Activities calendar

05 November 2018

21:50 - November 5, 2018

హైదరాబాద్: 2019 ముందే అయోధ్యలో  రామమందిర నిర్మాణం పనులు బీజేపీ  ఆధ్వర్యంలో మొదలు పెడతాం అని గోషామహల్  బీేజపీ ఎమ్మెల్యే అభ్యర్ధి రాజాసింగ్ చెప్పారు. హైదరాబాద్లో  ఎంఐఎం నాయకులు  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గోరక్షణ నా జీవిత లక్ష్యం అని, నేను బతికి ఉన్నంత వరకు గోరక్షణకు కృషి చేస్తానని, గోమాంసం తినే వారి నాలుక కోస్తా అని ఆయన అన్నారు. మోదీ తీసుకు వచ్చిన త్రిపుల్ తలాక్ బిల్లు పట్ల ముస్లింమహిళలలో మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు

21:10 - November 5, 2018

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ  ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు టైం దగ్గర పడుతున్నప్పటికీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహా కూటమిలో మాత్రం సీట్ల పంపకం ఇంకా తేలలేదు.  దీంతో భాగస్వామ్య పక్షాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికి ఎన్నిసార్లు భాగస్వామ్య పార్టీలన్నీసమావేశం అయినా టికెట్ల సంఖ్య తేలలేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో జాప్యంపై  ఇప్పటికే సీపీఐ అసహనం వ్యక్తంచేస్తోంది.  కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందని, తొమ్మిది నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయబోతున్నట్టు  చాడ ప్రకటించారు. తొమ్మిది సీట్లు  ఇస్తేనే కూటమిలో  ఉంటామని చాడ  తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మహాకూటమి ముఖ్య నేతలు పార్క్‌ హయత్‌ హోటల్‌లో  సమావేశం అవ్వాలని భావించారు. కానీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదండరాం మాత్రం సమావేశమై సీట్ల విషయం చర్చించుకున్నారు.  సీట్ల విషయంలో స్పృష్టత ఉంది కనుక మీటింగ్ కు వెళ్లలేదని  టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ  చెప్పగా,  మీటింగ్ కు పిలవలేదని చాడ వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. 
ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రస్తావించగా.......మహా కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నందున రేపు ఢిల్లీకి వెళుతున్నామని, తిరిగి వచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు.  కోదండరాంతో చర్చలు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగాయని ,  రేపటిలోగా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

19:57 - November 5, 2018

ఢిల్లీ: భారత రక్షణ రంగ అమ్ముల పొదిలోకి  ఐఎన్ఎస్ అరిహాంత్ జలాంతర్గామి వచ్చి చేరింది. ప్రపంచంలో అణు జలాంతర్గాములను తయారు చేసి నడపగలిగిన రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాడ్ దేశాల సరసన నేడు భారత్ చేరింది. మొదటిసారిగా గస్తీ పూర్తి చేసుకుని  విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సమావేశమై వారిని అభినందించారు.  ఐఎన్ఎస్ అరిహాంత్ విజయం దేశ భద్రత పటిష్టతలో మరో పెద్ద ముందడుగని  ప్రధాన మంత్రి అన్నారు. 
6,000 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ అరిహంత్ ను ప్రధాని మోడీ నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందని ,. దేశభద్రత  విషయంలో  భారత్ మరో ముందడుగు వేసిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇక నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారికి  సరైన సమాధానం ఇవ్వగలిగిన స్ధాయికి మనం చేరాం అని మోడీ అన్నారు.  'ఐఎన్ఎస్ అరిహాంత్  సబ్‌మెరైన్ డిజైన్, నిర్మాణం, పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించి ఇండియాను సొంత అణు జలాంతర్గాములున్న దేశాల స్థాయికి నిలిపిన యావన్మంది సిబ్బందికి ప్రధాని   ధన్యవాదాలు చెప్పారు.ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు.

 

 

18:50 - November 5, 2018

ఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ యోగా పాఠాలతో మొదలు పెట్టి, పతంజలి బ్రాండ్ నేమ్ తో వినియోగదారుల మార్కట్ లోకి ప్రవేశించి స్వదేశీ నినాదంతో నిత్యావసర సరుకులు, ఆహార,ఆరోగ్య ఉత్పత్తులు, అమ్మకం మొదలు పెట్టారు. పతంజలి గతంలో ప్రకటించినట్లే ఈరోజు దుస్తుల ఉత్పత్తులను కూడా మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఢిల్లీలో పతంజలి పరిధాన్  పేరుతో మొదటి ఫ్యాషన్ స్టోర్ ను బాబా రాందేవ్ సోమవారం  ప్రారంభించారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్ లు  ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.విదేశీ బ్రాండ్లకు అలవాటుపడిన మన ప్రజలకు స్వదేశీ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతోనే పతంజలి దుస్తుల రంగంలోకి అడుగుపెట్టిందని బాబా రాందేవ్ తెలిపారు. తమ స్టోర్‌లో వివిధ రకాలైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులను అందించడం అనేది కొత్త ఉద్యమమని అన్నారు.
500 రూపాయలకే పతంజలి స్టోర్స్ లో  సంస్కార్ జీన్స్ అందిస్తున్నారు. కేవలం యువతకే కాకుండా పురుషులకు,మహిళలకు, చిన్న పిల్లలకు కావల్సిన అన్ని దుస్తులు  పంతజలి పరిధాన్ లభిస్తాయని సంస్ధ తెలిపింది. దీపావళి సందర్భంగా 5 రోజుల పాటు దుస్తులపై ఆఫర్లుకూడా ప్రకటించారు. ఆస్ధా, సంస్కార్,లైవ్ ఫిట్ అనే బ్రాండ్లతో 3500 వేరియంట్లలో వస్త్రాలను  ఉంచింది. హోం. టెక్స్ టైల్స్, షూలు, ఆభరణాలు,  ఇతర వస్తువులు కూడా  ఈ స్టోర్స్ లో లభ్యంఅవుతాయని బాబా రాందేవ్ ట్వీట్ చేశారు. 7వేల రూపాయలు విలువైన  1జీన్స్ ప్యాంట్,2 టీ షర్టులు  రూ.1100 కే ఇస్తున్నట్లు రాందేవ్ చెప్పారు.

17:47 - November 5, 2018

గుంటూరు: "జనతా గ్యారేజ్" ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ సినిమా, దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అని ఉంటుంది. వాస్తవానికి ఇది మెకానిక్ షెడ్ అయినా "సామాన్యులు ఇక్కడికెళ్లి  ఏ సమస్య చెప్పుకున్నా పరిష్కారం అవుతుందని" సినిమాలో చూపించారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రదీప్ అనే వ్యక్తి జనతాగ్యారేజ్ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేను సెటిల్ చేస్తానని 2 నంబర్లు ఇచ్చి గ్రూప్స్ లో మెసేజ్ పంపించాడు. దాంతో అతని గ్రూప్ లో కొందరు చేరారు. ఈరోజు ఉదయం గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ఆధారంగా ఉండవల్లిలోని ఒక ఇంటివద్ద సెటిల్ మెంట్ చేయడానికి తన మిత్రులతో కలిసి కత్తి పుచ్చుకువచ్చి అరుస్తూ హాడావిడి చేశాడు. అతని చేతిలో కత్తి చూసి స్ధానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఇతడిపై ఏమైనా నేరచరిత్ర ఉందా,లేదా అనేది పోలీసు విచారణలోతేలాల్సి ఉంది.

17:12 - November 5, 2018

కేరళ : శబరిమల అయ్యప్ప సన్నిధానం తెరుచుకుంది. చిత్తిర అట్ట విశేషం పూజకు ఆలయ పెద్దలు ఏర్పాట్లు చేశారు. నెలలో ఒక రోజు మాత్రమే ఈ పూజలు నిర్వహిస్తుంటారు. ఒక రోజు మాత్రమే ఆలయాన్ని తెరువనున్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప దర్శనం కోసం 
Image result for sabarimala women stoppedఏరుమలైకి భారీగా భక్తులు చేరుకున్నారు. అయ్యప్ప శరణుఘోషతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో మహిళలు దర్శనం కోసం రావడం..వీరిని అడ్డుకొనేందుకు వివిధ హిందూ సంస్థలు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దానికంటే ముందు రాష్ట్ర పోలీసులు శబరిమలలో 144 సెక్షన్ అమలు చేశారు. 
మరోవైపు మహిళా భక్తులు వస్తే అయ్యప్ప దర్శనం చేయించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 10 నుండి 50 ఏళ్ల వయస్సున్న మహిళలు వస్తే అడ్డుకొనేందుకు హిందూ సంస్థలు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా 2500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఈసారైనా మహిళలు దర్శనం చేసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

16:40 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతున్నాయి. వీటికి సీనియర్ హీరోలు..యంగ్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. యంగ్ హీరోలతో నటించడానికి సీనియర్ హీరోలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. వెంకటేష్..నాగార్జునలు ఇప్పటికే యంగ్ హీరోల సరసన నటించి మెప్పించారు. తాజాగా వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వరుణ్ తేజతో జత కడుతున్నారు. 
Image result for F2 First Lookఅనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ చిత్రాలు మంచి టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రూపొందుతున్న ‘ఎఫ్ 2’ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 
వెంకటేశ్ సరసన తమన్నా..వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్‌లు నటిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సినిమా మొదటి లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మంచి కలర్ ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకొంటోంది. ఈ పోస్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం

16:06 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్..బాలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా యూ ట్యూబ్‌ని చక్కగా ఉపయోగించుకొంటోంది. సినిమాలకు సంబంధించిన టీజర్..ట్రైలర్..ఇతర వీడియోలను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్‌కి నెటిజన్ల నుండి తెగ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్..వ్యూస్ వచ్చాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్‌లో రూపొందుతున్న ఓ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్‌ని షేక్ చేస్తోంది. 
Image result for Yedu Chepala Katha Teaserఅడల్ట్ మూవీ..అంటూ ఇటీవలే ‘ఏడు చేపల కథ’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. యూత్‌ని ఆకట్టుకొనే విధంగా శృంగారాన్ని ఒలకపోశారు. శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, రామకృష్ణా రెడ్డి సమర్పణలో, శేఖర్ రెడ్డి జీ.వీ.ఎన్‌లు ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. ఈ చిత్రంలో అభిషేక్‌ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటించారు. సినిమా టీజర్‌లో లిప్ కిస్‌లు..అమ్మాయిలు గోడల మీద నుండి దూకడం...రొమాన్స్ సీన్స్‌లతో కుర్రాళ్లను పిచ్చెక్కించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోర్న్ సినిమాను తలదన్నేలా ఉందని అంటున్నారు. 
ఇదిలా ఉంటే అప్‌లోడ్ చేసిన ఒక రోజుకే.. పది లక్షలకు అంటే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 16 మిలియ‌న్స్ (దాదాపు కొటి అర‌వై ల‌క్ష‌లు ) వ్యూస్ రావ‌టం గ్రేట్ అని నిర్మాతలు పేర్కొంటున్నారు. 
అడల్డ్ కామెడీ జోనర్‌లో సినిమాను రూపొందించడం జరిగిందని, సినిమాలో అందరూ కొత్తవారేనని నిర్మాతలు వెల్లడించారు. టీజర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా మలిచారన్నారు. సినిమా విడుదల విషయంలో త్వరలోనే నిర్మాతలు ఓ ప్రకటన చేయనున్నారు. 

15:59 - November 5, 2018

నల్లగొండ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొనసాగుతోంది. పొత్తుపొడుపులు సరిగ్గా కుదిరితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాకూటమి బలీయంగా మారనుంది. అయితే పార్టీల అసంతృప్తులు బరిలోకి దిగితే.. సీన్‌ మారిపోనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..

సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. టీజేఎస్‌ను పక్కన పెడితే. కాంగ్రెస్‌తో పాటు.. టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలముంది. ఆ రెండు పార్టీలు ఒంటరిగా విజయం సాధించే పరిస్థితుల్లో లేకున్నా.. పలు నియోజకవర్గాల్లో ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు కూటమి పార్టీల వలన అదనపు బలం కలిసి వస్తుందని హస్తం నేతలు అంటున్నారు. 

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా.. కాంగ్రెస్, సిపిఐ ఒక కూటమిగా.. టీడీపీ, బీజేపీ మరో కూటమిగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేశాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో ఆరు టీఆర్ఎస్‌ గెలుచుకోగా, సీపీఐకి ఒకటి కాంగ్రెస్‌ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

* ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు
* గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌ 6, కాంగ్రెస్‌‌ 5, సీపీఐ ఒక స్థానంలో విజయం
* నల్లగొండలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలకు సంస్థాగతంగా బలం
* మహాకూటమితో బలపడతామంటున్న కాంగ్రెస్‌

గత ఎన్నికల్లో దేవరకొండలో కాంగ్రెస్‌, సీపీఐ కూటమి తరుపున పోటీ చేసిన రవీంద్రకుమార్ 57 వేల 717 ఓట్లతో గెలవగా.. రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ 53 వేల 501 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన లాలూనాయక్ 38,618 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కలిసి బరిలోకి దిగుతుండడంతో వారిద్దరికి వచ్చిన ఓట్లు 1,11,218 గా ఉన్నాయి. తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని కూటమి పార్టీలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో సిపిఐ అభ్యర్థిగా విజయం సాధించిన రవీంద్రకుమార్ ఈ సారి టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. క్రాస్ ఓటింగ్ జరిగినా.. అంత భారీస్థాయిలో ఉండదని కూటమి నేతల అభిప్రాయం. 

సీపీఐ రవీంద్రకుమార్‌ 57,717 ఓట్లు
టీడీపీ కేతావత్ బిల్యానాయక్ 53,501 ఓట్లు
టీఆర్ఎస్ లాలూనాయక్ 38,618 ఓట్లు

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున కుందూరు జానారెడ్డి 69,684 ఓట్లతో విజయం సాధించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య 53,208 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ మూడవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్‌కు 27,858 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ప్రస్తుత కూటమి ప్రకారం చూస్తే టీఆర్ఎస్ కంటే 44,334 ఓట్లు మహాకూటమికి అధికంగా ఉన్నాయి. 

కాంగ్రెస్ భాస్కర్‌రావు 62,059 ఓట్లు
టీఆర్ఎస్ అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి 56,006 ఓట్లు

మిర్యాలగూడలో గత ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు 62,059 ఓట్లు రాగా.. రెండవ స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి 56,006 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ ఓట్లను కలిపి చూస్తే 26,812 ఓట్లు కూటమికి అధికంగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన భాస్కర్‌రావు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి అమరేందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరడంతో ఓటర్లు ఎలా రీసివ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Image result for uttam kumar reddyటీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రస్తుత కూటమిని పరిగణనలోకి తీసుకుంటే కూటమికి 49,319 ఓట్లు ఆధిక్యత ఉంది. అయితే గత ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగిన హుజూర్‌నగర్‌లో ఈ సారి ద్విముఖ పోటీ చోటు చేసుకోనుంది. గతంలో వైసీపీకి పోల్ అయిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఇక మొదటి నుంచీ టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపని కోదాడలో మహాకూటమి ఓటింగ్ గణనీయంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి 81,966 ఓట్లతో విజయం సాధించగా.. గట్టి పోటీనిచ్చి రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 68,592 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్‌ 13,404 ఓట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒకే కూటమిగా ఉండటంతో గత ఎన్నికల ప్రకారం వారి ఓటింగ్ 1,37,154కు చేరుకుంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్‌కు అవకాశం ఉన్నా.. అంత భారీస్థాయిలో ఉండకపోవచ్చన్నది విశ్లేషకులు అభిప్రాయం.

Image result for jagadeesh reddyమంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో ఈసారి హోరాహోరీ తప్పదనిపిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన చతుర్ముఖ పోటీలో జగదీష్‌రెడ్డి 43,554 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు 41,335 ఓట్లు.. మూడవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డికి 39,175 ఓట్లు, నాలుగవ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డికి 38,529 ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి ఒకే పార్టీలో ఉండటంతో పాటు.. కూటమిగా బరిలో దిగుతుండడం.. సంకినేని బీజేపీ తరుపున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సారి త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓటు షేరింగ్ అనేది కీలకంగా మారింది. 

భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన పైళ్ల శేఖర్‌రెడ్డి 54,686 ఓట్లతో విజయం సాధించగా..39,270 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి రెండవ స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు 33,560 ఓట్లతో మూడవ స్థానం.. 24,569 ఓట్లతో టిడిపి అభ్యర్థి ఉమామాధవరెడ్డి నాలుగవ స్థానంలో నిలిచారు. అయితే ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఆ పార్టీకి బలంగా మారింది. 

ఇక తుంగుతుర్తిలో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల ప్రకారం.. ప్రస్తుత మహాకూటమికి 29,293 ఓట్ల ఆధిక్యం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గాదరి కిశోర్ 64,382 ఓట్లతో గెలుపొందగా.. రెండవ స్థానంలో అద్దంకి దయాకర్‌కు 62,003 ఓట్లు, మూడవ స్థానం సాధించిన పాల్వాయి రజనికుమారికి 31,672 ఓట్లు వచ్చాయి. 

Related imageఇక నల్లగొండలో గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి పోటీనిచ్చి కేవలం 10,547 ఓట్లతో ఓటమిపాలైన స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో కంచర్లకు మద్ధతుగా నిలిచిన టీడీపీ ఓటింగ్ ఈసారి ఎటు నిలిస్తే వారిదే విజయంగా రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది.

ఆలేరులో గతంలో ద్విముఖ పోటీ జరుగగా.. ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. మోత్కుపల్లి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతుండటంతో.. ఓట్ల షేరింగ్‌ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ను కూటమి ఎలా నిలువరిస్తుందో చూడాలి. కూటమి పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగకుండా కట్టడి చేయగలుగుతారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. తాజా కూటమి 2009 మహాకూటమిలా చివరంచులో బోల్తా పడుతుందో.. లేక మహాబలిగా నిలబడుతుందో తెలియాలంటే.. డిసెంబర్ రెండవ వారం వరకు ఆగాల్సిందే.

 
15:28 - November 5, 2018

కాకినాడ: గుండెల్లో మురికి పెట్టుకుని బయట చెత్తని శుభ్రపరిస్తే ఏం లాభం? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముందు మన మనసులోని మలినాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛభారత్ బ్రాండ్ అండాసిడర్‌గా నన్ను ఉండమని ప్రధాని మోడీ కోరారని, అయితే తాను తిరస్కరించానని పవన్ తెలిపారు.

Image may contain: 16 people, people smiling, wedding and crowdతూర్పుగోదావరి జిల్లాలో పారిశుధ్య కార్మికులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన ప్రభుత్వం వస్తే రెల్లి కులస్తులకు తాను అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. తాను మాట సాయం కంటే చేత సాయం చేసే వాడిని అని పవన్ స్పష్టం చేశారు. రెల్లి కులస్తులకు తాను అండగా ఉంటాను, అన్నగా తమ్ముడిగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. అన్నికులాల మలమూత్రాలు శుభ్రుపరిచే ఉన్నత కులం రెల్లి కులం అని పవన్ అన్నారు. మీ జీవితాల్లో వెలుగు నింపకపోతే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినా ప్రయోజనం లేదన్నారు. రెళ్ల కులస్తులు ఇళ్లు అద్దెకు అడిగే స్థాయి నుంచి ఇళ్లు అద్దెకిచ్చే స్థాయికి తీసుకెళతానన్నారు. తాను అందరిలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనని, హామీలు ఇవ్వను అని చెప్పిన పవన్.. తాను కేవలం ఆశయాలను పాటిస్తాను, మాట్లాడతాను, ఆచరిస్తాను అని చెప్పారు.

+

15:23 - November 5, 2018

హైదరాబాద్ : సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్‌లు ఆస్తకి రేపుతుంటాయి. అంతేకుండా ఉత్కంఠను రేకేత్తిస్తుంటాయి. సినిమా ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొంది. ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంపై అందరీ చూపు ఉంది. 
Image result for rajamouli rrr filmటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆర్.ఆర్.ఆర్’ వర్కింగ్ టైటిల్ పెట్టారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 11గంటలకు సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇటీవలే రాజమౌళి ప్రకటించారు. కానీ ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎవరొస్తారనే దానిపై చర్చ జరిగింది. 
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్‌తో రాజమౌళి కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అంతర్జాతీయస్థాయిలోకి ఎక్కాయి. కేవలం ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ ఇతర సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు బాక్సర్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. 1920 నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని టాక్. కానీ ఈ యంగ్ హీరోల సరసన ఏ హీరోయిన్స్‌లు నటించనున్నారనేది తెలియరావడం లేదు. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. మరి ప్రారంభోత్సవానికి ఎవరొస్తారనేది 11న తేలనుంది. 

15:18 - November 5, 2018

ఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఏపీలో హైకోర్టుకు మౌలిక వసతులు కల్పన పూర్తయితే నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం స్పృష్టం చేసింది. డిసెంబర్ 15నాటికి అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై  సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై  ఏపీకి వెళ్లే  హై హైకోర్టు న్యాయమూర్తులుకూడా సంతృప్తి చెందారని కోర్టు స్పృష్టం చేసింది. జనవరి 1 నుంచి కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తి స్ధాయిలో జరుగుతుందని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కోంది. 

14:57 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో ‘విజయ్ దేవరకొండ’ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి చిత్రం అనంతరం ఇతని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తనదైన స్టైల్..నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతమున్న యూత్‌లో విజయ్ దేవరకొండ అంటే ఒక క్రేజ్. ప్రస్తుతం ఇతను టాప్ హీరోల స్థానానికి ఎగబాకేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాడంట. 
దిగ్గజ దర్శకులు కొరటాల శివ..సుకుమార్‌తో విజయ్ దేవరకొండ పనిచేయడానికి సిద్ధమౌతున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల ఓ లైన్ రాసుకుంటున్నారు. Image result for koratala chiruప్రస్తుతం చిరు ‘సైరా’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోైవైపు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కోసం సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. Image result for sukumar and koratala film with vijay devarakondaదీని అనంతరం విజయ్ దేవరకొండతో చిత్రం తీయాలని సుకుమార్ భావిస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్. వీరిద్దరితో విజయ్ దేవరకొండ చిత్రాలు ఉంటే మాత్రం అతను చిత్రాలు ఖచ్చితంగా టాప్ లీడ్‌లోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తున్నారు. 
మరోవైపు ‘గీత గోవిందం’ చిత్రంతో రూ. 70 కోట్ల బిజినెస్ చేసిన ఈ అర్జున్ రెడ్డి ‘నోటా’ సినిమాతో ఒక్కాసారిగా బోల్తాపడ్డాడు. అనంతరం ‘టాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి సుకుమార్..కొరటాలతో విజయ్ సినిమాలు ఉంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

 
 
14:13 - November 5, 2018

గుజరాత్ : దీపావళి పండుగ వచ్చేస్తోంది. దానికంటే ముందుగా వచ్చేది ధన్ తేరస్...ఈ రోజులో బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి తమింట్లో కొలువవుతుందని చాలా మంది విశ్వాసం. ఇక దీనిని క్యాష్ చేసేందుకు వ్యాపారులు ఆఫర్లు..డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటించేస్తున్నారు. తమ దగ్గర బంగారం కొంటే అది ఫ్రీ..ఇది ఫ్రీ...అంటుంటే అన్ని బంగారు ఆభరణాలపై 5 నుండి 15-20 శాతం వరకు రాయితీ ఇస్తామని పలు వ్యాపార సంస్థలు ప్రకటిస్తుంటాయి. 
కానీ సూరత్‌లో ఉన్న ఓ దుకాణం మాత్రం అందర్నీ ఆకట్టుకొంటోంది. అక్కడ బిస్కెట్ల రూపంలో బంగారం..వెండిని విక్రయిస్తుంటారు. ఈసారి ధన్ తేరస్ సందర్భంగా ప్రత్యేకతను చాటుకోవాలని ఆ దుకాణ యజమాని వినూత్నంగా బంగారు, వెండి బిస్కెట్లను తయారు చేయించారు. ఆ బిస్కెట్లపై మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను ముద్రించడమే. రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని మోడీ..ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీల ఫొటోలను ముద్రించి అమ్మారు. ప్రధాన మంత్రి మోడీ పాలనలో 

14:03 - November 5, 2018

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి దేవి సింగ్‌ పటేల్‌ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రి, రాజ్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి అయిన దేవి సింగ్‌ పటేల్‌‌కు గుండెపోటు రావడంతో బర్వానీ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పటేల్‌ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బందర్‌కచ్‌ అనే గ్రామంలో జరగనున్నాయి. 

పటేల్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజార్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు, రాజ్‌పూర్‌ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు కూడా రాజ్‌పూర్ నుంచి పోటీ చేయాల్సి ఉండగా ఇంతలోనే విషాదం నెలకొంది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న పోలింగ్‌ జరగనుంది.

14:01 - November 5, 2018

హైదరాబాద్ : అన్ని రంగాల్లో మహిళా శక్తి చాటుతూ.. అతివలు దూసుకుపోతుండగా రాజకీయ రంగంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చేసేస్తున్నామని చెప్పుకునే పార్టీలు,పాలకులు మహిళలకు ఎన్నికల్లో సీట్లు కేటాయించటంలోమాత్రం తామే ముందుంటారు. కానీ నగరంలో అయితే మహిళా ప్రతినిథుల ప్రాతినిథ్యం అతి స్వల్పం..మరి నగరంలో ఏర్పడిన నియోజకవర్గాలు..వాటి నుండి పోటీచేసిన మహిళా అభ్యర్థుల, వారి విజయాలు..ఆనాటి ఆ కాస్త వెలుగు కూడా నేటి ఎన్నికల్లో ెఎలా వుందో చూద్దాం..
5 సార్లు సమిత్రాదేవి 
5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు సుమిత్రాదేవి. నగరంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మహిళ ఆమె ఒక్కరే. తొలిసారిగా తూర్పు నియోజకవర్గం నుంచి 1962లో..అనంతరం మేడ్చల్‌లో రెండుసార్లు.. జూబ్లీహిల్స్‌, ఇబ్రహీంపట్నం నుంచి ఒక్కొక్కసారి గెలిచారు. 
Image result for manemmaముషీరాబాద్ నుండి ఒకే ఒక్కసారి మణెమ్మ
ముషీరాబాద్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడినప్పట్నుంచి 15సార్లు ఎన్నికలు వచ్చాయి. 2004లో ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి రాజీనామా చేయడంతో 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. అందులో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన టి.మణెమ్మ గెలుపొందారు. 2009లోనూ ఆమే గెలిచారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిందీ ఈమె ఒక్కరే విశేషం.
Image result for katragadda prasunaసనత్‌నగర్‌..
ఈ నియోజకవర్గం 1978లో ఏర్పడింది. దీంతో  10సార్లు ఎన్నికలు జరిగాయి.  కాంగ్రెస్‌ 6సార్లు.. టీడీపీ 4 సార్లు గెలిచింది. 1983లో కాట్రగడ్డ ప్రసూన టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో ఈ నియోజవర్గంలో ఇప్పటి వరకూ ఆమె ఒక్కరే కావటం గమనించాలి. 
రద్దు అయిన హిమాయత్ నగర్..
1978లో ఏర్పడిన హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం 2009లో రద్దయ్యింది. అప్పటికి 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో..
బీజేపీ      4 సార్లు
టీడీపీ        3 సార్లు.. 
జనతా పార్టీ   1సారి
కాంగ్రెస్‌       1 సారి 

విజయం సాధించాయి. తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున లక్ష్మీకాంతమ్మ గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ గెలిచే అవకాశం ఎవరికి  రాలేదు. 1967లో ఏర్పడిన గగన్‌మహల్‌ నుంచి 1972లో టి.శాంతాబాయి కాంగ్రెస్‌ నుండి  ఎన్నికయ్యారు. తరువాతి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కనుమరుగైంది.
1952లో  ఏర్పడిన మలక్‌పేట నియోజక వర్గం.. అప్పటి నుండి ఇప్పటి వరకూ  14 సార్లు ఎన్నికలు జరిగాయి. 
కాంగ్రెస్‌ 6 సార్లు.. 
బీజేపీ 3 సార్లు
మజ్లిస్‌ 2 సార్లు
పీడీఎఫ్‌, జనతా, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. 

1962, 1967 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బి.సరోజినీ పుల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఇక్కడ పోటీ చేసే అవకాశం ఎవరికీ రాలేదు. 
Related image1952లో ఏర్పడిన ఇబ్రహీంపట్నం నియోజక వర్గం..  
ఇప్పటివరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ నుండి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ (ఐ)  నుంచి 1978లో సుమిత్రాదేవి విజయం సాధించారు. తరువాత 1999లో తెదేపా నుంచి కొండ్రు పుష్పలీల విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.Image result for sabitha indra reddy
 

తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు 
1999లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సబితారెడ్డి బరిలోకి దిగి గెలుపొందారు. 2004లో చేవెళ్ల నుంచి, 2009లో మహేశ్వరంలో ఎన్నికయ్యారు. వైఎస్‌ క్యాబినెట్‌లో తొలి మహిళా హోం మంత్రిగా సబిత పనిచేశారు.

Image result for jayasudha mLA1989లో సికింద్రాబాద్‌ నియోజక వర్గం..
ఇక్కడి నుండి 1989లో మేరీ రవీంద్రనాథ్‌.. 2009లో జయసుధ ఎన్నికయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ తరఫున గెలిచారు.
కంటోన్మెంట్‌..
కంటోన్మెంట్‌లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి  వి.రామారావు గెలిచారు. పదవిలో ఉండగానే ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. 1972లోనూ ఎన్నికయ్యారు.
1952లో  ఏర్పడిన శాలిబండ..
అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మనుమా బేగం కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె పత్తర్‌ఘట్టి నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో 24 నియోజకవర్గాలుండగా.. ఒక్క మహిళా ఎమ్మెల్యే ఎన్నికవ్వలేదు. కాగా టీఆర్ఎస్ ప్రకటించిన 105 అభ్యర్థులలో నగరానికి సంబంధించి 9మంది అభ్యర్థులను ప్రకటించగా..వారిలో ఒక్క మహిళా లేకపోవటం గమనించాల్సిన విషయం. మరి మిగిలిన జాబితాలో మహిళలకు చోటు కల్పిస్తోరో లేదో చూడాలి. 
బీజేపీ ఇప్పటివరకూ రెండు బాబితాను ప్రకటించినా నగరం నుండి మహిళలను ఎవరూ లేదరు. ఇక కాంగ్రెస్, టీడీపీ కి సంబంధించిన మహా కూటమిలో ఇంకా సీట్ల పంపకాలు తేలనందున వారింకా అభ్యర్ధుల జాబితాను ప్రకటించలేదు. 2018లో కూడా ఎవ్వరూ కానరాకపోవటంతో ఈ నేపథ్యంలో మహిళలు చట్టసభల ప్రాతినిథ్యం ప్రశ్నార్థంగానే వుంది. 
                                                                                                                               - మైలవరపు నాగమణి

 
13:57 - November 5, 2018

ముంబై: భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్‌లో ఎదురైన అనుభవాలను, పాత జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. తన 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచలు వచ్చేవని రెహమాన్ వెల్లడించారు. 9 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కొల్పొయిన తర్వాత ఎదురైన పరిణామాలు తనను ఆ దిశగా ఆలోచించేలా చేశాయన్నారు. కంపోజర్‌గా కెరీర్ ప్రారంభించిన తాను అప్పట్లో ఫెయిల్ అయ్యాయని. దీనికి తోడు కుటుంబ బాధ్యతలు.. తండ్రి మరణం.. ఎన్నో కష్టాలు.. వీటిని ఎదుర్కొలేక తన జీవితం ఇక ముగించాలని భావించేవాడినని తెలిపారు. కానీ తన ప్రయాణం తనకు చాలా నేర్పిందన్నారు. సంగీతం తన జీవితంలో మార్పు తెచ్చిందన్నారు. చావు అనేది అనివార్యమైనా.. సమస్యకు పరిష్కారం కాదని గుర్తించానని చెప్పారు. జీవితంలో దేనికీ పనికిరాము అని ఎవరూ అనుకోకూడదని రెహమాన్ సూచించారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని 25ఏళ్ల వయసులో తెలుసుకున్నట్లు రెహమాన్ తెలిపారు.

కృష్ణ త్రిలోక్‌ రచించిన రెహమాన్‌ బయోగ్రఫీ ‘నోట్‌ ఆఫ్‌ ఏ డ్రీమ్‌: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహమాన్‌’ పుస్తకాన్ని శనివారం రోజున ముంబైలో అవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన 12 నుంచి 22 ఏళ్ల వయస్సులోనే జీవితంలో అన్ని కోణాలను చూశానని రెహమాన్ చెప్పారు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్న తాను చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిపోయానని చెప్పారు. 

తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహమాన్‌గా మారిందని ఆయన వివరించారు. ఎందుకు ఇష్టం లేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదని రెహమాన్ అన్నారు.

13:47 - November 5, 2018

హైదరాబాద్ : టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాకులు కోదండరాం మేనిఫెస్టో, ప్రణాళిక, పార్టీ గుర్తును రిలీజ్ చేశారు. మేనిఫెస్టోను ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు తెలిపారు. పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను మీడియాకు టీజేఎస్ నేత వెల్లడించారు. 
ప్రగతికి పది సూత్రాలు :  ’పారదర్శకత..ప్రజాస్వామిక...బాధ్యాయుతమైన సుపరిపాలన..పౌర సమాజ సలహాలు..సూచనలు...తీసుకోవడానికి అన్ని మార్గాలను చూస్తాం. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం...సామాజిక న్యాయం - సాధికారిత.’

టీజేఎస్ మేనిఫెస్టో..ముఖ్యాంశాలు...
అందరికీ ఉచిత విద్య..వైద్యం.. వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, 
బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ వికలాంగుల సంక్షేమం స్వావలంబన పట్టణాభివ‌ృద్ధి - మౌలిక సదుపాయాలు
అధికారంలోకి రాగానే తీసుకొనే తక్షణ చర్యలు...
రైతులకు తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ తొలి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు
ప్రతి ఏటా ఉద్యోగాల కేలండర్ ప్రకటన అర్హతను బట్టి రూ. 3వేల నిరుద్యోగ భృతి
వంద రోజుల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేత హైదరాబాద్‌లో అమరుల స్మ్రతిచిహ్నం ఏర్పాటు
కౌలు రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ది ఆత్మహత్య చేసుకున్న రైతులు (కౌలు రౌైతులతో సహా) నష్టపరిహారం
2016 భూ సేకరణ చట్టం రద్దు  ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు రద్దు
ధర్నాచౌక్ పునరుద్దరణ ప్రగతి భవన్ తెలంగాణ మ్యూజియంగా మార్పు
ఈపీసీ వ్యవస్థ రద్దు ప్రాజెక్టుల రీ డిజైనింగ్ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానం రద్దు
13:36 - November 5, 2018

ప్రకాశం : జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లుల మంజూరులో వివక్షపై చైర్మన్‌ను విపక్షాలు నిలదీశాయి. బడ్జెట్ నిధులు పక్కదారి పట్టిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. 

 

13:17 - November 5, 2018

వరంగల్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి పెరుగుతోందని కోదండరామ్ అన్నారు. సీట్ల పంపకాల చర్చల్లో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. వరంగల్‌లో 10 టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి కూర్పు నత్తనడకన సాగుతోందని చెప్పారు. కూటమిలో ప్రచార పనులే ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రచారంలో ఉంటే..కూటమిలో పంపకాలే పూర్తి కాలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు. తమ శక్తిపై అంచనా ఉందని.. ఏమి అడగాలో.. వాటిని ఎలా సాధించుకోవాలో తమకు తెలుసునని అన్నారు. 

 

13:06 - November 5, 2018

కోయంబత్తూర్: ఒక వైపు రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. రాష్ట్ర మంత్రులు ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుండా తైతక్కలాడుతున్నారని తమిళ ప్రజలు సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి కోయంబత్తూరులోని ఓ గుళ్లో చిందులువేయడంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోయంబత్తూరు దగ్గరలోని కైకోలపాళ్యం కోవెలలో జాతర సందర్భంగా ఆదివారం నాడు మంత్రి వేలుమణి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మీరూ ఈ డ్యాన్స్‌ను చూసి తరించండి!

13:02 - November 5, 2018

కాకినాడ: రాజకీయాల్లో చెత్తను శుభ్రం చేయడానికి తాను వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రెల్లి కులస్తులకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పారిశుధ్య కార్మికులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీకు నేను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

Image may contain: 29 people, people smiling, people sittingఇవాళ్టి నుంచి తాను కులం మార్చుకుంటున్నానని, తనది రెల్లి కులం అని పవన్ ప్రకటించారు. మానవసేవలో నిమగ్నమై ఉన్న రెల్లి కులస్తులను మదర్ థెరిసాతో పోల్చారు పవన్. అన్ని కులాల మనుషుల మలమూత్రాలను శుభ్రం చేసే మీకు అండగా నిలవకపోతే జనసేన ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. భగవంతుడు ముగ్గురి రూపంలో ఉంటాడన్న పవన్.. అందులో ఒకరు దేశాన్ని రక్షించే సైనికుడు, అన్నం పెట్టే రైతు, చెత్త శుభ్రపరిచే రెల్లి కులస్తుల్లో దేవుడు ఉంటాడని చెప్పారు.

13:02 - November 5, 2018

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదించేందుకు లాయర్ ముందుకొచ్చారు. శ్రీనివాసరావు తరపున వాదిస్తానని, అతనికి బెయిల్ ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తానని సలీం అనే న్యాయవాది పేర్కొన్నారు. సోమవారం విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాడి వెనుక సీఎం చంద్రబాబు, ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు ఆరోపించడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఎలాంటి అంశాలు చెప్పారి బయటకు రాలేదు. మొన్ననే అతని పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీని పొడిగించాలని, విచారణ ఇంకా చేయాల్సి ఉందని పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు. 
ఇదిలా ఉంటే తాను ఇటీవలే శ్రీనివాసరావును కలవడం జరిగిందని లాయర్ సలీం తెలిపారు. అప్పటి నుండి తాను అతనికి లాయర్‌గా ఉండడం జరిగిందన్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని, మానసికస్థితి సరిగ్గా లేదని..ఆయనపై చాలా ఆరోపణలు వస్తున్నాయన్నారు.  తాను దాఖలు చేసిన పిటిషన్‌లపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. 

12:47 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ జనసమితి ఎన్నికల విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన గుర్తు (అగ్గిపెట్టె), మేనిఫెస్టోను విడుదల చేశారు. Image result for tjs party symbolసంపూర్ణంగా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని, కానీ ఎన్నికల కోడ్ ఉండడంతో బహిర్గతం చేయడం లేదన్నారు. కాపీలను ఎన్నికల సంఘానికి పంపిస్తున్నామని, మూడు రోజుల అనంతరం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళుతామన్నారు. దీనితోపాటు ఆయన ఎన్నికల ప్రణాలిక కాపీనీ మీడియా ఎదుట విడుదల చేశారు. 
పొత్తులు..సీట్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తాము కలవడం జరిగిందని, సోమవారం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కలవడం జరుగుతుందని వెల్లడించారు. పొత్తులు..సీట్ల ఖరారు విషయంలో చర్చించడం జరుగుతుందని, దీనికి తుదిరూపు వచ్చే అవకాశం ఉందన్నారు. పది సీట్లలో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, మరో మూడు సీట్లలో బలమైన అభ్యర్థులున్నారని..ఈ విషయాన్ని ఆలోచించాలని కాంగ్రెస్‌ను కోరడం జరుగుతుందన్నారు. దీపావళి నాటికి పొత్తులు, సీట్ల ఖరారుపై ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. 
మహాకూటమి విషయంలో కొంత ఆలస్యం జరిగిందని, విజయదశమి నాటికి తేలాల్సిన పొత్తులు..తేలలేదని..జాప్యం జరగకపోతే ఈ సమయంలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండేదన్నారు. దీనితో పలువురు నేతలు అసంతృప్తికి గురి కావడం జరిగిందన్నారు. కానీ వీలైనంత తొందరలో పొత్తులు..సీట్ల ఖరారు జరిగే అవకాశం ఉందని కోదండరాం వెల్లడించారు. 

12:25 - November 5, 2018

హైదరాబాద్ : మహారాష్ట్రలో హడలెత్తించిన పులిని షార్ప్ షూటర్స్ అంతం చేసిన సంగతి తెలిసిందే. పులి రెండేళ్లుగా కంటి మీదకునుకు లేకుండా చేసింది. హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్స్ నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు పులిని అంతం చేశారు. షార్ప్ షూటింగ్‌లో నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్ దిట్టలు. ఈమేరకు హైదరాబాద్‌లో వారు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పులిని చంపాలన్నది తమ ఉద్దేశం కాదని నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు అన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోవద్దన్నది మాహారాష్ట్ర ప్రభుత్వం, కోర్టు సూచన అని తెలిపారు.

గత రెండేళ్లలో 13మంది మనుషుల ప్రాణాలు తీసిన ఆడపులి 'అవని'ని అటవీ శాఖ అధికారులు అంతమొందించారు. శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్‌లో హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్స్ నవాబ్ అలీఖాన్, అస్గర్ అలీఖాన్‌లు పులిని కాల్చి చంపారు. అవనిని కాల్చిచంపేందుకు గత సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాని జాడ కనుగొనేందుకు అటవీ అధికారులు నానాతంటలు పడ్డారు. 3 నెలలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ 150 మంది అటవీసిబ్బంది గాలింపు చేపట్టారు. షూటర్స్‌, నిపుణులైన ట్రాకర్స్‌ ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్లు, శిక్షణ పొందిన శునకాల సహాయంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టగా ఎట్టకేలకు దొరికింది. షార్ప్ షూటర్స్ పులిని అంతమొందించారు. 

అవని 2012లో యవత్మాల్‌ అడవుల్లో తొలిసారి కనిపించింది. ఆ సమీప ప్రాంతాల్లో రెండేళ్లలో పలు ఘటనల్లో పులి కారణంగా చనిపోయిన 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుఉందని ఎట్టకేలకు పులిని మట్టుపెట్టినందుకు ప్రజలు మిఠాయిలు పంచుకొని, టాపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

12:23 - November 5, 2018

హైదరాబాద్ : దీపావళి సీజన్ లో కళకళలాడుతుండే టపాకాయల విక్రయ దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాధారణ ధరకు, జీఎస్టీ కూడా అధనం కావడంతో, ప్రతియేటా 10 నుంచి 12 శాతం మేరకు పెరిగే ధరలు, ఈ సంవత్సరం 20 శాతానికి పైగా పెరగడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆంక్షలు కూడా ఉండటంతో వ్యాపారం తక్కువగా సాగుతోంది. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అధిక ధరలకు టపాకాయలను విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులే అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి, సరుకు తెచ్చుకున్నామని, వాటిని కొనుగోలు చేసే వారు కనిపించడం లేదని వాపోతున్నారు.
 

11:57 - November 5, 2018

సంగారెడ్డి: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. టీఆర్‌ఎస్ పాలనలో ముస్లింల నిజమైన అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించిందన్నారు. 204 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిందన్నారు. పేద ముస్లింలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ముస్లిం విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ కూడా ఇస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను బలపరుస్తూ ఎంఐఎం ఏర్పాటు చేసిన బహిరంగసభకు అసదుద్దీన్ ఓవైసీ హాజరై మాట్లాడారు. 

మైనార్టీల అభివృద్ధి విద్యద్వారానే సాధ్యమని భావించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 204 ఇంగ్లిషు మీడియం గురుకులాలు ఏర్పాటుచేశారని, వీటిల్లో 50వేల మంది ముస్లిం బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారని ఓవైసీ చెప్పారు. రూ.750 కోట్లతో 12 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు. ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. ఇన్ని చేస్తున్న కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓట్లువేసి గెలిపించి అధికారం అప్పజెప్పితే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఓవైసీ అన్నారు.

గత ప్రభుత్వాలు ఉర్దూ భాషను పట్టించుకోలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఉర్దూ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఓవైసీ కితాబిచ్చారు. మసీద్ ఇమామ్‌లకు ప్రభుత్వం తరుపున వేతనం ఇస్తున్నారని, పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారని వెల్లడించారు. దేశంలో మతఘర్షణలు జరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం గడచిన నాలుగున్నరేళ్లలో ఎలాంటి మత వివాదాలు తలెత్తలేదని ఓవైసీ గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు నియంత్రణలో ఉన్నాయని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓవైసీ సెటైర్లు వేశారు. చార్మినార్ వద్ద రాహుల్ సభకు రెండు వేల లోపే జనం వచ్చారన్న ఓవైసీ.. అదే చార్మినార్ వద్ద నాతో సెల్ఫీ దిగమంటే కనీసం 10వేల మంది వస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తమపై విమర్శలు చేస్తున్నాడని.. 'భారత దేశంలో మేమూ భాగమే.. కిరాయి వాళ్లం కాదు కదా' అని ఓవైసీ బదులిచ్చారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి గెలిపించుకోవాలని, మైనార్టీలను వంచించిన పార్టీలకు ఓటువేయొద్దని ఓవైసీ పిలుపునిచ్చారు.

11:54 - November 5, 2018

ఢిల్లీ : తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ నిలదొక్కుకోవడంతో.. 17.5 ఓవర్లలో విజయం సాధించి.. మూడు టీ-20ల సీరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత తడబడిన భారత్‌ విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, ధావన్‌లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కొద్దిగా కష్టాల్లో పడింది. ఓ దశలో విజయానికి భారత్‌ ఎదురీదింది. దినేశ్‌ కార్తీక్‌ నిలకడగా ఆడడం.. చివర్లో పాండ్యా విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడడంతో భారత్‌ 17.5 ఓవర్లలో విజయం సాధించింది. 

విండీస్‌ బౌలర్లలో థామస్‌, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. పియరీకి ఒక వికెట్‌ దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో ఉంది.

11:48 - November 5, 2018

అమ‌ృత్‌సర్ : ప్రభుత్వ ఉద్యోగులు..అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన వేతనం క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డబుల్ వేతనం క్రెడిట్ అయినట్లు తెలిసింది. ఈ వేతనం క్రెడిట్ అయిన వారు ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సెలైంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందించిందా ? అని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసేసరికి మిన్నకుండిపోయారు..
అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన వేతనాలను అక్కడి ట్రెజరీ వారి వారి అకౌంట్లో జమ చేసింది. కానీ ఒక్కసారిగా అసలు విషయం తెలుసుకున్న ట్రెజరీ ఆఫీసర్ ప్రభుత్వ శాఖలకు ఓ నోటీసు పంపించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ వేతనం క్రెడిట్ అయ్యిందని, పొరపాటున ఇది జరిగిందని నోటీసులో పేర్కొన్నారు. డబుల్ వేతనం డ్రా చేసుకోవద్దని..త్వరలోనే ఆ డబ్బును రికవరి చేస్తామన్నారు. రూ. 40-50 కోట్ల రూపాయలు అదనంగా క్రెడిట్ అయినట్లు సమాచారం. 

11:39 - November 5, 2018

ఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం మళ్లీ హఢలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా కాలుష్యం అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం తగ్గేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. వాతావారణ శాఖ కూడా పలు సూచనలు చేస్తోంది. కానీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ముందే చలికాలం కావడం..పొగమంచుకు తోడు కాలుష్యం అధికంగా ప్రబలుతోంది. 
Image result for Delhi Pollutionసోమవారం కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పీఎం లెవల్ 700 పాయింట్లకు చేరుకుంది. సెంట్రల్ ఢిల్లీ, మందిర్ మార్గ్, ధ్యాన్‌చంద్, జవహార్ లాల్ స్టేడియం తదితర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంది. కాలుష్య తీవ్రత అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదు వందల మీటర్ల లోబడి కనిపించడం లేదు. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 500 మీటర్ల మేర దుమ్మధూళి వ్యాపిస్తోంది. 
Image result for Delhi Pollutionశ్వాసకోశ వ్యాధులు అధికమౌతున్నాయి. అత్యవసరమయితే ఇంటి నుండి బయటకు రావాలని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పంటలను కాల్చిన అనంతరం వచ్చే పొగ, వాహనాల నుండి వచ్చే పొగ..వివిధ పరిశ్రమల నుండి వచ్చే పొగ కారణంగా కాలుష్యం అధికమౌతోందని కాలుష్య నియంత్రణ మండలి భావిస్తోంది. మరోవైపు దీపావళి పండుగ రాకముందే కాలుష్యం అధికం కావడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే పటాసులతో మరింత కాలుష్యం అధికమౌతోందని తెలుస్తోంది. దీనితో పటాసులపై నియంత్రణ విధిస్తారా ? లేదా ? అనేది చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు పటాసుల కాల్చడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ పటాసుల దుకాణాలు ఢిల్లీలో అధికంగా కనిపించడం లేదు. 

11:30 - November 5, 2018

తూర్పుగోదావరి : పవన్ రాకను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రోడ్డుపై భారీగా మట్టిని పోసి మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ వాహనం దిగి మట్టిని దాటుకుని  కాలినడకన వెళ్లి గిరిజనులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ మాఫియా దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే తన పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు. మాఫియా అడ్డుకున్నా తన పర్యటన ఆగదని పవన్ స్పష్టం చేశారు. జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. స్థానిక గిరిజనులకు మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ మాఫియా గిరిజనుల భూములను భయపెట్టి లాక్కుందని ఆరోపించారు. ఇప్పటికీ అసలు భూముల పట్టా గిరిజనుల పేరు మీదే ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో పవన్ నిన్న రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా మట్టివేయటంతో వాహనం వెళ్లటానికి వీలు లేకపోవటం వాహనం దిగి పనవ్ కళ్యాణ్ నడుచుకుంటు గిరిజనుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

11:16 - November 5, 2018

ప్రొ- కబడ్డీ సీజన్‌ సిక్స్‌లో గుజరాత్‌ టీమ్‌ అదరగొడుతోంది. ఆ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. రాత్రి ఢిల్లీతో తలపడిన ఆ టీమ్‌... 45-38 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఢిల్లీకి హ్యాట్రిక్‌ ఓటమి తప్పలేదు. ఇక యూపీ యోధ - బెంగాళ్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది.

ప్రొ- కబడ్డీ 6వ సీజన్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ విజయపరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాత్రి ఆ జట్టు దబాంగ్‌ ఢిల్లీతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టీమ్‌... దబాంగ్‌ ఢిల్లీని 45-38 పాయింట్ల తేడాతో ఓడించింది.

రైడర్‌ రోహిత్‌ గులియా వరుస పాయింట్లు తేవడంతో గుజరాత్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం కొనసాగించింది. తొలి నాలుగు నిమిషాల్లోనే 11-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ ఢిల్లీని ఆలౌట్‌ చేసి ఫస్టాఫ్‌ ముగిసే సరికి 27-18తో నిలిచింది. సెకండాఫ్‌లో డాంగ్‌లీ చెలరేగడంతో గుజరాత్‌ జట్టు పాయింట్లు పెంచుకుంటూ పోయింది. మరోవైపు ఢిల్లీ ట్యాకింగ్‌లో పూర్తిగా విఫలమైంది. మరో రెండు నిమిషాల్లో గేమ్‌ ముగుస్తుందనగా 45-38తో ఆధిక్యాన్ని సాధించిన గుజరాత్‌.. అదే జోరులో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

గుజరాత్‌ ఆటగాడు దక్షిణ కొరియాకు చెందిన డాంగ్‌ జియాన్‌ లీ 10 రైడింగ్‌ పాయింట్లతో రాణించాడు. ట్యాకింగ్‌లో పర్వేశ్‌ 6 పాయింట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ జట్టులో చంద్రన్‌ రంజిత్‌ 11 రైడింగ్‌ పాయింట్లు సాధించినా నిరాశే తప్పలేదు. 

మరో మ్యాచ్‌లో యూపీ యోధ - బెంగాల్ వారియర్స్‌ తలపడ్డాయి. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆఖరి రైడ్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ 30-30 స్కోరుతో టైగా ముగిసింది.  ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ కూడా టైగానే ముగిసింది.

11:09 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగున్నాయి. డిసెంబర్ నెలలో జరిగే ఈ ఎన్నికలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసీ పలు నిబంధనలు విధిస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఇటీవలే అమల్లోకి తెచ్చిన రైతు బంధు పథకం మీద ఈసీ ఆంక్షలు విధించింది. ఈ పథకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
తాజాగా రైతు బంధు పథకంలో నగదు బదిలీని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారికి మాత్రమే నగదు బదిలీ చేయాలని, కొత్తలబ్దిదారులను చేర్చవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. ఇందులో సుమారు 2 లక్షల మంది లబ్దిదారులున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 లక్షల 90 వేల మంది రైతులకు ప్రయోజనం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో 2.9 లక్షల మంది పాస్ పుస్తకాలు అందలేకపోవడంతో నగదు అందలేదని టాక్. చెక్కులు అందచేసి నగదు ఎందుకు బదిలీ చేయరని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తమకు డబ్బు వస్తుందని ఆశించిన రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

11:03 - November 5, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉమ్మడి ఎజెండాతో జత కట్టిన మహా కూటమి సీట్ల పంపిణీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు నామినేషన్ల సమయం దగ్గర పడుతుండటంపై కూటమి భాగస్వామి పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయవంలో టీడీపీ కొంత పట్టు విడుపుతో మసలుతోంది. ఇప్పటికే టీడీపీకి 14 సీట్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. మరో నాలుగు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా వుండటంతో మరోనాలుగు ఇవ్వాలని కోరుతోంది. ఈ క్రమంలో సీపీఐ మాత్రం పది సీట్లను అడిగిన ఈ పార్టీ కచ్చితంగా ఐదింటినైనా ఇవ్వాల్సిందేనని గట్టిగా కోరుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు, మునుగోడు, దేవరకొండ, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి. వీటిలో ఏవైనా ఐదు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతోంది. తమపార్టీ బలంగా ఉన్నందున నల్గొండలో ఒకటి, ఖమ్మం జిల్లాలో రెండు కలిపి తప్పనిసరిగా మొత్తం 5 కేటాయించాలనేది డిమాండు. కానీ రెండింటినే ఇస్తామని కాంగ్రెస్‌ సంకేతాలిచ్చింది. అవి బెల్లంపల్లి, వైరా అని తేల్చింది. తమకు 5 సీట్లు ఇవ్వకపోతే మరో ప్రణాళిక ప్రకారం ముందుకెళతామని సీపీఐ పేర్కొంది.
 

 

11:02 - November 5, 2018

గాంధీనగర్ (గుజరాత్): దారితప్పిన ఓ చిరుతపులి ఏకంకా రాష్ట్ర సచివాలయంలోకే ఎంటర్ అయ్యింది. గాంధీనగర్‌లోని సెక్రటేరియట్ సీసీటీవీలో చిరుత వంగిపోయి బారికేడ్ దాటటం సోమవారం తెల్లవారుఝామున రికార్డయ్యింది. అయతే దాని జాడ గర్తించడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది చిరుత ఎక్కడ దాక్కుందో కనుక్కోనేందుకు వెతుకులాట ప్రారంభించారు. అయితే లోపలికి చొరబడిన చిరుత బయటకు వెళ్లిపోయిందా లేదా..లోపలే ఉందా అనేది ఇంకా తెలియరాలేదు. అడవిలో నీటి వనరులు లేకపోవడంతో పాటు ఆహారం అందక ఇటీవల కాలంలో చిరుతలు జనారణ్యంలోకి అడుగు పెడుతున్నాయి. చిరుత గేటు దాటుకొని లోపలకి ఎలా ప్రవేశించిందో మీరూ చూడండి!

10:50 - November 5, 2018

హైదరాబాద్: ఫలక్‌నుమా పోస్టాఫీస్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ చెప్పుల గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. 2 ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో పక్కనే ఉన్న భవనంలో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తన్నారు. కాగా అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

10:48 - November 5, 2018

ఉత్తరప్రదేశ్‌ :  రామజన్మ భూమిలో రామ మందిరం కోసం కంకణం కట్టుకున్నామంటున్న బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ అంశాన్ని తెరమీదికి తెస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాముడి పేరుతో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహాన్ని సరయూ నది ఒడ్డున ప్రతిష్ఠించాలని యోచిస్తున్న యోగి సర్కారు అందుకోసం శిల్పిని వెతికే పనిలో పడింది. అందులో భాగంగా ఆర్కిటెక్ట్, డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. షార్ట్ లిస్ట్ అయిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ప్రజంటేషన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసిన అనంతరం విగ్రహ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు.  రాముడి విగ్రహం మొత్తం నిర్మాణం ఎత్తు 201 మీటర్లు కాగా, అందులో పీఠం ఎత్తు 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు వుండేలా  యోగీ ప్రయత్నాలను ప్రారంభించింది.
 

10:36 - November 5, 2018

ఒడిశా: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందారు. అల్లూరు కోట, సన్యాసిగూడ గ్రామ పరిసరాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమంది మావోలు అక్కడే ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు.

10:26 - November 5, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా హిమవత్పర్వతాలలో కొలువైన వున్న కేదారేశ్వరుడ్ని సందర్శించుకోనున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని పీఎంఓ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి.  దీంతో దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ  కేదారేశ్వరుడిని దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. జోలీ గ్రంట్ ఎయిర్ పోర్టునకు రేపు ఉదయం చేరుకునే మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళతారని, కేదార్ పురి పునర్మిర్మాణం పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. శీతాకాలం ప్రవేశించడంతో, కేదార్ నాథ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. మంచు తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆలయాన్ని మూసివేసి, తిరిగి ఆరు నెలల తరువాత తెరుస్తారు. కాగా, గతంలోనూ మోదీ ఓ మారు ప్రధాని హోదాలో కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.
 

10:00 - November 5, 2018

కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు ఒక్క రోజు దర్శనానికి సర్వం సిధ్దమైంది. ఇవాళ సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో గత నెలలో జరిగిన రగడ తెలిసిందే.. ఈ నేపధ్యంలో మరోసారి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. రేపు అర్ధరాత్రి వరకూ సెక్షన్ 144 కొనసాగనుంది

మహిళలకు అయ్యప్ప దర్శనం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు అవుతుందో లేదో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం చితిర అట్ట విశేషం పేరుతో జరిగే ఒక్క రోజు పూజకు ఆలయద్వారాలు తెరుచుకుంటాయ్. ఐతే ఈసారి మహిళల ప్రవేశంపై ఆంక్షలు కోర్టు రద్దు చేసిన నేపధ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. 

గతనెలలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పోలీస్ శాఖ భారీగా బందోబస్తు చేసింది. దాదాపు 5వేలమంది పోలీసులను భద్రతకోసం నింపేదిసింది. వీరిలో 50ఏళ్ల వయసు దాటిన మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఒక్క భక్తులను తప్ప..మిగిలిన వారిని అనుమతించే ప్రసక్తే లేదని పథనం తిట్ట జిల్లా ఎస్పీ నారాయణన్ ప్రకటించారు.  ఇద్దరు ఐజీలు, పదిమంది డిఎస్పీలు ఈ ఒక్క రోజు దర్శనం కోసం ఏర్పాటు చేసిన భద్రత సిబ్బందిని పర్యవేక్షిస్తారు. మరోవైపు పంబ పరిసరాల్లో మహిళాసంఘాలు దర్శనం కోసం చేరుకున్నట్లు తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే పిసి జార్జ్ స్వయంగా పదేళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉన్న
మహిళలు బాలికలు స్వామి దర్శనంకోసం సిధ్దంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు మహిళల దర్శనంపై ఆంక్షలను కోరుతున్న భక్తులు కూడా వీరిని అడ్డుకునేందుకు సిధ్దమైనట్లు తెలుస్తోంది. ఐతే ఇలా కోర్టు తీర్పు ప్రకారం దర్శనం కలిగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయ్. ఇలా చేయడం కేరళని వందేళ్ల వెనక్కి తీసుకెళ్తోందని జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత
ఎంటి వాసుదేవన్ నాయర్ అన్నారు. పాతకాలపు సంప్రదాయాలను అమలు చేయాలని చెప్పడం వాటిని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 543 కేసులు రిజిస్టర్ చేసి 3701మందిని అరెస్ట్ చేశారు. ఈ చర్యలు భక్తులను రెచ్చగొట్టేందుకే తప్ప ఇంకోటి కాదని..బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముక్తకంఠంతో విమర్శించడం విశేషం. ఈ నేపధ్యంలో శబరిమల ఆలయ పరిసరాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది.

09:49 - November 5, 2018

సంగారెడ్డి : ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు. మరెన్నో సంచలనాలు జరగుతుంటాయి. ఈ నేపథ్యంలో నీటి కోసం బోరు తవ్విత్తే..నీటితో పాటు నాణాలు కూడా వెల్లువలా పొంగి పొర్లుతున్న ఘటన స్థానికులకు విస్మయాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఇప్పుడీ వీడియో వాట్సాప్‌లో సంచలనం సృష్టిస్తోంది. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో బోరు బావి తవ్వితే నీళ్లతో పాటు నాణేలు కూడా వస్తున్నాయట. ఇప్పుడు ఈ విషయం వాట్సాప్ వీడియో గ్రూపుల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే శాంతి నగర్‌లో మాత్రం రెండు, మూడు రోజులుగా ఎక్కడా బోర్లు తవ్విన దాఖలాలైతే లేవు. మరి సంగారెడ్డిలో జరిగిందని చెబుతున్న ఘటన నిజంగా ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. కాగా గతకాలంలో ఆ ప్రాంతంలో నాణాల నిథిని భూమిలో భద్ర పరిచటంతో అదే ప్రాంతలో తవ్విన బోరుబావి నుండి నాణాలు వస్తుండవచ్చని కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా బోరుబావి నుండి నాణాలు కూడా రావటంతో స్థానికులంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

09:44 - November 5, 2018

వరంగల్: తెలంగాణ జనసమితి చీఫ్ (టీజేఎస్) కోదండరామ్ మహాకూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి కూర్పు నత్తనడక వల్ల చాలా నష్టం జరుగుతుందని కోడందరామ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రచారంలో ముమ్మరంగా సాగిపోతుంటే కూటమి ఇంకా మొదలే పెట్టలేదన్నారు. సీట్ల సర్దుబాటు ఇంకా తేలకపోవడంతో భాగస్వామ్య పక్షాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని కోదండరామ్ అన్నారు. పొత్తుల అంశం తేలితేనే నా పోటీపై స్పష్టత ఇస్తానని కోదండరామ్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం జరగకుండా ముందుకెళ్తామన్న కోదండరామ్.. సామాజిక న్యాయంపై ఉమ్మడి ఎజెండానే తమకు ముఖ్యమన్నారు. 

ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై కోదండరామ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రాజకీయాలు డబ్బు సంపాదన మీద తప్ప పనుల మీద దృష్టి పెట్టలేదన్నారు కోదండరామ్ ఆరోపించారు‌. టీఆర్‌ఎస్‌కు కాంట్రాక్టర్లు, కమిషన్ల మీద ఉన్న దృష్టి నిరుద్యోగుల పట్ల లేదని విమర్శించారు. ఈ రాజకీయాలు మారితేనే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందన్నారు. ఈ రాజకీయాలు మార్చడానికే పార్టీ పెట్టినట్లు ఆయన చెప్పారు.

09:37 - November 5, 2018

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్‌ ఒకడుగు ముందుకేసి ఇంటింటి ప్రచారాన్ని సైతం నిర్వహిస్తోంది. ప్రచారంతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పలుచోట్ల ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ప్రచారం నిర్వహిస్తోన్న  టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, రసమయి బాలకిషన్‌కు ప్రజల నుంచి నిరసన ఎదురైంది.

రాజన్న సిరిసిల్ల సిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల, కందికట్కూర్‌ గ్రామాల్లో తాజీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది.  నాలుగేళ్ల పాలనలో తమకేమి చేశావంటూ రసమయిని వంతడుపుల గ్రామస్తులు అడ్డుకున్నారు. మా గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు.  దీంతో రసమయి  అక్కడ ప్రచారాన్ని ముగించుకుని  పక్కనున్న కందికట్కూర్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని  మిడ్‌ మానేరు ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు... గ్రామస్తులు, మహిళలతో వాగ్వాదానికి దిగారు.  గ్రామస్తులపైకి దాడికి యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలను నెట్టివేయడంతో వారు రసమయిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్‌శాపురంలో తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గ్యాదరి కిషోర్‌కు నిరసన సెగ తగిలింది.  ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామన్న హామీ ఏమైందంటూ యువకులు గ్యాదరి కిషోర్‌ను నిలదీశారు. కొండగడపలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు.. టీఆర్‌ఎస్‌ నాయకులతో వాగ్వాదానికి దిగారు. అనాజిపురంలో పట్టాపాస్‌ పుస్తకాలు అందలేదంటూ...కిశోర్ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని.. గాదరి కిశోర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గత ఎన్నికల్లో నేతలు ఇచ్చిన హామీలను నెరేవర్చకపోవడంతో ప్రజలు వారిని నిలదీస్తున్నారు. దీంతో నాయకులకు నిరసన సెగలు తప్పడం లేదు.

09:27 - November 5, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్‌ బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం, మత్స్యకారులు, ఇల్లు కోల్పోయినవారు.. ఇలా బాధితులందరికీ మొత్తం 540 కోట్ల రూపాయలు పరిహారం అందించనున్నారు. పలాస మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో చంద్రబాబు కొంతమందికి చెక్కులు అందిస్తారు. అలాగే జిల్లాలోని అన్ని పంచాయితీల్లో అధికారులు చెక్కులు అందిస్తారు. మధ్యాహ్నం పలాసకు చేరుకోనున్న చంద్రబాబు... చెక్కుల పంపిణీ అనంతరం.. బహిరంగ సభలో పాల్గొంటారు. 

 

09:25 - November 5, 2018

హైదరాబాద్: పండగ కోసం షాపింగ్‌ చేసేవారిని దోచుకునేందుకు వ్యాపారులు సిద్దమవుతున్నారు. గత ఏడాది మిగిలిన సరుకును కొత్తగా ప్యాకింగ్‌ చేసి విక్రయించడం,.. తక్కువ తూకంతో అమ్మడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కొలతలు, తూనికల శాఖ అధికారులు.. షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్‌ జంట నగరాల్లోని టపాసులు, సీట్‌ షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దీపావళి సందర్బంగా.. టపాసులు, స్వీట్‌ షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి.. అమ్మకాలు సాగిస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. 

తూనికలు, కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ ప్రకారం.. ఎమ్మార్పీకే వస్తువులను విక్రయించాలి. ఎమ్మార్పీపై స్టిక్కర్లు అంటించకూడదు. అలాగే తూకం సక్రమంగా ఉండాలి. తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ, తయారీదారు పేరు, చిరునామా, ఇతర వివరాలు ప్యాకింగ్‌ బ్యాక్స్‌లపై పేర్కొనాలి. కానీ దుకాణదారులు మాత్రం.. అలా చేయడం లేదు. స్వీట్‌షాపుల్లో సరైన తూకంలో అమ్మకపోవడం.. డబ్బా బరువును కూడా స్వీట్స్‌తోనే కలిపి తూకం వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఇక టపాసుల దుకాణాలలో గతేడాది నిల్వ ఉంచిన టపాసులకు రేట్ల ట్యాగ్‌ లైన్‌ మార్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై 270 కేసులు నమోదు చేశారు. స్వీట్‌షాపులపై 180 కేసులు... క్రాకర్స్‌ షాపులపై 90 కేసులు నమోదు చేశారు. 

మొత్తానికి పండగ దగ్గర పడుతుండడంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మరి.. ఈ దాడులతోనైనా అక్రమాలకు అడ్డుకట్టపడి సామాన్యులకు మేలు జరుగుతందో.. లేదో చూడాలి.

09:09 - November 5, 2018

విజయవాడ : రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో చంద్రబాబుపై ప్రారంభైన విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టారంటే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలన్నీ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు ప్రశ్నలను ప్రతిపక్షాలపై సంధించారు.

Image result for lakshmi parvathi and jaganఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?  లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని కేఈ కోరారు.

09:07 - November 5, 2018

ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జీవితచరిత్ర ఆధారంగా కృష్ణ త్రిలోక్ రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను, అనుభవాలను తెలియజేశారు. తనకు పాతికేళ్ల వయసు వచ్చేవరకూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవని చెప్పారు. కంపోజర్‌గా కెరీర్ ప్రారంభించిన తాను అప్పట్లో ఫెయిల్ అయ్యాయని అన్నారు. దీనికి తోడు కుటుంబ బాధ్యతలు.. 9ఏళ్ల వయసులోనే తండ్రి మరణం.. ఎన్నో కష్టాలు.. వీటిని ఎదుర్కొలేక తన జీవితం ఇక ముగించాలని భావించేవాడినని తెలిపారు. అయితే చావు అనేది పరిష్కారం కాదని అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని 25ఏళ్ల వయసులో తెలుసుకున్నట్లు రెహ్మాన్ చెప్పారు.  జీవితంలో ఎవరూ పనికిరారు అని అనుకోకూడదని.. రెహ్మాన్ సూచించారు. చావు అనేది అందరికీ ఒకేసారి వస్తుందని, ప్రతిదానికి అంతమయ్యే తేదీ ఉంటుందని చెప్పుకొచ్చారు.  

12 నుంచి 22 ఏళ్ల వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి, ఎంతో నేర్చుకున్నట్టు రెహ్మాన్ తెలిపారు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్న తాను చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిపోయానని చెప్పారు. తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహ్మాన్‌గా మారిందని వివరించారు. ఎందుకు ఇష్టంలేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదన్నారు. సంగీతమే తనలో మార్పు తెచ్చిందని రెహ్మాన్ వెల్లడించారు. మొత్తంగా తాను ఎదుర్కొన్న కష్టాలే తనను జీవితంలో మరింత రాటుదేలేలా చేశాయని రెహ్మాన్ పేర్కొన్నారు.

09:01 - November 5, 2018

తూర్పు గోదావరి : గత ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు ఈపాటికి రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యేవారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను మద్దతు ఇవ్వడంతోనే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.... బీజేపీపైనా, జగన్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

ప్రజాపోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్‌... చంద్రబాబుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు రిటైరై  ఉండేవారని ఎద్దేవా చేశారు. తన మద్దతుతోనే సీఎం అయ్యారని చెప్పారు. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోద సమయంలో టీడీపీ ఎంపీలను కొట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకట్టడమేంటని నిలదీశారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా పవన్‌ కల్యాణ్‌ పదునైన విమర్శలు సంధించారు. ఆంధ్రులు దోపిడీదారులని టీఆర్ఎస్‌ నేతలు కించపరుస్తోంటే జగన్‌ నోరు మెదపకపోవడాన్ని పవన్‌ తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించాలంటే జగన్‌కు ఏవో భయాలున్నాయన్నారు.  తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడలేనివారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరని... కారాదని.. ఇదే శాసనమని ఆవేశంగా మాట్లాడారు. 

అవినీతిలో టీడీపీ నేతలు కాంగ్రెస్‌ నాయకులను మించిపోయారని పవన్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని దుయ్యబట్టారు. బీజేపీ అంటే చాలా కోపముందని పవన్‌ అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఎందుకు చేస్తున్నారని ఒక్క బీజేపీ నాయకుడూ ప్రశ్నించలేదన్నారు.  యూపీని ఇలాగే చీల్చుతారా అని ప్రశ్నించారు. యూపీని నాలుగు ముక్కలుగా చెయ్యకపోతే తమ కడుపుమంట చల్లారదని అన్నారు.

08:39 - November 5, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కడుపు మంటగా వుందని తెలిపారు. అదీ ఎవరిమీదనో తెలుసా? బీజేపీపైనే. బీజేపీపై తనకు చెప్పలేనంత కోపం ఉందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతు... ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చేసే వరకు తన కడుపు మంట చల్లారదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయ నేతలకు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదని..మీరెవర్రా రాష్ట్రాన్ని విడదీయడానికి అని అడగొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా అలాగే ముక్కలు చేస్తారా ? అని నిలదీశారు. యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు తమ కడుపు మంట చల్లారదని పవన్ పేర్కొన్నారు.
 

08:37 - November 5, 2018

చంఢీఘర్ : హర్యానాలోని సోనిపణ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి కారు, రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే ఖానాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. 

 

08:23 - November 5, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీపీఐకి 5 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి అవలంబించడం కొంత నిరాశకు గురిచేసిందన్నారు. కూటమి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు. 

 

08:18 - November 5, 2018

ఢిల్లీ : దేశంలోని పలు కీలక వ్యవస్థల్లోని వ్యవహారాలపై వివాదాలు నెలకొంటున్నాయి. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలో అవినీతి భాగోతాలు..దానిపై అటు కేంద్రం జోక్యం. ఇటు సుప్రీంకోర్టులో కేసుల పిటీషన్లు. ఇలా దేశంలోని కీలక వ్యవస్థల్లో పలు వ్యవహారాలు సామాన్యులకు వాటిపై నమ్మకం పోయేలా వ్యవహరించం ఆందోళన కలిగిస్తోంది. కాగా దీనికంతటికి కేంద్రం జోక్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కేంద్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Image result for rbi and supreme courtసుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోరా? అంటు ఆగ్రహం వ్యక్తంచేసింది.  తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి పేర్లను వెల్లడించాల్సిందేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించడాన్ని తప్పుబట్టింది. రుణాలు ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించలేదో  ఈ నెల 16లోగా సమాధానం చెప్పాలంటూ సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యలు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌నే ప్రధాన సమాచార అధికారిగా భావించాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేర్లను వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను జరిమానా ఎందుకు విధించకూడదో 16లోగా చెప్పాలని ఆదేశించారు.
పారదర్శకత, నిజాయతీలపై ఉర్జిత్ చెబుతున్నదానికి, ఆచరణకు పొంతన లేకుండా పోయిందని సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొండి బకాయిలపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బయటపెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐలను కోరింది. మరి దీనిపై గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

08:09 - November 5, 2018

హైదరాబాద్ : మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఓవైపు కాంగ్రెస్‌కు కూటమి పక్షాలు డెడ్‌లైన్‌ విధిస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. సీట్ల పంపకాలలో భాగంగా ఇవాళ టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూటమి పక్షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. 

మహాకూటమి సీట్ల సర్దుబాటుపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఇప్పటికే సీపీఐ, టీజేఎస్‌లు కాంగ్రెస్‌ను కోరాయి. మరోవైపు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు జరిపినా.. ఇంకా కొలిక్కి రాలేదు. 

సీట్ల సర్దుబాటుపై ఇవాళ మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలతో టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఏయే స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలన్న అంశంపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశముందని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. 

ఇక కూటమి నేతలతో భేటీ అనంతరం.. ఉత్తమ్‌తో పాటు.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏఐసీసీ తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితాను పరిశీలించనుంది. ఈ జాబితాను బుధవారం రాహుల్‌, సోనియా, కుంతియాలతో కూడిన కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదం తర్వాత.. ఈనెల 8న లేదా 9న కాంగ్రెస్‌ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి సీట్ల సర్దుబాటు, స్థానాల ఖరారుతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితాతోనే ఉత్తమ్‌ తిరిగి హైదరాబాద్‌ వస్తారని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.

07:54 - November 5, 2018

హైదరాబాద్ : ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగా ప్రకటించి ప్రచారంతో హోరెత్తిస్తోన్న టీఆర్‌ఎస్‌...  బీ-ఫారాలను సైతం ముందుగానే పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  ఈనెల 12 నుంచి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. ఈ గడువు ఈనెల 19 వరకు ఉంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి బీ-ఫారాలను పంపిణీ చేయడానికి టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7న దీపావళికాగా.. మరుసటి రోజు కార్తీకమాసం మొదలవుతుంది. 12న సోమవారం మంచి రోజనే భావనతో కొంతమంది  అభ్యర్థులు ఆ రోజున నామినేషన్లు వేయాలనుకుంటున్నారు. దీంతో కేసీఆర్‌ దీనిపై నిన్న కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అభ్యర్థులందరికీ ఒకేసారి బీ-ఫారాలు పంపిణీ చేయాలా , దశల వారీగా ఇవ్వాలా, లేదా నేరుగా అభ్యర్థుల ఇళ్లకే పంపించాలా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం. అయితే మిగిలిన 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే బీ-ఫారాలు అందజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

 

07:54 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమై వారాలు గడిచిపోయాయ్. మరో వారం రోజుల్లో నామినేషన్‌ ఘట్టానికి తెరలేవనుంది. టీఆర్ఎస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో ఇప్పటివరకూ ‘సీట్ల ముడి’ ఇంకా వీడటంలేదు. ఇప్పటివరకూ పలుసార్లు కూటమి నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. అయినా సీట్ల పంపకాలు తేలటంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈరోజు 4 పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎవరికి ఏ సీటు అన్నది ఇంకా తేల్చకపోతే ఎన్నిసార్లు చర్చలు జరిపినా వృథా అని కాంగ్రెస్‌కు మిగతా పార్టీలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఇక సమయం మించిపోతున్న తరుణంలో ఏ విషయం అనేది తేల్చేయాలని టీడీపీ నేత ఎల్‌.రమణ కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు. టీడీపీ దారిలోనే మిగిలిన 3 పార్టీలూ కూడా స్పష్టం చేశాయి. ఈరోజు మరోసారి కీలక చర్చలు జరపనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు తెజస అధ్యక్షుడు కోదండరాం మీడియా సమావేశం జరపనున్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు, ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నారన్న అంశంపైనా ఆయన వివరణిచ్చే అవకాశాలున్నట్లు..ఇప్పటి వరకూ 8 సీట్లు తెజసకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మరో 2 ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదనపు సీట్లు రెండింటినీ సిద్దిపేట, చాంద్రాయణగుట్టగా ఖరారు చేసినట్లు..మిగిలిన 8 ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఎంచుకోవాలని తెజస తేల్చుకోవాలని కాంగ్రెస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Related imageతేలని సీట్ల ముడి ఆశావహుల్లో గందరగోళం 
మహా కూటమిలో పొత్తులు ఖాయం. కానీ అనుకూలమైన సీట్లు మాత్రం తమకే దక్కాలనే పంతంతో మహాకూటమి భాగస్వామ్య పార్టీల తీరు వుంది. గత కొన్ని వారాలుగా ఆ పార్టీలన్నీ చర్చలు కొనసాగిస్తున్నా...ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఎవరికి వారు టికెట్లపై నమ్మకంతో తామే అభ్యర్థులం అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శేరిలింగంపల్లి స్థానాన్ని తెలుగుదేశానికి ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ గాంధీభవన్‌ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.  ఈ నిరసనలో భాగంగా ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యకు కూడా పాల్పడటంవతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితు నెలకొన్నాయి. కాగా సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా తయారయ్యింది. ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ ఎదురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

07:07 - November 5, 2018

అనంతపురం  : ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తు ఏమాటనైనా కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన స్టైల్ లో స్పందించారు. ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు. రెడ్లకు, రాష్ట్రానికి  జగన్ శనిలా దాపురించాడని మండిపడ్డారు.  కోడికత్తితో చిన్న గాయమైతే దానికిన్ని డ్రామాలు అవసరమా? అని ప్రశ్నించారు.శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాను కారణంగా తీవ్ర నష్టాల పాలైతే జగన్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. జగన్‌కు కామన్‌సెన్స్ అనేదే లేదన్న జేసీ.. పట్టిసీమను వద్దన్న మూర్ఖుడు అని విమర్శించారు.చంద్రబాబు సీఎం అయితేనే అనంతపురం జిల్లాకు నీళ్లొస్తాయన్న జేసీ.. ఆయన్ను పట్టుదల, విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణించారు.

06:47 - November 5, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకూ మహిళలు సీఎం పదవి చేపట్టలేదు. కానీ ఆరోజు రానుందా? అదీ ఈ వచ్చే ఎన్నికల్లోనే ఆ కొరత తీరిపోనుందా? తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న పోరులో మహా కూటమి గెలుపు సాధిస్తుందా? మహా కూటమి గెలుపు సాధిస్తే తానే సీఎంనవుతానని ధీమా వ్యక్తంచేస్తున్నారు కాంగ్రెస్ సీనియుర్ నేత..దివంగత ముఖ్యమంత్రికి దేవుడిచ్చిన చెల్లెమ్మగా పేరు తెచ్చుకున్న మాజీ హోం మినిష్టర్ సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి అంతే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్ నేతలున్నా కూడా ఆమెనే హోం మినిష్టర్ ను చేశారు రాజశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మహా కూటమి గెలిస్తే తానే సీఎంని అవుతానని సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖంగుతిన్నారు. కలవర పడుతున్నారు. అంతేకాదు  మహేశ్వరం నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు సబితా..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు.

మహేశ్వరం నుంచి తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు మహేశ్వరంలోని శ్రీరాంనగర్ కాలనీకి వచ్చి చూడాలని కాలనీ వాసులు పేదరికంలో మగ్గుతున్నారని సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. మరి సబితా వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

Don't Miss