Activities calendar

01 November 2018

21:53 - November 1, 2018

లండన్ : ద గ్రేట్ యునైటెడ్ కింగ్‌డమ్‌. పేరులోనే గ్రేట్ వుంది. గ్రేట్ బ్రిటన్ గ్రేట్ అయిన వాహనాన్ని తీసుకొచ్చింది. వాహనాల ద్వారా కాలుష్యాన్ని హరించివేయటానికి ఓ బస్ ను తీసుకొచ్చింది. ఈ అతిపెద్ద బస్, రైలు ఆపరేటర్ అయిన గో అహెడ్ గ్రూప్ కొత్తగా ఓ గ్రీన్ బస్‌ను తీసుకొచ్చింది. ఈ బస్సు ముందుకు కదులుతుంటే కలుషిత గాలి శుద్ధి చెందుతుండటం విశేషం. ఈ బ్లూస్టార్ బస్సుకు పైన ఓ ఫిల్టర్‌ను అటాచ్ చేశారు. ఈ ఫిల్టర్ గాల్లోని ప్రమాదకర కణాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. పాల్ ఏరోస్పేస్ ఈ ఫిల్టర్‌ను తయారు చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బస్సు సౌథాంప్టన్ వీధుల్లో తిరిగినట్లు గో అహెడ్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. నగరాల్లో బస్సులు ట్రాఫిక్ సమస్యకే కాదు కాలుష్య సమస్యను కూడా తీర్చాలన్నదే తమ లక్ష్యం అని గో అహెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ బ్రౌన్ చెప్పారు.

Related imageబస్సు కదులుతున్న సమయంలో గాల్లోని ప్రమాదకర కణాలను తొలగిస్తుండటం వల్ల ఇది నగరాల్లో గాలి నాణ్యతను పెంచుతున్నట్లే అవుతుంది. ఈ బస్సు పది మీటర్ల ఎత్తు వరకు అది తిరిగే దారిలో ఏడాదికి 1.7 సార్లు గాలిని శుద్ధి చేస్తుంది. ఈ లెక్కన అన్ని బస్సుల్లో ఇదే టెక్నాలజీ వాడితే ఎలా ఉంటుందో ఊహించండి అని బ్రౌన్ తెలిపారు. ఈ ఫిల్టర్ 99.5 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నదని పాల్ ఏరోస్పేస్ మార్కెటింగ్ డైరెక్టర్ స్టీవ్ సింప్సన్ చెప్పారు. అంటే ఇది ఏడాదికి 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేయగలదని ఆయన తెలిపారు. ఈ బస్సు పైభాగాన ఫిల్టర్‌ను అమరుస్తున్నారు. యూకేలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి వీటి ద్వారా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
 

21:44 - November 1, 2018

విజయవాడ: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు వసంత్ కుమార్ స్పష్టం చేశారు. వసంత్ కుమార్ తన రాజీనామా లేఖను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా పంపనున్నట్లు సమాచారం. వట్టి రాజీనామా చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వసంత్ కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్, చంద్రబాబు కలయిక నచ్చని కారణంగానే వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. తాను 1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నానని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ కలవడం జీర్ణించుకోలేకపోతున్నట్టు వట్టి వసంత్ కుమార్ తెలిపారు.

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. 

కాగా.. వట్టి భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని  కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే త్వరలోనే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మాట్లాడక వట్టి వసంత్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం. కాగా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం వట్టి బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

21:32 - November 1, 2018

ఢిల్లీ: ఇద్దరు చరిత్ర సృష్టించినవారే. వీరిద్దరు దేశఆనికి కీర్తిప్రతిష్టలు తెచ్చి..పతకాలు గెలిచి భరతమాతకు మెడలో వేసినవారే. పంచ్ లతో ఒకరు పతకాన్ని గెలుచుకుంటే మరొకరు బాణాలు సంధించి పతకాన్ని గెలిచారు.ఒకరు ఒలింపిక్స్ షూటింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వ్యక్తి.. మరొకరు బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలు.. వీళ్లిద్దరూ ఇప్పుడు దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లలో రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రిగా ఉండగా.. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్రెండ్లీగా బాక్సింగ్ చేశారు. చాంపియన్ అయిన మేరీ కోమ్‌ను డామినేట్ చేయడానికి రాథోడ్ ప్రయత్నించినా.. ఆమె మాత్రం టైమ్‌లీ పంచ్‌లతో రాథోడ్‌ను కంగుతినిపించింది. ఈ ఇద్దరి సరదా బాక్సింగ్ అక్కడున్న వాళ్లందరినీ ఆకట్టుకుంది.
https://twitter.com/ANI/status/1057943763895619584

21:08 - November 1, 2018

ఢిల్లీ : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శతృవులు వుండరని నానుడి. అదే ఈరోజు ఓ అరుదైన భేటీకి నాంది పలికింది. జరగదు అనుకున్నది ఒకటి జరిగింది. సాధ్యం కాదు అనుకున్న ఒకటి సాధ్యం అయ్యింది. చూడలేం అనుకున్నది ఘనట ఒకటి చోటుచేసుకుంది. అదే కాంగ్రెస్, టీడీపీ దోస్తానా. కాంగ్రెస్ పార్టీకి చిరకాల ప్రత్యర్థిగా వుండే టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు హస్తినలో బీజాలు పడినట్లుగా సంకేతాలు వచ్చాయి. ఈ భేటీ రానున్న రోజు్లో పొత్తుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ పొత్తు దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. 

Related imageరాహుల్‌, చంద్రబాబుల భేటీ చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటికీ ఈరోజు జరిగిన భేటీ దేశ రాజకీయాల్లో మార్పునకు నాందిగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన ఆయన రాజ్యాంగ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను ప్రభావితం చేస్తున్న భాజపాను ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందని మధుయాష్కీ పేర్కొన్నారు. 
 

20:40 - November 1, 2018

హైదరాబాద్ : సీపీఐ నారాయణ ఏం మాట్లాడినా సంచలనమే. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన మాట్లాడే మాటలు వివాదాస్పందంగాను..సంచలనంగాను వున్నా వాటిలో వాస్తవాలు కూడా వుంటాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ..బీజేపీ ఏతర పార్టీలను కూడగట్టి జాతీయ స్థాయిలో మహాకూటమికి పావులు కదుపుతున్న చంద్రబాబు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం, దేశ రక్షణ కోసం కలిసి పనిచేస్తామని రాహుల్ గాంధీ, చంద్రబాబు చెప్పిన విషయంపై నారాయణ తన స్టైల్ లో స్పందించారు.కాంగ్రెస్, టీడీపీలు ఉత్తర-దక్షిణ ధృవాలని, అలాంటి ధృవాలను కలిపిన ఘనత ప్రధాని మోదీదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్-టీడీపీ కలయిక శుభపరిణామమని, ఈ పరిణామాలను స్వాగతిస్తున్నామని  సీపీఐ పార్టీ నేత నాయరాణ తెలిపారు. 
 

20:26 - November 1, 2018

ఢిల్లీ: బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవన్‌లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను తెలంగాణను పరిపాలించను, సీఎంను కాను అని అన్నారు. ఏపీలో పరిపాలిస్తే చాలన్నారు. తెలంగాణలో తమ నాయకులు ఉన్నారని, వాళ్లు ఎదగాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ టీడీపీ నేతలకు మద్దతు మాత్రమే ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తులపై తాను ఎక్కడా మాట్లాడలేదన్న చంద్రబాబు.. తెలంగాణలో పొత్తులపై నిర్ణయం స్థానిక నేతలదే అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేస్తే నన్ను తిడుతున్నారని చంద్రబాబు వాపోయారు. ప్రస్తుతమున్నది బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి అన్న చంద్రబాబు.. ఏ కూటమి వైపు ఉండాలన్నది తేల్చుకోవాల్సింది కేసీఆరే అన్నారు.

సేవ్ నేషన్ పేరుతో బీజేపీయేతర పక్షాలను ఐక్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన పలు పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, శరద్ పవార్, అజిత్ జోగీ, ఫరూక్ అబ్దుల్లాలను చంద్రబాబు కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశం పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంతా ఒక్కటవ్వాల్సిన అవసరాన్ని చంద్రబాబు వారికి వివరించారు.

20:20 - November 1, 2018

తిరువనంతపురం : చదువుకు వయస్సుతో పనిలేదు. ప్రతిభకు ఓపికతో పనిలేదు. మనలో వున్న ప్రతిభను వెలికి తీస్తే అది అద్భుతాలను సృష్టిస్తుంది. వేలమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. కాటికెల్లే వయస్సులో చదువులేంటి? అనే విమర్శించినవారికి తన మార్కులతో నోరు మూయించింది ఈ బామ్మ. 30ఏళ్లు వచ్చేసరికే మోకాళ్ల నొప్పులు..40 ఏళ్లు వచ్చేసరికే వయసంతా అయిపోయినట్లుగా ఆరోగ్య పరిస్థితి మారిపోతున్న క్రమంలో అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ అనే 96 ఏళ్ల వయస్సులో అద్భుతాన్ని సృష్టించింది. అందరి మన్ననలు అందుకుంటోంది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన సాక్షరత కార్యక్రమం పరీక్షలో అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ అనే 96 ఏళ్ల నూటికి 98 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. 98 మార్కులు సాధించిన కార్తియాని అమ్మను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సత్కరించారు. అనంతరం సాక్షరత కార్యక్రమం సర్టిఫికెట్‌ను బామ్మకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా సీఎంగారు బామ్మగారితో ముచ్చటించారు. ఎలా సాధ్యమైంది నూటికి 98 మార్కులు ఎలా సాధించారని బామ్మను మీడియా ప్రశ్నించగా.. తాను కాపీ కొట్టలేదని..తన పేపర్‌ను చూసి అందరూ కాపీ కొట్టారని చెప్పారు. దీంతో సీఎం పినరాయి విజయన్ తో పాటు మీడియా మిత్రులంతా నవ్వులే నవ్వులు..మరి ఇటువంటి సందర్భాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది కదూ.
https://twitter.com/ANI/status/1057938545627807744

19:49 - November 1, 2018

కర్ణాటక : అధికార దర్పంతో నేతలు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. ఎన్నికల సమంయలో ప్రజలవద్దకు వచ్చి ఓట్ల అడుక్కునే నేతలు ప్రజాప్రతినిధులుగా మారి మరింత సమయన్వయంతో ప్రవర్తించాల్సిందిపోయి ప్రజల పట్ల ముఖ్యంగా బాధితుల పట్ల వారి ప్రవర్తన వివాదాస్పందంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లను ఓ మంత్రి విసిరేస్తే.. నేడు క్రికెటర్లకు క్రికెట్ కిట్లను మరో మంత్రి విసిరేసి వివాదాస్పదమయ్యారు. కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే తన సొంత నియోజకవర్గమైన హలియాల్‌లో ఇండోర్ స్టేడియంను బుధవారం నాడు ప్రారంభించారు.  అనంతరం అక్కడ క్రికెటర్లకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అయితే క్రికెటర్ల పేర్లు చదువుతుండగా.. వారు సభా వేదిక వద్దకు వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. దీంతో ఆ కిట్లను క్రికెటర్లపైకి మంత్రి దేశ్‌పాండే విసిరేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. నేతలుగా వున్నప్పటి కంటే ప్రజాప్రతినిథులుగా మరింతగా చెప్పాంటే మంత్రి స్థాయిలో వున్న నేతలు ఇంత పొగరుగా, నిర్లక్ష్యంగా అధికార దర్పం ప్రదర్శించటంపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఈ ఏడాది ఆగస్టులో హసన్ ఏరియాలో వరదలు రావడం వల్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రాల్లో పునరావాసం పొందుతున్న ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్ణ బిస్కెట్ ప్యాకెట్లను విసిరేసిన సంగతి తెలిసిందే.

 

https://twitter.com/ANI/status/1057854036152631296

 

19:25 - November 1, 2018

ఢిల్లీ: సేవ్ నేషన్ పేరుతో బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీకి చేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ భవన్‌లో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చంద్రబాబు అన్నారు. నోట్ల రద్దుతో వృద్ధి రేటు కుంటుపడిందన్నారు. జీఎస్టీ కారణంగా పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీల, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే ఏపీపై కక్ష కట్టారని.. టీడీపీ ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాఫెల్ స్కాంపై మోడీ మౌనానికి అర్థం ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఎవరి మాట వినకుండా నోట్ల రద్దు చేశారని.. జీఎస్టీలో లోపాల కారణంగా దుష్పరిణామాలు అనుభవిస్తున్నామని చంద్రబాబు వాపోయారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ సర్కార్ తీరుతో జనం విసుగెత్తిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దేశ విస్తృత ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు చంద్రబాబు. ఏపీకి అన్యాయం చేయడమే కాకుండా ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు ముఖ్యమన్న చంద్రబాబు.. దేశ ఐక్యత కోసం కృషి చేస్తామన్నారు. జాతీయ పార్టీల నేతలందరిని కలవాలనుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు. దేశాన్ని రక్షించాలని భావిస్తున్న పార్టీలతో కలిసి వెళ్తామన్నారు చంద్రబాబు.

ఇవాళ ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. పలు పార్టీల నాయకుల కలిసారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అజిత్ సింగ్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

19:19 - November 1, 2018

మహబూబ్ నగర్ : జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కల్వకుర్తి కూడా ఒకటి. ముందస్తు ఎన్నికల్లో కల్వకుర్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశకు లోనవుతున్నారు. వారిలో కసిరెడ్డి నారాయణరెడ్డి ఒకరు. ఈ నియోజక వర్గం టికెట్ ఆశించి తీవ్ర మనస్తాపానికి గురైన కసిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్ బుజ్జగించారు. కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్‌ను అధిష్ఠానం ప్రకటించింది. దీంతో నారాయణరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల ఓసారి ఆయనతో కేటీఆర్ మాట్లాడినప్పటికీ ఆయన వినలేదు. 
అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నారాయణరెడ్డి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఓడిపోడం ఖాయమని భావించిన కేటీఆర్ మరోసారి నారాయణరెడ్డితో భేటి అయ్యారు. పార్టీలో తగిన ప్రాధాన్యత నిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని కేటీఆర్‌కు హామీ ఇవ్వడమే కాదు... కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తి బహిరంగ సభకు వెళ్లారు.
 

18:58 - November 1, 2018

ఉత్తరప్రదేశ్ : అయోధ్య భూ వివాదం కేసుపై గతకాలం నుండి కొనసాగుతునే వుంది. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీనిపై  సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ స్పందించారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for ramamandiram supreme courtఅయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసును జనవరిలో విచారిస్తామని సుప్రీం చెప్పడంతో అందరూ వేచి చూడాల్సిందేనన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు వెల్లడించారు. ఇదిలావుండగా ఎన్నికల్లోగా కేసు కొలిక్కి వస్తుందని భావించిన బీజేపీ నేతలు సుప్రీం నిర్ణయంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు స్పందిస్తు ఇప్పుడు ఆ వివాదంపై విచారణ అంత ముఖ్యమా అంటు జనవరికి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 
ఈ నేపథ్యంలో అపర్ణా యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై యాదవ్ కుటుంబం ఎలా స్పదింస్తుందో వేచి చూడాలి. 

18:33 - November 1, 2018

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. గురువారం గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన 5వ వన్డేలో కోహ్లి సేన 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది. చివరి వన్డేలో విండీస్‌ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు(63 నాటౌట్ 5 ఫోర్లు, 4 సిక్సర్లు). కెప్టెన్ విరాట్‌ కోహ్లి 29 బంతుల్లో 33పరుగులు(6 ఫోర్లు) చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(6) తొందరగా పెవిలియన్‌ చేరినప్పటికీ రోహిత్‌-కోహ్లిల జోడి మరో వికెట్‌ పడకుండా ఆడి భారత్‌కు విజయాన్ని అందించింది. 

అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. భారత బౌలర్ల దెబ్బకు 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్‌ను లో స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్లోన్‌ శామ్యూల్స్‌(24), జాసన్‌ హోల్డర్‌(25), రోవ్‌మాన్‌ పావెల్‌(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. విండీస్ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌లు తలో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది.

స్కోర్లు..
విండీస్ 104 (31.5ఓవర్లు)
భారత్ 105/1 (14.5ఓవర్లు)
జడేజా 4 వికెట్లు

18:20 - November 1, 2018

అరిజోనా (అమెరికా): రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఓ మహిళ 6 రోజులపాటు కారులోనే ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అరిజోనాలో అక్టోబర్ 12న మహిళ ఒక్కతే డ్రైవ్ చేస్తూ ఉండగా కారు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీ కొట్టి 17 మీటర్ల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. కారు చెట్టు కొమ్మలో ఇరుక్కుపోవడంతో ఆరు రోజులపాటు కారులోనే ఉండిపోయింది. అక్టోబర్ 18న రైలింగ్ డ్యామేజీని గమనించిన భద్రతా సిబ్బంది చెట్టుపై ఉన్న కారును గమనించి కిందకి దిగారు. కానీ కారులో ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ మహిళ చిన్నగా చెట్టుపైనుంచి పైకి వచ్చి రైల్-రోడ్డుకు చేరుకొనేందుకు ప్రయాసపడింది. అయితే శరీరంలో నీరు తక్కువ కావడంతో అక్కడికి చేరుకోలేకపోయింది. స్థానికులు కొందరు ఆ మహిళను గమనించడంతో ఆసుపత్రిలో చేర్చడంతో కోలుకుంటోంది. 
 

18:12 - November 1, 2018

అమెరికా : పాప్ ప్రపంచంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. రారు. అంతటి పేరు ప్రఖ్యాతులు తన స్వయంకృషితోనే సంపాదించుకున్న గొప్ప సింగర్ మైఖేల్ జాక్సన్. అతని పేరే ఓ ప్రభంజనం, ఓ సంచలనం, ఓ అభిమానం, ఓ వైబ్రేషన్. నల్లజాతీయుడై మైఖేల్ తన జీవితంలో తెల్లటి శరీరంకోసం కోట్లాది డాలర్లలను ఖర్చు పెట్టాడంటారు. అతని  శరీరానికి ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయో లెక్కే లేదు. ఓ సంగీత సామ్రాజం కూలిపోయిన వేళ అభిమానులు తట్టుకోలేకపోయారు. అతని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్యం కూలిపోయినా..అతను చరిత్ర సృష్టిస్తునే వున్నాడు. 

Image result for forbes death celabrites listపాప్‌ రారాజు మైఖెల్‌ జాక్సన్‌ చనిపోయి కొన్నేళ్లవుతున్నప్పటికీ అత్యధికంగా సంపాదిస్తున్న డెడ్‌ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌.. చనిపోయిన తర్వాత కూడా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. అందులో మైఖెల్‌ జాక్సన్‌ మొదటి స్థానంలో ఉన్నారు. జాక్సన్‌ గతేడాది 400 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. అదెలాగంటే.. లండన్‌కు చెందిన ఈఎంఐ మ్యూజిక్‌ కంపెనీలో జాక్సన్‌కు వాటాలు ఉన్నాయి.జాక్సన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అన్నీ దాదాపు ఈఎంఐ సంస్థే కొనుగోలు చేసింది. జాక్సన్‌కు చెందిన ప్రైవేట్‌ ఏజెంట్ల ద్వారా ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను సోనీ సంస్థ 287 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అమ్మకాల ప్రక్రియ ద్వారా జాక్సన్‌ పరోక్షంగా దాదాపు 400 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. అలా 2009లో చనిపోయిన జాక్సన్‌ ఇప్పటివరకు 1.8 బిలియన్‌ డాలర్స్‌ను సంపాదించారు. 

  • Image result for forbesమైఖేల్ జాక్సన్      : 1.8 బిలియన్‌ డాలర్స్ 
  • మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ ప్రెస్లే: 31 మిలియన్‌ డాలర్స్  
  • గోల్ఫ్‌ క్రీడాకారుడు ఆర్నాల్డ్‌ పామర్: 27 మిలియన్‌ డాలర్స్ 
  • ప్లేబాయ్‌ సంస్థ వ్యవస్థాపకుడు హ్యూగ్‌ హెఫ్నర్‌: 11.7 మిలియన్‌ డాలర్స్ 
  • ఆ తర్వాతి స్థానాల్లో ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లే, రచయిత స్యూస్‌, గాయని మార్నిల్‌ మన్రో ఉన్నారు.

 

 


 

18:10 - November 1, 2018

నటుడు, దర్శకుడు రవిబాబు ఈసారి కొత్తగా పందిపిల్లతో ప్రయోగం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సదరు పందిపిల్ల పేరు, బంటి అంట. బంటి ప్రధాన పాత్రలో నటించిన మూవీ, అదుగో. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యే బంటి క్యారెక్టర్‌కి, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడీ పందిపిల్లతో పాదయాత్ర చేయించబోతుంది మూవీ యూనిట్. ఈ మేరకు ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసారు. రేపు సాయంత్రం, 3 గంటల 30 నిమిషాలకు, కె.బి.ఆర్.పార్క్ నుండి, ఫిలించాంబర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందట. సురేష్ ప్రొడక్షన్స్, ఎ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా నిర్మించిన అదుగో మూవీ, నవంబర్ 7న రిలీజవుతుంది.

17:55 - November 1, 2018

హైదరాబాద్: భారత తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యర్థం ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే సర్దార్ సమైక్యతా విగ్రహ శిలాఫలకంలో తెలుగు భాషను విస్మరించారని విమర్శలు వెల్లువెత్తాయి. మాట్లాడితే జాతీయవాదం అనే బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందన్న వాదనలు వినిపించాయి. తెలుగువారికి మీరిచ్చే గౌరవం ఇదేనా? తెలుగు ప్రజలపై ఎందుకింత వివక్ష? అంటూ టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

సమైక్యతా విగ్రహ శిలాఫలకంలో దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని, తెలుగు భాషకు స్థానం కల్పించలేదు అంటూ విమర్శలు వస్తున్న తరుణంలో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.

ఆ శిలాఫలకంపై తెలుగు భాషకు స్థానం కల్పించలేదన్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆ శిలాఫలకంపై ‘తెలుగు’, ‘కన్నడ’ తదితర భాషలు ఉన్నాయని తెలియజేస్తూ శిలాఫలకం ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఐక్య భారతం శ్రేష్ఠ భారతం’ అని తెలుగులో రాసి ఉండటం గమనించవచ్చు. ఈ సందర్భంగా టీడీపీపై ఆమె నిప్పులు చెరిగారు. ‘ఆఖరికి ఆ మహానుభావుడిని కూడా మీ పచ్చ బానిసత్వానికి బలిచేశారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారామె.

ఫోటో షాప్ చేసిన ఫ్రేమ్ నిజానికి 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ ' అని ఉన్న ప్లేట్.. దాని స్థానంలో వివిధ భాషల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసి జనం మీదకు వదిలారు పచ్చ పార్టీ వాళ్లు అని పురందేశ్వరి మండిపడ్డారు. దానికి తోడు జర్నలిజం ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు దీన్ని తమతమ ఛానల్స్‌లో చర్చలు పెట్టి మోడీ మీద ఎంత బురద చల్లాలో అంత చల్లేశారు... పైగా మేం భారతీయులం కాదా? అని ప్రశ్నలు వేశారు అని మండిపడ్డారు.

భరతమాత బిడ్డ మోడీ అంటే మీకెందుకు మంటగా ఉందో అర్ధం కావడంలేదని పురందేశ్వరి వాపోయారు. మనం తెలుగుతల్లి బిడ్డలం.. తెలుగుదేశం బిడ్డలం కాదు అని అన్నారు. ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు? దాని గురించి మీ మీ ఛానల్స్ లో ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు? అని తన పోస్ట్‌లో విరుచుకుపడ్డారు పురందేశ్వరి.

కాగా, దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ శిలాఫలకంలో గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మోదీ సఫలమయ్యారు కానీ పటేల్ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని లోకేష్ విమర్శించారు. ఐక్యతా విగ్రహంలో తెలుగు భాషను విస్మరించి.. బీజేపీ మరోసారి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారాయన.

ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చెయ్యడంలో మోడీ జీ సఫలీకృతం అయ్యారు. కానీ పటేల్ సమైక్య స్ఫూర్తి ని కాపాడటంలో మోడీ విఫలం అయ్యారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీ మరో సారి దెబ్బతీసింది. #StatueOfUnity pic.twitter.com/e8odb2WAOP

17:44 - November 1, 2018

హైదరాబాద్  : లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీ. ఈయన అవకాశం వస్తే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ తరపునుండి గానీ..కాంగ్రెస్ తరపు నుండి గానీ పోటీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా యూ ట్యూబ్‌లో పోల్ నిర్వహించడం జరిగింది. ‘తెలంగాణాలో లగడపాటి పోటీ... ప్రజాదరణ ఉంటుందా’? అని ప్రశ్న అడగగా వేయి మంది స్పందించారు. ఉంటుందని 20 శాతం చెప్పగా చెప్పలేమని 10 శాతం...ఉండదని ఏకంగా 70 శాతం మంది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

తెలంగాణాలో లగడపాటి పోటీ... ప్రజాదరణ ఉంటుందా?
ఉంటుంది 20 శాతం
ఉండదు 70 శాతం
చెప్పలేం 10 శాతం

 

17:24 - November 1, 2018

ఢిల్లీ : ‘జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో భాజపా వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. 
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతు..దేశం బీజేపీ పాలనలో క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరముందని రాహుల్ అభిప్రాయపడ్డారు. పాత విషయాలు ఇప్పుడు ముఖ్యం కాదని..ఇప్పుడు దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశ భవిష్యత్ కోసం కలిసి పనిచేయాలనుకుంటున్నామని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాపై ఛలోక్తులు విసిరారు. మీరెప్పుడు సెన్షేషన్ కోసమే ప్రయత్నిస్తుంటారా? అంటు సెటైర్ వేశారు. ఈ సందర్భంగా రాఫెల్ కుంభకోణం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని, సరైన విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు.

బీజేపీ యేతర పార్టీలతో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అీన్ని పార్టీలతో కలిసి త్వరలో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయించామని, దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నామని అన్నారు. పాత విషయాల జోలికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తామని, గతం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుత పరిణామాలపై ఆలోచిస్తున్నామని చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం సీబీఐ,ఆర్బీఐ వంటి రాజ్యాంబద్ధ వ్యవస్థల్లో కూడా జోక్యం చేసుకుంటు దేశంలోని అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు దేశం వున్న పరిస్థితులను బట్టి వ్యక్తుల గురించి కాదు దేశం గురించే మా ఆలోచన అంతా అని అందుకే బీజేపీ యేతర పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో వున్న సమస్యలపై రాహుల్ గాంధీ ఏపీకి అండగా వుంటామని హామీ ఇచ్చారని..కాంగ్రెస్ తో ప్రస్తుతం మాకు ఇబ్బందులేమీ లేవని  ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. 

కాగా భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపై ఇప్పటికే శరద్ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాలతో సీఎం చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయి గంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి చంద్రబాబు వీణను బహుమతిగా ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతు ఈ అంశాలపై మాట్లాడారు.
 

17:13 - November 1, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌, తెలుగు టీజర్‌లకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది... దీపావళి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న సర్కార్ సినిమాని, కేరళలో రెండు థియేటర్లలో, ఏకధాటిగా, 24 గంటల పాటు ప్రదర్శించనున్నారు. మరికొన్ని చోట్ల తెల్లవారు జామున 5 గంటలనుండే షోలు వెయ్యనున్నారు. తమిళనాడులో అయితే, కంటిన్యూస్‌గా 48 గంటలపాటు షోలు వేసుకునేలా అనుమతి ఇవ్వాలని, విజయ్ అభిమానులతో పాటు, మూవీ యూనిట్, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 6న సర్కార్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది.

16:49 - November 1, 2018

ఢిల్లీ : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్ మసాల, యూ ట్యూబ్ వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రసారమవుతున్న ప్రకటనలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రసారం చేయడానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం. వెంటనే ప్రకటనకు సంబంధించిన ప్రసారాన్ని నిలిపివేయాలని, భవిష్యత్‌లో కూడా ఎలాంటి ప్రకటన ప్రసారం చేయవద్దని నోటీసుల్లో పేర్కొంది. వెంటనే పది రోజుల్లో స్పందన తెలియచేయాలని సూచించింది. గతంలో కూడా ఓ కంపెనీకి చెందని బంగారు ఆభరణాల ప్రకటన విషయంలో కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందులో అమితాబ్ వ‌ృ‌ద్ధుడిగా నటించాడు. ఈ ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం కల్పించింది. 

16:32 - November 1, 2018

దసరా సీజన్ ముగించుకుని, దీపావళి కోసం ఎదురు చూస్తుంది తెలుగు సినిమా బాక్సాఫీస్.. ఎన్టీఆర్, అరవింద సమేత సినిమాతో, అక్టోబర్ 11నే దసరా సందడి మొదలైంది. పండగరోజు, రామ్, హలోగురు ప్రేమకోసమే, విశాల్, పందెంకోడి 2 మూవీస్ రిలీజైతే, గతవారం కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి. హైదరాబాద్ ఆర్.టీ.సి.క్రాస్ రోడ్‌లోని థియేటర్లలో, ఇవాళ  మార్నింగ్ అండ్ మ్యాట్నీ‌షోల కలెక్షన్స్ మరీ ఘోరంగా ఉన్నాయి.  అరవింద సమేత -సుదర్శన్- రూ.12,543, (మార్నింగ్ షో), రూ.19,052 (మ్యాట్నీ), బంగారి బాలరాజు- దేవి- రూ.1,578, (మార్నింగ్ షో), రూ.2,860, (మ్యాట్నీ),  హలోగురు ప్రేమకోసమే- సంధ్య70- రూ,10,761, (మార్నింగ్ షో), రూ.17,862,  (మ్యాట్నీ), పందెంకోడి 2- సంధ్య35- రూ.12,039,(మార్నింగ్ షో), రూ.16,512,  (మ్యాట్నీ), టు ఫ్రెండ్స్- మయూరి- రూ.2,303,(మార్నింగ్ షో),  రూ.2,676 (మ్యాట్నీ), వీరబోగ వసంత రాయలు- సప్తగిరి- రూ.5,236, (మార్నింగ్ షో),  రూ.5,382,(మ్యాట్నీ), 
ఐశ్వర్యాభిమస్తు- శాంతి- రూ.4,405, (మార్నింగ్ షో),     రూ.4,189,,(మ్యాట్నీ), రథం- తారకరామ- రూ.4,145, (మార్నింగ్ షో),  రూ.5,186,(మ్యాట్నీ).  

16:26 - November 1, 2018

కేరళ : భారత్ తరపున 164 టెస్టులు, 344 వన్డే మ్యాచ్‌లు ఆడి రెండు ఫార్మాట్లలోనూ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న అరుదైన ఆటగాడు రాహుల్ ద్రావిడ్.‘మిస్టర్ డిపెండబుల్’, ‘దివాల్’గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన భారత మాజీ క్రికెటర్, దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం లభించింది.  భారత్ తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదవ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు చోటు దక్కింది. 

Image result for rahul dravid hall of fameతిరువనంతపురం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రవిడ్ ఈ జ్ఞాపికను అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి భారత మాజీ స్పిన్ బౌలర్ కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ద్రవిడ్‌కు ముందు 2009లో గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, 2015లో అనిల్ కుంబ్లేలు ఈ గౌరవాన్ని పొందారు. 

16:19 - November 1, 2018

హైదరాబాద్: బీజేపీలో టికెట్ల గొడవ ముదురుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీజేపీ కార్యాలయం ముందు ఆశావహులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి బుచ్చిరెడ్డి, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి శ్రీనివాసరెడ్డిలు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆశావహులు ఆరోపిస్తున్నారు. 

మొదటి లిస్టులో సీట్లు దక్కని వారు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజాగా బీజేపీ రెండో జాబితా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీటు ఆశిస్తున్న ఆశావహులు బీజీపీ ఆఫీస్ ముందు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నంకు చెందిన బీజేపీ ఆశావహులు బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దశాబ్దాల పాటు పార్టీ కోసం పని చేస్తున్నామని, పార్టీని బతికించిన తమను పట్టించుకోకుండా డబ్బున్నవారికి టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి టికెట్ విషయంలో నరేష్, అచ్చిరెడ్డి భాస్కర్ రెడ్డి, సతీష్‌లు రేస్‌లో ఉన్నారు. అయితే తమ ముగ్గురికి కాకుండా అమిత్ షా టూర్‌లో బీజేపీలో చేరిన యోగానంద్‌కు  టికెట్ ఇస్తారని తెలియడంతో వారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అటు ఇబ్రహీంపట్నంలో అంజయ్యకు కాకుండా వేరేవాళ్లకు టికెట్ ఇవ్వడం సమంజసం కాదంటున్నారు. బీజేపీని నాశనం చేసే విధంగా రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. కాగా టికెట్ ఆశించి భంగపడ్డ బుచ్చిరెడ్డి సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరి ఈ అసమ్మతి జ్వాలను బీజేపీ అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి.

15:57 - November 1, 2018
తిరువనంతపురం: చివరి వన్డేలో... భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 31.5 ఓవర్లలో 104 పరుగులకే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది. భారత విజయలక్ష్యం 105 పరుగులు.
 
అంతకుముందు స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరగానే తొలి వికెట్‌ను, మరో పరుగు చేరగానే రెండో వికెట్‌ను, 36 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయారు. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టు.. పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ జడేజా 4 వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఖలీల్ 2, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో జేసన్ హోల్డర్ చేసిన 25 పరుగులే అత్యధిక స్కోర్.
15:53 - November 1, 2018

ఢిల్లీ : రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తెలంగాణలో మహా కూటి సీట్ల పంపకంతో పాటు..ఇతర పనులలో బిజీ బిజీగా వున్నారు. బీజేపీ ఏతర పార్టీలతో జత కట్టి రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం శరద్ పవార్ నివాసంలో కొనసాగింది. జాతీయ స్థాయిలో మహా కూటమికి పునాదులు వేస్తున్నారు.  శరత్ పవార్, ఫరూక్ లతో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతు..దేశంలోనే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాను సీనియర్ నేతలన్నారు. బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, కీలకమైన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని..సీనియర్ నేతలుగా తామంతా ఆందోళన చెందుతున్నామన్నారు. భవిష్యత్ తరాలను, దేశాన్ని రక్షించడానికి తాము పూనుకున్నామని తెలిపారు. అందరం కలసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

Image result for sharad pawarప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది..
శరద్ పవార్ మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ' పేరుతో తామంతా ముందుకు సాగుతున్నామని చెప్పారు. భావసారూప్యం ఉన్న పార్టీలన్నీ తమతో కలసి రావాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.

Image result for faruq abdullah
సీబీఐ,ఆర్బీఐలను కేంద్రం భ్రష్టు పట్టించింది..
సీబీఐ, వ్యవహారం దగ్గర నుంచి ఆర్బీఐ వరకు అన్ని రంగాలను కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఫరూక్ విమర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల నేపథ్యంలో అంతా కలిసి పనిచేద్దాం అని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తాము చర్చించామని తెలిపారు. రానున్న ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామని వెల్లడించారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

 

15:38 - November 1, 2018

వరంగల్: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన తిరునగరి మారుతీరావు, అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్ కుమార్‌లను మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులైన ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఏడాది పాటు వీరు ముగ్గురూ సెంట్రల్ జైల్లో ఉంటారని, ముగ్గురికి వేర్వేలు బ్యారక్‌లు కేటాయించామని డీఐజీ మురళీబాబు తెలిపారు. ఈ కేసులో ఏ1గా మారుతీ రావు, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్ ఉన్నారు.

15:24 - November 1, 2018

ఢిల్లీ: హస్తిన పర్యటనలో వున్న ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. బీజేపీ ఏతర పార్టీలను కలుపుకుని బీజేపీ పార్టీయే లక్ష్యంగా పలు పార్టీల నేతలతో వరుసభేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీ యేతర కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై చంద్రబాబు నాయుడు ఇరు నేతలతో చర్చించారు.

Image result for faruq abdullahదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని అంతా కలిసి రావాల్సిన సమయం ఏర్పడిందని నేతలకు చంద్రబాబు సూచించారు. బాబు అభిప్రాయాలతో ఏకీభవించిన నేతలు సానుకూలత వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతు..సీబీఐ వ్యవహారం దగ్గర నుంచి ఆర్బీఐ వరకు అన్ని రంగాలను కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఫరూక్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల నేపథ్యంలో అంతా కలిసి పనిచేద్దాం అని యోచిస్తున్నట్లు తెలిపారు. 

Image result for chandrababuదేశంలో ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శరద్ పవార్, ఫరూక్ అబ్ధుల్లాతో సమావేశమైన అనంతరం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా కలిసి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. తనకంటే సీనియర్ రాజకీయ నాయకులైన శరద్ పవార్, ఫరూక్ అబ్ధుల్లాతో కలిసి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వివరించినట్లు తెలిపారు. బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడమే తన లక్ష్యమని అందుకు అవసరమైతే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుస్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తో సైతం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సాయంత్రం 3.30గంటలకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలను కలుపుకుని భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. కాగా మధ్యహ్నాం 3.30గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణలో మహాకూటమిలో పొత్తులు, సీట్ల పంపకాలు వంటి పలు కీలక అంశాలపై చంద్రబాబు రాహుల్ తో చర్చించనున్నారు.

15:23 - November 1, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో, దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత డి.వి.వి.దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఈ ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్) మూవీని నిర్మించబోతున్నాడు . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్వాతత్ర్యం రాకముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుందని, తారక్, చరణ్‌లలో ఒకరు దొంగగా, మరొకరు పోలీస్‌గా కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ మూవీలో యంగ్ టైగర్ లుక్ ఇదేనంటూ, సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఆ పిక్‌లో బ్లాక్‌డ్రెస్‌లో, టక్ చేసుకుని ఉన్నాడు. ఆల్‌రెడీ ఎన్టీఆర్, ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు మొదలు పెట్టేసాడు. నవంబర్ 5న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టే ప్లాన్‌లో ఉన్నారు.

 

15:18 - November 1, 2018

తిరువనంతపురం: చివరి వన్డేలో... భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరగానే తొలి వికెట్‌ను, మరో పరుగు చేరగానే రెండో వికెట్‌ను, 36 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయారు. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టు.. పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఓపెనర్ కీరన్ పావెల్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిగాడు. అనంతరం హోప్ కూడా బుమ్రా బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్లన్ శామ్యూల్స్ ధాటిగా ఆడుతూ 24పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలెన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. విండీస్ స్కోర్ 21.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులు.

15:16 - November 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం కుదరడం లేదని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజులవుతున్నా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ని ఓడించేందుకు కాంగ్రెస్ పెద్దన్నగా మారి మహా కూటమి తెరపైకి తెచ్చింది. ఇందులో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు చేరాయి. ప్రస్తుతం పొత్తులు..సీట్ల సర్దుబాటు..అభ్యర్థుల ఖరారపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒక కొలిక్కి రాకపోవడంతో ఆయా పార్టీల నేతల్లో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. 
ఇదిలా ఉంటే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇతర కీలక నేతలు గురువారం ఢిల్లీకి బయలుదేరారు. సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు కుంతియా వెల్లడించారు. 
మరోవైపు ఈరోజు జరగాల్సిన స్ర్కీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈనెల 5వ తేదీన సమావేశం జరుగనుంది. అనంతరం 8వ తేదీన జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కూటమిలో ఉన్న ఇతర పార్టీల జాబితా కూడా అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది. 95 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయానికి రాగా మిత్రపక్షాలకు 24 సీట్లు కేటాయించింది. మరి కాంగ్రెస్ నిర్ణయం మిత్రపక్షాలు అంగీకరిస్తాయా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

15:12 - November 1, 2018
పట్నా: ‘‘బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలో ఇంతకాలం ఉండి విసిగిపోయారు.. త్వరలో రాజీనామా చేసి శేషజీవితం ప్రశాంతంగా గడుపుతారు’’ అంటూ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుషువా సంచలన వ్యాఖ్యలు చేయడం బిహార్ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షులు కుషువా చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ నుంచి కానీ.. జనతా దళ్ యునైటెడ్ పార్టీనుంచి గానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. 
‘‘ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మేము కోరుకోవడం లేదు.   ఆయనకు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ఆయనను ఎవరూ వత్తిడి చేయడంలేదు’’ అంటూ కుషువా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎల్పీ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. 
‘‘15 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇంకా కొనసాగటానికి నితీష్ కుమార్ సంసిద్ధంగా  లేరు’’ అంటూ కార్యకర్తల చిట్ చాట్ లో కుషువా బుధవారం వ్యాఖ్యానించారు. 
అయితే.. కుషువా వ్యాఖ్యల వెనక సీట్ల సర్దుబాటులో అసంతృప్తి దాగి ఉందని తెలుస్తోంది. జేఎల్డీ, బీజేపీ సమానంగా సీట్లు సర్దుబాటు చేసుకుంటాయి అని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ప్రకటన నేపథ్యంలో ఉపేందంర్ కుషువా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌తో సమావేశమై సీట్లకోసం బేరం ఆడారన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కుషువా వ్యాఖ్యలు వారి మధ్య మరింత గ్యాప్ పెంచాయని భావిస్తున్నారు. 
 
14:37 - November 1, 2018

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా, ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమాని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చెయ్యనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రెండు భాగాలూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ మూవీ యూనిట్ చాలా స్పీడ్‌గా ఉంది.. ఇప్పటి వరకు విడుదల చేసిన బాలయ్య వివిధ లుక్స్‌కి, సుమంత్, రానా, కళ్యాణ్ రామ్,  రకుల్ ప్రీత్ సింగ్, భరత్ రెడ్డి లుక్స్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆత్రుతగా, ఆసక్తితో ఎదురు చూస్తున్న నందమూరి వీరాభిమానులు తమ తరపునుండి ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు. బాలయ్యకి కూకట్‌పల్లిలో హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. తన ప్రతి సినిమా రిలీజ్ నాడు, తెల్లవారు జామునే అభిమానులతో కలిసి, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్స్‌లో సినిమా చూడడం బాలయ్యకి ఎంతో ఇష్టం. ఒకరకంగా కూకట్‌పల్లి బాలయ్య కంచుకోటని చెప్పొచ్చు. రీసెంట్‌గా అక్కడి నందమూరి వీరాభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో  టీ షర్టులు ప్రింట్ చేసి, వాటిని ధరించి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న విడుదల కాబోతున్నాయి.  

 

14:25 - November 1, 2018

నల్గొండ : మహాకూటమికి 10 సీట్ల రాకుంటే..తాను గెలిచినా రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కోమటిరెడ్డి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. శుక్రవారం మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 

 

14:12 - November 1, 2018
మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా ఈ జిల్లా నుంచే బరిలో దిగుతున్నారు. దీంతో మహాకూటమిలోని ఇతర పార్టీలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం ఐదు స్థానాలే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవి ఏంటి? వాటిలో ఎవరు పోటీ పడుతున్నారు?
 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో టికెట్ల కోసం మహాకూటమిలోని పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ తమకంటే తమకని టీడీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయి. దీంతో ఎవరెవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ మఖ్తల్, దేవరకద్ర, వనపర్తి, జడ్చర్ల టిక్కెట్లు ఆశిస్తుండగా.. టీజేఎస్ మహబూబ్ నగర్ స్థానాన్ని కోరుతోంది.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు బరిలో నిలిచే అవకాశముందో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గం. 
నియోజకవర్గం - మహబూబ్ నగర్
పాత జిల్లా - మహబూబ్ నగర్
కొత్త జిల్లా - మహబూబ్ నగర్
2014లో గెలిచిన అభ్యర్ధి - శ్రీనివాస్ గౌడ్
2014లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్ధి - యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మహాకూటమి నుంచి టీజేఎస్ టికెట్ ఆశిస్తోంది. రాజేందర్ రెడ్డిని టీజేఎస్ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశముంది.
టీజేఎస్ మహబూబ్ నగర్ స్థానం కోసం పట్టుపట్టడానికి కారణాలు
రాజేందర్ రెడ్డి కొదండరామ్‌ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఉద్యోగం సంఘాల తరపున ఉద్యమంలో రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘ నేత శ్రీనివాస్‌కు మరో ఉద్యోగ సంఘ నేత రాజేందర్ రెడ్డే ప్రత్యామ్నాయమని టీజేఎస్ భావిస్తోంది. టీడీపీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో మొదటిది.. మఖ్తల్.
నియోజకవర్గం - మఖ్తల్
పాత జిల్లా - మహబూబ్ నగర్
కొత్త జిల్లా - మహబూబ్ నగర్
2014లో గెలిచిన అభ్యర్ధి - చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈయన కాంగ్రెస్ టికెట్ పై గెలిచి తరువాత టీఆర్ఎస్‌ లో చేరారు. 2014లో రెండో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ఎల్లారెడ్డి. మహాకూటమి నుంచి టీడీపీ మఖ్తల్ టికెట్ ఆశిస్తోంది. టీడీపీ అభ్యర్ధిగా దయాకర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశముంది.
టీడీపీ మఖ్తల్ టికెట్ ఆశించడానికి కారణాలు
గతంలో మఖ్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం వుంది. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సన్నిహితి సంబంధాలున్నాయి. కాంగ్రెస్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. మఖ్తల్‌లో హస్తం పార్టీకి మరో బలమైన నేత లేకపోవడంతో దయకర్ రెడ్డిని బరిలోకి దించాలని మహాకూటమి ప్లాన్ చేస్తున్నట్లు  తెలుస్తోంది. టీడీపీ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో రెండవది.. దేవరకద్ర.
నియోజకవర్గం - దేవరకద్ర
పాత జిల్లా - మహబుబ్ నగర్
కొత్త జిల్లా - మహబుబ్ నగర్
2014లో గెలిచిన అభ్యర్థి - ఆల వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ. 2014లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్ధి - డోకూర్ పవన్, కాంగ్రెస్ పార్టీ
మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్ధిగా సీతాదయకర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
టీడీపీ దేవరకద్ర టికెట్ డిమాండ్ చేయడానికి కారణాలు
గతంలో దేవరకద్ర ఎమ్మెల్యేగా సీతాదయాకర్ రెడ్డి పనిచేశారు. టీడీపీలో సీనియర్ నాయకురాలిగా కొనసాగుతున్నారు. 
కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ అభ్యర్ధికే టికెట్ దక్కుతుందని టీడీపీ విశ్వసిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ తీవ్రంగా పోటీపడుతున్న నియోజకవర్గం వనపర్తి.
నియోజకవర్గం - వనపర్తి
పాత జిల్లా - మహబుబ్ నగర్
కొత్త జిల్లా - వనపర్తి
2014లో గెలిచిన అభ్యర్థి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ. 2014లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థి - నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ
మహాకూటమి నుంచి కాంగ్రెస్, టీడీపీ రెండూ పోటీ పడుతున్నాయి. టీడీపీ అభ్యర్ధిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా చిన్నారెడ్డి సై అంటే సై అంటున్నారు. 
టీడీపీ, కాంగ్రెస్ వనపర్తి టికెట్ డిమాండ్ చేయడానికి కారణాలు:
రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్ననారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. చిన్నారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి తమకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ తీవ్రంగా పోటీపడుతున్న మరో నియోజకవర్గం జడ్చర్ల.
నియోజకవర్గం - జడ్చర్ల
పాత జిల్లా - మహబుబ్ నగర్
కొత్త జిల్లా - మహబుబ్ నగర్
2014లో గెలిచిన అభ్యర్థి - లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్
2014లో కాంగ్రెస్ అభ్యర్థి  మల్లు రవి రెండో స్థానంలో నిలిచారు. జడ్చర్ల టికెట్ తమకే కావాలని మహాకూటమిలోని టీడీపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. టీడీపీ నుంచి ఎర్రశేఖర్, కాంగ్రెస్ నుంచి మల్లురవి జడ్చర్ల టికెట్ ఆశిస్తున్నారు.
టీడీపీ, కాంగ్రెస్ జడ్చర్ల టికెట్ డిమాండ్ చేయడానికి కారణాలు :
ఎర్ర శేఖర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎర్ర శేఖర్‌కు పనిచేసిన అనుభవం ఉండటంతో టీడీపీ తమకే ఈ టికెట్ కావాలని డిమాండ్ చేస్తోంది. మల్లు రవి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా మల్లురవి గతంలో పనిచేశారు. దీంతో తమకే టికెట్ ఇవ్వాలని మహాకూటమి డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ మాత్రమే పోటీ చేసే నియోజకవర్గాలు.
నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి పేరు
గద్వాల్..  డీకే అరుణ
అలంపూర్..  సంపత్ కుమార్
కల్వకుర్తి...  వంశీచంద్ రెడ్డి
అచ్చంపేట ... వంశీకృష్ణా
కొడంగల్ ... రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్...  నాగం జనార్ధన్ రెడ్డి
షాద్ నగర్...  ప్రతాప్ రెడ్డి
కొల్లాపూర్..  బీరం హర్షవర్ధన్ రెడ్డి
13:51 - November 1, 2018

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడికి పాల్పడిన శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో శ్రీనివాసరావు ఎలాంటి విషయాలు వెల్లడిస్తున్నాడనేది గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు శ్రీనివాసరావు తల్లిదండ్రులను సిట్ అధికారులు పిలిపించారు. గురువారం ఎయిర్ పోర్టు పీఎస్ లో తల్లిదండ్రుల ఎదుట విచారిస్తున్నారు. జ్యోతి, రమాదేవిలను కూడా విచారిస్తున్నారు. సిట్ ఎదుట మరోసారి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ సిబ్బంది హాజరయ్యారు. ఇందులో ఇద్దరు సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
ఇదిలా ఉంటే శ్రీనివాసరావు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని సిట్ కోర్టును అభ్యర్థిస్తుందా ? అభ్యర్థిస్తే కస్టడీని పొడిగిస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. శ్రీనివాసరావు కాల్ డేటాను సిట్ విశ్లేషిస్తోంది. అతని బ్యాంకు లావాదేవీలు, ఎనిమిది నెలల్లో ఎవరిని శ్రీనివాసరావు కలిశాడు ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తునకు అవసరమైన సమాచారం సేకరించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. 

13:39 - November 1, 2018

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నెలకొన్న వివాదం నేపథ్యంలో  కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తుందని చెప్పింది. ఐతే ఆర్‌బీఐ చట్టం పరిధిలో  బ్యాంకు స్వయం ప్రతిపత్తిని కాపాడతామని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆర్‌బిఐ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా వరకూ ఈ వ్యవహారం వెళ్లిందని అన్నారు. ఇందుకోసం కేంద్రం ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్ 7ను ప్రయోగిస్తుందని కూడా విన్పించింది. ఐతే ఇంతలోపే రచ్చ జరగడంతోనే కేంద్రం వెనక్కి తగ్గింది.

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య విభేదాలు  తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ గవ‍ర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పదేళ్ల సమయాన్నే చూస్తే.. ఆర్‌బీఐ గవర్నర్లకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ నెలకొనడానికి ముఖ్యంగా బ్యాంకుల లిక్విడిటీనే కారణంగా మారుతోంది. తాజాగా ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్‌ 7ని కేంద్రం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే న్యాయనిపుణులతో ఈ సెక్షన్ పై సంప్రదించినట్లు తెలుస్తోంది. 

ఆర్‌బిఐ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం తగదంటూ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, అసలు ఆర్బీఐ తీరే ఎన్‌పిఏ సమస్యకి కారణమంటూ అరుణ్ జైట్లీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అసలు ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి హక్కెంత వరకు ఉంది అనే చర్చ మొదలైంది..ఇందుకు ప్రతిగా కేంద్రం గత 83ఏళ్లలో ఎన్నడూ వాడని ఓ సెక్షన్‌ని వాడనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయ.
 
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 నిబంధన ప్రకారం, కేంద్రం ఆర్బీఐకి ప్రతి అంశంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఆదేశాలు సూచనలు జారీ చేయవచ్చు. ఐతే ఆర్బీఐ గవర్నర్‌ని సంప్రదించిన తర్వాతే ఇలా చేయడానికి వీలు ఉంటుంది. కానీ ఇక్కడిదాకా వచ్చాక ఇక ఆర్బీఐకంటూ.. నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చ ఉండదు..అందుకే ఆర్బీఐ గవర్నర్ గా తన పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యక్షంగా ఇప్పటిదాకా కేంద్రం సెక్షన్7 గురించి చెప్పకపోయినా..ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని అంటారు. ఐతే ఇప్పటికే ఈ విషయంపై ఇంటా బైటా రచ్చ జరగడంతో కేంద్రం ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసేందుకు ప్రకటన విడుదల చేసినట్లు చెప్తున్నారు.

13:22 - November 1, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తినలో అడుగు పెట్టారు. సేవ్ నేషన్ పేరిట జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని బాబు వ్యూహాలు రచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రం, మోడీపై బాబు పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చిన తరువాత ఏపీపై కేంద్రం వివక్ష చూపిస్తోందని, ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోందని బాబు ధ్వజమెత్తుతున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ పార్టీ నేతలను కలిసి ఏపీకి జరుగుతున్న అన్యాయం వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
ఇటీవలే ఢిల్లీ వెళ్లివచ్చిన బాబు గురువారం ఉదయం మరోసారి హస్తినకు బయలుదేరారు.Image result for ghulam nabi azad and chandrababu విమానాశ్రయంలో దిగగానే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తో బాబు భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలు..మహా కూటమి అభ్యర్థుల ఖరారు..పొత్తులు తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్ భేటీ కంటే ముందుగానే బాబును ఆజాద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Image result for Farooq abdullah and chandrababuఅనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి బయల్దేరుతారు. ఇక్కడకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా రానున్నారు. రాజకీయ అంశాలపై వీరు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ అధినేత రాహుల్ తో బాబు భేటీ కానున్నారు. ప్రాంతీయ పార్టీలని ఏకతాటిపైకి తెచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని బాబు నేతలను కోరనున్నారు. మరి బాబు ప్రయత్నాలు ఎంత మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. 

13:08 - November 1, 2018

కర్నూలు : రాయలసీమను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 13మంది చనిపోయారు. మరోవైపు ఈ వ్యాధి నెల్లూరు జిల్లాకు వ్యాపిచండంతో.. వైద్య శాఖ అలర్టైంది. గుంటూరు నుంచి ప్రత్యేక వైద్యులను రప్పించి.. వ్యాధి విస్తరణకు గల కారణాలను అన్వేషిస్తోంది. 

కర్నూలు జిల్లాను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకు ప్రభుత్వాస్పత్రికి వచ్చే స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చలిగాలుల తీవ్రత పెరుగుతుండటంతో.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వాధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గ్రామాల్లో పరిస్థితి ఏ  మాత్రం మారడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 37 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదుకాగా... 12 మంది మృతి చెందారు. బుధవారం మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 13కు చేరింది.  మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులు, పాములపాడుకు చెందిన క్రిష్టమ్మగా గుర్తించారు.

స్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్ ఫ్లా వ్యాధి పై  అధ్యాయానికి గుంటూరు డాక్టర్ల కమిటీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. గుంటూరు నుండి కర్నూలు చేరుకున్న డాక్టర్ల బృందం జిల్లాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ  కేసులుపై అధ్యయనం చేస్తోంది.  స్వైన్ ఫ్లూ కేసులు పెరగటానికి కారణాలను అన్వేషిస్తోంది. అధ్యయనం తరువాత రిపోర్టును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందజేయనుంది. 

మరోవైపు ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ వ్యాధి నెల్లూరు జిల్లాకు విస్తరించింది. జిల్లాలో అధికారికంగా 11 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. నెల్లూరు నగరంలో ఐదు, చిట్టమూరు, సౌత్‌ మోపూరు,  బుచ్చిరెడ్డిపాళెంలో రెండేసి వంతున స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.  జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు  సదస్సులు నిర్వహిస్తున్నారు.  

13:06 - November 1, 2018

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వరస ఫ్లాప్‌ల తర్వాత, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో నటిస్తున్న జీరో మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
కలర్ ఎల్లో ప్రొడక్షన్ సమర్పణలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో జీరో సినిమాను నిర్మిస్తుంది. ఈరోజు షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా జీరో మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేసాడు. ఒక పోస్టర్‌లో కత్రినా కైఫ్‌తో, మరో  పోస్టర్‌లో అనుష్క శర్మతో  షారుఖ్ కనిపించాడు. ఈమూవీలో  షారుఖ్, బువా సింగ్ అనే మరుగుజ్జు క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కత్రినా‌తో ఉన్న పోస్టర్‌కి చాలామంది నక్షత్రాలను దగ్గరినుండి చూడాలని కలలు కంటారు. కానీ, నేను చంద్రుడినే దగ్గరినుంచి చూసాను అనే క్యాప్షన్ ఇచ్చిన కింగ్ ఖాన్, అనుష్క శర్మతో  ఉన్న పోస్టర్‌కి, ఈ ప్రపంచంలో నాలా ఉండే వ్యక్తి ఆమె ఒక్కతే అని క్యాప్షన్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్న జీరో మూవీ, డిసెంబర్ 21న రిలీజవబోతుంది.    

12:35 - November 1, 2018

ముంబై : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ డ్యాన్స్ అంటేనే అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతుంటారు. ఆమె చేసే డ్యాన్స్ మతులను పొగొడుతుంది. పలు సినిమాల్లో కత్రినా చేసిన డ్యాన్స్ లు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.Image result for suraiya katrina kaif dance వయస్సు మీద పడుతున్నా ఆమెలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని ఇటీవలే విడుదలైన టీజర్ చూస్తే అర్థమౌతుంది. 
అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇందులో సురైయా అనే నర్తకి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మొదటి పాటను ఇటీవలే విడుదల చేశారు. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.
విడుదల చేసిన 'సురయ్యా' సాంగ్ లో కత్రినా చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది. ఈ పాటకు ఇప్పటికే 9.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పచ్చ, ఎరుపు రంగు కాంబినేషన్‌లో ఉన్న లెహెంగా ధరించిన కత్రినా గెటప్ అదిరిపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సాంగ్ తో మరోసారి కత్రీనా అందరినీ మెస్మరైజ్ చేసింది. కత్రినా డ్యాన్స్‌ చేస్తుంటే చుట్టూ నిలబడిన బ్రిటిషర్స్ వావ్‌ అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోయారంట. విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

12:21 - November 1, 2018

కృష్ణా : అగ్రిగోల్డు బాధితుల ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తిరుమలరావు హెచ్చరించారు. బాధితులు ధర్నా చౌక్‌లో ఆందోళన చేసుకోవాలని సీపీ సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అగ్రిగోల్డు బాధితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసుల అరెస్టులపై అగ్రిగోల్డు బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

12:19 - November 1, 2018

తూత్తుకుడి:  పెళ్లి చేసుకుంటామంటే సరేనన్నారు ఆ ఆలయం పెద్దలు. తీరా పెళ్లి రోజు వచ్చేసరికి కుదరదు. వేరేచోట పెళ్లి చేసుకోండి.. అంటూ బయటకు పంపేశారు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గుడి నిర్వాహకులు ప్లేటు ఫిరాయించడంతో అంతా షాకయ్యారు. ఇంతకీ వారు వద్దనడానికి కారణం ఏంటంటే.. పెళ్లి కూతురు శ్రీజ ట్రాన్సజెండర్ మహిళ (లింగమార్పిడి అనంతరం), పెళ్ళికొడుకు అరుణ్ కుమార్ సిస్‌జెండర్ (పుట్టుకతో మగ). దీంతో ఇద్దరు ట్రాన్సజెండర్ మహిళలు భూమిక, ఆర్తి వీరి పెళ్లికి నడుంబిగించారు. 

Image result for Section 377
ఈ ఏడాది సెప్టెంబర్ 6న సెక్షన్ 377 పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తాజా తీర్పు ప్రకారం గే సెక్స్ తప్పుకాదు. ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చితే కలిసి జీవించవచ్చు, వివాహమాడవచ్చు అని తీర్పు వెలువరించింది. ట్రాన్సజెండర్లు పెళ్లిచేసుకోవచ్చని తెలిపినా సమాజం అందుకు ఇంకా సన్నద్ధం కాలేదు అనడానికి తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఈ సంఘటన ఓ ఉదాహరణ. 

Image result for marriage in Thoothukudi after SC verdict on Section 377
తూత్తుకుడిలోని శివాలయంలో పెళ్లిచేసుకోవాలని వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆధార్ కార్డులు ఇతర ఆధారాలు ముందే సమర్పించారు. వీరి పెళ్లికి మీడియాను, గ్రామపెద్దలను ఆహ్వానించారు. కెమెరాలను పురమాయించారు. అందరూ పెళ్లి మండపానికి రెండు గంటల ముందే చేరుకున్నారు. తీరా పెళ్లిఘడియ  వచ్చేసరికి శివాలయం పెద్దలు పెళ్లి కుదరంటే కుదరదు అని వారిని బయటకు పంపేశారు. పెళ్లికోసం రూ 600 ఫీజును ముందు రోజే చెల్లించారు. సర్టిఫికెట్ ఇవ్వండి పూజారికి ఇవ్వాలంటే.. కుదరదు అనేశారు ఆలయ నిర్వాహకులు. కారణం అప్లికేషన్‌లో ఆడ, మగ అనే రెండే ఆప్షన్లు ఉన్నాయి. అందులో ట్రాన్స్‌జెండర్ అనే ఆప్షన్ లేదు.  ఈ కారణంతొ పెళ్లికి నిరాకరించారు. ‘‘మేమిద్దరం ఏడాది నుంచే కలిసి ఉంటున్నాము. అయితే ఆర్టికల్ 377పై తీర్పు వచ్చిన తర్వాతే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకొన్నాము. మేమిద్దరం హిందూవులమే.. ఆలయంలో పెళ్లినిరాకరించడం అన్యాయం’’ అంటూ పెళ్లికూతురు శ్రీజ వాపోయింది. 
అయితే పెళ్లికి వచ్చిన ట్రాన్సజెండర్ మహిళలు కలగచేసుకొని వీరిద్దరికీ తాళిబొట్టు ఇచ్చి పెళ్ళి జరిపించడం విశేషం. పెళ్లి అనంతరం రిజిస్టార్ ఆఫీసులో మ్యారేజీ నమోదు చేసుకున్నారు. అందరూ మద్ధతు ఇవ్వడంతో తమ పెళ్లి సజావుగా జరిగిందని పెళ్లికొడుకు అరుణ్ కుమార్ చెప్పాడు. అయితే.. తన తల్లిదండ్రులు పెళ్లికి రాకపోవడం బాధ కలిగించినా.. పెళ్లి అయినందుకు సంతోషంగా ఉందని అరుణ్ తెలిపాడు. 
 

 

12:06 - November 1, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం కేసు మలుపులు తిరుగుతోంది. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస్ పలు విషయాలు తెలియచేస్తున్నాడు. ఇదిలా ఉంటే తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో కుట్ర దాగి ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. దీనిని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతికంగా జరుగుతోందని లాయర్ కోర్టుకు తెలిపారు. దీనితో ఇరువురి వాదనలు విన్న కోర్టు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

12:06 - November 1, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ధియేట్రికల్ ట్రైలర్‌,‌ సాంగ్స్ అండ్ సాంగ్ ప్రోమోస్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈరోజు సవ్యసాచి సుభద్ర పరిణయం టీజర్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాలేజ్‌లో హీరో అతని ఫ్రెండ్స్‌తో కలిసి సుభద్ర పరిణయం నాటకాన్ని ప్రదర్శించి, కడుపుబ్బా నవ్వించబోతున్నాడని క్లూ ఇచ్చింది సినిమా బృందం. కృష్ణా, బలరాముడంటే రాముడికి చుట్టమా? అని ధర్మరాజు అడిగితే, కృష్ణుడు, సుదర్శన చక్రం సర్వీసింగ్‌కిచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకుండేదిరా దరిద్రుడా అనడం.. బలరాముడు చెలికత్తెలతో సరసాలాడుతూ, అర్జునుడితో, ఇందులో(పోటీలో) మొత్తం మూడు రౌండ్లుంటాయ్ అంటే, అయ్యో బలరామ్ బావా, నాకు రెండు రౌండ్లకే కళ్ళు తిరిగిపోతాయి అని అర్జునుడు అమాయకంగా అనడం భలే పేలింది. ఇక అర్జునుడు, మూడు పరీక్షలు గెలిస్తే ఏంటి? అనడిగితే, సుభద్రను చేసుకోవచ్చు అని బలరాముడు చెప్పగానే, మరి ఓడిపోతే? అని ధర్మరాజు ప్రశ్నిస్తే, చెలికత్తెను చేసుకోవచ్చు అనడం, దానికి ధర్మరాజు ఇన్‌డైరెక్ట్‌గా చచ్చిపోవచ్చని చెప్తున్నారు అంటూ కౌంటర్ వెయ్యడం అదిరిపోయింది. సవ్యసాచి దీపావళి కానుకగా, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.    

12:01 - November 1, 2018

తూర్పుగోదావ‌రి : జిల్లాలో జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కాబోతుంది. తుని నుండి ప్రారంభ‌మ‌య్యే ఈ పోరాట యాత్రను వినూత్నంగా ప్రారంభించేందుకు ప‌వ‌న్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే క‌వాతు ద్వారా తూర్పుగోదావ‌రిలోకి ప్రవేశించిన ప‌వ‌న్.. తుని యాత్రకు రైల్లో వెళ్లనున్నారు. 

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానంటూ పవన్ ప్రజా పోరాట యాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మెదలు పెట్టిన యాత్రను ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనూ పూర్తి చేశారు. ప‌వ‌న్ అనుకున్నట్లుగానే నాలుగు జిల్లాల్లోయాత్రకు మంచి స్పంద‌న వ‌చ్చింది..

పవన్ నాల్గవ విడ‌త‌గా ప్రజా పోరాట యాత్రను తూర్పుగోదావ‌రి జిల్లా నుండి న‌వంబ‌ర్ 2 నుంచి ప్రారంభించ‌నున్నారు ప‌వ‌న్. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వ‌ద్ద క‌వాతు ద్వారా తూర్పుగోదావ‌రిలోకి ఎంట‌ర్ అయిన ప‌వ‌న్ యాత్ర కాస్త విరామం త‌రువాత తుని నుండి  ప్రారంభం కాబోతుంది. అయితే తుని యాత్రకు వెళ్లేందుకు ప‌వ‌న్ వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తునిలో బ‌హిరంగ స‌భ నిర్వహించ‌నున్న ప‌వ‌న్ విజ‌య‌వాడ నుండి తుని కి రైలు మార్గం ద్వారా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి  జ‌న‌సేనానితో రైలు ప్రయాణం అని పేరు పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట‌కు విజ‌య‌వాడ‌లోజ‌న్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కనున్నారు. ఈ రైలు ప్రయాణంలో వివిధ వ‌ర్గాల ప్రజ‌ల‌తో ప‌వ‌న్ సమావేశ‌మ‌వుతారు...

విజ‌య‌వాడ‌లో బయ‌లుదేరిన తరువాత ట్రైన్ లో రైల్వే పోర్టర్లతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశ‌మ‌వుతారు. అనంత‌రం త‌రువాత మామిడి రైతులు, అంఘ‌టిత రంగంలో ఉన్న చిరు వ్యాపారుల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌వుతారు. త‌రువాత చెర‌కు రైతులు, చేనేత కార్మిక‌లు,  విద్యార్ధులు ల‌తో పాటు ఏటికొప్పాక బొమ్మల త‌యారీ క‌ళాకారుల‌తో రైలు ప్రయాణంలోనే ప‌వ‌న్ స‌మావేశ‌మ‌వుతారు. వీటితో పాటు విజ‌య‌వాడ నుండి తుని వెళ్లేందుకు జ‌న్మ‌భూమి ఎక్స్ ప్రెస్ 8 ప్రధాన స్టేష‌న్లలో ఆగుతుంది. విజ‌య‌వాడ‌లో ఒంటి గంట‌కు  ప్రారంభమయ్యే రైలు.. నూజివీడు, ఏలూరు, తాడేప‌ల్లిగూడెం, రాజ‌మండ్రి, సామ‌ర్లకోట‌, అన్నవ‌రం మీదుగా సాయంత్రం 6గంటలకు తుని చేరుకుంటుంది. మార్గమ‌ద్యలోని రైల్వే స్టేష‌న్ల‌కు వ‌చ్చిన కార్యక‌ర్తలు, అభిమానుల‌ను ప‌వ‌న్ క‌లుస్తారు.

మెత్తానికి తుని వెళ్లేందుకు ప‌వ‌న్ రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. యాత్రకు నాలుగు రోజులు ముందే రైలు మార్గంలో ప్రయాణిస్తాన‌ని చెప్పడంతో అభిమానులు, జనసేన కార్యల‌క‌ర్త ల తాకిడి ఎక్కువ‌గా ఉండే అవకాశముంది.

11:31 - November 1, 2018

హైదరాబాద్ : మహాకూటమి పొత్తుల వ్యవహారం హస్తినకు చేరింది. కూటమిలోని ప్రధాన పార్టీల నేతలంతా ఒక్కొక్కరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ యేతర ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో భాగంగా జాతీయ నేతలను కలిసేందుకు చంద్రబాబు, సీట్ల సర్దుబాటుపై రాహుల్‌ను కలిసేందుకు కోదండరాం ఢిల్లీకి పయనమవుతున్నారు.  ఏఐసీసీ ఎన్నికల కమిటీ తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాపై సమీక్ష చేపట్టనుండడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. వీరంతా ఇవాళ సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో సీపీఐ జాతీయ నాయకులు కూడా పాల్గొనే అవకాశముంది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. 

 

 

11:30 - November 1, 2018

హైదరాబాద్ : బాలీవుడ్, టాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన నటీ, నటులు సినిమాలే కాకుండా ఇతర వాటిపై కూడా ఫోకస్ పెడుతున్నారు. Image result for AMB Cinemas Kondapurవ్యాపారాల్లో ప్రవేశించి కొంతమంది లాభాలు గడిస్తుండగా మరికొందరు నష్టాలపాలవుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా వ్యాపర రంగంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 
Image result for AMB Cinemas Kondapurమహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలో అడుగు పెడుతున్నాడు. ఏషియన్ ఫిలింస్ వారితో కలిసి మహేష్ ఈ బిజినెస్ లో రాబోతున్నాడు. ఏఎంబీ సినిమాస్ పేరిట కొండాపూర్ లో ఓ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ నవంబర్ 8 న ప్రారంభం కానుంది. మహేష్ బాబు ఫ్యామిలీ లాంఛనంగా దీనిని ప్రారంభించనున్నారట. మహేష్, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దీనికి డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారని టాక్. నవంబర్ 8న రిలీజ్ అయ్యే 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'.. 'సర్కార్' సినిమాలను మల్టిప్లెక్స్ లో ప్రదర్శించనున్నారు. 

11:11 - November 1, 2018

ఢిల్లీ : మరోసారి పెట్రోల్ ధరలు తగ్గాయి. వరుసగా 13 రోజుల నుండి చమురు ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మరోసారి తగ్గాయి. అంతర్జతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇంధన ధరలు తగ్గుతున్నాయని పలు కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సిటీ  డీజిల్ లీటర్ పెట్రోల్ లీటర్
హైదరాబాద్‌ రూ.84.14. రూ.80.25 
విజయవాడ రూ.83.29 78.97
బెంగళూరు రూ .79.99 రూ.74.16
ఢిల్లీ రూ.79.39 రూ.73.78
ముంబై రూ.84.86 రూ.77.32
కోల్‌కతా  రూ. 81.25 రూ. 75.63
చెన్నై రూ. 82.65 రూ. 78.00
10:43 - November 1, 2018

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన మహానటి చిత్రాన్ని, ఈ ఏడాది గోవాలో జరగబోయే 49వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్టు, ఇండియన్ పనోరమా బృందం ప్రకటించింది. ఈసారి చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు 22 ఫీచర్ ఫిలింస్‌తో పాటు, 4 మెయిన్ స్ట్రీమ్ సినిమాలను జ్యూరీ ఎంపిక చేసింది. 22 ఫీచర్ ఫిలింస్‌‌లో, ఐదు మలయాళం, ఐదు బెంగాలీ, రెండు హిందీ, ఒక జసారి, ఒక లదాఖి, రెండు  మరాఠీ, నాలుగు తమిళ్, ఒక తుళు చిత్రాలకు చోటు దక్కింది. మెయిన్ స్ట్రీమ్‌లో మహానటి (తెలుగు), టైగర్ జిందా హై ( హిందీ), పద్మావత్ ( హిందీ), రాజీ ( హిందీ), సినిమాలు స్క్రీనింగ్ అవనున్నాయి. ఇవేకాక, 21 నాన్ ఫీచర్ ఫిలింస్ కూడా ఎంపికవగా, మొదటి రోజు మలయాళ చిత్రం ఓఎల్‌యూ ని ప్రదర్శించనున్నారు. 

 

10:40 - November 1, 2018

తిరువనంతపురం: కేరళకు చెందిన ఈ బామ్మగారి పేరు కార్తియనియమ్మ కృష్ణపిల్లా. ఈమె వయస్సు 96 ఏళ్లు. ఈమె సాధించిన ఘనత నేటి యువతరానికే ఆదర్శం. వయస్సు అయిపోయిందీ అనుకొనే వారందరికీ వెన్నుతట్టి ముందుకు నడిపించే పరాశక్తి కార్తియనియమ్మ.

ముదిమి వయస్సులో సాక్షరతా మిషన్ నిర్వహించిన 4వ తరగతి పరీక్షలో దుమ్మురేపింది. ఏకంగా 98 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. కార్తియనియమ్మ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేతులమీదుగా మెరిట్ సర్టిఫికెట్‌ను గురువారం అందుకోబోతోంది. ఈమె అలప్పూళ జిల్లాలోని ముట్టొమ్ గ్రామానికి చెందిన కార్తియనియమ్మ స్కూల్ ముఖం ఎరుగదు.  గుళ్లలో పనిచేసుకుంటూ జీవిస్తోంది. దాదాపు 43,000 వేల మంది ఈ పరీక్షలు రాయగా కార్తీయనియమ్మ క్లాస్ 4లో టాపర్‌గా నిలిచింది. 

 

 

10:35 - November 1, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు చేసే విమర్శలు..ఇతరత్రా వాటిపై జీవీఎల్ తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టీడీపీ వర్సెస్ జీవీఎల్ గా నడుస్తోంది. సేవ్ నేషన్ పేరిట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం హస్తినకు వెళ్లిన తరువాత బీజేపీయేతర పార్టీలతో బాబు భేటీ కానున్నారు. బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని బాబు పిలుపునిస్తున్నారు. 
బాబు ఢిలీ పర్యటనపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు నాయుడు 1978లో ఎంఎల్ఏ,,1980లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు. అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబుకి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా? ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా’? అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా జీవీఎల్ చేసిన విమర్శలపై టీడీపీ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. 

10:27 - November 1, 2018

కరీంనగర్ : టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ రగులుతోంది. సీటు ఆశించిన ఆశావహులు జాబితాలో పేరు రాకపోవడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో కొండా సురేఖ దంపతులు, బాబుమోహన్‌తోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా గులాబీ పార్టీలో మరో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. చొప్పదండి ప్రచారంలో బొడిగ శోభ కీలక వ్యాఖ్యలు చేశారు. చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు. 60 రోజులు ఓపిక పట్టానని తెలిపారు. తన మీద ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే సహించే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. చొప్పదండి నుంచి దళిత బిడ్డకు అవకాశం ఇవ్వాలని.. అది కూడా తనకు (బొడిగ శోభ)కు ఇవ్వాలని సీఎంను కోరారు. 

తనతో లబ్ధి పొందిన నాయకులే తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు టీఆర్ఎస్‌లో పని చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పుడు తాను కారం పొడి పట్టుకుని నిలబడ్డానని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో ఒక్క దళిత మహిళ కూడా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిలుపు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎంపీ కవిత, కేశవరావు, మంత్రి హరీష్‌రావు, మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశానని తెలిపారు. తన పని ప్రకారం సీటు ఇవ్వాలనకుంటే.. చొప్పదండి సీటు తనకే ఇవ్వాలన్నారు. ఒక మాదిగ బిడ్డను అభ్యర్థిగా ప్రకటించడంలో ఇంత జాప్యమా అని వాపోయారు. ఓట్ల దగ్గర దళిత మహిళల అవసరం ఉంటుంది... కానీ ఒక దళిత మహిళ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తారా? ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని ప్రశ్నించారు. 

10:02 - November 1, 2018

ఢిల్లీ : ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు. ఎందుకంటే ప్రస్తుతం భారత ప్రధాన మంత్ర నరేంద్ర మోడీకి ఇంటి పోరు మొదలయ్యింది. ఏకంగా ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ వేరే పార్టీలో చేరుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి..మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లే. కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తుండడంతో ప్రహ్లాద్ వేరే పార్టీలో చేరడం..వ్యతిరేకంగా ప్రచారం చేస్తే బీజేపీపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కాషాయ నేతలు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. 
Image result for PM Narendra Modi's brotherప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రహ్లాద్ మోడీ అనే సోదరుడున్నారు. ఇతను రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడు. ఈయన టీఎంసీలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన టీఎంసీకి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలతో నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ప్రహ్లాద్ పాల్గొని సంచలనం సృష్టించారు. కానీ తాను అన్నయ్య (మోడీ)కి వ్యతిరేకం కాదని..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

09:39 - November 1, 2018

ముంబై : భారతదేశవ్యాప్తంగా ‘మీ టూ’ ప్రకంపనలు ఆగడం లేదు. ప్రముఖ హీరో నానా పటేకర్ పై హీరోయిన్ తను శ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనితో ఇతర హీరోయిన్స్, ఇతర రంగంలో ఉన్న మహిళలు స్వేచ్చగా ఇతరులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.Image result for Rakhi Sawant Sues Tanushree Dutta nanapatekar ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో కలకలం రేగుతోంది. పలువురు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా తను శ్రీ దత్తాపై రాఖీ సావంత్ నష్టపరిహారం కోరారు. కేవలం రూ. 25 పైసల నష్టపరిహారం కోరడం గమనార్హం. 
‘తనుశ్రీ దత్తా డ్రగ్స్‌ బానిస, ఆమె ఒక లెస్బియన్‌’ అంటూ వ్యాఖ్యలు రాఖీ తీవ్ర ఆరోఫణలు గుప్పించిన సంగతి తెలిసిదే. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన తను శ్రీ రూ. 10 కోట్లకు దావా వేశారు. దీనికి ప్రతిగా రాఖీ స్పందించారు. భారీగా నష్టపరిహారం కోరి మరింత కష్టాల్లో పడలేనని, తన పరువు..మర్యాదాలను తను శ్రీ నాశనం చేయాలని చూస్తోందని...ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ఈ దావా వేశానని తెలిపారు. 
Related imageనానా పటేకర్ పై తను శ్రీ దత్తా ఫలు ఆరోపణలు గుప్పించింది. కానీ బాలీవుడ్ నటీమణులు కొందరు తను శ్రీకి మద్దతు తెలపగా రాఖీ మాత్రం తీవ్ర విమర్శలు చేసిన సంగతి  తెలిసిందే. తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందని రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్‌ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వీరి మధ్య వివాదం పరిష్కారమౌతుందా ? లేక మరింత ముదురుతుందా ? అనేది చూడాలి. 

09:20 - November 1, 2018

హైదరాబాద్ : మళ్లీ సామాన్యుడిపై పిడుగు పడింది. ఇప్పటికే చమురు ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇటీవలే కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తుండడంతో కొంత ఊపిరిపీల్చుకున్నాడు. అంతలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
గత జూన్‌ నెల నుంచి వరుసగా సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.60 పెరిగింది. నవంబర్ మాసం నుండే అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. ధరలు పెరగడానికి మళ్లీ అదే కారణం చెబుతోంది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడం, విదేశీ మారకద్రవ్యంలో అస్థిరత పరిస్థితుల కారణంగా ధరలు పెరిగినట్లు వెల్లడిస్తోంది. జూన్ నెలకు ఇప్పటికీ సబ్సిడీ సిలిండర్‌పై మొత్తంగా రూ.14.13 ధర పెరిగినట్లు  అయ్యింది. 

09:14 - November 1, 2018

హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగతంతో వెళ్తున్న కారు అదుపు తప్పి ఆటో, టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. 

 

08:56 - November 1, 2018

ఢిల్లీ : మహాత్మగాంధీ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పవాడా ? అని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ కూడా పటేల్ పుట్టిన గడ్డ మీదే పుట్టారని..ఆయన్నుగుర్తించకపోవడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. పేదలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే.. ప్రధాని మోడీ.. విగ్రహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. దేశం కోసం పోరాడిన గాంధీని పక్కన పెట్టి పటేల్ విగ్రహం పెట్టడమంటే..ఇది చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు. ఒక వైపు పటేల్.. నిజాం నవాబును లొంగదీసుకున్న వీరుడని చెబుతున్నారు...కానీ కమ్యూనిస్టులు సాయుధపోరాటం సాగించడంతో నిజాం నవాబ్ భయపడి.. బతికుంటే బలిసాకు తిని బతకవచ్చనే ఉద్దేశంతో సరెండరైతే.. అప్పుడు పటేల్ సర్దార్ వల్లాభాయ్ పటేల్.. నిజాం నవాబును స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు.   

 

08:44 - November 1, 2018

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతోపాటు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడం లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శరద్‌పవార్, ఫరూక్‌అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తేజస్వియాదవ్‌లతో ఆయన భేటీ కనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు శరద్‌పవార్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలు, దేశ రాజకీయాలపై సీఎం చర్చించనున్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ను కూడా కలవనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఓడించాలని చంద్రబాబు కసర్తత్తు చేస్తున్నారు.

 

08:03 - November 1, 2018

గుంటూరు : రాజకీయాల్లో శాత్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. ఇన్నాళ్లూ బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో ఒకటి అయ్యాయి. తొలిసారి టీజేఎస్‌, సీపీఐతో కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాహుల్‌గాంధీతో ఇవాళ భేటీ కాబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరితో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

అమరావతిలో టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అవుతున్నట్టు తెలిపారు.  ఆయనతో కూడా మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. అందరితో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడవేసేందుకు తాను బాధ్యత తీసుకుంటానన్నారు.   ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదన్నారు.  టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశ దిశ చూపిందని, మరోసారి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందన్నారు.  దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, నమ్మక ద్రోహం  చేశారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రత్యేకహోదా హామీని తుంగలో తొక్కారని ఫైర్‌ అయ్యారు. ఏపీకి కేంద్రం  చేసిన ద్రోహంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తే... వారే బీజేపీతో కలిసి పనిచేస్తోన్న వైసీపీ, జనసేనను వచ్చే ఎన్నికల్లో గంగలో ముంచుతారన్నారు.

దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. బీజేపీ విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన సభ్యత్వాన్ని పునరుద్దరించుకున్నారు.

Don't Miss