Activities calendar

31 October 2018

21:45 - October 31, 2018

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్‌ను చంపేందుకు టీడీపీ కుట్ర పన్నిందని వైసీపీ నాయకులు.. సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. జగన్‌పై దాడి విషయం తెలిశాక పార్టీలకు అతీతంగా(టీడీపీ మినహా) అంతా ఆయనను పరామర్శించారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకి కనీసం మానవత్వం కూడా లేదని, జగన్‌ను పరామర్శించకపోవడం దారుణం అని వైసీపీ నాయకులు మండిపడ్డారు.

వైసీపీ చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్ తనను నెంబర్ వన్ ముద్దాయి అని అన్నారని.. అందుకే జగన్‌కు ఫోన్ చేసి పరామర్శించలేదని చంద్రబాబు వివరించారు. అసలు కోడి కత్తి దాడితో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్‌పై సానుభూతి వస్తుందని  నిందితుడే స్వయంగా ఒప్పుకున్నాడని చంద్రబాబు తెలిపారు. కావాలనే టీడీపీపై నేరాన్ని మోపాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సభ్యత్వాన్ని చంద్రబాబు పునరుద్ధరించుకున్నారు. కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టీడీపీకి 71 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పలు అంశాలపై తీవ్రంగా స్పందించారు.

21:25 - October 31, 2018

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. మోడీ మనల్ని నమ్మించి మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ వస్తే దేశం బాగుపడుతుందని భావించామని, కానీ దేశం ఇబ్బందుల్లో పడేలా చేస్తారని అనుకోలేదని వాపోయారు. మోడీ దేశాన్ని ముంచేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. డిల్లీని మరిపించేలా ఏపీ రాజధాని కడతామని మోడీ చెప్పారని.. చివరికి మన చేతికి నీరు, మట్టి ఇచ్చి మన నోట్లో మట్టి కొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి న్యాయం జరుగుతుందని బీజేపీతో కలిశామని గుర్తు చేసిన చంద్రబాబు.. బీజేపీ పొత్తు ధర్మాన్ని కూడా పాటించలేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం తాను ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పిన చంద్రబాబు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలుస్తానన్నారు. అందరం కలిసి ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాహుల్‌తో చెబుతానన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామాన్ని కాపాడుకోవడానికే తన ప్రయత్నమని చంద్రబాబు వివరించారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. మోడీ, అమిత్ షాలకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశానికి ఎన్నోసార్లు టీడీపీ దశదిశ చూపిందని, మరోసారి, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినన్పటికీ సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. 

అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సభ్యత్వాన్ని చంద్రబాబు పునరుద్ధరించుకున్నారు. కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టీడీపీకి 71 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ అనేది పెద్ద కుటుంబ వ్యవస్థ అని,  కార్యకర్తల బాగోగులు చూడటం టీడీపీ కర్తవ్యమని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా 71 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అని, కార్యకర్తలకు బీమా కింద రూ.58.44 కోట్లు చెల్లించామని అన్నారు. తెలుగు జాతి గర్వపడే విధంగా తాను పని చేస్తానని చంద్రబాబు తెలిపారు.

21:25 - October 31, 2018

సిద్దిపేట : ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరు పెంచిన టీఆర్ఎస్ నేతలు ఆయా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతీ వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేత హరీశ్ రావు కారును కూడా తనిఖీలు చేపట్టారు. డబ్బు, మద్యం పంపిణీలు జరుగుతాయనే అనుమానంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే అదే సమయంలో మంత్రి హరీశ్ రావు హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని సిద్ధిపేటకు వస్తున్నారు. ఆయన కారును ఆపిన అధికారులు పూర్తిగా తనిఖీ చేశారు. 
 

21:11 - October 31, 2018

విజయవాడ : నను చంపేస్తారేమోనని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అనుమానం వ్యక్తం చేశారని.. అసలు తనను ఎవరు చంపేస్తారో లక్ష్మీపార్వతిని కూర్చోబెట్టి సీబీఐ విచారణ జరపాలని శివాజీ పేర్కొన్నారు.  ఏపీ ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ తెలుసుకుందని.. కాబట్టి అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటోందన్నారు. తాను రాష్ట్రం కోసం పడే తపనను అర్థం చేసుకోలేని మూర్ఖులే తనను విమర్శిస్తారన్నారు. ఆపరేషన్ గరుడ గురించి తనకు తెలిసినపుడు హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. తనకు తెలిసింది చెప్పానని ఆయన వెల్లడించారు. వైసీపీ, బీజేపీ ఉడత ఊపులకు తాను రానని.. దర్యాప్తు సంస్థ రమ్మంటే వస్తానని శివాజీ స్పష్టం చేశారు. జగన్ దాడి ఎపిసోడ్‌లో ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అని శివాజీ వ్యాఖ్యానించారు.ఆపరేషన్ గరుడపై ప్రజలకు విశ్వాసముందని.. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతోందన్నారు. 
 

20:35 - October 31, 2018

అమరావతి : లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీ. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి  రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి అన్నమాటకు కట్టుబడి వున్నారు. రాజకీయాలలో లేకపోయినా..ఆయన సర్వేలు మాత్రం చేయిస్తునే వుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే డిమాండే వేరు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటివరకూ జరుగుతూనే వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన సర్వేను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్ మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును ఆయన అనుభవం ఉన్న నేతగా అభివర్ణించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారంటూ కితాబు ఇచ్చారు. కాగా అవకాశం వస్తే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానంటు సంచలన వ్యాఖ్యలు చేసిన లగడపాటి చంద్రబాబుతో భేటీ కావటం చూస్తుంటే  తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ తరపునుండి గానీ..కాంగ్రెస్ తరపు నుండి గానీ పోటీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

20:20 - October 31, 2018

తిరుపతి: ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆమె.. జగన్‌పై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. జగన్‌పై దాడిని అందరూ ఖండించాలని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఓ బాధ్యత గల ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే.. కత్తి అంగుళం దిగిందా.. అర అంగుళం దిగిందా అంటూ వెటకారం చేస్తూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. జగన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తికి పోలీసులే మంచి వ్యక్తని సర్టిఫికెట్లు ఇస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. జగన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తికి నేరచరిత్ర ఉన్నట్లు తేలిందని.. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడు శ్రీనివాసరావు తన భద్రతపై ఆందోళన చెందుతున్నాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అనంతపురంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలపై దాడి.. ఇప్పుడు జగన్‌పై దాడి.. ఈ ఘటనలన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంలో అవినీతి పెరిగిందంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం కాదు.. ఏపీలోనే అవినీతి పెరిగిందన్నారు. దేశం సర్వతోముఖాభివృద్థి సాధించే దిశగా మోడీ ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసలు కురిపించారు. బీజేపీని ఓడించడం.. మోడీని గద్దె దించడం ఎవరికి సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు. ఇక అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని పురందేశ్వరి తెలిపారు.

20:15 - October 31, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల లొల్లి ఓకొలిక్కి రాలేదు. అభ్యర్థుల జాబితాపై కూడా ఇంకా ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఖరారైన అభ్యర్థుల జాబితతో సహా అధిష్టాన్ని కలిసేందుకు  ఉత్తమ్ ఢిల్లీ ప్రయాణమై వెళ్లారు. టీఆర్ఎస్ తొలి 105మంది జాబితాను ఖరారు కేసిన ప్రచారంలో దూసుకుపోతున్న క్రమంలో కూడా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్నా కాంగ్రెస్ సీట్ల సంఖ్యపైనా...స్థానాల ఖరారు పైనా స్పష్టత ఇవ్వకపోవటంతో మిగిలిన ప్రధాన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, కోదండరాం పార్టీలు కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వాములైన కోదండరామ్ తో సీట్ల గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ తనను కలవాలంటూ కోదండరామ్ కు ఫోన్ చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు కోదండరామ్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరనున్నారు. అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీతో సీట్ల సర్దుబాటు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోదండరామ్ చర్చించనున్నారు. అలాగే సీట్ల సర్దుబాటుపై కూడా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

19:43 - October 31, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల్లో ఆయన వెరీ వెరీ స్పెషల్. మాటకు మాట, చేతకు చేత ఆయన స్పెషల్. తెలంగాన రాష్ట్ర సాధన నేపథ్యంలో కేసీఆర్ దీక్ష చేపట్టిన సందర్భంగా నేను కూడా దీక్ష చేస్తానని హల్ చల్ చేసిన నేత ఆయన. సర్వేలు చేయించటంలో ఆయన దిట్ట. ఆయన చేయించిన సర్వేలు 90శాతం వరకూ కరెక్ట్ యిన నిరూపణ అయ్యింది కూడా. తెలుగు ప్రజలు విడిపోవద్దనీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ లో ఆయన సృష్టించిన పెప్పర్ స్ప్రే విషయం గుర్తుకొస్తే చాలు గుర్తుకొచ్చే పేరు ఆయనే. ఆయనే మాజీ ఎంపీ  నేత లగడపాటి రాజగోపాల్, రాష్ట్రం విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి విడిపోయినప్పటి నుండి అన్నమాటకు కట్టుబడి వున్న లగడపాటి రాజ్ గోపాల్ మరోసారి వార్తల్లోకొచ్చారు. అదికూడా తెలంగాణలో అవకాశం వస్తే పోటీ చేస్తానంటు!!!.

Image result for lagadapati rajagopal surveyతెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన జరుగుతున్న ఎన్నికలను పురస్కరించుకొని  సోషల్ మీడియాలో వస్తున్న సర్వే వివరాల గురించి మాజీ ఎంపీ లగడపాటి  స్పందించారు. పార్టీలు కోరితే సర్వేలు చేసి చెబుతానని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణలో పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని ప్రకటించటంతో అందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
డిసెంబర్ 7వ తేదీ తర్వాత తన సర్వే వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు సక్సెస్ అవుతోందా... లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని లగడపాటి తెలిపారు. మరి ఆయన నిజంగానే తెలంగాణలో పోటీ చేస్తారా? లేదా? అనే విషయం తెలాల్సివుంది. 2014 నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. భావోద్వేగాలతో రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్నానని అందరూ అనుకోబట్టే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని లగడపాటి స్పష్టం చేశారు.

 

19:30 - October 31, 2018

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కేటగిరీ ర్యాంకింగ్‌లో భారత్ 77 వ స్థానాన్ని కైవసం చేసుకొంది. ఏకంగా 23 స్థానాలు దాటి 190 దేశాల పోటీలో 77 ర్యాంకుకు చేరింది. టాప్ 100 స్థానాల్లోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి కారణంగా ఇది సాధ్యమయ్యింది. వ్యాపార సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఒకేసారి 23 ర్యాంకులను దాటుకొని 77వ స్థానంలో నిలిచింది. 
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 10 సూచీల్లో 6 పాయింట్లు సాధించడం ద్వారా అంటే వ్యాపారం మొదలు పెట్టడం, వ్యాపారం చేయడం అంశాల్లో ఈ ప్రగతి భారత్ కనబరించింది. వ్యాపార సరళీకరణ, నిర్మాణ రంగంలో త్వరితగతిన అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, రుణాల మంజూరు, టాక్స్ చెల్లింపులు, సరిహద్దు హద్దులు లేకుండా వ్యాపారం చేయడం, కాంట్రాక్టులను అప్పజెప్పటం, దివాలా సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలలో భారత్ మెరుగైన ఫలితాలను రాబట్టిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

 

19:24 - October 31, 2018

గుజరాత్ : మేరు నగర ధీరుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్. అఖండ భారతావని తునాతునకలుగా విడిపోతున్న సమయంలో అకుంఠిత దీక్షా దక్షతతో ఉక్కు సంకల్పంతో రక్త రహితంగా 565 సంస్థానాలను భారత్ లో విలీనం చేసేందుకు పటేల్ పడిన తపన, దీక్ష, అపర చాణుక్యుడిగా సందర్భాను సారంగా సంప్రదింపులు జరిపి ఉక్కు సంకల్పంతో ఉక్కు మనిషిగా మారిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ యొక్క అత్యంత భారీ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’నిర్మించి భరత జాతి ఆయనకు జన్మదినం రోజు ఘన నివాళులర్పించింది. ఈ విగ్రహమే ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా పేరొందింది. మరి మన సర్ధార్ కు ఎవరూ సాటిరారు కదా..మరి ప్రపంచంలో వున్న అతి భారీ విగ్రహాల గురించి తెలుసుకుందాం...

Image result for sardar patel statue height in modi and top 10 statesస్టాట్యూ ఆఫ్ యూనిటీ: 597 అడుగుల ఎత్తులో వున్న స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టిన ఈ సర్దార్ విగ్రహం చైనాలోని బుద్ధ విగ్రహం కంటే 100 అడుగుల ఎత్తు ఎక్కువ. అంతేకాదు అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెట్టింపు ఎత్తు మన సర్ధార్ సొంతం. Image result for Spring Temple Buddha in china

స్పింగ్ టెంపుల్ బుద్ధ : చైనాలోని హెవెన్ ప్రావిన్స్ లో నిర్మించిన డ 503 అడుగుల ఎత్తు. ఇందులో 66 అడుగుల ఎత్తున లోటస్ వుంటుంది. 
లెక్యున్ సెట్క్యార్ : లెక్యున్ సెట్క్యార్ పేరుతో వుండే ఈ విగ్రహం 427 అడుగులు. ఈ విగ్రహం కంటే సర్ధార్ పటేల్ విగ్రహం 173 అడుగుల ఎత్తు ఎక్కువ.
ఉషుకి : జపాన్ లోని ఉషుకిలో వుండే బుద్ధుడి ప్రతిమ 394 అడుగుల ఎత్తు. ఇందులో 30 అడుగులు బేస్ వుంటే మరో 30 అడుగుల ఎత్తులో లోటస్ వుంటుంది.
గునియన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సాన్యా : గునియన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సాన్యా గా పేరొందిన ఈ తదాగతుడు ప్రతిమ చైనాలో వుంది. దీని ఎత్తు 354 అడుగులు. 

ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు ెప్రాచుర్యం పొందాయి. బుద్ధుడు, ఏసు క్రీస్తు, ఝాన్సీ లక్ష్మీభాయ్, శివుడు, మేరీ మాత ఇలా ఎన్నో, ఎన్నెన్నో. కానీ ఇప్పటి వరకూ పేరొందిన అన్ని విగ్రహాల కంటే మన  భరతజాతి ఐక్య గీతక..కార్యసాధకుడు సర్దార్ పటేల్ విగ్రహానికి సాటిరావు కదా..

 
 
 
 
19:19 - October 31, 2018

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ జోరు పెంచింది. ఇప్పటికే 38మందితో ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ.. రెండో లిస్టును కూడా సిద్ధం చేసింది. గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అభ్యర్థుల జాబితాతో తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు బోర్డు కమిటీ ముందు జాబితాను ఉంచనున్నారు. ఈ సమావేశం అనంతరం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. నవంబర్ 12 నామినేషన్లు వేయడానికి మొదటి రోజు కావడంతో.. ఆ లోపే మొత్తం అభ్యర్ధులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. రెండో జాబితాలో 50 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Image result for telangana bjpఇక మూడో లిస్టును కూడా 7 లేదా 8వ తేదీన ప్రకటించడానికి బీజేపీ సిద్ధమైంది. రెండో జాబితాలో ప్రకటించే 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసెంబ్లీ సమ్మేళనాలు వెనువెంటనే పూర్తి చేయాలని బీజేపీ నిర్ణయించింది.

 

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా..

నెం. నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 చాంద్రాయణగుట్ట షెహజాది (ఏబీవీపీ)
2 చార్మినార్ ఉమా మహేందర్
3 బహుదూర్ పురా హనీఫ్ అలీ
4 మలక్ పేట ఆలే జితేంద్ర (నరేంద్ర కొడుకు)
5 యాకత్ పురా రూప్ రాజ్
6 కూకట్‌పల్లి మాధవరం కాంతారావు
7 ఆలేరు డి.శ్రీధర్ రెడ్డి
8 కొడంగల్ నాగూరావు నామోజీ
9 మహబూబ్‌నగర్ పద్మజా రెడ్డి
10 దేవరకద్ర ఎగ్గెని నర్సింహులు
11 రామగుండం బలమూరి వనిత
12 రాజేంద్ర‌నగర్ బద్దం బాల్‌రెడ్డి
13 కొత్తగూడెం కుంచె రంగా కిరణ్
14 శేరిలింగంపల్లి యోగానంద్
15 నిజామాబాద్ యెండల లక్ష్మీనారాయణ
16 ఇబ్రహీంపట్నం కొత్త అశోక్‌‌గౌడ్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

18:10 - October 31, 2018

గత 12 ఏళ్ళుగా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది, కలువ కళ్ళ చిన్నది కాజల్ అగర్వాల్.. ఇప్పటికీ వరసగా సినిమాలు చేస్తూ  జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తుంది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాలు చేస్తున్నకాజల్‌కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది.
2.ఓ. తర్వాత శంకర్ భారతీయుడు 2 స్టార్ట్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. భారతీయుడుకి సీక్వెల్‌గా రూపొందబోయే ఈ మూవీలో, కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్‌ని ఎంపికచేసారని తెలుస్తోంది. కమల్‌తో కాజల్ నటించడం ఇదే మొదటిసారి. ఓ వైపు కుర్ర హీరోలతో, మరోవైపు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది కాజల్ అగర్వాల్ ..

18:06 - October 31, 2018

విశాఖపట్నం: రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం చెలరేగింది. విశాఖలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఏపీఐఐసీ సర్వేయర్‌ చిరంజీవిరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో చిరంజీవి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం పది చోట్ల ఈ దాడులు జరిగాయి.

ఇప్పటివరకు చిరంజీవికి రెడ్డిపల్లిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురంలో 300 గజాల స్థలం, రేవాళ్ళపాలెంలో 80 గజాల స్థలం, మురళీనగర్‌లో 200 గజాల్లో ఇల్లు, ఒక ప్లాట్‌ను గుర్తించారు. బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. చిరంజీవిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏపీఐఐసీలో చిరంజీవి 20ఏళ్లుగా సర్వేయర్‌గా పని చేస్తున్నారు. దీంతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 

కాగా, విశాఖలో అవినీతి నిరోధక శాఖల వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, పేరం గ్రూప్స్‌ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపగా...తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్‌ చిరంజీవి నివాసంలో దాడులు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

17:59 - October 31, 2018

ఒడిశా : ప్రజాప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసేవారని అర్థం. కానీ నేటి ప్రజా ప్రతినిధులు మాత్రం తమ స్వార్థం కోసమే రాజకీయాలలోకి వచ్చేవారే ఎక్కువగా వున్నారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకులు వారి సంక్షేమం కోసం కట్టుబడి వున్నామనీ..మీ సేవల కోసమే మేము వచ్చామనీ..మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నామనీ వాగ్ధానాలు చేస్తుంటారు. కానీ అధికారం లోకి వచ్చాక ఆ మాటే గుర్తుండదు. కానీ ఈ మాత్రం తన నియోజక వర్గంలో జరిగిన ఓ దారుణానికి బాధితులకు న్యాయం చేయలేకపోతున్నానని తీవ్ర మనస్థాపానికి గురై తన పదవికి రాజీనామా చేశారు.  ఆయనే ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సగారియా.

Related image2017 అక్టోబర్ 10న ఒడిశా కోరాపూట్ జిల్లాలోని ముసగుడా గ్రామంలో 14 ఏళ్ల బాలిక.. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఈ ఏడాది జనవరి 22న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నిసార్లు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. తాను కూడా ఈ కేసు విషయంలో పోరాడారు. కానీ న్యాయం జరగలేదు సరికదా నిందితులను కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. 

Image result for krushna chandra sagaria mlaతన సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయిన్నప్పటికీ.. నిందితులను అరెస్టు చేయకపోవడంపై కోరాపూట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సగారియా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం లాభం? ఒక బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉండటం సరికాదని భావించిన కృష్ణ చంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కృష్ణ చంద్ స్పష్టం చేశారు.

17:31 - October 31, 2018

ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కెరీర్ ఆరంభించిన దగ్గరినుండి హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత చిత్రం హ్యాపి‌వెడ్డింగ్ నిరాశ పరచింది. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రాజశేఖర్‌తో గరుడవేగ సినిమాని నిర్మించిన జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌లో, సుమంత్ అశ్విన్ హీరోగా ఒక మూవీ ప్లాన్ చేసారు.
దండుపాళ్యం‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యనున్నాడు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

16:55 - October 31, 2018

గుజరాత్ : ఐక్యత ఆయన నినాదం..ఐక్యత ఆయన గళం, ఐక్యత ఆయన ఊపిరి, ఐక్యత ఆయన సిద్ధాంతం, ఐక్యతే నినాదంగా 565 సంస్థానాలకు భారత్ లో ఉక్కు సంకల్పంతో  రక్తపాత రహితంగా విలీనం చేసిన అపర చాణుక్యుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్. ఆయన విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎతైన విగ్రహాన్ని తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ విగ్రహం విశ్వమంత ఘతనను సాధించింది. ఈ నేపథ్యంలో ఐక్యత సిద్ధాంత కర్తగా పాటు పడిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ పాదాల చెంత దక్షిణాదికి మరోసారి అవమానం జరిగింది. దక్షిణాది భాష అయిన తెలుగు భాష దేశంలో అత్యధికులు మాట్లాడే భాష, అంతేకాదు తెలుగు దేశంలోనే మూడో భాషగా పేరొందింది. ఈ నేథ్యంలో పటేల్ పాదాల చెంత తెలుగు భాషకు చోటు దక్కకపోవటంతో భాషాకోవిదులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Image resultదక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఐక్యతకు చిహ్నాంగా ఈ రోజు ఆవిష్కరించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ మహా విగ్ర శిలా ఫలకంలో తెలుగు భాషకు చోటు దక్కక పోవడమే ఈ విమర్శలకు ప్రధాన కారణమయింది. ‘ఐక్యతా చిహ్నం’ అయితే శిలా ఫలకంలో తెలుగు భాషకు ఎందుకు చోటు దక్కలేదని తెలుగు భాషా కోవిదులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉందని, ఉద్దేశపూర్వకంగానే తెలుగు భాషను బీజేపీ పట్టించుకోలేదంటూ భాషాకోవిదులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

లా ఫలకంపై మొత్తం పది భాషలకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది. దక్షిణాది భాషల నుంచి కేవలం తమిళ భాషను మాత్రమే ఫలకంపై ముద్రించింది. అయితే తమిళంలో తప్పుగా రాశారని దాన్ని కూడా చెరిపేయడం గమనార్హం. దీంతో సర్దార్ చెప్పిన ఐక్యత ఇదేనా? అని, దేశ ఐక్యతకు చిహ్నంగా చెబుతున్న విగ్రహం శిలా ఫలకంపై దక్షిణాది భాషలకు చోటు ఎందుకు కల్పించలేదని పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

16:53 - October 31, 2018

హైదరాబాద్: తనపై హత్యాయత్నం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని జగన్ ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందని, దాడి వెనుక ప్రభుత్వం వైఫల్యం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 8మందిని జగన్ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హోం సెక్రటరీ, డీజీపీ కనుసన్నల్లోనే సిట్ విచారణ కొనసాగుతోందని, ఆ విచారణపై తనకు నమ్మకం లేదని జగన్ తెలిపారు.

Image result for jagan attackedహత్యాయత్నం కేసులో సక్రమంగా విచారణ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని, కుట్ర కోణాన్ని సజావుగా దర్యాప్తు చేయాలని కోరుతూ జగన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా ఆపరేషన్ గరుడ పేరిట ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని జగన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ అని చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడే ‘ఆపరేషన్ గరుడ’ పాత్రధారి అని, అతను నటుడు శివాజీ అని ఆరోపించారు. పాదయాత్రలో తనపై ఓ దాడి చేస్తారని, టీడీపీ ప్రభుత్వ పతనానికి ఆ సంఘటన దారితీస్తుందని నటుడు శివాజీ గతంలో చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదో భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి ‘ఆపరేషన్ గరుడ’లో భాగమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
Image result for jagan attackedఅక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ తన వద్దకు వచ్చి తనపై దాడి చేయబోయాడని జగన్ పేర్కొన్నారు. పదునైన కత్తితో తనపై దాడి చేయబోతే, తాను తృటిలో తప్పించుకున్నానని, కిందకు వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని వివరించారు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని, ప్రాథమిక చికిత్స అనంతరం తాను హైదరబాద్‌కు వచ్చానని, సిటీ న్యూరో ఆసుపత్రిలో తనకు చికిత్స చేసి 9 కుట్లు వేశారని తెలిపారు.
 
తనపై దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టారని, పబ్లిసిటీ కోసం జరిగిన దాడి అంటూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని జగన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇదంతా ఆపరేషన్ గరుడ’లో భాగం’ అని పేర్కొన్న విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. తనపై దాడి చేసిన శ్రీనివాస్ దగ్గర లభ్యమైన లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయని, ఇది అనుమానాలకు తావిస్తోందని జగన్ చెప్పారు.
 
Image result for srinivasa rao accusedకాగా, జగన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.
16:32 - October 31, 2018

విజయవాడ : జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక నజర్ పెట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఒంటరిగా చేయాలని..వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. Related imageఅందులో భాగంగా ప్రాంతీయ పార్టీలతో ఆయన సమావేశాలు జరుపుతున్నారు. ‘సేవ్ నేషన్’ పేరిట బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు ఏకం కావాలని బాబు పిలుపునిస్తున్నారు. బీజేపీయేతర పక్షాల్లో ఊపు తెచ్చే విధంగా బాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్డీయే నుండి బయటకు రావడంతో ఏపీ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని, తమ పార్టీకి చెందిన నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరుపుతూ భయపట్టేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఢిల్లీలో పర్యటించి పలువురు నేతలను కలిశారు. 
Image result for chandra babu meets national leadersమరోసారి ఆయన ఢిల్లీ బాట పట్టనున్నారు. గురువారం ఆయన ఢిల్లీకి వెళ్లి జాతీయస్థాయి నేతలతో మంతనాలు జరుపనున్నారు. సీనియర్ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. గురువారానికి సంబంధించిన ఏజెండాను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.Image result for chandra babu meets national leaders పొత్తులు..ఇతరత్రా రాజకీయాలపై బాబు చర్చించనున్నారు. కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్‌ని బాబు కలిసిన సంగతి తెలిసిందే. శరద్ పవర్ తో లంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ ప్రతినిధి, సీపీఎం నేతలు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మాయావతిలతో బాబు భేటీ కానున్నారు. మమత బెనర్జీతో ఇప్పటికే పలుమార్లు సంప్రదించినట్లు, తరచూ ఫోన్‌లో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే అన్నీ పార్టీలు ఏకం కావాలని బాబు పిలుపునిస్తున్నారు. మరి బాబు ఇందులో సక్సెస్ అవుతారా ? లేదా ? అనేది చూడాలి. 

16:25 - October 31, 2018

విజయవాడ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బద్ధ శతృవులైన కాంగ్రెస్, టీడీపీ జతకట్టాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టీడీపీ జతకట్టనున్నాయా? కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా భిన్న దృవాలైన ఈ రెండు ప్రధాన పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ? బీజేపీని టార్గెట్ గా కేంద్రం ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న ఇరు పార్టీలు కలుస్తాయా? అనేది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో  ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఈ అంశంపై రఘువీరా మాట్లాడుతు..

Image result for raghuveera rahul gandhi72 శాతం మంది ఆంధ్ర ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పప్పు అంటూ కొందరు విమర్శించిన రాహుల్... ఇప్పుడు నిప్పు అయ్యారని చెప్పారు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం చెప్పిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశాన్ని హైకమాండే చూసుకుంటుందని... పార్టీ పెద్దల ఆదేశాలను తాము పాటిస్తామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిరంజీవి ప్రచారానికి వస్తారని చెప్పారు. జగన్ పై దాడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని అన్నారు. దాడి ఘటనను టీడీపీ, వైసీపీ, బీజేపీలు రాజకీయాలకు వాడుకుంటున్నాయని చెప్పారు.

 
16:16 - October 31, 2018

విభిన్న తరహా కథల్ని సెలెక్ట్ చేసుకుంటూ, వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ, సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ రన్ చేస్తున్నాడు ప్రముఖ నటుడు మాధవన్. ఆయన ప్రధాన పాత్రలో, ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్ అనేది ట్యాగ్‌లైన్.. ఈరోజు రాకెట్రీ  టీజర్ రిలీజ్ అయింది. నంబి నారాయణన్ పాత్ర వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్‌లో, నేను రాకెట్రీలో 35 సంవత్సరాలు, జైల్లో 50 రోజులు గడిపాను.ఆ యాభై రోజుల మూల్యం ఏదైతే నా దేశం చెల్లించిందో దాని గురించి ఈ కథ, నా గురించి కాదు అంటూ, నారాయణన్ చెప్తాడు. గతంలో ఇస్రోలో గూఢచర్యం జరిగిందని, దానివెనక నంబి నారాయణన్ హస్తం ఉందని అతణ్ణి అరెస్ట్ చెయ్యడం, అతను నిర్దోషని తెలిసాక, మూల్యం చెల్లించుకోవడం వగైరా అంతా సినిమాలో చూపించబోతున్నారు. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపోందుతున్న రాకెట్రీ- ది నంబి ఎఫెక్ట్  2019 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. 

వాచ్ టీజర్

 

16:04 - October 31, 2018

ఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రాజీనామా చేశారు. ఆయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు  కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌కు పంపించారు. ఆయన రాజీనామాను రాథోడ్‌ అంగీకరించారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనుపమ్ పలు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ టెలివిజన్‌షోతో పాటు తనకు కొన్ని బిజీ కమిట్‌మెంట్లున్నాయని ఈ కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని,  ఇందులో అనుభవం సంపాదించే అవకాశం దొరికిందని, కానీ అంతర్జాతీయ కమిట్‌మెంట్లు ఉండటంతో తగిన సమయం కేటాయించలేకపోతున్నానని తెలిపారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. గజేంద్ర చౌహాన్ స్థానంలో 2017 అక్టోబర్ 11న ఎఫ్‌టీఐఐ కొత్త చైర్మన్‌గా అనుపమ్ ఖేర్‌ను నియమించిన సంగతి 

15:59 - October 31, 2018

ఢిల్లీ: హ‌సిమ్‌పురా ఊచ‌కోత కేసులో 16 మంది పోలీసుల‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 1987లో హ‌సిమ్‌పురా ఊచ‌కోత ఘ‌ట‌న చోటుచేసుకుంది. గతంలో వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపారేస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది అధికారులకు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హై కోర్టు నేడు సంచలన తీర్పు వెల్లడించింది.

Breaking News : 1987 నాటి సామూహిక హత్యల కేసులో 16 మంది అధికారులకు జీవిత ఖైదుజ‌స్టిస్ ముర‌ళీధ‌ర్‌, వినోద్ గోయ‌ల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ తీర్పును ర‌ద్దు చేస్తు  ఈ తీర్పును వెల్లడించింది. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మైనారిటిలు ఎందరో ప్రాణాలు కోల్పోయారని, బాధితుల కుటుంబాలకు న్యాయం జరగడానికి 31 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈమేరకు తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా ఈ వార్తను వెల్లడించింది. కాగా ఆ ఊచ‌కోత‌లో 42 మంది మైనార్టీ వ‌ర్గీయులు చ‌నిపోయిన విషయం తెలిసిందే. 
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. 31 ఏళ్ల పోరాటం అనంతరం ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని, దోషులకు శిక్ష పడిందని కోర్టు వెలుపల ఈ తీర్పు కోసం వేచిచూస్తున్న పలువురు బాధితులు అభిప్రాయపడ్డారు.   

Related imageకాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక హత్యలపై సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసిన సుప్రీంకోర్టు సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్ని రాష్ట్రాలు తెలియజేయాలంటూ వారం రోజుల సమయం ఇచ్చింది. ఆ హత్యలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించాలంటూ సెప్టెంబర్ 13వరకు గడువు ఇచ్చింది. ఆదేశాలను స్పందించని ఆయా రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది.

Image result for Massacre in hasimpuraసామూహిక హత్యల నివారణకు మంత్రులతో కమిటీ వేశామని ... దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇదివరకే తెలిపింది. అయితే సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. పెరుగుతున్న సామూహిక హత్యలను సీరియస్‌గా పరిగణించాలని కేంద్రం ఇలాంటి ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు జూలై 17న సూచించింది. కేంద్రంపైనే భారం వేసి రాష్ట్రాలు తప్పించుకోవాలని చూడటం సరికాదని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఇదిలా ఉంటే సామూమిక హత్యలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా కేంద్రం త్వరలో చట్టం తీసుకురానుందని జూలైలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు 31 ఏళ్లకు హంసిరా మారణకాండ కేసులో ఢిల్లీ హైకోర్ట్ సంచలన తీర్పునివ్వంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

15:51 - October 31, 2018

ఢిల్లీ : కేంద్రం..ఆర్బీఐ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. విబేధాలు పొడచూపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలు... వాటికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్లతో ఆర్‌బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ముదిరాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? పుకార్లు షికారు చేస్తున్నాయి. పటేల్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల్ని సడలించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ ఆర్‌బీఐ గవర్నర్ ఆచార్య ఇటీవలే కామెంట్ చేశారు.  దీనికి ప్రతిగా ఆర్థిక మంత్ర జైట్లీ కౌంటర్ ఇచ్చారు. 2008 నుంచి 2014 మధ్య అన్ని బ్యాంకులు విచ్చలవిడిగా లోన్లు ఇస్తుంటే ఆర్‌బీఐ కట్టడి చేయలేదంటూ జైట్లీ మండిపడ్డారు. 
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు కేంద్రం లేఖలు పంపినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోందని లేఖలో పేర్కొనట్లు తెలుస్తోంది. కేంద్రం సెక్షన్ 7ను ఉపయోగించడంతో ఆర్బీఐ సతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి సెక్షన్ బయటకు తీయడంతో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో పటేల్ కూడా పాల్గొన్నారని, పదవికి రాజీనామా చేసే సూచనలు కనిపించడం లేదని మరో వాదన వినిపిస్తోంది. 

15:34 - October 31, 2018

హైదరాబాద్: ఎట్టకేలకు కసరత్తు ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ఎన్నో రోజులుగా చర్చించిన అనంతరం అభ్యర్థులను భక్తచరణ్ దాస్ కమిటీ ఖరారు చేసినట్టు తెలస్తోంది. 40మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. నవంబర్ తొలి వారంలో తొలి జాబితా విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఎక్స్‌క్లూజివ్‌గా 10 టీవీ సంపాదించింది. కాగా,  తొలి జాబితాలో అధికారికంగా ఎంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ తొలి జాబితా..

నెం. అభ్యర్థి నియోజకవర్గం
1 గోషామహల్ ముఖేష్‌గౌడ్
2 సనత్‌నగర్ మర్రి శశిధర్‌రెడ్డి
3 నాంపల్లి ఫిరోజ్‌ఖాన్
4 జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్‌రెడ్డి
5 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
6 పరిగి రామ్మోహన్‌రెడ్డి
7 జహీరాబాద్ గీతారెడ్డి
8 ఆందోల్ దామోదర రాజనర్సింహ
9 సంగారెడ్డి జగ్గారెడ్డి
10 నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి
11 గజ్వేల్ ప్రతాప్‌రెడ్డి
12 మధిర భట్టి విక్రమార్క
13 కొడంగల్ రేవంత్‌రెడ్డి
14 గద్వాల్ డీకే అరుణ
15 వనపర్తి చిన్నారెడ్డి
16 కల్వకుర్తి వంశీచంద్‌రెడ్డి
17 ఆలంపూర్ సంపత్
18 నాగర్‌కర్నూల్ నాగం జనార్దన్‌రెడ్డి
19 కామారెడ్డి షబ్బీర్‌అలీ
20 బోధన్ సుదర్శన్‌రెడ్డి
21 బాల్కొండ అనిల్
22 నిర్మల్ మహేశ్వర్‌రెడ్డి
23 ఖానాపూర్ రమేశ్ రాథోడ్
24 బోధ్ సోయం బాబూరావు
25 ఆసిఫాబాద్ ఆత్రం సక్కు
26 జగిత్యాల జీవన్ రెడ్డి
27 మంథని శ్రీధర్ బాబు
28 కరీనంగర్ పొన్నం ప్రభాకర్
29 సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి
30 పెద్దపల్లి విజయ రమణారావు
31 భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి
32 నర్సంపేట దొంతి మాధవరెడ్డి
33 ములుగు సీతక్క
34 జనగామ పొన్నాల లక్ష్మయ్య
35 హుజూర్‌నగర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
36 నాగార్జునసాగర్ జానారెడ్డి

 

* హైదరాబాద్ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
* మెదక్ నుంచి 5 స్థానాలకు
* నల్గొండ నుంచి 6 స్థానాలకు 
* మహబూబ్‌నగర్ నుంచి 6 స్థానాలకు
* నిజామాబాద్ నుంచి 3 స్థానాలకు
* ఆదిలాబాద్ నుంచి 4 స్థానాలకు
* కరీంనగర్ నుంచి 5 స్థానాలకు
* వరంగల్ జిల్లా నుంచి 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

 

15:24 - October 31, 2018

మహబూబ్ నగర్ : కరవు, వలసలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా గుర్తుకు వస్తుంది. రాజకీయ ప్రముఖులు కలిగిన జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర మాజీ మంత్రి డీకే.అరుణ, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులంతా ప్రస్తుత ఎన్నికల్లో తమ తమ పార్టీలను గెలిపించేందుకు ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎన్‌టీఆర్‌ను ఓడించిన చరిత్ర కల్వకుర్తి నియోజకవర్గానికి ఉంది. అన్ని పార్టీల దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లాపైనే ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలకూ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. 

Image result for mahaboobnagar district mapపూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాలు, వనపర్తి జిల్లాలుగా ఏర్పాడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, వనపర్తి జిల్లాలో 1 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గం విభజనలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది.

నాలుగు జిల్లాల్లో ఓటర్ల వివరాలు
జిల్లా పురుషులు స్త్రీలు ట్రాన్స్‌జెండర్స్ మొత్తం
మహబూబ్‌నగర్ 5,02,528 5,01,900  53 10,04,481
నాగర్‌కర్నూల్ 3,08,915  3,01,478  50 6,10,443 
జోగులాంబగద్వాల 2,17,127 2,18,549  54 4,35,730 
వనపర్తి 1,11,749 1,09,643  26 2,21,418

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 10 లక్షల 4 వేల 481 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 లక్షల 2వేల 528 మంది పురుషులు, 5 లక్షల 1 వెయ్యి 900 మంది  స్త్రీలు, ఇతరులు 53 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 6 లక్షల 10 వేల 443 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3 లక్షల 8 వేల 915 మంది పురుషులు, 3 లక్షల 1 వెయ్యి 478 మంది స్త్రీలు, 50 మంది ఇతరులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 4 లక్షల 35 వేల 730 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2 లక్షల 17 వేల 127 మంది పరుషులు, 2లక్షల 18 వేల 549 మంది స్త్రీలు, 54 మంది ఇతరులు ఉన్నారు. వనపర్తి జిల్లాలో 2లక్షల 21 వేల 418 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1లక్షా 11 వేల 749 మంది పురుషులు, 1లక్షా 9 వేల 643 మంది స్త్రీలు, 26 మంది ఇతరులు ఉన్నారు. 

2014 ఎన్నికల్లో పార్టీల బలాబలాలు
టీఆర్ఎస్ 7
కాంగ్రెస్ 5
టీడీపీ 2

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5, టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలిచాయి. గత ఎన్నికల్లో కొండగల్ నియోజవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌కు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉండటం, కాంగ్రెస్‌ తరపున రేవంత్‌రెడ్డి బరిలో ఉన్న కొడంగల్‌‌ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
ముందస్తు ఎన్నికల ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్‌, మహాకూటమిలోని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు, బీజేపీ, బీఎల్ఎఫ్‌లోని సీపీఎంతోపాటు మిగిలిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.

ఇప్పటివరకు టీఆర్ఎస్ రెండు సార్లు ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గానూ 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు అసెంబ్లీ రద్దు చేసిన రోజునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఎల్ఎఫ్ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించ లేదు. నవంబర్ 1న తొలి జాబితా ప్రకటిస్తామని మహాకూటమి నేతలు తెలిపారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

sno నియోజకవర్గం
1 మహబూబ్ నగర్
2 నాగర్ కర్నూల్
3 గద్వాల
4 వనపర్తి
5 కల్వకుర్తి
6 షాద్ నగర్
7 మక్తల్
8 నారాయణపేట
9 దేవరకద్ర
10 కొల్లాపూర్
11 కొడంగల్
12 అలంపూర్
13 జడ్చర్ల
14 అచ్చంపేట

-చింత భీమ్‌రాజ్

 

 

 

15:18 - October 31, 2018

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఏ.ఆర్.మురగదాస్‌‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా ప్లానింగ్‌లో ఉంది, అనే మాట తమిళ తంబీల దగ్గరినుండి వినబడుతోంది. రజినీ నటించిన 2.ఓ. రిలీజ్‌కి రెడీ అవుతుంది. కొత్త సినిమా పేట్టా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సినిమా ఏంటనేది తెలియదు. అలాగే, మురగదాస్‌ దర్శకత్వం వహించిన సర్కార్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కార్ తర్వాత మురగ ఎవరితో సినిమా చేస్తాడో ఇంకా ఫిక్స్ కాలేదు. దీన్ని బట్టి, రజినీకాంత్, మురగదాస్‌‌ల కాంబినేషన్ కన్‌ఫమ్ అయినట్టేనంటున్నారు. సమాజంలోని సమస్యలకి కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు తియ్యడంలో దాస్ దిట్ట. ఇక తలైవా గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరి కాంబోలో కనుక సినిమా వస్తే, బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.  

 

15:07 - October 31, 2018

విజయవాడ : నటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు అయిన శివాజీ మరోసారి ఢిల్లీ నేతలపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో ఏపీ నేతలపై కూడా పనిలో పనిగా చురకరలంటించారు. ప్రస్తుతం అమెరికాలో వున్న శివాజీ గత కొంతకాలం క్రితం ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో కేంద్రం ఏపీపై కక్షపూరిత ధోరణి అవలంబించబోతోందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన అనంతరం మరోసారి ‘ఆపరేషన్ గరుడ’లో ఈ దాడి కూడా భాగమేనని అది తాను ఆ రోజునే తెలిపాని శివాజీ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో శివాజీ భయపడి అమెరికా పారిపోయి దాక్కున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేసిన క్రమంలో ఘాటుగా స్పందించిన శివాజీత్వరలోనే ఇండియా వస్తాననీ..మీకు అంత తొందరగా వుంటే ముందే వస్తానని తెలిపారు. అంతేకాదు ఢిల్లీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

Image result for central government modiరాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పట్టడం, వారి బూట్లు నాకుతున్న తెలుగు నేతల బండారాన్ని బయటపెట్టడమే తన లక్ష్యమని ఘటుగా జవాబిచ్చారు. ఇప్పటికే తన లక్ష్యానికి చేరువలో ఉన్నానని..సీఎం చంద్రబాబు తనకు డబ్బులిచ్చారని అందుకే తాను అమెరికా పారిపోయానని ఆరోపిస్తున్నారనే విమర్శలకు సమాధానంగా  అమెరికాకు పారిపోవడం ఉండదని... టికెట్ ఉంటేనే ఆ దేశంలోకి ఎంట్రీ అయినా, ఎగ్జిట్ అయినా ఉంటుందని తెలిపారు. Related image
తన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీన ఇండియాకు తిరిగి రావాల్సి ఉందని... మీకేమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడే వచ్చేస్తానని శివాజీ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కంగారు పడుతున్నట్టుగా తాను కంగారు పడటం లేదని అన్నారు. అమెరికాకు వచ్చిన తర్వాత మూడు మీటింగులు పెట్టుకున్నానని, తన కుమారుడి పని పెట్టుకున్నానని, ఆ పని కూడా పూర్తి చేసుకున్నానని తెలిపాడు. ఢిల్లీ నేతల బూట్లు నాకి వీరి నోర్లు మొద్దుబారి పోయాయని తీవ్రంగా విమర్శించారు. వీరందరికీ గుంటూరు కారం తినిపించేందుకు 10వ తేదీన వస్తున్నానని చెప్పారు. అందరూ రెడీగా ఉండాలని అన్నారు. ఎవరెవరు ఏమేం చేసుకుంటారో చేసుకోవచ్చని... అన్నింటికీ తాను సిద్ధంగానే ఉన్నానని శివాజీ హెచ్చరించారు. 

14:03 - October 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ కోడ్ లను ఎత్తివేశారు. ఏపీ రవాణా శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోడ్ తో వాహనాల రిజిస్ట్రేషన్ చేపట్టనున్నట్లుచ, 39 నంబర్ సిరీస్ తో మరో 15  రోజుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. కొత్త వాహనాలకు ఇకపై జిల్లాకు ప్రత్యేక కోడ్ ఉండదని, ఒకే కోడ్ తో వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండున్నర రోజుల్లోనే అంకెల సిరీస్ మారిపోతుందని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. 15 రోజుల్లో కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. 

13:51 - October 31, 2018

ఛత్తీస్‌గడ్ : మావోయిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డీడీ న్యూస్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తనను కాపాడాలంటూ అచ్యుతానంద్ సాహూ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల సమయంలో తనకు బతకాలనుందని..కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశాడు.

ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా ఆరాన్పూర్‌లో ఎన్నికల ప్రచారవార్తలు కవర్ చేయటానికి వెళ్లిన దూరదర్శన్ మీడియా సిబ్బందిపై నిన్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ఈఘటనలో డీడీ న్యూస్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 

 

13:44 - October 31, 2018

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా ఓ యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే పోరుయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న జనసేనానీ త్వరలో రైలు యాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. ‘సేనానితో రైలు ప్రయాణం’ పేరుతో ఈ యాత్ర సాగనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం..పలువురి నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే జనసేన ఏమి చేస్తుందో ప్రజలకు ముందే చెప్పేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
నవంబర్ 2వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీన విజయవాడ నుంచి తునికి పవన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించనున్నారు. ప్రతొక్క స్టేషన్ లో వివిధ రంగాల ప్రజలను కలుసుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ లో రైల్వే పోర్టర్లతో పవన్ మాట్లాడనున్నారు. నూజివీడులో మామిడి రైతులు..ఏలూరులో సామాన్య ప్రజలు..చిరు వ్యాపారులు..తాడేపల్లి గూడెంలో చెరుకు రైతులు..రాజమండ్రిలో టెక్స్‌టైల్స్ కూలీలు..సామర్లకోటలో విద్యార్థులు..అన్నవరంలో ఏటికొప్పాక హస్తకళాకారులు......పవన్తో మాట్లాడనున్నారు. అనంతరం తునికి చేరుకుంటారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు భారీ ఏర్పాటు చేస్తోంది. 

13:40 - October 31, 2018

కాబూల్: ఇండోనేషియాలో 189 మంది ప్రాణాలు బలిగొన్న విమాన ప్రమాదం మరువక ముందే కాబూల్ లో ఒక ఆర్మీ హెలికాప్టర్ కూలి 25 మంది మరణించారు. బుధవారం ఉదయం గం.9-10 ని.లకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  మరణించిన వారిలో  ఫరా ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులతో సహా పలువురు సీనియర్ మిలటరీ అధికారులు ఉన్నారని...హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న అందరూ మరణించారని జాఫర్ మిలటరీ కార్ప్స్ ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు.  అనార్  దారా జిల్లా నుంచి  హెరాత్ ప్రావిన్స్ కు బయలుదేరిన సైనిక హెలికాప్టర్,  వాతావరణం అనుకూలించక బయలు దేరిన కొద్దిసేపట్లోనే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. 

13:30 - October 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగున్నాయి.  2019లో ఎన్నికలు వస్తాయా ? లేక ముందుగానే ఎన్నికలు వస్తాయా ? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే ఆయా పార్టీలు ఇప్పటి నుండే రెడీ అవుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట జనాలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరుయాత్ర పేరిట భారీ బహిరంగసభలు..ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
ఇతర పార్టీలకు చెందిన నేతలు జనసేనలోకి వచ్చేందుకు ఆస్తకి చూపుతున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. తుని నియోజకవర్గానికి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. పార్టీలో చేరాలని స్వయంగా జనసేన పార్టీ కీలక నేతలు ఆయన్ను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి అశోక్ బాబు ఒకే చెప్పారని, త్వరలో పార్టీలో చేరుతారని టాక్. మరి ఆయన పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది చూడాలి. 

13:18 - October 31, 2018

అమెరికా : వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారుల కోసం అమలు చేసే విధానాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. అమెరికాలో పుట్టినవారికి ఇక మీదట ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించదు. అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరికీ జన్మతః లభించే పౌరసత్వ హక్కుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చరమగీతం పాడనున్నారు. అమెరికా పౌరులు కాని వారి బిడ్డలు సైతం వారి తల్లిదండ్రుల మాదిరే, అదే హోదాలో ఇక్కడ ఉండాల్సి ఉంటుందనీ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ అధికారిక ఉత్తర్వును ఆయన త్వరలోనే జారీ చేయనున్నారు. 

 

13:14 - October 31, 2018

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. ఒకప్పుడు తన సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన శృంగార తార షకీలా జీవితం, సినిమాగా తెరకెక్కబోతోంది. ఇంద్రజిత్ లంకేష్, షకీలా జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల ఆధారంగా,  షకీలా బయోపిక్‌ని రూపొందిస్తున్నాడు. షకీలాగా బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తుంది. అందులో భాగంగా ఆమె బెంగుళూరులో షకీలాని కలిసి, ఆమె పర్సనల్ అండ్ ప్రెఫెషనల్ విషయాలతో పాటు, ఆమె డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించి చాలా అంశాలు తెలుసుకుందట. క్యరెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయితేనే అవుట్‌పుట్ అదిరిపోద్ది కాబట్టి, రిచా, షకీలా సలహాలు తీసుకుందట. ఇక ఈ మూవీలో షకీలా అతిధి పాత్ర చెయ్యబోతుంది. దర్శకుడు తన క్యారెక్టర్ గురించి చెప్పిన విధానం నచ్చడంతో, షకీలా తన బయోపిక్‌లో కాసేపు తెరపై కనిపించడానికి అంగీకరించిందట. సిల్క్‌స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్‌లానే, షకీలా బయోపిక్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. 

13:00 - October 31, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగున్నాయా ? అనర్హత పొందిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనపడుతున్నాయంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో దినకరన్ వర్గం ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అక్కడది కోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. 18 మంది ఎమ్యెల్యేల అనర్హత సరైనదేనని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీనితో దినకర్ వర్గం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారని తొలుత ప్రచారం జరిగింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది. ఖాళీగా ఉన్న 20 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమని టీటీవీ దినకరన్ ప్రకటించారు. తమిళ ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఆర్కే నగర్ ఉప ఎన్నికలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మరి ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

12:46 - October 31, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాసేపు ప్రచారానికి విరామం ఇచ్చి సరదాగా గడిపారు. ఈ క్రమంలో రాహుల్‌ ఇండోర్‌లోని 56 దుకాణ్‌ అనే షాప్‌లో ఐస్‌క్రీం తినేందుకు వెళ్లారు. రాహుల్‌ కోసం అక్కడి సిబ్బంది ప్రత్యేక ఐస్‌క్రీంను తయారు చేసి ఇచ్చారు. దాన్ని తీసుకుని తినడానికి సిద్ధమైన రాహుల్‌‌.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని గమనించారు. హలో.. ఐస్‌క్రీం తింటావా? అంటూ ప్రశ్నించి ఆ బాలునికి ఐస్‌ క్రీం తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ సమయంలో రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు. 

 

12:45 - October 31, 2018

 చైనా: జీవితంలో అనుకున్నది సాధించుకోలేక పోయిన ఓ చైనా రైతు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు...చాలా మంది ప్రజలు తాము ప్రయాణించటానికి వీలుగా వారి, వారి స్ధాయిని బట్టి బైకు, కారు లాంటివి కొనుక్కుంటూ ఉంటారు. వారి స్ధోమత, అవసరాన్నిబట్టి విలువైన వాటి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. చైనాకు చెందిన ఒక వార్తా సంస్ధ కధనం ప్రకారం....చైనాలో వెల్లుల్లి పండించే "జు యే" అనే రైతు జీవితంలో ఎలాగైనా విమానం కొనుక్కోవాలనుకున్నాడు. విమానం కొనుక్కునేంత ఆర్ధిక స్దోమతకు చేరుకోలేక పోవటంతో తన వ్యవసాయ క్షేత్రంలో విమానం డిజైన్లో ఉండే ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఎయిర్ బస్ ఏ 320 విమానం లాగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు 2  కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న విమానం నిర్మాణం పూర్త్యయాక ఇందులో ఓ రెస్టారెంటును పెడతానని చెప్పాడు జు యే.  

12:45 - October 31, 2018
అహ్మదాబాద్: లిబర్టీ స్టాచూ తరహాలో ‘స్టాచూ ఆఫ్ యూనిటీ’ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు.  గుజరాత్‌లోని కేవదియా వద్ద ఈ మహా విగ్రహాన్ని నిర్మించారు. 
 
 
మహా విగ్రహం విశేషాలివే..
  • 597 అడుగులు (182 మీటర్లు) ఎత్తులో స్టాచూ ఆఫ్ యూనిటీని నిర్మించారు
  • ఇప్పటి వరకూ చైనాలోని బుధ్దుడి విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 177 అడుగులు
  • పటేల్ విగ్రహం న్యూయార్క్‌లోని లిబర్టీ స్టాచూ కంటే రెండింతలు ఎత్తైనది
  • ఈ విగ్రహం నిర్మాణానికి దాదాపు రూ 2,989 కోట్లు ఖర్చుపెట్టారు
  • పటేల్ విగ్రహాన్ని పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్. వి సూతర్ డిజైన్ చేయగా ఎల్ అండ్ టీ మరియు సర్దార్ సరోవర్ నర్మద నిగమ్ లిమిటెడ్ ఈ విగ్రహం నిర్మాణాన్ని చేపట్టాయి. 
  • ఈ విగ్రహం సర్దార్ సరోవర్ డ్యామ్ నుండి 3.32 కిమీ దూరంలో నిర్మించారు
  • ఈ విగ్రహం తయారీకి కావాల్సిన ఉక్కును దేశం నలుమూలనుండి సేకరించారు.
  • ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు 193 మీటర్ల ఎత్తులో ఒక గ్యాలరీని నిర్మించారు. దాదాపు 200 మంది ఒకేసారి వీక్షించే విధంగా ఈ గ్యాలరీని రూపొందించారు.
  • దాదాపు 40,000 పత్రాలతో, 2 వేల ఛాయాచిత్రాలతో ఒక మ్యూజియం, పరిశోధనశాలను సర్దార్ వల్లభాయ్ పటేల్‌ పేరుతో విగ్రహం బేస్‌మెంట్‌లో నిర్మించారు. 
  • స్టాచూ ఆఫ్ యూనిటీకి కావాల్సిన ఇనప ప్యానల్స్‌ను చైనాలోని ఒక ఫౌండ్రీలో పోతపోసి తెప్పించారు.
12:42 - October 31, 2018

ఢిల్లీ : రాఫెల్ స్కాం..ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. ప్రతిపక్షాలు ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. దీనితో అధికారపక్షమైన బీజేపీ కౌంటర్ లు ఇస్తుండడంతో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొనుగోలు ఒప్పందంలోని ధరలు, వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు డెడ్ లైన్ కూడా విధించింది. కేవలం పది రోజుల్లో అన్ని వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. 
Image result for Rafale deal Supreme Courtన్యాయమూర్తులు వినీత్ దండా, మనోహర్ లాల్ శర్మలు ఈ పిటిషన్ లు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వివరాలు రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరోవైపు, యుద్ధ విమాన ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని... వీటి ధరలను వెల్లడించడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ కోర్టుకు తెలిపారు. దీనితో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం సూచించింది. ఈ ఒప్పందంపై సీబీఐ విచారణ చేయించాలని పిటిషనర్లు కోరారు. తరువాత పరిశీలించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఇచ్చిన సుప్రీం ఆదేశాలతో కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

12:25 - October 31, 2018

ముంబై : సినీ పరిశ్రమలో నెగ్గుకరావాలంటే టాలెంట్ తో పాటు అందాల ఆరబోత ముఖ్యమని పలువురు హీరోయిన్స్ అనుకుంటున్నట్లుంది. ఎందుకంటే పలువురు హీరోయిన్స్ అందాల ఆరబోతలో పోటీ పడుతున్నారు. అలనాటి హీరోయిన్స్ తమ కూతుర్లను కూడా సినీ పరిశ్రమలో దింపుతున్నారు. వీరు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వార్తలో నిలుస్తోంది. ఆమె చేసిన Image result for Vogue Women of Year Awards 2018: jhanvi kapoor Special Attractionఫోటోషూట్స్ కుర్రాళ్ళ గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి. అందమైన భామ 'స్కిన్ షో' చేయడానికి కూడా వెనుకాడడం లేదు. జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఫోటో షూట్‌లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీల్లో కూడా పాల్గొంటోంది. కానీ ఆమె వేసుకున్న డ్రస్ లు..అందాలకు అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొంది. బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్‌ వేసుకుని అందాలు ఆరబోసింది. లేలేత అందాలను కెమెరాలు క్లిక్ అనిపించాయి. ప్రస్తుతం జాన్వీ హాట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

12:24 - October 31, 2018

హైదరాబాద్ : తన‌పై జ‌రిగిన దాడిపై జ‌గ‌న్ ఎప్పుడు నోరు విప్పుతారు...? అటాక్ సంబంధించి ఎం చెబుతారు...? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇటు వైసీపీ నేత‌ల్లోనూ.. అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ స‌స్పెన్స్ గా మారాయి...? అయితే ఈ సస్పెన్స్ కు జ‌గ‌న్ తెర‌దించబోతున్నారా.. అంటే  అవున‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.. ఇంత‌కీ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ ఎప్పుడు నోరు విప్ప‌బోతున్నారు?

విశాఖ ఎయిర్ పోర్టులో త‌న‌పై జ‌రిగిన దాడిపై జ‌గ‌న్ ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు.. దాడి జ‌రిగిన రోజు నేను క్షేమంగా ఉన్నాను అని పార్టీ కార్యక‌ర్తల‌కు ట్విట్టర్ వేదిక‌గా చెప్పిన జ‌గ‌న్ దాడికి సంబందించి ఎలాంటి విష‌యాలు చెప్పలేదు. దీంతో దాడిపై జ‌గ‌న్ స్పంద‌న  ఎలా ఉంటుందనే దానిపై ఇటు పార్టీలోనూ అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

త‌న‌పై దాడి జ‌రిగి వారం రోజుల‌వుతున్నా ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు.. పార్టీ నేత‌లు మాత్రమే స్పందించారు.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు జాతీయ స్థాయిలోనూ దాడిని తీవ్రంగా ఖండిస్తూ అధికార పార్టీపై అనేక అరోప‌ణలు చేశారు. దాడి వెనుక  చంద్రబాబు కుట్ర ఉందంటూ కేంద్ర పెద్దల‌కు పిర్యాదు చేశారు వైసీపి నేత‌లు. కేసుని కేంద్ర ప్రభుత్వ ద‌ర్యాప్తు సంస్థల‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. అయితే త‌న పై జ‌రిగిన దాడిపై జ‌గ‌న్ మాత్రం ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వ‌లేదు. కేసుని  విచారిస్తున్న సిట్ అధికారుల‌కు స్టేట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. కేసులో జగన్ స్టేట్ మెంట్ చాలా కీల‌కం క‌నుక.. తమకు సహకరించాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

త‌న‌పై జ‌రిగిన దాడిపై జ‌గ‌న్ స్పందించ‌బోతున్నారు... వైద్యుల సూచ‌న మేర‌కు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జ‌గ‌న్ న‌వంబ‌ర్ మూడ‌వ తేది విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌ర్గం మ‌క్కువ మండ‌లం పాయ‌క‌పాడు గ్రామం నుండి పాద‌యాత్ర  ప్రారంభించ‌నున్నారు. పాద‌యాత్రలో భాగంగా న‌వంబ‌ర్ 6 తేది పార్వతీపురంలో బహిరంగ స‌భ నిర్వహించ‌నున్నారు. అయితే ఈ స‌భ‌లో త‌న‌పై జ‌రిగిన దాడిపై జ‌గ‌న్ స్పందించ‌నున్నట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని నేరుగా ప్రజలకే చెబుతానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో న‌వంబ‌ర్ 6 తేదిన జ‌గ‌న్ ఏం మాట్లాడుతారో అని పార్టీ నేత‌లతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కుంది..

ఒక్క ప‌క్క పాద‌యాత్ర ప్రారంభించిన త‌రువాత జ‌గ‌న్ స్లేట్ మెంట్ తీసుకోవ‌డం కోసం మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తామ‌ని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్తితుల్లో జ‌గ‌న్ ఎం మాట్లాడ‌తార‌నేదానిపైనే అంద‌రి దృష్టి ఉంది.

12:18 - October 31, 2018

రాజశేఖర్, దాదాపు పదేళ్ళ తర్వాత, గతేడాది విడుదలైన గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు. అ! మూవీతో ప్రశంసలందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా ఫిక్స్‌ అయింది. హిందీ క్వీన్ తెలుగు రీమేక్ కొంత భాగాన్ని షూట్ చెయ్యాల్సి రావడంతో,  ప్రశాంత్ వర్మ బిజీ అయిపోయాడు. కొంచెం గ్యాప్ తర్వాత, రాజశేఖర్, ప్రశాంత్ వర్మల సినిమా అప్‌డేట్ వచ్చింది. కల్కి టైటిల్‌తో రూపొందబోయే ఈ మూవీలో, రాజశేఖర్ ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యనున్నాడు. ఆయన పక్కన అదా శర్మ, నందితా శ్వేత, ఎవడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటించబోతుండగా, సి.కళ్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో రూ.2కోట్లతో వేసిన సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కల్కిలో అశుతోష్ రాణా, నాజర్ తదితరులు నటిస్తున్నారు. 

11:57 - October 31, 2018

గుజరాత్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లో 600 అడుగుల ఎత్తుతో నిర్మించిన పటేల్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో అత్యంత ఎత్తైన పటేల్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశానికి పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశమంతా సర్దార్‌కు నివాళులర్పిస్తోందన్నారు. సీఎంగా కన్నకలలు..ప్రధానిగా సాకారమయ్యాయని పేర్కొన్నారు. ఐక్యతను కాంక్షిస్తూ పరుగులు తీసిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. 

పటేల్ విగ్రహం.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.  స్టాచ్యూ ఆఫ్ యూనిటీ...అంటే పటేల్ ఐక్యతా విగ్రహం ప్రధాని నరేంద్రమోడీ కలల ప్రాజెక్ట్. ఒకటా, రెండా అనేక ప్రత్యేకతలు ఈ విగ్రహం రూపొందించారు. గుజరాత్ లోని 182 నియోజక వర్గాలకు అద్దం పట్టేలా ..182 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మించారు. అంటే దాదాపు 600 అడుగుల ఎత్తన్న మాట. ప్రంపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహంగా ఐక్యతా విగ్రహం రికార్డ్ నెలకొల్పింది. 

11:45 - October 31, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఆయన నటించిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఏ చిత్రం పోటీ లేకపోవడంతో కలెక్షన్లలలో దూసుకపోతోంది. బాక్సాపీస్ రికార్డులు బద్దలు కొడుతూ వేగంగా దూసుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ Image result for aravinda samethaసినిమాలో ఎన్టీఆర్ విశ్వరూపంతో, విలన్ గా జగపతి బాబు అభిమానులను మెప్పించారు. 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా దసరా సెలవల్లో విడుదలైంది. తొలి రోజే రూ. 39 కోట్ల షేర్ రాబట్టినట్లు సినీ పండితులు పేర్కొన్నారు. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా అనంతరం వచ్చిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ‘అరవింద’ బాక్సాపీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఏకంగా 12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. మొత్తంగా 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.165 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు 

11:36 - October 31, 2018

ఢిల్లీ: భారత మాజీప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధి 34వ వర్ధంతి సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు ఢిల్లీలోని శక్తిస్ధల్ వద్ద ఆమెకు ఘన నివాళులర్పించారు.  ఇందిర హత్యకు గురై నేటికి 34 సంవత్సరాలైనప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఆమె తీసుకున్న నిర్ణయాలను నేటికి ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారు.  " ఈరోజు ఆనందంతో నా తండ్రిని గుర్తుచేసుకున్నాను. ఆమెకు మనవడుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆమె నా పట్ల చాలా ప్రేమతో ఉండేది. ఆమెనుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆమె ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసింది" అని  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్వర్గీయ ఇందిరాగాంధీ కి నివాళులర్పించారు. 
1959  ఫిబ్రవరి2న  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ 1966 జనవరి 24 న  ప్రధాన మంత్రిగా భాధ్యతలు  చేపట్టిన ఇందిరాగాంధీ మొట్ట మొదటి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. నేటికి భారత దేశంలో ఆపదవిని మరో మహిళ చేపట్టలేదు. భారతదేశానికి 3వ ప్రధాన మంత్రిగా పనిచేసిన ఇందిర తన పదవీ కాలంలో పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1984 లో పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతికారంగా, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రోడ్డులోని తన నివాసంలో 1984 అక్టోబర్ 31న ఆమె తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేతిలో హత్యకు గురయ్యారు. హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధే.  చివరి రక్తపుబొట్టువరకు తాను దేశం కోసం శ్రమిస్తానని, ప్రజలపై తనకు గల ప్రేమను ఎవరూ చంపలేరని, నేను చనిపోతే నా ఒక్కో రక్తం బొట్టూ దేశాన్ని పటిష్టం చేయడానికి తోడ్పడుతుంది." అని  ఆమె తన చివరి ప్రసంగంలో అన్నారు. 

11:30 - October 31, 2018

హైదరాబాద్ : రకూల్ ప్రీత్ సింగ్ తమిళ..కన్నడ..హిందీ..తెలుగు భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. జయ జానకి నాయక..రారండోయ్ వేడుక చూద్దాం..విన్నర్..ధృవ..సరైనోడు..నాన్నకు ప్రేమతో...బ్రూస్ లీ..కిక్-2..పండుగ చేసుకో..రన్..కరెంటు తీగ..లౌక్యం..వెంకటాద్రి ఎక్స్ ప్రెస్..తదితర చిత్రాల్లో 'రకూల్ ప్రీత్ సింగ్' నటించింది. ఇటీవలే వచ్చిన 'స్పైడర్' సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. 'కార్తీ' సరసన 'ఖాకీ'లో..తీరన్..అదిగరం ఒంద్రు..జయత్ జంత్రి సినిమాలో 'రకూల్' మెప్పించింది. 
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీదేవి లుక్‌లో ఉన్న రకుల్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జిమ్ 

11:28 - October 31, 2018

గుంటూరు : మంగళగిరిలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు వీడియో రికార్డ్‌ చేశాడు.
రత్నాల చెరువులోని సురేశ్‌ అనే వ్యక్తి ఇంట్లో 60 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ....గోపిరాజుతో పాటు అతని తల్లిని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల వేధింపుల తట్టుకోలేక గోపిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు గోపిరాజు..తన తల్లితోపాటు తనను పోలీసులు దారుణంగా హింసించారని...ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వీడియోలో తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని....వాళ్ల వస్తువులు ఎక్కడో పొగొట్టుకొని తమను అనుమానిస్తున్నారని చెప్పాడు. తమను హింసించిన వారిని వదిలిపెట్టవద్దని వీడియోలో కోరాడు. చివరికి బంగారం అపహరణకు గురి కాలేదని ఇంటి యజమాని సురేశ్‌ పోలీసులకు తెలిపారు.

వీడియో రికార్డులోని అంశాలు.. 
’పోలీస్ స్టేషన్‌కు వెళ్తే నానా హింస పెట్టారు. ఒక్క రోజులోనే చాలా బాధ పెట్టారు. నేను అందరి కాళ్లు పట్టుకున్నాను. అందరినీ బతిమిలాడాను. ఎవ్వరి దగ్గర నాకు ఏ న్యాయం జరగలేదు. తీరా నా చేత తప్పు ఒప్పిద్దామని చూశారు. మా మీద చాలా నింద వేశారు. అప్పటికీ ఒప్పుకున్నా.. చేయని తప్పుకు ఎంతో కొంత ఒప్పుకుంటానని చెప్పాను. నాకు బతకాలని లేదు.. నా కుటుంబానికి న్యాయం చేయాలి.. నాకు పెళ్లికి కాని చెల్లి ఉంది. ఆమెకు పెళ్లి అయ్యేటట్లు చూడాలి. మేము చాకలోళ్లం.. నాలుగు ఇళ్లళ్లోకి వెళ్లి పని చేసుకుంటాం. మమ్మల్ని పనులకు ఎవరూ రానివ్వలేదు. మా పై నింద వేసిన వారిని మీరు ఉచితంగా వదలిపెట్టవద్దు..మా అన్నయ్య (మా పెద్దమ్మ వాళ్ల అబ్బాయి), మా పెద్దమ్మ మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాను.   

 

11:12 - October 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. డిసెంబర్ మాసంలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీనితో అధికారపక్షం, విపక్షాల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అధికారపక్ష టీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకపోతోంది. మరికొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తమకే ఖాయమని తెలుసుకున్న అభ్యర్థులు ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది వారి పనులు కూడా చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు గడ్డం గీస్తూ..మరొక్కరు ఇస్త్రీ చేస్తూ..ఇంకొకరు స్నానం చేయిస్తూ...ఇలా అభ్యర్థులు తిప్పలు పడుతున్నారు. ప్రచారం ముగిసిన అనంతరం కార్యకర్తలు..నేతలతో ముచ్చటిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఓట్లు..పాట్లు చూడండి...
 తుంగతుర్తి నియోజకవర్గ ప్రచారంలో గాదరి కిశోర్ ఓట్ల పాట్లు

 
 ఇల్లెందులో ప్రచారం నిర్వహిస్తూ అన్నం వండుతున్న కోరం కనకయ్య

 

 

 

 

 

 భూపాలపల్లిలో పాడె మోస్తున్న మధుసూదనాచారి (File) ఎన్నికల ప్రచారంలో బూంది వండుతున్న సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్

 

11:01 - October 31, 2018

వరలక్ష్మీ శరత్ కుమార్.. దసరాకి రిలీజ్ అయిన పందెంకోడి2 లో, తన నటనతో అద్భుతమైన విలనిజాన్ని పండించింది. ఫస్ట్‌టైమ్ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.. ఇప్పుడు ఇళయ దళపతి విజయ్‌తో, సర్కార్‌లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ‌సినిమా విడుదలకాబోతున్న నేపధ్యంలో, వరలక్ష్మీ మీడియాతో ముచ్చటిస్తూ, పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
ఇక నుండి తెలుగులో నా టైమ్ మొదలైంది, మంచి క్యారెక్టర్స్ వస్తే  తెలుగులో నటిస్తాను అని చెప్పిన వరలక్ష్మీ, విశాల్‌తో తను డేటింగ్‌లోలేనని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌అని, అతను పెళ్ళి చేసుకుంటానంటే హ్యాపీగా చేసుకోమంటాను. పైగా తనకోసం నేను పిల్లను కూడా వెతుకుతున్నాను. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి, నేనే దగ్గరుండి విశాల్ పెళ్ళి జరిపిస్తా అంటూ, తమ మధ్య స్నేహం తప్ప, మరేం లేదని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మీ. 

 

10:42 - October 31, 2018

హైదరాబాద్ : కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో...ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుందో తెలియదు. సినిమాకు సంబంధించిన విషయాలు..ఫొటోలు రిలీజ్ కాకుండా చిత్ర యూనిట్ గోప్యంగా షూటింగ్ కానిచ్చేస్తూ ఉంటుంది. ఈ కోవలోకి మహేష్ చిత్రం చేరుతుంది. మెల్లగా ఒక్కో షెడ్యూల్ పూర్తి చేసుకుని పరుగులు పెడుతోంది. వంశీపైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. డెహ్రాడూన్, గోవాలో కూడా చిత్ర షూటింగ్ జరుపుకొంది. మహేష్ కు ఇది 25వ చిత్రం. 
Image result for Maharishi Shooting Completed In America #maheshbabuఇటీవలే చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గడ్డం..మీసాలతో మహేష్ కనిపించడం..కొత్తగా ఉన్న ఈ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటీవలే చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లింది. అక్టోబర్ నెలలో వెళ్లిన చిత్ర యూనిట్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌కు టీం రానున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు తల్లిగా సీనియర్‌ నటి జయప్రద కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

10:24 - October 31, 2018

హైదరాబాద్ : మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా ? అయితే బుధవారం నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పలు ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఒక రోజులో రూ. 20, 000 కన్నా ఎక్కువ డ్రా చేయకూడదని నిబంధన పెట్టింది.  ఇంతకుముందు రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. దీనితో ఎస్‌బీఐ ఖాతాదారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోవాలంటే వారు ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. 
ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు పెరిగిపోతుండడం...తదితర ఫిర్యాదులు రావడంతో బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ లకు అలవాటు పడాలని ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

09:57 - October 31, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిందితుడు శ్రీనివాస్ ఫోన్ నుండి 10 నుంచి 12 సార్లు సైరా బీకి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ నంబర్ వివరాల ఆధారంగా కనిగిరికి చెందిన సైరా బీతో శ్రీనివాస్ మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పిడుగురాళ్లలో ఉంటున్న సైరా బీ సోదరుడు నాగూర్ వలి పేరుతో సిమ్ అడ్రస్ ఉంది. కాల్ లిస్ట్ ఆధారంగా కనిగికి చెందిన మహిళను విచారించేందుకు పిడుగురాళ్లకు అధికారులు రప్పించారు.

 

09:20 - October 31, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా ? గతంలో తెలుదేశంపార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏర్పాటుచేసిన నేషనల్ ఫ్రంట్  మాదిరగానే ఇప్పుడు ఎన్డీయే వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించనున్నారా ?......  అవుననే సమాధానం వస్తోంది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి. ఏపీలో  తెలుగుదేశం పార్టీ నాయకుల పై ఇటీవల వరుసగా పెరిగిపోయిన ఐటీ దాడులు, ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని టీడీపీ ప్రభుత్వమే చేయించిందని వస్తున్న వార్తలు, టీడీపీపై బీజేపీ నాయకుల వ్యవహార శైలి ఇతర కారణాలదృష్ట్యా చంద్రబాబు నాయుడు   బీజేపీతో తేల్చుకోటానికి సిధ్దమయ్యారు. 
ఎన్డీయే వ్యతిరేక కూటమి  ఏర్పాటు కోసం గత వారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మళ్లీ గురువారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈసారి పర్యటనలో ఆయన ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తో భేటీ అవుతారు. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్టుల్లాతో కూడా మరోసారి సమావేశం అయ్యి ,జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చిస్తారు. మరో వైపు చంద్రబాబు ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  మంగళవారం చంద్రబాబు నాయుడుతో ఫోనులో మాట్లాడి తన మద్దతు తెలిపారు. "ఫెడరల్ వ్యవస్ధకు బీజేపీ గండి కొడుతోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దేశంలో అన్ని వర్గాల  ప్రజలు అశాంతి తో ఉన్నారని,  బీజేపీయేతర పక్షాల కూటమి ఏర్పాటులో సమాజ్ వాది పార్టీ తరఫున మీకు పూర్తి మద్దతిస్తామని " అఖిలేష్ చెప్పారు. గడచిన 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు, దేశంలో పెరిగిపోయిన అవినీతి,సీబీఐ వ్యవహారం వంటి విషయాలను చంద్రబాబునాయుడు అఖిలేష్ తో చర్చించారు. ఈనేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఇక నుంచి వారంలో రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి జాతీయ రాజకీయాలలో క్రియాశీలకపాత్ర పోషించునున్నట్లు తెలుస్తోంది.

08:56 - October 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఏపీ డీజీపీ స్పందించారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో డీజీపీ రిప్లై పంపారు. దొరికిన వారంతా నోటీసులో చెప్పిన విధంగా వారంతా ఇంటెలిజెన్స్‌ అధికారులేనని స్పష్టం చేశారు. వారి దగ్గర నగదు ఉందనేది కూడా అవాస్తవమన్నారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సమాచారం సేకరించడానికే ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లినట్టు డీజీపీ వివరణ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా ధర్మపురిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొంతమంది పోలీసులకు చిక్కారు.  అయితే వారిని విచారించగా ఏపీ పోలీసులుగా తేలింది.  దీంతో ఆంధ్రా పోలీసులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఫైర్‌ అయ్యింది.  అంతేకాదు.. వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. డబ్బులు పంచిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈసీని టీఆర్‌ఎస్‌ కోరింది.

టీఆర్‌ఎస్‌ ఫిర్యాదుతో  ఈసీ ఏపీ డీజీపీకి నోటీసులు ఇచ్చింది. పోలీసులకు తెలంగాణలో పనేంటి, వారు డబ్బులు పంచడమేంటని ప్రశ్నించింది. వెంటనే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఏపీ డీజీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో డీజీపీ సమాధానం పంపారు. దొరికిన వారంతా ఇంటెలిజెన్స్‌ అధికారులేనని స్పష్టం చేశారు. వారి దగ్గర నగదు ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.

ఏపీ పోలీసులు తెలంగాణకు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్నకు ఆయన సవివరమైన సమాధానం చెప్పారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచార సేకరణలో ఇంటెలిజెన్స్‌ సిబ్బంది తెలంగాణకు వెళ్లారని వివరణ ఇచ్చారు. ఇంటెలిజెన్స్‌ నిఘాలో భాగంగా ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు వారికి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఇంకా ఏపీ ఇంటెలిజెన్స్‌కు యూనిట్‌ కూడా ఉందన్నారు. ఎన్నికల సంఘం పంపిన వీడియోలోనూ నగదు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

08:42 - October 31, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన టీజేఎస్‌కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్‌ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తమకు చెన్నూరు, ఆసిఫాబాద్, దుబ్బాక, షాద్‌నగర్‌ లేదా మెదక్‌ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. 

 

08:18 - October 31, 2018

హైదరాబాద్ : గులాబి దళపతి కేసిఆర్.... ప్రచార వ్యూహాన్ని మార్చబోతున్నారా?  సుడిగాలి పర్యటనలకు బదులు.. ద్విముఖ ప్రచార వ్యూహంపై దృష్టి సారించారా?  అందుకు ట్రయల్ రన్ కూడా కేసిఆర్ నిర్వహించారనే ప్రచారంలో వాస్తవమెంత? ఇంతకీ కేసీఆర్ ప్రచార వ్యూహం ఏంటి?

ముందస్తు ఎన్నికలను ఎంతో జోష్ గా ఎదుర్కొనేందుకు వ్యూహం రచించిన గులాబి పార్టీ నేతలు దాదాపు 50 రోజులుగా ప్రజల్లోనే ఉంటున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.....మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అభ్యర్థులతో పాటు పార్టీ కీలక నేతలు  మంత్రులు కేటిఆర్, హరీష్‌ రావ్ లు ఎంపీ కవితలు తెలంగాణా వ్యాప్తంగా పర్యటిస్తూ..... ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని కేసిఆర్ నేతలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆశీర్వాద సభల పేరుతో.. ఉమ్మడి  జిల్లాలను చుట్టేస్తున్న కేసీఆర్.. ప్రచార వ్యూహాన్ని మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

హెలికాప్టర్ నుంచి 50 రోజుల్లో వంద సభలను నిర్వహించాలని పార్టీ  భావించినా..... పండుగల సీజన్ కావడం, ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించకపోవడంతో కేసిఆర్ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. మొదటి వారంలో విపక్ష పార్టీల  అభ్యర్థులు ఖరారయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి ద్విముఖ వ్యూహాన్ని గులాబి దళపతి కేసిఆర్ అమలు చేయాలని  భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఎన్నికలకు ఇంకా దాదాపు 40 రోజుల గడువు ఉండడంతో మొదటి విడతలో బస్సుయాత్ర ద్వారా జిల్లాల్లో పర్యటించి రోడ్ షోలు, వీలైన చోట్ల సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇందుకోసం బస్సులో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ నుంచి ఫాం హౌస్ వరకు బస్సులోనే సిఎం కొంత మంది  ముఖ్య నేతలతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. 

2014 ఎన్నికల్లో 15 రోజుల్లో 90 పైగా సభల్లో కేసిఆర్ పాల్గొన్నారు. ఇప్పుడు బస్సు టూర్ తో  ప్రచార పర్వాన్ని మొదలు పెట్టినా...ఎన్నికల తేదీలు సమీపిస్తున్న సమయంలో సుడిగాలి పర్యటనలు చేసేందుకు హెలిక్యాప్టర్ వినియోగించే అవకాశం ఉంది.

07:54 - October 31, 2018

ఢిల్లీ: ఎన్నికల ప్రచార వార్తలు కవర్ చేయటానికి వెళ్లి  ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టుల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహు కుటుంబాన్నిఆదుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ చెప్పారు. నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌ఘడ్ లోని దంతేవాడ జిల్లా ఆరాన్పూర్ లో ఎన్నికల ప్రచారవార్తలు కవర్ చేయటానికి వెళ్లిన  దూరదర్శన్ మీడియా సిబ్బందిపై మంగళవారం మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈఘటనలో కెమెరామెన్ సాహూతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు పోలీసులను దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని,అదే సమయంలో దాడి జరిగిందని ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు.

07:48 - October 31, 2018

గుజరాత్ : సర్దార్ వల్లభభాయ్ పటేల్...అఖండ బారత నిర్మాత. 562 సంస్ధానానలను భరతమాత ఒడికి చేర్చిన ధీరుడు. ఖండ, ఖండాలుగా ఉన్న భారత దేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కు మనిషి. ఆయనకు నివాళిగా, గౌరవ సూచకంగా నిర్మించిన ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

గుజరాత్ లోని నడియాద్ లో 1875 అక్టోబర్ 31 న ఆయన జన్మించారు. ఆరోజును ఏక్తా దివస్ గా జరుపుకుంటున్నాం. కానీ 2018 అక్టోబర్ 31 చాలా ప్రత్యేకమైనది. ప్రదాని నరేంద్రమోడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన అత్యంత ఎత్తైన పటేల్  ఐక్యతా విగ్రహం ఆవిష్కృతమైనది. 

బ్రిటీష్ పాలనలో దేశంలో 526 సంస్ధానాలు వుండేవి. స్వాతంత్ర్యం ఇస్తూ ...అవి భారత్ లో కానీ, పాకిస్తాన్ లో కానీ, స్వతంత్రంగా కానీ వుండొచ్చన్న చిచ్చురేపి తెల్లవారు వెళ్ళిపోయారు. అందులో కశ్మీర్, హైదరాబాద్, జూనాగడ్ సంస్ధానాలు ప్రధానమైనవి. వాటిని పాకిస్తాన్ లో కలవకుండా...అప్పటి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించారు.ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవి.  హైదరాబాద్ సంస్దానం భారత్ లో విలీనం చేయకుండా..  అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెగించారు. దీంతో ఆపరేషన్ పోలో చేపట్టిన సర్దార్ పటేల్ 1948 సెప్టంబర్ 14న హైదారాబాద్ లోకి దళాలతో ప్రవేశించారు.17 తేదీన తాను లొంగిపోతున్నట్టు నిజాం ప్రటించారు. దీంతో హైదరాబాద్ సంస్ధానం భారత్ లో విలీనం అయ్యింది. ఇలా చిన్న రాజ్యాలుగా వున్న 526 సంస్దానాలను భారత్ లో విలీనం చేసిన ఘనత పటేల్ దే. 

పటేల్ కు నివాళిగా గుజరాత్ లోని నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు . ఇది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.  స్టాచ్యూ ఆఫ్ యూనిటీ...అంటే పటేల్ ఐక్యతా విగ్రహం ప్రధాని నరేంద్రమోడీ కలల ప్రాజెక్ట్. ఒకటా, రెండా అనేక ప్రత్యేకతలు ఈ విగ్రహం రూపొందించారు. గుజరాత్ లోని 182 నియోజక వర్గాలకు అద్దం పట్టేలా ..182 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మించారు. అంటే దాదాపు 600 అడుగుల ఎత్తన్న మాట. ప్రంపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహంగా ఐక్యతా విగ్రహం రికార్డ్ నెలకొల్పింది. చైనా లోని స్ప్రింగ్  టెంపుల్ బుద్ద ఎత్తు 128 మీటర్లు..అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు..93 మీటర్లు. కానీ నర్మదా నది మధ్యలో కొలువుతీరిన పటేల్  విగ్రహం 182 మీటర్ల ఎత్తుకలిగి వుంది . అంటే స్టాచ్యూ అఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు పెద్దది. తలపైకెత్తి చూస్తే ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టుగా కనిపిస్తుంది.

3400 మంది కార్మికులు, 250మంది ఇంజనీర్లు...రాత్రి పగలు అని లేకుండా 42 నెలల పాటు శ్రమించి నిర్మించారు. 70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 18,500 మెట్రిక్ టన్నుల రీయిన్ ఫోర్స్డ్ స్టీల్ , 6000 మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 1700 మెట్రిక్ టన్నుల కాంస్యం , 24,500 మెట్రిక్ టన్నుల ఇనుము ఉపయోగించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. పటేల్ ఎంతటి దృఢమైన నాయకుడో...అంతే  దృఢంగా దీన్ని రూపొందించారు. బలమైన భూకంపాలను సైతం తట్టుకోగల దృఢత్వం దీని సొంతం. 216 కిమీ వేగంతో వీచే పెను గాలులు సైతం ఈ విగ్రహాన్ని ఏమీ చేయలేవు. ఇక ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత...153 మీటర్ల వద్ద ఏర్పాటైన గ్యాలరీ. పటేల్ విగ్రహ ఛాతి భాగంలో   ఏర్పాటు చేసిన గ్యాలరీలో 200మంది సదర్శకులు కూర్చోవచ్చు. ఈ విగ్రహానికి 3.2 కిమీ దూరంలో ప్రత్యేక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి డ్యా అందాలు, ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలను వీక్షించవచ్చు .2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేశారు. 

2011 మార్చిలో సర్దార్ వల్లభబాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 2012 జూన్ లో విగ్రహా కాన్సెప్ట్ జీజైన్ ను అనౌన్స్ చేశారు. 2013 అక్టోబర్ లో దీని నిర్మాణానికి నరేంద్రమోడీ శంకుస్దాపన చేశారు. ఈ విగ్రహనిర్మాణం అవగాహన క్లించే కార్యక్రమంతో పాటు...ఇనుము సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

2014 జూన్ లో ఎల్ అండ్ టీ సంస్ధ కాంట్రాక్ట్ దక్కించుకుంది. 15 అక్టోబర్ ఐక్యతా విగ్రహానికి ప్రతిరూపాన్ని గాంధీనగర్ లోని స్వర్ణిమ్ పార్క్ లో ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ నాటికి  ఐక్యతా విగ్రహం రూపుదిద్దుకుంది.  ప్రాజెక్ట్ లో  భాగంగా స్వతంత్రోద్యమం, జాతీయ సమైక్యత, అందులో పటేల్ పాత్ర ప్రతి బింబించేలా ఒక స్మారక మ్యూజియం ఏర్పాటు చేశారు. లాగే ఐక్యతా విగ్రహానికి, కెవాడియా ప్రాంతాన్ని కలిపే రహదారి వెంబడి పార్కింగ్,రవాణా, కన్వెన్షన్ సెంటర్లు అభివృద్ది చేయనున్నారు.   

Don't Miss