స్పీకర్ తోపాటు చైర్ దగ్గరకు వెళ్లని చంద్రబాబు

Submitted on 13 June 2019
Chandrababu did not go to the chair with the Speaker

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పదవికి నోటిఫికేషన్‌ వెలువడగా.. ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం (జూన్ 13, 2019) 11 గంటలకు ఆయన స్పీకర్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు

కొత్తగా ఎన్నికైన స్పీకర్ ను సభా అధ్యక్షుడి చైర్ లో సీఎం, ప్రతిపక్ష నేత కూర్చోబెట్టడం ఆనవాయితీగా ఉంది. అయితే స్పీకర్ తోపాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చైర్ దగ్గరకు వెళ్లలేదు. తన బదులు అచ్చెన్నాయుడిని పంపించారు. స్పీకర్ బాధ్యతలు చేపట్టే సమయంలో చంద్రబాబు వైఖరిపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. 

స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ పిలుపుతో తమ్మినేని సీతారాం రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. తమ్మినేని మూడుసార్లు మంత్రిగా పని చేసి సేవలు అందించారని తెలిపారు. శ్రీకాకుళం.. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అన్నారు. తనకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్తేమీ కాదన్నారు. తన వాయిస్ లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. ఇవాళ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఇష్టం లేదన్నారు.

 

 

 

Chandrababu
did not
go
chair
Speaker

మరిన్ని వార్తలు