Activities calendar

03 November 2018

22:03 - November 3, 2018

పాట్నా: బీహార్ మాజీముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ తన భార్య ఐశ్వర్యరాయ్ నుంచి విడాకులు కోరుతూ పాట్నాలోని ఫ్యామిలీ కోర్టులో శుక్రవారం పిటీషన్ వేశారు. పిటీషన్ని స్వీకరించిన కోర్టు నవంబర్ 29న కేసు విచారిస్తామని తెలిపింది. 2018 మే12న తేజ్ ప్రతాప్యాదవ్, ఐశ్వర్యరాయ్ వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే విడాకులు కోరటంతో ఇప్పుడు బీహార్లో ఇదే హాట్టాపిక్ అయ్యింది. బీహార్లోని  మాజీ ముఖ్యమంత్రుల కుటుంబంలో ఇటువంటి సంఘటన జరగటం  పట్ల అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తేజ్ప్రతాప్ భార్య ఐశ్వర్య కూడా ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రికా రాయ్‌ కుమార్తె. దాణాకుంభకోణం కేసులో జైలులో ఉన్న లాలూ ప్రసాద్, తేజ్ప్రతాప్ పెళ్లికి 3రోజులు పెరోల్ ,6నెలలు బెయిల్ పై వచ్చారు. విడాకుల పిటీషన్ దాఖలు చేసిన తర్వాత తేజ్ప్రతాప్ మాట్లాడుతూ..... "మా ఇద్దరి అభిప్రాయాలు కలవటంలేదు, ఇద్దరం చాలాసార్లు మాపెద్దల ముందే గొడవ పడ్డాం, కలిసుండటం ఇక మావల్ల కాదు, ఈ ఆర్నెల్ల వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపింది లేదు, కలిసుండి కొట్టుకునే కన్నా విడిపోవటం బెటర్ అని విడాకులకు అప్లయ్ చేశాను" అని చెప్పారు. ఐశ్వర్య ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరిలో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసారు. విడాకులు విషయమై రెండు కుటుంబాల నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కొందరు పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు  తెలుస్తోంది. 

21:44 - November 3, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఓటమే థ్యేయంగా కూడిన కూటమి అడుగులు తడబడుతున్నాయి. ఇప్పటికే 105 సీట్లను కూడా ఖరారు చేసి  టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. మరోపక్క బీజేపీ రెండవ విడత కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో రెండవస్థానంలోవుంది. కానీ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పట్లో కుదిరేలా లేదు.

Image result for mahakutami in telanganaసీట్ల పంపిణీ విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయ్. కూటమి అడుగులు తడబడుతున్నాయ్. ఈ సీట్ల పంచాయితీ ఢిల్లీ చేరింది. టీడీపీపకి 14 సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది కానీ పంపకాల విషయంలో తాడో పేడో త్వరగా తేల్చి చెప్పండంటూ ఇప్పటికే చాలా సార్లు కాంగ్రెస్ ను కోరారు కోదండరాం. మా దారి మేం చూసుకంటామంటూ అల్టిమేటం కూడా ఇచ్చారు. అయినా సీట్ల విషయంలో పంచాయితీ అసంపూర్తిగానే ఉంటోంది. దీంతో ఈ సారి ఏకంగా ఢిల్లీ వెళ్లి..రాహుల్ తో భేటీ అయ్యారు కోదండరాం. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు రాహుల్‌ సూచించారని కోదండరాం వివరించారు.

Image result for mahakutami in telanganaఇక సీట్ల విషయంలోనూ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కోదండరాం. కాంగ్రెస్ కు 95, టీడీపీకి 14, మిగిలినవి టీజేఎస్, సీపీఐ పంచుకుంటాయని ఉత్తమ్ ప్రకటించిన మరుసటి రోజే జరిగిన ఈ సమావేశంలో టీజేఎస్ తమ ప్రతిపాదనలను రాహుల్ కు వివరించింది. తెలంగాణలో 25 చోట్ల తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని కోదండరాం స్పష్టం చేశారు. 17 సీట్లు కచ్చితంగా ఇవ్వాలని తాము కాంగ్రెస్‌ పార్టీని కోరామన్నారు కోదండరాం.

Image result for kodandaram chada venkat reddyటీజేఎస్ వాదన విన్న రాహుల్..సీట్ల పంపకాలపై హైదరాబాద్ లోనే తేల్చుకోవాలని సూచించినట్లు కోదండరాం వివరించారు. కూటమి కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ తెలిపారన్నారు. అయితే..సీట్ల సర్దుబాటుపై రాష్ట్రంలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కోదండరాం..ఒకవేళ పరిష్కారం కాకుంటే తమ కార్యచరణ వేరేగా ప్రకటిస్తామన్నారు. కాగా సీపీఐ, టీజేఎస్ ల సీట్ల పంపిణీ మాత్రం పెండింగ్ లోనే వుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు ప్రజాక్షేత్రంలో చెప్పుకోదగ్గ బలం లేదనీ..వారికి చెప్పుకోదగ్గ నాయకుడు లేరని అందుకే కాంగ్రెస్ వారికి సీట్లు వారు ఆశించినంతగా ఇచ్చేందుకు సుముఖంగా లేరని అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బైటకు పోలేక..కూటమిలో కొనసాగలేక టీజేఎస్, సీపీఐ అంతర్మధనంలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ పంపిణీ కార్యక్రమాలు ఎప్పటికి తేలేనో? ప్రచారం ఎనాటికి ప్రారంభమయ్యేనో? టీఆర్ఎస్ ఓటమి కోసం కంకణం కట్టుకున్న కూటమి పరువు నిలిచేనా? లేదా గులాబీ పార్టీకి చిక్కకుండా కూటమి పరువు నిలబెట్టుకుంటాదో? లేదో? వేచి చూడాల్సిందే.

-మైలవరపు నాగమణి

21:11 - November 3, 2018

తిరువనంతపురం: కేరళలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ తలుపులుసోమవారం  తెరుచుకోనున్నాయి.  మాసపూజలో భాగంగా 5వ తేదీ సాయంత్రం  9 వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. శబరి మల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించవచ్చని సెప్టెంబరు 28 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం , తీవ్ర ఉద్రిక్త పరిస్ధితుల  నడుమ అక్టోబరు 17 న ఆలయ తలపులు తెరవటం, కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించటం,  భక్తుల నుంచి నిరసన రావటం  జరిగింది. గత నెలలో జరిగిన అనుభవాల  దృష్ట్యా ప్రభుత్వం  ముందు జాగ్రత్త చర్యగా  భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 16 వందల మంది పోలీసులతో భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది. సన్నిధానం, పంబ, నిలక్కల్ ప్రాంతాల్లో   శనివారం సాయంత్రం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తామని, భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే పంబకు వెళ్లేందుకు అనుమతిస్తామని పత్తనంతిట్టా జిల్లా ఎస్పీ నారాయణన్  చెప్పారు. అలాగే మీడియా, భక్తులు తప్ప మిగతావారిని నిలక్కల్ నుంచి పంబకు అనుమతించమని,  డీజీపీ ఆదేశాల ప్రకారం.. ఇద్దరు ఐజీల పర్యవేక్షణలో పోలీసుల బృందం భద్రతను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఐదుగురు ఎస్పీలు, పది మంది డీఎస్పీలను నిలక్కల్, పంబ, సన్నిధానం, వడస్సేరికర ప్రాంతాల్లో విధులకు కేటాయించినట్టు తెలియజేశారు. సన్నిధానంలో ఎక్కువ సమయం  ఉండేందుకు ఎవర్నీ అనుమతించబోమని, సుప్రీంతీర్పుకు పోలీసులు కట్టుబడి ఉంటారని, భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ నారాయణన్ తెలిపారు.

21:05 - November 3, 2018

మెదక్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తేనే వార్తల్లోకి వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. రైతు సమన్వయ సమితి సభ్యుడు దేవీరవీందర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. హరీశ్ రావుపై వంటేరు వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఘన్ పూర్ లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కాగా హరీశ్ తనకు ఫోన్ చేసిన తన మామ కేసీఆర్ ను ఓడించమనీ..అందుకు ఎంతకావాలన్నా ఇస్తారనన్నారనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హరీశ్ రావు వెంటనే తనకు ఒంటేరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటమే కాక ఒంటేరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతనికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాననీ..అప్పటి వరకూ గజ్వేల్ లోనే వుంటారని సవాల్ చేశారు.

20:44 - November 3, 2018

సిద్ధిపేట : టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారనీ..దీని కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో వున్నారంటే కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించమని మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశారంటూ వంటేరు చేసిన  వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు వంటేరు తనకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది ప్రతాప్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవని, అసహనంతో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image result for harishrao and vanteruగజ్వేల్ ప్రజలకు ప్రతాప్ రెడ్డి ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటు మండిపడ్డారు.వంటేరుకు గజ్వేల్ లో డిపాజిట్లు కూడా దక్కవనీ..అప్పటి వరకూ తాను గజ్వేల్ లోనే ఉంటానని అన్నారు. తన పుట్టుక, చావు టీఆర్ఎస్ లోనే అని, బతికినంత కాలం తన జీవితం కేసీఆర్ కే అంకితమని హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ది ముగిసన అధ్యాయమని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తాము అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.
 

19:46 - November 3, 2018

హైదరాబాద్ : గులాబీ గూటిలో పొడచూపుతున్న విబేధాలపై గత కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తునే వున్నాయి. కేసీఆర్ తరువాత హరీశ్ రావే ముఖ్యమంత్రి అంటు ఒక వర్గం కొంతకాలం క్రితం ప్రచారం చేయటం..దానిపై కేసీఆర్ మండిపడ్డారనే వార్తలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఇంటిపోరు ఎక్కువైందని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని...ఈ నేపథ్యంలో హరీష్ టీఆర్ఎస్ ను వీడనున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారని...త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అన్నారు. కొంగరకలాన్ సభ తర్వాత 108 సభలు పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ వంటేరు పైవ్యాఖ్యలు చేశారు.

అప్పటి నుండి కేసీఆర్ హరీశ్ రావ్ పై అసంతృప్తిగా వున్నట్లుగా పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. కాగా తన కుమారుడు కేటీఆర్ ను ఎలాగైనా సీఎంని చేయాలను దృఢ సంకల్పంతో వున్న కేసీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాస్తు బాగాలేదంటు సెక్రటేరియట్ ను మార్చేంత వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ సెక్రటేరిట్ లో వుండి పాలన జరిపితే తన కుమారుడు సీఎం కాలేడనే నమ్మకంతో ఆయన పాలన ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ నుండే నడిపిస్తుంటారని అందుకు అంటుంటారు. సెక్రటేరియట్ కు రాని సీఎం అంటు విపక్షాలు విమర్శలు చేసినా కేసీఆర్ పట్టింకోకపోవటానికి కారణం కూడా అదేనంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో హరీశ్ రావ్ చురుగ్గానే పనిచేస్తున్నా..లోలోపల అసంతృప్తిగానే వున్నట్లుగా వార్తలు వస్తునే వున్నాయ్. ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న ఈ సంచలనాత్మక వార్తలు ఎంతవరకూ వాస్తవమో వేచి చూడాలి.
 

19:34 - November 3, 2018

హైదరాబాద్: "డబ్బులు ఎవరికీ ఊరికే రావు, ఇంతవరకు ఇచ్చింది చాలు" అంటూ కొన్నిరోజులక్రి తం టీవీల్లో ప్రకటనలు చూసి జనం బంగారం షాపులకు  క్యూ కట్టారు. అక్షయ తృతీయ, ధన్ తేరస్ పేరు చెప్పి బంగారం షాపులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. సంవత్సరంలో వచ్చే ఈరెండు రోజుల్లో బంగారం కొనాలనుకునేవారి బలహీనతలతో బంగారం షాపులు కిటకిట లాడతాయి. ఇదే అదనుగా బంగారం షాపులు వినియోగదారులను రకరకాల మోసాలతో నిండా ముంచుతున్నాయి.  దీపావళికి 2 రోజులు  ముందు బంపర్ ఆఫర్లు ప్రకటించి తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఇక్కడే వినియోగదారుడు నిండా మునుగుతున్నాడు.  ఈసమయంలో వ్యాపారస్తులు  వినియోగదారులను మోసంచేసే అవకాశం ఉండటంతో  తూనికలు కొలతలశాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌... తన సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ లోశనివారం విస్తుృతంగా  తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వినియోగదారులును  మోసంచేస్తున్న 85 షాపులపై కేసులు నమోదుచేశారు. 
ఈరోజు తూనికలు కొలతల శాఖ తనిఖీల్లో అనేక అక్రమాలు  బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలోతొక్కి వినియోగదారుడిని బంగారం వ్యాపారస్తులు నిలువునా  దోచుకుంటున్నాయి.  నిబంధనల ప్రకారం... వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు ఇచ్చే బిల్లులో కచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్‌ బరువు, ధర విడివిడిగా బిల్లులో చూపించాలి. కొనుగోలు చేసిన రోజు ఉన్న బంగారం ధరతోపాటు 22 కేరట్లా, 24 కేరట్లా అన్నది స్పష్టంగా  తెలపాలి. మేకింగ్‌ చార్జీలు , వేస్టేజ్‌ని వ్యాట్‌లో కలపడం కూడా నిబంధనలకు విరుద్ధం. అన్నీపోగా నికర బరువు ప్రకారమే ధర వేయాలి. కానీ...వ్యాపారస్తులు వేస్టేజ్‌ పేరుతో, రాళ్లబరువుతో కలిపి చార్జి చేస్తు వినియోగదారుడిని  మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.  
తూనికలు కొలతలు శాఖ తనిఖీల్లో నగరంలోని పలు పేరెన్నికగన్న షాపులు ఉండటం గమనార్హం. అందులో కొన్ని .....తిబుర్‌మల్‌, మంగత్‌రాయ్‌, ముసద్దీలాల్‌ జువెలర్స్‌ (బంజారాహిల్స్‌), మహాలక్ష్మి జువెలర్స్‌(జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌), తనిష్క్(రోడ్‌ నెం.1 బంజారాహిల్స్‌), లలిత, ముసద్దీలాల్‌, మలబార్‌ గోల్డ్‌, కీర్తిలాల్‌ జువెలర్స్‌ (సోమాజిగూడ),  భజరంగ్‌లాల్‌ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ , సూరజ్‌భాన్‌ అండ్‌ కంపెనీ, తోతారామ్‌ సాగర్‌లాల్‌,  వైభవ్‌, శుభం జువెలర్స్‌ (తార్నాక), కుమరన్‌, సీఎంఆర్‌, చందన, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌, తోతారామ్‌ సాగర్‌లాల్‌, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌, చెన్నై షాపింగ్‌మాల్‌(ఆర్‌పీ రోడ్‌) లు ఉన్నాయి.

19:16 - November 3, 2018

కత్తిపూడి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,టీడీపీ నాయకులకు డబ్బే ప్రధానం అయిందని, వాళ్లను నిలదీసే పరిస్ధితి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయటానికి డబ్బులు ఉండవు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను కొనటానికి డబ్బులుంటాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి లోకేష్ అడ్డదారిలో పంచాయతీ రాజ్ శాఖమంత్రి అయ్యారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గ్రామ,గ్రామాన అవినీతి పెరిగిపోయిందని జనసేన పార్టీ అవినీతిపై పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించటమే జనసేన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయని, సాగునీరు లేదు, ప్రభుత్వాసుపత్రిలు మూసివేస్తున్నారు అని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం వెంటనే  జాగ్రత్త పడి వుంటే ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగేవారని...... మీ ఎమ్మెల్యేలను కాపాడలేకపోయిన మీరు ఒక ముఖ్యమంత్రా అని  సీఎం ను ఉద్దేశించి ప్రశ్నించారు. సభ ప్రారంభలో అభిమానులు పవర్ స్టార్ సీఎం ,పవర్ స్టార్ సీఎం, అంటూ నినాదాలు చేయగా... మీ ఆకాంక్ష భగవంతుడి ఆశీస్సులతో  త్వరలో నెరవేరుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.   

19:06 - November 3, 2018

డెహ్రాడూన్: అసలే మంచు ప్రాంతం. పైగా శీతాకాలం వచ్చేసింది. ఇక వర్షమే వర్షం. అదికూడా మంచు వర్షం. దీంతో ఉత్తరాది మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా తయారయ్యింది. జ‌మ్మూక‌శ్మీర్‌తో పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ తొల‌క‌రి మంచు భారీగా కురుస్తోంది. శ్రీన‌గ‌ర్‌లో అనేక ప్రాంతాల్లో తొల‌క‌రి మంచు ప‌ల‌క‌రించింది. ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూడా భారీ స్థాయిలో మంచు కురిసింది. స్వ‌ల్ప స్థాయిలో భ‌క్తులు కేదారీశ్వుడిని ద‌ర్శించుకున్నారు. ఇక హిమాచ‌ల్‌లోని కులు, మ‌నాలీలోనూ మంచు కురుస్తోంది. అక్క‌డ కూడా మంచు వ‌ల్ల ప‌ర్యాట‌కులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. పూంచ్ జిల్లాలోని మొఘ‌ల్ రోడ్డులో మంచు వ‌ల్ల చిక్కుకున్న 140 మందిని భార‌తీయ ఆర్మీ ర‌క్షించింది. సుర‌న్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపున‌కు వాళ్ల‌ను త‌ర‌లించారు.
 

18:45 - November 3, 2018

హైదరాబాద్ : శ్రీపీఠం పీఠాధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రజాకార్ల పాలన సాగుతోందనీ..ఇక్కడ హిందువుకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వరంగల్ లో సాయిబాబా మందిర పూజారిపై ఓ ముస్లిం మతోన్మాది చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని..ఆయన అంతిమయాత్ర వెళ్తే వందలాది మంది పోలీసులను రంగంలోకి దించారని మండిపడ్డారు. ప్రస్తుతం రజాకార్ల పాలన కొనసాగుతోందని... ఎంఐఎం కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. దారుస్సలాం కనునన్నల్లో కాకుండా, లాల్ దర్వాజ కనుసన్నల్లో ప్రభుత్వం నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని పరిపూర్ణానంద తెలిపారు. 

Related imageతెలంగాణ అంటే నిజామే అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారని..జీసన్ పాలన తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారనీ ఈ సందర్భంగా పరిపూర్ణానంద గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి హిందువు ఓటు వేయాలని... ఎవరు బాగా పరిపాలిస్తారో వారికే ఓటు వేయాలని కోరారు. బీజేపీకి కులమతాలు ఉండవని తెలిపారు. కాగా ఇటీవలే అమిత్ షా చేతుల మీదుగా పరిపూర్ణానంద బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో పాగా వేయాలనుకునే బీజేపీ పరిపూర్ణానంద ద్వారా ప్రచారం చేయించి తద్వారా అధికారంలోకి రావాలని యోచిస్తోంది. 
 

18:08 - November 3, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న పలు వివాదాస్పద నిర్ణయాలతో దేశంలో కీలకమైన వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నంగా తయారవుతున్నాయి. సీబీఐ లాంటి కీలక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో అవినీతికి అడ్డాగా మారిపోయింది. దీంతో ఇటీవల కాలంలో సీబీఐలో అవినీతి భాగోతం వీధినపడింది. ఈ అంశంల సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 
భారత రిజర్వు బ్యాంకు  అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్రం యత్నిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై మాజీ కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. గతంలో ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ ను రెండోసారి బాధ్యతలు చేపట్టకుండా కేంద్రం సాగనంపిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విషయంలోనూ అదే ఘటన పునరావృతం అవుతోందని విమర్శించారు.

Image result for rbi ex governor raghuram rajan‘ఉర్జిత్‌ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌ కోరుకుంటోంది. దానర్థం మోదీ ప్రభుత్వం కూడా ఆయన వెళ్లిపోవాలనే భావిస్తోంది. రఘురామ్ రాజన్‌ కథే పునరావృతం అవుకానుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

‘ప్రజలు ఎంతో నమ్మకం ఉంచిన సంస్థల చట్టబద్ధత, స్థాయిని దూరం చేయడం అంతిమంగా సామాజిక, ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తుంది’ అని ఆమె హెచ్చరించారు. భారత్‌లో ఇది నిజం అనిపిస్తోంది’’ అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ జానెత్‌ యెల్లెన్‌ పేర్కొన్నారు.  ఆ మాటలు నిజమవుతాయని చిందంబరం ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనీ, లేదంటే రాజీనామా చేయాలని ఆర్బీఐ గవర్నర్ కు స్వదేశీ జాగ‌రణ్ మంచ్‌ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే.
 

17:46 - November 3, 2018

2.ఓ అఫీషియల్ ట్రైలర్‌ని, చెన్నైలో నేషనల్, రీజనల్ మీడియా మరియు, మూవీ యూనిట్ సమక్షంలో, అంగరంగ వైభవంగా రిలీజ్ చేసారు.  తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల అయిన ట్రైలర్స్‌కి హ్యూజ్ రెస్పాన్స్‌వస్తోంది. ఒక్క చెన్నైలోనే కాక, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, యూఎస్ఏ, యూకే, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా వంటి పలు దేశాల్లో, వివిధ సమయాలలో రిలీజ్ చెయ్యడం విశేషం. కేవలం ట్రైలర్‌నే ఈ స్ధాయిలో విడుదల చెయ్యడం, రికార్డ్  అనే చెప్పాలి.  సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఇండియాతో పాటు, విదేశాల్లో సైతం అభిమానులున్నారనే సంగతి తెలిసిందే.  లైకా ప్రొడక్షన్స్‌‌దాదాపు రూ. 600 కోట్లతో నిర్మించిన 2.ఓ, నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్‌గా రిలీజ్ అవబోతోంది. 

వాచ్,  2.ఓ అఫీషియల్ ట్రైలర్‌ [తెలుగు]..

17:25 - November 3, 2018

హైదరాబాద్ : మహా కూటమి సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, జనసమితి, టీడీపీ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయా పార్టీల నేతలు హస్తినకు వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. సీట్ల సర్దుబాటు కుదరలేదని..మహాకూటమి నుండి పార్టీలు బయటకొస్తాయని ప్రచారం జరిగింది. కానీ దీనిని కాంగ్రెస్ ఖండించింది. 
శనివారం మహా కూటమి నేతలు ఉత్తమ్, రమణ, కోదండరాంలు భేటీ అయ్యారు. నగర శివారులోని ఓ ప్రాంతంలో ఈ భేటీ కొనసాగుతోందని తెలుస్తోంది. సీట్ల తుది సంఖ్యపై తేల్చాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. 95 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 14, టీజేఎస్, సీపీఐ చెరో 10 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. దీనికి సీపీఐ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. తమకిచ్చే సీట్లను పెంచాలని టీజేఎస్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి కూటమి లెక్కలు తేలుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

17:10 - November 3, 2018

అమెరికా: ఆయన ఒంటి పేరు ఉక్కుమనిషి.. ఇంటిపేరు సాహసం.. ధైర్యానికి, తెగువకు మారుపేరు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ ప్రప్రథమ హోం మంత్రికి సముచిత గౌరవం దక్కింది. గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పటేల్‌ విగ్రహం కొలువుదీరింది. 182 అడుగుల(దాదాపు 600 అడుగులు) పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విగ్రహంగా దీన్ని రూపొందించారు.

కాగా పటేల్ గొప్పదనం ఖండాంతరాలను తాకింది. ప్రపంచవ్యాప్తంగా పటేల్ గురించి, ఆయన విగ్రహం గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికాలోని ప్రముఖ దినపత్రిక వాషింగ్టన్ పోస్టులో సైతం ఈ విగ్రహంపై కథనం వచ్చింది. పటేల్ సాధించిన విజయాల గురించి, ఉక్కుమనిషి విగ్రహం విశిష్టతల గురించి ఆ కథనంలో రాసుకొచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 565 సంస్థానాలను తిరిగి భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతా సారథిగా పటేల్ దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో తెలిపింది.

కేవలం 36 నెలల కాలంలోనే గుజరాత్‌లో నర్మదానది తీరాన ఈ విగ్రహాన్ని నిర్మించారు. నిర్మాణ వేగం, నాణ్యత, భారీతనంతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే కాకుండా, దేశీయ సాంకేతికత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. 182మీటర్ల ఎత్తుతో రూపొందించిన ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా నిలిచింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం ఎత్తు రెండురెట్లు ఎక్కువ.

16:50 - November 3, 2018

మహారాష్ట్ర : కోరుకున్న పాపులర్ బ్రాండ్స్ సిగరేట్లు కావాలంటే దుకాణాలకు వెళ్లాల్సినవసరం లేదు. నేరుగా ఇంటికే పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రలో త్వరలో ఇది అమలు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే మోడల్ మేఘా శర్మ చేసిన ఉదంతం తెలిసిందే. ముంబైలోని కీలక ప్రాంతాలు బాంద్రా, వర్లి, కొలబా ఇతర ప్రాంతాలను మొదట ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 జనవరి 1వ తేద నుండి దీనిని ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
Image result for Maharashtra Govt Doorstep Delivery Of Cigarettesముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్న మోడల్ మేఘా శర్మ అక్టోబర్ 25 అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు అలోక్‌కు ఫోన్ చేసింది. కానీ అతను నిరాకరించడంతో మేఘా శర్మ తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనితో ఘర్షణకు దిగింది. అలోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి మగ పోలీసులు చేరుకున్నారు. స్టేషన్ కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీనికి మేఘా శర్మ నిరాకరించింది. అది కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేనందున పోలీస్ స్టేషన్‌కు తెల్లారగానే వస్తానని చెప్పింది. అయినా పోలీసులు వినకపోవడంతో వేసుకున్న దుస్తులను మేఘా శర్మ తొలగించింది. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మరి మహా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాటి వివాదం చెలరేగుతుందో చూడాలి. 

16:42 - November 3, 2018

విజయవాడ: అవినీతిర‌హిత, బాధ్య‌త‌తో కూడిన వ్య‌వ‌స్థ నిర్మాణానికి ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు ప‌ని చేస్తాన‌ని, అందుకు మీ అంద‌రి స‌హాయ, స‌హ‌కారాలు అవ‌స‌ర‌మ‌ని జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్న‌వ‌రంలో తుని నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పవన్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ... చాలా బాధ్య‌త‌తో కూడిన పొలిటిక‌ల్ పార్టీ న‌డుపుతున్నామన్నారు. 'మీకు సినిమా యాక్ట‌ర్‌గా తెలిసి ఉండొచ్చు, ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకోవ‌చ్చు. నేను మాత్రం ఏదీ స‌ర‌దాగా తీసుకోవ‌డం లేదు. జ‌న‌సేన పార్టీ ఒక్క ఎన్నిక‌ల కోసం పుట్టిన పార్టీ కాదు. మేం ఎంత బాధ్య‌త‌గా ఉన్నామో, కార్య‌క‌ర్త‌లు కూడా అంతే బాధ్య‌త‌తో ప‌ని చేయాలి. స‌రికొత్త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని తీసుకురావాలి. అరుపులు కేక‌లు కాదు, పార్టీ విధివిధానాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ పెట్టాల‌న్న నిర్ణ‌యం ఇప్ప‌టిది కాదు. 2003లోనే రాజ‌కీయాల్లోకి వెళ్ల‌బోతున్నా అని నా త‌ల్లికి చెప్పా. సినిమాలు చేసుకోక ఎందుకు అంది. నాకు సినిమాల మీద మ‌మ‌కారం లేదు. సినిమాల్లో ఓ స‌మ‌స్య మీద అవగాహ‌న మాత్రమే క‌ల్పించ‌గ‌లం. స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌లేం. సినిమాలు చేస్తూ ఉద్ధానం స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌గ‌లమా.? సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌కి సిద్ధ‌మ‌య్యా. 15 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు నా త‌ల్లి న‌న్ను ఆశీర్వ‌దించింది. నా త‌ల్లి న‌న్ను దేశ ప్ర‌జ‌ల‌కి ద‌త్త‌త ఇచ్చేసింది. 'వీడు దేశం బిడ్డ' అని. నువ్వు నా బిడ్డ‌వి కాదు, నీది పెద్ద కుటుంబం, నువ్వు దేశానికి సంబంధించిన వ్య‌క్తివి అంటూ మ‌న‌స్ఫూర్తిగా ఆశీర్వ‌దించింది. నాకు మ‌ద్ద‌తు ఇస్తూ పింఛన్ డ‌బ్బు నుంచి రూ.4 ల‌క్ష‌లు ఆఫీస్‌కి వ‌చ్చి ఇచ్చింది. 
2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కోపం, ఆవేద‌న వ‌చ్చాయి. తోటి ఆంధ్రులపై చ‌ట్ట‌స‌భ‌ల్లో దాడులు చేసి బ‌య‌టికి గెంటేసి విభ‌జించారు. అందుకే కోపం వ‌చ్చింది. 

ఒక్క సంత‌కంతో తెలంగాణ‌లో ఉన్న బీసీ కులాలు, ఓసీలుగా మారిపోయాయి. వారికి ఉన్న స‌దుపాయాలు, రిజ‌ర్వేష‌న్లు పోయాయి. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటే, విబేధించి బ‌య‌టికి వ‌చ్చా. తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చా. ఇంత చేస్తే ముఖ్య‌మంత్రి వెళ్లి కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకున్నారు. టీడీపీ నాయ‌కుల్ని పార్ల‌మెంటులో కొట్టారు, ఎంపి శివ‌ప్ర‌సాద్ కొర‌డాల‌తో కొట్టుకున్నారు. నెహ్రూ లాంటి నాయ‌కులు కూర్చున్న పార్ల‌మెంటు హాల్లో, వ్యాపారులు ఎంపిలుగా కూర్చుంటే వ్య‌వ‌స్థ ఇలాగే వుంటుంది. ఓ వ్య‌క్తి గురించి మాట్లాడితే ఆ కులం వారు ఓటు వేయ‌రు అంటారు. త‌ప్పులు చేసి కులాల ముసుగులో దాక్కోవాల్సిన అవ‌స‌రం ఏముంది.? స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ప్ర‌జా కోర్టులో నిల‌బెడ‌తాం. తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు చాలా మంది వ్య‌తిరేకించారు. చంద్ర‌బాబు వాడుకుని వ‌దిలేస్తారు అన్నారు. అయితే అప్ప‌ట్లో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి ఆయ‌నే కావ‌డంతో, ఎక్క‌డో చిన్న‌పాటి న‌మ్మ‌కం. చంద్ర‌బాబు నుంచి గొప్ప వ్య‌క్తి బ‌య‌టికి వ‌స్తాడేమోన‌ని న‌మ్మా. వాల్మీకిని యోగిగా మార్చొచ్చు, వేమ‌న‌లోని భోగాన్ని అణ‌చ‌వ‌చ్చు గానీ, చంద్ర‌బాబుని మాత్రం మార్చ‌లేమ‌ని అర్ధ‌మ‌య్యింది. మ‌నం మాత్రం అంద‌ర్నీ మార్చేద్దాం. పంచాయతీ స్థాయి నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు అన్ని కులాల‌కీ, మ‌తాల‌కీ బ‌లంగా ప‌నిచేసే వ్య‌క్తుల్ని తీసుకొద్దాం. మ‌నం రూపొందించే పాల‌సీలు కింది స్థాయి వ‌ర‌కు వెళ్లాలి. జ‌న‌సేన నాయ‌కులు కులాల‌ని ముందు పెట్టి మాట్లాడ‌వ‌ద్దు. ఇక్క‌డ అన్ని కులాలు స‌మానం. ఒక కులానికి పెద్ద పీట వేయ‌డం జ‌ర‌గ‌దు. 

నేను అంబేద్క‌రిజాన్ని న‌ర‌న‌రానా జీర్ణించుకున్నా. పార్టీ నాయ‌కులు ఎవ‌రైనా శృతిమించి మాట్లాడి ఉంటే స‌రి చేసుకోండి. ఓట‌మి ఎదురైనా పార్టీ విలువ‌ల్ని మాత్రం వ‌దులుకోం. జ‌నానికి కావాల్సింది 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల జీవితం. అది ఇచ్చేందుకు జ‌న‌సేన సిద్ధంగా ఉంది. తుని దుర్ఘ‌ట‌న రాష్ట్ర చ‌రిత్ర‌లోనే చెరిగిపోని మ‌చ్చ‌. అన్ని ల‌క్ష‌ల మంది ఒక చోటుకి చేరుతున్నారంటే, ప్ర‌భుత్వం ఆ స‌మ‌స్య గురించి వారితో మాట్లాడాలి. దుర్ఘ‌ట‌న జ‌రిగే వ‌ర‌కు ఎందుకు ఊరుకున్నారు.?  రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల‌నే వ‌దిలేసిందా.? ధ‌వ‌ళేశ్వ‌రం క‌వాతులో బ్రిడ్జి మీద పోలీసులు లేరు. మూడు రోజుల ముందు తీసుకున్న అనుమ‌తిని మూడు గంట‌ల ముందు ర‌ద్దు చేశారు. అంటే జ‌నం తొక్కుకుని చ‌చ్చిపోమ‌నా అర్ధం. ఇలాంటి వ్య‌వ‌స్థ‌ల‌ని మార్చాలి. పంచాయతీ స్థాయి నుంచి బాధ్య‌త‌తో ప‌ని చేసే వ్య‌క్తులు కావాలి. అడ్డ‌గోలుగా వ‌చ్చే గెలుపు వ‌ద్దు.  శ్వేత‌జాతీయుడు బారిస్ట‌ర్ చ‌దువుకున్న వ్య‌క్తిని రంగు త‌క్కువ‌ని రైలు కంపార్ట్‌మెంట్ నుంచి గెంటేస్తే, అత‌ను భార‌త దేశం నుంచి బ్రిటీష్ వారిని గెంటేస్తాడ‌ని ఎవ‌రైనా ఊహించారా? మ‌నిషి శ‌క్తి అలాంటిది. మీలో ఉన్న శ‌క్తిని బ‌య‌టికి తీయండి. రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో స‌రికొత్త మార్పు తీసుకురండి. అవినీతి లేని వ్య‌వ‌స్థ‌, ప‌ని కోసం ప్ర‌భుత్వ కార్యాల‌యానికి వెళ్తే లంచం అడ‌గ‌ని వ్య‌వ‌స్థ ఉండాలి. రుణాల కోసం వెళ్లే మ‌హిళ‌ల‌ని కూర్చొపెట్టి అప్పు ఇచ్చే వ్య‌వ‌స్థ ఉండాలి. దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చా. ఆ క‌ష్టాలు నాకు తెలుసు" అని పవన్ అన్నారు. 

16:37 - November 3, 2018

మహారాష్ట్ర : మనిషి మానవత్వాన్ని విడిచి దానవత్వంలోకి పోతున్నాడా? ఆది మానవుడుగా తిరోగమనంలోకి పోతున్నాడా? మనిషి ప్రాణం కంటే వస్తువులకు, ఆస్తులకు విలువనిస్తున్నాడా? సాటి మనిషి ప్రాణం పోతున్న సమయంలో కూడా స్వార్థంలో పడిన మనిషి దానవుడుగా మారిపోతున్నాడు. దీనికి ఎన్నో రోడ్డు ప్రమాదాలు సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సాటి మనిషి ప్రాణాల కోసం కొట్టుకులాడుతుంటే..అది మరచి సెల్ఫీలు తీసుకోవటమే టెక్నాలజీకి నిదర్శనమా? అని అనుమానం రాక మానదు. ప్రమాదానికి లోనైన మనిషి ప్రాణాలు కాపాడాల్సింది పోయి మనకెందుకులే అనుకుని వెళ్లిపోయేవారు కొందరైతే..ప్రమాదంలో ఉన్న వ్యక్తి దగ్గరి వస్తువులు తీసుకుని వెళ్తుంటారు మరికొందరు.

Image result for onion truck accident రోడ్డు ప్రమాదం జరిగి ఓ ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. అతడ్ని ఏమాత్రం పట్టించుకోని జనం ఆ ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పుణె నుంచి ఉల్లి లోడ్‌తో ముంబయి వెళ్తున్న ఓ ట్రక్కు లోనావ్లా ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వాల్వన్‌ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి పుణె-ముంబయి పాత హైవేపై పడింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే అక్కడ గుమిగూడారు. అయితే వారి దృష్టి గాయపడిన డ్రైవర్‌ మీద కాకుండా ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డల మీద పడింది.
ఇంకేముంది డ్రైవర్‌ను పట్టించుకోని స్థానికులు తమకు దొరికినన్ని ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉల్లిగడ్డల ట్రక్కు బోల్తా పడిందన్న వార్త దావానలంలా వ్యాపించిందని, దీంతో స్థానికులు సంచులు తెచ్చుకుని మరి ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

16:20 - November 3, 2018

అన్నవరం: డ్వాక్రా సంఘాలను పాలక పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని జనసేన తప్పుపట్టింది. అధికార పార్టీ చెప్పినట్టు వినే వారికే రుణాలు ఇచ్చే పరిస్థితి రావడం దారుణం అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వస్తే ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో డ్వాక్రా సంఘాలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే డ్వాక్రా రుణాలు రావడం లేదని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై చలించిన పవన్.. స్వయం సహాయక బృందాలకు ఇలాంటి దుస్థితి దాపురించడం బాధాకరం అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే పార్టీలకు అతీతంగా ఆడపడుచులకు అండగా ఉంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

16:16 - November 3, 2018

 2.ఓ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురు చూసిన సినీ అభిమానుల  కోరిక ఈరోజు తీరిపోయింది. 2.ఓ ట్రైలర్‌ని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో, మూవీ యూనిట్  రిలీజ్ చేసింది.  ట్రైలర్‌ లాంచ్ కోసం పెద్ద ఎత్తున లైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. పలువురు సెలబ్రెటీల స్పందన తెలుసుకోవడానికి, స్క్రీన్‌పై, ఆన్‌లైన్ ప్రొజెక్ట్‌చేసిన వీడియోలు ప్లే చేసారు. ఒక వీడియోలో దర్శక ధీరుడు రాజమౌళి, శంకర్2కి తన అభినందనలు తెలియచెయ్యడంతో పాటు, ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. అందరిలానే, నేను కూడా 2.ఓ ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సందర్భంగా శంకర్ సర్‌ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంత పెద్ద కాన్వాస్‌పై, రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. అలాంటి భారీ మూవీ చేస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఎలా హ్యాండిల్ చేసారు అని అడిగాడు. దానికి శంకర్ తన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసాడు. మోర్ వర్క్‌చెయ్యడమే నా పద్ధతి, నచ్చిన పని చేసేటప్పుడు నాకు ప్రెజర్ అనిపించదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్‌ అయినా, నేనే అలాగే పని చేస్తాను అంటూ, చివర్లో.. నేను రాజమౌళి సర్‌‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విధానం చూస్తే, అంతగా ఒదిగి ఉంటారు కాబట్టే,  శంకర్, రాజమౌళిలు దేశం గర్వించదగ్గ దర్శకులయ్యారు అనిపిస్తుంది.

 

16:03 - November 3, 2018

చైనా : అభివృద్దిలో దూసుకుపోతున్న దేశం. ప్రపంచలోనే అంత్యంత అధిక జనాభా వున్నా టెక్నాలజీలో కూడా మాదే పైచేయి అంటోంది చైనా. బిగ్గెస్ట్ నిర్మాణాలే కాదు స్మార్ట్ లోను మేమే స్మార్ట్ అంటోంది చైనా. గత కొంతకాలంగా శామ్‌సంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే వీటన్నింటిని అధిగమించి రాయొలే ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. 7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. 
బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు
20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌
16మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కెమెరాలు
రెండు కెమెరాలు బ్యాక్ సైడ్ 
20మెగాపిక్సెల్‌ కెమెరా సెల్ఫీ కెమెరా

ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌
6జీబీ లేదా 8జీబీ ర్యామ్‌
128జీబీ/256జీబీ/512జీబీ అంతర్గత మెమొరీ
3,800ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 
అయితే మడతబెట్టినప్పుడు 20మెగాపిక్సెల్‌ కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ చెబుతోంది.

ఇప్పటికే అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,318 డాలర్లు, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,469డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబరులో ఫోన్ల డెలివరీ చేయనున్నారు. మరి ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో వేచిచూడాలి. కొత్తగా ఏది వచ్చినా ముందుగా భారత్ లోనే ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది. మరి భారత్ లోని స్మార్ట్ ప్రియులను ఈ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ ఎంతరవకూ ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం.
 

15:43 - November 3, 2018

లండన్: ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రత మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. కేంబ్రిడ్జి అనలిటికా వివాదంతో చిక్కుల్లో ఉన్న ఫేస్‌బుక్ లో గత నెలలో దాదాపు 3కోట్ల మంది వ్యక్తిగత డేటా లీకైనట్లు ఒప్పుకుంది. 2017 జులై నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఉన్న ఫేస్‌బుక్ కోడ్‌లో లోపం వల్ల హ్యాకింగ్ జరిగినట్లు, దాన్ని అప్పట్లో సరి చేసినట్లు ఫేస్‌బుక్‌ యాజమాన్యం తెలిపింది. తాజాగా ఫేస్‌బుక్‌లోని 12కోట్ల యూజర్ల డేటాను హ్యాక్ చేసి వారి ప్రైవేట్ మెసేజ్‌లు దొంగిలించి అందులోని 81వేల మంది వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్ధ ఈ విషయాన్ని బయటపెట్టింది. 

తమ వద్ద ఉన్న 12కోట్ల ఎఫ్‌బీ అకౌంట్ మెసేజ్‌లు అమ్ముతామని ఓ ఇంటర్‌నెట్ ఫోరమ్‌లో పోస్ట్ చేయడంతో కలలకం చెలరేగింది. వారి వద్ద ఎఫ్‌బీ యూజర్ల మెసేజ్‌లు ఉన్నాయని తెలిపేందుకు శాంపిల్‌గా 81వేల ఖాతాల వివరాలను అప్‌లోడ్ చేశారు. ఒక ఖాతాను 10 సెంట్స్ చొప్పున హ్యాకర్లు అమ్ముతున్నారు. వెబ్‌సైట్ భద్రతా వ్యవస్ధలోని ఓ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు  ఫేస్‌బుక్‌లోని 5కోట్ల ఖాతాదారుల సమాచారం ఉన్న యాక్సెస్ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేశారు. ఖాతాదారుల వివరాలు ఫోన్ నెంబర్లు చిరునామా వంటి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తెలుసుకున్నారు. వారి పర్సనల్ మెసేజ్‌లు కూడా చోరీ చేసినట్లు చెప్పటానికి తమ వద్ద ఉన్న వాటిలోంచి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన శృంగార సంభాషణను హ్యాకర్లు పోస్టు చేశారు. ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన యూజర్లతో పాటు యూకే, అమెరికా, బ్రెజిల్‌ దేశాల ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత సందేశాలను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ యూజర్ల సమాచార భద్రతకు ఎటువంటి ఢోకా లేదని ఫేస్‌బుక్ చెపుతోంది. హ్యాకర్లు ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మెసేజ్‌లు పోస్ట్ చేసిన వెబ్‌సైట్‌ను తొలగించాలని స్ధానిక అధికారులు, న్యాయశాఖ సిబ్బందిని కోరినట్లు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది..

15:35 - November 3, 2018

ఢిల్లీ : ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలకు భయపడి వాహనాలను మూలన పెట్టేసిన వాహన ప్రియులకు మంచి రోజులొస్తున్నట్లుగా కనిపిస్తోంది పెట్రోల్ రేట్లు రోజు రోజుకు తగ్గుతుండటం చూస్తుంటే.రయ్ మంటు బైక్ పై దూసుకెళ్లిపోవచ్చు..జామ్ అంటు కారులో చక్కర్లు కొట్టొచ్చు. గత 20 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. సామాన్యుడి మొములో మళ్లీ చిరునవ్వు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు ఆకాశాన్ని అంటుకునే పెరగుతు పోతుండంతో సామాన్యుడు విలవిలలాడిపోయాడు. కానీ 20 రోజుల నుండి ధరలు రోజు రోజుకు తగ్గుతుండంతో హాయి కొంతవరకూ ఊపిరి తీసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో ఈరోజు లీటరు పెట్రోల్‌ 19 పైసలు తగ్గి రూ.78.99కి చేరింది. నిన్న రూ.79.18గా ఉంది. నేడు లీటరు డీజిల్‌ ధర 11 పైసలు తగ్గి రూ.73.53కు చేరింది. నిన్న డీజిల్‌ ధర రూ.73.64గా ఉంది. గత పదిహేను రోజుల్లో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.3.28గా తగ్గగా, డీజిల్‌పై రూ.1.84 తగ్గింది.
ముంబయి లో 19 పైసలు తగ్గి రూ.84.49కి చేరింది. డీజిల్‌ ధర 12 పైసలు తగ్గి రూ.77.06గా ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.82.06, రూ.80.89గా ఉండగా, డీజిల్‌ ధరలు రూ.77.73గా, రూ.75.39గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 83.75గా ఉండగా.. డీజిల్‌ రూ.80కి చేరుకుంది. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌ ధర 86 డాలర్ల నుంచి 72.57డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా కూడా రెండు నెలల పాటు విపరీతంగా పెరిగిపోయిన చమురు ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.
 

15:16 - November 3, 2018

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుండే సమస్యలు వస్తున్నాయి. అంతర్గత విబేధాలు...పార్టీ నేతల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. దీనితో పార్టీ పరువు కాస్తా బజారున పడుతోంది. తాజాగా మిర్యాలగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. టికెట్ తమకంటే తమకే కేటాయించాలంటూ ఆశావాహులు ఆందోళన చేశారు. స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎదుటే ఈ రచ్చ జరగడం విశేషం. 
సమావేశానికి సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో జానారెడ్డి ఎదుటే అమరేందర్ రెడ్డి, శంకర్ నాయక్ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న అమరేందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనితో మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఆందోళన చేపట్టారు. పార్టీ మారిన వారికి కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానికులకే టికెట్ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. టికెట్ కోసం స్కైలాబ్ నాయక్, శంకర్ నాయక్, అమరేందర్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

14:58 - November 3, 2018

ప్రకాశం : జాతీయ మూడో ఫ్రంట్ కు తెర తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ, వైసీపీ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వరజమెత్తారు. ఒంగోలులో రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన హామీల ప్రకారం విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా అభివృద్ధికి అవరోధం కల్పిస్తోందని తెలిపారు. విభజన చట్టాన్ని అమలు చేయకపోగా రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.  దీంతో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి డిమాండ్ చేసిన ప్రజా ప్రతినిధులపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందనీ.. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం. అడుక్కుంటే లాభం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనది. మనది ఒక వ్యవస్థ. దేశానికి సమస్య వచ్చినప్పుడు దారి చూపే పార్టీ మనది. ధర్మంకోసం, న్యాయం కోసం పారాడుతాం. ఎవరికి భయపడను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Image result for chandrababuవచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉం డాలి. కోడికత్తి, జెల్లికట్టు, పోలవరం కాలువలు తెగొట్టడం, అసెంబ్లీకి రాకపోవటం, పార్లమెంట్‌లో రాజీనామాలు చేయటం మనకు తయారైన ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓటు వేసే బాధ్యత మీది...జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శినిలో సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.

14:21 - November 3, 2018
కామారెడ్డి : ఓట్ల కోసం రాజకీయ నేతలు పడరాని పాట్లు పడతారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగేవారు కొందరైతే.... డప్పు కొట్టి, డ్యాన్స్‌ చేసేవారు ఇంకొందరు. కానీ ’నాకు ఓటు వేయకండి’ అని మైకుపట్టి ప్రచారం చేస్తున్నాడు ఓ అభ్యర్థి. అంతేకాదు ఓటు వేయవద్దని ప్రచార రథానికి సైతం బ్యానర్లు కట్టుకని మరీ గ్రామాల్లో తిరుగుతున్నాడు.
 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి భారత్‌ వాగ్మారే వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. నాకు ఓట్లు వేయకండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ’ఓటు వేయకండి... కాని ఒక్కసారి నా స్పీచ్ విని నిర్ణయం తీసుకోండి’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతే కాదు ప్రచార రథానికి సైతం ఓటు వేయవద్దనే బ్యానర్‌ను కట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు.
 
తాను డబ్బులు, మద్యం పంపిణీ చేయనని భారత్‌ వాగ్మారే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే.. రెడ్డి సీఎం అవుతారని.. టీఆర్‌ఎస్‌కు వేస్తే వెలమ ముఖ్యమంత్రి అవుతారని.. అదే బీఎల్‌ఎఫ్‌కు ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని భారత్‌ వాగ్మారే చెప్పుకొచ్చారు.
 
ఇంతగా చెప్పిన వాగ్మారే.. రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ గెలిచే స్థానాలు 20 మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం వస్తే.. తామే కింగ్‌ మేకర్‌మవుతామని చెప్పుకొచ్చారు. కర్నాటకలో వచ్చిన పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందని వాగ్మారే కలలు కంటున్నారు. మొత్తానికి తనకు ఓటు వేయవద్దంటూనే.. భారీ మెజార్టీతో గెలుస్తానని వాగ్మారే చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. 
14:06 - November 3, 2018

ఖమ్మం : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో రాజకీయాల్లో చెప్పడం కష్టం. ఇప్పుడు అదే ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. మూడు దశాబ్దాలపాటు ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండబోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి, ఇప్పుడు బహిష్కృత నేత అయిన జలగం ప్రసాద్‌రావు కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఇవాళో లేక ఎల్లుండో ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఆయన ఎదురు చూశారు. అయినా ఆ పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్‌ను కలిసి తన చేరికను ఫైనల్‌ చేసుకున్నారు. జలగం, తుమ్మల కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో ఉంటే... జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

14:00 - November 3, 2018

2.ఓ. ట్రైలర్ కోసం, రజనీ అభిమానులతో పాటు, సినీ వర్గాలవారు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ, ఈరోజు, 2.ఓ. 3డి ట్రైలర్‌ని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో, చెన్నెలోని సత్యం సినిమాస్‌లో మూవీ యూనిట్  రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ.లో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా,  అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై, సుభాస్కరన్, భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. 
2.ఓ. ట్రైలర్ అద్భుతంగా ఉంది. శంకర్, ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం, నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల పనితీరు కలగలసిన 2.ఓ. ట్రైలర్ చూస్తుంటే, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది. కథ విషయంలో గందరగోళం లేకుండా, ఒక రకంగా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. భవిష్యత్తులో టెక్నాలజీ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అక్షయ్ కుమార్ చేత, సెల్‌ఫోన్ వాడుతున్నవాళ్ళంతా హంతకులే అని చెప్పించాడు. ఐ యామ్ చిట్టీ, రీలోడెడ్, వెర్షన్ 2.ఓ. అంటూ,  రజనీ అదరగొట్టేసాడు. విజువల్ ఎఫెక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సెల్‌ఫోన్లన్నీ సునామీలా వచ్చే షాట్, అక్షయ్, పక్షిలా చేసే విన్యాసాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 2.ఓ. ధియేట్రికల్ ట్రైలర్‌‌కి ఏ.ఆర్.రెహమాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్  ఓ రేంజ్‌లో ఉంది. హ్యాపీ దివాళి ఫోక్స్‌అన్నట్టు, దీపావళికి నాలుగురోజుల ముందే ట్రైలర్ ద్వారా, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలియచేసింది, 2.ఓ. టీమ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఎత్తున 2.ఓ. ట్రైలర్‌ ట్రెండ్ అవుతోంది.  

 

13:48 - November 3, 2018

యూపీ: తమిళ తలైవాస్‌ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యూపీ యోధాను చిత్తు చేసింది. 46-24 పాయింట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ జట్టు.... జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.

ప్రొ - కబడ్డీ 2018 సీజన్‌ సిక్స్‌లో తమిళ్‌ తలైవాస్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను మట్టికరిపించి అదుర్స్‌ అనిపించింది. ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓటమిపాలైంది. మళ్లీ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో తమిళ జట్టు ఫామ్‌లోకి వచ్చింది.

తమిళ్‌ తలైవాస్‌ జట్టు రాత్రి యూపీ యోధాతో తలపడింది. మొదట ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగినా ఆ తర్వాత తమిళ్‌ తలైవాస్‌ ఆధిపత్యం సాధించింది. అదే ఊపును చివరి వరకు కంటిన్యూ చేసి 46-24 పాయింట్ల తేడాతో యూపీ యోధాను చిత్తు చేసింది. సొంతగడ్డప జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 

మ్యాచ్‌ ప్రారంభం నుంచే తడబడిన యూపీ జట్టు ఫస్టాఫ్‌ ముగిసే సరికి 11-26 పాయింట్లతో వెనుకబడి పోయింది. తలైవాస్‌ జట్టు ఫస్టాఫ్‌లో సాధించిన ఆదిక్యంతో మరింత దూకుడుగా ఆడి విజయం సాధిందించింది. తలైవాస్‌ జట్టులో అజయ్‌ ఠాగూర్‌, కుఖేష్‌హెగ్డే చెరో 9 పాయింట్లతో చెలరేగారు.

మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ , జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడ్డాయి. పింక్‌ పాంథర్స్‌పై గుజరాత్‌ జట్టు 36-25 స్కోరుతో విజయం సాధించింది. ఆరంభంలో మ్యాచ్‌ హోరాహోరీగా సాగినా... ఆ తర్వాత వన్‌సైడ్‌గా జరిగింది. గుజరాత్‌ ధాటికి జైపూర్‌ జట్టు విలవిల్లాడిపోయింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌లో అనిల్‌కుమార్‌, దీపక్‌‌హుడా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయారు. గుజరాత్‌ టీమ్‌లో సునీల్‌‌కుమార్‌ 8 రైడ్‌ పాయింట్లు సాధించాడు.

13:38 - November 3, 2018

హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడంపై రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ భేటీపై పలు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ ను విమర్శించిన బాబు నేడు కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. శనివారం ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి మౌనదీక్ష చేపట్టారు. 
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందని, కానీ బాబు సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి, ఎన్నికల ముందు కాంగ్రెస్ తో జతకట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని, దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశాలుంటే పరిశీలిస్తానన్నారు. 

13:35 - November 3, 2018

కర్నూలు : విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన టీచర్‌ శంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై దాడి చేసిన శంకర్‌ను సస్పెండ్ చేయాలని స్కూల్ యాజమాన్యానికి మంత్రి గంటా శ్రీనివాస్ అదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరపాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో శంకర్‌ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

కర్నూలు జిల్లాలోని రాక్డ్ స్కూల్ లో హిందీ టీచర్ గా శంకర్ పనిచేస్తున్నారు. అదే స్కూల్లో ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిన శంకర్ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన అనంతరం అదే బ్లేడ్ తో శంకర్ కూడా గొంతు కోసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినిపై దాడి చేసిన సమయంలో శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ప్రజలు శంకర్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

13:12 - November 3, 2018

హైదరాబాద్: దేశం కోసం అంటూ కాంగ్రెస్-టీడీపీలు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కాగా టీడీపీ-కాంగ్రెస్ కలయికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం, ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడంపై పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌తో కలవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.

తాజాగా రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. 'స్టాచ్యూ ఆఫ్ పిటీ' పేరుతో ఓ కార్టూన్‌ని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహంపై కప్పిన శాలువాను తీసి  రాహుల్‌కు చంద్రబాబు ఇస్తున్నట్టు అందులో ఉంది. ఇక తన పోస్టులో అవకాశవాద రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ తీరుని ఎండగట్టారు. తెలుగు ప్రజలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వివక్ష చూపింది, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తీరుని పవన్ అందులో ప్రస్తావించారు. పాలకుల కారణంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే.. ఏపీ ప్రజలను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజకీయాల్లో ఉన్న కొందరు వ్యాపారవేత్తలు వారి స్వార్థం కోసం ఏపీని విభజనకు సహకరించారని పవన్ ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మన ఎంపీలపై దాడి చేసి వారిని బయటకు తోసేశారని, దాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మర్చిపోలేరని పవన్ అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం పని చేస్తే వేర్పాటువాద ఉద్యమాలు పెరిగిపోతాయని గతంలోనే నరేంద్ర మోడీకి సైతం చెప్పానని పవన్ గుర్తు చేశారు. ఈ క్రమంలో అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించకూడదని రాహుల్ గాంధీకి పవన్ విజ్ఞప్తి చేశారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

13:10 - November 3, 2018

తూర్పుగోదావరి : అన్నవరంలో జనసేన నిర్వహిస్తున్న డ్వాక్రా ఆత్మీయ సమ్మేళనం కొనసాగుతోంది. ఈ సమ్మేళనంలో పలువురు మహిళా సంఘాలు ఆవేదన తెలియచేస్తున్నారు. పిఠాపురం నుండి కుమారపురం నుండి వచ్చిన నాగమంగాదేవి ఏపీ విద్యాశాఖ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 
మధ్యాహ్న భోజన పథకం డ్వాక్రా మహిళలకు అప్పచెప్పారని, కానీ సడెన్ గా బెండపూడి ఆశ్రమానికి పథకాన్ని అప్పచెప్పారన్నారు. దీనితో ఎంతో మంది మహిళలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ. 1000 ఇచ్చినా మహిళలు పని చేస్తున్నారని, గత మూడు రోజుల నుండి కొనసాగుతున్న ప్రభుత్వం స్పందన వ్యక్తం చేయడం లేదని తెలిపారు. ఈ విషయంపై మాట్లాడడానికి బెండపూడి ఆశ్రమానికి తాము వెళ్లడం జరిగిందన్నారు. ‘విద్యాశాఖ మంత్రి తనింట్లో మూడు రోజులు ఉన్నారని...జీడిపప్పుతో భోజనం పెట్టానని..మూడు రోజుల పాటు తీర్థయాత్రలు చేయించానని..ఇందుకు రూ. 30వేలు ఖర్చయ్యిందని...తాను దరఖాస్తు పెట్టుకున్నానని’ మేడం తెలియచేశారని పవన్ ఎదుట పేర్కొన్నారు. 

13:10 - November 3, 2018

హైదరాబాద్ : జీరో మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లోనే ట్రైలర్‌కు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా జీరో.  కలర్ ఎల్లో ప్రొడక్షన్ సమర్పణలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై, షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్ లాంటి అంశాలతో రూపొందించిన జీరో మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ ట్రైలర్‌తో అభిమానులకు బర్త్‌డే ట్రీట్ ఇచ్చాడు కింగ్ ఖాన్.  క్రిస్మస్ కానుకగా, డిసెంబర్ 21న జీరో మూవీ రిలీజ్ కానుంది.

12:51 - November 3, 2018

కరీంనగర్ : కోదండరాంకు టీఆర్ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సవాల్ విసిరారు. దమ్ముంటే కోదండరాం రామగుండంలో పోటీ చేయాలన్నారు. ఈమేరకు రామగుండంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. గెలిస్తే కోదండరాంపైనే గెలవాలన్నారు. 

 

12:48 - November 3, 2018

దర్శకుడు రాజమౌళి, బాహుబలి రెండు పార్ట్‌‌ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు. దాదాపు, రూ. 300 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఈ మూవీని నిర్మించబోతున్నాడు నిర్మాత డి.వి.వి.దానయ్య. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడీ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడనేది ప్రకటించింది చిత్ర బృందం. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కొబ్బరికాయ కొడతారట. పదకొండవ నెల, పదకొండవ తారీఖు, పదకొండు గంటలకి ముహూర్తం భలే సెట్ చేసారు. ఈ సినిమా కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ల సరసన ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలని ఫిక్స్ చేసాడని తెలుస్తుంది. ఈనవంబర్ 11న క్లాప్‌తో మొదలవనున్న ఈ సినిమా, 2020 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తారక్, చెర్రీ కలిసి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్) ‌కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.. 
ఎమ్.ఎమ్.కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతుండగా, కె.కె.సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తాడు.

 

12:45 - November 3, 2018

తూర్పుగోదావరి : ఏపీ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన పోరు యాత్ర పేరిట ప్రజలను కలుసుకుంటున్నారు. శుక్రవారం రైలు యాత్ర ద్వారా వివిధ రంగాల ప్రజలను కలుసుకున్న పవన్...శనివారం అన్నవరంలో డ్వాక్రా మహిళలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గౌరీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమ్మేళానికి పలు ప్రాంతాల డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. మహిళల సమస్యలు...పొదుపు సంఘాల పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కు తెలియచేశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ చెబుతున్నా తాము వడ్డీ కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సంఘం పేరిట సభ్యులతో డబ్బులు కట్టించుకుంటున్నారని, సంవత్సరానికి కొంత డబ్బు కట్టించుకుంటున్నారని తెలిపారు. రైతులకు సంబంధించిన పలువురు మహిళలు డ్వాక్రా సంఘాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. వారు పేర్కొంటున్న సమస్యలను విన్న పవన్ పలు కీలక అంశాలను రాసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై పవన్ ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి. 

12:21 - November 3, 2018

హైదరాబాద్ : ప్రగతి సూచికలుగా గుర్తించే విద్యుత్‌ వినియోగం, తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిశాతం నమోదు చేయడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు విభాగాల్లోనూ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసింది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా వినియోగంలో తెలంగాణలో 13.62శాతం వృద్ధి సాధించింది. అంతేకాదు.. తలసరి విద్యుత్‌ వినియోగం  11.34శాతం పెరిగింది. ఈ రెండు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికే ప్రథమ స్థానం దక్కింది. ఇక గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో తెలంగాణ రాష్ట్రం 11.94శాతం వృద్ధి సాధించింది. 2017-18 వార్షిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను  కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ వినియోగంలో మొదటి స్థానం సాధించింది. ఏడాదికి సగటున రాష్ట్రంలో 97వేల వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నట్టు స్పష్టమైంది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ మరింత వృద్ధి సాధించనున్నట్టు సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్ల అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.  రాష్ట్ర విద్యుత్‌ వినియోగం, తలసరి విద్యుత్‌ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్‌ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గ సరఫరా చేస్తూనే... రాబోయే కాలంలో వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు రాష్ట్రంలోని అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడడంలోనూ నాణ్యమైన , నిరంతరాయ విద్యుత్‌ సరఫరా  పాత్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

12:12 - November 3, 2018

పోలవరం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గ్రామంలో కలకలం చెలరేగింది. ప్రాజెక్టు వద్ద భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. 15 అడుగుల మేర రోడ్డు పైకి లేచింది. దీంతో కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ప్రొక్లైన్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. పగుళ్లు ఏర్పడటం, భూమి పైకి లేవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడ్డారు. కాగా, పోలవరం ప్రాజెక్టులోని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడంతోనే పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు నుంచి ఏజెన్సీకి వెళ్లే ప్రధానమైన రోడ్డు అకస్మాత్తుగా పగుళ్లకు లోనైంది. మొదట చిన్న పగుళ్లు వచ్చాయి. రెండు అడుగుల మేర భూమి పైకి లేచింది. గంట వ్యవధిలోనే 15 అడుగుల మేర భూమి పైకి లేచింది. అలా 300మీటర్ల వరకు పగుళ్లు ఏర్పడ్డాయి. 19 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తారు. పగుళ్లు ఏర్పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు వెంటనే వచ్చి ఘటనా స్థలిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ చానల్‌కు సంబంధించి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ గ్రామంలో డంప్ చేస్తున్నారు. 6 నెలలుగా ఇలా డంప్ చేస్తున్నారు. ఈ కారణంగా బరువు ఎక్కువై భూమి పైకి లేచి ఉండొచ్చని ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు. అదే సమయంలో భూకంపం ఏమైనా వచ్చిందా? అనే దిశలోనూ పరిశీలన జరుపుతున్నారు.

12:08 - November 3, 2018

మహారాష్ట్ర : దీపావళి పండుగ వచ్చేస్తోంది. అప్పుడే విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే పటాసుల ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పటాసు ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రాయ్ పూర్ పీఎస్ పరిధిలోని పింపాల్గాం గ్రామంలో యశ్ సంజయ్ గవాటే బాలుడు తోటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు. వీరు మతాబులు పేలుస్తున్నారు. కానీ ఓ మతాబు పేలకపోవడంతో దానిని గమనించేందుకు వెళ్లాడు. నిప్పు ఆరిపోయి ఉంటుందని భావించిన సంజయ్ మతాబును నోట్లో పెట్టుకుని కొరికాడు. వెంటనే అతి పేలిపోయింది. సంజయ్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే మతాబుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. 

11:50 - November 3, 2018

కడప: ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ కారణంతోనే ఇప్పటికే వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మొదటి నుంచి తాను చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు రామచంద్రయ్య చెప్పారు. విభజన సమయంలో చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు తాను మరిచిపోలేనని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎన్ని నాటకాలైనా ఆడతారని రామచంద్రయ్య విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు - విడిపోతారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఈ రోజు ఈ గతి పట్టడానికి కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సి. రామచంద్రయ్య చెప్పారు.

జిల్లాలో రామచంద్రయ్య కీలక నేతగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన..  ఏ పార్టీలో చేరతారో చూడాలి.

మొత్తంగా ఏపీ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ - కాంగ్రెస్ కలయికను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా పలువురు రాజీనామా  యోచనలో ఉన్నట్టు సమాచారం. 

11:37 - November 3, 2018

కృష్ణా : దేశంలో మెడీ ప్రభుత్వ దుష్టపాలన సాగిస్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మోడీ ఒంటెత్తు పోకడలతో, నియంతృత్వ పరిపాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు. సామాన్య పేద, మధ్య తరగతి కుటుంబాలను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని చెప్పారు. బీజేపీతో వైసీపీ, జనసేన చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వైసీపీ, జనసేన పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్, జగన్.. చంద్రబాబును ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

 

11:30 - November 3, 2018

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలోని బంగారుపేటలో దారుణ ఘటన జరిగింది. బంగారుపేటలో రాక్డ్ స్కూల్ లో హిందీ టీచర్ గా శంకర్ పనిచేస్తున్నారు. అదే స్కూల్లో ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిన శంకర్ బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆ విద్యార్థిని గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం అదే బ్లేడ్ తో శంకర్ కూడా గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు దాడి చేశాడనేది తెలియరాలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు శంకర్ ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:16 - November 3, 2018

హైదరాబాద్: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గెలుపు వ్యూహాలు రచిస్తూ... అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రచార తీరు తెన్నులపై అభ్యర్థులను అలర్ట్‌ చేస్తున్న గులాబీ దళపతి... పండుగలు, పబ్బాలను ప్రచారానికి వినియోగించుకోవాలని ఆదేశించారు. త్వరలో రానున్న దీపావళి, నోముల సందర్భంగా ప్రచారానికి విరామం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ప్రజలను కలుసుకునేందుకు ఇదో మంచి అవకాశంగా మలచుకోవాలని తెలిపారు. ప్రచారం ఇప్పుడు కొనసాగిస్తున్న పంథాలోనే కొనసాగుతూ.. మరింత ముమ్మరం చేయాలని పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఆదేశించారు. పండుగల సందర్భంగా జరిగే ఉత్సవాల్లో మమేకమవ్వాలని చెప్పారు. అభ్యర్థులు నోములకు హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాలన్నారు. మరోవైపు వరంగల్‌, ఖమ్మం తదితర ఉమ్మడి జిల్లాల ఎన్నికల ప్రచార సభలను దీపావళి తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.

11:14 - November 3, 2018

కడప : ఏపీ కాంగ్రెస్కు షాక్ ల మీద షాక్ లు కలుగుతున్నాయి. టీడీపీ పార్టీ కాంగ్రెస్తో కలవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన నేత వట్టి వసంత కుమార్ ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లాలో కీలక నేతగా ఉన్న సి. రామచంద్రయ్య పార్టీని వీడడానికి సిద్ధమౌతున్నారు. 
శనివారం ఉదయం 11గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి గల కారణాలు..టీడీపీ..కాంగ్రెస్ పొత్తు అంశాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రామచంద్రయ్య కీలక నేతగా కొనసాగుతూ వస్తున్నారు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. టిడిపి పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలపడంపై ఆయన తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. దీనితో ఆయన పార్టీని వీడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారో చూడాల్సి ఉంది. 

10:58 - November 3, 2018

ప్రకాశం: ఎన్నికల కాలం వచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల కాలం ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలకు చెక్ పెట్టే పని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించిన ఆయన.. పద్ధతి మార్చుకోకుంటే ఫైరింగే అంటు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు వరుసగా రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. అటు అధికారిక కార్యక్రమాలతో పాటు, ఇటు పార్టీ ప్రాధాన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉండేలా ఈ సారి షెడ్యూల్ రూపొందించారు. శుక్రవారం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు రాత్రి బస చేసి మరీ పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించే పనిలో పడ్డారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీడీపీకి పార్టీ పరంగా అత్యంత సమస్యాత్మకమైనవి ఆరు ఉన్నాయి. వాటిలో నాలుగు నియోజకవర్గాలపై అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. నాయకుల మధ్య పొరపొచ్చాలు, అవినీతి, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి వంటివి ఆయా చోట్ల అసమ్మతికి కారణమైన నేపథ్యంలో సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే పని ప్రారంభించారు.

Image result for chandrababu angryపార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, నేతల ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. సంతనూతల పాడు సమన్వయ కమిటీ సమావేశంలో.. పార్టీ నేతలకు చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. రాజకీయాలు తనకు నేర్పవద్దంటూ సంతనూతలపాడు నేతలపై సీరియస్ అయ్యారు. ప్రతీ ఒక్కరి జాతకం తన వద్ద ఉందన్న సీఎం.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేను గౌరవించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నామంటే అర్ధమేంటని నేతలను నిలదీశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో.. వర్గ విబేధాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు.. ఇకనైనా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇంకా కొత్త, పాత వంటి పదాలు వినిపిస్తున్నాయని, అన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. పార్టీ శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం  చేశారు. రానున్నది ఎన్నికల కాలమన్న చంద్రబాబు.. కలికట్టుగా పనిచేసి.. పార్టీ విజయానికి దోహద పడాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు.

Image result for veligonda projectఇక తొలి రోజు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు....వెలిగొండ  ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు నీళ్లు ఇచ్చామన్న చంద్రబాబు...త్వరలోనే గోదావరి నీళ్లను నాగార్జున సాగర్‌కు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌ స్థానానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

జగన్‌పై జరిగిన దాడిపై చంద్రబాబు తన శైలిలో స్పందించారు. కోడి కత్తిపైన వైసీపీ నానా రచ్చ చేసిందని...దాడి చేసింది జగన్ వీరాభిమాని అయితే అది టీడీపీ పెట్టారంటే తనకు ఏం చెప్పాలో  తెలియట్లేదన్నారు. అసలు ఇదెక్కడి కోడి కత్తి డ్రామానో అర్థం కావడం లేదని  చంద్రబాబు అన్నారు.

Image result for attack on ys jaganవిభజన హామీలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్యర్థులను వేధించడం కోసమేనని అన్నారు. ఇవన్నీ చూసి ఓ సీనియర్ నాయకుడిగా తట్టుకోలేకపోయానని..రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఉద్ధేశ్యంతోనే జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్నాని చంద్రబాబు స్పష్టం చేశారు.

తొలిరోజు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినా.. రెండో రోజు మాత్రం పార్టీకి ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెట్టనున్నారు. మరి చంద్రబాబు హెచ్చరికలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి. 

 
10:55 - November 3, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 3 కార్యక్రమం ముగిసి రోజులవుతోంది. అందులో విన్నర్గా నిలిచిన కౌశల్కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఆయన ఎక్కడకు వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ షోలో విజేతగా నిలిచిన కౌశల్కు వచ్చిన రూ. 50 లక్షల బహుమతిని క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇచ్చేసి తన మానవతను చాటుకున్నారు. దీనితో కౌశల్కు అభిమానులు మరింత పెరిగారు. బిగ్ బాస్ ఓట్ల ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు ఈ కౌశల్.
Image result for Bigg Boss Season 2 Winner Kaushalతాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదు అందుకున్నాడు. కౌశల్ ఆర్మీ నిర్వహకులు నవంబర్ 2వ తేదీన త్యాగరాజు గానసభలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశల్‌కి సన్మానం చేసిన రోశయ్య బిరుదును బహుకరించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడారు. తాను మోడలింగ్ చేసే సమయంలో వెయ్యి రూపాయల కోసం ఇదే స్టేజీ మీద నడవడం జరిగిందని, ప్రస్తుతం రోశయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నానంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ ఘటనను తాను జీవితంలో మరిచిపోలేనని, ఇంతలా ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కౌశల్ తెలిపారు. 
కౌశల్...సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ..మోడలింగ్ చేసిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కూడా పాత్రలు వేశారు. ప్రతినాయకుడిగా కౌశల్ అలరించారు. బిగ్ బాస్ 3 సీజన్ విజేతతో కౌశల్ అందరి నోళ్లలో నానాడు. ఆయనకు సినిమా ఛాన్స్ లు కూడా వస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

10:36 - November 3, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. ఓ మహిళ నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న సబీరా అనే మహిళ నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబీరాను సీఐఎస్ఎఫ్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. సబీరాను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

 

10:31 - November 3, 2018

విజయవాడ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవడం..మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా బాబు అడుగులు వేస్తుండడం పట్ల బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఏపీ బీజేపీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన సమయంలో సోనియా, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు..ఇప్పుడు రాహుల్తో కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. 
ఊసరవెల్లి కూడా సిగ్గు పడే విధంగా రాజకీయాలు నడుపుతున్న అవినీతి చక్రవర్తి బాబు ఏ స్థాయికినైనా దిగజారుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. Image result for rahul gandhi and babuఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్నాడని, బాబు నాయకత్వం అవసరమా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారని మరిచిపోయి రాజకీయాలు చేస్తున్నారని, దేశ రక్షణ కాదని...అవినీతి బండారం బయటపడుతుందోనని భయపడి పారిపోయి కాంగ్రెస్ తో దోస్తీ కడుతున్నాడని తెలిపారు. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడని అన్న బాబు ఆయనతో చేతులు కలపడం హాస్యాస్పదమన్నారు. బాబు..అతని మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. 2019లో మోడీ అధికారంలోకి రావడానికి వీల్లేదని...అధికారంలోకి వస్తే వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందో...అనే భయంతో బాబు పొత్తులు పెట్టుకుంటున్నాడని తీవ్రంగా విమర్శించారు. తాజాగా కన్నా చేసిన విమర్శలను ఏపీ టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి. 

10:23 - November 3, 2018

అమెరికా : హెచ్‌-1బి వీసా ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది. ఈ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌-1బి కిందవచ్చే కొత్త విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టతరమయ్యేలా వీటిని సిద్ధం చేశారు. భారత ఐటీ నిపుణులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. వీటి ప్రకారం ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల లెక్కలు తప్పనిసరిగా ఉద్యోగ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కోరుతున్న తాజా సమాచారం అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే కొత్తగా హెచ్‌-1బి వీసాదారులను తీసుకొనేందుకు ఉద్యోగ సంస్థలకు అనుమతి ఇస్తారు. దేశీయంగా ఆ ఉద్యోగానికి ఎవరూ అందుబాటులో లేరని శాఖ ధ్రువీకరించిన తర్వాతే విదేశీ నిపుణుల నియామకాలకు సంస్థలకు అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగా కార్మిక నిబంధనల దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి నిపుణుల ఉద్యోగ స్థితిగతులు, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు? ఒక్కో కార్యాలయంలో ఎంత మంది ఉన్నారు? లాంటి వివరాలన్నీ సమగ్రంగా సేకరించేలా దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్‌-1బి లపై ఆధారపడుతున్న సంస్థలు, అవి అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్న ద్వితీయ పక్ష సంస్థలను స్పష్టంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 

 

10:10 - November 3, 2018

పాకిస్తాన్ : తాలిబన్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫాదర్ ఆఫ్ తాలిబన్‌గా పిలవబడే.. మౌలానా సమీ ఉల్ హక్... హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఓ దుండగుడు అతణ్ని గొంతు కోసి హత్య చేశాడు. దాడి జరిగిన సమయంలో మౌలానా బాడీ గార్డ్స్ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారు తిరిగొచ్చేసరికి మౌలానా తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

 

10:07 - November 3, 2018

ప్రకాశం: సేవ్ నేషన్.. సేవ్ డెమోక్రసీ నినాదంతో బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బరిలోకి దిగిన ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మరోసారి కేంద్రం, విపక్షాలపై ఫైర్ అయ్యారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరి తాను కేంద్ర ప్రభుత్వానికి భయపడే సీఎంను కాదని, తిరగబడి వారిపై పోరాటం చేసి వారి మెడలు వంచే వ్యక్తిని అంటూ చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏపీపై దాడులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శినిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు, పొరుగు రాష్ట్రం సీఎంపై నిప్పులు చెరిగారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినందుకే టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అయినా తాను వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. తాను భయపడే సీఎంను ఎంతమాత్రం కాదని, కేంద్రంపై తిరగబడి సాధించుకునే సీఎంనని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను బంగారుమయం చేసి అందిస్తే, కేసీఆర్ పాలించుకోలేకపోతున్నారని, పైగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా కాళ్లరిగేలా తిరిగి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని గుర్తుచేసుకున్నారు. 

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానని, ఏపీని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు నిద్రపోనని భావోద్వేగంతో చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామాతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా నన్నే తిడుతున్నారన్న చంద్రబాబు.. ఏపీ విభజన హామీల అమలుపై నిజనిర్ధారణ కమిటీ వేశామని చెప్పిన పవన్, ఆ కమిటీని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.  

కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకే తాను ఢిల్లీలో పర్యటించి ఎన్డీయేతర పార్టీల నేతలతో కీలక భేటీలు నిర్వహించి, మద్దతు కూడగడుతున్నానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షానికి ప్రజలను ఓట్లు అడిగే హక్కుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక వర్గాలను చూసి ఓట్లేయవద్దని, కేవలం అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలంటూ ఏపీ సీఎం సూచించారు.

09:55 - November 3, 2018

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రోబోకి సీక్వెల్‌గా రూపొందుతున్న మూవీ, 2.ఓ. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు. అమీ జాక్సన్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మ్యూజిక్ మెజీషియన్, ఏ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన పాటలకీ, టీజర్‌కీ భారీ రెస్పాన్స్‌వస్తుంది. ముందుగా దీపావళి నాడు 2.ఓ. ధియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు, 2.ఓ. 3డి ట్రైలర్‌ని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం, రజనీ అభిమానులతో పాటు, సినీ వర్గాలవారు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 2.ఓ. టీమ్, దీపావళికి నాలుగురోజుల ముందే ట్రైలర్ ద్వారా, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌తో శంకర్, చిట్టితో ఎలాంటి విన్యాసాలు చేయించాడో మరికాసేపట్లో తెలిసిపోతుంది.   

09:48 - November 3, 2018

ముంబాయి : బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణె పెళ్లి సందడి మొదలైంది. బెంగళూరులోని ఆమె నివాసంలో వివాహానికి ముందు చేసే పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పొడవు కాళ్ల సుందరి ముదురు నారింజ రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది. నవంబరు 14, 15వ తేదీల్లో దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని లేక్‌ కోమోలో వీరి పెళ్లి జరగనుంది రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది.

 

09:34 - November 3, 2018

విశాఖపట్నం: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఒక రాంగ్‌కాల్‌ కూడా జీవితాలను ఇబ్బందుల్లో పడేస్తుందని మీకు తెలుసా. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్‌ పట్ల అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా చూశారా? ఓ రాంగ్‌కాల్‌ కారణంగా ముగ్గురి జీవితాలు భారీ కుదుపునకు గురయ్యాయి. అంతేకాదు ఆ కుటుంబాల్లోని వారంతా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఇంతకీ ఆ రాంగ్‌కాల్ కహానీ ఏంటనే వివరాల్లో వెళితే..

ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందో లేదో తెలియదుకానీ... ఒక రాంగ్‌కాల్‌ మాత్రం మన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. తెల్లారితే ఏం జరుగుతుందోన్న వేదనను అనుభవించాల్సి వస్తోంది. ఇదంతా నిలువెత్తు నిదర్శనమే.. జగన్ దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బారిన పడిన వ్యక్తులు.

జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు చేసిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఏపీ ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేయడం.. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం... ఆ తర్వాత కస్టడీకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే పోలీసుల కస్టడీలో శ్రీనివాసరావు అనేక కీలక విషయాలు వెల్లడించాడు. మరోవైపు పోలీసులు అతడి ఫోన్‌కాల్‌ లిస్ట్‌ ఆధారంగా పలువురిని విచారించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు సైరాబీ, అమ్మాజీలను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం విశాఖకు తరలించారు. అయితే ఇద్దరు మహిళలకు కూడా పోలీసులు తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో... ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అమాయకంగా తాము చేసిన నేరమేంటని సిట్‌ అధికారులను వారు ప్రశ్నించారు. పోలీసులు చెప్పిన విషయం తెలిసి షాక్‌ అవ్వడం వారి వంతైంది.

జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్‌ నుంచి ఓ రోజు  కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన సైరాబీకీ రాంగ్‌కాల్ వెళ్లింది. అది రిసీవ్‌ చేసుకున్న సైరాబీ అతనితో కాసేపు సంభాషించి రాంగ్‌కాల్‌ అని పెట్టేసింది. ఆ తర్వాత కూడా కాల్స్‌ రావడంతో సైరాబీతోపాటు ఆమె అత్త, తోడి కోడలు కాసీంబీ, అమ్మాజీలు కూడా శ్రీనివాసరావుతో మాట్లాడారు. వాస్తవానికి సైరాబీకి ఆ ఫోన్‌ను, సిమ్‌ను పిడుగురాళ్లలో ఉంటున్న తన సోదరుడు రసూల్‌ కొనిచ్చాడు. జగన్‌పై దాడి చేయడానికి ముందు కూడా నిందితుడు శ్రీనివాసరావు సైరాబీ సెల్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో పోలీసులు సిమ్‌కార్డును ఎంక్వైరీ చేసి పిడుగురాళ్లలోని రసూల్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత సెల్‌ను వాడుతున్న సైరాబీని, ఆమె అత్త, తోడికోడలును సిట్‌ పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తమకేమీ తెలియదని... శ్రీనివాసరావు ఎవరో కూడా తాము చూడలేదని.. రాంగ్‌కాల్‌తోనే శ్రీనివాసరావు పరిచయమని, జగన్‌పై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో మొరపెట్టుకున్నారు. తాము కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నామని.. ఎవరికీ అపకారం తలపెట్టేవారికి కాదని విలపించారు. 

పోలీసులు శ్రీనివాసరావును విచారించి వారికి దాడితో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. వారి నుంచి వాంగ్మూలం రికార్డు చేసి పంపించారు. దీంతో జగన్‌పై దాడి కేసులో కలకలం సృష్టించిన రాంగ్‌కాల్‌ చిక్కుముడి వీడింది. 

ఒక రాంగ్‌కాల్‌ వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో అర్ధమైంది కదూ. రాంగ్‌కాల్‌ చేసిన శ్రీనివాసరావుతో మాట్లాడటంతో ముగ్గురి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇరుగుపొరుగు నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. అపరిచిత వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకోకుండా వారితో ఒకటికి పలుమార్లు మాట్లాడితే ఇలాంటి చిక్కులే వచ్చిపడతాయి. కాబట్టి రాంగ్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండండి.

09:31 - November 3, 2018

హైదరాబాద్ : దాదాపు దశాబ్దకాలం నాటి సత్యం కుంభకోణంలో సెబీ తాజాగా సంచలన ఆదేశాలు ఇచ్చింది. సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడైన బి.రామలింగరాజును 14 ఏళ్లపాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేకుండా నిషేధించింది. దీంతోపాటు చట్టవ్యతిరేకంగా సంపాదించిన 813.40 కోట్ల మొత్తాన్ని, వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి స్పష్టం చేసింది.  సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధ కాలం రామలింగరాజు, రామరాజులకు 2014 జులై 15 నుంచి మొదలైంది. అందువల్ల అప్పటి నుంచి 14 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు.  సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు సెబీ తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

 

09:01 - November 3, 2018

ఢిల్లీ : రాఫెల్ స్కాంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోది ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఈ ఒప్పందంలో అనిల్‌ అంబానీ, మోది మధ్య భాగస్వామ్యం ఉండడం వల్లే ప్రధాని అనిల్‌ అంబానితో డీల్‌ చేశారని ఆరోపించారు. దస్సాల్ట్‌ కంపెనీ డబ్బులతోనే అనిల్ అంబానీ భూమి కొన్నారని రాహుల్‌ తెలిపారు.  అనిల్ అంబానీకి రూ.30,000 కోట్ల డీల్ నరేంద్ర మోదీ కట్టబెట్టారని, దీనిపై దర్యాప్తు జరిపితే మోదీ తప్పించుకోలేరని రాహుల్‌ వెల్లడించారు. ప్రధాని మోదిని రక్షించేందుకు డస్సాల్ట్‌ సిఈఓ అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిపై జెపిసితో విచారణ జరపాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

 

08:50 - November 3, 2018

విజయవాడ: ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తోన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయా..? పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నానా తంటాలు పడుతోందా..? ఇంటింటికి  కాంగ్రెస్ కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉందా..? కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు దూరంగా ఉంటున్నారా..?  అంటే అవుననే సమాదానం వస్తోంది.

బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాల్లోకి వెళ్లి వివరిస్తామంటూ బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నేతలకు భంగపాటు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి ఆ పార్టీ ముఖ్య నేతలు అంటీ ముట్టనట్టుగా హాజరవుతుండడంతో....ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టోను ప్రజల్లోకి క్షేత్రస్ధాయిలో  తీసుకెళ్లలేక పోతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అధిష్టానం కలసి కట్టుగా ప్రచారం చేయాలని ఆదేశించినా అక్టోబర్ 2న శ్రీకాకుళం నుంచి రఘువీరా, ఏలూరు నుంచి రాష్ట్ర  వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంది ప్రారంభించడం చర్చకు దారితీసింది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో...ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనకపోవడం ప్రధాన చర్చకు దారితీసింది. చిరంజీవి సినిమా షూటింగ్‌లో బిజీగా మారడంతో కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మరికొంతమంది నేతలు కూడా దూరంగా ఉండడంతో...నేతలంతా కార్యక్రమంలో పాల్గొనాలని అందుకు నవంబర్ 19 వరకు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు రఘువీరా ప్రకటించారు. 

మరి మిగిలిన రోజుల్లోనైనా పార్టీ ముఖ్య నేతలు ఇంటింటికి కాంగ్రెస్ కార్యాక్రమంలో పాల్గొంటారా...క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్వ వైభవం కోసం ఏ మేరకు కృషి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

08:43 - November 3, 2018

ఢిల్లీ చిన్నతరహా, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి కానుక ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు 1 కోటి వరకు రుణాన్ని  కేవలం 59 నిమిషాల్లో ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. జిఎస్‌టి పోర్టల్‌ నుంచి కూడా లోన్‌ లభిస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు సహకరిస్తూ, చేరువయ్యే ఎంఎస్ఎంఈ కార్యక్రమాన్ని  ప్రధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 12 నిర్ణయాలు తీసుకున్నట్లు మోది చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరపతిని పెంచేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ విధానాలు దోహదపడతాయన్నారు.  ఈ పథకం దేశంలోని 100 జిల్లాల్లో 100 రోజులపాటు అమలవుతుందని పేర్కొన్నారు.

 

07:41 - November 3, 2018

హైదరాబాద్‌ : నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లిలోని అల్లందుల్ల హోటల్ పక్కనే ఉన్న ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా షాప్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

 

Don't Miss