కుమారస్వామికి నిరసన సెగ : బస్సును అడ్డుకున్న ఉద్యోగులు

Submitted on 26 June 2019
Chief Minister Kumaraswamy Lost His Cool

కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి నిరసన సెగ తగిలింది. ఆయన బస్సుకు అడ్డు తగిలారు. ముందుకు పోనియకుండా బైఠాయించారు. తాము పనిచేస్తున్నా కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని..ఉద్యోగ భద్రత లేదంటూ వారు వాపోయారు. సమస్యను పరిష్కరిస్తానని కుమార స్వామి చెప్పినా వారు వినిపించుకోలేదు. దీనితో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. 

సీఎం కుమార స్వామి బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పల్లె నిద్రలో భాగంగా 2019, జూన్ 26వ తేదీ బుధవారం రాంచీలోని మాన్వీ తాలుకాలోని కర్రెగుడ్డా గ్రామంలోకి చేరుకున్నారు కుమార స్వామి. ఆయన వస్తున్నారన్న తెలుసుకున్న థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగులు అక్కడకు చేరుకున్నారు. భారీగా సంఖ్యలో ఉద్యోగులు ఉండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బస్సు రాగానే అడ్డుకున్నారు. కొంతమంది బస్సు ఎదుట కూర్చొన్నారు. 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారు వాపోయారు. వారి సమస్యలను సీఎం కుమార స్వామి బస్సులో నుండే విన్నారు. సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. దీంతో కుమార స్వామి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ హామీపై ఉద్యోగులు మెత్తబడలేదు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని..దీనిపై మీటింగ్ ఏర్పాటు చేస్తానని స్పష్టమైన హామీనివ్వడంతో కుమార స్వామి కాన్వాయ్‌కు దారి వదిలారు. పల్లె నిద్రలో భాగంగా తమతో మాట్లాడుతానని సీఎం కుమార స్వామి చెప్పారని..ఆయన కోసం ఎంత వెయిట్ చేసినా రాలేదని..అందుకే తాము బస్సును అడ్డుకోవాల్సి వచ్చిందని ఉద్యోగ నేతలు వెల్లడించారు. 

Chief Minister Kumaraswamy
lost
His Cool
Yermarus Thermal Power Station

మరిన్ని వార్తలు