Activities calendar

03 December 2018

21:32 - December 3, 2018

హైదరాబాద్:  తెలంగాణ లో జరుగుతున్నముందస్తు ఎన్నికల్లో  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతు ఎవరికివ్వనున్నారనే దానిపై  బుధవారం డిసెంబరు 5న ఒక  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన తెలంగాణ లో  పోటీలోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు.
" తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో మిత్రులు, జనసైనికులు,ప్రజలతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా  పార్టీఅభిప్రాయాన్ని తెలియ చెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియ పరుస్తాము" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 

21:10 - December 3, 2018

హైదరాబాద్: 2019 మార్చిలో తెలంగాణా రాష్ట్రంలో  జరిగే పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. 16 మార్చి2019 నుంచి 2 ఏప్రిల్ 2019 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం తొమ్మిదిన్నరకు  పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షలకు సంబంధించిన పేపర్ కోడ్ కూడా అధికారులు టైం టేబుల్ లో ఇచ్చారు. 

 

20:20 - December 3, 2018

నల్గొండ: గత 58 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు,ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గోండ ఓటర్లను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ...... హైదరాబాద్ నేనే కట్టానిని చెప్పే చంద్రబాబు, అధికారంలో ఉండంగా  కరెంట్ ఎందుకు ఇవ్వలేక పోయారని కేసీఆర్ ప్రశ్నించారు.   టీఆర్ఎస్ పార్టీకి ప్రజాసంక్షేమమే ముఖ్యంఅని, ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్  ఇస్తున్నామని ఆయన తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రం లోనూ విధంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, రాష్ట్రంలో కల్తీ వస్తువులను పూర్తిగా నిరోధిస్తాం అని తెలిపారు. రైతు బంధు,రైతుభీమా పధకాలు దేశానికే ఆదర్సంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ది  మొదటి నుంచి మోసపు బుద్దే, కాంగ్రెస్, టీడీపీ కూటమి, ఒకవైపు టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. తెలంగాణాకు మంచి చేసే పార్టీకి మీరు ఓటు వేయాలి అని  కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ ఏమో నేను మోడీఏజెంట్ ను అంటారు.... కానీ నేను తెలంగాణా ప్రజల ఏజెంట్ ను,  వాస్తవానికి నేను నల్గోండనుంచి పోటీచేద్దామనుకున్నాను, భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను నేనే దత్తత తీసుకుంటానని  ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నల్గొండకు అండర్ గ్రౌండ్ డ్రయినేజ్, మంచినీరు, ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిచేస్తాను అని కేసీఆర్ చెప్పారు.

19:57 - December 3, 2018

హైదరాబాద్: ఈనెల 7 వ తేదీ తర్వాత రాష్ట్రంలో వారసత్వ కుటుంబ పార్టీలు కనుమరుగవుతాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు.  హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధుల విజయంకోసం ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...దేశంలో  వారసత్వ కుటుంబ పాలన లేని ఏకైక పార్టీ  బీజేపీ అని అన్నారు. దేశంలో ఒక ప్రధాన పార్టీ  ఐన కాంగ్రెస్ ఒక కుటుంబం చేతిలో చిక్కుకుని ఉందని,  ఆపార్టీలో యోగ్యులైన వారు ఎందరో ఉన్నా  వారసత్వరాజకీయాల వల్ల ఎదగలేకపోయారని మోడీ అన్నారు. యోగ్యత లేకున్నా  వారసత్వంగా  పార్టీని ప్రభుత్వాన్ని నడపాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని మోడీ విమర్శించారు. 
తెలంగాణా  రాష్ట్రంలో కూడా కేసీఆర్  కుటుంబం చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయిందని, ఏపీలో టీడీపీ కానీ  హైదరాబాద్ లోని ఎంఐఎం కానీ అన్నీ వారసత్వ కుటుంబ పార్టీలేనని మోడీ చెప్పారు. ఎంఐఎం కుటుంబ వారసత్వంతోపాటు మతాన్నికూడా నమ్ముకుందని, ప్రజలు వారసత్వ పార్టీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని  అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం,కాంగ్రెస్ కు వ్యతిరేకంగా   ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపిస్తే , చంద్రబాబునాయుడు  స్వార్ధంకోసం కాంగ్రెస్ తో చేతులు కలిపారని చెప్పారు.  కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని, రెండూ వ్యతిరేకంగా కనిపించినా  ఆలోచనా విధానం ఒకటే అని మోడీ అన్నారు. 
తెలంగాణా ప్రజలకు హృదయ పూర్వక అభినందనలు అంటూ తెలుగులో  ప్రసంగాన్నిప్రారంభించిన మోడీ ....సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఆదర్శం అని, పటేల్ పట్టుదల,కృషి వల్లే  హైదరాబాద్ విమోచనం జరిగిందని అన్నారు.

17:52 - December 3, 2018

మిర్యాలగూడ: స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు ఐనా, ఎన్నికలు వచ్చినప్పుడు  ఇంకా మనదేశంలో పెద్ద  కన్ఫ్యూజన్ ఉంటుదని, ప్రధాని మంత్రి కూడా వచ్చి 
అబద్దాలు చెపుతారని  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,  ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  నల్గోండజిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ...కాంగ్రెస్ టీడీపీ అధికారం కోసం దిగుజారుడు రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. తెలంగాణాలో అమలు చేస్తున్న ఏసంక్షేమ పధకం కూడా బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో అమలు చేయట్లేదని, 52 ఏళ్లపాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ లేదని కేసీఆర్ ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో పవర్ హాలీడే లేకుండా అందరికీ విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణా ఒక్కటేనని చెపుతూ కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం  అనేక  కార్యక్రమాలు అమలు  చేస్తున్నామని తెలిపారు.  అమ్మఒడి వాహనం ద్వారా  గర్భిణీ స్త్రీలకు  సహయంచేస్తునన్నామని, ఈ ఎన్నికల్లో మీరు గెలిపించి అధికారం ఇస్తే, అధికారంలోకి రాగానే ఫించన్లు  డబల్ చేస్తానని  హామీఇచ్చారు.రైతులకు మేలుచేసేలా రైతు బంధు, రైతుభీమా పధకం ద్వారా రైతు కుటుంబానికి 5లక్షలు ఇస్తున్నామని ఆయన చెప్పారు.  వస్తా ఉండు చూపిస్తానని అన్నారు. 
రాష్ట్రంలో స్వంత ఆర్ధిక వనరులు పెంపొందించుకోటానికి కృషి చేస్తున్నామని గత 4 సంవత్సరాలనుంచి 17.17 శాతం తో తెలంగాణా ఆర్ధిక వృద్దిలో ఇండియాలోనే నెంబరు 1 గా ఉందని  కేంద్ర సంస్దలు చెప్పాయని కేసీఆర్  తెలిపారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా ఇసుక మీద ఆదాయం 10ఏళ్లలో రూ.9 కోట్లు ఉంటే, తెలంగాణ వచ్చిన 4 ఏళ్ళలో రూ.2057 కోట్లు వచ్చిందని  ఆయన చెప్పారు. ఇసుకలో అవినీతి,స్మగ్లింగ్ అరికట్టటం వల్లే ఇది సాధ్యమయ్యిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్నసంపదను పేదలకు పంచుతున్నామని కేసీఆర్ చెప్పారు. దామరచర్లలో  నిర్మాణంలో ఉన్న 7వేల మెగా వాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్ పూర్తయితే ఎన్నో పరిశ్రమలు వచ్చి రాష్ట్రంలో ఆర్దిక వికాసం కలుగుతుందని ఆయన అన్నారు. మిర్యాలగూడప్రాంతంలోని  సిమెంట్ ఫ్యాక్టరీలవద్ద సిమెంట్ సరఫరా చేసే లారీలకు  సింగిల్ పర్మిట్ విధానం వచ్చేలా ఆంద్రా సీఎంతో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి తాలూకాలో ఎక్కడ ఏ పంటలు బాగా పండుతాయో గమనించి అక్కడ ఫుడ్ ఫ్రోసెసింగ్ యూనిట్లు, ఆహార శుధ్ది  కర్మాగారాలు ఏర్పాటుచేస్తామని కేసీఆర్ చెప్పారు.  

16:56 - December 3, 2018

ప్రియాంక చోప్రా - నిక్. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఆదివారం పెళ్లి చేసుకున్నారు. జోథ్ పూర్ లో అత్యంత వైభవంగా సాగిన పెళ్లికి దేశంలోని అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారు. పెళ్లి తర్వాత ప్రియాంక - నిక్ ఎలా ఉన్నారు అనేది అభిమానులకు మాత్రం ఎంతో ఆసక్తి నెలకొంది. వారికి కూడా ఆ ఆనందాన్ని అందించాలని అనుకున్నారో ఏమో.. జోథ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో మీడియాకు జంటగా ఫోజులు ఇచ్చారు.
చీరకట్టులో.. మెడలో మంగళసూత్రం :
జోథ్ పూర్ ఎయిర్ పోర్టులో ప్రియాంకను చూసిన మీడియా సైతం షాక్ అయ్యింది. హిందూ సంప్రదాయ పద్దతిలో చీరకట్టులో కనిపించింది. మెడలో మంగళసూత్రం.. నుదుటను తినకం దిద్దుకుని ఉంది. అందరికీ నమస్కారం పెట్టారు. నిక్ మాత్రం థమ్స్ అప్ చూపిస్తూ వచ్చాడు. కొత్త జంటను ఇంత సంప్రదాయంగా ఫస్ట్ లుక్ ఇస్తారని ఊహించలేదు ఎవరూ. మెడలో మంగళసూత్రం కనిపిస్తూ.. ఓ సాధారణ గృహిణి రూపంలో దర్శనం ఇచ్చింది ప్రియాంక చోప్రా. తనకు ఎంతో ఇష్టం అయిన పిల్లి రూపంలో ఉండే కళ్లద్దాలను పెట్టుకుంది. నిక్ మాత్రం రెగ్యులర్ గానే ఉన్నాడు. పెళ్లి తర్వాత కొత్త జంట ఈ విధంగా విశేషమే...

16:53 - December 3, 2018

తాండూర్:  5ఏళ్లక్రితం తెలంగాణ యువత నీళ్లు,నిధులు,నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణాను తెచ్చుకున్నారు. ఉద్యమకారులు, ఆత్మబలిదానాలు చేసుకున్నారు, వారు కన్న కలలు నేడు కల్లలు అయ్యాయి అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలోమాట్లాడుతూ .. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టులు రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టులు వ్యయం పెంచారని ఆరోపించారు. 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కేసీఆర్  ప్రతి ఒక్కరి తలపై రెండున్నర లక్షల అప్పు మిగిల్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల నెత్తిన అప్పు మిగిల్చిన కేసీఆర్ కొడుకు ఆదాయం మాత్రం రూ.400 కోట్ల కుపైగా చేరిందని రాహుల్ తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అన్నారు కానీ ఆయన కుటుంబం బంగారుకుటుంబగా ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 


కేసీఆర్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజల ఆశలు తీరతాయని కాంగ్రెస్ పార్టీ  ఆనాడు తెలంగాణా ఇచ్చిందని, కానీ ప్రజలకు కేసీఆర్ వల్ల ఒరిగిందేమి లేదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక నేను  విశ్రాంతి తీసుకుంటానని  కేసీఆర్ గతంలో అన్నారని కానీ ఆయన అలాంటిదేమీ చేయలేదని, రేపు ఎన్నికల్లో ఓడిపోతే రూ.300 కోట్ల రూపైయల విలువైన భవంతిలో ఆయన  విశ్రాంతి తీసుకుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదని రాహుల్ గాంధీ చెపుతూ, కేసీఆర్ ధనవంతులకు మేలుచేస్తున్నారు కానీ, పేదవారికి ఏమీ చెయ్యట్లేదని  అని చెప్పారు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2లక్షల లోపు  రైతు రుణాలను ఒక్కసారిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటుధర కల్పిస్తామని, ఆదివాసీలకు అటవీ హక్కలపై  పూర్తి హక్కులు కల్పిస్తాంఅని రాహుల్ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో బలంగాఉన్న డ్వాక్రా సంఘాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని,కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి  రాగానే మహిళా  పారిశ్రామికవేత్తలకు రూ.500 కో్ట్లతో  నిధిని ఏర్పాటు చేస్తుందని ఆయన  తెలిపారు. 5లక్షల రూపాయలవరకు వడ్డీలేని రుణం మహిళా సంఘాలకు ఇస్తాం అని కూడా రాహుల్ తెలిపారు.  బడ్జెట్ లో 20శాతం విద్యా, సాఫ్ట్ స్కిల్స్ కోసం కేటాయిస్తాంఅని రాహుల్ గాంధీ చెప్పారు.  నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కోకరికి 15లక్షలు ఇస్తాననన్నారు కానీ ఎవరికీ పైసా ఇవ్వలేదని రాహుల్ అన్నారు. మోడీ  తెచ్చిన జీఎస్టీ వల్ల లక్షలాది మంజి మంది ఉద్యోగాలుపోయాయని. జీఎస్టీకి దేశంలో మద్దతు తెలిపిన తెలిపినవారిలో కేసీఆర్ ఒకడని ఆయన చెప్పారు. 

16:25 - December 3, 2018

బీహార్ : భాష అర్థం కాకపోయినా ఫరవాలేదు..కానీ భావం అర్థం కాకపోతే వచ్చే కష్టాలేమిటో తెలియజేశారు పోలీసులు. న్యాయమూర్తి ఇంగ్లీషులో ఇచ్చిన కోర్టు తీర్పు అర్థంకానీ పోలీసులు ఓ అమాయకుడికి జైలుశిక్ష విధించారు. కోర్టు ఉత్తర్వులు ఇంగ్లిష్ లో ఉండటంతో అర్థం చేసుకోలేకపోయిన పోలీసులు, ఓ అమాయకుడిని విడిచిపెట్టడానికి బదులుగా జైలులో పెట్టారు. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నాలో 2018, అక్టోబర్ 25న జరిగింది. జెహానాబాద్ కు చెందిన వ్యాపారి నీరజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన స్థానిక కోర్టు.. నీరజ్ కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వివరాలను తమముందు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తీర్పు ఉత్తర్వుల్లో డిస్ట్రెస్ వారెంట్ అనే పదాన్ని చేర్చింది. అయితే దీన్ని అరెస్ట్ వారెంట్ గా తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్ ను నవంబర్ 25న రాత్రంతా జైలులో ఉంచారు. మరుసటి రోజు నీరజ్ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీరజ్ ను విడిచిపెట్టారు.

16:09 - December 3, 2018

అతని పేరు నకుల్. ప్రముఖ నటి దేవయాని సోదరుడు. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ మూవీలో జెనీలియా సోదరుడిగా నటించాడు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవలే నకుల్.. ఐఫోన్ XS MAX ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేశాడు. నవంబర్ 30వ తేదీని డెలివరీ అయ్యింది. డిసెంబర్ 1వ తేదీ ఓపెన్ చేశాడు నకుల్. అంతే షాక్.. ఫోన్ చూడటానికి చక్కగా ఉంది.. ఆన్ చేస్తే అసలు విషయం బయటపడింది.
ఆన్ చేస్తే చైనా భాష : ఐఫోన్ డూప్ అది
ఫోన్ ఆన్ చేసిన నకుల్ కు.. చైనా భాష కనిపించింది. ఐపోన్ ఆప్షన్స్ ఉన్నా.. ఆపరేటింగ్ మాత్రం పిచ్చిపిచ్చిగా ఉంది. ఫోన్ అంతా ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంది. ఎయిర్ బబుల్స్ వచ్చి ఉన్నాయని వీడియో సాక్ష్యంగా పోస్ట్ చేశాడు నకుల్. ఒక లక్ష 25వేల రూపాయలు చెల్లించానని వెల్లడించారు యాక్టర్ నకుల్. ఫోన్ తీసుకెళ్లాలని కాల్ చేసినా రెస్పాన్స్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్లిప్ కార్ట్ కు మెయిల్ చేశానని.. 12 రోజుల్లో ఫోన్ కలెక్ట్ చేసుకుంటామని రిప్లయ్ ఇచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫోన్ అంతా ప్లాస్టిక్ తో తయారైందని.. అసలు - నకిలీ ఐఫోన్ కు తేడా ఏంటో చూపిస్తూ కూడా ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అమెజాన్ లో వచ్చిన ఐఫోన్ - ఫ్లిప్ కార్ట్ ద్వారా వచ్చిన ఐఫోన్ తేడాను చూపిస్తూ కూడా ఓ ఫొటో రిలీజ్ చేశాడు నకుల్ జయదేవ్.
భార్యకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే.. బురిడీ కొట్టించారు :
మూడో పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా.. తన భార్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని iphone XS MAX బుక్ చేసినట్లు తెలిపాడు. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసి మోసపోయాను అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టు పెట్టాడు. అసలే నటుడు.. ఆపై నకిలీ ఐఫోన్.. కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపై ఫ్లిప్ కార్ట్ ఇంకా స్పందించలేదు.

15:37 - December 3, 2018

ఢిల్లీ : రాత్రికి రాత్రే దేశ ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టేసిన సంచలన నిర్ణయం అది. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఈర్బీఐతో ఏమాత్రం సంబంధం లేకుండా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో దేశం యావత్తు నివ్వెరపోయింది. అతలాకుతలం అయిపోయింది. మోదీ సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై తాజాగా కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నోట్ల రద్దు ప్రస్తుత ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్నికల్లో నల్లధనం వినియోగం తగ్గుముఖం పడుతుందని అందరూ భావించారు కానీ, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పట్టుబడుతున్న నగదును చూస్తే దీని ప్రభావం ఏమాత్రం లేదని అనిపిస్తోందని రావత్ పేర్కొనటం సంచలనంగా మారింది. అంతేకాదు..ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగిన గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ నగదు పట్టుబడిందనిన్నారు. ఎన్నికల్లో వినియోగించే నల్లధనంపై నిఘా లేదని, రాజకీయ నేతలు, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్నవారికి డబ్బు కొదవేలేదన్నారు. ఎన్నికల సందర్భంగా వినియోగిస్తున్న భారీ సొమ్మంతా ముమ్మాటికీ నల్లధనమేననని ఆయన  తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించిన రావత్, గతవారమే పదవీ విరమణ చేశారు. 

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపైనే ప్రస్తుతం సీలింగ్ ఉందని..ఇదే సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చులపై నియంత్రణ లేదని అన్నారు. ఎన్నికల్లో నల్లధనాన్ని నియంత్రించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవని ఓపీ రావత్ సెప్టెంబరులో వ్యాఖ్యానించారు. ప్రస్తుత చట్టాల సాయంతో ఎన్నికల్లో నల్లధనంపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేమని, దేశంలో నగదు ప్రమేయం లేని ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు. అలాగే ఎన్నికల్లో ధన ప్రభావంపై ప్రజలు కూడా చర్చించుకుంటారని, ఈ విషయంపై అందుబాటులో ఉన్న న్యాయపరమైన చర్యలు దీన్ని పరిష్కరించలేవని స్పష్టం చేశారు. కాబట్టి ఈ దిశగా ఎన్నికల కమిషన్ కొన్ని సంస్కరణలను తీసుకురావాలని కోరుతోందని రావత్ అభిప్రాయపడ్డారు. 
కాగా పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని ఆర్థిక విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ నిర్ణయంతో దేశం అన్ని విధాలుగా నానా కష్టాల్లో కొట్టుకుపోతున్నా ప్రధాని మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ అంశంపై పెదవి విప్పలేదు..ఒక్క మాటకూడా మాట్లాడలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ప్రధాని నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని అరికట్టిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించిన రావత్, గతవారమే పదవీ విరమణ అనంతరం ఎన్నికల్లో నాయకులు, పార్టీలు ఖర్చు చేసేందంతా బ్లాక్ మనీయే అనటం సంచలనానికి దారితీస్తోంది. అంటే ప్రధాని మోదీ చెప్పే ఆ నల్లడబ్బు నియంత్రణ జరగనట్లే కదా..
 

15:12 - December 3, 2018

2.ఓ సినిమాలో పక్షిరాజా గుర్తున్నాడుగా.. పక్షిరాజాగా అక్షయ్ కుమార్ చేసిన పాత్ర సినిమాకే హైలైట్‌. పక్షులను చంపేస్తున్న సెల్‌ఫోన్ టవర్స్‌ను నాశనం చేయటమే కాకుండా సెల్‌ఫోన్లను మాయం చేస్తుంటాడు ఈ పక్షిరాజా. మనిషి చేసే తప్పు ప్రకృతికి ఎలా శాపం అవుతుందో.. పక్షిరాజా పోరాటం చెబుతోంది. సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల ఇప్పటికే పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4G టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే.. రాబోయే 5G సిగ్నల్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతున్నది అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనను నిజం చేస్తూ.. నెదర్లాండ్‌లో జరిగిన ఓ ఘటన అందరి వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
నెదర్లాండ్స్‌లో 5G రేడియేషన్ టెస్ట్ సిగ్నల్ :
నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లోని ఓ పార్క్‌లో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆ పార్క్ పరిధిలో 300 పక్షులు చనిపోయి ఉన్నాయి. వరసగా పక్షులు చనిపోతుండటంతో ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించారు. షాకింగ్ విషయం తెలిసింది. 5G టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్ అని తెలిసి వణికిపోయారు. 5G టెస్ట్ సిగ్నల్‌ వల్లే వందలాది పక్షులు చనిపోయినట్లు పశు వైద్యులు వెల్లడించారు. టెలికాం కంపెనీ అధికారులు కూడా అంగీకరించారు. 5G టెస్ట్ సిగ్నల్ చేశామని.. రేడియేషన్ బాగా వచ్చిందని మాత్రమే చెబుతున్నారు వారు. 
రేడియేషన్ దెబ్బకి పక్షులు విలవిల:
డచ్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా అధికారులు 5G టెస్ట్ సిగ్నల్ ప్రయోగం చేశారు. దీని కారణంగా రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న పక్షులపై తీవ్ర ప్రభావం చూపింది. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయి. కొన్ని పక్షులు రేడియేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు నీళ్లలో తలదాచుకుంటున్నాయి. ఈ ఘటనపై పక్షి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయోగాలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పక్షులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో 2.ఓ సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలోనూ పక్షిరాజా రావాల్సిందేనని, అప్పుడు కానీ ఈ మూగజీవాలకు రక్షణ ఉండదని అంటున్నారు.

15:12 - December 3, 2018

విశాఖపట్నం : ఏపీలో మరో పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అనిత పాదయాత్ర చేపట్టబోతున్నారు. తన నియోజకవర్గం అయిన పాయకరావు పేటలో అనిత పాదయాత్ర చేపట్టబోతున్నారు. 'మీ కోసం - మీ ఆడపడుచు' పేరుతో పాదయాత్రను ఈనెల 24న పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లుగా అని తెలిపారు. నియోజకవర్గంలోని 80 పంచాయతీల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని అనిత తెలిపారు.టీచర్ వృత్తి నుండి రాజకీయాలల్లోకి అడుగు పెట్టిన ఎమ్మెల్యే అనిత తన మంచి వాగ్ధాటితో ప్రతి పక్ష ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలకు, విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతుంటారు. రోజా విమర్శలతో అసెంబ్లీలో కంటతడి పెట్టకున్న అనిత రాను రాను రాజకీయాలలోతనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలు రానున్న తరుణంలో అనిత పాదయాత్ర విశేషంగా మారింది. 
ఈ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో అనిత మాట్లాడుతు..పాయకరావు పేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ నాలుగున్నరేళ్లలో చేశానని... తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే పాదయాత్రను చేయనున్నానని తెలిపారు. అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూల్ ను విడుదల చేస్తామని చెప్పారు.
 

14:53 - December 3, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు  గడువు దగ్గరపడుతుంటంతో రాజకీయ పార్టీలు తమ,తమ పార్టీలకు చెందిన జాతీయనేతలతో, ప్రచారం ముమ్మరం చేసాయి. బహిరంగ సభలతో ఊదర గొడుతున్నా, సోషల్ మీడియాలో కూడా వీలైనంత వరకు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. 
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికలపై ట్విట్టర్ లో తెలుగులో ట్వీట్ చేసారు


"BJP `B`టీం TRS.KCR తెలంగాణ‌లో మోడీ ర‌బ్బ‌ర్‌స్టాంప్‌.
ఓవైసీకి చెందిన ఎంఐఎం బీజేపీ `C`టీంగా వ్య‌వ‌హ‌రిస్తూ BJP/TRS వ్య‌తిరేక ఓట్ల‌ను చీలుస్తోంది.
మోడీ,KCR,ఓవైసీ ఒక్క‌టే.రెండునాల్క‌ల దోర‌ణితో మాట్లాడ‌టంలో వారు ఆరితేరారు.తెలంగాణప్ర‌జ‌లు తెలివైన‌వారు.ఆ ముగ్గురి చేతిలో మోస‌పోరు!"

అని సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. 
ఆయన ఈరోజు తెలంగాణాలో  గద్వాల,తాండూర్ లలో జరిగే  బహిరంగ సభల్లో పాల్గోని సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి కూకట్ పల్లి,  జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో  రోడ్ షోల్లో పాల్గొంటారు.

14:42 - December 3, 2018

మహబూబ్ నగర్ : టీఆర్ ఎస్ పార్టీని బీజేపీ అనుబంధ పార్టీ అయిన ఆర్ఎస్ ఎస్ పార్టీతో పోల్చారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బీజేపీకీ, టీఆర్ఎస్ కు మంచి దోస్తీ తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టిన టీఆర్ఎస్ పార్టీ టీ.‘టీర్ఎస్ ఎస్’పార్టీగా మారిపోయిందని రాహుల్ గాంధీ గద్వాల్ కాంగ్రెస్ సభలో మాట్లాడుతు టీఆర్ఎస్ పార్టీపైనా..తద్వారా కేసీఆర్ పైనా సెటైర్స్ వేశారు. కేసీఆర్, నరేంద్రమోదీ, అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురు ఒక్కటేనన్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసిన నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ మద్ధతు పలికారనీ..అలాగే జీఎస్టీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారనీ..ఈ విషయాలను గమనిస్తే బీజేపీకి కేసీఆర్ కు ఎంత దోస్తీలో అర్థం చేసుకోవచ్చని గద్వాల్ కాంగ్రెస్ సభలలో రాహుల్ మాట్లాడుతు కేసీఆర్ ను విమర్శించారు. ఐదేళ్ల క్రితం తెలంగా ప్రజలు స్వరాష్ట్రం కోసం కలలు కన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కలలు కన్నారనీ..కానీ వారి కలలు కల్లలు చేసి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచి పెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ పాలనలో అసంతృప్తిగా వున్న ప్రజల కోసం ఏర్పాటైన మహాకూటమిని గెలిపించాలనీ..మహాకూటమి గెలుపుతో తెలంగాణ ప్రజల కోరికలను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ కోరారు. 
 

14:38 - December 3, 2018

ఖమ్మం : కేంద్రంలో నాన్ బీజేపీ - నాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని..ఇందుకు తాను ప్రయత్నం చేస్తుంటే తనను నిలువరించాలని...ప్రయత్నాలు చేస్తున్నారని...ఎన్నికలు అయిపోయిన అనంతరం ఢిల్లీకి వచ్చి చీల్చిచెండాడుతానంటూ తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్...హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి..మధిరలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఇక్కడ ఆలోచన చేసే ప్రజలుంటారని తెలిపారు. ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామని..ఎన్నికల్లో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని..మోడీ..రాహుల్ అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. తాను బీజేపీకి ఏజెంట్ అని ఒకరంటే..కాంగ్రెస్‌కి ఏజెంట్ అంటూ మరొకరు వ్యాఖ్యానిస్తున్నారన్న కేసీఆను..తాను ఏవరి ఏజెంట్ కాదు...ప్రజల ఏజెంట్ అంటూ స్పష్టం చేశారు. 
కేసీఆర్ ఎందుకంత భయం...
నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తుంటే తనను తెలంగాణకు పరిమితం చేయాలని అనుకుంటున్నారని..కేసీఆర్ అంటే ఎందుకంత భయం..దేశంలో కోట్లాది ఎకరాల బంజరు భూములున్నాయని..లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశంలో కాంగ్రెస్..బీజేపీ పార్టీలు ఏమీ చేయలేకపోయారన్నారు. 
దీర్ఘకాలిక దృ‌ష్టి లేదు...
40వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళుతున్నాయని..పాలించిన పార్టీలకు దీర్ఘకాలిక దృష్టి లేదన్నారు. హిమాలయాల అవతలి పక్క చైనా ఉండేదని..గతంలో వీరు దరిద్రులుగా ఉండేవారని..ప్రస్తుతం ప్రపంచంలో బలమైన దేశమన్నారు. నూరు నియోజకవర్గాలు తిరగడం జరిగిందని...టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని సర్వేలు పేర్కొంటున్నాయని వివరించారు. 
కాపాడాల్సింది ప్రజలే...
కేసీఆర్‌ని కొట్టడానికి ఎంతో మంది వస్తున్నారని..కాపాడాల్సింది ప్రజలేనన్నారు. గోదావరి ఒరుసుకుని పారే జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండే విధంగా నీళ్లు వస్తాయన్నారు. కట్టలేరు మీదు చెక్ డ్యాం కట్టి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుంటామని...థర్డ్ జోన్ మీద జీవో ఇచ్చి సెకండ్ జోన్‌లోకి మారుస్తామన్నారు. తరువాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గెలవాలన్నారు.  ఇక్కడ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని కేసీఆర్ తెలిపారు. 

14:29 - December 3, 2018

హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం బాగోలేదన్న అక్బర్.. నాకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని అన్నారు. పాతబస్తీలోని యాకూత్‌పురలో ఎన్నికల సభలో అక్బరుద్దీన్ ఇలా అన్నారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని, తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్టు వెల్లడించారు. డయాలసిస్ చేసుకోమని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. కిడ్నీల దగ్గర కొన్ని బుల్లెట్ ముక్కలు అలాగే ఉండిపోయాయని, కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటి పోయిందని అక్బర్ వాపోయారు.
తానెప్పుడూ తన కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని, సేవ చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అక్బర్ చెప్పారు. తనకంటే మెరుగ్గా సేవ చేసేందుకు ఎవరైనా యువత ముందుకు వస్తే తన సీటుని వారికి అప్పగిస్తానని అక్బర్ స్పష్టం చేశారు.
2011 ఏప్రిల్ 30న బార్కస్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. పహిల్వాన్ వర్గీయులు అక్బర్ కాల్పులు జరిపారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

14:16 - December 3, 2018

గుజరాత్‌ : కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మెడకు లీకేజీల కేసు చుట్టుకంది. దీంతో ఇద్దరు బీజేపీ నేతలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిస్టేబుల్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన అధికార పార్టీ బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతుండగా..ప్రతిపక్షాలు ఏకి పడేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్  నేత శక్తిసిన్హ్ గోలీ మాట్లాడుతు..ప్రభుత్వ ఉద్యోగాల కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్న యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. 

పోలీస్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో గుజరాత్ పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. ఇందులో ముఖేష్ చౌదరి, మన్‌హర్ పటేల్ బీజేపీ నేతలని పోలీసులు తెలిపారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర నాయకత్వం వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

పరీక్ష సమయానికి కొన్ని గంటల ముందు క్వశ్చన్ పేపర్ సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ పరీక్షను రద్దు చేసింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లో  9,713 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పరీక్షలు జరగాల్సి ఉండగా, ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో  పరీక్షను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ  పరీక్షకు దరఖాస్తు చేస్తున్న 8.75 లక్షల అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయయ్యింది. ఈ అంశంపై సీఎం విజయ్ రూపానీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. కాగా 30 రోజుల్లోగా తిరిగి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. 

 

13:34 - December 3, 2018

అమరావతి: పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల దరఖాస్తుకు ఈ నెల 7 ఆఖరి తేదీ. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే రిజల్ట్స్ విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 2,833 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి వెల్లడించారు.

13:08 - December 3, 2018

ఆధార్.. ప్రతి భారత పౌరునికి ముఖ్యమైనది. మన దేశంలో చాలా వాటికి ఆధార్‌ను లింక్ చేశారు. మొబైల్ సిమ్ కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా ఆధార్ తప్పని సరి. అంతేకాదు సంక్షేమ పథకాలు పొందాలన్నా ఆధార్ మస్ట్. అయితే ఆధార్ మీద ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఆధార్ భద్రతపై భయాలు ఉన్నాయి. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఈజీగా బయటపడుతున్నాయి. దీంతో దుర్వినియోగం జరుగుతోంది. 500 రూపాయలకే ఆధార్ వివరాలు అమ్మేస్తున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆధార్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దని, అన్నింటికి(మరీ ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లకు) ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఓవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు, మరోవైపు ఆధార్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలు, ఆర్బీఐ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆధార్ స్థానంలో ఆఫ్ లైన్ ఆధార్(క్యూఆర్ కోడ్) తీసుకురావాలని, ప్రూఫ్‌గా వాటిని అనుమతించాలని యోచిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయని చెబుతున్నారు. బ్యాంకు అకౌంట్లు, పేమెంట్ వ్యాలెట్లు, బీమా పథకాలకు.. ఆధార్ ఈ-కేవైసీ బదులు ఆఫ్‌లైన్ ఆధార్ వినియోగించాలని చూస్తున్నారు. క్యూఆర్ కోడ్ అంటే డిజిటల్ సంతకం అన్నమాట. ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ సంస్థ పేరు మీదు ఈ సంతకం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లను సెర్వర్లకు లింక్ చేసి ఉంచరు. దీంతో వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండదని రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ ఆధార్ తీసుకొచ్చే విషయమై యూఐడీఏఐ అధికారులతో రిజర్వ్ బ్యాంకు అధికారులు చర్చలు జరుపుతున్నారు.

12:53 - December 3, 2018
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి బాబు...
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న బాబు...
  • బాబు అడ్డుకోకుంటే 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది...
  • మహాకూటమి అధికారంలోకి వస్తే 1956 పరిస్థితి పునరావృతం...
  • ముందే కోవర్టులను కాంగ్రెస్‌‌లో చేరిపించాడు...
  • తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కి వెళ్లడంలో బాబుది కీలక పాత్ర...

హైదరాబాద్ : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో కుట్ర పన్నేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని..పథకం ప్రకారం కోవర్టులను కాంగ్రెస్‌లో చేరిపించిన బాబు..ఆంధ్రలో తెలంగాణ కలిపే అవకాశాలున్నాయంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏర్పడిన పరిస్థితిని ఆయన సుదీర్ఘంగా వివరించారు. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని..గతంలో జరిగిన చరిత్రను హరీష్ వివరించారు. 
టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు...
బాబు అడ్డుకోకుంటే 18 ఏళ్ల కిందటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో బీజేపీ తీర్మానం చేసి 1998లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అనంతరం 200లో ఛత్తీస్ గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్..రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని..బీజేపీతో పొత్తులో ఉన్న బాబు..తెలంగాణ రాష్ట్రం ఇవ్వవద్దని కోరడం జరిగిందని..ఈ విషయం అద్వానీ ధృవీకరించారని..యశ్వంత్ సిన్హా కూడా 2008లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ఇవ్వలేదని వెల్లడించారంటూ ఆధారాలు చూపించారు.
తెలంగాణ ప్రకటన వెనక్కి పోవడంలో బాబు కీలక పాత్ర...
రైతులను కాల్చి చంపిన క్రమంలో 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే సీఎంగా ఉన్న బాబు తెలంగాణ అనే పదాన్ని బ్యాన్ చేశారన్నారు. 2004లో కాంగ్రెస్ చేత జై తెలంగాణ అనిపిచ్చి..కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని...2005లో ప్రణబ్ ముఖర్జీ చేత కమిటీ వేయించిన ఘనత టీఆర్ఎస్‌దని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దంటూ టీడీపీ నేతలు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. చివరకు కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేసిన అనంతరం తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. 2009లో తెలంగాణ ప్రకటన వెనక్కి పోవడంలో బాబు కీలక పాత్ర పోషించినట్లు..2012లో మీ కోసం అంటూ బాబు యాత్ర చేపట్టారని...వరంగల్ పర్యటనకు వచ్చిన బాబుకు అక్కడున్న మహిళలు బోనాలు ఇచ్చే వరకు బాబుకు షాక్ తిన్నాడని..బోనంపై తెలంగాణ అనే అక్షరాలున్నాయని..వెంటనే బోనం కిందకు దింపేసిన బాబు..జై తెలుగుదేశం బోనం ఎత్తాడని ఫొటోలు చూపించారు. ప్రస్తుతమున్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. 

12:45 - December 3, 2018

ముంబై : సంకల్ప బలం వుంటే దేనైనా సాధించవచ్చు అనేది పెద్దల మాట. కష్టాలు వచ్చినియని కృంగిపోకుండా వాటిపై పోరాడి విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా వుంటుంది. ఏ కష్టమైనా రానీ నా ధైర్యం మాత్రం దిగజారిపోదు అనే మనోధైర్యంతో తనకు వచ్చిన దీర్ఘకాలిక వ్యాధితో పోరాడేందుకు సిద్ధమైంది బాలివుడ్ నటి సోనాలిబింద్రే. కొన్ని తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించి సోనాలి భయంకరమైన క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయినా తనకొచ్చిన వ్యాధితో పోరాడతానని దానికి సంబంధించిన వైద్యం చేయించుకునేందుకు విదేశం వెళ్లిన సోనాలి తిరిగి వచ్చింది అంతే ఆత్మవిశ్వాసంతో. దీనికి సంబంధించిన ఆమె ఫోటోలు ఇన్ స్ట్రా గ్రామ్ లో అభిమానులు పోస్ట్ చేయటంతో ఆమెపై ప్రశ్నంసల జల్లు కురుస్తోంది. 

ముంబైలో సోనాలి బింద్రే ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు ఆమె అభిమానులు. పైగా క్యాన్సర్ మహమ్మారితో ఆమె పోరాడిన విధానంపై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా ఏ రోజు కూడా భయపడలేదని.. తాను ధైర్యంగా పోరాడుతూ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె మనోధైర్యమే కాపాడిందని చెబుతున్నారు వైద్యులు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని సోనాలికి సూచించారు డాక్టర్లు. అవసరం అనుకున్నపుడు మళ్లీ న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోనుంది సోనాలి బింద్రే. కాగా ట్రీట్ మెంట్ నేపథ్యంతో తన వెంట్రుకలను కత్తిరించుకునే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన సోనాలి ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుని ముంబై రావటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తు ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆమె మరింత ఆరోగ్యంగా వుండాలని..ఆనందంగా వుండాలని పోస్ట్ లు పెడుతున్నారు. 

12:37 - December 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి మహాకూటమి వస్తే ఆంధ్రలో తెలంగాణను కలిపేస్తారని...
1956లో జరిగిన పరిస్థితి పునారావృతమయ్యే అవకాశం ఉందని..మేథావులు..తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూటమి కబలించే అవకాశం ఉందని...ఉద్యమకారుడిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని..పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నట్లు హరీష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి రాజకీయాలు పోటీలు చేయాలి...ఇక్కడున్న బిడ్డల చేతుల్లో పాలన ఉండాల్సినవసరం ఉందన్నారు. మహాకూటమి ఏర్పాటు కావడం...1956 పునరావ‌ృతం అయ్యే ఛాన్స్ ఉందని...ఇక్కడున్న లెఫ్ట్ పార్టీలను ఎదుర్కొన లేక ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపే అవకాశం ఉందని హెచ్చరించారు. మహాకూటమిలో ఉన్న నేతలను చూస్తే అర్థమౌతుందన్నారు. కూటమిలో కోదండరాం..సీపీఐలు ఉన్నా లేనట్లేనని..కూటమిలో కాంగ్రెస్..బాబులు మాత్రమే ఉన్నాయన్నారు. 

12:26 - December 3, 2018

హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను ఎన్ఐఏకి ఎందుకు అప్పగించలేదని కోర్టు ప్రశ్నించింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేశారు? అని అడిగింది. కేసును ఎన్ఐకి అప్పగించకపోవడంపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి(డిసెంబర్ 5) వాయిదా వేసింది.
లోకల్ పోలీసులతో ఎందుకు?
జగన్‌పై హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్‌పై దాడి కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీతో(ఎన్ఐఏ)తో సమగ్ర దర్యాఫ్తు జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై లోకల్ పోలీసులు ఎందుకు విచారణ చేశారని, ఎందుకు ఎన్ఐఏకి అప్పగించలేదని ఏపీ ప్రభుత్వం, పోలీసులపై కోర్టు సీరియస్ అయింది. ఎందుకు బదిలీ చేయాలో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వానికి నోటీసులు:
ఈ సందర్భంగా జగన్ తరుఫు న్యాయవాది వాదిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేయాలని.. జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. సిట్ అధికారుల విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించాలని ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

12:17 - December 3, 2018

ఢిల్లీ : గత కొంతకాలంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఊరటినిస్తున్నాయి.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు డిసెంబరు 3న మరోసారి తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాలల్లో  కూడా ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్ లో పెట్రల్ : 76.20లు వుండగా విజయవాడలో రూ.75.70లు గా వుంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 30 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.71.93 కి చేరింది. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.66.66 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 30 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.77.50 కి చేరగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.69.77 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 62.45 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 53.77 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి రూ.76.26 ఉండగా.. డీజిల్ ధర 39 పైసలు తగ్గి రూ.72.42 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 31 పైసలు తగ్గి రూ.75.70ఉండగా.. డీజిల్‌ ధర 38 పైసలు తగ్గి రూ.71.46 వద్ద కొనసాగుతోంది. 
 

12:07 - December 3, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నాగం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం అంచనాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు సమర్థించింది. అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెబుతూ నాగం వేసిన పిల్‌ను కొట్టివేసింది.
ఈ ప్రాజెక్టులో 2,400 కోట్ల అవినీతి జరిగిందని నాగం ఆరోపించారు. పంప్‌హౌజ్‌లో బిగించిన మోటార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరను వేశారని, 72గంటల్లో టెండర్లలోనూ ఫైనల్ చేశారని తన పిటిషన్‌లో నాగం పేర్కొన్నారు. ఇతర కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగానే టెండర్లను ఫైనల్ చేశారని ఆరోపించారు. అయితే తన ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను నాగం జనార్ధన్‌రెడ్డి సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

12:04 - December 3, 2018

హైదరాబాద్ : ఎన్నికల నిర్వాహణ ఓ సవాల్‌‌లాంటిదని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికలకు సర్వంసిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ 3వ తేదీ సోమవారం ఆయన మీట్ ద ప్రెస్‌లో మాట్లాడారు. ఇక్కడ జరిగే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించిందని...ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలను ఎన్నో ఎదుర్కొన్నామన్నారు. బోగస్ ఓటర్లు లేకుండా చేసినట్లు...4.93 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్న రజత్ కుమార్...  కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వాహణ చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను సేకరించినట్లు..పార్టీల మేనిఫెస్టో..హామీలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల చేతులో ఓటుతో పాటు పవర్‌ఫుల్ యాప్ ఉందని రజత్ 

12:03 - December 3, 2018

ఢిల్లీ : అసలే కష్టాలు..దీనికి తోడు మరో కష్టం వచ్చి పడింది జెట్‌ ఎయిర్‌ వేస్‌ కు. పైలెట్స్ అందరికి ఒకేసారి ఆరోగ్య సమస్యలు వచ్చాయట. అందుకే వారంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టేసారు. మరి ఇంకేముంది? జెట్ ఎయిర్ వేస్ విమానాల సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్ ఎయిర్ వేస్..సెప్టెంబర్ నెలలో సగం వేతనం చెల్లించింది ఈ సంస్థ. మిగిలిన వేతనాన్ని అక్టోబర్, నవంబర్ నెలల వేతనాన్ని పెండింగ్ లో పెట్టేసింది. దీంతో పైలెట్స్ లో చాలామంది మూకుమ్మడిగా సెలవులు పెట్టేసరికి జెట్ ఎయిర్ వేస్ సంస్థకు దిమ్మ తిరిగిపోయింది. పలువురు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందని చెబుతూ మూకుమ్మడిగా సిక్ లీవు పెట్టడంతో 14 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ విమానాల సర్వీసుల్లో ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీంతో జెట్ ఎయిర్ వేస్ అధికారులతో ప్రయాణీకులు  వాగ్వాదానికి దిగారు. పైలట్లు సహకరించని కారణంగానే విమానాలను రద్దు చేశామని, దీని కారణంగా దాదాపు 100కు పైగా సర్వీసులు నిలిచిపోయాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా సర్వీసులు రద్దు చేసిన విషయాన్ని ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ల రూపంలో వెల్లడించామని, సాధ్యమైనంత మంది ప్రయాణికులను ఇతర విమానాల్లో గమ్య స్థానాలకు చేర్చామని, మిగిలిన వారికి పరిహారం అందించనున్నామని పేర్కొంది. మరి జెట్ ఎయిర్ వేస్ సంస్థ సమస్యలు ఏనాటికి తీరేనో..
 

11:36 - December 3, 2018

ఢిల్లీ : భారతీయులకు సిట్జర్లాండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారతీయుల కల ఈనాటికి నెరవేరే అవకాశాలన్ని స్విస్ ప్రభుత్వం ఇవ్వనుంది. భారతదేశంలో అక్రమంగా సంపాదించిన డబ్బులను అదే అక్రమ రీతిలో విదేశాలను తరలించిన బ్లాక్ మనీ ఖాతాదారుల గుట్టు బైపడునుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం బ్లాక్ మనీ ఖాతాదారుల లిస్ట్ ను వెల్లడించేందుకు నిర్ణయం తీసుకుంది. 
నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామనే ఎజెండాతో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ దాదాపు మోదీ ప్రధాని అయిన దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్న బ్లాక్ మనీ తీసుకొచ్చే జాడే కనిపించటంలేదు. దీనిపై విపక్షాలు ఎన్నిమార్లు విమర్శించినా మోదీ నోటి నుండి ఒక్క వివరణగానీ..ఒక్క మాటగానీ రాలేదు. 
 వివరాలు వెల్లడించటం కుదరదని ఇప్పటి వరకూ తెలిపిన స్విస్ బ్యాంక్ ఇప్పుడు హఠాత్తుగా బ్లాక్ మనీ ఖాతాదారుల వివరాలను తెలియజేస్తామనీ..వారి లిస్ట్ ఇస్తామనీ కేంద్ర ప్రభుత్వానికి సమచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పినట్లే. భారతదేశంలో భారీ  అక్రమాలకు పాల్పడి.. ఆ సొమ్మును విదేశాలలో నిల్వ చేసుకున్న నల్లవీరుల బండారం బట్టబయలు కానుంది స్విస్ బ్యాంక్ అధికారుల ప్రకటనతో. స్విస్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించేందుకు స్విస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు కంపెనీలు, ముగ్గురు వ్యక్తుల వివరాలు అందించనున్నట్టు స్విస్ ప్రభుత్వం  తెలిపింది. 
తమిళనాడులోని జియోడెసిక్ లిమిటెడ్, ఆది ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, జియో డెసిక్ కంపెనీ చైర్మన్ పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ శరద్ ములేకర్, ఎండీ కిరణ్ కులకర్ణిలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, వారి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విస్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విజ్ఞప్తిని అంగీకరించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ వివరాలను అందిస్తామని,  వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా పాలనా పరమైన సాయాన్ని భారత్‌కు అందజేస్తామని స్పష్టం చేసింది. 1982లో ఏర్పాటైన జియోడెసిక్, 2014లో ఏర్పాటైన ఆది ఎంటర్‌ప్రైజెస్‌లు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా కంపెనీల ప్రమోటర్ల ఆస్తులపై దాడులు చేశారు.
ఈ నేపథ్యంలో మరింతమంది నల్లవీరుల జాబితా బైటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ నల్లడబ్బు భారతదేశానికి తిరిగి వస్తే..భారతదేశపు ఆర్థిక స్థితిగతులు అమోఘంగా మారిపోయే అవకాశం వుంది. ఏది ఏమైనా ఈనాటికైనా స్విస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావటం ఆహ్వానించదగిన విషయం.

11:32 - December 3, 2018

ఢిల్లీ : వస్తు..సేవల పన్ను..(గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) నవంబర్ మాసానికి రూ. 97, 637 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ (సీజీఎస్టీ) కింద రూ. 16, 812 కోట్లు వచ్చాయి. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఎస్జీఎస్టీ) కింద రూ. 23, 070..ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ (ఐజీఎస్టీ) కింద రూ. 49, 726...జీఎస్టీఆర్ 3బీ రిటర్న్ (అక్టోబర్ - మొత్తం 30వ నవంబర్) 69.6 లక్షలు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీజీఎస్టీ కింద రూ.18,262 కోట్లు...ఎస్‌జీఎస్టీ కింద రూ.15,704 కోట్ల చెల్లింపులు చేసినట్లు కేంద్రం పేర్కొంది. 
అక్టోబర్ మాసంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీజీఎస్టీ కింద రూ.35,073 కోట్లు...ఎస్‌జీఎస్టీ కింద రూ.38,774 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. ఆగస్టు-సెప్టెంబర్ నెలకుగాను రాష్ర్టాలకు పరిహారం కింద రూ.11,922 కోట్ల నిధులు విడుదల చేసింది 
> ఏప్రిల్‌లో రూ.1.03 లక్షల కోట్లు...
మేలో రూ.94,016 కోట్లు...
జూన్‌లో రూ.95,610 కోట్లు...
జూలైలో రూ.96,483 కోట్లు...
ఆగస్టులో రూ.93,960 కోట్లు...
సెప్టెంబర్‌లో రూ.94,442 కోట్లు...
అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు...

2016 సెప్టెంబ‌రు 8నుంచి 101 వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా జీఎస్టీ చ‌ట్ట‌రూపం దాల్చిన సంగతి తెలిసిందే. 

11:13 - December 3, 2018

హైదరాబాద్ : సినిమాల్లో పంచ్ డైలాగ్సే కాదు..ఎమోషనల్ డైలాగ్స్ లో కూడా బాలయ్యది ఓ స్పెషల్. అటు ఎమ్మెల్యేగా..ఇటు ట్రెండ్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవటమే కాదు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య తెలంగాణ యాసలోకూడా అదరగొట్టేస్తున్నారు. నగరంలోని శేరిలింగంపల్లి నియోకవర్గంలో రోడ్డు షోలో తెలంగాణ యాస, భాషతో మాట్లాడి సభికుల్లో జోష్‌ నింపారు. ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టడం వల్లే వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఉపాధి, ఉద్యోగాల్లేక పలువురు ఆత్మహత్యకు పాల్పడడం ఆవేదన కలిగించే విషయమన్నారు. 

ల్యాప్‌టాప్‌ కనిపెట్టింది మీరేనా’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబును వ్యంగ్యంగా విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలో జవాబిచ్చారు బాలయ్య. చంద్రబాబు రాజకీయ జీవితం హిస్టరీ అయితే మీది లాటరీ అని, రాళ్లగుట్టలతో నిండిన హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా అభివృద్ధి చేసిన ఘనత బాబుదని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు ప్రత్యర్థి పార్టీ నాయకులకు.చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, సైబరాబాద్‌ సృష్టికర్త ముమ్మాటికీ చంద్రబాబేనని బాలకృష్ణ ప్రశంసించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత రైతు రాజ్యం వస్తుందని అంతా ఆశిస్తే రాబందుల రాజ్యం వచ్చిందని..టీడీపీ ఒక కులం, మతం కోసం పుట్టిన పార్టీ కాదని, సామాజిక న్యాయం కోసం ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనీ..కారుకూతలు కూస్తున్న వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బాలయ్య మాటలతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నిండింది.
 

11:08 - December 3, 2018

ఢిల్లీ : ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు...పోలీసులకు పట్టించి చట్ట ప్రకారం వారికి ఏ శిక్ష విధించాలో కోర్టు నిర్ణయిస్తుంది. అదే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ? దొంగతనం..వేధించాడని...ఇతరత్రా కారణాలతో కొంతమందిని విచక్షణారహితంగా కొట్టడం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో వారు మరణిస్తుంటారు కూడా. తాజాగా ఓ ప్రజాప్రతినిధి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
వికాస్ అనే యువకుడు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆప్ ఎమ్యెల్యే సౌరవ్ ఝా..అతడిని చితకబాదాడు. దొడ్డు కర్ర చేత పట్టుకుని వికాస్‌ని చావబాదాడు. ఢిల్లీలోని కిరారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులుండగానే ఆ ప్రజాప్రతినిధి రెచ్చిపోవడం విశేషం. ఎమ్యేల్యేనే రెచ్చిపోతే తామెందుకు ఎందుకు కొట్టవద్దని అనుకున్నారో ఏమో అక్కడున్నవారు..వారు కూడా కర్రలు చేత పట్టుకుని వికాస్‌ని చితకొట్టారు. బాధలు భరించలేని వికాస్ అరుపులు పెట్టాడు. అయినా వారు కనికరించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వికాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. 
ఇదిలా ఉంటే కిరారీ ప్రాంతంలో వికాస్..అతని స్నేహితులు యువతులను వేధించే వారని ఝా ఏఎన్ఐ సంస్థకు తెలిపారు. వికాస్‌పైనే కాకుండా..అతని సోదరుడిపై కూడా కేసులున్నాయని..రెండు సంవత్సరాల కిందట ఓ మహిళపై వీరిద్దరూ గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలను వికాస్ కుటుంబం ఖండించింది. తప్పుడు ఆరోపణలు చేసిన తమకు రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఏదైనా క్రైం చేస్తే పోలీసులకు అప్పగించాల్సింది పోయి ఇలా చితకబాదడం ఏంటీ అని వారు ప్రశ్నించారు. నిజనిజాలు త్వరలోనే బయటపడునున్నాయి. 

11:04 - December 3, 2018

హైదరాబాద్: ఇప్పటి యూత్‌కు సెల్ఫీల పిచ్చి బాగా ఉంది. మూడ్ వస్తే చాలు సెల్ఫీలు దిగేస్తున్నారు. ప్లేస్ ఏదైనా, సందర్భం మరేదైనా అస్సలు పట్టించుకోవడం లేదు. సెల్ఫీలు దిగడం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టడం.. వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. ఈ క్రమంలో సెల్ఫీలకు బాగా అడిక్ట్ అయిపోయారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఏం చేసినా అనేవాళ్లు లేరు కదా అని డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ దిగితే.. ఆ ఓటును రద్దు చేస్తారు.
పక్కన పడేస్తారు:
ఇలా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం 49ఎం(ఓటు రహస్యం) అనే నియమాన్ని ఉల్లంఘించడమే అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అంటే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. సో.. సెల్ఫీ పిచ్చోళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.. ఆ తర్వాత చింతించినా లాభం ఉండదు.
ప్రతి ఓటరు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన నిబంధనలు:
* నిబంధనల ప్రకారం పోలింగ్‌ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం.
* ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు అతడిని బయటకు పంపేస్తారు.
* ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను అని బూత్‌లో చెప్పడం కూడా నేరమే. వారిని ఓటు వేయనీయరు.
* దివ్యాంగులు ఓటు వేయడానికి సహాయకుడిగా ఒకరిని అనుమతిస్తారు.
* అదే వ్యక్తిని మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా అనుమతించరు.
* పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
* ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు డౌట్ వచ్చినా పోలింగ్‌ ఏజెంట్లు ప్రిసైడింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్‌ గది వరకు వెళ్లొచ్చు.
* అధికారి మాత్రమే అక్కడ ఏమీ జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు.
* ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్‌ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు.

10:52 - December 3, 2018

ఢిల్లీ : దేశానికి ఏ విపత్తు వచ్చినా..ఏ సంచలనాత్మక మార్పులు జరిగినా..ఎటువంటి అంతర్యుద్ధాలు జరిగినా ఆ ప్రభావం ప్రధానంగా పడేది మహిళలపైనే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాలే చాటా చెబుతున్నాయి.  ఇది ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు. దేశం ఏదైనా మహిళలపై జరుగుతున్న..జరిగే హింసలకు తేడా లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది దక్షిణ సూడాన్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం.. ఇది కేవలం ఊహ కాదు..కల్పితం అసలే కాదు సాక్షాత్తు.. ‘మెడిసిన్ షన్స్ ఫ్రంయిర్స్(ఎంఎస్ఎఫ్)’ అనే సంస్థ వెల్లడించిన భయంకరమైన వాస్తవాలు.

దేశంలో మహిళలపై జరగుతున్న హింసాత్మక చర్యలు కొనసాగుతునే వున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారుల నుండి కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధుల వరకూ కూడా ఈ హింసాకాండ జరుగుతుండటం దేశంలో ఆడపుట్టుకను ప్రశ్నార్థం చేస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా  బాలిక నిష్పత్తి దారుణంగా పడిపోతుండటం..బాలురు, బాలిక నిష్పత్తిలో భారీగా వ్యత్యాసం రావటంతో భవిష్యత్తులో మరింతగా ఆడపుట్టుకపై హంసాత్మక చర్యలు పెరుగుతాయనటానికి ఈ దారుణమైన వ్యత్యాచం సూచికగా హెచ్చరిస్తోంది. ఈనేపథ్యంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. ఇది ఎంత దారుణంగా వుంది అంటే కేవలం 10 రోజుల్లో ఏకంగా 125 అత్యాచారాలు జరిగటం భయాందోళనలు కలిగిస్తోంది. తలచుకుంటేనే ఒళ్లు గగొర్పొడిచే ఈ లెక్కలు దేశం భద్రతను ప్రశ్నిస్తోంది. 

10 రోజులో వ్యవధిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 125 మంది మహిళలు అత్యాచారానికి గురికావడంతో యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దక్షిణ సూడాన్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం.. అక్కడ మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు సాక్ష్యంగా నిలుస్తోంది. 

దక్షిణ సూడాన్‌లో బాలికలు, మహిళలు అనే తేడా లైకుండా లైంగిక హింస కొనసాగుతోంది. స్థానిక పురుషులతో పాటు.. బాధితులకు వారికి రక్షణ కల్పించాల్సిన మిలటరీ సిబ్బంది సైతం ఈ అత్యాచారాలకు పాల్పడటం కలచివేస్తోంది. బెంటియూ అనే ప్రాంతంలో ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లిన మహిళలపై  అత్యాచారాలు, భౌతిక దాడులకు పాల్పడినట్లు ‘మెడిసిన్ షన్స్ ఫ్రంయిర్స్(ఎంఎస్ఎఫ్)’ అనే సంస్థ వెల్లడించింది. 

బాధితుల్లో 10 ఏళ్ల చిన్నారుల నుంచి 64 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారని ఎంఎస్ఎఫ్ సంస్థ వెల్లడించింది. గత ఐదేళ్లుగా అంతర్యుద్ధంతో అస్తవ్యస్తమవుతున్న దక్షిణ సూడాన్ రెండు నెలల కిందట ప్రభుత్వానికి, వ్యతిరేకులకు మధ్య ఉద్యమ విరమణ ఒప్పందం జరిగినా శాంతి  మాత్రం కనుచూపుమేరలో కానరావటంలేదు. ఫలితంగా పౌరులు, సైనికులు ఇష్టారాజ్యంతో చిన్నారులపైనా..మహిళలపై అత్యాచారాలను, భౌతిక దాడులకు పాల్పడు హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అంతేకాదు సాధ్యమైనంత వరకూ దోచేస్తున్నారు. దీంతో దక్షిణ సూడాన్ లో ఈ అత్యాచాలకు గురవుతున్న ఆడపుట్టుక భయంకరమైన హింసలకు బలవుతోంది. 
 

10:39 - December 3, 2018

విజయవాడ : కొత్తగా కనిపిస్తున్నారు..కదా..ఈ పోలీసులు..ఎక్కడా..తెలుగు రాష్ట్రంలోనిదే అనుకుంటున్నారు..కదా..కరెక్టే...ఇది పక్క రాష్ట్రమైన ఏపీ రాష్ట్రంలో...కొత్త డ్రెస్..కొత్త..కారు..కొత్త సైకిళ్లతో ఉన్న ఈ పోలీసుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మహిళలను వేధిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘షీ టీమ్’ను తీసుకొచ్చింది. వేధిస్తున్న వారి భరతం పడుతున్నారు. 
శక్తి టీమ్...
ఆకతాయిల వేధింపులను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా విజయవాడ డీసీపీ (క్రైమ్) రాజకుమారి ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లతో ‘శక్తి టీమ్’ ఏర్పాటు చేశారు. పోలీసులకు సాధారణంగా ఉండే ఖాకీ కలర్ డ్రెస్ కాకుండా వేరే డ్రస్‌ని ఏర్పాటు చేశారు. అంతేగాకుండా వీరికి పెట్రోలింగ్ కోసం కొత్త మోడల్ ప్రవేశపెట్టారు. కొత్త కారు..కొత్త సైకిళ్లు అందించారు. సైకిల్ మాత్రం బ్యాటరీతో నడువనుంది. వీరిని చూస్తున్న జనం..విదేశాల్లో ఉండే పోలీసుల మాదిరిగా ఉన్నారంటూ కితాబిస్తున్నారు. బ్యాటరీతో నడిచే సైకిళ్లను అందించారు. ఈ మహిళా కానిస్టేబుళ్లు విజయవాడ నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. 

10:28 - December 3, 2018

రాజస్థాన్‌ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయం తెలిసిందే. బాల్యవివాహాలు చేసినా..ఆ వివాహాలకు హాజరయినా చట్టరీత్యా నేరం. రాజ్యంగం ప్రకారం చట్టసభల్లో చేసిన చట్టం ఈ బాల్యవివాహా చట్టం. కానీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తు చట్టవిరుద్ధమైన  వివాదాస్ప హామీలిస్తున్న బీజేపీ మహిళా అభ్యర్థి ఇస్తున్న హామీలు వివాదాస్పదంగాను..సంచలనంగాను మారాయి. చట్టసభకు ప్రాతినిథ్యం వహించేందుకు ఎన్నికల్లో ప్రచారంలో బీజేపీ అభ్యర్థి తనను గెలిప్తే బాల్య వివాహాలను దగ్గరుండి గెలిపిస్తానని, పోలీసుల అడ్డంకి లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు అవాక్కయ్యారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిసినా ఆమె ఈ హామీ ఇవ్వడంతో వివాదాస్పదమైంది.  ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యర్థులే కాదు, నెటిజన్లు కూడా ఆమెపై దుమ్తెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వ్యక్తి ఇటువంటి దురాచారాలను ప్రోత్సహించడం ఏంటంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

రాజస్థాన్‌లోని సోజత్ నియోజకవర్గం నుంచి శోభ చౌహాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం పీపాలియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. తనను గెలిపిస్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తానని, పోలీసుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీలివ్వటం వివాదాస్పదంగా మారింది. అసలే బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శోభా చౌహాన్ హామీలు ఇప్పుడు రాజస్థాన్ లో సంచలనంగా మారాయి. మరి ఈ చట్ట వ్యతిరేక హామీలపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
 

10:23 - December 3, 2018

హైదరాబాద్ : వెండితెరపైనే కనిపించే సినీ హీరోలు..హీరోయిన్స్...రోడ్లపైకి వస్తున్నారు. తమ ముందు తమ అభిమాన నాయకుడు..నాయకురాలు..ఉంటుండడంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారితో సెల్ఫీలు దిగడానికి..షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నారు. వారిని ఏ మాత్రం నారాజ్ చేయకుండా వారికి సహకరిస్తున్నారు. సినీ తారలతో పాటు క్రీడాకారులు కూడా ప్రచారం చేపడుతుండడం విశేషం. ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తారలు ఆయా పార్టీలకు ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రధాన దృష్టి కేంద్రీకరించడం విశేషం. సినిమా హీరో..హీరోయిన్లను చూడటానికి జనాలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. 
బాలయ్య పంచ్ డైలాగ్స్..ప్రచారం...
కూకట్ పల్లి నియోజకవర్గం నుండి టీ.టీడీపీ అనూహ్యంగా నందమూరి సుహాసిని బరిలోకి దింపింది. ఈమె దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె. ఈమె విజయానికి...ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ప్రచారం చేపట్టారు. ఆయనతో పాటు నందమూరి కుటుంబం కూడా ప్రచారం చేపట్టడం విశేషం. సినీహీరో బాలకృష్ణ రోడ్‌ షో నిర్వహించారు కూడా. ఇక్కడే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ పంచ్ డైలాగ్స్‌తో ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె గెలుపు సాధించాలని కోరుతూ సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్‌లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జూ.ఎన్టీఆర్ ప్రచారం చేపడుతారని అనుకున్నారు..కానీ ఆయన ప్రచారానికి రారని తేలిపోయింది. టీడీపీ అభ్యర్థి నామా తరఫున నటుడు వేణు ప్రచారం చేశారు.
కాంగ్రెస్..కూడా...
అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా సినీ తారలను రంగంలోకి దింపేసింది. ఆ పార్టీ తరపున ఇప్పటికే విజయశాంతి..ఖష్బూలు ప్రచారం నిర్వహిస్తూ పంచ్ డైలాగ్‌లు వదులుతున్నారు. ఇక క్రికెట్‌ ఆటగాళ్లు సిద్దూ...అజారుద్దీన్‌‌లు కూడా కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నారు. సినిమాల్లో నటించి నటులు..నటీమణులు చేసే ప్రచారం ఆయా అభ్యర్థులకు ఎంత ఉపయోగపడుతుందో చూడాలంటే డిసెంబర్ 11 వరకు వేచి ఉండాల్సిందే. 

10:18 - December 3, 2018

ఒడిశా: హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై గెలుపుతో శుభారంభం చేసిన భారత్.. అదే జోరులో పటిష్ఠ బెల్జియంతో హోరాహోరిగా పోరాడింది. తొలుత తడబడ్డా..ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్‌ను గెలిచే ప్రయత్నం చేసింది. చివర్లో బెల్జియంకు గోల్ ఇచ్చుకుని డ్రాతో సరిపెట్టుకుంది. భువనేశ్వర్ వేదికగా బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్‌లో 2-2తో స్కోరుని సమం చేసింది.
మెరిసిన సిమ్రన్‌జిత్, హర్మన్‌ప్రీత్:
8వ నిమిషంలో హెండ్రిక్స్ కళ్లు చెదిరే గోల్‌తో బెల్జియం జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు. భారత్ డిఫెన్స్‌ని ఛేదించుకుంటూ పదే పదే గోల్‌పోస్టుపై దాడులు చేసిన ఆ జట్టు.. 40వ నిమిషం వరకూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే.. 40వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ చూడచక్కని గోల్‌‌తో ఆధిక్యాన్ని 1-1తో సమం చేయగా.. ఆ తర్వాత 47వ నిమిషంలో సిమ్రన్‌జీత్ 2-1తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 7 నిమిషాల వ్యవధిలో భారత్ జట్టు అనూహ్యంగా పుంజుకోవడంతో కంగారుపడిన బెల్జియం.. దూకుడుని పెంచింది. భారత్ కంటే అటాక్, డిఫెన్స్‌లో బలంగా కనిపించిన ఆ జట్టు.. ఆధిక్యాన్ని 2-2తో సమం చేసేందుకు ప్రయత్నించడంతో.. అడ్డుకునేందుకు భారత్ విశ్వప్రయత్నం చేసింది. కానీ.. 56వ నిమిషంలో తెలివిగా బంతిని పోస్టులోకి తరలించిన బెల్జియం ఆటగాడు సిమన్.. స్కోర్‌ని సమం చేశాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ గ్రూపులో టాప్‌లో కొనసాగుతున్నది. చివరి మ్యాచ్‌లో కెనడాపై విజయంతో నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

10:12 - December 3, 2018

మధ్యప్రదేశ్‌  : ఎన్నికలు ప్రశాతంగా జరిపింటం ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సామువంటిదే. అనంతరం ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎంల భద్రత అంతకంటే ముఖ్యం. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఈవిఎంలకు భధ్రత విషయంలో ఓ కలెక్టర్ సంచలన ఆదేశాలకు జారీ చేసారు. ఈవీఎంల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, మధ్యప్రదేశ్  రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంల భద్రతపై ఆయా పార్టీల నేతలు పలు అనుమానాలను వ్యక్తంచేయటం..ఈవీఎంలు  భద్రపరిచే ప్రాంతంలో సీసీ కెమెరాలు  పనిచేయటకపోవటం వంటి పలు అంశాలపై  పలు అనుమానాలకు తావివ్వగా, ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లో రక్షణ సిబ్బందిని పెంచుతున్నామని, ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే వారిని కాల్చిపారేయాలని ప్రీతి మైథిలి ఆదేశించారు. 
రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ లోని ఓ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయక పోవడంకాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ లను పరిశీలించిన కలెక్టర్ ప్రీతీ మైథిలి ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, 11వ తేదీ వరకూ అనుక్షణం ఈవీఎంలను కాపాడతామని తెలిపారు. అంతగా నిబంధలను ఖాతరు చేయకుండా ఈ ప్రాంతంలోకి వచ్చిన వారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేయమని భద్రతాదారులకు కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలను జారీ చేశారు.
 

09:53 - December 3, 2018

ఖమ్మం : ఒకవైపు ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. అలాగే ప్రచారం పూర్తయ్యే రోజుల కూడా దగ్గర పడుతుండటంతో  ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీ దిగ్గజాలు, స్టార్ క్యాంపెయినర్లు, సినీ తారలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద ప్రచారంలో ‘నాగా సాధువులు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  వారణాసి నుంచి వచ్చిన కొంత మంది నాగా సాధువులు.. ఉప్పల శారదతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెతో కలిసి ప్రచార రథంలో కొంత దూరం ప్రయాణించారు. శారద కోసం తాము వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులు తీసుకొచ్చామని ఓ నాగా సాధువు మీడియాతో అన్నారు. 

ప్రచారంలో పాల్గొన్న చాలా మందికి నాగా సాధువుల గురించి తెలియకపోవడం గమనార్హం. శారదతో పాటు వారిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వారిని చూడటానికి జనం ఎగబడ్డారు. రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నాయకులకు కూడా నాగా సాధువుల గురించి తెలియదంటే ఆశ్చర్యపోనక్కరలేదు. నాగా సాధువుల ఆశీస్సులు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఉప్పాల శారద తెలిపారు. 
మరోవైపు ఖమ్మంలోని  ఇల్లెందులో బీజేపీ ప్రచారంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జౌల్ ఓరం పాల్గొన్నారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని..ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం  అడవిబిడ్డలకు మంత్రి  జౌల్ హామీల వర్షం కురిపించారు. 

09:50 - December 3, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని ఆసుపత్రివర్గాలు పేర్కొంటూ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రూ.1200 కోట్ల బకాయిలు ఉండటంతో రెండు పథకాల కింద లబ్ధిదారులకు వైద్య సేవలను గత నెల 20వ తేదీ నుంచి నిలిపి వేశాయి. దీనితో ఈ సేవలను పొందుతున్న వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది. ఈ సమస్య డిసెంబర్ 2వ తేదీ పరిష్కారమౌతుందని..మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ నెటిజటన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆస్పత్రుల సంఘంతో ప్రభుత్వం చర్చలు జరిపింది.  గత నాలుగు రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుకు రూ.150కోట్ల బకాయిలను సంబంధిత ఆసుపత్రులకు విడుదల చేశామని సీఈఓ వెల్లడించారు. త్వరలోనే మిగితా బకాయిలను చెల్లిస్తామని, రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ఆయన కోరారు. వెంటనే రూ.150కోట్లు విడుదల చేయడమే కాకుండా మరో రూ.150కోట్లు నెలలోపు విడుదల చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. 

09:37 - December 3, 2018

హైదరాబాద్ : కార్తీక మాసంలో మొదటి..చివరి రోజులు ముఖ్యంగా భావిస్తుంటారు. మొదటి సోమవారం..చివరి సోమవారం రోజుల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తుతుంటారు. 2018 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు కిటకటాలడుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద తెల్లవారుజాము నుండే భక్తలతో సందడి నెలకొంది. శైవక్షేత్రాల్లో ప్రముఖ ఆలయంగా పేరొందిన శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు సమాచారం. మల్లికార్జున స్వామి వారి సాధారణ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అమరావతి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించారు. మొత్తానికి ఆలయాల్లో భక్తుల రద్దీతో సందడి..సందడి నెలకొంది. 

09:32 - December 3, 2018

హైదరాబాద్ : నిత్యం వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తన పదునైన వ్యాఖ్యలకు పనిచెప్పారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్..అల్లా బీజేపీని ఓడిస్తాడని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మలక్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఒవైసీ ప్రధాని మోదీ, యూపీ ఎంపీ ఆదిత్యానాధ్ లపై ఘాటుగా స్పందించారు. భారతదేశం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లది మాత్రమే కాదనీ..అందరిదీననీ..మోదీ, ఆర్‌ఎస్సెస్, యోగిలకు వ్యతిరేకంగా మాట్లాడినా..వారిని విమర్శించినా..దేశం నుంచి తరిమేస్తారా? అని ఓవైసీ ఆవేశంగా  ప్రశ్నించారు.అల్లా మోదీని ఓడిస్తాడని  ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. కాగా డిసెంబర్ 2వ తేదీని  తెలంగాణలో  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం ఆదిత్యానాథ్ మాట్లాడుతు..బీజేపీ అధికారంలోకి ఖామమనీ..నిజాం హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్లుగానే ఎంఐఎం నేతలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తామని యోగి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన ఒవైసీ..ఎంఐఎం చరిత్రపై యూపీ సీఎంకు ఏ మాత్రం అవగాహన లేదని..తెలియకపోతే చరిత్ర తెలిసిన వారిని అడిగి తెలుసుకోండని ఎద్దేవా చేశారు. నిజాంను హైదరాబాద్ నుంచి గెంటేయలేదు, ఆయన్ను రాజ్ ప్రముఖ్‌గా నియమించారని..ఈ విషయాన్ని యోగీ తెలుసుకోవాలని పరుషంగా కౌంటరిచ్చారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
 

09:28 - December 3, 2018

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంటోంది. మూడు రోజులే ప్రచారానికి సమయం మిగిలి ఉండడంతో... పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించనున్నారు.
కేసీఆర్ దూకుడు:
ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం కేసీఆర్‌.. ఇవాళ(డిసెంబర్ 3) ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఆరు చోట్ల నిర్వహించే ఆశీర్వాద సభలలో పాల్గొంటారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర,.. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌,.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాల్లో నిర్వహించే సభలలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి సత్తుపల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత ఒంటిగంటకు మధిర వెళ్తారు. అనంతరం ఒంటిగంట 45 నిమిషాలకు కోదాడలో నిర్వహించే ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రెండున్నర గంటలకు హుజూర్‌నగర్‌, 3 గంటల 30 నిమిసాలకు మిర్యాలగూడ, నాలుగున్నర గంటలకు నల్గొండ సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్‌ సభల కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
* ప్రచారంలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ
* ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం
* ఆరు సభల్లో పాల్గొననున్న కేసీఆర్‌

* మ.ఒంటి గంటకు మధిర
* మ.1.45కి కోదాడ
* మ.2.30కి హుజూర్‌నగర్
* మ.3.30కి మిర్యాలగూడ
* సా.4.30కి నల్గొండ

చంద్రబాబు జోరు:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జోరు పెంచారు. ప్రజాకూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ (డిసెంబర్ 3) ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా జూబ్లీహిల్స్, కూకట్‌పల్లిలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతో కలిసి రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు.
కాంగ్రెస్ స్పీడ్:
కాంగ్రెస్ సైతం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. మరికొంత మంది రోడ్‌షోలు నిర్వహించారు. స్టార్‌ క్యాంపెయినర్ ఉత్తమ్, జానారెడ్డి, విజయశాంతితోపాటు పలువురు నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కూటమిలోని పార్టీల అగ్రనేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పీసీసీ నేతలు ఆయా జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తూనే... కాంగ్రెస్ అగ్రనాయత్వాన్ని ప్రచార పర్వంలో దింపుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, సోనియాగాంధీ, ఆజాద్‌తోపాటు పలువురు నేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు.

09:15 - December 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ - మహారాష్ట్ర - ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్..టెన్షన్..వాతావరణం నెలకొంది. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయని పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందచేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కొద్ది రోజుల కిందటే ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించాలంటే పోలీసుల నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పకుండా గ్రామాలకు వెళ్లొద్దని ఆయా అభ్యర్థులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
అభ్యర్థులకు అదనపు భద్రత...?
కరీంనగర్..ఆదిలాబాద్..ఖమ్మం అభ్యర్థులకు అదనపు భధ్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రత నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు...ఎన్నికలు పూర్తయ్యే దాక అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 
ఛత్తీస్ గడ్‌లో ఎన్ కౌంటర్...
కొద్ది రోజుల క్రితం ఎమ్యెల్యే కిడారి సోమ, మాజీ ఎమ్యెల్యే హత్య అనంతరం ఏపీ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. అంతేగాకుండా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను అడ్డుకొనేందుకు మావోలు ప్రయత్నించారు. పోలింగ్‌కు ముందు రోజు మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. మొదటి దశ పోలింగ్ సమయంలో బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. 

 

09:06 - December 3, 2018

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రచారానికి మూడు రోజుల సమయమే మిగిలి ఉండడంతో... పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు తమ పార్టీల అగ్రనేతలతో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. భారతీయ జనతాపార్టీ తెలంగాణలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రచారానికి గడువు సమీపించడంతో పోటీలో ఉన్న అన్నిచోట్ల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం(డిసెంబర్ 3) రాష్ట్రానికి రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది.
* మరోసారి రాష్ట్రానికి మోదీ
* ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ
* మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం

మోదీ స్పీచ్‌పై ఆసక్తి:
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను సక్సెస్‌ చేసి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ సభకు భారీగా జనసమీకరణపై దృష్టి సారించింది. అన్ని జిల్లాల నుంచి జనాన్ని భారీ సంఖ్యలో తరలించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. మరోవైపు సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మోదీ ఏం చెప్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సౌత్‌లో సత్తా చాటాలని:
రాష్ట్ర నేతలతో పాటు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రచారంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు యూపీ సీఎం యోగి ప్రచారం నిర్వహించారు. మరికొంత మంది ఇతర బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం నిర్వహించారు. సౌత్‌లో తమ పార్టీ ఖాతా తెరవాలని... అది తెలంగాణతోనే మొదలవ్వాలన్న లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు.
మరోసారి రంగంలోకి రాహుల్:
అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. గద్వాల, తాండూరు నియోజకవర్గ సభల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. చంద్రబాబుతో కలిసి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షోలో రాహుల్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, రహ్మత్‌నగర్‌, మూసాపేట చౌరస్తాల్లో రాహుల్‌ ప్రసంగించనున్నారు. రాహుల్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పూర్తి చేసింది.
రాహుల్‌ రాక కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని, ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు ఆయన పర్యటన బాగా ఉపయోగపడిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో మరోసారి రాష్ట్రానికి రావాలని పీసీసీ ఆయనను కోరింది. ఇందుకు రాహుల్ కూడా అంగీకరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు రాహుల్. సుడిగాలి పర్యటనతో పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.
* మరోసారి రాష్ట్రానికి రాహుల్‌
* గద్వాల, తాండూరు నియోజకవర్గాల్లో ప్రచారం
* మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లో ప్రచారం
* చంద్రబాబుతో కలిసి ప్రచారం చేయనున్న రాహుల్‌
* కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
* మ.12.15 గద్వాల్, మ.2.15కి తాండూరులో బహిరంగ సభ
* సా. 4.15 గంటలకు జూబ్లీహిల్స్‌లో రోడ్‌షో
* సా. 5.30 గంటలకు కూకట్‌పల్లిలో రోడ్‌షో

08:50 - December 3, 2018

అనంతపురం : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన నిరసన కవాతులో తీవ్ర విషాదం నెలకొంది. అీనంతపురం జిల్లాలో డిసెంబర్ 2వ తేదీ ఆదివారం పవన్ నిరసన కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కవాతులో పాల్గొని వెళుతున్న నలుగురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీనితో వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
జనసేన కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును కర్నూలు జిల్లా డోన్ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. నలుగురు కార్యకర్తలు అక్కడికక్కడనే మృతి చెందగా కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో మధు, గో్వింద్‌లు డోన్ మండలంలోని ధర్మవరానికి చెందిన వారు కాగా...హనుమంతు వెల్దుర్థి మండలం గోవర్ధనగిరికి చెందిన వాడు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాద వార్తను తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందడంపై పవన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. జనసేన నేతలతో మాట్లాడి ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. 

08:39 - December 3, 2018

> టీడీపీ నేతలు దోపిడి చేస్తున్నారు...
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ ఫైర్...
యువత మార్పు కోసం ముందుకు రావాలి...

అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేనానీ మరోసారి ఫైర్ అయ్యారు. తనకు ప్రధాన మంత్రి మోడీ అంటే భయం లేదన్న పవన్...జేసీ దివాకర్ రెడ్డిది రౌడీయిజం అంటూ ఆరోపించారు. అనంతలో పర్యటిస్తున్న పవన్..తనకు పదవులతో పని లేదన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకరావాల్సిన అవసరం ఉందని..ఇందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ నుండి ఏమీ ఆశించకుండా తాను మద్దతు ఇవ్వడం జరిగిందని..అమరావతిలో బలవంతపు భూ సేకరణ చేయనని బాబు హామీనిచ్చి మాట తప్పారని విమర్శించారు. బాబు పాలన అంతా అవినీతిమయం..ఒక్కో నియోజకవర్గంలో రూ. 1000 - 3500 కోట్ల వరకు దోపిడీ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని..ప్రజలకు సేవ చసేందుకు ముందుకు వచ్చానని...యువత మార్పు కోరుకొంటోందన్నారు. సరికొత్త రాజకీయాల కోసం జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని..కమ్యూనిజం...క్యాపిటలిజం లేని కొత్తతరం రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. రక్తం పంచుకుని పుట్టిన వారికంటే ప్రజలే తనకు ముఖ్యమని తెలిపారు. 

08:38 - December 3, 2018

హైదరాబాద్: పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సింథికాలనీ నుంచి శేరిలింగంపల్లికి వెళ్తున్న కారులో 70లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు.
* శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీగా నగదు స్వాధీనం
* పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు
* సింథికాలనీ నుంచి శేరిలింగంపల్లి వెళ్తున్న కారులో తనిఖీలు
* రూ.70లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
* ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

08:27 - December 3, 2018

హైదరాబాద్‌: అమీర్‌పేట్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. సనత్‌నగర్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు బస చేసిన హోటళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4లక్షల 63వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

* టీడీపీ కార్యకర్తలు బస చేసిన హోటళ్లలో పోలీసుల తనిఖీలు
* గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల అరెస్ట్
* రూ.4.63లక్షల నగదుతో పాటు కారు సీజ్

07:37 - December 3, 2018

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొడంగల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. డిసెంబర్ 4న జరగబోయే కేసీఆర్‌ సభను అడ్డుకుంటానని ప్రకటించిన రేవంత్‌రెడ్డిపై ఈసీ సీరియస్‌ అయ్యింది. వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ కోరారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు:
తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. డిసెంబర్ 4న కొడంగల్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు.. సీఎం కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌ ప్రజలను అకారణంగా రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను సైతం ఈసీకి అందించారు. రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుపై స్పందించిన రజత్‌కుమార్‌... తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. రేవంత్‌ ఎపిసోడ్‌పై ఏం చర్యలు తీసుకున్నారో కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
రంగంలోకి హరీష్:
ఇక రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్‌రావు రంగంలోకి దిగుతున్నారు. కొడంగల్‌‌లో జరిగే సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లతో పాటు.. నేతలు, కార్యకర్తలకు మనోస్థైర్యం కలిగించేందుకు అక్కడికి వెళ్లనున్నారు. అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కొడంగల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

Don't Miss