చంద్రబాబు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి : నా సస్పెన్షన్ పై ప్రతీకారం తీర్చుకోను

Submitted on 13 June 2019
chandrababu must say sorry, mla roja

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయామని చంద్రబాబు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. అబద్దపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశానని చంద్రబాబు ఒప్పుకుంటే రుణమాఫీపై సీఎం జగన్ స్పందిస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ది చెప్పినా.. చంద్రబాబు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు.

చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత అని గుర్తు చేసిన రోజా.. ఇంకా సీఎం అనుకుంటే ఎలా అని నిలదీశారు. చంద్రబాబుకి సెక్యూరిటీ తగ్గించడంపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను రోజా ఖండించారు. చంద్రబాబుకి ఉండే సెక్యూరిటీ ఆయనకు ఉంటుందన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని, జగన్ కి మంచి పేరు తీసుకొస్తానని రోజా చెప్పారు. ఏపీఐఐసీ చైర్మపర్సన్ పదవి ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుంటానని వెల్లడించారు. టీడీపీ ఇచ్చిన హామీలు మాపై రుద్దాలని చూస్తున్నారని రోజా మండిపడ్డారు. రైతులకు ఏం చేయాలో సీఎం జగన్ కి తెలుసు అని రోజా స్పష్టం చేశారు. 

mla roja
Chandrababu
SORRY
Assembly
cm ys jagan
crop loan waiver

మరిన్ని వార్తలు