CBSE పరీక్ష ఫీజు భారీగా పెంపు

Submitted on 12 August 2019
The Central Board of Secondary Education (CBSE) has increased the fees of Class 10 and 12 Board Examinations

 కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజును రూ.50 నుంచి రూ.1200కు, జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజు రూ.750నుంచి రూ.1500కు పెంచింది.ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50, సాధారణ విద్యార్థులు రూ.750 చెల్లిస్తున్న విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గతేడాది తొమ్మిదో తరగతి, 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరానికి బోర్డు పరీక్షలు రాసేందుకు తమ పేర్లు నమోదుచేసుకోవాలి. ఈ మేరకు పాఠశాలలు పాత పద్ధ్దతి ప్రకారం ఫీజులు వసూలు చేశాయి. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయం మేరకు మిగతా బకాయిలు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. సవరించిన నిబంధనల మేరకు ఐదు సబ్జెక్టులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1200, సాధారణ క్యాటగిరీ విద్యార్థులు రూ.1500 చెల్లించాలి. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఈ ఫీజులు వర్తిస్తాయని సీబీఎస్‌ఈ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

అయితే 12వ తరగతి బోర్డు పరీక్షల్లో  ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు అదనపు సబ్జెక్ట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అదనపు ఫీజు చెల్లించనవసరం లేదు. ఇంతకుముందు రూ.300 చెల్లించాల్సి ఉండేది. ఇక 12వ తరగతిలో సాధారణ  కేటగిరీ విద్యార్థులు రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం దృష్టి లోపం గల విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి సీబీఎస్‌ఈ మినహాయింపునిచ్చింది. గడువు లోగా ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోని వారిని 2019-20 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని సీబీఎస్‌ఈ అధికారి తెలిపారు. 

cbse
Increased
fees
Class 10 and 12
Board Examinations

మరిన్ని వార్తలు