Activities calendar

08 November 2018

21:57 - November 8, 2018

దంతెవాడ: చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. చత్తీస్ ఘడ్ కు చెందిన అభినందన్ పాఠక్ అచ్చు మోడీ లాగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బస్తర్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్న పాఠక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంతెవాడ, కొండగావ్‌, జగ్దల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నపాఠక్ తో ఓటర్లు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

21:17 - November 8, 2018

హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను ఈరోజు హైదరాబాద్ లో  వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మంగలికృష్ణ పై  హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ  గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా....  కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

19:57 - November 8, 2018

ఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం ముగిసింది. తీవ్ర వడపోతల మధ్య 74 సీట్లలో పోటీచేసే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే స్ధానాలను కేటాయించారు. యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకమిటీ సమావేశం అనంతరం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో మిత్ర పక్షాలకు 25 సీట్లు కేటాయించామని చెప్పారు. టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐకి 3  కేటాయించామని, ఈనెల 10న తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

19:21 - November 8, 2018

బెంగుళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరులో జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమావేశం అయ్యారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబునాయుడు వీరిని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు సమావేశమైన అనంతరం ముగ్గురు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
రాజ్యాంగ బధ్దంగా ఏర్పాటైన సంస్ధలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దేవెగౌడ అన్నారు. కేంద్రలోని బీజేపీని గద్దె దించాలంటే దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని అందులో భాగంగా చంద్రబాబుతో చర్చలు జరిపామని దేవెగౌడ చెప్పారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో కూడా చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన తెలిపారు. 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.... దేశంలోని రాజ్యంగ బధ్దంగా ఏర్పడ్డ సంస్ధలను అడ్డంపెట్టుకుని మోడీ ప్రభుత్వం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్నలక్ష్యంతో బెంగళూరు వచ్చానని చంద్రబాబు అన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో పెరిగిపోతున్నాయని,  ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిందని, రెగ్యులేటరీ బాడీ అయిన రిజర్వుబ్యాంకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈడీ, ఆదాయపుపన్ను శాఖలద్వారా గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతూ సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ, జేడీఎస్‌ పాతమిత్రులేనని, లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై తాము చర్చించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి అంటూ...2019 లోక్‌సభ ఎన్నికల్లో 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులు  ఏకం చేయంటంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈవారంలోనే చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తోనూ సమావేశం అవుతారు. 

18:19 - November 8, 2018

కాలిఫోర్నియా: అమెరికాలో కాలిఫోర్నియాలోని ధౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్ లో గురువారం తెల్లవారు ఝూమున ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13మంది మరణించారు. పలువురికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు ఘటనాస్దలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిఫోర్నియాలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్ లో ఓకళాశాలకు చెందిన సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఆగంతకుడు పబ్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. పబ్ లోకి వస్తూనే పొగ వచ్చే గ్రెనేడ్లు విసిరి కాల్పులుకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపిన ఆంగతకుడు కూడా బార్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇటీవల అమెరికాలో  స్కూళ్లు, ప్రార్ధనా మందిరాలు, పబ్ లు రెస్టారెంట్లుతో సహా బహిరంగప్రదేశాలలో ఇటీవల  దుండగులుకాల్పులు జరిపే ఘటనలు ఎక్కువయ్యాయి. 

17:41 - November 8, 2018

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 


దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడి సంస్థానాలనీ, రాజ్యాలనీ తమ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటారు.
ఆ నేపథ్యంలో, రోనక్‌పూర్ అనబడే స్వతంత్ర్య రాజ్యంపై కన్నేసిన బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్, రోనక్‌పూర్ రాజుని, అతని కొడుకుని అంతమొందించి, రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు యువరాణి జఫీరా, రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ సాయంతో రాజ్యం నుండి తప్పించుకుంటుంది. మరోపక్క థగ్స్‌గా పిలవబడే ఒక ముఠా, దారి దోపిడీలతో బ్రిటీష్ వారిపై విరుచుకు పడుతుంటుంది. తన అవసరాల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తన తెలివితో ఎంతటివారినైనా బురిడీ కొట్టించే ఫిరంగి మల్లయ్యను, థగ్స్  నాయకుడైన ఖుదా బక్ష్‌ను పట్టుకోవడానికి నియమిస్తాడు జాన్ క్లైవ్. మరి ఫిరంగి మల్లయ్య, ఖుదా బక్ష్‌ని బ్రిటీష్ వారికి అప్పజెప్పాడా, లేదా అనేదే ఈ థగ్స్ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


అమితాబ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చాలా వరకూ డూప్ సాయంతో లాగించేసారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ, తెలుగులో ఆయనకి వాయిస్ సూట్ కాలేదు. తెరపై అమీర్‌ని చూస్తున్నంత సేపు..  పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో జాక్ స్పారో పాత్రే గుర్తొస్తుంది. కత్రినా సురైయ్యాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర అలరిస్తుంది.
అజయ్ - అతుల్ కంపోజ్ చేసిన పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు కానీ, జాన్ స్టివార్ట్ బ్యాగ్రౌండా స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.  మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఈ సినిమాకి చక్కగా సూటవుతుంది. 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్ నవల ఆధారంగా, రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది, పైగా, అమితాబ్, అమీర్ కాంబో  అనగానే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఆ అంచనాలకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. దర్శకుడు సెట్స్ మీదా, కాస్ట్యూమ్స్ మీదా, యాక్షన్ ఘట్టాల పైనా పెట్టిన శ్రద్థ, కొంచెమైనా స్ర్కీన్‌ప్లే పై కూడా పెట్టుంటే థగ్స్ ఇంకోలా ఉండేది. 


థగ్స్.. పైన పటారం, లోన లొటారం. 

తారాగణం :  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్

        కెమెరా    :            మనుష్ నందన్ 

       సంగీతం   :         అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం  :         జాన్ స్టివార్ట్ 

         నిర్మాత   :         ఆదిత్య చోప్రా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :     విజయ్ కృష్ణ ఆచార్య

రేటింగ్  : 2/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

16:37 - November 8, 2018

విజయవాడ: విజయవాడలో టీడీపీ,జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. గతంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుడు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి  కౌంటర్ గా  జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుతో తెలుగుదేశం పార్టీని ఘాటుగా విమర్శిస్తూ  నగరంలో  బుధవారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఇన్నాళ్లు  సైలెంట్ గా ఉన్న  పోలీసులు  ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. 
పవన్ కళ్యాణ్ మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు 2014 లోనే రిటైరయ్యేవారని ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా  కాట్రగడ్డ బాబు..." పవన్ కళ్యాణ్ గారు మీరు మద్దతివ్వకపోతే చంద్రబాబు 2014 లోనే రిటైరయ్యేవారా? ఎందుకు అహంకారపు ప్రగల్భాలు, మీ అన్నదమ్ములంతా కలిసినా 2009లో మీకు వచ్చింది 18 సీట్లే,  ఇప్పుడు తల్లకిందులుగా తప్పస్సు చేసినా మీరు ఒకటో,రెండో సీట్లు గెలిస్తే గొప్ప, అంతకు మించి మీకు సీను లేదు, సినిమా లేదని" గతంలో బ్యానర్లు కట్టారు .
కాట్రగడ్డ బాబు వేసిన  పోస్టర్సకు కౌంటర్ గా విజయవాడలోని బెంజిసర్కిల్ తో సహా ప్రధాన కూడళ్లలో జనసేనపార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుమీద తెలుగుదేశం పార్టీని  ఘూటుగా విమర్శిస్తూ బుధవారం వెలిసిన పోస్టర్లతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. "పచ్చతమ్ముళ్ల పిచ్చిపురాణం, వెంటాడుతున్న ఓటమి భయం, టీడీపీని ఓడించే జనసైనికులం" అంటూ వెలసిన ఫ్లెక్సీలలో తెలుగు దేశం పార్టీపై ఘాటుగా విమర్శించారు. "2019లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీతో అక్రమసంబంధం పెట్టుకున్నారని, దమ్ముంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగా పోటీ చేయాలని" సవాల్ విసిరారు. "2019లో టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయకపోతే మేము జనసైనికులం కాదని " జనసేన పోస్టర్లలో పేర్కోన్నారు. దీంతో పరిస్ధితి తీవ్ర రూపం దాల్చకుండా  పోలీసులు  రెండు పార్టీల నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిధ్దమయ్యారు.

16:27 - November 8, 2018

జావా (ఇండోనేషియా) : ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలచేత సిగరెట్ తాగించాడు ఓ ప్రధాన ఉపాధ్యాయుడు. పదకొండు మంది విద్యార్థులకు శిక్ష వేసేందుకు వారిచేత బలవంతంగా సిగరెట్ తాగించాలని నిర్ణయించాడు. ఆటస్థలంలో 11 మంది విద్యార్థులను లైన్‌గా నుంచోబెట్టారు. ఆ తర్వాత వారిని హెడ్‌మాస్టర్ గదికి లాక్కెళ్లారు. అక్కడ పనిష్మెంటుగా వారిని సిగరెట్ తాగమన్నారు. వారు సిగరెట్ తాగుతుంటే వారిని చూసి పక్కనేఉన్న కొంతమంది ఇతర విద్యార్థులు నవ్వుతున్నారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర జావ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకొంది. ఆ హెడ్ మాస్టర్ పేరు తాటి మాలేటీగా గుర్తించారు. పిల్లలు సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగవదులుతుంటే అక్కడే ఉన్న ఒక టీచర్ వీడియో చిత్రీకరించాడు. ఈ వింత శిక్షకు సంబంధించన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  
 

15:42 - November 8, 2018

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టారు. కునాల్ కోహ్లి  బాలీవుడ్‌లో, అమీర్ ఖాన్‌తో ఫనా, సైఫ్ అలీఖాన్‌తో హమ్‌తుమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నెక్స్ట్ ఏంటి చిత్ర షూటింగ్, లండన్, హైదరాబాద్‌లలో జరగనుంది. తమన్నా ప్రస్తుతం ఎఫ్2, అభినేత్రి 2, క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మితో పాటు, హిందీలో ఖామోషీ అనే సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి  మూవీకి లియోన్ జేమ్స్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  

15:11 - November 8, 2018

దంతేవాడ: నవంబర్ 12 ఎన్నికల జరగనున్న చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చత్తీస్ ఘడ్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక రోజు ముందు మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బచేలి సమీపంలో గురువారం మావోయిస్టులు ఒక బస్సుపై  దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తో సహా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
గడచిన 2 వారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు పాల్పడటం ఇది మూడోసారి.  అక్టోబర్ 30 న ఎన్నికల వార్తల కవరేజ్ కు  వెళ్లిన దూరదర్శన్ టీంపై పైదాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానందన్ మరణించారు.  వారికి రక్షణగా వెళ్లిన  మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 27న  ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు  మరణించారు.
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్  నవంబర్ 12న జరుగుతుంది.  తొలిదశలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, మిగిలిన  72 నియోజకవర్గాలలో నవంబర్  20న పోలింగ్ జరుగుతుంది. 

14:11 - November 8, 2018

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌లోనే కుప్పకూలిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతణ్ణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా, అప్పటికే శరవణన్ మృతిచెందినట్టు డాక్టర్స్ చెప్పడంతో, యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి, అజిత్ చాలా బాధపడ్డాడట. తనే దగ్గరుండి పోస్ట్‌మార్టం పనులవీ చూసుకున్నాడని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక, శరవణన్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, కానీ, ఆసంగతి యూనిట్ వారికి చెప్పలేదని తోటి డ్యాన్సర్స్ అంటున్నారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా, మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందచేసింది విశ్వాసం టీమ్.  

13:56 - November 8, 2018

ఢిల్లీ: నోట్ల రద్దుకు ఈరోజుకు అంటే నవంబర్ 2019నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. నోట్ల రద్దు విషయంపై 2016 నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనతో దేశం యావత్తు షాక్ కు గురయ్యింది. పెద్దల నుండి సాధారణ ప్రజానీకం వరకూ నివ్వెరపోయారు. దీంతో తెల్లారేసరికి దేశంయామత్తు భయాందోళనలకు గురయ్యింది. నల్లధనాన్నిన వెలికి తీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్రం సమర్థించుకుంది. దేశ ప్రజలను అర్థరాత్రికి రాత్రి నడిరోడ్డుపై నిలబెట్టేసింది. నల్లధనం మాట ఎలా వున్నా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అయిపోయింది.

Image result for demonetisation peaple proublumsచిరు వ్యాపారుస్థుల నుండి పెద్ద వ్యాపారుల వరకూ ఏం చేయాలో పాలుపోక అతలాకుతలం అయిపోయారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు రెండేళ్లు నిండిన  సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అసలు ఉద్దేశాన్ని విశదీకరించారు. డీమానిటైజేషన్ అదే పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నగదును సీజ్ చేయటం కాదు.. ఎక్కువ నగదు కలిగిఉన్న వారిచేత పన్ను చెల్లించేవిధంగా చేయడమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. ‘‘లెక్కలోలేని నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు.. వారిచేత పన్ను చెల్లింపచేయడమే ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచే విధానం అవసరం దేశానికి ఉంది’’ అంటూ బుధవారం జైట్లీ వివరించారు. కానీ ఇది ఎంతవరకూ వాస్తమో? ఇది ఎంతవరకూ నెరవేరిందో కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రశ్నార్థకంగా మారటం గమనించాల్సిన విషయం. 

 

 

13:23 - November 8, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఎంతకూ తెమలటంలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితాతో ఢిల్లీ వెళ్లిన నేతలు పలు దఫాలుగా కాంగ్రెస్ అధిష్టానంతో భేటీలు కొనసాగుతన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా లీక్ అవ్వటం..మహాకూటమిలో భాగంగా వున్న సీపీఐ ఆశించిన స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులకు ఖరారు చేయటంతో సీపీఐ మండి పడుతోంది. సీపీఐ ఆశించిన వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్త గూడెం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు దాదాపు ఖరారు చేసినట్లుగా లీకులు బైటకురావటం అది కామ్రెడ్లకు తెలియటంతో వారు మండిపడుతున్నారు. ఈ లీక్స్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా పూర్తిస్థాయిలో అభ్యర్థులకు ఖరారు చేయలేదనీ..దీనిపై వస్తున్న వార్తలను నమ్మవద్దంటు సీపీఐ కు కాంగ్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా సమాచారం. మరి సీపీఐ ఏం నిర్ణయించుకోనుంది. మహాకూటమిలో కొనసాగుతుందా? లేదా స్వంతగా పోటీ చేస్తుందా? కాంగ్రెస్ నచ్చచెప్పటం..సీపీఐ ఆశించిన సీట్లను కాంగ్రెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
 

13:20 - November 8, 2018

న్యూఢిల్లీ: నోట్ల రద్దుకు రెండేళ్లు నిండింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అసలు ఉద్దేశాన్ని విశదీకరించారు. డీమానిటైజేషన్ అదే పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నగదును సీజ్ చేయటం కాదు.. ఎక్కువ నగదు కలిగిఉన్న వారిచేత పన్ను చెల్లించేవిధంగా చేయడమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. ‘‘లెక్కలోలేని నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు.. వారిచేత పన్ను చెల్లింపచేయడమే ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచే విధానం అవసరం దేశానికి ఉంది’’ అంటూ గురువారం జైట్లీ వివరించారు. 

Image result for old indian currency notes
డీమానిటైజేషన్ తర్వాత యూపీఐ యాప్ విడుదలచేయడం ద్వారా ఢిజిటల్ లావాదేవీల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కేవలం 50 లక్షల లావాదేవీలు అక్టోబర్ 2016 సంవత్సరం జరగగా..వీటి సంఖ్య సెప్టెంబర్, 2018 నాటికి 598 లక్షలకు చేరింది.   అలాగే డీమానిటైజైషన్ తర్వాత భీమ్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. 
 

 

12:56 - November 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటు వేసిన పిటీషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఎన్నికల వేళ ఓటర్ల జాబితా అంశంపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, ఆ జాబితాతోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో ఎలా తదూరుస్తామని ఈ సందర్బంగా  ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా అంశంపై ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ కోర్టును ఆశ్రయించింది.
 

12:44 - November 8, 2018

హైదరాబాద్ :  ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్దికి చంద్రబాబు అడ్డుపడుతున్నారనీ..రాష్ట్రంలో అస్థిరత సృష్టించేదుకు చంద్రబాబు మహాకూటమి వేదికగా ఎన్నికల నేపథ్యంలో యత్నిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని..తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తు..నీటిని ఆంధ్రాకు తరలించే కుట్రలు పన్నుతున్నారని..తద్వారా తెలంగాణను మళ్లీ వలసల రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని  విమర్శించారు. నీటిప్రాజెక్టులపై కేంద్ర జలసంఘానికి లేఖలు రాస్తున్నారన్నారు. 
తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? ఆ ప్రాజెక్టును నిర్మించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాళేశ్వరంపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం మేము చేసిన పాపమా? కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్లను వద్దనలేదా? కల్వకుర్తిపై కుట్రలు చేశారన్నది నిజం కాదా? పోలవరానికి బదులు కృష్ణాకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడారా? లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దన్నది మీ కుతంత్రం కాదా? అని నిప్పులు చెరిగారు. 
 

12:33 - November 8, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
అంతేకాదు, కేవలం రెండే రెండు రోజల్లో ఈ సినిమా అక్షరాలా రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. మొదటరోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్ పడగా, ప్రపంచవ్యాప్తంగా, రెండు రోజుల్లో, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సర్కార్. మరోపక్క ఈ సినిమాలో విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేసాడని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. గతంలో, తమిళనాట విజయ్ నటించగా విజయం సాధించిన కొన్ని సినిమాలను పవన్, తెలుగులో రీమేక్ చేసాడు. పవన్ బంగారం ఆడియో ఫంక్షన్‌కి, విజయ్ గెస్ట్‌గా వచ్చాడు కూడా. అయితే సర్కార్‌లో విజయ్, పవన్‌లా,  ప్రశ్నిస్తా.. అనడంతో పాటు, అజ్ఞాతవాసి సినిమాలోలా, అహ్ అహ్ అంటూ చాలా వరకూ, పవన్‌ని అనుకరించాడు, అందుకే రెండు రోజుల్లో రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యగలిగింది అంటున్నారు కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్.. 

 

12:11 - November 8, 2018

హైదరాబాద్ : సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ముందు 19 ప్రశ్నలను సంధిస్తూ, బహిరంగ లేఖను రాసిన ఆయన, పలు అంశాలను స్పృసించారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? ఆ ప్రాజెక్టును నిర్మించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాళేశ్వరంపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం మేము చేసిన పాపమా? కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్లను వద్దనలేదా? కల్వకుర్తిపై కుట్రలు చేశారన్నది నిజం కాదా? పోలవరానికి బదులు కృష్ణాకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడారా? లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దన్నది మీ కుతంత్రం కాదా? అని నిప్పులు చెరిగారు. ఎవరి అనుమతితో ఏపీలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం ముంపు మండలాలు అన్యాయంగా తెలంగాణకు దూరం చేయలేదా? సీలేరు విద్యుత్ ప్లాంటును తీసుకోవడం ద్వారా తెలంగాణకు ఏడాదికి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లేలా చేసింది మీరు కాదా? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2,465 మెగావాట్ల విద్యుత్ ఎగ్గొట్టలేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
 

11:51 - November 8, 2018

ఈ దీపావళికి దళపతి నటించిన సర్కార్ విజయంతో,  విజయ్ అభిమానులు, తమిళ ప్రేక్షకులకు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. దీపావళికి కోలీవుడ్ కొత్త సినిమా అప్ డేట్స్‌తో కళకళలాడింది. పండగ సందర్భంగా.. ముందురోజు, చియాన్ విక్రమ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పండగ నాడు, తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఎన్‌జీకే మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేసారు. సూర్యకిది 36వ సినిమా. సెల్వరాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ‌సినిమాలో, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా, జనవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ధనుష్, బాలాజీ మోహన్‌ల కలయికలో వచ్చిన మారి మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కాంబోలో మారికి సీక్వెల్‌గా, మారి 2 తెరకెక్కుతుంది. సాయి పల్లవి కథానాయిక. దీపావళికి మారి 2 కొత్త పోస్టర్లు విడుదల చేసారు. ఎన్‌జీకే అండ్ మారి 2 న్యూ లుక్స్, ఆయా హీరోల అభిమానులనూ, తమిళ సినీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి.     

 

11:23 - November 8, 2018

హైదరాబాద్ : ఎన్నో నెలలుగా మెబైల్ వినియోగదారులు ఎదురుచూస్తున్న శ్యామ్‌సంగ్ మడత పెట్టగలిగే స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. దీంట్లోభాగంగా మెదటి లుక్‌ను శ్యామ్‌సంగ్ విడుదల చేసింది. మడతపెట్టే ఫోన్ కోసం కొత్త యాప్‌లు క్రియేట్ చేయాలని డెవలప్పర్స్‌ను శ్యామ్‌సంగ్ కోరింది.
ఇటీవల కాలంలో భారీగా తగ్గిన లాభాలను దృష్టిలో ఉంచుకొని.. కొరియన్ టెక్ జెయింట్ శ్యామ్‌సంగ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అలాగే యాపిల్ దెబ్బతో పోయిన రెవెన్యూలను తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది. శ్యామ్‌సంగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిఇన్ డెనిసన్ శ్యాన్‌ఫ్రాన్‌సిస్కోలో ప్రాధమికంగా మడత ఫోన్ గిఫ్‌ను చూపించారు. అయితే ఇది 18.5 సెంటీమీటర్ల డయాగ్నల్‌గా సైజ్‌లో ఉంది.  
దీని ధర కానీ.. దీని మందం కానీ చూస్తే.. వినియోగదారులకు నచ్చకపోవచ్చని బిజినెస్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

11:12 - November 8, 2018

దీపావళికి ఓవైపు టపాసుల మోత మోగుతుంటే, సినిమా పరిశ్రమ కొత్త సినిమాల ఫస్ట్‌లుక్స్, అప్‌డేట్స్‌తో అదరగొట్టేసింది. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏంటో చూద్దాం.. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు జంటగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న మూవీ.. ఎఫ్2. వెంకీ, వరుణ్ తోడల్లుళ్ళుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎర్ర చొక్కాలేసుకుని, గళ్ళ లుంగీలు కట్టుకుని, స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని, మాంచి ఊపుమీద డాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి రిలీజ్ చేసింది చిత్రబృందం. మాస్ మహరాజా రవితేజ, శ్రీనువైట్ల కలయికలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని టీమ్, దీపావళి శుభాకాంక్షలు చెప్తూ ఒకటి, నవంబర్ 16న విడుదల అంటూ, రెండు పోస్టర్స్ వదిలారు. వరుణ్ తేజ్ హీరోగా, ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్ మూవీ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ పండక్కి రెండు సినిమాల అప్‌డేట్స్‌తో మెగా ఫ్యాన్స్‌ని పలకరించాడు వరుణ్. శర్వానంద్, సాయిపల్లవిల పడిపడిలేచే మనసు, అఖిల్ అక్కినేని, వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న మిస్టర్ మజ్ను, 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియచేస్తూ, అఖిల్ కొత్త లుక్ విడుదల చేసారు. దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర, విజయ్ దేవరకొండ టాక్సీవాలా, ఆది సాయికుమార్, సాయికిరణ్ అడవిల ఆపరేషన్ గోల్డ్‌ఫిష్, బ్లఫ్ మాస్టర్, అనగనగా ఓ ప్రేమకథ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఏడు చేపల కథ  సినిమాల లుక్స్  ఈ దీపావళికి రిలీజ్ అయ్యాయి. 
 

11:09 - November 8, 2018

ఉత్తరప్రదేశ్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో 'అయోధ్య దీపోత్సవ్ 2018' పేరిట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సరయు నది తీరాన 3,01,152 దీపాలు వెలిగించినందుకుగాను అయోధ్య దీపోత్సవ్ 2018 ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. కాగా ఈ దీపోత్సవానికి సౌత్ కొరియా అధ్యక్షుడు సతీమణి సూరిరత్నప్రత్యేక అతిథిగా విచ్చేయటం మరో విశేషం. ఏటా వందల సంఖ్యలో దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యను దర్శించుకొని వెళుతుంటారు.మన రామాయణ దేవుడి జన్మభూమితో వారికేం పని అంటే.. దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఈ నేపథ్యంలో క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా యువరాజును సూరిరత్న కొరియా యువరాజును వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సూరిరత్న పేరును హియో హ్వాంగ్-ఓక్ గా పేరు మార్చుకున్నారు. 
 

10:40 - November 8, 2018

ఢిల్లీ : దీపావళి పండుగ వేడుకల సందర్భంగా వాహనదారులకు శుభవార్త అందినట్లే. ఇప్పటివరకూ పెట్రోల్,డీజిల్ పెరుగతుపోయి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 20 రోజుల నుండి తగ్గుముఖంపట్టాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటమే. దీంతో  దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. నేడు లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 78.21కి, డీజిల్ ధర రూ. 72.89కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.72, డీజిల్ ధర రూ. 76.38కి చేరుకోగా మిగతా ప్రాంతాల్లోనూ ధరలు ఆ మేరకు తగ్గాయి.
 

10:16 - November 8, 2018

హైదరాబాద్ :  ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ టీడీపీ నేతలు అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా  టీ.టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు.. టీఆర్ఎస్ ది కుటుంబ కూటమి అని మాది ప్రజల కూటమి అని రావుల స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతున్నారనే టీఆర్ఎస్ కు ఎదురు కౌంటర్ ఇచ్చారు రావుల. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు..2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు లేని ఆత్మగౌరవ తాకట్టులు తమ కూటమిని విమర్శించేవారికి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? అంటు రావుల ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ది కుటుంబ కూటమి, మారు ప్రజా కూటమి : రావుల
ఈ సంద్భంగా రావుల టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు.ముఖ్యంగా దేశ రాజకీయాలలో చంద్రబాబు మహాకూటమి దేశ రాజకీయాలలో పెను మార్పులు తీసుకొస్తుందనీ..చంద్రబాబు ఈరోజున బెంగళూరు వెళ్తున్న సందర్భంగా అభినందనలు తెలపటానికి వచ్చామని రావుల తెలిపారు. ఈ క్రమంలో దేశంలో రాజకీయాలు కలుషితం అయిన నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న జాతీయ మహాకూటమికి తెలుగు ప్రజలు ఎక్కడా వున్నాగానీ..చంద్రబాబు ఆశయాలను అమలు చేసేందుకు నిరంతరం కట్టుబడి వుంటామని రావుల తెలిపారు. 

Image result for mahakutamiతెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలోని భాగస్వామిగా వున్న టీడీపీ మహాకూటమిలో టీడీపీకి 14 స్థానాలు కేటాయించే అవకాశం ఉండడంతో.. ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు ఇవాళ టీ-టీడీపీ నేతలు అమరావతి వెళారు. చంద్రబాబు ఆమోదం తర్వాత.. అభ్యర్థుల జాబితా ఫైనల్‌ చేయనున్నారు టీ.టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోదూసుకుపోతున్న క్రమంలో కూటమిలో భాగంగా టీడీపీ  వెనుకబడిపోతారా అనే ప్రశ్నకు సమాధానంగా టీడీపీకి ఎన్నికలు కొత్తకాదనీ..టీడీపీకి ప్రజల్లో వుండే మద్దతుతో ప్రజల అభిమానాన్ని పొందుతామని తెలిపారు. గతంలో నామినేషన్ ప్రక్రియ జరిగిన తరువాత కూడా అభ్యర్ధుల ప్రక్రియ కొనసాగిందని రావుల గుర్తు చేశారు. కాగా టీడీపీ. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకుని తనకు సమాచారమివ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తెలంగాణ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. 

09:25 - November 8, 2018

విజయవాడ  : కనక దుర్గమ్మ ఆలయంలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఈవో చర్యలు తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెమొంటోల విషయంలో సిబ్బంది చేతివాటానికి పాల్పడిన్టు తేలడంతో  ముగ్గరు ఉద్యోగులతోపాటు ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం సంచలనం రేపుతోంది.  సస్పెండ్ అయిన ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి దుర్గగుడిలోని వివాదం తెరపైకి వచ్చింది.

Related imageమెమొంటోల్లో సిబ్బంది చేతివాటం  దుర్గగుడి ఈవో, ఏఈవోకు మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించింది. దసరా ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ మెమొంటోలు ఇవ్వాలని ఈవో ఆదేశించారు.  ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ మెమొంటోలు ఇచ్చామంటూ సిబ్బంది రెండువేల మెమొంటోలకు  బిల్లు చేశారు. చాలా మంది భక్తులు తమకు జ్ఞాపికలు అందలేదంటూ ఈవోను కలవడంతో ఆమె విచారణ చేపట్టారు. మెమొంటోల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఈవో విచారణలో వెల్లడైంది. కాంట్రాక్ట్ ఉద్యోగి సైదా మెమొంటోలు అందజేయడంతో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించి అతనని విధుల నుంచి తొలగించారు. సైదాకు సహకారం అందించారంటూ రికార్డ్‌ అసిస్టెంట్‌ సునీతను, సీనియర్‌ అసిస్టెంట్‌ గోపిచంద్‌ను సస్పెండ్‌ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్‌గా ఉన్న ఏఈవో అచ్యుతరామయ్య తన విధులను సరిగా నిర్వహించలేదని, నిజానిజాలు వెలుగుచూపేలా విచారణ చేయకుండా... అక్రమాలకు పాల్పడిన వారికి మద్దతు పలకడాన్ని తప్పుపడుతూ అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో ఈవో, ఏఈవో మధ్య వివాదం రాజుకుంది.
తానేంటో ఈవోకు చూపిస్తానని సవాల్‌                    
తననే సస్పెండ్ చేస్తారా అంటూ ఏఈవో అచ్యుతరామయ్య నిరసన వ్యక్తం చేశారు. ఈవోతో వివాదానికి దిగారు. తనను కావాలని టార్గెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానంటూ రాద్ధాంతం చేశారు. తనేంటో ఈవోకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈవో కోటేశ్వరమ్మ ఏఈవోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుర్గమ్మ సొమ్మను దోచేయడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ కంప్లైంట్‌ ఇచ్చారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పాలకమండలి సమావేశంలోచర్చించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్మన్‌
అయితే దుర్గగుడిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని చైర్మన్‌ గౌరంగబాబు తెలిపారు.  ఈవో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏదైనా సమస్య చర్చలతో పరిష్కరించుకోవాలని, పోలీస్‌ స్టేషన్ వరకు తీసుకెళ్లడం సరికాదంటున్నారు. ఈ వ్యవహారంపై పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.మొత్తానికి దుర్గగుడిలో ఇంతకుముందు పాలకమండలి నేతల మధ్య వివాదాలు తలెత్తడం చూశాం. ఇప్పుడు అధికారుల మధ్యే వివాదాలు తలెత్తడం చూస్తున్నాం. మరోవైపు దుర్గగుడి తరచూ వివాదాల్లోకి ఎక్కడంతో భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

08:54 - November 8, 2018

తూర్పుగోదావరి : పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  పవన్‌ పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో కొత్త వివాదం రాజుకుంటోంది. కొంతకాలంగా పెద్దగా వార్తల్లో కనిపించని వంతాడ వ్యవహారం ఇప్పుడు పెనుదుమారం రేపేలా కనిపిస్తోంది. వంతాడలో భారీగా సాగుతున్న మైనింగ్‌ చుట్టూ తగాదా తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది. అటు మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో కౌంటర్లు, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఘాటు కామెంట్స్‌తో వంతాడ రాజకీయ మరింత వేడెక్కుతోంది.

Image result for pawan kalyan and lokeshవంతాడ మైనింగ్‌ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య వార్‌
 ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పవన్‌ పర్యటనతో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. పవన్‌ తన పర్యటనలో మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది. ప్రతీ మీటింగ్‌లోనూ లోకేష్‌ ప్రస్తావన లేకుండా పవన్‌ ప్రసంగం సాగడం లేదు. ఇక తాజాగా వంతాడ వ్యవహారంలో ఇద్దరు నేతలు నేరుగా తలపడుతుండడం ఆసక్తిగా మారింది. మైనింగ్ విషయంలో ఇద్దరు నేతల మధ్య ముదురుతున్న వివాదం చివరకు ఎక్కడకు దారితీస్తుందోననే చర్చ మొదలయ్యింది. వంతాడలో దశాబ్దకాలంగా మైనింగ్‌
అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఆధారాలు ట్వీట్‌ చేసిన పవన్‌.

Image result for vantada mainig in east godawariవంతాడలో మైనింగ్‌ గడిచిన దశాబ్దకాలంగా సాగుతోంది. అయితే అప్పట్లో మైనింగ్‌ నిర్వహించిన మహేశ్వరి మినరల్స్‌కి టీడీపీ అధికారంలోకి రాగానే చెక్‌ పెట్టారు. కాంగ్రెస్‌ హయాంలో  మహేశ్వరి మినరల్స్‌కు వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు స్వయంగా వంతాడలో ఉద్యమం నిర్వహించారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆండ్రూ మినరల్స్‌ కంపెనీకి మైనింగ్‌ అప్పగించారు. దీంతో ఈ కంపెనీ వెనుక టీడీపీ అధిష్టానంలోని కీలకనేత హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో ఇప్పుడు పవన్‌  టీడీపీ తీరును తప్పుపడుతున్నారు. పోలీసులు అభ్యంతరం తెలిపినా, మైనింగ్‌ కంపెనీ  అడ్డగోలుగా మట్టికుప్పలు వేసినా... వాటిని అధిగమించి వంతాడలో ఆయన అడుగుపెట్టారు. వంతాడ మైనింగ్‌ను పరిశీలించిన పవన్‌... చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్‌ తవ్వకాలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దీంతోపాటు వంతాడలో అక్రమమైనింగ్‌ జరుగుతోందంటూ ఆధారాలు ట్విట్టర్‌లో జత చేశారు. 

Image result for vantada mainig in east godawariపవన్‌ ఆరోపణలపై ఏపీమంత్రి నారా లోకేష్‌ స్పందించారు.  పవన్‌ తీరును తప్పుపడుతూ కౌంటర్‌ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. అవినీతి, అక్రమాలకు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. పవన్‌ పర్యటన చేసిన మరునాడే వంతాడలో విజిలెన్స్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మొత్తానికి వంతాడ మైనింగ్‌పై ఇద్దరు నేతల మధ్య వార్‌ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలోనే మరో 20 రోజులపాటు పర్యటిస్తానని చెబుతున్న పవన్‌. మైనింగ్‌పై మరింత చొరవ ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పవన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

 
 
 
08:36 - November 8, 2018

హైదరాబాద్ : స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతి... ఇప్పుడు పోటీకి సై అంటోంది. మెదక్‌ నుండి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యింది. అయితే.. ప్రచారానికే పరిమితమవుతానన్న రాములమ్మ.. ఇప్పుడు పోటీకి సిద్దపడడానికి కారణమేంటి ? హైకమాండ్‌ ఆదేశమా..? లేక ఆమె సొంత వ్యూహమా ? ఇప్పుడు ఇదే పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

విజయశాంతి. ఊరప్‌ రాములమ్మ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌. నిన్నటిదాకా పోటీకి దూరంగా ఉంటానని చెప్పింది. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ప్రచారం చేసి.. కేసీఆర్‌ గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటించింది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. ఎన్నికల్లో పోటీకి సై అంటూ రెడీ అవుతోంది. అంతేకాదు గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన మెదక్‌ నుండే బరిలోకి దిగేందుకు సిద్దమంటోంది రాములమ్మ. 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పిందట విజయశాంతి. దీంతో ఆమె సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని మొదట భావించినా... ఆమె పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. ఆమెకు ఉన్న తెలంగాణ సెంటిమెంట్‌ గ్రాఫ్‌తో పాటు.. ఆమె గ్లామర్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. అయితే... ఇప్పుడు విజయశాంతి మెదక్‌ నుండి పోటీకి సిద్ధమవుతుండడంపై పార్టీ చర్చనీయాంశంగా మారింది. 

అయితే.. మాజీ ఎంపీలను పోటీలోకి దింపాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌, మల్లు రవి, సురేష్‌ షెట్కార్‌, సర్వే సత్యనారాయణలతో పాటు.. విజయశాంతి కూడా మెదక్‌ నుండి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇదంతా ఒక వాదనగా అనిపిస్తుంటే.. విజయశాంతే సొంత వ్యూహంలో భాగంగా పోటీ సిద్దమైందని మరో టాక్‌ వినిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని భావిస్తున్న విజయశాంతి.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కుతుందన్న నమ్మకంతో పోటీలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కాలం కలిసివస్తే.. డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కవచ్చన నమ్మకంతో రాములమ్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయశాంతి కొత్త ఆశలతో మెదక్‌ బరిలోకి దిగాలని డిసైడ్‌ అన్నట్లు సమాచారం. 

మొత్తానికి రాములమ్మ ఎన్నికల్లో పోటీ సై అనడంతో.. అధిష్టానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇన్నాళ్లు విజయశాంతి పోటీ చేయదని ఎంతోమంది ఆశలు పెట్టుకుని పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె పోటీకి సై అనడంతో ఆశావహుల్లో గుబులు రేగుతోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ.. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న చోట వారిని ఢిల్లీకి పిలిచింది. అందులో మెదక్‌ కూడా ఉంది. ఇవాళ ఆయా అభ్యర్థులతో మాట్లాడి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాములమ్మ పోటీపై ఈరోజు సాయంత్రం వరకు ఒక్క క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 
 

08:15 - November 8, 2018

 విజయవాడ : నగరంలో  ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సహచర విద్యార్థిని తనను ప్రేమించడం లేదని సాయిరెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు విచారిస్తుండగా మెడపై కత్తితో కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన సాయిరెడ్డిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.  లబ్బీపేటలోని సీఎంఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. కాగా మహబూబ్ నగర్ కు చెందిన సాయిరెడ్డి సహచర విద్యార్థిని ప్రేమించాడు. ఈ క్రమంలో దీపావళి రోజున ప్రపోజ్ చేయటంతో ఆమె అంగీకరించలేదనే మనస్తాపంతో కత్తి పట్టుకుని కోచింగ్ సెంటర్ కు వచ్చి నా ప్రేమ అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటు హల్ చల్ చేశారు. దీంతో విద్యార్థులంతా కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి తెలిపారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి సాయిరెడ్డికి కౌన్సిలింగ్ చేస్తుండగానే సాయిరెడ్డి తనవద్ద వున్న కత్తితో పోలీసుల సమక్షంలోనే గొంతుకోసుకున్నాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు సాయిరెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

 

08:02 - November 8, 2018

హైదరాబాద్ :  వేడుకలు విషాదం కాకూడదు. ప్రతీ సంవత్సరం వలెనే ఈ సంవత్సరంలో కూడా దీపావళి కొందరి కుటుంబాలలో విషాదాన్ని నింపింది. దీపావళి వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చేసుకున్న వెలుగులు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దీపావళి సందర్బంగా కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ కళ్లకు ప్రమాదం జరగడంతో సరోజిని కంటి ఆస్పత్రికి వచ్చారు. ఇప్పటివరకు 14 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా.. వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. 
 

07:47 - November 8, 2018

హైదరాబాద్ :  తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఇప్పటికే మహాకూటమిలో టీడీపీకి 14 స్థానాలు కేటాయించే అవకాశం ఉండడంతో.. ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు ఇవాళ టీ-టీడీపీ నేతలు అమరావతి వెళ్తున్నారు. చంద్రబాబు ఆమోదం తర్వాత.. అభ్యర్థుల జాబితా ఫైనల్‌ కానుంది. 
తెలంగాణలో సీట్ల సర్దుబాటు కసరత్తుపై దృష్టి సారించింది టీడీపీ. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకుని తనకు సమాచారమివ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తెలంగాణ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. 

దాదాపుగా రెండు నెలలుగా కూటమికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అభ్యర్థులు, నియోజకవర్గాలపై రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదరడంలో ఆలస్యమైంది. కాంగ్రెస్‌ తర్వాట ప్రధాన పార్టీగా కూటమిలో వ్యవహరిస్తున్న టీడీపీ దాదాపు 20 స్థానాలు దక్కించుకునే ప్రయత్నం చేసినా.. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. 14 స్థానాలు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. మరో రెండు, మూడు స్థానాలు దక్కే అవకాశం ఉందన్న ధీమాతో టీడీపీ నేతలున్నారు. దీంతో టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకున్నారు. 20 నియోజకవర్గాలపై కసరత్తు చేసి.. అభ్యర్థుల జాబితాను సిద్దం చేశారు. చివరి నిమిషంలో నియోజకవర్గాల్లో మార్పు జరిగినా... అందుకనుగుణంగా జాబితాను సిద్దం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో చంద్రబాబుతో.. టీ-టీడీపీ నేతలు సమావేశమై.. అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. 

మొత్తానికి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ 90 స్థానాలకు పరిమితమైతే... కూటమిలోని ఇతర పార్టీలకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు చొరవ తీసుకుంటే టీడీపీకి 14 కంటే ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని టీ-టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

07:27 - November 8, 2018

అమరావతి : రాహుల్‌ను కలిసి అధికార ఎన్డీయేలో గుబులు రేపిన టీడీపీ అధినేత చంద్రబాబు విపక్షాలను ఏకం చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బెంగళూరు వెళ్తున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

Image result for chandrababu mamata banerjeeరాష్ట్రానికి హామీలు ఇచ్చి.. మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడం, అనంతరం బీజేపీ-టీడీపీ నేతల మాటల యుద్దం కొనసాగడం, ఆ తర్వాత టీడీపీ నేతల ఇళ్లపై ఏసీబీ దాడులు జరగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో చంద్రబాబు బీజేపీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసి సంచలనం లేపారు. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాల నేతలను కలిసిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాది నేతలను కలిసే పనిలో పడ్డారు .ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలతో సమావేశమవుతున్నారు. జేడీఎస్‌ నేతల సమావేశం అనంతరం... బెంగళూరు నుంచి నేరుగా చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక కర్నాటక, తమిళనాడు పర్యటన అనంతరం చంద్రబాబు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కూడా కలవనున్నారు. కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభావం ఎదురుకావడంతో బీజీపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. 

Image result for chandrababu kumaraswamyడిసెంబర్ నాటికి మోడీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులను నేరుగా కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చిన త‌ర్వాత జ‌న‌వ‌రిలో బీజేపీయేతర కూటమి నేతలతో మరోసారి హ‌స్తిన‌లో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. జ‌న‌వ‌రి స‌మావేశం త‌రువాత ఆయా రాష్ట్రాల్లో నిర‌స‌న ర్యాలీలు, స‌భ‌ల్లో విపక్ష నేతలు పాల్గోనేలా ఒక ప్రణాళిక‌ను రూపొందిస్తున్నారు.
ఏదిఏమైనా తాజాగా వెలువడ్డ కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యతిరేకంగా రావడంతో.. బీజేపీయేతర శక్తులను ఏకం చేసేందుకు కసరత్తు చేస్తున్న చంద్రబాబుకు మరింత బలం చేకూరింది. మరి ఈ స్పీడ్‌ ఇలాగే కొనసాగుతుందా ? లేదా ? చూడాలి. 
 

07:09 - November 8, 2018

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థుల ఎంపికపై రెండు రోజులుగా కసరత్తు చేస్తోన్న స్క్రీనింగ్‌ కమిటీ నేటి సాయంత్రానికి పూర్తి జాబితాను రెడీ చేయనుంది. ఇప్పటివరకు 70 స్థానాల్లో అభ్యర్థులు ఖరారుకాగా.. మరో 20స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్నది తేలలేదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీకి సిద్దపడుతున్న వారిని ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు అందింది. వారితో చర్చించి జాబితాను రూపొందించనుంది. ఈ జాబితాకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేయనుంది.
చివరి దశకు చేరుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ  చివరి దశకు చేరుకుంది. స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల వడపోత కార్యక్రమం దాదాపు పూర్తి చేసింది.అయితే.. కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం సీట్ల టెన్షన్‌ తగ్గలేదు. అదే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఆశావహులంతా తమకు టిక్కెట్‌ దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో మాత్రం ఉన్నారు.  
90 స్థానాల్లో కాంగ్రెస్‌..29 స్థానాలను ప్రతిపక్షాలకు 
రెండు రోజులుగా స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. తెలంగాణలో మొత్తంగా 90 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. నిన్నమొన్నటి వరకు 95 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా... మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు సీట్లకోసం పట్టుదలగా ఉండడంతో 90 స్థానాల్లోనే పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో 5 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీకి 14 సీట్లు కేటాయించాలని డిసైడ్‌ అయిన కాంగ్రెస్‌.. టీజేఎస్‌కు 11, సీపీఐకి 4 సీట్లు సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. 
70 స్థానాల్లో ఖరారైన కాంగ్రెస్‌ అభ్యర్థులు
కాంగ్రెస్‌ పోటీ చేయనున్న 90 స్థానాల్లో 70 సీట్లకు అభ్యర్థులు ఖరారు అయినట్టు తెలుస్తోంది.  మిగిలిన 20 స్థానాల్లో ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు ఉండడంతో వారి పేర్లు ఇంకా ఫైనల్‌ చేయలేదు.  స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారుకాని 20 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాలని ఆదేశించింది.  ఢిల్లీకి రావాలని పిలుపు అందిన వారిలో డీకె అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు ఉన్నారు.  ఇవాళ ఉదయం 9.30 నుంచి  సాయంత్రం వరకు వీరితో చర్చలు జరుగనున్నాయి. సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, రాజేంద్రనగర్‌, దుబ్బాక్‌, మెదక్‌, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్‌ ఈస్ట్‌, కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, మేడ్చల్‌ , పఠాన్‌చెరు జుక్కల్‌కు చెందిన ఆశావహులతో ఇవాళ చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.  స్క్రీనింగ్‌ కమిటీ ఒక్కొక్క జిల్లాకు  గంట సమయం కేటాయించింది.
సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ మావేశం
మరోవైపు ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోపే స్క్రీనింగ్‌ కమిటీ జిల్లాలకు చెందిన నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఆ జాబితాను సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీకి అందజేయనుంది. రాహుల్‌ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలుపనుంది. దీంతో రేపు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశముంది.

 

Don't Miss