు మాత్రం కాంగ్రెస్‌లో చేరారు కానీ డి.ఎస్. మాత్రం చేరలేదని టాక్ వినిపిస్తోంది. 
Image result for D Srinivas and kcrతెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో పలువురు టికెట్లు ఆశించి భంగపడి ఇతర పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్న డి.శ్రీనివాస్ మాత్రం అలకబూనారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ వార్తలు వెలువడ్డాయి. దీనితో ఆయన పార్టీ మారుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు స్వయంగా గులాబీ బాస్‌కి ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు డి.శ్రీనివాస్ ప్రయత్నించినా అవి సఫలం కాలేదు. చివరకు పార్టీ మారాలని డి.శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. 
Image result for rahul gandhi and d.srinivasడీఎస్ తన రాజకీయ భవిష్యత్‌పై వేగం పెంచారు. తన అనుచరుడు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని కాంగ్రెస్ గూటికి పంపిన డీఎస్ శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ రాహుల్‌తో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని డిఎస్ విలేకరులకు తెలిపారు. కానీ ఏ విషయాలు మాట్లాడారో చెప్పలేదు. పార్టీలో చేరారా ? అనే ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానమిచ్చారు. మరి ఆయన కాంగ్రెస్‌‌లో చేరారా ? చేరుతారా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

12:47 - October 27, 2018

మాస్‌రాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రూపొందుతున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని.. గోవా బ్యూటీ ఇలియానా, కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీతోనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీనువైట్ల పుట్టినరోజు సంధర్భంగా, గ్లిమ్స్‌ఆఫ్ అమర్ అక్బర్ ఆంటొని పేరుతో రవితేజ లుక్‌ని రిలీజ్ చెయ్యగా, మంచి స్పందన వస్తోంది.. మాస్‌రాజా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిండంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యబోతోంది మూవీ యూనిట్.. అలాగే, దీపావళి నాడు రవితేజ, వి.ఐ.ఆనంద్‌ల కాంబోలో, డిసెంబర్‌లో ప్రారంభం కాబోయే డిస్కోరాజా(వర్కింగ్ టైటిల్) ఫస్ట్‌లుక్ లేదా, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చెయ్యనున్నారు. నభా నటేష్ హీరోయిన్.. రెండు సినిమాల అప్‌డేట్స్‌తో, ఈ దీపావళికి డబుల్ ధమాఖా ఇవ్వబోతున్నాడు మాస్‌రాజా.. అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న విడుదల కానుంది..   

 

12:41 - October 27, 2018

కర్ణాటక : పలు కీలక పరిణామాల మధ్య పోరాటం చేసి సీఎంగా అధికారాన్ని చేపట్టిన కన్నడ కుమారస్వామి మరోసారి కంటతడి పెట్టారు. భావోద్వేగానికిలోనై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీసి, తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. సంకీర్ణప్రభుత్వం అంటేనే ముళ్లకుంపటి. అటువంటిది కుమారస్వామి సంకీర్ణప్రభుత్వం ద్వారా  సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం పలుమార్లు కంటతడి పెట్టిన ఆయన, తాజాగా మళపళ్లిలో జరిగిన బహిరంగ సభలోనూ మరోసారి కంటతడి పెట్టారు. ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడే తాను చనిపోయివుండాల్సిందని, కానీ దేవుడి దయతోనే బతికానని చెప్పిన కుమారస్వామి, ఇంకా ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో చెప్పలేనని ఉద్వేగభరితంగా అన్నారు. ఊపిరి ఉన్నంతకాలం ప్రజాసేవ చేస్తానని, జీవితాంతం పేదలకు అండగా ఉంటానని చెప్పారు. తన హృదయంలో ఎంతో భాధ ఉందని, దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలను తాను ఎన్నటికీ మరువబోనని కుమారస్వామి తెలిపారు. 

 

12:31 - October 27, 2018

హైదరాబాద్ : ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో తెలంగాణ పండుగలు బతుకమ్మ, బోనాలు చేరనున్నాయి. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ రివిజన్‌ ఎడిటర్‌ పెన్నీ స్పందించారు. ఆయన కవిత లేఖకు స్పందిస్తూ మరో లేఖను రాశారు. బతుకమ్మ, బోనాలు పదాలను డిక్షనరీలో చేర్చనున్నట్టు అందులో పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ పండుగలను నిఘంటువుల్లో చేర్చాలని కవిత గత ఏడాది నవంబర్‌ 27న ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు నిర్వాహకులకు లేఖ రాశారు. నిర్వాహకులు దాని గురించి సమాచారం కోరగా కవిత పంపించారు. ఈ రెండు పదాలను నిఘంటువుల్లో చేర్చాలన్న నిర్ణయంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. 

 

12:25 - October 27, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా ? ప్రమాదంపై ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసిందా ? పోలీసులు నిరంతరం తనిఖీలు చేయడానికి కారణాలేంటీ ? మావోయిస్టుల ముప్పుతోనే అసాధారణ రీతిలో భద్రత పెంచారా ? ప్రాజెక్ట్ ప్రాంతంతో పాటు చుట్టుప్రక్కల 20 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తూ CC కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచడానికి కారణాలేంటీ ?
Image result for polavaram project policeఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌కు...ఊహించని విధంగా ఉన్నట్టుండి సెక్యూరిటీని పెంచేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన 59 శాతం పనులు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పిల్ వే, స్పిల్ చానల్, డయాఫ్రం వాల్ నిర్మాణం, గేట్లు, విద్యుత్ కేంద్రం ఇలా ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి అరకొర భద్రత పెట్టిన సర్కార్... ఇప్పుడు ప్రాజెక్ట్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. రెండేళ్ల క్రితం వరకు పోలవరం ప్రాజెక్టుకు కేవలం పోలవరం పోలీసులు మాత్రమే భద్రత కల్పిస్తూ వస్తున్నారు. ఏడాది నుంచి మూడు ప్లాటూన్స్ భద్రత నిర్వహిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రతి నెల ముఖ్యమంత్రి  రావడం...కేంద్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు..రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు వచ్చి వెళ్తున్నారు. ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు ప్రాజెక్ట్ చుట్టుపక్కల 20కిలోమీటర్ల పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 15కిలోమీటర్ల దూరంలో పోలీసులు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
Image result for polavaram project policeఇప్పటి వరకు స్థానిక పోలీసులతో పాటు 72 మంది ఏపీఎస్పీ పోలీసులు భద్రత నిర్వహించేవారు. మావోయిస్టుల ముప్పుందని ఐబీ హెచ్చరించడంతో 72మందితో అదనంగా యాంటీ నక్సల్స్ స్క్వాడ్ నియమించారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలతో పాటు కొండల్లో కూంబింగ్ చేస్తూ....వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. లివిటిపుట్టు ఘటన నేపథ్యంలో ప్రాజెక్టు ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడుతో పాటు చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కవాతులు చేస్తూ...రాత్రి, పగలు కూంబింగ్ చేస్తున్నారు. నిఘా వర్గాలు హెచ్చరికలతో పోలవరం ప్రాజెక్ట్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న సమయంలో, పూర్తయిన తర్వాత కూడా భారీ భద్రత కావాల్సిన ఉండటంతో...వెయ్యి మంది APSP సాయుధ పోలీసులతో ఒక బెటాలియన్‌ను పోలవరం ప్రాజెక్ట్‌కు కేటాయించింది. ఈ బెటాలియన్ చేరికతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పటిష్ట బందోబస్తు మధ్య జరగనుంది. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రజాప్రతినిధులతో పాటు పర్యాటకులు, రైతుల తాకిడి పెరగనుండటంతో...భద్రతను కట్టుదిట్టం చేసింది సర్కారు. 

 

12:23 - October 27, 2018

తిరువనంతపురం: శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధించినందుకు  తిరువనంతపురం సమీపంలోని కుందమాన్‌కడవు లోని స్వామి సందీపానంద ఆశ్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారు ఝామున దాడి చేశారు. ఈదాడిలో స్వామి సందీపానంద బాలికల పాఠశాల ముందు పార్క్‌చేసి ఉన్న రెండుకార్లు, ఒక స్కూటర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన తెల్లవారుఝూము గం.2-30 సమయంలో జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులు ఘటనా ప్రదేశంలో ఒక పుష్పగుచ్చం ఉంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. సమయానికి అగ్నిమాపక దళాలు ఘటనా స్ధలానికి చేరుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్దానికులు అన్నారు.ఆశ్రమంలో స్వామి సందీపానంద, అతని సహాయకుడు మాత్రమే ఉంటున్నారు.
ఈ ఉదయం ఆశ్రమాన్ని సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ "సిధ్ధాంత పరంగా ఎదుర్కోలేని పిరికి పందలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని " వ్యాఖ్యానించారు.  శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు ప్రవేశం కల్పిస్తూ గత నెలలో  సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు స్వామి సందీపానంద  తీర్పును సమర్ధించారు. తీర్పును వచ్చిన తర్వాత కొందరు మహిళలు ఇటీవల శబరిమల ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తిన విషయం తెలిసిందే. నిరసనకారులు కొందరిపై భౌతిక దాడులు చేయగా, మరికొందరు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. 

11:54 - October 27, 2018

ఢిల్లీ : శ్రీలంకలో రాజకీయాలు అనుహ్యంగా మారిపోతున్నాయి. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే పదవీచ్యుతుడయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నూతన ప్రధాన మంత్రిగా మహింద రాజపక్స చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధికార యూపీఎఫ్‌ఏ సంకీర్ణ కూటమి నుంచి మైత్రిపాల సిరిసేన పార్టీ వైదొలగడంతో ఈ కీలక మలుపు చోటు చేసుకుంది. కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రధానిగా కొనసాగుతున్న రణిల్‌విక్రమ సింఘేను పదవీచ్యుతుడిని చేసి.. తదుపరి ప్రధానిగా రాజపక్సేతో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణస్వీకారం చేయించారు. రణిల్ విక్రమ సింఘే నాయకత్వంలో యూనిటీ గవర్నమెంట్ 2015లో ఏర్పాటైంది. విక్రమసింఘే మద్దతుతోనే సిరిసేన శ్రీలంక అధ్యక్షుడయ్యారు.

 

11:48 - October 27, 2018

ఒక్క ఫోటో వెయ్యి మాటలకు సమానమంటారు. లక్ష మాటలు అవసరం లేదు. ఒక్క చూపు చాలు అంటారు. ఫోటోలు గతకాలపు గుర్తులే కాదు వేలాది, లక్షలాదిమంది హృదయాలను గెలుచుకునే చిహ్నాలు. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. అటువంటిదే మనం ఇక్కడ చూస్తున్న ఫోటో. కడుపు పండాలని ప్రతి మహిళా కలలకు కంటుంది. కడుపులో నలుసుగా పడిన బిడ్డ పాపాయి రూపంలో ఒడిలోకి వచ్చేంత వరకూ ఆమె క్షణమొక యుగంలా గడుపుతుంది. అలా ఒడిలోకి వచ్చే క్రమంలో జరగకూడని అనర్థాలకు పిండం కరిగిపోతే!!. కలలు కల్లలుగా మిగిలిపోతే!!,ఆమె పడే వేదనకు మాటలుండవు. పడే మూగ రోదనకు భాష వుండదు.ఎన్నో అవాంతారాలను దాటుకుని కడుపులో పిండం బోసి నవ్వులతో ఒడిలోకి వచ్చేందుకు ఎన్ని కష్టాలనైనా..ఎంతటి బాధనైనా..నొప్పినైనా భరిస్తుంది ఆ తల్లి. ఎన్నో అవాంతరాలను అధిగమించిన అనంతరం తన పాపాయి తన ఒడిలోకి చేరిందని తెలిపేలా ఒక ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. 

Image result for pratisia baby injectionనాలుగేళ్లలో ఏడుసార్లు బిడ్డ కోసం యత్నాలు..
ఆమె పేరు పత్రిసియా..అతనిపేరు కింబర్లీ. పిల్లల కోసం పరితపించిపోయారు. దాని కోసం ఆమె ఒళ్లంతా గాయాలు చేసే ఇంజెక్షన్ నొప్పిని హాయిగా భరించింది. నాలుగేళ్లలో ఏడుసార్లు గర్భం వచ్చేందుకు ప్రమాదకర ప్రయత్నాలు!!. వాటిలో మూడుసార్లు అబార్షన్స్!!. ప్రాణంపోయేంత ప్రమాదం!!. వాటినేమీ లెక్కచేయలేదు ప్రతిసియా. ఎట్టకేలకు నాలుగోసారి విజయవంతంగా గర్భం రావటమేకాదు..వారి కలలు పండాయి. ఈ క్రమంలో 1616 ఇంజెక్షన్స్ చేయించుకుంది ప్రతిసియా. వాటన్నింటిని దాచిపెట్టింది. కాలం గడిచింది. కడుపులోని బుజ్జాయి ఒడిలోకి వచ్చింది. అంతే!!..వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ప్రతిసియాకు ఓ ఆలోచన వచ్చింది. పాపాయిని మధ్యలోపడుకోబెట్టి, సిరింజిలన్నీ హృదయం ఆకారంలో పేర్చి ఫోటో తీసి తన ఫేస్ బుక్ లో పెట్టింది. ఇప్పుడా ఫోటో ప్రపంచం అంతా ట్రెండ్ గా మారిపోయింది!!. నొప్పిని కలిగించే సిరింజిలు కూడా ఇంత అందంగా వుంటాయా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అమ్మతనాన్ని అందించిన ఇంజెక్షన్ల నొప్పి కూడా ఇంత హాయిగా వుంటుందా? అంటు నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బిడ్డ కోసం తాను పడిన కష్టం అంతా ఒడిలోని బోసి నవ్వుల పాపాయిని చూసే సరికి ఆ దంపతులకు లోకమంతా అందంగానే కనిపిస్తోంది. అంతే కదా మరి!!. అదే అమ్మతనంలోని గొప్పదనం!!.

గుండెల్ని పించేసిన బీచ్‌లో బాలుడి ఫోటో.. 
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కనీసం ఒక్క కన్నీటి బొట్టయినా రాల్చేట్టు చేస్తోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్ లో కనిపించింది. ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ వాస్తవం ఘోరమైనది. గుండెలను పిండేస్తుంది. ఈ బాబు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాబు పేరు అయిలాన్ కుర్ది. గ్రీకు దీవులను చేరాలన్న ప్రయత్నంలో భాగంగా పడవల్లో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. ఈ చిత్రాన్ని వాషింగ్టన్ పోస్ట్ బీరూట్ బ్యూరో చీఫ్ లిజ్ స్లై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చిన్నారికి చెందిన ఇతర చిత్రాలను సిరియా నుంచి సేకరించి వాటినీ పోస్ట్ చేశారు. ఇప్పుడీ చిత్రం, దాని వెనకున్న కథ లక్షలాది షేర్స్ తెచ్చుకుంది. ఎంతో మంది ప్రముఖులు సహా కోట్లాది మంది స్పందించారు.

-మైలవరపు నాగమణి

 

 

 
11:43 - October 27, 2018

ఢిల్లీ : డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ సొంత గడ్డపై దుమ్ము రేపింది. జైపూర్ పింక్ పాంథర్స్‌ను 41-30 పాయింట్ల తేడాతో మట్టి కరిపించింది. ఆట ప్రారంభంలో జైపూర్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రైడర్‌ ప్రదీప్‌ వరుస రైడ్లతో పట్నాకు పాయింట్లు తీసుకొచ్చి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఫస్టాఫ్‌ ముగిసేసరికి పట్నా 22-15తో మ్యాచ్‌పై పట్టు సాధించింది. అయితే సెకండాఫ్‌ ఆరంభంలో జైపూర్‌ అద్భుతంగా పోరాడడంతో 20-23తో పట్నాకు సమీపంగా వచ్చింది. ఈ దశలో రైడర్‌ మంజీత్‌ చెలరేగడంతో పాటు డిఫెండర్లు జైదీప్‌, వికాస్‌ కాలే జైపూర్‌ రైడర్లను కట్టడి చేయడంతో పట్నా 38-26తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను గెలుచుకొంది. పట్నా రైడర్లు ప్రదీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లు, మంజీత్‌ 9 పాయింట్లతో రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ 36-25తో తమిళ్‌ తలైవా్‌సపై విజయం సాధించింది.

 

11:33 - October 27, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో అందరూ రాక్షసుల వేషాల్లో ఉండడమే. మెగాస్టార్ చిరంజీవి, కూతుర్లు, కోడలు, ఇతరులు అందరూ వేషాల్లో కనిపిస్తూ భయకరంగా కనిపంచారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం వేషం మాత్రం వేసుకోలేదు. ఈ రాక్షస పార్టీ ఫొటోను కొణిదెల వారమ్మాయి నిహారిక ఈ ఫొటోలను పోస్టు చేసింది. ఓ ఇంగ్లీష్ చిత్ర పేరును పేర్కొంటూ ఫొటోలను ట్వీట్ చేసింది. 

11:31 - October 27, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్న రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్‌‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి సాంగ్స్ జూక్‌బాక్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సవ్యసాచి ఆల్బమ్‌లో మొత్తం ఏడు పాటలున్నాయి.. ఇంతకుముందు విన్న టైటిల్ ట్రాక్, ఒక్కరంటే ఒక్కరు, వైనాట్ పాటలతో పాటు, నాగార్జున అల్లరి అల్లుడులోని, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు పాట రీమిక్స్ కూడా ఉంది.. ఈ పాటని అల్లరి అల్లుడులో ఎస్పీబీ, చిత్ర పాడగా, వేటూరి లిరిక్స్ వ్రాసారు.. వేటూరి లిరిక్స్‌తో పాటు, రీమిక్స్‌లో కొన్ని పదాలు రామజోగయ్య శాస్త్రి వ్రాసారు.. కీరవాణి, పృథ్వీచంద్ర, మౌనిమ చంద్రభట్ల చక్కగా పాడారు.. సినిమాలో లగ్గాయిత్తు పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. నవంబర్ 2న సవ్యసాచి రిలీజ్ అవనుంది..

 

11:19 - October 27, 2018

విజయవాడ : కార్పొరేట్ కళాశాలలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. తీవ్ర వత్తిడిలు...మనో వేదన..ఇతరత్రా కారణాలతో విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కష్టనష్టాలకు ఓర్చి..చదిపించి...ఉన్నత విద్యనభ్యసించి తమకు అండగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతోంది. ప్రధానంగా నారాయణ కాలేజీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ కాలేజీల్లో విద్యార్థిని..విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరొక విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. 
విజయవాడలోని నారాయణ కాలేజీలో శ్రీ చైతన్య అనే విద్యార్థి చదువుకుంటున్నాడు. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఇతను ఉరి వేసుకుని విగతజీవుడిగా కనిపించాడు. దీనితో తీవ్ర కలకలం రేగింది.  ప్రభుత్వ మార్చరీ వద్ద శనివారం ఉదయం విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి నారాయణ, మంత్రి గంటా శ్రీనివాసరావరావు రాజీనామా చేయాలని పేర్కొంటున్నాయి. నారాయణ కాలేజీలో 76 మంది విద్యార్థులు చనిపోయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు తెలిపాయి. 
మృతి చెందిన అనంతరం విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారని, అప్పటికే అతను మృతి చెందినట్లు ఆరోపణలున్నాయి. రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడని, ఇంటికి పంపించాలని వేడుకున్నా కాలేజీ యాజమాన్యం పంపించలేదని...తల్లిదండ్రులను చూడాలని అనిపిస్తున్నట్లు...ఈ విషయాన్ని తన స్నేహితులతో శ్రీ చైతన్య ఆవేదన పంచుకున్నట్లు సమాచారం. తీవ్ర మనోవేదనకు గురైన శ్రీ చరణ్ ఉరి వేసుకుని మృతి చెందాడని తెలుస్తోంది. పదో తరగతి, ఇంటర్‌లో టాప్ టెన్‌లో ఉన్నాడని, ఒక్క కొడుకు మృతి చెందడం వెనుక కాలేజీ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 

11:16 - October 27, 2018

చెన్నై: అర్ధరాత్రి, హైవే,కంటైనర్లో వేల కోట్ల రూపాయల కొత్త 2వేలరూపాయల నోట్లు, సాంకేతిక కారణాలతో రోడ్డుపై లారి ఆగిపోయింది. వెంటవున్న భద్రతా సిబ్బందిలో ఆందోళన, ఎలర్టైన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న అదనపు బలగాలు తుపాకులతో కాపలా కాశాయి. ఈలోపు మెకానిక్ వచ్చాడు మరమ్మత్తు చేశాడు, లారీ అక్కడినుంచి కదిలింది. దీంతో భద్రతా సిబ్బంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందా అనుకుంటున్నారా.... అసలు విషయంలోకి వెళితే......గురువారం మధ్యాహ్నం  మైసూరులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి 2 వేల రూపాయల కొత్తనోట్ల కట్టలతో 3 కంటైనర్లు చెన్నైలోని రిజర్వుబ్యాంకుకు బయలు దేరాయి.2  కంటైనర్లు  చెన్నై చేరుకున్నాయి కానీ ఒక కంటైనర్ మార్గమధ్యంలో అర్ధరాత్రి వేళ  చెన్నై సమీపంలోని అమింజికరై వద్ద పూందమల్లి రోడ్డులో ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ సంఘటటనతో దాదాపు 2 గంటలపాటు  ఆ ప్రాంతంలో ఉద్రిక్త ఏర్పడింది.  మరమ్మత్తు పూర్తియిన తర్వాత భద్రత నడుమ చివరి కంటైనర్ కూడా క్షేమంగా చెన్నై లోని రిజర్వు బ్యాంకు కు  చేరింది. 

11:05 - October 27, 2018

మహారాష్ట్ర : భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శనివారం పుణెలో మూడో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సుపర్ విక్టరీ కొట్టిన భారత్...రెండో వన్డేలో మాత్రం ఓటమి అంచుల్లోకి వెళ్లి...టైతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి...సిరీస్‌లో ఆధిక్యత సాధించాలని పట్టుదలతో టీమిండియా. మరోవైపు వెస్టిండీస్ జట్టు మాత్రం వన్డేలో అయినా గెలుపొంది...సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. భారత్-విండీస్ జట్ల మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలుపొందిన ఇండియాకు...రెండో వన్డేలో షాకిచ్చింది విండీస్ జట్టు. తొలి వన్డేలో వెస్టిండీస్ నిర్దేశించిన 322 పరుగులు లక్ష్యాన్ని....టీమిండియా సునాయాసంగా చేజ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీలు సెంచరీలతో దుమ్మురేపారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి...విండీస్ జట్టు తేలిపోయింది. 
Image result for India vs West Indies : 3rd ODI In Puneఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...321 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. రెండో వన్డేలోనూ సెంచరీ సాధించి...జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు సహకరించడంతో విండీస్ ముందు 322 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. అచ్చొచ్చిన మైదానంతో భారత్ గెలుస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే విండీస్ బ్యాట్స్‌మెన్లు హోప్, హెట్ మెయర్ చివరి వరకు పోరాటం చేసి...మ్యాచ్ ను టై చేశారు.
Image result for India vs West Indies 3rd ODI In Puneసిరీస్ లో రెండో వన్డే టై కావడంతో...ఇప్పుండదరి కన్నుమూడో వన్డేపై పడింది. ఈ వన్డేలో గెలుపొంది...సిరీస్ లో ఆధిక్యత సాధించాలని భారత్ భావిస్తుంటే....ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించి...సిరీస్ ను సమం చేయాలని విండీస్ ఉత్సాహంలో ఉంది. అంచనాలకు మించి రాణిస్తున్న వెస్టిండీస్‌ను టీమిండియా తమ పూర్తి బలగంతో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ బ్యాట్స్‌మెన్‌ హవా సాగింది. భారత్‌కు తగ్గట్టుగానే విండీస్‌ కూడా చెలరేగుతుండడంతో 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. 
Image result for India vs West Indies 3rd ODI In Puneకెప్టెన్‌ కోహ్లీ బీకర ఫామ్‌ విండీస్ ను వణికిస్తోంది. తొలి వన్డేలో 140 పరుగులు, రెండో వన్డేలో 157 పరుగులు చేసి...ప్రత్యర్థికి కొరకురాని కొయ్యలా మారాడు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే ఫాం కొనసాగిస్తే...విండీస్ జట్టుకు మరోసారి కష్టాలు తప్పేలా లేవు. కోహ్లీ తోడు తొలి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ, రెండో వన్డేలో అద్భుతంగా ఆడిన రాయుడులు రాణిస్తే విండీస్ మరోసారి చుక్కలే. మరోవైపు రెండో వన్డేలో అద్భుతంగా ఆడిన షై హోప్, హెట్ మెయిర్ లపైనే విండీస్ జట్టు ఆశలు పెట్టుకుంది. 3వందల పైచిలుకు స్కోరును కాపాడుకోలేకపోయిన విండీస్...ఈ మ్యాచ్ లో మరింత భారీ స్కోరు చేయాలని భావిస్తోంది.

10:59 - October 27, 2018

ఢిల్లీ : పేరుకు మాత్రమే సర్వసంగ పరిత్యాగులు. కానీ ఆస్తులు చూస్తే కోట్లల్లో. భూములు చూస్తే వేలాది ఎకరాలు..సుఖాలు, సౌకర్యాలకు అంతలేదు. ఇంద్రభోగాలన్నీ వారి సొంతమే. ఇక కంటికి కనిపించినవారిపై లైంగిక దాడులు. వీరా సన్యాసులు? వీరాకాషాయ వస్త్రాలు కట్టుకుని సమాజాన్ని జాగృతి చేస్తామంటు బయలుదేరిని స్వాములు? వీరి అరాచకాలకు ప్రభుత్వాలు సైతం వంత పాడటం విచారకరం. భూస్వాములకు వీరు ఏమాత్రం తీసిపోరు. అంతేకాదు..అసాంఘి కార్యకలాపాలకు అడ్డాగా కొనసాగుతున్న వీరి ఆశ్రమాలను, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో మరో దొంగస్వాములోరు లైంగికదాడి, అసహజ లైంగిక చర్య వంటి ఆరోపణలపై ఢిల్లీకి చెందిన ఓ స్వామీజీ, అతడి సోదరులపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. 
ఆశ్రమానికి చెందిన ఓ వ్యక్తిపై లైంగికదాడికి, అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డారని దక్షిణ ఢిల్లీలో ఓ ఆలయాన్ని నిర్వహిస్తున్న దాతీ మహరాజ్ అనే వ్యక్తిపై ఆయన శిష్యురాలు ఫతేపూర్ బేరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీ పోలీసుల విచారణపై కొంతమంది ప్రభావం చూపుతున్నారని పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు.. ఈ కేసుపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దాతి మహరాజ్, అతడి ముగ్గురు సోదరులు, ఓ మహిళపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

-మైలవరపు నాగమణి
 

 

10:56 - October 27, 2018

ఢిల్లీ : జార్ఖండ్ డైనమేట్, టీమిండియా మాజీ కెప్టెన్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. వెస్టిండీస్‌తో జరగబోయే మూడు టీ20లతో పాటు ఆస్ట్రేలియాతో పర్యటనకు...ధోనిని దూరంగా పెట్టారు. రెండు సిరీస్‌లు జట్లు ప్రకటించిన జాతీయ సెలెక్టర్లు....రెండింట్లోనూ ధోనికి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిల మద్దతు ఉన్నప్పటికీ తన ను పక్కనబెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో ధోనీ కెరీర్‌ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాత్రం వీటిని ఖండించారు. ధోని ప్రస్తుతం ఆరు టీ20ల్లో ఆడడం లేదని....సమర్థుడైన రెండో వికెట్‌కీపర్‌ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. అయితే మాజీ కెప్టెన్‌కు ద్వారాలు మూసుకుపోలేదని స్పష్టం చేశారు. అందుకే రిషభ్‌ పంత్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌లను ఈ ఆరు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు.

 

10:53 - October 27, 2018

ఢిల్లీ: రాఫెల్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాఫెల్ కుంభకోణం విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని అనిల్ అంబానీకి వేల కోట్ల లబ్ధి చేకూర్చారని మోదీ సర్కార్‌పై అవిశ్రాంత పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ సైనికోద్యోగులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కానున్నారు. కాంగ్రెస్ సాగిస్తున్న రఫేల్ స్కామ్ పోరాటంపై మాజీ సైనికులను మద్దతు కోరనున్నారు.  

Image result for rahul gandhi rafaleరాహుల్ గాంధీ అరెస్ట్..
రాఫెల్ కుంభకోణంపై ప్రధాని మోదీ ఇంతవరకూ పెదవి విప్పకపోవడం తమ అనుమానాలు మరింత బలపరుస్తోందని రాహుల్ పేర్కొన్నారు. రాఫెల్‌పై దర్యాప్తు ప్రారంభించినందుకే సీబీఐ చీఫ్ అలోక్‌వర్మను తప్పించారంటూ శుక్రవారం దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టగా, రాహుల్ స్వయంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనకు సారథ్యం వహించి స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. ఇటీవలే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ, ప్రస్తుత ఉద్యోగులతో కూడా రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు కొనసాగింపుగా మాజీ సైనికోద్యోగులతో రాహుల్ ఇవాళ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
 

 
10:48 - October 27, 2018

కొద్ది రోజులక్రితం నటుడు వైజాగ్ ప్రసాద్ మరణించిన సంగతి మరచిపోకముందే, టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది..  
ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి ఈ ఉదయం కన్నుమూసారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. 1987లో కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివప్రసాద్ రెడ్డి.. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, ఆటో డ్రైవర్, అల్లరి అల్లుడు, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, ధడ, గ్రీకువీరుడు వంటి సినిమాలు నిర్మించారు. ఆయన అక్కినేని నాగార్జునకి అత్యంత సన్నిహితుడు.. నాగార్జునతో శివప్రసాద్ రెడ్డి ఎక్కువ సినిమాలు నిర్మించారు. గత కొంత కాలంగా గుండె సంభందిత వ్యాధితో భాదపడుతున్న శివప్రసాద్ రెడ్డి ఈ‌ ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు..

10:46 - October 27, 2018

ఢిల్లీ : మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫైనల్ పోటీల్లో ఊహించని ఘటన జరిగింది. మయన్మార్‌లోని యాంగోన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫైనల్స్‌లో విజేతగా ప్రకటించగానే ....పరాగ్వేకు చెందిన క్లారా సోసా కళ్లు తిరిగి కింద పడిపోయింది. విజేత పేరు ప్రకటించడానికి ముందు ఫైనల్స్ చేరిన మీనాక్షి చౌదరి, క్లారా సోసాలిద్దరూ....టెన్షన్‌తో ఒకరినొకరు చేతులు పట్టుకొని నిలబడ్డారు. జడ్జిలు విజేతగా క్లారా సోసా పేరు ప్రకటించగానే...ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో జడ్జిలతో పాటు ప్రేక్షకులు షాకయ్యారు. ఆమె కోలుకున్న తర్వాత మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ కిరీటాన్ని అలంకరించారు. క్లారా కళ్లు తిరిగి పడిపోయిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. భారత్‌కు చెందిన మీనాక్షి చౌదరి రన్నరప్ నిలిచారు.

 

10:06 - October 27, 2018

ముంబై: ఒకప్పుడు దేశంలో టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)  2018 సెప్టెంబర్ 18 నాడు ఆ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి సంస్ధ 40 వేల కోట్ల రూపాయల అప్పుల్లోఉందని సంస్ధ అధినేత అనిల్ అంబానీ చెప్పారు. సంస్ధ తను చెల్లించాల్సిన బకాయిల్లో 11 సంస్ధలకు సెప్టెంబర్ 30 నాటికి బకాయిలు చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ నేటికి రుణం తీర్చలేదని తెలుస్తోంది.  కొన్ని రుణ వివాదాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్ కామ్ నుంచి తమకు రావల్సిన  బకాయిలు ఇప్పించాలని కోరుతూ  24 ప్రముఖ సంస్ధలు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కు వెళ్లాయి. వీటిలో  బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, అసెండ్ టెలికాం, సిస్కామ్ కార్పోరేషన్, పేటీఎం, గతి లిమిటెడ్‌, లక్ష్యా మీడియా వంటి సంస్ధలు ఉన్నాయి. 

09:15 - October 27, 2018

ఢిల్లీ : గత కొంతకాలం నుండి రోజుకో విధంగా పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 10 రోజుల నుండి తగ్గుతు వస్తున్నాయి. దీంతో సామాన్యుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. సెంచరీకి చేరువవుతోందేమోనని సామాన్యడు బెంగపడుతున్న సమయంలో ధరలు తగ్గిన కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో డాలర్ మారకపు విలువలో రూపాయి బలపడుతూ ఉండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు దిగివస్తున్నాయి. వరుసగా పదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. శనివారం నాడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 35 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 80.45, డీజిల్ ధర రూ. 74.38కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 85.93, డీజిల్ ధర రూ. 77.96కు తగ్గాయి. విజయవాడలో పెట్రోలు రేటు రూ. 84.60, డీజిల్ రూ. 79.80కు చేరుకుంది. గుంటూరులో పెట్రోలు ధర రూ. 84.80కి, డీజిల్ రూ. 80కి తగ్గింది.
 

08:56 - October 27, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ  కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి డక్కా మెక్కీలు తిన్న డీఎస్ ఎట్టకేలకూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ అసమ్మతి నేత డీఎస్ ఢిల్లీలో మకాం వేశారు. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ తో భేటీ కానున్నారు. అనంతరం పార్టీ కండువా కప్పుకోనున్నారు.  

Image result for ramulu nayakఆయన బాటలోనే టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం పయనిస్తున్నట్లు సమాచారం. శనివారం రాహుల్ గాంధీని కలసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. రాములు నాయక్ నారాయణఖేడ్ టికెట్ ఆశించి  భంగపడ్డ రాములు స్తున్నారు. టీఆర్ఎస్ లో నారాయణ ఖేడ్ టికెట్ ఆశించి భంగపడ్డ రాములు నాయక్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నారాయణ ఖేడ్ టిక్కెట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. కాగా ఇటీవల గోల్కొండ హోటల్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రాములు నాయక్ కలిశారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ అతనిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  

08:29 - October 27, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ వెళుతున్నారు.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరకంగా ఇబ్బందులకు గురిచేస్తోంది, ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి ఈటూర్ లో ఆయన దేశ ప్రజలకు వివరించనున్నారు. ఉదయం ఏపి భవన్ లో పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయిన అనంతరం, కేంద్రంపై పోరాటంలో టీడీపీకి మద్దతు ఇచ్చే జాతీయ పార్టీల నాయకులతో సమావేశం అవుతారు.  ఈసమావేశాల్లో రాష్ట్రంలో ఐటి దాడులు గురించి, జగన్ పై దాడి, గవర్నర్ల వ్యవస్ధ, సీబీఐ వ్యవహారం చర్చించనున్నారు.  మధ్యాహ్నం మూడున్నరకు కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రాష్ట్రాన్ని టార్గెట్  చేసుకుని కేంద్రం ఏరకంగా వేధిస్తోందో వివరించనున్నారు.

08:20 - October 27, 2018

చండీగఢ్ : సీబీఐలో నెలకొన్న ఇద్దరు డైరెక్టర్ల  ఆదిపత్యం పోరుతో వీధిన పడిన అధికారుల అవినీతి భాగోతంతో దేశం యావత్తు ఉలిక్కి పడింది. దీంతో ఆ ఇద్దరు డైరెక్టర్ల రాకేశ్ ఆస్థానా, అలోక్ వర్మలను విధులనుండి తాత్కాలికంగా కేంద్ర తొలగించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అలోక్ వర్మను విధుల నుండి తొలగించటంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. 

Obsession of CBI offices across the countryపంజాబ్, హర్యానాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయం వైపునకు దూసుకువస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. చండీగఢ్‌లోని సీబీఐ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ కేనన్‌లతో నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మాట్లాడుతూ.. సీబీఐని కేంద్రం పంజరంలో బంధించిందంటూ విమర్శలు గుప్పించారు. పాట్నాలో సేవ్ సీబీఐ.. సేవ్ డెమోక్రసీ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని సీబీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. 

Image result for cbi office alok vermaభువనేశ్వర్‌లో నల్లరంగు టీ షర్టులు ధరించిన యువకులు సీబీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతాసిబ్బంది వారిని అడ్డుకుని చెదరగొట్టారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, జమ్మూ, రాంచీ, విజయవాడ, గౌహతి, ధన్‌బాద్‌లలో ఆందోళనలు చేపట్టారు. సీపీఐ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌తోపాటు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఈ నిరసన కార్యక్రమాలలో ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనట విశేషం. 

07:55 - October 27, 2018

గుంటూరు : జనసేన పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. కానీ పార్టీలో చేరేవారు భిన్నరంగాలకు చెందినవారు కావటం విశేషం. ఈ నేపథ్యంలో  రిటైర్డ్ జడ్జ్ టీఎస్ రావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ ప్రకటించిన విజన్ డాక్యుమెంటులోని అంశాలు, జనసేన ఏడు సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ.. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అవసరమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలు, భూ సంస్కరణల అమలు తీరుపై తనకున్న అవగాహన, అనుభవాన్ని పార్టీ కోసం వినియోగిస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 

07:47 - October 27, 2018

హైదరాబాద్: చలికాలం రాగానే చాలామందిలో జలుబు, దగ్గులాంటి ఫ్లూ లక్షణాలు కనిపించడం సర్వసాధారణం. అది మామూలు జలుబే అయితే ఫర్వాలేదు. కానీ ఒకవేళ స్వైన్ ఫ్లూ అయితే మాత్రం ప్రమాదకరం. జాగ్రత్తపడకపోతే ప్రాణాంతకం కావచ్చు.  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వైన్ ఫ్లూ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది.  శీతాకాలం పూర్తిగా రాక మునుపే తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి చలి తీవ్రత కూడా పెరుగుతోంది. గత రెండురోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగి రాత్రి ఉష్ణాగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. స్వైన్ ఫ్లూతో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది.  హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో  స్వైన్ ఫ్లూ తో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శుక్రవారం మరో ఇద్దరికి స్వైఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తేలింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మాసమ్మ(60), రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన టి.రాధిక(21) గత కొద్ది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో జ్వరానికి వైద్యం చేయించుకుంటున్నారు. ఎంతకీ జ్వరం తగ్గక పోవటంతో రక్త పరీక్షలు చేయించగా స్వైన్ ఫ్లూ బయటపడింది. దీంతో ఈనెలలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఈవ్యాధి భారిన పడ్డట్లు తెలిసింది.వీరిలో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిన్న వ్యాధి లక్షణాలు బయటపడ్డ ఇద్దరికీ మెరుగైన చికిత్స అందించటానికి వైద్యులు ప్రత్యేక వార్డు కు తరలించి వైద్యం అందిస్తున్నారు. 

07:32 - October 27, 2018

హైదరాబాద్ : ఎన్నికల వేళ నేతలు పార్టీల జంపింగ్ లు సర్వసాధారణమే. టిక్కెట్ల కోసం..వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా కారణం ఏదైనా కావచ్చు..ఒక పార్టీ నుండి మరోపార్టీకి నేతలు కప్పల మాదిగా జంప్ అయిపోతుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా..సీనియర్ నేతగా వుండే డీఎస్ 2014 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ గూడికి చేరుకున్నారు. ఇప్పడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. దీనికి కారణాలు ఏమైనా గానీ తిరిగి డీఎస్ తన సొంతపార్టీకు చేరుకోనున్నారు. గత రెండు నెలలుగా అదిగో చేరుతా ఇదిగో చేరుతా అంటూ ముసుగులో గుద్దులాటలకు డీఎస్ స్వస్తి పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు డీఎస్  జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందులో భాగంగా డీఎస్ ఇప్పటికే హస్తినకు బయలుదేరారు. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు డీఎస్. అనంతరం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అటు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం నేరుగా డీఎస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి డీఎస్ చేరనున్నారు. 

ఇకపోతే నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విబేధాల వల్ల డీఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు డీఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని కూడా డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై అసహానాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  

 

07:11 - October 27, 2018

హైదరాబాద్ : పేదలకు అదే దిక్కు. కానీ అక్కడి ఉద్యోగులకు మాత్రం పేదలంటే చిన్నచూపు. ప్రభుత్వ ఆసుపత్రులపైనా..ప్రభుత్వ వైద్యం పైనా ప్రజలకు నమ్మకంపోయి భయం కలిగించేలా వ్యవహరించటం అక్కడి ఉద్యోగులకు పరిపాటే. విధుల పట్ల నిర్లక్ష్యం..తమకు ఎవరేం చేస్తారులే అనే పొగరు వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహించేలా చేస్తోంది. దీంతో వేలాదిమంది రోగులు పలు అవస్థలకు గురవుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన సదరు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా విధులకు హాజరయ్యేవారిపై కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో వారికి మెమోలు జారీ చేసింది. 

ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులపై ఉస్మానియా పాలకవర్గం  16 మందికి మెమోలను జారీ చేసింది. కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు హాజరుకాని 16మంది 4వ తరగతి ఉద్యోగులను గుర్తిం చి వారికి మెమోలను జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎఫ్‌ఎన్‌ఓలు, 13మంది ఎంఎన్‌ఓలు ఉన్నారు. వీరంతా ఎలాంటి అనుమతులు లేకుం డా రెండు, మూడునెలల నుం చి విధులకు హాజరుకావడం లేదు. ఇదిలాఉంటే అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఇంటికి వెళ్లిపోతున్న వారిని గుర్తించి అధికారులు మెమోలు జారీ చేశారు. నెలరోజుల క్రితం ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న 10మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన విషయం విదితమే. కాగా తాజాగా మెమోలు జారీ చేసిన వారిలో గతంలోని ఐదుగురు కూడా ఉండడం గమనార్హం. మరోసారి ఇలా జరిగితే మూడో మెమో ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
 

Don't Miss