ఈ కారుకు దాహం ఎక్కువ : ఆయిల్  కోసం.. కోళ్లు, బాతులు దొంగిలించి అమ్మేస్తున్న యజమాని

Submitted on 10 June 2019
Chinese Farmer Steals Chickens And Ducks, Sells Them To Cover Fuel Costs Of His ‘Thirsty’ BMW

అతడో ధనవంతుడైన చైనీస్ రైతు. పేరు.. లిన్ షుయూ(50). రూ.2 కోట్లు పెట్టి BMW కారు కొన్నాడు. కానీ, కారు కొన్నప్పటి నుంచి ఆయిల్ తెగ తాగేస్తుంది. ఇంధన ఖర్చు భరించలేని ఈ రిచ్ రైతు.. దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. వీధుల్లో కనిపించే కోళ్లు, బాతులను దొంగిలించి అమ్మేస్తున్నాడు. వచ్చిన సొమ్ముతో తన బీఎండబ్ల్యూ కారుకు ఇంధనం కొంటున్నాడు.

పక్షులను దొంగతనం చేసి అమ్ముతున్నందుకు చైనీస్ రిచ్ రైతు లిన్ షుయూను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ నుంచి సిచుయాన్ ప్రావిన్స్ గ్రామంలోని కోళ్లు, బాతులు కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న లిన్ షుయూ ఖరీదైన తన కారుకు ఇంధనం కొనే స్థోమత లేదు.

దీంతో చిల్లర నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా లిన్ షుయూను పోలీసులు పట్టుకున్నారు. తన మోటార్ సైకిల్ పై రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి ప్రవేశించి కోళ్లు, బాతులను దొంగలిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులను తప్పించుకునేందుకు లిన్ షుయూ తన కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు.

కారులో వెళ్తున్న అతడ్ని పోలీసులు ఛేజ్ చేసి మే 22న పట్టుకున్నారు. లిన్ షూయ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. మోటార్ సైకిల్ తో పాటు కోళ్లు, బాతులను స్వాధీనం చేసుకున్నారు. తన బీఎండబ్ల్యూ కారులో ఇంధనం కొనేందుకు డబ్బుల కోసం దొంగతనం చేస్తున్నట్టు 50ఏళ్ల లిన్ షుయూ విచారణలో అంగీకరించాడు.

Chinese Farmer
 Chickens
Ducks
Fuel Cost

మరిన్ని వార్తలు