సాహో టీజర్ - సినీ ప్రముఖుల స్పందన

Submitted on 13 June 2019
Celebrities Response on Saaho Teaser

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించగా, సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ సాహో టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. టాలీవుడ్ సినిమా టీజర్ హాలీవుడ్ మూవీని తలపించేలా ఉందంటూ, ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ టీజర్‌ గురించి చెప్తున్నారు. సాహో టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియచేసారు.

కింగ్ నాగార్జున.. 'సాహో టు ప్రభాస్ అండ్ యూవీ క్రియేషన్స్ ఫర్ పుషింగ్ ది బార్' అని ట్వీట్ చెయ్యగా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. ‘సాహో' ‘ఓహో' అని ప్రేక్షకుల నీరాజనాలు పొందాలని కోరుకుంటూ, మా ప్రభాస్ ప్రభాకర తేజస్సుతో వెలిగి పోవాలని ఆశీర్వదిస్తూ.. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సాహో'.. అంటూ సాహో టీమ్‌ని విష్ చేసారు.. పూరీ జగన్నాధ్.. 'టీజర్ ఇన్‌క్రిడబుల్'.. అని, సాయి ధరమ్ తేజ్.. 'న్యూ స్టాండర్డ్స్ హేవ్ బీన్ సెట్, విషింగ్ ది వోల్ టీమ్ నథింగ్ లెస్ ఆఫ్ ఏ బ్లాక్ బస్టర్' అంటూ ట్వీట్ చేసాడు..

రానా దగ్గుబాటి, నితిన్, అడవి శేష్, సుశాంత్, సందీప్ కిషన్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్, దర్శకులు సురేందర్ రెడ్డి, సుధీర్ వర్మ, మారుతి తదితరులు సాహో టీజర్ గురించి తమ రెస్పాన్స్ తెలిపారు.

Parbhas
Shraddha Kapoor
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు