Activities calendar

09 November 2018

21:49 - November 9, 2018

చెన్నై: బీజేపీని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విభేదాలను వదిలేసి, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పని చేస్తాయని ఆయన తెలిపారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చెన్నై వెళ్లిన చంద్రబాబు డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను కలిశారు. తాజా రాజకీయాలు, కూటమి ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. 
దేశాన్ని కాపాడేందుకు సహకరించాలని, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కోరానని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవుతానని చంద్రబాబు చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అపహాస్యం పాలైందని, బ్యాంకింగ్ వ్యవస్థ నాశనమైందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ వైట్‌గా మారిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు వాపోయారు. దేశ భవిష్యత్ కోసమే కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. తమతో కలిసి వచ్చే నేతలందరితోనూ చర్చలు జరుపుతామన్నారాయన. 
మోడీని గద్దె దించేందుకు నా సహకరాం ఉంటుందని చంద్రబాబుకి స్టాలిన్ హామీ ఇచ్చారు. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. మతవాద బీజేపీని గద్దె దించేందుకు చంద్రబాబుతో చేతులు కలిపామన్నారాయన.

21:31 - November 9, 2018

విశాఖ: ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పంపించారు. బాలరాజు శనివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే మరో కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, జనసేనలో నేతల చేరికలు ఊపందుకుంటున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవలందించే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. అనుచరులు, సన్నిహితుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మండల స్థాయి నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలరాజు.. అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజీనామాకు ముందు బాలరాజు తన అనుచరులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమీపస్తున్న వేళ.. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. కాంగ్రెస్‌లో కొనసాగడంపై అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి మెజార్టీ నేతల అభిప్రాయం ప్రకారం జనసేనలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

కాగా టీడీపీ, కాంగ్రెస్ కలయికను నిరసిస్తూ ఇప్పటికే వట్టి వసంత్ కుమార్, సి.రామచంద్రయ్యలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

21:09 - November 9, 2018

విజయవాడ: కృష్ణా జిల్లా పెడన వైసీసీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బస్టాండు వద్ద నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ ఘటనలో జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు అద్దాలు పగలగొట్టిన సమయంలో జోగి రమేష్ కారులో కాకుండా, బైక్ పై వెళ్తుండటంతో ఆయనకు ఏమీ కాలేదు. జోగి రమేష్ వర్గీయుల దాడిలో ఉప్పాల వర్గీయులు ఇద్దరు గాయపడ్డారు. ఉప్పాల రాంప్రసాద్ కుమారుడు రామ్‌కు గాయాలయ్యాయి.  మచిలీపట్నానికి ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

పెడన నుంచి పోటీ చేయాలని రాంప్రసాద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, జోగి రమేష్‌కు అనుకూలంగా వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆయనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. సమన్వయకర్తగా జోగి రమేష్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇరు వర్గాలు దూరంగానే ఉంటూ వచ్చాయి. పార్టీ కార్యక్రమాలను కూడా ఇరు వర్గాలు విడివిడిగానే నిర్వహిస్తున్నాయి.

18:53 - November 9, 2018

విజయవాడ: కేబినెట్‌ను విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. మైనార్టీ, ఎస్టీ అభ్యర్థులతో ఈ రెండు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఫరూక్‌కు, మావోయిస్టుల చేతిలో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మార్చి 8న బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో... ఆ రెండు పదవులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో, ఈ రెండు ఖాళీలు భర్తీ చేసే పనిలో ముఖ్యమంత్రి పడ్డారు.  11వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ జరగనుందని సమాచారం.

17:14 - November 9, 2018

హైదరాబాద్: మాకే తెలియని సమాచారం మీకెలా తెలుసు.. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఇంకా క్లారిటీనే ఇవ్వలేదు.. 8 సీట్లను తేల్చనూలేదు అంటూ క్లయిమాక్స్‌లో షాక్ ఇచ్చారు టీజేఎస్ నేత కోదండరాం. ఢిల్లీలో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని వివరించారు మాస్టారు. వారి చర్చలే కొలిక్కిరాలేదని.. మా సంగతి ఇప్పుడే పట్టించుకుంటారా అన్నట్లు కాంగ్రెస్ తీరుపై చురకలు అంటించారు. కోదండరాం వ్యాఖ్యలతో మరోసారి కూటమిలో కలకలం రేగింది. ఇప్పటికీ కూటమిని నిలబెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం అంటూ తూటాలు పేల్చారు. సార్.. వ్యాఖ్యలు చూస్తుంటే కూటమిలో సీట్ల సర్దుబాటుపై అవగాహనే లేదని స్పష్టం అవుతుంది. 

టీజేఎస్ లో పరిస్థితి ఇలా ఉంటే.. సీపీఐలో ఇంత కంటే దారుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీపీఐ ఎంత డిమాండ్ చేసినా.. 3 సీట్లకు మించి ఇచ్చేదిలేదని తెగేసి చెబుతోంది కాంగ్రెస్. దీనికి ససేమిరా అంటున్నారు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి. అడిగినన్ని సీట్లు, కోరిన నియోజకవర్గాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకోవటానికి సిద్ధంగా లేమంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు చాడ. సమస్యను పరిష్కరించటంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుందని నిలదీశారాయన. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించటాన్ని తప్పుబడుతూనే.. టైం లేదు.. ఏదో ఒకటి తేల్చకుంటే మా దారి మేం చూసుకుంటాం అని వార్నింగ్ బెల్ మోగించారు. కోదండరాంతో కలిసి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతామని స్పష్టం చేస్తూనే.. ఇవే తుది చర్చలు అన్నట్లు డెడ్ లైవ్ విధించారు కామ్రేడ్ చాడ.

15:54 - November 9, 2018

కన్నడ నటుడు యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ, కె.జి.ఎఫ్. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. ఈరోజు కె.జి.ఎఫ్. చాప్టర్ 1 పేరుతో, అయిదు భాషల్లో ట్రైలర్స్ రిలీజ్ చేసారు. తెలుగు వెర్షన్‌ని సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నాడు. 1951లో మొదలైన కె.జి.ఎఫ్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హీరో బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, డెప్త్‌తో కూడిన డైలాగులు, అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, బ్యూటిఫుల్ కెమెరా వర్క్, ట్రైలర్‌కి హైలెట్ గా నిలిచాయి. సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. మిల్కీబ్యూటీ తమన్నా ఐటెం‌సాంగ్‌లో అలరించనుంది. డిసెంబర్ 21న కె.జి.ఎఫ్. అయిదు భాషల్లో భారీగా విడుదల కానుంది.

 

14:35 - November 9, 2018

గుర్‌గావ్: ఓ కారు మంటల్లో చిక్కుకుంది..అయినా ఆగలేదు. మంటల్లోనే కదులుతున్న కారులోంచి దూకి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్న సంఘటన ఢిల్లీ దగ్గరలోని గుర్‌గావ్‌లో చోటుచేసుకుంది. మంటలతో కారు స్పీడుగా పోతుంటే అటుగా వెళుతున్న ఓ వ్యక్తి దాన్ని చిత్రీకరించాడు. చూపరులను భయభ్రాంతులకు గురిచేసే ఈ సంఘటన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రాకేష్ చందల్ అనే వ్యక్తి దీపావళి బహుమతులను స్నేహితులకు పంచుకుంటూ కారులో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏంటో చూద్దామని కారు దిగినా ఏమీ లేకపోవడంతో మళ్లీ కారు స్టార్ట్ చేసి సైబర్ సిటీ ప్లైఓవర్ మీద పోతుండగా మంటలు కనిపించాయి. బ్రేక్ వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఒక్కసారిగా సీటులోంచి జంప్ చేసి రోడ్డుమీదకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. మంటలు ఒక్కసారిగా పెరిగి కారు వెనకాలే తనుకూడా పరిగెత్తడం వీడియోలో రికార్డు అయ్యింది. 

14:05 - November 9, 2018

విజయవాడ : కార్తీక మాసం వచ్చిందంటే చాలు అతివలంతా చేతులు నిండుగా గాజులు వేసుకుని గాజుల గౌరమ్మ అవతారంలో వెలుగిపోయే దుర్గమ్మను కొలుచుకుంటారు. దీపావళి వెళ్లిన మరునాడు పాడ్యమి  నుండే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు సహా వేడుకలు నిర్వహిస్తున్నారు. నేడు కార్తీక శుద్ద విదియ, శుక్రవారం కావడంతో అమ్మవారికి గాజుల ఉత్సవం నిర్వహించారు. అమ్మవారు సహా ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గాజుల ఉత్సవం కోసం ఇప్పటికే భక్తులు కోటి గాజులు సమర్పించారు. వీటన్నింటినీ అమ్మవారు సహా ఆలయ అలంకరణకు వీలుగా భక్తులు ప్రత్యేకంగా రూపమిచ్చి సిద్దం చేశారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న గాజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణమంతా రకరకాల గాజులు, విద్యుద్దీపాల వెలుగులతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఈ సారి గాజుల ఉత్సవం శుక్రవారం రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్దయెత్తున భక్తులు తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం డిసెంబర్ 7తో ముగియనుండగా అప్పటి వరకు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 

13:25 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన సర్కార్‌కీ, తమిళనాడు  సర్కార్‌కీ మధ్య వార్ జరుగుతుంది. విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌‌‌లో, తమిళ రాజకీయాలపైనా, అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలపైనా సెటైర్లు వేసాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అచ్చు జయలలితను పోలి ఉందని అంటున్నారు. సినిమాలోని వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేసారు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, గత రాత్రి దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో, విజయ్ సర్కార్ వర్సెస్ తమిళనాడు సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసారు విజయ్ అభిమానులు. సర్కార్ సినిమా వివాదం గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీ‌కాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌లు విజయ్‌కి అండగా నిలవబోతున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక, ఎట్టకేలకు సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించేందుకు సన్ పిక్చర్స్ అంగీకరించిందని తెలుస్తోంది. దీని విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనవసరమైన గొడవలెందుకనే ఉద్దేశంతో  సన్ పిక్చర్స్ యాజమాన్యం రాజీకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
 
 

 

13:15 - November 9, 2018

చెన్నై: మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా దివంగత నేత జయలలిత ప్రభుత్వాన్ని కించపరిచేవింధంగా ఉందని ఏఐడీఎంకే కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. సినిమా పోస్టర్లను తగలబెట్టి, కోయంబత్తూరు, మధురై, చెన్నై ప్రాంతాల్లో సినిమా హాళ్లపై దాడులు చేయడంతో చిత్ర దర్శకుడు మురుగదాస్ ముందస్తు బెయిల్‌కు శుక్రవారం ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఇక హీరో విజయ్‌కు కూడా పోలీసు భద్రత కల్పించారు.
దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమా రెండు రోజుల క్రితం విడుదల అయ్యి దాదాపు రూ 100 కోట్లు వసూలు చేసింది. తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీ వీ షణ్ముగం సైతం సినిమా అభ్యంతరకరంగా ఉందని.. మనోభావాలను రెచ్చగొట్టేవిధంగా సినిమా ఉందని వ్యాఖ్యానించడం విశేషం. ఇది టెర్రరిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యగా పోల్చడంతో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు. 

 

 

12:45 - November 9, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా, వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకి,  కవచం అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. హీరోగా  శ్రీనివాస్‌కిది అయిదవ సినిమా. కవచం‌లో తొలిసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పోలీస్ యూనిఫామ్‌లో గాగుల్స్ పెట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న శ్రీనివాస్ లుక్ బాగుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ రోల్ చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న కవచం, డిసెంబర్‌లో విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సినిమాకి కెమెరా : చోటా కె. నాయుడు, ఆర్ట్ : చిన్నా.  

12:27 - November 9, 2018

పశ్చిమగోదావరి : స్వతంత్ర్య భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం అనే పేరు. కానీ ఇక్కడ అన్నింటికి ఆంక్షలే. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ ఆంక్షలనేవి మరింత జటిలంగా వుంటాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని మహిళలకు ఆ ఊరి పెద్దలు ఓ వింత ఆదేశాలను జారీ చేశారు. అదేమంటే ఆ ఊరిలోని మహిళలు నైటీ వేసుకుంటే జరిమానా కట్టాలట. ఈ వింత ఆంక్షలు పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయట. గ్రామ పెద్దలు పెట్టిన ఈ ఆంక్షలను మహిళలు అతిక్రమిస్తే..రూ.2 జరిమానా, గ్రామ బహిష్కరణ విధిస్తామని పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా బైటకు పొక్కటంతో పోలీసులు, తహశీల్దారు రంగ ప్రవేశం చేశారు. గ్రామ పెద్దల ఆంక్షలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సంప్రదాయాన్ని కాపాడేందుకే ఇటువంటి నిబంధన విధించామని గ్రామ పెద్దలు వితందవాదం చేస్తుండటం గమనించాల్సిన విషయం.
కాగా సంప్రదాయం పేరుతో మహిళలు సౌకర్యం కోసం వేసుకునే నైటీలపై ఆంక్షలు విధించిన పెద్దలు భారతీయ సంప్రదాయం కాని ప్యాంట్ వేసుకోవటంపై ఆంక్షలు విధిస్తే ఎలా వుంటుందో నని ఊహించి వుండరు. అయినా ఆంక్షలు, సంప్రదాయాలు మహిళలకేనా? పురుషుల కుండవా? అనేది మహిళా సంఘాల వాదన.

12:21 - November 9, 2018

పూణే: పోతూ పోతూ రోడ్డు మీద ఉమ్మేసే వారిని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఈ చెడు అలవాటు చదువుకున్న వారిలో సైతం ఉంటుంది. భాధించే అంశం ఏంటంటే వాళ్లు కనీసం తాము తప్పు చేస్తున్నాం అనే భావనకూడా వీరిలో కలగకపోవడం విచారకరం. ఇక మన హైదరాబాద్‌లో  అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా గోడలు పాన్ మరకలతో ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఎన్ని తొట్లు పెట్టినా.. బోర్డులు పెట్టినా జనంలో మార్పు తీసుకురావడం కష్టం అనే అభిప్రాయం పాలకులలో గట్టిగా స్థిరపడిపోయింది.
అయితే మహారాష్ట్రలోని పూణే మునిసిపల్ పరిథిలో అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా రోడ్డు మీద ఉమ్మేస్తే రూ 100 జరిమానా విధిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు వారిచేత రోడ్లు శుభ్రపరిచే కార్యక్రమాన్నికూడా చేపట్టారు పూణే మునిసిపల్ అధికారులు. ఈ కార్యక్రమాన్ని పూణేలోని బిబీవేవాడి ప్రాంతంలో విజయవంతంగా అమలు చేశారు. ఇప్పటివరకూ 25 మందికి ఇటువంటి శిక్షలు విధించినట్టు అధికారలు తెలిపారు. ఇది కఠినమైన శిక్షలే అని మాకు తెలుసు.. కానీ భవిషత్తులో పొగాకును నమిలి ఉమ్మేసే ముందు ఒకసారి ఆలోచిస్తారనే నమ్మకం మాకుంది అని స్థానిక అధికారులు అభిప్రాయపడ్డారు.
 

 

12:01 - November 9, 2018

హైదరాబాద్ :  మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకాలు తేలాయి. 93 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీ..26 స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. 
కాంగ్రెస్ : 93
టీడీపీ : 14
టీ.జనసమితి: 8
సీపీఐ : 3
ఇంటిపార్టీ :1

కేటాయించింది. ఈ నేపథ్యంలో  ఇంటి పార్టీకి నకిరేకల్, లేదా మహబూబ్ నగర్ స్థానాన్ని కేటాయించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో 74 కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 10న హైదరాబాద్ లో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

 1. గోషామహల్ - ముఖేశ్ గౌడ్
 2. ఎల్ బి నగర్ -సుధీర్ రెడ్డి
 3. నాంపల్లి -ఫిరోజ్ ఖాన్
 4. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
 5. కంటోన్మెంట్ -సర్వే సత్యనారాయణ
 6. కోదాడ  - పద్మావతి
 7. హుజూర్ నగర్ -ఉత్తమ్ కుమార్ రెడ్డి
 8. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 9. తుంగతుర్తి - అద్దంకి దయాకర్ 
 10. నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
 11.  నాగార్జున సాగర్ - జానారెడ్డి
 12. ఆలేరు - భిక్షమయ్య
 13. భువన గిరి - అనిల్ కుమార్ రెడ్డి
 14. నాగర్ కర్నూల్ - నాగం జనార్థన్ రెడ్డి
 15. కొడంగల్ - రేవంత్ రెడ్డి
 16. మెదక్ - విజయశాంతి
 17. వనపర్తి -చిన్నారెడ్డి
 18. గద్వాల్ -డీకే. అరుణ
 19. అచ్చంపేట - వంశీకృష్ణ
 20. కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి
 21. జడ్చర్ల - మల్లు రవి
 22. మానకొండూరు - అరెపల్లి మోహన్ 
 23. మేముల వాడ -ఆది శ్రీనివాస్
 24. పెద్దపల్లి - విజయరమణారావు
 25. మంథని -శ్రీధర్ బాబు
 26. సిరిసిల్ల - కె.కె. మహేందర్ రెడ్డి
 27. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ 
 28. చొప్పదండి - మేడిపల్లి సత్యం
 29. జగిత్యాల - జీవన్ రెడ్డి
 30. నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి
 31. ఆందోల్  - రామదర రాజనరసింహ 
 32. జహీరాబాద్ - గీతారెడ్డి
 33. సంగారెడ్డి - జగ్గారెడ్డి
 34. వికారాబాద్ - గాదం ప్రసాద్ కుమార్
 35. కుత్బుల్లా పూర్ - కూన శ్రీశైలం గౌడ్
 36. పరిగి - రామ్మోహన్ రెడ్డి
 37. మహేశ్వరం -సబితా ఇంద్రారెడ్డి
 38. తాండూరు - రోహిత్ రెడ్డి
 39. షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి
 40. ఆసిఫా బాద్ - ఆత్రం సక్కు
 41. నిర్మల్ -మహేశ్ రెడ్డి
 42. ఖానాపూర్ - రమేశ్ రాథోడ్
 43. బోథ్ - సాయం బాబూరావు 
 44. బాల్కొండ - ఎరవత్రి అనిల్ 
 45. బోథన్ - సుదర్శన్ రెడ్డి
 46. నిజామాబాద్ అర్బన్ - మహేశ్  కుమార్ గౌడ్
 47. కామారెడ్డి -షబ్బీర్ అలీ
 48. పరకాల - కొండా సురేఖ
 49. పాలకుర్తి - జంగా రాఘవరెడ్డి
 50. డోర్నకల్ - రామ్ చంద్రనాయక్
 51. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి
 52. జనగాం  - పొన్నాల లక్ష్మయ్య
 53. ములుగు - సీతక్క
 54. మధిర - భట్టి విక్రమార్క
 55. గజ్వేల్ - ఒంటేరు ప్రతాప్ రెడ్డి
 56. అలంపూర్ - సంపత్ కుమార్ 
 57. ఖైరతాబాద్ - విష్ణువర్థన్ రెడ్డి 

టీడీపీ అభ్యర్థులు వీరే..

టీడీపీ అభ్యర్థులు వీరే..
అశ్వారావు పేట -ఎం.నాగేశ్వరరావు
ఖమ్మం - నామా నాగేశ్వరావు 
సత్తుపల్లి - సండ్ర వీరయ్య
మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఉప్పల్ - వీరేందర్ గౌడ్

 

11:12 - November 9, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మూవీ యూనిట్, ముందుగా చెప్పినట్టే ఈ ఉదయం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం, రామ్ చరణ్, బోయపాటి శ్రీను మాత్రమే కనబడతారు.  
అన్నాయ్ వీణ్ణి చంపెయ్యాలా, భయపెట్టాలా? భయపెట్టాలంటే పదినిమిషాలు, చంపెయ్యాలంటే పావుగంట, ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో.. 
 ఏయ్, పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్, రామ్.. కొ..ణి..దె..ల.. అంటూ చరణ్ రెచ్చిపోయాడు. సరైనోడులో విలన్.. వైరం ధనుష్ అయితే, ఈ సినిమాలో పందెం పరశురామ్ అనుకోవచ్చు. బోయపాటి ఎప్పటిలానే తన ఊరమాస్ యాంగిల్‌లో అదరగొట్టేసాడు. ఎం. రత్నం తన మార్క్ మాస్ డైలాగ్స్ వ్రాసారు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ఫేమ్), చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేసాడు. టీజర్‌కి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన భరత్ అనే నేను భామ కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

11:12 - November 9, 2018

వెస్ట్ ఇండీస్ : మహిళ క్రికెట్ కు పురుషుల క్రికెట్ కున్న క్రేజ్ గతంలో వుండేది కాదు..కానీ 2017లో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో మిథాలీ సేన కనబరిచిన ఆట తీరుకు భారతదేశం యావత్తు ఫిదా అయిపోయింది.  వరల్డ్ కప్ గెలవకపోయినా..అమ్మాయిల క్రికెట్ టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. గతంలో ఎప్పుడు కనీసం ఫైనల్ కూడా చేరుకోని మహిళా టీమ్ 2017లో ఫైనల్ లో పోరాడి ఓడింది. అయినా వారి కృషిని, పట్టుదలను భారత్ యావత్తు గుర్తించింది. ఒక్కసారిగా మహిళా క్రికెట్ పై అభిమానం తారాస్థాయికి చేరుకుంది. మిథాలీ సేనకు దేశం పట్టం కట్టింది. ఆ టీమ్ మొత్తానికి ఆయా ప్రాంతాలల్లో విశేష ఆదరణ లభించింది. అప్పటి వరకూ మహిళా క్రికెట్ టీమ్ లో వున్నవారి కనీసం పేర్లు కూడా ఎవరికి తెలియదు. కానీ 2017 వరల్డ్ సిరిస్ జరుగున్న నేపథ్యంలో అమ్మాయిల ఆటతీరుకు ఫిదా అయిపోయిన ప్రజలు గూగుల్ లో ఆ టీమ్ లోని అమ్మాయిల వివరాల కోసం విపరీతంగా సర్చ్ చేసినట్లుగా వార్తలు పెద్ద మొత్తంలో వచ్చాయంటే వారిపై అభిమానం ఎలా వుందో ఊహించుకోవచ్చు. 

women's cricket కోసం చిత్ర ఫలితంఈ నేపథ్యంలో మహిళా క్రికెట్ సేన కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఓ చరిత్రను సృష్టించింది. 6వేల పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో మిథాలీ పురుషుల టీమ్ కు వున్నట్లుగా నే మహిళా టీమ్ కు కూడా టీ20 వుండాలని కోరింది. అది ఈనాటికి నెరవేరింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దీవుల్లో అమ్మాయి టీ20 షురూ అయ్యింది. ఇది మహిళా క్రికెట్  తమ కృషితో..పట్టుదదలతో తెచ్చుకున్న గుర్తింపుకు వచ్చిన అసలైన నిర్వచనంగా భావించవచ్చు. 
 పురుషులేనా మేమూ కొడతాం సిక్సులు అంటున్నారు మన అమ్మాయిల క్రికెట్ టీమ్.సిక్స్ లతో, ఫోర్లతో మెరుపులు మెరిపించేందుకు వారికీ ఓ అవకాశం చిక్కింది.. నేటి నుంచే ప్రపంచ టీ20 టోర్నమెంట్‌! వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. 10 దేశాలు పోటీపడుతున్న ఈ సమరం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

women's cricket కోసం చిత్ర ఫలితంమహిళల ప్రపంచ టీ20 టోర్నీకి వేళైంది.. కరీబియన్‌ దీవుల వేదికగా అమ్మాయిలు సమరానికి సై అంటున్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.2009, 10 టోర్నీలో సెమీఫైనల్‌ చేరడమే టీమ్‌ఇండియాకు ఉత్తమ ఫలితాలు. అయితే ఇటీవల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ఈ కప్‌లో ఫేవరెట్ల జాబితాలో నిలుస్తుంది. శ్రీలంకను ఓడించి.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఎపై గెలిచి మంచి ఊపు మీదుంది భారత్‌. ప్రపంచ టీ20 టోర్నీ వార్మప్‌ పోటీల్లో బలమైన వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లపై గెలవడం టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

punam yadav and julian goswami కోసం చిత్ర ఫలితం
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ భారత్‌ మునుపటికంటే మెరుగైంది. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌తో పాటు వెటరన్‌ జులన్‌ గోస్వామి రాణించడం జట్టుకు కీలకం. అయితే సుజె బేట్స్‌, సోఫి డివైజ్‌ లాంటి బ్యాటర్లతో కూడిన కివీస్‌ను ఓడించడం భారత్‌కు అంత సులభమేం కాదు. మొత్తం మీద పోటీ హోరాహోరీ సాగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఈనెల 11న పాకిస్థాన్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది.
 -మైలవరపు నాగమణి

10:40 - November 9, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో భాగస్వామిగా వున్న వామపక్ష పార్టీ సీపీఐ తనకు కావాల్సిన..పట్టు వున్న స్థానమైన కొత్తగూడెం స్థానంపై పట్టుపట్టుకుని కూర్చుంది. ఎలాగైనా తమకు కొత్తగూడెం స్థానం కేటాయించాల్సిందేననీ..లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీపీఐ కార్యాలయం అయిన మగ్ధూంభవన్ లో జరగనున్న నేపథ్యంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ సీపీఐకి నాలుగు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీ సీట్లను  డిమాండ్ చేసింది కానీ కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలకు మాత్రమే కేటాయించింది. దీంతో హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి సీట్లను మాత్రమే కేటాయించింది. కానీ బెల్లంపల్లి స్థానానికి బదులుగా మంచిర్యాల స్థానాన్ని కోరటంతోపాటు కొత్తగూడెం స్థానంపై మాత్రం తమ పట్టు వీడటంలేదు. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోకుంటే ఒంటరి పోరుకు సీపీఐ సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. 
తెలంగాణ, ఎన్నికలు, మహాకూటమి, సీపీఐ, కొత్తగూడెం,అసెంబ్లీ స్థానం, 

 

10:09 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన  సర్కార్, భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
 కేవలం రెండే రెండు రోజల్లో ప్రపంచవ్యాప్తంగా, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దళపతి సత్తా చాటింది సర్కార్.  ఇప్పుడు తమిళనాట ఈ సినిమాకి రాజకీయ సెగ తగులుతోంది. ప్రభుత్వంపై సెటైర్లు వేసారనీ, వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈవిషయాన్ని మురుగదాస్‌ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. అర్థ రాత్రి పూట తాను ఇంట్లో లేనప్పుడు, పోలీసులు తమ ఇంటికివచ్చి, చాలాసార్లు తలుపులు కొట్టారని, ఆ టైమ్‌లో తను ఇంట్లోలేనని, కొద్దిసేపటి తర్వాత పోలీసులు వెళ్ళిపోయారని దాస్ తెలిపాడు.  ఇదే విషయాన్ని సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. నటుడు విశాల్, మురుగదాస్‌ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్ళారు.సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చాక కూడా ఈ నాన్సెన్స్ ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం, సర్కార్ వర్సెస్ తమిళనాడు  సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు విజయ్ అభిమానులు.
   

09:39 - November 9, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నికల తుది ప్రణాళికపై రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం  సమీక్షించారు. ఎన్నికల కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గల ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక కమిటీ సమర్పించిన ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం పలువురు నేతలు, కార్యకర్తలు, ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఈ నెల 10న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే అదే రోజు తెరాస సైతం.. మిగిలిన 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఆ రోజు ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాబితా వస్తే సాయంత్రం తెరాస జాబితాను కేసీఆర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. కాంగ్రెస్‌ జాబితా పర్యవసానాలను పరిశీలించిన అనంతరం తెరాస తమ జాబితాలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసే వీలుంది.
 

09:25 - November 9, 2018

ఢిల్లీ: ఎన్నికలు జరుగుతన్న రాష్ట్రాలలో రానున్న ఫలితాలపై పలు సర్వేలు జరగటం సర్వసాధారణమైన విషయం. ఆయా పార్టీలు..పలువురు నేతలు సర్వేలను నమ్ముతుంటారు. సర్వేలు చేయించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి తమ లక్ష్యం కోసం శాయశక్తుల పనిచేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణాలో కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస పార్టీ అద్భుత విజయాన్ని సాధిస్తుందని ఇండియాటుడే నిర్వహిస్తున్న ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (పీఎస్‌ఈ)’ అంచనా వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల కొద్ది నెలలు ముందుగా జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 4 రాష్ట్రాల్లో ఫోన్‌ద్వారా ఓటర్లను సర్వే చేసిన పీఎస్‌ఈ.. వెల్లడైన అంశాలను ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల వారీగా వివరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ఈ సర్వేలు స్పష్టం చేశాయి. 

inida today and pse sarway on kcr cm కోసం చిత్ర ఫలితంటీఆర్ఎస్ కు 75 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు అంచనా. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పాలనకు సానుకూల పవనాలు వీస్తున్నాయనీ..అన్నివర్గాల ప్రజల్లోనూ టీఆర్ఎస్ కు ఆదరణ కనిపిస్తోదని సర్వే తెలిపింది. దీనికి తోడు  రాష్ట్రంలో అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలు అదనపు బలంగా నిలిచాయనీ...అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ రాజకీయ గొప్ప ఎత్తుగడగా అభివర్ణించింది పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి  సర్వే.  
కాంగ్రెస్‌-తెదేపాల పొత్తు సానుకూల ఫలితాలిచ్చే పరిస్థితి అంతగా కనిపించడం లేదనీ..హైదరాబాద్‌ ప్రాంతంలో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి ఓట్లకు గండికొట్టే అవకాశం వుందనీ పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి సర్వే వెల్లడించింది.
 

08:47 - November 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అత్యంత గౌరవమైన వ్యక్తుల్లో జీవన్ రెడ్డి ఒకరు. ఆయన వస్త్రధారణ రైతన్నను గుర్తుచేస్తాయి. ఆయన  మాట్లాడే తీరు గౌరవభావాన్ని కలిగిస్తాయి. సౌమ్యంగా మాట్లాడినా ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడటంలో ఆయన దిట్టగా పేరు. అటువంటి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలపై ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతు..అసలు అబద్ధాలు అనేవి కల్వకుంట్ల డీఎన్ఏలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ కంటే సీఎం పదవికి కడియం ఉత్తమమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమని జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు. గొప్పతనమన్నారు. టీఆర్ఎస్ లో కేవలం కేసీఆర్, కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారనీ.. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా సీఎం పదవికి అర్హులేనని..జీవన్ రెడ్డి పోటీలో ఉంటే కేసీఆర్, కవితకు భయమెందుకు వేస్తుందని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేశారు. 
 

 

08:28 - November 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామినేషన్ ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్  అభ్యర్థులు కూడా  నామినేషన్ల దాఖలుకు మహూర్తాలను ఖరారు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నెల 12 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 15న  నామినేషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి ఆయన ఆరోజునే నామినేషన్ వేస్తారని రాజకీయ వర్గాల సమచారం.  ఈ మేరకు కొందరు పండితులు శుభముహూర్తంగా సీఎంకు చెప్పారని తెలిసింది. శుక్రవారం మరోసారి చర్చించి తేదీని ఖరారు చేయనున్నారు. గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌ ముందుగా కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్వయంగా ఆయనే నామినేషన్‌ దాఖలు వేసే వీలుంది. ఈనెల 12, 14, 16, 18 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని.. ఎక్కువమంది వాటివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ నెల 11న తెరాస అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. పదో తేదీన కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముందుగా బి-ఫారాలకు పూజలు చేయించి, తీసుకొని వెళ్తారని తెలిసింది. 11న తెలంగాణభవన్‌కు కొంతమంది అభ్యర్థులను పిలిచి బి-ఫారాలు ఇస్తారు. ఆరోజు నుంచి వాటినిఅందుబాటులో ఉంచుతారు.
 

 

08:00 - November 9, 2018

హైదరాబాద్ : బీజేపీ పేర్లు మార్పు కార్యక్రమంలో సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం పేర్ల మీద ఉన్న సంస్థలన్నింటినీ హైందవీకరిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా మరో వివాదానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరో సంచలన, వివాదాలకు పూనుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ల పేర్లు మార్చేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసలు పేరు భాగ్యనగరమని... 1590లో భాగ్యనగరం పేరును హైదరాబాదుగా కులీ కుతుబ్ షా మార్చారని తెలిపారు. తాము మళ్లీ అసలైన పేరును పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. 

hyderabad historical places కోసం చిత్ర ఫలితంతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్ర అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని, తదుపరి లక్ష్యం హైదరాబాద్ పేరు మార్చడమేనని అన్నారు. మొఘలులు, నిజాంల పేరిట ఉన్న పేర్లను తొలగిస్తామని... దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామని రాజా సింగ్ తెలిపారు.
కాగా ఇప్పటికే దేశంలోని అతి పురాతనమైన మొగల్‌సరారు జంక్షన్‌ను దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన యోగి సర్కారు.. తాజాగా రాష్ట్రంలోని మూడు విమానాశ్రాయాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. రారుబరేలి, కాన్పూర్‌, ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖ విమానాశ్రాయాల పేర్లను మార్చనుంది. బరేలి విమానాశ్రాయాన్ని నాథ్‌నగరిగా (పౌరాణికాల్లో బరేలి పేరు), కాన్పూర్‌లోని చకేరి ఎయిర్‌పోర్ట్‌కు గణేష్‌ శంకర్‌ విద్యార్థి పేరు, ఆగ్రా విమానాశ్రాయాన్ని దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని.. త్వరలోనే కేంద్ర విమానయాన శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని యూపీ మంత్రి నంద్‌గోపాల్‌ నంది తెలిపారు. అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్‘గా మార్చే పనిలో వుంది యోగీ సర్కార్. 

07:39 - November 9, 2018

హైదరాబాద్ : మాజీ ఎంపీ లగడపాటి ఫైర్ బ్రాండ్ గా పేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ర్పే తో పెను సంచలనం సృష్టించిన తరువాత రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరంగా వున్నారు. అప్పటి నుండి తిరిగి గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పోటీ చేస్తానంటు మరోసారి వార్తల్లోకి వచ్చిన లగడపాటి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు. 
 

07:13 - November 9, 2018

ఢిల్లీ : మహాకూటమి సీట్ల కేటాయింపు ఎట్టకేలకు తుది అంకం పూర్తయ్యింది. టీఆర్ఎస్ పార్టీని ఓడించే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంకం పూర్తయింది. మొత్తం 119 స్థానాలకు గాను 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా... మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాల చొప్పున కేటాయించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించే అవకాశం ఉంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్న పార్టీల మధ్య సీట్ల కేటాయింపు దాదాపు ఖరారయింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కుంతియా గురువారం దిల్లీలో వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. మిత్రపక్షాలకు పోగా కాంగ్రెస్‌కు మిగిలే 93 స్థానాల్లో 74 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ జాబితాకు పార్టీ అధిష్ఠానం గురువారం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయిస్తే కాంగ్రెస్‌ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాల్లో ఒక స్థానాన్ని తగ్గించుకొని 73 స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తుంది. మొత్తంగా 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. అయితే తమకు కనీసం నాలుగు సీట్లైనా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది.

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో గురువారం సాయంత్రం భేటీ అయింది. ఈ నెల ఒకటో తేదీన 57 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్‌ సీఈసీ తాజాగా మరో 17 స్థానాలకు పేర్లను ఖరారు చేసింది. దీంతో మొత్తంగా 74 స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. వీరందరితో కూడిన తొలి జాబితాను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఈసీ సభ్యులు అశోక్‌ గెహ్లోత్‌, ఏ.కె.ఆంటోని, అహ్మద్‌ పటేల్‌, గిరిజా వ్యాస్‌, జనార్దన్‌ ద్వివేది, వీరప్ప మొయిలీ, ముకుల్‌ వాస్నిక్‌, ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, కమిటీ సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ కూటమిలోని మిత్రపక్షాలకు 25 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టీజేఎస్ కు కేటాయించిన స్థానాలు, పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే...
మెదక్ - జనార్దన్ రెడ్డి
సిద్ధిపేట - భవానీరెడ్డి
దుబ్బాక - రాజ్ కుమార్
వరంగల్ ఈస్ట్ - ఇన్నయ్య
మల్కాజ్ గిరి - దిలీప్
మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి.

చెన్నూరు, మిర్యాలగూడల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ అధినేత కోదండరామ్ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

06:43 - November 9, 2018

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జంపింగ్ జిలానీలు తమ గూడుకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.
గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.
 

Don't Miss