Activities calendar

04 November 2018

21:19 - November 4, 2018

యాదాద్రి: కేవలం అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు ఐటీ శాఖమంత్రి కేటీఆర్. యాదాద్రిజిల్లా భువనగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు ఇచ్చేనోట్లకోసం, 4 సీట్ల కోసం ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్దుల పేర్లు  ఖరారుచేయాల్సింది  రాహుల్ గాంధీ కాదని,చంద్రబాబే అని ఇంతకంటే దౌర్బాగ్యం మరోకటి ఉండదని అన్నారు. ఉత్తమ్, జానాలు  రాష్ట్రంలో పులుల మాదిరి ఉంటారని , ఢిల్లీ వెళ్లి   పిల్లిలా చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని అన్నారు. ముసలి నక్క కాంగ్రెస్‌- గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

20:27 - November 4, 2018

ఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అనాదిగా వస్తున్నఆచార సంప్రదాయాలను అందరూ పాటించాలని‘ఆర్ట్ఆఫ్లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సాధు,సంతుల సమావేశంలో పాల్గోటానికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.....ప్రతి మతంలోనూ వారి,వారి ప్రార్ధనా స్ధలాల్లో పాటించాల్సిన నియమాలు ఉంటాయని, వాటిని అందరూ తప్పక పాటించాలని అన్నారు. దేవాలయానికి వెళ్ళినపుడు చెప్పులను బయట విడిచిపెడతామని, గురుద్వారాకు వెళ్ళినపుడు తలను మూసుకుంటారని, ముస్లింలు హజ్‌కు వెళ్ళినపుడు ఓ వస్త్రాన్ని ధరిస్తారని ఇలా ప్రతి మతంలోనూ కొన్నిసంప్రదాయాలున్నాయని వాటిని అందరూ పాటించాలని చెప్పారు. రుతుస్రావం జరిగే మహిళలు శబరిమలలో ప్రవేశించకూడదనే నిబంధన ఉన్నట్లయితే, దానిని అందరూ అనుసరించవలసిందేనని, దీనిపై వివాదం చేయవలసిన అవసరం లేదని శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు.  
సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, అదే సమయంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ  రివ్యూ పిటిషన్‌పై విచారణ జరుపుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి శబరిమల వార్తల్లోకెక్కుతూనేఉంది. మాసపూజలో భాగంగా రేపు ఆలయాన్ని తెరవనున్నారు. సుప్రీం తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సోమవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా ఇప్పటికే ఆలయ పరిసరాల్లో 2,500 మంది పోలీసులతో కేరళ ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది.

19:13 - November 4, 2018

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయం కాంగ్రెస్ తేల్చకపోవడంతో సీపీఐ, కూటమి నేతలకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలు  సీపీఐ కు 2, 3 సీట్లు అని లీకులివ్వటం పట్ల  పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర స్ధాయి కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈసమావేశంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సీపీఐ నేతలు తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. తమకు బలం లేని చోట్ల సీట్లు అంటగట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు నాయకులు ఆరోపించారు. తమకు బలమున్న వైరా, హుస్నాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ కోరుతోంది. "దేశ రాజకీయాలను మార్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుని చంద్రబాబుతో కలిసి రావాలని, ఏం జరుగుతుందో వేచి చూడాలని" పార్టీ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

18:27 - November 4, 2018

డెహ్రాడూన్: "మీటూ"సెగ బీజేపీని బలంగానే తాకినట్టు కనిపిస్తోంది. మీటూ దెబ్బకు కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి ఎంజేఅక్బర్ తన పదవి కోల్పోయినా, ఇంకా ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి  సంజయ్ కుమార్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్నికూడా పార్టీ పదవి నుంచి తప్పించారు. పార్టీకి చెందిన ఓమహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదుతో  సంజయ్ కుమార్ పై పార్టీ వేటు వేసింది.  సంజయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చినప్పటినుంచి అతడ్ని పదవి నుంచి తొలగించాలని స్ధానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ అధిష్టానం సంజయ్ ని ఢిల్లీ పిలిపించి పార్టీ పదవి నుంచి తొలగిసస్తున్నట్లు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీసుకున్ననిర్ణయాన్నిపార్టీ అధిష్టానం ఉత్తరాఖండ్ రాష్ట్ర నేతలకు చెప్పింది. త్వరలోనే నూతన ప్రధానకార్యదర్శిని కేంద్ర కమిటీ ప్రకటిస్తుందని తెలిపారు. 

17:34 - November 4, 2018

ట్విట్టర్‌లో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులను ఫాలో అవుతుంటారు. దానివల్ల తమ ఫేవరెట్ నటుల లేదా, పొలిటిషియన్ల లేటెస్ట్‌అప్‌డేట్స్‌ అన్నీతెలుస్తుంటాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ, ఈ ట్విట్టర్ అనేది ఒక వేదికగా మారింది. ట్వట్టర్ గురించి ఇంతగా చెప్తున్నానేంటనుకుంటున్నారా? మరేం లేదు. ఈరోజు ట్వట్టర్‌లో, తెలంగాణా ఐ.టి. మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనలకి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. డియర్ తెలంగాణా గవర్నమెంట్, మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ, మాకు మీ దగ్గరినుండి ఇంకాస్త హెల్ప్‌కావాలి. పేద పిల్లలకు నాతరపు నుండి నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. ఆడపిల్లల కోసం ఒక హాస్టల్ మంజూరు చేసే విషయం పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.. అని, ఉపాసన ట్వీట్ చెయ్యగా, ప్రభుత్వం స్కూలు మంజూరు చేసినందుకు చాలా సంతోషం, అయితే హాస్టల్ గురించి డిసెంబర్ 11న నెక్స్ట్‌ గవర్నమెంట్ ఏర్పాటయ్యేవరకూ ఆగాల్సి ఉంటుంది. మా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్‌ అని కేటీఆర్ తన స్టైల్‌లో స్పందించారు. ఒకపక్కన స్కూలు మంజూరు చేసామనే ఘనత గురించి చెబుతూనే, మరోవైపు, ఈసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని,  నమ్మకముంచినందుకు థ్యాంక్స్ అని సమయస్ఫూర్తితో సెలవిచ్చారు కేటీఆర్...
 

 

17:11 - November 4, 2018

కర్నాటక : ఇది భార్యభర్తల దీనగాథ..ఏడాదిగా వీరు మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నారు. పేదిరకంలో మగ్గుతున్న వారికి అక్కడి ప్రభుత్వం ఆదరణ చూపకపోవడంతో వారు అత్యంత దుర్భమైన జీవితం గడుపుతున్నారు. ఈ విషయం మీడియాకు చిక్కింది. దీనితో వీరు నివాసం ఉంటున్న ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
కర్నాటకలోని తుముకూరు వద్ద కడపపాలకేరకు చెందిన దంపతులు ఓబులప్ప, లక్ష్మీనరసమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి Image result for b r ambedkar nivas yojana scheme karnatakaఒక కుమారుడున్నాడు. ఇతను బెంగళూరు వీధుల్లో కూరగాయాలు విక్రయిస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఓబులప్పకు అనారోగ్యం ఉండడంతో అతని భార్య నరసమ్మ కూలిపని చేసుకుంటూ సంసార పడవను నెట్టుకొస్తోంది. వీరు పేద వారు కావడంతో ప్రభుత్వం పథకంలోని బీఆర్ అంబేద్కర్ నివాస్ యోజన కింద ఇల్లు మంజూరైంది.


నివాసం మంజూరు కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇల్లు కట్టుకొనేందుకు కొంత రుణం..తెలిసిన వారి వద్ద డబ్బులు తీసుకున్నారు. ఇంటి పునాదుల వరకు ఆ డబ్బు సరిపోయింది. కానీ ప్రభుత్వం తరపున అందాల్సిన నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయాలంటూ దంపతులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగారు. నిర్మాణం కోసం రూ.1.64లక్షలను Obalappa and Lakshminarasammaఅధికారులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నిధులు కూడా రిలీజ్ కాలేదని తెలుస్తోంది. 

#Karnataka | A couple from #Tumakuru had to live in a relative's bathroom after a delay in the allocation of a house to them by the state government. https://t.co/O0Pcux6Y6y

— MyNation (@MyNation) November 4, 2018

దీనితో విసిగివేసారిన ఆ దంపతులు బంధువులను ఆశ్రయించారు. ఓ బంధువుల ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నారు. గత ఏడాది నుండి ఇలాగే వీరు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే తాము ఇళ్లు కట్టకుంటామని, వెంటనే అధికారులు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఓబులప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ తో కర్నాటక ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా అనేది వేచి చూడాలి. 

 

#Karnataka | A couple from #Tumakuru had to live in a relative's bathroom after a delay in the allocation of a house to them by the state government. https://t.co/O0Pcux6Y6y

— MyNation (@MyNation) November 4, 2018

Karnataka: Couple forced to live in toilet after government releases Rs 1 for house - The New Indian Express https://t.co/4alNVBnWYK

— Indian Liberals News (@Liberals_News) November 3, 2018
16:55 - November 4, 2018

గజ్వేల్: కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు మళ్లీ తెలంగాణాకు నష్టం చేయాలని చూస్తే భవిష్యత్తులో చంద్రబాబు సంగతి చూస్తాం అని టీఆర్ఎస్ నాయకుడు హరీష్రావు హెచ్చరించారు. గజ్వేల్లో జరిగిన మైనారిటీల సభలో  హరీష్రావు మాట్లాడుతూ... కేసీఆర్ కొట్టిన దెబ్బకు అమరావతి పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని తెలంగాణాలో పెత్తనం చెలాయించాలని చూస్తే భవిష్యత్తులో మావద్ద ఉన్నరికార్డులు బయటపెట్టి మరోసారి బాబు బండారం బయటపెడతాం అని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్కు అండ,దండ, అంతా చంద్రబాబే, అని అమరావతి నుంచి డబ్బులు, టికెట్లు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్ అక్కడి నుంచే వస్తున్నాయని  హరీష్రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇప్పటివరకు చేసింది పాతికశాతం మాత్రమేనని, ఇప్పటివరకు 2500 కోట్లతో అభివృద్ది పనులు చేశారని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన తెలిపారు. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బట్టలు పంచడం ఏరాష్ట్రంలోనూ లేదని కేసీఆర్ తొలిసారిగా తెలంగాణాలో ప్రవేశపెట్టి అమలు  చేస్తున్నారని హరీష్ రావు చెప్పారు. 

16:41 - November 4, 2018

రాయ్ లక్ష్మి, గతేడాది మెగాస్టార్ పక్కన రత్తాలు పాటలో రచ్చ రచ్చ చేసింది. తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా, తమిళ్‌లో మాత్రం బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్న రెండు సినిమాల లుక్స్‌ ఈరోజు రిలీజ్ అయ్యాయి. తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, లుక్‌ని, యంగ్ హీరో నితిన్ లాంచ్ చెయ్యగా, సిండ్రెల్లా అనే హారర్ మూవీ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ హారర్ సినిమా పోస్టర్‌లో, ప్రేతాత్మగా మారిన రాయ్, హార్లీ డేవిడ్ సన్‌ పై రైడ్ చేస్తుంది. ఘోస్ట్‌గా ఆమె మేకప్ అదిరిపోయింది. థిటయేర్లలో ప్రేక్షకులను ఎలా భయపెడుతుందో మరి. ఈ సిండ్రెల్లాని వినూ వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి పోస్టర్‌లోనూ రాయ్ లక్ష్మి రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతుందని తెలుస్తుంది. కిషోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో రాయ్, తిరిగి ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి.

 

16:36 - November 4, 2018

మహబూబాబాద్: కాంగ్రెస్‌, టీడీపీ కలయికపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్న కూటమి.. అసలు కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలో చెప్పడం లేదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ పాలన అమరావతి నుంచి సాగుతుందని కేటీఆర్‌ మండిపడ్డారు.

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల పాటు శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఈరోజు ఏకమయ్యాయని అన్నారు. రాహుల్‌గాంధీని కలిసిన చంద్రబాబు కేసీఆర్‌ను గద్దె దించాలని కోరుతున్నారని.. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. సోనియాగాంధీని నానా మాటలు అన్న చంద్రబాబును కాంగ్రెస్‌ ఎలా స్వీకరిస్తుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు సీట్ల కోసం చంద్రబాబు వంచన చేరడంపై ఆయన మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన కొనసాగుతుందన్నారు. 

మహబూబాబాద్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయని.. బయ్యారం ఉక్కు కర్మాగారానికి కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్‌ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని.. పేదలకు అండగా ఉన్నారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్‌ కోరారు.

16:16 - November 4, 2018

పోలవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌(పశ్చిమ గోదావరి జిల్లా) దగ్గర అలజడి చెలరేగింది. ప్రాజెక్ట్‌ దగ్గర ఒక్కసారిగా భూమి చీలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. పోలవరం ప్రాజెక్ట్ చెక్‌పోస్టు సమీపంలో భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. రోడ్లు చీలిపోయాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రాకపోకలు స్తంభించాయి.

పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై‌ శనివారం ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం మొదలైంది. మెటల్‌ రోడ్డు మెల్లమెల్లగా ఉబికి వచ్చింది. ఒకటీ రెండూ కాదు... అలా సుమారు ఆరు అడుగుల ఎత్తున రోడ్డు ఉబికి వచ్చింది. రోడ్డు మొత్తం కండకండాలుగా విడిపోయింది. 15 అడుగుల లోపలి వరకు నెర్రెలు పడ్డాయి. అతి భారీ భూకంపమేదో సంభవించినట్లుగా విధ్వంస దృశ్యం కనిపించింది. 3 కిలోమీటర్ల రోడ్డులో సుమారు కిలోమీటరు పొడవునా రోడ్డు ముక్కలుగా మారిపోయింది. 

Image may contain: mountain, outdoor and natureఅసలు మ్యాటర్‌లోకి వెళితే... పోలవరం మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారి చాలా ఏళ్లుగా ఉంది. చిన్నగా ఉన్న రోడ్డును ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా వెడల్పు చేశారు. ప్రాజెక్టులో తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఈ రహదారిని ఆనుకునే, కొంచెం దిగువన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ మట్టితో మరో రహదారి నిర్మించింది. ఈ మట్టి రోడ్డుపై దాదాపు నిమిషానికొకటి వంద టన్నుల లోడ్‌తో ట్రక్కులు తిరుగుతున్నాయి. అతి భారీ యంత్రాలు తిరగడంతో మట్టి రోడ్డు ఒత్తిడికి గురై మెల్లమెల్లగా కుంగుతూ వచ్చింది. దీని ప్రభావం పక్కనే ఉన్న తారు రోడ్డుపై పడింది. లోలోపలే ఒత్తిడి పెరిగింది. అది తట్టుకోలేనంతగా పెరిగి శనివారం ఉదయం విస్పోటంలా మారింది. మెల్లమెల్లగా ఉబుకుతూ రోడ్డు ముక్కలు ముక్కలుగా మారింది. ఇదీ అక్కడ జరిగిన అసలు కథ. 

రోడ్డు మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోవడంతో ఇరువైపులా ఉన్న విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లే 33 కేవీ లైన్‌, పోలవరం మండలం ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే 11 కేవీ లైన్‌ దెబ్బతిని విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పోలవరం స్పిల్‌ చానల్‌ పనులకు అంతరాయం ఏర్పడింది. స్పిల్‌ చానల్‌లో తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లే దారిలేక... తవ్వకం పనులు నిలిపి వేశారు. రోడ్డు ధ్వంసం కావడంతో ఏజెన్సీలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కనీవినీ ఎరుగని పరిణామాలతో పోలవరం వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ ప్రాజెక్టు ప్రాంతం వద్ద అటువంటి ప్రకంపనలు ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Image result for polavaram project cracksపోలవరంలో వచ్చింది భూకంపం కాదని ప్రాజెక్ట్‌ సీఈ శ్రీధర్‌ తెలిపారు. భారీ యంత్రాలు తిరగడం వల్లనే అలా జరిగిందని స్పష్టం చేశారు. దీనికీ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధం లేదన్నారు.  ప్రాజెక్టులో కాంక్రీటు పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని... నవయుగ కంపెనీ పెద్ద ఎత్తున భారీ యంత్రాలతో మరో డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేస్తోందన్నారు. 24 గంటల్లోనే రాకపోకలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

16:01 - November 4, 2018

కేరళ : శబరిమల మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఉన్న టెన్షన్ వాతావరణం మరోసారి పునరావృతమౌతోంది. సోమవారం ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. పలు నిబంధనలు..ఆంక్షలు విధిస్తోంది. మాస పూజల నిమిత్తం సోమవారం తెరుచుకోనుంది. దీనితో పలువురు మహిళలు ఆలయానికి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. కానీ వీరిని అడ్డుకోవడానికి కొన్ని సంఘాలు సిద్ధమౌతున్నాయి. 
Image result for sabarimala don't send women journalistఇదిలా ఉంటే పలు మీడియా సంస్థలకు విశ్వహిందూ పరిషత్, శబరిమల కర్మ సమితి, హిందూ ఐక్యవేదికలతో కూడిన రైట్ వింగ్స్ సంయుక్త వేదిక పేరిట లేఖలు వచ్చాయి. సోమవారం నాడు ఆలయం తెరువనున్న నేపథ్యంలో శబరిమల ఆలయం వద్దకు మహిళా జర్నలిస్టులను పంపించవద్దని వారు లేఖలో కోరారు. ఇటీవలే కొంతమంది మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలుగు జర్నలిస్ట్ మోజో కవిత సైతం ఆలయ ఎంట్రీ కోసం వెళ్లి.. నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయడంతో ఉద్రిక్తతలకు తెరపడింది.
అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం ఇటీవలే తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్పుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో ఆందోళనలు..నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పును అనుసరిస్తామని కేరళ సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం మరోసారి ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

15:45 - November 4, 2018

గుజరాత్ :  రాష్ట్రంలోని కొంతమంది హోం గార్డులు సూరత్ పోలీసు కమిషనర్ కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. కోరుకున్న చోటికి బదిలీ చేయాలంటే ఉన్నతాధికారులు కోరికలు తీర్చాలని వేధిస్తున్నారంటూ లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 25 మంది మహిళా హోం గార్డులు శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులపై సూరత్‌ పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ శర్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సతీశ్ శర్మ స్పందించారు. ఈ ఫిర్యాదును డీసీపీకి పంపించడం జరిగిందని, జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించిందని వెల్లడించారు. కానీ హోం గార్డులు పోలీసు శాఖలోకి రారని దీనితో స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 
గత కొద్దీ రోజులుగా పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని హోం గార్డులు లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బదిలీ చేయడానికి డబ్బులివ్వాలని..లేకపోతే కోరిక తీర్చాలని వేధిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి స్థానిక కమిటీ జరిపే విచారణలో ఎలాంటి అంశాలు బయటకొస్తాయో చూడాలి. 

15:43 - November 4, 2018

ప్రొ-కబడ్డీ 6వ సీజన్‌ హోరాహోరిగా సాగుతోంది. బెంగళూరు బుల్స్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. యూపీ యోధతో తలపడిన ఆ జట్టు... 35-29 పాయింట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌పై  యు ముంబా ఘన విజయం సాధించింది. 31-22 పాయింట్ల తేడాతో పుణెరి టీమ్‌ ఓటమిపాలైంది.

ప్రొ-కబడ్డీ 6వ సీజన్‌లో యు ముంబా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాత్రి జరిగిన మ్యాచ్‌లో యు ముంబా.... పుణెరి పల్టాన్‌ను ఓడించింది. ఆరంభంలో పుణెరి జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. దర్శన్‌ కడియన్‌ సూపర్‌రైడ్‌ చేయడంతో యు ముంబా ఖాతా తెరిచింది. ఆ తర్వాత దీపక్‌కుమార్‌ను పట్టేసిన యు ముంబా స్కోరును 5-1కి పెంచుకుంది. ఆ కొద్దిసేపటికే పుణెరిని ఆలౌట్‌ చేసి 12-6 ఆధిక్యంలోకి వెళ్లింది యు ముంబా.  ఆ తర్వాత డిఫెండర్‌ ఫజల్‌ అత్రాచలి మాయ మొదలైంది. అద్భుతమైన ట్యాక్లింగ్‌ చేసిన ఈ ఇరాన్‌ ఆటగాడు.. ముంబాకు 20-12తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. అత్రాచలి చేసిన ఐదు ట్యాక్లింగ్స్‌లో నాలుగింట్లో సఫలం అయ్యాడు. దీపక్‌ ముంబా డిఫెన్స్‌ను ఛేదించడంతో విఫలం కావడంతో పుణెరి మరోసారి ఆలౌట్‌ అయ్యింది. డిఫెన్స్‌లో అదరగొట్టిన ముంబా 31-22తో విజయాన్ని సొంతం చేసుకుంది. 

మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ - యూపీ యోధాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో యూపీ యోధను బెంగళూరు బుల్స్‌ 35-29 పాయింట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్‌లో ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. కానీ రైడర్లు విజృంభించడంతో యూపీ యూధ 19-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బెంగళూరు కూడా ధీటుగా స్పందించడంతో 25-24తో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. అక్కడి నుంచి వరుస పాయింట్లు సాధించి 35-29తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు అదే జోరు ఆఖరిదాకా కొసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు జట్టులో రోహిత్‌కుమార్‌ 14 రైడ్‌ పాయింట్లు సాధించగా.... కాసీలింగ్‌ రెండు ట్యాక్లింగ్‌లు చేశాడు.

15:36 - November 4, 2018

ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల అనంతరం టీఆర్ఎస్, బీజేపీలు కలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .... ప్రస్తుత పరిస్ధితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టీఆర్ఎస్ కి 50 శాతం సీట్ల కంటే ఎక్కువ రావని, అందువల్ల కేసీఆర్ ఎంఐఎం, బీజేపీలతో చర్చలు జరుపుతారని అన్నారు. కేంద్రంలో మోడీతో కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని జైపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్పార్టీ, టీడీపీ, మరికొన్నిపార్టీలతో కలిసి మహకూటమిని ఏర్పాటుచేసి అధికారాన్ని కైవసం చేసుకోటానికి ప్రయత్నిస్తోంది.

15:32 - November 4, 2018

కర్నాటక : రాష్ట్రంలోని బీజేపీకి పలు కష్టాలు ఎదురవుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. కొద్దిరోజుల్లో రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రుద్రేష్ రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 
ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి ఎల్‌. చంద్రశేఖర్‌ ఒక్కసారిగా బీజేపీకి షాక్ ఇచ్చారు. ప్రచారాల ముగింపు రోజున పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో పార్టీకు కోలుకోలేని దెబ్బతగిలింది. బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనితాకుమారస్వామి గెలుపు లాంఛనమైందని తెలుస్తోంది. కానీ చంద్రశేఖర్ ను బుజ్జగించడంలో పార్టీ నేతలు విఫలం చెందారని రుద్రేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ జేడీఎస్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలతో కొంతమంది నేతలు సంబంధాలు పెట్టుకున్నారని, దీనితో పార్టీ అభివృద్ధి చెందడం లేదని రుద్రేష్ సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. కానీ రుద్రేష్‌ తీసుకునే నిర్ణయంతో పార్టీలో ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయో చూడాలి. 

15:23 - November 4, 2018

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్‌తో రూపొందే సినిమాలకు ఆదరణ లభిస్తుంది. ఇప్పుడదే కోవలో,అంతా కొత్త వాళ్ళతో, హవా అనే చిత్రం రాబోతుంది. చైతన్య మదాడి, దివి ప్రసన్న జంటగా, మహేష్ రెడ్డి డైరక్షన్‌‌లో, ఫిల్మ్‌అండ్ రీల్ సమర్పణలో తెరకెక్కుతున్న హవా మూవీ ట్రైలర్, రీసెంట్‌గా రిలీజ్ అయింది. నైన్ బ్రెయిన్స్, నైన్ క్రైమ్స్, నైన్ హవర్స్ అంటూ, డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు మూవీ యూనిట్.  ట్రైలర్ చూడగానే, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, గుర్రపు పందేలు, లవ్, లస్ట్, హేట్ వంటి అంశాలతో ఈ మూవీ రూపొందించారనిపిస్తుంది. యూత్‌కి కనెక్ట్‌అయ్యే కంటెట్ ఉందీ సినిమాలో. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కెమెరా, ఆర్ ఆర్, మేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈనెల 23న హవా రిలీజవబోతుంది. 

14:30 - November 4, 2018

హైదరాబాద్: కాంగ్రెస్‌లో టికెట్ల వ్యవహారం చిచ్చు రాజేసింది. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాన్ని మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. భిక్షపతి యాదవ్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటిని ముట్టడికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో గాంధీభవన్ ముందు భిక్షపతి నేతృత్వంలో సుమారు వందమంది ధర్నాకు దిగారు. భిక్షపతి యాదవ్‌కే టికెట్ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం, మరో కార్యకర్త చెయ్యి కోసుకోవడం కలకలం రేపాయి. ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

శేరిలింగంపల్లి టికెట్ టీడీపీకి కేటాయిస్తే ఊరుకునేది లేదని భిక్షపతి యాదవ్ తేల్చి చెప్పారు. త్యాగం చేయడానికి బీసీల సీటే కావాల్సి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 'టీడీపీ బీసీల పార్టీ అంటారు. మరి బీసీల సీటు ఎందుకు అడుగుతున్నారు? నేను కాంగ్రెస్ జెండా మోస్తూ వస్తున్నా... ఇప్పుడు నాకే ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు?' అని ఆయన నిలదీశారు. 

శేరిలింగంపల్లి సీటు కాంగ్రెస్‌కే ఇవ్వాలని.. ఈ విషయంలో హైకమాండ్‌ పునరాలోచించుకోవాలని భిక్షపతి యాదవ్ కోరారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాకే టికెట్ ఇవ్వాలన్నారాయన. పొత్తుల కోసం బీసీలే త్యాగాలు చేయాలా? అని భిక్షపతి ప్రశ్నించారు. టీడీపీకి టికెట్ ఇవ్వాలంటే చాలా నియోజకవర్గాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకం తనకు ఉందని, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తానో తర్వాత చెబుతానని భిక్షపతి యాదవ్ చెప్పారు.

14:20 - November 4, 2018

హైదరాబాద్ : ప్రధాని మోడీ నేతృత్వంలో కుట్ర కూటమి ఏర్పాటు అయిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబుపై మూకుమ్మడి దాడి చేస్తోందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్రకూటమిగా ఏర్పడ్డ కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌లకు ఏపీ ప్రయోజనాలు అవసరం లేదని విమర్శించారు. 

 

13:57 - November 4, 2018

హైదరాబాద్ : ఆరు బయట ఆడకోవడం మానేస్తున్నారు....గ్రౌండ్ కెళ్ళి ఆటలు ఆడటం మరిచిపోతున్నారు...నాలుగ్గోడలమధ్య బందీ అవుతున్నారు...మొబైల్ గేమ్స్ కు బానిసలవుతున్నారు.. తెలివితేటలు పెంచని , ఆహ్లాదాన్ని అందించని...మానసికక ,శారీరక ఉల్లాసాన్ని కలిగించని ఆటల్లో మునిగిపోతున్నారు...నేటి బాల్యం వీడియోగేమ్స్ మైదానంలో విహరిస్తోంది.

వీడియో గేమ్స్ సరదాగా వుంటాయి. టైం  మరిచిపోయి....అందులోనే లీనమైపోతుంటారు చిన్నారులు. ఒకటా రెండా ... వేలాది మొబైల్ గేమ్స్  డౌన్ లోడ్ కు అందుబాటులో వున్నాయి.. గంటల తరబడి వాటితోనే కాలం గడిపేస్తున్న చిన్నారులకు అది ఎంత వరకు ప్రయోజనకరం.  ఒక్కసారైనా ఆలోచించారా...వీడియో గేమ్స్ మీ పిల్లలకు నేర్పిస్తోంది ఏంటి..? అది వారికి ఎంత వరకు ప్రయోజనకరం..?  మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందా...? శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందా...?మంచి చెడుల విచక్షణ నేర్పుతుందా...? ఈ ప్రశ్నలకు పిల్లల మానసిక వైద్య నిపుణులు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా..? 

వీడియో గేమ్.. పిల్లల్ని పెడధోరణలు పట్టిస్తోంది... విపరీత మానసిక ప్రవర్తనకు కారణం అవుతోంది...
వ్యక్తిత్వ నిర్మాణ లోపాలు కలిగిస్తోంది. చెడు మార్గాల వైపు నడిపిస్తోంది. అవును పసి మనసులు మొద్దు బారిపోతున్నాయి.. మెషీన్లతో దోస్తీ చేస్తూ... సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. హింసతోనే విజయం, ఆనందం అనే స్ధాయికి వీడియో గేమ్స్ వారిని తీసుకెళ్ళిపోతున్నాయి. 

ఒకచేత్తో తుపాకీ...రెండో చేతిలో రెండు ఆయుధాలు కనిపించిన వాడినల్లా కాల్చేస్తూ పోవడం. ఇదే పబ్జీ గేమ్. మరి ఈ గేమ్ నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ... కేవలం నాలుగు నెలల కాలంలో పది కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే...ఈ గేమ్ కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారో అర్దం చేసుకోవచ్చు. యూయస్ టైమ్స్ దీన్ని మోస్ట్ పాపులర్ గేమ్ గా గుర్తించింది.

పిల్లల్లో బాగా క్రేజ్ వున్న గేమ్. దారిలో అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ...వారి దగ్గరున్న డబ్బు దోచుకుంటూ...కనిపించిన వాహనాన్ని దొంగిలిస్తూ పారిపోయే ఆట. రక్తం వేడెక్కుతుంది...గుండె వేగం పెరుగుతుంది. వంపులు., ఆటంకాలు వున్న దారిలో వేగంగా దూసుకెళ్ళాలి. ప్రమాదాలకు ఎదురెళ్లాలి. వాటిని తప్పించుకుమటూ నాణాలు పోగేసుకుంటూ ముందుకెళ్ళాలి.

అందరికీ తెలిసిన గేమ్. చిన్నా పెద్దా అందరూ ఆడే ఆట. చూశారుగా ఇవి పిల్లల్ని బానిసలుగా మార్చిన విడియో గేమ్స్ లో ఇవి కొన్ని. వీటిలో ఏవైనా...విలువులు పెంచేవి వున్నాయా...?  తెలివితేటలు పెంచే ఆటలు వున్నాయా...? ఆహ్లాదాన్ని అందించేవి వున్నాయా...? గన్ తో కాల్చి చంపడం...ర్యాష్ డ్రైవింగ్ చేయడం..యాక్సిడెంట్స్ చేసి పారిపోవడం..కాయిన్స్ దోచుకోవడం..ఇవే మీ పిల్లలకు విడియో గేమ్స్ నేర్పుతున్నది.. ఇలాంటి గేమ్స్ దాదాపు మూడు వేల వరకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో వున్నాయి. ఈ గేమ్స్ ఆడితే  పాయింట్స్ వస్తాయి. మీరు విన్నర్ అవుతారు.  ఈ హింసానందంలో మునిగిపోయి....బాల్యం సున్నితత్వాన్ని కోల్పోతుంది.  టెక్ అడిక్షన్ అనే సంస్ధ చేసిన సర్వే ప్రకారం 40శాతం మంది పిల్లలు విడియోగేమ్స్ ఆడుతున్నారు. అందులో 12 శాతం మంది వాటికి బానిసలుగా మారిపోయారు. నలుగురితో కలవడం...భావాలను పంచుకోవడం...మరిచిపోయారు . శారీరక మానిసిక ఉల్లాసాన్ని కలిగించే ఆటలకు దూరం కావడం వల్ల పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణ లోపాలు తలెత్తుతున్నాయని చిన్న పిల్ల మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అతి తక్కువ సమయంలో గేమ్స్ పూర్తి చేయాలన్న యాంగ్జైటీ వారిని ఒత్తిడి, కుంగుబాటులోకి నెట్టేస్తోందని చెబుతున్నారు. మరి జాగ్రత్తలు తీసుకోవాలసిన తల్లి దండ్రులు ఏం చేస్తున్నారు. చాలా మంది తల్లి దండ్రులు కూడా ఈ విడియో గేమ్స్ లో బిజీగా వున్నారు. డియర్ పేరెంట్స్ ....మొబైల్ గేమ్స్ నుంచి ముందు మీరు తల పైకెత్తండి. . మీ పిల్లల వైపు చూడండి . వారు  ఏం చేస్తున్నారో గమనించండి.

ఆరుబయట తోటి పిల్లలతో మీరు ఆడుకున్నారు...మరి మీ పిల్లలు కూడా అలాగే ఆడుకోవాలిగా . విలువలు పెంచే తెలివితేటలు పెంచే...శారీరక మానసిక ఉల్లాసాన్ని అందిచే ఆటలు మీ పిల్లలకు నేర్పండి...ఆ అవకాశం మీరే కల్పించండి. పసి మనసులు మొద్దు బారి పోక ముందే...మీరు నిద్ర మేల్కోండి.      

13:47 - November 4, 2018

హైదరాబాద్: చంద్రబాబు-రాహుల్ కలయికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ టీడీపీ కలయికను వ్యతిరేకిస్తూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ ఘాటుగా స్పందించారు. ''నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు” అన్న సామెత లాగా .. ముఖ్యమంత్రి గారు, అవకాశవాద రాజకీయాలుతో, పూటకొక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది ఉన్నారు.. అలిసి పోయిఉన్నారు .. ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్యాలు ఆపేసేయాలి... ఇక భరించలేకుండా ఉన్నాం..'' అని పవన్ పోస్టులు, ట్వీట్‌లు పెట్టారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో భూమి నెర్రెలు బారిన అంశంపైనా పవన్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకి సమీపంలోని రహదారిపై భూమి తీవ్రంగా నెర్రలుబారి.. పైకి ఉబికి వచ్చింది. నేలపై పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ''బాబుగారూ.. మీరు ఇది గమనించారా? భూమి నెర్రెలు బారడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భూకంపం వచ్చిందేమోనని భయపడుతున్నారు. మీరు వెంటనే దీనిపై స్పందించి, పగుళ్లు రావడానికి గల కారణాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని పవన్ ట్వీట్ పెట్టారు.

13:44 - November 4, 2018

హైదరాబాద్ : అయ్యో నెట్ లేదే...బ్యాలెన్స్ అయిపోయిందే..ఒక్కసారిగా వైఫై కనెక్షన్ ఆగిపోతే..నెట్ లేకపోతే నిమిషం కూడా ఉండలేకపోతున్నారా ? అయితే మీరు ప్రాబ్ర్లమ్ లో పడ్డట్టేనంట. అవును నెట్ లేకపోతే కొంతమంది ఏదో కోల్పోతున్నామనే భావనలో ఉంటున్నారంట. కొంతమందిలో సర్వే చేసిన అనంతరం కొన్ని విషయాలను గుర్తించారు. 
Image result for FOMO, psychologists, technology, Dr. Lee Hadlington, digital technology, Elsevier.చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్..అందులో నెట్ ఉంటే చాలు..ప్రపంచం మీ గుప్పిట్లో ఉంటుంది. ఎలాంటి సమాచారం అయినా క్షణాల్లో తెలుసుకొనే అవకాశం ఉంది. విషయాన్ని పది మందితో పంచుకోవడవం..వారి అభిప్రాయాలు తెలుసుకోవడం..ఛాటింగ్..పోస్టులు..షేర్లతో యువత కాలం గడిపేస్తోంది. కానీ నెట్ లేకపోయేసరికి వారిలో ఎలాంటి భావాలు వ్యక్తమౌతాయో తెలుసుకొనేందుకు మాంట్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కొంతమందిని పరిశీలించారు. నెట్ ఆగిపోతే ఏదో కోల్పోతున్నామనే భావనలో వారిలో కలుగుతోందని..నెట్ బానిసలుగా మారిన వారిలో విపరీతమైన స్పందనలు వ్యక్తమౌతున్నాయని గ్రహించారు. ఇది అనేక దుష్పలితాలకు కారణమౌతాయని, వారిమీద ప్రభావం చూపడంతో పాటు వెనుకపడుతారని 

13:32 - November 4, 2018

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని, హైదరాబాద్ చేరుకుంది మూవీ టీమ్. ఎఫ్2లో వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతుండగా, వారికి జంట అయిన తమన్నా, మెహరీన్ ఇద్దరూ అక్కా,చెల్లెళ్ళుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు, ఎఫ్2 - ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యనున్నట్టు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. దీపావళి కొంచెం ముందుగా అంటూ, ఎఫ్2 ఫస్ట్‌లుక్  అప్‌డేట్‌తో ఒక పోస్టర్ పోస్ట్‌చేసాడు. అందులో, వి2, వెంకటేష్, వరుణ్ తేజ్ అని మెన్షన్ చేసారు. లోగో డిజైనింగ్ టైటిల్‌కి తగ్గట్టుగా సెట్ అయింది.  ఇప్పటికే దిల్ రాజు, అనిల్ కాంబోలో, సుప్రీమ్, రాజా ది గ్రేట్ లాంటి రెండు హిట్స్ వచ్చాయి. ఎఫ్2తో, హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.  

13:29 - November 4, 2018

హైదరాబాద్ : అతని వయస్సు పదకొండేళ్లు.. చదువుతున్నది సెవెన్త్ క్లాస్.. కాని పాఠాలు చెబుతున్నది మాత్రం బిటెక్ విద్యార్ధులకు.. అందేటని ఆశ్యర్యపోతున్నారా? కాని అదే నిజం.. చిన్న పిల్లాడు అయినా చాలా పెద్ద లక్ష్యాలతో క్లాసులు చెబుతూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. 

హైదరాబాద్‌కు చెందిన హసన్ అలి...దకొండేళ్ల వయసులో తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలో బిటెక్ విద్యార్ధులకు పాఠాలు చెబుతూ ఎంతో బిజిగా మారాడు. బిటెక్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్లిన చాలామంది తమ బ్యాగ్రౌండ్‌లో కాకుండా ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతికేస్తున్నారని...దానికి కారణం వారంతా కమ్యూనికేషన్ స్కిల్స్‌లో చాలా వెనకబడి ఉండటం...వాటితో పాటు డ్రాఫ్టింగ్, డిజైనింగ్ లో చాలా వెనకబడి ఉన్నారని తెలుసుకుని వాటిని నేర్పాలనే ఉద్ధేశంతో తాను టీచర్ గా మారానని చిన్నారి బుతున్నాడు. 

అసలింతకీ చిన్నారి పాఠాలు చెబుతానంటే ఒప్పుకున్నదెవరు అనే అనుమానాలు రాకతప్పవు. తన తండ్రిని వెంటబెట్టుకొని హైదరాబాద్‌ మలక్‌పేట తిరుమల టవర్స్‌లోని ఓ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లిన హసన్ అలి....ఇక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇన్‌స్టిట్యూట్ వారు ఆశ్యర్యపోయినట్లు తెలుస్తోంది. అయితే కంపూట్యర్ డిజైనింగ్‌, డ్రాఫ్టింగ్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేస్తున్న లోపాలను అధిగమించేందుకు ఎలాంటి మెలకువలు పాటించాలనే అంశాలపై ఆ అబ్బాయి చకచకా వివరిస్తుంటే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. 

ఇంతటి ప్రతిభ కల్గిన విద్యార్థి తమ పాఠశాలలో చదవడం సంతోషాన్ని కల్గిస్తుందని హసన్ అలి స్కూల్ ప్రిన్సిపాల్ అంటున్నారు. హసన్ అలికి ఉన్న ప్రతిభను గుర్తించి తామే ఆ దిశగా ప్రోత్సహించామని తెలిపారు. ఇక హసన్ చెప్పే పాఠాలపైన ఎంతో సంతృప్తి ఉన్నామని బిటెక్ విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు ఇంత చిన్న వయసులో ఎంతో గొప్ప ఆలోచనలు చేస్తూ వండర్ కిడ్ అనిపించుకుంటున్నాడని అందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

13:09 - November 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో డబ్బు..మద్యం ప్రభావం భారీగా ఉంటుందా ? ఓటర్లను మభ్య పెట్టేందుకు అభ్యర్థులు సరంజామాను సిద్ధం చేసేస్తున్నారా ? ఈసారి జరిగే ఎన్నికల్లో భారీగా మద్యం..డబ్బు పంపిణీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనితో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు చర్యలు తీసుకొనడానికి ఎన్నికల అధికారులు సిద్ధమౌతున్నారు. 
2014 ఎన్నికల్లో రూ. 76 కోట్లు ? 2018లో ?...
ఇప్పటికే పట్టుబడింది రూ. 55 కోట్లు...
కీలక నియోజకవర్గాలపై ఈసీ నిఘా ?
అన్ని మార్గాల దగ్గర చెక్ పోస్టులు
సంచార బృందాల నియామకం..నిత్యం తనిఖీలు...

Image result for Telangana Election 2018 cash and liquorడిసెంబర్ 7న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేసేస్తున్నారు. మరోవైపు గెలుపొందేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మహా కూటమి పేరిట కలుస్తున్న కాంగ్రెస్, జనసమితి, టీడీపీ, సీపీఐ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ముందే అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ దళం ప్రచారం ముందంజంలో ఉంది. కానీ కొన్ని కీలక నియోజకవర్గాల్లో అధికంగా డబ్బు..మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని ఈసీ గుర్తించింది. దీనితో ఓటర్లను మభ్య పెట్టకుండా ఉండేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలు రచిస్తోంది. ఓటర్లను తిప్పుకోవడానికి అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపుతారని గుర్తించింది. 2014 ఎన్నికల్లో రూ. 76 కోట్ల నగదు పట్టుబడగా, ఈ ఎన్నికల్లో ఇప్పటికే రూ. 55 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ధన ప్రవాహం అధికంగా ఉండే నియోజకవర్గాలపై క్షేత్రస్థాయి అధికారుల నుండి ఎన్నికల సంఘం నివేదిక కోరింది. 
Image result for Telangana Election 2018 cash and liquorప్రధానంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలు బరిలోకి దిగే నియోజకవర్గాల్లో ఖర్చు భారీగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని అభ్యర్థులు సిద్ధం కావడం...డబ్బు..మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో డబ్బు భారీగా పట్టబడుతోంది. మద్యం, చీరలతో పాటు వివిధ రకాల వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిని అరికట్టేందుకు కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, ఆయా నియోజకవర్గాలకు వచ్చే అన్ని మార్గాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. 

12:57 - November 4, 2018

కర్నూలు : ఏపీ మంత్రి అఖిలప్రియ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ ప్రతీకార వ్యాఖ్యలు చేశారు. ’నా తండ్రిని వేధించిన వారి లెక్కలు తేలుస్తా’ అంటూ శపథం చేశారు. కొత్తపల్లెలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. దత్తత గ్రామం కొత్తపల్లెలో అఖిలప్రియ సీరియస్ కామెంట్స్ చేశారు. జన్మభూమి కార్యక్రమంలో ఇక్కడే తన తండ్రిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లెలో ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని పిలుపు ఇచ్చారు. పార్టీ జెండా చూసి ప్రత్యర్థులు పారిపోయేలా సహకరించాలని ప్రజలకు విన్నపం తెలియజేశారు. అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 

12:35 - November 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. ఓటర్ల శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రచారం..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా వెల్లడించడంలాంటి పలు కార్యక్రమాలు చేపడుతోంది. పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రజలకు అవకాశాలు కల్పించింది. ఇప్పటికే పలు అవకాశాలను కల్పించిన ఎన్నికల సంఘం చివరి అవకాశాన్ని కల్పించింది. 
Image result for Let's Go And Check The Voter List hyderabadఆదివారం హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాలకు చెందిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో పేరు ఉందో? లేదో? ఓటర్లు నేరుగా వెళ్లి పరిశీలించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గం. నుండి సా.5 వరకు ఈ వెసులుబాటును కల్పించారు. ఒకవేళ పేరు లేనిపక్షంలో అక్కడనే దరఖాస్తు చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పించారు. నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉండడం జరుగుతందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనాలని అధికారులు సూచించారు. 

12:34 - November 4, 2018

రంగారెడ్డి : జిల్లాలోని శేరిలింగంపల్లి టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఆ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. టికెట్ ఖరారు కాకముందే భవ్య ఆనంద్ ప్రసాద్ బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో ఆగ్రహించిన మువ్వ సత్యనారాయణ వర్గీయులు ఆనంద్ ప్రసాద్ బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, మువ్వ సత్యనారాయణ, ఆనంద ప్రసాద్ టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

 

12:28 - November 4, 2018

హైదరాబాద్: దేశం కోసం అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటిది..  కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి కాంగ్రెస్-టీడీపీ కలయికను తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ కేంద్ర నాయకుల వద్ద మోకరిల్లారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పొట్టుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకి వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను ఎండగడుతూ.. తనతో తన భర్త ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు నాలుగు పేజీల లేఖ రూపంలో ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారామె.

Image result for lakshmi parvathi letter‘మహనీయుడైన ఎన్టీఆర్‌ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గానీ పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయింది. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ తలవంచకుండా ఎన్టీఆర్ పాలించారు. నేడు కేవలం తన స్వార్థం కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారు. కళ్ల మందే విలువల్ని వలువలుగా పూడ్చుకొని, పూర్తి నగ్నంగా కాంగ్రెస్ వాకిట్లో నిలబడ్డ మీ పార్టీని చూసి నిన్న చాలా సేపు దు:ఖించా. స్వామీ మీరు మళ్లీ పుట్టరా.. ఈ వెన్నుపోటుదారులను, అవినీతి చక్రవర్తులను, స్వార్థం కోసం నీతిని అమ్ముకునే కుహనా నాయకులను దేశం నుంచి తమికొట్టరా.. పూజ్యులైన మీ పాద పద్మములకు నమస్కరిస్తూ.. మీ భార్య లక్ష్మీ పార్వతి’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో కూడిన లేఖను లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారు. అయితే తాను ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను తప్ప రాజకీయాలు చేయడానికి కాదని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

Related imageచంద్రబాబు తప్పులు చేస్తున్నా ఎన్టీఆర్‌ అభిమానులంతా పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారని, ఏ సిద్ధాంతం మీద పార్టీని స్థాపించారో ఆ పునాది కూలిపోయిందని లక్ష్మీపార్వతి వాపోయారు.

 
12:15 - November 4, 2018

పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిపై పగుళ్లు ఆగడం లేదు. నిన్నటి నుంచి రోడ్డు పైకి లేస్తోంది. భూమిపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడుతున్నాయి. 25 అడుగులు పైగా భూమి పైకిలేసింది. దీంతో కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ప్రొక్లైన్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. పగుళ్లు ఏర్పడటం, భూమి పైకి లేవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టులోని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడంతోనే పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.

 

 

12:12 - November 4, 2018

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై, అభిషేక్ నామా, భాస్కర్ రషి నిర్మాతలుగా, ధనుంజయ, ఇర్రా మోర్ జంటగా, వర్మ శిష్యుడు సిద్దార్థ డైరెక్షన్‌లో, రాయల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో, తెరకెక్కిన ఫ్యాక్షన్ అండ్ లవ్ సినిమా.. భైరవ గీత.
రెండునెలల క్రితం భైరవ గీత టీజర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసింది. రెండు నిమిషాల  ఈ ట్రైలర్ ఆద్యంతం రక్తపాతం, అక్కడక్కడా రొమాన్స్‌తో సాగిపోయింది. విలన్‌కి నమ్మిన బంటుగా ఉండే హీరోకి, హీరోయిన్ విషయంలో.. విలన్‌తో గొడవ రావడం, హీరో, హీరోయిన్ ఎస్కేప్ అవడం, విలన్ ఎంటరవడం, ఇక అక్కడి నుండి రక్త చరిత్ర రేంజ్‌లో రచ్చ మొదలవడం వంటివి ట్రైలర్‌లో చూపించారు. నటీ‌నటులు సీమ‌యాసలో డైలాగులు చెప్పడంతో పాటు, నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ట్రైలర్ చివర్లో, హీరో, విలన్‌కి వార్నింగ్ ఇచ్చే షాట్, మాస్ ఆడియన్స్‌కి కిక్కిస్తుంది. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం బాగున్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న భైరవ గీత నవంబర్ 22న  రిలీజ్ అవనుంది.


వాచ్ ట్రైలర్..

 

 

12:06 - November 4, 2018

ఉత్తర్ ప్రదేశ్ : అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు మొదలవుతాయంటూ ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయం కోసం ప్రతొక్కరూ దీపావళి పండుగ సందర్భంగా దీపం పెట్టాలని సూచించారు. రాజస్థాన్‌ బికనేర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 
ఆయన వ్యాఖ్యలపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సుప్రీంకోర్టులో అయోధ్య రామ మందిరంపై విచారణ సాగుతోందని, ఈ తరుణంలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని నేతలు పేర్కొంటున్నారు. మరోసారి ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మరింత ముదురుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

12:00 - November 4, 2018

హైదరాబాద్: దీపావళి అంటే గుర్తొచ్చేది టపాసుల మోతలు అవి పంచే వెలుగులు. అయితే వినోదం మాటున దాగున్న కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు కీలక తీర్పున్చింది. దీపావళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సూచించింది. సుప్రీం తీర్పు నేపధ్యంలో మార్గదర్శకాల అమలు పై గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. సమయం దాటి టపాసులు కాల్చేవారిని ఎలా అదుపు చేస్తారు. టపాసులు పేల్చిన తర్వాత కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాకిళ్లలో వెలుగులు నింపే దీపావళి సంబరాలంటే చిన్నా పెద్దా అందరికి సంబరమే. ఈ వేడుక రోజు రకరకాల టపాసులతో పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లలుగా మారిపోయి కేరింతలు కొడతారు. అయితే ఈ దీపావళి వెలుగుల వెనుక కాలుష్యపు చీకటి కోణంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా బాణాసంచా కాల్చడంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవైనా రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేపధ్యంలో నగరంలో బాణాసంచా కాల్పులపై నియంత్రణ ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ వ్యవహారం కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి రావడంతో ఇప్పుడు అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు.

Image result for diwali supreme courtహైదరాబాద్ నగరంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ పొల్యూషన్‌ను నియంత్రించేందుకు నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి కంటిన్యూయస్ యాంబ్యియంట్ ఎయిర్ క్వాలిటీ అనే అధునాతన యంత్రంతో వాయు కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ పరికరంతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, బెంజిన్, టోలిన్ వంటి కాలుష్యకారకాల మోతాదును లెక్కిస్తుంది. వీటితో పాటు నగరంలోని మరో 21 పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ డస్ట్ శాంప్లర్ అనే వాటితితో గాలిలోని ధుమ్ము ధూలిని లెక్కకడుతోంది.

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం నగరంలో దీపావళికి వారం రోజుల ముందు తరువాత నగరవ్యాప్తంగా ఉన్న వాయు కాలుష్యాన్ని లెక్కించాలి. అయితే దీనికి అవసరమైన సిబ్బంది అందుబాబులో లేరని పీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో దీపావళి పండుగ రోజు అవధులు దాటే కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారన్నది సప్పెన్స్‌గా మారింది. మరోవైపు పర్యావరణానికి హాని కలిగిస్తున్న టపాసులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Image result for diwali supreme courtమరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి బాణా సంచా కాలిస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు పండుగ రోజు 2 గంటలు మాత్రమే బాణాసంచా కాల్చలాన్న నిర్ణయం అమలులో ఇబ్బందులున్నా అమలుపరచ్చాల్పిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే పండుగ రోజు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చిందని అంటున్నారు న్యాయనిపుణులు.

ఓవైపు సుప్రీంకోర్టు మరోవైపు ప్రజల విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

11:36 - November 4, 2018

నాగపూర్ : మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పాండ్రకొండ అడవుల్లో 13 మందిని చంపేసిన ‘ఆడ పులి’ హత్యోదంతం తీవ్రమౌతోంది.  ఈ మ్యాన్‌ ఈటర్‌ పులిని చంపవచ్చని గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పులిని వేటాడేందుకు మూడు నెలలుగా అటవీశాఖ అధికారులతో సహా సుమారు 150 మంది గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఈ పులిని ఎట్టకేలకు చంపేశారు. దీనిని కాల్చి చంపింది అస్ఘర్ ఆలీఖాన్ అని తెలుస్తోంది. ఇతను హైదరాబాద్ వాసీ అని సమాచారం. కానీ ఇతనికి లైసెన్స్ లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. 
మరోవైపు 13 మందిని చంపిన పులి హత్యోదంతంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమౌతోంది. చంపక తప్పని పరిస్థితుల్లో చంపామని అస్ఘర్ వెల్లడించాడు. పులిని కాల్చే ముందు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేయకుండానే చంపినట్లు వన్యప్రాణి సంరక్షకులు విమర్శిస్తున్నారు. 
ఏడాది కాలంగా 13 గ్రామాల ప్రజలను 'ఆవని' ఆడపులి భయపెట్టింది. థర్మల్‌ డ్రోన్లతోపాటు కెల్విన్‌ క్లెయిన్‌, స్నిఫర్‌ డాగ్స్‌, పారాగ్లైడర్లు, 112 కెమెరాట్రాప్‌లతో పులి కోసం గాలించారు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ పులిని చంపినట్లు అధికారులు ప్రకటించారు. 

11:30 - November 4, 2018

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 20ఏళ్ల తర్వాత జలగం ప్రసాదరావు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినట్టు అయ్యింది. ఆరేళ్లుగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎత్తివేసినప్పటికీ జలగం టీఆర్ఎస్‌లో చేరారు. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి కాంగ్రెస్‌లో చేరేందుకు విఫలయత్నం చేసిన జలగం చివరకు కారెక్కారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొన్నారు.

Image result for jalagam prasada raoఅన్ని వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని ప్రసాదరావు అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పొరపాటున మహాకూటమి అధికారంలోకొస్తే, మనకు నీళ్లు రావని, నాగార్జున సాగర్ గేట్లను చంద్రబాబు మూసేస్తారని హెచ్చరించారు. తెలంగాణలో చంద్రబాబు చెబితే సీట్లిచ్చే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని జలగం విమర్శించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. బడుగు బలహీనవర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహాకూటమికి అధికారం ఇస్తే.. అమరావతి నుంచి పాలన కొనసాగుతుందని కేటీఆర్‌ హెచ్చరించారు.
 

Image may contain: 21 people, people smiling, people on stage and indoorకాగా, జలగం ప్రసాదరావు చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడైన జలగం ప్రసాదరావు 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో ఆయనను పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. అప్పటి నుంచి ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఇటీవల ఆయనకు పీసీసీ సంప్రదింపుల కమిటీ నుంచి పార్టీలో చేరేందుకు ఆహ్వానం వచ్చినా.. జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

11:22 - November 4, 2018

కేరళ : మళ్లీ టెన్షన్...టెన్షన్...అయ్యప్పను దర్శించుకుంటామని మహిళలు..అడ్డుకుంటామని ఇతరుల హెచ్చరింపులు..దీనితో మరోసారి కేరళ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించాల్సిందేనని.. అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.Image result for sabarimala Temple Open On monday Full Tension ఈ తీర్పును పలువురు వ్యతిరేకించారు. ఇటీవలే తెరిచిన ఆలయం వద్దకు అయ్యప్పను దర్శించుకొనేందుకు వచ్చిన మహిళలు ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెరిచిన రోజుల్లో ఏ ఒక్క మహిళ దర్శనం చేసుకోలేదు. తాజాగా సోమవారం ఆలయం తెరుచుకోనుంది. 
Image result for sabarimala Temple Open On monday Full Tensionదీనితో అక్కడి రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నీలక్కల్ నుండి పంబా వరకు పలు ఆంక్షలు విధించారు. మహిళలు రాకుండా హిందూ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు మోహరించడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేవలం 9గంటల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. స్వామిని దర్శించుకునేందుకు 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఇప్పటికే శబరిమలకు బయలుదేరినట్లు సమాచారం. 
ఈ సందర్భంగా పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. భక్తులు గుమికూడి ఉండవద్దని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కాప్స్ హెచ్చరించారు. ఇందులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. 

11:06 - November 4, 2018

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపొద్దు..ప్రాణాలను తీయకండి...బలికాకండి..అంటూ నగర కాప్స్ విన్నపాలను మద్యం బాబులు బేఖాతర్ చేస్తున్నారు. వీకెండ్స్ లో నిర్వహించే తనిఖీల్లో మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు. వీరి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు మద్యం సేవించిన వారు చుక్కలు చూపెడుతున్నారు. వీరిని సముదాయించడానికి...వారి వాహనం సీజ్ చేయడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టుబడుతున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. దీనితో మహిళా పోలీసులు కూడా ఉండాల్సి వస్తోంది. 
శనివారం బంజారాహిల్స్..జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులందరినీ తనిఖీలు చేశారు. మొత్తం 108 మందిపై కేసులు పెట్టారు. ఇందులో 43 కార్లు, 65 బైకులను సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో పలువురు మహిళలున్నారు. వాహనాలను అప్పగించేందుకు పలువురు మహిళలు సహకరించలేదని తెలుస్తోంది. వారిని అదుపు చేయడానికి పోలీసులు మహిళా పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చిందని 

11:05 - November 4, 2018

ఢిల్లీ: కుమారులకు అధికారం కట్టబెట్టేందుకే జాతీయ కూటమి ఏర్పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏకమవుతున్న పార్టీలకు అధికార దాహమే కానీ.. సిద్ధాంతపరమైన సారూప్యత లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రాహుల్, చంద్రబాబునుద్దేశించి మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలకు అనువంశిక పాలనే ముఖ్యమని విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉంటే తమ వారసులకు భవితవ్యం ఉండదనే భయం పట్టుకుందన్నారు. అందుకే తమ పిల్లలు, బంధువుల కోసం, వంశపాలన కొనసాగేందుకు ఇలా కూటమి ఏర్పరుస్తున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండా మోడీ తొలిసారిగా జాతీయ ఫ్రంట్‌పై స్పందించారు. అనువంశిక పాలన పేరుతో రాహుల్‌, చంద్రబాబులిద్దరినీ ఆయన టార్గెట్‌ చేశారు.

ఐదు లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఏకే-47 పేల్చినపుడు బుల్లెట్లు శరపరంపరగా బయటకొస్తాయి. అదే రీతిన అబద్ధాలను పేలుస్తున్నారు. విపక్షాలు కావవి.. అబద్ధాలు వెళ్లగక్కే యంత్రాలు అని ప్రధాని విరుచుకుపడ్డారు. విపక్ష కూటముల గురించి ఆందోళన వద్దు.. వాటిని పట్టించుకోవద్దని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

10:52 - November 4, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ‘నిర్భయ’ చట్టం రేప్ నిందితులకు భయాన్ని కలిగించడంలేదు. మహిళలపై అత్యాచారాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. రేపిస్టులు వారి వికృత చేష్టలను కొనసాగిస్తూనే ఉన్నారు. కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొందరు దుర్మార్గులు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 
బరేలి జిల్లాలో బాలిక (8) పాముకాటుకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీఛక్షించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తి కన్ను ఆ బాలిక పడింది. వెంటనే తన స్నేహితులకు విషయం తెలియచేసి ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. తనకు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం ఐదుగురు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

10:43 - November 4, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో పడింది. కేకే ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు స్వీకరించింది. ప్రజాకర్షక మ్యానిఫెస్టోను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

తెలంగాణాలో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు గులాబి పార్టీ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనినిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా  పార్టీ మేనిఫెస్టో కమిటీ.....ప్రజా సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన నవారి నుంచి  పెద్ద ఎత్తున విజ్ఙప్తులు స్వీకరించింది. అన్ని వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా మ్యానిఫెస్టోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చెమటోడుస్తోంది. ఇప్పటికీ కీలక నిర్ణయాలను పాక్షికంగా వెల్లడించిన గులాబి పార్టీ... మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

పాక్షిక మేనిఫెస్టోతో ప్రచార పర్వంలో పాల్గొంటున్న నేతలు..... ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వినతులను మేనిఫెస్టో కమిటీకి తెలియచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తమ మేనిఫెస్టో ఉంటుందని గులాబి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫి, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి నిర్ణయాలను వెల్లడించిన అధికార పార్టీ...... తెలంగాణాలో ఉన్న బలహీన వర్గాలకు భీమా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతులకు మాత్రమే ఇస్తున్న భీమా... ఇకపై బీసీల వర్గాల ప్రజలకు వర్తింపజేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. భూమి లేని నిరుపేదలకు రూ.5లక్షల బీమా చేయించడంపై మేనిఫెస్టో కమిటీ చర్చంచింది. అలాగే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే విధంగా మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల వారిగా కూడా కొత్త పథకాలపై పార్టీ ఇప్పటికే సమీక్షలు జరిపి మ్యానిఫెస్టో కమిటీ పథకాలను రూపొందిస్తోంది. 

దీపావళి తర్వాత మొదలయ్యే సీఎం ప్రచార సభల సమయానికి మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసే విధంగా కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 

10:33 - November 4, 2018

విశాఖ : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై మావోయిస్టులు వివరణ ఇచ్చారు. 14 పేజీల ఇంటర్వ్యూను విడుదల చేశారు. జగబంధు పేరు మీద లేఖలను విడుదల చేశారు. కిడారి, సోమలు ఆస్తులు కూడబెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారని జగబంధు పేర్కొంది. కిడారి, సోమలు బాక్సైట్ తవ్వకాలకు మద్దతు ఇచ్చారని తెలిపింది. కిడారి, సోమను శిక్షించడానికి ముందు గంట సేపు ప్రజాకోర్టు నిర్వహించామని పేర్కొంది. కిరాయి కోసం హత్యలు చేయబోమని స్పష్టం చేసింది. ఉనికి కోసమే కాల్పులకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో నిజం లేదని జగబంధు తెలిపింది.  

 

10:10 - November 4, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మరో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా.. కరీబియన్‌ జట్టును ఢీకొంటుంది. అయితే టీ20లకు చిరునామా అయిన ధోని లేకుండానే భారత్‌ బరిలో దిగుతోంది. అంతేకాదు కెప్టెన్‌ కోహ్లికి కూడా విశ్రాంతినివ్వడంతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్‌ఇండియా.. విండీస్‌తో పోరుకు సై అంటోంది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టును రోహిత్‌శర్మ నడిపించనున్నాడు. ధోని, కోహ్లి లేని నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించడం రోహిత్‌కు సవాలే. ధోని లేకపోవడంతో తనను తాను నిరూపించుకునేందుకు రిషబ్‌ పంత్‌కు ఇదే సరైన అవకాశం. మరోవైపు స్టార్‌ ఆటగాళ్లు వచ్చి చేరడంతో వెస్టిండీస్‌ బలోపేతమైంది. కెప్టెన్‌ హోల్డర్‌ స్థానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ప్రమాదకర ఆటగాడు. డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌, రామ్‌దిన్‌ లాంటి అనుభవజ్ఞులు జట్టులో చేరడంతో హోరాహోరీ పోరు జరగడం మాత్రం పక్కా.

09:44 - November 4, 2018

విశాఖ : ఏలేరు రిజర్వాయర్ నుంచి వైజాగ్‌ వెళ్లే కాలువకు గండి పడింది. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలోకి నీళ్లు చేరాయి. ఇళ్లల్లోకి చేరిన నీటితో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు రిజర్వాయర్ వద్ద గేట్లు మూసి నీటిని అదుపు చేశారు. గండి పూడ్చివేత పనులు ప్రారంభించారు.

09:40 - November 4, 2018

విజయవాడ: చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ క‌ల‌యిక ఏపీ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. వారి దోస్తీని నిర‌సిస్తూ కాంగ్రెస్ సీనియ‌ర్లు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వ‌ట్టి వ‌సంత్ కుమార్.. సి. రామ‌చంద్ర‌య్య.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడుతున్న నేతల నెక్ట్స్ స్టెప్ ఏంటి? వారంతా ఏ పార్టీలో చేరబోతున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మోడీ సారథ్యంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా చంద్ర‌బాబు, రాహుల్ దోస్తీ కట్టారు. వారిద్దరి చర్చల తరువాత‌ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వారి కలయికను నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌ను భూస్టాపితం చెయ్యాల‌న్న చంద్ర‌బాబుతో చేయి కలపడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఆపత్కాలంలో రాష్ట్రంలో పార్టీ వెన్నంటే ఉన్న తమను కనీసం సంప్రదించకుండా.. రాహుల్ చంద్రబాబుతో ఎలా చర్చలు జరుపుతారని వారు  ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇక‌పై క‌లిసి ప‌నిచేస్తామ‌న్న చంద్రబాబు, రాహుల్ ప్రకటనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన వారి సంఖ్య రెండు(వట్టి వసంత్ కుమార్, సి.రామచంద్రయ్య) అయిన‌ప్ప‌టికీ ఈ సంఖ్య మ‌రింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలా మంది వైసీపీ, జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి టీడీపీ, కాంగ్రెస్ మైత్రి అవకాశంగా దొరికినట్లయింది. అయితే కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న నేతల నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌‌కు రాజీనామా చేసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనూహ్యంగా జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్యలు కూడా మనోహర్ బాటలోనే పయనిస్తారని తెలుస్తోంది. జనసేన తీర్దం పుచ్చుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. వట్టి వసంతకుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలో దించే అవకాశముందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక సి రామ‌చంద్ర‌య్య సైతం జ‌న‌సేనలోకి వ‌చ్చేందుకు సుముఖంగా  ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జారాజ్యం నుండి ప‌వ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌ద్యంలో రామచంద్రయ్య త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

ప్ర‌స్తుతం జనసేన పార్టీలో.. సీనియ‌ర్ లీడ‌ర్స్ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో కాంగ్రెస్‌ను వీడుతున్న నేతల దృష్టంతా పవన్ పార్టీపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో నినాదాన్ని ఎత్తుకున్న పవన్..  ఆ పార్టీ నేతల పట్ల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది రాజకీయంగా చర్చకు  తెరలేపింది.

09:32 - November 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోజుకో చోట కరపత్రాలు, వాల్ పోస్టర్లతో అలజడి సృస్టిస్తున్నారు. ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పుతున్న పోలీసులు.. వారిని కట్టడి చేసేందుకు ప్లాన్స్ రేడీ చేసుకుంటున్నారు. దీంతో గోదావరి పరివాహాక ప్రాంతాలు ఎన్నికల వేళ చిగురుటాకులా వణుకుతున్నాయి. 

ఎన్నికల వేళ మావోయిస్టు యాక్టివిటీ తెర పైకి వచ్చింది. ఏజెన్సీ నుంచి మొదలుకుని మండల కేంద్రాల వరకు ఉనికిని చాటుతున్నారు. బూటకపు ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉనికిని  చాటుకోవడం కోసం కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురం మండలంలో బ్యానర్లను ఏర్పాటు చేసి అదివాసీ, గిరిజనుల హాక్కులను గుర్తుచేస్తున్నారు. చాపకింద నీరులా ఉద్యమ స్పూర్తిని నింపుతున్నారు. చిట్యాల మండలం ఎన్.ఎప్.సీ గోదాం వద్ద నుంచి  ఏలేటి రామయ్యపల్లి, చిట్యాల రోడ్డుకు ఇరువైపుల కరపత్రాలు వేశారు. గురువారం వెంకటాపురం మండలం పాత్రపురం సమీపంలో బల్లకట్ట వాగు వద్ద బ్యానర్లు కట్టి తమ నిరసన తెలిపారు మావోయిస్టులు.

దళారీ నిరంకుశ, బూర్జువావర్గం, బడా భూస్వాముల, సామ్రాజ్య వాదంకి వ్యతిరేకంగా పోరాడాలని మావోయిస్టులు పిలుపునిస్తున్నారు. కేసియార్ కుటుంబ పాలన, అధికార దుర్వినయోగం, అవినీతిని ఎండగట్టలని ప్రజలకు విజ్ఞప్తి  చేస్తున్నారు. దోపిడి విదానాలను బహిర్గతం చేయాలని ప్రజలను  కోరుతున్నారు. బిజేపి బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని తిప్పికొట్టండి. ఓటుకోసం వస్తున్న పార్టీ నేతలను తన్ని తరిమికొట్టండి. తెలంగాణ జన సమితి అవకాశ వాద రాజకీయలను బహిర్గతం చేయండి.  వ్యవసాయ విప్లవాన్ని కొనసాగించాలనేది మవోయిస్టులు పంచిన కరపత్రాల సారంశం.  హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ను పునరుద్దరించాలి. దున్నేవారికి భూమి కావాలని డిమాండ్ చేస్తున్నారు...నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలని నినదిస్తున్నారు. ప్రపంచ సోషలిస్ట్ విప్లవ భావాలను అంశాలను గోదావరి పరివాహాక ప్రాంతాల్లో విస్తరింపజేస్తున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమీక్షలు జరిపారు...అయితే మావోయిస్టు పార్టీ  బ్యానర్లు  పెట్టి వాటి కింద ల్యాండ్‌మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల నుంచి మావోయిస్టు పార్టీకి, సీఆర్పీఎఫ్‌ బలగాలకు మధ్య పోరాటం జరుగుతోంది.  గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు  మావోయిస్టులు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు డీజిపి ఆదేశాలు జారీ  చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ఇందుకు స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు...అవసరమయితే కేంద్ర బలగాలను సైతం  ఎన్నికల భద్రతకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు..ఇప్పటికే మావోయిస్టులు ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలని లేఖలు విడుదల చేసిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను  అదేశించింది పోలీస్ శాఖ.

ప్రచారం వేళ అభ్యర్ధులకు రక్షణ కల్పించడం పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో భద్రత, ఎన్నికల నిర్వహాణ పనులను విభజించుకుని అధికారులు ముందుకు వెళ్తున్నారు. మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి అడుగుపెట్టకుండా,అంతర్గతంగా ఉన్న యాక్షన్‌ కమిటీలపై దృష్టి  పెట్టారు..అయితే ఇన్నాళ్లూ పెద్దగా కనిపించని మావోయిస్టుల కమిటీలు.. ఇప్పుడు వ్యూహాత్మకంగా దాడులకు సిద్దమవుతుండటంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

09:22 - November 4, 2018

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రాయుడు గుడ్ బై చెప్పేశాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి సారించేందుకు  రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై రంజీ ట్రోఫీలు సహా నాలుగు రోజుల మ్యాచుల్లో ఆడడు. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల్లో వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్ధారించింది. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి జట్టులో తన స్థానాన్ని రాయుడు పదిలం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో ఒక శతకం బాదడంతో పాటు మొత్తం 217 పరుగులు చేశాడు. నెం 4 స్థానానికి తగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 

ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒక్క టెస్టూ ఆడని రాయుడు, ఇకపైనా టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రంజీల్లో హైదరాబాద్‌, బరోడా, విదర్భ జట్లకి రాయుడు ఆడాడు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 45.56 సగటుతో 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలతో పాటు 34 అర్ధశతకాలూ ఉన్నాయి. హైదరాబాద్ తరఫున 2002లో రంజీల్లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. ఆ తర్వాత రెండు జట్లు మారి.. తాజాగా హైదరాబాద్ తరఫున ఆడుతూనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రాయుడు టెస్టుల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

08:58 - November 4, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకొ ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిసినా సీట్ల పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఇంకా సీట్ల లెక్కతేలనే లేదు. కాంగ్రెస్‌ కాలయాపనపై టీజేఎస్‌, సీపీఐ మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి డెడ్‌లైన్‌ కూడా పెట్టాయి.  దీంతో ఇవాళ మరోసారి సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు.

మహాకూటమిలో సీట్ల పీఠముడి ఇంకా వీడలేదు. రాహుల్‌తో కూటమి నేతలు కలిసినా సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఎవరికెన్ని సీట్లన్న అంశం ఇంకా తేలడంలేదు. టీపీసీసీ  అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాం నగర శివారులోని ఓ ప్రాంతంలో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాహుల్‌గాంతో కలిసినప్పుడు చర్చకు వచ్చిన అంశాలను కోదండరాం.. ఉత్తమ్‌కు వివరించిటన్టు తెలుస్తోంది. తాము మొదటి నుంచి 12 సీట్లు అడుగుతున్నామని.... కనీసం 10 సీట్లైనా ఇవ్వాలని కోదండరాం ఉత్తమ్‌ను కోరినట్టు సమాచారం. అయితే దీనికి ఉత్తమ్‌ మౌనంగానే ఉంటూ సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. దీంతో టీజేఎస్‌ సీట్ల సర్దుబాటుపై తేల్చుకోవాలని భావిస్తోంది.

మరోవైపు ఇవాళ సీపీఐ రాష్ట్ర సమితి మధ్యాహ్నం ఒంటి గంటకు భేటీ అవుతోంది. సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి  సురవరం సుధాకర్‌రెడ్డి కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అడిగినన్ని సీట్లు కాంగ్రెస్‌ ఇవ్వకపోతే ఏం చేయాలి,  కూటమిలో కొనసాగాలా... వద్దా... కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు ఇచ్చేలా ఏం చేయాలి అన్నదానిపై చర్చించే అవకాశముంది.

కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలకు కలిపి మొత్తంగా 24 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 14 సీట్లు టీడీపీకి ఇచ్చేందుకు అంగీకరిస్తోంది. మిగిలిన పది సీట్లు టీజేఎస్‌, సీపీఐకి ఇవ్వాలని యోచిస్తోంది. అయితే టీజేఎస్‌ , సీపీఐ ఎక్కువ సీట్లు అడుగుతుండడంతో లెక్కలు కుదరడం లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగానే  కాలయాపన చేస్తున్నట్టు తెలుస్తోంది. 
వాస్తవానికి ఇవాళ మరోమారు కూటమి నేతలు భేటీ కావాలని నిర్ణయించారు. అయితే... ఉత్తమ్, కోదండరామ్‌ ఇవాళ అందుబాటులో ఉండడం లేదు. దీంతో మహాకూటమి భేటీ కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టపర్చడం లేదు. ఒకవేళ అనివార్య కారణాలతో ఇవాళ భేటీ కుదరకపోతే.. రేపు జరిగే అవకావం ఉంది.

08:38 - November 4, 2018

ప్రకాశం : ప్రజాస్వామ్యం ప్రమాదం బారిన పడినప్పుడు.. తనలాంటి వారు కూడా మౌనం వహిస్తే.. స్వాతంత్ర్యంకోసం పోరాడిన మహనీయుల ఆత్మ క్షోభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే.. జాతీయ కూటమికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను చంద్రబాబు తప్పుపట్టారు. బీజేపి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని విమర్శించారు. కోడి కత్తిని మోడీ తన కత్తిగా మార్చుకుని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు

 

08:23 - November 4, 2018

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. పిట్స్‌బర్గ్‌ కాల్పుల ఘటన మరిచిపోకముందే ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని టల్లహసీలోని ఓ యోగా స్టూడియోలో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. యోగా స్టూడియోలోకి తుపాకీతో ఒంటరిగా ప్రవేశించిన స్కట్‌ పాల్‌ బీర్లె ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు ప్రారంభించాడు. దీంతో నాన్సీ వాన్‌ వెస్సెమ్‌ అనే వైద్యురాలు, మౌరా బింక్లీ అనే విద్యార్థి మృతి చెందారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆగంతకుడి నుంచి పిస్టల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరికొందరు అక్కడి జనాలు తప్పించుకునేందుకు సహకరించారు. లేకుంటే మరింత ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

 

07:58 - November 4, 2018

ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను కాల్చివేశారు.  భాగ్యనగరం అడవుల్లో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులను దింపి రెండు బస్సులను కాల్చివేశారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

 

07:28 - November 4, 2018

నెల్లూరు : నగరంలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫతేఖాన్‌పేట, ,రైతు బజార్ వద్ద వ్యాపారి మహేంద్రసింగ్‌పై ఇద్దరు దుండగులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపి, పరారయ్యారు. ముసుగు ధరించి వచ్చిన దుండగులు మహేంద్రసింగ్‌పై మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మహేంద్రసింగ్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతనికి తీవ్ర రక్త స్రావం కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ మహేంద్రసింగ్ మృతి చెందాడు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

Don't Miss