Activities calendar

29 October 2018

22:04 - October 29, 2018

హైదరాబాద్: జగన్‌ భద్రత విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ.. ఆయన రక్షణపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం భద్రత పెంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పాదయాత్రను జగన్ మొదలుపెట్టనుండడంతో.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు... జగన్‌పై దాడి కేసులో సీబీఐ లేదా థర్డ్‌ పార్టీతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్ట్‌.

కత్తి గాయం నుంచి కోలుకుంటున్న వైఎస్ జగన్‌ నవంబర్ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర సాగనుంది. అయితే.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడితో తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ, జగన్ భద్రత విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం జ‌గ‌న్ పాద‌యాత్రలో దాదాపు 80 మంది సెక్యురిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో జ‌గ‌న్‌కు వ్యక్తిగ‌త సిబ్బందిగా ప్రభుత్వం ఇచ్చిన‌ దాదాపు 10మంది ఉన్నారు. రోప్ పార్టీలో దాదాపు 50 మంది ఎఆర్ కానిస్టేబుల్స్ ఉంటున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాన్ని బట్టి స్థానిక పోలీసులు కూడా బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇక ప్రైవేటు సెక్యూరిటీగా 15మంది, మరో ఐదుగురు మాజీ సైనికులు జగన్‌తో పాటే నడుస్తున్నారు. ఇప్పుడీ ప్రైవేటు సెక్యూరిటీని 50కి పెంచారు వైసీపీ నేతలు. 

జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సెక్యూరిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు.. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పించాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. జగన్‌కు ప్రాణహాని ఉందన్న విషయం .. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడితో తేలిపోయింది కాబట్టి.. తక్షణం సెక్యూరిటీని పెంచాలని కోరుతున్నారు. దీంతోపాటు.. జగన్ ప్రయాణిస్తున్న వాహనాల ఫిట్‌నెస్‌ కూడా సరిగ్గా లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా స్పందించడం లేదంటన్నారు. ఈ వాహనాలను మార్చాలంటున్నారు.

జగన్‌పై దాడి కేసును థర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ.. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్ట్‌. ఇదే కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ బూరగడ్డ అనిల్‌ కుమార్, అమరనాథ్ రెడ్డి వేసిన పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. దానిపై వాదనలు విన్న తర్వాత.. వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ను విచారిస్తామంది హైకోర్టు.

జగన్ దాడి వ్యవహారంపై విజయమ్మ కూడా స్పందించారు. ఓ మత కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కత్తి దాడి జరిగే సమయంలో జగన్ పక్కకు తిరగడంతోనే భుజానికి గాయమయ్యిందని లేదంటే మెడలో గుచ్చుకుని ఉండేదన్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడే వారి సంగతిని చూసుకుంటారన్నారు విజయమ్మ.

శనివారం నుంచి పాదయాత్రకు సిద్ధమవుతుండడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతోంది వైసీపీ. పూర్తిస్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. సెల్ఫీలు  దిగడానికి వచ్చే వారినీ కట్టడి చేయాలని భావిస్తోంది.

15:35 - October 29, 2018

ఢిల్లీ : అయోధ్య రామ మందిరం- బాబ్రీ మసీదు కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామ మందిరి కేసు ఇప్పుడంత అత్యవసరంగా విచారించాల్సిన అవుసరం లేదంటు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై విచారణ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 
 

15:13 - October 29, 2018

Image result for Kapoor Family Decides To Sell RK Studioఢిల్లీ : సినిమా చరిత్రలో క్లాసిక్స్ అనబడే కొన్ని సినిమాలు నిర్మించిన ఘనత ఆ స్టూడియో సొంతం. దేశంలోనే అత్యంత పురాతనమైన స్టూడియోగా కూడా ఆ కంపెనీకి పేరు ఉంది. అసలు ఆ పేరు వింటేనే ప్రేక్షకుల్లో కొంతమంది పులకింతకు గురవుతారు. అలాంటి నిర్మాణ సంస్థ ఇప్పుడు అమ్మకానికి సిధ్దమైంది..అదే రాజ్ కపూర్ ది గ్రేట్ ప్రొడక్షన్స్ ఆర్కే స్టూడియోస్.. ప్యార్ హువా..ఇక్ రార్ హువా...జీనా యహా...మర్నా యహా...ఈ పాటలే కాదు..బర్సాత్, ఆవారా, శ్రీ 420, జిస్ దేస్ మే గంగా బెహతీ థీ..మేరానామ్ జోకర్, బాబీ, రామ్ తేరీ గంగా మైలీ వంటి అనేక క్లాసిక్ సినిమాలు నిర్మించింది ఆర్‌కే స్టూడియోస్. 
`Image result for Kapoor Family Decides To Sell RK Studioఈ స్టూడియో రాజ్ కపూర్ కలల సౌధం.. ఈ స్టూడియో వెనుకగానే రాజ్ కపూర్‌కి ఓ కాటేజీ కూడా ఉండేదట. చిన్న చిన్న ఫంక్షన్లు ఇక్కడే చేసేవాడట ఆయన. ఇక్కడ కేవలం ఆర్కే స్టూడియోస్ బ్యానర్‌పైన నిర్మించే చిత్రాలే కాకుండా..ఇతరులవీ నిర్మాణం జరిగేవి. అప్పట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది ఆర్కే స్టూడియో..ఐతే అదంతా గతం. ఇప్పుడు చిన్న చిన్న టీవి షూటింగ్స్ తప్పించి లైట్స్..కెమెరా...యాక్షన్ డైలాగులు విన్పించడం లేదు. దీంతో కపూర్ ఫ్యామిలీ ఈ ఆర్కే స్టూడియోని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్ కపూర్ భార్య-కృష్ణరాజ్ కపూర్, ఆయన కుమారులు రణ్ ధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్, మనవరాళ్లు రీతూ నందా, రీమా జైన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
Image result for RK Studio godrej propertiesఆర్కే స్టూడియోస్‌ను గోద్రెజ్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తమకి ఈ స్థలం అనువుగా ఉంటుందని ఆ సంస్థ భావిస్తోందట. దాదాపు రూ.250కోట్లవరకూ కపూర్ ఫ్యామిలీ రేటు చెప్తుండగా..గోద్రెజ్ మాత్రం రూ.150 కోట్ల వరకూ చెల్లించేందుకు సిధ్దపడిందని టాక్. ఆర్కే స్టూడియోస్ బ్యానర్‌లో వచ్చిన చివరి సినిమా ఆ అబ్ లౌట్ చలే..ప్రస్తుతం ఫ్యామిలీ అంతా సినిమాల్లోనే ఉన్నా..ఎవరూ వరసగా ఈ బ్యానర్‌పై సినిమాలు తీయకపోవడం కూడా ఆర్కే స్టూడియోస్‌ పతనానికి కారణంగా చెప్పుకోవాలి. గత ఏడాది సూపర్ డ్యాన్సర్ 2 షోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆర్కే బ్యానర్ పాత సినిమాల్లో వాడిన అనేక కాస్ట్యూమ్స్ కూడా దగ్ధం అయిపోయాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్‌తో డీల్ ఓకే అయినా కాకపోయినా..ఆర్కే స్టూడియోస్ మరెంతో కాలం మనుగడ సాధించలేదన్నది సత్యం.

15:01 - October 29, 2018

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజమండ్రి రూరల్‌లోని కొంతమూరు మండలం జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 70కి పైగా పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం లేకపోయినా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్  వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదంలో ఇళ్లన్నీ దగ్ధమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

14:57 - October 29, 2018

కేరళ : శబరిమల వివాదం కొనసాగుతునే వుంది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుండి కొనసాగుతున్న దేశ వ్యాప్త చర్చ కాస్తా దేశాలయం తెరిచిన నాటి నుండి ఉద్రిక్తతగా మారింది. దేవాలయం ప్రవేశానికి మహిళలు యత్నించటం దీన్ని భక్తులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతల నడుమ దేవాలయాన్ని మూసివేశారు. అయినా ఈ అంశంపై చర్చలు, మాటలు మాత్రం వాడి వేడిగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంల శబరిమలలో మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళలపై బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయని అన్నారు. సుప్రీంకోర్టునే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for amit shahమీ కుట్రలు గురజరాత్ లోనే ఇక్కడ కాదు..
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని... ఆయనకు ఉన్న బలం దానికి సరిపోదని విజయన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పనులు గుజరాత్ లో చేసుకుంటే మేలని హితవు పలికారు. కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా కలలు కంటున్నారని...కేరళలో అడుగు మోపేంత స్థలం కూడా బీజేపీకి  లేదని సీఎం పినరాయి విజయం తీవ్రంగా మండిపడ్డారు. 
 

 

14:44 - October 29, 2018

మహబూబ్ నగర్ : ఆనాడు ఆంధ్రను..తెలంగాణనను బలవంతంగా కలిపింది కాంగ్రెస్సేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మక్తల్...పాలమూరు వారికి ఏమొస్తదని ఆనాడు ప్రశ్నించారని, మక్తల్ తాలూకాలో లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చిందా ? లేదా ? అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగేళ్ల కింద పాలమూరు ఏ విధంగా ఉన్నదో..ప్రస్తుతం ఎలా ఉందో గమనించాలని ప్రజలకు సూచించారు. బతుకులు చీకటి అవుతాయి..వెలుగు అనేది కనబడదని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారని...కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం..కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన అనంతరం ఎలా అభివృద్ధి జరిగిందో కళ్ల ఎదుట కనిపిస్తోందన్నారు. 
దేశానికి స్వాతంత్రం వచ్చి 71 ఏళ్లు అయ్యిందని...51 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పాలించిందన్నారు. ఉమ్మడి ఏపీలో అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు అని, పాలమూరు జిల్లాలో వివిధ పథకాల కింద 8-9 లక్షల ఎకరాలకు నీరందించింది కేసీఆర్ ఘనతేనని..వలసల ప్రారదోలింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. పవన్ కుమార్..హర్షవర్ధన్ రెడ్డిలు కోర్టులో కేసులు వేసి పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టడం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. మక్తల్ తాలూకాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో రామ్మోహన్ నాయుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారని, మూడు మున్సిపాల్టీలు కావాలని పట్టుబట్టారని కేటీఆర్ తెలిపారు. 

14:41 - October 29, 2018

చెన్నయ్: దీపావళి పండగ సందర్భంగా పటాసులు కాల్చే సమయంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన వారం తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్పుపై స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టపాసులు కాల్చే సమయాన్ని 8 గంటల నుంచి 10 గంటల వరకే అని ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఉదయం పూట కూడా టపాసులు కాల్చేందుకు అవకాశం కల్పించాలని కోర్టుకు విన్నవించింది. తెల్లవారుఝామున 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కాల్చేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు సర్కార్ కోరింది. 
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ‘‘గ్రీన్ క్రాకర్స్’’ ను మాత్రమే కాల్చాని ఆదేశాలివ్వడాన్ని తమిళనాడులోని టపాసుల తయారీదారులు తప్పుపట్టారు. అసలు ‘‘గ్రీన్ క్రాకర్స్’’ అనేవి ప్రత్యేకంగా ఏమీ లేవని వారంటున్నారు. దీనిమీద రివ్యూ పిటీషన్ వేయనున్నట్టు టపాసుల తయారీదారులు తెలిపారు. 

 

 

14:32 - October 29, 2018

ఢిల్లీ: ఇండోనేషియాలోని జకార్తాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో, విమానం నడిపిన పైలట్ ఢిల్లీకి చెందిన భవ్య సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి. లయన్ఎయిర్ వేస్ లో మార్చి 2011 నుంచి పనిచేస్తున్న సునేజా కేరీర్ లో ఎటువంటి రిమార్క్స్ లేవని లయన్ ఎయిర్ అధికారులుతెలిపారు. గత జులైలో ఢిల్లీకి బదిలీ చేయమని అడిగాడని, ఏడాది తర్వాత పోస్టింగ్ ఇస్తామని చెప్పినట్లు లయన్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.  సునేజా ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. సునేజా అనుభవంరీత్యా తనసర్వీసులో ఎక్కువగా బోయింగ్737 విమానాలనే నడిపారు. ప్రమాదానికి సరిగ్గా కొద్ది క్షణాల ముందు విమానం వెనక్కి తిరిగి వచ్చేందుకు అనుమతి అడిగినట్లు  తెలుస్తోంది. ఆతర్వాత కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం.... 188 మంది ప్రయాణికులు గల్లంతవ్వడం జరిగిపోయింది. లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది. అనంతరం 13 నిమిషాలకు అంటే సరిగ్గా 6:33కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.విమానంలో  మొత్తం 178 ప్రయాణికులు, ఓ చిన్నారి, ఇద్దరు పసికందులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ సిందు రహయు ప్రకటించారు. 

13:57 - October 29, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌‌లో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో విజయ్‌కు ఊహించని క్రేజ్ ఏర్పడింది. అర్జన్ రెడ్డి...గీతా గోవిందంలో పోషించిన పాత్రలకు విజయ్ దేవరకొండ పూర్తి న్యాయం చేశాడు. దీనితో అభిమానుల్లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అనంతరం వచ్చిన ‘నోటా’ అంతగా ఆడకపోయేసరికి విజయ్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అంతకముందే రిలీజ్ కావాల్సిన ‘ట్యాక్సీవాల’ చిత్రం నవంబర్ 16న రిలీజ్ కాబోతోంది. కానీ ఈ చిత్రంపై కూడా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. 
Image result for Vijay Devarakonda vs Ravi Tejaఎందుకంటే అదే రోజు పలు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రవితేజ చిత్రం కూడా ఉండడం గమనార్హం. మైత్రీ మేకర్స్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ అంటోనీ చిత్రం నవంబర్ 16న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసేస్తోంది. టాలీవుడ్‌లో మాస్ మహరాజాగా పేరొందిన నటుడు రవితేజ హీరోగా నటించడం...అందాల ముద్దుగుమ్మ ఇలియానా హీరోయిన్‌గా నటించడంతో అభిమానుల ఉత్కంఠకు కారణమని తెలుస్తోంది. ఈ సినిమానే కాకుండా చిన్న సినిమాలుగా రూపొందిన ‘24 కిస్సెస్’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరి ‘టాక్సీవాలా’ దూసుకపోతాడా ? లేదా ? అనేది చూడాలి. 

13:42 - October 29, 2018

పాడేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు మళ్లీ  తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద  వెలసిన మావోల పోస్టర్లు, బ్యానర్లు  కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున వీటిని మావోలు పడేసినట్లు తెలుస్తోంది. "చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోంద"ని మావోయిస్టులు ఆ కరపత్రాల్లో ఆరోపించారు. "బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార టీడీపీ, బీజేపీ నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని" మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో మన్యంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 
సెప్టెంబరు 23న అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోము ని మావోయిస్టులు హత్య చేసినప్పటినుంచి మన్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నావంటూ గతంలో కిడారిని మావోయిస్టులు హెచ్చరించారు. చివరికి ఆయన మావోల చేతిలో హతమయ్యారు.   సోమవారం వెలసిన పోస్టర్లు, బ్యానర్లతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు. 

13:29 - October 29, 2018

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. డిసెంబరు 15 కల్లా అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం గతవారం అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కారణంగానే విభజన ఆలస్యమవుతోందని కేంద్ర సర్కారు అత్యున్నత న్యాయస్థానానికి అంతకుముందు తెలియజేయడంతో.. రాష్ట్ర అధికారులు అన్ని వివరాలను సమగ్రంగా అఫిడవిట్‌లో ప్రస్తావించారు. 
డిసెంబర్‌లో నిర్మాణాలు పూర్తయ్యాక హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశించింది. భవనాల నిర్మణాలకు సంబంధించి ఫొటోలను అందించాలని కేంద్రం తరపు న్యాయవాది వేణుగోపాల్ తెలిపారు. న్యాయాధికారురల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్ కోర్టుకు తెలిపారు. 

13:05 - October 29, 2018

హైదరాబాద్ : కలం పట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. తన కలంతో మంచి మంచి గీతాలు ఒలకబోసిన ఆ రచయిత ప్రస్తుతం ఊచలు లెక్క బెడుతున్నాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాలు గుర్తుండే ఉంటాయి కదా..ఆ చిత్రాల్లోని హిట్ పాటలు రాసిన ‘కులశేఖర్’ దొంగగా మారిపోయాడు. ఆయన్ను దొంగతనం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 
ఇప్పుడు క‌లం ప‌ట్టిన చేతుల‌నే బేడీలు ప‌ట్టుకున్నాయి. అప్పుడు క‌లంతో అద్భుత‌మైన పాట‌లు రాసిన ఆయ‌నే.. ఇప్పుడు చోరీలు చేస్తున్నాడు. ఒక‌ప్పుడు సంచ‌ల‌న గేయ ర‌చ‌యిత‌గా తెలుగులో అద్భుతాలు సృష్టించిన కుల‌శేఖ‌ర్ ఇప్పుడు దొంగ‌గా పోలీసుల ముందు నిల‌బ‌డ్డాడు. Lyric Writer Kulasekhar in Police Remand In theft case.. lyricist kulasekhar arrested,kulasekhar,lyric writer kulasekhar,telugu cinama,తెలుగు సినిమా,రైటర్ కులశేఖర్,లిరిక్ రైటర్ కులశేఖర్ అరెస్ట్,దొంగతనం చేసిన కులశేఖర్,పూజారులను టార్గెట్ చేసిన కులశేఖర్గతంలో ఆయన మానసిక పరిస్థితి బాగా లేదంటూ..ఆరోగ్యం కూడా బాగాలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన్ను దొంగతనం కేసులో అరెస్టు అయ్యారు. సింహాచలం వాస్తవ్యుడైన కులశేఖర్ హైదరాబాద్‌ మోతీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఓ పూజారీ బ్యాగు చోరీ చేసిన కేసులో పోలీసులు కులశేఖర్‌ని అరెస్టు చేశారు. కులశేఖర్ నుంచి రూ.50వేల విలువైన 10 మొబైల్స్, రూ.45వేల విలువచేసే బ్యాగులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, తాళంచెవులు స్వాధీనం కావడం కలకలం రేపింది. 
ఇతను కుటుంబ సభ్యులతోనూ కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. గతంలో చేసిన ఓ దొంగతనం కేసులో కులశేఖర్ ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట ఓ వర్గానికి నచ్చలేదు. తమను కించపరిచే విధంగా గీతం ఉందంటూ ఆయన్ను వెలివేసింది. దీనితో ఆ వర్గానికి చెందిన వ్యక్తులపై ధ్వేషం పెంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు టాక్. 

12:48 - October 29, 2018

విజయవాడ : ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత రెండు రో్జుల క్రితం ఆమె తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రతిభా భారతి తండ్రి అనారోగ్యంతో విశాఖలోని పినాకినీ ఆసుపత్రిలో చేరారు. దీనితో ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిభకు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 
former speaker pratibha bharati health condition was seriousకానీ ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటోందని..దీనితో రక్తం ఎక్కించి, ప్లేట్‌లెట్స్ పెంచడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మరో రెండు రోజులపాటు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందజేయనున్నారని తెలుస్తోంది. 
మరోవైపు హైదరాబాద్‌కు తరలించి యాంజియోగ్రామ్‌ చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చికిత్స పొందుతున్న ప్రతిభా భారతిని పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

12:47 - October 29, 2018

ఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్నవివాదాస్పద రామ జన్మభూమి కేసుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.  రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు స్పందించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఈకేసును జనవరికి వాయిదా వేసింది. జనవరిలో విచారణ తేదీని తెలపనున్నట్లు సుప్రీం పేర్కొంది. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రాంలల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మొహీ అఖాడా మధ్య పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.  తీర్పుపై దాఖలైన అప్పీళ్లను సెప్టెంబరు 27వ తేదీన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేందుకు తిరస్కరించింది. 1994లో ఉన్నతీర్పును పరిగణనలోనికి తీసుకోవాలన్న అభ్యర్ధనను వెనక్కి నెట్టింది. ఈకేసులో ప్రధానంగా మసీదు ఇస్లామ్‌లో అంతర్భాగమా కాదా అన్న అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా  పలు సంచలన తీర్పులు  వెలువరిస్తున్న సుప్రీంకోర్టు రామజన్మభూమి అంశంలో ఎటువంటి తీర్పు వెలువరిస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 
ఆధార్‌ చట్టబద్ధత, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు, శబరిమలలో మహిళల ప్రవేశం వంటి కేసుల్లో వరుస కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈసారి అయోధ్య కేసును కూడా తేల్చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తారని, ఏ కేసునూ పెండింగ్‌లో పెట్టడాన్ని ఆయన అంగీకరించబోరని న్యాయవర్గాలు  చెప్పటం ఇక్కడ గమనార్హం. భారతీయ జనతాపార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరతామని ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది. 
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల మాట్లాడుతూ... రామజన్మభూమి రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు...రామమందిరం విషయంలో కూడా వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని, వివక్ష ఉండకూడదని అన్నారు. అయితే భారతదేశంలోని లౌకిక వాదం, మెజారిటీ ప్రజలు మనోభావాలతో ముడిపడివున్న ఈ కేసులో తీర్పు వస్తే, దేశ రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, దాని ప్రభావం  ఏ విధంగా ఉంటుంది అనేది తేలాలంటే జనవరి దాకా వేచి చూడాలి. 

12:26 - October 29, 2018

శ్రీలంక : ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని రనిల్‌ విక్రమసింఘేను పదవీచ్యుతుడిని చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నిర్ణయం తీసుకోవడంతో.. రాజకీయ వేడి రాజుకుంది. మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించడంతో.. రాజ్యాంగ సంక్షోభం దిశలో అడుగులు పడ్డాయి. అయితే.. ముందస్తు ఎన్నికలకు సిరిసేన, రాజపక్సేలు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తానే రాజ్యాంగబద్ధ ప్రధానమంత్రినని ప్రకటించుకున్నరనిల్‌ విక్రమసింఘే.. బల నిరూపణకు అవకాశమివ్వాల్సిందిగా సిరిసేనకు లేఖరాశారు. బలాబలాలు ఏవిధంగా చూసినా.. విక్రమసింఘేకు అనుకూలంగా ఉన్నాయి.
పార్లమెంట్‌లో 225 సీట్లుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 113. విక్రమసింఘే నేతృత్వంలోని యూఎన్‌పీకి 106 మంది సభ్యులుండగా.. తాజా పరిణామాల తర్వాత ఆయనకు మరో పది మంది చిన్నపార్టీల సభ్యులు, స్వతంత్రులు మద్దతిస్తామని ప్రకటించారు. 
సిరిసేన నేతృత్వంలోని ఐక్య ప్రజా స్వతంత్ర పార్టీ, రాజపక్సే నేతృత్వంలోని శ్రీలంక స్వతంత్ర పార్టీల బలం 95 మాత్రమే. ఈ నేపథ్యంలో నవంబరు 16న జరగనున్న బలపరీక్షలో విక్రమసింఘే విజయం తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. రాజపక్సే ఇప్పటివరకు కేవలం ఇద్దరు యూఎన్‌పీ సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టుకోగలిగారు. మిగిలిన 19 రోజుల్లో మరో 17 మందిని తనవైపు తిప్పుకుంటేనే ఆయన ప్రధానిగా కొనసాగుతారు. 

11:40 - October 29, 2018

ప్రకాశం : వేరే కులస్తులను ప్రేమించడం నేరమా ? వివాహం చేసుకోవద్దా ? ప్రేమించినా ? వివాహం చేసుకున్నా చంపేస్తారా ? గత కొన్ని రోజులుగా ఇలాంటి హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ పరువు పొతుందని స్వయంగా కుటుంబసభ్యులే అత్యంత దుర్మార్గానికి తెగబడుతున్నారు. కనిపెంచిన వారిపైనే దాడులు..హత్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి అనుమానస్పదంగా మ‌ృ‌తి చెందడం..మ‌ృతదేహాన్ని కాల్చివేయడం తీవ్ర సంచలనంగా మారింది. 

నాగిరెడ్డిపల్లిలో ఉంటున్న ఇంద్రజ...దళిత యువకుడులు ప్రేమించుకుంటున్నారు. గత ఐదు సంవత్సరాలు ప్రేమించుకుంటున్న వీరు త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు వారిని కలుసుకోకుండా చేశారు. ఇంద్రజకు వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాహానికి ఇంద్రజ వ్యతిరేకించింది. కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంద్రజ విగతజీవిగా దర్శనమిచ్చింది. ఉరి వేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు సమాచారం. కానీ ఆమెను గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు దహనం చేసినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు ఘటనాస్థిలికి చేరుకున్నారు. అమ్మాయి ఉరి వేసుకుందా ? లేక కుటుంబసభ్యులు ఉరి వేశారా ? అనేది తెలియాల్సి ఉంది. పరువు హత్యగానే పలువురు అనుమానిస్తున్నారు. 

11:38 - October 29, 2018

కోల్‌కతా: భారత్‌లో చైనా బ్రాండ్ మొబైల్ పోన్ల అమ్మకాల జోరు ఊపందుకొంటోంది. దాదాపు రూ 50,000 కోట్ల భారతీయుల సొమ్ము చైనాకు చేరాయి. ఇవి ఈ ఏడాది ఇప్పటివరకూ తేలిన లెక్కలు. గతేడాదితో పోలిస్తే ఈ సొమ్ము రెండింతలు పెరిగినట్టు ఆర్థిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సొమ్ము భారతీయులు కేవలం చైనాకు చెందిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయడం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో మన నిథులు తరలినట్టు భారత మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు. 
ప్రధానంగా చైనాకు చెందిన నాలుగు కంపెనీలు - జియోమీ, ఒప్పో, వివో, ఆనర్‌తో పాటు లెనోవా, మోటరోలా, ఒన్ ప్లస్. ఇన్‌ప్లిక్స్ మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్న చైనా బ్రాండ్‌ల యెక్క అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవి భారత్‌లో జరుగుతున్న మొత్తం అమ్మకాల్లో 50 శాతంకు చేరాయి. చైనా బ్రాండ్ మెబైల్ ఫోన్లపై వినియోగదారుకు మక్కువ పెరగటమే కారణమని వ్యాపార ఆర్థికవేత్తలు తెలియచేస్తున్నారు. కొరియా, జపాన్, భారత్‌లలో తయారయ్యే ఫోన్లతో పోల్చితే చైనా బ్రాండులు ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువధరకు మొబైల్ ఫోన్లను అందిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
 

 

11:24 - October 29, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ సోమవారం సమావేశం అవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ తేది దగ్గర పడుతుండటం, మరో 2 రోజుల్లో మహాకూటమి తొలి జాబితా, టీఆర్ఎస్ తుది జాబితా విడుదల చేయనున్న నేపధ్యంలో పార్టీ ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం అవుతోంది. ఈసమావేశంలో అసెంబ్లీకి పోటీ చేసే రెండవ విడత  అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే స్ధానం ఈరోజు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ రూపొందించిన 38మంది తొలి జాబితాను కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇటీవల ప్రకటించారు.ముషీరాబాద్ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావు, ఉప్పల్ నుంచి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎల్‌బీనగర్ నుంచి  పేరాల శేఖర్ రావు పోటీ చేస్తున్న వారిలో ఉన్నారు.

11:22 - October 29, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు ఆగడం లేదు. తాము కేంద్రం నుండి బయటకు రాగానే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని..సీబీఐ, ఈడీలను రాష్ట్రానికి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైసీపీ అధినేత జగన్‌పై దాడి అనంతరం మరింత రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా సోమవారం ఉదయం గుంటూరు జిల్లాలోని టీడీపీ నేత, ప్రముఖ వ్యాపార వేత్త రవీంద్ర నివాసంపై ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. 
Related imageకోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని ప్రముఖ వ్యాపార వేత్త. పెట్రోల్, గ్యాస్ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఈయన టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా నిర్వహిస్తున్నారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా అధిష్టానం మాత్రం ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపలేదు. దీనితో టీడీపీ వాణిజ్య విభాగాన్ని నాని చూస్తున్నారు. 
సోమవారం ఉదయం మూడు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు తొలుత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:00 - October 29, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కేటీఆర్ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి 100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. శంకుస్థాపన సమయంలో అమరావతికి  ప్రకటించాలని భావించారని...కానీ, ప్రధాని మోడీ ఏమీ ప్రకటించకపోవడంతో మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. ఒకవేళ తాను వంద కోట్లు ప్రకటించి.. ప్రధాని మోడీ ప్రకటించకపోతే వివాదం రాజుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు కేటీఆర్ వివరించారు.
ఇక హైదరాబాద్‌లో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రజలను ఇబ్బంది పెట్టే  పనులు టీఆర్ఎస్‌ ఏమీ చేయలేదని అన్న కేటీఆర్... అలాగే ఇబ్బంది పెట్టే పనులు చేయోద్దొంటూ కేటీఆర్ వారిని కోరారు.  

10:58 - October 29, 2018

ముంబై: సెక్యూరిటీ సిబ్బంది చొరవతో హార్ట్ఎటాక్‌తో కుప్పకూలిన ఓ ప్రయాణీకుడు ముంబై ఎయిర్‌పోర్టులో బతికి బయటపడ్డాడు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన గుబ్బల సత్యనారాయణ ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఉన్నట్టుండి టెర్మినల్ 2 లో హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిపోయాడు. 
అక్కడే ఉన్న ఏఎస్ఐ మోహిత్ కుమార్ శర్మ మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది స్పందించి సీపీఆర్ చేసి ఊపిరి తీసుకొనేలా చేశారు. తర్వాత ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ క్షేమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సత్యనారాయణ కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వీడియో చూడండి!

 

10:51 - October 29, 2018

విజయవాడ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట సభలతో నిరసన తెలుపుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దీనిని దేశమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు. తెలుగువారి ప్రాబల్య ప్రాంతాల్లో, భావసారూప్య పక్షాలున్న రాష్ట్రాల్లో ఈ పోరాట సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారు.  చెన్నైలో ఒక ధర్మపోరాట బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారు. బెంగాల్లో కూడా కేంద్ర కక్షపూరిత వ్యవహారాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.  

 

10:44 - October 29, 2018

విజయవాడ : ఏపీలో ఆపరేషన్ గరుడ వాస్తవమేనా? అంటే అవుననే అంటోంది తెలుగుదేశం పార్టీ. తాము ఆరోపణలు చేయడం లేదు వాస్తవాలే చెబుతున్నామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఆపరేషన్ గరుడకు బీజేపీ నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటున్నారు. ఇంతకీ రాం మాధవ్ ఏమన్నారు?ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. బీజేపి, వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అధికార తెలుగుదేశం నేతలు నిత్యం కోడై కూస్తున్నారు. వైసీపీ కేంద్రానికి సహకరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. అటు బీజేపి నేతల తాజా స్టేట్‌మెంట్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఆపరేషన్ గరుడ నిజామా కాదా అన్న మీమాంశలో ఉన్న ప్రజల్లో లేని పోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చుతూ.. బీజేపి నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 
Image result for operation garuda babuదేశ సంక్షేమం కోసమే తాను ఢిల్లీ వచ్చానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రాంమాధవ్ సెటైర్లు వేశారు. దేశం కాదు ముందు పదవి పోతుంది కాపాడుకోమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధినేతకు సీఎం పదవి పిచ్చి పట్టిందని, బీజేపితో కలిసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించాలన్నదే జగన్ ఉద్దేశమని మంత్రి దేవినేని విమర్శించారు.
Related imageఅటు బీజేపి.. ఇటు వైసీపీ చంద్రబాబును పద్మవ్యూహంలోకి నెట్టామని సంబర పడుతున్నాయని.. ఆ పద్మవ్యూహాన్ని చేధించుకోవడం చంద్రబాబు కొత్తేమీ కాదన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి చంద్రబాబు అభిమన్యుడు కాదు.. అర్జునడన్నారు రామయ్య. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందన్న తమ వాదనకు.. కాషాయ నేతల స్టేట్‌మెంట్లు అద్దం పడుతున్నాయన్న వాదన ఎక్కువైంది. 

10:36 - October 29, 2018

హైదరాబాద్ : మహాకూటమి నేతలు వేగం పెంచారు. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ముందే అభ్యర్థులను (105) ప్రకటించేసి ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకపోతోంది. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు రాష్ట్రంలో మహాకూటమి ఏర్పాటైంది. ఇందులో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ పార్టీలున్నాయి. కానీ పొత్తులపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీలు చర్చలు ప్రారంబించాయి. 
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. పొత్తులు..సీట్ల ఖరారు..అభ్యర్థుల ఖరారు విషయంలో చర్చించారు. తాజాగా మరోసారి మహాకూటమి నేతలు భేటీ కానున్నారు. సీట్ల కేటాయింపు...ఏ యే స్థానాలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై చర్చలు జరపనున్నారు. గురవారం నాటికి స్పష్టత ఇవ్వాలన్న యోచనలో ఉత్తమ్, ఎల్ రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డిలు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు-ఉత్తమ్ భేటీ తర్వాత టీడీపీ నేతలు స్పీడ్ పెంచారు. 

10:17 - October 29, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్న గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమ్య మృతి చెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చైతన్య కళాశాలకు చెందిన బస్సు బీభత్సానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. 
సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లడానికి జగద్గిరిగుట్టకు చెందిన రమ్య కూకట్‌పల్లి వద్ద రోడ్డు దాటుతోంది. అదే సమయంలో చైతన్య కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి రమ్యను ఢీకొట్టింది. తలపై నుండి వెళ్లిపోవడంతో అక్కడికక్కడనే విద్యార్థిని మృతి చెందింది. 
అక్కడనే ఉన్న విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై కళాశాలకు చెందిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థతి సమీక్షించారు. రమ్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. యాజమాన్యం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

10:00 - October 29, 2018

నిజామాబాద్: గోదావరికి ఎగువున మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లను ఈరోజు మూసివేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 1వ తేదీ నుంచి అక్టోబరు 28 వరకు గేట్లు తెరిచి ఉంచుతారు. అక్టోబరు 29 నుంచి జూన్ 30 వరకు గేట్లు మూసి వేస్తారు. ఈఏడాది భారీగా వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు జూన్ 11నే గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. గేట్లు ఎత్తే సమయంలో బాబ్లీ ప్రాజెక్టులో 0.56 టీఎంసీల నీరు ఉంది. ఈఏడాది ఇప్పటి వరకు 77.23 టీఎంసీల నీరు బాబ్లీ ప్రాజెక్టునుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. 
మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు లేకుండా, తాగునీటి కోసం వినియోగిస్తామని చెప్పి 2.5 టీఎంసీల సామర్థ్యంతో బాబ్లీ ప్రాజెక్టును 2004లో మొదలుపెట్టి 2009లో పూర్తిచేసింది. అయితే, ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ పరిధిలో అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసును విచారించిన కోర్టు.. ఎస్సారెస్పీకి గోదావరి నీరే ఆధారమైనందున వర్షాకాలం మొదలైన జూలై ఒకటి నుంచి అక్టోబరు 28 వరకు మొత్తం గేట్లను తెరిచి ఉంచాలని 2013లో తీర్పు చెప్పింది.  కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏటా జులై1 నుంచి అక్టోబరు 28 వరకు బాబ్లీ నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

09:08 - October 29, 2018

జకర్తా: ఇండోనేషియాలో సోమవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. జకార్తా నుంచి పంగకల్ పినాంగ్‌కు బయలు దేరిన లయన్ లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్‌ విమానం జేటీ 610  విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే  కనిపించకుండా పోయింది. ఉదయం గం.6-33 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. విమానంలో 188 మంది ప్రయాణికులున్నారని,  విమానం కోసం గాలింపు, రక్షణ  చర్యలు  చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

 

08:16 - October 29, 2018

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు పెద్ద కుట్రే జరిగిందని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆయన ఆదివారం లోటస్ పాండ్ లో జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒవైసీ, విశాఖ విమానాశ్రయంలో జగన్ ను హత్య చేయటానికి ప్రయత్నించారని, అసలు ఓ వ్యక్తి వీఐపీ లాంజ్ లోకి కత్తితో ఎలా రాగలిగాడని ప్రశ్నించారు. జగన్ అదృష్టవంతుడు కనుక ప్రాణాపాయంలేకుండా బయట పడ్డాడని అంటూ ఆయన ,జగన్ పై హత్యాయత్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం ప్రతిపక్ష నేతను పరామర్శించకపోవటం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఆయన అలా చేయకూడదని, మనమంతా మనుషులం అని, సాటి మనిషిపై మానవత్వం చూపాల్సిన అవసరం ఉందని  చెప్పారు. జగన్ పై చంద్రబాబు ఆడిన గేమ్ ప్లాన్ కు ఆంధ్రా ప్రజలు తగిన  సమయంలో సమాధానం చెపుతారని ఒవైసీ  అన్నారు. హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేతపై చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఒవైసీ హితవు పలికారు. జగన్ ను ఇకనుంచి మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పానని,జగన్ భవిష్యత్తు రాజకీయాల్లో తిరుగులేని పాత్ర పోషిస్తారని ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

07:22 - October 29, 2018

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. నవంబర్ 2న టీఆర్ఎస్ అభ్యర్ధుల తుది జాబితా విడుదల, అనంతరం జిల్లాల పర్యటన,ఎన్నికల ప్రచారం ఉన్న నేపధ్యంలో  కంటి, దంత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. గతంలో కూడా ఆయన ఢిల్లీలోనే కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. వచ్చేవారం అంతా బిజీ,బిజీగా ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకునేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం సోమవారం తిరిగి హైదరాబాగ్ తిరిగి చేరుకుంటారు. ఈపర్యటనలో ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఎవరితోనూ ఇతర సమావేశాలు ఉండవని పార్టీ నేతలు తెలిపారు. 

Don't Miss