ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్త కాదు : చంద్రబాబు మాటలకు సీఎం జగన్ నవ్వులు

Submitted on 13 June 2019
chandrababu angry, jagan laughs in assembly

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు సీరియస్ గా మాట్లాడుతుంటే.. జగన్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. చంద్రబాబు మాటలకు జగన్ నవ్వుకున్నారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరించాక టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడారు. ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్త కాదు అని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం ఇది మూడోసారి అని ఆవేశంగా మాట్లాడారు. వాయిస్ పెంచాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మా హయాంలో మైకులు బాగానే పని చేశాయని చంద్రబాబు అన్నారు. నా మైక్ వాల్యూమ్ పెంచితే.. నా వాయిస్ ఆటోమేటిక్ పెరుగుతుందని చెప్పారు. నా వాయిస్ తగ్గదు, పోరాటం తగ్గదు..అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలకు సీఎం జగన్ నవ్వులు చిందించారు. 

ఇవాళ తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని చంద్రబాబు అన్నారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేనికి చంద్రబాబు వ్యక్తిగతంగా, టీడీపీ తరఫున అభినందనలు తెలిపారు. ఎన్టీ రామారావు పిలుపుతో తమ్మినేని రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తమ్మినేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి రొక్కం లక్ష్మీనరసింహరావ్, సత్యనారాయణ, కావలి ప్రతిభా భారతి స్పీకర్లు అయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన వారిలో తమ్మినేని సీతారాం నాలుగో వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. స్పీకర్లను ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా శ్రీకాకుళం ఉందన్నారు. రాజకీయ చైతన్యం ఉండే శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం.. స్పీకర్ కావడం చాలా అదృష్టం అన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలో రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Chandrababu Naidu
TDP
AP Assembly
CM YS Jagan Mohan Reddy
chandrababu agnry
jagan laugh
Tammineni Sitaram

మరిన్ని వార్తలు