Activities calendar

02 November 2018

21:32 - November 2, 2018

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో  బాక్సింగ్ మహిళా దిగ్గజం మేరీకోమ్ బాక్సింగ్ కి తలపడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ భార్య లత  చిన్న పిల్లల కోసం "శ్రీదయ" అనే ఫౌండేషన్ ను స్ధాపించారు. ఫౌండేషన్  ప్రారంభోత్సవానికి విచ్చేసిన మేరీ కోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీ ఇంటికి వెళ్లి కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం రజనీ, మేరీ కోమ్ ఇద్దరు కలిసి బాక్సింగ్ కి తల పడుతున్నట్లు ఫోజులిచ్చారు. ఆఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి. ప్రముఖ తమిళ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన "2 ఓ"  ట్రైలర్‌ను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఈనెల 29న విడుదల కానున్నఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

21:22 - November 2, 2018

 ఢిల్లీ : మీటూ ఉద్యమంలో భాగంగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై  జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై అక్బర్ భార్య మల్లికా అక్బర్  స్పందించారు. పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి ఎంజే అక్బర్ గతంలో తనపై అత్యాచారం చేశారని ఎన్ఆర్ఐ మహిళ పల్లవి గొగొయ్ ఆరోపణలను ఖండించిన అక్బర్, పరస్పర అంగీకారంతో తమ మధ్య సంబంధం కొన్ని నెలలు కొనసాగిందని వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బర్ భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు.  

తన భర్తపై ‘మీటూ’ ఆరోపణలు వస్తున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ, పల్లవి చేసిన ఆరోపణల నేపథ్యంలో తాను పెదవి విప్పక తప్పడం లేదని అన్నారు. కొన్నేళ్ల కిందట పల్లవి తమ కుటుంబంలో చిచ్చుపెట్టిందని చెప్పారు. తన భర్తకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేయడం, పబ్లిక్ గా వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వాళ్లిద్దరి మధ్య సంబంధం తనకు తెలిసిందని అన్నారు. 
తమ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో తన భర్త, ఆమె కలిసి డ్యాన్స్ చేయడం తనను బాధించిందని, ఈ విషయమై నాడు తన భర్తను నిలదీసాననీ దీనికి ఆయన ఇకపై కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానని తన భర్త మాట ఇచ్చిన విషయాన్ని పల్లవి గొగొయ్, తుషితా పటేల్ ఇద్దరూ తమ నివాసానికి తరచుగా వస్తుండేవారని మల్లికా అక్బర్ చెప్పుకొచ్చారు.
 

20:43 - November 2, 2018

తూర్పుగోదావరి : మీకు ఏదైనా చేయమంటారా? అని సీఎం చంద్రబాబు తనను చాలా సార్లు అడిగారని.. రాష్ట్రానికి మంచి పాలన, యువతకు ఉద్యోగాలు కల్పించాలని తాను కోరినట్లు పవన్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజారంజక పరిపాలన ఇవ్వండి తనకేమీ అవసరం లేదని తెలిపారనని కానీ అంత రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు తాను అడిగింది తప్ప అన్నీ చేశారని పవన్ ఎద్దేవా చేశారు. ఈ రోజు విజయవాడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకున్న ఆయన తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇసుక మాఫియా నుండి అన్ని ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలకే ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తన ఆశయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తుని ఘటన రాష్ట్ర చరిత్రలో బాధ కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. విధ్వంసాలు జరగకుండా ఆపేందుకే వచ్చామని, నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తామని చెప్పారు. స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసమే తెదేపాతో కలిసి పనిచేశామన్నారు. తునిలో ఒక్క పారిశ్రామికవాడ కూడా లేదని, ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారన్నారని రైలు ప్రయాణంలో తనకు యువత చెప్పుకుని ఆవేదన చెందారని పవన్ తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఆ మార్పు జనసేనతోనే వస్తుందని పవన్ పేర్కొన్నారు.

20:30 - November 2, 2018

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవి కాంగ్రెస్ లో చేరినందుకు తనతో విభేదించి స్వంత పార్టీని స్థాపించానని..ఇది కేవలం రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే తప్ప కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విభేదించానని స్పష్టం చేశారు. భాజపాను వెనకేసుకొస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. సొంత అన్నయ్యనే కాదని బయటకు వచ్చిన తనకు ప్రధాని మోదీ ఎంత? అని వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు భయపడతానా? అని అన్నారు. తనకు రూ.వేల కోట్ల ఆస్తులు, కాంట్రాక్టులు, దోపిడీచేసే చరిత్ర లేవన్నారు. అందువల్ల ఎవరైనా తనను ఎందుకు బెదిరిస్తారని పవన్ ప్రశ్నించారు. అమిత్ షాకు తాను భయపడాల్సిన పనిలేదనీ..తానేమన్నా వేలకోట్ల ప్రజల ధనాన్ని తాను దోచుకోలేదని అటువంటి సమయంలో తానెందుకు కేంద్ర ప్రభుత్వానికి భయపడతానని ప్రశ్నించారు. 
 

19:53 - November 2, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు యాత్ర తుని వరకూ కొనసాగింది. ఈ సందర్బంగా పవన్ తునిలో బహిరంగ సభలో మాట్లాడుతు కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించటం వల్లనే తాను కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకమని..అన్యాయానాకి గురైన ఏపీకి న్యాయం జరగాలనే ఉద్ధేశ్యంతో తాను 2014 ఎన్నికల్లో పోటీ చేసయకుండా అనుభవజ్నుడైన చంద్రబాబుకు మద్ధతు ఇచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటువంటి ఈరోజు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా తన ప్రయోజనాకల కోసం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తెలుగు ప్రజలకు తీరని అన్యాయమేనని..పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీలను అవమానించిన సంగతి మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ అవమానానికి మీరు పౌరుషం లేదా? అవన్నీ మరిచిపోయి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకుందామని అడగటానికి సిగ్గులేదా? అని తీవ్రమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. 2014లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని నినదించిన చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు తాను తన అన్న చిరంజీవితోను..తన కుటుంబ సభ్యులతోను విభేదించి స్వంత పార్టీని పెట్టానని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు ప్రజల కోసమే తన అన్నతో విభేధించాను తప్ప తన రక్త సంభంధమైన తన అన్న చిరంజీవి అంటే తనకు ప్రాణప్రమదమని పవన్ తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని పవన్ కళ్యాన్ విమర్శించారు. 

19:46 - November 2, 2018

 తుని: ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకోవటం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌-తుని మ‌ధ్య చేసిన రైలు ప్ర‌యాణంలో ఆయన మాట్లాడుతూ.....ముఖ్య‌మంత్రికి అధికార దాహం మిన‌హా, ప్ర‌జాసంక్షేమం ప‌ట్ట‌దని....తెలుగుదేశం పార్టీ కేవ‌లం ఓట్ల రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి జ‌రిగే అన్యాయం వారికి ప‌ట్ట‌దు. వారికి అధికారం చేతిలో ఉంటే చాలు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి అంటున్నారు, కానీ కేవలం లక్షల కోట్ల అప్పులు మాత్రం మిగులుతున్నాయని" ఆరోపించారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని, బ‌ల‌మైన సంస్థాగ‌త మార్పు తీసుకురావ‌డానికి జ‌న‌సేన పార్టీ కృషి చేస్తుందని, రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం తీసుకురావాల్సిన అవ‌స‌రం  ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలుతీసుకోవటానికి  తాను వ్యతిరేకమని, ప్రజలతో ఉండి వారి కష్టాలు, వారి బాధలు తెలుసుకుంటూ ప్రజలకోసం పనిచేయటం తనకిష్టమని అందుకే సామాన్యుడిలాగా రైలు ప్రయాణం చేసి అందరికష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. "టీడీపీ అంతిమ ల‌క్ష్యం అధికారం అయితే, జ‌న‌సేన పార్టీ అంతిమ ల‌క్ష్యం మార్పు కోసం" అని ఆయన తెలిపారు. గ‌డ‌చిన నెలరోజుల్లో "జ‌న‌బాట కార్య‌క్ర‌మం ద్వారా 23 ల‌క్ష‌ల ఓట్లు ఎన్‌రోల్ చెయ్య‌గ‌లిగాం, ఎక్క‌డో ఒక చోట మార్పు రావాల‌న్న ల‌క్ష్యంతోనే ప్రజల్లోకి వచ్చాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.రాష్ట్రానికి జాతీయ పార్టీలు అన్యాయం చేశాయని 2019 ఎన్నిక‌ల్లో   ప్రజలు ఆకోపాన్ని చూపించ‌బోతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

18:58 - November 2, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతు..తొలుత తన అనుచరులను మట్టుబెట్టి ఆ తర్వాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మహాకూటమికి టీఆర్ఎస్ భయపడుతోందా? తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కూటమి విజయం సాధిస్తుందనే అభద్రతా భావంతో కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ హత్యాయత్నం చేస్తోందా? ఇదంతా రాజకీయ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కోమటిరెడ్డి రాజకీయ లబ్డి కోసం టీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారా? లేదా టీఆర్ఎస్ కోమటిరెడ్డి హత్యకు ప్లాన్ చేస్తోందా?  మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టీఎస్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

18:46 - November 2, 2018

ఢిల్లీ: అమెరికాకు చెందిన పల్లవిగొగోయ్ అనే జర్నలిస్టు తనను రేప్ చేశానని చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజేఅక్బర్ ఖండించారు. పల్లవి ఆరోపణలను అక్బర్ భార్య మల్లికాఅక్బర్ కూడా ఖండించారు. ఎంజే అక్బర్ జర్నలిస్టుగా పని చేసిన రోజుల్లో లైంగిక వేధింపులకు గురిచేశారని 12 మంది మహిళలు ఆరోపించినా స్పందించని అక్బర్ భార్య మల్లికా అక్బర్, పల్లవి అబద్దాలాడుతోందని ఆమె ఆరోపణలను ఖండించారు.  
పల్లవిగొగొయ్ ఆరోపణలపై  కేంద్ర  మాజీ మంత్రి   అక్బర్  మాట్లాడుతూ..."1994లో పరస్పర అంగీకారంతో మాఇద్దరి మధ్య బంధం ఉన్నమాట వాస్తవమేనని, ఈవిషయం అందరికీ తెలుసని, ఆ బంధం వల్ల మాకుటుంబంలో గొడవలు వచ్చాయని, కొన్నాళ్ళకి ఆబంధం ముగిసిందని, కాకపోతే మామధ్య ఉన్న బంధానికి మంచి ముగింపు ఇవ్వలేకపోయాం" అని చెప్పుకొచ్చారు. 
అక్బర్ భార్య మల్లికా అక్బర్ పల్లవి ఆరోపణలపై స్పందిస్తూ " ఇన్నాళ్లూ  నా భర్తపై వస్తున్న  "మీటూ" ఆరోపణలపై మౌనంగా ఉన్నాను. కానీ పల్లవి ఈరోజు చేసిన ఆరోపణలు అబ్దదాలు అని కొట్టిపారేస్తూ.."1994లో మావారికి పల్లవికి ఉన్న బంధం గురించి తెలిసింది. కొన్నిసార్లు ఆమె నాఎదుటే నాభర్తపై ప్రేమ కురిపించేది. అది మాఇంట్లో కలతలకు దారితీసింది. ఈ విషయమై  ఆయన్ను అడగ్గా, మావారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు" అని చెప్పారు. 

18:03 - November 2, 2018

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా, జీరో.. కలర్ ఎల్లో ప్రొడక్షన్ సమర్పణలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. నిన్న షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా జీరో మూవీలో కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలతో ఉన్న న్యూ పోస్టర్స్ రిలీజ్ చేసాడు. ఈరోజు బాద్ షా బర్త్‌డే సందర్భంగా, జీరో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.    ఈమూవీలో  షారుఖ్, బువా సింగ్ అనే మరుగుజ్జు క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో మరోసారి తన నటనతో ఫ్యాన్స్‌ని ఫిదా చేసాడు షారుఖ్. షారుఖ్‌లానే  అనుష్క శర్మ కూడా, సరిగా మాట్లాడడం రాని, వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యే చాలెంజింగ్ పాత్రలో కనిపించనుండగా, కత్రినా, హీరోయిన్ పాత్ర చేస్తుంది. షారుఖ్, కత్రినాల మధ్య రిలేషన్ తర్వాత బ్రేకప్, అనుష్క శర్మతో ప్రేమ వంటివి ట్రైలర్‌లో చూపించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్ లాంటి అంశాలతో రూపొందించిన జీరో మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ ట్రైలర్‌తో, అభిమానులకు బర్త్‌డే ట్రీట్ ఇచ్చాడు కింగ్ ఖాన్.   
 క్రిస్మస్ కానుకగా, డిసెంబర్ 21న జీరో మూవీ రిలీజవబోతుంది.    

 

వాచ్ ట్రైలర్...   

17:30 - November 2, 2018

ఢిల్లీ : బీజేపీ అవలంభిస్తున్న విధానాలతో దేశం సంక్షోభంలోకి నెట్టబడుతోందనీ..దేశ వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయనీ..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రమాదకర పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం వల్ల జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు టీడీపీ  అధినేత చంద్రబాబు ముందడుగేసారు. భాజపా వ్యతిరేక పక్షాలతో కూటమి ఏర్పాటు చేయడంలో భాగంగా గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పలువురు నేతలను కలిశారు. ఈ నేపథ్యంలో గతంలో ఏర్పాటయిన ఫ్రంట్‌ల గురించి పలు పార్టీల నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావించటం..తెలుసుకోవడమూ ఆసక్తికరం,గమనించాల్సిన విషయం. 1988లో ఏర్పాటయిన నేషనల్‌ ఫ్రంట్‌, 1996లో ఏర్పాటయిన యునైటెడ్‌ ఫ్రంట్‌లోనూ తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. అంతే కాదు... ఆ కూటములు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి కూడా. మరి ఆ  కూటమిల గురించి తెలుసుకుందాం..

Image result for Ntr and v.p singh national frontదేశంలో మొదటి ఫ్రంట్ ప్రభుత్వం..
ఆగస్టు 6, 1988 : ఏడు ప్రధాన రాజకీయ పక్షాలతో 1989/91న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది.

 1. కాంగ్రెస్ (ఎస్)
 2. అసోం గణ పరిషద్ 
 3. జనమోర్చా
 4. జనతా
 5. లోక్ దళ్
 6. తెలుగు దేశం
 7. డీఎంకే

రాజకీయ పక్షాలతో్ కూడిన ఏడు ప్రధాన పక్షాల భాగస్వామ్యంతో  నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా మాజీ దివంగత నేత తెలుగు ప్రజల హృదయాధినేత అయిన  ఎన్టీరామారావు నేషనల్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా..మాజీ ప్రధాని వీపీసింగ్‌ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం దేశవ్యాప్తంగా నవంబరు 22, 24, 26  తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోవటంతో ప్రభుత్వం ఏర్పాటుకు వీపీసింగ్‌ ముందుకురావటం..డిసెంబరు2న  ప్రధానిగా వీపీ సింగ్‌, ఉప ప్రధానిగా దేవీలాల్‌తో కూడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ రామజన్మభూమి  వివాదంలో అయోధ్యకు  రథయాత్ర చేస్తున్న భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీని మార్గమధ్యంలో అరెస్టు చేయటంతో ఆ పార్టీ వీపీ సింగ్‌ నకు  మద్దతు  ఉపసంహరించింది. వీపీ సింగ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన 2-12-1989 నుండి 10-11-1990 వరకూ మాత్రమే ప్రధానిగా కొనసాగారు. అనంతరం కాంగ్రెస్‌ మద్దతుతో  చంద్రశేఖర్‌ ప్రధాని  బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన కూడా కేవలం ఏడునెలల పాటు పదవిలో కొనసాగారు. చంద్రశేఖర్‌ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. 

దేశంలో రెండవ ఫ్రంట్ ఫ్రభుత్వం..
1991/98 : 13 భాగ్యస్వామ్య పక్షాలతో రెండ ఫ్రంట్ దేశంలో ఏర్పాటయ్యింది. 

 1. నాలుగు వామపక్ష పార్టీలు
 2. తమిళ్ మానికల కాంగ్రెస్
 3. నేషనల్ కాంగ్రెస్
 4. మహారాష్ట్ర వాది
 5. గోమంతక్ పార్టీ
 6. సమాజ్ వాద్ పార్టీ
 7. జనతాదళ్ పార్టీ
 8. అసోం గణ పరిషద్
 9. తెలుగుదేశం
 10. డీఎంకే
 11. అల్ ఇండియా
 12. ఇందిరా కాంగ్రెస్ (తివారీ)
 13. ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా

పైన పేర్కొన్న పార్టీలతో రెండవ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. 
1996 ఎన్నికల్లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటమిపాలయి 161 మంది ఎంపీలతో అతి పెద్దపార్టీగా భాజపా అవతరించింది. వాజ్‌పేయీ  నాయకత్వంలో పార్టీ అధికారాన్ని చేపట్టినా 16-5-1996 నుండి 1-6-1996 వరకూ  కేవలం  13 రోజుల పాటు మాత్రమే కొనసాగింది. అనంతరం ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు కలసి వీపీసింగ్‌ను అధికారం చేపట్టమని కోరినా, ఆయన  తిరస్కరించారు. అనంతరం  రాజకీయ కురువృద్ధుడు పశ్చిమబంగ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు ఎక్కువ మంది మద్దతు లభించింది. తాము సంకీర్ణ పాలనలో భాగస్వాములం కామంటూ, సీపీఎం ఈ ప్రతిపాదనను  తిరస్కరించింది. అదే సమయంలో ప్రస్తుత ఏపీ సీఎంగా వున్న నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని పదవి చేపట్టటానికి అవకాశం వచ్చింది కానీ ఎందుకో ఆసక్తి చూపలేదు. చివరికి  కేవలం 46 మంది ఎంపీలున్న దేవెగౌడకు ప్రధానిగా పట్టం కట్టారు.
ప్రధానిగా దేవెగౌడ : 
అనతరం దేవెగౌడ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేదు..1-6-1996 నుండి 20-4-1996 వరకూ మాత్రమే పదవిలో వున్నారు. భాగస్వామ్య పక్షాలన్నీ తర్జనభర్జన పడి చివరికి ఐ.కె.గుజ్రాల్‌కి అవకాశం ఇచ్చాయి. అంతగా ప్రజాదరణ లేని గుజ్రాల్‌ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేతలు భావించారు. పార్టీల మధ్య అంతర్గత పోరు, కాంగ్రెస్‌తో పొసగనితనం వల్ల పూర్తికాలం ఈ ప్రభుత్వం కొనసాగలేదు. ఆయన కూడా 21-4-1997 నుండి 19-3-1998 వరకూ పదవిలో వున్నారు. రాజీవ్‌గాంధీ హత్యకేసు విచారణకు ఏర్పాటయిన జైన్‌ కమిషన్‌.. ఆయన హత్యలో ఫ్రంట్‌ భాగస్వామ్యపక్షమైన డీఎంకే పాత్రను బయటపెట్టింది. దీంతో  సంకీర్ణం నుంచి డీఎంకేను తొలగించవలసిందిగా కాంగ్రెస్‌ పట్టుబట్టింది. తదనంతర పరిణామాలతో గుజ్రాల్‌ పదవి కోల్పోయారు. 1998లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. కొన్ని  ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల భాగస్వామ్యంతో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటయ్యింది. కాంగ్రెస్‌ బయట నుంచి ఈ కూటమికి  మద్దతు ఇచ్చింది. భాజపాను అధికారం నుంచి దూరం చేయాలన్న ఏకైక  లక్ష్యంగా ఇది పనిచేసింది.

Image result for rahul gandhi chandrababu naidu2018 మూడవ ఫ్రంట్ కు యత్నాలు..
2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రధానిగా కొనసాగున్న క్రమంలో సంచలనాత్మ నిర్ణయాలు జరిగాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, సీబీఐలో కొనసాగుతున్న అవినీతి రాజకీయాలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వంటి పలు విషయాలు..యూపీఏ ప్రభుత్వం అధికాంలో వున్న సమయంలో తెలుగు రాష్ట్రాల విభజనకు బీజేపీ మద్దతిచ్చింది. 

Related imageతెలుగు రాష్ట్రాల విభజన వంటి పెను మార్పులకు బీజేపీ కారణంగా నిలుస్తున్న క్రమంలో దేశంలో అనేక పరిణామాలు సంభవిస్తున్న క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో మూడవ మహా కూటమికి అడుగులు పడుతున్నాయి. మరి ఈ కూటమిలో భాగస్వాములుగా ఎన్ని పార్టీలు చేరతాయో?రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో మహాకూటమికి పునాదులు వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలిస్తాయా? ఫలించి ముందు జరిగిన కూటముల ప్రభుత్వాల వలె కాకుండా పూర్తిస్థాయిలో మహా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందో లేదో వేచి చూడాలి.
-మైలవరపు నాగమణి

17:03 - November 2, 2018

ఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణం కేసులో 2005 మే31న ఢిల్లీ  హైకోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారించాలని సీబీఐ దాఖలు చేసిన కేసును సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులకు బోఫోర్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పీల్ అనేది నిర్ణీత స‌మ‌యం ప్ర‌కారం జ‌ర‌గాల‌ని, ఆకార‌ణం చేత ఈకేసులో సీబీఐ అప్పీల్‌ను స్వీక‌రించ‌లేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. దాదాపు దశాబ్దకాలం తర్వాత బోఫోర్స్‌‌పై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా పిటిషన్ వేయాలంటూ స్వయంగా అటార్నీజనరల్ వేణుగోపాల్ సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయంటూ సీబీఐ ఈఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. బోఫోర్స్ కాంట్రాక్టు కోసం స్వీడ‌న్‌కు చెందిన కంపెనీ, హిందూజా సోద‌రుల‌కు మధ్య 8.3 మిలియ‌న్ల డాల‌ర్లు చేతులు మారినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

16:59 - November 2, 2018

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడిపై జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన శుక్రవారం ‘సేనానీతో రైలు ప్రయాణం’ చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడలో జన్మభూమి రైలు ఎక్కిన పవన్ తుని వరకు ప్రయాణం కొనసాగించనున్నారు. ఆయనతో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఇతర పార్టీల కీలక నేతలున్నారు. నూజివీడులో మామిడి రైతులతో పవన్ చర్చించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌కు విన్నవించారు. సమస్యలను తెలియచేస్తున్న వారికి పవన్ మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన తన అభిప్రాయాలను తెలియచేశారు. జగన్‌పై దాడిపై విలేకరి ప్రశ్నించగా ప్రతిపక్ష నేతపై దాడి జరగడం విచారకరమని

16:20 - November 2, 2018

తమిళనాడు : రాజకీయాలలో శాశ్వత శతృవులు..శాశ్వత మిత్రులు వుండరనేది జగమెరిగిన సత్యం. ఆ మాట అక్షరాలా నిజమైంది. కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ఒక్కటయ్యాయి. రానున్న రోజుల్లో దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు మీడియా ముఖ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇరుపార్టీల భేటీని కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే మరికొందరు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ స్పందించారు.

Image result for chandrababu rahul gandhiకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల కలయికను తాము స్వాగతిస్తున్నామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలు ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, కీలక వ్యవస్థలు నాశనమవుతున్నాయని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం భ్రష్టుపడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు అత్యవసరమని అన్నారు. 

15:57 - November 2, 2018

తూర్పుగోదావరి : ఏ విషయానైనా కుంబ బద్దలు కొట్టినట్లుగా మాట్లడే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో చేసిన దాడిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా... వాటన్నింటినీ వదిలేసి, ఈ దాడిపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ సభలకు జనాలు బాగా వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తనపై తానే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని ఉండవల్లి అన్నారు. జగన్ కు ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియనంత అమాయికుడు కాదు చంద్రబాబు అని అటువంటి పరిస్థితులు వస్తే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చంద్రబాబుకు  తెలుసని, కాబట్టి జగన్ ను హత్య చేయించే పని ఆయన చేయరని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు ఎందుకు ఆనందపడతారనీ? ప్రశ్నించారు.నిందితుడికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేయిస్తే, వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతాన్ని ఆపివేసి రాష్ట్రంలో వున్న సమస్యలపై నేతలు దృష్టి పెట్టాలని ఉండవల్లి సూచించారు. 
 

15:52 - November 2, 2018

విజయవాడ : జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన సేనానీతో రైలు ప్రయాణం కొనసాగుతోంది. శుక్రవారం విజయవాడలో జన్మభూమి రైలు ఎక్కిన పవన్ తుని వరకు ప్రయాణం కొనసాగించనున్నారు. ఆయనతో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఇతర పార్టీల కీలక నేతలున్నారు. నూజివీడులో మామిడి రైతులతో పవన్ చర్చించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌కు విన్నవించారు. సమస్యలను తెలియచేస్తున్న వారికి పవన్ మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మార్గ మధ్యలో పవన్ వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను పవన్ అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం తునికి చేరుకున్న తరువాత ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ ప్రసంగించనున్నారు. 
LiVE Vidio

15:44 - November 2, 2018

ఢిల్లీ : తన దగ్గర పనిచేసే మహిళా జర్నలిస్టులను  లైంగికంగా వేధించారనే ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం పదవి కోల్పోయిన  కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ను "మీటూ"  సెగ వదిలేట్టు లేదు. ప్రియారమణి అనే మహిళా  జర్నలిస్టు మొదటిసారి  అక్బర్ తనపై చేసిన లైంగిక దాడిని ట్విట్టర్లో  ధైర్యంగా బయటపెట్టటంతో ఇంకో 11 మంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్ చేసిన అరాచకాలను బయటపెట్టారు. ఇప్పుడు వాషింగ్టన్ లోని నేషనల్ పబ్లిక్ రేడియోలో  చీఫ్  బిజినెస్ ఎడిటర్ గా పనిచేసే  పల్లవి గొగోయ్  అక్బర్ తనను రేప్ చేశాడని తన బ్లాగ్ లో వివరించారు. తన 23 ఏళ్ల వయసుల్లో1994లో అక్బర్ తనపై అత్యాచార యత్నం చేసినట్లు  పల్లవి తెలిపారు.  ఏషియన్ ఏజ్ పత్రికలో పని చేస్తున్నసమయంలో " ఒక వార్త విషయమై ఆయన  వద్దకు వెళ్లినప్పడు తన పనితనాన్ని మెచ్చుకుని ఒక్కసారిగా ముద్దుపెట్టుకోబోయారు. ఆ చర్యతో షాక్ కి గురైన వెంటనే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేశాను".  ఆనాటి ఘటన ఇంకా నాకు గుర్తుంది అని పల్లవి  తన బ్లాగులో  రాశారు. ఇంతకు మునుపు ఆరోపణలు చేసిన వారు తమను లైంగికంగా వేధించారనే ఆరోపించారు, కానీ పల్లవి గొగోయ్ అత్యాచారం చేసారని ఆరోపించారు. 
మరోసారి జైపూర్ లోని హోటల్ రూంలో జరిగింది. ఒక ఎసైన్మెంట్  పూర్తి చేసుకుని రూమ్ ఖాళీ చేసి వెళుతున్న సమయంలో అక్బర్ పల్లవిని తన రూమ్ లోకి పిలిచారు. ఆమెకు అప్పచెప్పిన  కధనం విషయమై మాట్లాడటానికి.  రూమ్ లోకి వెళ్ళిన పల్లవిని అక్బర్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. ఆయన ముందు పల్లవి ఓడిపోయింది. ఆతర్వాత కూడా అక్బర్ పల్లవిని వేధించడం ఆపలేదు. అయితే.... ఆయన గొప్పగా రాస్తారని, ఆయనలా రాయటానికి తాను ప్రయత్నించేదానినని, పల్లవి తన బ్లాగులో రాసింది. పల్లవి బ్లాగులో రాసిన విషయాలను వాషింగ్టన్ పత్రిక ప్రచురించింది.  కాగా పల్లవి ఆరోపణలను అక్బర్ న్యాయవాది అవన్నీ అసంబద్ద ఆరోపణలని కొట్టిపారేశారు. కాగా తనపై లైంగిక ఆరోపణలు చేసిన  ప్రియా రమణిపై అక్బర్  పరువునష్టం దావావేశారు.

15:41 - November 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇదంతా సాధారనమే అయినా తెలంగాణలో తన పట్టు సాధించుకోవటానికి కమల దళం అసంతృప్తి నేతలతో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో విబేధాలు బైటపడటంతో వారిని బుజ్జగించేందుకు పెద్దస్థాయి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయినా ఊరట చెందని అసంతృప్తి నేతలు తమ నిరసనను పార్టీ కార్యాలయాలపై వ్యక్తంచేస్తున్నారు. 

Image result for serilingampally bjp yoganand28 మందితో భాజపా ఈరోజు రెండో విడత జాబితా విడుదల చేసింది. దీనిలో భాగంగా శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు రాష్ట్ర అధిష్టానం జాబితా మేరకు కేంద్ర అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.
 

15:14 - November 2, 2018

ఢిల్లీ : స్మార్ట్ ఫోన్ మరింత స్మార్ట్ అయిపోయింది. అవసరం వున్నా లేకున్నా ప్రతి ఒక్కరి చేతిలోను స్టార్మ్ ఫోన్ కామన్ గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్స్ లో ఏ కంపెనీలో ఏ కొత్త ఫీచర్ వచ్చినా ఆదరించటం స్మార్ట్ కస్టమర్స్ అలవాటు. స్మార్ట్ గా వుండాలి, వర్క్  తో పాటు కాస్ట్ కూడా అందుబాటులో వుండాలి. ఇవి వుంటే చాలు స్మార్ట్ ఫోన్స్ అంతకంటే స్మార్ట్ గా కొనుగోలు అయిపోతుంటాయి. అందులోను చైనా ఫోన్స్ కాస్ట్ తక్కువ వాడకం కూడా బాగానే వుంటాయి. స్మార్ట్ కస్టమర్స్ యొక్క నాడి తెలుసుకున్న చైనా అద్భుతమైన ఫీచర్స్ తో మరో ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే  'జ‌డ్‌5 ప్రో'. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్ అభిమానులు ఆకట్టుకేనే ఫీచర్స్ తో మార్కెట్ లోకి వచ్చేసింది. 
చైనా మొబైల్ దిగ్గజం లెనోవో తన నూతన స్మార్ట్ ఫోన్ 'జ‌డ్‌5 ప్రో'ను తాజాగా ఆ దేశ మార్కెట్లో విడుదల చేసింది. స్లైడింగ్ డిజైన్, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. రెండు వేరియంట్లలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ను ఈ నెల 11 నుండి మార్కెట్లో విక్రయించనున్నారు. భారత్ లో విడుదల తేదిపై స్పష్టత లేనప్పటికీ త్వరలోనే మన దేశ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.రూ.21400 ఉండ‌గా, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24300గా ఉంది.

 • వెనక భాగంలో రెండు 16/24 మెగాపిక్స‌ల్ కెమెరాలు
 • ముందు భాగంలో 16/8 మెగాపిక్స‌ల్ సేల్ఫీ కెమెరాలు
 • 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
 • 6.39" ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే (1080 × 2340 రిజ‌ల్యూష‌న్‌)
 • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
 • ఫేస్ అన్‌లాక్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
 • 3350ఎంఏహెచ్ బ్యాట‌రీ
 • మరిక స్మార్ట్ అభిమానుల మనసును ఈ ఫోన్ స్మార్ట్ గా దోచుకోవటం ఈజీ..ఇక లేటెందుకు ఓ 'జ‌డ్‌5 ప్రో'ను తెచ్చేయండి..మీరు మరింత స్మార్ట్ గా అయిపోండి..

 

15:03 - November 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ రెండో జాబితా విడుదల చేసిన అనంతరం ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించిన వారికి బీజేపీ అధిష్టానం మొండిచెయ్యి చూపడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కాకుండా వేరే వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వివిధ జిల్లాలో పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు..నిరసనలు చేపడుతుండడంతో పార్టీ పెద్దలు అంతర్మథనం చెందుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా అర్బన్ స్థానం నుండి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యె యెండల లక్ష్మీనారాయణ, నారాయణ గుప్తాలు ఆశించారు. కానీ యెండల వైపు పార్టీ మొగ్గు చూపడంతో నారాయణ గుప్తా తీవ్ర అసంత‌ృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న గుప్తా అనుచరులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మరోవైపు శేరిలింగంపల్లి టికెట్ కోసం నరేశ్ ప్రయత్నించారు. కానీ ఇతరులకు టికెట్ కేటాయించడంతో నరేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టికెట్లు అమ్ముకున్నారంటూ కార్యకర్తలు నినదిస్తు్న్నారు. పార్టీ అసంత‌‌ృప్తులను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.

15:01 - November 2, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన సవ్యసాచి.. దీపావళి కానుకగా, ఈరోజుప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. శైలజారెడ్డి అల్లలుడు తర్వాత చైతు చేస్తున్న సినిమా కావడం, ప్రేమమ్ తర్వాత చైతు, చందూమొండేటిల కాంబినేషన్ అవడంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సవ్యసాచి ఆ అంచనాలను అందుకుందో, లేదో చూద్దాం.

కథ : 

విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు) అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి కారణంగా, ఆనందం వచ్చినా, ఆందోళనగా ఉన్నా, అతని ఎడమ చేయి అతని కంట్రోల్‌లో ఉండదు. చిత్ర (నిధి అగర్వాల్)‌ని ప్రేమిస్తాడు. ఒక రీజన్‌తో ఆరేళ్ళ పాటు ఆమెకి దూరమవుతాడు. యాడ్‌‌ఫిలిం మేకర్ అయిన విక్రమ్, షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళి వచ్చేటప్పటికి, ఒక ప్రమాదంలో అతని బావ, మేనకోడలు చనిపోతారు. మొదట యాక్సిడెంటల్‌గా భావించిన విక్రమ్‌కి, తన మేనకోడలు బ్రతికే ఉందని, తన బావ చావుకి ఒక వ్యక్తి  కారణం అని తెలుస్తుంది. అతనెవరు, అతని దగ్గరి నుండి, పాపని ఎలా సేవ్ చేసాడు అనేది కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

సినిమా సినిమాకి నటుడిగా ఇంప్రూవ్ అవుతున్నాడు నాగ చైతన్య. ఎడమ చేయి తన మాట విననప్పుడు చైతు నటన ఆకట్టుకుంటుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నిటినీ తన స్టైల్‌లో చేసాడు. లగ్గాయిత్తు సాంగ్‌లో చైతు వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తాయి. ఫైట్స్‌లోనూ చైతు బాగా చేసాడు. విభిన్న తరహా చిత్రాలు చేసే నటుడు మాధవన్, సవ్యసాచితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదికూడా విలన్ పాత్ర కావడం విశేషం. సినిమా అంతా, చైతు, మాధవన్‌ల చుట్టూ తిరుగుతుంది. తనదైన శైలి నటనతో, తనకంటే ఇంకెవరూ ఈ పాత్ర చెయ్యలేరు అన్నంతగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడు. నిధి అగర్వాల్‌కిది తెలుగులో బెస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. యాక్టింగ్, డాన్స్, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటుంది.
దేవయాని, భూమిక ఉన్నంతలో బాగా చేసారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, విద్యుల్లేఖ ఉన్నంతలో కామెడీ చేసారు. ఎమ్.ఎమ్.కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం బాగానే ఉంది. యువరాజ్ కెమెరా సినిమాకి అందాన్నద్దింది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చందూమొండేటి ఎంచుకున్న వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే అంశం కొత్తదే కావచ్చుగానీ, వివరంగా చెప్పడంలో తడబడ్డాడు. ఎడమ చేయి కంట్రోల్‌లో ఉండదు అని, సినిమా స్టార్టింగ్‌లో చెప్పి, ఇంటర్వెల్ ముందు వరకు, అసలు కథ‌లోకి తీసుకెళ్ళలేదు.  సెకండ్‌హాఫ్‌లో సినిమా సీరియస్‌గా సాగుతున్న టైమ్‌లో కామెడీ చేయించడం, డ్యాన్సులు వేయించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా స్పీడ్ అందుకుంటుంది. హీరో, విలన్‌ల మధ్య జరిగే మైండ్ గేమ్‌ని ఆసక్తి కరంగా మలిచిన విధానం బాగుంది కానీ, చివరకు సినిమా రివేంజ్ డ్రామాగా తయారయింది. నాగచైతన్య, మాధవన్‌ల నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
 మైండ్‌గేమ్‌‌తో కూడిన రివేంజ్ డ్రామా... సవ్యసాచి

  తారాగణం : నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమికాచావ్లా, దేవయాని,  వెన్నెల కిషోర్, సుదర్శన్, విద్యుల్లేఖ రామన్ 

  కెమెరా    :  యువరాజ్

 సంగీతం   :  ఎమ్.ఎమ్.కీరవాణి 

ఎడిటింగ్‌  :  కోటగిరి వెంకటేశ్వర రావు 

నిర్మాణం   : మైత్రీ మూవీ మేకర్స్ 

కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం :  చందూమొండేటి

రేటింగ్  :  2.5/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

14:28 - November 2, 2018

ఢిల్లీ : మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. దీనిపై త్వరగా విచారించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఫిబ్రవరిలో విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దీనితో మరలా ఒకసారి ఓటుకు నోటు కేసు వార్తల్లోకెక్కింది. 
ఓటుకు నోటు కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వ్యవహారంలో ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులు బయటికి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. 
కేసును త్వరగా విచారించాలంటూ ఆళ్ల సుప్రీంను ఆశ్రయించారు. ఆయన రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. 2017 నుండి ఆయన పోరాటం చేస్తున్నారు. 
దీనిపై ఆళ్ల స్పందించారు. మార్చి 6వ తేదీన బాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసిందని, సాక్ష్యాధారాలతో సహా ముందుకు వచ్చారని..దీనిపై సమాధానం చెప్పాలని గతంలో బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కానీ కోర్టు ఎదుట హాజరు కాలేదని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అని, గతంలో దాఖలు చేసిన పిటిషన్ లు ఇంతవరకు విచారణకు రాకపోవడమే కారణమన్నారు. కానీ చివరకు శుక్రవారం సుప్రీంలో బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారని తెలిపారు. రెండు సంవత్సరాలవుతున్నా బాబు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. 
ఓటుకు నోటు కేసులో రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. తొలి ఛార్జిషీట్ లో ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక,, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అందులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌‌తోపాటు ఉదయ్‌ సిన్హాను నిందితులుగా పేర్కొంది. 
కానీ ఛార్జిషీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించలేదు. దీనితో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందని కోర్టు పేర్కొంటూ ఆర్కే పిటిషన్‌‌ను కొట్టివేసింది. దీనితో ఆళ్ళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం వివరణ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబుకి గతంలో నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఫిబ్రవరి నుండి విచారిస్తామని కోర్టు స్పష్టం చేయడంతో టీడీపీ ఎలా స్పందిస్తందో వేచి చూడాలి. 
 

14:28 - November 2, 2018

ఖమ్మం : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో రేపు ప్రసాద్‌రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్‌రావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన్ను ఆహ్వానించారు. గతంలో జలగం ప్రసాద్‌రావుపై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. 9 సంవత్సరాలుగా ప్రసాద్‌రావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

13:40 - November 2, 2018

భువనేశ్వర్ : ఒడిశాలో దారుణం జరిగింది. దొంగతనానికి వచ్చి దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు బాలిక పైనా పైశాచిత్వాన్ని ప్రదర్శించారు. ఈ దారుణ ఘటన కలకలం రేపింది. 

ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలోని ఓ ఇంట్లోకి ముగ్గురు దుండగులు బుధవారం అర్ధరాత్రి చోరి చేసేందుకు వెళ్లారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు ఇంట్లో అమ్మ పక్కన నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట పడుకుని ఉన్నారు. గురువారం తెల్లవారుజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది.. భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని బాలిక పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొన్నట్టు అమె తండ్రి తెలిపారు.

12:39 - November 2, 2018

హైదరాబాద్: ఈ బాలుడు పేరు... మహమ్మద్ హసన్ ఆలీ. వయస్సు.. 11 ఏళ్లు.. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా 7వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఏకంగా బీ.టెక్, ఎమ్‌టెక్ చదువుతున్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 
హైదరాబాద్‌కు చెందిన హసన్ ఆలీ తనకంటే పెద్దవాళ్లకే చదువుచెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.  
ఉదయం పూట స్కూలుకు వెళతాడు.. సాయంత్రం 6 గంటల వరకు ఆడుకోవడం, హోమ్‌వర్క్ పూర్తిచేసి ఆతర్వాత ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో క్లాసులు తీసుకుంటాడు. పైగా ఇతని లక్ష్యం ఏంటో తెలుసా? 2020 కల్లా కనీసం 1000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫాఠాలు చెప్పాలని శపథం చేసుకున్నాడు. తన వయసు కంటే కనీసం రెండు, మూడు రెట్లు ఎక్కువ వయస్సున్న వారికి పాఠాలు చెప్పటం అంటే ఆషామాషీ కాదు అంటున్నారు ఇతని దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు. ఈ బాల మేధావి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆశిద్దాం!
 

 

12:37 - November 2, 2018

తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్, ఈ మధ్య ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకోవడానికొచ్చిన యువకుడి మొబైల్ పగలగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేసింది తప్పు అంటూ, సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. సెలబ్రెటీలకు ప్రైవసీ ఉండకూడదా, అతను అలా చెయ్యకుండా ఉండాల్సింది, ఈ విషయంలో తప్పు నాదే, అని శివకుమార్ స్పందించడం కూడా జరిగింది. ఇప్పుడాయన పగలగొట్టిన ఫోన్‌ని సదరు యువకుడికి కొనిచ్చారు. రూ.21 వేల ఖరీదుగల మొబైల్‌ కొని, శివకుమార్, తన మేనేజర్ చేత రాహుల్‌కిప్పించారు. దాంతో, ఆశ్చర్యపోవడం రాహుల్ వంతైంది. ఫోన్ తీసుకుని, శివకుమార్‌కి థ్యాంక్స్ చెప్పాడు రాహుల్.   

12:35 - November 2, 2018

హైదరాబాద్ : ఏపీ డీజీపీ, విశాఖ ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు 30 రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. రామ్‌ప్రసాద్ లేఖకు స్పందించిన ఎస్సీ కమిషన్.. ఏపీ డీజీపీ, విశాఖ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 

 

12:28 - November 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఢిల్లీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తెలంగాణ నేతలు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు..పార్టీ..ప్రతిష్ట మరింత మెరుగుపరచాలని అమిత్ షా యోచిస్తున్నారు. ఇప్పటికే షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు. రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులున్నారు. రెండో జాబితాతో మొత్తం 66 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది. దీపావళి అనంతరం మూడో జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీ రెండో జాబితా...
సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
01 సిర్పూర్  డా.శ్రీనివాసులు
02 ఆసిఫాబాద్ అజ్మిరా ఆత్మారాం నాయక్
03 ఖానాపూర్ సట్ల అశోక్
04 నిర్మల్ సువర్ణరెడ్డి
05 నిజామాబాద్ అర్బన్  యెండల లక్ష్మీనారాయణ
06 జగిత్యాల ముదిగంటి రవీందర్ రెడ్డి
07 రామగుండం బల్మూరి వనిత
08 సిరిసల్ల మల్లగారి నర్సాగౌడ్
09 సిద్ధిపేట  నాయినీ నరోత్తమ్ రెడ్డి
10 కూకట్ పల్లి  మాదవరం కాంతారావు
11 రాజేంద్రనగర్ బద్దం బాల్ రెడ్డి
12 మలక్‌పేట ఆలె జితేంద్ర
13 శేరిలింగం పల్లి  యోగానంద్
14 చార్మినార్  టి.ఉమా మహేంద్ర
15 చాంద్రాయణగుట్ట  షెహజాది
16 యాకుత్‌పురా రూప్‌రాజ్‌
17 బహదూర్‌పురా  హనీఫ్‌అలీ
18 దేవరకద్ర  ఎ.నర్సింహులు సాగర్
19 వనపర్తి కొత్త అమరేందర్ రెడ్డి
20 నాగర్ కర్నూలు  ఎన్.దిలీప్ చారి
21 నాగార్జున సాగర్  కె.నివేదిత
22 ఆలేరు దొంతిరి శ్రీధర్ రెడ్డి
23 ఘనపూర్  పి.వెంకటేశ్వరుడు 
24 వరంగల్ వెస్ట్  ఎం. ధర్మారావు
25 వర్ధన్నపేట  కొత్త సారంగారావు
26 ఇల్లందు మోకల్ల నాగశ్రవంతి
27 వైరా బూక్యా రేశ్మాభాయి
28 అశ్వరావుపేట  బూక్యా ప్రసాద్ రావు
11:31 - November 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పార్టీలో అసమ్మతులు చల్లబడడం లేదు. తమకు టికెట్ రాదని..టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలోకి జంప్ కావాలని పలువురు నేతలు యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వేరే పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 107 మంది అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ బాస్ మరికొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టారు. నవంబర్ 2వ తేదీ అవుతున్నా ఇంకా ఆ స్థానాలను అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీనితో టికెట్ ఆశిస్తున్న వారు..తమకు టికెట్ వస్తుందని అనుకుంటున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. 
Image result for gaddam vinod congress partyమాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత గడ్డం వినోద్ పార్టీ మారుతారనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారని, సొంత గూటి (కాంగ్రెస్)లో చేరుతారని పుకార్లు షికారు చేశాయి. చెన్నూరు నుండి బరిలో దిగాలని వినోద్ ఆలోచించారు. ఆయన అలక బూనారని తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది.
శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ వీడొద్దని..భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ తో మాట్లాడిస్తానని తెలియచేసినట్లు సమాచారం. దీనితో ఆయన పార్టీ మారే విషయాన్ని పునరాలోచిస్తున్నట్లు సమాచారం. మరి మంత్రి కేటీఆర్ హామీ మేరకు టీఆర్ఎస్ లోనే గడ్డం వినోద్ ఉంటారా ? లేదా ? అనేది చూడాలి. 

11:29 - November 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌లో పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. త్వరలోనే అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో ఆశావహులు తమకే సీటు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మందికి అధిష్ఠానం ఇన్‌ డైరెక్ట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. 

అసెంబ్లీని రద్దు చేసి, 105 మంది అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్‌ఎస్‌. ఈ నేపథ్యంలోనే 50 రోజుల నుండి ప్రజలతో మమేకమవుతూ జోరుగా ప్రచారంలో మునిగిపోయారు అభ్యర్థులు. పెండింగ్‌ ఉన్న 14 స్థానాలపై ఉత్కంఠ నెలకొనగా 2 స్థానాలను ఇప్పటికే ప్రకటించింది అధిష్ఠానం. ఇంకా 12 సీట్లు పెండింగ్‌ ఉండటంతో ఆయా స్థానాలపై గులాబీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు తీవ్రంగా కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే గులాబీ దళపతి కొంత మంది అభ్యర్థులకు ప్రచారం ప్రారంభించాలని సైలెంట్‌గా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 లేదా 4 నియోజకవర్గాలకు మించి అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 

బీజేపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీరాబాద్‌ నియోజకవర్గానికి టీఆర్ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ పేరు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన ప్రచారం మొదలు పెట్టేశారు. ఘోషామహల్‌ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ పేరు దాదాపు ఖరారు అయిందని గులాబీ నేతలు అంటున్నాయి. ఖైరతాబాద్‌ స్థానం నుండి పోటీ చేసేందుకు మాజీ మంత్రి దానం నాగేందర్‌ను సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దానం కూడా ఇప్పటికే కింది స్థాయి నేతలతో చర్చలు జరుపుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో తీవ్ర పోటీ నెలకొనడంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్‌ఐఎమ్‌ పార్టీ కూడా మేయర్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థించిందన్న సూచనతో  అంబర్‌పేట రామ్మోహన్‌కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 

మేడ్చల్‌ స్థానానికి ఎంపీ మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆయన పేరు అధికారికంగా వెల్లడించాల్సి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వికారాబాద్‌ స్థానం కోసం నలుగురు.. ఐదుగురు టీఆర్‌ఎస్‌ నేతల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థిత్వంపై స్పష్టత రాలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రవి శంకర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఇంకా అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రాలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో చివరి నిమిషంలోనే పేర్లు ఖరారు చేసే ఛాన్స్‌ ఉంది. 

11:16 - November 2, 2018

హైదరాబాద్ : వైసీసీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర మరోసారి వాయిదా పడనుందా ? గాయంతో ఆయన కోలుకోలేదని తెలుస్తోంది. ఆయన చేయి ఏ మాత్రం పైకి లేవడం లేదని..సహకరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. Image result for jagan attack caseహైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో జగన్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు మరోసారి వైద్యులు ఆయన్ను పరిక్షీంచనున్నారు. విశాఖకు వెళ్లి శనివారం నుండి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించాలని జగన్ యోచించారు. కానీ గాయం మానకపోవడంతో వైద్యులు మరో వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. యాత్ర చేసే సమయంలో ఇబ్బందులు వస్తాయని వైద్యులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనితో నవంబర్ 10వ తేదీ నుండి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించాలని వైసీపీ యోచిస్తోందని తెలుస్తోంది. దీనిపై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
Image result for jagan attack caseవిశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య మరింత చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. మరోవైపు శ్రీనివాసరావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన కస్టడీ శుక్రవారంతో ముగినుంది. 

10:51 - November 2, 2018

ముంబయి: టపాకాయ్ వెలగలేదు అనుకొని నోటీతో కొరికేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ళ బాలుడు ఒక్కసారిగా అది పేలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగింది.
దీపావళి పండగను ముందుగా జరుపుకొనే ఉత్సహాంతో యాష్ సంజయ్ గావటే అనే పిల్లాడు మరో నలుగురు పిల్లలతో కలిసి సీమ టపాకాయలు కాలుస్తున్నాడు. ఒక సీమ టపాకాయ్ పేలకపోవడంతో చేతులోకి తీసుకొని చూసి.. మళ్లీ నిప్పు అంటించే ముందు కొనను కొరుకుదామని నోట్లో పెట్టుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అసుపత్రికి తరలించినా ప్రయోజనం కలగలేదు. ఆసుపత్రికి వచ్చేసరికే సంజయ్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

 

 

10:39 - November 2, 2018

హైదరాబాద్ : మరోసారి పెట్రోల్ ధరలు తగ్గాయి. వరుసగా 15 రోజుల నుండి ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇంధన ధరలు తగ్గుతున్నాయని పలు కంపెనీలు పేర్కొంటున్నాయి. 16వ రోజు పెట్రోలుపై 19 పైసలు, డీజిల్ పై 14 పైసల మేరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. 

01-11-2018

సిటీ  డీజిల్ లీటర్ పెట్రోల్ లీటర్
హైదరాబాద్‌ రూ.84.14. రూ.80.25 
విజయవాడ రూ.83.29 78.97
బెంగళూరు రూ .79.99 రూ.74.16
ఢిల్లీ రూ.79.39 రూ.73.78
ముంబై రూ.84.86 రూ.77.32
కోల్‌కతా  రూ. 81.25 రూ. 75.63
చెన్నై రూ. 82.65 రూ. 78.0

02-11-2018

సిటీ  డీజిల్ లీటర్ పెట్రోల్ లీటర్
హైదరాబాద్‌ రూ. 83.96 రూ. 83.96
విజయవాడ రూ. 83.34 రూ. 79.07
బెంగళూరు రూ. 79.82  రూ. 74.04
ఢిల్లీ రూ. 79.18 రూ. 73.64
ముంబై రూ. 84.68 రూ. 77.18
కోల్‌కతా రూ. 81.08 రూ. 75.50
చెన్నై రూ. 82.26 రూ. 77.85
10:27 - November 2, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. రోజు ఇక్కడ రిలీజవుతుండగా, యూ.ఎస్ లో నిన్న రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విధంగా ఉంది. ఫస్ట్‌హాఫ్ కాలేజ్ సీన్స్, చైతు, నిధిల లవ్ ట్రాక్, కామెడీ సీన్స్, సాంగ్స్‌తో సరదాగా సాగిపోతూ, ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, సెకండ్‌హాఫ్‌లో హీరో, విలన్‌ల మధ్య ఇంట్రెస్టింగ్ వార్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలరించే లగ్గాయిత్తు సాంగ్ రీమిక్స్, అద్భుతమైన ఎండింగ్ ఇచ్చి, దర్శకుడు చందూమొండేటి మంచి సినిమా తీసాడని, ఓవర్సీస్ ఆడియన్స్ చెప్తున్నారు. మొత్తానికి, సవ్యసాచితో చైతు సక్సెస్ కొట్టాడన్నమాట. మరి కాసేపట్లో పూర్తి రివ్యూ రాబోతుంది. 

 

09:59 - November 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఇక్కడ తమ ప్రభావం చూపించాలని కాషాయ దళం ఆరాటపడుతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక నజర్ పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన తెలంగాణలో పర్యటించారు. మొదటి జాబితాను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. హై కమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో 28 మంది అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో అభ్యర్థులు ఎవరున్నారనే దానిపై ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 

సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
01 మలక్‌పేట ఆలె జితేంద్ర
02 కూకట్‌పల్లి మాధవరం కాంతారావు
03 చాంద్రాయణగుట్ట షెహజాది
04 యాకుత్‌పురా రూప్‌రాజ్‌
05 ఆలేరు డి.శ్రీధర్‌రెడ్డి
06 చార్మినార్‌ ఉమా మహేందర్‌
07 బహదూర్‌పురా హనీఫ్‌అలీ
08 కొడంగల్‌ నాగూరావు నామోజీ
09 మహబూబ్‌నగర్‌ పద్మజారెడ్డి
10 దేవరకద్ర ఎగ్గెని నర్సింహులు
11 రామగుండం బలమూరి అనిత
12 ఇబ్రహీంపట్నం కొత్త అశోక్‌
13 శేరిలింగంపల్లి యోగానంద్
14 నిజామాబాద్‌ యెండల లక్ష్మీనారాయణ
15 రాజేంద్రనగర్‌ బద్దం బాల్‌రెడ్డి
16 కొత్తగూడెం కుంచె రంగా కిరణ్

ఈ పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మహా కూటమి నుండి అభ్యర్థులను ప్రకటించగానే మూడో జాబితా కూడా ప్రకటించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

09:45 - November 2, 2018

ఢిల్లీ : మహాకూటమి సీట్ల పంచాయతీ హస్తినకు చేరింది. మహాకూటమి నేతలు సీట్ల పంపకాలపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఢిల్లీలో మకాం వేశారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండారం భేటీ కానున్నారు. రాహుల్‌తో భేటికి ముందే అశోక్ గెహ్లాట్, జైరా రమేశ్‌లతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చించనున్నారు. 

అయితే కోదండరాం కూటమిలో 15 సీట్లు కోరుతున్నారు. కాగా తాను బలంగా ఉన్న చోట సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే ఇప్పుడు కూటమిలోని మిత్ర పక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే...రాబోయే ఎంపీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అధిక సీట్లు అడిగే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా కోదండరాం అభ్యర్థనను రాహుల్ గాంధీ ఎంత వరకు ఒప్పుకుంటారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

 

09:32 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. Image result for Jagan Mohan Reddy Going Vishakaఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య మరింత చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసులకు జగన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని..జాతీయ సంస్థలతో విచారణ చేయించాలని జగన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 
Image result for Jagan Mohan Reddy Going Vishakaమరోవైపు చికిత్స అనంతరం..విశ్రాంతి తీసుకున్న జగన్ శుక్రవారం విశాఖలో అడుగు పెట్టనున్నారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరనున్నారు. దీనితో సిట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన అనంతరం జగన్ స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దర్యాఫ్తునకు సహకరించాలని, తమకు స్టేట్ మెంట్ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. కానీ జగన్ స్టేట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

 

09:14 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ దాడికి సంబంధించి శ్రీనివాసరావు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. దీనితో కోర్టు ఎదుట అతడిని హాజరు పరుచనున్నారు. విచారణ జరుగుతోందని..అతని కస్టడీ కొనసాగించాలని సిట్ అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు కస్టడీ పొడిగిస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విచారణలో శ్రీనివాసరావు ఎలాంటి కీలక అంశాలు వెల్లడించారనేది తెలియడం లేదు. మొత్తం ఈ కేసులో 40మందిని విచారించారు. ఇందులో 30 మంది అమ్మాయిలు ఉండడంతో విచారణ మందకొడిగా సాగిందని తెలుస్తోంది. దాడికి ముందు శ్రీనివాసరావు పదివేల కాల్స్ చేశారని గుర్తించిన కాప్స్ 300 పైచిలుకు కాల్స్ పై దర్యాప్తు చేపట్టారు. ఇందులో గంటల వ్యవధిలో మాట్లాడడం..అధికంగా ఏ వ్యక్తులతో మాట్లాడారో వారిని పోలీసులు గుర్తించారు. వీరిని కూడా సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కస్టడీకి కోర్టు అనుమతినిస్తుందా ? లేదా ? అనేది కాసేపట్లో తెలియనుంది. 

09:12 - November 2, 2018

చిత్తూరు : జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం భారీగా పట్టుబడింది. కురబలకోట మండలం  సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే 146 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప నుంచి బెంగళూరుకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో.. ముదివేడు పోలీసులు కురబలకోట మండలం రైల్వేగేటు దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను పీఎస్‌కు తరలించారు. 

 

08:53 - November 2, 2018

హైదరాబాద్ : ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సైతో పాటు అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, కానిస్టేబుళ్లు, డిప్యూటీ జైలర్, వార్డర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 24 వరకు  అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 

08:35 - November 2, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో జస్టిస్‌ సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్న ఆర్ సుభాష్‌రెడ్డి.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలోని రైతు కుటుంబంలో 1957లో జన్మించారు. శంకరంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఇంటర్, డిగ్రీని పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1980 అక్టోబర్ 30వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 22 ఏళ్లపాటు వేల కేసులను వాదించారు. 2002 డిసెంబర్‌లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 13వ తేదీన గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్న సీనియార్టీ దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు కొలీజియం సిఫారసు చేసింది. 

 

08:20 - November 2, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చిందా? 95స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనపై కూటమిలోని పార్టీలు ఏమంటున్నాయి? రాహుల్‌తో కోదండరామ్ భేటీ తరువాత పంపకాల సస్పెన్స్‌కు తెరపడనుందా? ఎపట్లోగా కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలయ్యే అవకాశముంది?

మహాకూటమిలో సీట్ల స‌ర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. మిత్ర పక్షాలకు ఎన్నిసీట్లు కేటాయించాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయాని కొచ్చినట్లు తెలుస్తోంది. 119నియోజకవర్గాల్లో 95చోట్ల తాము పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో  మిగిలిన 24 స్థానాలు మహాకూటమిలోని మిత్రపక్షాలకు దక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీకి 14, తెలంగాణ జనసమితికి 7, సీపీఐకి మూడు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. 20సీట్లు దక్కుతాయని తెలుగుదేశం నేతలు ఆశించినా.. ఆ సంఖ్య పద్మాలుగుకే పరిమితమైంది. దీంతో.. తెలంగాణ టీడీపీ నేతలు తాము కోరుతున్న  నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌కారం టిడిపి పోటీ చేసే స్థానాల జాబితా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. శేరిలింగంప‌ల్లి, కూక‌ట్ ప‌ల్లి, ఉప్ప‌ల్, రాజేంద్ర‌న‌గ‌ర్, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్, మ‌క్త‌ల్, దేవర‌క‌ద్ర‌, కోదాడ‌, కోరుట్ల‌, వ‌రంగ‌ల్  ఈస్ట్, స‌త్తుప‌ల్లి, అశ్వ‌రావ్ పేట‌ నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను నిలబెట్టేందుకు తెలుగుదేశం నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

సీట్ల కేటాయింపు విష‌యంలో త‌మ‌కు పెద్ద‌గా ప‌ట్టింపు లేద‌ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. తుది జాబితా వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూస్తామని చెప్పారు.

కాంగ్రెస్ చెబుతున్న దాని ప్రకారం తెలంగాణ జన సమితికి ఏడు స్థానాలు దక్కుతాయి. అయితే కోదండరామ్ అండ్ టీమ్ మాత్రం 8స్థానాలకు పట్టుబడుతోంది. సీట్ల సర్దుబాటుపై ఇవాళ రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ భేటీ కానున్నారు. ఈ భేటీ  తరువాత జనసమితికి ఎన్నిసీట్లు దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. ఇక టీజేఎస్ మ‌ల్కాజిగిరి, రామ‌గుండం, ఎల్లారెడ్డి, సిద్దిపేట  లేదా వ‌రంగ‌ల్ వెస్ట్, వ‌ర్ధ‌న్న పేట‌, తాండూరు, చెన్నూరు, మిర్యాల గూడ‌ నియోజకవర్గాలు తమకే కావాలని కోరుతోంది.

సిపిఐ పార్టీ విష‌యానికి వ‌స్తే 7 స్థానాల‌ను కోరుతున్నా.....క‌నీసం నాలుగు  స్థానాలను కేటాయించాల‌ని ప‌ట్టుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీపీఐ హుస్నాబాద్, మునుగోడు,  కొత్త‌గూడెం, బెల్లంప‌ల్లి, భధ్రాచ‌లం, దేవ‌ర‌కొండ‌, వైరా నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లో తాము వదులుకునేది లేదంటోంది. ఈనెల 8న అభ్య‌ర్థ‌ుల‌ను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ .....కూట‌మి పార్టీల్లో అభ్య‌ర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకోమ్మ‌ని సూచించిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. 

08:03 - November 2, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. జనసైనికులతో కలసి రైలు ప్రయాణం చేయనున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించనున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగన్ పై దాడి ఘటన నేపథ్యంలో పవన్ టూర్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజకీయ చైతన్యానికి వేదికైన తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ ప్రజాపోరాట యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ వరకూ జిల్లాలో పవన్ పర్యటిస్తారు. కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన  కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ యాత్ర చేపట్టారు. రైతులు, కార్మికులతో పాటు ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు.  పొలిటికల్ టూర్‌లో భాగంగా తొలిసారిగా జిల్లాకు పవన్ కల్యాణ్ వస్తున్న నేపధ్యంలో ఆయన అభిమానులు,   జనసనేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. 

జనసైనికులతో కలసి పవన్ కల్యాణ్ రైలు ప్రయాణం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటా 20నిమిషాలకు విజయవాడలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పవన్ బయలుదేరతారు. అక్కడి నుంచి తుని వరకు ఆయన రైల్లో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో వచ్చే  అన్ని రైల్వే స్టేషన్లలో అభిమానులు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతారు. విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో  నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.

మొన్నటి వరకు పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ధవళేశ్వరంలో కవాతు నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ రావడంతో అక్కడకు వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రజల్లోకి  వెళ్లడానికి ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పవన్ రానుండటంతో.. జనసేన పార్టీ నేతలు జోష్ లో ఉన్నారు.. జనసేనాని ఇఫ్పటి వరకు కేవలం ముమ్మిడివరం నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు.. అయితే ఈ ధఫా టూర్ లో మరికొన్ని స్ధానాలకు  అభ్యర్ధులను ప్రకటిస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.. నియోజకవర్గాల వారిగా ఉన్న సమస్యలను ఇప్పటికే పవన్ దృష్టికి తీసుకువెళ్లిన నేతలు.. ఆయన రాకతో తమ గ్రాఫ్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.. ప్రధానంగా జిల్లాలోని ఎస్ఈజడ్.. వంతాడ,   ఇసుక మైనింగ్ పై పవన్ దృష్టి సారించి నియోజకవర్గాల వారిగా నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారంటున్నారు జిల్లా పార్టీ నేతలు.. 

ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో పవన్ ప్రజాపోరాట యాత్రకు పోలీసులు అధిక ప్రాధాన్యనిస్తున్నారు. పవన్ సమీపంలోకి అభిమానులు, కార్యకర్తలను అనుమతించబోమని తెలిపారు. సెల్ఫీలు తీసుకోవడం నిషేధించడం జరిగిందని.. ఎవరైన  నిబంధనలు అతిక్రమిస్తే చర్యలకు వెనుకాడేది లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. 

ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్ సంకల్ప యాత్ర నిర్వహించారు. తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్రకు రానుండటంతో.. జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. 

Don't Miss