Activities calendar

30 October 2018

22:04 - October 30, 2018

 కడప: ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మీరు ముందుకొస్తారా? లేదా? న్యాయానికి కట్టుబడి ఉన్నారా? లేదా? బాధ్యత తీసుకుంటారా? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని, తొందరలోనే శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే రాష్ట్రం తరపున అన్ని రకాల రాయితీలు ఇస్తామని సీఎం అన్నారు. కేంద్రం ముందుకు రాకపోతే ఆ బాధ్యతను తమకు అప్పజెప్పాలని, త్వరలో కేబినెట్ సమావేశం జరగనుందని, రాయలసీమ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు క్లియరెన్స్ ఇస్తున్నానని మరొక్కసారి ప్రజలకు హామీ ఇస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

కడపలో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని, ఇది ప్రజల హక్కు అని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే ఏ విధంగా తెప్పించుకోవాలో ఆ విధంగా తెప్పించుకుంటామన్నారు. తాము కూడా ఈ దేశంలో పౌరులమేనని, చిన్నచూపు చూడటం తగదని కేంద్రానికి హితవు పలికారాయన. ఇంకో నెలలోపులోనే ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామన్నారు.

21:50 - October 30, 2018


విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ లిస్టును పరిశీలించిన పోలీసులు అతని ఫోన్ నుంచి ఓ మహిళకు అధికంగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆ మహిళను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా శ్రీనివాసరావు అస్వస్థతకు గురి కావడంతో కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

21:13 - October 30, 2018

నల్గొండ: ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల దాడులే కాదు, భౌతిక దాడులూ జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడే ఉన్న భిక్షమయ్యగౌడ్ తన అనుచరులను వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో దాడిచేసిన భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఆలేరులో పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలేరులో బీఎల్ఎఫ్ టికెట్‌పై పోటీ చేయడం ఖరారైపోయింది.

20:15 - October 30, 2018

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి తుని పట్టణం నుంచి పవన్ పోరాటయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. తదుపరి ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. కత్తిపూడి జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. 4వ తేదీ ఉదయం వంతాడలో లేటరైట్ కార్మికులతో సమావేశం, రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన కాకినాడలో పారిశుధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. సా.4 గంటలకు పెద్దాపురంలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగిస్తారు. అనంతరం పెద్దాపురం ప్రజలతో సమావేశమవుతారు. 6వ తేదీన కాకినాడ ఎస్.ఈ.జడ్. నిర్వాసితులు, రైతులు పవన్‌ని కలిసి తమ సమస్యలు వివరిస్తారు. ఆ రోజు సా.4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ ఉంటుంది. 7వ తేదీన షెడ్యూల్ కులాల ప్రజలతో సమావేశం ఉంటుంది. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నగరంలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగిస్తారు. కాగా, కాటన్ బ్యారేజి మీదుగా కవాతు చేస్తూ పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Image may contain: 1 person, smiling, textనవంబర్ 2న విజయవాడ నుంచి మ.1.10గంటలకు రైలు మార్గంలో పవన్ తునికి బయలుదేరుతారు. నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం మీదుగా తుని చేరుకుంటారు. రైలు ప్రయాణం సందర్భంగా పవన్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

తూ.గో.జిల్లాలో పవన్ పోరాట యాత్ర షెడ్యూల్

నవంబర్ 2న విజయవాడ నుంచి మ.1.10గం. రైలులో పయనం
సా.5.20గం. తుని చేరిక
తుని రైల్వేస్టేషన్‌ సమీపంలో బహిరంగ సభ
నవంబర్ 3న స్థానిక నాయకులతో సమావేశం, కత్తిపూడి జంక్షన్‌లో బహిరంగ సభ
4వ తేదీ ఉదయం వంతాడలో లేటరైట్ కార్మికులతో సమావేశం, రచ్చబండ కార్యక్రమం
సాయంత్రం జగ్గంపేట బహిరంగ సభ
5వ తేదీన కాకినాడలో పారిశుధ్య కార్మికులతో సమావేశం
సా.4 గంటలకు పెద్దాపురంలో బహిరంగ సభ
6వ తేదీన కాకినాడ ఎస్.ఈ.జడ్. నిర్వాసితులు, రైతులతో భేటీ
సా.4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ 
7వ తేదీన షెడ్యూల్ కులాల ప్రజలతో సమావేశం
9వ తేదీ సా.4 గంటలకు కాకినాడ నగరంలో బహిరంగ సభ

18:47 - October 30, 2018

విశాఖ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తి దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై మోసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది‌’ అంటూ శ్రీనివాసరావు అరవడం సంచలనంగా మారింది. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, మీడియా వద్దకు తీసుకెళ్లండి అంటూ శ్రీనివాసరావు గట్టిగా అరిచాడు. నన్ను కాపాడండి లేదా నా అవయవాలు దానం చేయండి.. నన్ను చంపేసి రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారు.. అంటూ శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశాడు.

Image result for శ్రీనివాసరావు కేజీహెచ్జగన్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రీనివాసరావును మూడు రోజులుగా ప్రశ్నిస్తోంది. ఇవాళ అతడు భోజనం చేయలేదని, దీంతో అస్వస్ధతకు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు వైద్యులను పిలిపించి చికిత్స అందించారు. అయితే, తనకు ఇంకా ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో శ్రీనివాసరావును విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రికి తరలించారు . ప్రత్యేక బందోబస్తు మధ్య నిందితుడిని కేజీహెచ్‌లోకి తరలిస్తున్న సమయంలో శ్రీనివాసరావు గట్టిగా అరిచాడు. నాకు ప్రాణహాని ఉంది, మీడియా వద్దకు తీసుకెళ్లండి అంటూ గట్టిగా కేకలు వేశాడు. రాష్ట్రం బాగు కోసమే తాను ఈ పనిచేశానని, ఒకవేళ తాను చనిపోతే తన అవయవాలు దానం చేయాలంటూ శ్రీనివాసరావు అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శ్రీనివాసరావును పోలీసులు భుజం మీద మోసుకుంటూ ఆస్పత్రిలోనికి తీసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వారు వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌‌స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. నీ సమస్య ఏంటి అని వైద్యులు అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, శ్రీనివాస్ బీపీ, పల్స్‌ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేజీహెచ్‌ నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను డిశ్చార్జ్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Image result for శ్రీనివాసరావు కేజీహెచ్మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరిగేవి సాధారణ వైద్య పరీక్షలేనని వివరించారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలి, అందులో భాగంగానే వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ప్రభుత్వ కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు.

18:17 - October 30, 2018

హైదరాబాద్: జనసేన పార్టీకి జనసేనాని మాతృమూర్తి విరాళం ఇచ్చారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ తల్లి కొణెదల అంజనాదేవి 4 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. జనసేన కార్యాలయానికి వెళ్లిన అంజనాదేవి.. పార్టీ చీఫ్, తన కుమారుడు పవన్‌ను కలిసారు. తన తరఫున 4లక్షల రూపాయల చెక్కుని పవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తన తల్లి పాదాలను మొక్కిన పవన్, ఆమె ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించారు.

Image result for ANJANA DEVI DONATION JANASENAఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో అంజనాదేవి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్‌ను అంజనాదేవి కోరారు. పోలీస్ ఉద్యోగం గురించి తనకు బాగా తెలుసని, తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేశారని, తన తండ్రి ఎక్సైజ్ శాఖలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో పని చేసేవారిని గుర్తుచేసుకున్నారు. ఎక్సైజ్ శాఖలోనే కానిస్టేబుల్‌గా పని చేసిన కొణెదల వెంకట్రావుతో తనకు వివాహమైందని, ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Image may contain: 2 people, people smiling, people sittingపార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన తన మాతృమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన పవన్, ఆమె పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను’ అని అన్నారు. 

అంజనాదేవికి జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నమస్కరించారు. నాడు నాదెండ్ల భాస్కరరావు ఉత్తర్వుల కారణంగా తమ కుటుంబానికి కలిగిన మేలును ఆమె గుర్తు చేసుకున్నారు. నాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్..  ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించారని, నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే ఆ వయో పరిమితిని 58 ఏళ్లకు పెంచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వయోపరిమితి పెంచడంతో తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం నాడు లభించిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిన విషయమని అంజనాదేవి పేర్కొన్నారు.

Image may contain: one or more people, people sitting and table

18:13 - October 30, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌, తెలుగు టీజర్‌లకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది... తన కథ మురగదాస్‌ కాపీ చేసాడని, రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్ట్‌లో కేసు వేసిన సంగతి తెలిసిందే. మొదట సర్కార్ కథ తనదేననీ, ఏదైనా కోర్ట్‌లోనే తేల్చుకుంటానని చెప్పిన మురగదాస్‌, రచయిత వరుణ్ రాజేంద్రన్‌తో రాజీకి వచ్చాడు. అతనికి టైటిల్ క్రెడిట్‌తో పాటు, 30 లక్షల పారితోషికం కూడా ఇవ్వడానికి సన్ పిక్చర్స్ అండ్ దాస్ ఒప్పుకోవడంతో, సర్కార్ వివాదం సద్దుమణిగి, విడుదలకి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది. దీని గురించి వివరణ ఇస్తూ, మురగదాస్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. , కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి,యోగిబాబు తదితరులు నటించిన సర్కార్, దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళ్‌లో భారీగా రిలీజ్ కానుంది.

17:25 - October 30, 2018

గుజరాత్‌ : భారత జాతి పిత మహాత్మా గాంధీ జన్మదినం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛత పట్ల అవగాన కల్పించేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. కానీ స్వచ్ఛత పట్ల మరింత అవగాహన రావాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వల్సాడ్‌కు చెందిన పార్డీ నగరపాలక సంస్థ మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. నగరపాలక సంస్థ పరిధిలో మొబైల్ టాయిలెట్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ఐదు రూపాయాలు ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఈ కార్యక్రమంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇలా టాయిలెట్ వినియోగించే వారికి ఐదు రూపాయల ఇవ్వడం వలన, ఒకసారి టాయిలెట్ వినియోగించినవారే మళ్లీ మళ్లీ వస్తుంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన ఈ పథకం ప్రయోజనం పక్కదారి పడుతుందంటున్నారు. కాగా నగరపాలక సంస్థ ఇటీవల కొనుగోలు చేసిన మొబైల్ టాయిలెట్‌లో 4 బ్లాక్‌లు మహిళలకు, 4 బ్లాక్‌లు పురుషులకు ఉన్నాయి. మున్సిపాలిటీ ఈ నూతన నిర్ణయంపై అధికారులతో మరోమారు సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తోంది.
 

 

17:14 - October 30, 2018

నల్లగొండ : అన్ని పార్టీలు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని  మిర్యాలగూడ స్థానమే. ఈ నియోజక వర్గంలోని కొన్ని ప్రాంతాలలో అధికంగా గిరిజన జనాభా వుంటుంది. దీంతో మిర్యాలగూడలో ఎవరు గెలుపొందాలి? ఏ పార్టీ గెలుపు సాధించాలి? అనే విషయాన్ని వారే డిసైడ్ చేస్తారు. 

Related imageదామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లోని గిరిజనులు ఎవరికి ఓటేస్తే వారే ఎన్నికల్లో గెలుపొందుతున్నారు. మిర్యాలగూడ  నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజనుల ఓట్లు దాదాపు 37 నుంచి 40 వేల ఓట్ల వరకు వున్నాయి. ముఖ్యంగా ఒక్క ఉమ్మడి దామరచర్ల మండలంలోనే దాదాపు 30 వేల వరకు ఉన్నాయి అంటే మరి వారి ఎమ్మెల్యేను డిసైడ్ చేసేది వారు కాక ఇంకెరు? అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
Image result for amarendar reddy in trsగత ఎన్నికల్లోనూ తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన అమరేందర్‌రెడ్డికి మిర్యాలగూడ, నియోజకవర్గంలో మిగతా ప్రాంతాల్లో మెజార్టీ వచ్చినా దామరచర్ల మండలంలోని గిరిజనులంతా గంపగుత్తగా కాంగ్రెస్‌కే ఓటేయడంతో అప్పట్లో భాస్కర్‌రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సంప్రదాయం కొన్ని ఎన్నికల నుంచి కొనసాగుతోంది. 

Related imageదేశంలోనే సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ కేంద్రాన్ని ఈ సెగ్మెంటులోనే నిర్మిస్తుండటంతో ఆ ప్రాంతంలోని గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై వారు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటివరకు మహాకూటమి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ అన్ని పార్టీల నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై వారికున్న అసంతృప్తి వల్లన టీఆర్ఎస్ నేతకు వారు ఓటు వేస్తారా? లేదా? అనేది అనుమానించాల్సిన క్రమంలో మరి మిర్యాలగూడ ప్రాంతంలోని అడవిబిడ్డలు ఏపార్టీ నేతను ఎమ్మెల్యేగా డిసైడ్ చేస్తారో వేచి చూడాలి.

-మైలవరపు నాగమణి

 

 

17:13 - October 30, 2018

నిజ జీవితంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా, వినోద్ కప్రి డైరెక్షన్‌లో, సిద్ధార్థ్ రాయ్ కపూర్, శిల్పా జిందాల్, రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న హిందీ చిత్రం, పీహూ.. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.. మైరా విశ్వకర్మ అనే రెండేళ్ళ పాప ప్రధాన పాత్ర పోషించిన పీహూ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌‌లో మైరా, ఇంట్లో ఒంటరిగా తిరుగుతూ, నిద్రపోతున్న తల్లిని లేపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు పీహూమూవీ గిన్నిస్ రికార్డ్‌ పొందడానికి రెడీ అవుతోంది. ఎందుకంటే, ఒకే ఒక పాత్ర కనబడే బాలల చిత్రంగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. గతంలోనూ ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాలు వచ్చినా, ఓ బాల నటి ఏకైక పాత్రధారిగా కనిపించిన తొలి సినిమా  పీహూ‌నే కావడం విశేషం. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుందీ చిత్రం.  ఇంట్లో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త వహించాలో తెలియచెప్పేలా రూపొందిన పీహూ, నవంబర్ 16న రిలీజ్ కాబోతుంది..

 

16:52 - October 30, 2018

నల్లగొండ : జిల్లాల విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల గురించి ఈ ఎన్నికల సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఉమ్మడిగా వున్న నేపథ్యానికి ఈనాటి ఎన్నికల సమయంలో విభజన జిల్లాలలో వున్న నేపథ్యానికి వ్యత్యాసం వుంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న స్థానం ఏదైనా ఉందంటే అది మిర్యాలగూడ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. 
ఉద్యమాలకు మారుపేరుగా నల్లగొండను చెప్పుకుంటాం. అలాగే మిర్యాలగూడలో కూడా అదే వాతావరణం కనిపిస్తుంది.

Image result for congress and trs flags kodandaram flagsరాష్ట్ర ఉద్యమ సమరంలో చురుగ్గా పాల్గొని తనకంటు ఓ ముద్ర వేసుకున్నారు ప్రొఫెసర్ కోదండరాం. అనంతరం ఆయన  రాజకీయ పార్టీని స్థాపించిన క్రమంలో మిర్యాలగూడ నుండి తన పార్టీని మరింతగా బలోపేతం చేసుకునేందుకు ఇక్కడి నుండే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతోంది.  మరోపక్క కాంగ్రెస్ కూడా ఇదే ధోరణితో వుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే మహాకూటమి పొత్తులు తుది దశకు చేరి రెండ్రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది. దీంతో ఇక్కడ రాజకీయం రోజుకో రంగు పులుముకుంటోంది.
తెజస  కొత్త పార్టీ కావటం కావచ్చు..మరేదైనా కారణం కావచ్చు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. జాతీయ పార్టీ అయిన  కాంగ్రెస్‌కు కూడా ఇక్కడ నాయకత్వ సమస్య వుంది. దీంతో ఈ రెండు పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఇక్కడ పోటికి అన్ని రకాల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. మహాకూటమి మధ్య జరిగిన పొత్తు  సమావేశాల్లో మిర్యాలగూడ స్థానంపై కాంగ్రెస్‌, తెజసలు పట్టుబట్టాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో సర్వేను బట్టే ఈ స్థానాన్ని కేటాయించనున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. తాజాగా ఈ స్థానం తెజసకు కేటాయించారనే ప్రచారంతో స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్కంఠకు గురవుతున్నాయి.Related image
కాగా ఒక్కో కుటుంబానికి ఒక్క స్థానమే కేటాయిస్తామని పదేపదే కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి పార్టీ తరఫున తన తనయుడు రఘువీర్‌రెడ్డిని పోటీ చేయించాలని చూస్తున్న జానారెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇటీవలే తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన తెరాస నియోజకవర్గ ఇన్‌ఛార్జీ అమరేందర్‌రెడ్డిని బరిలోకి దింపుతారా? లేదా తన అనుచరుడికి ఎవరికైనా పార్టీ టిక్కెట్‌ ఇప్పిస్తారా? అనే విషయం తేలాల్సివుంది.

Related imageఇంకోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావు ఈసారి తెరాసకు ఓటేయాలని కోరుతుంటం విశేషం. మరి మిర్యాలగూడ స్థానం ఎవరికి దక్కేను? దక్కించుకున్నాక ఎవరు గెలిచేను? అనే విషయం వేచి చూడాల్సిందే.

-మైలవరపు నాగమణి

 

16:30 - October 30, 2018

అమెరికా : డొనాల్డ్  ట్రంప్. ఈ పేరే సంచలనం. తన నిర్ణయాలను నిర్మొహమాటంతో ఎన్నికల ఎజెండాలోపెట్టి విజయం సాధించిన ట్రంప్ కామెడీలు కూడా చేస్తుంటారు. తన వింత చర్యలతోను, చేష్టలతో నవ్వులు పూయించే ట్రంప్ మరోసారి నవ్వులు పూయించారు. గతంలో ఓసారి బాత్రూమ్ లో వాడే పేపర్ తో విమానం ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో  నెటిజన్లతో  వింత వింత కామెంట్స్ చేశారు. ఈసారి మరోసారి ట్రంప్ నెటిజన్లకు చిక్కారు.

Image result for trump umbrellaచిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ గా మారే ఆయన, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరగా, వర్షం కురుస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కిన వేళ ఈ ఘటన జరిగింది. విమానం లోపలికి వెళ్లే వేళ, గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో, ద్వారం వద్దే దాన్ని పడేసిన ట్రంప్ లోపలికి వెళ్లిపోయారు. ఆపై గాలికి ఆ గొడుగు అటూ ఇటూ తిరుగుతూ, విమాన ద్వారం వద్దే ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, సరదా సరదా కామెంట్లు వస్తున్నాయి. "ట్రంప్‌ కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు" అని ఒకరు, "చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్‌ కు వెళితే ఫ్లష్‌ కూడా చేయరేమో" అని ఇంకొకరు, "ట్రంప్‌ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు" అని ఇంకొకరు  కామెంట్లు చేశారు. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన ఇటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ట్రంప్ మరోసారి నవ్వులు పూయించటంలో సక్సెస్ అయినట్లే కదా!..

 

 

 
 
16:20 - October 30, 2018

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..వీళ్ళు ముగ్గురూ ఒకే సినిమా కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది? సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది కదూ.. అసలు విషయం ఏంటంటే, మలయాళంలో మోహన్ లాల్ మెయిన్ లీడ్‌గా, భారీ బడ్జెట్‌తో ఒడియన్ అనే పీరియాడికల్ మూవీ రూపొందుతుంది. పూర్వకాలం కేరళలో నివసించిన ఒడియన్ల తెగకు చెందిన ఒకవ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, మోహన్ లాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనబడతారు. అందుకోసం దాదాపు 18కిలోలకు పైగా ఆయన బరువు తగ్గారు కూడా.. వీఏ శ్రీకుమార్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఒడియన్‌ని దక్షిణాది భాషలన్నిటిలో విడుదల చెయ్యాలనుకుంటున్నారు. అందుకోసం, ఆయా భాషల హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుంటున్నారు. తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీ కాంత్ చేత ఒడియన్ చిత్ర ప్రారంభ డైలాగ్స్ చెప్పించబోతున్నారట. అలాగే, తెలుగులో తారక్ తన గొంతు అరువివ్వనున్నాడట. మోహన్ లాల్, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో కలిసి నటించారు. ఈ హీరోలిద్దరూ మోహన్ లాల్ అడిగితే కాదనకుండా వాయిస్ చెప్తారు కాబట్టి, ఒడియన్‌కి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్‌కి స్పందన బాగుంది. డిసెంబర్‌లో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు..


వాచ్ ఒడియన్ మూవీ టీజర్   

https://www.youtube.com/watch?time_continue=17&v=GOJsWfC52QI

 

13:23 - October 30, 2018

చెన్నై: ఏడాదికోసారి వచ్చే దీపావళి పండుగ అంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఆనందంతో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. ఆరోజు ఎక్కడ చూసినా మిరుమిట్లు గొలిపే దీపాల కాంతుల్లో ప్రతి ఇంట్లో చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాల్లో తేలిపోతారు. కాకపోతే ఇటీవల సుప్రీంకోర్టు  దీపావళికి బాణాసంచా కాల్చుకోవటాన్నిరాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు 2గంటలకు పరిమితంచేస్తూ తీర్పు చెప్పింది.  వాస్తవానికి గత ఏడాది బాణాసంచా విక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది.  ఈ ఏడాది బాణా సంచా కాల్చటంపై  సమయాన్ని రెండు గంటలకే పరిమితం చేయటాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. బాణసంచా కాల్చే సమయాన్ని తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదనంగా 14 గంటలు అనుమతించాలని అందులో కోరారు. పిటీషన్ మంగళవారం విచారణకు వస్తుంది. మరోవైపు తమిళనాడులోని  బాణాసంచా ఉత్పత్తిదారులు కూడా బాణాసంచా కాల్చే సమయంపై మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. కేవలం2 గంటల్లో బాణా సంచా కాల్చటం వలన వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం తీవ్రత ఎక్కువ ఉంటుందని, దీన్ని పరిశీలించి  సమయాన్ని పెంచాలని ఆ పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్లపై సుప్రీం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

13:22 - October 30, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడుతోంది. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నం చేయవద్దని, అలాంటి ప్రయత్నం విపరీత పరిణామాలకు దారితీస్తుందని ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. గత వారం ఎ.డి. షార్ఫ్‌ స్మారకోపన్యాసంలో ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఆచార్య ప్రకటించిన అభిప్రాయాలతో ఉద్యోగులు పూర్తిగా ఏకీభవిస్తున్నారని ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం ఒక లేఖ రాసింది. ఆచార్య చెప్పినట్టుగా ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీసే ప్రయత్నం ఏదైనా ఒక విపత్కర పరిస్థితికి దారి తీస్తుందని, అలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించింది. ఆచార్య అభిప్రాయాలకు ఉద్యోగులు గట్టి మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేసింది. 

 

13:16 - October 30, 2018

ఢిల్లీ: స్కూల్‌లో కాంపోజిషన్‌లో తప్పులు రాస్తే ఇంపోజిష్ రాయమని మాస్టారు విద్యార్థులకు శిక్ష వేస్తారు. విద్యార్థులు రాయకపోతే బెత్తంతో కొడతారు. ఆ భయంతో విద్యార్థులు ఇంపోజిష్ రాసేస్తారు. కానీ ఇప్పుడు రాజకీయాలలో కాంపోజిషన్, ఇంపోజిష్ అంటూ జాతీయ బీజేపీ అధ్యక్షుడు... కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇంపోజిషన్ రాయమంటూ శిక్ష వేశారు. ఇదేమిటి? అనుకుంటున్నారా? అదేనండీ మ్యాటర్‌లోకి వచ్చేస్తున్నా.. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే నేతలు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు, కామెంట్స్ విసురుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో తప్పు చేసిన రాహుల్ గాంధీ మరోసారి బీజేపీకి టార్గెట్ అయిపోయారు. అదేమంటే......

రాహుల్ చేసిన తప్పును పసిగట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వంద సార్లు ఇంపోజిషన్ రాయాలంటూ శిక్ష వేశారు. మిజోరంలోని సైనిక స్కూల్ విద్యార్థినులను అభినందిస్తూ, ఓ ట్వీట్ పెట్టిన రాహుల్, మిజోరాం బదులు మణిపూర్ అని రాశారు. ఈ పొరపాటును బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య కనిపెట్టి సెటైర్లు వేయగా, రాహుల్ దాన్ని తొలగించారు. అప్పటికే దాని స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. 

దీనిపై స్పందించిన అమిత్ షా, "కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఈశాన్య భారతంలో మణిపూర్, మిజోరం వేర్వేరు రాష్ట్రాలని గుర్తుంచుకుంటా అని వందసార్లు రాయండి" అని ట్వీట్ చేశారు. రాహుల్‌పై బీజేపీ నేతల సెటైర్లు కొనసాగుతున్నాయి. కాగా దీనిపై యువరాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

12:55 - October 30, 2018

దర్శకుడు రాజమౌళి, బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని దృష్టిలోపెట్టుకుని, అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ కేటాయించి, ఈ ఆర్ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్)మూవీని నిర్మించబోతున్నాడు నిర్మాత డి.వి.వి.దానయ్య. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ల సరసన ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలని ఫిక్స్ చేసాడని తెలుస్తుంది. ఇద్దరు టాప్ హీరోయిన్లతో పాటు, ఒక ఫారిన్ భామ కూడా, తారక్ అండ్ చెర్రీలతో ఆడిపాడనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు మొదలు పెట్టేసాడు. ఇక చరణ్, బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ 5న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టే ప్లాన్‌లో ఉన్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందించనున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తారు.

 

12:52 - October 30, 2018

విశాఖ : ఏపీలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో దాడులు చేసిన ఐటీ అధికారులు...ఇవాళ విశాఖలోని పేర గ్రూపు సంస్థలో సోదాలు జరుపుతున్నారు. పేరం గ్రూపు అధినేత హరిబాబు.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు బంధువు. 

ఐటీ దాడులతో రియల్ ఎస్టేట్ సంస్థల్లో, కన్‌స్ట్రక్చన్స్ కంపెనీల్లో గుబులు మొదలైంది. మొదటి నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలపై పక్కా సమాచారంతో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని సంస్థలపై ఐటీ దాడులు జరుగనున్నాయి. ఆదాయ పన్ను చెల్లించని సంస్థలపై దాడులు చేస్తున్నారు. విడతల వారిగా సోదాలు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వారిపై నిఘా పెట్టారు. 

12:30 - October 30, 2018

ఢిల్లీ : దూర తీరాలలో గగన విహారంలో ఉద్యోగం చేసే కొడుకు పండగకు వస్తాడనుకుని వేయి కళ్లతో ఎదురు చూసే తల్లికి కడుపుశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. ప్రతీ సంవత్సరం అందరూ కలిసి దీపావళి పండుగను వేడుగగా చేసుకుని మురిసిపోయే ఆ కుటుంబంలో శాశ్వతంగా చీకటిని మిగిల్చి వెళ్లిపోయాడు. ఆనవాయితీయికి చరమగీతం పాడి ఆ ఇంట విషాద గీతం వినిపించేలా చేసి వెళ్లిపోయిన కుమారుడ్ని తలచుకుని ఆ తల్లి హృదయం పుట్టెడు శోకంతో అంగలార్చుకుపోతోంది. నవంబర్ 7వ తేదీన వచ్చే దీపావళి పండుగకు వస్తాడని గంపెడంత ఆశతో కుమారుడు  భవ్వే సునేజా కోసం సంగీతా సునేజా ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్న వేళ ఆ ఇంట్లో పిడుగులాంటి వార్త వినిపించింది. అంతే కుటుంబం అంతా కుదేలైపోయింది. కలా? నిజమా? అనే మీమాంసలో పడిన ఆ కుటుంబానికి కల కాదు నిజమే అనే చేదు వార్త నమ్మటానికి ఎంతో సమయం పట్టలేదు. 

Image result for pilot SUNEJA BHAVE FAMILYభవ్యే సునేజా తో కలిసి ఆ ఇంట ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ.... ఓ పిడుగులాంటి వార్త ఆ కుటుంబం ఆశలను ఆనందాలను చిదిమేసింది. ఇక ఎప్పటికీ భవ్యే రారని... ఆయన ఇక లేరని తెలిసి అంతా శోక సంద్రంలో ముగినిపోయారు. 31 ఏళ్ల అతి చిన్నవయసులోనే ఇండోనేషియాలో సముద్రంలో కూలిపోయిన విమానం పైలట్‌ భవ్వే సునేజా. ఈ ప్రమాద వార్తను టీవీల్లో చూసిన ఆయన కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. కన్నీరుమున్నీరైన ఆయన తల్లి సంగీతా సునేజాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.  

Image result for pilot SUNEJA BHAVE FAMILY2009లో ఆయనకు పైలట్‌ లైసెన్సు వచ్చిన భవ్వే మయూర్‌ విహార్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో భవ్యే చదువుకున్నారు. తండ్రి గుల్షన్‌ సుఖేజా చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ గా పనిచేసే తండ్రి, తల్లి సంగీతా సునేజా ఎయిర్‌ ఇండియాలో పనిచేసేవారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజర్‌గా పనిచేసిన గరిమా సేథీతో 2016లో భవ్యేకు  వివాహమైంది. 2011లో లయన్‌ ఎయిర్‌లో చేరిన భవ్వేకు పైలట్‌గా 6,000 ఫ్లైట్‌ అవర్స్‌ అనుభవం ఉన్న ఈ భారతీయుడు అనుభవం తన ప్రాణమేకాదు..తనతో పాటు ఎంతోమందిని జలసమాధి చేయటం విచారించదగిన విషయం. కళ్లల్లో దీపాల ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న జీవన సహచరి జీవితాంతం ఎదురు చూసినా రాని భాగస్వామి కోసం గుండెలవిసేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు ఎవ్వరి తరం కావటంలేదు. 

 
12:18 - October 30, 2018

చెన్నయ్: మెట్రో ట్రైన్‌ను పోలిన రైలు బండి 16 బోగీలతో త్వరలో పట్టాలపైకి రాబోతోంది. ట్రైన్-18 అనే ఈ రైలు గంటకు 160 రచ స్పీడుతో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు. ఈ రైలు భారత్ లోనే డిజైన్ చేయబడి ఇక్కడే తయారు చేయబడుతోంది. ఇంటిగ్రెల్ కోచ్ ఫాక్టరీ (ఐసీఎఫ్) ఈ రైలును రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లో నిర్మించింది. ఈ రైలును ఢిల్లీ-భోపాల్ సెక్షన్ లో ప్రారంభించబోతున్నారు.  దీనికి ఇంజన్ మామూలు రైలు మాదిరిగా విడిగా ఉండదు. బోగీలతోపాటే కలిసి ఉంటుంది. మామూలు రైళ్లకంటే అత్యధిక స్పీడు కలిగిఉంటుంది. ప్రస్తుతం గటిమాన్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే గంటకు 160 కిమీ ప్రయాణించగలుగుతుంది. 

 

 

12:17 - October 30, 2018

జకార్తా : ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో 189 మంది జలసమాధి అయ్యారు. వీరిలో శిశువు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. 'లయన్‌ ఎయిర్‌' విమానం జావా సముద్రంలో కూలిపోయింది. 

జకార్తా విమానాశ్రయం నుంచి పంగ్‌కల్‌ పినాంగ్‌ నగరానికి బయలుదేరిన 'లయన్‌ ఎయిర్‌' విమానం గల్లంతైంది. ఉదయం 7.20కి పంగ్‌కల్ చేరుకోవాల్సిన విమానం బయలుదేరిన రెండు నిమిషాలకే గల్లంతైంది. ఇండోనేసియాకు చెందిన 'లయన్‌ ఎయిర్‌' విమానం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లో జావా సముద్రంలో కూలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయ బృందాలను రంగంలోకి దించారు. ప్రయాణికుల్లో ఎవరైనా సజీవంగా బయటపడ్డారేమోనని గాలింపులు చేశారు. ఎక్కడా వారి జాడ కనపడలేదు. సమయం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లాయి. ఈలోగా కొన్ని మృతదేహాలు, అవయవాలను సహాయ బృందాలు గుర్తించాయి. విమానానికి సంబంధించిన ప్రధాన శకలాన్ని ఇంకా కనుగొనాల్సి ఉందని సహాయ చర్యల విభాగం ఉన్నతాధికారి తెలిపారు.

విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం సాధారణంగానే ఉంది. విమానంలోని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ 'బ్లాక్‌ బాక్స్‌' దొరికితేనే ప్రమాదానికి కారణం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ''ఈ విమానం చాలా ఆధునికమైంది.. అది ఎప్పటికప్పుడు డేటాను బట్వాడా చేస్తుంది. దాన్ని కూడా సమీక్షిస్తాం'' అని అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో శకలాలను గుర్తించి, బ్లాక్‌ బాక్స్‌ను వెలికి తీయడం సవాల్‌తో కూడుకున్నదంటున్నారు. 

11:41 - October 30, 2018

మాస్‌రాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రూపొందుతున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని.. గోవా బ్యూటీ ఇలియానా కథానాయిక. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముగింపు వ్రాసుకున్నతర్వాతే కథ మొదలు పెట్టాలి అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటొని  టీజర్, ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంది. అమర్, అక్బర్, ఆంటొనిగా.. మాస్‌రాజా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు, మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్, వివిధ ప్రాంతాల్లో, డిఫరెంట్ గెటప్స్‌లో వెళ్ళి, రౌడీలను రఫ్ఫాడించడం చూస్తుంటే, మాస్‌రాజా అండ్ శ్రీనువైట్ల ఆర్ బ్యాక్ అనిపిస్తుంది. టీజర్‌లో శ్రీనువైట్ల మార్క్ కామెడీ లేదు కాబట్టి, ఈసారి కొత్త ప్రయత్నం ఏదో చేసాడనిపిస్తుంది. ఇలియానా బొద్దుగా బాగుంది. టీజర్‌కి థమన్ ఇచ్చిన ఆర్ఆర్ హైలెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. విడుదల చేసిన తక్కువ టైమ్‌లోనే, టీజర్‌కి మూడు మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది..ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న విడుదల కానుంది..   

 

11:34 - October 30, 2018

హైదరాబాద్ : రాజకీయాలంటే రొచ్చు. రాజకీయాలంటే పార్టీల మధ్య కంటే మనుషులపై మనుషులు పోరాడే యుద్ధం. రాజకీయమంటే రణరంగం. రాజకీయమంటే రచ్చ. ఇప్పటి వరకూ యువతలో వుండే భావనలివి. కానీ వర్శిటీలలో పీహెచ్ డీలు చేసి పట్టా పుచ్చుకుని నేరుగా రాజకీయాలలోకి అడుగిడుతున్నారు నేటి తరం. దీనికి వేదిక ఇటీవలే 100ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక వర్శిటీ ఉస్మానియా. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన ఉస్మానియా వర్శిటీ రాష్ట్ర  విభజన నేపథ్యంలో వర్శిటీని ఉద్యమాలను వేరు చేసి చూడలేం. ఉద్యమం పుట్టిందే వర్శిటీలో అనే సంగతి మరువకూడదు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు పోరు తెలంగాణలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు వర్శిటీ పీహెచ్ డీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థినీ, విద్యార్థులు..

Image result for balka sumanశాసనసభ ఎన్నికల్లో పీహెచ్‌డీ విద్యార్థులు,   ఇప్పటికే పీహెచ్‌డీ పూర్తిచేసి పట్టా పొందిన వారు.. తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఒకవైపు పీహెచ్‌డీ పట్టా సాధనకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు తాము సైతం సై అంటున్నారు. గతంలో పెద్దగా చదువుకోనివారే రాజకీయాల్లోకి వచ్చేవారు. తరువాత డిగ్రీ, పీజీ చదివినవారు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు పెరిగారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.   పీహెచ్‌డీ పట్టాతో ఎన్నికల గోదాలోకి  దిగుతున్న వారు క్రమేణా పెరుగుతున్నారు. 

Related imageరాజకీయాలు అనగానే తమకు సంబంధం లేని అంశంగా చాన్నాళ్లు ఉన్నత చదువులు చదువుకున్నవారు భావించేవారు. ఇక పీహెచ్‌డీలు చేసినవారైతే బోధన రంగంలో ఎక్కువగా స్థిరపడేవారు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపేవారు. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారి వారంతా రాజకీయాల బాట పడుతున్నారు. తమకున్న పరిశోధన పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పరిష్కారమార్గాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిశోధక విద్యార్థులు, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారంతా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వారే కావడం విశేషం. 

తమకున్న పరిశోధన పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిశోధక విద్యార్థులు, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారంతా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వారే కావడం విశేషం. వారెవరో చూద్దాం..
ఉస్మానియా వీరి ఊపిరి....

  • 2014లోనే ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన బాల్కసుమన్
  • 2014 లో ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు
  • 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఓడిన ఎంఏ విద్యార్థిని సీతక్క
  • 2014లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా  గెలిచిన  సంపత్ కుమార్
  • 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిన పిడమర్తి రవి
  • 2018లో గాదరితో తలపడేందుకు సిద్ధంగా వున్న  అద్దంకి దయాకర్ 
  • 2014లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గాదరి కిశోర్
  • 2018 బీఎల్ఎఫ్ నుండి బరిలోకి ఎంఏ విద్యార్థిని రమావత్ సౌజన్య
  • ఉస్మానియా విద్యార్థిని విద్యార్థులు పోరు తెలంగాణలో బరిలోకి దిగనున్నారు.  మరి వీరి అదృష్టం వీరిని రాజకీయాలలో నిలబెడుతుందో..లేదా అనుభవంగా మిగిలిపోతుందో వేచి చూడాలి.
  • -మైలవరపు నాగమణి
11:34 - October 30, 2018

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డును ఓ దొంగ పట్టపగలే బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించాడు. బొమ్మ తుపాకీతో సినీ ఫక్కీలో బ్యాంక్‌ దోపిడీకి యత్నించాడు. అయితే కస్టమర్లు చాకచక్యంగా అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

విశాఖపట్నానికి చెందిన డేవిడ్‌ కొన్నాళ్లుగా రాయదుర్గంలో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌‌ మణికొండలోని కరూర్‌ వైశ్యాబ్యాంక్‌లో అతనికి అకౌంట్‌ కూడా ఉంది. అయితే డేవిడ్‌ కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి ఓ ప్లాన్‌ రూపొందించుకున్నారు. తన ఖాతా ఉన్న బ్యాంక్‌లోనే చోరీ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

డబ్బులు కొట్టేయడానికి స్కెచ్‌ వేసిన డేవిడ్‌ దాన్ని అమలు జరిపేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఓ డమ్మీ పిస్తోలు, డమ్మీ బాంబ్‌లను సమకూర్చుకున్నాడు. అనుకున్న ప్రకారం సోమవారం పట్టపగలు నల్లటి దుస్తులు ధరించి
మణికొండలోని కరూర్‌ వైశ్యాబ్యాంక్‌లో ప్రవేశించాడు. వస్తూవస్తూనే అందరినీ డమ్మీ పిస్తోలుతో బెదిరించాడు. దీంతో బ్యాంక్‌లో ఉన్నవారంతా ఊహించని ఘటనతో షాక్‌కు గురయ్యారు. డేవిడ్‌  బొమ్మ తుపాకీతో 15 నిమిషాలపాటు బ్యాంక్‌లో హల్‌చల్‌  చేశాడు. బ్యాంక్‌ చోరీకి విఫలయత్నం చేశాడు. తర్వాత తేరుకున్న బ్యాంక్‌ సిబ్బంది, కస్టమర్లు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. డేవిడ్‌ను దొరకబుచ్చుకుని, బొమ్మ తుపాకీ లాక్కొని అతడికి దేహశుద్ధి చేశారు. కస్టమర్ల నుంచి తప్పించుకోవడానికి దొంగ పరుగులు తీసినా వెంటబడి మరీ కొట్టారు. చివరకు  రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

డేవిడ్‌ చోరీకి యత్నించిన సమయంలో క్యాష్‌ కౌంటర్‌లో 15 నుంచి 20 లక్షల నగదు ఉంది. అయితే నగదు మాత్రం చోరీకి గురికాలేదని బ్యాంక్‌ మేనేజర్‌ తెలిపారు. నిందితుడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు బ్యాంక్‌ చోరీకి ఎందుకు ప్రయత్నించాడు? కేవలం అతనొక్కడే బ్యాంక్‌ చోరీకి యత్నించాడా? దీని వెనకాలా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

11:34 - October 30, 2018

ఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అప్ డేట్ చేస్తూ వస్తోంది.  Media Visibility అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. 
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉద్యోగ,వ్యాపార రీత్యా అనేక గ్రూప్ లలో  సభ్యులుగా ఉంటుంటారు. కొన్నిసార్లు ఒకే పోస్టు అన్నిగ్రూప్ ల్లోను చక్కర్లు  కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పోస్టుకు సంబంధించిన వీడియోనో, ఫోటోనో, అన్ని గ్రూప్ల్లో డౌన్లోడ్ అయ్యి డేటా లాస్ అవుతూ ఉంటుంది. తద్వారా ఫోన్ మెమరీ కూడా నిండి పోతూ ఉంటుంది. అవసరమైన వాటినే డౌన్ లోడు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది అన్ని ఫీచర్లు ఉపయోగించుకోలేక పోవటం వల్ల ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది. మనకు అక్కర్లేని  ఫోటోలు,వీడియోలు గ్యాలరీలోంచి ఎప్పటికప్పుడు డిలిట్ చేసుకోకపోవటం వల్ల త్వరగా ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దాంతో గ్రూప్ ఎడ్మిన్ మీద, పోస్టు పంపించిన వారిమీద చిరాకుపడుతూ ఉంటారు. లేదా గ్రూప్ ల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు.
ఇకనుంచి అలాంటి బాధ లేకుండా వాట్సప్  ఇప్పుడు కొత్త ఫీచర్  అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానికి మీరు ఏం చెయ్యాలంటే ...ముందుగా మీరు ఉన్న గ్రూప్ ఓపెన్  చేసి, రైట్ సైడ్ టాప్ లో ఉన్న 3 చుక్కలను తాకి, Group Info ఓపెన్  చేయండి.  అప్పుడు మీకు స్క్రీన్ మీద Media Visibility అనే కొత్త ఆప్షన్  కనపడుతుంది. అందులో No అని సెట్ చేసి OK  చేస్తే  వాట్సప్ లో వచ్చిన  ఫోటోలు, వీడియోలు మీకు కనపడతాయి కానీ, మెమరీ లోకి రావు. ఈ ఆప్షన్ ప్రస్తుతం గ్రూప్ లకు మాత్రమే ఉంది. అలాగే ఏ గ్రూప్ కి ఆగ్రూప్ కి ఈ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. 

10:30 - October 30, 2018

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన చేయడానికి "సంతోషిస్తున్నా.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అందరి ఆశీస్సులు, దీవెనలు సంతోషానికి కలిగించాయి" అని ట్వీట్ చేశారు.

బేబీ మీర్జా మాలిక్ పుట్టాడంటూ షోయబ్ మేనేజర్ అమీబ్ హక్ కూడా ట్వీట్ చేశారు. తొలి బిడ్డకు జన్ననిచ్చిన ఆనందంలో షోయబ్ ఉబ్బితబ్బిబవుతున్నారని మీడియాకు తెలిపారు. నగరంలోని ఓ ఆసుపత్రిలో సానియా మీర్జాకు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. 

2010లో షోయబ్, సానియాల వివాహం జరిగింది. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్నిసానియా ఏప్రిల్‌లో ప్రకటించారు. గత కొంత కాలంగా బిడ్డ కోసం టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా 2020లో టోక్యో ఒలింపిక్స్ ఆడనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. సానియా మీర్జా చెల్లెలు కూడా సానియా మగబిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని ట్వీట్ చేశారు.

10:24 - October 30, 2018

ఢిల్లీ : రోజురోజుకు పెరుగుతున్న సామాన్యుడికి చుక్కలు చూపించిన పెట్రోల్ ధరలు ఇప్పుడు రోజు రోజుకూ తగ్గుతున్న పండుగ సంబరాన్ని సామాన్యుడికి కల్పిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న వేళ, సామాన్య మానవుడు బెంబేలెత్తిపోయినవేళ బండి బైటకు తీయాలంటేనే హడలిపోయే పరిస్థితి నుండి బండిమీద జామ్ అంటు పోయేలే ఈరోజుకి అంటే వరుసగా 13వ రోజు కూడా తగ్గుదల కనిపించింది.Image result for Essential goodsకాగా పెట్రోల్ ధరలు పెరిగాయంటే ఆ ప్రభావం సామాన్యుడిపై భారంగా కూరగాయలు, నిత్యావరస వస్తువులపై పడి అన్ని సరుకుల ధరలు పెరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు తగ్గుతున్నందువల్లన నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం వుంటుంది. 

Related imageఇంధన ధరలు ఆరు వారాల కనిష్ఠానికి చేరగా, వరుసగా 13వ రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మంగళవారం నాడు పెట్రోలుపై 20 పైసలు, డీజిల్‌ పై 7 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 79.55కు, డీజిల్‌ ధర రూ. 73.78కు తగ్గింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర. 85.04కు,  డీజిల్ ధర రూ. 77.32గా ఉంది. ఇక కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.63కు, డీజిల్ ధర రూ . 75.70కు చేరగా, చెన్నైలో రూ. 82.86కు పెట్రోలు ధర, రూ. 78.08కి డీజిల్ ధర తగ్గింది. హైదరాబాద్‌ లో పెట్రోలు ధర రూ. 84.33గా, డీజిల్ ధర రూ.80.25గా ఉండగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 83.47, డీజిల్‌ ధర రూ. 79కి తగ్గింది. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింతగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10:02 - October 30, 2018

హిమాచల్ ప్రదేశ్ : ప్రపంచంలో రకరకాలు టీలున్నాయి. గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా చెప్పుకుంటు పోతే ఆ లిస్టు చాంతాండత అవుతుంది. ప్రాంతాలను బట్టి, టేస్ట్ ను బట్టి, అభిరుచిని బట్టి టీలను వివిధ రకాలుగా తయారు చేసి ఆస్వాదిస్తుంటారు. కానీ టీలలో ఇంకా కొత్త కొత్త రకాలు పుట్టుకువస్తూనే ఉన్నాయి. ఈ వెరైటీ టీలు  తేనీటి ప్రియులకు మరిన్ని కొత్త రుచులను అందిస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి కొత్త తరహా టీ ఆకులు ప్రవేశించాయి. దీని ధర ఎంతో తెలిస్తే షాకవడం కచ్చితంగా ఖాయం!!,  ఈ టీ ఆకుల ధర అక్షరాలా కిలో రూ. 24,501 !!. ఏమిటి నమ్మశక్యంగా లేదా? అలాగే అనిపిస్తుంది మరి ఈ వెరైటీ టీ ధర వింటేనే చుక్కలు కనిపిస్తున్నాయి కదూ? మరి టేస్ట్ ఎలా వుంటుందనే ప్రశ్న కూడా వస్తుంది కదూ? అదిమాత్రం మీరు టేస్ట్ చేసి చెప్పాల్సిందే.మరి ఆ కాస్ట్లీ టేస్టీ టీ గురించి తెలుసుకుందామా?

Image result for different type of teasఅరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో ఈ టీఆకులు లభ్యమవుతాయి. చాయ్ మీద పరిశోధనలు చేసే ఒక సంస్థ ఈ తేనీరుకు గల చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసింది. తొలుత ఈ చాయ్‌ని కీనియాలో వినియోగించారని తెలుస్తోంది. ఈ అలవాటు అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ చాయ్ రిచ్ క్వాలిటీతో కూడి ఉంటుంది. కాగా ఈ టీ చూసేందుకు వంకాయి రంగులో కనిపిస్తుంది. ఈ చాయ్ క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని తెలుస్తోంది. కాగా ఈ తేయాకును అడవుల్లోనే పండించి తీసుకువస్తారని తెలుస్తోంది. గతంలో ఈ టీ రూ. 15,000 ఉండగా, ఇప్పుడు మరింత ప్రియం అయ్యింది.

 

09:56 - October 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై పలువురు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు  మండిపడుతున్నారు. ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందంటూ ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనంత విద్వేశపూరితమైన వివక్ష ఇక్కడ కనిపిస్తోందని ధ్వజమెత్తారు. తమను లక్ష్యంగా చేసుకుని అప్రాధాన్య పోస్టుల్లో నియమిస్తోందని ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తమను పట్టించుకోవడం లేదనే కారణంతో దాన్నుంచి విడిపోయి ‘తెలంగాణ స్థానిక ఐఏఎస్‌ అధికారుల సంఘాన్ని’ ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఐఏఎస్‌లు సోమవారం రాత్రి బేగంపేటలోని ఐఏఎస్‌ అధికారుల సంఘ భవనంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. 20 మందికి పైగా ఐఏఎస్‌లు హాజరయ్యారు. తమకు కేటాయించాల్సిన పోస్టుల్లో నాన్‌ ఐఏఎస్‌లు, విశ్రాంత అధికారులను నియమించారని వాపోయారు. సీఎస్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినా వారు స్పందించలేదన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న తెలంగాణ అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురవుతున్నామని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘంగా ఏర్పడ్డామని తెలిపారు. 

09:48 - October 30, 2018

ఢిల్లీ: మీటూ ఉద్యమం అన్ని రంగాలలోను ప్రకంపనలు పుట్టిస్తోంది. అక్కడ ఇక్కడ అనకుండా వివిధ రంగాలలో మీటూ ప్రకంపనలు రేగుతున్నాయి. ఇకపై వేధింపులన సహించం అంటు గళమెత్తిన మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వేధించినవారు ఎంతటివారినైనా వారు వదిలిపెట్టటంలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలతో దేశంలో ప్రారంభమైన ‘మీటూ’ ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ‘మీటూ’ కారణంగా ఇప్పటికే కేంద్రమంత్రి ఎంజే అక్బర్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పదవులు పోగొట్టుకోగా.... తాజాగా ప్రముఖ రచయిత, నటుడు సుశీల్ సేథ్‌ వంతు వచ్చింది. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు మహిళలు ఆరోపించడంతో టాటా గ్రూప్ కంపెనీ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్ కన్సల్టెంట్‌గా ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించింది.Image result for susheel seth ratan TaTaసేథ్‌పై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన మీదట కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

2016లో టాటా గ్రూప్ చైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత.. ఆ వివాదం నుంచి కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌‌‌కు మళ్లీ పునర్వైభవం తేవడంలో సేథ్ కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ‘క్యాలెండర్ గర్ల్స్’ నటుడిగా గుర్తింపుతెచ్చుకున్న సేథ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు దాదాపు ఆరుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ‘‘మీటూ’’ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటి, మోడల్ దియాంద్ర సోరెస్, సినీ నిర్మాత నటాషా, రచయిత ఇరా త్రివేది, జర్నలిస్టు మందాకినీ గెహ్లాల్, ఇషిత యాదవ్, జాస్మిన్ దేవేకర్ సహా తదితరులు ఆయనపై గొంతెత్తడంతో టాటా సన్స్ ఆయనను పక్కన బెట్టింది.కాగా ప్రముఖ అంతర్జాల సంస్థ గూగుల్ సంస్థలో కూడా మీటూ ప్రభావానికి 48మంది ఉద్యోగులకు సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్వాసన పలికారు. వీరిలో సీనియర్ ఉద్యోగులు కూడా వుండటం గమనించాల్సిన విశేషం.
 
 

 

09:34 - October 30, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఈసీ దూరం పెట్టింది. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసులను వినియోగించకూడదని నిర్ణయించింది. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులు.. తెలంగాణ ఓటర్లను ప్రలోభ  పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రచారంలో అభ్యర్ధుల తీరుతెన్నులను పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఖర్చులను లెక్కగడుతోంది. ఎన్నికల ఖర్చులను  డేగకళ్లతో కనిపెట్టేందుకు 119నియోజకవర్గాల్లో త్వరలో పరిశీలకులను నియమించబోతుంది.

ఎన్నికల కాలం నడుస్తుండటంతో.. తెలంగాణలో పరిణామాలను ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటిలిజెన్స్  అధికారులు ధర్మపురిలో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో ఈసీ సీఈఓ రజత్ కుమార్ చర్యలు చేపట్టారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీకి రజత్  కుమార్ లేఖ రాశారు. పట్టుబడ్డ పోలీసులకు సంబంధించిన వివరాలు అందించాలని కోరారు. అయితే.. ఏపీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. ఈసీ కీలక నిర్ణయం  తీసుకుంది. ఏపీ మినహా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల  బలగాల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది.

ఎన్నిక‌ల గ‌డువు సమీపిస్తున్న కొద్ది ఎన్నికల సంఘం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేస్తోంది. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగే ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు  అభ్య‌ర్దులు ఉప‌యోగించే అన్ని అంశాల‌పై నిఘా క‌ఠిన‌త‌రం చేసింది. ఎన్నిక‌ల్లో భ‌ద్ర‌త ‌కోసం 70 వేల బ‌ల‌గాలను వినియోగించనుంది. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు, ఈవీఎంల భ‌ద్ర‌త ‌కోసం కేంద్ర  బ‌ల‌గాల‌ను మోహరించనుంది. ఎన్నిక‌ల భద్రత కోసం కేంద్రం నుండి 307 ప్ల‌టూన్ల బ‌ల‌గాల‌ను కోరగా.. 250 ప్ల‌టూన్ల బ‌ల‌గాల‌ను కేటాయిస్తామ‌ని కేంద్రం తెలిపింది. అత్య‌వ‌స‌రమైతే మ‌రిన్ని  బ‌ల‌గాలు పంపుతామంది.  

ఎన్నిక‌ల‌ నిర్వహణకు విఘాతం క‌లిగించే వారిపైనా ఈసీ దృష్టిసారించింది. ఆయుధాల కలిగిన వారి వివరాలు సేకరించిన ఈసీ.. లైసెన్స్ కలిగిన తుపాకీలను స్వాధీనం చేసుకుంది. ఓట‌ర్లను  ప్ర‌లోభాల‌కు గురిచేసే మద్యం స‌ర‌ఫ‌రాపైనా నిఘా పెంచాల‌ని ఈసీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే కోటి రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.  ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎమ‌ర్జెన్సీ  స‌మ‌యంలో వైద్య సేవ‌ల ‌కోసం ఎయిర్ అంబులెన్స్ ల వినియోగంపైనా దృష్టి సారించింది. క‌ర్నాట‌కతో పాటు ఖ‌మ్మం ఎన్నికల్లో ఈ సేవ‌లు వినియోగించిన నేప‌థ్యంలో అవి ఎలా  ఉప‌యోగ‌ప‌డ్డాయ‌న్న అంశంపై అధ్యయ‌నం చేయనుంది.

అభ్య‌ర్దుల ఖ‌ర్చునూ ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నికల కమిషన్ లెక్క‌గ‌డుతోంది. వారు పెట్టే ప్ర‌తిపైసా ఖర్చు పైనా నిఘా ఉంటుంద‌ని స్పష్టం చేసింది. అభ్య‌ర్థులు రూ.28 ల‌క్ష‌ల కంటే ఎక్క‌వ  ఖ‌ర్చుచేయ‌రాద‌ని సూచించింది. ఎన్నిక‌ల ఖ‌ర్చుపై నిఘా పెంచేందుకు 119 నియోజక వ‌ర్గాల్లో ప‌రిశీల‌కులను నియమించనుంది. తెలంగాణలో ఎన్నిక‌లు స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో  నిర్వ‌హించేందుకు అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో పోలీసుల‌తో మార్చ్ ఫాస్ట్ నిర్వహించనుంది. 

08:54 - October 30, 2018

హైదరాబాద్ : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, వడపోతల తర్వాత 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఆ జాబితాతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాత్రి ఢిల్లీకి వెళ్లింది.  నవంబర్‌ 1న రాహుల్‌ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోదముద్ర వేయనుంది. అదే రోజు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో 35 మంది పేర్లు ప్రకటించే అవకాశముంది. 

 

08:42 - October 30, 2018

హైదరాబాద్ : తుది మ్యానిఫెస్టోను నవంబరు 6న విడుదల చేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధం అవుతోంది. పలు కీలకమైన హామీలతో పాటు, భారీ సంఖ్యలో కొత్త ప్రతిపాదనలు తుది మ్యానిఫెస్టోలో ఉండేలా ఆ పార్టీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తున్నారు. 

ఈ నెల 17న పాక్షిక మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్ 8 హామీలను ప్రకటించారు. మిగిలిన హామీలపై చర్చలు సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన దళిత, గిరిజనుల కోసం హామీల రూపకల్పనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు అధ్యక్షతన మ్యానిఫెస్టో కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కమిటీలు నవంబరు 3 కల్లా తమ నివేదికలను సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నాయి. 

 

08:39 - October 30, 2018

గుంటూరు: గుంటూరుజిల్లా నరసరావుపేట, వరవకుంటలోని ఓటింబర్ డిపోలో మంగళవారం తెల్లవారుఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డిపోలోని టేకు దుంగలు అగ్నికి ఆహుతయ్యాయి. 4 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకురావటానకి ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సిఉంది. 

 

07:53 - October 30, 2018

కడప : ప్రొద్దుటూరులో ఇవాళ టీడీపీ ధర్మపోరాట సభ తలపెట్టారు. ఈనేపథ్యంలో ముందస్తు అరెస్టులకు తెర తీశారు. ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా ఆయన్ను ఖచ్చితంగా అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించడంతోసీపీఐ, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యను ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయనతోపాటు పలువురు నేతలను సీపీఐ కార్యాలయం నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబును అడ్డుకుంటామని సీపీఐ తెలిపింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ జగన్‌పై కత్తి దాడి ఘటన తరువాత టీడీపీ తొలి సభ జరుగనుంది. జగన్ సొంత జిల్లాలో సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఉత్కంట నెలకొంది. 

 

07:53 - October 30, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ కు గురవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి రజత్కుమార్ చెప్పారు. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని పలువురు ప్రతిపక్షనేతలు ఇటీవల సీఈవోకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రజత్కుమార్ డీజీపీని  వివరణ కోరారు. జాతీయభద్రత, నేరాల అదుపుకోసం కట్టుదిట్టమైన విధి,విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్ జరుపుతున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి సీఈవో కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎవరి ఫోన్ ఐనా ట్యాపింగ్ చేయాలంటే కేంద్రహోంశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిఉంటుందని, దేశరక్షణ,శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే అలాంటి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్ధితులు లేవని డీజీపీ నివేదిక ఇచ్చినట్లు రజత్కుమార్ తెలిపారు. 

Don't Miss