విశ్రాంతి : డాక్టర్ల సూచనతో హైదరాబాద్ కి చంద్రబాబు

Submitted on 13 August 2019
chandrababu to take rest

టీడీపీ చీఫ్ చంద్రబాబు హైదరాబాద్ కి బయల్దేరారు. గుంటూరులో టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్ కి పయనం అయ్యారు. చంద్రబాబు చేతి నొప్పితో బాధపడుతున్నారు. రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో చంద్రబాబు హైదరాబాద్ కి వచ్చి రెస్ట్ తీసుకోనున్నారు. చంద్రబాబు చేతికి కట్టు కట్టుకున్నారు. అలాగే టీడీపీ సమావేశానికి హాజరయ్యారు. చేతిపై ఒత్తిడి ఎక్కువ కావడంతో చంద్రబాబు నొప్పితో బాధపడుతున్నారు.

విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి హాజరైన బాబు.. చేతికి కట్టుతో కనిపించారు. ఆయన చేతికి కట్టు చూసి నేతలు, కార్యకర్తలు కంగారుపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీశారు. ఆయన కుడిచేతి నరంపై ఒత్తిడి పెరిగి నొప్పితో బాధపడుతున్నారని, అది కాస్త ఇబ్బంది పెట్టడంతో చేతికి ఒత్తిడి పడకుండా వైద్యులు కట్టు కట్టారని తెలిసి రిలాక్స్ అయ్యారు. చంద్రబాబు చేతిని పరీక్షించిన డాక్టర్లు.. కట్టు కట్టడంతో పాటూ 2 రోజుల విశ్రాంతి తీసుకోమని చెప్పారట. దీంతో చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్‌ కి పయనం అయ్యారు. విశ్రాంతి తీసుకొని మళ్లీ ఏపీ రాజధానికి వస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా, చంద్రబాబు చేతికి కట్టు కట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Chandrababu
rest
Hyderabad
hand pain

మరిన్ని వార్తలు