శునకాలను తరిమికొట్టిన ఊసరవెల్లి

Submitted on 14 August 2019
Chameleon fight with dogs

సాధారణంగా కుక్కలు మనుషులు, జంతువులను తరిమికొడుతాయి. కానీ ఓ ఊసరవెల్లి శునకాలకు ముచ్చెమటలు పట్టించింది. దీన్ని నమ్మాలా.. అంటే నమ్మి తీరాల్సిందే. తన్నుకుపోవడానికి వచ్చిన శునకాలను ఊసరవెల్లి తరిమికొట్టింది.

నోటితో కరుచుకుపోవడానికి శునకాలు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శునకాలు ఉడాయించిన తర్వాత ఊసరవెల్లి తన దారిన వెళ్లిపోయింది. శునకాల నుంచి తన ప్రాణాలను కాపాడుకుంది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. శునకాలు, ఊసరవెళ్లి మధ్య జరిగిన పోరాట దృశ్యాలు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఊసరవెల్లి గ్రేట్ అనుకున్నారు.

Also Read : కొండచిలువతో పోరాటం : గాయాలతో బయటపడిన మేకలకాపరి 

Chameleon
fight
Dogs
bhadradri kothagudem

మరిన్ని వార్తలు