రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో పొత్తులా? సిగ్గులేదా? : పవన్

19:53 - November 2, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు యాత్ర తుని వరకూ కొనసాగింది. ఈ సందర్బంగా పవన్ తునిలో బహిరంగ సభలో మాట్లాడుతు కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించటం వల్లనే తాను కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకమని..అన్యాయానాకి గురైన ఏపీకి న్యాయం జరగాలనే ఉద్ధేశ్యంతో తాను 2014 ఎన్నికల్లో పోటీ చేసయకుండా అనుభవజ్నుడైన చంద్రబాబుకు మద్ధతు ఇచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటువంటి ఈరోజు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా తన ప్రయోజనాకల కోసం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తెలుగు ప్రజలకు తీరని అన్యాయమేనని..పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీలను అవమానించిన సంగతి మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ అవమానానికి మీరు పౌరుషం లేదా? అవన్నీ మరిచిపోయి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకుందామని అడగటానికి సిగ్గులేదా? అని తీవ్రమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. 2014లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని నినదించిన చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు తాను తన అన్న చిరంజీవితోను..తన కుటుంబ సభ్యులతోను విభేదించి స్వంత పార్టీని పెట్టానని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు ప్రజల కోసమే తన అన్నతో విభేధించాను తప్ప తన రక్త సంభంధమైన తన అన్న చిరంజీవి అంటే తనకు ప్రాణప్రమదమని పవన్ తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని పవన్ కళ్యాన్ విమర్శించారు. 

Don't Miss