సభలో సంప్రదాయం గొడవ : సీఎం జగన్ పిలవలేదని చంద్రబాబు ఆవేదన

Submitted on 13 June 2019
chandrababu vs ambati rambau over tradition

ఏపీ అసెంబ్లీలో సంప్రదాయం గొడవ రేగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు సభలో సంప్రదాయం పాటించలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. గత అసెంబ్లీలో స్పీకర్ ను సభా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కలిసి చైర్ లో కూర్చోబెట్టారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఎంతో రాజకీయ అనుభవం గల చంద్రబాబు.. ఈసారి ఆ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారపక్షం చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 

అధికారపక్షానికి చెందిన వారే సంప్రదాయం పాటించలేదని చంద్రబాబు ఎదురుదాడి చేశారు. స్పీకర్ ను చైర్ లో కూర్చోబెట్టే సమయంలో ముఖ్యమంత్రి, సభ అధ్యక్షుడు జగన్.. తమను ఆహ్వానించలేదన్నారు. వస్తే రండి లేకపోతే లేదు అన్నట్టు వ్యవహరించారని.. అందుకే స్పీకర్ ని చైర్ లో కూర్చోపెట్టే సమయంలో తాను రాలేదని చంద్రబాబు చెప్పారు. అధికారపక్షం నేతలు సంప్రదాయం, సభా విలువలు పాటించలేదని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో తాను ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు. తాను ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించలేదన్నారు. స్పీకర్ ను ఎంపిక చేసినప్పుడు.. చైర్ లో కూర్చోపెట్టినప్పుడు.. ప్రతిపక్షాలకు సమాచారం ఇచ్చామని, వారిని ఆహ్వానించామని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో మేము స్పీకర్ ని ఎంపిక చేసినప్పుడు మంత్రులని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ దగ్గరికి పంపానని చంద్రబాబు గుర్తుచేశారు. ఈసారి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు.

Chandrababu
ambati rambabu
tradition
TDP
YSR congress party
AP Speaker
Tammineni Sitaram

మరిన్ని వార్తలు