Activities calendar

06 December 2018

22:16 - December 6, 2018

జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లాలో మధుయాష్కీ కారుపై దాడి జరిగింది. కొమ్మిరెడ్డి రాములుకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఆయన వర్గీయులు మధుయాష్కీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మధుయాష్కీ కారు ధ్వంసమైంది. కోరుట్లలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. మెట్‌పల్లి ప్రాంతంలో మాజీ ఎంపీ కారు మధుయాష్కీపై దాడి జరిగింది. ఈ దాడిలో మధుయాష్కీకి చెందిన రెండు కార్లు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అసలేం జరుగుతోందో అర్థం కాక షాక్ తిన్న మధుయాష్కీ వెంటనే ఓ బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డికి కోరుట్ల టికెట్ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని, జువ్వాని నర్సింగరావుకి టికెట్ రావడం వెనుక మధుయాష్కీ హస్తం ఉందని కొమ్మిరెడ్డి వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వారు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
మెట్‌పల్లికి ఎందుకొచ్చారు?
అసలు మధుయాష్కీ మెట్‌పల్లి ఎందుకు వచ్చారు? అని పోలీసులు ఆరాతీస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, స్థానికేతరుడైన మధుయాష్కీ కోరుట్ల ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం చేశారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల కోడ్ ప్రకారం స్థానికేతరులు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదు. అయినా మధుయాష్కీ మెట్‌పల్లి రావడం చర్చనీయాంశంగా మారింది.

22:09 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. సతీసమేతంగా సోమాజిగూడలోని ఐసీడీఎస్ అంగన్ వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేయనున్నారు. సిద్ధిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలోని పోలింగ్ బూత్‌లో సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా.. ఆయన ఓటు మాత్రం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉంది. ఇక్కడే ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటారు. కేసీఆర్‌ తనయ .. నిజామాబాద్‌ ఎంపీ కవిత మాత్రం బోధన్‌ నియోజకవర్గం నవీపేట మండలం పొతంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు సిద్దిపేటలోని బూత్ నంబర్ 107 అంబిటస్ స్కూల్లో సతీ సమేతంగా ఓటు వేయనున్నారు.
ఇక కాంగ్రెస్ నేతల విషయానికొస్తే.. ముఖ్యనేతలంతా తన నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను పోటీ చేస్తున్నహుజూర్‌నగర్‌లో ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి హైదరాబాద్ ఎంఎల్ఏ కాలనీలోని రోడ్ నంబర్ 12లో ఓటు వేస్తారు. ఇక తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్.. ఉదయం 8గంటలకు హైదరాబాద్ తార్నాకలో ఓటు వేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని శాంతినికేతన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 9లో ఓటు హక్కువినియోగించుకుంటారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి... లింగంపల్లిలోని దీక్ష మోడల్ స్కూల్‌లో ఓటు వేయనున్నారు. బంజారాహిల్స్‌లోని గౌరీ శంకర్ కాలనీలో సీఈసీ రజత్‌కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ గతంలో హైదరాబాద్‌లోనే ఓటు వేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్‌లోనే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. ఆయన మొదట్నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఓటు వేస్తున్నారు.

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

21:37 - December 6, 2018

హైదరాబాద్: ప్రచారం ముగిసి చాలా సేపు అయింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయినా నిబంధనలకు విరుద్దంగా ఆంధ్రా టీడీపీ నేతలు ఇక్కడే మకాం వేశారని, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖమ్మంతో పాటు పలు నియోజకవర్గాల్లో ఆంధ్రా టీడీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని.. ప్రచారం ముగిసిన తర్వాత కూడా సొంత రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మకాం వేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఏపీ టీడీపీ నేత జూపూడి అనుచరులు డబ్బులు పంచుతూ దొరికిపోయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల నేతలను సొంత రాష్ట్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.

 

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

18:16 - December 6, 2018

ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సంస్థ ఒక్కో సర్వీస్‌ని క్లోజ్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే గూగుల్ ప్లస్, హ్యాంగౌట్స్ మేసేజింగ్ యాప్‌లను మూసివేన గూగుల్ తాజాగా మరో మేసేజింగ్ యాప్ ''అల్లో''ను మూసివేయాలని నిర్ణయించింది. 2019 మార్చి నుంచి ‘అల్లో’ పూర్తిగా కనిపించకుండా పోతుంది. 2016 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ ఈ చాట్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దీనికి ఆదరణ లభించలేదు. దీంతో ఈ యాప్‌ను క్లోజ్ చేసేందుకు మొగ్గుచూపింది. ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేసిన గూగుల్.. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిగా యాప్ కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు అధికారిక బ్లాగ్‌లో తెలిపింది. అదే సమయంలో ఎస్ఎంఎస్‌ పంపిణీ నిర్వహణ తీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. అల్లో స్థానంలో ఆర్‌సీఎస్ తీసుకొని వస్తోంది. ఆండ్రాయిడ్ డివైజస్‌లో ఐమేసేజ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

 

17:45 - December 6, 2018

పండగలకు ఊరెళ్లే జనం ఈసారి ఓట్ల కోసం కదిలారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ మహా నగరంలో స్థిరపడిన వారు అందరూ కూడా పల్లెలకు పయనం అయ్యారు. సొంతూరులో ఓటు వేయటంలో ఉండే కిక్కే వేరు అంటున్నారు. డిసెంబర్ 7వ తేదీ ఓటు వేసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివెళుతుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఊహించని విధంగా ప్రజలు ఒక్కసారిగా రావటంతో బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. ముందుగానే ఊహించిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అయినా సరిపోలేదు. 
వరసనగా మూడు రోజులు సెలవులు :
డిసెంబర్ 7వ తేదీ శుక్రవారం పోలింగ్ సెలవు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా సెలవు దినం ప్రకటించాయి. స్కూల్స్ కూడా హాలిడే. శుక్రవారం పోలింగ్ సెలవు వచ్చింది.. డిసెంబర్ 8వ తేదీ సెకండ్ శాటర్ డే.. 9వ తేదీ ఆదివారం. మూడు రోజులు వరసగా సెలవులు వచ్చాయి. పిల్లలకు కూడా సెలవు. దీంతో గతంలో కంటే పెద్ద సంఖ్యలోనే ప్రజలు సొంతూర్లకు కదిలారు. పోలింగ్ తోపాటు.. రెండు రోజులు సొంతూరులో ఉండొచ్చని ఉద్దేశంతో ఈసారి భారీ స్పందన వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజల రద్దీతో మరిన్ని బస్సులు నడుపుతున్నట్లు కూడా ప్రకటించింది ఆర్టీసీ. జిల్లాలకు వెళ్లే బస్సుల్లో నిల్చోవటానికే సీట్లు లేవు. నిలబడి వెళుతున్నారు. స్పెషల్ సర్వీసులు నడపటంలో ఆర్టీసీ అధికారులపై విమర్శలు కూడా వస్తున్నాయి.

16:43 - December 6, 2018

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధారే ఆధారంగా వుంది. కాగా విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ వర్తించాలంటే ఈ ఆధార్ కార్డే ఆధారం. 
ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్ష‌న్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది. 
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు..
దీంతో ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్ర‌తిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి కూడా. దీంతో దేశ పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. 
18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం..
దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 
పాన్ కార్డు లేని వారికి కొత్త నిబంధ‌న ఉప‌యోగం..
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది. 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

15:46 - December 6, 2018

కర్ణాటక : హెచ్ఐవీ రోగులంటే సమాచారంలో ఏహ్యభావం ఏర్పడిపోయింది. వారికి దూరంగా వుండటమే కాక వారిపై అంతులేని వివక్ష కొనసాగుతోంది. వారు బ్రతికి వుండగానే కాదు మరణానంతరం కూడా ఇటువంటి ఘోరమైన వివక్ష  జరగుతుండటం అత్యంత దారుణం, బాధాకరం. హృదయ విదారకమైన ఇటువంటి ఘటనకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది కర్ణాటకలోని హుబ్లి జిల్లా మొరాబా గ్రామం. హెచ్ ఐవీ సోకిన ఓ బాధితురాలు సమాజంలో తన పట్ల జరుగుతున్న అవమానకర పరిస్థితులు తట్టుకోలేక గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
గ్రామస్థుల వివక్ష, తట్టుకోలేకపోయిన ఐశ్వర్య..
గత కొంతకాలం క్రితం హెచ్ఐవీ సోకిన ఐశ్వర్య వైద్యం తీసుకుని తిరిగి స్వగ్రామం చేసుకుంది. అప్పటి నుండి ఐశ్వర్యపై వివక్ష ప్రారంభమయ్యింది. ఆమెను తాకితేనే ఎయిడ్స్ వచ్చేస్తున్నట్లు ప్రవర్తించటం తట్టుకోలని ఆమె ఆ గ్రామ చెరువు వద్ద ఓ షెడ్ వేసుకుని నివాసముంటోంది 40ఏళ్ల ఐశ్వర్య. కాగా గత కొన్ని రోజుల నుండి ఆమె కనిపించకుండా పోవటం..వారం రోజుల క్రితం ఆమె ఆ ఊరి ప్రధాన నీటి వనరుగా వున్న 36 ఎకరాల చెరువులో శవంగా తేలటంతో గ్రామస్థులంతా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఆ 36 ఎకరాల చెరువును ఖాళి చేయాలని. అంటే నీటిలో వన్న నీరంతటిని బైటకు తోడివేయాలని.
అనుకున్నదే తడవుగా గ్రామస్థులంతా గత కొన్ని రోజుల నుండి పదుల సంఖ్యలో మోటర్స్ నువేసి నీటిని తోడేస్తున్నారు. ఎయిడ్స్ వున్న ఐశ్వర్య చెరువులో పడి చనిపోయిన కారణంగా ఆ నీరు తాగితే తమకు కూడా ఎయిడ్స్ వచ్చేస్తుందనే మూఢత్వంతోను..అవగాహనారాహిత్యంతోను ఈ దారుణానికి పాల్పడ్డారు. Image result for HIV woman committed suicide
ఆరోగ్య అధికారుల మాటలను వినని గ్రామస్థులు..
ధార్వాడ్ జిల్లా ఆసుపత్రిలో ఒక సర్జన్ డాక్టర్ గిరిధర్ మాట్లాడుతూ..చెరువులోని నీటిని త్రాగినా హెచ్ఐవీ రాదనిఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నించారు. ఆ మాటలు వినని గ్రామస్థులు నీటిని తోడేయటానికి పూనుకున్నారు. కనీసం గ్రామంలోని పశువులను కూడా ఆ చెరువువైపు వెళ్లనివ్వకుండా కాపాలా కాసారు అంటే వారిది ఎంతటి మూఢత్వమో ఊహించుకోవచ్చు. 
కాగా గతంలో కూడా ఈ చెరువులో ఓ బాలుడు పడి మరణించినప్పుడు కూడా ఆ గ్రామస్థులు ఆ చెరువు నీటినే వాడుకున్నారు. అప్పుడు లేని ఈ అంతులేని వివక్ష హెచ్ ఐవీ మహిళ ఆత్మహత్య తరువాతనే రావటం గమనించాల్సిన విషయం. ఇది హెచ్ఐవీ రోగుల పట్ల సమాజం ఎంతటి వివక్షను చూపుతోందో అర్థం చేసుకోవచ్చుImage result for HIV woman committed suicide
ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఈ చెరువే ఆధారం..
కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఆ గ్రామానికే కాదు ఆ చుట్టుపక్కన కొన్ని గ్రామాలకు ఈ చెరువే ప్రధాన నీటి వనరు. మాలప్రబ కుడి కాలువ నుండి ఈ చెరువుకు నాలుగు నెలలకు ఒకసారి త్రాగునీటిని విడుదల చేస్తారు. అలా మూడు రెండు నెల క్రితం చెరువులోకి నీటిని విడుదల చేశారు. కానీ ఈ నీటికి బైటకు పంపించివేసిన తరువాత వారికి నీరు అవసరం కాబట్టి మరోసారి నీటిని విడుదల చేయాలని గ్రామస్థులు కొత్త కొత్త అభ్యర్థనను పంపించారు.
ఐశ్వర్య ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు..
చెరువులో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంద సమచారంతో పోలీసులు సంఘటనాస్థలినికి చేరుకుని కేసు నమోదుచేసుకుని ఐశ్వర్య శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా ఐశ్వర్యది సహజ మరణం కాదనీ..ఆమెను ఎవరో చంపి చెరువులో పడవేశారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

15:39 - December 6, 2018

టీమిండియాకి ఏమైంది.. విదేశీ గడ్డపై ఆడలేరా.. స్వదేశంలోనేనా సత్తా చాటేది.. చావబాదేది.. విదేశీ పిచ్‌లపై పిట్టల్లా రాలిపోతారా.. బ్యాటింగ్ చేయాలంటే దడేనా.. బౌలింగ్ ఎదుర్కోవాలంటే బెంబేలెత్తాల్సిందేనా.. టీమిండియా లోకల్ టైగర్సేనా.. ఇన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ పై..
కుప్పకూలిన టాప్ ఆర్డర్ :
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది కోహ్లీసేన. ఓపెనర్లతోపాటు ఆరుగురు బ్యాట్స్‌మెన్లను బరిలోకి దించింది. ఓపెనర్లుగా రాహుల్, విజయ్ క్రీజ్ లోకి ఎంటర్ అయ్యారు. అలా వచ్చారో లేదో రాహుల్ 2, విజయ్ 11 పరుగులకు ఔట్ అయ్యారు. ఆ తర్వాత పుజారా, కెప్టెన్ కోహ్లీ వంతు వచ్చింది. కోహ్లీ 3 పరుగులకే ఔట్ అవ్వగా.. పుజారా మాత్రం ఆచితూచి ఆడాడు. కోహ్లీ స్థానంలో వచ్చిన రహానె కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. కేవలం 13 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. పుజారాతో కలిసి శర్మ మాత్రం కొద్దిసేపు క్రీజ్‌లో నిలకడగా రాణించాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంతో స్కోర్ బోర్డులో పరుగులు నమోదవుతూ వచ్చాయి. 
ఇద్దరూ నిలబడ్డారు అనుకుంటున్న సమయంలో.. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర శర్మ ఔటయ్యాడు. అతని ప్లేస్‌లో యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ వచ్చాడు. వీళ్లద్దరి పార్టనర్‌షిప్ నిలకడగా ఉంది అనుకుంటున్న టైంలో.. 25 పరుగుల దగ్గర పంత్ ఔట్ అయ్యాడు. అతని ప్లేస్‌లో అశ్విన్ వచ్చాడు. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ బాట పట్టాడు అశ్విన్. అప్పటికే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. పీకల్లోతు కష్టాల్లో పడింది. పుజారాపైనే భారం వేసింది. ఇదే సమయంలో పుజారా సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇషాంత్ శర్మ కూడా నాలుగు పరుగుల దగ్గర దగ్గర ఔట్ అయ్యాడు. 123 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పుజారా కూడా రనౌట్ అయ్యాడు. క్రీజ్‌లో మహ్మద్ షమీ, బుమ్రా ఉన్నారు. ఫస్ట్ డే మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 250 పరుగులకు 9 వికెట్లు. 
ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ :
పిచ్‌పై తేమను తమకు అనుకూలంగా, చక్కగా ఉపయోగించుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు. స్టార్క్ 2, హజీల్ ఉడ్ 2, కమ్మిన్స్ 2, లైన్ 2 వికెట్లు పడగొట్టారు.

15:33 - December 6, 2018

రంగారెడ్డి: ఎన్నికల వేళ అధికారులు జరుపుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో నోట్ల కలకలం చెలరేగింది. ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ ఇంట్లో రూ.5.78లక్షలు నగదు లభ్యమైంది. సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. ఈ డబ్బు బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి అనుచరులదిగా పోలీసులు గుర్తించారు.
పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలుంది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకి రేటు కడుతున్నారు. మరోవైపు ప్రలోభాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు నిఘా పెంచారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

15:15 - December 6, 2018

ఢిల్లీ: అన్ని వాహనాలకు ‘హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ప్లేట్ల(హెచ్‌ఎ్‌సఆర్‌పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కస్టమర్లకు మరో శుభవార్త వినిపించారు. ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. అక్కడ ఇక్కడ తిరగాల్సిన బాధ ఉండదు. వాహనాలు తయారు చేసే కంపెనీలే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తయారు చేస్తాయి. డీలర్లు వాటిని వాహనానికి బిగించి విక్రయిస్తారు. కేంద్ర రోడ్డు రవాణ శాఖ ఈ మేరకు ఆటోమొబైల్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019 ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం:
హైసెక్యూరిటీ ప్లేట్లకు 5 ఏళ్ల గ్యారంటీ ఇస్తారు. వాహనం ధరతో పాటు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ధర కలుపుతారు. ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వాహన్ డేటా బేస్‌తో ఈ నెంబర్ ప్లేట్లను అనుసంధానం చేస్తారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంటుంది. ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం.
పార్లమెంటుపై దాడి తర్వాత:
2005 కల్లా హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంకా 12 రాస్ట్రాల్లో ఈ విధానం పూర్తిగా అమలు చేయాల్సి ఉంది. 2002లో పార్లమెంటుపై దాడి ఘటన తర్వాత కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. నెంబర్ ప్లేట్‌ను ట్యాంపరింగ్ చేసిన వాహనంపై వచ్చి ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
చోరీలకు చెక్:
ఇక హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌తో పాటు థర్డ్ రిజస్ట్రేషన్ మార్క్‌ కూడా ముఖ్యం. దీన్ని కూడా వాహనాలు తయారు చేసే కంపెనీలే డిజైన్ చేస్తాయి. దీనికి కలర్ కోడింగ్ ఉంటుంది. వాహనంలో వాడే ఇంధనాన్ని ఇది సూచిస్తుంది. దీన్ని డీలర్లు వాహనాలకు బిగిస్తారు. క్రోమియమ్ బేస్డ్ హోలోగ్రామ్ స్టికర్ రూపంలో ఈ మార్క్ ఇస్తారు. ట్యాంపరింగ్ జరక్కుండా ఇది ఉపయోగపడుతుంది. ఈ స్టికర్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పర్మినెంట్ నెంబర్, ఇంజిన్-చాసిస్ నెంబర్ ఉంటాయి. వాహన చోరీలు జరక్కుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుంది. కాలుష్యం వెదజల్లే వాహనాలను కనుక్కోవడం కూడా సులభం అవుతుంది.

14:21 - December 6, 2018

ఢిల్లీ : పెట్రోల్ ధరలకు, దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధమేంటి? దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగిన సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గుతాయి? ఎన్నికలు ముగిసాక మళ్లీ ధరలు ఎందుకు పెరుగుతాయి? అసలు పోల్స్ కు పెట్రల్ ధరలకు సంబంధం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది కదూ?..మరి ఆ కారణాలేమిటో తెలుసుకుందాం..
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనకు ముందు  పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినాటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకో విధంగా తగ్గుముఖం పడతున్నాయి. గతంతో కర్ణాటక ఎన్నికల సందర్బంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం గమనార్హం. అసలు పోల్స్ కు పెట్రోల్ ధరలకు సంబంధం ఏమిటి? 
గత రెండు నెలలుగా అంటే అక్టోబర్, నవంబర్ నెలల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతు వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతం తగ్గాయి. దీంతో చమురు ఉత్పత్తిని తగ్గించే దిశగా ఒపెక్ దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, సౌదీల చమురు ఉత్పత్తి ఆల్ టైం హైకి చేరింది. ఒకవేళ ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే దాని ప్రభావం ధరలపై పడనుంది. 
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న పెట్రోల్ ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మళ్లీ పెరగనున్నాయా? పెట్రో ఉత్పత్తుల ధరలకు, ఎన్నికలకు అవినాభావ సంబంధం ఉందని భావించొచ్చు. ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. కర్ణాటక ఎన్నికల ముందు 20 రోజులపాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. మే 12న ఎన్నికలు ముగిశాక 17 రోజుల తేడాలోనే పెట్రోల్ ధర సుమారు నాలుగు రూపాయల మేర పెరిగింది. గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్య పెట్రోల్ ధరలు పెరగకపోయినా స్థిరంగా ఉన్నాయి. అప్పట్లో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, యూపీ, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. దీన్ని బట్టి ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గడం, తర్వాత పెరగడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అర్థం అవుతోంది. 
ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతం తగ్గాయి. దీంతో చమురు ఉత్పత్తిని తగ్గించే దిశగా ఒపెక్ దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, సౌదీల చమురు ఉత్పత్తి ఆల్ టైం హైకి చేరింది. ఒకవేళ ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే దాని ప్రభావం ధరలపై పడనుంది. 
ఇటీవల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేనందున నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు అనుకున్నంతగా వసూలు కాక రూ.50 వేల కోట్లు తగ్గుతాయని అంచనా. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఖజానాను నింపుకోవాలనుకున్న కేంద్ర సర్కారు..లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో కేంద్రానికి పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కీలకం కానుంది.
 

13:55 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వాహణ సంతృప్తికరంగా సాగుతోందన్న రజత్ కుమార్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృ‌షి చేస్తున్నారు. ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే..ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా..భద్రతా అంశాలపై రాజీ లేకుండా చర్యలు చేపట్టమన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ కుమార్ రెడ్డి అరెస్టుపై స్పందించారు. కొడంగల్ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన కొడంగల్ మినహా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 
> మద్యం సేవించిన వారిపై చర్యలు..
అందరికీ కార్డులు..లేని వారికి 12 రకాల గుర్తించిన ఆధారాలతో ఓటు హక్కు...
ఈవీఎంలు..వీవీ ప్యాట్స్ సిద్ధం...
స్ట్రాంగ్ రూం నుండి పోలింగ్ స్టేషన్‌కు ఈవీఎంలు..వీవీ ప్యాట్స్ తరలించేందుకు సిద్ధం...
ప్రతి పీఎస్ మానిటరింగ్...

13:52 - December 6, 2018

హైద‌రాబాద్ : ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డిసెంబర్‌లో మెట్రో రైలులో  ప్రయాణం చేయవచ్చు. ఈనెల 25 నుంచి హైటెక్ సిటీ మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. గతంలో ప్రకటించినట్లుగానే అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కీలకమైన సీఈఐజీ తనిఖీలు పూర్తికాగా.. స్టేషన్లలో మెట్ల మార్గాల పనులు పూర్తి చేస్తున్నారు. కారిడార్-3కి సంబంధించి నాగోలు-అమీర్‌పేట మార్గం ఇప్పటికే అందుబాటులోకి రాగా.. అమీర్‌పేట-హైటెక్‌సిటీ 11 కిలోమీటర్ల మార్గం పూర్తి కావొస్తోంది. ఈ మార్గంలో మెట్రో ప్రారంభమైతే ఐటీ కారిడార్‌లో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా తగ్గనుంది.

13:39 - December 6, 2018

హైదరాబాద్ : ఎన్నికల తేదీ దగ్గర పడటంతో కొంతమంది రాజకీయ నేతలు మద్యం పంపిణీ చేపట్టేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. రూ.460 ఫుల్‌ బాటిల్‌ మద్యం రూ.10లకే ఇచ్చేస్తారు. రూ.50 ఇచ్చారంటే రూ.600 మద్యం సీసా ఇస్తారు. ఇంతకంటే నాణ్యమైన మద్యం కావాలంటే రూ.100 ఇవ్వాలి అప్పుడు రూ.1000 మద్యం సీసా లభిస్తుంది. మాదాపూర్‌లోని సిటీ వైన్స్‌లో అతి చవగ్గా మద్యం లభిస్తోంది. అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్‌ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్‌ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. దీని గురించి తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు నిందితులను నిన్న చాకచక్యంగా పట్టుకున్నారు. సిటీ వైన్స్‌ మేనేజరు ప్రవీణ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వై.నాగేశ్వర్‌రావు తెలిపారు.

 

13:10 - December 6, 2018

2018, డిసెంబర్ 7వ తేదీ తెలంగాణ ఎన్నికల సందడితోపాటు సినిమాల సందడి వచ్చింది. నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సుబ్రహ్మణ్యపురం, శుభలేఖ+లు, కవచం, నెక్స్ట్ ఎంటీ ధియేటర్లలో ప్రేక్షకుల కోసం వస్తున్నాయి. 
’సుబ్రహ్మణ్యపురం'..
సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం' విడుదలకు కానుంది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా కొత్త కథతో రూపొందింది. ఈ సినిమాలో సుమంత్ దేవాలయాల మీద రీసెర్చ్ చేసే పాత్రలో కనిపించబోతున్నారు. 
శుభలేఖ+లు..
హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం శుభలేఖ+లు. ఈ చిత్రంలో శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దీక్షాశర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శరత్ నర్వాడే దర్శకత్వం వహించగా, కేఎం రాధాకృష్ణ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. విద్యాసాగర్, ఆర్ఆర్ జనార్ధన్ నిర్మాతలు. 
’కవచం’..
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కవచం’. రేపు థియేటర్లలో సందది చేయనుంది. నవీన్‌చౌదరి శొంఠినేని (నాని) నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నెక్ట్స్ ఏంటీ.. 
బాలీవుడ్‌ దర్శకుడు కునాల్ కోహ్లీ నేరుగా తెలుగులో రూపొందించిన నెక్ట్స్ ఏంటీ చిత్రం రేపు రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మిల్కి బ్యూటీ తమన్నా గ్లామర్‌ రోల్‌లోనూ, అలాగే బాధ్యతాయుతమైన యువతి పాత్రలో కనిపించబోతున్నారు. హీరోగా సందీప్ కృష్ణ నటించాడు.

12:49 - December 6, 2018

ఆడిలైడ్ : జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆదుకుని తన విలువ ఏంటో మరోసారి బ్యాట్ ద్వారా చెప్పాడు పుజారా. అడిలైడ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో మొదటి టెస్టు మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. వికెట్లు పడుతున్నా ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా క్రీజులో పాతుకపోయాడు. నిలకడగా ఆడుతూ టీమిండియా పరువు కాపాడాడు.
231 బంతుల్లో సెంచరీ...
కెరీర్‌లో 20వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 153 బంతులు ఎదుర్కొన్న పూజారా నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అదే జోరులో 231 బంతుల్లో 101 పరుగులతో సెంచరీ చేశాడు. 16 టెస్టుల్లో 5వేల పరుగుల మైలురాయి.
కుప్పకూలిన బ్యాట్స్‌మెన్స్...
టాస్‌ గెలిచిన భారత్.. బ్యాటింగ్‌ తీసుకుంది. క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. ఓ దశలో 127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13) తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. రోహిత్‌ శర్మ(37) - రిషబ్‌ పంత్ (25) జోడి కూడా విఫలమైంది. దీంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. అశ్విన్ (25), ఇశాంత్ శర్మ (4) వెనుదిరిగారు. పుజారా సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది టీమిండియా. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, కమిన్స్, లియాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

12:34 - December 6, 2018

ఢిల్లీ : వాహన దారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా బంపరాఫర్ ఇచ్చింది. బీమ్ కార్డు ద్వారా బంకుల్లో మొదటిసారి రూ.100 విలువైన పెట్రోల్ కొట్టించుకుంటే.. 5 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటు SBI ప్రకటించింది.

అది ఎలాగంటే..
SBI కార్డు లేదా భీమ్‌ SBI పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్ (IOC) బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఆ తర్వాత 5 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు. దీని కోసం ఇండియన్‌  ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులో అయినా కనీసం రూ.100 విలువైన పెట్రోలు కొనాలి. దీనికి కొన్ని నిబంధలు ఉంటాయి. అవి ఏమిటంటే..2018 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. 
ఆఫర్ ఎలా పొందాలంటే..

 1. ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ల నుంచి రూ.100 విలువైన పెట్రోల్ ను కొనుగోలు చేయాలి. అదీ భీమ్‌, SBI కార్డు  ద్వారా మాత్రమే చెల్లింపు మాత్రమే..
 2. 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెల అధికార కోడ్‌ను 9222222084కు పంపాలి. 
 3. భీమ్‌  ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌, SBI కార్డు ద్వారా చెల్లింపుల విషయంలో ఆరు అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు SMS చేయాలి.

 ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది.
స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌..
ఇలా పంపిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపిక చేసిన వాటికి  50, 100,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ఒక మొబైల్ నంబర్ నుంచి రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండు వారాల్లో విజేతలను ప్రకటిస్తామని SBI ప్రకటించింది.

12:32 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 7న జరుగనుంది. రేపు జరిగే పోలింగ్ కు ఈసీ, పోలీసు శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తి కానుంది. తెలంగాణలోని 119 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 
32 వేల 815 పోలింగ్ కేంద్రాలు.. 
రాష్ట్ర వ్యాప్తంగా 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. 32 వేల 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 3873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 39 వేల 763 కంట్రోల్ యూనిట్లు వినిగియోగించనున్నారు. ఈవీఎంలు 55 వేలు, 329, వీవీప్యాట్స్ 42 వేల 751 ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గోనున్నారు. 
పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు.. 
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలతోపాటు ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన 30 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్రంలో 4 వేల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో సీనియర్ అధికారికి ఒక్కో నియోజకవర్గ భాధ్యతలు అప్పగించారు. 
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. 
రాష్ట్రంలో 444 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 404 స్టాటిక్ సర్వైలెన్స్, 3వేల 385 సంచాల బృందాలు రంగంలోకి దింపారు. ఎన్నికలకు అంతరాయం కల్గించనున్న 96 వేల 591 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. 11, 806 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశారు. 17 వేల 779 సెక్యూరిటీ కేసులు నమోదు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 
8,688 లైసెన్స్ డు ఆయుధాలు డిపాజిట్.. 
రాష్ట్ర వ్యాప్తంగా 8,688 లైసెన్స్ డు ఆయుధాలు డిపాజిట్ చేశారు. 11 అక్రమ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 ఆయుధాల లైసెన్స్ లు రద్దు చేశారు. 1042 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించిన వారిపై 1314 కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

 

12:11 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు ఆర్టీసీకి వరంలా మారింది. నష్టాల ఊబిలో కూరుకపోయిన ఆర్టీసీ గట్టెక్కుతోంది..పార్టీల సమావేశాలు..సభలు..ప్లీనరీల గిరాకీ పెరుగుతోంది. దీని ద్వారా ఆర్టీసీ సంస్థ నాలుగు కాసులను చూస్తోంది. ఎలక్షన్ పుణ్యమా అని కలెక్షన్లు వస్తున్నాయి. అసెంబ్లీ రద్దుకు ముందు గులాబీ దళం నిర్వహించిన కొంగరకలాన్ సభ మొదలు ఎన్నికల సిబ్బంది తరలించే వరకు ఆర్టీసీకి బాగానే గిరాకీ పెరిగింది. ప్రతి దానికి ఆర్టీసీ బస్సులకు ఓటు వేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సిబ్బంది తరలించేందుక తమకు మూడు వేల ఆర్టీసీ బస్సులు కావాలని ఎన్నికల సంఘం చెప్పడంతో ఆర్టీసీ దూకుడుకు బ్రేకులు లేకుండా పోయింది.
ఒక్క బస్సు అద్దె రూ. 21వేలు...
2014 సాధారణ ఎన్నికల్లో 2 వేల 3 వందల బస్సులను ఉపయోగించగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం 31 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేయడంతో అదనంగా మరో 7వందల బస్సులు సమకూర్చుకొంటోంది. గత ఎన్నికల్లో బస్సుకు రూ. 14వేల అద్దెను ఈసీ చెల్లించగా...ప్రస్తుతం వినియోగం..డీజిల్ ధరలు పెరగడంతో అద్దెను పెంచాలని...ఒక్క బస్సు అద్దె రూ. 21వేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం..దీనికి ఈసీకి సర్కార్ విన్నవించడం జరిగింది. దీనికి ఈసీ కూడా అంగీకరించడంతో ఎలక్షన్స్ ఆర్టీసీకి కలెక్షన్స్‌గా మారాయి. 
ఆర్టీసీ ఖుషీ..ఖుషీ...
ఒక్కో నియోజకవర్గానికి 2 నుండి 3 బస్సులు..ఎన్నికల విధుల కోసం 32 నియోజకవర్గాల నుండి 4 బస్సులు నడుపనుంది. భద్రత కోసం 700 బస్సులు..వీరిని తీసుకరావడానికి ఇప్పటికే 400 బస్సులు బయలుదేరాయి. సెప్టెంబర్ - డిసెంబర్ వరకు రూ. 150 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నిర్వహించిన కొంగర్ కలాన్ సభ ద్వారా రూ. 75 కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం. ఇరత పార్టీలు నిర్వహించిన సభల ద్వారా రూ. 25 కోట్లు...ఎన్నికల కమిషన్ ద్వారా రూ. 61 కోట్ల ఆదాయం...వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి కలెక్షన్లు భారీగానే రావడంతో ఆర్టీసీ ఖుషీఖుషీ అవుతోంది...

11:53 - December 6, 2018

హైదరాబాద్ : కేవలం 24గంటలే...అందరిలోనూ ఉత్కంఠ..ముఖ్యంగా నేతల గుండెలు లబ్..డబ్ అంటూ కొట్టుకుంటున్నాయి. ఈ 24గంటల్లో ఏమీ జరుగబోతోంది ? ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే..ఓటర్లను బూత్ వరకు తీసుకరావడం..తమకే ఓటు వేసే విధంగా చూడడం..గట్టి ఏజెంట్లను నియమించడం...దొంగ ఓట్లను నిలువరించడంపై పార్టీలు దృష్టి సారించాయి. పోల్ మేనేజ్ మెంట్...ప్రలోభాలపై ఆయా పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. రెండు..మూడు నెలల నుండి ప్రచారం చేసినా...24గంటలే కీలకమని భావిస్తున్న ఆ పార్టీలు..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
అభ్యర్థులకు దిశా..నిర్దేశం...
ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు అగ్ర నేతలు దిశా..నిర్దేశం చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలు మొబైల్ ఫోన్లను నమ్ముకున్నాయి. అభ్యర్థులకు ఫోన్‌లు చేసి నియోజకవర్గ ఎన్నిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అగ్రనేతల అంతరంగికులు రంగంలోకి దిగి సమీక్షిస్తున్నారు. విపక్ష పార్టీల ప్రలోభాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. గజ్వేల్ కేంద్రంగా కేసీఆర్..పోలింగ్ పర్యవేక్షణ చేశారు. కుంతియా ఢిల్లీ నుండి పర్యవేక్షిస్తుండగా మహాకూటమి అభ్యర్థులతో ఉత్తమ్..చంద్రబాబు..నారాయణ..కోదండరాం మాట్లాడారు. మరి 24గంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

11:49 - December 6, 2018

నెల్లూరు :  రూరల్ వైసిపి ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర రెడ్డి స్టైలే వేరు. ప్రభుత్వ అధికారులను అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేసారు.  ఉద్యమాలంటారు, ఆందోళనలు, నిరసనల పేరుతో జనాల్లోకి వెళ్ళిపోతారు. అందుకనే కోటంరెడ్డి అంటే అధికారులకు ఒకింత భయమే. మున్సిపల్ అధికారుల వైఖరికి నిర్లక్ష్యంగా ఎంఎల్ఏ ఎవరూ ఊహించని రీతిలో మురికి కాలువలోకి దిగి నిలబడ్డారు. దీనిపై సమాచారం అందుకు్న అధికారులు ఉరుకులు పరుగులతో ఎంఎల్ఏ దగ్గరకు వచ్చేశారు.
తన నియోజకవర్గం పరిధిలోని ఓ మురికి కాలువపై వంతెన నిర్మాణం కోసం ప్రజలు ఎన్నిసార్లు అధికారులు పట్టించుకోకపోవటంతో ఈ విషయాన్ని ఎంఎల్ఏ కోటంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని కూడా అధికారులు పట్టించుకోకపోవటంతో ఇక లాభం లేదని అర్ధం చేసుకున్న ఎంఎల్ఏ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు హఠాత్తుగా  మురికికాల్వలోకి దిగి నిలబడ్డారు.అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేసేంత వరకూ తాను బయటకు వచ్చేది లేదని  చెప్పిన ఎంఎల్ఏ కాలువలోకి నడుంలోతు వరకూ దిగి చేతులు కట్టుకుని నిలబడ్డారు. జరుగుతున్న విషయం గమనించిన స్ధానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. దాంతో విషయం ఉన్నతాధికారుల వరకూ చేరింది. వెంటనే మున్సిపల్ అధికారులు భయపడిపోయి ఎంఎల్ఏ దగ్గరకు పరుగులు పెట్టి హామీ ఇచ్చారు.
 

11:34 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు కాకమీదున్నాయి. ఓట్లు వేసేందుకు సిద్ధంగా వున్నారా? కానీ ఈవీఎంలపై వుండే వివాదాలతో ఒక పార్టీకి వేసిన ఓటు మరో పార్టీకి పడుతోందనీ..దీనికి సంబంధించి ముందే ఈవీఎంలలో సెట్ చేసి వుంచుతారనే విమర్శలు వున్నాయి. ఈ క్రమంలో  మీరు ఓ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు..కానీ అది వేరే పార్టీకి వెళ్లిందరనుకోండి? ఎలా? అయ్యొ అనుకుంటారు? లేదా అసలు మీ ఓటు ఏ పార్టీకి పడిందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎలా? అనే ప్రశ్న వస్తుంది. మీ ఓటు ఎవరికి వేసారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి..
2004 నుండి అందుబాటులోకి వచ్చిన ఈవీఎంలపై పలు విమర్శలున్నాయి. ప్రస్తుతం ఈవీఎం వీవీ ప్యాట్స్  ను వినియోగిస్తున్నారు. ఈవీఎం ఓటు విధానం ద్వారా ఓటు టాంపరింగ్ జరుగుతుందనే వివర్శలతో వీవీఎంలతో పాటు వినియోగంలోకి వచ్చిన వీవీ ప్యాట్స్ చెప్పేస్తుంది. మీరు వేసిన ఓటు ఏ అభ్యర్థికి వేశామో వీవీ ప్యాట్ డిస్ ప్లే మీద కనిపిస్తుంది. ఇప్పటికే వీవీ ప్యాట్స్ పై అటు నాయకులతో పాటు ఓటర్లకు కూడా ఈసీ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. వీవీ ప్యాట్స్ విధానంతో ఏ పార్టీకి మనం ఓటు వేసాం? ఏ అభ్యర్థికి ఓటు వేసాం? అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు పేపర్ పై ప్రింట్ అవుతుంది. ఈ పేపర్ స్ర్కీన్ పై 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ పేపర్ పక్కనే వున్న బాక్స్ లోకి పడిపోతుంది. దీంతో ఓటరుకు ఏ అభ్యర్థికి ఓటు వేసామోననే విషయం తేటతెల్లంగా తెలిసిపోతుంది.
ఇక బ్యాలెట్ యూనిట్ ను తీసుకుంటే ఈ యూనిట్ లో 15మంది పోటీ చేసే అభ్యర్థుల పేర్లు వుంటాయి. 16వ నెంబర్ లో నోటా బటన్ కూడా అందుబాటులో వుంటుంది. పేర్లకు పక్కనే ఓటింగ్ బటన్స్ కూడా వుంటాయి. కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ ఇష్యూ చేయగానే..రెడ్ లైట్ వెలుగుతుంది. దీన్నే బిజీ లైట్ అంటాం. దీంతో బీప్ మంటు సౌండ్ వస్తుంది. దీంతో బ్యాలెట్ యూనిట్ లో పై భాగంలో గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. ఓటు బటన్ నొక్కగానే గ్రీన్ లైట్ ఆరిపోతుంది. తరువాత ఓటు పడిన అభ్యర్థి పక్కన వుండే రెడ్ లైట్ వెలుగుతుంది. వెంటనే వీవీ ప్యాట్ మిషన్ లో ఓటు పొందిన అభ్యర్థి సీరియల్ నంబర్ తో పాటు పేరు, పార్టీ గుర్తుతో ప్రింట్ అయిన ఓ చిన్న సింబల్ స్లిప్ 7 సెకన్ల పాటు కనిపించి వీవీ ప్యాట్ మిషన్ లో ఆటోమేటిగ్ పడిపోతుంది. దీంతో మనం ఓటు ఎవరికి వేశామోస్పష్టంగా తెలిసిపోతుంది. మరి తెలిసింది కదా? మీ ఓటు ఎవరికి వేశారో తెలుసుకున్నారు కదా? 
 

11:23 - December 6, 2018

నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌కు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు బిజీ బిజీ అయిపోయారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం వారికి కేటాయించిన కేంద్రాలకు వచ్చి ఈవీఎంలను పరీక్షించారు. ఎన్జీ కాలేజీలో ఈవీఎంల పంపిణీ చేపడుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 202 మంది అభ్యర్థులున్నారు. 3300 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా...ముగ్గురు కేంద్ర ఎన్నికల పరిశీలకుల బృందం పరిస్థితిని సమీక్షిస్తోంది. 404 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 267 కేంద్రాలున్నాయని..1200 మంది సిబ్బంది..రెవెన్యూ సిబ్బంది 200 మంది ఉన్నారని అధికారి తెలిపారు. 

11:15 - December 6, 2018

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. డిసెంబర్ 7వ తేదీన శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక, నకల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో యధావిధిగా సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 
70 లక్షల మంది యువ ఓటర్లు.. 
తెలంగాణలో మొత్తం ఓటర్లు 2 కోట్లు 80లక్షల 64వేల 684 మంది. వీరిలో కొత్తగా అంటే ఫస్ట్ టైం ఓటు వేస్తున్న కుర్రోళ్లు 70 లక్షల మంది. వీళ్లందరూ మొదటిసారి పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్నారు. గతంలో ఎప్పుడూ ఓటు వేయలేదు కనుక.. పోలింగ్ బూత్ ఎలా ఉంటుంది.. గుర్తింపు కార్డులు ఏమైనా చూపించాలా అనే విషయాలపై కొందరికి కొన్ని సందేహాలు ఉండటం సహజం. కొత్తగా ఓటేస్తున్న కుర్రకారుకి అవగాహన కోసమే ఈ స్టోరీ.. 
కొత్త ఓటర్లు తెలుసుకోవాల్సి విషయాలు ఇవే :
> ఈసీ వెబ్‌సైట్‌ ద్వారా జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. వెబ్ సైట్ లో లేకపోతే జాబితాలో ఓసారి పరిశీలించండి. అక్కడ కూడా కనిపించకపోతే లోకల్ ఎన్నికల ఆఫీస్ కు వెళ్లండి.
> ఓటు వేయటానికి వెళ్లేటప్పుడు ఓటర్ ఐటీ లేదా ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి.
> ప్రతి ఓటరుకి.. ఓటరు స్లిప్ ఇంటికి వచ్చి ఇస్తారు. దాన్ని కూడా తీసుకెళ్లాలి. ఇంటికి ఓటర్ స్లిప్ రాకపోతే పోలింగ్ బూత్ బయట ఉండే పార్టీ ఆఫీసుల దగ్గర కూడా తీసుకోవచ్చు.
> పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అవ్వగానే ముగ్గురు అధికారులు ఉండే టేబుల్ దగ్గరకి వెళతారు. ఒకరు పేరు చెక్ చేస్తారు. మీ ఓటు ఉందో లేదో జాబితాలో పరిశీలిస్తారు. ఓటు ఉన్నది అని నిర్థారించుకున్నాక.. మరో అధికారి మీ వేలికి సిరా చుక్క వేస్తారు. ఆ పక్కనే ఉండే మరో అధికారి మీరు ఓటు వేయటానికి అవసరం అయిన అనుమతి ఇస్తూ.. EVMలోకి వెళ్లటానికి అనుమతి ఇస్తారు.
> బూత్ లో నలుగురికీ కనిపించకుండా ఉండే ప్రాంతంలో ఉంచిన EVM మిషన్ లో మీకు నచ్చిన పార్టీ, అభ్యర్థికి ఓటు వేయవచ్చు. ఓటు వేయగానే బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడే మీ ఓటు నమోదు అయినట్లు లెక్క.
> EVMలో ఓటు వేసిన తర్వాత ఆ పక్కనే వీవీ ప్యాట్ మిషన్ ఉంటుంది. అందులో మీరు ఎవరికి వేటు వేశారో అనేది చూపిస్తుంది. ఓ స్లిప్ కూడా వస్తోంది. వీవీ ప్యాట్ లో డిస్ ప్లే కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. వెంటనే చెక్ చేసుకోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే పోలింగ్ బూత్ అధికారికి కంప్లయింట్ చేయొచ్చు.

 

11:00 - December 6, 2018

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఎన్నికల కోలాహాలం నెలకొంది. డిసెంబర్ 6వ తేదీ ఉదయం ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్‌కు చేరుకున్నారు. ఈవీఎంలను పరిశీలించిన సిబ్బంది...వారిని తీసుకెళుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు 292 ఉండగా 540 మంది సిబ్బంది కేటాయించారు. నిర్మల్ వరకు 400 మంది పోలింగ్ సిబ్బంది...800 పోలింగ్ కేంద్రాలున్నాయి. మంచిర్యాలలో 500 మంది పోలింగ్ సిబ్బంది...1200 పోలింగ్ కేంద్రాలు...కొమరం భీం జిల్లా విషయానికి వస్తే 300 పోలింగ్ స్టేషన్లు..1800 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. నాలుగు జిల్లాల కలెక్టర్లు..జిల్లా యంత్రంగాం..పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు. ఉమ్మడి ఐదు నియోజవకర్గాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ సమయాన్ని కుదించారు. ఓటింగ్ అనంతరం సిబ్బంది వెళ్లడం..ఈవీఎంలు తరలించడడానికి సమయం పడుతుందని భావించిన ఈసీ పోలింగ్ సమయాన్ని కుదించింది. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం..సున్నిత..అతి సున్నిత ప్రాంతాల్లో 8 ఫ్లాటూన్లతో భద్రతను చేపట్టారు. 

10:46 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రజలు స్వేచ్చాయుతంగా ఓటు వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని..ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగినంత సేపూ వీడియో తీయనున్నట్లు..ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
> డిసెంబర్ 6వ తేదీ ఉదయం ఎల్బీ స్టేడియం నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలివెళుతున్నాయి. సైబరాబాద్‌లో 40 లక్షలుండగా..రాచకొండ పరిధిలో 42 లక్షల జనాభా ఉంది. ఓటర్లు సైబరాబాద్‌లో 24,53,341...రాచకొండ పరిధిలో 27,67,269 మంది ఉన్నారు. సైబరాబాద్‌లో 2,867 పోలింగ్ స్టేషన్‌లు...రాచకొండ పరిధిలో 3,073 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌లో 12వేలు..రాచకొండ పరిధిలో 12వేల..పోలీసు సిబ్బందిని నియమించారు. 

10:45 - December 6, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ప్రకటించిన ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార పర్వానికి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలకు  తెరపడింది. దీంతో పార్టీల మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల ప్రచార రధాలకు బ్రేకులు పడ్డాయి. నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలువిధాలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా వున్నారు. ఎన్నికల ప్రచారంలో సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో విమర్శలు, ఆరోపణలతో  హోరెత్తించిన నాయకులు.. ప్రచారానికి ప్యాకప్ చెప్పేశారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న మొన్నటి వరకూ ఒకరిపై ఒకరు వ్యంగాస్త్రాలు, తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. అయితే.. ప్రచార పర్వానికి తెరపడిన తర్వాత కూడా మోదీపై రాహుల్ వ్యంగాస్త్రం సంధించడం విశేషం. 
ప్రచారం ముగిసిందని..ప్రధాని మోదీ ఇక తన పార్ట్ టైమ్ జాబ్ అయిన ప్రధాని పదవి కోసం కాస్త సమయం కేటాయించవచ్చని ట్విటర్ వేదికగా  రాహుల్ ఎద్దేవా చేశారు. 
ప్రచారానికి తెరపడింది. ఇక మీరు మీ పార్ట్ టైమ్ జాయి  ఉద్యోగమైన ప్రధాని బాధ్యతలపై కాస్త సమయం పెట్టొచ్చేమో..’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ పై అసలే సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

10:19 - December 6, 2018

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈ నెల 6,7 తేదీల్లో సెలవులు ప్రకటించింది. గురువారం, శుక్రవారం సెలవులు ఇవ్వగా అనంతరం  రెండో శనివారం, ఆదివారం రానున్న క్రమంలో విద్యా సంస్థలకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అలాగే ప్రభుత్వ సంస్థలకు కూడా వరుసగా 3 రోజులు  సెలువులు రానున్నాయి. డిసెంబర్ 7వ తేదీన ఓటు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. 8న రెండో శనివారం, 9న ఆదివారం వస్తున్నాయి. ఓట్ల లెక్కింపు నిర్వహించే విద్యా సంస్థలు, కార్యాలయాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.
 

10:19 - December 6, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన మరోసారి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికలకు రూ. 1200 కోట్లను చంద్రబాబు తరలించారంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిసెంబర్ 6వ తేదీన బాబుపై మరో ట్వీట్ చేశారు.
మరో రూ. 500 కోట్లు...
‘‘టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడు...ఓటుకు నోటు కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చినందున నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు... రూ. 1200 కోట్లు సరిపోకపోతే మరో రూ. 500 కోట్లను ఏర్పాటు చేస్తానని నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని మరీ చెప్పారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
బాబు ప్రచారం...
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నిర్వహించారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

09:42 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఈసీకి కత్తిమీద సాముగా మారాయి. అటు శాంతి భద్రతలు, ఇటు టెక్నాలజీ ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత వంటి పలు కీలక అంశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటు...తగిన ఏర్పాట్లు చేస్తున్నా ఏ సమయంలో ఎక్కడ, ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయోననే యోచనతో కఠినతర నిర్ణయాలు తీసుకుంటోంది ఈసీ. దీంతో పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ స్పష్టత ఇచ్చారు. డిసెంబర్ 5న  మీడియాతో మాట్లాడుతు..పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌లను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఓటర్స్ తమ కూడా వారి గుర్తింపు కార్డులు  ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకురావాలని సూచించారు. నగరంలో మొత్తం 3,911 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసామనీ..ఆయా స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. నగరంలో మొత్తం 518 చెక్‌పోస్టులు, 60 షాడో టీంలు ఏర్పాటు చేశామనీ..హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 15 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించినట్టు అంజన్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఓటర్స్ పోలింగ్ బూత్ లకు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దని మరోసారి స్పష్టంచేశారు.
 

09:42 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు పార్టీలు ప్రచారం ముగించాయి. డిసెంబర్ 7వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. 119 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. గిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ అంతటా ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 
32 వేల 815 పోలింగ్ కేంద్రాలు.. 
రాష్ట్ర వ్యాప్తంగా బరిలో 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం  2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు. మొత్తం 32 వేల 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గోనున్నారు. ఓటు, పోలింగ్ బూత్ సమాచారం కోసం నా ఓటు యాప్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 
13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. 
సమస్యత్మాక, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగనుంది. సిర్పూరు, చెన్నూరు(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల, అసిఫాబాద్‌(ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఇల్లెందు(ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం(ఎస్టీ) నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

09:27 - December 6, 2018
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నేతల తలరాతను ఓటర్ నిర్ణయించబోతున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌కు మొత్తం 32 వేల769 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే...
> మొత్తం నియోజకవర్గాలు 119
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 2,73,18,603
పురుష ఓటర్లు 1,37,87,920
స్త్రీ ఓటర్లు 1,35,28,020
పోటీ చేస్తున్న అభ్యర్థులు 1,821
పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు 43
ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు 66
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి
టీఆర్ఎస్ పోటీ చేస్తున్న స్థానాల సంఖ్య 119
టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలు 13
తెలంగాణ జనసమితి, ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాలు 8
సీపీఐ పోటీ చేస్తున్న స్థానాలు 3
కాంగ్రెస్ పార్టీ మొత్తం 99 చోట్ల పోటీలో నిలిచింది.
రాష్ట్రంలోని థర్డ్ జెండర్ ఓటర్లు 2,663
పోలింగ్ జరిగే తేదీ డిసెంబర్ 7
ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
09:21 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ తీవ్రంగా  మనస్తాపం చెందారు. గత నాలుగు నెలల నుండి తాను పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు చదంగా అయిపోయిందని రజత్ వాపోయారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన క్షణం నుంచి, ఎన్నికలు నిర్వణలో భాగంగా తాను అహర్నిశలు చేసిన కృషి..రేవంత్ రెడ్డి అరెస్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టడం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు కూడా తీవ్రంగా  మందలించడంతో రజత్ కుమార్ మనస్తాపం చెందారు. 
ఈ ఘటన రజత్ తీవ్ర ఆగ్రహాన్ని సైతం తెప్పించిందని..ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా రాత్రికి రాత్రే రేవంత్ రెడ్డిపై తనిఖీలు..అనంతరం కేసీఆర్ కోస్గి సభను అడ్డుకుంటామని చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ ను అర్థరాత్రి పూట అరెస్ట్ చేయటం..అనంతరం విడిచిపెట్టటం వంటి పలు నాటకీయ పరిణామాలపై హైకోర్టు అటు ఎన్నికల సంఘాన్ని..ఇటు పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన దగ్గర నుండి గత రెండు రోజుల వరకూ తాను పడిన కష్టం అంతా నేలపాలు అయ్యిందనీ..ఆఖరికి ధర్మాసనంతో కూడా చీవాట్లు పడాల్సి వచ్చిందని రజత్ కుమార్ తీవ్రంగా మనస్తాపం చెందారు.

కేసీఆర్‌ బహిరంగ సభను వ్యతిరేకించిన రేవంత్, బంద్ కు పిలుపునివ్వగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా 'అవసరమైన చర్యలు' తీసుకోవాలని మాత్రమే తాను ఆదేశిస్తే, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, దీంతో తనపై అపవాదులు వచ్చాయని ఆయన తన సన్నిహితుల వద్ద రజత్ కుమార్ వాపోయినట్లుగా తెలుస్తోంది. పైగా రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా..గృహ నిర్బంధంలో ఉంచితే ఇంత వివాదం వచ్చుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రజత్ కుమార్, గత రెండ్రోజులుగా విలేకరులను సైతం కలిసేందుకు ఇష్టపడకపోవడం గమనించాల్సిన విషయం. 
 

08:56 - December 6, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే...కరీంనగర్ జిల్లా పేరును కరిపురంగా మారుస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించడం కలకలం రేపుతోంది. అసలు కరిపురం అంటే ఏమిటీ ? కరిపురంగా ఎందుకు మారుస్తారు ? అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కరీంనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు నగరాల పేర్లను మార్చేశారు. దీనిని వ్యతిరేకించినా యోగి మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా..వికారాబాద్..కరీంనగర్ పేర్లను మార్చేస్తామని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. 
కరీంనగర్ కు ఆ పేరు ఎలా వచ్చింది అంటె ?...సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరము కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరము కావున ఈ నగరానికి కరినగరము అని పేరు వచ్చినది, కాలక్రమేనా కరీంనగర్ అని పిలువబడుతున్నది.

08:52 - December 6, 2018

జర్మనీ : ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ బైక్ రోడ్డెక్కింది. నెరా పేరుతో తయారైన ఈ త్రీడీ బైక్ ను బిగ్ రెప్, నౌలబ్ అనే జర్మన్ కంపెనీలు రూపొందించాయి. నెరా త్రీడీ బైక్ రోడ్డుపై పరుగులు పెట్టింది. జర్మన్ త్రీడీ దిగ్గజం బిగ్ రెప్, నౌలబ్ లు సంయుక్తంగా ఈ బైక్ ను రూపొందించాయి. కొత్తతరం అనే అర్థం వచ్చే న్యూఎరా నుంచి తీసుకున్న పదాలతో నెరా అనే పేరు పెట్టారు.

నెరా బైక్ తయారీలో ఎలక్ట్రిక్ కాంపోనెంట్ బ్యాటరీ తప్పితే మిగిలినవన్నీ కూడా త్రీడీ టెక్నాలజీతోనే తయారు చేసిన భాగాలు వాడతారు. బైక్ బరువు కూడా చాలా తక్కువ...దాదాపు 60 కేజీలు మాత్రమే ఉండగా.. బైక్ తయారీకి 12 వారాల గడువే పట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం స్పీడ్ తక్కువున్న నెరా బైక్ ను కమర్షియల్ గా విక్రయించడం లేదు. 

 

08:34 - December 6, 2018

ఢిల్లీ : బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇచ్చారు. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్రమోడీ హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు ప్రధాని అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రిసెప్షన్ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి ప్రియాంక చోప్రాను నిక్ జోనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ’ప్రియాంక చోప్రా, నికి జోనస్.. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా.. మీకు అభినందనలంటూ’ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. 

 

08:26 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌కు ఎన్నికల అధికారులు సర్వంసిద్ధం చేశారు. పోలింగ్‌ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు..నిబంధనలు విధించింది. ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించు కొనేందుకు వీలు కల్పించాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలుసా ? అయితే ఇది చదవండి...

 • డిసెంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలు. 
 • పోలింగ్‌ బూత్‌లోకి సెల్‌ఫోన్లను అనుతించరు. 
 • పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే ఆ ఓటును రద్దు.
 • పోలింగ్ కేంద్రానికి 200మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలి. రాజకీయ పార్టీల వారికి ఒక టేబుల్..రెండు కూర్చీలు మాత్రమే అనుమతి. 
 • పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు ఉండాలి. వీటిపై పార్టీల గుర్తులు...పేర్లు ఉండవద్దు. 
 • అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. 
 • పోలింగ్‌ కేంద్రాలన్నింటినీ ధూమపాన నిషేధ ప్రాంతాలు. 
 • మద్యం తాగి పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తే అరెస్టు చేస్తారు. 
 • ఈసారీ అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు బ్రీత్‌ ఎనలైజర్లను అందుబాటులో ఉంచుతారు. 
 • వారికే ఓటు వేస్తాను..వేశాను..అని బూత్‌లో చెబితే వారిని ఓటు వేయనీయరు. 
 • ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) ప్రకారం అతడిని బయటకు పంపేస్తారు. 
 • పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
08:22 - December 6, 2018

కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేజీఎఫ్. ఇటీవల విడుదలైన ఈ మూవీ తొలి ట్రైలర్ కు విశేష స్పందన లభించడంతో చిత్ర యూనిట్ రెండో ట్రైలర్ ను విడుదల చేసింది. ’నువ్వు నాక ఒక మాటివ్వాలి.. నువ్వెలా బతుకుతావో నాకు తెలియదు.. కానీ చనిపోయేటప్పుడు మాత్రం కోటీశ్వరుడిలా చావాలని’.. ఓ తల్లి తన కొడుకుతో ప్రమాణం చేయించుకునే సన్నివేశంతో ఓ ట్రైలర్ మొదలవుతుంది. 

1970లో అమెరికా, రష్యా మధ్య జరిగిన గొడవ దాదాపు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోయింది. ఆ సమయంలో బంగారం ధరలు మిన్నంటాయి. ప్రజల జీవితాలు చతికిలపడ్డాయి. ఒకప్పుడు అతి పెద్ద అతిపెద్ద బంగారు గని కేజీఎఫ్...ఈ గనిని ఒకే ఒక్కడు అదుపు చేస్తే ఎలా ఉంటుందనేదే సినిమా స్టోరీ.. ఇదే విషయాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రం కన్నడతోపాటు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, జపాన్, చైనీస్ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 

08:10 - December 6, 2018

ఆస్ట్రేలియా : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆదిలోనే భారత్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేకపోయారు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం మూడు పరుగుల వద్ద రాహుల్ (2) వెనుదిరిగాడు. మరో 12 పరుగులు జోడించిన అనంతరం విజయ్ 11 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. భారత కెప్టెన్ కోహ్లీ కూడా (11) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ జట్టు స్కోరు 41 పరుగుల వద్ద రహానే (13) వికెట్ కూడా కోల్పోయింది. మొత్తానికి భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులతో ఆడుతోంది. క్రీజులో పుజారా 11, శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 2 వికెట్లు తీయగా స్టార్క్, కుమిన్స్ చెరో ఒక వికెట్ తీశారు. 

07:25 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పవన్ సపోర్టు ఎవరికి ఇస్తారు ? ఏపీలో ప్రభుత్వం..నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేనానీ తెలంగాణలో ఎవరికి మద్దతిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 5వ తేదీన తన మనస్సులోని మాటలను తెలియచేస్తానన్న పవన్..అందుకనుగుణంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు అనేది స్పష్టం చేయలేదు. 
ధనం దాచగలరేమో గానీ..తేజస్సును దాచగలరా ? అంటూ దాశరథి చెప్పిన మాటలతో ప్రారంభించారు. తెలంగాణ సమరయోధులు..స్వాతంత్ర యోధుల స్పూర్తితో యువకులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని..అందుకే తెలంగాణ అంటే తనకు గౌరవం ఉందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో..తక్కువ సమయం ఉండడం..ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేయలేకపోతోందని తెలిపారు. తెలంగాణ ఇచ్చా మని ఒకరు, తెచ్చామని ఇంకొకరు..అభివృద్ధి చేశామని మరొకరు...ఇలా పేర్కొంటుండడంతో అయోమయ పరిస్థితులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ఎక్కువ పారదర్శకత...తక్కువ అవినీతితో మంచి పరిపాలన అందించగలరో..లోతుగా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఓటేయాలని పవన్ అభ్యర్థించారు..చివరగా జై..తెలంగాణ.., జై హింద్ అంటూ ముగించారు. 

07:16 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బరిలో 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గోనున్నారు. ఓటు, పోలింగ్ బూత్ సమాచారం కోసం ’నా ఓటు’ యాప్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 
భారీ బందోబస్తు ఏర్పాటు... 
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది సంచారంపై నిషేదం విధించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. 

 

07:05 - December 6, 2018

జూపూడి ఇంట్లో డబ్బుల కలకలం...
ఇంటి వెనుక నుండి పారిపోతున్న యువకులను పట్టుకున్న టీఆర్ఎస్ నేతలు...
జూపూడిని అరెస్టు చేయాలన్న గులాబీ నేతలు...

హైదరాబాద్ :
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది..ఇక ప్రలోభాలకు తెరలేచింది. ఆఖరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు..మద్యం..బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీ రాత్రి కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ఇంట్లో భారీగా డబ్బులున్నాయనే ప్రచారం కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు డబ్బు సంచులతో పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందని..అందులో ఒకరు దొరికారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని..వెంటనే జూపూడిని అరెస్టు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తులు ఎవరు ? డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. 

06:53 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సమరం అత్యంత కాస్ట్లీగా మారిపోతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. నగదు..మద్యాన్ని వరద పారిస్తున్నారు. దీనితో పోలీసు శాఖ అప్రమత్తమైంది. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుండి ప్రచారం (డిసెంబర్ 5 సాయంత్రం) వరకు ఏకంగా రూ. 137 కోట్ల విలువైన నగదు..నగలు..మద్యం..స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 115 కోట్ల 67 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. అంతేగాకుండా రూ. 10 కోట్ల 87 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. రూ. 9 కోట్ల 52 లక్షల విలువైన బంగారం..వెండి..ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన రూ. 7 కోట్ల 3 లక్షల రూపాయల నగదు...వరంగల్ అర్బన్ జిల్లా సిద్దార్థనగర్‌లో రూ. 3 కోట్ల 30 లక్షల నగదును సీజ్ చేశారు. ప్రజా కూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో 8 మంది హవాలా ఆపరేట్లను పోలీసులు అరెస్ట చేశారు. విమల్ థియేటర్‌లో రూ. 8 లక్షల 80వేల నగదు..సుల్తానాబాద్‌లో రూ. 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss