సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? సీఐసీ ఆగ్రహం..

08:18 - November 5, 2018

ఢిల్లీ : దేశంలోని పలు కీలక వ్యవస్థల్లోని వ్యవహారాలపై వివాదాలు నెలకొంటున్నాయి. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలో అవినీతి భాగోతాలు..దానిపై అటు కేంద్రం జోక్యం. ఇటు సుప్రీంకోర్టులో కేసుల పిటీషన్లు. ఇలా దేశంలోని కీలక వ్యవస్థల్లో పలు వ్యవహారాలు సామాన్యులకు వాటిపై నమ్మకం పోయేలా వ్యవహరించం ఆందోళన కలిగిస్తోంది. కాగా దీనికంతటికి కేంద్రం జోక్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కేంద్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Image result for rbi and supreme courtసుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోరా? అంటు ఆగ్రహం వ్యక్తంచేసింది.  తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి పేర్లను వెల్లడించాల్సిందేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించడాన్ని తప్పుబట్టింది. రుణాలు ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించలేదో  ఈ నెల 16లోగా సమాధానం చెప్పాలంటూ సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యలు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌నే ప్రధాన సమాచార అధికారిగా భావించాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేర్లను వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను జరిమానా ఎందుకు విధించకూడదో 16లోగా చెప్పాలని ఆదేశించారు.
పారదర్శకత, నిజాయతీలపై ఉర్జిత్ చెబుతున్నదానికి, ఆచరణకు పొంతన లేకుండా పోయిందని సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొండి బకాయిలపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాసిన లేఖను కూడా బయటపెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐలను కోరింది. మరి దీనిపై గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Don't Miss